
'ఆ బౌలర్ నుంచి చాలా నేర్చుకున్నా'
ముంబై: తాను ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాణించడానికి తన సహచర ఆటగాడు ఆశిష్ నెహ్రానే కారణమని సన్ రైజర్స్ పేసర్ భువనేశ్వర్ కుమార్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం బంతిని ఇరు వైపులా స్వింగ్ చేస్తూ ఆకట్టుకోవడానికి నెహ్రా సూచనలే కారణమన్నాడు.
'నెహ్రా నుంచి చాలా నేర్చుకున్నా. అతనితో కలిసి భారత జట్టు తరపున కొన్ని మ్యాచ్లు ఆడా. అప్పుట్నుంచి నెహ్రా నుంచి అనేక విషయాలు నేర్చుకుంటూనే ఉన్నా. ఇప్పుడు ఐపీఎల్ ఇద్దరం ఒకే జట్టుకు ఆడతుండటం వల్ల మరిన్ని విషయాలను తెలుసుకునే ఆస్కారం దొరికింది. అతని సలహాలు నాకు చాలా ఉపయోగపడుతున్నాయి. ఈ సీజన్లో రాణించడానికి అతనే కారణం'అని నెహ్రాపై భువనేశ్వర్ కుమార్ ప్రశంసలు కురిపించాడు. అయితే మరో పేసర్ ప్రవీణ్ కుమార్ తన ఆరాధ్య బౌలర్ అని భువనేశ్వర్ స్పష్టం చేశాడు. తాను ప్రవీణ్ కుమార్ బౌలింగ్ ను చూస్తూ పెరిగానని పేర్కొన్నాడు. అందుచేత తన బౌలింగ్ శైలి ప్రవీణ్ కుమార్ బౌలింగ్ ను పోలి ఉంటుందన్నాడు.