Mumbai Indians
-
అమన్‌జ్యోత్ మెరుపులు
బెంగళూరు: డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు సొంతగడ్డపై చుక్కెదురైంది. అమన్‌జ్యోత్ కౌర్ ఆల్‌రౌండ్ మెరుపులు మెరిపించడంతో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టు రెండో విజయం నమోదు చేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ నాలుగు వికెట్ల తేడాతో ఆర్సీబీపై గెలుపొందింది. మొదట ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఎలీస్ పెర్రీ (43 బంతుల్లో 81; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) విజృంభించింది. ముంబై బౌలర్లలో అమన్‌జ్యోత్ కౌర్ 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం ముంబై జట్టు 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (38 బంతుల్లో 50, 8 ఫోర్లు, 1 సిక్స్), సివర్ బ్రంట్ (21 బంతుల్లో 42; 9 ఫోర్లు) ధాటిగా ఆడారు.చివర్లో ఉత్కంఠ నెలకొన్న సమయంలో అమన్‌జ్యోత్ కౌర్ (27 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కమలిని (11 నాటౌట్; 1 ఫోర్) కీలక పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చారు. నేడు జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో యూపీ వారియర్స్ తలపడుతుంది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి (సి) యస్తిక (బి) షబ్నిమ్ 26; డానీ వ్యాట్ (సి) హేలీ (బి) సివర్ బ్రంట్ 9; పెర్రీ (సి) షబ్నిమ్ (బి) అమన్‌జ్యోత్ 81; కనిక (బి) సంస్కృతి 3; రిచా (బి) అమన్‌జ్యోత్ 28; జార్జియా (సి) సంస్కృతి (బి) అమన్‌జ్యోత్ 6; కిమ్ గార్త్ (నాటౌట్) 8; ఎక్తా బిష్త్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–29, 2–48, 3–51, 4–57, 5–107, 6–119, 7–165, బౌలింగ్: షబ్నిమ్ 4–0–36–1; సివర్ బ్రంట్ 4–0–40–1; హేలీ మాథ్యూస్ 4–0–37–1; అమేలియా కెర్ 4–0–28–0; సంస్కృతి 1–0–3–1; అమన్‌జ్యోత్ 3–0–22–3. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: హేలీ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఏక్తా 15; యస్తిక (ఎల్బీడబ్ల్యూ) (బి) కిమ్ గార్త్ 8; సివర్ బ్రంట్ (బి) కిమ్ గార్త్ 42; హర్మన్‌ప్రీత్ (సి) రిచా (బి) జార్జియా 50; అమేలియా (సి) ఏక్తా (బి) జార్జియా 2; అమన్‌జ్యోత్ (నాటౌట్) 34; సంజనా (ఎల్బీడబ్ల్యూ) జార్జియా 0; కమలిని (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.5 ఓవర్లలో 6 వికెట్లకు) 170. వికెట్ల పతనం: 1–9, 2–66, 3–74, 4–82, 5–144, 6–144, బౌలింగ్: రేణుక 4–0–35–0; కిమ్ గార్త్ 4–0–30–2; జార్జియా 4–1–21–3; ఏక్తా 3.5–0–37–1; జోషిత 2–0–19–0; కనిక 2–0–28–0. -
గుజరాత్ పై ముంబై ఇండియన్స్ విజయం
-
డబ్బులేదు.. మూడేళ్లపాటు మ్యాగీ తిని బతికాడు.. ఇప్పుడు అతడే..: నీతా అంబానీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ద్వారా వెలుగులోకి వచ్చి టీమిండియా స్టార్లుగా ఎదిగారు హార్దిక్ పాండ్యా(Hardik Pandya), జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah). క్రికెట్ ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని సత్తా చాటుతున్నారు. అయితే, ఈ ఇద్దరిలో దాగున్న అద్భుత నైపుణ్యాలను తెరమీదకు తెచ్చింది మాత్రం ముంబై ఇండియన్స్ యాజమాన్యం అని చెప్పవచ్చు.అంతేకాదు పాండ్యా, బుమ్రా సాధారణ ఆటగాళ్ల నుంచి సూపర్స్టార్లుగా ఎదగడంలో ఈ ఐపీఎల్ ఫ్రాంఛైజీదే కీలక పాత్ర. ఇక ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్‌బౌలర్‌గా వెలుగొందుతుండగా.. హార్దిక్ పాండ్యా సైతం టీమిండియా కీలక ప్లేయర్‌గా జట్టులో సుస్థిర స్థానం సంపాదించాడు. అంతేకాదు.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ స్థాయికీ చేరుకున్నాడు.ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ యజమాని, భారత కుబేరుడు ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ(Nita Ambani) పాండ్యా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన హార్దిక్ పాండ్యా, అతడి అన్న కృనాల్ పాండ్యాలో తాము ఆట పట్ల అంకిత భావాన్ని గుర్తించి అవకాశం ఇచ్చామని.. ఈరోజు వాళ్లు ఉన్నతస్థాయికి చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు.అరుదైన గౌరవంకాగా రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీకి అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. దార్శనిక నాయకత్వం, సమాజానికి చేసిన అసాధారణ సేవకు గుర్తింపుగా మసాచుసెట్స్ విశిష్ట గవర్నర్ ప్రశంసాపత్రాన్ని ఆమెకు ప్రదానం చేసింది. ఈ సందర్భంగా బోస్టన్‌లో మాట్లాడిన నీతా అంబానీ హార్దిక్ పాండ్యా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.‘‘ఐపీఎల్లో మాకు ఫిక్స్డ్ బడ్జెట్ ఉంటుంది. ఒక్కో ఫ్రాంఛైజీ ఇంతే ఖర్చు పెట్టాలనే నిబంధన ఉంటుంది. అయితే, మేము ఆ డబ్బును కొత్త మార్గాల్లో ఖర్చుచేయాలనుకున్నాం. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను వెలికితీయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్లాం.బక్కపల్చగా, పొడుగ్గా ఉన్న ఇద్దరు యువకులుముఖ్యంగా రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు జరిగినప్పుడు నేను ప్రత్యేకంగా అక్కడికి వెళ్లేదాన్ని. నాతో పాటు మా స్కౌట్ బృందం కూడా ఉండేది. ప్రతి దేశవాళీ మ్యాచ్‌ను నిశితంగా గమనించేవాళ్లం. మా స్కౌట్ క్యాంపులో భాగంగా బక్కపల్చగా, పొడుగ్గా ఉన్న ఇద్దరు యువ ఆటగాళ్లను చూశాం.మ్యాగీ మాత్రమే తిని బతికారునేను వెళ్లి వాళ్లతో మాట్లాడాను. తాము గత మూడేళ్లుగా కేవలం మ్యాగీ మాత్రమే తిని బతుకుతున్నామని అప్పుడు వాళ్లు చెప్పారు. తమ దగ్గర డబ్బు లేదని అందుకే నూడుల్స్‌తో కడుపు నింపుకొంటున్నామని అన్నారు. అయితే, అప్పుడు నాకు వారిలో ఆట పట్ల ఉన్న నిబద్ధత.. ఏదో సాధించాలన్న బలమైన తపన కనిపించాయి.ఆ ఇద్దరు.. సోదరులు.. వారు మరెవరో కాదు.. హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా. 2015లో నేను హార్దిక్ పాండ్యా కోసం రూ. 10 లక్షలు ఖర్చుచేసి వేలంలో అతడిని కొనుక్కున్నా. ఇప్పుడు అతడు ముంబై ఇండియన్స్‌కు గర్వకారణమైన కెప్టెన్’’ అని నీతా అంబానీ హార్దిక్ పాండ్యా నైపుణ్యాలపై ప్రశంసలు కురిపించారు.మరో ఆణిముత్యం.. అతడే ఓ చరిత్రఇక ఆ మరుసటి ఏడాది.. తమకు మరో ఆణిముత్యం దొరికిందన్న నీతా అంబానీ.. ‘‘ఓ యువ క్రికెటర్. అతడి బాడీ లాంగ్వేజ్ భిన్నంగా ఉంది. అతడు బౌలింగ్ చేస్తే చూడాలని అక్కడ కూర్చున్నాం. తానేంటో అతడు బంతితోనే నిరూపించుకున్నాడు. అతడు బుమ్రా. ఇక ఆ తర్వాత జరిగిందంతా ఓ చరిత్ర’’ అంటూ జస్ప్రీత్ బుమ్రాను ఆకాశానికెత్తారు. ఇక తిలక్ వర్మను కూడా తాము ఏరికోరి ఎంచుకున్నామన్న నీతా అంబానీ.. టీమిండియాకు ముంబై ఇండియన్స్ ఓ నర్సరీ లాంటిదంటూ తమ ఫ్రాంఛైజీపై ప్రశంసలు కురిపించారు.ఐపీఎల్ 2025లో పాల్గొనే ముంబై ఇండియన్స్ జట్టుహార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, నమన్ ధిర్, బెవాన్ జాకబ్స్, రాజ్ బవా, విల్ జాక్స్, విజ్ఞేశ్ పుతుర్, సత్యనారాయణ రాజు, మిచెల్ సాంట్నర్, అర్జున్ టెండూల్కర్, ర్యాన్ రికెల్టన్, రాబిన్ మింజ్, కృష్ణణ్ శ్రీజిత్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వని కుమార్, రీస్ టాప్లే, లిజాడ్ విలియమ్స్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్.#WATCH | Boston, US: Reliance Foundation Founder-Chairperson Nita Ambani tells how she scouted for new talent for the Mumbai Indians team and included Hardik Pandya, Krunal Pandya, Jasprit Bumrah and Tilak Varma in the teamShe says, "In IPL, we all have a fixed budget, so every… pic.twitter.com/v0HriPJH8T— ANI (@ANI) February 17, 2025 -
IPL 2025: ముంబై ఇండియన్స్ ఆడే మ్యాచ్‌లు ఇవే..!
ఐపీఎల్ 2025 (IPL 2025) సీజన్ షెడ్యూల్ ఇవాళ (ఫిబ్రవరి 16) విడుదలైంది. ఈ సీజన్లో ఫైవ్ టైమ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) మార్చి 23న తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. తొలి మ్యాచ్‌లో ముంబై జట్టు తమ లాగే ఫైవ్ టైమ్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్‌తో (Chennai Super Kings) తలపడనుంది. ఈ మ్యాచ్‌కు చెన్నై ఆతిథ్యమివ్వనుంది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ మొత్తం 14 మ్యాచ్‌లు (ప్లే ఆఫ్స్ కాకుండా) ఆడుతుంది. ఇందులో ఏడు తమ సొంత మైదానంలో ఆడనుంది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్.. సీఎస్కే, సన్‌రైజర్స్, లక్నో, గుజరాత్, ఢిల్లీతో తలో రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. కేకేఆర్, ఆర్సీబీ, రాజస్థాన్, పంజాబ్‌లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది.ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ ఆడే మ్యాచ్‌లు..మార్చి 23 (ఆదివారం)- సీఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్ (చెన్నై)మార్చి 29 (శనివారం)- గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (అహ్మదాబాద్)మార్చి 31 (సోమవారం)- కేకేఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (ముంబై)ఏప్రిల్ 4 (శుక్రవారం)- లక్నో వర్సెస్ ముంబై ఇండియన్స్ (లక్నో)ఏప్రిల్ 7 (సోమవారం)- ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్ (ముంబై)ఏప్రిల్ 13 (ఆదివారం)- ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (ఢిల్లీ)ఏప్రిల్ 17 (గురువారం)- సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (ముంబై)ఏప్రిల్ 20 (ఆదివారం)- సీఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్ (ముంబై)ఏప్రిల్ 23 (బుధవారం)- సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (హైదరాబాద్)ఏప్రిల్ 27 (ఆదివారం)- లక్నో వర్సెస్ ముంబై ఇండియన్స్ (ముంబై)మే 1 (గురువారం)- రాజస్థాన్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (జైపూర్)మే 6 (మంగళవారం)- గుజరాత్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (ముంబై)మే 11 (ఆదివారం)- పంజాబ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (ధర్మశాల)మే 15 (గురువారం)- ఢిల్లీ వర్సెస్ ముంబై ఇండియన్స్ (ముంబై)ఐపీఎల్ 2025 కోసం ముంబై ఇండియన్స్ జట్టు..హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, నమన్ ధిర్, బెవాన్ జాకబ్స్, రాజ్ బవా, విల్ జాక్స్, విజ్ఞేశ్ పుతుర్, సత్యనారాయణ రాజు, మిచెల్ సాంట్నర్, అర్జున్ టెండూల్కర్, ర్యాన్ రికెల్టన్, రాబిన్ మింజ్, కృష్ణణ్ శ్రీజిత్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వని కుమార్, రీస్ టాప్లే, లిజాడ్ విలియమ్స్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ -
టీ20ల్లో అరుదైన మైలురాయిని తాకిన టీమిండియా కెప్టెన్
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్, మహిళల ఐపీఎల్లో (WPL) ముంబై ఇండియన్స్ సారధి అయిన హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) పొట్టి క్రికెట్లో (T20 Cricket) అరుదైన మైలురాయిని తాకింది. హర్మన్.. భారత మహిళా జట్టు వైస్ కెప్టెన్, డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ సారధి అయిన స్మృతి మంధన తర్వాత టీ20ల్లో 8000 పరుగుల మైలురాయిని తాకిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. డబ్ల్యూపీఎల్-2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (ఫిబ్రవరి 15) జరిగిన ఉత్కంఠ పోరులో హర్మన్ ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌కు ముందు 8000 పరుగులు పూర్తి చేసేందుకు హర్మన్‌కు 37 పరుగులు అవసరమయ్యాయి. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో హర్మన్ 8000 పరుగుల మైలురాయిని చేరుకుంది. ఈ మ్యాచ్‌లో హర్మన్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడింది. 22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసింది.అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు వివిధ టీ20 లీగ్‌ల్లో హర్మన్ చేసిన పరుగులుడబ్ల్యూపీఎల్- 591 పరుగులుమహిళల బిగ్‌బాష్ లీగ్- 1440 పరుగులుహండ్రెడ్ వుమెన్స్ లీగ్- 176 పరుగులుఅంతర్జాతీయ క్రికెట్- 3589 పరుగులు- వీటితో పాటు హర్మన్ దేశవాలీ టీ20 టోర్నీల్లో పంజాబ్ తరఫున మరిన్ని పరుగులు సాధించింది.టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత మహిళా క్రికెటర్లు..స్మృతి మంధన- 8349హర్మన్‌ప్రీత్ కౌర్- 8005జెమీమా రోడ్రిగెజ్- 5826షఫాలీ వర్మ- 4542మిథాలీ రాజ్- 4329దీప్తి శర్మ- 3889ముంబై, ఢిల్లీ మ్యాచ్ విషయానికొస్తే.. చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ సమరంలో ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఢిల్లీ గెలుపుకు చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. అరుంధతి రెడ్డి చాలా ప్రయాసపడి రెండు పరుగులు పూర్తి చేసింది. తొలి పరుగును సునాయాసంగా పూర్తి చేసిన అరుంధతి.. రెండో పరుగు తీసే ప్రయత్నంలో డైవ్ చేయగా... కీపర్ వికెట్లను గిరాటేసింది. మూడో అంపైర్‌కు నివేదించగా... రీప్లేలో అరుంధతి బ్యాట్ క్రీజ్‌ను దాటినట్లు తేలింది. దీంతో రెండో పరుగొచ్చింది. ఫలితంగా ఢిల్లీ 2 వికెట్ల తేడాతో గెలిచింది. ఆఖరి బంతిదాకా చెమటోడ్చిన ముంబై ఇండియన్స్‌కు పరాభవం తప్పలేదు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 19.1 ఓవర్లలో 164 పరుగుల వద్ద ఆలౌటైంది. నాట్ సీవర్ బ్రంట్ (59 బంతుల్లో 80 నాటౌట్; 13 ఫోర్లు) చెలరేగింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (22 బంతుల్లో 42; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిపించింది. ఢిల్లీ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్ 3, శిఖా పాండే 2 వికెట్లు తీశారు.అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులు చేసి గెలిచింది. ఓపెనింగ్‌లో షఫాలీ వర్మ (18 బంతుల్లో 43; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేసింది. మిడిలార్డర్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నికీ ప్రసాద్ (33 బంతుల్లో 35; 4 ఫోర్లు) ఢిల్లీ గెలుపుకు అవసరమైన పరుగుల్ని జతచేసింది. -
ముంబై ఇండియన్స్‌లోకి స్టార్ ప్లేయర్.. ఎవరంటే?
ఐపీఎల్-2025కు సీజన్‌కు ముంబై ఇండియన్స్ స్పిన్నర్, అఫ్గానిస్తాన్ నయా స్పిన్ సంచలనం ఘజన్ఫర్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. వెన్ను గాయంతో బాధపడుతున్న ఘజన్ఫర్.. ఐపీఎల్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి దూరమయ్యాడు. ఐపీఎల్-2025 మెగా వేలంలో ఘజన్‌ఫర్‌ను రూ. 4.8 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ అతడు కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడి స్ధానాన్ని మరో అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్‌తో ముంబై ఇండియన్స్ భర్తీ చేసుకుంది.ముజీబ్‌ను రూ. 2 కోట్ల కనీస ధరకు ముంబై ఒప్పందం కుదుర్చుకుంది. "ఐపీఎల్ 18వ సీజన్‌కు అల్లా ఘజన్ఫర్ గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్ధానంలో ముజీబ్-ఉర్-రెహ్మాన్‌ను జట్టులోకి తీసుకున్నాము. ముజీబ్‌కు ఇప్పటికే ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. అతడు 19 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టాడు. అతడిని బెస్ప్రైస్రూ. 2 కోట్లకు కొనుగోలు చేశాము" అని ముంబై ఫ్రాంచైజీ ఓ ప్రకటనలో పేర్కొంది.కాగా టీ20ల్లో ముజీబ్‌కు మంచి రికార్డు ఉండడంతో ముంబై తమ జట్టులోకి తీసుకుంది. పవర్‌ప్లేలో తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పులు పెట్టే సత్తా అతడికి ఉంది. అయితే పాక్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి మాత్రం ముజీబ్‌ను అఫ్గాన్ సెలక్టర్లు ఎంపిక చేయలేదు.అతడి స్ధానంలో ఏఎం ఘజన్‌ఫర్‌ను ఎంపిక చేశారు. కానీ ఘజన్ఫర్ గాయం కారణంగా దూరం కావడంతో ముజీబ్‌ను తిరిగి ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి తీసుకుంటారని అంతా భావించారు. కానీ అఫ్గాన్ సెలక్టర్లు మాత్రం నంగేయాలియా ఖరోటేను ఎంపిక చేసి అందరికి షాకిచ్చారు.ముంబై ఇండియన్స్ జట్టుజస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, ట్రెంట్ బౌల్ట్ (రూ. 12.50 కోట్లు), నమన్ ధీర్ (రూ. 5.25 కోట్లు), రాబిన్ మింజ్ (రూ. 65 లక్షలు), కర్ణ్ శర్మ (రూ. 50 లక్షలు), దీపాక్ రికల్టన్ (ఆర్. 2 కోట్లు), దీపక్.9 కోట్లు. కోటి), అల్లా గజన్ఫర్ (రూ. 4.80 కోట్లు), విల్ జాక్స్ (రూ. 5.25 కోట్లు), అశ్వనీ కుమార్ (రూ. 30 లక్షలు), మిచెల్ సాంట్నర్ (రూ. 2 కోట్లు), రీస్ టోప్లీ (రూ. 75 లక్షలు), కృష్ణన్ శ్రీజిత్ (రూ. 30 లక్షలు), రాజ్ అంగద్ బావా (ఆర్. 30 లక్షలు), సత్యానారాయణ 30 లక్షలు. బెవాన్ జాకబ్స్ (రూ. 30 లక్షలు), అర్జున్ టెండూల్కర్ (రూ. 30 లక్షలు), లిజాద్ విలియమ్స్ (రూ. 75 లక్షలు), విఘ్నేష్ పుత్తూర్ (రూ. 30 లక్షలు). -
ఆఖరి బంతికి ఢిల్లీ గెలిచింది
వడోదర: లక్ష్యఛేదనలో ఢిల్లీకి చివరి 12 బంతుల్లో 21 పరుగులు కావాలి...అయితే 5 బంతుల్లో 5 పరుగులే వచ్చాయి. సమీకరణం 7 బంతుల్లో 16 పరుగులకు మారడంతో ముంబైకే విజయావకాశాలు ఉన్నాయి. కానీ ఆపై డ్రామా సాగింది... ఆఖరి బంతి దాకా సాగిన రనౌట్/నాటౌట్ హంగామా ఢిల్లీనే గట్టెక్కించింది. కలిత వేసిన 20వ ఓవర్లో తొలి నాలుగు బంతుల్లో 8 పరుగులు రాగా, ఐదో బంతికి నికీ ప్రసాద్ (33 బంతుల్లో 35; 4 ఫోర్లు) క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆఖరి బంతికి 2 పరుగులు చేయాల్సిన తరుణంలో హైదరాబాదీ ఆల్‌రౌండర్ తొలి పరుగు పూర్తి చేసింది. అయితే రెండో పరుగు తీసే ప్రయత్నంలో డైవ్ చేయగా... కీపర్ వికెట్లను గిరాటేసింది. మూడో అంపైర్‌కు నివేదించగా... రీప్లేలో ఆమె పడిన డైవ్‌తో బ్యాట్ క్రీజ్‌ను దాటినట్లు తేలడంతో రెండో పరుగొచ్చింది. దీంతో ఢిల్లీ 2 వికెట్ల తేడాతో గెలిచింది. ఆఖరి బంతిదాకా చెమటోడ్చిన ముంబై ఇండియన్స్ జట్టు 2 వికెట్ల తేడాతో ఓడింది. డబ్ల్యూపీఎల్‌లో శనివారం ఆసక్తికరంగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 19.1 ఓవర్లలో 164 పరుగుల వద్ద ఆలౌటైంది. నాట్ సీవర్ బ్రంట్ (59 బంతుల్లో 80 నాటౌట్; 13 ఫోర్లు) చెలరేగింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (22 బంతుల్లో 42; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిపించింది. ఢిల్లీ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్ 3, శిఖా పాండే 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులు చేసి గెలిచింది. ఓపెనింగ్‌లో షఫాలీ వర్మ (18 బంతుల్లో 43; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేసింది. మిడిలార్డర్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నికీ ప్రసాద్ గెలిచేందుకు అవసరమైన పరుగుల్ని జతచేసింది. సీవర్, హర్మన్ దంచేసినా... ముంబై ఓపెనర్లు హేలీ మాథ్యూస్ (0), యస్తిక (11) సహా ఆఖరి వరుస బ్యాటర్లు షబ్నమ్ (0), సైకా ఇషాక్ (0) వరకు ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేదు. వన్‌డౌన్‌లో నాట్ సీవర్ బ్రంట్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఇద్దరే ముంబైని ఆదుకున్నారు. వాళ్లిదరు మెరిపించడంతో ఒకానొక దశలో ముంబై 10.3 ఓవర్లలోనే వంద పరుగులకు చేరింది. మూడో వికెట్‌కు 73 పరుగులు జోడించాక ధాటిగా ఆడుతున్న కెపె్టన్ హర్మన్ అవుటైంది. తర్వాత వచ్చినవారెవరూ బాధ్యత కనబర్చలేదు. కానీ సీవర్ బ్రంట్ 36 బంతుల్లో అర్ధసెంచరీ సాధించి ఆఖరిదాకా అజేయంగా పోరాడింది. అదరగొట్టిన షఫాలీ ఓపెనర్ షఫాలీ వర్మ పవర్ ప్లేలో పవర్ హిట్టింగ్తో కెపె్టన్ మెగ్ లానింగ్ (15)తో కలిసి ఢిల్లీకి మెరుపు ఆరంభమిచ్చింది. ఆరో ఓవర్ ఐదో బంతికి షఫాలీ జోరుకు హేలీ కళ్లెం వేయగా, మరుసటి ఓవర్లో లానింగ్‌ను షబ్నమ్ అవుట్ చేసింది. తర్వాత జెమీమా (2), అనాబెల్ సదర్లాండ్ (13), అలైస్ క్యాప్సి (16)లు విఫలమవడంతో ఢిల్లీ ఆట పడుతూలేస్తూ సాగింది. ఈ దశలో నికీ ప్రసాద్, సారా బ్రైస్ (10 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) జోడీ ఆరో వికెట్‌కు వేగంగా 31 పరుగులు జతచేయడంతో ఢిల్లీ గెలుపుదారిలో పడింది. స్వల్పవ్యవధిలో సారా, శిఖాపాండే (2) నిష్క్రమించినా ఆఖరి బంతి దాకా పోరాడిన ఢిల్లీ టెయిలెండర్లు జట్టును గెలిపించారు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: యస్తిక (బి) శిఖాపాండే 11; హేలీ (సి) లానింగ్ (బి) శిఖాపాండే 0; సీవర్ బ్రంట్ నాటౌట్ 80; హర్మన్‌ప్రీత్ (సి) నికీ (బి) అనాబెల్ 42; అమెలియా రనౌట్ 9; సజన (సి) బ్రైస్ (బి) అనాబెల్ 1; అమన్‌జ్యోత్ (బి) క్యాప్సి 7; సంస్కృతి (సి) లానింగ్ (బి) మిన్నుమణి 2; కలిత రనౌట్ 1; షబ్నిమ్ రనౌట్ 0; సైకా ఇషాక్ (బి) అనాబెల్ 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (19.1 ఓవర్లలో ఆలౌట్) 164. వికెట్ల పతనం: 1–1, 2–32, 3–105, 4–129, 5–133, 6–146, 7–156, 8–159, 9–160, 10–164. బౌలింగ్: శిఖా పాండే 4–0–14–2, అలైస్ క్యాప్సి 2–0– 25–1, అరుంధతి 4–0– 40–0, మిన్నుమణి 4–0–23–1, అనాబెల్ 3.1–0–34–3, రాధా యాదవ్ 2–0–26–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: మెగ్ లానింగ్ (బి) షబ్నమ్ 15; షఫాలీ (సి) అమన్‌జ్యోత్ (బి) హేలీ 43; జెమీమా (సి) హర్మన్‌ప్రీత్ (బి) అమెలియా 2; అనాబెల్ (బి) సీవర్ బ్రంట్ 13; క్యాప్సి (సి) షబ్నమ్ (బి) అమెలియా 16; నికీ ప్రసాద్ (సి) అమెలియా (బి) కలిత 35; సారా బ్రైస్ (సి) కలిత (బి) హేలీ 21; శిఖా పాండే రనౌట్ 2; రాధా యాదవ్ నాటౌట్ 9; అరుంధతీ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–60, 2–60, 3–66, 4–76, 5–109, 6–140, 7–147, 8–163. బౌలింగ్: షబ్నమ్ 4–0–18–1, సైకా 3–0–43–0, సీవర్ బ్రంట్ 4–0–38–1, హేలీ మాథ్యూస్ 4–0–31–2, అమెలియా కెర్ 4–0–22–2, కలిత 1–0–10–1. శ్రేయాంక స్థానంలో స్నేహ్ రాణా బెంగళూరు: డబ్ల్యూపీఎల్ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరులో కీలక మార్పు జరిగింది. గాయంతో బాధపడుతున్న స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ టోర్నీ నుంచి తప్పుకుంది. శుక్రవారం జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌లో కూడా ఆమె బరిలోకి దిగలేదు. శ్రేయ స్థానంలో స్నేహ్ రాణాను ఆర్సీబీ జట్టులోకి తీసుకున్నారు. గత ఏడాది గుజరాత్ జెయింట్స్ తరఫున ఆడిన రాణా ఈ సారి వేలంలో ఎంపిక కాలేదు. రాణాను రూ.30 లక్షలకు బెంగళూరు ఎంచుకుంది. డబ్ల్యూపీఎల్‌లో నేడుగుజరాత్ X యూపీ వారియర్స్ రాత్రి గం. 7:30 స్టార్ స్పోర్ట్స్, జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఆర్సీబీకి భారీ షాక్!
మహిళల ప్రీమియర్ లీగ్(WPL)-2025 ఆరంభానికి ముందే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు ప్లేయర్లు గాయాల వల్ల ఈ టోర్నమెంట్‌కు దూరం కాగా.. తాజాగా స్టార్ స్పిన్నర్ ఆశా శోభన కూడా తప్పుకొంది.ఈ నేపథ్యంలో ఆమె స్థానాన్ని భారత వికెట్ కీపర్ బ్యాటర్ నుఝత్ పర్వీన్‌తో భర్తీ చేస్తున్నట్లు ఆర్సీబీ గురువారం ప్రకటన విడుదల చేసింది. ‘‘దురదృష్టవశాత్తూ.. మోకాలి గాయం కారణంగా మా చాంపియన్ ఆల్‌రౌండర్ ఆశా శోభన(Asha Sobhana) డబ్ల్యూపీఎల్-2025 మొత్తానికి దూరమైంది.స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ నుఝత్ పర్వీన్ ఈ సీజన్లో ఆశా శోభన స్థానాన్ని భర్తీ చేస్తుంది. నుఝత్ ఆర్సీబీకిలో నీకు స్వాగతం’’ ఆర్సీబీ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.కాగా 33 ఏళ్ల లెగ్ స్పిన్నర్ ఆశా శోభన మహిళల టీ20 ప్రపంచకప్-2024 సందర్భంగా చివరగా భారత్‌కు ప్రాతినిథ్యం వహించింది. నాడు గ్రూప్ దశలో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఆమె గాయపడింది. అయితే, ఇంత వరకు కోలుకోలేదు. ఈ నేపథ్యంలో డబ్ల్యూపీఎల్ తాజా ఎడిషన్ మొత్తానికి ఆమె దూరమైంది.గత సీజన్లో ఆశా శోభన మొత్తంగా పన్నెండు వికెట్లు తీసి జట్టు చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించింది. ఇక ఇదివరకే సోఫీ మెలినెక్స్, కేట్ క్రాస్ గాయాల కారణంగా ఆర్సీబీకి దూరం కాగా.. సోఫీ డివైన్ టోర్నీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంది.మరోవైపు.. ఆల్‌రౌండర్ శ్రేయాంక పాటిల్ కూడా గాయం వల్ల స్వదేశంలో పలు సిరీస్‌లకు దూరమైన విషయం తెలిసిందే. కాబట్టి ఆమె ఆర్సీబీ తుదిజట్టులోకి వస్తుందా లేదా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది.ముంబై ఇండియన్స్‌లోకి పరుణిక సిసోడియాడబ్ల్యూపీఎల్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్‌కు కూడా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ సీజన్ మొత్తానికి దూరమైంది. ఆమె స్థానంలో పరుణిక సిసోడియా జట్టులోకి వచ్చింది. కనీస ధర రూ. 10 లక్షలతో పరుణిక ముంబై ఇండియన్స్‌లో చేరింది.కాగా ఇటీవల జరిగిన మహిళల అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీలో పరుణిక అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ నుంచి ఆమెకు పిలుపు రావడం గమనార్హం. ఇక ఫిబ్రవరి 14- మార్చి 15 వరకు మహిళల ప్రీమియర్ లీగ్ జరుగనుంది. ముంబై ఇండియన్స్ వుమెన్స్, ఆర్సీబీ వుమెన్స్, యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మొత్తంగా 22 మ్యాచ్‌లు జరుగుతాయి. -
మరో క్రికెట్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్ యాజమాన్యం
ముంబై ఇండియన్స్ (Mumbai Indians) యాజమాన్యం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) మరో క్రికెట్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఐదు క్రికెట్ ఫ్రాంచైజీలు కలిగిన RIL.. తాజాగా ద హండ్రెడ్ లీగ్‌లోని ఓవల్ ఇన్విన్సిబుల్స్ (లండన్ బేస్డ్) ఫ్రాంచైజీలో 49 శాతం వాటాను సొంతం చేసుకుంది. మిగిలిన 51 శాతం వాటాను ఇన్విన్సిబుల్స్ మాతృ సంస్థ అయిన సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్ (SCC) నిలబెట్టుకుంది.RIL, దాని అనుబంధ సంస్థ అయిన RISE వరల్డ్‌వైడ్ ద్వారా సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇన్విన్సిబుల్స్లో తమ వాటా కోసం RIL దాదాపు 644 కోట్ల రూపాయలు (60 మిలియన్ GBP) చెల్లించినట్లు తెలుస్తుంది. ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) విక్రయించిన మొట్టమొదటి ఫ్రాంచైజీ ఓవల్ ఇన్విన్సిబుల్స్. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీ విలువ 1320 కోట్ల రూపాయలుగా (123 మిలియన్ GBP) ఉంది. ఓవల్ ఇన్విన్సిబుల్స్‌ను ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ తమ కుటుంబంలోకి స్వాగతించారు.ఈ భాగస్వామ్యంతో ముంబై ఇండియన్స్ అభిమానుల స్థావరాన్ని భారత్‌తో పాటు న్యూయార్క్, UAE, దక్షిణాఫ్రికా, ఇప్పుడు ఇంగ్లండ్‌కు విస్తరిస్తున్నామని ఆమె అన్నారు. మా ప్రపంచ క్రికెట్ ప్రయాణంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నామని నీతా అంబాని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.హండ్రెడ్ లీగ్‌లో ఫ్రాంచైజీని కొన్న మూడో ఐపీఎల్ జట్టు..కాగా, ద హండ్రెడ్ లీగ్‌లో ఇటీవలే ఐపీఎల్ ఫ్రాంచైజీలైన లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా పెట్టుబడులు పెట్టాయి. నార్తర్న్ సూపర్‌చార్జర్స్ ఫ్రాంచైజీను సన్‌రైజర్స్ యాజమాన్యం సన్ గ్రూప్ హస్తగతం చేసుకుంది. ఈ ఫ్రాంచైజీలో మొత్తం వంద శాతాన్ని సన్ గ్రూప్ కొనుగోలు చేసింది.అంతకుముందు లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం RPSG గ్రూప్.. మాంచెస్టర్ ఒరిజినల్స్ (ఇంగ్లండ్) ఫ్రాంచైజీని కళ్లు చెదిరే ధర వెచ్చించి సొంతం చేసుకుంది. ఒరిజినల్స్ మొత్తం విలువలో 49 శాతాన్ని RPSG గ్రూప్ దక్కించుకుంది. భారత కరెన్సీలో ఈ వాటా విలువ రూ. 1251 కోట్లు.హండ్రెడ్ లీగ్‌లో ఇన్విన్సిబుల్స్ హవాఓవల్ ఇన్విన్సిబుల్స్ మహిళల జట్టు 2021, 2022 ఎడిషన్లలో ద హండ్రెడ్ విజేతగా నిలిచింది. పురుషుల జట్టు 2023, 2024 ఎడిషన్లలో ఛాంపియన్‌గా నిలిచింది.ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుముంబై ఇండియన్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా ఉంది. ఈ ఫ్రాంచైజీ 2013, 2015, 2017, 2019, 2020 ఎడిషన్లలో ఛాంపియన్‌గా నిలిచింది. ముంబై ఇండియన్స్ రెండు సందర్భాలలో ఛాంపియన్స్ లీగ్‌ను కూడా గెలుచుకుంది. ఇటీవల, MI కేప్ టౌన్ SA20 2025 టైటిల్‌ను కూడా గెలుచుకుంది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంఐ ఫ్రాంచైజీలు ఇవే..!ముంబై ఇండియన్స్ (ఐపీఎల్), ముంబై ఇండియన్స్ (డబ్ల్యూపీఎల్), ఎంఐ న్యూయార్క్ (మేజర్ లీగ్ క్రికెట్), ఎంఐ కేప్‌టౌన్ (సౌతాఫ్రికా టీ20 లీగ్), ఎంఐ ఎమిరేట్స్ (ఇంటర్నేషనల్ లీగ్ టీ20), తాజాగా ఓవల్ ఇన్విన్సిబుల్స్ (ద హండ్రెడ్ లీగ్) -
ముంబై ఇండియన్స్‌కు షాక్.. టోర్నీ నుంచి ఔట్
ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీలో (ILT20-2025) డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్‌కు (MI Emirates) షాక్ తగిలింది. ప్రస్తుత ఎడిషన్‌లో ఆ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్‌లో నాకౌటైంది. నిన్న (ఫిబ్రవరి 7) షార్జా వారియర్జ్‌తో (Sharjah Warriorz) జరిగిన మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్ 6 వికెట్ల తేడాతో పరాజయంపాలై, టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేసింది. 42 పరుగులు (22 బంతుల్లో; 6 ఫోర్లు, సిక్స్) చేసిన నికోలస్ పూరన్ ఎంఐ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టామ్ బాంటన్ (29), విల్ జాక్స్ (18), కుసాల్ పెరీరా (18), అకీల్ హొసేన్ (15) రెండంకెల స్కోర్లు చేశారు. భారీ హిట్టర్లు ఆండ్రీ ఫ్లెచర్ (0), బెవాన్ జాకబ్స్ (7), రొమారియో షెపర్డ్ (7) దారుణంగా విఫలమయ్యారు. వారియర్జ్ బౌలర్లలో టిమ్ సౌథీ 2, ఆడమ్ మిల్నే, దిల్షన్ మధుషంక, అస్టన్ అగర్, హర్మీత్ సింగ్, రోహన్ ముస్తఫా తలో వికెట్ పడగొట్టారు.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వారియర్జ్ 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (40), జాన్సన్ ఛార్లెస్ (36) వారియర్జ్ విజయానికి గట్టి పునాది వేయగా.. టిమ్ సీఫర్ట్ (40 నాటౌట్), రోహన్ ముస్తఫా (2 నాటౌట్) వారియర్జ్‌ను విజయతీరాలకు చేర్చారు. జేసన్ రాయ్ (26) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఎంఐ బౌలర్లలో ముహమ్మద్ రోహిద్ ఖాన్ 3, ఫజల్ హక్ ఫారూకీ ఓ వికెట్ పడగొట్టారు. ఈ గెలుపు అనంతరం వారియర్జ్ రెండో క్వాలిఫయర్‌లో డెసర్ట్ వైపర్స్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌లో విజేత ఫిబ్రవరి 9న జరిగే ఫైనల్లో దుబాయ్ క్యాపిటల్స్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది.కాగా, యూఏఈ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ఇప్పటిదాకా రెండు ఎడిషన్లు జరిగాయి. తొలి ఎడిషన్‌లో గల్ఫ్ జెయింట్స్ ఛాంపియన్‌గా నిలువగా.. రెండో సీజన్లో ఎంఐ ఎమిరేట్స్ విజేతగా నిలిచింది. గత ఎడిషన్ ఫైనల్లో ఎమిరేట్స్ దుబాయ్ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. ఈ సీజన్లో క్యాపిటల్స్ అందరికంటే ముందే ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. -
సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫైనల్లోకి ముంబై ఇండియన్స్
ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఫ్యామిలీకి చెందిన ఎంఐ కేప్‌టౌన్ (MI Cape Town) తొలిసారి సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో (SA20 2025) ఫైనల్‌కు చేరింది. నిన్న (ఫిబ్రవరి 4) జరిగిన తొలి క్వాలిఫయర్‌లో ఎంఐ కేప్‌టౌన్ పార్ల్ రాయల్స్‌పై 39 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ప్రస్తుత సీజన్లో ఎంఐకు ఇది మూడో అత్యధిక స్కోర్. ముంబై ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ (27 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), వాన్ డర్ డస్సెన్ (32 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సహా డెవాల్డ్ బ్రెవిస్ (30 బంతుల్లో 44 నాటౌట్; 4 సిక్సర్లు), జార్జ్ లిండే (14 బంతుల్లో 26; 3 సిక్సర్లు), డెలానో పోట్గెటర్ (17 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) రాణించారు. రాయల్స్ బౌలర్లలో దునిత్ వెల్లలగే 2, ఫోర్టుయిన్, డేవిడ్ గేలియమ్ తలో వికెట్ పడగొట్టారు.200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. ఎంఐ బౌలర్లు కలిసికట్టుగా సత్తా చాటడంతో 19.4 ఓవర్లలో 160 పరుగులకే ఆలౌటైంది. ట్రెంట్ బౌల్ట్, కగిసో రబాడ, కార్బిన్ బాష్, కెప్టెన్ రషీద్ ఖాన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జార్జ్ లిండే ఓ వికెట్ దక్కించుకున్నాడు. రాయల్స్ ఇన్నింగ్స్‌లో డేవిడ్ మిల్లర్ (45) టాప్ స్కోరర్‌గా నిలువగా.. దినేశ్ కార్తీక్ (31) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఛేదనలో రాయల్స్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన రషీద్ ఖాన్ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. ఈ మ్యాచ్‌లో ఓడినా ఫైనల్‌కు చేరేందుకు రాయల్స్‌కు మరో అవకాశం ఉంటుంది. రేపు (ఫిబ్రవరి 6) జరుగబోయే క్వాలిఫయర్-2లో రాయల్స్.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజేతతో తలపడుతుంది. ఇవాళ (ఫిబ్రవరి 5) జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్.. జోబర్గ్ సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది. గత రెండు సీజన్లలో టేబుల్ లాస్ట్‌లో నిలిచిన ఎంఐ కేప్‌టౌన్ తొలిసారి ఫైనల్‌కు చేరింది. సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ సౌతాఫ్రికా టీ20 లీగ్ రెండు ఎడిషన్లలో విజేతగా నిలిచింది. -
IPL 2025: ప్రధాన ఆటగాళ్లకు ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ వార్నింగ్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్(Mumbai Indians) గతేడాది ఘోర పరాభవాన్ని చవిచూసింది. పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగే గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. స్టార్ ప్లేయర్లు ఉన్నా పేలవ ప్రదర్శనతో చతికిలపడి అవమానభారంతో లీగ్ దశలోనే నిష్క్రమించింది.అయితే, ఈ దుస్థితికి యాజమాన్యమే కారణమని ముంబై ఇండియన్స్ అభిమానులే విమర్శల వర్షం కురిపించారు. ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు అంబానీల సారథ్యంలోని ముంబై జట్టు.. తమ కెప్టెన్‌ను మార్చడమే ఇందుకు ప్రధాన కారణం. ముంబై ఫ్రాంఛైజీకి ఘనమైన చరిత్ర ఉంది. రోహిత్ శర్మ సారథ్యంలోక్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక సార్లు ట్రోఫీ గెలిచిన జట్టుగా ముంబై నిలిచింది. రోహిత్ శర్మ(Rohit Sharma) సారథ్యంలో ఏకంగా ఐదుసార్లు టైటిల్ సాధించి.. ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. అయితే, గత సీజన్ ఆరంభానికి ముందు రోహిత్‌ను కెప్టెన్‌గా తప్పించిన మేనేజ్మెంట్..అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకుని మరీ.. పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించింది.పాండ్యాకు అవమానాలురోహిత్ శర్మ ఫ్యాన్స్‌తో పాటు.. ముంబై జట్టు అభిమానులు కూడా ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోయారు. దీంతో హార్దిక్ పాండ్యా మైదానంలోకి రాగానే అతడిని కించపరిచేలా పెద్ద ఎత్తున గోల చేశారు. ముంబై సొంత గ్రౌండ్ వాంఖడేలోనూ హార్దిక్‌కు ఇలాంటి చేదు అనుభవాలు తప్పలేదు. రోహిత్ కూడా అభిమానులను వారించకుండా మిన్నకుండిపోవడం అనుమానాలకు తావిచ్చింది.రోహిత్ టీమ్ వర్సెస్ హార్దిక్ అనేలాహార్దిక్ పాండ్యాను కెప్టెన్‌ను చేయడం రోహిత్ శర్మకు ఇష్టం లేదనే ప్రచారం జరిగింది. రోహిత్‌తో పాటు.. అతడి తర్వాత కెప్టెన్ పదవిని ఆశించిన జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌లకు కూడా హార్దిక్‌తో పొసగడం లేదనే వార్తలు గుప్పుమన్నాయి. ఫలితంగా ముంబై ఇండియన్స్ డ్రెసింగ్‌రూమ్‌లో విభేదాలు తలెత్తాయంటూ వదంతులు వ్యాపించాయి. అయితే, మైదానంలో రోహిత్, బుమ్రా, సూర్య ఒక జట్టుగా కనిపించడం.. హార్దిక్ పాండ్యా ఒంటరిగా ఉండటం వీటికి బలాన్ని చేకూర్చాయి.ఫలితంగా వరుస ఓటముల రూపంలో ముంబై ఇండియన్స్ భారీ మూల్యమే చెల్లించింది. అయితే, ఈసారి మాత్రం అలాంటి పొరపాటును పునరావృతం చేయకూడదని ముంబై యాజమాన్యం భావిస్తోందట. ప్రధాన ఆటగాళ్లకు ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ వార్నింగ్!ఇందుకోసం ఇటీవలే ప్రత్యేకంగా ఓ సమావేశం కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీని మనస్ఫూర్తిగా అంగీకరించాలని.. అతడికి అన్ని వేళలా అండగా నిలవాలని జట్టులోని ప్రధాన ఆటగాళ్లతో మేనేజ్మెంట్ పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.అదే విధంగా.. ఆటగాళ్లంతా కలిసికట్టుగా ఉండి.. జట్టు ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యంగా పనిచేయాలని గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. హార్దిక్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా అతడిని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించినట్లు సమాచారం.కాగా తనను కెప్టెన్‌గా తప్పించిన ముంబై ఇండియన్స్‌తో రోహిత్ శర్మ బంధం తెంచుకుంటాడనే ప్రచారం జరుగగా.. అతడు మాత్రం అనూహ్య రీతిలో అదే ఫ్రాంఛైజీతో కొనసాగేందుకు నిర్ణయించుకున్నాడు.రోహిత్ మళ్లీ ముంబైతోనే..ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ముంబై రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో రోహిత్ కూడా ఉండటం విశేషం. జస్ప్రీత్ బుమ్రా(రూ. 18 కోట్లు), సూర్యకుమార్ యాదవ్(రూ. 16.35 కోట్లు),హార్దిక్ పాండ్యా(రూ. 16.35 కోట్లు), రోహిత్ శర్మ(రూ. రూ. 16.30 కోట్లు), తిలక్ వర్మ(రూ. 8 కోట్లు)లను ముంబై అట్టిపెట్టుకుంది. కాగా గత సీజన్ ఆఖరి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా.. హార్దిక్ పాండ్యాకు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్-2025లో మొదటి మ్యాచ్ ఆడకుండా అతడిపై నిషేధం పడింది.చదవండి: ఆసీస్‌తో టెస్టుల్లో అతడిని ఆడించాల్సింది.. ద్రవిడ్ ఉన్నంత వరకు.. : భజ్జీ -
ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా రషీద్ ఖాన్..
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కెప్టెన్‌గా అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్‌ను ముంబై కేప్ టౌన్ తిరిగి నియమించింది. కాగా తొట్ట తొలి సీజన్లో ముంబై కేప్ టౌన్ కెప్టెన్‌గా వ్యవహరించిన రషీద్.. గాయం కారణంగా రెండో సీజన్‌కు దూరమయ్యాడు.ఇప్పుడు వచ్చే ఏడాది సీజన్‌కు అతడు అందుబాటులోకి రావడంతో మరోసారి కేప్‌టౌన్ జట్టును ముందుండి నడిపించనున్నాడు. తొలి సీజన్లో అతడి సారథ్యంలోని కేప్ టౌన్ జట్టు దారుణ ప్రదర్శన కనబరిచింది. పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో నిలిచి గ్రూపు స్టేజిలోనే రషీద్ జట్టు ఇంటిముఖం పట్టింది. రెండో సీజన్లో కూడా ముంబై తలరాత మారలేదు.రషీద్ స్ధానంలో ముంబై కేప్ టౌన్ కెప్టెన్‌గా విండీస్ దిగ్గజం కిరాన్ పొలార్డ్ వ్యవహరించాడు. రెండో సీజన్లో కూడా ముంబై జట్టు పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానానికే పరిమితమైంది. కనీసం మూడో స్ధానంలోనైనా ముంబై కేప్ టౌన్ తలరాత మారుతుందో లేదో చూడాలి.కాగా ఎస్ఏ 20-2025 సీజన్‌కు ముందు ముంబై ఫ్రాంచైజీ ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ముంబై కేప్‌టౌన్ జట్టులో స్టోక్స్‌తో పాటు ట్రెంట్ బౌల్ట్, కగిసో రబాడ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. కాగా ముంబై కేప్‌టౌన్ జట్టు ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి చెందినదే అన్న విషయం తెలిసిందే. ఇక ఎస్ఎ టీ20 లీగ్ మూడో సీజన్ జనవరి 9, 2025న ప్రారంభం కానుంది.ఎస్ఏ20 2025 ఎడిషన్ కోసం ఎంఐ కేప్‌టౌన్ జట్టు..బెన్ స్టోక్స్, రషీద్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, అజ్మతుల్లా ఒమర్జాయ్, నువాన్ తుషార, క్రిస్ బెంజమిన్, కగిసో రబాడ, డెవాల్డ్ బ్రెవిస్, రస్సీ వాన్ డర్ డస్సెన్, ర్యాన్ రికెల్టన్, జార్జ్ లిండే, డెలానో పాట్గెయిటర్, థామస్ కేబర్, కానర్ ఎస్టర్హ్యుజెన్చదవండి: అశ్విన్‌కు వచ్చే పెన్షన్ ఎంతో తెలుసా? -
ముంబై ఇండియన్స్ మహిళా టీం, యువ ప్రతిభకు ప్రాధాన్యం : నీతా
మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ 3 కోసం రిలయన్స్ఫౌండేన్ చైర్పర్సన్ నీతా అంబానీ యాజమాన్యలోని ముంబై ఇండియన్స్ పటిష్టమైన టీంను సిద్ధం చసింది. WPL 2025 ఆదివారం బెంగుళూరులో జరిగిన వేలంలో కొత్తగా నలుగురు మహిళా క్రికెటర్లను జట్టులో చేర్చుకుంది. దీనిపై నీతా అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. తమ ముంబై ఇండియన్స్ మహిళా జట్టులో యువతకు ప్రాధాన్యత ఇచ్చి, వారిలోని ప్రతిభను గుర్తించి, తద్వారా టీం పటిష్టతకు ప్రయత్నిస్తోందని నీతా తెలిపారు.నీతా అంబానీ కొత్తగా ఎంపికైన టీంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పురుషుల జట్టులో ఆటగాళ్లు బుమ్రా, హార్తిక్, తిలక్ ప్రపంచ వేదికపై ప్రతిభతో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందన్నారు. అలాగే గతేడాది వేలంలో తీసుకున్న సజనకూడా అద్భుతంగా ఆడిందంటూ ప్రశంసించారు నీతా. ముంబై ఇండియన్స కుటుంబంలో భాగమైన అమ్మాయిలందరి గురించి తాను గర్వపడుతున్నానని వ్యాఖానించారు. కొత్తగా టీంలో చేరిన తమిళనాడుకు చెందిన 16 ఏళ్ల వికెట్ కీపర్ జి. కమలిని, ఆల్ రౌండర్లు సంస్కృతి గుప్తా, అక్షితా మహేశ్వరి, దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ నాడిన్ డి క్లర్క్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు. “Grooming young talent, and watching them play at the global stage feels wonderful.”Mrs. Nita Ambani encourages new talent joining the 𝗙𝗔𝕄𝕀𝗟𝗬 at the #TATAWPLAuction! 💙#OneFamily #AaliRe #MumbaiIndians pic.twitter.com/VySfK4B6W6— Mumbai Indians (@mipaltan) December 15, 2024 -
మినీ వేలం: యువ క్రికెటర్‌కు కళ్లు చెదిరే ధర.. ఎవరీ కమలిని?
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మినీ వేలం సందర్భంగా తమిళనాడుకు చెందిన ఓ యువ క్రికెటర్‌పై కనక వర్షం కురిసింది. పదహారేళ్ల జి. కమలిని కోసం ముంబై ఇండియన్స్ భారీ మొత్తం ఖర్చు చేసింది. అన్క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలో ఉన్న ఈ ఆల్‌రౌండర్‌ను ఏకంగా రూ. 1.60 కోట్లకు కొనుగోలు చేసింది.19 స్థానాల కోసంభారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మినీ వేలంలో మొత్తం 120 మంద మహిళా క్రికెటర్లు పాల్గొంటున్నారు. ఐదు జట్లలో కలిపి ఖాళీగా ఉన్న 19 స్థానాల కోసం భారత్ నుంచి 91 మంది, విదేశాల నుంచి 29 మంది ఆటగాళ్లు బరిలో నిలిచారు.రూ. 10 లక్షల కనీస ధరఇక బెంగళూరు వేదికగా ఆదివారం మొదలైన ఈ వేలంపాటలో జి. కమలిని రూ. 10 లక్షల కనీస ధరతో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఆమె కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌తో పాటు ముంబై ఇండియన్స్ బిడ్ వేసింది. అయితే, ఈ ఆల్‌రౌండర్‌ను ఎలాగైనా తమ జట్టులోకి చేర్చుకోవాలని పట్టుబట్టిన ముంబై యాజమాన్యం.. ఢిల్లీతో పోటీ పడి ఆమె ధరను కోటి దాటించింది.అయినప్పటికీ ఢిల్లీ వెనక్కి తగ్గకపోవడంతో మరో అరవై లక్షలు పెంచి ఏకంగా 1.60 కోట్ల రూపాయలకు ముంబై కమలిని సేవలను సొంతం చేసుకుంది. కాగా అన్క్యాప్డ్ ప్లేయర్ అయినప్పటికీ జి.కమలిని కోసం వేలంలో భారీ డిమాండ్ రావడానికి కారణం.. ఆమె నైపుణ్యాలే.భారీ సిక్సర్లతో విరుచుకుపడే లెఫ్టాండర్ఇటీవల జరిగిన అండర్-19 మహిళల టీ20 ట్రోఫీలో తమిళనాడు టైటిల్ గెలవడంలో జి. కమలినిది కీలక పాత్ర. ఈ టోర్నమెంట్లో ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి ఆమె 311 పరుగులు చేసింది. భారీ సిక్సర్లతో విరుచుకుపడే ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. పార్ట్ టైమ్ స్పిన్నర్‌గానూ సేవలు అందించింది.అంతేకాదు.. ఈ లెగ్‌బ్రేక్ స్పిన్నర్ వివిధ కేటగిరీల్లో తమిళనాడు తరఫున వికెట్ కీపర్‌గానూ బరిలోకి దిగింది. అందుకే ఈ ఆల్‌రౌండర్ కోసం ముంబై భారీ మొత్తం ఖర్చు చేసింది. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ కోసంకాగా ముంబై ఇండియన్స్ మహిళా జట్టులో నాలుగు ఖాళీలు ఉండగా.. ఒక స్థానం జి. కమలిని భర్తీ చేసింది. ఇక ఈ వేలంలో కమలిని కంటే ముందు సౌతాఫ్రికా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నదినె డి క్లర్క్‌ను ముంబై కొనుక్కుంది. ఆమె కోసం రూ. 30 లక్షలు వెచ్చించింది.డాటిన్‌కు రూ. 1.70 కోట్లుమరోవైపు.. వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ డియోండ్రా డాటిన్‌ను గుజరాత్ జెయింట్స్ రూ. 1.70 కోట్లకు సొంతం చేసుకుంది. యూపీ వారియర్స్‌తో పోటీపడీ మరీ డాటిన్‌ను దక్కించుకుంది. అదే విధంగా సిమ్రన్ షేక్ కోసం గుజరాత్ అత్యధికంగా రూ. 1.90 కోట్లు ఖర్చు చేసింది.అయితే, తొలి రౌండ్లో పూనమ్ యాదవ్, స్నేహ్ రాణా(కనీస ధర రూ. 30 లక్షలు) వంటి భారత ప్లేయర్లు అమ్ముడుపోకుండా మిగిలిపోయారు. కాగా డబ్ల్యూపీఎల్‌లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ పేరిట ఐదు జట్లు పాల్గొంటున్నాయి. చదవండి: BGT: మహ్మద్ షమీకి బైబై! -
హార్దిక్ పాండ్యా విధ్వంసం.. ఒకే ఓవర్లో 28 పరుగులు! వీడియో వైరల్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో బరోడాకు ప్రాతినిథ్యం వహిస్తున్న పాండ్యా మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా శుక్రవారం త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.త్రిపుర బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా త్రిపుర స్పిన్నర్ పర్వేజ్ సుల్తాన్‌ను ఈ బరోడా ఆల్‌రౌండర్ ఊతికారేశాడు. బరోడా ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసిన పర్వేజ్ బౌలింగ్‌లో 4 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో పాండ్యా 28 పరుగులు పిండుకున్నాడు.ఓవరాల్‌గా 23 బంతులు ఎదుర్కొన్న పాండ్యా.. 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 47 పరుగులు చేసి ఔటయ్యాడు. పాండ్యా విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా బరోడా 110 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 11.2 ఓవర్లలో చేధించింది. బరోడా బ్యాటర్లలో పాండ్యాతో పాటు మితీష్ పటేల్ 37 పరుగులతో ఆజేయంగా నిలిచాడు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన త్రిపుర నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. త్రిపుర బ్యాటర్లలో కెప్టెన్ మన్దీప్ సింగ్(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.బరోడా బౌలర్లలో అభిమన్యు సింగ్ మూడు వికెట్లు, కెప్టెన్ కృనాల్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా ఈ టోర్నీలో హార్దిక్ పాండ్యా ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి 115.50 సగటుతో 231 పరుగులు చేశాడు.చదవండి: Asia Cup 2024: రేపే భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. లైవ్ ఎక్కడో తెలుసా? Hardik Pandya was on fire again 🔥🔥The Baroda all-rounder went berserk smashing 6⃣,6⃣,6⃣,4⃣,6⃣ in an over on his way to a whirlwind 47(23) against Tripura 🙌🙌#SMAT | @IDFCFIRSTBankScorecard ▶️ https://t.co/1WPFeVRTum pic.twitter.com/xhgWG63y9g— BCCI Domestic (@BCCIdomestic) November 29, 2024 -
ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆసక్తికర ఘటన
ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలు చెరి ముగ్గురు ఆటగాళ్లను కుండ మార్పిడి చేసుకున్నాయి. 2025 మెగా వేలంలో ఆర్సీబీ సొంతం చేసుకున్న రొమారియో షెపర్డ్, టిమ్ డేవిడ్, నువాన్ తుషార 2024 సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ఆడారు. 2024 సీజన్లో ఆర్సీబీకి ఆడిన విల్ జాక్స్, రీస్ టాప్లే, కర్ణ్ శర్మ.. 2025 మెగా వేలంలో ముంబై ఇండియన్స్ వశమయ్యారు. వేలంలో ఓ ఫ్రాంచైజీ నుంచి మరో ఫ్రాంచైజీకి మారడం సాధారణమే అయినప్పటికీ.. ఏకంగా ముగ్గురు ఆటగాళ్ల కుండ మార్పిడి జరగడం సిత్రమే.కాగా, ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో జరిగిన విషయం తెలిసిందే. ఈ వేలంలో మొత్తం 577 మంది ఆటగాళ్లు పాల్గొనగా ఆయా ఫ్రాంచైజీలు 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. వీరిలో 62 మంది విదేశీ ఆటగాళ్లు కాగా.. మిగిలిన వారు దేశీయ ఆటగాళ్లు.వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రిషబ్ పంత్ రికార్డు నెలకొల్పాడు. పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ 27 కోట్ల భారీ మొత్తం వెచ్చింది సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో కూడా ఇదే భారీ మొత్తం కావడం విశేషం. ఐపీఎల్ 2025 వేలంలో సెకెండ్ హైయ్యెస్ట్ పేమెంట్ శ్రేయస్ అయ్యర్‌కు దక్కింది. శ్రేయస్‌ను పంజాబ్ కింగ్స్ 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. వేలంలో మూడో అత్యధిక ధర వెంకటేశ్ అయ్యర్‌కు దక్కింది. వెంకటేశ్‌ను కేకేఆర్ 23.75 కోట్లకు కొనుగోలు చేసింది. -
'నిజంగా నేను ఆశ్చర్యపోయాను.. థాంక్యూ ముంబై ఇండియన్స్'
ఐపీఎల్-2025 మెగా వేలం ముగిసింది. జెడ్డా వేదికగా జరిగిన ఈ వేలంలో అన్క్యాప్డ్ న్యూజిలాండ్ బ్యాటర్ బెవాన్ జాకబ్స్‌ను కొనుగోలు చేసి ముంబై ఇండియన్స్ అందరిరని ఆశ్చర్యపరిచింది. కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీ, ఆడమ్ మిల్నే వంటి కివీస్ స్టార్ క్రికెటర్లు అన్‌సోల్డ్‌గా మిగిలిన చోట.. జాకబ్స్ అమ్ముడుపోవడంతో అందరూ విస్తుతపోయారు. 21 ఏళ్ల జాకబ్‌ను రూ.30 లక్షల కనీస ధరకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. అయితే ముంబై తనను దక్కించుకోవడాన్ని బెవాన్ జాకబ్స్ సైతం నమ్మలేకపోతున్నాడు."ఉదయం మేల్కొన్నవెంటనే వేలంలో నేను అమ్ముడుపోయానన్న వార్త విని నేను ఆశ్చర్యపోయాను. నిజంగా నాకు ఇది చాలా పెద్ద అవకాశం. నన్ను కొనుగోలు చేసినందుకు ముంబై ఇండియన్స్‌కు ధన్యవాదాలు.నాకు అక్కడ ఆడే అవకాశం లభిస్తే ఇంకా ఎక్కువగా సంతోషపడతాను. ముంబై ఇండియన్స్ వంటి అద్బుత ఫ్రాంచైజీలో చేరేందుకు అతృతగా ఎదురుచూస్తున్నాను. అదేవిధంగా ప్రపంచంలోని అత్యుత్తమమైన ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్ నుంచి అన్ని విషయాలను నేర్చుకునేందుకు ప్రయత్నిస్తాను" అని ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాకబ్ పేర్కొన్నాడు.ఇప్పటివరకు ఆరు టీ20లు ఆడిన జాకబ్.. 33.50 సగటుతో 134 పరుగులు చేశాడు. సూపర్ స్మాష్ 2024-25 సీజన్‌పై జాకబ్ దృష్టిపెట్టాడు. సూపర్ స్మాష్ సీజన్‌ను ఐపీఎల్‌కు ముందు ప్రాక్టీస్‌గా ఉపయోగించుకోవాలని జాకబ్ భావిస్తున్నాడు.ఈ టోర్నీలో అతడు ఆక్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. కాగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కొత్త ఆటగాళ్లకు అవకాశమిచ్చేందుకు ఎల్లప్పుడూ ముందుంటుంది. ఇప్పటికే డెవాల్డ్ బ్రెవిస్, క్రిష్మార్ సాంటోకీ వంటి విదేశీ ఆటగాళ్లు తమ ఫస్ట్‌క్లాస్ అరంగేట్రానికి ముందే ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించారు.చదవండి: IPL 2025: 'రూ.75 లక్షలకు కూడా ఎవరూ తీసుకులేదు.. ఇప్పటికైనా సిగ్గు పడు' -
వేలం ముగిసింది.. ఇంకా ఎవరి పర్సులో ఎంత? ఎన్ని ఖాళీలు.. పూర్తి వివరాలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2025 సీజన్‌కు సంబంధించి మెగా వేలం కార్యక్రమం పూర్తయింది. సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో రెండు రోజుల పాటు నిర్వహించిన వేలంపాటలో.. తాము కోరుకున్న ఆటగాళ్ల కోసం పది ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. ఎట్టకేలకు తమకు కావాల్సిన వారిని దక్కించుకున్నాయి. ఇక వేలం ప్రక్రియ ముగిసింది కాబట్టి... ఇక వచ్చే ఏడాది మార్చిలో జరిగే టోర్నీకి ఎలా సమాయత్తం కావాలో ఫ్రాంచైజీలు ప్రణాళికలు రచించుకుంటాయి.కాగా ఐపీఎల్లో ఇంతవరకూ టైటిల్ నెగ్గలేకపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఈసారి ఎలాగైనా ఆ లోటును తీర్చుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి. మరి వచ్చే సీజన్లోనైనా ఈ జట్లలో ఒకటి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంటుందో లేదో వేచి చూడాలి.ఇక ఆదివారం నాటి తొలిరోజు వేలంలో టీమిండియా స్టార్లు రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ భారీ ధర పలికారు. వికెట్ కీపర్ బ్యాటర్, కెప్టెన్ ఆప్షన్ అయిన పంత్ కోసం లక్నో ఏకంగా రూ. 27 కోట్లు వెచ్చించింది. మరోవైపు.. పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్‌ను రూ. 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ తాము రిలీజ్ చేసిన వెంకటేశ్ అయ్యర్‌ను ఏకంగా రూ. 23.75 కోట్లకు కొనుగోలు చేసి మరోసారి జట్టులో చేర్చుకుంది.ఇదిలా ఉంటే.. సోమవారం నాటి రెండో రోజు వేలంలోని విశేషాలను గమనిస్తే.. భువనేశ్వర్ కుమార్ కోసం ముంబై ఇండియన్స్, లక్నో మధ్య తీవ్ర పోటీ సాగింది. ఈ రెండు కలిసి అతడి విలువను రూ.10 కోట్ల 50 లక్షల వరకు తీసుకెళ్లాయి. ఈ స్థితిలో అనూహ్యంగా ముందుకు వచ్చిన బెంగళూరు రూ.10 కోట్ల 75 లక్షలకు అతడిని సొంతం చేసుకుంది. మరోవైపు.. తమ పాత ఆటగాడు దీపక్ చహర్‌ను తీసుకునేందుకు చెన్నై సూపర్‌కింగ్స్ చివరి వరకు ప్రయత్నించింది. ముంబై, పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీలతో పోటీ పడి రూ. 8 కోట్ల వరకు బరిలో నిలిచింది. అయితే వెనక్కి తగ్గని ముంబై రూ.9 కోట్ల 75 లక్షలకు అతడిని దక్కించుకుంది.వీరికి మంచి ధర👉సోమవారం వేలంలో అందరికంటే ముందుగా న్యూజిలాండ్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ పేరు రాగా అతడిని తీసుకునేందుకు ఆసక్తి చూపించలేదు. 👉గత ఏడాది వరకు బెంగళూరు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన డుప్లెసిస్‌ను ఈసారి అతని కనీస విలువ రూ.2 కోట్లకే ఢిల్లీ క్యాపిటల్స్ ఎంచుకుంది. 👉భారత పేస్ బౌలర్లలో ఆకాశ్‌దీప్ (రూ.8 కోట్లు; లక్నో), ముకేశ్ కుమార్ (రూ. 8 కోట్లు; ఢిల్లీ), తుషార్ దేశ్‌పాండే (రూ. 6 కోట్ల 50 లక్షలు; రాజస్తాన్ రాయల్స్) మంచి ధర పలికారు. 👉అఫ్గానిస్తాన్ మిస్టరీ ఆఫ్‌స్పిన్నర్ అల్లా గజన్ఫర్(రూ. 4.80 కోట్లు) కోసం కోల్‌కతా, బెంగళూరులతో పోటీ పడి ముంబై సొంతం చేసుకుంది. భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని పోలిన బౌలింగ్ శైలిగల గజన్ఫర్ గత ఏడాది కోల్‌కతా టీమ్‌లో ఉన్నా మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. 👉ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ఒకే ఓవర్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది అందరి దృష్టిలో పడిన ప్రియాన్ష్ ఆర్య కోసం నాలుగు జట్లు బరిలో నిలవగా, చివరగా పంజాబ్ దక్కించుకుంది. 👉పదేళ్ల క్రితం చివరి టీ20 మ్యాచ్ ఆడి టెస్టుల రిటైర్మెంట్ తర్వాత ఇప్పుడు ఐపీఎల్లో రిజిస్టర్ చేసుకున్న ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్‌ను ఎవరూ పట్టించుకోలేదు.👉రిటెయిన్ చేసుకున్న వారితో కలిపి మొత్తం 25 ఆటగాళ్ల గరిష్ట కోటాను చెన్నై సూపర్‌కింగ్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ పూర్తి చేసుకోగా... లక్నో సూపర్ జెయింట్స్ (24), ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ (23), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (22), డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (21), రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (20) అంతకంటే తక్కువ మందితో సరిపెట్టాయి. చెన్నై సూపర్ కింగ్స్రుతురాజ్ (రూ. 18 కోట్లు) జడేజా (రూ. 18 కోట్లు) పతిరణ (రూ. 13 కోట్లు) శివమ్ దూబే (రూ. 12 కోట్లు) ధోని (రూ. 4 కోట్లు) నూర్ అహ్మద్ (రూ.10 కోట్లు) ఆర్. అశి్వన్ (రూ. 9.75 కోట్లు) కాన్వే (రూ. 6.25 కోట్లు) ఖలీల్ అహ్మద్ (రూ. 4.80 కోట్లు) రచిన్ రవీంద్ర (రూ. 4 కోట్లు) రాహుల్ త్రిపాఠి (రూ. 3.40 కోట్లు) అన్షుల్ కంబోజ్ (రూ.3.40 కోట్లు) స్యామ్ కరన్ (రూ. 2.40 కోట్లు) గుర్జప్నీత్ సింగ్ (రూ. 2.20 కోట్లు) నాథన్ ఎలిస్ (రూ. 2 కోట్లు) దీపక్ హుడా (రూ.1.70 కోట్లు) జేమీ ఓవర్టన్ (రూ.1.50 కోట్లు) విజయ్ శంకర్ (రూ. 1.20 కోట్లు) వంశ్ బేడీ (రూ. 55 లక్షలు) ముకేశ్ చౌదరీ (రూ. 30 లక్షలు) షేక్ రషీద్ (రూ. 30 లక్షలు) అండ్రి సిద్ధార్థ్ (రూ. 30 లక్షలు) కమలేశ్ నాగర్కోటి (రూ. 30 లక్షలు) రామకృష్ణ ఘోష్ (రూ. 30 లక్షలు) శ్రేయస్ గోపాల్ (రూ.30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 65 కోట్లు; వేలానికి రూ. 54.95 కోట్లు; మిగిలింది: 5 లక్షలుఢిల్లీ క్యాపిటల్స్అక్షర్ పటేల్ (రూ. 16.50 కోట్లు) కుల్దీప్ యాదవ్ (రూ. 13.25 కోట్లు) స్టబ్స్ (రూ. 10 కోట్లు) అభిషేక్ పోరెల్ (రూ. 4 కోట్లు) కేఎల్ రాహుల్ (రూ. 14 కోట్లు) స్టార్క్ (రూ. 11.75 కోట్లు) నటరాజన్ (రూ. 10.75 కోట్లు) జేక్ ఫ్రేజర్ (రూ 9 కోట్లు) ముకేశ్ కుమార్ (రూ. 8 కోట్లు) హ్యారీ బ్రూక్ (రూ. 6.25 కోట్లు) అశుతోష్ శర్మ (రూ. 3.80 కోట్లు) మోహిత్ శర్మ (రూ.2.20 కోట్లు) డుప్లెసిస్ (రూ. 2 కోట్లు) సమీర్ రిజ్వీ (రూ. 95 లక్షలు) దుష్మంత చమిర (రూ. 75 లక్షలు) డోనొవన్ ఫెరీరా (రూ. 75 లక్షలు) విప్రాజ్ నిగమ్ (రూ.50 లక్షలు) కరుణ్ నాయర్ (రూ. 50 లక్షలు) మాధవ్ తివారి (రూ. 40 లక్షలు) అజయ్ జాదవ్ (రూ.30 లక్షలు) దర్శన్ నల్కండే (రూ. 30 లక్షలు) త్రిపురాణ విజయ్ (రూ. 30 లక్షలు) మన్వంత్ కుమార్ (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 47 కోట్లు; వేలానికి రూ 72.80 కోట్లు; మిగిలింది: రూ. 20 లక్షలు గుజరాత్ టైటాన్స్రషీద్ ఖాన్ (రూ. 18 కోట్లు) శుబ్‌మన్ గిల్ (రూ. 16.50 కోట్లు) సాయి సుదర్శన్ (రూ. 8.5 కోట్లు) రాహుల్ తెవాటియా (రూ. 4 కోట్లు) షారుక్ ఖాన్ (రూ. 4 కోట్లు) బట్లర్ (రూ.15.75 కోట్లు) సిరాజ్ (రూ.12.25 కోట్లు) రబాడ (రూ.10.75 కోట్లు) ప్రసిధ్ కృష్ణ (రూ.9.50 కోట్లు) సుందర్ (రూ. 3.20 కోట్లు) రూథర్‌ఫర్డ్ (రూ. 2.60 కోట్లు) కొయెట్జీ (రూ. 2.40 కోట్లు) ఫిలిప్స్ (రూ. 2 కోట్లు) సాయి కిషోర్ (రూ. 2 కోట్లు) మహిపాల్ లోమ్రోర్ (రూ.1.70 కోట్లు) గుర్నూర్ సింగ్ (రూ. 1.30 కోట్లు) అర్షద్ ఖాన్ (రూ.1.30 కోట్లు), జయంత్ (రూ. 75 లక్షలు) ఇషాంత్ (రూ. 75 లక్షలు) కరీమ్ జనత్ (రూ. 75 లక్షలు) కుమార్ కుశాగ్ర (రూ.65 లక్షలు) మానవ్ సుతార్ (రూ. 30 లక్షలు) అనూజ్ రావత్ (రూ.30 లక్షలు) నిశాంత్ సింధు (రూ. 30 లక్షలు) కుల్వంత్ (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 51 కోట్లు; వేలానికి రూ. 68.85 కోట్లు; మిగిలింది: 15 లక్షలు పంజాబ్ కింగ్స్శశాంక్ సింగ్ (రూ.5.5 కోట్లు) ప్రభ్‌సిమ్రన్ సంగ్ (రూ.4 కోట్లు) శ్రేయస్ అయ్యర్ (రూ.26.75 కోట్లు) అర్ష్‌దీప్ సింగ్ (రూ.18 కోట్లు) యుజువేంద్ర చహల్ (రూ.18 కోట్లు) స్టొయినిస్ (రూ.11 కోట్లు) మార్కొ జాన్సెన్ (రూ. 7 కోట్లు) నేహల్ వధేరా (రూ.4.20 కోట్లు) మ్యాక్స్‌వెల్ (రూ.4.20 కోట్లు) ప్రియాన్‡్ష ఆర్య (రూ. 3.80 కోట్లు) జోష్ ఇంగ్లిస్ (రూ. 2.60 కోట్లు) అజ్మతుల్లా (రూ. 2.40 కోట్లు) ఫెర్గూసన్ (రూ. 2 కోట్లు) వైశాక్ విజయ్‌కుమార్ (రూ.1.80 కోట్లు) యశ్ ఠాకూర్ (రూ.1.60 కోట్లు) హర్‌ప్రీత్ బ్రార్ (రూ.1.50 కోట్లు) ఆరోన్ హార్డి (రూ. 1.25 కోట్లు) విష్ణు వినోద్ (రూ.95 లక్షలు) జేవియర్ బార్ట్లెట్ (రూ. 80 లక్షలు) కుల్దీప్ సేన్ (రూ. 80 లక్షలు) అవినాశ్ (రూ. 30 లక్షలు) సూర్యాంశ్ షెడ్గే (రూ. 30 లక్షలు) ముషీర్‌ఖాన్ (రూ.30 లక్షలు) హర్నూర్ (రూ.30 లక్షలు) ప్రవీణ్ దూబే (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ.9.50 కోట్లు; వేలానికి రూ. 110.15 కోట్లు; మిగిలింది: రూ. 35 లక్షలు రాజస్తాన్ రాయల్స్యశస్వి జైస్వాల్ (రూ. 18 కోట్లు) సంజూ సామ్సన్ (రూ. 18 కోట్లు) ధ్రువ్ జురేల్ (రూ. 14 కోట్లు) రియాన్ పరాగ్ (రూ. 14 కోట్లు) హెట్‌మైర్ (రూ. 11 కోట్లు) సందీప్‌శర్మ (రూ. 4 కోట్లు) జోఫ్రా ఆర్చర్ (రూ.12.50 కోట్లు) తుషార్ దేశ్‌పాండే (రూ.6.50 కోట్లు) హసరంగ (రూ.5.25 కోట్లు) మహీశ్ తీక్షణ (రూ.4.40 కోట్లు) నితీశ్ రాణా (రూ. 4.20 కోట్లు) ఫజల్హక్ (రూ. 2 కోట్లు) క్వెన మఫాక (రూ. 1.50 కోట్లు) ఆకాశ్ మధ్వాల్ (రూ.1.20 కోట్లు) వైభవ్ సూర్యవంశి (రూ. 1.10 కోట్లు) శుభమ్ దూబే (రూ. 80 లక్షలు) యు«ద్వీర్ చరక్ (రూ. 35 లక్షలు) కుమార్ కార్తికేయ (రూ.30 లక్షలు) అశోక్ శర్మ (రూ. 30 లక్షలు) కునాల్‌సింగ్ (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 79 కోట్లు; వేలానికి రూ. 40.70 కోట్లు; మిగిలింది: రూ. 30 లక్షలు సన్‌రైజర్స్ హైదరాబాద్క్లాసెన్ (రూ. 23 కోట్లు) కమిన్స్ (రూ. 18 కోట్లు) హెడ్ (రూ. 14 కోట్లు) అభిõÙక్ శర్మ (రూ. 14 కోట్లు) నితీశ్ రెడ్డి (రూ. 6 కోట్లు) ఇషాన్ కిషన్ (రూ.11.25 కోట్లు) షమీ (రూ.10 కోట్లు) హర్షల్ పటేల్ (రూ.8 కోట్లు) రాహుల్ చహర్ (రూ.3.20 కోట్లు) అభినవ్ మనోహర్ (రూ.3.20 కోట్లు) రాహుల్ చహర్ (రూ. 3.20 కోట్లు) ఆడమ్ జంపా (రూ.2.40 కోట్లు) సిమర్జీత్ సింగ్ (రూ. 1.50 కోట్లు) ఇషాన్ మలింగ (రూ. 1.20 కోట్లు) బ్రైడన్ కార్స్ (రూ. 1 కోటి) ఉనాద్కట్ (రూ. 1 కోటి) కమిండు మెండిస్ (రూ. 75 లక్షలు) జీషాన్ అన్సారి (రూ. 40 లక్షలు) అనికేత్ వర్మ (రూ. 30 లక్షలు) అథర్వ తైడే (రూ.30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 75 కోట్లు; వేలానికి రూ.44.80 కోట్లు; మిగిలింది: రూ.20 లక్షలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకోహ్లి (రూ. 21 కోట్లు) రాజత్ పటిదార్ (రూ.11 కోట్లు) యశ్ దయాళ్ (రూ. 5 కోట్లు) హాజల్‌వుడ్ (రూ.12.50 కోట్లు) ఫిల్ సాల్ట్ (రూ.11.50 కోట్లు) జితేశ్ శర్మ (రూ.11 కోట్లు) భువనేశ్వర్ (రూ.10.75 కోట్లు) లివింగ్‌స్టోన్ (రూ.8.75 కోట్లు) రసిక్ ధార్ (రూ.6 కోట్లు) కృనాల్ పాండ్యా (రూ. 5.75 కోట్లు) టిమ్ డేవిజ్ (రూ. 3 కోట్లు) జాకబ్ బెథెల్ (రూ. 2.60 కోట్లు) సుయాశ్ శర్మ (రూ.2.60 కోట్లు) పడిక్కల్ (రూ. 2 కోట్లు) తుషార (రూ. 1.60 కోట్లు) రొమరియో (రూ. 1.50 కోట్లు ఇన్‌గిడి (రూ. 1 కోటి) స్వప్నిల్ సింగ్ (రూ.50 లక్షలు) మనోజ్ (రూ. 30 లక్షలు) మోహిత్ రాఠి (రూ. 30 లక్షలు) అభినందన్ (రూ. 30 లక్షలు) స్వస్తిక్ చికార (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 37 కోట్లు; వేలానికి రూ. 82.25 కోట్లు; మిగిలింది: రూ. 75 లక్షలు ముంబై ఇండియన్స్బుమ్రా (రూ. 18 కోట్లు) హార్దిక్ పాండ్యా (రూ.16.35 కోట్లు) సూర్యకుమార్ (రూ. 16.35 కోట్లు) రోహిత్ శర్మ (రూ. 16.30 కోట్లు) తిలక్ వర్మ (రూ. 8 కోట్లు) ట్రెంట్ బౌల్ట్ (రూ.12.50 కోట్లు) దీపక్ చహర్ (రూ. 9.25 కోట్లు) నమన్ ధీర్ (రూ.5.25 కోట్లు) విల్ జాక్స్ (రూ.5.25 కోట్లు) ఘజన్ఫర్ (రూ. 4.80 కోట్లు) సాంట్నర్ (రూ. 2 కోట్లు) రికెల్టన్ (రూ. 1 కోటి) రీస్ టోప్లే (రూ. 75 లక్షలు) లిజాద్ విలియమ్స్ (రూ. 75 లక్షలు) రాబిన్ మిన్జ్ (రూ.65 లక్షలు) కరణ్ శర్మ (రూ.50 లక్షలు) అర్జున్ టెండూల్కర్ (రూ.30 లక్షలు) విఘ్నేశ్ (రూ.30 లక్షలు) సత్యనారాయణ (రూ. 30 లక్షలు) రాజ్ అంగద్ (రూ. 30 లక్షలు) శ్రీజిత్ కృష్ణన్ (రూ. 30 లక్షలు) అశ్వని కుమార్ (రూ. 30 లక్షలు) బెవాన్ జాకబ్స్ (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 75 కోట్లు; వేలానికి రూ. 44.80 లక్షలు; మిగిలింది: రూ. 20 లక్షలులక్నో సూపర్ జెయింట్స్నికోలస్ పూరన్ (రూ.21 కోట్లు) రవి బిష్ణోయ్ (రూ.21 కోట్లు) మయాంక్ యాదవ్ (రూ. 11 కోట్లు) మోసిన్ ఖాన్ (రూ.4 కోట్లు) ఆయుశ్ బదోని (రూ.4 కోట్లు) రిషభ్ పంత్ (రూ.27 కోట్లు) అవేశ్ ఖాన్ (రూ.9.75 కోట్లు) ఆకాశ్‌దీప్ (రూ.8 కోట్లు) మిల్లర్ (రూ.7.50 కోట్లు) అబ్దుల్ సమద్ (రూ.4.20 కోట్లు) మిచెల్ మార్‡్ష (రూ.3.40 కోట్లు) షహబాజ్ అహ్మద్ (రూ. 2.40 కోట్లు) మార్క్రమ్ (రూ.2 కోట్లు) బ్రీట్జ్కే (రూ. 75 లక్షలు) షమర్ జోసెఫ్ (రూ. 75 లక్షలు) సిద్ధార్థ్ (రూ. 75 లక్షలు) యువరాజ్ (రూ. 30 లక్షలు) ప్రిన్స్ యాదవ (రూ. 30 లక్షలు) ఆకాశ్ సింగ్ (రూ. 30 లక్షలు) దిగ్వేశ్ సింగ్ (రూ. 30 లక్షలు) హిమ్మత్ సింగ్ (రూ.30 లక్షలు) ఆర్యన్ జుయల్ (రూ.30 లక్షలు) అర్శిన్ కులకర్ణి (రూ. 30 లక్షలు) హంగార్గేకర్ (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ.51 కోట్లు; వేలానికి రూ. 68.90 కోట్లు; మిగిలింది: రూ. 10 లక్షలు కోల్‌కతా నైట్ రైడర్స్రింకూ సింగ్ (రూ. 13 కోట్లు) నరైన్ (రూ. 12 కోట్లు) రసెల్ (రూ. 12 కోట్లు) వరుణ్ చక్రవర్తి (రూ. 12 కోట్లు) హర్షిత్ రాణా (రూ. 4 కోట్లు) రమణ్‌దీప్ (రూ.4 కోట్లు) వెంకటేశ్ అయ్యర్ (రూ.23.75 కోట్లు) ఆన్రిచ్ నోర్జే (రూ.6.50 కోట్లు) డికాక్ (రూ.3.60 కోట్లు) అంగ్కృష్ (రూ.3 కోట్లు) జాన్సన్ (రూ. 2.80 కోట్లు) గుర్బాజ్ (రూ.2 కోట్లు) మొయిన్ అలీ (రూ. 2 కోట్లు) వైభవ్ అరోరా (రూ.1.80 కోట్లు) రోవ్‌మన్ పావెల్ (రూ.1.50 కోట్లు) రహానే (రూ. 1.50 కోట్లు) మనీశ్ పాండే (రూ. 75 లక్షలు) ఉమ్రన్ మలిక్ (రూ. 75 లక్షలు) అనుకూల్ రాయ్ (రూ. 40 లక్షలు) మయాంక్ మర్కండే (రూ. 30 లక్షలు) లవ్నిత్ సిసోడియా (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ.69 కోట్లు; వేలానికి రూ. 50.95 కోట్లు; మిగిలింది: రూ.5 లక్షలు. -
IPL Auction 2025 : పేస్ బౌలర్లకు పట్టం
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకడు... అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానం... టైటిల్ సహా దశాబ్దకాలం పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషించిన పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వేలంలో ఫ్రాంచైజీలను ఆకర్షించడంలో సఫలమయ్యాడు. రెండో రోజు వేలంలో భువీ (రూ.10 కోట్ల 75 లక్షలు) అత్యధిక ధరతో అగ్ర స్థానంలో నిలిచాడు. భువనేశ్వర్లాగే చెన్నై మూడు ట్రోఫీ విజయాల్లో కీలక బౌలర్‌గా నిలిచిన దీపక్ చహర్‌కు (రూ.9 కోట్ల 25 లక్షలు) భారీ మొత్తం దక్కింది. వీరిద్దరిని వరుసగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు దక్కించుకున్నాయి. ప్రతీ జట్టుకూ భారత పేసర్ల అవసరం ఉండటంతో సోమవారం వేలంలో ఆకాశ్‌దీప్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్‌పాండేలకు మంచి విలువ లభించింది. విదేశీ ఆటగాళ్లలో మార్కో జాన్సెన్, విల్ జాక్స్‌లను ఫ్రాంచైజీలు తగిన మొత్తానికి సొంతం చేసుకున్నాయి. ఆరంభంలో ఆసక్తి చూపించకపోయినా... అజింక్య రహానే, దేవదత్ పడిక్కల్, ఉమ్రాన్ మాలిక్వంటి ఆటగాళ్లను చివర్లో టీమ్‌లు ఎంచుకున్నాయి. రెండో రోజు కూడా ఆస్ట్రేలియా డాషింగ్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు నిరాశ ఎదురవగా... కేన్ విలియమ్సన్, బెయిర్‌స్టో, మిచెల్, శార్దుల్ ఠాకూర్ తదితరులను ఫ్రాంచైజీలు దూరంగా ఉంచాయి. జిద్దా (సౌదీ అరేబియా): ఐపీఎల్–2025 కోసం రెండు రోజుల పాటు సాగిన వేలం సోమవారం ముగిసింది. మొత్తం 577 మంది క్రికెటర్లు వేలంలోకి రాగా... గరిష్టంగా 204 మంది క్రికెటర్లను ఎంచుకునే అవకాశం ఉండగా... 10 ఫ్రాంచైజీలు కలిపి మొత్తం 182 మంది ఆటగాళ్లనే వేలంలో తీసుకున్నాయి. వీరిలో 62 మంది విదేశీయులు కాగా... అన్ని జట్లూ కలిపి వేలంలో రూ.639.15 కోట్లు వెచ్చించాయి. ఐపీఎల్లో అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా బిహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. వేలంలో రాజస్తాన్ రూ.1 కోటీ 10 లక్షలకు ఎంచుకునే సమయానికి వైభవ్ వయసు 13 ఏళ్ల 243 రోజులు మాత్రమే. వైభవ్ ఇప్పటి వరకు 5 రంజీ మ్యాచ్‌లు, ఒక టి20 మ్యాచ్ ఆడాడు. అయితే ఇటీవల భారత అండర్–19 జట్టు సభ్యుడిగా ఆ్రస్టేలియా అండర్ –19 జట్టుతో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. తొలి రోజు వేలం రికార్డులతో హోరెత్తించగా, రెండో రోజు కూడా పేరున్న ఆటగాళ్లకు మంచి మొత్తమే దక్కింది. సోమవారం జాబితాలో పెద్ద సంఖ్యలో యువ ఆటగాళ్లు బరిలో నిలవగా, కొందరిని అదృష్టం తలుపు తట్టింది. జాతీయ జట్టుకు ఆడని అన్క్యాప్డ్ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు చివర్లో కనీస విలువకే తీసుకొని జట్టులో మిగిలిన ఖాళీలను నింపాయి. -
ఐపీఎల్ వేలం 2025 : అదిరే డ్రెస్‌లో నీతా అంబానీ, ధర ఎంతో తెలుసా?
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ ఫ్యాషన్ స్టైల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సమయానికి తగ్గట్టుగా డ్రెస్‌లను ఎంపిక చేసుకోవడంలో, ఫ్యాషన్‌ను, బిజినెస్‌ను మిళితం చేయడంలో నీతా తరువాతే ఎవరైనా అనేది అభిమానుల మాట మాత్రమే కాదు, ఫ్యాషన్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం కూడా. తాజా ఐపీఎల్ -2025 వేలం సందర్భంగా మరోసారి తన స్టైల్‌తో అందర్నీ తనవైపు తిప్పుకుంది. నీతా అంబానీ నేవీ బ్యూ ప్యాంట్‌సూట్ ధరించి అందరినీ ఆకర్షించింది. అంతేకాదు ఆ డ్రెస్ ధర కూడా హాట్ టాపిక్‌గా నిలిచింది. ఐపీఎల్ టీం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఓనర్ అయిన నీతా అంబానీ వైడ్-లెగ్ ప్యాంట్, బ్లూ సూట్లో హుందాగా కనిపించారు. నీతా ధరించిన ‘మజే’ బ్రాండ్‌కు చెందిన ఈ బ్రేజర్ సూట్ ధర అక్షరాలా 950 డాలర్లు. అంటే దాదాపు రూ.78 వేలు. ఇందులో బ్లేజర్ రూ. 47 వేలు కాగా వైడ్-లెగ్ ట్వీడ్ ట్రౌజర్ ధర సుమారు రూ. 31వేలు, మొత్తంగా ఆమె సూట్ ధర రూ.78 వేలు. అంతేనా వజ్రాలు పొదిగిన ఎంఐ బ్రూచ్, హ్యాండ్‌బ్యాగ్, డైమండ్ రింగ్, డైమండ్ చెవిపోగులు, సన్ గ్లాసెస్, వాచ్, హీల్స్ ఇలా అన్నీ ప్రత్యేకంగా కనిపించడం విశేషం. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)nbsp;ఐపీఎల్ మెగా వేలం-2025 తొలి రౌండ్ విడత ప్రక్రియ దుబాయ్‌లోని జెడ్డాలో ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2025 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఇందులో ఎంఐ నలుగురు సూపర్ స్టార్లు రోహిత్ శర్మ,హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాతోపాటు టీమిండియా యంగ్ ప్లేయర్ తిలక్ వర్మకూడా ఉన్నాడు. ముఖ్యంగా తిలక్ వర్మను రూ.8 కోట్లకు దక్కించుకోవడం విశేషంగా నిలిచింది. ఈ వేలంలో నీతా అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ కూడా పాల్గొన్నారు. -
IPL 2025: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. తొలి మ్యాచ్‌కు ముందే కెప్టెన్‌పై నిషేధం
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్ తగిలింది. గత ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయిన్‌టెయిన్ చేసినందుకుగానూ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఓ మ్యాచ్ నిషేధం విధించారు. గత సీజన్లో అదే చివరి మ్యాచ్ కావడంతో ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు ఐపీఎల్ మేనేజ్మెంట్ తెలిపింది. నిషేధంతో పాటు హార్దిక్‌కు రూ. 30 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ పేర్కొంది. తదుపరి మ్యాచ్‌లో హార్దిక్ ఇంపాక్ట్ ప్లేయర్‌గానూ బరిలోకి దిగకూడదు. హార్దిక్‌తో పాటు నాటి మ్యాచ్‌లోని సభ్యులైన ప్రతి ఆటగాడికి రూ. 12 లక్షలు, లేదంటే మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా వర్తిస్తుంది.కాగా, గత సీజన్లో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన హార్దిక్‌ను ముంబై ఇండియన్స్ యాజమాన్యం తదుపరి సీజన్‌కు కూడా కెప్టెన్‌గా కొనసాగించింది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా ఐదుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. తదుపరి సీజన్ కోసం ముంబై రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ ఉన్నారు. ముంబై ఇండియన్స్‌కు ఆర్టీఎం ద్వారా తాము రిలీజ్ చేసిన ఓ ఆటగాడిని తిరిగి దక్కించుకునే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025 మెగా వేలం సౌదీ అరేబియాలోని జెద్దా నగరం వేదికగా నవంబర్ 24, 25 తేదీల్లో జరుగనుంది. కాగా, గత కొన్ని సీజన్లుగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న ముంబై ఇండియన్స్ గత సీజన్‌ను చివరి స్థానంతో ముగించిన విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్ చివరిసారిగా 2020లో టైటిల్ సాధించింది. -
ఇషాన్ కిషన్‌కు కళ్లు చెదిరే ధర.. రూ. 14.5 కోట్లకు వారి సొంతం!
టీమిండియాకు దూరమైన ఇషాన్ కిషన్‌కు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ ఈ ఏడాది కలిసి రాలేదు. ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్-2024లో ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. పద్నాలుగు మ్యాచ్‌లలో కలిపి 320 పరుగులు చేయగలిగాడు. అయితే, మెగా వేలానికి ముందు ముంబై ఫ్రాంఛైజీ మాత్రం అతడిని వదిలేసింది.జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మలతో పాటు యువ క్రికెటర్ తిలక్ వర్మను రీటైన్ చేసుకున్న ముంబై.. ఇషాన్ పేరును మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. నిజానికి 2018లో ముంబై తరఫునే క్యాచ్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్. ఆరంభం నుంచే మెరుగ్గా రాణించిన ఇషాన్ కిషన్ కోసం ఐపీఎల్-2022లో ముంబై భారీ మొత్తం వెచ్చించింది.నాడు రూ. 15.25 కోట్ల ధరకు ముంబై సొంతంనాటి మెగా వేలంలో అతడిని ఏకంగా రూ. 15.25 కోట్ల ధరకు సొంతం చేసుకుంది. కానీ.. అప్పటి నుంచి నేటి దాకా ఇషాన్ కిషన్ అందుకు తగ్గ పైసా వసూల్ ప్రదర్శన మాత్రం ఇవ్వలేకపోయాడు. అంతేకాదు.. దేశవాళీ క్రికెట్ ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించి సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయి.. జాతీయ జట్టుకూ దూరమయ్యాడు.అయితే, ఇటీవలే రంజీల్లో సెంచరీలు చేయడంతో రీ ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్.. భారత్-‘ఎ’ జట్టుకు సెలక్ట్ అయ్యాడు. కానీ.. ఆస్ట్రేలియా గడ్డపై కంగారూ జట్టుతో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల నడుమ ఇషాన్ కిషన్ ఐపీఎల్-2025 మెగా వేలంలోకి రాబోతున్నాడు.వికెట్ కీపర్ కోటాలో కళ్లు చెదిరే మొత్తంఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిర్వహించిన ‘మాక్ వేలం’లో మాత్రం ఇషాన్ కిషన్ భారీ ధర పలకడం విశేషం. మెగా వేలంలో ఇషాన్ రూ. 2 కోట్ల కనీస ధరతో పేరును నమోదు చేసుకున్నాడు. అయితే, అశ్విన్ మాత్రం తన వేలంలో.. వికెట్ కీపర్ కోటాలో ఇషాన్ కోసం బిడ్ వేసే ఫ్రాంఛైజీలు రూ. 5 కోట్ల నుంచి మొదలుపెట్టాలని సూచించాడు.ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ. 5 కోట్లకు బిడ్ వేయగా.. క్రమక్రమంగా ఇషాన్ ధర రూ. 10 కోట్లకు పెంచింది. దీంతో పంజాబ్ కింగ్స్ రేసు నుంచి తప్పుకోగా.. లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం వికెట్ కీపర్ కోసం ఏకంగా రూ. 14.5 కోట్లు వెచ్చించి దక్కించుకుంది.ఏకంగా రూ. 21 కోట్ల మొత్తానికి అతడు ఉన్నా కూడాఅయితే, అశ్విన్ నిర్వహించిన ఈ మాక్వేలంలో ఇషాన్ కిషన్‌కు కళ్లు చెదిరే మొత్తం దక్కడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫామ్‌లో లేని ఇషాన్ కోసం.. మెగా వేలంలో ఏ ఫ్రాంఛైజీ అంతగా ఆసక్తి చూపదని.. మహా అయితే, అతడికి రూ. ఐదు కోట్లు దక్కవచ్చని క్రికెట్ ప్రేమికులు అంటున్నారు.అంతేకాదు.. లక్నో ఇప్పటికే వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్‌ను ఏకంగా రూ. 21 కోట్ల మొత్తానికి అట్టిపెట్టుకుంది. అలాంటిది.. ఇషాన్‌ను ఆ ఫ్రాంఛైజీ కొనుక్కోవడం ఏమిటంటూ అశూ మాక్ వేలంలో లక్నో తరఫున పాల్గొన్న అభిమానులను ట్రోల్ చేస్తున్నారు. కాగా సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా నవంబరు 24, 25 తేదీల్లో మెగా వేలం జరుగనుంది.చదవండి: BGT 2024: టీమిండియాకు గుడ్‌న్యూస్ -
హ్యాట్రిక్ తీసిన బౌలర్‌నే వదిలేసిన ముంబై ఇండియన్స్
మహిళల ఐపీఎల్ (WPL) 2025 సీజన్ వేలానికి ముందు ఐదు ఫ్రాంచైజీలు (ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్) ఇవాళ రిటెన్షన్ జాబితాలను విడుదల చేశాయి. దాదాపుగా అన్ని ఫ్రాంచైజీలు నలుగురి నుంచి ఆరుగురిని వేలానికి వదిలేసి మిగతా ప్లేయర్లను అలాగే అట్టిపెట్టుకున్నాయి. డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ సైతం నలుగురిని వేలానికి వదిలేసి, 14 మంది ప్లేయర్లను రీటైన్ చేసుకుంది. ముంబై ఇండియన్స్ వదిలేసిన ప్లేయర్స్‌లో ముగ్గురు భారత అన్క్యాప్డ్ ప్లేయర్లు కాగా.. ఓ విదేశీ స్టార్ ప్లేయర్ ఉంది. వచ్చే సీజన్ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ ఇంగ్లండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ ఇస్సీ వాంగ్‌ను అనూహ్యంగా వేలానికి వదిలేసింది. 22 ఏళ్ల ఇస్సీ డబ్ల్యూపీఎల్ డెబ్యూ సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున హ్యాట్రిక్ తీసింది. మహిళల ఐపీఎల్లో హ్యాట్రిక్ తీసిన తొలి క్రికెటర్ ఇస్సీనే కావడం విశేషం. 2023 సీజన్లో యూపీ వారియర్జ్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఇస్సీ ఈ ఘనత సాధించింది. హ్యాట్రిక్ తీయడంతో పాటు తొలి సీజన్లో ఓ వెలుగు వెలిగిన ఇస్సీ 2024 సీజన్లో మరో స్టార్ విదేశీ పేసర్ (షబ్నిమ్ ఇస్మాయిల్) రావడంతో మరుగున పడిపోయింది. షబ్నిమ్ ఎంట్రీతో ఇస్సీకి అవకాశాలు కరువయ్యాయి. షబ్నిమ్ అద్భుతమైన ప్రదర్శనలతో రాణించడంతో ఈ ఏడాది వేలానికి ముందు ఇస్సీని వదిలేసింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం. తుది జట్టులో నలుగురు విదేశీ ప్లేయర్లకు మాత్రమే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎంఐ మేనేజ్మెంట్ ఇస్సీని వదులుకోక తప్పలేదు. ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఇస్సీతో పాటు స్వదేశీ అన్క్యాప్డ్ ప్లేయర్లు ప్రియాంక బాలా, హుమైరా ఖాజీ, ఫాతిమా జాఫర్లను కూడా వేలానికి వదిలేసింది. ముంబై ఇండియన్స్ ఈసారి కూడా హర్మన్‌ప్రీత్‌ను కెప్టెన్‌గా కొనసాగించింది. ఎంఐ రీటైన్ చేసుకున్న ప్లేయర్స్‌లో యస్తికా భాటియా, అమెలియా కెర్, క్లో టైరాన్, హేలీ మాథ్యూస్, నాట్ సీవర్ బ్రంట్, పూజా వస్త్రాకర్, షబ్నిమ్ ఇస్మాయిల్ లాంటి స్వదేశీ, విదేశీ స్టార్లు ఉన్నారు. వేలంలో పాల్గొనేందుకు ముంబై ఇండియన్స్ పర్స్‌లో ఇంకా 2.65 కోట్ల బ్యాలెన్స్ ఉంది. ఈ మొత్తంతో ముంబై ఇండియన్స్ మరో నలుగురు ప్లేయర్స్‌ను కొనుగోలు చేయవచ్చు. డబ్ల్యూపీఎల్ రూల్స్ ప్రకారం ఒక్కో ఫ్రాంచైజీ గరిష్ఠంగా 18 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకోవచ్చన్న విషయం తెలిసిందే. ఇందులో ఆరుగురు విదేశీ ప్లేయర్స్‌కు అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే, తొలి సీజన్లో అద్భుత ప్రదర్శనతో ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్.. రెండో సీజన్లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఓటమిపాలైంది. ఈ సీజన్లో ముంబైని ఇంటికి పంపించిన ఆర్సీబీనే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది.ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ వీళ్లే..హార్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), యస్తికా భాటియా, అమెలియా కెర్, క్లో టైరాన్, హేలీ మాథ్యూస్, జింటిమణి కలిత, నాట్ సీవర్ బ్రంట్, పూజా వస్త్రాకర్, సంజీవన్ సంజనా, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాఖీ, అమన్‌జోత్ కౌర్, అమన్‌దీప్ కౌర్, కీర్తనముంబై ఇండియన్స్ వదిలేసిన ప్లేయర్స్ వీళ్లే..ప్రియాంక బాలా, హుమైరా ఖాజీ, ఫాతిమా జాఫర్, ఇస్సీ వాంగ్ -
IPL 2025: ఇషాన్ కాదు.. వాళ్లిద్దరికోసం ముంబై పోటీ.. వాషీ కూడా రేసులోనే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2025 మెగా వేలానికి ముహూర్తం ఖరారైంది. సౌదీ అరేబియాలోని జిద్దా నగరంలో నవంబరు 24, 25 తేదీల్లో వేలంపాట నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అందరి కళ్లు టీమిండియా స్టార్లపైనే ఉన్నాయి.రేసులో భారత స్టార్లురిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ సహా రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్ తదితర సీనియర్ ప్లేయర్లు కూడా రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి ముంబై ఇండియన్స్ భారత స్పిన్నర్లను దక్కించుకునేందుకు ఇతర ఫ్రాంఛైజీలతో కచ్చితంగా పోటీపడుతుందని అభిప్రాయపడ్డాడు.పాలసీ పరిపూర్ణంగా ఉపయోగించుకునికాగా ఈసారి రిటెన్షన్ విధానాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకున్న జట్టు ముంబై ఇండియన్స్ అని చెప్పవచ్చు. నిబంధనలకు అనుగుణంగా ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లను అట్టిపెట్టుకుంది. జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మలను కొనసాగించాలని నిర్ణయించుకుంది.ఇక వీళ్లందరికి ఖర్చు పెట్టింది పోనూ.. ముంబై పర్సులో ఇంకా రూ. 45 కోట్లు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘ముంబై బ్యాటింగ్ ఆర్డర్ మరోసారి పటిష్టంగానే కనిపిస్తోంది. అయితే, వాళ్ల రిటెన్షన్ లిస్టులో బుమ్రా రూపంలో ఒకే ఒక స్పెషలిస్టు బౌలర్ ఉన్నాడు.కాబట్టి వారికి ఇప్పుడు బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. నిజానికి ముంబై 225- 250 పరుగులు స్కోరు చేయగల సామర్థ్యం కలిగిన జట్టు. అయితే, అదే స్థాయిలో పరుగులు కూడా సమర్పించుకున్న సందర్భాలు ఉన్నాయి.బ్యాటింగ్ పైనే ఎక్కువగా ఏదేమైనా వాళ్లు బ్యాటింగ్ పైనే ఎక్కువగా ఆధారపడతారన్నది వాస్తవం. కానీ ప్రతిసారీ ఇదే టెక్నిక్ పనికిరాదు. వాళ్ల జట్టులో ఉంటే ఇండియన్ బ్యాటింగ్ లైనప్.. విదేశీ బౌలింగ్ లైనప్ ఉంటుంది. ఇప్పుడు వారికి ఇద్దరు స్పిన్నర్ల అవసరం కూడా ఉంది. అందుకే కచ్చితంగా వాళ్లు యుజీ చహల్ వెనుకపడటం ఖాయం.ఇషాన్ కాదుఒకవేళ అతడిని దక్కించుకోలేకపోతే.. ముంబై ఇండియన్స్ వాషింగ్టన్ సుందర్నైనా సొంతం చేసుకుంటుంది’’ అని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా ఇషాన్ కిషన్ పేరును కూడా ప్రస్తావించిన ఆకాశ్ చోప్రా.. అతడిని ముంబై కొనుగోలు చేసే అవకాశం లేదని అభిప్రాయపడ్డాడు. వికెట్ కీపర్ కోటాలో ఇషాన్‌ను పరిగణించినా.. క్వింటన్ డికాక్ లేదంటే జితేశ్ శర్మ వైపు మొగ్గు చూపుతుందని అంచనా వేశాడు. చదవండి: Aus vs Pak: ఆసీస్‌కు కొత్త కెప్టెన్ -
ముంబై టాప్-3 లిస్టులో దక్కని చోటు.. రోహిత్ ఏమన్నాడంటే..!
-
IPL 2025: మన లీడర్.. మన కెప్టెన్.. రీటైన్ను సంపూర్ణంగా వాడుకుంది ఎవరు?
గత మూడేళ్లుగా పేలవ ఆట తీరుతో వెనుకబడ్డ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను తన అద్భుత కెప్టెన్సీతో ఈసారి టైటిల్ రేసులో నిలిపాడు ప్యాట్ కమిన్స్. ఆస్ట్రేలియాకు వన్డే వరల్డ్‌కప్ అందించిన సారథిగా నీరాజనాలు అందుకున్న ఈ ఫాస్ట్ బౌలర్.. ఫ్రాంఛైజీ తనకు చెల్లించిన రూ. 20.50 కోట్లకు పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడు.సహచర ఆటగాళ్లతో మమేమకమవుతూ సరైన సమయంలో అవకాశాలు ఇచ్చి జట్టును ఫైనల్‌కు తీసుకువెళ్లాడు. తద్వారా ఆరెంజ్ ఆర్మీకి ఇష్టమైన కెప్టెన్‌గా మారిపోయాడు. కానీ.. జాతీయ జట్టు విధుల దృష్ట్యా ఈసారి కమిన్స్ అసలు ఐపీఎల్ ఆడతాడా? కెప్టెన్‌గా కొనసాగుతాడా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, రిటెన్షన్ లిస్టు విడుదల సందర్భంగా సన్‌రైజర్స్ ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేసింది.మన లీడర్.. మన కెప్టెన్వచ్చే ఏడాది కూడా ప్యాటీనే రైజర్స్‌ను ముందుకు నడిపించబోతున్నాడని..ఫ్రాంఛైజీ అధికారికంగా ప్రకటించింది. ‘‘మన లీడర్.. మన కెప్టెన్... ప్యాటీ కమిన్స్ మిమ్మల్ని ఉప్పల్‌లో మరోసారి కలిసేందుకు సిద్ధంగా ఉన్నాడు’’ అంటూ ఆరెంజ్ ఆర్మీకి శుభవార్త అందించింది. ఇక ఈ ఏడాది పరుగుల విధ్వంసంతో రికార్డులు తిరగరాసిన సన్‌రైజర్స్.. రిటెన్షన్ల విషయంలోనూ దూకుడుగా వ్యవహరించింది. హార్డ్ హిట్టర్ హెన్రిక్ క్లాసెన్ కోసం ఏకంగా రూ. 23 కోట్లు ఖర్చు చేసింది. ఆ జట్లు వదిలేశాయిఇదిలా ఉంటే.. ఇతర ఫ్రాంఛైజీలలో కోల్‌కతా, ఢిల్లీ, లక్నో, పంజాబ్, బెంగళూరు తమ కెప్టెన్లను వేలంలోకి వదిలివేయగా.. చెన్నై, ముంబై, గుజరాత్, రాజస్తాన్ మాత్రం తమ సారథులను కొనసాగించాయి. దీంతో ఈసారి ఈసారి ఐపీఎల్ వేలం ఆసక్తికరంగా సాగడం ఖాయం.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం ఈనెల నెలాఖరున జరగనుండగా... రీటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్ నిర్వాహకులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో కొందరు ఆటగాళ్లు అనూహ్యంగా కోట్లు కొల్లగొట్టగా... మరికొందరు స్టార్ ప్లేయర్లు ఫ్రాంచైజీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. అధిక ధర వీరికేఅందరికంటే అత్యధికంగా దక్షిణాఫ్రికా ‘హార్డ్ హిట్టర్’ హెన్రిచ్ క్లాసెన్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ రూ. 23 కోట్లు కేటాయించగా... విరాట్ కోహ్లీకి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు... నికోలస్ పూరన్‌కు లక్నో సూపర్ జెయింట్స్ రూ.21 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకున్నాయి. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టుకు సారథ్యం వహించిన హార్దిక్ పాండ్యా... ఇక మీదట కూడా నాయకుడిగా కొనసాగడం ఖాయం కాగా... ముంబై మొత్తంగా ఐదుగురు ప్రధాన ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. మేటి పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు అత్యధికంగా రూ. 18 కోట్లు కేటాయించిన ఫ్రాంచైజీ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలకు చెరో రూ. 16 కోట్ల 35 లక్షలు వెచ్చించింది.ఇక ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మకు రూ. 16 కోట్ల 30 లక్షలు కేటాయించింది. హైదరాబాద్ ఆటగాడు ఠాకూర్ తిలక్ వర్మకు రూ.8 కోట్లు ఇచ్చి ముంబై తమ వద్దే పెట్టుకుంది. రీటైన్ను సంపూర్ణంగా వాడుకుంది ఎవరంటే?ఆటగాళ్ల కొనుగోలు కోసం ఒక్కో జట్టు రూ.120 కోట్లు ఖర్చు చేసుకునే అవకాశం ఉండగా... అందులో రూ. 75 కోట్లు రిటెన్షన్‌కు కేటాయించారు. తాజా జాబితాను చూస్తే ముంబై ఇండియన్స్ జట్టు రీటైన్ను సంపూర్ణంగా వాడుకోగా... అత్యల్పంగా పంజాబ్ కింగ్స్ జట్టు కేవలం ఇద్దరు ప్లేయర్లనే అట్టి పెట్టుకుంది. పంజాబ్ మరీ ఇద్దరినేపంజాబ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆ్రస్టేలియా దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ వ్యూహాల్లో భాగంగా... కేవలం ఇద్దరు ‘అన్క్యాప్డ్’ ప్లేయర్లను మాత్రమే రీటైన్ చేసుకున్న పంజాబ్ వద్ద వేలం కోసం అత్యధికంగా రూ. 110.5 కోట్లు మిగిలి ఉన్నాయి. ఈ ఏడాది జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ వేలానికి వదిలేయగా... తొమ్మిదేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో కొనసాగుతున్న రిషబ్ పంత్‌ను ఫ్రాంచైజీ వదిలేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం కేఎల్ రాహుల్‌పై నమ్మకం ఉంచలేదు. రింకూ సింగ్‌కు జాక్‌పాట్.. ధోనీ ‘అన్క్యాప్డ్’ ప్లేయర్చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధోనీ సహా మొత్తం ఐదుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకోగా... రాజస్తాన్ రాయల్స్ కూడా ఆరుగురు ప్లేయర్లను రీటైన్ చేసుకుంది. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 16 కోట్ల 50 లక్షలు కేటాయించగా... సిక్సర్ల వీరుడు రింకూ సింగ్‌కు కోల్‌కతా రూ.13 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకుంది. వెస్టిండీస్ ద్వయం రసెల్, నరైన్‌తో పాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి తలా రూ. 12 కోట్లు కేటాయించింది. కోల్‌కతా వదిలేసుకున్న శ్రేయస్ అయ్యర్ కోసం వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడటం ఖాయమే కాగా... సారథి కోసం చూస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పంత్‌పై కన్నేసే అవకాశాలు ఉన్నాయి. బేబీ మలింగకు రూ. 13 కోట్లుజాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఐదేళ్లు దాటిపోయిన ధోనీని ఐపీఎల్ నిబంధనల ప్రకారం ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ కోటాలో రీటైన్ చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ... మాజీ సారథికి రూ.4 కోట్లు కేటాయించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు చెరో రూ. 18 కోట్లు వెచ్చించింది. శ్రీలంక పేసర్ పతిరణకు రూ. 13 కోట్లు, పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబేను రూ.12 కోట్లకు అట్టిపెట్టుకుంది. రాజస్తాన్ రైట్రైట్రిటైనింగ్లో మొత్తం ఆరు అవకాశాలను వాడుకున్న రాజస్తాన్ రాయల్స్... సంజూ సామ్సన్, యశస్వి జైస్వాల్‌కు చెరో రూ.18 కోట్లు కేటాయించింది. రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్‌కు చెరో రూ. 14 కోట్లు వెచ్చించింది.పూరన్ కోసం అంత అవసరమా?కేఎల్ రాహుల్‌ను వేలానికి వదిలేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నిలకడగా ఆడతాడో లేదో తెలియని వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ కోసం రూ. 21 కోట్లు కేటాయించింది. గాయాలతో సహవాసం చేసే సూపర్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్, స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కు రూ. 11 కోట్లు కేటాయించిన లక్నో... మొహసిన్ ఖాన్, ఆయుష్ బదోనీలకు చెరో రూ. 4 కోట్లు వెచ్చించింది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు రూ.18 కోట్లు కేటాయించిన గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ... కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను రూ. 16 కోట్ల 50 లక్షలకు అట్టిపెట్టుకుంది. వేలానికి రానున్న ప్రధాన ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్, చాహల్, అశ్విన్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, షమీ (భారత్). వార్నర్, మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, మిచెల్ స్టార్క్, స్టొయినిస్ ఆస్ట్రేలియా). బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్, స్యామ్ కరన్, బట్లర్, ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్). డుప్లెసిస్, డేవిడ్ మిల్లర్, క్వింటన్ డికాక్, నోర్జే (దక్షిణాఫ్రికా). కాన్వే, రచిన్ రవీంద్ర, బౌల్ట్ (న్యూజిలాండ్). చదవండి: Ind vs Pak: భారత బ్యాటర్ల విధ్వంసం.. అయినా పాక్ చేతిలో తప్పని ఓటమి -
IPL 2025: నాకు ఇదే కరెక్ట్.. ముంబై రిటెన్షన్ లిస్టుపై రోహిత్ కామెంట్స్
టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) భవితవ్యం విషయంలో అందరి అంచనాలు తలకిందులయ్యాయి. మెజారిటీ మంది విశ్లేషకులు, కామెంటేటర్లు చెప్పినట్లుగా ‘హిట్‌మ్యాన్’ ముంబై ఇండియన్స్‌ను వీడలేదు. కెరీర్ ఆరంభం నుంచి తనకు అండగా నిలబడ్డ ఫ్రాంఛైజీతో కొనసాగేందుకే అతడు మొగ్గుచూపాడు. రోహిత్ అభిమానులకు కూడా ఇది ఒకరకంగా షాకిచ్చిందనే చెప్పవచ్చు.కాగా ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ విడుదల చేసిన రిటెన్షన్ జాబితాలో రోహిత్ శర్మకు చోటు దక్కిన విషయం తెలిసిందే. అయితే, టాప్-3లో మాత్రం అతడికి స్థానం ఇవ్వలేదు ముంబై. తమ ప్రాధాన్య ఆటగాళ్లలో రోహిత్‌ను నాలుగో ప్లేయర్‌గా అట్టిపెట్టుకుంది. దీంతో మరోసారి అతడి ఫ్యాన్స్ ఫ్రాంఛైజీపై మండిపడుతున్నారు.అందుకే వారికి పెద్దపీటఈ నేపథ్యంలో తాను నాలుగో ప్లేయర్‌గా ఉండటంపై రోహిత్ శర్మ స్పందించాడు. అంతర్జాతీయ టీ20ల నుంచి తాను రిటైర్ అయిన కారణంగా తనకు అదే సరైన స్థానమంటూ.. ఫ్రాంఛైజీ నిర్ణయాన్ని సమర్థించాడు. జాతీయ జట్టుకు ఆడుతున్న క్రికెటర్లకే మొదటి ప్రాధాన్యం దక్కుతుందని.. అందుకే ఫ్రాంఛైజీ వాళ్లకు పెద్దపీట వేసిందని చెప్పుకొచ్చాడు.ఇది సరైన నిర్ణయమని తానూ నమ్ముతున్నానన్న రోహిత్.. కోరుకున్న ఆటగాళ్లను వేలంలోకి వదిలేసి మళ్లీ కొనుక్కోవడం కష్టమని పేర్కొన్నాడు. ఇక గత రెండు- మూడేళ్లుగా తమ జట్టు స్థాయికి తగ్గట్లుగా రాణించలేకోయిందని.. ఈసారి మాత్రం పొరపాట్లు పునరావృతం కానివ్వమని చెప్పాడు. ముంబై ఇండియన్స్‌కు ఘనమైన చరిత్రముంబై తరఫున తాను చాలా ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నానని.. సహచర ఆటగాళ్లతో సమన్వయం చేసుకుంటూ జట్టును మెరుగైన స్థితిలో నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపాడు.ట్రోఫీలు గెలవడంలో ముంబై ఇండియన్స్‌కు ఘనమైన చరిత్ర ఉందన్న రోహిత్ శర్మ... క్లిష్ట పరిస్థితుల్లోనూ పోరాటపటిమ కనబరిచి గెలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నాడు. కాగా అంబానీల సారథ్యంలోని ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మ జట్టును ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు.అనూహ్య రీతిలో రోహిత్‌పై వేటుతద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లో ఈ ఘనత సాధించిన తొలి సారథిగా చరిత్రకెక్కాడు. అయితే, ఈ ఏడాది అనూహ్య రీతిలో ముంబై కెప్టెన్‌గా రోహిత్‌ను తప్పించి.. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాను నియమించింది. గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్‌ను ట్రేడ్ చేసుకుని మరీ జట్టు పగ్గాలు అప్పగించింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ అభిమానులు ఫ్రాంఛైజీతో పాటు హార్దిక్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.ఈ ఏడాది అట్టడుగున ముంబైరోహిత్ సైతం చాలాసార్లు మైదానంలోనే తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు కనిపించింది. జట్టు రెండు వర్గాలుగా విడిపోయిందన్న వార్తలకు బలం చేకూరుస్తూ ముంబై ఇండియన్స్ ఐపీఎల్-2024లో వరుస ఓటములు చవిచూసింది. పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ నాలుగే గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో రోహిత్ ముంబైని వీడతాడని.. ముంబై సైతం అతడిని విడిచిపెడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఈ చర్చలకు ఫ్రాంఛైజీ గురువారం చెక్ పెట్టింది. వేలానికి ముందు తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్లలో రోహిత్ ఉన్నట్లు ప్రకటించింది. ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు1. జస్ప్రీత్ బుమ్రా(టీమిండియా ప్రధాన పేసర్)- రూ. 18 కోట్లు2. సూర్యకుమార్ యాదవ్(టీమిండియా టీ20 కొత్త కెప్టెన్)- రూ. 16.35 కోట్లు3. హార్దిక్ పాండ్యా(టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్)- రూ. 16.35 కోట్లు4. రోహిత్ శర్మ(టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్)- రూ. రూ. 16.30 కోట్లు5.తిలక్ వర్మ(టీమిండియా రైజింగ్ స్టార్)- రూ. 8 కోట్లు.వరల్డ్‌కప్ జట్టులోటీమిండియాకు టీ20 ప్రపంచకప్-2024 అందించిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ తన పదవి నుంచి వైదొలగడంతో పాటు అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. ఇక ముంబై తాజాగా రిటైన్ చేసుకున్న బుమ్రా, హార్దిక్, సూర్య అతడి సారథ్యంలోని విన్నింగ్ టీమ్‌లో సభ్యులే.చదవండి: ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితా విడుదల View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians) -
ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా వరల్డ్‌కప్ విన్నర్
ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ పేసర్ పరాస్ మాంబ్రే నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఎంఐ యాజమాన్యం ఇవాళ (అక్టోబర్ 16) అధికారికంగా ప్రకటించింది. మాంబ్రే గతంలో ముంబై ఇండియన్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా పని చేశాడు. మాంబ్రే ప్రస్తుత ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ లసిత్ మలింగతో కలిసి పని చేస్తాడు. ముంబై ఇండియన్స్ యాజమాన్యం కొద్ది రోజుల కిందటే తమ హెడ్ కోచ్ మార్క్ బౌచర్‌పై వేటు వేసి పాత కోచ్ మహేళ జయవర్దనేను తిరిగి నియమించుకుంది. బౌచర్ ఆథ్వర్యంలో ముంబై ఇండియన్స్ గత రెండు సీజన్లలో పేలవ ప్రదర్శన కనబర్చింది. ఈ కారణంగా ఎంఐ యాజమాన్యం అతన్ని తప్పించింది. మాంబ్రే విషయానికొస్తే.. ఇతను 2024 టీ20 ప్రపంచకప్ సాధించిన భారత జట్టుకు బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు. మాంబ్రే ఆథ్వర్యంలో (వరల్డ్‌కప్‌లో) భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. మాంబ్రే అసిస్టెంట్ కోచ్‌గా ఉన్నప్పుడు ముంబై ఇండియన్స్ 2013 సీజన్ టైటిల్‌ను నెగ్గింది. అలాగే 2011, 2013 ఛాంపియన్స్ లీగ్‌ను కూడా కైవసం చేసుకుంది. మాంబ్రే టీమిండియా తరఫున 1996-1998 మధ్యలో రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు ఆడాడు. మాంబ్రే దేశవాలీ క్రికెట్లో ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ 284 ఫస్ట్ క్లాస్ వికెట్లు, 111 లిస్ట్-ఏ వికెట్లు పడగొట్టాడు. ముంబై ఇండియన్స్ గత ఐపీఎల్ సీజన్లో చిట్టచివరి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. గత సీజన్లో ఈ జట్టు హార్దిక్ పాండ్యా నేతృత్వంలో 14 మ్యాచ్‌లు ఆడి కేవలం నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. చదవండి: రెండో స్థానానికి ఎగబాకిన బ్రూక్.. టాప్ ప్లేస్‌ను సుస్థిరం చేసుకున్న రూట్ -
IPL 2025: ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా మహేళ జయవర్దనే
ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా మహేళ జయవర్దనే మళ్లీ నియమితుడయ్యాడు. జయవర్దనే 2017 నుంచి 2022 వరకు ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా పని చేశాడు. 2017, 2019, 2020 ఎడిషన్లలో టైటిళ్లు అందించాడు. అనంతరం జయవర్దనే ముంబై ఇండియన్స్ గ్లోబల్ హెడ్ ఆఫ్ ద క్రికెట్‌గా నియమితుడయ్యాడు. తిరిగి అతను 2025 ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.జయవర్దనే ప్రస్తుత హెడ్ కోచ్ మార్క్ బౌచర్ నుంచి బాధ్యతలు స్వీకరించనున్నాడు. బౌచర్ 2023, 2024 ఎడిషన్లలో ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా పని చేశాడు. బౌచర్ ఆథ్వర్యంలో ఎంఐ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. నూతన హెడ్ కోచ్‌గా జయవర్దనే నియామకాన్ని ఎంఐ ఫ్రాంచైజీ ఓనర్ ఆకాశ్ అంబానీ స్వాగతించారు. జయవర్దనే నాయకత్వ లక్షణాలు, క్రికెట్ పరిజ్ఞానం ముంబై ఇండియన్స్‌కు లబ్ది చేకూరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదే సందర్భంగా ఆకాశ్ మార్క్ బౌచర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. గత రెండు సీజన్లలో అతను అందించిన సేవలకు గాను కృతజ్ఞతలు తెలిపారు. ముంబై ఇండియన్స్ ఫ్యామిలీలో బౌచర్ సభ్యుడిగా కొనసాగుతడని పేర్కొన్నాడు.బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రే..టీ20 వరల్డ్ కప్-2024లో టీమిండియాను విజేతగా నిలపడంతో కీలక పాత్ర పోషించిన బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే తిరిగి ముంబై ఇండియన్స్ గూటికి చేరనున్నాడు. మాంబ్రే ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. టీ20 వరల్డ్ కప్ ముగిసిన అనంతరం టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ రాజస్థాన్ రాయల్స్‌తో చేరిన సంగతి తెలిసిందే. ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ ఇంకా టీమిండియాతోనే కొనసాగుతున్నాడు.చదవండి: ఇంగ్లండ్‌తో చివరి రెండు టెస్ట్‌లు.. సీనియర్లపై వేటు -
ఐపీఎల్లో ఆ జట్టుకు కెప్టెన్‌గా సూర్య?.. స్పందించిన ‘స్కై’
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో విజయాలే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇరు జట్ల మధ్య ఆదివారం(అక్టోబరు 6) గ్వాలియర్ వేదికగా తొలి టీ20కి షెడ్యూల్ ఖరారైంది.అది సానుకూలాంశమేఈ నేపథ్యంలో టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ శనివారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా.. జట్టులో కనీసం రెండు ఓవర్లు బౌలింగ్ చేయగల బ్యాటర్లు ఉండటం సానుకూలాంశమని తెలిపాడు. శ్రీలంక పర్యటనలోనూ ఈ తరహా ప్రయోగం చేశామని.. ఆటగాళ్లలో ఉన్న భిన్న నైపుణ్యాలను ఉపయోగించుకోవడంలో తప్పులేదన్నాడు. అందుకే బ్యాటర్ల చేతికీ బంతిని ఇచ్చేందుకు వెనుకాడమని తెలిపాడు.రోహిత్ భాయ్ కెప్టెన్సీలో ఆడుతున్నపుడు కూడాఈ క్రమంలో సూర్యకుమార్ ఐపీఎల్ భవితవ్యం, ఫ్రాంఛైజీ క్రికెట్ కెప్టెన్సీ గురించి విలేఖరులు ప్రశ్నించారు. ఇందుకు బదులిస్తూ.. ‘‘మీరు నన్ను ఇరుకున పెట్టేశారు(నవ్వుతూ). ప్రస్తుతం టీమిండియా కెప్టెన్‌గా ఉండటాన్ని ఆస్వాదిస్తున్నా. ముంబై ఇండియన్స్‌లో రోహిత్ భాయ్ కెప్టెన్సీలో ఆడుతున్నపుడు కూడా.. అవసరమైనపుడు సలహాలు ఇచ్చేవాడిని. మీకే తెలుస్తుందిఇక టీమిండియా విషయానికొస్తే.. ఇటీవల శ్రీలంకతో పాటు.. గతంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో సిరీస్‌లలోనూ నేను కెప్టెన్‌గా వ్యవహరించాను. జట్టును ఎలా ముందుకు నడిపించాలో ఇతర కెప్టెన్లను చూసి నేర్చుకోవడానికి సందేహించను.జీవితం ఇలా ముందుకు సాగుతోంది. కాలం గడుస్తున్న కొద్దీ ఏం జరుగబోతుందో మీకే తెలుస్తుంది’’ అని సూర్యకుమార్ యాదవ్ తన ఐపీఎల్ కెప్టెన్సీ అంశంపై సంకేతాలు ఇచ్చాడు. కాగా సుదీర్ఘకాలంగా సూర్య ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నాడు.పాండ్యా సారథ్యంలో ముంబైకి ఘోర పరాభవంకాగా ముంబై ఫ్రాంఛైజీ అనూహ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జట్టును ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి.. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. అయితే, పాండ్యా సారథ్యంలో ముంబై ఘోర పరాభవం చవిచూసింది. ముంబై ఇండియన్స్ సారథిగా సూర్య?ఈ ఏడాది పాయింట్ల పట్టికలో అట్టడగున పదో స్థానంలో నిలిచింది. ఇక ఇదే జట్టులో ఉన్న సూర్య గతంలో అతడి గైర్హాజరీలో కెప్టెన్‌గా వ్యవహరించాడు. అంతేకాదు.. టీమిండియా టీ20 జట్టు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను రీప్లేస్ చేశాడు. దీంతో ముంబై ఇండియన్స్ జట్టులోనూ ఇదే తరహా మార్పు జరుగనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సూర్య వ్యాఖ్యలు కూడా వాటికి కాస్త ఊతమిచ్చేలాగానే ఉన్నాయి.చదవండి: అరంగేట్రంలోనే దుమ్ములేపిన సెహ్వాగ్ కుమారుడు -
రోహిత్, కిషన్‌కు నో ఛాన్స్.. ముంబై రిటెన్షన్ లిస్ట్ ఇదే!
ఐపీఎల్-2025 మెగా వేలానికి సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ రూల్స్‌ను బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి మొత్తం ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అవకాశం ఇచ్చింది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) ఆప్షన్ ఉంది. అదేవిధంగా ప్రతీ ఫ్రాంచైజీ పర్స్ వాల్యూను రూ.120 కోట్లకు పెంచారు. గతంలో ఈ పర్స్ విలువ రూ.90 కోట్లు ఉండేది. ఇక అట్టిపెట్టుకున్న అయిదుగురి కోసం ఓ ఫ్రాంఛైజీ రూ.75 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అట్టిపెట్టుకున్న మొదటి ఆటగాడికి రూ.18 కోట్లు, రెండో ఆటగాడికి రూ.14 కోట్లు, మూడో ఆటగాడికి రూ.11 కోట్లు ఫ్రాంఛైజీ చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రెండు రిటెన్షన్లకు తిరిగి వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు వెచ్చించాలి. ఇక రిటెన్షన్‌కు సంబంధించి విధి విధానాలు ఖారారు కావడంతో ఆయా ఫ్రాంచైజీలు తమ అంటిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సిద్దం చేసే పనిలో పడ్డాయి.రోహిత్, కిషన్‌కు నో ఛాన్స్!ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తమ ప్లేయర్ల రిటెన్షన్ లిస్ట్‌ను ఫైనలైజ్ చేసినట్లు చేసినట్లు తెలుస్తోంది. ఆ జట్టు స్టార్ ప్లేయర్, కెప్టెన్‌గా 5 ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మను వదులుకోవడానికి ముంబై ఇండియన్స్ సిద్దమైనట్లు తెలుస్తోంది.ఈ ఏడాది సీజన్‌కు ముందు హిట్‌మ్యాన్‌ను తమ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు ముంబై యాజమాన్యం బాధ్యతలు అప్పగించింది. అప్పటినుంచే ముంబైతో రోహిత్ తెగిపోయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రోహిత్ కూడా ఆ ఫ్రాంచైజీని నుంచి బయటకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాడంట. అతడితో పాటు స్టార్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌ను కూడా విడిచిపెట్టాలని ముంబై నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత రెండు సీజన్ల నుంచి కిషన్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఈ క్రమంలోనే అతడిని వేలంలోకి విడిచిపెట్టన్నట్లు వినికిడి.రిటెన్షన్ ఆటగాళ్లు వీరే? కెప్టెన్ హార్దిక్ పాండ్యా(రూ.18 కోట్లు), స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(రూ.14 కోట్లు), యువ ఆటగాడు తిలక్ వర్మ(రూ.11 కోట్లు)లను ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకోవాలని భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. వీరితో పాటు ఆన్క్యాప్డ్ ప్లేయర్లగా నమాన్ ధీర్(రూ. 4 కోట్లు), ఆకాశ్ మధ్వాల్(రూ. 4కోట్లు) అంటిపెట్టుకోవాలని ముంబై యోచిస్తున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ ఏడాది డిసెంబర్లో మెగా వేలం జరిగే అవకాశముంది.చదవండి: అశ్విన్ వారసుడు దొరికినట్లేనా? -
IPL 2025: ‘ఆర్సీబీ రోహిత్ శర్మను కొని.. కెప్టెన్ చేయాలి’
ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గనుక వేలంలోకి వస్తే.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అతడిని కొనుగోలు చేయాలని సూచించాడు. అంతేకాదు.. హిట్‌మ్యాన్‌ను ఆర్సీబీ తమ సారథిగా నియమిస్తే.. ట్రోఫీ గెలవాలన్న చిరకాల కల నెరవేరుతుందన్నాడు.కాగా 2008లో ఆరంభమైన ఐపీఎల్లో రోహిత్ శర్మ తొలుత దక్కన్ చార్జర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. రెండో ఎడిషన్‌లో టైటిల్ గెలిచిన చార్జర్స్‌లో అతడు సభ్యుడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ రోహిత్‌ను కొనుగోలు చేసి.. జట్టు పగ్గాలు అప్పగించింది. ఈ క్రమంలో తన కెప్టెన్సీ నైపుణాల్యతో ముంబైని ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు.తొలి కెప్టెన్‌గా రోహిత్ రికార్డుతద్వారా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. అయితే, ఈ ఏడాది ముంబై ఇండియన్స్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. రోహిత్ శర్మపై వేటు వేసి.. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాను తమ కెప్టెన్‌గా నియమించుకుంది.ఈ క్రమంలో అసంతృప్తికి లోనైన రోహిత్ శర్మ జట్టును వీడాలని నిర్ణయించుకున్నాడని.. ముంబై ఫ్రాంఛైజీతో అతడి బంధం ముగిసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ మాట్లాడుతూ.. ‘‘రోహిత్ వేలంలోకి వస్తే ఆర్సీబీ.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.టైటిల్ కరువు తీరుతుందిఅంతేకాదు.. రోహిత్‌ను ఒప్పించి తమ కెప్టెన్‌గా నియమించుకోవాలి. బ్యాటర్‌గా రోహిత్ మరీ మునుపటిలా పరుగులు రాబట్టలేకపోవచ్చు. ఫార్టీ, ఫిఫ్టీస్ మాత్రం చేయగలడు. అయితే, కెప్టెన్‌గా తుదిజట్టు కూర్పును మాత్రం చక్కగా సెట్ చేస్తాడు. అతడి వల్ల ఆర్సీబీకి లాభం చేకూరుతుంది.టైటిల్ కరువు తీరుతుంది. ఏ ఆటగాడి సేవలను ఎప్పుడు ఎలా వాడుకోవాలో రోహిత్‌కు బాగా తెలుసు. కెప్టెన్‌గా తన ప్రణాళికలు, వ్యూహాలు అమోఘం. ఒకవేళ ఆర్సీబీకి గనుక అవకాశం దొరికితే.. రోహిత్ శర్మను కొని, కెప్టెన్ చేసుకుని తీరాల్సిందే’’ అని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా.. రోహిత్ ఐపీఎల్లో కొనసాగితే ఏదైనా ఒక జట్టుకు కెప్టెన్‌గా మాత్రమే ఉండాలని పేర్కొన్నాడు.మూడుసార్లు ఫైనల్ చేరిన ఆర్సీబీకాగా ఇప్పటి వరకు మూడుసార్లు ఫైనల్ చేరిన ఆర్సీబీ.. ఆఖరి గండాన్ని మాత్రం దాటలేకపోయింది. 2009లో దక్కన్ చార్జర్స్, 2011లో చెన్నై సూపర్ కింగ్స్, 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడి టైటిల్ మిస్ చేసుకుంది. ఇక టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి చాలాకాలం పాటు ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఆటగాడిగా అతడు బెంగళూరు ఫ్రాంఛైజీతోనే కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం విదితమే.చదవండి: అరంగేట్రం చేసిన నాలుగేళ్లకే పాక్ క్రికెటర్ రిటైర్మెంట్.. కానీ ఓ ట్విస్ట్! -
ధోని కంటే రోహిత్ బెటర్ కెప్టెన్: భారత స్పిన్ దిగ్గజం
మహేంద్ర సింగ్ ధోని.. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్. అతడి సారథ్యంలో భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011, చాంపియన్స్ ట్రోఫీ-2013 గెలిచింది. ఇక ఫ్రాంఛైజీ క్రికెట్లోనూ ఈ జార్ఖండ్ డైనమైట్.. 2008లో మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆది నుంచి చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే)కు ఆడుతున్నాడు. సారథిగా సీఎస్కేను ఏకంగా ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్‌గా నిలిపాడు. మరోవైపు.. రోహిత శర్మ.. టీమిండియా ప్రస్తుత కెప్టెన్. ఇటీవలే టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీ గెలిచాడు. ఇక ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు సుదీర్ఘకాలం పాటు కెప్టెన్‌గా ఉండి.. ధోని కంటే ముందుగానే ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన సారథిగా చరిత్రకెక్కాడు.ధోని కంటే రోహిత్ బెటర్ కెప్టెన్‌కాగా టీమిండియాలో ఇద్దరితో కలిసి, ఐపీఎల్లో ఈ ఇద్దరి కెప్టెన్సీలోనూ ఆడాడు టీమిండియా దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. ఈ నేపథ్యంలో ఇద్దరి నాయకత్వ శైలిని పోలుస్తూ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని కంటే రోహిత్ బెటర్ కెప్టెన్ అని తన మనసులోని మాట బయటపెట్టాడు. అందుకు గల కారణాన్ని వెల్లడిస్తూ..ధోని ఎవరితో మాట్లాడడు‘‘ఇద్దరిలో ఎవరు బెటర్ అంటే.. నేను ధోనిని కాదని రోహిత్ వైపే మొగ్గుచూపుతాను. ఎందుంకటే రోహిత్ ప్లేయర్స్ కెప్టెన్. ప్రతి ఒక్క ఆటగాడి దగ్గరికి వెళ్లి వాళ్లకు ఏం కావాలో అడిగి తెలుసుకుంటాడు. సహచరులతో అతడికి మంచి అనుబంధం ఉంటుంది.అయితే, ధోని కెప్టెన్సీ స్టైల్ వేరుగా ఉంటుంది. అతడు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. తన మౌనం ద్వారానే ఎదుటివారికి తన మనసులోని మాట చేరాలని భావిస్తాడు. ఇతరులతో ధోని సంభాషించే విధానం ఇలాగే ఉంటుంది’’ అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. రోహిత్ శర్మకు స్నేహితులే తప్ప.. అతడికి విరుద్ధంగా మాట్లాడేవారు ఒక్కరూ ఉండరని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. స్పోర్ట్స్ యారీ ఇంటర్వ్యూలో భజ్జీ ఈ వ్యాఖ్యలు చేశాడు.చదవండి: Babar Azam: బాబర్ ఆజం సంచలన నిర్ణయం..Rohit Sharma is a better captain than MS Dhoni says Harbhajan Singh Full podcast at 9pm tonight, only on Sports Yaari YouTube Channel 🇮🇳pic.twitter.com/6tVAdJh6qx— Sushant Mehta (@SushantNMehta) October 2, 2024 -
శ్రేయస్ అయ్యర్‌కు షాక్.. కేకేఆర్ కెప్టెన్‌గా సూర్యకుమార్!?
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు అన్ని ఫ్రాంచైజీలు కీలక మార్పులు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న మెగా వేలం కోసం ఆయా జట్లు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి.ఇప్పటికే ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ గుడ్‌బై చెప్పనున్నాడనే ప్రచారం జోరుగా సాగుతుండగా.. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కోతా నైట్‌రైడర్స్‌కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఐపీఎల్-2024లో తమ జట్టును ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను కేకేఆర్ యాజమాన్యం విడిచిపెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కేకేఆర్ కెప్టెన్‌గా సూర్యకుమార్..?గౌతం గంభీర్ తర్వాత కేకేఆర్‌కు టైటిల్ అందించిన రెండో కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. అయితే మెంటార్‌గా పనిచేసిన గౌతం గంభీర్.. ఇప్పుడు భారత ప్రధాన కోచ్ బాధ్యతలు చేపట్టడంతో తమ కెప్టెన్ కూడా మార్చాలని కేకేఆర్ భావిస్తున్నట్లు వినికిడి.ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను ట్రేడింగ్ ద్వారా సొంతం చేసుకోవాలని కేకేఆర్ యోచిస్తున్నట్లు సమాచారం. అందుకు బదులుగా కేకేఆర్ అయ్యర్‌ను ముంబైకి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇరు ఫ్రాంచైజీల మధ్య డీల్ కుదిరినట్లు సమాచారం. సూర్యకు అయ్యర్ స్ధానంలో తమ జట్టు పగ్గాలని అప్పగించాలని కేకేఆర్ ప్లాన్ చేస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అదేవిధంగా గంభీర్ స్ధానంలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మెంటార్ బాధ్యతలు చేపట్టనున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.చదవండి: AUS vs ENG: లివింగ్ స్టోన్ ఊచకోత.. ఆసీస్‌పై ఇంగ్లండ్‌పై ఘన విజయం -
రోహిత్ ముంబై ఇండియన్స్‌తోనే కొనసాగాలి.. ఎందుకంటే?
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి గుడ్‌బై చెప్పనున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. కొంతమంది రోహిత్ శర్మ లక్నో సూపర్ జెయింట్స్‌కు వెళ్లనున్నాడని, మరి కొంతమంది ఢిల్లీ ఫ్రాంచైజీతో జతకట్టనున్నాడని చెప్పుకుంటూ వస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై మాజీ ఆటగాడు ప్రజ్ఞాన్ ఓజా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌లోనే కొనసాగాలని ఓజా తెలిపాడు. కాగా హిట్‌మ్యాన్‌తో ఓజా మంచి అనుబంధం ఉంది. ఐపీఎల్లో ఓజా.. రోహిత్లో కలిసి నాలుగేళ్ల పాటు ముంబై ప్రాంఛైజీకి ప్రాతినిథ్యం వహించారు."ముంబై ఇండియన్స్‌తో రోహిత్‌కు మంచి అనుబంధం ఉంది. ముంబై ఫ్రాంచైజీలో రోహిత్ చాలా కాలం నుంచి అంతర్భాగంగా ఉన్నాడు. వారికి ఐదు టైటల్స్‌ను అందించాడు. రోహిత్‌ని వదిలివేయడం వారికి సులభమో కాదో నాకు తెలియదు.కానీ రోహిత్‌కి మాత్రం చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. నాకు తెలిసినంతవరకు రోహిత్ కూడా ముంబై ఫ్రాంచైజీని విడిచిపెట్టాలని అనుకోడు. ఒకవేళ అదే జరిగితే కఠిన నిర్ణయమనే చెప్పవచ్చు. నా వరకు అయితే ముంబై ఇండియన్స్‌లో రోహిత్ కొనసాగితేనే బెటర్. అతడు ఈ స్థాయికి ఎదగడంలో ముంబై ఇండియన్స్ పాత్ర కూడా ఉంది. అందుకే అతడు ముంబై ఫ్రాంచైజీలోనే కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఇది ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నమెంట్, కొన్ని సార్లు ఏదైనా జరగవచ్చు" అని ఇన్సైడ్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓజా పేర్కొన్నాడు.చదవండి: టెస్టుల్లో రీఎంట్రీ ఇవ్వనున్న హార్దిక్ పాండ్యా ..? -
’ముంబై ఇండియన్స్‌తో రోహిత్ ప్రయాణం ముగిసినట్టే’
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ భవితవ్యం గురించి భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీతో హిట్‌మ్యాన్ ప్రయాణం ముగిసినట్లేనని.. అతడు ఈసారి మెగా వేలంలోకి వచ్చే అవకాశం ఉందన్నాడు. లేనిపక్షంలో.. ట్రేడింగ్ ద్వారానైనా వేరే ఫ్రాంఛైజీకి బదిలీ కావొచ్చని అభిప్రాయపడ్డాడు.ఐదుసార్లు ట్రోఫీ అందించిఐపీఎల్లో ఓ జట్టును అత్యధిక సార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత రోహిత్ శర్మ సొంతం. అతడి సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఏకంగా ఐదుసార్లు ట్రోఫీ గెలిచింది. ఐపీఎల్- 2013, 2015, 2017, 2019, 2020 ఎడిషన్లలో టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఒడిదుడుకులు ఎదురైనా గతేడాది ప్లే ఆఫ్స్ చేరి సత్తా చాటింది.రోహిత్‌ను తప్పించి పాండ్యాకు పగ్గాలుఅయినప్పటికీ ఐపీఎల్-2024 సీజన్లో ముంబై ఇండియన్స్ తన కెప్టెన్‌ను మార్చింది. దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మను కాదని.. గుజరాత్ టైటాన్స్‌ను చాంపియన్‌గా నిలిపిన హార్దిక్ పాండ్యాను భారీ మొత్తానికి ట్రేడ్ చేసుకుని సారథిగా నియమించింది. దీంతో రోహిత్‌ను అవమానించిన జట్టుకు మేము మద్దతుగా నిలవబోమంటూ అభిమానులు ముంబై ఫ్రాంఛైజీతో పాటు పాండ్యాను పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.దారుణ ఫలితంఈ క్రమంలో ఒత్తిడిలో చిత్తైన పాండ్యా సారథ్యంలో ఐపీఎల్-2024లో ముంబై దారుణ ఫలితం చవిచూసింది. పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగు గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఇదిలా ఉంటే.. అంబానీల యాజమాన్యంలోని ముంబై జట్టుతో రోహిత్‌కు సుదీర్ఘ అనుబంధం ఉన్నప్పటికీ.. తనను అవమానకరరీతిలో కెప్టెన్సీ తప్పించారని అతడు భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.ముంబై జట్టుతో రోహిత్ ప్రయాణం ముగిసిందిఈ నేపథ్యంలో ఐపీఎల్-2025 మెగా వేలం సందర్భంగా రోహిత్ ముంబైని వీడనున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ పరిణామాల ఆధారంగా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘రోహిత్ ముంబై ఇండియన్స్‌లో కొనసాగుతాడా లేదా? అన్నది ప్రశ్నార్థకం. అయితే, నా అభిప్రాయం ప్రకారం అతడు ఇక ఆ ఫ్రాంఛైజీతో ఉండడు.అతడేమీ ధోని కాదుఎందుకంటే.. మహేంద్ర సింగ్ ధోని- చెన్నై సూపర్ కింగ్స్ మాదిరి ముంబై- రోహిత్ మధ్య అలాంటి అనుబంధం లేదనిపిస్తోంది. అందుకే రోహిత్ బయటకు రావడం ఖాయమని చెప్పవచ్చు. ముంబై సైతం అతడిని రిటైన్ చేసుకోకపోవచ్చు. కాబట్టి రోహిత్ ట్రేడ్ విండో ద్వారా లేదంటే మెగా వేలంలోకి రావడం ద్వారా వేరే జట్టుకు మారే అవకాశం ఉంది. నాకు తెలిసినంత వరకు ముంబై ఇండియన్స్‌తో రోహిత్ ప్రయాణం ముగిసింది’’ అని పేర్కొన్నాడు. విభేదాలు వచ్చిన తర్వాత కలిసి ప్రయాణించడం కుదరబోదని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.ధోని-చెన్నై అనుబంధం వేరుకాగా రోహిత్ మాదిరే టీమిండియా దిగ్గజ కెప్టెన్ ధోని సైతం చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు. 2008 నుంచి అదే ఫ్రాంఛైజీలో కొనసాగుతున్న తలా... ఈ ఏడాది తానే స్వయంగా కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. రుతురాజ్ గైక్వాడ్‌కు చెన్నై జట్టు పగ్గాలు అప్పగించాడు. అంతేకాదు వేలం దగ్గర నుంచి తుదిజట్టు ఎంపిక దాకా చెన్నై ఫ్రాంఛైజీ ధోనికి పూర్తి స్వేచ్ఛనిస్తుందని ఇప్పటికే పలుమార్లు రుజువైంది. ఈ నేపథ్యంలోనే రోహిత్ పరిస్థితి ఇందుకు భిన్నమని ఆకాశ్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు.చదవండి: DT 2024: భారత ‘ఎ’ జట్టులోషేక్ రషీద్.. టీమిండియాతో చేరని సర్ఫరాజ్ ఖాన్! -
మొదటిరోజు హార్దిక్- రోహిత్ మాట్లాడుకోలేదు.. ఆ తర్వాత
‘‘టీమిండియా ప్రాక్టీస్ చేసిన మొదటిరోజు నేను నెట్స్ వద్దకు వెళ్లాను. అప్పుడు హార్దిక్- రోహిత్ దూరదూరంగా ఉండటం గమనించాను. నిజానికి ఆరోజు వారు మాట్లాడుకోలేదు. అయితే, రెండో రోజు నుంచి మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వాళ్లిద్దరు ఒకరికొకరు చేరువగా వచ్చారు.ఓ మూలన కూర్చుని మాట్లాడుకుంటూ కనిపించారు. నిజానికి అక్కడ కెమెరా కూడా లేదు. వాళ్లిద్దరినీ అలా చూసి నేను నమ్మలేకపోయాను. జట్టు ప్రయోజనాల కోసం ఆటగాళ్లు తమ మధ్య విభేదాలు ఉన్నా వాటిని పక్కనపెట్టి కలిసికట్టుగా ముందుకు సాగుతారని అప్పుడే నాకు కళ్లకు కట్టినట్లయింది.ఆ తర్వాత మూడు రోజుల పాటు రోహిత్, హార్దిక్ కలిసే బ్యాటింగ్ చేశారు. హార్దిక్ బ్యాటింగ్, బౌలింగ్ చేస్తున్నపుడు రోహిత్ దగ్గరుండి పర్యవేక్షించాడు. వారిని అలా చూస్తే ముచ్చటేసింది’’ అంటూ స్పోర్ట్స్ జర్నలిస్టు విమల్ కుమార్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ- స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అనుబంధం గురించి తెలిపాడు.కారణం అతడేటీ20 ప్రపంచకప్-2024 సమయంలో రోహిత్- హార్దిక్ కలిసిపోయి మునుపటిలా ఉండటానికి హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ కారణమని పేర్కొన్నాడు. ఈ విషయంలో ఆయనకే క్రెడిట్ ఇవ్వాలని.. ద్రవిడ్ చొరవ వల్లే డ్రెస్సింగ్ రూం వాతావరణం అంత చక్కగా ఉందన్నాడు. టీమిండియా ఆటగాళ్ల మధ్య విభేదాలంటూ వచ్చే వార్తలు నిజం కావని వారిని దగ్గరగా చూసిన తర్వాతే తనకు అర్థమైందన్నాడు విమల్ కుమార్. టూ స్లాగర్స్ అనే యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.అందుకే విభేదాలు?ఐపీఎల్-2024కు ముందు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించిన ముంబై ఇండియన్స్.. ఆ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించింది. దీంతో హిట్‌మ్యాన్ అభిమానులు తీవ్రస్థాయిలో హార్దిక్‌పై మండిపడ్డారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. మరోవైపు.. హార్దిక్ సైతం మైదానంలో రోహిత్ ఫీల్డింగ్ పొజిషన్‌ను పదే పదే మారుస్తూ కాస్త అతి చేశాడు. ఈ క్రమంలో రోహిత్ కూడా హార్దిక్ తీరు పట్ల అసంతృప్తికి గురైనట్లు వార్తలు వచ్చాయి.కలిసిపోయారుఈ నేపథ్యంలో తాజా సీజన్లో ముంబై దారుణంగా ఓడిపోవడంతో ఆటగాళ్ల మధ్య సఖ్యత లోపించడమే ఇందుకు కారణమనే విమర్శలు వచ్చాయి. అయితే, టీ20 ప్రపంచకప్-2024లో సీన్ మారింది. రోహిత్ కెప్టెన్‌గా.. హార్దిక్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలిచింది. దాదాపు పదకొండేళ్ల విరామం తర్వాత మరోసారి ఐసీసీ టైటిల్ సాధించింది. ఇందులో రోహిత్‌తో పాటు ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాత్ర కూడా కీలకం. ఇక అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరిగిన ఈ ఈవెంట్లో టీమిండియాతో పాటే ఉన్న విమల్ కుమార్ తాజాగా రోహిత్- హార్దిక్ జట్టు కోసం కలిసిపోయారంటూ పాజిటివ్ కామెంట్స్ చేశాడు. -
‘రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌తోనే ఉంటాడు’
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2025 మెగా వేలం నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. హిట్‌మ్యాన్ ముంబై ఇండియన్స్‌ను వీడతాడా? లేదంటే అదే ఫ్రాంఛైజీతో కొనసాగుతాడా? అంటూ క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో అభిమానులు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ రోహిత్ ముంబై జట్టుతో బంధం తెంచుకుంటాడని గట్టిగా వాదిస్తున్నారు.ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ తన పూర్వపు జట్టుతోనే ప్రయాణం కొనసాగిస్తాడని అంచనా వేశాడు. ఒక దశకు చేరుకున్న తర్వాత.. రోహిత్ వంటి ఆటగాళ్లు డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వరంటూ తనదైన శైలిలో కామెంట్స్ చేశాడు. ఈ మేరకు యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ రోహిత్ ఇలా ఆలోచిస్తే తప్పేం ఉంది?నేను సంతోషంగా ఈ జట్టుతోనే ఉంటాను అనుకుంటే..‘నాకు కొత్తగా ఎలాంటి తలనొప్పులు వద్దు. నేను టీమిండియా కెప్టెన్‌గా ఉన్నాను. ముంబై ఇండియన్స్ జట్టుకు ఎన్నో ఏళ్లు సారథ్యం వహించాను. ఒకవేళ ఇప్పుడు నేను కెప్టెన్ కాకపోయినంతమాత్రాన ఏం మారుతుంది? నేను సంతోషంగా ఈ జట్టుతోనే ఉంటాను’ అని రోహిత్ భావించవచ్చు. తారస్థాయికి చేరిన తర్వాత కొంతమందికి డబ్బుకు అంతగా ప్రాధాన్యం ఇవ్వరు’’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.రోహిత్‌ను తప్పించి.. హార్దిక్‌కు పగ్గాలుకాగా ముంబై ఇండియన్స్‌ను ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత రోహిత్ శర్మది. 2011లో ముంబై ఇండియన్స్‌లో చేరిన ఈ ముంబై బ్యాటర్.. 2013లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. 2023 వరకు సారథిగా కొనసాగాడు. అయితే, ఈ ఏడాది వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేసుకున్న ముంబై ఇండియన్స్.. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించింది. అతడి స్థానంలో హార్దిక్‌కు పగ్గాలు అప్పగించింది.ఈ నేపథ్యంలో రోహిత్‌కు- ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి విభేదాలు వచ్చాయని.. అతడు వచ్చే ఏడాది జట్టును వీడబోతున్నాడనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో అశూ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గెలవాలన్న దాహం తీరదుఅయితే, ఇటీవల క్రీడా పురస్కారాల వేడుకకు హాజరైన రోహిత్ శర్మ.. తనలో ట్రోఫీలు గెలవాలనే దాహం ఇంకా తీరలేదన్నాడు.. ఒక్కసారి గెలుపు రుచి చూసిన వాళ్లు అంత తేలికగా సవాళ్లకు తలొగ్గరని.. ముందుకు సాగుతూనే ఉంటారని పేర్కొన్నాడు. కాగా ఐదు ఐపీఎల్ టైటిల్స్‌తో పాటు టీ20 ప్రపంచకప్(2024) ట్రోఫీ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు హిట్‌మ్యాన్.చదవండి: టీమిండియా పాకిస్తాన్‌కు రాబోతోంది.. జై షానే కారణం: పాక్ మాజీ కెప్టెన్ -
‘రోహిత్ వేలంలోకి వస్తే.. మేమూ పోటీలో ఉంటాం’
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 వేలంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ముంబై ఇండియన్స్‌తో సుదీర్ఘ బంధాన్ని తెంచుకునేందుకు హిట్‌మ్యాన్ సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ గనుక వేలంలోకి వస్తే దక్కించుకునేందుకు మూడు ఫ్రాంఛైజీలు సిద్ధంగా ఉన్నట్లు ఐపీఎల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.ఈ జాబితాలో పంజాబ్ కింగ్స్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పంజాబ్ ఫ్రాంఛైజీ క్రికెట్ డెవలప్మెంట్ హెడ్ సంజయ్ బంగర్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి. కాగా ఐపీఎల్లో ఓ జట్టును అత్యధికసార్లు చాంపియన్‌గా నిలిపిన మొదటి కెప్టెన్‌గా రోహిత్ శర్మ తన పేరును చరిత్రపుటల్లో లిఖించుకున్నాడు.ముంబై యాజమాన్యంతో విభేదాలు?ముంబై జట్టుకు ఏకంగా ఐదుసార్లు ట్రోఫీ అందించి ఈ ఘనత సాధించాడు. అయితే, గతేడాది ముంబై ఫ్రాంఛైజీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. కెప్టెన్‌గా రోహిత్‌పై వేటు వేసి.. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. గుజరాత్ టైటాన్స్ నుంచి భారీ ధరకు హార్దిక్‌ను ట్రేడ్ చేసుకుని మరీ కెప్టెన్‌గా నియమించింది.ఈ క్రమంలో ముంబై యాజమాన్యం- రోహిత్ మధ్య విభేదాలు ఉన్నాయనే సంకేతాలు వెలువడ్డాయి. ఇక మైదానంలో రోహిత్ పట్ల హార్దిక్ వ్యవహరించిన తీరు కూడా విమర్శలు తావిచ్చింది. ఈ నేపథ్యంలో ముంబై జట్టును వీడేందుకు రోహిత్ శర్మ నిర్ణయించుకున్నాడని ఐపీఎల్ వర్గాలు లీకులు ఇచ్చాయి. అతడు గనుక వేలంలోకి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ పోటీపడనున్నాయని వెల్లడించాయి.తగినంత డబ్బు ఉంటే కొనుక్కుంటాంఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్‌కు చెందిన సంజయ్ బంగర్ ఓ యూట్యూబ్ చానెల్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ రోహిత్ గనుక వేలంలోకి వస్తే మాత్రం.. అతడు భారీ ధరకు అమ్ముడుపోవడం ఖాయం. అయితే, మా పర్సులో ఎంత డబ్బు ఉందనే అంశం మీదే అంతా ఆధారపడి ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. తమ దగ్గర తగినంత డబ్బు ఉంటే రోహిత్ శర్మను కచ్చితంగా సొంతం చేసుకుంటామని చెప్పకనే చెప్పాడు.సుదీర్ఘ అనుబంధంకాగా తొలుత దక్కన్ చార్జర్స్ హైదరాబాద్‌కు ఆడిన రోహిత్ శర్మ.. 2011లో ముంబై ఇండియన్స్‌లో చేరాడు. ఆ తర్వాత రెండేళ్లకు రిక్కీ పాంటింగ్ స్థానంలో ముంబై కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుంచి పదేళ్లపాటు సారథిగా కొనసాగిన రోహిత్ ప్రయాణానికి హార్దిక్ రాకతో ఈ ఏడాది తెరపడింది. అయితే, ఇదే ఏడాది టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీని రోహిత్ గెలవడం విశేషం. ఈ నేపథ్యంలో ముంబై అతడిని రిటైన్ చేసుకుంటుందా? ఒకవేళ ఆ ఆఫర్ ఇచ్చినా రోహిత్ శర్మ అందుకు సమ్మతిస్తాడా? అన్న సందేహాలకు వేలానికి ముందే సమాధానం దొరకనుంది. చదవండి: రిటైర్మెంట్ తర్వాత.. అభిమానులకు శుభవార్త చెప్పిన ధావన్ -
IPL 2025: రోహిత్ శర్మకు రూ.50 కోట్లు..!?
ఐపీఎల్-2025 మెగా వేలానికి ఆయా ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే తమ ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నాయి. ఎవరని రీటైన్ చేసుకోవాలి, ఎవరని వేలంలో విడిచిపెట్టాలన్న అన్న అంశాలపై ఫ్రాంచైజీలు కసరత్తులు మొదలు పెట్టాయి. అయితే ఈసారి మెగా వేలంలో టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ మాజీ సారథి రోహిత్ శర్మపై కాసుల వర్షం కురువనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని రోహిత్ శర్మ విడిచిపెట్టనున్నట్లు సమాచారం. కాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ యాజమాన్యం తమ జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తప్పించి స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించింది.అప్పటి నుంచి ముంబై ఫ్రాంచైజీ మెనెజ్‌మెంట్ రోహిత్ ఆసంతృప్తితో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ నుంచి బయటకు రావాలని హిట్‌మ్యాన్ నిర్ణయించుకున్నట్లు వినికిడి.రూ. 50 కోట్లు అయినా ఓకే!ఇక రోహిత్ శర్మ వేలంలోకి వస్తే ఎలాగైనా అతడిని దక్కించుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ కాచుకొని ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెవ్ స్పోర్ట్స్‌కు చెందిన రోహిత్ జుగ్లన్ విశ్లేషణ ప్రకారం.. వేలానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్ హిట్‌మ్యాన్ ఏకంగా రూ.50 కోట్లు దాచి పెట్టుకున్నట్లు తెలుస్తోంది.అతడికి తమ జట్టు పగ్గాలను అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు లక్నో ఫ్రాంచైజీ కూడా రోహిత్ కోసం రూ. 50 కోట్లు వెచ్చించడానికి సిద్దంగా ఉందంట. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన రికార్డ్ ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉంది. ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలంలో అతన్ని రూ. 24.75 కోట్ల భారీ ధరకు కేకేఆర్ సొంతం చేసుకుంది. ఐపీఎల్-2025 మెగా వేలం ఈ ఏడాది డిసెంబర్లో జరిగే ఛాన్స్ ఉంది. -
హార్దిక్ పాండ్యాకు షాక్!.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా సూర్యకుమార్?
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కీలక మార్పులు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తమ జట్టు కెప్టెన్, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ముంబై ఫ్రాంచైజీ విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకుని మరి తమ జట్టు పగ్గాలను ముంబై మెనెజ్‌మెంట్ హార్దిక్‌కు అప్పగించింది. రోహిత్ శర్మ స్ధానంలో ముంబై కెప్టెన్‌గా బాధ్యతలు చేపపట్టిన హార్దిక్.. తన మార్క్‌ను చూపించలేకపోయాడు.అతడి సారథ్యంలో దారుణ ప్రదర్శరన కనబరిచిన ముంబై కనీసం లీగ్ స్టేజిని కూడా దాటలేకపోయింది. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించింది. ఆటగాడిగా కూడా పాండ్యా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అతడిని రిటైన్ చేసుకోకూడదని ముంబై నిర్ణయించుకున్నట్లు వినికిడి. అతడి స్ధానంలో సూర్యకుమార్ యాదవ్‌ను తమ జట్టు కెప్టెన్‌గా నియమించాలని ముంబై ఫ్రాంచైజీ యోచిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. సూర్యకుమార్ యాదవ్ ఇటీవలే భారత టీ20 జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. హార్దిక్ పాండ్యాను కాదని రోహిత్ శర్మ వారసుడిగా సూర్యను బీసీసీఐ ఎంపిక చేసింది. శ్రీలంక టీ20 సిరీస్‌తో భారత జట్టు కెప్టెన్‌గా సూర్య తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. కెప్టెన్‌గా తన తొలి సిరీస్‌లోనే సూర్య ఆకట్టుకున్నాడు. లంకతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 3-0 క్లీన్ స్వీప్ చేసింది. -
IPL 2025: రోహిత్ శర్మ కోసం ఆ జట్ల మధ్య పోటీ!
కెప్టెన్‌గా ఐదు ట్రోఫీలు.. ఓవరాల్‌గా 6628 పరుగులు... ఇందులో రెండు సెంచరీలు.. 43 హాఫ్ సెంచరీలు.. 599 ఫోర్లు.. 280 సిక్సర్లు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ ట్రాక్ రికార్డ్ ఇది. దక్కన్ చార్జర్స్ ద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టిన ఈ ముంబై బ్యాటర్.. తర్వాత ముంబై ఇండియన్స్‌కు మారాడు.తన అద్భుతమైన ఆట తీరుతో హిట్‌మ్యాన్‌గా ఎదిగి.. భారత జట్టు సారథిగానూ పగ్గాలు చేపట్టాడు. అయితే, గత రెండేళ్లుగా ముంబై ఇండియన్స్‌తో అతడి అనుబంధం బీటలు వారిందనే వార్తలు వచ్చాయి. గతేడాది రోహిత్‌ను కెప్టెన్‌గా తొలగించి.. అతడి స్థానంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పగించడంతో వీటికి బలం చేకూరింది.ఈ క్రమంలో వచ్చే ఏడాది రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌ను వీడతాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే.. ఐపీఎల్-2025 మెగా వేలంలో.. ఈ టీ20 వరల్డ్‌ప్ విన్నింగ్ కెప్టెన్‌ను దక్కంచుకునేందుకు ఫ్రాంఛైజీలు పోటీపడటం ఖాయం.ముఖ్యంగా మూడు జట్లు ఇప్పటి నుంచే రోహిత్‌పై కన్నేసినట్లు ఐపీఎల్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఆ జట్టు ఏవి? వాటికి రోహిత్ అవసరం ఎంత?!లక్నో సూపర్ జెయింట్స్అరంగేట్ర సీజన్ 2022లో లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ చేరి సత్తా చాటింది. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలోని ఈ జట్టు 2023లోనూ మూడో స్థానంలో నిలిచింది. అయితే, ఈ ఏడాది మాత్రం దారుణంగా విఫలమైంది.పద్నాలుగింట కేవలం ఏడు మ్యాచ్‌లు గెలిచి.. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంతో సీజన్‌ను ముగించింది. ఈ క్రమంలో ఫ్రాంఛైజీ, కెప్టెన్ రాహుల్ మధ్య విభేదాలు తలెత్తాయని.. రాహుల్ ఆర్సీబీ వైపు చూస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి.ఒవకేళ అదే జరిగితే లక్నో కెప్టెన్‌తో పాటు.. ఓపెనర్‌నూ కోల్పోతుంది. ఆ స్థానాన్ని భర్తీ చేయగల బెస్ట్ ఆప్షన్ రోహిత్ శర్మనే అవుతాడు మరి!ఢిల్లీ క్యాపిటల్స్‌ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం జట్టును ప్రక్షాళన చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హెడ్ కోచ్‌గా రిక్కీ పాంటింగ్‌ను తొలగించింది. అంతేకాదు కెప్టెన్ రిషభ్ పంత్‌ను కూడా రిలీజ్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.ఈ నేపథ్యంలో పంత్.. చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరబోతున్నాడనే ప్రచారం ఊపందుకుంది. ఒకవేళ పంత్ గనుక ఢిల్లీని వీడితే.. ఆ ఫ్రాంఛైజీ రోహిత్ శర్మ వైపే చూస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఢిల్లీకి రోహిత్ వస్తే బహుశా ఆ లోటు తీరొచ్చేమో!పంజాబ్ కింగ్స్ఐపీఎల్లో ఇంత వరకు ట్రోఫీని ముద్దాడని మరో జట్టు పంజాబ్ కింగ్స్. పవర్ హిట్టర్లు ఉన్నా .. ఆఖరి నిమిషంలో అవకాశాలు చేజార్చుకోవడం ఆ జట్టుకు అలవాటే.దీనికి ప్రధాన కారణం సరైన నాయకుడు లేకపోవడమే అని చెప్పవచ్చు. కెప్టెన్ల విషయంలో ఇక్కడ నిలకడే లేదు. ఈ ఏడాది కూడా ఇద్దరు సారథ్యం వహించారు.శిఖర్ ధావన్ గాయం కారణంగా దూరం కాగా.. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ కెప్టెన్సీ చేపట్టాడు. అయితే, ఆరంభంలో బాగానే రాణించినా పంజాబ్ జట్టు.. తమ పాత కథను పునరావృతం చేస్తూ.. ఏడు విజయాలతో ఆరో స్థానానికే పరిమితమైంది.ఫలితంగా శిఖర్ ధావన్‌తో పాటు ఖరీదైన ఆటగాడైన సామ్ కర్రన్‌ను కూడా వదిలించుకోవాలని పంజాబ్ ఫ్రాంఛైజీ ఫిక్సైనట్లు వినికిడి. ఒకవేళ రోహిత్ శర్మను దక్కించుకుంటే వారికి అంతకంటే మంచి కెప్టెన్ దొరకడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చదవండి: 'బుమ్రా, బ్రెట్‌లీ కాదు.. క్రికెట్ చరిత్రలో అతడిదే బెస్ట్ యార్కర్' -
ఏడ్చేసిన నీతా అంబానీ.. రోహిత్ ముంబైని వీడటం పక్కా! వీడియో
ఐపీఎల్-2024కు ముందే రోహిత్ శర్మను కెప్టెన్‌గా తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది ముంబై ఇండియన్స్. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన హిట్‌మ్యాన్‌ను కాదని.. హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించి తగిన మూల్యం చెల్లించింది.పాండ్యా సారథ్యంలో ఘోరంగా విఫలమైన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అడుగున నిలిచింది. రోహిత్- పాండ్యా సైతం ఎడమొహం- పెడమొహంగానే మెదిలారు. ఫలితంగా ఇరువురిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.అయితే, టీ20 ప్రపంచకప్-2024తో సీన్ రివర్స్ అయింది. ఈ ఇద్దరూ టీమిండియా ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి నీరాజనాలు అందుకుంటున్నారు. కెప్టెన్‌గా రోహిత్, ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా తమ బాధ్యతను చక్కగా పూర్తి చేసి ప్రశంసలు దక్కించుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ యాజమాన్యం.. ట్రోఫీ గెలిచిన టీమిండియాలో సభ్యులైన తమ ఆటగాళ్లను ఘనంగా సత్కరించింది. ముఖేశ్ అంబానీ- నీతా అంబానీ దంపతులు ఈ సందర్భంగా భారత జట్టుపై ప్రశంసల వర్షం కురిపించారు.కాగా అంబానీ చిన్న కుమారుడు అనంత్- రాధికా మర్చంట్ల ముందస్తు పెళ్లి వేడుకలు ఆర్భాటంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంగీత్ నిర్వహించిన సమయంలోనే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలను ఉద్దేశించి నీతా అంబానీ మాట్లాడారు.వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించి ఆత్మీయంగా హత్తుకుని భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ అద్భుతం చేశాడంటూ అతడిని హగ్ చేసుకున్న నీతా.. ఆ తర్వాత సూర్య, హార్దిక్‌లను కూడా ఆత్మీయంగా హత్తుకున్నారు.ఈ సందర్భంగా హార్దిక్‌ను ఉద్దేశించి.. ‘‘కష్ట సమయం ఎప్పుడూ ఉండదు.. అయితే, పట్టుదల కలిగిన మనుషులు మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటారు’’ అని ప్రశంసించారు. ముఖ్యంగా వరల్డ్‌కప్ ఫైనల్లో ఆఖరి ఓవర్ అద్భుతంగా వేసి జట్టును గెలిపించిన తీరు అమోఘమంటూ కొనియాడారు.మరోవైపు.. 2011 నాటి సంబరాన్ని మళ్లీ తీసుకువచ్చారంటూ ముఖేశ్ అంబానీ ఆటగాళ్లను కితాబులిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే, ఇందులో రోహిత్ శర్మ మాత్రం పైకి నవ్వుతూ కనిపించినా కాస్త మనస్ఫూర్తిగా ఆ వేడుకలో భాగం కాలేకపోయాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఇప్పటికే తన మనసు విరిగిపోయిందని.. వచ్చే సీజన్లో అతడు ముంబై ఇండియన్స్ జట్టును వీడటం పక్కా అని ఫిక్సయిపోయారు. కాగా వెస్టిండీస్ వేదికగా సౌతాఫ్రికాతో ఫైనల్లో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో టీమిండియా ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.చివరి ఓవర్లో మూడు వికెట్లు తీసి హార్దిక్ పాండ్యా జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా భారత్ ఖాతాలో నాలుగో వరల్డ్‌కప్ టైటిల్ చేరింది.AMBANI FAMILY celebrating the World Cup heroes - Captain Rohit, Hardik & Surya. 🇮🇳- VIDEO OF THE DAY...!!!! ❤️ pic.twitter.com/8XbPo9kkLE— Johns. (@CricCrazyJohns) July 6, 2024 -
ఏదేమైనా వదిలిపెట్టను: హార్దిక్ పాండ్యా ఉద్వేగం
‘‘ఏదేమైనా యుద్ధ రంగంలోకి దిగిన తర్వాత మనం అక్కడే ఉండి పోరాడాలి. ఒక్కోసారి జీవితం మనల్ని విపత్కర పరిస్థితుల్లోకి నెట్టేస్తుంది.అయితే, నేను మాత్రం ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఆటను వదిలిపెట్టకూడదని గట్టిగా నిర్ణయించుకున్నా. ఒకవేళ యుద్ధ రంగంలో వెన్నుచూపితే మనం అనుకున్న ఫలితాలు రాబట్టలేం కదా!ఇక్కడ కూడా అంతే.. ఆట ద్వారా మనమేం పొందాలనుకుంటున్నామో.. వాటిని సాధించాలంటే కాస్త ఓపికగా ఎదురుచూడాలి. ఒక్కోసారి అది చాలా కష్టంగా ఉంటుందన్న మాట వాస్తవం.అయితే, నేను ఎప్పుటికప్పుడు మా మనసుని తేలిక చేసుకుంటాను. అంతకు ముందు ఎలా ఉన్నానో.. క్లిష్ట పరిస్థితుల్లోనూ అలాగే ఉండేందుకు ప్రయత్నిస్తాను.జీవితంలో మంచి రోజులు, గడ్డు పరిస్థితులు.. వస్తూ పోతూ ఉంటాయి. నేను ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఇలాంటి కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నాను. వాటిని దాటుకుని విజయవంతంగా ముందడుగు వేశాను.నిజానికి నేను సక్సెస్‌ను అంత సీరియస్‌గా తీసుకోను. నేను బాగా ఆడిన రోజును మర్చిపోతాను. అదే విధంగా.. చేదు అనుభవాలను కూడా!అలా అని పరిస్థితుల నుంచి పారిపోను. ధైర్యంగా వాటిని ఎదుర్కొంటాను. ఏదో ఒకరోజు వాటి నుంచి బయటపడతాను. ఆట, నైపుణ్యాలను మెరుగుపరచుకుంటూ.. కఠిన శ్రమకోరుస్తూ ముందుసాగితే తప్పకుండా ఫలితం ఉంటుంది.అలాగే ఎల్లప్పుడూ చిరునవ్వును మాత్రం వీడకూడదు’’ అంటూ టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు చేశాడు. కాగా వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ మధ్యలోనే గాయపడిన పాండ్యా మిగతా మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే.విమర్శల వర్షంఈ క్రమంలో ఐపీఎల్-2024 ద్వారా పునరాగమనం చేసిన ఈ బరోడా క్రికెటర్.. ముంబై కెప్టెన్‌గా కొత్త బాధ్యతలు చేపట్టాడు. అయితే, రోహిత్ శర్మ స్థానంలో పాండ్యా రావడాన్ని జీర్ణించుకోలేని అభిమానులు అతడిపై ఆగ్రహం వెళ్లగక్కారు.స్టేడియంలో, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తూ హార్దిక్ పాండ్యాపై విరుచుకుపడ్డారు. ఇక కెప్టెన్‌గానూ హార్దిక్ విఫలం కావడంపై అతడిపై విమర్శల వర్షం కురిసింది. అతడి సారథ్యంలో ముంబై పద్నాలుగింట కేవలం నాలుగు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిపోయింది.ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024 జట్టులో స్థానమే ప్రశ్నార్థకమైన వేళ.. బీసీసీఐ సెలక్టర్లు హార్దిక్ పాండ్యాపై నమ్మకం ఉంచి ఏకంగా వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో జూన్ 1న బంగ్లాదేశ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో పాండ్యా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.మొత్తంగా 23 బంతులు ఎదుర్కొని 40 పరుగులతో అజేయంగా నిలిచి ఈ పేస్ ఆల్‌రౌండర్.. తదుపరి ఒక వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా తాను ఫుల్ ఫామ్‌లోకి వచ్చినట్లేనని పాండ్యా సంకేతాలు ఇచ్చాడు.భార్యతో విభేదాలు.. విడాకులంటూ ప్రచారంకాగా ఐపీఎల్-2024లో చెత్త ప్రదర్శన ద్వారా విమర్శలపాలైన హార్దిక్ పాండ్యా.. వ్యక్తిగత జీవితంలోనూ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. భార్య నటాషా స్టాంకోవిక్‌తో అతడికి విభేదాలు తలెత్తాయని.. ఈ క్రమంలో ఆమె విడాకులకు అప్లై చేసిందనే ప్రచారం జరుగుతోంది.అంతేకాదు భరణంగా హార్దిక్ పాండ్యా ఆస్తిలో డెబ్బై శాతం వాటా కూడా నటాషాకు లభించనుందని సోషల్ మీడియాలో వదంతులు వ్యాపిస్తున్నాయి. కాగా సెర్బియా మోడల్ నటాషాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు హార్దిక్ పాండ్యా.ఈ జంటకు కుమారుడు అగస్త్య సంతానం. ఎంతో అన్యోన్యంగా ఉండే హార్దిక్- నటాషా విడిపోతున్నారనే వార్తలు అభిమానులను కలవర పెడుతున్నాయి. ఇక వృత్తిగతంగా, వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న హార్దిక్ పాండ్యా టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు స్టార్ స్పోర్ట్స్ షోలో పైవిధంగా ఉద్వేగ పూరితంగా మాట్లాడటం గమనార్హం.చదవండి: రోహిత్, విరాట్ భార్యలను గమనిస్తేనే తెలిసిపోతుంది: గంగూలీ -
Rohit Sharma- MI: ఆఖరి మ్యాచ్ ఆడేశాడు!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ కెరీర్లోనే 2024 సీజన్‌ను ఓ చేదు జ్ఞాపకంగా చెప్పవచ్చు. 2011లో ముంబై ఇండియన్స్ కుటుంబంలో అడుగుపెట్టిన రోహిత్ శర్మ ఓపెనర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.ఆ తర్వాత రెండేళ్లకే కెప్టెన్‌గా ప్రమోట్ అయిన హిట్‌మ్యాన్.. సారథిగా తొలి ప్రయత్నంలోనే ముంబై ఇండియన్స్‌కు టైటిల్ అందించాడు. ఆ తర్వాత మరో నాలుగు సార్లు జట్టును చాంపియన్‌గా నిలిపి.. అత్యధికంగా ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తొలి కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు.ఇక గతేడాది ముంబైని ప్లే ఆఫ్స్‌నకు చేర్చిన రోహిత్ శర్మకు.. ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే ముంబై మేనేజ్మెంట్ షాకిచ్చింది. కెప్టెన్‌గా రోహిత్‌పై వేటు వేసి అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది.గుజరాత్ టైటాన్స్ నుంచి భారీ మొత్తానికి పాండ్యాను ట్రేడ్ చేసుకుని మరీ కెప్టెన్‌గా నియమించింది. అయితే, అతడి సారథ్యంలో ముంబై ఈసారి చెత్తగా ఆడి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. మరోవైపు.. రోహిత్ శర్మ సైతం ఓపెనర్‌గా ఆకట్టుకోలేకపోయాడు.ఆడిన 14 మ్యాచ్‌లలో కలిపి కేవలం 417 పరుగులు మాత్రమే చేశాడు. ఇదిలా ఉంటే.. ముంబై మేనేజ్మెంట్ వైఖరితో విసిగిపోయిన రోహిత్ శర్మ వచ్చే సీజన్లో ఆ ఫ్రాంఛైజీని వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-2025 వేలానికి ముందు ముంబై రిటెన్షన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డాడు.‘‘నాకు తెలిసి వాళ్లు ఇషాన్ కిషన్‌ను వదిలేస్తారు. అతడి కోసం రైట్ టూ మ్యాచ్ కార్డు వాడతారనుకుంటా. ఎందుకంటే ఇషాన్ కోసం 15.5 కోట్లు వెచ్చించడం సరికాదు.కాబట్టి వాళ్లు అతడిని వదిలేస్తారు. ఇక రోహిత్ శర్మ ఇప్పటికే ముంబై ఇండియన్స్ తరఫున తన ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. తనను ఫ్రాంఛైజీ రిటైన్ చేసుకోవాలని అతడు కోరుకోవడం లేదు.అదే విధంగా ఫ్రాంఛైజీ కూడా అతడిని అట్టిపెట్టుకోవాలని భావించడం లేదు. ఇప్పటికే ముంబై ఇండియన్స్, రోహిత్ శర్మ దారులు వేరయ్యాయి. రోహిత్‌ను మరోసారి ముంబై జెర్సీలో చూసే అవకాశం లేదు.అయితే, ఇది కేవలం నా అంచనా మాత్రమే. ఒకవేళ ఇది నిజం కావచ్చు. కాకపోవచ్చు. ఏదేమైనా రోహిత్ శర్మ వచ్చే సీజన్లో ముంబైకి మాత్రం ఆడబోడని నమ్మకంగా చెప్పగలను’’ అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్లో పేర్కొన్నాడు.ఇక ముంబై రిటైన్ చేసుకునే ఆటగాళ్లలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా మొదటి ఆటగాడిని.. అతడితో పాటు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మను కూడా కొనసాగిస్తుందని ఆకాశ్ చోప్రా అంచనా వేశాడు. కాగా ఐపీఎల్ పదిహేడో సీజన్లో ముంబై ఆడిన పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగే గెలిచింది. -
హార్దిక్ పాండ్యా విడాకులు?.. భరణం కింద ఏకంగా అంత మొత్తమా?
టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. అతడి వ్యక్తిగత జీవితం గురించి వదంతులు పుట్టుకొస్తున్నాయి. భార్య నటాషా స్టాంకోవిక్‌తో హార్దిక్‌కు విభేదాలు తలెత్తాయని.. వారిద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది.నటాషా తన సోషల్ మీడియా ఖాతాలలో పాండ్యా ఇంటి పేరును తొలగించిందని.. తద్వారా తాము విడిపోయామని పరోక్షంగా హింటిచ్చిందని ‘రెడిట్’ పోస్ట్ ద్వారా నెటిజన్లు ఓ అంచనాకు వచ్చారు.హార్దిక్ పాండ్యాను ఎంకరేజ్ చేసేందుకు ఐపీఎల్-2024 మ్యాచ్‌లకు నటాషా రాలేదని.. అతడితో కలిసి ఉన్న ఫొటోలు కూడా పోస్ట్ చేయడం లేదంటూ ఇందుకు కారణాలు వెతికే ప్రయత్నం చేశారు.వదంతులు మాత్రమేనంటూఅయితే, ఇవన్ని వట్టి పుకార్లేనని హార్దిక్ పాండ్యా అభిమానులు కొట్టిపారేస్తున్నారు. ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్‌గా నియమితుడైన తర్వాత హార్దిక్ పాండ్యా దారుణమైన ట్రోలింగ్‌కు గురైన విషయం తెలిసిందే.పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలవడంతో అతడిపై విమర్శలు మరింత పదునెక్కాయి. ఈ నేపథ్యంలో.. ఆ ప్రభావం భార్య నటాషా, కుమారుడు అగస్త్యపై పడకుండా ఉండేందుకు పాండ్యానే స్వయంగా తనతో ఉన్న ఫొటోలు పోస్ట్ చేయవద్దని భార్యకు సూచించినట్లు తెలుస్తోంది.అయితే.. ఇన్నాళ్లూ విభేదాలంటూ వార్తలు రాగా..ఈసారి గాసిప్ రాయుళ్లు మరో ముందుడుగు వేశారు. హార్దిక్ పాండ్యా తీరు నచ్చని నటాషా.. ఇప్పటికే విడాకుల కోసం దరఖాస్తు చేసిందని వదంతులు వ్యాప్తి చేస్తున్నారు.భరణం కింద ఆస్తిలో 70 శాతంఈ క్రమంలో భరణం కింద హార్దిక్ పాండ్యా ఆస్తి(స్పోర్ట్స్‌కీడా నివేదిక ప్రకారం సుమారు రూ. 91 కోట్లు)లో 70 శాతం మేర(దాదాపు 63 కోట్లు) ఇవ్వాలని కోరిందని.. ఇందుకు అతడు కూడా సుముఖంగానే ఉన్నట్లు నెట్టింట రూమర్లు సృష్టిస్తున్నారు. అయితే, ఈ విషయంపై ఇటు హార్దిక్ పాండ్యా గానీ.. అటు నటాషా గానీ పెదవి విప్పకపోవడం గమనార్హం.మరోవైపు.. ఇటీవల నటాషా నుదిటిన బొట్టుతో ఉన్న ఫొటో పోస్ట్ చేస్తూ.. ‘‘అతడి ప్రేమ వల్లే ఇలా’’ అంటూ క్యాప్షన్ జత చేసింది. దీంతో అభిమానులు పాండ్యాను ఉద్దేశించే ఆమె ఈ పోస్ట్ చేసిందని భావిస్తున్నారు.సోషల్ మీడియాలో విష్ చేయని హార్దిక్.. ఒంటరిగానే రీచార్జ్ అవుతున్నట్లుగాఅయితే, వాలంటైన్స్ డే తర్వాత.. నటాషా పుట్టినరోజున సైతం హార్దిక్‌పాండ్యా ఆమెకు విష్ చేస్తూ పోస్ట్ పెట్టకపోవడం గమనార్హం. కేవలం కొడుకుతో ఉన్న ఫొటోలు మాత్రమే ఇటీవల పోస్ట్ చేసిన హార్దిక్.. శుక్రవారం మరో ఫొటోతో ముందుకు వచ్చాడు. ప్రస్తుతం రీచార్జ్ అవుతున్నా అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అయితే, ఇందులో నటాషా గానీ, అగస్త్య గానీ లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. తదుపరి ఐసీసీ ఈవెంట్లోమామూలుగా అయితే, ఆట నుంచి విరామం దొరకగానే హార్దిక్ పాండ్యా తన భార్య, కుమారుడితోనే ఎక్కువ సమయం గడుపుతాడు. హార్దిక్- నటాషాలలో ఎవరో ఒకరు అధికారికంగా స్పందిస్తే తప్ప ఈ వదంతులకు చెక్ పడదు. కాగా హార్దిక్ సెర్బియా మోడల్ నటాషాను ప్రేమించి 2020లో పెళ్లాడాడు. పెళ్లికి ముందే తల్లిదండ్రులైన వీరు గతేడాది ఘనంగా మరోసారి వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యా తదుపరి జూన్ 1 నుంచి మొదలుకానున్న టీ20 ప్రపంచకప్-2024కు సిద్ధం కానున్నాడు. చదవండి: SRH Captain Pat Cummins: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్.. ఇంకొక్క అడుగు View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) -
భార్యతో హార్దిక్‌కు విభేదాలు?.. అతడి వల్లే అంటూ నటాషా పోస్ట్!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు గత కొద్ది నెలలుగా ఏదీ కలిసి రావడం లేదు. గాయం కారణంగా వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ మధ్యలోనే నిష్క్రమించిన ఈ బరోడా క్రికెటర్.. మళ్లీ ఐపీఎల్-2024 సీజన్‌తో పునరాగమనం చేశాడు.చీలమండ గాయం నుంచి పూర్తిగా కోలుకుని క్యాష్ రిచ్ లీగ్ బరిలో నిలిచాడు. కష్టకాలంలో తనపై నమ్మకం ఉంచి.. కెప్టెన్సీ అనుభవం లేకున్నా పగ్గాలు అప్పగించిన గుజరాత్ టైటాన్స్‌ను వీడి తిరిగి ముంబై ఇండియన్స్ గూటికి చేరాడు.స్టేడియంలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ఈ క్రమంలో ముంబై యాజమాన్యం రోహిత్ శర్మపై వేటు వేసి హార్దిక్ పాండ్యాను సారథిగా నియమించింది. అప్పటి నుంచి హార్దిక్ కష్టాలు మొదలయ్యాయి. ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్‌ను కాదని పాండ్యాను కెప్టెన్ చేయడంతో అభిమానులు ముంబై యాజమాన్యంపై ఫైర్ అయ్యారు.స్టేడియంలో, సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యాను పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఇక ఆట తీరుతోనైనా అభిమానుల మనసు గెలవాలని హార్దిక్ పాండ్యా భావించగా.. ఆ ఆశ కూడా నెరవేరలేదు. చెత్త కెప్టెన్సీ కారణంగా ముంబై ఈ సీజన్లో దారుణంగా విఫలమైంది.చెత్త కెప్టెన్సీ వల్ల అట్టడుగున ముంబైలీగ్ దశలో ఆడిన పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఆల్‌రౌండర్‌గానూ పాండ్యా ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉండటంతో అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024 భారత జట్టులోనూ హార్దిక్ పాండ్యా స్థానం ప్రశ్నార్థకం కాగా.. ప్రత్యామ్నాయం లేదు కాబట్టి అదృష్టవశాత్తూ సెలక్టర్లు అతడిని మెగా టోర్నీకి ఎంపిక చేశారు.భార్య నటాషాతో హార్దిక్‌కు విభేదాలు?ఇక కెరీర్ విషయం ఇలా ఉంటే.. హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం గురించి ఓ వార్త తెరమీదకు వచ్చింది. భార్య నటాషా స్టాంకోవిక్‌తో హార్దిక్ బంధం బీటలు వారిందనేది దాని సారాంశం. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటాషా గత కొన్ని రోజులుగా హార్దిక్‌తో ఉన్న ఫొటోలు పోస్ట్ చేయకపోవడమే ఇందుకు కారణం అన్నట్లుగా ‘రెడిట్’ ఓ పోస్ట్ పెట్టింది.ఈ క్రమంలో కొంత మంది హార్దిక్- నటాషా విడిపోనున్నారంటూ ప్రచారం మొదలుపెట్టారు. అయితే, వారి అభిమానులు మాత్రం ఇవన్నీ వట్టి వదంతులే అని కొట్టి పారేస్తున్నారు. హార్దిక్, అతడి కుటుంబంతో నటాషా దిగిన ఫొటోలు ఇప్పటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో అలాగే ఉండటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.మరి ఎందుకు ఇలా?ముంబై కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత హార్దిక్ పాండ్యాపై సోషల్‌మీడియాలో కొంత మంది పనిగట్టుకుని మరీ విద్వేష విషం చిమ్మిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి లోనైన పాండ్యా.. ఈ ప్రభావం తన భార్యాబిడ్డపై కూడా పడుతుందేమోనని భయపడినట్లు సమాచారం.ఆ భయం వల్లే హార్దిక్ వద్దన్నాడు!అందుకే నటాషాను కొద్ది కాలం సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని.. ముఖ్యంగా తనతో ఉన్న ఫొటోలు షేర్ చేయవద్దని స్వయంగా చెప్పినట్లు అభిమానులు భావిస్తున్నారు. అందుకే నటాషా స్టేడియానికి కూడా రావడం మానేసిందని.. కుమారుడు అగస్త్యను కూడా బయటకు తీసుకురావడం లేదని తెలుస్తోంది.అతడి ప్రేమ వల్లే ఈ మెరుపుఇక నుదుటిన బొట్టుతో బుధవారం ఓ ఫొటో షేర్ చేసిన నటాషా.. ‘‘అతడి ప్రేమ వల్లే ఈ మెరుపు’’ అంటూ ఫొటోను షేర్ చేసింది. దీంతో హార్దిక్- నటాషా మధ్య విభేదాలు అంటూ వస్తున్న ఊహాగానాలను ఆమె పటాపంచలు చేసినట్లయింది. కాగా నటాషా ఈ మధ్యకాలంలో పెట్టిన ప్రతీ పోస్టుకు హార్దిక్సోదరుడు కృనాల్ పాండ్యా, వదిన పాంఖురి శర్మ లైకులు కొట్టడం గమనార్హం.చదవండి: Dinesh Karthik: పదిహేడు సీజన్లు.. ఒకే ఒక్క టైటిల్! అరుదైన రికార్డులు.. దటీజ్ డీకే! -
హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
‘‘ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాళ్లతో కూడిన జట్టు. నేను పదేళ్ల పాటు ఆ జట్టుకు ఆడాను. ముంబై మేనేజ్మెంట్ టీమ్‌ను చాలా బాగా చూసుకుంటుంది. అయితే, ఈసారి వాళ్లు తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టింది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే వారు కెప్టెన్‌ను మార్చారు. కానీ.. వాళ్లు అనుకున్నట్లుగా ఏదీ జరుగలేదు.జట్టు ఏకతాటిపై ఉన్నట్లు కనిపించలేదు. ఎవరికి వారే అన్నట్లు విడివిడిగా ఉన్నట్లు అనిపించింది. ముంబై లాంటి జట్టు ఇలా పేలవంగా ఆడటం నన్ను బాధించింది.కెప్టెన్‌ను మార్చాలనే నిర్ణయం సరైందే అయినా.. అందుకు మరో ఏడాది వేచి చూడాల్సింది. ఇందులో హార్దిక్ పాండ్యా తప్పేం లేదు. గుజరాత్ టైటాన్స్‌లో ఉన్నపుడు అతడి కెప్టెన్సీ అద్భుతంగా ఉంది.నిజానికి.. కెప్టెన్ ఎవరైనా.. సీనియర్లంతా కలిసి జట్టును ఒక్కటిగా ఉంచాల్సింది. కెప్టెన్లు వస్తారూ.. పోతారు. జట్టు మాత్రం ఒక్కతాటిపై ఉండాలి కదా!ఈసారి వాళ్లు జట్టులా ఆడినట్లు ఏ కోశానా కనిపించలేదు’’ అని టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ అన్నాడు. ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ దారుణ వైఫల్యం పట్ల విచారం వ్యక్తం చేశాడు.కాగా ఈ సీజన్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి.. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. దీంతో సొంత జట్టు అభిమానుల నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.అదే విధంగా హార్దిక్ పాండ్యాకు సైతం స్టేడియంలో, సోషల్ మీడియాలో అభిమానుల ఆగ్రహ జ్వాలల సెగ తగిలింది. అందుకు తగ్గట్లుగానే ముంబై వరుస మ్యాచ్‌లలో ఓడిపోవడం.. ఆఖరికి ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలవడంతో ఫ్యాన్స్ మరోసారి రెచ్చిపోయారు.ఇక ఓవరాల్‌గా ఈ ఎడిషన్‌లో ముంబై ఆడిన పద్నాలుగింట కేవలం నాలుగు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ హర్భజన్ సింగ్ వార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ పైవిధంగా స్పందించాడు.జట్టు రెండు వర్గాలుగా విడిపోవడానికి సీనియర్లే కారణమంటూ పరోక్షంగా రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌లను టార్గెట్ చేశాడు. హార్దిక్ పాండ్యాకు మద్దతు తెలిపే క్రమంలో భజ్జీ జట్టు వైఫల్యాలకు సీనియర్లను బాధ్యులుగా చూపే ప్రయత్నం చేశాడు.చదవండి: KKR vs SRH: ప్రమాదకారి.. ఫైనల్ చేరే తొలి జట్టు ఇదే: పాక్ లెజెండ్#WATCH | On Hardik Pandya's captaining Mumbai Indians in IPL 2024, former Indian cricketer Harbhajan Singh says "I have played with Mumbai Indians for 10 years. The team management is great but this decision has backfired them. The management was thinking about the future while… pic.twitter.com/pGNW5gIRF5— ANI (@ANI) May 21, 2024 -
MI: ఈ సీజన్లో నిరాశే మిగిలింది: నీతా అంబానీ వ్యాఖ్యలు వైరల్
ఐపీఎల్-2024 ముంబై ఇండియన్స్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. గత సీజన్లో ప్లే ఆఫ్స్ చేరిన ఈ జట్టు.. ఈసారి మాత్రం దారుణంగా విఫలమైంది. ఆడిన పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగు మాత్రమే గెలిచి ఎనిమిది పాయింట్లతో పట్టికలో అట్టడుగున నిలిచింది.పేలవ ప్రదర్శనతో ఈ ఎడిషన్‌లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌ను చేసినందుకు ముంబై యాజమాన్యం భారీ మూల్యమే చెల్లించిందనే విమర్శలు వస్తున్నాయి.ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ జట్టును ఉద్దేశించి డ్రెస్సింగ్ రూంలో చేసిన ప్రసంగం ఆసక్తికరంగా మారింది. ‘‘ఈ సీజన్ మనందరినీ ఎంతగానో నిరాశ పరిచింది. మనం ఆశించినట్లుగా ఏదీ జరగలేదు.అయినా నేనెప్పటికీ ముంబై ఇండియన్స్ జట్టుకు వీరాభిమానినే. కేవలం యజమానిగా ఉన్నందుకు మాత్రమే నేను ఈ మాటలు చెప్పడం లేదు. ముంబై ఇండియన్స్ జెర్సీ ధరించడం.. జట్టుతో ఇలా మమేకం కావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను.మన ఆట తీరును సమీక్షించుకుందాం. ఓటములకు గల కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం’’ అని నీతా అంబానీ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపారు. అదే విధంగా టీ20 ప్రపంచకప్-2024 ఆడబోయే భారత జట్టుకు ఎంపికైన ముంబై ఆటగాళ్లకు నీతా అంబానీ ఈ సందర్భంగా ఆల్ ది బెస్ట్ చెప్పారు.‘‘రోహిత్, హార్దిక్, సూర్య, జస్ప్రీత్.. భారతీయులంతా మీ కోసం ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు’’ అంటూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలను విష్ చేశారు. కాగా జూన్ 1 నుంచి వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభం కానుండగా.. జూన్ 5న ఐర్లాండ్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది.Mrs. Nita Ambani talks to the team about the IPL season and wishes our boys all the very best for the upcoming T20 World Cup 🙌#MumbaiMeriJaan #MumbaiIndians | @ImRo45 | @hardikpandya7 | @surya_14kumar | @Jaspritbumrah93 pic.twitter.com/uCV2mzNVOw— Mumbai Indians (@mipaltan) May 19, 2024 -
నా ఆల్‌టైమ్ ఫేవరెట్ క్రికెటర్ అతడే: టీమిండియా స్టార్
టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011.. టీమిండియా ట్రోఫీ గెలిచిన రెండు సందర్బాల్లోనూ జట్టులో భాగంగా ఉన్నాడు స్పిన్నర్ పీయూశ్ చావ్లా. ఏకంగా రెండుసార్లు ట్రోఫీని ముద్దాడే అదృష్టం దక్కించుకున్నాడు. 2006లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ యూపీ స్పిన్నర్ తన కెరీర్ మొత్తంలో 3 టెస్టులు, 25 వన్డేలు, ఏడు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 7, 32, 4 వికెట్లు తీశాడు.అయితే, ఈ రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్‌కు ఐపీఎల్లో మాత్రం ఘనమైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు క్యాష్ రిచ్ లీగ్‌లో 192 మ్యాచ్‌లు ఆడిన పీయూశ్ 192 వికెట్లు తీశాడు. ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తరఫున 11 మ్యాచ్‌లలో కలిపి 13 వికెట్లు పడగొట్టాడు.ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీ టూర్ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ బృందంతో కలిసి పీయూశ్ చావ్లా హైదరాబాద్‌లోని సాక్షి మీడియా ఆఫీస్‌కు వచ్చాడు. ఈ సందర్భంగా ట్రోఫీని ఆవిష్కరించి టీమిండియాకు విష్ చేశాడు.ఈ క్రమంలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. తన ఫేవరెట్ క్రికెటర్ ఎవరో తెలియజేశాడు. ‘‘రోహిత్ శర్మ నా ఆల్‌టైమ్ ఫేవరెట్. తను నాకు స్నేహితుడు. ఐపీఎల్-2024లో ఆఖరి మ్యాచ్ సందర్భంగా అతడు ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశాడు. ఈసారి వరల్డ్‌కప్‌లో రోహిత్ ప్రదర్శన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని పీయూశ్ చావ్లా పేర్కొన్నాడు.కాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ ఆటగాడిగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ.. 14 మ్యాచ్‌లు ఆడి 417 పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌పై సెంచరీ చేసిన హిట్‌మ్యాన్.. లీగ్ దశలో ఆఖరిదైన లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లోనూ అర్ధ శతకం(38 బంతుల్లో 68)తో సత్తా చాటాడు. -
రోహిత్‌తో నీతా అంబానీ సీరియస్ డిస్కషన్.. వీడియో వైరల్
ఐపీఎల్-2024లో తన ఆఖరి మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ. ఈ సీజన్లో నిలకడలేని ఫామ్‌తో విమర్శల పాలైన హిట్‌మ్యాన్ సొంతగడ్డపై శుక్రవారం ధనాధన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు.లక్నో సూపర్ జెయింట్స్‌తో వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 38 బంతుల్లోనే 68 పరుగులు సాధించాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.అయితే, రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ ముంబై జట్టును గెలిపించలేకపోయింది. ఈ మ్యాచ్‌లో లక్నో 18 పరుగుల తేడాతో గెలుపొందడంతో లీగ్ దశను ఓటమితోనే ముగించింది ముంబై ఇండియన్స్.ఏకంగా పదో పరాజయం నమోదు చేసి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఇదిలా ఉంటే.. ఆఖరి మ్యాచ్‌లో అదరగొట్టిన రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కోచ్ సిబ్బంది ప్రత్యేక మెడల్‌తో సత్కరించింది.హిట్‌మ్యాన్‌ను సత్కరించిన నీతా అంబానీప్రధాన కోచ్ మార్క్ బౌచర్ రోహిత్ శర్మ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడంటూ ప్రశంసించాడు. మెడల్ తీసుకోవడానికి రావాల్సిందిగా రోహిత్ శర్మను కోరాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ హిట్‌మ్యాన్ జెర్సీకి బ్యాడ్జిని అటాచ్ చేసి సత్కరించారు.అయితే, ఆ సమయంలో రోహిత్ శర్మ ముఖంలోగానీ.. నీతా ఫేస్‌లో గానీ ఏమాత్రం సంతోషం కనబడలేదు. నీతా ఏదో మొక్కుబడిగా బ్యాడ్జి పెట్టిన అనంతరం.. రోహిత్ ముభావంగా వెనక్కి తిరిగి వచ్చేశాడు.तोडफोड from the get-go, a 𝐭𝐲𝐩𝐢𝐜𝐚𝐥 𝐑𝐨 𝐩𝐞𝐫𝐟𝐨𝐫𝐦𝐚𝐧𝐜𝐞 was on display in #MIvLSG 💪💙#MumbaiMeriJaan #MumbaiIndians | @ImRo45 pic.twitter.com/sddic4we6i— Mumbai Indians (@mipaltan) May 18, 2024 తారస్థాయికి విభేదాలు!ఇందుకు సంబంధించిన వీడియో నెటిజన్లలో చర్చకు దారి తీసింది. ముంబై ఇండియన్స్ యాజమాన్యం రోహిత్ శర్మ పట్ల వ్యవహరించిన తీరు చూస్తుంటే.. ఇరు వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్లు కనిపిస్తోందని.. వచ్చే సీజన్లో రోహిత్ ముంబైకి ఆడకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. లక్నో చేతిలో ఓటమి తర్వాత రోహిత్- నీతా సీరియస్‌గా మాట్లాడుకున్న దృశ్యాలను ఈ సందర్భంగా షేర్ చేస్తున్నారు.Is Nita Ambani requesting Rohit Sharma to stay back in Mumbai Indians?#RohitSharma | #MumbaiIndians pic.twitter.com/DP59HFueWd— Indian Cricket Team (Parody) (@ictparody) May 17, 2024 కాగా ముంబై ఇండియన్స్‌ను అత్యధికంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత రోహిత్ శర్మది. అయితే, ఐపీఎల్-2024కు ముందే అతడిపై వేటు వేసిన ముంబై మేనేజ్మెంట్.. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించింది.అయితే, హార్దిక్ సారథ్యంలో ముంబైకి ఘోర పరాభవం ఎదురైంది. ఐపీఎల్-2024లో ఆడిన పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఇక తాజా ఎడిషన్‌లో మొత్తంగా ముంబై తరఫున 14 మ్యాచ్‌లు ఆడి 417 పరుగులు చేశాడు రోహిత్ శర్మ.చదవండి: T20 WC 2024: టీమిండియా ఆటగాళ్ల న్యూయార్క్ ప్రయాణం ఆరోజే! -
MI: అర్జున్ టెండుల్కర్ ‘ఓవరాక్షన్’.. ఆ తర్వాత ఇలా డగౌట్లో!
టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. అతి చేస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయని.. అయినా పరిస్థితులు ఎదుర్కోకుండా పారిపోవడం ఏమిటంటూ నెటిజన్లు అతడిని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.ఇంతకీ ఏం జరిగిందంటే.. ఐపీఎల్ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్ టెండుల్కర్ 2024 సీజన్లో ఎట్టకేలకు శుక్రవారం తన తొలి మ్యాచ్ ఆడాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ సందర్భంగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్థానంలో తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు.ఈ మ్యాచ్‌లో కేవలం 2.2 ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ రైటార్మ్ పేస్ ఆల్‌రౌండర్ 22 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కాగా.. లక్నో ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్ బౌల్ చేసిన అర్జున్.. 3 పరుగులు మాత్రమే ఇచ్చి శెభాష్ అనిపించుకున్నాడు.అయితే, ఐదో ఓవర్లో కాస్త అతి చేశాడు. మార్కస్ స్టొయినిస్‌ను ట్రాప్ చేసేందుకు అర్జున్ ఇన్‌స్వింగర్ సంధించగా.. బ్యాటర్ తప్పించుకున్నాడు. ఈ క్రమంలో బంతిని అందుకున్న అర్జున్ వికెట్లకు స్టొయినిస్ మీదకు విసిరేస్తానన్నట్లుగా దూకుడు ప్రదర్శించాడు. ఇందుకు స్టొయినిస్ చిరాగ్గా నవ్వుతూ కౌంటర్ ఇచ్చాడు.ఇక ఆ తర్వాత 15వ ఓవర్లో మళ్లీ బాలింగ్‌కు దిగిన అర్జున్ టెండుల్కర్ బౌలింగ్‌లో నికోలసన్ పూరన్ తొలి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాదాడు. అయితే, ఆ తర్వాత అర్జున్ తనకు ఇబ్బంది ఉందంటూ ఫిజియోను పిలిపించుకున్నాడు.ఆ తర్వాత అతడితో కలిసి మైదానం వీడగా.. నమన్ ధిర్ మిగిలిన కోటా పూర్తి చేశాడు. అయితే, ఆ ఓవర్లో టెండుల్కర్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదిన పూరన్.. తర్వాత నమన్ ధిర్ బౌలింగ్‌లోనూ వరుసగా సిక్స్, ఫోర్, 1, సిక్స్ బాది 29 పరుగులు పిండుకున్నాడు.ఈ నేపథ్యంలో అర్జున్ టెండుల్కర్ కావాలనే గాయం పేరిట తప్పించుకున్నాడంటూ నెటిజన్లు అతడిని ట్రోల్ చేస్తున్నారు. పూరన్ ఫామ్ చూసి భయపడిపోయిన అర్జున్ను కాపాడేందుకు మేనేజ్మెంట్ నమన్ ధిర్‌ను బలి చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా స్టొయినిస్ విషయంలో అర్జున్ ప్రవర్తించిన తీరు కూడా ప్రస్తావిస్తూ విమర్శిస్తున్నారు.కాగా సచిన్ టెండుల్కర్ ముంబై ఇండియన్స్ మెంటార్ అన్న విషయం తెలిసిందే. గత సీజన్లో అర్జున్ మూడు వికెట్లు తీయడంతో పాటు 13 పరుగులు చేశాడు.Arjun Tendulkar shows aggression to Marcus Stoinis.🥵💥#mivslsg #mivlsg #lsgvsmi #lsgvmi #tataipl #tataipl2024 #ipl2024 #ipl #mumbaiindians #crickettwitter pic.twitter.com/SCzAdnkzmx— AK tweets (@ajithkumaarrrrr) May 17, 2024Arjun Tendulkar Going Back To Dressing Room After Pooran Hit Him Two Back To Back Sixes 🤡🤡🔥🔥😂😂He didn't Even Complete His Over 🤡🤡🤡#MIvsLSG #RCBvCSK #CSKvRCB pic.twitter.com/OlyNj9k1QW— Khabri_Prasang (@Prasang_) May 17, 2024 -
IPL 2025: ముంబైకి రోహిత్ గుడ్ బై.. క్లారిటీ ఇచ్చేసిన కోచ్!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఐపీఎల్-2024 చేదు అనుభవాలనే మిగిల్చింది. సీజన్ ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించి.. సారథ్య బాధ్యతలను ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు అప్పగించింది.గుజరాత్ టైటాన్స్ నుంచి భారీ మొత్తానికి పాండ్యాను ట్రేడ్ చేసుకుని మరీ.. ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మపై వేటు వేసింది. ఇదిలా ఉంటే.. బ్యాటర్‌గానూ హిట్‌మ్యాన్ ఈసారి తన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు.అదొక్కటి హైలైట్తాజా ఎడిషన్‌లో మొత్తంగా ముంబై తరఫున 14 మ్యాచ్‌లు ఆడి 417 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్‌పై చేసిన సెంచరీ ఒక్కటి హైలైట్‌గా నిలవగా.. లీగ్ దశలో ఆఖరిదైన లక్నో మ్యాచ్‌లోనూ రోహిత్ అర్ధ శతకం(38 బంతుల్లో 68) సత్తా చాటాడు. ఇవి మినహా రోహిత్ నుంచి ఆశించిన మేర మెరుపులు రాలేదు.ఇదిలా ఉంటే.. మేనేజ్మెంట్, హార్దిక్ పాండ్యాతో విభేదాలు తలెత్తిన కారణంగా రోహిత్ శర్మ వచ్చే సీజన్లో ముంబై ఇండియన్స్‌ను వీడతాడనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల కేకేఆర్ కోచ్ అభినవ్ ముకుంద్తో మాట్లాడుతూ రోహిత్ వీటికి బలం చేకూర్చాడు.వచ్చే ఏడాది మెగా వేలంఇక ముంబై ఇండియన్స్ హెడ్‌కోచ్ మార్క్ బౌచర్ సైతం తాజాగా ఈ విషయంపై స్పందించాడు. లక్నోతో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ముంబై ఓడిన అనంతరం అతడు మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి ప్రశ్న ఎదురైంది.ఇందుకు బదులిస్తూ.. ‘‘తనకు సంబంధించిన నిర్ణయాలు తానే తీసుకోగల సమర్థుడు. వచ్చే ఏడాది మెగా వేలం జరుగబోతోంది. ఏం జరుగనుందో ఎవరికి మాత్రం ఏం తెలుసు? రోహిత్ శర్మతో నేను గత రాత్రి మాట్లాడాను. ఈ సీజన్లో వైఫల్యాల గురించి చర్చించాం. తదుపరి ఏమిటని అడిగాను.ఇందుకు రోహిత్ బదులిస్తూ.. ‘వరల్డ్‌కప్’.. అని సమాధానమిచ్చాడు’’ అని మార్క్ బౌచర్ పేర్కొన్నాడు. అతడి వ్యాఖ్యలను బట్టి.. రోహిత్ శర్మ వచ్చే ఏడాది ముంబైని వీడటం ఖాయమని ఫిక్సయిపోయారు అతడి అభిమానులు.తగిన శాస్తి జరిగిందంటూపనిలో పనిగా.. రోహిత్ శర్మను కెప్టెన్‌గా తొలగించినందుకు ముంబై యాజమాన్యానికి తగిన శాస్తి జరిగిందంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ మొత్తంగా ఆడిన 14 మ్యాచ్‌లలో కేవలం నాలుగే గెలిచింది. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. కాగా జూన్ 1 నుంచి ఆరంభమయ్యే టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియాకు రోహిత్ శర్మ కెప్టెన్. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్. -
BCCI: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. ఐపీఎల్-2025లో..
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి భారీ షాకిచ్చింది. రూ. 30 లక్షల జరిమానాతో పాటు తదుపరి మ్యాచ్‌కు దూరంగా ఉండాలని నిషేధం విధించింది.కాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ సారథిగా రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసిన హార్దిక్ పాండ్యాకు అడుగడుగునా చేదు అనుభవాలే ఎదురయ్యాయి. రోహిత్ స్థానంలో వచ్చినందుకు సొంత జట్టు అభిమానుల నుంచే ఛీత్కారాలు.. కెప్టెన్‌గా తీసుకున్న నిర్ణయాల కారణంగా విమర్శలు ఎదుర్కొన్నాడు.ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుఆల్‌రౌండర్‌గానూ తన స్థాయికి తగ్గట్లు ఆకట్టుకోలేకపోయాడు హార్దిక్ పాండ్యా. సారథిగానూ సరైన వ్యూహాలు రచించలేక చతికిలపడ్డాడు. ఫలితంగా ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై పరాభవం మూటగట్టుకుంది.ఇక లీగ్ దశలో ఆఖరిదై మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడింది. వాంఖడే వేదికగా జరిగిన ఈ పోరులో లక్నో ముంబైని 18 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో ముంబై ఖాతాలో పదో పరాజయం నమోదైంది.ఇదిలా ఉంటే.. లక్నోతో మ్యాచ్ సందర్భంగా ముంబై ఇండియన్స్ నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ హార్దిక్ పాండ్యాకు పనిష్మెంట్ ఇచ్చింది.ఐపీఎల్-2025లో తొలి మ్యాచ్ ఆడకుండా నిషేధంఈ మేరకు.. ‘‘ఈ సీజన్లో ముంబై జట్టు చేసిన మూడో తప్పిదం కావున.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి కింద.. స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా పాండ్యాకు రూ. 30 లక్షల జరిమానా విధించడంతో పాటు.. జట్టు తదుపరి ఆడే మ్యాచ్ ఆడకుండా నిషేధం విధిస్తున్నాం’’ అని ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటన విడుదల చేశారు. అంటే ఐపీఎల్-2025లో పాండ్యా తన తొలి మ్యాచ్‌కు దూరంగా ఉండాలన్నమాట! ఇక పాండ్యాతో పాటు ముంబై జట్టుకు కూడా ఎదురుదెబ్బ తగిలింది. ముంబై జట్టు మొత్తానికి జరిమానా‘‘లక్నోతో మ్యాచ్ ఆడిన ముంబై తుదిజట్టులోని ఆటగాళ్లందరికీ.. ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా ప్రతి ఒక్కరికి రూ. 12 లక్షల జరిమానా లేదంటే మ్యాచ్ ఫీజులో 50 శాతం మేర కోత(ఏది తక్కువగా ఉంటే అది) విధిస్తాం’’ అని తెలిపారు. కాగా ఐపీఎల్-2024లో ఆడిన 14 మ్యాచ్‌లలో కేవలం నాలుగు మాత్రమే గెలిచిన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.చదవండి: Pat Cummins: సన్‌రైజర్స్ కెప్టెన్ చేసిన పనికి అభిమానులు ఫిదా.. వీడియో వైరల్ #LSG wrapped up their season on a winning note and happy faces in Mumbai😃👌🎥 Here's a roundup of the #MIvLSG clash at the Wankhede 🏟️ #TATAIPL pic.twitter.com/FbdT2QQQAk— IndianPremierLeague (@IPL) May 18, 2024 -
MI Vs LSG: లక్నో విజయంతో ముగింపు
ముంబై: ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో అందరికంటే ముందుగా ప్లేఆఫ్స్ దశకు దూరమైంది. ఇప్పుడు ఆఖరి స్థానంతో లీగ్ దశను పేలవంగా ముగించింది. మధ్యలో వర్షం ఆటంకం కలిగించిన ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 18 పరుగుల తేడాతో ముంబైపై ఘనవిజయం సాధించింది. ముందుగా లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (29 బంతుల్లో 75; 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) సునామీలా చెలరేగిపోయాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (41 బంతుల్లో 55; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. పియూశ్ చావ్లా, తుషారా చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసి ఓడింది. రోహిత్ శర్మ (38 బంతుల్లో 68; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), నమన్ ధీర్ (28 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరిపించారు. పూరన్ ధనాధన్ పది ఓవర్లలో లక్నో స్కోరు 69/3. పడిక్కల్ (0), స్టొయినిస్ (22 బంతుల్లో 28; 5 ఫోర్లు), దీపక్ హుడా (11) అవుటయ్యారు. ఇంకో 10 ఓవర్లలో వంద కొట్టినా... 170 దాటదు! కానీ పూరన్ తన 29 బంతుల్లో అంతా మార్చేశాడు. రాహుల్‌తో కలిసి విధ్వంసరచన చేశాడు. అన్షుల్ 13వ ఓవర్లో పూరన్ 4, 0, వైడ్, 4, 6, 6, 1లతో 22 పరుగులు రాబట్టాడు. 15వ ఓవర్‌ను అర్జున్ టెండూల్కర్ ప్రారంభించి 2 బంతులేస్తే పూరన్ సిక్సర్లుగా మలిచాడు. కండరాలు పట్టేయడంతో అర్జున్ వెనుదిరిగాడు. మిగతా ఓవర్‌ను నమన్ ధీర్ వేయగా పూరన్ 6, 4, 1 కొట్టాడు. ఆఖరి బంతిని రాహుల్ సిక్స్ బాదడంతో ఈ ఓవర్లో 29 పరుగులు వచ్చాయి. పూరన్ 19 బంతుల్లోనే ఫిఫ్టీ చేసుకోగా... రాహుల్ 37 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. ఆఖర్లో బదోని (10 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో లక్నో 200 పైచిలుకు స్కోరు చేసింది. రోహిత్, ధీర్ ఫిఫ్టీ–ఫిఫ్టీ భారీ లక్ష్యఛేదనకు అవసరమైన హిట్టింగ్తో రోహిత్ ముంబై స్కోరును పరుగుపెట్టించాడు. మరో ఓపెనర్ బ్రెవిస్ (20 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్‌లు) వేగంలో వెనుకబడినా రోహిత్ బౌండరీలతో జోరు కనబరిచాడు. 28 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. 88 పరుగుల వద్ద బ్రెవిస్ అవుటయ్యాక ముంబై తడబడింది. సూర్యకుమార్ (0), రోహిత్, హార్దిక్ (16), నేహల్ (1) వికెట్లను కోల్పోవడంతో ముంబై లక్ష్యానికి దూరమైంది. ఈ దశలో నమన్ ధీర్ మెరిపించినా అప్పటికే ఆలస్యమైంది. నమన్ 25 బంతుల్లో అర్ధసెంచరీ సాధించినా ముంబైని ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) తుషారా (బి) చావ్లా 55; పడిక్కల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) తుషారా 0; స్టొయినిస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) చావ్లా 28; హుడా (సి) నేహల్ (బి) చావ్లా 11; పూరన్ (సి) సూర్య (బి) తుషారా 75; అర్షద్ (సి) నేహల్ (బి) తుషారా 0; బదోని (నాటౌట్) 22; కృనాల్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 214. వికెట్ల పతనం: 1–1, 2–49, 3–69, 4–178, 5–178, 6–178. బౌలింగ్: తుషారా 4–0–28–3, అర్జున్ 2.2–0–22–0, అన్షుల్ 3–0–48–0, పియూశ్ చావ్లా 4–0–29–3, నేహల్ 2–0– 13–0, హార్దిక్ 2–0–27–0, నమన్ 0.4–0–17–0, షెఫర్డ్ 2–0–30–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) మోసిన్ (బి) బిష్ణోయ్ 68; బ్రెవిస్ (సి) కృనాల్ (బి) నవీనుల్ 23; సూర్య (సి) బిష్ణోయ్ (బి) కృనాల్ 0; ఇషాన్ (బి) నవీనుల్ 14; హార్దిక్ (సి) నవీనుల్ (బి) మోసిన్ 16; నేహల్ (సి) కృనాల్ (బి) బిష్ణోయ్ 1; నమన్ (నాటౌట్) 62; షెఫర్డ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–88, 2–89, 3–97, 4–116, 5–120, 6–188. బౌలింగ్: అర్షద్ 2–0–11–0, హెన్రీ 2–0–24–0, కృనాల్ 4–0–29–1, మోసిన్ 4–0– 45–1, నవీనుల్ 4–0–50–2, రవి బిష్ణోయ్ 4–0–37–2. -
ఐపీఎల్లో విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే!
ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎల్ఎస్జీ ప్లేయర్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించారు. కేవలం 19 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించారు. ఇందులో 7 సిక్సర్లు, 2 ఫోర్లతో చేలరేగాడు. అర్జున్ టెండూల్కర్ వేసిన 15 ఓవర్లో వరుస బంతుల్లో నికోల పూరన్ మూడు సిక్సర్లు బాదాడు. దీంతో ఆ ఓవర్లో ఏకంగా 29 పరుగులు సమర్పించుకున్నారు. కేవలం 29 బంతుల్లో 75 పరుగులు నికోలస్ పూరన్ ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు కొట్టాడు. చివరికీ నువాన్ తుషార బౌలింగ్‌లో ఔటై వెనుదిరిగారు. అయితే ఇప్పటికే ముంబయి ఇండియన్స్ ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు లక్నో సూపర్ జైయింట్స్కు సైతం దాదాపుగా ప్లే ఆఫ్ వెళ్లే అవకాశం లేనట్లే. ఇప్పటికే 12 పాయింట్లతో ఉన్న లక్నోకు రన్‌రేట్ లేకపోవడం వారి అవకాశాలు దెబ్బతీసింది. ఇవాల్టి మ్యాచ్‌లో గెలిచినా ఎలాంటి ఉపయోగం లేదు. కాగా.. ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా.. మరో స్థానం కోసం ఆర్సీబీ, చెన్నై పోటీ పడుతున్నాయి. "De chauka de chakka. Aaj ho jaye, ho jaye, Dhoom Dhadaka" pic.twitter.com/f0gZiT3kjz— Lucknow Super Giants (@LucknowIPL) May 17, 2024 -
MI: రోహిత్, హార్దిక్ వద్దు.. వాళ్లిద్దరినే రిటైన్ చేసుకోండి: సెహ్వాగ్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ ‘స్టార్’ క్రికెటర్ల ఆట తీరుపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. వచ్చే ఏడాది వేలంలో సోకాల్డ్ ‘స్టార్ల’ను వదిలేయాలని మేనేజ్మెంట్కు సూచించాడు.కాగా ముంబై ఇండియన్స్‌లో స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, టీ20 వరల్డ్ నంబర్ వన్ స్టార్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు యంగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ తదితరులు ఉన్నారు.ఇక రోహిత్ శర్మ ఈ జట్టుకు ఐదుసార్లు ట్రోఫీ అందించినా.. ఐపీఎల్-2024 సీజన్లో కెప్టెన్‌గా అతడిని తప్పించింది యాజమాన్యం. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న పాండ్యాకు పగ్గాలు అప్పగించింది.రెండు వర్గాలుగా విడిపోయిన జట్టు?ఈ నేపథ్యంలో వేదనకు గురైన రోహిత్ శర్మతో పాటు బుమ్రా, సూర్య తదితరులు ఒక బృందంగా.. పాండ్యా, ఇషాన్‌లతో కూడిన మరికొందరు మరో బృందంగా ఏర్పడ్డారని.. జట్టులో విభేదాలు తారస్థాయికి చేరాయనే వార్తలు వినిపిస్తున్నాయి.జట్టు ప్రదర్శనపై ఇది ప్రభావం చూపిందని.. అందుకే ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై నిలిచిందనే విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ ఎడిషన్ లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో భాగంగా ముంబై శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది.ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ ముంబై మేనేజ్మెంట్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. 2025 వేలానికి ముందే రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్‌లను వదిలేయాలని సూచించాడు.షారుఖ్, సల్మాన్, ఆమిర్ ఉంటే సరిపోదుఇందుకు సినిమాను ఉదాహరణగా ప్రస్తావిస్తూ ఈ మేరకు ‘‘షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ కలిసి ఒకే సినిమాలో నటించినా.. అది హిట్టవుతుందనే గ్యారెంటీ లేదు. సినిమాలో స్టార్లు ఉన్నంత మాత్రాన సరిపోదు.మంచి స్క్రిప్టు ఉండాలి. అందరూ బాగా నటించగలగాలి. ఇలా ఇంకెన్నో అంశాలు కలిసిరావాలి. అలాగే జట్టులో పేరున్న ఆటగాళ్లు ఉన్నంత మాత్రాన సరిపోదు.అసలు రోహిత్ శర్మ ఏం చేశాడు?మైదానంలో వాళ్లు సరిగ్గా ఆడితేనే అనుకున్న ఫలితాలు వస్తాయి. రోహిత్ శర్మ ఒక్క మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. కానీ ఆ మ్యాచ్‌లో ముంబై ఓడిపోయింది. మరి మిగతా మ్యాచ్‌లలో అతడి ప్రదర్శన మాటేమిటి?ఇక ఇషాన్ కిషన్.. ఈ సీజన్ మొత్తంలో ఒక్కసారి కూడా కనీసం పవర్ ప్లే ముగిసే వరకైనా ఉన్నాడా?.. నా దృష్టిలో ముంబై ఇండియన్స్ కేవలం జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్లనే నమ్ముకోవాలిక! వీళ్లిద్దరిని మాత్రమే రిటైన్ చేసుకోవాలివచ్చే సీజన్ కోసం వీళ్లిద్దరిని మాత్రమే రిటైన్ చేసుకుంటే బాగుంటుంది. మిగతా వాళ్లు అసలు అవసరమే లేదు’’ అని సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఈ సీజన్లో ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ 349, ఇషాన్ కిషన్ 306 పరుగులు చేశారు. మరోవైపు గాయం కారణంగా ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ 345 పరుగులు సాధించాడు. ఇక బుమ్రా 20 వికెట్లు తీయగా.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా 11 వికెట్లు తీయడంతో పాటు 200 పరుగులు చేశాడు. చదవండి: Kavya Maran- SRH: కేన్ మామను హత్తుకున్న కావ్యా.. వీడియో వైరల్అతడి కంటే చెత్త కెప్టెన్ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?.. గంభీర్ ఫైర్ -
రోహిత్ శర్మ సంచలన నిర్ణయం.. త్వరలోనే రిటైర్మెంట్!?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్‌కప్-2024 తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్‌కు విడ్కోలు పలకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే రోహిత్ శర్మ తన నిర్ణయాన్ని బీసీసీఐకు వెల్లడించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. టీ20ల్లో భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్ధానంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయాలని భారత క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే హార్దిక్‌ను టీ20 వరల్డ్‌కప్-2024లో భారత జట్టు వైస్ కెప్టెన్‌గా సెలక్టర్లు ఎంపిక చేసినట్లు వినికిడి. అంతేకాకుండా ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన జట్టులో హార్దిక్‌కు చోటు దక్కాలని సెలక్టర్లపై బీసీసీఐ ప్రత్యేక ఒత్తిడి తీసుకువచ్చినట్లు దైనిక్ జాగరణ్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది.కాగా ఇప్పటివరకు రోహిత్ శర్మ గైర్హజరీలో టీ20ల్లో భారత జట్టును హార్దిక్ పాండ్యానే నడిపిస్తున్నాడు. రోహిత్ తర్వాత హార్దిక్ భవిష్యత్తు కెప్టెన్ అని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ ఐపీఎల్-2024 సీజన్ తర్వాత అందరి అభిప్రాయం మారిపోయింది.ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్ నూతన కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ తన మార్క్ చూపించలేకపోయాడు. రోహిత్ శర్మను తప్పించి మరి తమ జట్టు పగ్గాలను హార్దిక్‌కు ముంబై ఫ్రాంచైజీ అప్పగించింది.జట్టును విజయం నడిపించడంలో హార్దిక్ విఫలమయ్యాడు. అంతేకాకుండా ముంబై డ్రెస్సింగ్ రూమ్ రెండు వర్గాలగా కూడి చీలిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొంతమంది రోహిత్ శర్మ వర్గంలో ఉంటే మరి కొంతమంది పాండ్యాకు సపోర్ట్‌గా ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్లో కెప్టెన్‌గా తన మార్క్ చూపించడంలో విఫలమవుతున్న హార్దిక్.. ఒక వేళ పూర్తి స్దాయిలో భారత జట్టు పగ్గాలు చేపడితే ఏ మెరకు విజయవంతమవుతాడో చూడాలి. -
చాలా బాధగా ఉంది.. ఆ తప్పే మా కొంపముంచింది: హార్దిక్ పాండ్యా
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తీరు ఏ మాత్రం తీరలేదు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఈడెన్‌గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. ఈ ఏడాది సీజన్లో ముంబైకు ఇది తొమ్మిదో ఓటమి కావడం గమనార్హం. ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబై.. ఆఖరి మ్యాచ్‌లలోనూ తమ మార్కును చూపించలేకపోతుంది. ఈ మ్యాచ్‌లో 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. నిర్ణీత 16 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులకే పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (40) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. తిలక్ వర్మ(32) పరుగులతో పర్వాలేదన్పించారు. మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 16 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్ (21 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. నితీశ్ రాణా (23 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓడిపోయామని హార్దిక్ తెలిపాడు."ఈ ఓటమిని జీర్ణించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది. లక్ష్య చేధనలో మాకు అద్బుతమైన ఆరంభం లభించినప్పటికి మేము సద్వినియోగపరుచుకోలేకపోయాము. వాతవారణ పరిస్ధితుల కారణంగా పిచ్ కొంచెం మేము అనుకున్నదాని కంటే కొంచెం భిన్నంగా ఉంది. అయితే బ్యాటింగ్‌కు మరి అంత కష్టమైన వికెట్(ఈడెన్ పిచ్) అయితే కాదు. పరిస్థితులకు తగ్గట్టు మా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. 158 పరుగుల టార్గెట్ అనేది మరి అంత పెద్ద లక్ష్యమేమి కాదు. తొలుత మేము బౌలింగ్ చేసే టప్పుడు మా బౌలర్లు కాస్త ఇబ్బంది పడ్డారు. బంతి బౌండరీకి వెళ్లిన ప్రతీసారి పూర్తిగా తడిగా మారి వెనుక్కి వచ్చేది. మంచు ప్రభావం ఎక్కువగా ఉండడంతో ప్రత్యర్ధి బ్యాటర్లు బౌండరీలను అలవోకగా బాదారు.ఇక మా చివరి మ్యాచ్ కోసం ప్రత్యేక ప్రణాళికలలు ఏమీ లేవు. వీలైనంతవరకు టోర్నీని విజయంతో ముగించేందుకు ప్రయ"త్నిస్తాము. ఏదమైనప్పటికి ఈ ఏడాది సీజన్లో మా స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయామని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హార్దిక్ పేర్కొన్నాడు. -
MI Vs KKR: బుమ్ బుమ్ బుమ్రా.. క్రికెట్ చరిత్రలోనే సూపర్ బాల్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ మరో ఓటమి చవి చూసింది. శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 16 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (21 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. నితీశ్ రాణా (23 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, ఆరోరా, రస్సెల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.అయితే ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సంచలన బంతితో మెరిశాడు. అద్భుతమైన బంతితో కేకేఆర్ ఓపెనర్ సునీల్ నరైన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన బుమ్రా తొలి బంతినే నరైన్‌కు అద్భుతమైన ఇన్-స్వింగింగ్ యార్కర్‌గా సంధించాడు.బుమ్రా వేసిన బంతికి నరైన్ దగ్గర సమధానమే లేకుండా పోయింది. నరైన్ బ్యాట్ కిందకు దించే లోపే బంతి స్టంప్స్‌ను గిరాటేసింది. ఇది చూసిన నరైన్ బిత్తర పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు వరల్డ్‌క్రికెట్‌లో యార్కర్ల కింగ్ అంటూ బుమ్రాను పొగడ్తలతో ముంచెత్తున్నారు. ఈ మ్యాచ్‌లో బుమ్రా తన నాలుగు ఓవర్ల కోటాలో 39 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. Jasprit Bumrah is my happiness.pic.twitter.com/wvLPZSbhs5— R A T N I S H (@LoyalSachinFan) May 11, 2024 -
‘ప్లేఆఫ్స్’కు కోల్‌కతా
కోల్‌కతా: ఈ సీజన్ ఐపీఎల్లో ‘ప్లే ఆఫ్స్’ చేరిన తొలి జట్టుగా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలిచింది. శనివారం జరిగిన పోరులో కోల్‌కతా 18 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై గెలిచింది. భారీ వర్షం వల్ల మ్యాచ్ చాలా ఆలస్యంగా మొదలవడంతో 16 ఓవర్లకు కుదించారు. ముందుగా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 16 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (21 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), నితీశ్ రాణా (23 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. అనంతరం ముంబై ఇండియన్ 16 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులే చేసింది. ఇషాన్ కిషన్ (22 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిలక్‌వర్మ (17 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. మెరిపించిన వెంకటేశ్ ఇన్నింగ్స్ తొలిబంతికే సిక్సర్ బాదిన సాల్ట్ (6)ను ఐదో బంతికే తుషార అవుట్ చేయగా, మరో ప్రమాదకర ఓపెనర్ సునీల్ నరైన్ (0) బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. బుమ్రా వేసిన నాలుగో ఓవర్లో వెంకటేశ్ 4, 6, 4 బాదాడు. కానీ మరుసటి ఓవర్లోనే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (7)ను అన్షుల్ బౌల్డ్ చేసి ముంబై శిబిరాన్ని మురిపించాడు. పవర్‌ప్లే 5 ఓవర్లలో నైట్‌రైడర్స్ 45/3 స్కోరు చేసింది. ఆరో ఓవర్లో జట్టు స్కోరు 50 దాటగా... నితీశ్ రాణా, వెంకటేశ్‌ల దూకుడుతో కోల్‌కతా ఇన్నింగ్స్ పుంజుకుంది. వెంకటేశ్ ధాటికి చావ్లా అడ్డుకట్ట వేయగా, రసెల్ (14 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాకతో నైట్‌రైడర్స్ 10.2 ఓవర్లలో వంద పరుగులు దాటింది. అడపాదడపా బౌండరీలతో జట్టు స్కోరును పెంచుతున్న నితీశ్ రాణాను తిలక్ వర్మ చక్కని త్రో రనౌట్ చేయగా, ఓవర్ వ్యవధిలో రసెల్ మెరుపులకు చావ్లా కళ్లెం వేశాడు. తర్వాత ఆఖరి ఓవర్లలో రింకూ సింగ్ (12 బంతుల్లో 20; 2 సిక్స్‌లు), రమణ్‌దీప్ సింగ్ (8 బంతుల్లో 17 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్)లు కూడా ధాటిని ప్రదర్శించడంతో ప్రత్యర్థి ముందు కష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. రాణించిన ఇషాన్ ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ (24 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్) ముంబైకి చక్కని ఆరంభాన్నే ఇచ్చారు. ఓ వైపు రోహిత్ కుదురుగా ఆడుతుంటే మరోవైపు కిషన్ చెలరేగాడు. బౌండరీలు, సిక్సర్లతో స్కోరు వేగాన్ని పెంచాడు. 5 ఓవర్ల పవర్‌ప్లేలో ముంబై 59/0 స్కోరు చేసింది.అయితే ఇంత చక్కని శుభారంభానికి కోల్‌కతా స్పిన్నర్లు తూట్లు పొడిచారు. వరుస ఓవర్లలో నరైన్, ఇషాన్‌ను... రోహిత్‌ను వరుణ్ అవుట్ చేయడంతో ముంబై రూటు మారింది. రసెల్ బంతినందుకొని హిట్టర్లు సూర్యకుమార్ (11), టిమ్ డేవిడ్ (0)లను అవుట్ చేయడంతోనే ముంబై లక్ష్యానికి దూరమైంది. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) అన్షుల్ (బి) తుషార 6; నరైన్ (బి) బుమ్రా 0; వెంకటేశ్ (సి) సూర్యకుమార్ (బి) చావ్లా 42; శ్రేయస్ (బి) అన్షుల్ 7; నితీశ్ రనౌట్ 33; రసెల్ (సి) అన్షుల్ (బి) చావ్లా 24; రింకూ సింగ్ (సి) ఇషాన్ (బి) బుమ్రా 20; రమణ్‌దీప్ నాటౌట్ 17; స్టార్క్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (16 ఓవర్లలో 7 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–6, 2–10, 3–40, 4–77, 5–116, 6–125, 7–148. బౌలింగ్: తుషార 3–0–31–1, బుమ్రా 4–0–39–2, అన్షుల్ 3–0–24–1, హార్దిక్ 3–0–32–0, పియూశ్ చావ్లా 3–0–28–2. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (సి) రింకూ (బి) నరైన్ 40; రోహిత్ (సి) నరైన్ (బి) వరుణ్ 19; సూర్యకుమార్ (సి) రమణ్‌దీప్ (బి) రసెల్ 11; తిలక్‌వర్మ (సి) సాల్ట్ (బి) హర్షిత్ 32; హార్దిక్ (సి) వైభవ్ (బి) వరుణ్ 2; డేవిడ్ (సి) శ్రేయస్ (బి) రసెల్ 0; నేహల్ రనౌట్ 3; నమన్ (సి) రింకూ (బి) హర్షిత్ 17; అన్షుల్ నాటౌట్ 2; చావ్లా నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (16 ఓవర్లలో 8 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1–65, 2–67, 3–87, 4–91, 5–92, 6–117, 7–136, 8–137 బౌలింగ్: వైభవ్ 2–0–16–0, స్టార్క్ 1–0–11–0, హర్షిత్ 3–0–34–2, నరైన్ 3–0–21–1, వరుణ్ 4–0–17–2, రసెల్ 3–0–34–2. ఐపీఎల్లో నేడుచెన్నై X రాజస్తాన్‌వేదిక: చెన్నైమధ్యాహ్నం 3: 30 గంటల నుంచి బెంగళూరు X ఢిల్లీవేదిక: బెంగళూరురాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
KKR vs MI: కేకేఆర్‌తో ముంబై పోరు.. తుది జట్లు ఇవే
ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌ను వర్షం కారణంగా 16 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. కోల్‌కతా ఓ మార్పు చేసింది. రఘువంశీ స్ధానంలో నితీష్ రానా వచ్చాడు. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న కేకేఆర్ ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకోవాలని భావిస్తోంది. 11 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా.. ఎనిమిదింట విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. మరోవైపు ముంబై అయితే ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై 9వ స్ధానంలో నిలిచింది.ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నెహాల్ వధేరా, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, అన్షుల్ కాంబోజ్, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషారకోల్కతా నైట్ రైడర్స్ : ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రింకు సింగ్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి -
కేకేఆర్ వర్సెస్ ముంబై మ్యాచ్‌కు వర్షం అడ్డంకి..
ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది. ఈడెన్ గార్డెన్స్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షం కురుస్తోంది. దీంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. 7 గంటలకు టాస్ వేయాల్సి ఉండగా వర్షం కారణంగా ఆలస్యమైంది. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న కేకేఆర్ ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకోవాలని భావిస్తోంది.11 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా.. ఎనిమిదింట విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. మరోవైపు ముంబై అయితే ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై 9వ స్ధానంలో నిలిచింది. -
'హార్దిక్ ఒక అద్బుతమైన కెప్టెన్.. అందరి కంటే డిఫరెంట్'
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీజన్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించింది.ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై 9వ స్ధానంలో కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీపై పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది. ముంబై కొత్త కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్ధానంలో బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా..తన మార్క్ చూపించడంలో విఫలమయ్యాడు. కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా హార్దిక్ నిరాశపరుస్తున్నాడు. అదే విధంగా ముంబై డ్రెస్సింగ్ రూమ్ రెండు గ్రూపులుగా విడిపోయినట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఉద్దేశించి ముంబై యువ పేసర్ గెరాల్డ్ కోయెట్జీ కీలక వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ పాండ్యా అద్భుతమైన కెప్టెన్ అంటూ కోయెట్జీ పొగడ్తలతో ముంచెత్తాడు."హార్దిక్ పాండ్యా నిజంగా సూపర్ కెప్టెన్. అతడికి అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. ప్రతీ కెప్టెన్‌కు ఒక స్టైల్ ఉంటుంది. ఏ కెప్టెన్ కూడా ఒకేలా ఉండడు. హార్దిక్ జట్టులో ప్రతీఒక్క ఆటగాడికి సపోర్ట్‌గా ఉంటాడు. ఫీల్డ్‌లో సరైన ప్రణాళికలలు రచించడంలో హార్దిక్ దిట్ట.నా వరకు అయితే అతడొక అసాధారణమైన కెప్టెన్. ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో ఎటువంటి విభేదాలు లేవు. అందరం కలిసే ఉన్నాం. మిగిలిన మ్యాచ్‌ల్లో విజయం సాధించి టోర్నీ ఘనంగా ముగించేందుకు ప్రయత్నిస్తామని" ఓ ఇంటర్వ్యూలో కోయెట్జీ పేర్కొన్నాడు. -
ముంబై గెలిస్తే.. కేకేఆర్ కేకే! ప్లే ఆఫ్స్ బెర్తు కన్ఫామ్!?
-
MI: ముంబై ఇండియన్స్‌కు గుడ్‌బై?.. రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ యాజమాన్యం వ్యవహారశైలి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నాడా? వచ్చే ఏడాది అతడు జట్టును వీడనున్నాడా? హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో తనకు జరిగిన అవమానం పట్ల ఆవేదన చెందుతున్నాడా?తాను నిర్మించిన సామ్రాజ్యం నుంచి తానే బయటకు వెళ్లే సమయం వచ్చిందా? అంటే అవుననే మెజారిటీ మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రోహిత్ శర్మ- కోల్‌కతా నైట్ రైడర్స్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ మధ్య జరిగిన తాజా ‘సంభాషణ’కు సంబంధించిన దృశ్యాలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.ఐపీఎల్-2024 కంటే ముందే కెప్టెన్‌గా రోహిత్ శర్మపై వేటు వేసిన ముంబై ఫ్రాంఛైజీ.. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. అపఖ్యాతిఅయితే, అతడి సారథ్యంలో పేలవ ప్రదర్శనతో చతికిల పడిన ముంబై ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతిని మూటగట్టుకుంది. రోహిత్, హార్దిక్‌లకు మద్దతుగా జట్టు రెండు వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలోనే ఈ వైఫల్యాలు ఎదురయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అదే విధంగా.. పాండ్యా వ్యవహార శైలి పట్ల గుర్రుగా ఉన్న రోహిత్ వచ్చే ఏడాది ముంబై జట్టును వీడనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ముంబై శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ సన్నాహకాల్లో భాగంగా మైదానంలోకి వెళ్లిన రోహిత్- కేకేఆర్ కోచ్ అభిషేక్ నాయర్‌తో మాట్లాడినట్లుగా ఉన్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.అది నా ఇల్లు బ్రదర్ఇందులో.. ‘‘ఒక దాని తర్వాత మరొకటి మారిపోతూ ఉన్నాయి. వాళ్లే ఇందుకు కారణం. ఏదేమైనా గానీ.. అది నా ఇల్లు బ్రదర్.. నేను నిర్మించిన గుడి అది. ఇదే నాకు లాస్ట్’’ అంటూ రోహిత్ శర్మ వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. దీనిని బట్టి రోహిత్ ముంబై ఫ్రాంఛైజీకి గుడ్‌బై చెప్పడం ఖాయమని అనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ తదుపరి కేకేఆర్‌లో చేరితే బాగుంటుందంటూ పాకిస్తాన్ లెజెండరీ పేసర్, గతంలో కోల్‌కతా ఫ్రాంఛైజీతో పనిచేసిన వసీం అక్రం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిషేక్ నాయర్‌తో హిట్‌మ్యాన్ సంభాషణ మరింత హైలైట్ అవుతోంది.చదవండి: KL Rahul- Sanjeev Goenka: జట్టు గెలవాలన్న తపనే అది: బ్రెట్ లీClear audio of Rohit Sharma and Abhishek Nayar's conversation, he didn't said that it's his last IPL.Please don't make any conclusions on half said words.🙏pic.twitter.com/9lbtZRQvQB— Aryan 🇮🇳 (@Iconic_Hitman) May 10, 2024... That chat. Rohit to Nayar "Ek ek cheez change ho rha hai!,, Wo unke upar hai,,, Jo bhi hai wo mera ghar hai bhai, wo temple mene banwaya hai" Last line - "Bhai mera kya mera to ye last hai" And now KKR deleted that chatting video of Rohit Sharma and Nayar#RohitSharma pic.twitter.com/4BiQzutQdH— HitMan 🖤 (@Sachin__i) May 11, 2024 -
రోహిత్ ముంబైని వీడటం ఖాయం.. ఆ తర్వాత అతడి కెప్టెన్సీలో!
ఐపీఎల్-2024లో కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మపై వేటు వేసి.. హార్దిక్ పాండ్యాను సారథి చేసినందుకు భారీ మూల్యమే చెల్లించింది.తాజా ఎడిషన్‌లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. కాగా రోహిత్ శర్మను కెప్టెన్‌గా తప్పించిన నాటి నుంచే అభిమానులు మేనేజ్మెంట్పై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాను మైదానం లోపల, వెలుపలా పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. అందుకు తగ్గట్లుగానే అతడు ఏమాత్రం రాణించలేకపోతున్నాడు. ఇంకో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానేపాండ్యా సారథ్యంలో ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్‌లలో కేవలం నాలుగు మాత్రమే గెలిచి.. ఇంకో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకొంది.ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ వాతావరణం అస్సలు బాగా లేదని.. రోహిత్, హార్దిక్‌లకు మద్దతుగా జట్టు రెండు వర్గాలుగా విడిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోహిత్ శర్మ కన్నీళ్లుస్టార్ ఆటగాళ్ల మధ్య విభేదాల వల్లే ముంబై పరిస్థితి ఇలా మారిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో వైఫల్యం తర్వాత రోహిత్ శర్మ కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా ఉన్న వీడియో వీటికి మరింత బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్లో హిట్‌మ్యాన్ ముంబై ఫ్రాంఛైజీని వీడనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ పేస్ లెజెండ్ వసీం అక్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ ముంబైని వీడతాడువచ్చే ఏడాది రోహిత్ శర్మ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆడితే చూడాలని ఉందని పేర్కొన్నాడు. ఈ మేరకు స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసి వచ్చే ఏడాది రోహిత్ శర్మ ముంబైతో కొనసాగకపోవచ్చు.అతడు కేకేఆర్‌లోకి రావాలని కోరుకుంటున్నాను. అక్కడ గౌతీ(గంభీర్) మెంటార్షిప్లో.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తూ ఉంటే ఎంతో బాగుంటుంది.గొప్ప ఆటగాడుఈడెన్ గార్డెన్స్ పిచ్ మీద రోహిత్ అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు. అతడొక గొప్ప ప్లేయర్. అతడు కేకేఆర్‌లోకి వస్తే చాలా చాలా బాగుంటుంది’’ అని వసీం అక్రం తన మనసులోని భావాలు పంచుకున్నాడు. ఇక ఈ సీజన్లో ఇప్పటికే పదకొండు మ్యాచ్‌లలో ఎనిమిది గెలిచి పట్టికలో అగ్రస్థానంలో ఉన్న కేకేఆర్ ప్రదర్శను ఈ సందర్భంగా కొనియాడాడు కూడా!చదవండి: SRH: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్.. ప్రపంచంలోనే తొలి టీ20 జట్టుగా.. -
Playoffs: పాండ్యాకు పరాభవం.. ముంబై కథ ముగిసిందిలా!
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు నుంచి ముంబై ఇండియన్స్ నిష్క్రమించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య బుధవారం మ్యాచ్ ఫలితంతో పాండ్యా సేన టాప్-4 ఆశలు గల్లంతయ్యాయి. లక్నోను సన్‌రైజర్స్ చిత్తు ఓడించడంతో ఈ సీజన్లో ముంబై ప్రయాణం ముగిసినట్లయింది.ఎలా అంటే?ఉప్పల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ లక్నోను పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. కేఎల్ రాహుల్ సేన విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా 9.4 ఓవర్లలోనే ఛేదించింది.WHAT. A. CHASE 🧡A 🔟-wicket win for @SunRisers with more than 🔟 overs to spare! Scorecard ▶️ https://t.co/46Rn0QwHfi#TATAIPL | #SRHvLSG pic.twitter.com/kOxzoKUpXK— IndianPremierLeague (@IPL) May 8, 2024తద్వారా క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్‌లో ఏడో విజయం(పన్నెండు మ్యాచ్‌లకు గానూ) నమోదు చేసి.. మొత్తంగా 14 పాయింట్లు సాధించింది. నెట్ రన్‌రేటు(0.406) కూడా మెరుగుపరచుకుని పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. టాప్-2లో తిష్ట వేసిన కేకేఆర్, రాజస్తాన్‌మరోవైపు.. కోల్‌కతా నైట్ రైడర్స్(రన్‌రేటు 1.453), రాజస్తాన్ రాయల్స్(రన్‌రేటు 0.476) పదకొండేసి మ్యాచ్‌లు ఆడి చెరో 16 పాయింట్లతో టాప్-2లో కొనసాగుతున్నాయి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ 11 మ్యాచ్‌లలో ఆరు గెలిచి 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.ఈ నేపథ్యంలో చెరో 12 పాయింట్లతో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్(రన్‌రేటు -0.316), లక్నో సూపర్ జెయింట్స్(రన్‌రేటు -0.769) వచ్చే వారం తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా 14 పాయింట్లతో పైకి ఎగబాకుతుంది.పాండ్యా సేనకు తప్పని పరాభవంమరోవైపు.. ఆర్సీబీ(11 మ్యాచ్‌లు- 8 పాయింట్లు- మిగిలినవి 3), పంజాబ్ కింగ్స్(11 మ్యాచ్‌లు- 8 పాయింట్లు- మిగిలినవి 3) ఏడు, ఎనిమిది స్థానాల్లో కొనసాగుతున్నాయి. అయితే, ముంబై ఇండియన్స్ తొమ్మిదో స్థానంలో ఉన్నప్పటికీ ఇప్పటికే 12 మ్యాచ్‌లు ఆడేసింది. కేవలం నాలుగింట గెలిచి 8 పాయింట్లతో ఉంది.మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినా మహా అయితే మొత్తంగా 12 పాయింట్లు వస్తాయి. కాబట్టి టాప్-4లో అడుగుపెట్టేందుకు ముంబైకి దారులు మూసుకపోయినట్లే! ఇక అట్టడుగున ఉన్న గుజరాత్ టైటాన్స్‌కు ఇంకో మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేకేఆర్, రాజస్తాన్, సన్‌రైజర్స్ దాదాపుగా ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకోగా.. ముంబై టోర్నీ నుంచి నిష్క్రమించినట్లయింది.చదవండి: #KL Rahul: కెప్టెన్‌పై కోపంతో ఊగిపోయిన లక్నో ఓనర్.. అందరూ చూస్తుండగానే అలా.. -
కమిన్స్ మాటలు విని షాకైన హార్దిక్! వీడియో వైరల్
మైదానంలో ఉన్నంత సేపు ప్రత్యర్థులు.. ఒక్కసారి ఆట ముగియగానే స్నేహితులు.. దాదాపు క్రీడాకారులంతా ఇలాగే ఉంటారు. ముఖ్యంగా లీగ్ క్రికెట్లో ఇలాంటి దృశ్యాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి.ఐపీఎల్-2024లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఇలాంటి దృశ్యం ఆవిష్కృతమైంది. సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌తో ముచ్చటించాడు.పరస్పరం ఆప్యాయంగా పలకరించుకుని ముచ్చట్లలో మునిగిపోయిన వేళ.. కమిన్స్ తన వేలి గాయం గురించి పాండ్యా, సూర్యలకు చెప్పాడు. తన కుడిచేతి మధ్యవేలు ముందరి భాగం చిన్నప్పుడే విరిగిపోయిందని కమిన్స్ చెప్పగానే వాళ్లిద్దరు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు.ముఖ్యంగా హార్దిక్ పాండ్యా అయితే.. ‘‘అయ్యె అవునా?’’ అన్నట్లుగా షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. సాటి ఫాస్ట్ బౌలర్‌గా కమిన్స్ కష్టాన్ని తెలుసుకుని సానుభూతి వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.కాగా రైటార్మ్ పేసర్ అయిన ప్యాట్ కమిన్స్ 2011లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా.. ‘‘నాకు నాలుగేళ్ల వయసున్నపుడు.. డోర్ మధ్య వేలు ఇరుక్కోవడంతో పైభాగంలో సెంటీమీటర్ మేర విరిగిపోయింది. అయినా.. నా బౌలింగ్ యాక్షన్‌పై ఎలాంటి ప్రభావం పడలేదు.ఎందుకంటే నా వేళ్లు అన్నీ దాదాపుగా ఒకే లెంగ్త్‌తో ఉంటాయి. ఈ విషయంలో ఇప్పటికీ నా సోదరి బాధపడుతూనే ఉంటుంది. ఎందుకంటే తనే డోర్ వేసింది’’ అని కమిన్స్ తెలిపాడు. అదన్న మాట సంగతి!ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సోమవారం నాటి మ్యాచ్‌లో ముంబై సన్‌రైజర్స్‌ను ఓడించింది. సూర్యకుమార్ యాదవ్ వీరోచిత అజేయ శతకం(51 బంతుల్లో 102)తో రాణించి ముంబై ఇండియన్స్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో కమిన్స్ బ్యాట్(17 బంతుల్లో 35)తో రాణించడమే గాక ఒక వికెట్ కూడా తీశాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా మూడు కీలక వికెట్లు తీసి సన్‌రైజర్స్ ఓటమిలో సూర్యతో పాటు తానూ కీలక పాత్ర పోషించాడు.చదవండి: T20 WC: ద్రవిడ్, రోహిత్‌కు నచ్చకపోవచ్చు.. కానీ నా సలహా ఇదే!Pat Cummins must be telling about how he lost the top of his middle finger on his dominant right hand when his sister accidentally slammed a door on it. Hardik's reaction 😱 pic.twitter.com/oinHeW99mn— 𝗔𝗱𝗶𝘁𝘆𝗔 (@StarkAditya_) May 7, 2024 -
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
‘‘నాకు తెలిసి అతడు పూర్తిగా అలసిపోయాడు. టీమిండియా కెప్టెన్‌గా, ముంబై ఇండియన్స్ కీలక ఆటగాడిగా విరామం లేని షెడ్యూల్‌తో బిజీగా గడుపుతున్నాడు.అతడికి కాస్త విశ్రాంతి అవసరం. బ్రేక్ తీసుకుని తిరిగి వస్తే తిరిగి ఫామ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. గత మ్యాచ్‌కు ముందు అతడు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నపుడు గమనించాను.వెన్నునొప్పితో బాధపడుతున్నట్లుగా అనిపించింది. అతడు పూర్తి ఫిట్‌గా, సంతోషంగా ఉంటేనే ముంబైకి, టీమిండియాకు శుభసూచకం. విశ్రాంతి లేకుండా ఆడితే మాత్రం ఇబ్బందులు తప్పవు.నిజానికి బ్యాటింగ్ పరంగా తనకు సమస్య లేదు. బ్రేక్ మాత్రం అవసరం’’ అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, కామెంటేటర్ మైకేల్ క్లార్క్ అన్నాడు. టీమిండియా సారథి రోహిత్ శర్మను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.అదొక్కటి తప్ప కాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ ఆటగాడిగా కొనసాగుతున్న రోహిత్ శర్మ ఆరంభంలో బాగానే ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సునామీ సెంచరీతో విరుచుకుపడ్డాడు కూడా!కానీ గత కొంతకాలంగా రోహిత్ శర్మ ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. గత ఐదు ఐపీఎల్ మ్యాచ్‌లలో రోహిత్ సాధించిన పరుగులు కేవలం 33. ఇందులో నాలుగుసార్లు అతడు సింగిల్ డిజిట్ స్కోర్లు నమోదు చేశాడు.మరోసారి వైఫల్యంఇక సన్‌రైజర్స్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లోనూ రోహిత్ వైఫల్యం కొనసాగింది. ఐదు బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులు చేసి నిష్క్రమించాడు రోహిత్. టైమింగ్ మిస్ అయి వికెట్ పారేసుకున్నాడు.అలా అయితే తిరిగి ఫామ్లోకిఈ నేపథ్యంలో మైకేల్ క్లార్క్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. రోహిత్ శర్మకు విశ్రాంతినివ్వాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశాడు. ఓవైపు టీ20 వరల్డ్‌కప్-2024 నేపథ్యంలో జట్టు ఎంపిక, కూర్పు, ప్రెస్మీట్లు.. మరోవైపు ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లతో రోహిత్ అలసిపోయాడని పేర్కొన్నాడు.అందుకే కాస్త బ్రేక్ ఇస్తే తిరిగి పుంజుకోగలడని క్లార్క్ అభిప్రాయపడ్డాడు. కాగా ఈ సీజన్లో ఇప్పటి వరకు రోహిత్ శర్మ ఆడిన 12 మ్యాచ్‌లలో కలిపి 330 పరుగులు మాత్రమే చేయగలిగాడు. చదవండి: Rohit Sharma Crying Video: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్ -
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఎలా ఉన్నా ఆ జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రం ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు జరిగిన 12 మ్యాచ్‌లలో భాగమైన బుమ్రా.. 18 వికెట్లు కూల్చాడు.తద్వారా అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో అగ్రస్థానం(మే 7 నాటికి) అగ్రస్థానంలో నిలిచి.. పర్పుల్ క్యాప్ తన దగ్గర పెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలుపొందిన విషయం తెలిసిందే.ఆశలు సజీవమేవాంఖడే వేదికగా హైదరాబాద్ జట్టును ఏడు వికెట్ల తేడాతో ఓడించిన ముంబై.. ఈ సీజన్లో నాలుగో విజయం నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్నప్పటికీ అధికారికంగా ముంబై ఇంకా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించలేదు.ఇక ఇప్పటికి 12 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్‌కు లీగ్ దశలో ఇంకో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఒకవేళ ప్లే ఆఫ్స్ చేరితే సంగతి వేరు!కాగా మే 26 నాటి ఫైనల్‌తో ఐపీఎల్ పదిహేడో ఎడిషన్‌కు తెరపడనుండగా.. జూన్ 1 నుంచి టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. జూన్ 5న టీమిండియా ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలిఈ నేపథ్యంలో పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాకు ముంబై ఇండియన్స్ యాజమాన్యం విశ్రాంతినివ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ విషయమై అసిస్టెంట్ కోచ్ కీరన్ పొలార్డ్‌కు సోమవారం ప్రశ్న ఎదురైంది.కుదరదుఇందుకు బదులిస్తూ.. ‘‘ఈ విషయంపై నేను స్పష్టతనివ్వలేను. అయితే, మేమంతా ఇక్కడున్నది సీజన్ ఆసాంతం సేవలు అందించడానికే! ఇతర విషయాల గురించి పెద్దగా ఆలోచించే పరిస్థితిలో లేము. వరల్డ్‌కప్ గురించి ఇప్పటి నుంచే మాట్లాడటం అనవసరం. ఇలాంటివి ప్రస్తుత ప్రదర్శనలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది’’ అని కీరన్ పొలార్డ్ చెప్పుకొచ్చాడు. బుమ్రాకు ప్రస్తుతం విశ్రాంతినిచ్చే ఆలోచన లేదని పరోక్షంగా స్పష్టం చేశాడు.చదవండి: Rohit Sharma Crying Video: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్ -
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
ఐపీఎల్-2024 టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు పెద్దగా కలిసి రావడం లేదు. సీజన్ ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్ కెప్టెన్ పదవిని కోల్పోయిన హిట్‌మ్యాన్.. హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆటగాడిగా కొనసాగుతున్నాడు.కానీ బ్యాటర్‌గా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 12 ఇన్నింగ్స్‌లో కలిపి రోహిత్ శర్మ చేసిన పరుగులు 330. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో పదిహేడో స్థానం(మే 7 నాటికి)లో ఉన్నాడు.ఆ సెంచరీ మినహా!ఈ ఎడిషన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మీద సాధించిన శతకం(105 నాటౌట్) మినహా మిగతా మ్యాచ్‌లలో రాణించలేకపోయాడు. తాజాగా సన్‌రైజర్స్‌తో సోమవారం ముగిసిన మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మ విఫలమయ్యాడు.భావోద్వేగానికి గురైన రోహిత్!వాంఖడే మైదానంలో ఐదు బంతులు ఎదుర్కొన్న రోహిత్.. కేవలం ఒక్క ఫోర్ కొట్టి అవుటయ్యాడు. రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఈ నేపథ్యంలో నిరాశగా మైదానం వీడిన రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లి తీవ్ర భావోద్వేగానికి గురైనట్లుగా కనిపించాడు. దుఃఖాన్ని ఆపుకొంటూ రోహిత్ కన్నీళ్లను తుడుచుకుంటున్నట్లుగా కనిపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.పాపం రోహిత్ఈ వీడియో చూసిన రోహిత్ శర్మ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ‘‘టీ20 వరల్డ్‌కప్‌నకు ముందు నిన్నిలా చూడలేకపోతున్నాం హిట్‌మ్యాన్. ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ నిర్ణయం వల్లే ఇదంతా. కెప్టెన్సీ నుంచి అవమానకరంగా తప్పించి అతడిని ఒత్తిడిలోకి నెట్టేశారు.ఐదుసార్లు ట్రోఫీ అందించిన కెప్టెన్‌పై వేటు వేశారు. అందుకు తగిన మూల్యం చెల్లిస్తున్నారు’’ అంటూ ముంబై జట్టు మేనేజ్మెంట్పై మండిపడుతున్నారు. ఏదేమైనా రోహిత్ శర్మ వైఫల్యాలను అధిగమించి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ఈ సీజన్లో నాలుగో విజయం అందుకుంది. చదవండి: ధోని గురించి నిజాలు ఇవే! మాజీ క్రికెటర్లకు కౌంటర్Rohit Sharma crying in the dressing room. pic.twitter.com/GRU5uF3fpc— Gaurav (@Melbourne__82) May 6, 2024💯 & winning runs in styleSuryakumar Yadav hits a maximum to bring up his century 👏Watch the recap on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #MIvSRH | @mipaltan pic.twitter.com/RlaOZ8l2i0— IndianPremierLeague (@IPL) May 6, 2024 -
ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ నాలుగో విజయం నమోదు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి చేరుకుంది. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్ వల్లే ముంబైకి ఈ గెలుపు సాధ్యమైంది.తద్వారా ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించే తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకునే ప్రమాదం నుంచి ముంబై తప్పించుకోగలిగింది. ఈ నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా హర్షం వ్యక్తం చేశాడు.సూర్యలాంటి విధ్వంసకర బ్యాటర్ తమ జట్టులో ఉండటం అదృష్టమంటూ అతడిని కొనియాడాడు. అదే విధంగా.. విజయానంతరం కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ నుంచి ఎదురైన ప్రశ్నకు హార్దిక్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా?ప్లే ఆఫ్స్ రేసు గురించి మంజ్రేకర్ ప్రస్తావించగా.. ‘‘మీరు ఏ సమీకరణల గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు. అయితే, మేము ఇంకాస్త మెరుగ్గా ఆడాలని అనుకుంటున్నాం’’ అని హార్దిక్ బదులిచ్చాడు.ఇక సన్‌రైజర్స్‌తో మ్యాచ్ ఫలితం గురించి మాట్లాడుతూ.. ‘‘మేము 10- 15 పరుగులు అదనంగా సమర్పించుకున్నాం. ఏదేమైనా మా బ్యాటర్లు అత్యద్భుతంగా ఆడారు. ఇక నేను కూడా ఈరోజు మెరుగ్గా బౌలింగ్ చేయగలిగాను.అత్యుత్తమ బ్యాటర్పరిస్థితులకు అనుగుణంగా నా వ్యూహాలను అమలు చేయగా సత్ఫలితాలు వచ్చాయి. ఇక ‘స్కై’ గురించి చెప్పేదేముంది. తనలోని అత్యుత్తమ బ్యాటర్ మరోసారి బయటకు వచ్చాడు.ప్రత్యర్థి జట్టు బౌలర్లను ఒత్తిడిలో కూరుకుపోయేలా చేశాడు. ఆత్మవిశ్వాసంతో అతడు బ్యాటింగ్ చేసిన తీరు మ్యాచ్ స్వరూపాన్నే మార్చి వేసింది. ఒంటిచేత్తో జట్టును గెలిపించగల సత్తా అతడి సొంతం’’ అని సూర్యకుమార్ యాదవ్‌పై హార్దిక్ పాండ్యా ప్రశంసలు కురిపించాడు.ముంబై వర్సెస్ హైదరాబాద్ స్కోర్లు:👉వేదిక: వాంఖడే, ముంబై👉టాస్: ముంబై.. బౌలింగ్👉హైదరాబాద్ స్కోరు: 173/8 (20)👉ముంబై స్కోరు: 174/3 (17.2)👉ఫలితం: ఏడు వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై ముంబై గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సూర్యకుమార్ యాదవ్(51 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 102 రన్స్- నాటౌట్).చదవండి: తండ్రిని ఎంకరేజ్ చేసేందుకు వచ్చిన జూనియర్ బుమ్రా..!💯 & winning runs in styleSuryakumar Yadav hits a maximum to bring up his century 👏Watch the recap on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #MIvSRH | @mipaltan pic.twitter.com/RlaOZ8l2i0— IndianPremierLeague (@IPL) May 6, 2024 -
తండ్రిని ఎంకరేజ్ చేసేందుకు వచ్చిన జూనియర్ బుమ్రా..!
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా నిన్న (మే 6) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ సన్‌రైజర్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ మెరుపు శతకంతో (51 బంతుల్లో 102 నాటౌట్; 12 ఫోర్లు, 6 సిక్సర్లు) విరుచుకుపడి ముంబైని ఒంటిచేత్తో గెలిపించాడు. తొలుత ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సన్‌రైజర్స్ 173 పరుగుల నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ఛేదనలో ముంబై సైతం ఆదిలో తడబడినప్పటికీ స్కై.. తిలక్ వర్మ (37 నాటౌట్) సహకారంతో ముంబైని విజయతీరాలకు చేర్చాడు. ఐపీఎల్లో స్కైకు ఇది రెండో సెంచరీ. Angad bumrah is here !!! So cute ,,#MIvSRH #bumrah #RohitSharma @Jaspritbumrah93 pic.twitter.com/EzxEdHwRPI— Randhir_45 (@Mr_Randhir_45) May 6, 2024ఈ మ్యాచ్‌లో ముంబై బౌలర్లు హార్దిక్ పాండ్యా (4-0-31-3), పియూశ్ చావ్లా (4-0-33-3) సైతం సత్తా చాటారు. నాలుగు వరుస పరాజయాల తర్వాత ఎట్టకేలకు ముంబైకు ఊరటనిచ్చే గెలుపు దక్కింది. ఈ గెలుపుతో ముంబై పాయింట్ల పట్టికలో పదో స్థానం నుంచి తొమ్మిదో ప్లేస్‌కు ఎగబాకింది. ఈ సీజన్లో ముంబై మరో రెండు మ్యాచ్‌లు (మే 11న కేకేఆర్‌తో, మే 17న లక్నోతో) ఆడాల్సి ఉన్నా ప్లే ఆఫ్స్‌కు చేరే పరిస్థితి లేదు. అలాగని టెక్నికల్‌గా ఇంకా ఔట్ కాలేదు. ఏదైనా మహాద్భుతం జరిగితే తప్ప ముంబై ఈ సీజన్ ప్లే ఆఫ్స్‌కు చేరలేదు.జూనియర్ బుమ్రా వచ్చాడు..ఇదిలా ఉంటే, నిన్న వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఓ చిట్టిపొట్టి అతిథి అందరి దృష్టిని ఆకర్శించాడు. అతడే బుమ్రా తనయుడు అంగద్ బుమ్రా. అంగద్.. తన తల్లి సంజనా గణేశన్‌తో కలిసి తన తండ్రి జస్ప్రీత్ బుమ్రాను ఎంకరేజ్ చేసేందుకు వాంఖడేకు వచ్చాడు. వీఐపీ స్టాండ్స్‌లో సంజనా.. అంగద్‌ను ఒడిలో కూర్చొబెట్టుకుని కెమెరా కంటికి చిక్కింది. ఈ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. అంగద్ తొలిసారి పబ్లిక్‌లోకి రావడంతో చిన్నారిని చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. అంగద్ ముంబై ఇండియన్స్ జెర్సీ ధరించి ఉండటంతో ఆ ఫ్రాంచైజీ అభిమానులు తెగ సంబురపడిపోతున్నారు. జూనియర్ బుమ్రా వచ్చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్‌లో యధావిధిగా అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో తన కోటా నాలుగు ఓవర్లు పూర్తి చేసిన బుమ్రా కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన అభిషేక్ శర్మ (11) వికెట్ పడగొట్టాడు. మొత్తానికి బుమ్రా కొడుకు అంగద్ నిన్నటి మ్యాచ్ సందర్భంగా చర్చనీయాంశంగా మారాడు. -
MI Vs SRH: ఆల్‌టైమ్ రికార్డు సమం
2024 ఐపీఎల్ సీజన్ గత సీజన్లకు భిన్నంగా జోరుగా సాగుతుంది. ఈ సీజన్లో దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో పరుగుల వరద పారడంతో పాటు భారీ సంఖ్యలో మెరుపు ఇన్నింగ్స్‌లు నమోదవుతున్నాయి. నిన్న (మే 6) ముంబై-ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లోనూ ఇలాంటి ఓ మెరుపు ప్రదర్శన నమోదైంది. ముంబై ఆటగాడు సూర్యకుమార్ (51 బంతుల్లో 102 నాటౌట్; 12 ఫోర్లు, 6 సిక్సర్లు) సునామీ శతకంతో విరుచుకుపడి తన జట్టుకు అపురూప విజయాన్నందించాడు. ఈ క్రమంలో ఓ ఆల్‌టైమ్ రికార్డు సమం అయ్యింది.ఓ సీజన్లో అత్యధిక సెంచరీల రికార్డును ప్రస్తుత సీజన్ సమం చేసింది. 2023 సీజన్లో రికార్డు స్థాయిలో 12 సెంచరీలు (అన్ని జట్లు కలిపి) నమోదు కాగా.. ఈ సీజన్లో ఇప్పటికే 12 సెంచరీలు పూర్తయ్యాయి. ఇంకా 19 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగానే భారీ సంఖ్యలో నమోదు కావడంతో ఈ సీజన్ గత సీజన్ల కంటే భిన్నమని మరోసారి రుజువైపోయింది.ఐపీఎల్లో ఏ యేడుకాయేడు సెంచరీల సంఖ్య పెరుగుతూ వస్తుంది. 2022 సీజన్ మొత్తంలో 8 సెంచరీలు నమోదైనప్పుడు అభిమానులు ఆహా ఓహో అన్నారు. ఇప్పుడు మరికొన్ని మ్యాచ్‌లు మిగిలుండగానే 12 సెంచరీలు నమోదవడం చూసి ఫ్యాన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. నిన్నటి మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్పై ముంబై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ముక్కీ మూలిగి 173 పరుగులు చేసింది. ట్రవిస్ హెడ్ (48). కెప్టెన్ కమిన్స్ (35 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేసి సన్‌రైజర్స్ పరువు కాపాడారు. ముంబై బౌలర్లలో పియూశ్ చావ్లా, హార్దిక్ పాండ్యా తలో 3 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, అన్షుల్ కంబోజ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే సూర్యకుమార్.. తిలక్ వర్మ (37 నాటౌట్) సాయంతో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో ఓటమితో సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోవడంతో పాటు నెట్ రన్‌రేట్‌ను కూడా దిగజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ముంబై ఆఖరి స్థానం నుంచి లేచొచ్చి తొమ్మిదో స్థానానికి చేరుకుంది. -
IPL 2024: ముంబై ఆశలకు సూర్య ఊపిరి
ముంబై: ఐపీఎల్ నుంచి ‘ఫైవ్ స్టార్’ చాంపియన్ ముంబై ఇండియన్స్ అందరికంటే ముందుగా ని్రష్కమించే ముప్పును సూర్యకుమార్ యాదవ్ (51 బంతుల్లో 102 నాటౌట్; 12 ఫోర్లు, 6 సిక్స్‌లు) తప్పించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడి ముంబైని రేసులో నిలిపాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 7 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై ఘనవిజయం సాధించింది. మొదట సన్‌రైజర్స్ నిరీ్ణత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. హెడ్ (30 బంతుల్లో 48; 7 ఫోర్లు, 1 సిక్స్), ప్యాట్ కమిన్స్ (17 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. హార్దిక్ పాండ్యా, పియూశ్ చావ్లా చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ముంబై 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్యకుమార్‌కు అండగా తిలక్ వర్మ (32 బంతుల్లో 37 నాటౌట్; 6 ఫోర్లు) నిలిచాడు. ఆదుకున్న హెడ్ ఆరంభంలో హెడ్, ఆఖర్లో కమిన్స్ మెరుపులు మినహా సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ ఈ మ్యాచ్‌లో బోర్ కొట్టించింది. పవర్‌ప్లేలో 56/1 స్కోరు చేసిన హైదరాబాద్ 10 ఓవర్ల దాకా 88/2 స్కోరుతో పటిష్టంగానే కనిపించింది. అభిషేక్ (11), మయాంక్ అగర్వాల్ (5), నితీశ్ కుమార్ రెడ్డి (15 బంతుల్లో 20; 2 ఫోర్లు), క్లాసెన్ (2)... ఇలా కీలక బ్యాటర్లందరినీ వరుస విరామంలో కోల్పోవడంతో హైదరాబాద్ కోలుకోలేదు. 16వ ఓవర్ వేసిన పాండ్యా... షహబాజ్ అహ్మద్ (10), మార్కో జాన్సెన్ (17)లను అవుట్ చేయగా, సమద్ (3)ను చావ్లా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 136 పరుగులకే 8 వికెట్లు పడిపోవడంతో డెత్ ఓవర్లలో దూకుడుగా ఆడే స్పెషలిస్టు బ్యాటరే కరువయ్యాడు. అయితే కెపె్టన్ కమిన్స్ 2 ఫోర్లు, 2 సిక్సర్లతో సత్తాచాటడంతో హైదరాబాద్ 170 పైచిలుకు స్కోరు చేయగలిగింది. ‘సూర్య’ మేటి ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో రోహిత్ (4) అవుటవగానే సూర్యకుమార్ క్రీజులోకి వచ్చాడు. అంతకుముందే ఇషాన్ కిషన్ (9) పెవిలియన్‌లో కూర్చుకున్నాడు. ఆ తర్వాత నమన్ ధీర్ (0) డకౌటయ్యాడు. ముంబై స్కోరు 31/3. సంబరాల్లో హైదరాబాద్! ఒత్తిడిలో ముంబై... ఈ దశలో తిలక్ వర్మ అండతో ముంబైని పీకల్లోతు కష్టాల్లోంచి ఘనవిజయం దాకా సూర్యకుమార్ గ్రేటెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. మొదట్లో బౌండరీలతో జట్టును నడిపించిన ‘భారత 360’ డిగ్రీ బ్యాటర్ తర్వాత భారీషాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో జట్టు స్కోరు ఆరో ఓవర్లో 50 దాటగా... 12వ ఓవర్లో వంద పరుగుల్ని అధిగమించింది. ఈ భాగస్వామ్యం మెరుపులతో లక్ష్యాన్ని చేరింది. 30 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న సూర్య... శతక్కొట్టేందుకు మరో 21 బంతుల్లే అవసరమయ్యాయి. 18వ ఓవర్లో భారీ సిక్సర్‌తో 51 బంతుల్లో సెంచరీని పూర్తిచేసుకోవడంతోనే మ్యాచ్ కూడా ముగిసింది. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) తిలక్ వర్మ (బి) చావ్లా 48; అభిõÙక్ (సి) ఇషాన్ (బి) బుమ్రా 11; మయాంక్ (బి) అన్షుల్ 5; నితీశ్ కుమార్ రెడ్డి (సి) అన్షుల్ (బి) హార్దిక్ 20; క్లాసెన్ (బి) చావ్లా 2; జాన్సెన్ (బి) హార్దిక్ 17; షహబాజ్ (సి) సూర్యకుమార్ (బి) హార్దిక్ 10; సమద్ (ఎల్బీడబ్ల్యూ) (బి) చావ్లా 3; కమిన్స్ (నాటౌట్) 35; సనీ్వర్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–56, 2–68, 3–90, 4–92, 5–96, 6–120, 7–124, 8–136. బౌలింగ్: తుషార 4–0–42–0, అన్షుల్ 4–0–42–1, బుమ్రా 4–0–23–1, హార్దిక్ పాండ్యా 4–0–31–3, పియూశ్ చావ్లా 4–0–33–3. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ (సి) మయాంక్ (బి) జాన్సెన్ 9; రోహిత్ (సి) క్లాసెన్ (బి) కమిన్స్ 4; నమన్ (సి) జాన్సెన్ (బి) భువనేశ్వర్ 0; సూర్యకుమార్ (నాటౌట్) 102; తిలక్ వర్మ (నాటౌట్) 37; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (17.2 ఓవర్లలో 3 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–26, 2–31, 3–31. బౌలింగ్: భువనేశ్వర్ 4–1–22–1, జాన్సెన్ 3–0–45–1, కమిన్స్ 4–1–35–1, నటరాజన్ 3.2–0–31–0, నితీశ్ కుమార్ రెడ్డి 2–0–16–0, షహబాజ్ 1–0–11–0. -
సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
ఐపీఎల్-2024లో వరుస ఓటములను చవిచూసిన ముంబై ఇండియన్స్ తిరిగి పుంజుకుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం 3 వికెట్లు కోల్పోయి 17.2 ఓవర్లలో చేధించింది. కాగా లక్ష్య చేధనలో ముంబై 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఎస్ఆర్హెచ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. సూర్య తన హోం గ్రౌండ్లో విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఓవైపు గాయంతో బాధపడుతూనే ముంబై ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. సూర్య కేవలం 51 బంతుల్లోనే 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 102 పరుగులతో ఆజేయంగా నిలిచి తన జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించాడు. అతడితో పాటు తిలక్ వర్మ(37నాటౌట్) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, మార్కో జానెసన్, కమ్మిన్స్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(48) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఆఖరిలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 17 బంతులు ఎదుర్కొన్న కమ్మిన్స్ 2 సిక్స్‌లు, 2 ఫోర్లతో 35 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. వీరిద్దరితో పాటు నితీష్ రెడ్డి(20), జానెసన్(17) రాణించారు. ఇక ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, చావ్లా తలా మూడు వికెట్లు సాధించగా.. అన్షుల్ కాంబోజ్, బుమ్రా చెరో వికెట్ సాధించారు. -
SRH Vs MI: రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పర్వాలేదన్పించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(48) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఆఖరిలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 17 బంతులు ఎదుర్కొన్న కమ్మిన్స్ 2 సిక్స్‌లు, 2 ఫోర్లతో 35 పరుగులతో ఆజేయంగా నిలిచాడు.వీరిద్దరితో పాటు నితీష్ రెడ్డి(20), జానెసన్(17) రాణించారు. ఇక ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, చావ్లా తలా మూడు వికెట్లు సాధించగా.. అన్షుల్ కాంబోజ్, బుమ్రా చెరో వికెట్ సాధించారు. -
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
ఐపీఎల్-2024లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్దమైంది. వాంఖడే స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. ముంబై ఇండియన్స్ తరపున అన్షుల్ కాంబోజ్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. మరోవైపు ఎస్ఆర్హెచ్ తుది జట్టులోకి మయాంక్ అగర్వాల్ వచ్చాడు.ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్‌కు చాలా కీలకం. ఈమ్యాచ్‌లో ముంబై ఓటమి పాలైతే అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తోంది.తుది జట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, అన్షుల్ కాంబోజ్, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార