RCB
-
ఐపీఎల్ 2026లో అత్యంత ప్రమాదకర పేస్ దళం ఏది..?
ఐపీఎల్ 2026లో బ్యాటర్ల హవా కొనసాగినా, పేస్ బౌలర్లు కూడా తమదైన ముద్ర వేశారు. ఈ సీజన్లో అత్యధిక 200+ స్కోర్లు నమోదైనా, కొన్ని జట్లు తమ బలమైన ఫాస్ట్ బౌలింగ్ దళంతో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాయి. సీజన్ మొత్తంలో ఏ జట్టుకు అత్యంత ప్రమాదకర పేస్ దళం ఉందో ఈ కంటెంట్‌లో చూద్దాం. చివరి నుంచి మొదలుపెడితే..కోల్‌కతా నైట్‌రైడర్స్ (2/10)ఈ సీజన్లో అత్యంత బలహీనమైన పేస్ అటాక్ కేకేఆర్‌ది అని చెప్పవచ్చు. హర్షిత్ రాణా, మతీష పతిరణ గాయాలతో దూరమవ్వడం ఈ సీజన్లో ఆ జట్టుకు భారీ దెబ్బ. కార్తీక్ త్యాగి 18 వికెట్లు తీసినా మిగతా పేసర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు.పంజాబ్ కింగ్స్ (2/10)ఈ జట్టులో అర్షదీప్ సింగ్ వంటి స్టార్ పేసర్ ఉన్నప్పటికీ, మిగతా పేసర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. వీరి కారణంగా కీలక మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లను కూడా కాపాడుకోలేకపోయారు.ముంబై ఇండియన్స్ (3/10)ఈ జట్టు పేస్ దళం ఈ సీజన్లో అతిపెద్ద నిరాశగా నిలిచింది. బుమ్రా, బౌల్ట్ లాంటి స్టార్ పేసర్లు ఆశించిన ప్రభావం చూపలేకపోయారు.చెన్నై సూపర్ కింగ్స్ (4/10)ఈ జట్టు తరఫున అన్షుల్ కంబోజ్ 21 వికెట్లతో మెరిసినా.. గాయాలు, అస్థిర ప్రదర్శనల కారణంగా పేస్ విభాగం బలహీనంగా కనిపించింది.ఢిల్లీ క్యాపిటల్స్ (4/10)ఈ జట్టులో స్టార్క్, నటరాజన్ కొంత మేర రాణించినా, మిగతా పేసర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.లక్నో సూపర్ జెయింట్స్ (5/10)ఈ సీజన్లో ఎల్ఎస్జీ చివరి స్థానంలో నిలిచినా, పేస్ బౌలింగ్‌లో మంచి సామర్థ్యం చూపింది. ప్రిన్స్ యాదవ్, షమీ ఆకట్టుకున్నారు. అయితే గాయాలు జట్టును దెబ్బతీశాయి.రాజస్థాన్ రాయల్స్ (6/10)ఈ సీజన్లో రాయల్స్ విజయాల్లో జోఫ్రా ఆర్చర్ కీలక పాత్ర పోషించాడు. 25 వికెట్లతో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.సన్‌రైజర్స్ హైదరాబాద్ (7/10)ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ పేస్ విభాగం బలంగా కనిపించింది. కమిన్స్ నేతృత్వంలో ఆ జట్టు పేస్ దళం మంచి సమతుల్యతను ప్రదర్శించింది. ఎషాన్ మలింగ 20 వికెట్లతో మెరిశాడు.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (8/10)బ్యాక్ టు బ్యాక్ టైటిళ్లు గెలవడంలో ఆర్సీబీ పేస్ బౌలర్ల పాత్ర అమోఘం. భువనేశ్వర్ కుమార్ 28 వికెట్లతో అదరగొట్టగా, రసిక్ సలాం, హాజిల్‌వుడ్ మంచి ప్రదర్శనలు ఇచ్చారు.గుజరాత్ టైటాన్స్ (9/10)ఈ సీజన్లో అత్యంత భయంకరమైన పేస్ దళం మాత్రం గుజరాత్ టైటాన్స్‌దే. ఈ జట్టులోని రబాడ, సిరాజ్, హోల్డర్, ప్రసిద్ద్ సమిష్టిగా సత్తా చాటారు. 29 వికెట్లు తీసి రబాడ పర్పుల్ క్యాప్ కూడా గెలుచుకున్నాడు. -
వైభవ్‌తో కోహ్లి చెప్పిన మాటలు ఇవే.. వీడియో వైరల్
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి సంతోషంలో మునిగితేలుతున్నాడు. ఐపీఎల్ తొలి టైటిల్ కోసం పద్దెనిమిదేళ్లు ఎదురుచూసిన ఈ రన్‌మెషీన్ కల గతేడాది ఫలించింది. క్యాష్ రిచ్ లీగ్ ఆరంభ సీజన్ నుంచి అతడు ప్రాతినిథ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 2025లో తొలిసారి ట్రోఫీ గెలిచింది.ఐపీఎల్-2026లోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేసిన ఆర్సీబీ.. వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలిచింది. గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం నాటి ఫైనల్లో ఐదు వికెట్ల తేడాతో గెలిచి విజేతగా అవతరించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి 75 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.వైభవ్ నమస్కారం చేయగా.. ఇదిలా ఉంటే.. ఫైనల్లో విజయం తర్వాత రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు, ఆరెంజ్‌క్యాప్ విన్నర్ వైభవ్ సూర్యవంశీతో కోహ్లి కాసేపు ముచ్చటించాడు. కోహ్లిని చూసి వైభవ్ నమస్కారం చేయగా.. ప్రతిగా అతడి భుజం తట్టి హత్తుకున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ గురించి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ‘కింగ్’.. ‘బేబీ బాస్’తో ఏం మాట్లాడాడో తెలుసుకోవాలని నెటిజన్లు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు.వాళ్ల మాటలు పట్టించుకోకుఈ నిరీక్షణకు ఆర్సీబీ తెరదించింది. కోహ్లి- వైభవ్‌ల వీడియోను బుధవారం షేర్ చేసిన యాజమాన్యం.. కోహ్లి వైభవ్‌కు ఇచ్చిన సలహా ఏమిటో తెలియజేసింది. వీడియో ప్రకారం.. ‘‘నువ్వు ఇంకా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. నీ కఠోర శ్రమ, ఆత్మవిశ్వాసం వల్లే నువ్వు ఇది సాధించగలిగావు.అయితే, నీ గురించి ఎవరు.. ఏం మాట్లాడుతున్నారు? ఎలా మాట్లాడుతున్నారు? అన్న విషయాల గురించి అస్సలు పట్టించుకోకు. నిజం చెప్పాలంటే.. బిహారీ ఎవరినైనా ఓడించగలడు. ఎవరినైనా అధిగమించగలడు’’ అని కోహ్లి వైభవ్‌తో పేర్కొన్నాడు.776 పరుగులుకాగా గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. ఈ సీజన్లో ఏకంగా 776 పరుగులు సాధించాడు. తద్వారా అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు.. రాజస్తాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు.. కోహ్లి ఈ సీజన్లో 675 పరుగులు సాధించి టాప్-4లో నిలిచాడు. ఫైనల్లో రాణించి ఆర్సీబీ రెండో టైటిల్ గెలవడంలో తన వంతు సాయం అందించాడు.చదవండి: నువ్వు కూర్చో.. అతడినే వన్‌డౌన్‌లో పంపుతాం అన్నాడు!𝗧𝗵𝗲 𝗺𝗮𝗻 𝘄𝗵𝗼 𝗺𝗮𝗱𝗲 𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗰𝗿𝗶𝗰𝗸𝗲𝘁 𝗳𝗲𝗮𝗿𝗹𝗲𝘀𝘀 🤝 𝘁𝗵𝗲 𝗯𝗼𝘆 𝘄𝗵𝗼 𝗯𝗮𝘁𝘀 𝗳𝗲𝗮𝗿𝗹𝗲𝘀𝘀 🫶💪The best piece of advice the 15-year old Vaibhav Suryavanshi could get! And who better than Virat Kohli to help fuel his fire in the right direction.… pic.twitter.com/MUqCRBo0la— Royal Challengers Bengaluru (@RCBTweets) June 3, 2026 -
IPL 2026లో ఎవరికి ఏ అవార్డు.. ఎంత ప్రైజ్ మనీ వచ్చిందో తెలుసా?
-
వారెవ్వా కోహ్లీ.. రోజు వ్యవధిలో ఎంత మార్పు!
ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు వృందావనంలోని ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని మంగవారం సందర్శించారు. ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత ఆర్సీబీ బ్యాటర్ కోహ్లీ తన భార్య అనుష్కతో కలిసి ఆధ్యాత్మిక ఆశ్రమానికి వచ్చాడు. ప్రేమానంద్ మహారాజ్‌కు చెందిన రాధా కేళీ కుంజ్ ఆశ్రమానికి వెళ్లారు. కాగా కోహ్లీ, అనుష్క దంపతులు ఇప్పటికే అనేక సార్లు ఆశ్రమాన్ని విజిట్ చేశారు. ఆశ్రమానికి వెళ్లి బయటకు వస్తున్న కోహ్లీ, అనుష్కకు సంబంధించిన వీడియోలు, ఫొటోలే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చాలా సింపుల్ డ్రెస్సులో ఇద్దరూ ఆశ్రమానికి వెళ్లారు. మాస్క్‌లతో తమ ముఖాన్ని కవర్ చేసుకున్నారు. ప్రేమానంద్ ఆధ్యాత్మిక బోధనలు వినేందుకు తరుచూ అనుష్క, కోహ్లీ జంట ఆశ్రమానికి వెళ్తుంటారు. ఇది చూసిన ఆర్సీబీ అభిమానులు.. ‘వారెవ్వా కోహ్లీ.. ఒక్కరోజులో ఎంత మార్పు’..‘టైటిల్ టు ఆధ్యాత్మికం వైపు అడుగులు’ అంటూ కామెంట్లు చేశారు.గత ఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్‌పై ఆర్సీబీ విజయం సాధించింది. అయితే ట్రోఫీ పట్టుకున్న సమయంలో కోహ్లీ నుదురుపై అనుష్కా కిస్ ఇచ్చింది.ఆ తర్వాత ఆర్సీబీ గెలుపు సంబరాలకు సంబంధించిన ఒక ఈవెంట్లోనూ విరుష్క జంట అదిరిపోయే స్టెప్పులతో అలరించారు. 🎥 | Virat Kohli and Anushka Sharma’s visit to #PremanandMaharaj’s Radha Keli Kunj Ashram in #Vrindavan has gone viral on #socialmedia, with a video showing the couple seeking blessings from the spiritual leader. The visit came days after #RCB’s historic #IPL title triumph, and… pic.twitter.com/QPucsbjK6i— The Statesman (@TheStatesmanLtd) June 2, 2026చదవండి: 'మాట తప్పిన మూర్ఖుడు.. అత్యంత చెత్త యజమాని!' -
కోహ్లీ, పాటీదార్ కాదు.. ఆర్సీబీ రాత మారింది ఆమె వల్లే!
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. పాటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీ వరుసగా రెండో ఏడాది చాంపియన్‌గా నిలిచింది. అయితే ఐపీఎల్ ఆరంభం నుంచి 'ఈ సాలా కప్ నమ్దే' అంటూ 17 ఏళ్లుగా టైటిల్ కోసం చకోర పక్షిలా ఎదురుచూసింది. అప్పటికీ మూడుసార్లు ఫైనల్ చేరినా తుది మెట్టుపై బోల్తా పడడంతో ఇక ఆర్సీబీ టైటిల్ కల కష్టమే అని ఫ్యాన్స్ కూడా ఒక అభిప్రాయానికి వచ్చేశారు.కానీ 17 ఏళ్లలో దక్కని టైటిల్ గతేడాది తమ చెంత చేరడంతో ఆర్సీబీ ఉబ్బితబ్బిబ్బైపోయింది. ఈ సీజన్లో అద్భుత ప్రదర్శనతో ఆర్సీబీ రెండోసారి కప్ ఒడిసిపట్టడంతో రజత్ పాటీదార్ లక్కీ కెప్టెన్ల జాబితాలో చేరిపోయాడు. వరుసగా రెండుసార్లు టైటిల్ సాధించిన మూడో కెప్టెన్‌గా పాటీదార్ నిలిచాడు. ఈ క్రమంలో పాటీదార్‌ను ఆర్సీబీకి ట్రోఫీ అందించిన లక్కీ కెప్టెన్ అని పొగుడుతున్నారు.కానీ ఆర్సీబీ రాత అంతకుముందే మారిందని కొంతమంది అభిమానులు పేర్కొంటున్నారు. ఆర్సీబీ పురుషుల జట్టు టైటిల్ సాధించ డానికి ముందే మహిళల జట్టు ఆ ఘనత సాధించింది. స్మృతి మందాన నేతృత్వంలోని ఆర్సీబీ వుమెన్ టీం 2024లోనే తొలి టైటిల్ సాధించింది. అయితే 2023లో మొదలైన డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ మహిళల జట్టు కూడా మొదట్లో ఓటమిబాటలోనే నడిచింది. ఆ సీజన్లో వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఓడిపోయి పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. దీంతో పురుషుల జట్టు మాదిరే మహిళల జట్టు కూడా ట్రోలింగ్‌కు గురైంది. అయితే మరుసటి సీజన్లోనే మంధాన నేతృత్వంలోని ఆర్సీబీ కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఆ సీజన్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసిన ఆర్సీబీ వుమెన్ తొలిసారి ఫ్రాంచైజీకి టైటిల్ అందించింది. దీంతో కెప్టెన్‌గా మంధాన పేరు మార్మోగిపోయింది. 2025 సీజన్లో టైటిల్ సాధించడంలో విఫలమైనప్పటికీ, 2026 సీజన్లో మరోసారి ఆర్సీబీ మహిళల జట్టు చాంపియన్‌గా నిలిచింది. ముఖ్యంగా కెప్టెన్‌గా, బ్యాటర్‌గా మంధాన అద్భుత ప్రదర్శన చేసింది. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్లో మంధాన 41 బంతుల్లోనే 87 పరుగులు సాధించి ఒంటిచేత్తో ఆర్సీబీకి రెండో కప్పును అందించింది. దీంతో ఆర్సీబీ కూడా చాంపియన్‌గా నిలవగలదని మంధాన బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చింది. మహిళల జట్టును ఆదర్శంగా తీసుకున్న పురుషుల జట్టు లెగసీని కంటిన్యూ చేస్తూ ఇవాళ వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలిచింది. రాబోయే రెండు మూడేళ్లు ఆర్సీబీకి చెందిన మహిళల జట్టు డబ్ల్యూపీఎల్‌లో.. పురుషుల జట్టు ఐపీఎల్లో వరుస టైటిల్స్ సాధించినా ఆశ్చర్యపోనవసరం లేదు.ఆర్సీబీని మార్చిన కోహ్లీ సందేశం..2023 డబ్ల్యూపీఎల్‌లో వైఫల్యం తర్వాత ఆర్సీబీ మహిళల జట్టుతో కోహ్లీ ప్రత్యేకంగా మాట్లాడాడు. ఈ నేపథ్యంలో మహిళల జట్టుకు 'ఫలితం కోసం ఆశించకుండా 110 శాతం కష్టపడండి' అంటూ కోహ్లీ తన మోటివేషన్ స్పీచ్‌తో ఆ ఏడాది ఆర్సీబీ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. అలా కోహ్లీ సందేశాన్ని ఒంటబట్టించుకున్న మంధాన సేన 2024 సీజన్లో టైటిల్‌ను సాధించింది. ఆర్సీబీ తలరాత మార్చింది కోహ్లీ, పాటీదార్ కాదు.. మంధాన అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ ఫన్నీ పోస్టులు పెడుతున్నారు.𝙀𝙚 𝙎𝙖𝙡𝙖 𝘾𝙪𝙥 𝙉𝙖𝙢𝙙𝙪 x 2⃣ 🏆🏆Smriti Mandhana 🤝 Rajat Patidar #TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/QxVAOX8oq2— IndianPremierLeague (@IPL) May 31, 2026చదవండి: షకీరా కూడా పనికిరాదు.. ఫ్యాన్స్‌ను షేక్‌చేస్తోన్న ఫిఫా పాట! -
ఐపీఎల్ ఫైనల్‌లోమెరిసిన అనుష్క, స్పెషల్ లగ్జరీ వాచ్, ధర ఎంతో?
ఐపిఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చారిత్రాత్మక విజయం సాధించిన వేళ నటి, స్టార్ క్రికెటర విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ (Anushka Sharma) మరోసారి ఆకర్షణీయంగా నిలిచారు. గుజరాత్‌లోని అహ్మదా బాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్‌లో అనుష్క శర్మ స్టాండ్స్ నుండి ఆర్సీబీని ఉత్సాహపరుస్తూ కనిపించారు. ముఖ్యంగా ఆమె చేతి రూ. 28 లక్షల విలువైన 'కార్టియర్ పాంథర్' (Cartier Panthère) లగ్జరీ వాచ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సింపుల్ అండ్ లగ్జరీ స్టైల్, ఫ్యాషన్ ప్రియులకు తెగ నచ్చేసింది.సెజాన్ లియోనార్డ్ వైట్ టాప్, వైడ్ లెగ్ ట్రౌజర్ల ధరించి సింపుల్ అండ్ క్లాసీ లుక్‌లో కనిపించింది. దీని ధర విలువ దాదాపు 25 వేల రూపాయల వరకు ఉంటుందని అంచనా. అయితే ఆమె లుక్ సింపుల్‌గా ఉన్నప్పటికీ, చేతికి పెట్టుకున్న వాచ్ మాత్రం హైలైట్‌గా నిలిచింది. అభిమానులు అది ప్రముఖ లగ్జరీ బ్రాండ్ 'కార్టియర్ పాంథర్' వాచ్ అని గుర్తుపట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వివరాల ప్రకారం.. ఈ ఐకానిక్ వాచ్ ధర దాదాపు రూ. 28 లక్షల వరకు ఉంటుందని అంచనా. స్క్వేర్ డయల్, రోమన్ అంకెలు, బ్రాస్లెట్ స్టైల్‌తో ఉండే ఈ వాచ్ సెలబ్రిటీలలో చాలా ఫేమస్. నీతా అంబానీ లాంటి ఫ్యాషన్ ఐకాన్లతో ప్రజాదరణ పొందింది.కాగా ఆర్సీబీ ఐపీఎల్ 2026 ట్రోఫీని గెలవడంతో కోహ్లీ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత విరాట్, అనుష్క కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విరాట్ కోహ్లీకి అనుష్క ఎల్లప్పుడూ అండగా నిలిచే 'సపోర్ట్ సిస్టమ్' అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.మ్యాచ్ అనంతరం జరిగిన పార్టీలో విరాట్ కోహ్లీ 'One felt nice, we did twice' (ఒక్కసారి గెలిస్తే బాగుంటుంది అనుకున్నాం, కానీ రెండుసార్లు గెలిచాం) అని రాసి ఉన్న టీ-షర్ట్ ధరించి అనుష్కతో కలిసి డాన్స్ చేయడం విశేషం. మొత్తానికి ఆర్సీబీ విజయోత్సవాల్లో అనుష్క లగ్జరీ వాచ్ ఒక అనూహ్యమైన ఫ్యాషన్ హైలైట్‌గా నిలిచింది. ఇదీ చదవండి: వారెవ్వా! నటనలోనే కాదు, ఫార్మింగ్‌లోనూ సూపర్ స్టారే! -
ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీకి బిగ్‌షాక్!
ఐపీఎల్ 2026 సీజన్ చాంపియన్‌గా నిలిచిన ఆర్సీబీకి ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ టిమ్ డేవిడ్ జరిమానా నుంచి తప్పించుకోలేకపోయాడు. వరుసగా రెండో సీజన్లోనూ టైటిల్ గెలిచి జోరు మీదున్న ఆర్సీబీకి టిమ్ డేవిడ్‌పై చర్య తీసుకోవడం కంటికి ఇంపుగా మారింది. టైటిల్ గెలిచిన ఉత్సాహం, సంబరాల నడుమ ఫైనల్ మ్యాచ్‌లో మైదానంలో దుష్ప్రవర్తనకు పాల్పడినందుకు టిమ్ డేవిడ్ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. అంతేకాదు ఐపీఎల్ 2027 సీజన్లో ఆర్సీబీ ఆడే తొలి మ్యాచ్ లేదా అతడు ప్రాతినిధ్యం వహించే ఫ్రాంచైజీ ఆడే తొలి మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ ఆడకుండా అతడిపై సస్పెన్షన్ విధిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది.గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ 10వ ఓవర్లో టిమ్ డేవిడ్ ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ వైపు ఐస్‌బ్యాగ్‌ను విసరడం కనిపించింది. ఇది ఫన్నీగా చేశాడా లేక కావాలనే చేశాడా అన్నది పక్కనబెడితే.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.9 ప్రకారం మ్యాచ్ సమయంలో ఒక ఆటగాడు.. జట్టుపై లేదా అంపైర్ లేదా మ్యాచ్ రిఫరీ లేదా మూడో వ్యక్తిపై అనుచితంగా ప్రవర్తించడం లేదా ఏదైనా వస్తువును విసరడం నిబంధనలకు విరుద్ధం. 30 ఏళ్ల టిమ్ డేవిడ్ తన తప్పును అంగీకరించినందున తన దుష్ప్రవర్తనతో నిబంధనలను ఉల్లఘించినందుకు గాను అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానాతో పాటు రెండు డీ మెరిట్ పాయింట్లు విధిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. అయితే ఈ సీజన్లో టిమ్ డేవిడ్ బీసీసీఐ ఆగ్రహానికి గురికావడం ఇది మొదటిసారి కాదు. ఈ టోర్నీలో అతడు మూడుసార్లు ఐపీఎల్ లెవెల్ 1 నిబంధనను ఉల్లఘించడం గమనార్హం. మొదటిసారి ఈ సీజన్లో 20వ మ్యాచ్‌లో (ఒక డీమెరిట్ పాయింట్), 54వ మ్యాచ్‌లో రెండో ఉల్లంఘన కింద రెండు డీమెరిట్ పాయింట్లు కోత పడింది. మూడోసారి కూడా టిమ్ డేవిడ్ నిబంధన ఉల్లంఘించడంతో నిబంధనల ప్రకారం వచ్చే సీజన్లో అతడు తొలి మ్యాచ్ ఆడకుండా సస్పెన్షన్ పడనుంది.చదవండి: ఆమె తిరిగి వచ్చేస్తోంది.. జాగ్రత్త! -
కోహ్లీకి ఏడుపొక్కటే తక్కువ.. ఆ కవర్లో ఏముంది?
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌పై ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో కోహ్లీ(75 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్‌తో ఆర్సీబీని గెలిపించడమే గాక రెండోసారి టైటిల్ అందించాడు.అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లి, అనుష్క శర్మల మధ్య జరిగిన ఒక సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఆ వీడియోలో అనుష్క, కోహ్లీ నడుచుకుంటూ వెళుతున్న సమయంలో, అనుష్క చేతిలో ఒక కవర్ కనిపించింది. ఇది చూసిన కోహ్లీ అందులో ఏముందో తెలుసుకోవడానికి అది ఒకసారి ఇవ్వాలని అడిగాడు. కానీ అనుష్క మాత్రం కోహ్లీకి లెటర్ ఇవ్వడానికి ఇష్టపడలేదు.అయినా కోహ్లీ అదే పనిగా ఆమె చేతి నుంచి లెటర్ తీసుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన అనుష్క శర్మ డగౌట్‌కు చేరుకున్న తర్వాత ఇస్తానులే అని చెప్పింది. దీంతో కోహ్లీ ఏంటి ఇలా చేస్తున్నావనడం వీడియోలో కనిపించింది. ఇది చూసిన అభిమానులు ఇంతకీ ఆ కవర్లో ఏముంది చెప్మా అంటూ కామెంట్లు పెట్టారు.మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (50) అర్థసెంచరీతో రాణించాడు. ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలామ్ 3 వికెట్లు తీయగా, భువనేశ్వర్, హాజిల్‌వుడ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 18 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. కోహ్లీ (75 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్‌తో ఆర్సీబీని గెలిపించగా, వెంకటేశ్ అయ్యర్ (32), టిమ్ డేవిడ్ (24) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీయగా, సిరాజ్, రబాడలు చెరొక వికెట్ తీశారు.FUNNY MOMENT AFTER THE FINAL 🤣🔥- Anushka had an envelope.- Virat Kohli was trying to take it.- But Anushka didn't want to give it.- Kohli tried multiple times but failed.- He was curious to know what was inside.Meanwhile, Anushka: "I'll give it to you there." 😅🔥 pic.twitter.com/v8k7jyaZ4z— Jara (@JARA_Memer) June 1, 2026చదవండి: కెనడా క్రికెట్‌పై సస్పెన్షన్.. కీలక మార్పులకు ఐసీసీ ఆమోదం! -
RCB తలరాతను మార్చిన ఒకే ఒక్కడు
-
బీసీసీఐ ప్రాపర్టీని నాశనం చేసిన ఆర్సీబీ బ్యాటర్!
ఐపీఎల్ 2026 సీజన్ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి వరుసగా రెండోసారి టైటిల్‌ను నిలబెట్టుకుంది. అయితే ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్ బీసీసీఐ ప్రాపర్టీని నాశనం చేసేందుకు ప్రయత్నించడం వైరల్‌గా మారింది. అయితే టిమ్ డేవిడ్ ఇదంతా ఫన్ మోడ్‌లో చేయడంతో పెద్దగా వివాదం కాలేదు.విషయంలోకి వెళితే.. ఈ సీజన్లో బీసీసీఐ ఏఐ రోబోట్ చంపాక్‌ను పరిచయం చేసింది. ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు బంతిని తీసుకురావడం, బ్యాటర్లకు వెల్కమ్ చెప్పడం లాంటి పనులతో రోబో బాగా పాపులర్ అయింది. అయితే ఈ ఏఐ రోబోను టిమ్ డేవిడ్ నాశనం చేసినంత పని చేశాడు. మ్యాచ్ విజయం అనంతరం ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్‌తో చాంపియన్ ఫొటోలకు ఫోజిచ్చేందుకు వచ్చింది. ఈ సమయంలో టిమ్ డేవిడ్ చాంపియన్ అని రాసి ఉన్న బోర్డు నుంచి బయటకు వచ్చి ఏఐ రోబో చంపాక్‌ను తన్నాలని చూశాడు. కానీ తన ఆలోచనను విరమించుకొని తిరిగి తన స్థానానికి వెళ్లిపోయాడు. టిమ్ డేవిడ్ చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (50) అర్థసెంచరీతో రాణించాడు. ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలామ్ 3 వికెట్లు తీయగా, భువనేశ్వర్, హాజిల్‌వుడ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 18 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. కోహ్లీ (75 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్‌తో ఆర్సీబీని గెలిపించగా, వెంకటేశ్ అయ్యర్ (32), టిమ్ డేవిడ్ (24) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీయగా, సిరాజ్, రబాడలు చెరొక వికెట్ తీశారు.The moment when the rest of the players were celebrating with the IPL trophy, Tim David started having fun with Champak. Never change Timmy 😂❤️ pic.twitter.com/CYteAnZ53z— ` (@Atomickolly17) May 31, 2026చదవండి: IPL 2026: టాప్-10 వివాదాలపై ఒక లుక్కేద్దామా! -
ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా ఇవే తగ్గించుకో.. కోహ్లి
-
గాయాన్ని కూడా లెక్కచేయకుండా భరించలేని నొప్పిని తట్టుకుంటూ...
-
ఆర్సీబీ విజయం.. టీజీ, ఏపీలో అభిమానుల వీరంగం
సాక్షి, విజయవాడ/హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2026) ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వరుసగా రెండో ఏడాది కూడా ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆర్సీబీ ఘన విజయాన్ని నమోదు చేయడంతో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ అయిన బెంగళూరు నగరం అర్ధరాత్రి వేళ బాణసంచా వెలుగులు, టపాసుల శబ్దాలతో దద్దరిల్లిపోయింది. తమ అభిమాన జట్టు వరుసగా రెండు టైటిళ్లు కొట్టడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా అభిమానులు సంబురాలు చేసుకున్నాయి. కానీ, పలుచోట్ల అభిమానులు రచ్చ చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది.విజయవాడ.. విజయవాడలో ఆర్సీబీ ఫ్యాన్స్ హంగామా చేశారు. తమ అభిమాన జట్టు గెలవడంతో రోడ్లపైకి వచ్చి ఫ్యాన్స్ సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు యువకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బైకులతో రోడ్లపై ప్రమాదకర ఫీట్స్ చేశారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు యువకులను చెదరగొట్టారు.Em chillar gallu unnara 🤧🤧 #Rcbfans pic.twitter.com/IopXcuy6zu— 𝕩 SunRise Reddy ™ (@HarshaReddy_07) May 31, 2026 కర్నూలు..కర్నూలులో ఆర్బీబీ అభిమానులు వీరంగం సృష్టించారు. ఆర్బీసీ విజయం ఆనందంలో అభిమానులు అరాచకాలకు పాల్పడ్డారు. సంబురాలను శృతి మించే విధంగా నిర్వహించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కర్నూలు రాజ్ విహర్ సెంటర్ చేరుకొని ట్రాఫిక్ బ్యారికేడ్స్‌తో పాటు ప్రైవేటు బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో, అక్కడికి చేరుకున్న పోలీసులు.. వారిని చెదరగొట్టారు.After RCB won the IPL Final, fans were celebrating on the road.During the celebrations, 3 RCB fans climbed onto a Tata Safari and started dancing and jumping on it.The Tata Safari had a full-size panoramic sunroof, and all three fans were standing and dancing on top of it.… pic.twitter.com/QZGcbkrhGJ— Saffron Chargers (@SaffronChargers) June 1, 2026విశాఖ.. విశాఖపట్నంలోని బీచ్ రోడ్డుకు అభిమానులు భారీ సంఖ్యలో పోటెత్తి గెలుపు సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో కొందరు ఫ్యాన్స్ కారు ఎక్కి, జెండాలు ఊపుతూ రోడ్లపై రచ్చ రచ్చ చేశారు.హైదరాబాద్..హైదరాబాద్‌లోనూ ఆర్సీబీ క్రేజ్ స్పష్టంగా కనిపించింది. ఆర్సీబీ విజయంతో ట్యాంక్ బండ్ వద్ద వందలాది మంది అభిమానులు గుమిగూడి ‘ఆర్సీబీ.. ఆర్సీబీ’ అంటూ నినాదాలు చేస్తూ సందడి చేశారు. అభిమానులు భారీ సంఖ్యలో ట్యాంక్ బండ్ వద్దకు తరలివచ్చారు. Celebrations at different places including near Secrtariat, SR Nagar, Kukatpally... in #Hyderabad, by RCB and Virat Kohli fans.As #RCB clinches a second consecutive IPL title, after being trophyless for 18 years.#ViratKohli #RCBvsGT #IPL2026final pic.twitter.com/7PLCLwLmjY— Surya Reddy (@jsuryareddy) May 31, 2026 -
ఫైనల్ లో మ్యాచ్ ఫిక్సింగ్? అంపైర్ పై పటిదార్ సీరియస్!
-
వరుసగా రెండో సారి IPL ట్రోఫీ గెలిచిన RCB
-
అందుకే ఆర్సీబీ సంబురాలకు బ్రేక్!
ఒకటి క్రికెట్ కప్.. మరొకటి ఫుట్‌బాల్ ట్రోఫీ. ఒకటి బెంగళూరు.. ఇంకొకటి పారిస్. క్రీడలు వేరు, దేశాలు వేరు. కానీ రెండు నగరాలు ఒకే ప్రశ్నను ఎదుర్కొన్నాయి. విజయోత్సవాలు ఎక్కడ, ఎలా ముగియాలి?. గత ఏడాది ఆర్సీబీ టైటిల్ విజయోత్సవాల సందర్భంగా బెంగళూరులో జరిగిన తొక్కిసలాట దేశాన్ని కుదిపేస్తే.. తాజాగా పీఎస్జీ ఛాంపియన్స్ లీగ్ విజయం తర్వాత పారిస్‌లో చెలరేగిన అల్లర్లు ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశాయి. ఈ రెండు ఘటనలు కలిసి క్రీడా సంబరాలపై కొత్త హెచ్చరికగా మారాయి.యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ ఫైనల్లో ఆర్సెనల్ను ఓడించి ప్యారిస్ సెయింట్ జర్మైన్ (PSG) మరోసారి యూరప్ ఛాంపియన్‌గా నిలిచిన వెంటనే పారిస్ వీధులు అభిమానులతో కిక్కిరిశాయి. మొదట అది ఆనందోత్సవంలా కనిపించింది. ఐఫిల్ టవర్ క్లబ్ రంగులతో మెరిసింది. వేలాది మంది అభిమానులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. కానీ కొద్ది గంటల్లోనే పరిస్థితి మారిపోయింది. కార్లకు నిప్పంటించడం, దుకాణాలపై దాడులు, పోలీసులపై రాళ్లు రువ్వడం, వీధుల్లో విధ్వంసం చోటుచేసుకున్నాయి.అధికారిక లెక్కల ప్రకారం ఒకరు ప్రాణాలు కోల్పోగా.. 780 మందికిపైగా అరెస్టయ్యారు. 264కు పైగా వాహనాలు దగ్ధమయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వేలాది మంది పోలీసులను రంగంలోకి దించాల్సి వచ్చింది. క్రీడా విజయాన్ని జరుపుకునేందుకు ప్రారంభమైన రాత్రి చివరకు చట్టవ్యవస్థకు సవాలుగా మారింది.ఈ దృశ్యాలు భారత అభిమానులకు గత ఏడాది బెంగళూరులో జరిగిన విషాదాన్ని గుర్తు చేశాయియి. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకున్నప్పుడు నగరం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. జట్టు విజయోత్సవాలను ప్రత్యక్షంగా చూడాలని లక్షలాది మంది అభిమానులు తరలివచ్చారు. కానీ భారీ జనసందోహాన్ని పోలీసులు నియంత్రించలేకపోవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. పలువురు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. మరెందరో గాయపడ్డారు. క్రీడా చరిత్రలో నిలిచిపోవాల్సిన ఆనంద క్షణం విషాద అధ్యాయంగా మారిపోయింది.ఆ ఘటన కేవలం ఒక ప్రమాదంగా ముగియలేదు. క్రీడా విజయోత్సవాల నిర్వహణపై ప్రభుత్వాలు, పోలీసు శాఖలు, క్రీడా సంస్థల ఆలోచననే మార్చేసింది. అభిమానుల భావోద్వేగం ఎంత ముఖ్యమో, వారి భద్రత కూడా అంతే ముఖ్యమని అందరికీ అర్థమైంది.అందుకే.. ఈ ఏడాది ఆర్సీబీ మళ్లీ ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచినప్పటికీ, గతంలో లాగా భారీ ర్యాలీలు, నియంత్రణలేని బహిరంగ సంబరాలకు అవకాశం ఇవ్వలేదు. బెంగళూరు పోలీసులు ముందుగానే అప్రమత్తమయ్యారు. నగరంలో పెద్ద ఎత్తున గుమికూడే కార్యక్రమాలపై పరిమితులు విధించారు. భారీ జనసందోహాలు ఏర్పడే అవకాశమున్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. విజయోత్సవాల కంటే భద్రతకే ప్రాధాన్యం ఇచ్చారు.ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆర్సీబీ యాజమాన్యం కూడా ఇదే సందేశాన్ని అభిమానులకు ఇచ్చింది. గత ఏడాది విషాదాన్ని గుర్తుచేస్తూ, వీధుల్లోకి పెద్ద ఎత్తున రావద్దని, కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే సురక్షితంగా విజయాన్ని ఆస్వాదించాలని అభిమానులకు పిలుపునిచ్చింది. సోషల్ మీడియా వేదికగా బాధ్యతాయుతమైన సంబరాలు జరుపుకోవాలని సూచించింది. సాధారణంగా జట్లు అభిమానులను బయటకు రమ్మని పిలుస్తాయి. కానీ ఈసారి అభిమానులు సురక్షితంగా ఉండటమే పెద్ద సంబరమని ఆర్సీబీ భావించడం గమనార్హం.What a night. What a feeling. 🥹To every member of the RCB nation, congratulations. This is YOUR win. 🏆❤️As the celebrations begin, let’s be responsible. 🙌Best way to celebrate is with your loved ones. Relive the memories, and enjoy this special moment from the comfort of… pic.twitter.com/hdGO3n115a— Royal Challengers Bengaluru (@RCBTweets) May 31, 2026వాస్తవానికి పారిస్ ఘటన, బెంగళూరు తొక్కిసలాట రెండూ ఒకే సందేశాన్ని ఇస్తున్నాయి. క్రీడా విజయాలు ప్రజలను ఏకం చేయగలవు. కానీ అదే భావోద్వేగం అదుపు తప్పితే ప్రమాదకరంగా మారుతుంది. సంబరాలు అల్లర్లకు దారి తీసినా, జనసందోహం ప్రాణాలను బలిగొన్నా చివరకు నష్టపోయేది అభిమానులే.ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రీడా నిర్వాహకులు ఒక కొత్త వాస్తవాన్ని అంగీకరిస్తున్నారు. విజయం ఎంత గొప్పదైనా, భద్రత దానికంటే గొప్పది. బెంగళూరు తొక్కిసలాట నేర్పిన పాఠాన్ని పారిస్ అల్లర్లు మరోసారి గుర్తు చేశాయి. కప్‌లు ప్రతి ఏడాది ఎవరో ఒకరు గెలుస్తారు. కానీ ఒక్క ప్రాణం కూడా పోకూడదనే బాధ్యత మాత్రం అందరిదీ. అందుకే ఈసారి ఆర్సీబీ సంబరాలకు బ్రేక్ పడింది. అది ఆనందంపై ఆంక్ష కాదు... గత విషాదం మళ్లీ పునరావృతం కాకూడదన్న ముందస్తు జాగ్రత్త. -
RCB ఫ్యాన్స్ అత్యుత్సాహం.. పరిగెత్తించిన పోలీసులు
-
ఐపీఎల్ బాద్షా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై జయకేతనం
-
చరిత్ర సృష్టించిన కోహ్లి.. RCB ఘన విజయం
-
ఫ్యాన్స్‌కి షాక్.. వేడుకలకు పోలీసులు నో..?
బెంగళూరు: ఐపీఎల్- 19 విజేతగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక పోలీసులు అప్రమత్తమయ్యారు. విన్నింగ్ సెలబ్రేషన్స్‌ను పబ్లిక్ రోడ్లపై వేడుకలు జరుపుకోవడాన్ని నిషేధించారు. 2025లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆర్సీబీ.. ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ ఫ్రాంచైజీలో అత్యధికంగా ఫ్యాన్ బేస్ ఉన్న జట్టుగా ఆర్సీబీకీ మంచి రికార్డుంది. ఇక వారి స్వంత రాష్ట్రంలో అభిమానుల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆర్సీబీ ఫ్యాన్స్‌కు అక్కడి పోలీసులు షాక్ ఇచ్చారు. భద్రతా కారణాల రీత్యా బెంగళూరు నగర వీధుల్లో బహిరంగ వేడుకలను పోలీసులు నిషేధించారు. గతేడాది జరిగిన ఘోర తొక్కిసలాట సంఘటనను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. సిటీ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ "బెంగళూరు సిటీ పోలీస్ ప్రేక్షకులు, అభిమానులకు వీధుల్లో బహిరంగంగా వేడుకలు జరుపుకోవద్దని, ముఖ్యంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని అడ్వైజరీ జారీ చేసింది. మేము వాహనాలను తనిఖీ చేస్తున్నాము. బహిరంగ వేడుకలకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించము. ఎవరైనా వేడుకలు జరుపుకోవాలనుకుంటే, వారు తమ ఇళ్ల లోపలే జరుపుకోవచ్చు," అని పేర్కొన్నారు. కాగా గతేడాది ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలిచిన సమయంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలవడంతో వేలాది మంది అభిమానులు ఎం. చిన్నస్వామి స్టేడియం పరిసరాల్లో సంబరాల కోసం గుమిగూడారు. అపరిమితంగా వచ్చిన ఈ జనసందోహం వల్ల ఘోర తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది అభిమానులు మృతి చెందారు. -
ఆర్సీబీ విజయం.. తెలుగు రాష్ట్రాల్లో దుమ్మురేపుతున్న ఫ్యాన్స్
ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ విజయంతో తెలుగురాష్ట్రాల్లో ఫ్యాన్స్ హంగామా మెుదలైంది. ఆర్సీబీ విజయంతో హైదరాబాద్‌లో సంబరాలు మెుదలయ్యాయి. ఆ జట్టు అభిమానులు పెద్ద సంఖ్యలో ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. అక్కడ టపాసులు పేల్చి సంబురాలు జరిపారు. ఆర్సీబీకి మద్దతుగా నినాదాలు చేస్తూ ట్యాంక్‌బండ్ పరిసరాల్లో హోరెత్తించారు.మరోవైపు ఆర్సీబీ గెలుపుతో విజవాడలోనూ ఫ్యాన్స్ సంబురాలు చేసుకున్నారు. రోడ్లపైకి వచ్చి ఆర్సీబీ విక్టరీ నినాదాలతో హోరెత్తించారు. కాగా కేవలం ఆర్సీబీకీ కేవలం కర్ణాటకలోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీగా అభిమానులున్నారు. దీంతో సెలబ్రేషన్స్ హోరెత్తిస్తున్నారు. కాగా ఈ రోజు జరిగిన ఫైనల్ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ నిర్దేశించన టార్గెట్‌ను ఆర్సీబీ అలవోకగా ఛేదించింది. దీంతో వరుసగా రెండో సారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది.Tankbund #RCBvsGT | #ViratKohli | #IPLFinal pic.twitter.com/sKleb0DQuQ— Hari🏏 (@Haricherry31) May 31, 2026 -
ఐపీఎల్ ఫైనల్‌పై రాజకీయం? డీకే శివకుమార్
బెంగళూరు: ప్రస్తుతం "రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు" ఫ్యాన్స్ పుల్ఖుషీతో ఉన్నారు. ఆర్సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్స్‌గా నిలవడంతో సంతోషంతో ఉబ్బితబ్బవుతున్నారు. ఓవైపు ఆర్సీబీ గెలుపుతో ఫ్యాన్స్ జోష్ మీదుంటే కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచాయి. డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడాతూ "నిజానికి ఈ మ్యాచ్ బెంగళూరులోనే జరగాల్సింది. కానీ మాకు అన్యాయం చేశారు. కేవలం రాజకీయం కారణంగానే ఈ మ్యాచ్‌ను అక్కడికి (అహ్మదాబాద్) తరలించారు. దీనిపై నేను ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ మాట్లాడను" అని ఆయన పేర్కొన్నారు.ఈ ఫైనల్ బెంగళూరులో ఫైనల్ జరిగి ఉంటే నగరానికి అది ఒక చారిత్రాత్మక సందర్భం అయ్యేదని, కానీ స్థానిక అభిమానులు ఆ అద్భుత క్షణాన్ని కోల్పోయారని అన్నారు. అయినప్పటికీ, ఈ సీజన్ అంతటా జట్టుకు అండగా నిలిచిన కర్ణాటక అభిమానులకు, ప్రభుత్వం అందించిన సహకారానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాగా జూన్ 3న కర్ణాటక ముఖ్యమంత్రిగా శివకుమార్ ప్రమాణస్వికారం చేసే అవకాశం ఉంది.కాగా ఈరోజు గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ మ్యాచ్ జరిగింది. GT 156 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా విరాట్ కోహ్లీ 75 పరుగులతో అజేయంగా నిలిచి ఆర్సీబీని గెలిపించారు. కాగా ఆర్సీబీ గతేడాది సైతం ఐపీఎస్ టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. -
కోహ్లీ వీరవిహారం.. చాంపియన్స్‌గా ఆర్సీబీ
ఐపీఎల్ 2026 చాంపియన్‌గా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చేజింగ్ మాస్టర్‌గా పేరు పొందిన విరాట్ కోహ్లీ ఆఖరి దాకా నిలిచి ఆర్సీబీని గెలిపించాడు. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ (42 బంతుల్లో 75 నాటౌట్), వెంకటేశ్ అయ్యర్ (16 బంతుల్లో 32), టిమ్ డేవిడ్ (17 బంతుల్లో 24 పరుగులు) ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2 వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్, రబాడ, అర్షద్ ఖాన్ తలా వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (50 నాటౌట్), నిషాంత్ సిందూ (20 పరుగులు) ఆడుతున్నారు. రసిక్ సలామ్ 3 వికెట్లు తీయగా, హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ చెరో 2 వికెట్లు తీశాడు.కోహ్లీ కమాల్..156 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. వెంకటేశ్ అయ్యర్, కోహ్లీలు కలిసి తొలి వికెట్‌కు 4.3 ఓవర్లలో 62 పరుగులు జోడించి మంచి పునాది వేశారు. ఈ దశలో పడిక్కల్, పాటీదార్లు రషీద్‌ఖాన్ బౌలింగ్‌లో వెనువెంటనే ఔట్ కావడంతో ఆర్సీబీ శిబిరంలో ఆందోళన నెలకొన్నప్పటికీ కోహ్లీ నిలకడగా ఆడి జట్టును విజయం దిశగా నడిపించాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్ ఔటైనప్పటికీ జితేశ్ శర్మ (11 నాటౌట్)తో కలిసి కోహ్లీ ఆర్సీబీని గెలిపించి వరుసగా రెండో కప్పును అందించాడు.ఆర్సీబీ అరుదైన ఫీట్ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఒక అరుదైన ఫీట్ సాధించింది. వరుసగా రెండు సీజన్లలో టైటిల్ గెలిచిన మూడో జట్టుగా ఆర్సీబీ రికార్డులకెక్కింది. గతంలో చెన్నై సూపర్‌కింగ్స్ (2010, 2011), ముంబై ఇండియన్స్ (2019, 2020) ఈ ఫీట్‌ను సాధించాయి.Finishing off in style 🥳And it's none other than King Kohli 😎👑Scorecard ▶️ https://t.co/Yz6K3q6w0X#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/FZNGQ26gBs— IndianPremierLeague (@IPL) May 31, 2026 -
అరుదైన ఫీట్‌తో భువనేశ్వర్ కొత్త చరిత్ర
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఫీట్ సాధించాడు. 16 మ్యాచ్‌లాడిన భువనేశ్వర్ 28 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఒక సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా భువనేశ్వర్ షమీతో కలిసి రికార్డులకెక్కాడు. కాగా ఈ జాబితాలో ఆర్సీబీ తరఫున హర్షల్‌పటేల్ (32 వికెట్లు, 2021 సీజన్), గుజరాత్ టైటాన్స్ తరఫున మహ్మద్ షమీ (28 వికెట్లు, 2023 సీజన్) ఈ ఫీట్ సాధించారు. ఇక ముంబై ఇండియన్స్ తరఫున జస్ప్రీత్ బుమ్రా (27 వికెట్లు, 2020 సీజన్), రాజస్తాన్ తరఫున చాహల్ (27 వికెట్లు, 2022), గుజరాత్ తరఫున మోహిత్ శర్మ (27 వికెట్లు, 2022) భువనేశ్వర్ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇక ఈ సీజన్లో ఇప్పటికే పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్న భువనేశ్వర్ మరో ఫీట్ కూడా అందుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్లో తొలి పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో భువనేశ్వర్ (17 వికెట్లు) షమీతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఇదే సీజన్లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ కగిసో రబాడ (19 వికెట్లు) తీసి తొలి స్థానంలో ఉన్నాడు.Bhuvneshwar Kumar in IPL2026 - 𝟮𝟴 wickets (7.95 Eco)*2025 - 17 wickets (9.28 Eco)2024 - 11 wickets (9.35 Eco)2023 - 16 wickets (8.33 Eco)2022 - 12 wickets (7.34 Eco)2021 - 6 wickets (7.97 Eco)2020 - 3 wickets (6.98 Eco)2019 - 13 wickets (7.81 Eco)2018 - 9 wickets… pic.twitter.com/DLOczlJ22e— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) May 31, 2026చదవండి: 'కోహ్లీ కాస్త తగ్గి ఉండు.. మీ బ్యాటింగ్ అయిపోలేదు!' -
'కోహ్లీ కాస్త తగ్గి ఉండు.. మీ బ్యాటింగ్ అయిపోలేదు!'
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న ఫైనల్లో ఇప్పటికైతే ఆర్సీబీదే పైచేయిగా ఉంది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతున్న గుజరాత్ టైటాన్స్ సాధారణ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. అయితే గుజరాత్ వికెట్లు పడిన ప్రతీసారి కోహ్లీ హైపర్ యాక్టివ్‌గా కనిపించాడు. ముఖ్యంగా గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ వికెట్లు పడ్డప్పుడు కోహ్లీ ఇచ్చిన రియాక్షన్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో గిల్ ఔటైన వెంటనే పిచ్‌పైకి పరిగెత్తుకొచ్చిన కోహ్లి గిల్‌వైపు చూస్తూ గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకోవడం కనిపించింది. అంతటితో ఆగకుండా సాయి సుదర్శన్ ఔట్ కావడానికి ముందు కోహ్లీ శ్రుతి మించిపోయాడు. హాజిల్‌వుడ్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లు ప్రతీ బంతికి ముందు కోహ్లీ సాయి సుదర్శన్‌ను టార్గెట్ చేస్తూ ఏదో ఒక మాట అనడం స్టంప్ మైక్‌లో రికార్డయింది. అదే ఓవర్ నాలుగో బంతికి సాయి సుదర్శన్ భారీ షాట్‌కు యత్నించి జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే కోహ్లీ చర్యలపై గుజరాత్ టైటాన్స్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోహ్లీ కాస్త తగ్గి ఉండు.. మీ బ్యాటింగ్ ఇంకా అయిపోలేదు. అని కామెంట్లు పెడుతున్నారు.మరో విషయమేంటంటే.. గత రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్‌గా వెనుదిరిగిన సాయి సుదర్శన్ ఈ మ్యాచ్‌లోనూ అలా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. హాజిల్‌వుడ్ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్ రెండో బంతిని ఆడే క్రమంలో బ్యాట్ అతని చేతి నుంచి జారిపోయేలా కనిపించినప్పటికీ ఈసారి మాత్రం అలా జరగలేదు. ఇక మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాష్టింగ్టన్ సుందర్ (50) అర్థసెంచరీతో గుజరాత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. రసిక్ సలామ్ మూడు వికెట్లు తీయగా, హాజిల్‌వుడ్, భువనేశ్వర్‌లు చెరో 2 వికెట్లు పడగొట్టారు.pic.twitter.com/E5HLX9ALPr— crictalk (@crictalk7) May 31, 2026చదవండి: అయ్యో గుజరాత్.. సీన్ రివర్స్ అయ్యేలా ఉందే! -
అయ్యో గుజరాత్.. సీన్ రివర్స్ అయ్యేలా ఉందే!
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పూర్తిగా తడబడుతోంది. ఆదిలోనే ఓపెనర్లిద్దరి వికెట్లను కోల్పోయిన గుజరాత్ కష్టాల్లో పడింది. అయితే హోంగ్రౌండ్లో గుజరాత్ టైటాన్స్‌కు మంచి రికార్డే ఉంది. టాస్ ఓడినా, గెలిచినా 2025 నుంచి చూసుకుంటే అప్పటినుంచి గుజరాత్ టైటాన్స్ ఐదు మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ ఐదు మ్యాచ్‌ల్లోనూ గుజరాత్ విజయాలను సాధించింది. ఇందులో ముంబై ఇండియన్స్‌పై 36 పరుగులతో, రాజస్తాన్‌పై 58 పరుగులతో, ఎస్ఆర్హెచ్పై 38 పరుగులతో, ఎస్ఆర్హెచ్పై 82 పరుగులతో, సీఎస్కేపై 89 పరుగులతో విజయాలను అందుకుంది. అయితే ఈసారి జరుగుతున్న ఫైనల్లో మాత్రం గుజరాత్ టైటాన్స్‌కు సీన్ రివర్స్ అయ్యేలా కనిపిస్తుంది. పైగా టాస్ సమయంలో గిల్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా అనిపించాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ పటీదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అహ్మదాబాద్ పిచ్‌పై చేజింగ్ చేసిన జట్టే ఎక్కువ విజయాలు అందుకుంది. అయితే గిల్ మాత్రం తాను టాస్ గెలిచి ఉంటే బ్యాటింగ్ ఎంచుకునేవాడినని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు తొలుత బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ గుజరాత్ ఆర్సీబీ బౌలర్లను ఎదుర్కోలేకపోతుంది. 8 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ 2 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. నిషాంత్ సిందూ (20), జాస్ బట్లర్ (10) పరుగులతో ఆడుతున్నారు.🚨 Toss Update from the FINAL 🚨@RCBTweets have won the toss & will bowl first against @gujarat_titans in Ahmedabad.Updates ▶️ https://t.co/Yz6K3q6w0X#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/kgrF0LJ0gQ— IndianPremierLeague (@IPL) May 31, 2026చదవండి: చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్ జోడీ -
ఐపీఎల్ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ!
ఐపీఎల్ 2026 సీజన్లో ఎక్కువగా వార్తల్లో నిలిచిన పేరు రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ. బ్యాటింగ్ చేసినా, ఫీల్డింగ్ చేసినా, తిన్నా, పడుకున్నా.. ఇలా అతడు ఏం చేసినా అది వార్తగానే నిలిచేది. ఎలిమినేటర్‌లో ఎస్ఆర్హెచ్ను చిత్తు చేసినప్పటికీ క్వాలిఫయర్-2 పోరులో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి పాలయిన రాజస్తాన్ రాయల్స్ సీజన్‌ను మూడో స్థానంతో ముగించింది. జట్టు ఓటమి పాలైనప్పటికీ వైభవ్ మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు. వైభవ్ సూర్యవంశీ ఆటను మరొక్కసారి చూస్తే బాగుంటుందని అభిమానులు ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ అభిమానులకు ఒక శుభవార్త. అతడి ఆటను చూడలేకపోవచ్చు కానీ అతడిని స్టేడియంలో మరోసారి చూసే అవకాశం మాత్రం దక్కనుంది. అహ్మదాబాద్ వేదికగా నేడు ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు వైభవ్ సూర్యవంశీ హాజరుకానున్నాడు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో వైభవ్ తళుక్కుమన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు వైభవ్ తన కుటుంబంతో కలిసి అహ్మదాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం వైభవ్ సూర్యవంశీని ప్రత్యేకంగా సన్మానించే అవకాశం కూడా ఉంది. ఈ సీజన్లో 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఒకవేళ ఇవాల్టి ఫైనల్లో గిల్, సాయి సుదర్శన్ తక్కువ స్కోర్లకు వెనుదిరిగితే మాత్రం వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకునే చాన్స్ ఉంది. ఈ సీజన్ ఆరంభం నుంచి స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తూ వచ్చిన వైభవ్ ఒక సెంచరీ సహా ఐదు అర్థసెంచరీలు సాధించాడు. సీజన్లో 72 సిక్సర్లతో ఒక సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా నిలిచాడు. ఇక గుజరాత్‌తో మ్యాచ్‌లో 47 బంతుల్లో 96 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్‌లో ఏడు సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. ఇక ఎలిమినేటర్ పోరులోనూ ఎస్ఆర్హెచ్పై సునామీ ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి ఔటయ్యాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సెంచరీ చేజార్చుకున్నప్పటికీ అతడి ఆటతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.VAIBHAV SOORYAVANSHI AT AHMEDABAD TO WATCH IPL FINAL 🔥⭐ [IANS] pic.twitter.com/o7uRx10z3j— Johns. (@CricCrazyJohns) May 31, 2026చదవండి: IPL 2026: ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి షాక్! -
ఐపీఎల్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధం
-
ఐపీఎల్ 2026 ఫైనల్ : ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
హోరా హోరీగా సాగిన ఐపీఎల్ 2026 ఫైనల్ దశకు చేరింది. దేశవ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ పీక్స్‌కు చేరింది. ఫైనల్ మ్యాచ్ కౌంట్‌డౌన్ స్టార్ట్ నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్ రైల్వేస్ గుడ్ న్యూస్ చెప్పింది. వెస్ట్రన్ రైల్వే ముంబై - అహ్మదాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది.మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ సూపర్ ఫైట్‌ను ఈ చూసేందుకు వేలాది మంది అభిమానులు అహ్మదాబాద్‌కు తరలివెళ్లనున్నారు. ఫ్రీ ప్రెస్ జర్నల్ నివేదిక ప్రకారం.. ఫైనల్ మ్యాచ్ జరిగే రోజున ముంబై సెంట్రల్ నుండి అహ్మదాబాద్‌కు ప్రత్యేక ఏసీ సూపర్‌ఫాస్ట్ రైలు నడపనున్నారు.ట్రైన్ నంబర్ 09021: మే 31న ఉదయం 6:20 గంటలకు ముంబై సెంట్రల్లో బయలుదేరి, అదే రోజు మధ్యాహ్నం 12:40 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది. మ్యాచ్ రోజునే ప్రయాణించాలనుకునే అభిమానులకు ఇది చాలా అనుకూలమైన ఆప్షన్.ఈ రైలులో ప్రీమియం శతాబ్ది తరహా రేక్తో పాటు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్, ఏసీ చైర్ కార్, అనుభూతి క్లాస్, మరియు విస్టాడోమ్ కోచ్‌లు కూడా ఉంటాయి.రిటర్న్ సర్వీస్ (ట్రైన్ నంబర్ 09022): ఇది అహ్మదాబాద్‌లో మధ్యాహ్నం 3:10 గంటలకు బయలుదేరి, రాత్రి 9:45 గంటలకు ముంబై సెంట్రల్ చేరుకుంటుంది.ఫైనల్ మ్యాచ్ ముగిసాక అదనపు సర్వీసులుమ్యాచ్ ముగిసిన తర్వాత ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి, వెస్ట్రన్ రైల్వే జూన్ 1న మరో రెండు అదనపు ప్రత్యేక రైళ్లను ప్లాన్ చేసింది.ట్రైన్ నంబర్ 09044: అహ్మదాబాద్ నుండి బాంద్రా టెర్మినస్ వరకు నడుస్తుంది.ట్రైన్ నంబర్ 09043: అదే రోజు రాత్రి బాంద్రా టెర్మినస్ నుండి వాటివా (Vatva) వరకు నడుస్తుంది.ప్రత్యేకతలు: ప్రీమియం ఏసీ రైళ్లతో పోలిస్తే, ఈ రైళ్లలో ఏసీ త్రీ-టైర్ మరియు స్లీపర్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. బడ్జెట్ ప్రయాణికులకు ఇవి ఎంతో అనుకూలంగా ఉంటాయి.రైలు ఆగే స్టేషన్లు ఈ ప్రత్యేక రైళ్లు ముంబై-అహ్మదాబాద్ కారిడార్‌లోని పలు ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి. ఇందులో బోరివలి, వాపి, సూరత్, భరూచ్ మరియు వడోదర ఉన్నాయి. దీనివల్ల వివిధ నగరాల నుండి ప్రయాణించే వారికి సౌకర్యంగా ఉంటుంది.బుకింగ్స్ ఎలా అంటే..ఈ నాలుగు ప్రత్యేక సర్వీసుల బుకింగ్స్ మే 30 నుండి ప్రారంభమవుతాయి. టిక్కెట్లను ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ ద్వారా లేదా పీఆర్ఎస్ (PRS) రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా బుక్ చేసుకోవచ్చు.ఐపీఎల్ ఫైనల్ వీకెండ్ కారణంగా భారీ సంఖ్యలో క్రికెట్ అభిమానులు అహ్మదాబాద్‌కు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను ఖరారు చేసుకునే ముందు పూర్తి టైమ్‌టేబుల్ మరియు కోచ్ వివరాలను తనిఖీ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. కాగా టైటిల్కోసం డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), 2022 ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (జీటీ) తలపడనున్నాయి. -
అతడు లక్కీ హ్యాండ్.. ఆ జట్టుదే ఐపీఎల్ టైటిల్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ మరోసారి చాంపియన్‌గా నిలవడానికి మరో అడుగు దూరంలో ఉంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న మెగాటోర్నీ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌పై ఆర్సీబీ ఆధిక్యంలో ఉంది. లీగ్ దశలో చెరో మ్యాచ్ గెలిచినప్పటికీ, క్వాలిఫయర్-1 పోరులో గుజరాత్‌ను 92 పరుగుల భారీ తేడాతో ఓడించి 2-1తో ఆధిక్యంలో నిలిచింది. అయితే ఈ సీజన్లో ఆర్సీబీ విజేతగా నిలవనున్నట్లు, అందుకు జోష్ హాజిల్‌వుడ్ కారణం కానున్నట్లు ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఇప్పటివరకు హాజిల్‌వుడ్ ఐదు టీ20 టోర్నీ ఫైనల్స్ ఆడితే.. ప్రతీసారి తాను ప్రాతినిధ్యం వహించిన జట్టే చాంపియన్‌గా నిలిచింది. ఐపీఎల్ 2021లో చెన్నై సూపర్‌కింగ్స్ విజేతగా నిలిచింది. ఆ జట్టులో హాజిల్‌వుడ్ ఉన్నాడు. 2012లో చాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీలో విజేతగా నిలిచిన సిడ్నీ సిక్సర్, 2019 బీబీఎల్ విజేత సిడ్నీ సిక్సర్స్, 2021 టీ20 ప్రపంచకప్ సాధించిన ఆస్ట్రేలియా జట్టు, 2021 ఐపీఎల్ సీజన్ విజేతగా నిలిచిన సీఎస్కే, 2025 ఐపీఎల్ సీజన్ విజేతగా నిలిచిన ఆర్సీబీ జట్టు.. ఇలా ఐదుసార్లు హాజిల్‌వుడ్ సభ్యుడిగా ఉన్నాడు. అంతేకాదు 2015, 2023 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులోనూ హాజిల్‌వుడ్ సభ్యుడిగా ఉండడం విశేషం.దీంతో హాజిల్‌వుడ్ లక్కీ హ్యాండ్ అని.. అతను ఏ జట్టులో ఉంటే ఆ జట్టు చాంపియన్‌గా నిలుస్తుందని అభిమానులు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. అతడు లక్కీహ్యాండ్ మాత్రమే కాదు, తాను ఆడిన ఐదు ఫైనల్స్‌లోనూ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆడిన ఐదు ఫైనల్స్ కలిపి 10 వికెట్లు పడగొట్టాడు. 2021 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌తో పాటు 2012 చాంపియన్స్ లీగ్ టీ20 ఫైనల్లో మూడు వికెట్లు తీసి బెస్ట్ ప్రదర్శన నమోదు చేశాడు. అయితే ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ చాంపియన్‌గా నిలవడంలో హాజిల్‌వుడ్ కీలకపాత్ర పోషించాడు. ఆ సీజన్లో 12 ఇన్నింగ్స్‌ల్లో 22 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ సీజన్లో 12 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 13 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అయితే భువనేశ్వర్, రసిక్ సలామ్‌లు రాణిస్తుండడంతో హాజిల్‌వుడ్‌కు పెద్దగా ఇబ్బంది ఎదుర్కోవడం లేదు.చదవండి: ‘ఈసారి హిట్ వికెటవ్వను.. విరుగుడు మంత్రమదే!’ -
‘ఈసారి హిట్ వికెటవ్వను.. విరుగుడు మంత్రమదే!’
ఐపీఎల్ 2026 సీజన్లో శుక్రవారం క్వాలిఫయర్-2లో రాజస్తాన్ రాయల్స్‌ను ఓడించి గుజరాత్ టైటాన్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సెంచరీతో చెలరేగగా, మరో ఓపెనర్ సాయి సుదర్శన్ అర్థసెంచరీతో రాణించాడు. సాయి సుదర్శన్ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. అయితే ఆర్సీబీతో జరిగిన క్వాలిఫయర్-1 పోరులో హిట్ వికెట్‌గా వెనుదిరిగిన సాయి సుదర్శన్ రాజస్తాన్‌తో జరిగిన క్వాలిఫయర్-2 పోరులోనూ మరోసారి హిట్‌వికెట్‌గా వెనుదిరగడం గమనార్హం. 150 ఏళ్ల క్రికెట్ చరిత్రలో వరుసగా రెండుసార్లు హిట్‌వికెట్‌గా వెనుదిరిగిన ఆటగాడిగా సాయి సుదర్శన్ నిలిచిపోయాడు. హిట్‌వికెట్‌గా రెండోసారి ఔటవ్వడంపై సాయి సుదర్శన్ ఎట్టకేలకు మౌనం వీడాడు. ఈసారి బ్యాట్ జారిపోకుండా ఏదైనా కొత్త పద్ధతిని అనుసరిస్తానని నవ్వుతూ పేర్కొన్నాడు. ‘ఈ సమస్యను అధిగమించడానికి కొత్తగా ఏదైనా చేయాలి. అందుకు కొన్ని గ్రిప్ టెక్నిక్స్ ఉపయోగించి బంతులు ఆడే ప్రయత్నం చేస్తాను. ఆర్సీబీతో మ్యాచ్‌లో బంతిని ఆడే క్రమంలో నా బ్యాట్ చేతిలో నుంచి జారి బౌన్స్ అయి వికెట్ల మీద పడింది. కానీ రాజస్తాన్‌తో మ్యాచ్‌లో స్ట్రెయిట్ షాట్ ఆడాలనుకున్నా. కానీ ఈసారి కూడా బంతి బౌండరీ వెళ్లినప్పటికీ బ్యాట్ నేరుగా వెళ్లి వికెట్లను గిరాటేసింది. ఫైనల్లో ఈ సమస్య రాకుండా ఒక కొత్త పద్ధతిని అనుసరించాలనుకుంటున్నా. అది ఎంతమేర సఫలమవుతుందో చూ డాలి’ అని చెప్పుకొచ్చాడు.ఇక ఈ సీజన్లో సాయి సుదర్శన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. గుజరాత్ తరఫున ఓపెనింగ్‌లో వస్తున్న సాయి సుదర్శన్ 16 ఇన్నింగ్స్‌లో 710 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇందులో ఒక సెంచరీ, 8 అర్థసెంచరీలున్నాయి. అయితే ఈ సీజన్లో గుజరాత్ ఆడిన తొలి ఆరు మ్యాచ్‌ల్లో సాయి సుదర్శన్ ఒక ఫిఫ్టీ కూడా నమోదు చేయలేదు. ఆ తర్వాత నుంచి వరుసగా ప్రతి మ్యాచ్‌లోనూ స్థిరమైన ప్రదర్శనతో కనీసం అర్థసెంచరీ సాధించడం విశేషం. మరో విషయమేంటంటే సాయి సుదర్శన్ వరుసగా రెండో సీజన్లోనూ 700 పరుగుల మార్క్‌ను అధిగమించాడు. గతంలో క్రిస్ గేల్ మాత్రమే వరుసగా రెండు సీజన్లలో 700 ప్లస్ మార్కును దాటాడు. తాజాగా ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా సాయి సుదర్శన్ నిలిచాడు. Glad he can still see the funny side of it 😅🎥 Sai Sudharsan on his back-to-back bizarre dismissals \|/#TATAIPL | #Qualifier2 | #TheFinalLeap | #GTvRR | @gujarat_titans pic.twitter.com/nGVrC10SUc— IndianPremierLeague (@IPL) May 29, 2026THE RAREST OF RARE DISMISSALS! TWICE IN TWO INNINGS 😯😯Sai Sudharsan's bat fell onto his own stumps 🫣Updates ▶️ https://t.co/eupS8cBPc2#TATAIPL | #Qualifier2 | #TheFinalLeap | #GTvRR pic.twitter.com/htGSYpu3YH— IndianPremierLeague (@IPL) May 29, 2026The Sai Sudharsan dismissal. 😄 pic.twitter.com/m0DaXI29aE— Mufaddal Vohra (@mufaddal_vohra) May 26, 2026చదవండి: అభిమానులకు గుడ్‌న్యూస్.. కానీ 332 కోట్ల మెలిక! -
ఎక్స్ ట్రా ప్లేయర్ గా వచ్చి.. RCB రూపురేఖలు మార్చేసిన పటీదార్ కథ ..
-
గుజరాత్‌పై గెలుపు.. కోహ్లికి వెటకారం ఎక్కువే!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1 పోరులో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. గొడవలో అయినా, ఫన్నీ మోడ్‌లో అయినా కింగ్ కోహ్లిని ఎవరు బీట్ చేయలేరు. మ్యాచ్‌లో కోహ్లి 25 బంతుల్లోనే 43 పరుగులు చేసి ఆర్సీబీకి శుభారంభం దక్కడంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ ఓటమి తర్వాత గుజరాత్ టైటాన్స్ జట్టు ఫొటో సెషన్ జరిగింది. ఈ సమయంలో డగౌట్లో ఉన్న కోహ్లీ గుజరాత్ జట్టు వైపు చూస్తూ.. ‘ బాగైంది.. మేం మీపై గెలిచి ఫైనల్‌కు చేరుకున్నాంలే’ అంటూ ఫన్నీ మోడ్‌లో తన చేతులతో స్నేక్ గెచ్చర్ ఇవ్వడం కనిపించింది. ఇది చూసిన గుజరాత్ ఆటగాళ్లు సరదాగా నవ్వుకున్నారు. అంతకముందు గుజరాత్ ఇన్నింగ్స్ సమయంలోనూ కోహ్లీ గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో కయ్యానికి కాలు దువ్వడం కనిపించింది. అయితే ఇదంతా సరదా కోసమే చేసినట్లు వీడియోలో క్లియర్‌గా కనిపించింది. ఇక జాకబ్ డఫీకి బంతి ఇవ్వడానికి ముందు కోహ్లీ చేసిన మరొక చర్య కూడా వైరల్‌గా మారింది. తాను బౌలింగ్‌కు దిగుతున్నట్లు అంపైర్ వద్దకు వెళ్లి తన క్యాప్‌ను ఇచ్చిన కోహ్లీ ఆ తర్వాత బంతి తీసుకొని రనప్‌కు సిద్ధమయ్యాడు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన జాకబ్ డఫీ బంతి ఇవ్వమని అడగడంతో అతని చేతిలో పెట్టాడు. ఆ తర్వాత తన క్యాప్ ఇవ్వాలంటూ అంపైర్ వద్దకు వెళ్లగా, అతడు నిరాకరించాడు. దీంతో 'ప్లీజ్ నా క్యాప్ ఇచ్చేయండి' అని అంపైర్‌ను అడగడం వీడియోలో కనిపించింది. గుజరాత్‌పై విజయం తర్వాత భార్య అనుష్క శర్మ దగ్గరికి వెళ్లి హగ్ చేసుకోవడం కనిపించింది. ఇలా మ్యాచ్ మొత్తం తన చర్యలతో కోహ్లీ హల్చల్ చేశాడు. ఇవన్నీ కోహ్లీ సరదాతో చేసినప్పటికీ సోషల్ మీడియాలో కొంతమంది అభిమానులు మాత్రం అతడి చర్యను తప్పుబట్టారు. కోహ్లికి వెటకారం అనుకున్నదాని కంటే ఎక్కువే ఉందని కామెంట్లు పెట్టారు. మొన్న హెడ్‌తో గొడవ పెట్టుకున్న కోహ్లి ఇవాళ గుజరాత్ టీమ్‌ను హేళన చేసేలా అతడి స్నేక్ గెచ్చర్ ఉందని పేర్కొన్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. మంగళవారం ఏకపక్షంగా సాగిన క్వాలిఫయర్–1లో ఆర్సీబీ 92 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ 19.3 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. ఓడినా గుజరాత్ ఫైనల్ చేరేందుకు మరో అవకాశం మిగిలి ఉంది. బుధవారం జరిగే ‘ఎలిమినేటర్’ మ్యాచ్ విజేతతో శుక్రవారం జరిగే క్వాలిఫయర్–2లో గుజరాత్ జట్టు తలపడుతుంది. Virat Kohli teasing Gujarat Titans players during their photoshoot in Dharamshala 🤣🔥- Rajat Patidar did the same with GT too 😭 pic.twitter.com/368X6y0VpA— Jara (@JARA_Memer) May 26, 2026 -
పాటీదార్ ఒక స్లో పాయిజన్.. కప్పు గెలిస్తే చరిత్రే!
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ ఆ జట్టును వరుసగా రెండో ఏడాది ఫైనల్ చేర్చడంలో సఫలమయ్యాడు. నాయకుడంటే ముందుండి నడిపించాలి. ఆ మాటలను ఇవాళ పాటీదార్ అక్షరాలా చేసి చూపించాడు. మొదట తన అద్భుత బ్యాటింగ్‌తో జట్టు భారీ స్కోరు సాధించడంలో పాటీదార్ కీలకపాత్ర పోషించి షాన్‌దార్‌గా నిలిచాడు. త్రుటిలో సెంచరీ చేజారినా, బ్యాటింగ్‌లో పొరపాట్లు ఉన్నా సరే, అతడి విలువైన ఇన్నింగ్స్ దానిని మర్చిపోయేలా చేసింది. ఈ నేపథ్యంలో వరుసగా తన టీమ్‌ను రెండోసారి ఫైనల్ చేర్చిన అతను మరో టైటిల్ అందిస్తే చరిత్రలో నిలిచిపోతాడనడంలో సందేహం లేదు. గుజరాత్‌పై విజయంతో ఐపీఎల్లో ఒక జట్టును వరుసగా రెండుసార్లు ఫైనల్ చేర్చిన కెప్టెన్ల జాబితాలో పాటీదార్ చేరిపోయాడు. గతంలో ఎంఎస్ ధోని (సీఎస్కే, 2010, 2011), రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్ 2019, 2020), హార్దిక్ పాండ్యా ( గుజరాత్ టైటాన్స్ 2022, 2023), శ్రేయస్ అయ్యర్ (2024లో కేకేఆర్, 2025లో పంజాబ్) ఈ ఘనత సాధించారు.స్లో పాయిజన్ బ్యాటింగ్..రజత్ పాటీదార్ బ్యాటింగ్ స్టైల్ స్లో పాయిజన్ అని చెప్పొచ్చు. స్లో పాయిజన్ మెళ్లిగా ఎక్కినా బలంగా ప్రభావం చూపుతుంది. అదే తరహాలో ముందు స్లోగా ఆడడం.. ఒకసారి కుదురుకున్నాక అతడి విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడం పాటీదార్ స్టైల్. 2025 సీజన్లో బ్యాటింగ్‌లో కూడా ఫర్వాలేదనిపించే ప్రదర్శన (143.77 స్ట్రైక్‌రేట్‌తో 312 పరుగులు) చేసిన అతను ఈసారి మరింతగా చెలరేగిపోయాడు. టైటిల్ సాధించిన నాయకుడిగా వచ్చిన ఆత్మవిశ్వాసం కావచ్చు తాజా సీజన్లో అతను అసాధారణ బ్యాటింగ్‌ను ప్రదర్శిస్తున్నాడు. తాను ఎదుర్కొన్న 247 బంతుల్లో అతను 486 పరుగులు (5 అర్ధసెంచరీలు) సాధించాడు. వీటిలో 29 ఫోర్లు, 41 సిక్సర్ల ద్వారానే 362 పరుగులు రాబట్టడం అతని బ్యాటింగ్ ధాటి ఏమిటో చూపించింది. మంగళవారం మ్యాచ్‌లో అతను అద్భుత షాట్లతో ఆకట్టుకున్నాడు. ఆరుగురు ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొన్న అతనూ ఎవరినీ వదలకుండా అందరి బౌలింగ్‌లో సిక్సర్లు బాదాడు. కుల్వంత్ ఓవర్లో దూకుడు ప్రదర్శించిన తర్వాత రషీద్ ఓవర్లో అతను 2 భారీ సిక్స్‌లు కొట్టాడు. వీటిలో ఎక్స్ట్రా కవర్ మీదుగా కొట్టిన సిక్స్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. రబాడ ఓవర్లోనూ రెండు సిక్స్‌లు కొట్టిన అతను 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. సిరాజ్ ఓవర్లో వరుసగా 6, 4 బాదిన అతను ప్రసిధ్ వేసిన ఆఖరి ఓవర్లోనూ 2 సిక్స్‌లు కొట్టాడు. ఇలా కెప్టెన్‌గా, ఆటగాడిగా సూపర్ సక్సెస్ అయిన రజత్ పాటీదార్ తొందరలో టీమిండియా గడప కూడా తొక్కే అవకాశం లేకపోలేదు.Captains who led their teams into back to back IPL Finals:- MS Dhoni (2010, 2011). - Rohit Sharma (2019, 2020). - Hardik Pandya (2022, 2023). - Shreyas Iyer (2024, 2025). - Rajat Patidar (2025, 2026). pic.twitter.com/2evHNpBfQK— Mufaddal Vohra (@mufaddal_vohra) May 26, 2026Breathtaking Batting 🤯🎥 Rajat Patidar leaving the best in the business awestruck 😳❤️Updates ▶️ https://t.co/9rs6u5obOw#TATAIPL | #Qualifier1 | #TheFinalLeap | #RCBvGT | @RCBTweets pic.twitter.com/5BFUDFTHH1— IndianPremierLeague (@IPL) May 26, 2026చదవండి: ‘క్రెడిట్ నాది కాదు.. మ్యాచ్‌ను గెలిపించింది వాళ్లే!’ -
‘క్రెడిట్ నాది కాదు.. మ్యాచ్‌ను గెలిపించింది వాళ్లే!’
ఐపీఎల్ 2026 సీజన్లో మంగళవారం జరిగిన క్వాలిఫయర్-1 పోరులో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించిన ఆర్సీబీ ఫైనల్ చేరింది. మ్యాచ్‌లో 92 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న ఆర్సీబీ వరుసగా రెండో ఏడాది కూడా ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ విజయంపై ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ స్పందించాడు. ధర్మశాలలో జరిగిన ఈ హై-వోల్టేజ్ పోరులో ఒత్తిడిని అధిగమించి ప్రణాళికలను పక్కాగా అమలు చేయడం, మైదానంలో ప్రశాంతంగా నిలదొక్కుకోవడం కీలకంగా మారిందని అన్నారు. ఈ మ్యాచ్‌లో తాము కేవలం స్కోరును కాపాడుకోవడానికి రాలేదని, ప్రత్యర్థిపై పూర్తి దూకుడుతో అటాక్ చేయాలనే మైండ్ సెట్‌తో బరిలోకి దిగడం వల్లే విజయం సొంతమా అయిందని పటీదార్ పేర్కొన్నారు.పాటీదార్ మాట్లాడుతూ.. ‘ఈ సీజన్లో ఆర్సీబీ విజయాల్లో బౌలింగ్ విభాగం కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశాడు. సెంచరీ ఏముంది మరో మ్యాచ్‌లో చేసుకోవచ్చు. అయినా నా బ్యాటింగ్‌లో చాలా తప్పులున్నాయి. లైఫ్‌లు లభించడంతోనే ఇవాళ భారీ స్కోరు సాధించాను. మేము భారీ స్కోరు చేసినప్పటికీ, మా బౌలర్లు అద్భుతంగా రాణించి జట్టుకు విజయాన్ని కట్టబెట్టారు. గెలుపు క్రెడిట్‌ను నేను తీసుకోలేను, మా బౌలర్లే ఇవాళ నిజమైన హీరోలు.ముఖ్యంగా పవర్ ప్లేలో వికెట్లు తీయడమే తమ ప్రధాన లక్ష్యమని మా బౌలర్లు ముందే చెప్పారు. లీగ్ ముందుకు సాగుతున్న కొద్దీ భువనేశ్వర్ కుమార్, జోష్ హేజల్‌వుడ్, రసిక్ సలామ్, కృనాల్ మ్యాచ్ విన్నర్లుగా మారిపోయారు. పవర్ ప్లేలో కీలక వికెట్లు తీస్తూ జట్టుకు మంచి ఆరంభాలు ఇస్తున్నారు. ఫైనల్లోనూ ఇదే దూకుడు కొనసాగిస్తాం’ అని రజత్ పాటీదార్ ధీమా వ్యక్తం చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. మంగళవారం ఏకపక్షంగా సాగిన క్వాలిఫయర్–1లో ఆర్సీబీ 92 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. కెపె్టన్ రజత్ పాటీదార్ (33 బంతుల్లో 93 నాటౌట్; 5 ఫోర్లు, 9 సిక్స్‌లు) విధ్వంసక బ్యాటింగ్ ప్రదర్శన చేయగా... విరాట్ కోహ్లి (25 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్), కృనాల్ పాండ్యా (28 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం గుజరాత్ 19.3 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. ఓడినా గుజరాత్ ఫైనల్ చేరేందుకు మరో అవకాశం మిగిలి ఉంది. బుధవారం జరిగే ‘ఎలిమినేటర్’ మ్యాచ్ విజేతతో శుక్రవారం జరిగే క్వాలిఫయర్–2లో గుజరాత్ జట్టు తలపడుతుంది. Body Language: “𝘞𝘦 𝘢𝘳𝘦 𝘤𝘰𝘮𝘪𝘯𝘨 𝘧𝘰𝘳 𝘺𝘰𝘶” 🦁 pic.twitter.com/oVXoBEWBki— Royal Challengers Bengaluru (@RCBTweets) May 26, 2026 -
పాటిదార్ ఊచకోత.. గుజరాత్ చిత్తు.. ఫైనల్లో ఆర్సీబీ
ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీ హోదాకు తగ్గట్టుగా ఆడుతుంది. లీగ్ దశలో టేబుల్ టాపర్‌గా నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరిన ఈ జట్టు.. ఇవాళ (మే 26) జరిగిన తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తుగా ఓడించి, వరుసగా రెండో ఎడిషన్‌లో ఫైనల్‌కు చేరింది.ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. కెప్టెన్ రజత్ పాటిదార్ మహోగ్రరూపం (33 బంతుల్లో 93 నాటౌట్; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) దాల్చాడు. ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది.ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో పాటిదార్‌తో పాటు మిగతా ఆటగాళ్లు కూడా చెలరేగారు. వెంకటేశ్ అయ్యర్ 7 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 19 పరుగులు, విరాట్ కోహ్లి 25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 43, పడిక్కల్ 19 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 30, కృనాల్ పాండ్యా 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 43, టిమ్ డేవిడ్ 5 బంతుల్లో 4, జితేశ్ శర్మ 5 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 15 పరుగులు (నాటౌట్) చేశారు. గుజరాత్ బౌలర్లలో హోల్డర్, రబాడ తలో 2, ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ తీశారు.అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్.. ఆదిలోనే మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. సాయి సుదర్శన్ (14) దురదృష్టవశాత్తు హిట్ వికెట్‌గా వెనుదిరగడంతో ఈ జట్టు పతనం ప్రారంభమైంది. ఆతర్వాత కొద్ది సేపటికే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (2).. 51 పరుగుల వద్ద బట్లర్ (29), నిషాంత్ సింధు (5), హోల్డర్ (0) ఔట్ కావడంతో పవర్ ప్లేలోనే (5.4 ఓవర్లలో) ఓటమి ఖరారైంది. ఆతర్వాత స్వల్ప వ్యవధిలో సుందర్ (8), రషీద్ ఖాన్ (8), రబాడ (9) కూడా ఔట్ కావడం 100 పరుగులలోపే ఆలౌటయ్యేలా కనిపించింది. అయితే ఆఖర్లో తెవాతియా (68) బ్యాట్ ఝులిపించడంతో జట్టు స్కోర్ 100 పరుగుల మార్కు దాటింది. అంతిమంగా గుజరాత్ 19.3 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటై 92 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఆర్సీబీ బౌలర్లలో డఫీ 3, భువీ, రసిక్, కృనాల్ తలో 2, హాజిల్‌వుడ్ ఓ వికెట్ తీసి గుజరాత్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. -
పాటిదార్ మహోగ్రరూపం.. ఆల్‌టైమ్ రికార్డులు బద్దలు కొట్టిన ఆర్సీబీ
ఐపీఎల్ 2026 తొలి క్వాలిఫయర్‌లో ఆర్సీబీ-గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసి అతి భారీ స్కోర్ చేసింది.రజత్ పాటిదార్ (33 బంతుల్లో 93 నాటౌట్; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) మహోగ్రరూపం దాల్చడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో పాటిదార్‌తో పాటు మిగతా ఆటగాళ్లు కూడా చెలరేగారు.వెంకటేశ్ అయ్యర్ 7 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 19 పరుగులు, విరాట్ కోహ్లి 25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 43, పడిక్కల్ 19 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 30, కృనాల్ పాండ్యా 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 43, టిమ్ డేవిడ్ 5 బంతుల్లో 4, జితేశ్ శర్మ 5 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 15 పరుగులు (నాటౌట్) చేశారు. గుజరాత్ బౌలర్లలో హోల్డర్, రబాడ తలో 2, ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ తీశారు.కాగా, ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఆల్‌టైమ్ పలు రికార్డులు బద్దలు కొట్టింది. ఐపీఎల్ నాకౌట్స్/ప్లే ఆఫ్స్‌లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. అలాగే ఐపీఎల్ నాకౌట్స్/ప్లే ఆఫ్స్‌లో అత్యధిక బౌండరీలు సాధించిన జట్టుగానూ సరికొత్త రికార్డు నెలకొల్పింది.ఐపీఎల్ నాకౌట్స్/ప్లే ఆఫ్స్‌లో అత్యధిక స్కోరు254/5 RCB vs PBKS ధర్మశాల 2026 *233/3 GT vs MI అహ్మదాబాద్ 2023228/5 MI vs GT న్యూ చండీగఢ్ 2025226/6 PBKS vs CSK వాంఖడే 2014222/5 CSK vs DC చెన్నై 2012ఐపీఎల్ నాకౌట్స్/ప్లే ఆఫ్స్‌లో అత్యధిక బౌండరీలు38 RCB vs GT ధర్మశాల 2026 *33 CSK vs DC చెన్నై 201232 PBKS vs CSK వాంఖేడే 201431 GT vs MI అహ్మదాబాద్ 202331 MI vs GT న్యూ చండీగఢ్ 2025 -
హెడ్ భార్యకు వేధింపులు.. వికృత చేష్టలు ఆపండి!
ఐపీఎల్ 2026 సీజన్లో ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ మ్యాచ్ ఫలితం కంటే విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ల మధ్య చోటుచేసుకున్న వివాదమే హైలైట్‌గా నిలిచింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో కోహ్లీపై హెడ్ వ్యంగ్యాస్త్రాలు సంధించడం, దీనికి కౌంటర్‌గా కోహ్లీ ధీటుగా బదులివ్వడం కనిపించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత హెడ్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించినా కోహ్లీ అతడిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోవడంతో వివాదం మరో మలుపుకు తిరిగింది. అయితే వివాదం అక్కడితో సద్దుమణిగిందిలే అనకుంటే ఇప్పుడు అభిమానులు దీనిని మరింత పెద్దదిగా చేస్తున్నారనిపిస్తోంది. తాజాగా హెడ్ భార్య జెస్సికాను ఈ వివాదంలోకి లాగారు. జెస్సీకా సోషల్ మీడియా అకౌంట్‌ను హ్యాక్ చేసిన కొంతమంది ఆమెను కించపరుస్తూ అసభ్యకర పోస్టులతో ఆన్లైన్ వేధింపులకు దిగినట్లు తెలుస్తోంది. ఆటగాళ్లు వివాదాన్ని మైదానానికే పరిమితం చేస్తున్నప్పటికీ కొంతమంది ఫ్యాన్స్ మాత్రం వివాదాలను ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాలతో ముడిపెట్టి తమ వికృత చేష్టలతో క్రీడా సంస్కృతిని భ్రష్టు పట్టిస్తున్నారు.తనను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారంటూ హెడ్ భార్య జెస్సికా స్వయంగా సోషల్ మీడియా వేదికగా వాపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 'ప్రపంచకప్ సంఘటన తర్వాత నాపై వేధింపులు తిరిగి పునరావృతమైనట్లుగా అనిపిస్తోంది. నేను నిద్రలేవడంతోనే నా సోషల్ మీడియా ఖాతాలో కొంతమంది అసభ్యకర పోస్టులు, కామెంట్లు పెట్టారు. నన్ను వేధింపులకు గురి చేసినా పట్టించుకునే దాన్ని కాదు, కానీ వాళ్లు శ్రుతి మించిపోయారు. నాతో పాటు నా కుటుంబసభ్యులను, మిత్రులపై వేధింపులకు దిగారు. క్రీడా సంబంధిత విషయాలను వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టడం సరికాదు. ఈ వికృత చేష్టలను దయచేసి ఆపాలని కోరుతున్నా.' అంటూ జెస్సికా ఆవేదనతో రాసుకొచ్చింది. మేము మనుషులమే..'ప్రస్తుతం అన్ని క్రీడల్లోనూ మానసిక ఆరోగ్యం, దృక్పథం, మనం ఒకరితో ఒకరు మాట్లాడుకునే విధానం గురించి ఒక ముఖ్యమైన చర్చ జరుగుతోందని నేను అనుకుంటున్నాను. క్రీడల్లో ఆటగాళ్ల మధ్య గొడవలు సహజం. కానీ ఆటను ఆటగానే చూడాలి. అంతేకానీ ఆ వివాదాలను వ్యక్తుల కుటుంబాల దాకా తీసుకురాకూడదు. మేము మనుషులమే.. మాకు కుటుంబాలు ఉంటాయని గుర్తుంచుకోవడం ముఖ్యం.' అని ఆమె అన్నారు.గతంలోనూ వేధింపులు..అయితే హెడ్ భార్య జెస్సికాకు ఆన్లైన్ వేధింపులు కొత్త కాదు. గతంలో 2023 వన్డే ప్రపంచకప్ సందర్భంగా ఫైనల్లో రోహిత్ శర్మ ఇచ్చిన క్యాచ్‌ను హెడ్ అందుకున్నాడు. అప్పుడు కూడా హెడ్‌తో పాటు అతడి భార్య జెస్సికాను టార్గెట్ చేస్తూ కొంతమంది అభిమానులు అసభ్యకర కామెంట్లు చేశారు. తాజాగా ఐపీఎల్ 2026 సీజన్లో కోహ్లీ, హెడ్ మధ్య వివాదం జెస్సికాకు మరోసారి చేదు అనుభవాన్ని మిగిల్చింది.కోహ్లీ, హెడ్ వివాదమేంటి?ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో కోహ్లీ స్లోగా ఆడడంతో హెడ్.. ‘కాస్త బౌండరీలు కొట్టు’ అంటూ కాస్త వెటకారంగా పేర్కొన్నాడు. దీంతో కోహ్లీకి చిర్రెత్తుకొచ్చి 'నువ్వు బౌలింగ్ చెయ్యు.. బౌండరీలు కొడుతా. అయినా నువ్వు ఎప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్‌గానే వస్తున్నావు. ఒక్కసారి బౌలింగ్ కూడా రాలేదు' అని పేర్కొన్నాడు. కానీ హెడ్ మాత్రం కోహ్లీ వ్యాఖ్యలను పట్టించుకోకుండా సరదాగా నవ్వేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్ల కరచాలనం సందర్భంగా హెడ్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ కోహ్లీ అతడిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయాడు.ఐపీఎల్ 2026 సీజన్లో లీగ్ దశ ముగిసింది. మంగళవారం తొలి క్వాలిఫయర్‌లో ఆర్సీబీ, గుజరాత్ తలపడునున్నాయి. బుధవారం ఎలిమినేటర్‌లో ఎస్ఆర్హెచ్, రాజస్తాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. మే 29న క్వాలిఫయర్-2, మే 31న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.Look behind the whole SRH coaching staff, including Daniel Vettori and Muttiah Muralitharan, were watching Virat Kohli and Travis Head, expecting some drama and ready to stop a fight. 😳But Kohli didn’t shake hands, and everyone started laughing. 😂 pic.twitter.com/9F9pHwiC8T— Jeet (@JeetN25) May 23, 2026255 on the board and the bowlers made sure it was never, ever in doubt 🔥#SRH cap off the league stage with a massive 5️⃣5️⃣-run win 🧡Scorecard ▶️ https://t.co/ZcxjefgalG#TATAIPL | #KhelBindaas | #SRHvRCB | @SunRisers pic.twitter.com/LiQBSJDDR2— IndianPremierLeague (@IPL) May 22, 2026చదవండి: ‘అతడి వల్లే విజయం.. లేకుంటే ఇంటికి పోయేవాళ్లం!’ -
ముగిసిన లీగ్ దశ.. ప్లేఆఫ్స్ పూర్తి షెడ్యూల్ ఇదే
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్‌పై విజయంతో రాజస్తాన్ రాయల్స్ నాలుగో జట్లుగా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. ఇప్పటికే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ప్లేఆఫ్స్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వాహకులు ప్లేఆఫ్స్ షెడ్యూల్, మ్యాచ్ వేదికలు, మ్యాచ్ సమయంకు సంబంధించి పూర్తి వివరాలు విడుదల చేశారు. మే 26న జరగనున్న క్వాలిఫయర్-1 పోరులో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో అడుగుపెట్టనుండగా, ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్ ధర్మశాల వేదికగా జరగనుంది. ఇక మే 27న ఎలిమినేటర్ పోరులో ఎస్ఆర్హెచ్, రాజస్తాన్ తలపడనున్నాయి. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక మే 29న జరగనున్న క్వాలిఫయర్-2 పోరులో ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు తలపడనుంది. ఎలిమినేటర్‌తో పాటు క్వాలిఫయర్-2 మ్యాచ్‌కు ముల్లన్పూర్ వేదిక కానుంది. ఇక ఆదివారం (మే 31న) అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్లో క్వాలిఫయర్-1 విజేతతో క్వాలిఫయర్-2 విజేత అమీతుమీ తేల్చుకోనుంది.ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్మే 26- క్వాలిఫయర్-1 (ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్, ధర్మశాల, రాత్రి 7.30 నుంచి)మే 27- ఎలిమినేటర్ (ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్తాన్, ముల్లన్పూర్, రాత్రి 7.30 నుంచి)మే 29-క్వాలిఫయర్-2 (క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు వర్సెస్ ఎలిమినేటర్ విజేత, ముల్లన్పూర్, రాత్రి 7.30 నుంచి)మే 31- ఫైనల్ (క్వాలిఫయర్-1 విజేత వర్సెస్ క్వాలిఫయర్-2 విన్నర్, అహ్మదాబాద్, రాత్రి 7.30 నుంచి)4️⃣ teams. 1️⃣ winner All roads lead to the ultimate glory 🏆#TATAIPL | #TheFinalLeap pic.twitter.com/waI2u61Q4t— IndianPremierLeague (@IPL) May 24, 2026చదవండి: పంజాబ్ చేజేతులా.. నిరీక్షణ ఇంకెన్నాళ్లు! -
ఆర్సీబీకి షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ ఆటగాడు!
ఐపీఎల్ 2026 సీజన్లో డిపెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చాంపియన్ హోదాకు తగ్గట్లే టేబుల్ టాపర్‌గా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. అయితే గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్ పోరుకు ముందు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టులో ఓపెనర్‌గా రాణిస్తున్న జాకబ్ బెతెల్ ఉన్నపళంగా స్వదేశానికి వెళ్లిపోయాడు. చేతి వేలి గాయంతో జాకబ్ బెతెల్ జట్టును వీడినట్లు ఆర్సీబీ యాజమాన్యం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే జూన్‌లో ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. దీంతో స్వదేశంలో చేతి వేలి గాయానికి సంబంధించి మెరుగైన చికిత్స తీసుకోవడానికి ఇంగ్లండ్ వెళ్లినట్లు ఆర్సీబీ తెలిపింది. 'పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో జాకబ్ బెథెల్ ఎడమ చేతి వేలికి గాయమైంది. అయితే జూన్‌లో ఇంగ్లండ్‌కు కీలకమైన టెస్టు సిరీస్ ఉండడంతో మెరుగైన వైద్య పరీక్షల కోసం ఇంగ్లండ్‌కు వెళ్లిపోయాడు' అని ఆర్సీబీ తమ ఎక్స్‌లో రాసుకొచ్చింది. కాగా ఇంగ్లండ్‌కే చెందిన మరో స్టార్ ఆటగాడు ఫిల్ సాల్ట్ గాయపడడంతో జట్టులో చోటు దక్కించుకున్న జాకబ్ బెతెల్ సీజన్లో ఏడు మ్యాచ్‌లు ఆడాడు. ఫిల్ సాల్ట్ తిరిగొచ్చినప్పటికీ బెతెల్ రాణించడంతో జట్టులో అతడినే కంటిన్యూ చేసింది. అయితే మే 26న ధర్మశాలలో గుజరాత్ టైటాన్స్‌తో జరగనున్న క్వాలిఫయర్-1 పోరుకు జాకబ్ బెతెల్ దూరం కావడంతో కోహ్లీతో కలిసి ఫిల్ సాల్ట్ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశముంది. అందుకే జాకబ్ బెతెల్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయడం లేదని ఆర్సీబీ మరో ప్రకటనలో పేర్కొంది. ఇక ఇంగ్లండ్ స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. జూన్ 4 నుంచి 8 మధ్య తొలి టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కూడా జాకబ్ బెతెల్ గాయంపై స్పందించింది. ‘న్యూజిలాండ్‌తో వచ్చే నెలలో టెస్టు సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం జాకబ్ బెతెల్‌ను ఎంపిక చేశాం. తొలి టెస్టుకు ముందే జాకబ్ బెతెల్ గాయం తీవ్రతను పూర్తిగా అంచనా వేసేందుకు వైద్య బృందం పర్యవేక్షించనుంది’ అని పేర్కొంది.🚨 𝙊𝙛𝙛𝙞𝙘𝙞𝙖𝙡 𝘼𝙣𝙣𝙤𝙪𝙣𝙘𝙚𝙢𝙚𝙣𝙩: Jacob Bethell sustained an injury to his left ring finger during our game against PBKS. He will return to England to be assessed ahead of their Test series. ❤️🩹𝙶𝚎𝚝 𝚠𝚎𝚕𝚕 𝚜𝚘𝚘𝚗, 𝙹𝙱! 🫂 𝚆𝚎’𝚕𝚕 𝚖𝚒𝚜𝚜 𝚑𝚊𝚟𝚒𝚗𝚐 𝚢𝚘𝚞… pic.twitter.com/x6ipurfteA— Royal Challengers Bengaluru (@RCBTweets) May 23, 2026చదవండి: టెస్టు క్రికెట్లో ఐసీసీ కీలక మార్పులు! -
కోహ్లీకి ఎదురుపడితే ఈసారి దబిడిదిబిడే!
ఐపీఎల్ 2026 సీజన్లో శుక్రవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 55 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ విజయం కన్నా విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలోనే ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. మ్యాచ్ ముగిసిన తర్వాత హెడ్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి కోహ్లీ నిరాకరించడంతో వివాదం మరో మలుపుకు తిరిగింది. వివాదం జరిగి ఒకరోజు కావొస్తున్నా ఇంకా ఆ వేడి తగ్గలేదనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికర పరిణామం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరిన ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్లు క్వాలిఫయర్‌లో ఎదురుపడే అవకాశం లేదు. కానీ క్వాలిఫయర్-1 పోరులో ఆర్సీబీ ఓడి, ఎలిమినేటర్ పోరులో ఎస్ఆర్హెచ్ గెలిస్తే మాత్రం.. క్వాలిఫయర్-2 పోరులో ఈ రెండు జట్లు మళ్లీ తలపడనున్నాయి.అలా కాకుండా క్వాలిఫయర్-1లో ఆర్సీబీ గెలిచి.. మరోవైపు ఎలిమినేటర్‌తో పాటు క్వాలిఫయర్-2లోనూ ఎస్ఆర్హెచ్ గెలిచి ఫైనల్ చేరితే మాత్రం, తుది పోరులో ఆర్సీబీతో అమీతుమీ తేల్చుకోనుంది. ఏది ఏమైనప్పటికీ కోహ్లీ మాత్రం ప్రతీకారేచ్చతో రగిలిపోతున్నాడు. మరోమారు ఎస్ఆర్హెచ్తో ఆర్సీబీ మ్యాచ్ ఆడితే మాత్రం హెడ్‌కు దబిడిదిబిడి అయ్యేలాగే పరిస్థితులు ఉన్నట్లు అభిమానులు పేర్కొంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. అసలేం జరిగిందంటే..ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో కోహ్లీ స్లోగా ఆడడంతో హెడ్ @కాస్త బౌండరీలు కొట్టు* అంటూ కాస్త వెటకారంగా పేర్కొన్నాడు. దీంతో కోహ్లీకి చిర్రెత్తుకొచ్చి 'నువ్వు బౌలింగ్ చెయ్యు.. బౌండరీలు కొడుతా. అయినా నువ్వు ఎప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్‌గానే వస్తున్నావు. ఒక్కసారి బౌలింగ్ కూడా రాలేదు' అని పేర్కొన్నాడు. కానీ హెడ్ మాత్రం కోహ్లీ వ్యాఖ్యలను పట్టించుకోకుండా సరదాగా నవ్వేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత హెడ్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించడంతో కోహ్లీ దీనిని సీరియస్‌గా తీసుకున్నాడని స్పష్టంగా తెలిసొచ్చింది.You could easily notice that every time Venkatesh Iyer found the boundary, Kohli kept throwing Travis Head-related gestures. He sparked the whole drama himself, didn’t even shake hands afterward.His arrogance is on another level. 🥵pic.twitter.com/HEnvHnLjEw— Yorker__93™ (@Boom__93) May 23, 2026 255 on the board and the bowlers made sure it was never, ever in doubt 🔥#SRH cap off the league stage with a massive 5️⃣5️⃣-run win 🧡Scorecard ▶️ https://t.co/ZcxjefgalG#TATAIPL | #KhelBindaas | #SRHvRCB | @SunRisers pic.twitter.com/LiQBSJDDR2— IndianPremierLeague (@IPL) May 22, 2026చదవండి: అభిమానికి రోహిత్ క్షమాపణ.. ఎందుకంటే? -
ఎస్ఆర్హెచ్కు తప్పని గండం
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (మే 22) జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై ఎస్ఆర్హెచ్ 55 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ గెలిచినా ఎస్ఆర్హెచ్కు సుఖం లేకుండా పోయింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తద్వారా ఎలిమినేటర్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ జట్టు ఫైనల్‌కు చేరాలంటే మరో రెండు గండాలు (ఎలిమినేటర్, క్వాలిఫయర్-2) దాటాల్సి ఉంటుంది. ఒకవేళ ఆర్సీబీ మ్యాచ్‌లో 90 పైచిలుకు పరుగుల తేడాతో గెలిచి ఉంటే, రన్‌రేట్ బాగా మెరుగై టాప్-2లోకి చేరిది. అప్పుడు క్వాలిఫయర్-1 బెర్త్ దక్కేది. క్వాలిఫయర్-1కు చేరితే ఓ అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఓడినా మరో అవకాశం ఉంటుంది. ఈ అడ్వాంటేనే ఎస్ఆర్హెచ్ మిస్ చేసుకుంది. ఎస్ఆర్హెచ్ చేతిలో ఓడినా మెరుగైన రన్‌రేట్ కారణంగా ఆర్సీబీ టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకుంది. గుజరాత్ రెండో స్థానాన్ని ఖాయం చేసుకుంది. ఈ రెండు జట్లు మే 26న ధర్మశాల వేదికగా జరిగే తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో తలపడతాయి. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో క్వాలిఫయర్-2లో తలపడుతుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-1 విజేతతో మే 29న అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్లో తలపడుతుంది.ఆర్సీబీ, గుజరాత్‌తో పాటు సన్‌రైజర్స్ కూడా తలో 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు సాధించినా.. ఆర్సీబీ (0.783), గుజరాత్ (0.695)తో పోలిస్తే ఎస్ఆర్హెచ్ (0.524) కాస్త తక్కువ రన్‌రేట్ కలిగి ఉండటంతో ఎలిమినేటర్ ఆడాల్సి పరిస్థితి ఏర్పడింది. ఎలిమినేటర్‌లో ఎస్ఆర్హెచ్ ప్రత్యర్దిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. నాలుగో ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం రాజస్థాన్, పంజాబ్, కేకేఆర్, ఢిల్లీ మధ్య పోటీ కొనసాగుతుంది. ఈ జట్లలో ఓ జట్టు మే 27న ముల్లాన్‌పూర్‌లో జరిగే ఎలిమినేటర్‌లో ఎస్ఆర్హెచ్లో తలపడుతుంది.ప్లే ఆఫ్స్ నాలుగో బెర్త్ కోసం అధికారింగా నాలుగు జట్లు పోటీపడుతున్నా, ప్రధాన పోటీ మాత్రం రాజస్థాన్, పంజాబ్, కేకేఆర్ మధ్య మాత్రమే ఉంది. వీటిలో పంజాబ్ భవిష్యత్తు నేటితో తేలిపోతుంది. ఇవాళ జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ లక్నోతో తలపడనుంది. లక్నోతో పాటు ముంబై, సీఎస్కే ఇదివరకే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. -
ఎస్ఆర్హెచ్ త్రిమూర్తుల అరుదైన ఫీట్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీతో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 255 పరుగులు భారీ స్కోరు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరుజట్లు ప్లేఆఫ్స్ చేరినప్పటికీ ఎస్ఆర్హెచ్ రెండో స్థానంలో ప్లేఆఫ్‌కు చేరాలంటే భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. అయితే ఆర్సీబీతో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ తొలుత బ్యాటింగ్ చేయడంతో రెండో స్థానంలో నిలవాలంటే 90 ప్లస్ పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఈ సంగతి పక్కనబెడితే ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెనిరిచ్ క్లాసెన్‌లు ఒక అరుదైన రికార్డు తమ పేరిట లిఖించుకున్నారు. ఆర్సీబీతో మ్యాచ్‌లో ఈ ముగ్గురు త్రిమూర్తులు అర్థసెంచరీలతో చెలరేగారు. ఈ సీజన్లో అభిషేక్, క్లాసెన్, ఇషాన్‌లు 500 పరుగుల మార్క్‌ను దాటారు. తద్వారా ఒకే ఎడిషన్‌లో ఒక జట్టు నుంచే ముగ్గురు బ్యాటర్లు 500 ప్లస్ పరుగులు సాధించడం ఐపీఎల్ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. గతంలో గుజరాత్ టైటాన్స్ 2025లో ఈ ఫీట్‌ను నమోదు చేసింది. ఆ సీజన్లో సాయి సుదర్శన్ (600 పరుగులు), శుబ్‌మన్ గిల్ (759 పరుగులు), బట్లర్ (538 పరుగులు) సాధించారు. తాజా సీజన్లో ఎస్ఆర్హెచ్ తరఫున క్లాసెన్ (606 పరుగులు), అభిషేక్ శర్మ (563 పరుగులు) ఐదొందల మార్క్ దాటగా, తాజాగా ఆర్సీబీతో మ్యాచ్‌లో ఫిఫ్టీ సాధించడం ద్వారా ఇషాన్ కిషన్ కూడా 500 మార్క్ దాటి 569 పరుగులతో ఆరెంజ్‌క్యాప్ రేసులో ఆరో స్థానంలో ఉన్నాడు. MAXIMUMS x 2️⃣🎥 Abhishek Sharma was in his element 👊🧡Updates ▶️ https://t.co/ZcxjefgalG#TATAIPL | #KhelBindaas | #SRHvRCB | @SunRisers pic.twitter.com/exdErsz4bp— IndianPremierLeague (@IPL) May 22, 2026A six-hitting Master-KLAAS on show 🍿🎥 Heinrich Klaasen going big against Josh Hazlewood 💥💥Updates ▶️ https://t.co/ZcxjefgalG#TATAIPL | #KhelBindaas | #SRHvRCB | @SunRisers pic.twitter.com/DGYE4ND2WN— IndianPremierLeague (@IPL) May 22, 2026 The ball literally flew to every single corner of the ground tonight 🚀Updates ▶️ https://t.co/ZcxjefgalG#TATAIPL | #KhelBindaas | #SRHvRCB | @SunRisers pic.twitter.com/8pR8qvDCnC— IndianPremierLeague (@IPL) May 22, 2026 -
IPL 2026: ఆర్సీబీని చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్
ఉప్పల్ మైదానం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 55 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 200 పరుగులకు పరిమితమైంది. బెంగళూరు బ్యాటర్లలో రజిత్ పాటిదార్(56) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కృనాల్ పాండ్యా(41), వెంకటేశ్ అయ్యర్(44) రాణించారు. విరాట్ కోహ్లి మాత్రం కేవలం 15 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ రెండు, షకీబ్, ట్రావిస్ హెడ్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇషాన్ (79), అభిషేక్ (56), క్లాసెన్ (51) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు.ఆర్సీబీ నాలుగో వికెట్ డౌన్పాటిదార్ రూపంలో ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. 56 పరుగులు చేసిన పాటిదార్.. హెడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 19 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 185/4ఆర్సీబీ మూడో వికెట్ డౌన్దేవ్దత్త్ పడిక్కల్ రూపంలో ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన పడిక్కల్.. మలింగ బౌలింగ్‌లో ఔటయ్యాడు8 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 91/28 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. క్రీజులో దేవ్‌దత్త్ పడిక్కల్(20), పాటిదార్(10) ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీఎస్ఆర్హెచ్ విధించిన 256 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ ధాటిగా ఆరంభించింది. 4 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. అయితే మరుసటి ఓవర్లోనే వెంకటేశ్ అయ్యర్ (44) ఔట్ కావడంతో ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. ఆర్సీబీ టార్గెట్ 256 పరుగులుహైదరాబాద్ వేదికగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్ భారీ స్కోరు చేసింది. అభిషేక్, ఇషాన్, క్లాసెన్ అర్థశతకాలతో విధ్వంసం సృష్టించడంతో ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇషాన్ (79), అభిషేక్ (56), క్లాసెన్ (51) ఫిఫ్టీలతో మెరిశారు. ఆఖర్లో నితీశ్‌కుమార్ (12 బంతుల్లో 29 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో ఎస్ఆర్హెచ్ 250 పరుగుల మార్క్‌ను దాటింది. ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలామ్ 2 వికెట్లు తీయగా, సుయాశ్, కృనాల్ చెరొక వికెట్ తీశారు.16 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 2 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. క్లాసెన్ 23 బంతుల్లో 50 పరుగుల మార్క్ సాధించాడు. కిషన్ 65 పరుగులతో ఆడుతున్నాడు.దంచుతున్న ఎస్ఆర్హెచ్.. 15 ఓవర్లలో 189-2ఆర్సీబీతో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ దంచికొడుతుంది. 15 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 2 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (50), క్లాసెన్ (47) క్రీజులో ఉన్నారు. అంతకముందు 56 పరుగులు చేసిన అభిషేక్ శర్మ సుయాశ్ శర్మ బౌలింగ్‌లో జోర్డాన్ కాక్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.6 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 63-16 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (26), ఇషాన్ కిషన్ (8) పరుగులతో ఆడుతున్నారు.హెడ్ (26) ఔట్.. తొలి వికెట్ డౌన్ఆర్సీబీతో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ రసిక్సలామ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోయి 45 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (17) క్రీజులో ఉన్నాడు.టాస్ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆర్సీబీపై భారీ విజయాన్ని సాధించి టేబుల్లో రెండో స్థానంలో నిలవాలని ఎస్ఆర్హెచ్ ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఇప్పటికే టాప్‌లో ఉన్న ఆర్సీబీ విజయంతో లీగ్ దశను ముగించాలని భావిస్తోంది. మరి భారీ స్కోర్లకు పెట్టింది పేరైన ఉప్పల్ స్టేడియంలో ఎవరిది పైచేయి కానుందో కొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ తమ సొంత మైదానంలో ఎస్ఆర్హెచ్తో తలపడింది. ఆ మ్యాచ్‌లో విజయం సాధించిన ఆర్సీబీ.. యాదృశ్చికంగా లీగ్ దశలో తమ చివరి మ్యాచ్‌ను మళ్లీ ఎస్ఆర్హెచ్తోనే ఆడుతోంది. అయితే ఎస్ఆర్హెచ్ మాత్రం ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది. ముఖాముఖి పోరులో ఇరుజట్లు 26 సార్లు తలపడితే ఎస్ఆర్హెచ్ 14 సార్లు, ఆర్సీబీ 12 సార్లు విజయాలు సాధించాయి. ఇక సొంత మైదానంలో ఆర్సీబీపై ఎస్ఆర్హెచ్దే పైచేయిగా ఉంది. ఇక్కడ ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఎస్ఆర్హెచ్ ఆరింటిలో గెలవగా.. ఆర్సీబీ మూడింట నెగ్గింది.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, జితేష్ శర్మ(వికెట్‌కీపర్), కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్.సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(కెప్టెన్), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్. 🚨Toss update from Hyderabad 🚨@SunRisers won the toss and elected to bat first against @RCBTweets Rajat Patidar returns to lead #RCB Updates ▶️ https://t.co/ZcxjefgalG#TATAIPL | #KhelBindaas | #SRHvRCB pic.twitter.com/izekAMXKnx— IndianPremierLeague (@IPL) May 22, 2026 -
వామ్మో.. ఒక్క టికెట్ 2 లక్షలా.. గేట్ బయట లీకైన వీడియో
-
కోహ్లి, అయ్యర్ మెరుపులు.. ప్లే ఆఫ్స్‌కు ఆర్సీబీ
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 17) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.విరాట్ కోహ్లి (58), వెంకటేశ్ అయ్యర్ (73 నాటౌట్) మెరుపు అర్ద శతకాలతో చెలరేగారు. పడిక్కల్ (45), టిమ్ డేవిడ్ (28) కూడా బ్యాట్ ఝులిపించారు. జేకబ్ బేతెల్ (11) పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ 2 వికెట్లు తీయగా.. అర్షదీప్ సింగ్, చహల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. ఈ ఓటమితో ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ సీజన్ తొలి 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించిన పంజాబ్.. ఆతర్వాతి 6 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, నిష్క్రమణ అంచుల్లో నిలిచింది. ఆర్సీబీతో మ్యాచ్‌లో పంజాబ్ ఆదిలోనే పట్టు కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ ధాటికి ఆ జట్టు 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆతర్వాత కూపర్ కన్నోల్లీ (37), సూర్యాంశ్ షేడ్గే (35) కాసేపు క్రీజ్‌లో నిలదొక్కుకున్నారు. అయితే షెపర్డ్, సుయాశ్ శర్మ దెబ్బకు వీరిద్దరు ఔటయ్యారు. ఈ దశలో శశాంక్ సింగ్ (56), స్టోయినిస్ (37) పంజాబ్ శిబిరంలో ఆశలు రేకెత్తించారు. వీరు కూడా ఔట్ కావడంతో పంజాబ్ ఓటమి ఖరారైంది. ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలాం దార్ 3, భువీ 2, హాజిల్‌వుడ్, సుయాశ్ శర్మ, షెపర్డ్ తలో వికెట్ తీశారు. పంజాబ్ బ్యాటర్లలో ప్రియాంశ్ ఆర్య 0, ప్రభ్‌సిమ్రన్ 2, శ్రేయస్ 1, ఒమర్జాయ్ 14 పరుగులకు ఔటయ్యారు. -
పంజాబ్‌పై ఆర్సీబీ గెలుపు
పంజాబ్‌పై ఆర్సీబీ గెలుపుఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 17) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.విరాట్ కోహ్లి (58), వెంకటేశ్ అయ్యర్ (73 నాటౌట్) మెరుపు అర్ద శతకాలతో చెలరేగారు. పడిక్కల్ (45), టిమ్ డేవిడ్ (28) కూడా బ్యాట్ ఝులిపించారు. జేకబ్ బేతెల్ (11) పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ 2 వికెట్లు తీయగా.. అర్షదీప్ సింగ్, చహల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. ఈ ఓటమితో ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ సీజన్ తొలి 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించిన పంజాబ్.. ఆతర్వాతి 6 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, నిష్క్రమణ అంచుల్లో నిలిచింది. ఆర్సీబీతో మ్యాచ్‌లో పంజాబ్ ఆదిలోనే పట్టు కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ ధాటికి ఆ జట్టు 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆతర్వాత కూపర్ కన్నోల్లీ (37), సూర్యాంశ్ షేడ్గే (35) కాసేపు క్రీజ్‌లో నిలదొక్కుకున్నారు. అయితే షెపర్డ్, సుయాశ్ శర్మ దెబ్బకు వీరిద్దరు ఔటయ్యారు. ఈ దశలో శశాంక్ సింగ్ (56), స్టోయినిస్ (37) పంజాబ్ శిబిరంలో ఆశలు రేకెత్తించారు. వీరు కూడా ఔట్ కావడంతో పంజాబ్ ఓటమి ఖరారైంది. ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలాం దార్ 3, భువీ 2, హాజిల్‌వుడ్, సుయాశ్ శర్మ, షెపర్డ్ తలో వికెట్ తీశారు. పంజాబ్ బ్యాటర్లలో ప్రియాంశ్ ఆర్య 0, ప్రభ్‌సిమ్రన్ 2, శ్రేయస్ 1, ఒమర్జాయ్ 14 పరుగులకు ఔటయ్యారు. 93 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన పంజాబ్223 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ దాదాపుగా చేతులెత్తేసింది. 93 పరుగులకే ఆ జట్టు సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతోంది. స్టోయినిస్ (14), శశాంక్సింగ్ (0) క్రీజ్‌లో ఉన్నారు. పీకల్లోతు కష్టాల్లో పంజాబ్223 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ తడబడుతోంది. 19 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భువనేశ్వర్ కుమార్ (2-0-8-2) అద్భుతమై స్వింగ్ బౌలింగ్‌తో పంజాబ్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. అతనికి రసిక్ సలామ్ దార్ (1-0-4-1) తోడయ్యాడు. పంజాబ్ బ్యాటర్లలో ప్రియాంశ్ ఆర్య డకౌట్ కాగా.. ప్రభ్‌సిమ్రన్ సింగ్ 2, శ్రేయస్ అయ్యర్ ఒక్క పరుగుకు వెనుదిరిగారు. కూపర్ కన్నోలీ (15), సూర్యంశ్ షేడ్గే (4) క్రీజ్‌లో ఉన్నారు. పంజాబ్ రెండో వికెట్ డౌన్పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన ప్రభ్సిమ్రాన్ సింగ్.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రెండు ఓవర్లకు పంజాబ్ స్కోర్: 19/2పంజాబ్ తొలి వికెట్ డౌన్223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య ఖాతా తెరవకుండానే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.ఆర్సీబీ భారీ స్కోర్‌టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (58), వెంకటేశ్ అయ్యర్ (73 నాటౌట్) మెరుపు అర్ద శతకాలతో చెలరేగారు. పడిక్కల్ (45), టిమ్ డేవిడ్ (28) కూడా బ్యాట్ ఝులిపించారు. జేకబ్ బేతెల్ (11) పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ 2 వికెట్లు తీయగా.. అర్షదీప్ సింగ్, చహల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ14.6వ ఓవర్- 157 పరుగుల వద్ద ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. చహల్ బౌలింగ్‌లో ప్రియాంశ్ ఆర్యకు క్యాచ్ ఇచ్చి విరాట్ కోహ్లి (58) ఔటయ్యాడు.రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ9.1వ ఓవర్- 97 పరుగుల వద్ద దేవ్‌దత్ పడిక్కల్ (45) ఔటయ్యాడు. హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ధాటిగా ఆడుతున్న పడిక్కల్, కోహ్లివిరాట్ కోహ్లి (24), దేవ్‌దత్ పడిక్కల్ (23) ధాటిగా ఆడుతున్నారు. 6 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 61-1గా ఉంది.తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ2.2వ ఓవర్- 21 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో జేకబ్ బేతెల్ (11) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ఐపీఎల్ 2026లో ఇవాళ (మే 17) డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ, పంజాబ్ తలపడుతున్నాయి. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ గాయం కారణంగా దూరమయ్యాడు. అతని స్థానంలో జితేశ్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. తుది జట్లు..రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, వెంకటేష్ అయ్యర్, జితేష్ శర్మ(w/c), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, క్రునాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మపంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్(w), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(c), సూర్యాంశ్ షెడ్గే, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, లాకీ ఫెర్గూసన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ -
తెగే దాకా తెచ్చుకున్న పంజాబ్.. అడుగు దూరంలో ఆర్సీబీ
ఐపీఎల్ 2026లో ఇవాళ (మే 17) మధ్యాహ్నం అత్యంత కీలక సమరం జరుగనుంది. టేబుల్ టాపర్‌గా ఉన్న ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం కొట్టిమిట్టాడుతున్న పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఆర్సీబీకి పెద్దగా కీలకం కాకపోయినా, పంజాబ్‌కు మాత్రం చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఓడిందా ఖేల్ దాదాపు ఖతమైనట్లే. ఆర్సీబీ విషయానికొస్తే.. ఈ జట్టుకు ఈ మ్యాచ్ అంత ముఖ్యం కాకపోయినా, గెలిస్తే మాత్రం దర్జాగా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ఓడినా ఈ జట్టుకు మరో ఛాన్స్ ఉంటుంది. చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై గెలిస్తే అప్పుడైన ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది. ఒకవేళ అది కూడా ఓడిందా.. ఇతర జట్ల గెలుపోటములపై భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇంతదాకా తెచ్చుకోకూడదంటే నేటి మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలిస్తే సరిపోతుంది. ఈ లెక్కన ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్‌కు కేవలం అడుగుదూరంలో ఉంది.తెగే దాకా తెచ్చుకున్న పంజాబ్ఈ సీజన్లో పంజాబ్ పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. తొలి 7 మ్యాచ్‌ల్లో 6 గెలిచి జైత్రయాత్ర చేసిన ఈ జట్టు, అనూహ్యంగా పరాజయాల బాట పట్టింది. ఏమైందో ఏమో తెలీదు కానీ, చివరి 5 మ్యాచ్‌ల్లో వరుసగా ఓడి ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతం ఈ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్నా, చివరికొచ్చే సరికి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుందన్న గ్యారెంటీ లేదు. నేటి మ్యాచ్‌లో ఆర్సీబీపై, 23వ తేదీ జరిగే మ్యాచ్‌లో లక్నోపై గెలిస్తే ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండవచ్చు. ఇప్పటికే తెగే దాకా తెచ్చుకున్న పంజాబ్, ఇకపై జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టుకు ఎదురుకాని అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్సీబీ, లక్నో మ్యాచ్‌లు ఈ జట్టుకు సెమీస్, ఫైనల్స్ లాంటివి.నేటి మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ ధర్మశాల వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలవుతుంది. ఇరు జట్లు ఈ సీజన్లో తలపడటం ఇదే మొదటిసారి. ఆర్సీబీ రెండు వరుస విజయాలతో దూకుడుమీదుంటే.. పంజాబ్ ఐదు వరుస పరాజయాలతో ఢీలా పడిపోయి ఉంది. -
కోల్‌కతాపై బెంగళూరు విజయం
ఐపీఎల్-2026 సీజన్లో కీలక పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 193 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో చేధించింది. రాయ్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసి విజయం అందుకుంది.విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీతో ఆర్సీబీని విజయ తీరాలకు చేర్చాడు. ఈ విజయంతో సీజన్లో 8వ విజయంతో ప్లేఆఫ్స్ రేసుకి మరింత చేరువైంది ఆర్సీబీ. -
‘నన్ను పావుగా వాడుకొని కోహ్లీపై కుట్ర పన్నాగం’
జర్మన్ మోడల్, ఇన్ఫ్లుయెన్సర్ లిజ్లాజ్ పెట్టిన పోస్టుకు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ లైక్ కొట్టడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ తర్వాత ఆ లైక్ కనిపించకపోవడం వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో లిజ్ లాజ్ మరోసారి బాంబు పేల్చింది. కోహ్లీపై తప్పుడు ఆరోపణలు చేయాలంటూ కొందరు జర్నలిస్టులు తనను సంప్రదించారని, అందుకు భారీగా డబ్బులు కూడా ఆఫర్ చేశారని లిజ్ లాజ్ వెల్లడించింది. తనను పావులా వాడుకొని కోహ్లీపై కుట్ర పన్నాలని భావించారని, కానీ డబ్బు కోసం లేదా పాపులర్ అవ్వడానికి కోహ్లీ పేరును వాడుకొని అతడి ప్రతిష్టను దెబ్బతీయాలన్న ఆసక్తి తనకు లేదని తెలిపింది. అందుకే వాళ్లు (జర్నలిస్టులు) ఇచ్చిన ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు పేర్కొంది. ఇంటర్వ్యూలో లిజ్ లాజ్ మాట్లాడుతూ.. ‘మొదట విరాట్ కోహ్లీ నా ఫొటో లైక్ చేసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ప్రపంచస్థాయి క్రికెటర్ నా పోస్టును గమనించడం గర్వంగా అనిపించింది. కానీ తర్వాత ఆ విషయాన్ని సోషల్ మీడియాలో అతిగా చూపించడం బాధ కలిగించింది. ఒక సాధారణ సోషల్ మీడియా యాక్టివిటీని పెద్ద వివాదంగా మార్చడం సరికాదు. కోహ్లీపై వచ్చిన ట్రోలింగ్ చూసి ఆశ్చర్యపోయాను. అతను ఎప్పుడూ అనుచితంగా ప్రవర్తించలేదు. కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి మాట్లాడుతూ, అతడిని ఫుట్‌బాల్ దిగ్గజాలు మెస్సీ, రొనాల్డోలతో పోల్చింది. ‘కోహ్లీ ఆసియాలో అత్యంత ప్రభావవంతమైన క్రీడాకారుల్లో ఒకరు. ఆయనపై అనవసర ఆరోపణలు చేయడం సరైంది కాదు. ఒక చిన్న విషయాన్ని పెద్ద వివాదంగా మార్చి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూడటం బాధాకరం’ అని ఆమె పేర్కొంది. ఈ వివాదం తర్వాత భారత్‌లో లిజ్ లాజ్‌కు విపరీతమైన గుర్తింపు వచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్లు భారీగా పెరిగారు. పలు బ్రాండ్ ప్రమోషన్లు, రియాలిటీ షో అవకాశాలు కూడా వచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ, తాను సంచలన ప్రచారం కోసం ఎవరి ప్రతిష్ఠతో ఆడుకోనని ఆమె స్పష్టం చేసింది. అంతేకాదు తాను ఐపీఎల్‌కు పెద్ద అభిమానినని, ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును క్రమం తప్పకుండా ఫాలో అవుతానని స్పష్టం చేసింది.ఎవరీ లిజ్లాజ్?లిజ్ లాజ్ దక్షిణాఫ్రికాలో జన్మించింది. ఆమె తండ్రిది సౌతాఫ్రికా కాగా.. తల్లిది జర్మనీ. దీంతో లిజ్ లాజ్ జర్మన్, ఆఫ్రికా, డచ్, ఫ్రెంచ్, రష్యన్ వంటి భాషలను అనర్గళంగా మాట్లాడగలదు. సైకాలజీ విభాగంలో ఎంఎస్సీ పట్టా పొందింది. లైఫ్‌సేవింగ్ స్విమ్మర్ కూడా లిజ్ లాజ్ గుర్తింపు పొందింది. ఫుడ్ వ్లాగింగ్, ట్రావెలింగ్, పాటల రచన లిజ్ లాజ్ హాబీలు.చదవండి: చీర్‌గర్ల్స్ చిందులు.. కళ్లప్పగించిన పోలీసులు! -
చీర్‌గర్ల్స్ చిందులు.. కళ్లప్పగించిన పోలీసులు!
ఐపీఎల్ 2026 సీజన్ దగ్గరపడుతున్న కొద్దీ రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికీ ప్లేఆఫ్స్‌కు చేరే జట్లపై ఇంకా స్పష్టత రాలేదు. ముంబై, లక్నో ఎలిమినేట్ కాగా ప్లేఆఫ్స్ స్థానం కోసం ఎనిమిది జట్లు పోటీ పడుతున్నాయి. అయితే అందులో ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, పంజాబ్, గుజరాత్‌కు ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ టీ20 మ్యాచ్‌లు కావడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందనేది ఊహించడం కష్టం. అందుకే సీజన్లో అన్ని లీగ్ మ్యాచ్‌లు పూర్త య్యాకే ప్లేఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ రానుంది. ఈ విషయం పక్కనబెడితే ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించడానికి వచ్చే అభిమానులకు, ఆటగాళ్లకు చీర్‌గర్ల్స్ తమ నృత్యాలతో అలరించడం చూస్తూనే ఉంటాం. అయితే ఆదివారం రాయ్‌పూర్ వేదికగా ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య మ్యాచ్ సమయంలో జరిగిన ఆసక్తికర ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయంలోకి వెళితే ఆర్సీబీ బ్యాటింగ్ సమయంలో స్ట్రాటజిక్ టైమ్ అవుట్ ఇచ్చారు. ఈ సమయంలో ముంబై ఇండియన్స్‌కు చెందిన చీర్ గర్ల్స్ ఫోడియంపై చిందులు వేస్తున్నారు. అందులో ఒక చీర్‌గర్ల్ అక్కడే ఉన్న పోలీసులను చూస్తూ నృత్యం చేసింది. దీంతో అక్కడే డ్యూటీ చేస్తున్న పోలీసులు చీర్ గర్ల్స్ నృత్యాలను కళ్లప్పగించి అలా చూస్తూ ఉండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరలవుతోంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ నష్టానికి 166 పరుగులు చేసింది. అనంతరం ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓటమితో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 19వ సీజన్ నుంచి ఎలిమినేట్ కాగా.. ఆర్సీబీ 14 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఆర్సీబీ తన తర్వాతి మ్యాచ్‌లో కేకేఆర్‌ను ఎదుర్కోనుండగా, ముంబై ఇండియన్స్ పంజాబ్‌తో తలపడనుంది.Raipur police enjoying watching the Mumbai Indians cheerleaders during the MI vs RCB match.😅 pic.twitter.com/xichgo4HEw— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) May 11, 2026చదవండి: అక్షర్ పటేల్‌కు భారీ జరిమానా! -
ఆర్సీబీ, ముంబై మ్యాచ్ ఫిక్స్.. ఇదిగో సాక్ష్యం!
ఐపీఎల్ 2026 సీజన్ చప్పగా సాగుతున్న వేళ ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు ఫుల్కిక్ ఇచ్చింది. ఆఖరి బంతి వరకు నువ్వానేనా అన్నట్లుగా సాగిన పోరు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఛేదించాల్సిన లక్ష్యం తక్కువే అయినప్పటికీ ఆద్యంతం ఆర్సీబీ, ముంబై మధ్య విజయం చేతులు మారుతూ వచ్చింది. చివరకు ముంబై తప్పిదాలు, పేలవ ఫీల్డింగ్‌తో ఓటమిని కొనితెచ్చుకుంది. అయితే తాజాగా సోషల్ మీడియా ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య మ్యాచ్ ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే.. ఆర్సీబీ విజయానికి ఆఖరి ఓవర్లో 15 పరుగుల కావాలి. ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసేందుకు రాజ్ బవా వచ్చాడు. ఓవర్లో మూడు వైడ్లు, ఒక నోబ్ వేశాడు. ఇది చాలదన్నట్లు భువనేశ్వర్ చేత సిక్సర్ కొట్టించాడు. ఇక ఆఖరి బంతికి రెండు పరుగుల అవసరమైన దశలో ఆర్సీబీ బ్యాటర్ రసిక్ సలామ్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. అయితే రాజ్ బవా తన వైపు వచ్చిన బంతిని కనీసం ఆపే ప్రయత్నం చేయకుండా అలాగే నిలబడి చూస్తూ ఉండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ఒక అభిమాని ఎక్స్‌లో పంచుకోవడంతో వైరల్‌గా మారింది. బంతి అతని కాలు తాకి మరో దిశలో వెళ్లింది. ఈ గ్యాప్‌లో ఆర్సీబీ రెండు పరుగులు తీసి విజయం సాధించింది. అయితే రాజ్ బవా బంతిని ఆపే ప్రయత్నం చేసి ఉంటే ముంబై గెలవడం లేదా సూపర్ ఓవర్‌కు దారి తీసి ఉండేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ‘రాజ్ బవా బంతిని కావాలనే ఆపలేదని, కచ్చితంగా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ’ కొంతమంది ఫ్యాన్స్ తెలిపారు. ‘అప్పటికే ఆ ఓవర్లో తొమ్మిది బంతులు వేసి రాజ్ బవా అలసిపోయాడని, అందుకే బంతిని ఆపే ప్రయత్నం చేయలేకపోయి ఉండొచ్చని, మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి వాటికి ఆస్కారం ఉండదని’ కొంతమంది కామెంట్లు చేశారు. ఇంకొందరు మాత్రం.. ‘ముంబై ఐదుసార్లు టైటిల్ గెలవడంతోనే ఆ జట్టు పూర్తిగా నీరుగారిపోయిందని.. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని, ఆర్సీబీతో ముంబై జట్టును కూడా ఐపీఎల్ నుంచి బ్యాన్ చేయాలని’ కొందరు ఆగ్రహంతో రెచ్చిపోయారు. ఏది ఏమైనా మ్యాచ్ ఫిక్సింగ్ సంగతి అటుంచితే చాన్నాళ్లుకు ఐపీఎల్లో ఒక థ్రిల్లర్ మ్యాచ్ మంచి అనుభూతి కలిగించిందని చెప్పొచ్చు. ఈ విజయంతో ఆర్సీబీ పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లగా.. ఓటమితో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2026 సీజన్ నుంచి ఎలిమినేట్ అయింది.RCB vs MI match is completely fixed. This mdc franchise needs to be banned from IPL forever pic.twitter.com/xCrf6JcHOc— Vishnu (@WorshipRohit) May 11, 2026🎥 𝙍𝙖𝙬 𝙍𝙚𝙖𝙘𝙩𝙞𝙤𝙣𝙨 from a thrilling night 🥳Down to the absolute wire in a contest of incredibly fine margins ⏳Watch the pure passion pour out from #RCB's unforgettable last-ball win ❤️ #TATAIPL | #KhelBindaas | #RCBvMI | @RCBTweets pic.twitter.com/H0PNbJSVY6— IndianPremierLeague (@IPL) May 11, 2026చదవండి: టిమ్ డేవిడ్ అనైతిక చర్య.. తగిన శాస్తి జరిగింది! -
టిమ్ డేవిడ్ అనైతిక చర్య.. తగిన శాస్తి జరిగింది!
ఐపీఎల్ 2026 సీజన్ వన్‌సైడ్ మ్యాచ్‌లో చప్పగా సాగుతున్న వేళ ఆదివారం ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ థ్రిల్లర్‌ను తలపించింది. అసలు సిసలు టీ20 మజాను చాలా రోజుల తర్వాత రుచి చూపించింది. ఆఖరివరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఆటగాళ్లు డగౌట్లో సంబరాల్లో మునిగితేలారు. కానీ ఆర్సీబీ స్టార్ టిమ్ డేవిడ్ మాత్రం అనైతిక చర్యకు పాల్పడ్డాడు. ముంబై ఇండియన్స్ ఓటమిని వెక్కిరిస్తూ టిమ్ డేవిడ్ ఆ జట్టుకు మిడిల్ ఫింగర్ చూపించడం కెమెరాలకు చిక్కింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా టిమ్ డేవిడ్ చర్యను తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించడంతో పాటు రెండు డీమెరిట్ పాయింట్లు కేటాయించింది. ‘ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.6 ప్రకారం అనుమతి లేకుండా ఒక జట్టు లేదా వ్యక్తిని ఉద్దేశించి అసభ్యకరమైన సంజ్ఞ చేయడం నిబంధనలకు విరుద్ధం. ఉల్లంఘన చర్య కింద అతడిపై చర్యలు తీసుకుంటున్నాం. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనల కింద ఆ సంజ్ఞ అసభ్యకరంగా ఉండడంతో పాటు వ్యక్తి లేదా జట్టును ఉద్దేశపూర్వకంగా అవమా నించడం కిందకు వస్తుంది. అందుకే అతడి మ్యాచ్ ఫీజులో జరిమానా విధించడంతో పాటు డీమెరిట్ పాయింట్లు కేటాయించాం’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.ఇక టిమ్ డేవిడ్ ఆర్సీబీలోకి రాకముందు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2022 నుంచి 2024 వరకు ముంబై తరఫున ఆడాడు. లోయర్ ఆర్డర్లో ధాటిగా బ్యాటింగ్ చేయగల సత్తా టిమ్ డేవిడ్ సొంతం. ముంబై ఇండియన్స్ తరఫున 37 మ్యాచ్‌లాడిన టిమ్ డేవిడ్ 171 స్ట్రైక్‌రేట్ 658 పరుగులు సాధించాడు. 2025 సీజన్‌కు ముందు ఆర్సీబీలోకి వచ్చిన టిమ్ డేవిడ్ ఆ సీజన్లో లోయర్ ఆర్డర్లో ఎక్కువగా బ్యాటింగ్‌కు వచ్చి 187 పరుగులు చేశాడు. తద్వారా ఆర్సీబీ తొలి ఐపీఎల్ టైటిల్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ విషయానికొస్తే ఆఖరి ఓవర్లో 15 పరుగులు అవసరమైన దశలో రొమారియో షెపర్డ్ ఔట్ అయ్యాడు. దీంతో సమీకరణం మూడు బంతుల్లో 10 పరుగులకు మారింది. ఈ దశలో భువనేశ్వర్ సిక్సర్ కొట్టడంతో ఒక్క బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. ఈ నేపథ్యంలో రసిక్ సలామ్ ఆఖరి బంతికి రెండు పరుగులు సాధించి ఆర్సీబీకి థ్రిల్లింగ్ విజయాన్ని సాధించి పెట్టాడు. ఈ విజయంతో ఆర్సీబీ 14 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది.🚨👀🔥Former Mumbai Indians player Tim David was caught showing a middle finger during the match while playing for Royal Challengers Bengaluru 😳The clip instantly went viral, with fans debating💥#TimDavid #RCBvsMI #MumbaiIndians #RCB #IPL2026 #12BETIndia #KnowTheGame 🔥 pic.twitter.com/i7MNqTt3CT— 12BET India (@12B_India) May 11, 2026#breaking RCB's batter Tim David has been booked under Article 2.6 (showing an offensive gesture) during @RCBTweets match vs @mipaltan yesterday at Raipur. He will be penalized 30% of his match fees and given 2 demerit points..@IPL official media release will be out soon!— Gaurav Gupta (@toi_gauravG) May 11, 2026 -
ఒక్క నిర్ణయంతో ముంబైని ప్లేఆఫ్స్ నుండి దూరం చేసాడు
-
పోటీ రసవత్తరం.. ప్లేఆఫ్స్ రేసులో 8 జట్లు!
ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి ప్లేఆఫ్స్ రేసు రసతవత్తరంగా మారింది. ఆదివారం ముంబై ఇండియన్స్‌పై ఉత్కంఠ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై చేజేతులా ఓటమి కొనితెచ్చుకుంది. ముంబై బౌలర్ రాజ్‌బవా ఒత్తిడికి తోడు వైడ్లు, నోబ్ వేయడంతో చివరి ఓవర్లో 15 పరుగులు చేసి ఆర్సీబీ హ్యాట్రిక్ ఓటమిని తప్పించుకోవడంతో పాటు టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఇప్పటికే వరుస ఓటములతో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నాయి. అయితే టాప్-4లో నిలిచేందుకు 8 జట్లు పోటీలో ఉండడం గమనార్హం.అగ్రస్థానంలో ఆర్సీబీ:ప్రస్తుతం టేబుల్ టాపర్‌గా ఉన్న ఆర్సీబీ 11 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో 14 పాయింట్లు సాధించింది. (+1.103) నెట్ రన్‌రేట్‌తో ఇతర జట్ల కంటే మెరుగైన స్థితిలో నిలిచింది. అయితే అధికారికంగా ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు కావాలంటే ఇంకా రెండు విజయాలు అవసరం. సాధారణంగా 16 పాయింట్లు ప్లేఆఫ్స్‌కు సరిపోతాయి. కాబట్టి ఆర్సీబీ ఒక్క విజయం సాధించినా సరిపోతుంది. కానీ ఎస్ఆర్హెచ్, పంజాబ్‌ల నుంచి పోటీ వద్దనుకుంటే మిగిలిన అన్ని మ్యాచ్‌లు గెలిచి నేరుగా క్వాలిఫయర్-1కు అర్హత సాధించే అవకాశం ఉంది.హైదరాబాద్ రెండు గెలిస్తే:సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా 14 పాయింట్లతోనే ఉన్నప్పటికీ నెట్ రన్‌రేట్ (+0.737) విషయంలో ఆర్సీబీ కంటే వెనుకబడి ఉంది. చివరి మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిస్తే.. ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయమవుతుంది. మే 22న ఆర్సీబీతో జరిగే మ్యాచ్ టాప్-2 స్థానాలపై కీలక ప్రభావం చూపే అవకాశముంది. గుజరాత్ టైటాన్స్ కూడా 14 పాయింట్లతో పోటీలో ఉంది. అయితే వారి నెట్ రన్ రేట్ (+0.228) తక్కువగా ఉండటంతో మరో రెండు విజయాలు అవసరం. మే 12న ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ గుజరాత్‌కు కీలకంగా మారనుంది.అనుకూల స్థితిలో పంజాబ్:పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం అత్యంత అనుకూల స్థితిలో ఉన్న జట్టుగా కనిపిస్తోంది. 10 మ్యాచ్‌ల్లోనే 13 పాయింట్లు సాధించిన పంజాబ్‌కు మరో నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. నాలుగులో కనీసం రెండు గెలిస్తే చాలు 17 పాయింట్లతో ప్లేఆఫ్స్ బెర్తును పంజాబ్ దాదాపు ఖాయం చేసుకుంటుంది.చెన్నైకి కనీసం రెండు విజయాలు:ఐదుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం కఠిన పరిస్థితుల్లో ఉంది. సీఎస్కే ప్రస్తుతం 12 పాయింట్లతో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌లో కనీసం రెండు గెలవాల్సిన అవసరముంది. అయితే వారి నెట్ రన్‌రేట్ (+0.185) పెద్దగా మెరుగ్గా లేకపోవడంతో అన్ని మ్యాచ్‌లు గెలిస్తేనే అవకాశం ఉంది.ఒత్తిడిలో రాజస్థాన్:రాజస్థాన్ రాయల్స్ కూడా 12 పాయింట్లతో సీఎస్కేతో సమానంగా ఉన్నప్పటికీ.. నెట్ రన్దేట్ (+0.082) తక్కువగా ఉంది. గత నాలుగు మ్యాచ్ ల్లో మూడు ఓటములు చవిచూడడంతో ఆ జట్టుపై ఒత్తిడి పెరిగింది. సీఎస్కేతో కలిసి నాలుగో ప్లేఆఫ్స్ స్థానం కోసం రాజస్థాన్ పోరాడే అవకాశం ఉంది. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. మిగిలిన నాలుగు మ్యాచ్‌లు కేకేఆర్ కచ్చితంగా గెలవాల్సిన అవసరముంది. అప్పుడు కేకేఆర్ 17 పాయింట్లతో ప్లేఆఫ్స్ చేరే అవకాశముంటుంది. అయితే మ్యాచ్‌లో ఒక్క ఓటమి ఎదురైనా కేకేఆర్ ఇంటిబాట పట్టాల్సిందే.ఢిల్లీ క్యాపిటల్స్‌కు కష్టమే..ఢిల్లీ క్యాపిటల్స్‌కు అవకాశాలు అంతంతమాత్రమే. ప్రస్తుతం వారి నెట్ రన్ రేట్ (-1.154) దారుణంగా ఉంది. మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలు కూడా తమకు అనుకూలంగా రావాల్సిన అవసరముంటుంది.ముంబై, లక్నో అవుట్:ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. దీంతో ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ పోరు ఇప్పుడు మరింత రసవత్తరంగా మారింది.చదవండి: ఆర్సీబీ థ్రిల్లింగ్ విక్టరీ.. ముంబై ఇండియన్స్ ఖేల్ ఖతం! -
ఆర్సీబీ కింగ్ మేకర్‌పై చర్యలు
ఆర్సీబీ కింగ్ మేకర్, ఆ జట్టు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్‌పై బీసీసీఐ చర్యలు తీసుకుంది. ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (మే 11) రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు ఫోర్త్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ చర్య ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో లెవెల్-1 ఉల్లంఘన కిందికి వస్తుంది. దీనికి శిక్షగా ఫ్లవర్‌కు మ్యాచ్ ఫీజ్‌లో 15 శాతం జరిమానా విధించారు. లెవెల్ 1 ఉల్లంఘనల కింద కోచ్‌లపై కూడా చర్యలు తీసుకునే అధికారం మ్యాచ్ రిఫరీకి ఉంటుంది.ఐపీఎల్లో ఇలాంటి ఉదంతాలు చాలా అరుదుగా జరిగాయి. గత సీజన్లో గుజరాత్ కోచ్ ఆశిష్ నెహ్రా కూడా ఇలాగే ప్రవర్తించి శిక్షించబడ్డాడు. అప్పట్లో అతని మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం కోత విధించారు. అదే సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ కూడా లెవెల్-1 ఉల్లంఘనకు పాల్పడి బీసీసీఐ ఆగ్రహానికి (25 శాతం జరిమానా) గురయ్యాడు.దీనికి ముందు 2024 ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ కీరన్ పోలార్డ్.. 2022 ఎడిషన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రే కూడా అంపైర్లతో వాదించి శిక్షించబడ్డారు. వీరిలో ఆమ్రే ఏకంగా ఓ మ్యాచ్ నిషేధానికి కూడా గురయ్యాడు.మ్యాచ్ విషయానికొస్తే.. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇన్నింగ్స్ చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన తరుణంలో రసిక్ సలామ్ ఆర్సీబీని గెలిపించాడు. అంతకుముందు నాలుగో బంతికి భువనేశ్వర్ కుమార్ సిక్సర్ బాది గెలుపు ఖరారు చేశాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేయగా.. ఆర్సీబీ చివరి బంతికి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఓటమితో ప్రస్తుత సీజన్లో ముంబై ఇండియన్స్ పోరాటం ముగిసింది. మరో 3 మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా, ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఎంఐతో పాటు లక్నో సూపర్ జెయింట్స్ కూడా ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఎలిమినేట్ అయ్యింది. -
ఐపీఎల్ లో ముంబైపై బెంగళూరు విజయం
-
ఒకే దెబ్బకు రెండు పిట్టలు
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (మే 10) రాత్రి జరిగిన రసవత్తర మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలను సుగమనం చేసుకోగా.. ముంబై ఇండియన్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. అలాగే మరో జట్టు కూడా పోటీ నుంచి వైదొలిగింది. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే చేతిలో చిత్తైన లక్నో సూపర్ జెయింట్స్ ముంబై ఇండియన్స్‌తో పాటు ఇంటికెళ్లింది. ఈ లెక్కన ఆర్సీబీ ఒకే దెబ్బతో రెండు జట్లను ఔట్ చేసింది.ఎంఐ, లక్నో నిష్క్రమణతో ఇక ప్లే ఆఫ్స్ రేసులో 8 జట్లు మిగిలి ఉన్నాయి. వీటిలో నాలుగు మాత్రమే ప్లే ఆఫ్స్‌కు చేరతాయి. ప్రస్తుతం టాప్-3లో ఉన్న ఆర్సీబీ (14 పాయింట్లు), ఎస్ఆర్హెచ్ (14), గుజరాత్ (14) ఆడాల్సిన 3 మ్యాచ్‌ల్లో తలో మ్యాచ్ గెలిచినా నాకౌట్ బెర్త్‌లు ఖరారయ్యే అవకాశం ఉంది.నాలుగో స్థానంలో ఉన్న పంజాబ్ ఇంకా 4 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. టాప్-3 జట్లతో పాటు ఈ జట్టుకు కూడా ప్లే ఆఫ్స్ అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. ఐదు, ఆరు స్థానాల్లో ఉన్న సీఎస్కే (12), రాజస్థాన్ (12) తలో 3 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ జట్లు నాకౌట్ బెర్త్‌లు దక్కించుకోవాలంటే కనీసం రెండు మ్యాచ్‌లైనా గెలవాలి. అప్పుడు కూడా ప్రస్తుతం టాప్-4లో ఉన్న జట్ల జయాపజయాలపై వీటి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ప్లే ఆఫ్స్ రేసులో మినుకుమినుమనే అవకాశాలు కలిగిన చివరి రెండు జట్లు కేకేఆర్ (9), ఢిల్లీ (8).ఈ రెండు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరడం దాదాపుగా అసాధ్యం. అయితే టెక్నికల్‌గా అవకాశాలు లేకపోలేదు. కేకేఆర్ తమ చివరి 4 మ్యాచ్‌ల్లో అన్నీ గెలిస్తే ప్లే ఆఫ్స్ అవకాశం ఉంటుంది. అలాగే డీసీ కూడా వారి చివరి 3 మ్యాచ్‌ల్లో తప్పక గెలవాలి. ఇలా జరిగితే ఈ రెండు జట్లకు కూడా ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి.ఓవరాల్‌గా చూస్తే.. పోటీ ప్రధానంగా ప్రస్తుతం టాప్-4లో ఉన్న నాలుగు జట్ల మధ్యే ఉంది. ఏదైనా అనూహ్యం జరిగితే సీఎస్కే, రాజస్థాన్ కూడా లైన్లోకి వస్తాయి. అద్భుతం జరిగితే కేకేఆర్, డీసీ కూడా రేసులో ఉంటాయి. ఇవాళ మరో జట్టు భవిష్యత్తు కూడా తేలిపోతుంది. పంజాబ్ చేతిలో ఓడితే డీసీ కూడా ఇంటిముఖం పడుతుంది. అప్పుడు రేసులో ఏడు జట్లు మాత్రమే మిగిలి ఉంటాయి. ఏది జరిగినా ఆశ్చర్యపోవాల్సి అవసరం లేదు. ఎందుకంటే పోటీ చాలా రసవత్తరంగా ఉంది.ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న జట్లు ఆడాల్సిన మిగిలిన మ్యాచ్‌లు..ఆర్సీబీ- కేకేఆర్ (మే 13), పంజాబ్ (17), ఎస్ఆర్హెచ్ (22)ఎస్ఆర్హెచ్- గుజరాత్ (12), సీఎస్కే (18), ఆర్సీబీ (22)గుజరాత్- ఎస్ఆర్హెచ్ (12), కేకేఆర్ (16), సీఎస్కే (21)పంజాబ్- డీసీ (11), ముంబై (14), ఆర్సీబీ (17), లక్నో (23)సీఎస్కే- లక్నో (15), ఎస్ఆర్హెచ్ (18), గుజరాత్ (21)రాజస్థాన్- డీసీ (17), లక్నో (19), ముంబై (24)కేకేఆర్- ఆర్సీబీ (13), గుజరాత్ (16), ముంబై (20), డీసీ (24)డీసీ- పంజాబ్ (11), రాజస్థాన్ (17), కేకేఆర్ (24) -
ఆర్సీబీ థ్రిల్లింగ్ విక్టరీ.. ముంబై ఇండియన్స్ ఖేల్ ఖతం!
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ఆట ముగిసింది. ఆర్సీబీ చేతిలో ఓటమితో ఈ సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ నిష్క్రమించింది. ఆదివారం రాయ్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైన చోట కృనాల్ పాండ్యా వీరోచిత పోరాటం ఆర్సీబీని విజయం వైపు తీసుకెళ్లింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. కృనాల్ పాండ్యా (46 బంతుల్లో 73) తన కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడి విజయంలో కీలకపాత్ర పోషించగా.. చివర్లో భువనేశ్వర్ సిక్సర్ కొట్టి ఆర్సీబీకి థ్రిల్లింగ్ విజయాన్ని అందించాడు. జాకబ్ బెతెల్ (27) పర్వాలేదనిపించాడు. ముంబై బౌలర్లలో కార్బిన్ బోస్క్ 4 వికెట్లు తీయగా, దీపక్ చాహర్ 2, గజన్ఫర్, రాజ్ బవాలు తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. తిలక్ వర్మ (57) హాఫ్ సెంచరీతో రాణించగా.. నమన్ ధిర్ (47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు మినహా మిగతా ముంబై బ్యాటర్లు విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లతో అదరగొట్టగా, హాజిల్‌వుడ్, రసిక్ సలామ్, షెపర్డ్ తలా ఒక వికెట్ తీశారు. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను ముంబై చేజేతులా ఓటమిని కొనితెచ్చుకుంది. ఫీల్డింగ్‌లో తప్పిదాలు, ఆఖరి ఓవర్లో రాజ్ బవా ఒత్తిడి లోనయ్యి వరుస వైడ్లు, నోబాల్ వేయడం కూడా ముంబై కొంపముంచింది. ఈ ఓటమితో ముంబై ప్లేఆఫ్స్ చేరకుండానే ఐపీఎల్ 19వ సీజన్ నుంచి ఎలిమినేట్ అయింది. మరోవైపు ఆర్సీబీ మాత్రం 11 మ్యాచ్‌ల్లో ఏడో విజయంతో 14 పాయింట్లు సాధించి మెరుగైన రన్‌రేట్‌తో టేబుల్ టాపర్‌గా నిలిచింది.WHAT ON EARTH HAVE WE JUST WITNESSED! 🤯Bhuvneshwar Kumar & Rasikh Dar, take a bow ❤️Updates ▶️ https://t.co/wYlCB10dhm#TATAIPL | #KhelBindaas | #RCBvMI | @RCBTweets pic.twitter.com/tqkuPMEsHR— IndianPremierLeague (@IPL) May 10, 2026 -
కాలర్ పట్టుకున్న పూరన్.. కృనాల్ వివరణ!
ఐపీఎల్ 2026 సీజన్లో గురువారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ 9 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో లక్నో జట్టు డబుల్ హ్యాట్రిక్ ఓటములకు చెక్ పెట్టినట్లయింది. అయితే లక్నో ఇన్నింగ్స్ సమయంలో బ్యాటర్ నికోలస్ పూరన్, ఆర్సీబీ బౌలర్ కృనాల్ పాండ్యా మధ్య చిన్న వాగ్వాదం చోటుచేసుకుంది. కృనాల్ విసిరిన బౌన్సర్‌ను లాంగ్ ఆన్ దిశగా ఆడి సింగిల్ తీశాడు. నాన్‌స్ట్రైక్ ఎండ్‌కు చేరుకున్న పూరన్‌తో కృనాల్ మాటల యుద్ధానికి దిగాడు. ఇద్దరూ సీరియస్‌గా ఒకరినొకరు చూసుకోవడం కనిపించింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ఇద్దరూ సరదాగా మాట్లాడుకోవడం కనిపించింది. ఈ నేపథ్యంలో పూరన్ కృనాల్ కాలర్‌ను పట్టుకొని నెట్టివేయడం కనిపించింది. కానీ ఆ తర్వాత ఈ ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకోవడంతో వివాదం సమసిపోయింది. దీనికి సంబంధించిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా పూరన్ తన కాలర్ ఎందుకు పట్టుకోవాల్సి వచ్చిందో, అసలు పూరన్‌తో గొడవేంటనే విషయాన్ని కృనాల్ పాండ్యా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా వివరణ ఇచ్చుకున్నాడు. ‘ఇద్దరి మధ్య గొడవేం లేదు. కేవలం మా మాధ్య ఉన్నది ప్రేమ మాత్రమే. 100 ఐపీఎల్ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న నా సోదరుడు నికోలస్ పూరన్‌కు అభినందనలు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. లక్నో ఇన్నింగ్స్ సమయంలో నేను పూరన్ అడిగింది ఏంటో తెలుసా?.. ‘ నా బౌన్సర్ ఎలా ఉంది’ అని అడిగాను. అంతకుమించి మా మధ్య ఏం జరగలేదు’ అని చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే వర్షం అంతరాయంతో 19 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్‌జెయింట్స్ 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ సెంచరీతో చెలరేగగా, పూరన్ (38), పంత్ (32 నాటౌట్) రాణించారు. అనంతరం 213 పరుగుల రివైజ్డ్టార్గెట్తో బరిలోకి దిగిన ఆర్సీబీ 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులకు పరిమితమైంది. పటీదార్ (61), పడిక్కల్ (34) రాణించగా, ఆఖర్లో టిమ్ డేవిడ్ (40), కృనాల్ (28 నాటౌట్), షెపర్డ్ (23 నాటౌట్) ధాటిగా ఆడినా ఆర్సీబీని గెలిపించలేకపోయారు. ప్రిన్స్ యాదవ్ 3 వికెట్లతో ఆర్సీబీ పతనాన్ని శాసించాడు.Things are heating up in this Revenge Week clash! 🔥A contest within the contest is brewing between #NicholasPooran and #KrunalPandya! 👀#TATAIPL Revenge Week 2026 ➡️ #LSGvRCB | LIVE NOW 👉 https://t.co/gEprGnf2A7 pic.twitter.com/C2oqmrYF0X— Star Sports (@StarSportsIndia) May 7, 2026 Nicholas Pooran and Krunal Pandya having a friendly banter? 😳 pic.twitter.com/hyYoj2J0d7— Deepu (@deepu_drops) May 8, 2026చదవండి: శ్రేయస్ కెప్టెన్ అయితే వీళ్ల కెరీర్ ఖతం! -
తొలి క్రికెటర్‌గా మిచెల్ మార్ష్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీతో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ ఓపెనర్ మిచెల్ మార్ష్ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. తద్వారా లక్నో తరఫున ఐపీఎల్లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన తొలి క్రికెటర్‌గా మిచెల్ మార్ష్ అరుదైన ఘనత సాధించాడు. రొమారియో షెపర్డ్ వేసిన యార్కర్ బంతిని బౌండరీ తరలించడం ద్వారా ఐపీఎల్లో రెండో సెంచరీ సాధించాడు. 49 బంతుల్లోనే సెంచరీ సాధించిన మిచెల్ మార్ష్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. అయితే గతంలో లక్నో తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ రిషబ్ పంత్ పేరిట ఉంది. గతేడాది ఇదే స్టేడియంలో ఆర్సీబీపైనే పంత్ 54 బంతుల్లో శతకం సాధించాడు. తాజాగా పంత్ రికార్డును బద్దలు కొట్టిన మార్ష్ ఫాస్టెస్ట్ సెంచరీతో ఆ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఓవరాల్‌గా మార్ష్‌కు ఐపీఎల్లో ఇది రెండో సెంచరీ. తొలి సెంచరీ కూడా లక్నో తరఫునే సాధించాడు. గతేడాది సీజన్లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సెంచరీ సాధించిన మార్ష్ 64 బంతుల్లో 117 పరుగులు సాధించాడు. ఇక లక్నో తరఫున రెండు సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా మార్ష్ నిలిచాడు. గతంలో కేఎల్ రాహుల్ ఈ ఫీట్ సాధించాడు. డికాక్, స్టోయినిస్, పంత్‌లు తలా ఒక సెంచరీ బాదారు.Crunched, clobbered, Celebrations 💯🎥 Mitchell Marsh brings up a 𝘀𝗶𝘇𝘇𝗹𝗶𝗻𝗴 𝗰𝗲𝗻𝘁𝘂𝗿𝘆 in some style 🔥🫡Updates ▶️ https://t.co/W0eDq9aWb7#TATAIPL | #KhelBindaas | #LSGvRCB | @LucknowIPL pic.twitter.com/xQxi3buH6j— IndianPremierLeague (@IPL) May 7, 2026చదవండి: ‘రగులుతున్న అసంతృప్తి’.. గంభీర్‌పై సంచలన ఆరోపణలు! -
భువనేశ్వర్ అరుదైన రికార్డు.. తొలి పేసర్‌గా!
ఐపీఎల్ 2026 సీజన్లో సూపర్ ఫామ్ కనబరుస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ లక్నోతో మ్యాచ్‌లో అరుదైన రికార్డు సాధించాడు. లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్ భువనేశ్వర్‌కు 200వ మ్యాచ్ కావడం విశేషం. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన తొలి పేసర్‌గా భువనేశ్వర్ అరుదైన రికార్డు సాధించాడు. ఓవరాల్‌గా ఐపీఎల్లో 200 మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో భువనేశ్వర్ కుమార్ 12వ స్థానంలో ఉన్నాడు. అయితే ఈ 12 మంది భారత ఆటగాళ్లే కావడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఇక భువనేశ్వర్ కుమార్ ఇప్పటివరకు ఐపీఎల్లో 199 మ్యాచ్‌ల్లో 215 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ తరఫున 10 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో లీడింగ్‌లో ఉన్నాడు. 2011లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన భువనేశ్వర్ తొలుత పుణే వారియర్స్ (2011-2013 వరకు) 26 మ్యాచ్‌లు, ఎస్ఆర్హెచ్ (2014-2024 వరకు) 129 మ్యాచ్‌లు, ఆర్సీబీ (2025 నుంచి) 44 మ్యాచ్‌లు ఆడాడు.అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితా..మహేంద్ర సింగ్ ధోని: 278 మ్యాచ్‌లు (2008-2025)రోహిత్ శర్మ: 277 మ్యాచ్‌లు (2008-2026)విరాట్ కోహ్లీ: 276 మ్యాచ్‌లు (2008-2026)రవీంద్ర జడేజా: 264 మ్యాచ్‌లు (2008-2026)దినేష్ కార్తీక్: 257 మ్యాచ్‌లు (2008-2024)శిఖర్ ధావన్: 222 మ్యాచ్‌లు (2008-2024)రవిచంద్రన్ అశ్విన్: 221 మ్యాచ్‌లు (2009-2025)అజింక్య రహానే: 207 మ్యాచ్‌లు (2008-2026)సురేష్ రైనా: 205 మ్యాచ్‌లు (2008-2021)రాబిన్ ఊతప్ప: 205 మ్యాచ్‌లు (2008-2022)అంబటి రాయుడు: 204 మ్యాచ్‌లు (2010-2023)భువనేశ్వర్ కుమార్: 200 మ్యాచ్‌లు (2011-2026)చదవండి: దొరికిపోయిన చాహల్.. పంజాబ్ జట్టుకు శిక్ష తప్పదా? -
గుజరాత్ చేతిలో RCB ఘోర ఓటమి
-
ఆర్సీబీకి షాకిచ్చిన గుజరాత్
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 30) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆర్సీబీకి షాకిచ్చింది (4 వికెట్ల తేడాతో గెలుపు). అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన గుజరాత్ ఆర్సీబీని 19.2 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్లతో పాటు ఫీల్డర్లు కూడా చెలరేగిపోయారు.హోల్డర్ 3, సాయి సుదర్శన్, రషీద్ ఖాన్ తలో 2 క్యాచ్‌లతో ఆర్సీబీని దారుణంగా దెబ్బకొట్టారు. బౌలింగ్‌లో అర్షద్ ఖాన్ 3, హోల్డర్, రషీద్ ఖాన్ తలో 2, సిరాజ్, రబాడ చెరో వికెట్ పడగొట్టి ఆర్సీబీని కుప్పకూల్చారు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో పడిక్కల్ (40) టాప్ స్కోరర్ కాగా.. విరాట్ 28, బేతెల్ 5, పాటిదార్ 19, జితేశ్ శర్మ 1, టిమ్ డేవిడ్ 9, కృనాల్ 4, షెపర్డ్ 17, వెంకటేశ్ అయ్యర్ 12, భువనేశ్వర్ కుమార్ 15 (నాటౌట్), హాజిల్‌వుడ్ డకౌటయ్యారు.అనంతరం 156 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ తడబడుతూనే బ్యాటింగ్ చేసినప్పటికీ.. 15.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. భువనేశ్వర్ కుమార్ (4-0-28-3), రొమారియో షెపర్డ్ (4-0-30-2) ఇబ్బంది పెట్టినా.. శుభ్‌మన్ గిల్ (43), జోస్ బట్లర్ (39), రాహుల్ తెవాతియా (27 నాటౌట్) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడి గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చారు. మిగతా బ్యాటర్లలో సాయి సుదర్శన్ 6, వాషింగ్టన్ సుందర్ 12, షారుక్ ఖాన్ 8, జేసన్ హోల్డర్ 12, రషీద్ ఖాన్ 7 (నాటౌట్) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో భువీ, షెపర్డ్‌తో పాటు సుయాశ్ శర్మ (3.5-0-44-1) వికెట్ తీశాడు. గత మ్యాచ్‌లో చెలరేగి బౌలింగ్ చేసిన హాజిల్‌వుడ్ (4-0-56-0) ఈ మ్యాచ్‌లో వికెట్ తీయలేకపోగా.. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. -
ఆర్సీబీపై గుజరాత్ గెలుపు
ఆర్సీబీపై గుజరాత్ గెలుపు156 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ తడబడుతూనే బ్యాటింగ్ చేసినప్పటికీ.. 15.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. భువనేశ్వర్ కుమార్ (4-0-28-3), రొమారియో షెపర్డ్ (4-0-30-2) ఇబ్బంది పెట్టినా.. శుభ్‌మన్ గిల్ (43), జోస్ బట్లర్ (39), రాహుల్ తెవాతియా (27 నాటౌట్) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడి గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చారు. మిగతా బ్యాటర్లలో సాయి సుదర్శన్ 6, వాషింగ్టన్ సుందర్ 12, షారుక్ ఖాన్ 8, జేసన్ హోల్డర్ 12, రషీద్ ఖాన్ 7 (నాటౌట్) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో భువీ, షెపర్డ్‌తో పాటు సుయాశ్ శర్మ (3.5-0-44-1) వికెట్ తీశాడు. గత మ్యాచ్‌లో చెలరేగి బౌలింగ్ చేసిన హాజిల్‌వుడ్ (4-0-56-0) ఈ మ్యాచ్‌లో వికెట్ తీయలేకపోగా.. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. గెలుపు దిశగా గుజరాత్7 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 86-2గా ఉంది. బట్లర్ 33, సుందర్ 3 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 155 పరుగులకే ఆలౌటైన ఆర్సీబీఈ మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్లతో పాటు ఫీల్డర్లు కూడా చెలరేగిపోయారు. హోల్డర్ 3, సాయి సుదర్శన్, రషీద్ ఖాన్ తలో 2 క్యాచ్‌లతో ఆర్సీబీని దెబ్బకొట్టారు. బౌలింగ్‌లో అర్షద్ ఖాన్ 3, హోల్డర్, రషీద్ ఖాన్ తలో 2, సిరాజ్, రబాడ చెరో వికెట్ పడగొట్టారు. ఫలితంగా ఆర్సీబీ 155 పరుగులకే ఆలౌటైంది.ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో పడిక్కల్ (40) టాప్ స్కోరర్ కాగా.. విరాట్ 28, బేతెల్ 5, పాటిదార్ 19, జితేశ్ శర్మ 1, టిమ్ డేవిడ్ 9, కృనాల్ 4, షెపర్డ్ 17, వెంకటేశ్ అయ్యర్ 12, భువనేశ్వర్ కుమార్ 15 (నాటౌట్), హాజిల్‌వుడ్ డకౌటయ్యారు. ఏడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ13.6వ ఓవర్- 126 పరుగుల వద్ద ఆర్సీబీ ఏడో వికెట్ కోల్పోయింది.రషీద్ ఖాన్ బౌలింగ్‌లో పడిక్కల్ (40) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ8.1వ ఓవర్- 80 పరుగుల వద్ద ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. హోల్డర్ బౌలింగ్‌లో జితేశ్ శర్మ (1) అతనికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. హోల్డర్ సూపర్ క్యాచ్7.4వ ఓవర్- 79 పరుగుల వద్ద ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో జేసన్ హోల్డర్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో రజత్ పాటిదార్ (19) ఔటయ్యాడు. కోహ్లి ఔట్3.2వ ఓవర్- 35 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి విరాట్ కోహ్లి (28) ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ2.4వ ఓవర్- 34 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి జేకబ్ బేతెల్ (5) ఔటయ్యాడు.టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్‌ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 30) జరుగనున్న 42 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ తలపడుతున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా, పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆర్సీబీ రెండో స్థానంలో ఉండగా.. గుజరాత్ ఐదో స్థానంలో ఉంది. ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించగా.. గుజరాత్ 8లో నాలుగు విజయాలు నమోదు చేసింది. తుది జట్లు..గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్(సి), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(w), జాసన్ హోల్డర్, షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, మానవ్ సుతార్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, జాకబ్ బెథెల్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(సి), జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్ -
చరిత్ర సృష్టించిన సుయాశ్ శర్మ
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 27) జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ చేసిన ఆర్సీబీ ప్రత్యర్దిని 16.3 ఓవర్లలో 75 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని వికెట్ మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ ఛేదించింది.ఢిల్లీని 75 పరుగులకు కట్టడి చేయడంలో ఆర్సీబీ బౌలర్లు భువనేశ్వర్ కుమార్ (3-0-5-3), హాజిల్‌వుడ్ (3.3-0-12-4), రసిక్ సలాం దార్ (2-0-21-1), సుయాశ్ శర్మ (4-1-7-1), కృనాల్ పాండ్యా (2-0-9-1) కీలకపాత్ర పోషించారు. వీరిలో భువీ, హాజిల్‌వుడ్ ఆరంభంలో చెలరేగగా.. ఆతర్వాత సుయాశ్ శర్మ పేట్రేగిపోయాడు. ఈ క్రమంలో సుయాశ్ చారిత్రక ప్రదర్శన నమోదు చేశాడు.తన కోటా 4 ఓవర్లలో కేవలం 7 పరుగులే ఇచ్చిన సుయాశ్, ఓ వికెట్ కూడా పడగొట్టాడు. అంతేకాదు, తన స్పెల్‌లో ఏకంగా 20 డాట్ బాల్స్ వేశాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో సంయుక్తంగా అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా అతడిని నిలిపింది. ఈ ఘనతను ఇంతకుముందు దీపక్ చాహర్ సాధించాడు. చాహర్ 2019 ఎడిషన్‌లో సీఎస్కేకు ఆడుతూ కేకేఆర్‌పై ఈ చారిత్రక గణాంకాలు నమోదు చేశాడు. ఇక్కడ దీపక్ చాహర్ పేస్ బౌలర్ కాగా.. ఈ ఘనత సాధించిన తొలి స్పిన్నర్‌గా సుయాశ్ చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డుకు సంబంధించి టాప-5 బౌలర్లలో సుయాశ్ ఒక్కడే స్పిన్నర్‌గా ఉన్నాడు.ఐపీఎల్ చరిత్రలో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్లు (టాప్-5)సుయాశ్ శర్మ- 20దీపక్ చాహర్- 20ఫిడేల్ ఎడ్వర్డ్స్- 19జహీర్ ఖాన్- 19మహ్మద్ షమీ- 19కాగా, ఈ చారిత్రక ప్రదర్శనలో సుయాశ్ ఇచ్చిన 7 పరుగుల్లో 3 వైడ్ల రూపంలో వచ్చాయి. ఇవి కూడా వేయకపోయుంటే సుయాశ్ ఐపీఎల్లో అత్యంత పొదుపైన స్పెల్ వేసిన బౌలర్‌గానూ రికార్డుల్లోకెక్కేవాడు. ఈ మ్యాచ్‌లో సుయాశ్ మధ్య ఓవర్లలో పరుగులకు పూర్తిగా అడ్డుకట్ట వేశాడు. అతని కట్టుదిట్టమైన బౌలింగ్ ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించింది.ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకగా.. ఢిల్లీ ఏడో స్థానానికి పడిపోయింది. ఆర్సీబీ ఏప్రిల్ 30న జరుగబోయే తమ తదుపరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. -
చెలరేగిన బౌలర్లు.. ఢిల్లీని చిత్తుగా ఓడించిన ఆర్సీబీ
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 27) జరిగిన 39వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. ఆర్సీబీ పేసర్లు భువనేశ్వర్ కుమార్ (3-0-5-3), హాజిల్‌వుడ్ (3.3-0-12-4) చెలరేగడంతో 75 పరుగులకే కుప్పకూలింది. భువీ, హాజిల్‌కు రసిక్ (2-0-21-1), సుయాశ్ (4-1-7-1), కృనాల్ (2-0-9-1) తోడవడంతో ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలింది.ఢిల్లీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగిందంటే అభిషేక్ పోరెల్ (30) పుణ్యమే. అతనితో పాటు డేవిడ్ మిల్లర్ (19), జేమీసన్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా బ్యాటర్లలో సాహిల్ పరాఖ్, సమీర్ రిజ్వి, అక్షర్ పటేల్ డకౌట్లు కాగా.. కేఎల్ రాహుల్, నితీశ్ రాణా తలో పరుగు చేశారు. స్టబ్స్ 5, కుల్దీప్ 3 పరుగులు చేశారు.అనంతరం ఢిల్లీ నిర్దేశించిన 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ 6.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఊదేసింది. 20 పరుగులు చేసి జేకబ్ బేతెల్ ఔట్ కాగా.. పడిక్కల్ (34 నాటౌట్), విరాట్ కోహ్లి (23 నాటౌట్) ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు.బేతెల్ వికెట్ జేమీసన్‌కు దక్కింది. -
ఆర్సీబీ ఘన విజయం
ఆర్సీబీ ఘన విజయంఢిల్లీ నిర్దేశించిన 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ 6.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఊదేసింది. 20 పరుగులు చేసి జేకబ్ బేతెల్ ఔట్ కాగా.. పడిక్కల్ (34 నాటౌట్), విరాట్ కోహ్లి (23 నాటౌట్) ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు.బేతెల్ వికెట్ జేమీసన్‌కు దక్కింది. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ2.5వ ఓవర్- 76 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 26 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. జేమీసన్ బౌలింగ్‌లో నటరాజన్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో జేకబ్ బేతెల్ (20) ఔటయ్యాడు. 75 పరుగులకే కుప్పకూలిన ఢిల్లీటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. ఆర్సీబీ పేసర్లు భువనేశ్వర్ కుమార్ (3-0-5-3), హాజిల్‌వుడ్ (3.3-0-12-4) చెలరేగడంతో 75 పరుగులకే కుప్పకూలింది. భువీ, హాజిల్‌కు రసిక్ (2-0-21-1), సుయాశ్ (4-1-7-1), కృనాల్ (2-0-9-1) తోడవడంతో ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలింది. ఢిల్లీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగిందంటే అభిషేక్ పోరెల్ (30) పుణ్యమే. అతనితో పాటు డేవిడ్ మిల్లర్ (19), జేమీసన్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా బ్యాటర్లలో సాహిల్ పరాఖ్, సమీర్ రిజ్వి, అక్షర్ పటేల్ డకౌట్లు కాగా.. కేఎల్ రాహుల్, నితీశ్ రాణా తలో పరుగు చేశారు. స్టబ్స్ 5, కుల్దీప్ 3 పరుగులు చేశారు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ12.3వ ఓవర్- 62 పరుగుల వద్ద ఢిల్లీ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో జేమీసన్ (12) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఏడో వికెట్ డౌన్8.6వ ఓవర్- 43 పరుగుల వద్ద ఢిల్లీ ఏడో వికెట్ కోల్పోయింది. రసిక్ సలాం బౌలింగ్‌లో జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి డేవిడ్ మిల్లర్ (19) ఔటయ్యాడు.ఆరో వికెట్ డౌన్3.5వ ఓవర్- ఆర్సీబీ పేసర్లు చెలరేగిపోతున్నారు. 8 పరుగుల వద్ద ఢిల్లీ ఆరో వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో నితీశ్ రాణా (1) ఔటయ్యాడు. 7 పరుగులకే సగం వికెట్లు డౌన్2.4వ ఓవర్- 7 పరుగుల వద్దే ఢిల్లీ ఐదో వికెట్ కూడా కోల్పోయింది. భువీ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి అక్షర్ పటేల్ () ఔటయ్యాడు. 7 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ2.1వ ఓవర్- ఢిల్లీ కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. భువీ బౌలింగ్‌లో ట్రిస్టన్ స్టబ్స్ (5) ఔటయ్యాడు. దీంతో ఢిల్లీ 7 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.పీకల్లోతు కష్టాల్లో ఢిల్లీటాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఆదిలోనే భారీ షాక్‌లు తగిలాయి. రెండో బంతికే భువీ సాహిల్ పారఖ్ (0), రెండో ఓవర్ తొలి బంతికే కేఎల్ రాహుల్‌ను (1), రెండో బంతికి సమీర్ రిజ్విని (0) హాజిల్‌వుడ్ ఔట్ చేశాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 27) జరుగుతున్న 39వ మ్యాచ్‌లో ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ రెండో స్థానంలో, ఢిల్లీ ఏడో స్థానంలో ఉన్నాయి. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఢిల్లీకి ఇకపై ప్రతి మ్యాచ్ కీలకమే. తుది జట్లు..రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(సి), జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): సాహిల్ పరాఖ్, కేఎల్ రాహుల్(w), నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్(సి), దుష్మంత చమీరా, కైల్ జామీసన్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్ -
GTపై RCB ఘన విజయం
-
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
రికార్డుల రారాజు విరాట్ కోహ్లి ఖాతాలో మరో రెండు భారీ రికార్డులు చేరాయి. ఈ దిగ్గజ బ్యాటర్ ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 24) గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు అర్ద సెంచరీ (44 బంతుల్లో 81) చేసి తన జట్టును గెలిపించాడు. ఇందులో 8 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఈ బౌండరీలు, సిక్సర్ల ద్వారా విరాట్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో 800 ఫోర్లు, ఒకే ఫ్రాంచైజీ (ఆర్సీబీ) తరఫున 300 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనతలను ఇప్పటివరకు ఏ ఆటగాడు సాధించలేదు.వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున 300 సిక్సర్లను మాత్రం క్రిస్ గేల్ (కేకేఆర్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ- 357), రోహిత్ శర్మ (డెక్కన్ ఛార్జర్స్, ముంబై ఇండియన్స్- 310) సాధించారు. గుజరాత్‌పై మ్యాచ్ తర్వాత విరాట్ ఖాతాలో 807 ఫోర్లు, 303 సిక్సర్లు ఉన్నాయి. ఫోర్ల విషయంలో మాత్రం ప్రస్తుతమున్న ఆటగాళ్లలో విరాట్ కనుచూపు మేరల్లో కూడా ఎవరూ లేరు. ఐపీఎల్లో విరాట్ తర్వాత అత్యధిక బౌండరీలు సాధించిన ఘనత మాజీ డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధవన్ (768) పేరిట ఉంది. ప్రస్తుమున్న ఆటగాళ్లలో విరాట్ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్ (663), రోహిత్ శర్మ (653) ఉన్నారు.50 హాఫ్ సెంచరీస్ఈ హాఫ్ సెంచరీతో విరాట్ మరో ఘనత కూడా సాధించాడు. ఈ హాఫ్ సెంచరీ అతనికి ఐపీఎల్లో ఓపెనర్ 50వది. ఈ ఘనతను విరాట్‌కు ముందు డేవిడ్ వార్నర్ మాత్రమే సాధించాడు. తాజా ఇన్నింగ్స్‌తో విరాట్ ప్రస్తుత సీజన్లో లీడింగ్ రన్‌స్కోరర్‌గానూ అవతరించాడు. 7 ఇన్నింగ్స్‌ల్లో 328 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్, ఓపెనర్ సాయి సుదర్శన్ (100) సూపర్ సెంచరీతో కదంతొక్కడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లి (81), పడిక్కల్ (55) చెలరేగడంతో ఆర్సీబీ 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
ఆర్సీబీ హాఫ్ సెంచరీ
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 24) బెంగళూరు వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18.5 ఓవర్లలో సునాయాసంగా ఛేదించింది. ఈ గెలుపు ద్వారా ఆర్సీబీ ఓ అరుదైన ఘనత సాధించింది. సొంత మైదానం బెంగళూరులో తమ 50వ విజయాన్ని నమోదు చేసింది. తద్వారా ముంబై ఇండియన్స్ (వాంఖడే), కేకేఆర్ (కోల్‌కతా), సీఎస్కే (చెన్నై) జట్ల సరసన చేరింది. ఈ జట్లు కూడా తమతమ సొంత వేదికలపై 50 విజయాలు నమోదు చేశాయి. గత 18 సీజన్లలో కలిపి బెంగళూరులో 46 విజయాలు నమోదు చేసిన ఆర్సీబీ, ఈ ఒక్క సీజన్లో ఇప్పటికే (5 మ్యాచ్‌ల్లో) 4 విజయాలు సాధించింది. ఈ సీజన్లో బెంగళూరులో ఆర్సీబీకి ఎదురైన ఏకైక పరాజయం ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో. ఈ మ్యాచ్‌లో 200 ప్లస్ లక్ష్యాన్ని ఛేదించడం ద్వారానూ ఆర్సీబీ ఓ ఘనత సాధించింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 200 ప్లస్ టార్గెట్‌ను ఛేదించిన జట్ల జాబితాలో రాజస్థాన్ రాయల్స్, ఎస్ఆర్హెచ్తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచింది. అలాగే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఛేదించిన 206 పరుగుల లక్ష్యం ఆ జట్టుకు ఐపీఎల్లో రెండో అత్యధిక లక్ష్య ఛేదనగా నిలిచింది.ఐపీఎల్లో అత్యధిక సార్లు 200 ప్లస్ లక్ష్యాన్ని ఛేదించిన టాప్-5 జట్లుపంజాబ్ కింగ్స్- 10ముంబై ఇండియన్స్- 6ఆర్సీబీ-5రాజస్థాన్- 5ఎస్ఆర్హెచ్- 5ఐపీఎల్లో ఆర్సీబీ ఛేదించిన 200 ప్లస్ లక్ష్యాలు228 vs LSG, లక్నో, 2025206 vs GT, బెంగళూరు, 2026*204 vs KXIP, బెంగళూరు, 2010202 vs SRH, బెంగళూరు, 2026201 vs GT, అహ్మదాబాద్, 2024ఐపీఎల్లో ఒక వేదికపై ఒక జట్టు సాధించిన అత్యధిక విజయాలు58 - MI (వాంఖడే)55 - KKR (కోల్‌కతా)53 - CSK (చెన్నై)50 - RCB (బెంగళూరు)*40 - SRH (హైదరాబాద్)*సూపర్ ఓవర్ విజయాలతో కలిపికాగా, నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. ఓపెనర్ సాయి సుదర్శన్ (100) సూపర్ సెంచరీతో కదంతొక్కాడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లి (81), పడిక్కల్ (55) చెలరేగడంతో ఆర్సీబీ 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
ఆర్సీబీకి షాక్.. కేసు వెనక్కు తీసుకున్న బౌలర్
శ్రీలంక ఆటగాడు నువాన్ తుషార వ్యవహారం ప్రస్తుత ఐపీఎల్ ఛాంపియన్ ఆర్సీబీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఐపీఎల్ 2026లో పాల్గొనేందుకు తుషారకు అతని సొంత దేశ క్రికెట్ బోర్డు (శ్రీలంక క్రికెట్) అనుమతి నిరాకరించింది. ఫిట్నెస్ లేని కారణంగా తుషారకు ఎన్వోసీ జారీ చేయలేమని తెలిపింది.ఈ విషయమై కోర్టును ఆశ్రయించిన తుషార.. అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. అకస్మాత్తుగా కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో కోర్టు శ్రీలంక క్రికెట్ బోర్డుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ పరిణామం తర్వాత తుషార ఇక ఐపీఎల్ ఆడటం కష్టమేనని తేలిపోయింది.తుషార వ్యవహారంలో కోర్టు తీర్పు ఆర్సీబీని ఇరకాటంలో పడేసింది. ఆ జట్టు ఈ సీజన్లో తుషారపై ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే, గత సీజన్లో అతను హాజిల్‌వుడ్ గైర్హాజరీలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతని యార్కర్లు, స్లో బంతులు డెత్ ఓవర్లలో ఆర్సీబీకి కీలకంగా మారే అవకాశం ఉండింది.ప్రస్తుతం ఆర్సీబీకి హాజిల్‌వుడ్, డఫీ, ఎంగిడి వంటి విదేశీ పేస్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నప్పటికీ.. తుషార లాంటి డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ ఉంటే అదనపు బలంగా మారే అవకాశం ఉండింది. మొత్తంగా తుషార న్యాయపోరాటం చేస్తూ మధ్యలోనే యూ-టర్న్ తీసుకోవడం ఆర్సీబీకి వ్యూహాత్మక నష్టంగా పరిగణించాలి. ప్లే ఆఫ్స్ రేసులో పోటీ తీవ్రంగా ఉన్న దశలో ఇలాంటి మార్పులు జట్టు సమతుల్యతను దెబ్బతీస్తాయి.కాగా, తుషార లేకపోయినా ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాకు తగ్గట్టుగానే రాణిస్తుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 2 అపజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఏప్రిల్ 24న జరిగే తదుపరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. -
ఎవ్వడిని వదల్లేదు, RCB పొగరు దింపిన మిల్లర్
-
తలతిక్క నిర్ణయాలతో కొంపముంచిన పటీదార్!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఓటమిని కొనితెచ్చుకుంది. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ తలా తోక లేని నిర్ణయాలతో జట్టు ఓటమికి బాటలు వేశాడు. అదెలాగంటే 15 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఈ సమయంలో అక్షర్ పటేల్ కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆర్సీబీకి భువనేశ్వర్ కుమార్, హాజిల్‌వుడ్ ప్రధాన బౌలర్లు. మ్యాచ్‌లో గెలిచే దశలో ఉన్న సమయంలో ప్రధాన బౌలర్లను చివరి ఓవర్లలో బౌలింగ్ చేయించాలి. కానీ ఇక్కడే పటిదార్ తెలివితక్కువ పని చేశాడు. ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 3 ఓవర్లు ముగిసేరికి 14 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. మరోవైపు హాజిల్‌వుడ్ వికెట్లేమీ తీయకపోయినప్పటికీ 3 ఓవర్ల వరకు ఎకానమీ రేటు బాగానే ఉంది. అయితే పటీదార్ డెత్ ఓవర్ల వరకు వీరిని అంటిపెట్టుకోకుండా మధ్యలోనే కోటా పూర్తి చేయించాడు. ఇదే ఆర్సీబీని దెబ్బకొట్టిందని చెప్పొచ్చు. భువనేశ్వర్, హాజిల్‌వుడ్ కోటా పూర్తవ్వడం, సుయాశ్ శర్మ ప్రభావం చూపించకపోవడంతో పటీదార్ రసిక్ సలామ్ చేతిలో బంతిని పెట్టాడు.గత మ్యాచ్‌లో మెరిసిన రసిక్ సలామ్ ఈ మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయాడు. 4 ఓవర్లు వేసి వికెట్ తీయకపోగా 40 పరుగులిచ్చాడు. ఆఖరి ఓవర్ వేసిన షెపర్డ్ ఒత్తిడిలో సరిగ్గా బౌలింగ్ చేయలేక 17 పరుగులు సమర్పించుకొని జట్టు ఓటమికి కారణమయ్యాడు. అదే భువనేశ్వర్ లేదా హాజిల్‌వుడ్‌లలో ఒకరితో చివరి ఓవర్ వేయించి ఉంటే ఆర్సీబీ గెలిచి ఉండేదేమో. ఏది ఏమైనా పటీదార్ తన తిక్క నిర్ణయంతో చేజేతులా ఆర్సీబీకి ఓటమి మూటగట్టుకోవాల్సి వచ్చింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. -
ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ చెత్త రికార్డు
ఐపీఎల్ 2026 సీజన్లో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పర్యావరణ పరిరక్షణ హితం కోసం ఆర్సీబీ గ్రీన్ జెర్సీతో బరిలోకి దిగింది. అయితే గ్రీన్ జెర్సీ ఆర్సీబీకి కలసిరాదన్న విషయం మరోసారి నిరూపితమైంది. ఈ సంగతి పక్కనబెడితే చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ ఆర్సీబీకి వందోది కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఆర్సీబీ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ తాము ఆడిన తొలి మ్యాచ్‌తో పాటు 50వ మ్యాచ్, తాజాగా వందో మ్యాచ్‌లోనూ ఓటమిపాలవ్వడం గమనార్హం. ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008లో చిన్నస్వామి స్టేడియంలో కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లోనే మెక్కల్లమ్ సెంచరీ బాదాడు. ఇక 2016లో ఇదే చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఆర్సీబీ 50వ మ్యాచ్ ఆడింది. తాజాగా యాదృశ్చికంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో చిన్నస్వామి స్టేడియంలో తన వందో మ్యాచ్ ఆడిన ఆర్సీబీకి మరోసారి ఓటమే ఎదురయ్యింది. ఇక 2011 నుంచి ప్రతీ సీజన్లో ఒక మ్యాచ్‌కు ఆర్సీబీ గ్రీన్ జెర్సీతో బరిలోకి దిగడం ఆనవాయితీగా చేసుకుంది. అయితే ఆర్సీబీ ఇప్పటివరకు గ్రీన్ జెర్సీలో 15 మ్యాచ్‌లు ఆడితే అందులో తొమ్మిదింట ఓడి కేవలం ఐదింట మాత్రమే నెగ్గింది. -
నాకు అప్పులు ఉన్నాయి.. ఆదుకోమన్న క్రిస్ గేల్!
వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ గురించి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సృష్టికర్త లలిత్ మోదీ ఆసక్తికర విషయం వెల్లడించాడు. తన వల్ల గేల్‌కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)కు ఆడే అవకాశం దక్కిందని పేర్కొన్నాడు. ఆ తర్వాత గేల్ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదని.. ఆర్థికంగానూ బాగానే స్థిరపడ్డాడని తెలిపాడు.వేలంలో అమ్ముడుపోలేదుకాగా ఐపీఎల్ 2008లో మొదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆరంభ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆడిన క్రిస్ గేల్.. 2009, 2010 ఎడిషన్లలో కూడా అదే జట్టుతో కొనసాగాడు. అయితే, నిలకడలేని ప్రదర్శనల కారణంగా 2011 వేలంలో ఎవరూ అతడిని కొనుగోలు చేయలేదు.ఆ సమయంలో తానే క్రిస్ గేల్‌కు సాయం చేసినట్లు లలిత్ మోదీ తాజాగా వెల్లడించాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నేను ఐపీఎల్ వదిలేసి లండన్‌కు వచ్చిన రోజులు అవి. నాకు ఇష్టుడైన నా స్నేహితుడు గేల్ అప్పట్లో వేలంలో అమ్ముడుపోలేదు.అప్పులు ఉన్నాయి.. ఆదుకోమన్న క్రిస్ గేల్!అప్పుడు నాకు అతడు కాల్ చేశాడు. తనను ఎవరూ కొనలేదని చెప్పాడు. అందుకు బదులుగా.. ‘నువ్వు బాగా ఆడలేదు కాబట్టే ఎవరూ కొనలేదు. నిజానికి నువ్వు మంచి ఆటగాడికి. కానీ బద్దకం వల్ల ఇలా తయారయ్యావు’ అని చెప్పాను.ఇందుకు సమాధానంగా.. ‘నాకు భారీగా అప్పులు ఉన్నాయి. బిల్స్ కట్టాలంటే నేను ఐపీఎల్లో తప్పక ఆడాల్సిందే’ అని గేల్ తన ఆర్థిక పరిస్థితి గురించి చెప్పాడు. అప్పుడు చాలా మందికి కాల్ చేశాను. గేల్‌ను జట్టులోకి తీసుకోమని కోరాను.కానీ ఎవరూ సానుకూలంగా స్పందించలేదు. అప్పుడు నేను విజయ్ మాల్యా ఇంటికి వెళ్లాను. గేల్‌కు ఒక్క అవకాశం ఇవ్వమని కోరాను. డిరిక్ నాన్స్ గాయపడినట్లు తెలిసింది. అతడి స్థానంలో గేల్‌ను ఆడించమన్నాను.ఖాళీ చెక్కుపై తలరాతఅప్పుడు విజయ్ ఓ కండిషన్ పెట్టాడు. గేల్ బాగా ఆడితేనే డబ్బులు చెల్లిస్తానని చెప్పాడు. అయితే, గేల్ మా నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అద్భుత ఆట తీరుతో అలరించి.. తనకు ఇచ్చిన ఖాళీ చెక్కుపై తన తలరాతను రాసుకున్నాడు. కోట్లాది రూపాయల విలువ గల కాంట్రాక్టులు దక్కించుకున్నాడు’’ అని లలిత్ మోదీ చెప్పుకొచ్చాడు.కాగా 2011లో 12 మ్యాచ్‌లు ఆడిన గేల్ 608 పరుగులతో దుమ్ములేపాడు. తద్వారా అత్యధిక పరుగుల వీరుడిగా యూనివర్సల్ బాస్ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. 2017 వరకు ఆర్సీబీతోనే గేల్ కొనసాగాడు. ఇదిలా ఉంటే.. ఇటు లలిత్ మోదీ.. అటు విజయ్ మాల్యా ఆర్థిక నేరగాళ్లుగా ముద్రపడి ప్రస్తుతం లండన్‌లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే.చదవండి: ‘ఏ క్షణమైనా బ్రెయిన్‌స్ట్రోక్.. సిగరెట్లు అడుక్కుంటున్నాడు’ -
గాయంపై అప్డేట్ ఇచ్చిన కోహ్లి
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 15) జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ లక్నో సూపర్ జెయింట్స్‌ను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నోను 146 పరుగులకే (20 ఓవర్లు) కుప్పకూల్చారు. రసిక్ సలామ్ దార్ 4, భువనేశ్వర్ కుమార్ 3, కృనాల్ పాండ్యా 2, హాజిల్‌వుడ్ ఓ వికెట్ తీశారు. హాజిల్‌వుడ్ తీసింది ఓ వికెటే అయినా అత్యంత పొదుపుగా (4-0-20-1) బౌలింగ్ చేసి ఆర్సీబీ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. లక్నో ఇన్నింగ్స్‌లో మిచెల్ మార్ష్ (40), ముకుల్ చౌదరి (39), ఆయుశ్ బదోని (38), మార్క్రమ్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ 15.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ఈ మ్యాచ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన కోహ్లి 49 పరుగులతో రాణించాడు. సాల్ట్ (7), పడిక్కల్ (10) తక్కువ స్కోర్లకే ఔటైనా.. కెప్టెన్ రజత్ పాటిదార్ (27), వికెట్‌కీపర్ జితేశ్ శర్మ (23) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి ఆర్సీబీ గెలుపును సునాయాసం చేశారు. టిమ్ డేవిడ్ (14 నాటౌట్), షెపర్డ్ (14) మ్యాచ్‌ను లాంఛనంగా ముగించారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 3, ఆవేశ్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టారు.మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లి తన గాయం (knee injury)పై అప్డేట్ ఇచ్చాడు. మోకాలి నొప్పితో ఇంకా ఇబ్బందిగానే ఉందని అన్నాడు. అయితే గత మ్యాచ్‌తో పోలిస్తే కాస్త బెటర్ అని తెలిపాడు. గేమ్ ఫినిష్ చేయాలనుకున్నా, పిచ్ స్లో కావడంతో కాస్త కష్టమైందని వివరించాడు. -
విరాట్ కోహ్లి అరుదైన ఫీట్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అరుదైన ఫీట్ సాధించాడు. తన ఐపీఎల్ కెరీర్లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా రావడం కోహ్లికి ఇదే తొలిసారి. ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి ఆర్సీబీకే ఆడుతున్న కోహ్లి తన కెరీర్లో అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓపెనర్‌గానే బరిలోకి దిగేవాడు. ఐపీఎల్ 2026 సీజన్లోనూ ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ కోహ్లి ప్రధాన జట్టులో సభ్యుడిగానే ఆడాడు. అయితే ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి చీలమండ గాయంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో ముంబై ఇన్నింగ్స్ సమయంలో కోహ్లి ఫీల్ఢింగ్‌కు దూరంగా ఉన్నాడు. లక్నోతో మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సమయంలోనూ కోహ్లీ కాలికి బ్యాండేజీతో కనిపించడంతో మ్యాచ్ ఆడేది అనుమానంగానే కనిపించింది. అయితే ఐపీఎల్లో ఇంపాక్ట్ రూల్ బ్యాటర్లకు ఉపయోగకరంగా మారింది. ఈ నేపథ్యంలోనే కోహ్లి లక్నోతో మ్యాచ్‌లో తొలుత తుది జట్టులో లేకపోయేసరికి అభిమానులు కంగారు పడినప్పటికీ కెప్టెన్ పటిదార్ మ్యాచ్‌లో కోహ్లి ఇంపాక్ట్ ప్లేయర్‌గా వస్తాడని పేర్కొన్నాడు. తొలిసారి ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన కోహ్లి విలువైన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. 34 బంతుల్లో 49 పరుగులు చేసి ఔటయ్యాడు. కోహ్లి ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్నో విధించిన 147 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 15.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లి (49) టాప్ స్కోరర్‌గా నిలవగా, పటిదార్ (27), జితేశ్ శర్మ (23) రాణించారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్‌జెయింట్స్ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్ (40) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ముకుల్ చౌదరీ (39), ఆయుశ్ బదోని (38) పర్వాలేదనిపించారు. Virat in a chase. Period. 🙇♂️ pic.twitter.com/1uSeL3PaF8— Royal Challengers Bengaluru (@RCBTweets) April 15, 2026 -
ముంబై, బెంగళూరు మ్యాచ్.. ఫైనల్‌గా జెర్సీ మార్చేసిన స్టార్ హీరోయిన్
బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఆదివారం సాయంత్రం తన కుటుంబంతో కలిసి వాంఖడే స్టేడియంలో జరిగిన ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌కు హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. తన భర్త సైఫ్ అలీ ఖాన్, కుమారులు తైమూర్, జహంగీర్‌లతో పాటు కరీనా కూడా ముంబై జట్టు జెర్సీ ధరించి మద్ధతిచ్చారు. కుటుంబంతో కలిసి రావడంతో వారి వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే, ఈ క్రమంలో ఆమెపై ట్రోల్స్ కూడా రావడం విశేషం.ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను బెంగళూరు జట్టు మట్టికరిపించింది. మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు కరీనా తన ఫ్యామిలీతో స్టేడియం బయట సందడిగా కనిపించారు, ఆ తర్వాత స్టాండ్స్‌లో కూర్చుని ఆటను ఆస్వాదిస్తూ కనిపించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత బయలుదేరి వెళ్తున్న సమయంలో మరిన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే, ఒక ప్రత్యేకమైన క్లిప్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఆ వీడియోలో, కరీనా అంతకుముందు మ్యాచ్ సమయంలో ధరించిన ముంబై ఇండియన్స్ జెర్సీకి బదులుగా, ఒక తెల్లటి టీ-షర్టు ధరించి కనిపించింది. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ముంబై ఇండియన్స్ ఓటమి చవిచూసిన తర్వాత, ఈ దృశ్యం ఆన్లైన్లో వైరల్ అయ్యింది. ముంబై జట్టు ఓడిపోయన తర్వాత ఆమె తన జెర్సీని తొలగించేశారని తెలుస్తోంది. దీంతో ఆమెను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.Kareena Kapoor came to the stadium wearing an MI jersey, but she removed it after MI’s loss against RCB, while Saif Ali Khan and Ibrahim were still seen in MI jerseys as they left Wankhede Stadium after the match 💔 pic.twitter.com/o7u6DlQpWd— Tejash (@Tejashyyyyy) April 13, 2026 -
అందరూ అనుకున్నట్లు కాదు, నా లెక్క వేరు.. రజత్ పాటిదార్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 12) రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ముంబై ఇండియన్స్‌ను వారి సొంత ఇలాకాలో చిత్తుగా ఓడించింది. ఫిల్ సాల్ట్ (78), విరాట్ కోహ్లి (50), రజత్ పాటిదార్ (53), టిమ్ డేవిడ్ (34 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆర్సీబీకి భారీ స్కోర్ అందించారు. ఛేదనలో తడబడిన ముంబై, లక్ష్యానికి 19 పరుగుల దూరంలో నిలిచిపోయింది.విజయానంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ హర్షం వ్యక్తం చేశాడు. జట్టు ప్రదర్శన, వ్యక్తిగత ప్రదర్శనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబైలో ఆడటాన్ని గొప్ప ఆనుభూతిగా పేర్కొన్నాడు. విరాట్ గాయంపై అప్డేట్ ఇచ్చాడు. మొత్తంగా జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు.రజత్ మాటల్లో.. ముంబైలో, ప్రత్యేకంగా వాంఖడే మైదానంలో ఆడటం ఎప్పుడూ ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడి అభిమానులు, వాతావరణం, ఫుల్–ప్యాక్ స్టేడియంలో ఆడటం వేరే లెవెల్ ఫీలింగ్ ఇస్తుంది. ఈ మ్యాచ్‌లో జట్టు ప్రదర్శన సంతృప్తిని కలిగించింది. విరాట్ భాయ్, ఫిల్ సాల్ట్ మంచి ఆరంభాన్ని ఇచ్చి మాకు డ్రైవింగ్ సీట్ ఇచ్చారు. అందుకే నేను, టిమ్ స్వేచ్ఛగా షాట్లు ఆడగలిగాము. ఇది పూర్తిగా టీమ్ ఎఫర్ట్.చాలామంది నేను స్పిన్ బౌలింగ్‌ను బాగా ఆడగలనని అనుకుంటారు. కానీ నిజానికి నాకు ఫాస్ట్ బౌలింగ్ ఆడటం చాలా ఇష్టం. అందులోనే నేను సౌకర్యవంతంగా ఆడగలను. ఈ పిచ్‌లో పేసర్లపై ఎదుర్కోవడం చాలా బాగుంది.విరాట్ భాయ్ గాయంపై నాకు పూర్తి సమాచారం లేదు. కానీ ఆయన బాగానే ఉన్నారని అనిపిస్తోంది. రజత్ మాటలను బట్టి చూస్తే.. జట్టు ప్రదర్శనపై అతను చాలా సంతృప్తిగా ఉన్నాడు. భయం లేకుండా బ్యాటింగ్ చేయడాన్ని ప్రోత్సహిస్తున్నాడు. స్పిన్నర్ల కంటే పేసర్లనే మెరుగ్గా హ్యాండిల్ చేయగలనన్న విషయాన్ని స్పష్టం చేశాడు.కాగా, ఎంఐతో మ్యాచ్‌ను ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసే సమయంలోనే తమ ఖాతాలో వేసుకుంది. సాల్ట్, విరాట్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చి పవర్ ప్లేలోనే మ్యాచ్ ఫేట్‌ను డిసైడ్ చేసేశారు. ఆతర్వాత రజత్, టిమ్ బ్యాటింగ్ ధాటి ఆర్సీబీ గెలుపును ఖరారు చేసింది. బౌలర్లు పెద్దగా రాణించకపోయినా, అది చేసిన భారీ స్కోర్ వల్ల వచ్చిన ధీమా మాత్రమే. మొత్తంగా ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాకు తగ్గ ప్రదర్శనలు చేస్తూ, ప్రస్తుత సీజన్లోనూ టైటిల్ దిశగా సాగుతోంది. ముంబై-ఆర్సీబీ మ్యాచ్ వివరాలు..ఆర్సీబీ- 240/4(20)ముంబై ఇండియన్స్- 222/5(20)18 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయంప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్: ఫిల్ సాల్ట్కీలక ప్రదర్శనలుఆర్సీబీ- ఫిల్ సాల్ట్ (78), విరాట్ కోహ్లి (50), రజత్ పాటిదార్ (53), టిమ్ డేవిడ్ (34 నాటౌట్), కృనాల్ పాండ్యా (4-0-26-1)ముంబై ఇండియన్స్- హార్దిక్ పాండ్యా (4-0-39-1), రూథర్‌ఫోర్డ్ (71 నాటౌట్) -
15 ఏళ్ల కుర్రాడు ..15 బంతుల్లో RCB కి చుక్కలు చూపించాడు
-
1089 రోజుల రికార్డు పునరావృతం చేసిన బిష్ణోయ్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 10) జరిగిన ఆసక్తికర సమరంలో ఆర్సీబీపై రాజస్థాన్ రాయల్స్ ఏకపక్ష విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ తొలుత తడబడినా, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకొని నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ రజత్ పాటిదార్ బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో (63) ఆర్సీబీ పతనాన్ని అడ్డుకున్నాడు అతనికి రొమారియో షెపర్డ్ (22), వెంకటేశ్ అయ్యర్ (29 నాటౌట్) సహకరించారు. మిగతా బ్యాటర్లలో విరాట్ కోహ్లి (32) పర్వాలేదనిపించగా.. సాల్ట్ (0), పడిక్కల్ (14), కృనాల్ (1), జితేశ్ (5), టిమ్ డేవిడ్ (13) నిరాశపరిచారు. రాయల్స్ బౌలర్లలో బిష్ణోయ్ (4-0-32-2), బ్రిజేష్ శర్మ (4-0-32-2), ఆర్చర్ (3-0-33-2) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. సందీప్ శర్మ (4-0-47-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. రవీంద్ర జడేజాకు ఓ వికెట్ దక్కింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మరోసారి పేట్రేగిపోయాడు. కేవలం 26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేశాడు. ఆతర్వాత ధృవ్ జురెల్ (43 బంతుల్లో 81 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) రెచ్చిపోయాడు. ఫలితంగా రాయల్స్ 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి, 6 వికెట్ల తేడాతో ఆర్సీబీని చిత్తు చేసింది. ఈ ఓటమి ఆర్సీబీకి ఈ సీజన్లో మొదటిది కాగా.. ఈ గెలుపుతో రాయల్స్ తమ అజేయ యాత్రను కొనసాగించింది. ఈ సీజన్ రాయల్స్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో రాయల్స్ బౌలర్ రవి బిష్ణోయ్ ఓ ప్రత్యేక ఘనత సాధించాడు. విరాట్‌ను అద్భుతమైన గూగ్లీతో క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా.. 1089 కిందటి ఓ ఘట్టాన్ని పునరావృతం చేశాడు. విరాట్ ఐపీఎల్లో చివరిసారి 2023 ఎడిషన్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మళ్లీ ఇప్పుడే అతను ఈ తరహాలో వికెట్ సమర్పించుకున్నాడు. అంటే ఐపీఎల్లో విరాట్ 1089 రోజుల తర్వాత క్లీన్ బౌల్డ్ అయ్యాడన్న మాట. 2023 ఎడిషన్‌లో విరాట్ సీఎస్కే బౌలర్ ఆకాశ్ సింగ్ చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. -
CSK ఫ్యాన్ ను ఒక ఆట ఆడుకున్న RCB అమ్మాయి...
-
చరిత్ర సృష్టించిన చెన్నై సూపర్ కింగ్స్
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చరిత్ర సృష్టించింది. ఐపీఎల్లో అత్యధిక సార్లు 200 ప్లస్ స్కోర్లు చేసిన జట్టుగా అవతరించింది. 2026 ఎడిషన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 3) జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ చేసిన ఆ జట్టు.. 36వ సారి 200 ప్లస్ మార్కును తాకింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఈ రికార్డు సీఎస్కే, ఆర్సీబీ (35) పేరిట సంయుక్తంగా ఉండేది.ఈ విభాగంలో సీఎస్కే, ఆర్సీబీ తర్వాతి స్థానాల్లో పంజాబ్ కింగ్స్ (32), ముంబై ