
అహ్మదాబాద్: ఐపీఎల్‌లో ఎంతో అనుభవం ఉన్న హార్దిక్ పాండ్యా జట్టుకు దూరమైన లోటు కనిపిస్తుందని, అయితే అతను వెళ్లకుండా తాము ఒప్పించే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదని గుజరాట్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా అన్నాడు.
గత రెండు సీజన్లలో టైటాన్స్‌కు కెప్టెన్ గా వ్యవహరించిన హార్దిక్ ఈ సీజన్‌నుంచి ముంబై ఇండియన్స్ సారథిగా బరిలోకి దిగనున్నాడు. ఏ క్రీడలోనైనా కొన్ని అంశాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోవాల్సిందేనని నెహ్రా అభిప్రాయ పడ్డాడు.
‘మా జట్టుతో ఉండిపొమ్మని పాండ్యాను ఒప్పించే ప్రయత్నం నేను ఎప్పుడూ చేయలేదు. మరో ఇతర ఫ్రాంచైజీకి వెళితే అలా చేసేవాడినేమో కానీ గుజరాత్‌కు ముందు 5–6 సీజన్లు ఆడిన ముంబైకి అతను వెళ్లిపోయాడు. అతను అక్కడ మళ్లీ కొత్తగా ఏదైనా నేర్చుకుంటాడేమో. కెపె్టన్‌గా రాటుదేలేందుకు గిల్‌కు ఇది మంచి అవకాశం’ అని నెహ్రా వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment