
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా వాంఖడే మైదానం వేదికగా నిన్న (ఏప్రిల్ 17) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది.
హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్‌లో మూడు సిక్సర్లు (2 ఆనికేత్, కమిన్స్ ఒకటి) సహా 22 పరుగులు, అంతకుముందు దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో రెండు సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రావడంతో సన్‌రైజర్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో అభిషేక్ 40, ట్రవిస్ హెడ్ 28, ఇషాన్ కిషన్ 2, నితీశ్ కుమార్ రెడ్డి 19, క్లాసెన్ 37, అనికేత్ 18 (నాటౌట్), కమిన్స్ 8 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ 2, బౌల్ట్, బుమ్రా, హార్దిక్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై మరో 11 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. ముంబై ఇన్నింగ్స్‌లో రికెల్టన్ 31, రోహిత్ శర్మ 26, విల్ జాక్స్ 36, సూర్యకుమార్ యాదవ్ 26, హార్దిక్ 21, తిలక్ 17 (నాటౌట్) పరుగులు చేశారు.
సన్‌రైజర్స్ బౌలర్లలో కమిన్స్ 3, ఎషాన్ మలింగ 2, హర్షల్ పటేల్ ఓ వికెట్ పడగొట్టారు. తొలుత బంతితో, ఆతర్వాత బ్యాట్‌తో రాణించిన విల్ జాక్స్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్
ఎస్‌ఆర్‌హెచ్‌పై గెలుపుతో ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. ఓ వేదికపై ఛేజింగ్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. వాంఖడే మైదానంలో ముంబై 29 సార్లు (47 మ్యాచ్‌ల్లో) లక్ష్యాలను ఛేదిస్తూ విజయాలు సాధించింది. ఈ రికార్డు సాధించే క్రమంలో ముంబై కేకేఆర్‌ను అధిగమించింది. కేకేఆర్ ఈడెన్ గార్డెన్స్‌లో 28 సార్లు (40 మ్యాచ్‌ల్లో) లక్ష్యాలను ఛేదిస్తూ విజయాలు సాధించింది.
ఐపీఎల్‌లో ఓ వేదికపై ఛేజింగ్ చేస్తూ అత్యధిక విజయాలు సాధించిన జట్లు..
ముంబై ఇండియన్స్- వాంఖడే స్టేడియం- 29 విజయాలు (47 మ్యాచ్‌లు)
కేకేఆర్- ఈడెన్ గార్డెన్స్- 28 (40)
రాజస్థాన్ రాయల్స్- సువాయ్ మాన్ సింగ్ స్టేడియం- 24 (31)
ఆర్సీబీ- చిన్నస్వామి స్టేడియం- 21 (41)
సన్‌రైజర్స్ హైదరాబాద్- ఉప్పల్ స్టేడియం- 21 (32)
సీఎస్‌కే- చెపాక్ స్టేడియం- 20 (31)