
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025 సీజన్ తొలి మ్యాచ్‌లోనే కేకేఆర్‌ను చిత్తు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమవుతోంది. ఆర్సీబీ తమ రెండో మ్యాచ్‌లో భాగంగా మార్చి 28న చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. సీఎస్‌కే కూడా తమ మొదటి మ్యాచ్‌లో ముంబై పై విజయం సాధించి మంచి జోష్ మీద ఉంది. దీంతో ఈ రెండు జట్ల మధ్య పోరు మరోసారి అభిమానులను మునివేళ్లపై నిలబెట్టడం ఖాయం.
ఇక ఈ మ్యాచ్‌కు ఆర్సీబీకి ఓ గుడ్ న్యూస్ ఉంది. కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమైన స్పీడ్ స్టార్ భువనేశ్వర్ కుమార్.. ఇప్పుడు ఫుల్ ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. భువీ నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్సీబీ కూడా తాజాగా భువీ బంతి పట్టికుని ఉన్న ఫోటోను షేర్ చేసింది.
అందుకు క్యాప్షన్‌గా "భువీ త్వరలోనే బంతిని స్వింగ్ చేస్తాడు. అతడు మరింత బలంగా తిరిగిరానున్నాడని" బెంగళూరు ఫ్రాంచైజీ రాసుకొచ్చింది. దీంతో ఆర్సీబీ తదుపరి మ్యాచ్‌లో భువనేశ్వర్ ఆడటం దాదాపు ఖాయమైనట్లే. కాగా మొదటి మ్యాచ్‌కు భువనేశ్వర్ కుమార్ స్ధానంలో జమ్మూ కాశ్మీర్ బౌలర్‌రసిఖ్ సలాం చోటు దక్కించుకున్నాడు.
కానీ అతడు అంత ప్రభావం చూపలేదు. మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 35 పరుగులతో పాటు ఓ వికెట్ పడగొట్టాడు. భువీ ఎంట్రీ ఇస్తే ధార్ సలీం బెంచ్‌కు పరిమితం కానున్నాడు. కాగా 35 ఏళ్ల భువనేశ్వర్ కుమార్‌కు అద్భుతమైన రికార్డు ఉంది.
176 ఐపిఎల్ మ్యాచ్‌లు ఆడిన ఈ యూపీ ఫాస్ట్ బౌలర్.. 7.56 ఎకానమీతో 181 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా గత కొన్ని సీజన్లగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన భువనేశ్వర్‌ను ఐపీఎల్-2025 వేలంలో రూ. 10.75 భారీ ధరకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. కాగా సీఎస్‌కేపై భువనేశ్వర్‌కు అంతమంచి రికార్డు లేదు. సీఎస్‌కేపై 20 మ్యాచ్‌ల్లో అతడు 39 సగటుతో 20 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
ఐపీఎల్-2025కు ఆర్సీబీ తుది జట్టు ఇదే
రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, లియామ్ లివింగ్‌స్టోన్, రసిఖ్ దార్, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, నువాన్ తుషార, మనోజ్ స్వేఖ్ భండాగే, జాకబ్ బండెక్, జాకబ్ బంధేజ్ లుంగీ ఎంగిడీ, అభినందన్ సింగ్, మోహిత్ రాథీ.
చదవండి: DC vs LSG: విశాఖలో మ్యాచ్.. తుదిజట్లు ఇవే!.. వర్షం ముప్పు?