రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్
సాక్షి, హైదరాబాద్ : విధ్వంసకర బ్యాట్స్‌మన్, రాయల్‌చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ను టెక్నిక్ బంతులతో బోల్తా కొట్టించానని సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్ రషీద్‌ఖాన్ తెలిపాడు. సోమవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ మరో అత్యల్ప స్కోర్‌ను కాపాడుకోని ఆర్సీబీపై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయానంతరం సన్‌రైజర్స్ ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్, రషీద్‌ఖాన్‌లు సరదాగా ముచ్చటించారు.
ఈ సందర్భంగా డివిలియర్స్ వికెట్‌పై రషీద్ స్పందిస్తూ.. ‘‘డివిలియర్స్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చే ఆటగాడని ప్రతి ఒక్కరికి తెలుసు. దీంతో టాప్ స్పిన్, లెగ్ స్పిన్, గూగ్లీలను కలిపి సరైన ప్రదేశాల్లో బంతులేయాలని ప్రణాళిక రచించాను. ఇందులో భాగంగానే ఏబీకి లెగ్ స్పిన్‌తో కూడిన గూగ్లీ బంతులను వేశాను. ఇది చాలా ముఖ్యమైన వికెట్.. ఇది మాకు మరింత విశ్వాసాన్ని ఇచ్చింది.’’ అని రషీద్ పేర్కొన్నాడు. ఇక రషీద్ వేసిన గూగ్లీని అర్థం చేసుకోలేని డివిలియర్స్ వికెట్ల పైకి ఆడుకోని పెలియన్ చేరాడు.
చివరి ఓవర్‌పై భువనేశ్వర్ స్పందిస్తూ.. ‘నేను మ్యాచ్ ఫలితం గురించి ఆలోచించలేదు. సరైన ప్రదేశాల్లో బంతులేస్తే చివరి ఓవర్‌లో 12 పరుగులను అడ్డుకోవచ్చని నాకు బాగా తెలుసు. వైవిధ్యమైన బంతులేయడంపైనే పూర్తిగా దృష్టి సారించాను.’ అని భువీ చెప్పుకొచ్చాడు. ఇక ఆర్సీబీకి విజయానికి చివరి ఓవర్‌లో 12 పరుగులు కావల్సి ఉండగా.. భువనేశ్వర్ అద్భుత బౌలింగ్‌తో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి సన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
వరుస విజయాలపై భువీ మాట్లాడుతూ.. ‘‘సునాయసంగా చేధించే స్వల్ప స్కోర్‌లను ప్రత్యర్ధులు ఒత్తిడిలో తప్పిదాలు చేస్తున్నారు. మా విజయాల వెనుక ఉన్న రహస్యం వరుసగా వికెట్లు తీయడమే. స్వల్ప స్కోర్‌లను కాపాడుకోవడంలో ఇది చాలా ముఖ్యం. ఫీల్డింగ్ విభాగం సైతం అద్భుతంగా రాణిస్తోంది. ఈ విజయాలు సమిష్టి ప్రదర్శన వల్లే సాధ్యమయ్యాయని భువీ అభిప్రాయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment