Bhuvneshwar Kumar
-
IPL 2025: గుడ్ బై.. స్వింగ్ కింగ్ భావోద్వేగం!.. ఆరెంజ్ ఆర్మీపై భువీ పోస్ట్
టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వకుమార్ భావోద్వేగానికి లోనయ్యాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తన పదకొండేళ్ల సుదీర్ఘ ప్రయాణం ముగిసిపోయిందన్నాడు. ఈ జట్టుతో తనకెన్నో మరపురాని, మధురజ్ఞాపకాలు ఉన్నాయంటూ భారమైన హృదయంతో వీడ్కోలు పలికాడు. ఈ సందర్భంగా ఆరెంజ్ ఆర్మీని ఉద్దేశించి భువీ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు.కరగని కావ్య మనసు!కాగా ఐపీఎల్ మెగా వేలం-2025కి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ భువీని వదిలేసిన విషయం తెలిసిందే. అయితే, ఆక్షన్లోనైనా అతడిని కొనుగోలు చేయాలని సన్‌రైజర్స్ యజమాని కావ్యా మారన్‌కు అభిమానులు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. అయితే, ఆరెంజ్ ఆర్మీ కోరుకున్నది జరుగలేదు.భువీ కోసం పోటీ పడ్డ ముంబై, లక్నోసౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో జరిగిన వేలంలో భువనేశ్వర్ కుమార్ కోసం సన్‌రైజర్స్ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. రూ. 2 కోట్ల కనీస ధరతో అందుబాటులో ఉన్న భువీ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఆది నుంచి ఆసక్తి చూపించింది. రూ. 10.75 కోట్లకు ఆర్సీబీ సొంతంముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్‌లతో పోటీపడి మరీ ధరను రూ. 10 కోట్లకు పెంచింది. ఆ తర్వాత కూడా లక్నో పోటీకి రాగా.. ఒక్కసారిగా 75 లక్షలు పెంచి రూ. 10.75 కోట్లకు ఆర్సీబీ భువీని సొంతం చేసుకుంది.సన్‌రైజర్స్ టైటిల్ గెలవడంలో భువీది కీలక పాత్రకాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన కుడిచేతి వాటం పేసర్ భువనేశ్వర్ కుమార్ 2011లో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చాడు. 2013లో సన్‌రైజర్స్‌తో చేరిన అతడు 2024 వరకు జట్టుతోనే కొనసాగాడు. 2016లో సన్‌రైజర్స్ టైటిల్ గెలవడంలో భువీది కీలక పాత్ర. ఆ ఏడాది అతడు 23 వికెట్లతో చెలరేగాడు. ఆ తర్వాతి సీజన్లో అత్యుత్తమంగా 26 వికెట్లు పడగొట్టాడు. కానీ.. అప్పటి నుంచి ఒక్కసారి కూడా మళ్లీ 20 వికెట్లు కూడా తీయలేకపోయాడు. దీంతో వేలానికి ముందు సన్‌రైజర్స్ భువీని వదిలేసింది. ఈ నేపథ్యంలో తమ హార్ట్‌బ్రేక్ అయిందని ఆరెంజ్ ఆర్మీ నెట్టింట భువీ పేరును ట్రెండ్ చేసింది.గుడ్ బై.. ఆరెంజ్ ఆర్మీఈ నేపథ్యంలో భువనేశ్వర్‌కుమార్ తాజాగా ఎక్స్ వేదికగా ఆరెంజ్ ఆర్మీని ఉద్దేశించి వీడియో షేర్ చేశాడు. ‘‘ఎస్ఆర్హెచ్తో అద్భుతమైన పదకొండేళ్ల ప్రయాణానికి ఇక వీడ్కోలు. ఇక్కడ నాకెన్నో మరుపురాని చిర్మసరణీయ జ్ఞాపకాలు ఉన్నాయి. అయితే, మీ ప్రేమను మాత్రం మిస్ అవ్వను. మీ మద్దతను ఎన్నటికీ మరువను. మీరు, మీ మద్దతే నా బలం. నా ప్రయాణాన్ని అద్భుతంగా మలిచినందుకు ధన్యవాదాలు. నాపై మీ ప్రేమ ఇలాగే కొనసాగాలి’’ అని 34 ఏళ్ల భువీ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక వచ్చే ఏడాది ఈ స్వింగ్ కింగ్ ఆర్సీబీ జెర్సీలో దర్శనమివ్వబోతున్నాడు.చదవండి: KKR: అతడు 12 కోట్లకే వచ్చేవాడు.. ఇషాన్ కూడా చీప్.. అయినా ఎందుకిలా?After 11 incredible years with SRH, I say goodbye to this team. I have so many unforgettable and cherishable memories.One thing unmissable is the love of the fans which has been splendid! Your support has been constant.I will carry this love and support with me forever 🧡 pic.twitter.com/SywIykloHp— Bhuvneshwar Kumar (@BhuviOfficial) November 28, 2024After 11 incredible years with SRH, I say goodbye to this team. I have so many unforgettable and cherishable memories.One thing unmissable is the love of the fans which has been splendid! Your support has been constant.I will carry this love and support with me forever 🧡 pic.twitter.com/SywIykloHp— Bhuvneshwar Kumar (@BhuviOfficial) November 28, 2024 -
IPL Auction 2025 : పేస్ బౌలర్లకు పట్టం
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకడు... అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానం... టైటిల్ సహా దశాబ్దకాలం పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషించిన పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వేలంలో ఫ్రాంచైజీలను ఆకర్షించడంలో సఫలమయ్యాడు. రెండో రోజు వేలంలో భువీ (రూ.10 కోట్ల 75 లక్షలు) అత్యధిక ధరతో అగ్ర స్థానంలో నిలిచాడు. భువనేశ్వర్లాగే చెన్నై మూడు ట్రోఫీ విజయాల్లో కీలక బౌలర్‌గా నిలిచిన దీపక్ చహర్‌కు (రూ.9 కోట్ల 25 లక్షలు) భారీ మొత్తం దక్కింది. వీరిద్దరిని వరుసగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు దక్కించుకున్నాయి. ప్రతీ జట్టుకూ భారత పేసర్ల అవసరం ఉండటంతో సోమవారం వేలంలో ఆకాశ్‌దీప్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్‌పాండేలకు మంచి విలువ లభించింది. విదేశీ ఆటగాళ్లలో మార్కో జాన్సెన్, విల్ జాక్స్‌లను ఫ్రాంచైజీలు తగిన మొత్తానికి సొంతం చేసుకున్నాయి. ఆరంభంలో ఆసక్తి చూపించకపోయినా... అజింక్య రహానే, దేవదత్ పడిక్కల్, ఉమ్రాన్ మాలిక్వంటి ఆటగాళ్లను చివర్లో టీమ్‌లు ఎంచుకున్నాయి. రెండో రోజు కూడా ఆస్ట్రేలియా డాషింగ్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు నిరాశ ఎదురవగా... కేన్ విలియమ్సన్, బెయిర్‌స్టో, మిచెల్, శార్దుల్ ఠాకూర్ తదితరులను ఫ్రాంచైజీలు దూరంగా ఉంచాయి. జిద్దా (సౌదీ అరేబియా): ఐపీఎల్–2025 కోసం రెండు రోజుల పాటు సాగిన వేలం సోమవారం ముగిసింది. మొత్తం 577 మంది క్రికెటర్లు వేలంలోకి రాగా... గరిష్టంగా 204 మంది క్రికెటర్లను ఎంచుకునే అవకాశం ఉండగా... 10 ఫ్రాంచైజీలు కలిపి మొత్తం 182 మంది ఆటగాళ్లనే వేలంలో తీసుకున్నాయి. వీరిలో 62 మంది విదేశీయులు కాగా... అన్ని జట్లూ కలిపి వేలంలో రూ.639.15 కోట్లు వెచ్చించాయి. ఐపీఎల్లో అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా బిహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. వేలంలో రాజస్తాన్ రూ.1 కోటీ 10 లక్షలకు ఎంచుకునే సమయానికి వైభవ్ వయసు 13 ఏళ్ల 243 రోజులు మాత్రమే. వైభవ్ ఇప్పటి వరకు 5 రంజీ మ్యాచ్‌లు, ఒక టి20 మ్యాచ్ ఆడాడు. అయితే ఇటీవల భారత అండర్–19 జట్టు సభ్యుడిగా ఆ్రస్టేలియా అండర్ –19 జట్టుతో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. తొలి రోజు వేలం రికార్డులతో హోరెత్తించగా, రెండో రోజు కూడా పేరున్న ఆటగాళ్లకు మంచి మొత్తమే దక్కింది. సోమవారం జాబితాలో పెద్ద సంఖ్యలో యువ ఆటగాళ్లు బరిలో నిలవగా, కొందరిని అదృష్టం తలుపు తట్టింది. జాతీయ జట్టుకు ఆడని అన్క్యాప్డ్ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు చివర్లో కనీస విలువకే తీసుకొని జట్టులో మిగిలిన ఖాళీలను నింపాయి. -
ఆరెంజ్ ఆర్మీ హార్ట్‌బ్రేక్.. కావ్యా మేడమ్ ఇలా ఎందుకు చేసింది!
