న్యూఢిల్లీ: ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో పేసర్ భువనేశ్వర్ కుమార్ కీలకపాత్ర పోషించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో, చివర్లో కీలక వికెట్లు తీసి జట్టుకు బ్రేక్ అందించడంలో అతనికి అతనే సాటి. లీగ్‌లో సాగించిన ఈ తరహా ప్రదర్శనే తనలో ఆత్మవిశ్వాసం పెంచిందని, తీవ్ర ఒత్తిడి సమయంలో ఎలా బౌలింగ్ చేయాలో కూడా నేర్చుకున్నానని భువనేశ్వర్ వ్యాఖ్యానించాడు. ‘మొదటి నుంచి కూడా యార్కర్లు నా బలం. వాటిని బాగానే ఉపయోగించినా ఆ తర్వాత పట్టు చేజార్చుకునేవాడిని. అయితే సన్‌రైజర్స్‌తో ఆడటం మొదలు పెట్టాక నాలో మార్పు వచ్చింది.
ప్రారంభ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయాల్సినప్పుడు, డెత్ ఓవర్లలో పరుగులు నిరోధించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నేనే ఎక్కువగా బౌలింగ్ చేశాను. దాని వల్ల నాకు ఎంతో మేలు జరిగింది. తీవ్రమైన ఒత్తిడిలోనూ మెరుగ్గా బౌలింగ్ ఎలా చేయాలో నేర్చుకోగలిగాను’ అని అతను చెప్పాడు. 2014 నుంచి సన్‌రైజర్స్ జట్టు తరఫున ఆడుతున్న భువీ 6 సీజన్లలో 86 మ్యాచ్‌లు ఆడి 109 వికెట్లు పడగొట్టాడు. మాజీ కెప్టెన్ ధోని తరహాలోనే తాను కూడా నేర్చుకునే ప్రక్రియపైనే దృష్టి పెడతాను తప్ప ఫలితం గురించి ఆలోచించనని ఈ పేసర్ అన్నాడు. ఐపీఎల్‌లో కూడా అలా చేయడం వల్లే సానుకూల ఫలితాలు వచ్చాయని భువీ విశ్లేషించాడు.
Comments
Please login to add a commentAdd a comment