
Photo Courtesy: BCCI
ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (ఏప్రిల్ 27) జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఓ భారీ రికార్డును తృటిలో మిస్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ మరో 5 పరుగులు చేసుంటే ఐపీఎల్‌లో ఓ ప్రత్యర్థిపై (ఏ ప్రత్యర్థిపై అయినా) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పి ఉండేవాడు. ఈ రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ పంజాబ్ కింగ్స్‌పై 1134 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో ఓ ప్రత్యర్థిపై ఓ ఆటగాడు చేసిన అత్యధిక పరగులు ఇవే.
నిన్నటి మ్యాచ్‌లో ఢిల్లీపై చేసిన 51 పరుగులతో ఆ ఫ్రాంచైజీపై విరాట్ చేసిన పరుగుల సంఖ్య 1130 పరుగులకు చేరింది. ఈ మ్యాచ్‌లో విరాట్ మరో 5 పరుగులు చేసుంటే వార్నర్ రికార్డు బద్దలు కొట్టి కొత్త రికార్డును తన పేరిట లిఖించుకుని ఉండేవాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ 47 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 51 పరుగులు చేసి దుష్మంత చమీరా బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
ఐపీఎల్‌లో ఓ ప్రత్యర్థిపై అత్యధిక పరుగులు
1134 - డేవిడ్ వార్నర్ vs PBKS
1130 - విరాట్ కోహ్లీ vs DC*
1104 - విరాట్ కోహ్లీ vs PBKS
1093 - డేవిడ్ వార్నర్ vs KKR
1084 - విరాట్ కోహ్లీ vs CSK
1083 - రోహిత్ శర్మ vs KKR
కాగా, నిన్నటి మ్యాచ్‌లో విరాట్ బాధ్యాతాయుతమైన హాఫ్ సెంచరీతో సత్తా చాటడంతో ఢిల్లీపై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఈ ఇన్నింగ్స్‌తో విరాట్ సైతం అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మొదటి స్థానానికి చేరుకున్నాడు. విరాట్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి 6 అర్ద సెంచరీల సాయంతో 443 పరుగులు చేశాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీని ఆర్సీబీ బౌలర్లు 162 పరుగులకే పరిమితం చేశారు. భువీ 3, హాజిల్‌వుడ్ 2, యశ్ దయాల్, కృనాల్ తలో వికెట్ తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేసి ఢిల్లీని స్వల్ప స్కోర్‌కే కట్టడి చేశారు. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (41), ట్రిస్టన్ స్టబ్స్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
అనంతరం ఛేదనకు దిగిన ఆర్సీబీ పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయినా ఆతర్వాత కోలుకుంది. విరాట్ (47 బంతుల్లో 51; 4 ఫోరు), కృనాల్ (47 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) టైమ్ తీసుకుని ఇన్నింగ్స్‌ను నిర్మించి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు.
టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) ఆఖర్లో వేగంగా ఆడి మ్యాచ్‌ను ముగించాడు. ఆల్‌రౌండ్ షోతో సత్తా చాటిన కృనాల్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సీజన్‌లో ఆర్సీబీ ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. తదుపరి మ్యాచ్‌లో (మే 3) సీఎస్‌కేతో (బెంగళూరులో) తలపడనుంది.