ఆరెంజ్ ఆర్మీ అభిమానులకు చేదువార్త. టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బంధం తెగిపోయింది. ఐపీఎల్ మెగా వేలం-2025కి ముందు రిటెన్షన్స్‌లో భాగంగా సన్‌రైజర్స్ భువీని వదిలేసింది.అయితే, కనీసం రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారానైనా భువీని తిరిగి సొంతం చేసుకుంటే బాగుండని సన్‌రైజర్స్ అభిమానులు భావించారు. కానీ.. వారికి నిరాశే మిగిలింది. వచ్చే ఏడాది భువనేశ్వర్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు(ఆర్సీబీ) ఆడబోతున్నాడు. కాగా సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ఆదివారం మెగా వేలం మొదలైంది.ఈ క్రమంలో సోమవారం నాటి ఆఖరి రోజు ఆక్షన్‌లో భాగంగా భువీ రూ. 2 కోట్ల కనీస ధరతో అందుబాటులోకి వచ్చాడు. ఆక్షనీర్ మల్లికా సాగర్ భువీ పేరు చెప్పగానే ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ రంగంలోకి దిగాయి. తగ్గేదేలే అన్నట్లు పోటీపడుతూ ఏకంగా రూ. 9 కోట్ల వరకు తలపడ్డాయి.అయితే, ఆ తర్వాత లక్నో భువీ ధరను రూ. 10 కోట్లకు పెంచిన తర్వాత ముంబై పోటీ నుంచి తప్పుకొంది. దీంతో లక్నోకు భువీ సొంతమవుతాడని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆర్సీబీ రేసులోకి దూసుకువచ్చింది. అమాంతం రూ. 75 లక్షలు పెంచి.. మొత్తంగా 10.75 కోట్ల రూపాయలకు భువీని బెంగళూరు దక్కించుకుంది.సన్‌రైజర్స్‌తో సుదీర్ఘ అనుబంధంఉత్తరప్రదేశ్కు చెందిన భువనేశ్వర్ కుమార్ 2011లో ఐపీఎల్లో అడుగుపెట్టాడు. తొలి సీజన్లో పుణె వారియర్స్(ఇప్పుడు లేదు) జట్టుకు ఆడాడు భువీ. ఏడు కంటే తక్కువ ఎకానమీతో 2013లో 13 వికెట్లు తీసి సత్తా చాటిన ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్‌ను.. 2014లో సన్‌రైజర్స్ దక్కించుకుంది.సన్‌రైజర్స్ ను చాంపియన్‌గా నిలపడంలో కీలకంరైజర్స్ తరఫున 2016లో భువీ 23 వికెట్లతో దుమ్ములేపి జట్టును చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ మరుసటి ఏడాది 26 వికెట్లతో దూసుకుపోయాడు. అయితే, ఆ తర్వాతి సీజన్ నుంచి భువీ ఒక్కసారి కూడా 20 వికెట్ల మార్కు అందుకోలేకపోయాడు. ఈ క్రమంలో సన్‌రైజర్స్ అతడిని వదిలేయడం గమనార్హం. అంతేకాదు వేలంలో కూడా అతడిపై ఏమాత్రం ఆసక్తి చూపలేదు.ఆరెంజ్ ఆర్మీ హార్ట్‌బ్రేక్.. కావ్యా మేడమ్ ఇలా ఎందుకు చేసింది!దీంతో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘కావ్యా మేడమ్ భువీని తీసుకోవాల్సింది. నిన్ను కచ్చితంగా మిస్ అవుతావు భయ్యా!’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మందేమో.. ‘‘నా బ్రేకప్ కంటే కూడా.. భువీ- సన్‌రైజర్స్ బ్రేకప్‌తోనే నేను ఎక్కువగా హర్ట్ అయ్యాను’’ అంటూ తమ బాధను పంచుకుంటున్నారు.కాగా గతంలో పలు సందర్భాల్లో భువీ సన్‌రైజర్స్ కెప్టెన్‌గానూ వ్యవహరించాడు.మరోవైపు.. ఆర్సీబీ అభిమానులు భువీ రాకతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు భువీ మొత్తంగా 176 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 181 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 5/19. కాగా గత కొంతకాలంగా ఈ యూపీ పేసర్‌కు టీమిండియాలో చోటు దక్కడం లేదు. అయితే, దేశీ టీ20లలో సత్తా చాటుతూ భువనేశ్వర్ వేలంలో ఈ మేర కోట్లు కొల్లగొట్టాడు.చదవండి: అదే మా కొంపముంచింది.. మరింత బలంగా తిరిగి వస్తాము: ఆసీస్ కెప్టెన్ -
భువనేశ్వర్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన అర్ష్‌దీప్ సింగ్.. ఒకే ఒక్కడు!
అంతర్జాతీయ టీ20లలో టీమిండియా తరఫున 2022లో అరంగేట్రం చేశాడు అర్ష్‌దీప్ సింగ్. రెండేళ్లకాలంలోనే పొట్టి ఫార్మాట్లో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా అవతరించాడు. తాజాగా సౌతాఫ్రికా పర్యటనలోనూ సత్తా చాటుతున్నాడు ఈ యువ పేసర్.నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టీ20లలో స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్‌పై కూడా అర్ష్‌దీప్ ఫర్వాలేదనిపించాడు. ఆ రెండు మ్యాచ్‌లలో ఒక్కో వికెట్ తీసిన ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్.. మూడో టీ20లో మాత్రం తన సత్తా చూపించాడు. కీలక సమయంలో మూడు కీలక వికెట్లు కూల్చి టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చడంలో తన వంతు పాత్ర పోషించాడు.కీలక సమయంలో కీలక వికెట్లు తీసిపవర్ ప్లేలో సౌతాఫ్రికా ఓపెనర్ రియాన్ రెకెల్టన్(15 బంతుల్లో 20)ను పెవిలియన్‌కు పంపిన అర్ష్‌దీప్.. విధ్వంసకర బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్(22 బంతుల్లో 41)ను అవుట్ చేసి తన ఖాతాలో రెండో వికెట్ జమచేసుకున్నాడు. ఇక ప్రొటిస్ జట్టు లక్ష్యానికి చేరువగా వస్తుందనుకున్న సమయంలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ వీరుడు మార్కో జాన్సెన్(17 బంతుల్లో 54)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని గట్టిషాకిచ్చాడు.అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్బౌలర్గామొత్తంగా మూడో టీ20లో నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన అర్ష్‌దీప్ 37 పరుగులు ఇచ్చి.. మూడు వికెట్లు కూల్చాడు. తద్వారా అంతర్జాతీయ టీ20లలో 92 వికెట్ల మార్కును అందుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్‌కుమార్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్‌బౌలర్‌గా అవతరించాడు.అంతేకాదు.. టీమిండియా తరఫున టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గానూ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో భారత వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ 96 వికెట్లతో మొదటిస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, తొంభై వికెట్ల క్లబ్లో చేరేందుకు చహల్‌కు 80 మ్యాచ్‌లు అవసరమైతే.. 25 ఏళ్ల అర్ష్‌దీప్ సింగ్ కేవలం 59 మ్యాచ్‌లలోనే ఈ ఘనత సాధించడం విశేషం.అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లు1. యజువేంద్ర చహల్- 80 మ్యాచ్‌లలో 96 వికెట్లు2. అర్ష్‌దీప్ సింగ్- 59 మ్యాచ్‌లలో 92 వికెట్లు3. భువనేశ్వర్ కుమార్- 87 మ్యాచ్‌లలో 90 వికెట్లు4. జస్ప్రీత్ బుమ్రా- 70 మ్యాచ్‌లలో 89 వికెట్లు.తిలక్, అభిషేక్ ధనాధన్ఇదిలా ఉంటే.. సెంచూరియన్ వేదికగా బుధవారం సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. తిలక్ వర్మ(107 నాటౌట్), అభిషేక్ శర్మ(50) అద్భుత ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ఏకంగా 219 పరుగులు చేసింది.లక్ష్య ఛేదనలో ఆఖరి వరకు సౌతాఫ్రికా పోరాడినా.. భారత బౌలర్ల విజృంభణతో వారికి ఓటమి తప్పలేదు. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 208 పరుగుల వద్ద నిలిచిన ప్రొటిస్ జట్టు.. టీమిండియా చేతిలో పదకొండు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ క్రమంలో సూర్యకుమార్ సేన ఈ సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక నాలుగో టీ20 జొహన్నస్‌బర్గ్‌లో ఆదివారం జరుగనుంది.చదవండి: అతడి కోసం నా ప్లేస్‌ను త్యాగం చేశా.. చెప్పి మరీ సెంచరీ బాదాడు: సూర్య -
భార్యను సర్ప్రైజ్ చేసిన భువీ (ఫోటోలు)
-
భువనేశ్వర్ కుమార్‌కు జాక్ పాట్.. లీగ్ చరిత్రలోనే భారీ ధర
ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్-2024లో టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. తొలి ఎడిషన్‌లో నోయిడా సూపర్ కింగ్స్‌కు ప్రాతనిథ్యం వహించిన భువనేశ్వర్.. ఈ ఏడాది సీజన్లో మాత్రం లక్నో ఫాల్కన్స్ తరపున ఆడనున్నాడు. ఆదివారం జరిగిన యూపీ టీ20 లీగ్ వేలంలో భువనేశ్వర్ కుమార్‌ను రూ. 30.25 లక్షల భారీ మొత్తానికి లక్నో ఫాల్కన్స్ కొనుగోలు చేసింది. దీంతో లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా భువీ రికార్డులకెక్కాడు. ఈ భారత వెటరన్ క్రికెటర్ కోసం కాన్పూర్ సూపర్ స్టార్స్ , గోరఖ్‌పూర్ లయన్స్ కూడా తీవ్రంగా శ్రమించాయి. కానీ వారి పర్స్‌లో తగినంత మొత్తం లేకపోవడంతో సదరు ఫ్రాంచైజీలు తమ నిర్ణయాన్ని మార్చుకున్నాయి. అయితే లక్నో ఫాల్కన్స్ మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గకుండా అతడిపై భారీ మొత్తాన్ని వెచ్చింది. గత సీజన్లో 9 మ్యాచ్‌లు ఆడిన భువీ 13 వికెట్లతో అదుర్స్ అన్పించాడు. కాగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న భువనేశ్వర్.. ప్రస్తుతం ఐపీఎల్లో కూడా ఆడుతున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్-2021 మెగా వేలంలో అతడిని ఎస్ఆర్హెచ్ రూ. 4.21 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక యూపీ టీ20 లీగ్-2024 సీజన్ ఆగస్టు 25 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో నితీష్ రాణా, శివమ్ మావి, వెటరన్ క్రికెటర్ పీయూష్ చావ్లా వంటి వారు భాగం కానున్నారు. -
SRH: కావ్యా మారన్ వైల్డ్ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
సొంతగడ్డపై.. టీ20 మ్యాచ్.. నరాలు తెగే ఉత్కంఠ నడుమ.. ఆఖరి బంతికి ఒక్క పరుగు తేడాతో గెలిస్తే ఆ కిక్కే వేరు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు, అభిమానులు గురువారం నాటి మ్యాచ్‌లో ఈ మధురానుభూతిని చవిచూశారు.ఆఖరి బంతికి భువనేశ్వర్ కుమార్ వికెట్ తీసి.. పటిష్ట రాజస్తాన్ రాయల్స్‌పై రైజర్స్‌ను గెలుపు తీరాలకు చేర్చడంతో వారి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఆటగాళ్లు, ఆరెంజ్ ఆర్మీ పరిస్థితి ఇలా ఉంటే.. ఫ్రాంఛైజీ సహ యజమాని కావ్యా మారన్ అయితే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు. #TATAIPL Matches 📂↳ Last Ball Thrillers 📂Bhuvneshwar Kumar wins it for @SunRisers 👌👏Recap the Match on @StarSportsIndia and @JioCinema 💻📱#SRHvRR pic.twitter.com/mHdbR2K3SH— IndianPremierLeague (@IPL) May 2, 2024 ‘‘హేయ్.. మేమే గెలిచాం’’ అన్నట్లుగా సంతోషం పట్టలేక గాల్లోకి ఎగిరి దుముకుతూ వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు కావ్యా. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.అగ్ర స్థానంలోనే రాజస్తాన్కాగా ఐపీఎల్-2024లో వరుస విజయాలతో జోరు మీదున్న రాజస్తాన్ రాయల్స్‌కు సన్‌రైజర్స్ షాకిచ్చిన విషయం తెలిసిందే. ఉప్పల్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఒక్క పరుగు తేడాతో రైజర్స్ గట్టెక్కింది. Jumps of Joy in Hyderabad 🥳Terrific turn of events from @SunRisers' bowlers as they pull off a nail-biting win 🧡Scorecard ▶️ https://t.co/zRmPoMjvsd #TATAIPL | #SRHvRR pic.twitter.com/qMDgjkJ4tc— IndianPremierLeague (@IPL) May 2, 2024 తద్వారా వరుసగా రెండు ఓటముల తర్వాత గెలుపొంది పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి దూసుకువచ్చింది. మరోవైపు.. రైజర్స్ చేతిలో పరాభవం ఎదురైనా రాజస్తాన్ అగ్రస్థానానికి వచ్చిన చిక్కేమీ లేదు. ఇప్పటికే 8 విజయాలు సాధించిన సంజూ సేన 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసులో అందరి కంటే ముందే ఉంది.సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు:👉వేదిక: ఉప్పల్, హైదరాబాద్👉టాస్: సన్‌రైజర్స్- బ్యాటింగ్👉హైదరాబాద్ స్కోరు: 201/3 (20)👉రాజస్తాన్ స్కోరు: 200/7 (20)👉ఫలితం: ఒక్క పరుగు తేడాతో రాజస్తాన్‌పై సన్‌రైజర్స్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: భువనేశ్వర్ కుమార్(3/41)👉టాప్ స్కోరర్లు: నితీశ్ రెడ్డి(సన్‌రైజర్స్- 42 బంతుల్లో 76 రన్స్- నాటౌట్)👉రియాన్ పరాగ్ (రాజస్తాన్- 49 బంతుల్లో 77 పరుగులు).చదవండి: వాళ్లిద్దరు అద్భుతం.. నితీశ్‌రెడ్డి సూపర్: కమిన్స్ ప్రశంసలు -
SRH vs RR: వారెవ్వా భువీ .. ఉత్కంఠ పోరులో ఎస్ఆర్హెచ్ విజయం
ఐపీఎల్-2024లో ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ సినిమా థ్రిల్లర్‌ను తలపించింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్ విజయంలో భువనేశ్వర్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. రాజస్తాన్ విజయానికి ఆఖరి ఓవర్లో 13 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో రావ్‌మెన్ పావెల్, అశ్విన్ ఉండగా.. ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను కమ్మిన్స్ భువీ అప్పగించాడు. చివరి ఓవర్ తొలి బంతికి అశ్విన్ సింగిల్ తీసి పావెల్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. పావెల్ రెండో బంతికి డబుల్, మూడో బంతిని బౌండరీగా మలిచాడు. దీంతో ఆఖరి మూడు బంతుల్లో రాజస్తాన్ విజయసమీకరణం 6 పరుగులుగా మారింది. ఆ తర్వాత వరుస రెండు బంతుల్లో పావెల్ రెండేసి పరుగులు తీయడంతో ఆఖరి బంతికి రాజస్తాన్ గెలుపునకు 2 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో భువనేశ్వర్ ఆఖరి డెలివరీని అద్బుతంగా బౌలింగ్ చేసి పావెల్‌ను ఎల్బీ రూపంలో ఔట్ చేశాడు. దీంతో ఎస్ఆర్హెచ్ సంచలన విజయం నమోదు చేసింది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో యశస్వీ జైశ్వాల్(67), రియాన్ పరాగ్(77) హాఫ్ సెంచరీలతో పోరాట పటిమ కనబరిచారు.ఎస్ఆర్హెచ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. నటరాజన్, కమ్మిన్స్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఆంధ్ర ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి విధ్వంసం సృష్టించాడు. 41 బంతులు ఎదుర్కొన్న నితీష్.. 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో 76 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.అతడితో పాటు ఓపెనర్ ట్రావిస్ హెడ్(58), క్లాసెన్(42 నాటౌట్) పరుగులతో సత్తాచాటారు. రాజస్తాన్ బౌలర్లలో అవేష్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ ఒక్క వికెట్ సాధించాడు. -
దుమ్ములేపిన భువీ.. కెరీర్ బెస్ట్.. టీమిండియా రీఎంట్రీ ఎప్పుడో?
Ranji Trophy 2024- Bhuvneshwar Kumar: దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత రంజీల్లో పునరాగమనం చేసిన టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. తొలి మ్యాచ్‌లోనే ఏకంగా ఎనిమిది వికెట్లు కూల్చి సత్తా చాటాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 8/41 (22 ఓవర్లు)తో కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. 60 పరుగులకే ఆలౌట్ దేశవాళీ క్రికెట్లో తన సొంత జట్టు ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న భువీ బెంగాల్‌తో మ్యాచ్ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. కాన్పూర్‌లో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగాల్ తొలుత ఫీల్డింగ్‌కు దిగింది. యూపీ జట్టును కేవలం 60 పరుగులకే ఆలౌట్ చేసి దిమ్మతిరిగేలా షాకిచ్చింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్ జోరుకు భువీ అడ్డుకట్ట వేయగలిగాడు. తొలి రోజే ఐదు వికెట్లు కూల్చాడు ఈ రైటార్మ్ పేసర్ దెబ్బకు ఓపెనర్ సౌరవ్ పాల్ 13 పరుగులకే పరిమితం కాగా.. సుదీప్ కుమార్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇతర ఆటగాళ్లలో అనుస్తుప్ మజుందార్(12), కెప్టెన్ మనోజ్ తివారి(3), అభిషేక్ పోరెల్(12)లు కూడా భువీకే వికెట్ సమర్పించుకుని పెవిలియన్ చేరారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సరికే భువీ ఖాతాలో ఐదు వికెట్లు చేరాయి. భువీ 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం ఇది 13వసారి. ఈ క్రమంలో 95/5 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టిన బెంగాల్ 188 పరుగులకు ఆలౌట్ అయింది. మొత్తం ఎనిమిది వికెట్లు రెండో రోజు ఆటలో.. 41 పరుగులతో నిలకడగా ఆడుతున్న ఓపెనర్ శ్రేయాన్ష్ ఘోష్‌ను పెవిలియన్‌కు పంపిన భువీ.. ప్రదీప్త ప్రమాణిక్(1), సూరజ్ సింధు జైస్వాల్(20)లను కూడా అవుట్ చేశాడు. దీంతో భువీ ఖాతాలోని వికెట్ల సంఖ్య ఎనిమిది చేరింది. ఇక కరణ్ లాల్(12), ఇషాన్ పోరెల్(10) రూపంలో మరో రెండు వికెట్లను లెఫ్టార్మ్ పేసర్ యశ్ దయాల్ దక్కించుకున్నాడు. బెంగాల్ ఆలౌట్ అయిన తర్వాత మళ్లీ బ్యాటింగ్ ఆరంభించిన ఉత్తరప్రదేశ్ జట్టు శనివారం ఆట పూర్తయ్యేసరికి 18 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేసింది. సమర్థ్ సింగ్ 21, ఆర్యన్ జుయాల్ 20 రన్స్‌తో క్రీజులో ఉన్నారు. అదే ఆఖరు.. రీఎంట్రీ ఎప్పుడో?! ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్-2022 ముగిసిన తర్వాత భువనేశ్వర్ కుమార్‌కు జట్టులో ప్రాధాన్యం లేకుండా పోయింది. 2022, నవంబరులో న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌లో ఈ సీమర్ ఆఖరిసారిగా టీమిండియాకు ఆడాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి అతడిని తప్పించింది. ఈ క్రమంలో 33 ఏళ్ల భువీకి జట్టులో చోటు కరువైంది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌లతో పాటు యువ పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్‌లతో పోటీలో అతడు వెనుకబడిపోయాడు. ప్రస్తుతం దేశవాళీ, లీగ్ క్రికెట్‌కే పరిమితమైన భువనేశ్వర్ కుమార్ తాజాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో సత్తా చాటుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా భువీ ప్రదర్శన ఆధారంగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు అతడిని ఎంపిక చేయాలని అభిమానులు బీసీసీఐ సెలక్టర్లకు సూచిస్తున్నారు. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లకు జట్టును ప్రకటించినప్పటికీ.. మిగిలిన మూడు టెస్టులకైనా అతడిని పరిగణనలోకి తీసుకుంటే బాగుండని ఆకాంక్షిస్తున్నారు. చదవండి: INDA Vs ENGA: శతక్కొట్టిన పాటిదార్.. పాపం సర్ఫరాజ్! భరత్ ఫిఫ్టీ.. .@BhuviOfficial on fire 🔥 A five-wicket haul and he's taken all 5⃣ Bengal wickets to fall so far. What a splendid spell 👌👌@IDFCFIRSTBank | #RanjiTrophy | #UPvBEN Follow the match ▶️ https://t.co/yRqgNJxmLY pic.twitter.com/Dqu0OgJMk0 — BCCI Domestic (@BCCIdomestic) January 12, 2024 -
షమీ తమ్ముడి దెబ్బ.. 60 పరుగులకే యూపీ ఆలౌట్! భువీ కూడా తగ్గేదేలే..
Ranji Trophy 2023-24: టీమిండియా వెటరన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ రంజీ ట్రోఫీ-2024 మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దేశవాళీ క్రికెట్లో ఈ రైటార్మ్ పేసర్ తన సొంత జట్టు ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం బెంగాల్‌తో మొదలైన టెస్టులో భువీ అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు. తొలిరోజు ఆట ముగిసే సరికి 1.90 ఎకనామీతో ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. అరవై పరుగులకే ఆలౌట్ అయి చెత్త రికార్డు మూటగట్టుకున్న యూపీ జట్టుకు కాస్త ఊరట చేకూరేలా తన బౌలింగ్ నైపుణ్యాలతో బెంగాల్ జోరుకు అడ్డుకట్ట వేశాడు. మహ్మద్ కైఫ్‌నకు నాలుగు వికెట్లు కాన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగాల్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ మనోజ్ తివారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరి దెబ్బకు యూపీ కేవలం 20.5 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 60 పరుగుల వద్దే చాపచుట్టేసింది. బెంగాల్ బౌలర్లలో పేసర్ మహ్మద్ కైఫ్(టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ తమ్ముడు) అత్యధికంగా నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకోగా.. సూరజ్ సింధు జైస్వాల్ మూడు, ఇషాన్ పోరెల్ రెండు వికెట్లు పడగొట్టారు. యూపీ బ్యాటర్లలో ఓపెనర్ సమర్థ్ సింగ్ 13 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవడం గమనార్హం. భువీ కూడా తగ్గేదేలే ప్రత్యర్థిని అల్ప స్కోరుకే పరిమితం చేశామన్న సంతోషంలో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బెంగాల్‌కు భువీ వరుస షాకులు ఇచ్చాడు. ఈ యూపీ బౌలర్ దెబ్బకు ఓపెనర్ సౌరవ్ పాల్ 13, సుదీప్ కుమార్ ఘరామి 0, అనుస్తుప్ మజుందార్ 12, మనోజ్ తివారి 3, అభిషేక్ పోరెల్ 12 పరుగులకే పరిమితమయ్యారు. ఇలా మొదటి రోజు ఆట పూర్తయ్యే సరికి భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లు కూల్చగా.. బెంగాల్ బ్యాటర్లు శ్రేయాన్ష్ ఘోష్ 37, కరణ్ లాల్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆట ముగిసే సరికి 28 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసిన బెంగాల్ 35 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అన్న షమీ బాటలో తమ్ముడు కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహ్మద్ షమీకి దేశవాళీ క్రికెట్లో సొంత జట్టుకు ఆడే అవకాశం రాకపోవడంతో బెంగాల్ తరఫున ఎంట్రీ ఇచ్చిన అతడు.. టీమిండియా స్టార్ పేసర్ స్థాయికి ఎదిగాడు. అన్న బాటలోనే నడుస్తున్న తమ్ముడు మహ్మద్ కైఫ్ సైతం ప్రస్తుతం బెంగాల్‌కే ఆడుతున్నాడు. ఇలా ఈరోజు అతడు అత్యుత్తమ ప్రదర్శనతో తన సొంత రాష్ట్రానికి చెందిన యూపీ జట్టును 60 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించడం విశేషం. మరోవైపు.. చాలా కాలంగా టీమిండియాకు దూరమైన భువనేశ్వర్ కుమార్ మళ్లీ జట్టులో చోటు దక్కించుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాడు. కానీ.. జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలోని పేస్ దళంలో షమీ, మహ్మద్ సిరాజ్ వంటి సీనియర్లు.. అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్ వంటి జూనియర్లు జట్టులో పాతుకుపోవడంతో భువీకి మొండిచేయే ఎదురవుతోంది. అయితే, తాజా రంజీ ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. చదవండి: IND Vs AFG: రోహిత్ రనౌట్.. తప్పు అతడిదే: టీమిండియా మాజీ బ్యాటర్ .@BhuviOfficial on fire 🔥 A five-wicket haul and he's taken all 5⃣ Bengal wickets to fall so far. What a splendid spell 👌👌@IDFCFIRSTBank | #RanjiTrophy | #UPvBEN Follow the match ▶️ https://t.co/yRqgNJxmLY pic.twitter.com/Dqu0OgJMk0 — BCCI Domestic (@BCCIdomestic) January 12, 2024 -
‘సెలక్టర్లు అతడిని మర్చిపోవద్దు.. సౌతాఫ్రికా టూర్‌కు పంపాల్సింది’
India tour of South Africa, 2023-24: సౌతాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసిన భారత ‘జట్ల’పై టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా స్పందించాడు. ప్రొటిస్ గడ్డపై వరుస సిరీస్‌లు ఆడేందుకు బీసీసీఐ ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో జట్టును సెలక్ట్ చేస్తుందని ముందే ఊహించానని పేర్కొన్నాడు. అయితే, మూడు జట్లలోనూ ఓ కీలక ఆటగాడి పేరు మాత్రం మిస్ అయిందని.. అతడు ఉంటే జట్టు మరింత పటిష్టమయ్యేదని నెహ్రా అభిప్రాయపడ్డాడు. కాగా డిసెంబరు 10 నుంచి జనవరి 7 వరకు టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. మూడు ఫార్మాట్లకు మూడు జట్లు ఇందులో భాగంగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడనుంది. ఇందుకోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే మూడు జట్లను ప్రకటించింది. రెగుల్యర్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలిపింది. ఇక రోహిత్ గైర్హాజరీలో టీ20లకు సూర్యకుమార్ యాదవ్, వన్డేలకు కేఎల్ రాహుల్ నాయకులుగా వ్యవహరించనున్నారు. టెస్టు సిరీస్‌తో రోహిత్, కోహ్లి రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఆశిష్ నెహ్రా జియో సినిమా షోలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. అందరికీ సంతోషమే.. ఆ ఒక్కడికి తప్ప ‘‘సౌతాఫ్రికా పర్యటన కోసం టీమిండియా సెలక్టర్లు మూడు వేర్వేరు జట్లను ఎంపిక చేయడం నన్నేమీ ఆశ్చర్యపరచలేదు. జట్టులో చోటు ఆశించిన చాలా మందికి సంతోషం దక్కింది. అయితే, ఈ టూర్ గురించి వినగానే నా మదిలో మెదిలిన పేరు భువనేశ్వర్ కుమార్. సౌతాఫ్రికాకు వెళ్తున్నామంటే జట్టులో ఎక్కువగా ఫాస్ట్‌బౌలర్లు ఉండాలి. అయితే, కొత్త బంతితో ఫలితం రాబట్టగల అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్ వంటి యువ బౌలర్ల రూపంలో మంచి ఆప్షన్లు అందుబాటులో ఉన్నమాట వాస్తవమే. భువీ లాంటి అనుభవజ్ఞుడిని మర్చిపోకండి కానీ భువనేశ్వర్ కుమార్ వంటి అనుభవజ్ఞుడైన ఫాస్ట్‌బౌలర్ జట్టులో ఉంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. సెలక్టర్లు అతడి పేరును పూర్తిగా విస్మరించడం తగదు. ముఖ్యంగా టీ20, వన్డేలలో అతడి అవసరం జట్టుకు ఉంది’’ అని మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా సెలక్టర్లను ఉద్దేశించి మాట్లాడాడు. దేశవాళీ టోర్నీలో అదరగొట్టినా కాగా గతేడాది టీ20 ప్రపంచకప్‌లో నిరాశజనక ప్రదర్శన తర్వాత సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన భువీ.. ఇప్పటి వరకు రీఎంట్రీ ఇవ్వలేకపోయాడు. స్థానిక లీగ్, దేశవాళీ మ్యాచ్‌లలో అద్భుతంగా ఆడుతున్నప్పటికీ టీమిండియాలో చోటు కోసం యువ బౌలర్లతో పోటీలో మాత్రం వెనుకబడిపోయాడు. ఇటీవల ముగిసిన టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భువీ.. మొత్తంగా 16 వికెట్లు తీశాడు. చదవండి: సౌతాఫ్రికా టూర్: వన్డేలకు రాహుల్ సారథి.. జట్ల వివరాలివే చదవండి: WTC: టీమిండియాను ‘వెనక్కి’నెట్టిన బంగ్లాదేశ్! టాప్‌లో పాకిస్తాన్.. -
చెలరేగిన భువనేశ్వర్ కుమార్.. 9 బంతుల్లో 5 వికెట్లు
జాతీయ జట్టులో చోటు కోల్పోయిన టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్.. దేశీవాళీ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉత్తర ప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న భువీ నిప్పలు చేరుగుతున్నాడు. ఈ టోర్నీలో భాగంగా కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్ 5వికెట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 3.3 ఓవర్లు వేసిన భువనేశ్వర్ కేవలం 16 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తొలి రెండు ఓవర్లలో వికెట్లు సాధించికపోయిన భువీ.. డెత్ ఓవర్లలో 9 బంతుల్లో 5 వికెట్లు తీశాడు. 196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కర్ణాటక.. భువీ దాటికి 156 పరుగులకు ఆలౌటైంది. భువీతో పాటు యశ్ దయాల్ రెండు వికెట్లు సాధించాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. యూపీ బ్యాటర్లలో గోస్వామి(77), నితీష్ రానా(40) పరుగులతో రాణించారు. చదవండి: World Cup 2023: ఓటమి బాధతో బాబర్ ఏడ్చాడు.. తప్పు అతనొక్కడిదే కాదు: పాకిస్తాన్ లెజెండ్ -
అతడు అద్భుతం.. కాస్త ఏమరపాటుగా ఉన్నా అంతే! నాకు అనుభవం: ఏబీడీ
AB de Villiers on Bhuvneshwar Kumar: టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌పై సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ ప్రశంసలు కురిపించాడు. అద్భుతమైన బౌలింగ్ నైపుణ్యాలు భువీ సొంతమని.. అతడు బంతిని స్వింగ్ చేసే తీరు బ్యాటర్లకు చెమటలు పట్టిస్తుందని పేర్కొన్నాడు. తనకూ ఇలాంటి అనుభవం ఎదురైందంటూ స్వింగ్ సుల్తాన్‌ను ఆకాశానికెత్తాడు. కాగా 2018లో టీమిండియా సౌతాఫ్రికా పర్యటనలో 1-2తో ఆతిథ్య జట్టుకు టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. అయితే, భారత జట్టుకు ఓటమి ఎదురైనా.. భువీ మాత్రం ఈ సిరీస్‌లో కొన్ని మధురజ్ఞాపకాలు పోగు చేసుకున్నాడు. ఏబీడీ వికెట్ పడగొట్టాడు ఆడిన రెండు మ్యాచ్‌లలో కలిపి 10 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా టీమిండియా గెలిచిన మూడో మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్‌ను 5 పరుగులకు పెవిలియన్‌కు పంపి సత్తా చాటాడు. తాజాగా ఈ విషయాలను గుర్తుచేసుకున్న ఏబీడీ తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘భువీ అద్భుతమైన బౌలర్. అతడి నైపుణ్యాలు అమోఘం. బ్యాటర్‌ను మునివేళ్ల మీద నిలబెడతాడు. ఒకవేళ ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న మన బలహీనతను క్యాష్ చేసుకుని పండుగ చేసుకుంటాడు. సెంచూరియన్‌లో నాకు ఇలాంటి అనుభవం ఎదురైంది. భువీ అద్భుతం అవుట్స్వింగర్లతో నన్ను టీజ్ చేశాడు. ఎట్టకేలకు ఓ ఇన్‌స్వింగర్‌తో నా వికెట్ తీశాడు. ఏం జరుగుతుందో తెలిసేలోపే స్టంప్స్ ఎగిరిపోయాయి. భువీ పట్ల నాకెల్లప్పుడూ గౌరవభావం ఉంటుంది’’ అని డివిలియర్స్ భువనేశ్వర్ కుమార్‌ను కొనియాడాడు. టీమిండియాకు దూరం కాగా భువీకి టీమిండియాలో అవకాశాలు సన్నగిల్లిన విషయం తెలిసిందే. గతేడాది నవంబరులో న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్‌లో అతడు ఆఖరిసారిగా ఆడాడు. వరుసగా విఫలం కావడంతో బీసీసీఐ అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. దీంతో ప్రస్తుతం 33 ఏళ్ల భువీ లీగ్ క్రికెట్‌కే పరిమితమయ్యాడు. చదవండి: WC- Ind vs Aus: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన ద్రవిడ్! ఇషాన్‌కు లక్కీ ఛాన్స్! -
అవును.. టీమిండియాలో నాకు చోటు లేదు.. ఇక: భువీ కీలక నిర్ణయం
Bhuvneshwar Kumar Comments: ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్-2022 ముగిసిన తర్వాత టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు జట్టులో ప్రాధాన్యం లేకుండా పోయింది. గతేడాది నవంబరులో న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌లో అతడు ఆఖరిసారిగా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి కూడా అతడిని తప్పించింది బీసీసీఐ. ఈ క్రమంలో 33 ఏళ్ల భువీకి గత కొంతకాలంగా జట్టులో చోటు కరువైంది. ఈ నేపథ్యంలో ఈ యూపీ సీమర్ లీగ్ క్రికెట్‌కే పరిమితమయ్యాడు. ఐపీఎల్లో హైదరాబాద్‌కు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్న భువనేశ్వర్ కుమార్.. తాజా ఎడిషన్‌లో 14 మ్యాచ్‌లలో 16 వికెట్లు తీశాడు. ప్రస్తుతం అతడు యూపీ టీ20 లీగ్‌తో బిజీగా ఉన్నాడు. స్థానికంగా జరుగుతున్న ఈ క్రికెట్ టోర్నీలో భువీ ప్రాతినిథ్యం వహిస్తున్న నోయిడా సూపర్ కింగ్స్ టాప్‌లో కొనసాగుతోంది. భువీ(PC: SRH) ఈ నేపథ్యంలో నేషనల్న్యూస్తో మాట్లాడిన భువనేశ్వర్ కుమార్ జాతీయ జట్టులో పునరాగమనం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫాస్ట్‌బౌలర్‌గా తన అంతర్జాతీయ కెరీర్ చరమాంకానికి చేరిందన్న ఈ రైట్ఆర్మ్ పేసర్... ఇప్పుడు తన దృష్టంతా కేవలం ఆటను ఆస్వాదించడం మీదే ఉందని పేర్కొన్నాడు. కెరీర్ చరమాంకంలో ఉన్నాను ‘‘మన కెరీర్ ఎలా సాగుతుందన్న విషయం మనసు మనకు గుర్తుచేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను అదే స్టేజ్‌లో ఉన్నాను. కొన్నేళ్లపాటు మాత్రమే ఫాస్ట్‌బౌలర్‌గా మనగలను. అవును.. టీమిండియాలో నాకు చోటు లేదు. అయినా ఆ విషయం నన్ను బాధించడం లేదు. రీఎంట్రీ ఇచ్చేందుకు నేను ఇవన్నీ చేయడం లేదు. ఇంకొన్నాళ్ల పాటు నాణ్యమైన క్రికెట్ ఆడాలని మాత్రమే కోరుకుంటున్నా. ఈ క్రమంలో ఒకవేళ జాతీయ జట్టులో స్థానం దక్కితే దక్కొచ్చు. ఇకపై నా దృష్టి మొత్తం దానిమీదే అంతేగానీ.. ప్రత్యేకంగా తిరిగిరావడం కోసమే నేను ఈ ప్రయత్నాలు చేయడం లేదు. ఏ ఫార్మాట్లో అయినా.. ఎలాంటి లీగ్ ఆడుతున్నా మెరుగైన ప్రదర్శనలు ఇవ్వడం మీదే నా దృష్టి ఉంది’’ అని భువీ చెప్పుకొచ్చాడు. ఇకపై తాను లీగ్ క్రికెట్‌పై మరింతగా ఫోకస్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. కాగా భువనేశ్వర్ కుమార్ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 21 టెస్టులు, 121 వన్డేలు, 87 టీ20లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 63, 141, 90 వికెట్లు తీశాడు. లోకల్ టాలెంట్ వెలుగులోకి యూపీ వంటి రాష్ట్రంలో ఇలాంటి లీగ్‌లు స్థానిక ఆటగాళ్ల ప్రతిభను వెలికి తీసేందుకు ఉపయోగపడతాయని ఈ సందర్భంగా భువనేశ్వర్ కుమార్ పేర్కొన్నాడు. కాగా ఆరు జట్ల మధ్య పోటీతో ఆగష్టు 30న యూపీ టీ20 లీగ్ ఆరంభమైంది. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్-2023 నేపథ్యంలో బీసీసీఐ మంగళవారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: ప్రపంచకప్‌నకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. ఆ ముగ్గురు అవుట్! కెప్టెన్ సహా.. -
తానే బెస్ట్ బౌలర్ అనుకుంటాడు.. కోహ్లి బౌలింగ్ అంటే మాకు భయం: భువీ
Bhuvneshwar Kumar Comments On Virat Kohli: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిని ఉద్దేశించి భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులో ఉన్న అందరి బౌలర్ల కంటే తానే బెస్ట్ అని కోహ్లి భావిస్తాడని.. అయితే, అతడు బంతి పట్టుకుంటే తాము మాత్రం హడలిపోయేవాళ్లమని పేర్కొన్నాడు. అందుకు గల కారణాన్ని కూడా భువీ వెల్లడించాడు. షాకిచ్చిన బీసీసీఐ కాగా 2012లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన భువనేశ్వర్ కుమార్.. ఇప్పటి వరకు 21 టెస్టులు, 121 వన్డేలు, 87 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 63, 141, 90 వికెట్లు పడగొట్టాడు. అయితే, భువీ గత కొంతకాలంగా వరుసగా విఫలం కావడంతో బీసీసీఐ అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. అదే ఆఖరు గతేడాది నవంబరులో న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు ఈ రైట్ ఆర్మ్ పేసర్. అప్పటి నుంచి మళ్లీ అతడు జట్టుకు ఎంపిక కాలేదు. ఇదిలా ఉంటే.. ముంబైలో సోమవారం జరిగిన CEAT అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో భువనేశ్వర్ కుమార్ పాల్గొన్నాడు. కోహ్లి బౌలింగ్ చేస్తుంటే మాకు భయమేస్తుంది ఈ సందర్భంగా కోహ్లి గురించి ప్రస్తావన రాగా.. ‘‘విరాట్ కోహ్లి... జట్టులో ఉన్న అత్యుత్తమ బౌలర్ తానేనని భావిస్తాడు. కానీ మేము మాత్రం కోహ్లి బౌలింగ్ చేసినప్పుడల్లా భయపడిపోతాం. తన బౌలింగ్ యాక్షన్ కారణంగా ఎక్కడ గాయపడతాడో అని బెంబేలెత్తిపోతాం’’ అని భువీ సరదాగా వ్యాఖ్యానించాడు. కింగ్ ఎక్కడైనా కింగే! ఇక క్రికెటర్ కాకపోయి ఉంటే కోహ్లి మల్లయోధుడు(రెజ్లర్) అయి ఉండేవాడని భువీ పేర్కొన్నట్లు జాతీయ మీడియా కథనంలో వెల్లడించింది. ఈ క్రమంలో కోహ్లి గురించి భువీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో కింగ్ ఫ్యాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘భారత జట్టులో ఉన్న చాలా మంది బౌలర్ల కంటే కోహ్లి బెస్ట్’’అని ఫొటోలు షేర్ చేస్తున్నారు. ఆసియ కప్ బరిలో ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సెలవుల్లో ఉన్న కోహ్లి ఆగష్టు 30 నుంచి మొదలుకానున్న ఆసియా కప్-2023తో మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఇక ఈ వన్డే టోర్నీకి సంబంధించిన జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో నలుగురు పేసర్లను సెలక్టర్లు ఎంపిక చేయగా.. భువీకి మాత్రం చోటు దక్కలేదు. చదవండి: వరల్డ్‌కప్ జట్టులో రోహిత్ వద్దంటూ.. ధోని అతడి కోసం పట్టుబట్టాడు! వెంటనే కోచ్.. అందుకే తిలక్‌ను సెలక్ట్ చేశాం.. వరల్డ్ కప్ టీమ్‌లో: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ WC 2023: ధావన్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్? అంతేనన్న అగార్కర్! వీడియో వైరల్ Bhuvneshwar Kumar said, "Virat Kohli thinks he's the best bowler in the team, we're always scared when he bowls that he doesn't get injured due to his bowling action (laughs)". pic.twitter.com/Ky3FgyK8d6 — Mufaddal Vohra (@mufaddal_vohra) August 21, 2023 -
కుల్దీప్ యాదవ్ సరికొత్త చరిత్ర.. తొలి భారత బౌలర్‌గా!
కరేబియన్ గడ్డపై టీమిండియా వెటరన్ కుల్దీప్ యాదవ్ మరోసారి తన స్పిన్ మయాజాలాన్ని ప్రదర్శించాడు. గయానా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో ప్రత్యర్ది బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 28 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో అద్బుతమైన ప్రదర్శరన కనబరిచిన కుల్దీప్ యాదవ్ పలు అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ అధిక్యాన్ని 1-2కు భారత్ తగ్గించింది. కుల్దీప్ సాధించిన రికార్డులు ఇవే.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 50 వికెట్ల మార్క్‌ను అందుకున్న భారత బౌలర్‌గా రికార్డులకెక్కాడు. 30 మ్యాచ్‌ల్లో కుల్దీప్ ఈ ఫీట్ సాధించాడు. అంతకముందు ఈ రికార్డు యజువేంద్ర చహల్ పేరిట ఉండేది. చాహల్ 34 మ్యాచ్‌ల్లో ఈ ఘనతను సాధించాడు. తాజా మ్యాచ్‌తో చాహల్ రికార్డును కుల్దీప్ బ్రేక్ చేశాడు. అదే విధంగా టీ20ల్లో వెస్టిండీస్‌పై అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా కుల్దీప్ నిలిచాడు. విండీస్‌పై ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన కుల్దీప్.. 15 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో వెటరన్ పేపసర్ భువనేశ్వర్ కుమార్ రికార్డును యాదవ్ బ్రేక్ చేశాడు. భువీ 18 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. చదవండి: Yashasvi Jaiswal: ఇషాన్‌ను కాదని నిన్ను ఆడిస్తే ఏం చేశావు? అప్పుడు సెంచరీ.. ఇప్పుడు రెండు సున్నాలు తగ్గాయంతే! ఫ్యాన్స్ ఫైర్ Charles ☝️ Nicholas Pooran ☝️ Brandon King ☝️ Kuldeep Yadav's sensational outing against the Windies! 🔥#KuldeepYadav #WIvsIND #Cricket pic.twitter.com/2jRC1Fs2Re — OneCricket (@OneCricketApp) August 8, 2023 -
సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగింపు.. భువనేశ్వర్ కుమార్ కీలక నిర్ణయం!
Bhuvneshwar Kumar: టీమిండియా సీమర్ భువనేశ్వర్ కుమార్ అనూహ్య చర్యతో వార్తల్లో నిలిచాడు. తన సోషల్ మీడియా అకౌంట్ బయోలో మార్పు చేసి ఫాలోవర్లను కన్ఫ్యూజన్లోకి నెట్టేశాడు. కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన భువీ 2012లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. పేస్ దళంలో ముఖ్యమైన సభ్యుడిగా జట్టుకు సేవలు అందించి ఎన్నో రికార్డులు సాధించాడు. గడ్డు పరిస్థితులు.. అయితే, గత కొంతకాలంగా ఈ ఫాస్ట్‌బౌలర్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. గతేడాది నవంబరులో చివరిసారిగా టీమిండియా తరఫున ఆడిన 33 ఏళ్ల భువీని సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితా నుంచి బీసీసీఐ ఇటీవలే తొలగించింది. వరుస వైఫల్యాల నేపథ్యంలో ఆసియా కప్ టీ20 టోర్నీ-2022, టీ20 ప్రపంచకప్-2022లో దారుణ ప్రదర్శన తర్వాత బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన భువనేశ్వర్ కుమార్.. దేశవాళీ క్రికెట్‌కు కూడా దూరంగా ఉన్నాడు. ఇప్పుడే అలాంటి నిర్ణయాలు వద్దు ఈ నేపథ్యంలో భువీ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బయోలో ఇండియన్ క్రికెటర్‌ను ఇండియన్‌గా మార్చుకోవడం విశేషం. ఇది గమనించిన ఫ్యాన్స్.. ‘‘అయ్యో ఇదేంటి భువీ! నువ్వు పునరాగమనం చేస్తావనని మేము బలంగా కోరుకుంటున్నాం. టీమిండియాకు నువ్వు చేయాల్సింది చాలా ఉంది! ఇదంతా చూస్తుంటే నువ్వు బాగా హర్ట్ అయినట్లు కనిపిస్తోంది. ప్రతి ఆటగాడి జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. నువ్వు మళ్లీ తిరిగి జట్టులోకి రావాలి. ఇప్పుడే రిటైర్మెంట్ లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ప్లీజ్’’ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. కాగా ఇన్‌స్టాలో ఇండియన్ క్రికెటర్ అన్న పదాలను తొలగించిన భువీ.. ట్విటర్లో మాత్రం కొనసాగించడం గమనార్హం. ఏదేమైనా ఈ సీనియర్ పేసర్ తన చర్యతో నెట్టింట వైరల్‌గా మారాడు. చదవండి: జట్టులో చోటు కొట్టేశావు.. ఆఖరికి జెర్సీ కూడానా?! ఇదేంటి సూర్య! Yaar Bhuvi!!!!! 😔 We hope atleast me, You will Make a strong comeback🤞. A lot of cricket left in you To play for INDIA. #BhuvneshwarKumar #Bhuvi pic.twitter.com/kB1AXPnQeK — Devanshu Maheshwari (@beingdevanshu19) July 28, 2023 View this post on Instagram A post shared by Bhuvneshwar Kumar (@imbhuvi) -
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో భువనేశ్వర్! స్వింగ్ సుల్తాన్ ఉంటే!
IPL 2023 GT vs SRH: ‘‘భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లు తీశాడు. బంతిని అద్భుతంగా స్వింగ్ చేశాడు. డెత్ ఓవర్లలో మెరుగ్గా రాణించాడు. భువీ నుంచి ఇలాంటి ప్రదర్శన చూసిన తర్వాత మీ, నా మదిలో ఓ ప్రశ్న మెదలడం ఖాయం కదా! అదేంటంటే.. సర్రే ఓవల్‌లో జరుగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడే జట్టును ఫైనల్ చేసేటపుడు భువీని పరిగణనలోకి తీసుకుంటారా? ఇంగ్లండ్‌లో వేసవి తొలి అర్ధ భాగంలో ఆడే మ్యాచ్‌లలో బ్యాటర్లను ఇబ్బంది పెట్టాలంటే స్వింగ్ రాబట్టాల్సిందే. ఇక ఇప్పటికే టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. శార్దూల్ ఠాకూర్ అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్‌లో సగం సగమే అనిపిస్తున్నాడు. జయదేవ్ ఉనాద్కట్ అందుబాటులో ఉంటాడో లేదో తెలియని పరిస్థితి. కాబట్టి భువనేశ్వర్ కుమార్‌ను జట్టుకు ఎంపిక చేస్తారా? చేస్తే బాగుండు. కానీ అలా జరుగకపోవచ్చు.. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే’’ అని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. 5 వికెట్లతో చెలరేగిన భువీ! స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్‌ను డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డ ఆకాశ్.. కానీ అది సాధ్యం కాకపోవచ్చని నిట్టూర్చాడు. ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో భువీ ఐదు వికెట్లతో చెలరేగాడు. టైటాన్స్ ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (0), శుబ్‌మన్ గిల్(101), కెప్టెన్ హార్దిక్ పాండ్యా(8), టెయిలెండర్లు నూర్ అహ్మద్ (0), మహ్మద్ షమీ(0) వికెట్లు కూల్చాడు. 4 ఓవర్ల బౌలింగ్‌లో 30 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో రెండోసారి ఫైవ్ వికెట్ హాల్ నమోదు చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడిస్తే! ఈ మ్యాచ్‌లో రైజర్స్ ఓడినప్పటికీ భువీ ప్రదర్శన మాత్రం సానుకూలాంశంగా పరిణమించింది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా.. భువీని కొనియాడుతూనే డబ్ల్యూటీసీ ఫైనల్లో అతడికి ఆడే అవకాశం వస్తే బాగుండని ఆకాంక్షించాడు. ఇంగ్లండ్ పిచ్‌లపై భువీ లాంటి స్వింగ్ మాస్టర్ అద్భుతాలు చేయగలడని పేర్కొన్నాడు. అయితే, సెలక్టర్లు అతడికి ఛాన్స్ ఇవ్వడం కష్టమేనని చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య జూన్ 7- 11 వరకు ఇంగ్లండ్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్ లిస్టులో బీసీసీఐ భువీకి చోటివ్వని సంగతి తెలిసిందే. చదవండి: కుక్క కరిచిందన్న అర్జున్ టెండుల్కర్.. వీడియో వైరల్! తుది జట్టులో.. A team hattrick & a 🖐️-wicket haul - this final over was a Bhuvi masterclass! #GTvSRH #IPLonJioCinema #TATAIPL #IPL2023 #EveryGameMatters @SunRisers pic.twitter.com/fNkl8KZ3Ea — JioCinema (@JioCinema) May 15, 2023 -
ఒక్కరం కూడా సహకారం అందించలేకపోయాం.. అంతా మా వల్లే: మార్కరమ్
IPL 2023- GT Vs SRH: ‘‘పవర్ ప్లేలోనే నాలుగు వికెట్లు కోల్పోవడం తీవ్ర ప్రభావం చూపింది. అప్పుడే మేము పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయాం. మా నుంచి గేమ్ చేజారిపోయింది’’ అని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ అన్నాడు. పేసర్ భువనేశ్వర్ కుమార్, వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ అద్భుతంగా రాణించారని.. అయినా ఫలితం లేకుండా పోయిందని వాపోయాడు. రైజర్స్ అవుట్ ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్‌తో సోమవారం మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 34 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో టైటాన్స్ వరుసగా రెండోసారి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టగా.. రైజర్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రైజర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. గిల్ సెంచరీతో స్టార్ పేసర్ భువీ.. టైటాన్స్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహాను డకౌట్ చేసి శుభారంభం అందించాడు. కానీ మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఆ ఆనందాన్ని నిలవకుండా చేశాడు. అతడికి వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ కూడా తోడయ్యాడు. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమైన వేళ గిల్ సెంచరీ(58 బంతుల్లో 101 పరుగులు)తో చెలరేగగా.. సాయి 47 పరుగులతో రాణించాడు. కుప్పకూలిన టాపార్డర్ వీరిద్దరి అద్బుత ప్రదర్శన కారణంగా సొంతమైదానంలో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి గుజరాత్ 188 పరుగులు స్కోరు చేసింది. భువీ మొత్తంగా 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన రైజర్స్ టాపార్డర్ కుప్పకూలింది. టైటాన్స్ పేసర్ షమీ ధాటికి కకావికలమైంది. ఓపెనర్లు అన్మోల్ప్రీత్ సింగ్(5), అభిషేక్ శర్మ (4) పూర్తిగా నిరాశపరిచారు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ మార్కరమ్(10) వైఫల్యం కొనసాగించాడు. రాహుల్ త్రిపాఠి(1) తప్పుడు షాట్ సెలక్షన్‌తో వికెట్ పారేసుకున్నాడు. పాపం క్లాసెన్ జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ క్లాస్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. వికెట్ పడకుండా జాగ్రత్తపడుతూనే వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు, సిక్సర్లు బాదాడు. ఓ వైపు టపాటపా వికెట్లు పడుతున్నా.. సంయమనంతో ఓపికగా ఆడాడు. భువీ నుంచి సహకారం అందడంతో 44 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేశాడు. క్లాసెన్ కారణంగా ఏదో అద్భుతం జరుగబోతుందని ఆశించిన ఆరెంజ్ ఆర్మీ ఆశలపై నీళ్లు చల్లుతూ 17వ ఓవర్ ఐదో బంతికి షమీ అతడిని పెవలియన్‌కు పంపాడు. తర్వాత భువీ(27) కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. 34 పరుగుల తేడాతో రైజర్స్ ఓటమిపాలైంది. మార్కరమ్ (PC: IPL) సహకారం అందించలేకపోయాం.. అంతా మావల్లే ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మార్కరమ్ మాట్లాడుతూ.. ‘మా జట్టులో బంతిని స్వింగ్ చేయగల వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్నారు. భువీ ఈరోజు అద్భుతంగా ఆడాడు. అతడికి క్రెడిట్ ఇవ్వాల్సిందే! అయితే, శుబ్‌మన్ తన ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అతడు అద్భుతం ఇక క్లాసెన్ తాను ఎంతటి అద్భుతమైన బ్యాటరో మరోసారి నిరూపించాడు. క్లాస్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. కానీ మాలో ఒక్కరం కూడా అతడికి సహకారం అందించలేకపోయాం. తన పోరాటం వృథాగా పోవడం నిజంగా దురదృష్టకరం. మిగిలిన రెండు మ్యాచ్‌లలో కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చే అంశం గురించి ఆలోచిస్తాం. ఈ ఏడాది కూడా నిరాశగా టోర్నీని ముగించడం బాధిస్తోంది. ఈ మ్యాచ్‌లో మమ్మల్ని పోటీలో ఉంచేందుకు భువీ శాయశక్తులా ప్రయత్నించాడు. కానీ మేము మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయాం’’ అని విచారం వ్యక్తం చేశాడు. చదవండి: తండ్రి లాంటి వారు చనువుగా, ఏదో తెలిసీ తెలియక తాకితే అపార్థం చేసుకుంటారా? A comprehensive win at home and @gujarat_titans qualify for the #TATAIPL 2023 playoffs 🥳 They register a 34-run win over #SRH 👏🏻👏🏻 Follow the match ▶️ https://t.co/GH3aM3hyup #TATAIPL | #GTvSRH pic.twitter.com/gwUNLVjF0J — IndianPremierLeague (@IPL) May 15, 2023 -
వారెవ్వా భువీ.. 2 పరుగులు, 4 వికెట్లు! వీడియో వైరల్
టీమిండియా వెటరన్ పేసర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తన మార్క్‌ను మరోసారి చూపించాడు. ఐపీఎల్-2023లో భాగంగా గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్లో రెండో సారి ఫైవ్ వికెట్ హాల్ సాధించాడు. భువీ తన నాలుగు ఓవర్ల కోటాలో 30 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ఆఖరి ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. మరో రన్ బైస్ రూపంలో వచ్చింది. ఈ ఓవర్లో భువీ మూడు వికెట్లు సాధించాడు. అదే విధంగా ఓ రనౌట్ కూడా చేశాడు. ఓవరాల్‌గా ఆఖరి ఓవర్లో గుజరాత్ నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇక టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో శుబ్‌మన్ గిల్(58 బంతుల్లో 101) సెంచరీతో చెలరేగాడు. ఇక ఎస్ఆర్హెచ్ బౌలర్లలో భువీతో పాటు నటరాజన్, ఫరూఖీ, జానెసన్ తలా వికెట్ సాధించారు. చదవండి: వచ్చే ఐపీఎల్ సీజన్లో ధోని ఆడుతాడని గట్టిగా నమ్ముతున్నాం: సీఎస్కే సీఈవో A team hattrick & a 🖐️-wicket haul - this final over was a Bhuvi masterclass! #GTvSRH #IPLonJioCinema #TATAIPL #IPL2023 #EveryGameMatters @SunRisers pic.twitter.com/fNkl8KZ3Ea — JioCinema (@JioCinema) May 15, 2023 -
అరుదైన ఘనత.. ఐపీఎల్ చరిత్రలో తొలి బౌలర్‌గా
ఐపీఎల్ చరిత్రలో ఎస్ఆర్హెచ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ మ్యాచ్‌ల్లో తొలి ఓవర్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా భువనేశ్వర్ కుమార్ తొలి స్థానంలో నిలిచాడు. భువీ తాను వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఇప్పటివరకు 24 వికెట్లు పడగొట్టాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్‌ను డకౌట్ చేయడం ద్వారా భువీ ఈ ఫీట్ సాధించాడు. భువనేశ్వర్ తర్వాత ట్రెంట్ బౌల్ట్(21 వికెట్లు) రెండో స్థానంలో, ప్రవీణ్ కుమార్ 15 వికెట్లతో మూడో స్థానంలో, సందీప్ శర్మ 13 వికెట్లతో నాలుగో స్థానంలో, 12 వికెట్లతో జహీర్ ఖాన్ ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ 27 బంతుల్లో 53 పరుగులు నాటౌట్ తొలి అర్థసెంచరీతో మెరవగా.. అభిషేక్ శర్మ 36 బంతుల్లో 67 పరుగులతో రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. చదవండి: కేకేఆర్‌ను ఎన్కౌంటర్ చేసిన విజయ్ శంకర్ -
ఐపీఎల్లో భువనేశ్వర్ అరుదైన రికార్డు.. రెండో బౌలర్‌గా
ఐపీఎల్లో టీమిండియా వెటరన్ పేసర్, సర్‌రైజర్స్ స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో బ్యాటర్లను అత్యధిక సార్లు డకౌట్ చేసిన రెండో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2023లో భాగంగా ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఫిల్ సాల్ట్‌ను డకౌట్ చేసిన భువీ..ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో ఇప్పటివరకు భువీ 25 మంది బ్యాటర్లను డకౌట్ చేశాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగా(36) తొలి స్థానంలో ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత ఆరు ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది. చదవండి: అనుష్కతో కలిసి డ్యాన్స్ చేసిన కోహ్లి.. అంతలోనే విరాట్ కాలికి! ఏం జరిగిందంటే? -
IPL 2023: ‘పవర్ ప్లే’లోనే ఓడిపోయాం! టాస్ విషయంలో మా నిర్ణయం సరైందే!
IPL 2023 SRH Vs RR- సాక్షి, హైదరాబాద్: రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తమ ఓటమికి రెండు ‘పవర్ ప్లే’లలో ప్రదర్శనే కారణమని సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్ బ్రియాన్ లారా అభిప్రాయపడ్డాడు. ‘ముందుగా రాజస్తాన్ పవర్‌ప్లేను అద్భుతంగా వాడుకొని 85 పరుగులు చేసింది. అదే మా వంతు వచ్చేసరికి పవర్‌ప్లేలో పరుగులే చేయలేకపోయాం. 200కుపైగా స్కోరు ఛేదిస్తూ తొలి ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోతే కోలుకోవడం కష్టమే’ అని లారా అన్నాడు. అయితే, తమ జట్టు స్టార్ పేసర్ నటరాజన్ ప్రదర్శన పట్ల లారా సంతృప్తి వ్యక్తం చేశాడు. గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన నటరాజన్.. తన రెండో ఓవర్ నుంచి పుంజుకున్న తీరు అమోఘమని కొనియాడాడు. తొలుత పరుగులిచ్చినా ఆ తర్వాత పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్లు తీసిన తీరును ప్రశంసించాడు. ఇలాంటి సానుకూల అంశాలు కూడా ఆఖరి ఎనిమిది ఓవర్లలో తమ బౌలర్లు మెరుగైన ప్రదర్శన కనబరిచారని.. ఒకానొక సమయంలో రాజస్తాన్ రాయల్స్ 225 పరుగుల స్కోరు చేస్తుందని భావిస్తే.. 200 రాబట్టడానికి కూడా ఇబ్బంది పడేలా చేశారని లారా పేర్కొన్నాడు. అనేక ప్రతికూలతల నడుమ ఇలాంటి సానుకూల అంశాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న తాత్కాలిక కెప్టెన్ భువనేశ్వర్‌కుమార్ నిర్ణయాన్ని లారా సమర్థించాడు. ‘‘ఉప్పల్ పిచ్‌పై మేము ప్రాక్టీసు చేశాం. వికెట్ కాస్త బౌన్సీగా ఉన్నట్లు అనిపించింది. పేస్‌కు అనుకూలిస్తుందని భావించాం. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాం. ఏదేమైనా ఒక్క మ్యాచ్‌లో ఓటమితో కుంగిపోము. మెరుగైన ప్రదర్శనతో ముందుకు సాగుతాం’’ అని లారా పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: ఇదొక్కటి! బ్యాటర్‌కు దిమ్మతిరిగింది.. అంతేనా ఆఖర్లో రెండు సిక్సర్లు! Nattu in death overs 👉 Always 🔥#OrangeFireIdhi #OrangeArmy #IPL2023 #SRHvRR pic.twitter.com/DIErNzIWxm — SunRisers Hyderabad (@SunRisers) April 3, 2023 -
SRH Vs RR: మర్చిపోవాలి అంతే! నువ్వసలు పనికిరావు.. పైగా ఇలా మాట్లాడతావా?
IPL 2023- SRH Vs RR: సొంతగడ్డపై నాలుగేళ్ల తర్వాత.. అభిమానుల కేరింతల నడుమ ఉప్పల్ వేదికగా ఐపీఎల్-2023లో తొలి మ్యాచ్ ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. రాజస్తాన్ రాయల్స్ చేతిలో చిత్తుగా ఓడి పరాజయంతో ఈ సీజన్‌ను ఆరంభించింది. కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ గైర్హాజరీ నేపథ్యంలో రైజర్స్ పగ్గాలు చేపట్టిన టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ సారథిగా పూర్తిగా విఫలమయ్యాడు. తప్పు చేశాడు! టాస్ గెలిచిన భువీ.. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై తొలుత బౌలింగ్ ఎంచుకుని పెద్ద పొరపాటే చేశాడు. పవర్‌ప్లేలోనే సన్‌రైజర్స్‌కు ఈ విషయం అర్ధమైపోయింది. రాజస్తాన్ ఓపెనర్లు యశస్వి జైశ్వాల్(37 బంతుల్లో 54 పరుగులు), జోస్ బట్లర్ (22 బంతుల్లో 54 పరుగులు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరికి తోడు కెప్టెన్ సంజూ శాంసన్ సైతం అర్ధ శతకం(32 బంతుల్లో 55 పరుగులు) అద్భుతంగా రాణించాడు. ఆఖర్లో హెట్మెయిర్ తనదైన శైలిలో (16 బంతుల్లో 22 పరుగులు) ఫినిష్ చేశాడు. దీంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు స్కోరు చేసింది రాజస్తాన్. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ తొలి రెండు బంతుల్లోనే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రాజస్తాన్ పరుగుల వరద.. పెవిలియన్‌కు క్యూ కట్టిన రైజర్స్ బ్యాటర్లు రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లు పరుగుల వరద పారించిన చోట.. హైదరాబాద్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యాడు. టాపార్డర్‌లో ఒక్కరంటే ఒక్కరు కనీసం ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు రైజర్స్ ఇన్నింగ్స్ ఎంత పేలవంగా సాగిందో! ఫలితంగా 72 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. కెప్టెన్‌గా పనికిరావు.. పైగా ఇలా మాట్లాడతావా? ఇక మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందించిన సన్‌రైజర్స్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ చేసిన వ్యాఖ్యలు అభిమానులకు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. ‘‘బ్యాటింగ్ పిచ్‌పై బౌలింగ్ ఎంచుకున్నావు. టాస్ సమయంలో తప్పుడు నిర్ణయం తీసుకన్నావు. పోనీ కెప్టెన్సీపై దృష్టి పెట్టావా అంటే అదీ లేదు. ముగ్గురు పేసర్లు ఉన్నారు.. వారి సేవలు వినియోగించుకోవాల్సింది పోయి.. నువ్వూ బౌలింగ్ చేశావు. 3 ఓవర్లలోనే 36 పరుగులు సమర్పించుకున్నావు. ఒత్తిడిని అధిగమించలేకపోయావు. కెప్టెన్‌గా నువ్వు పనికిరావు. పైగా ఓటమికి చచ్చు కారణాలు చెబుతావా అంటూ ఫైర్ అవుతున్నారు. ఇంతకీ భువీ ఏమన్నాడంటే.. ‘‘ఈ పరాజయం గురించి మర్చిపోయి.. ముందుకు సాగాలి. ఆఖరి ఆరు ఓవర్లలో మా బౌలర్లు ముఖ్యంగా ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా బౌల్ చేశాడు. కానీ అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. మేము ఇంకాస్త మెరుగ్గా బౌలింగ్ చేయాల్సింది. ఏదేమైనా ఇదే మొదటి మ్యాచ్. కాబట్టి తప్పులు సరిదిద్దుకుంటే అనుకున్న ఫలితాలు రాబట్టవచ్చు. సౌతాఫ్రికన్లు జట్టుతో చేరాల్సి ఉంది. వాళ్లు జట్టుతో చేరితో బ్యాటింగ్ ఆర్డర్ మరింత పటిష్టమవుతుంది. పిచ్ బాగుంది. మేమేమీ బాధపడటం లేదు నిజానికి ఇక్కడ మాకు అనుకూలంగా తయారు చేయించుకోవచ్చు. కానీ.. ఆ విషయంలో మేమేమీ బాధపడటం లేదు. రాజస్తాన్ ఓపెనర్లు బట్లర్, జైశ్వాల్ అద్భుతంగా రాణించారు. ట్రెంట్ బౌల్ట్ పవర్‌ప్లేలో వికెట్లు తీసి మమ్మల్ని దెబ్బకొట్టాడు. ఇక యుజీ చహల్, రవి అశ్విన్ తమదైన శైలిలో చెలరేగారు. జేసన్ హోల్డర్ బౌలింగ్, ఫీల్డింగ్‌లో మెరిశాడు’’ అని భువీ చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో పిచ్ గురించి మాట్లాడుతూ.. భువనేశ్వర్ కుమార్ చేసిన వ్యాఖ్యలే అతడిపై ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమయ్యాయి. కాగా సన్‌రైజర్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ సహా ఇతర సౌతాఫ్రికా ఆటగాళ్లు నెదర్లాండ్స్‌తో వన్డే సిరీస్ ముగించుకుని జట్టుతో చేరే అవకాశం ఉంది. చదవండి: IPL 2023- Virat Kohli: చెలరేగిన హైదరాబాదీ.. అయినా! కోహ్లి అద్భుత ఇన్నింగ్స్.. అరుదైన ఘనత! ఒకే ఒక్కడితో.. Aiden Markram: అక్కడ కెప్టెన్ ఇరగదీశాడు.. ఇక్కడ ఎస్ఆర్హెచ్ మాత్రం ⚡️⚡️ Trent-ing in Hyderabad!pic.twitter.com/FVa7owLQnL — Rajasthan Royals (@rajasthanroyals) April 2, 2023 -
సన్‌రైజర్స్ కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్!
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-2023 సీజన్‌కు మరో 24 గంటల్లో తెరలేవనుంది. మార్చి 31న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ ధానాధాన్ లీగ్ ఆరంభం కానుంది. ఇక ఇది ఇలా ఉండగా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాళ్లు దూరం కానున్నారు. దక్షిణాఫ్రికా, నెదర్లాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ నేపథ్యంలో ప్రోటీస్ స్టార్ ఆటగాళ్లు మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, రబాడ, మగాల, డికాక్, నోర్జే ఐపీఎల్ తొలి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండరు. ఎస్ఆర్హెచ్ కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్ కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఐడైన్ మార్క్రమ్ ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే ఎస్ఆర్హెచ్ తొలి మ్యాచ్‌కు మార్క్రమ్ దూరం కానున్నాడు. ఐపీఎల్-2023లో ఎస్ఆర్హెచ్ తమ తొలి మ్యాచ్‌లో ఏప్రిల్2న హైదరాబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు మార్క్రమ్ గైర్హజరీ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ కెప్టెన్‌గా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. కాగా గతంలో కూడా కొన్ని మ్యాచ్‌ల్లో ఆరెంజ్ ఆర్మీ సారథిగా భువీ వ్యవహరించాడు. అదే విధంగా గత కొన్ని సీజన్ల నుంచి ఎస్ఆర్హెచ్ జట్టులో కీలక సభ్యునిగా భువీ కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే అతడికి జట్టు పగ్గాలు అప్పజెప్పాలని ఎస్ఆర్హెచ్ మెన్‌జెమెంట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.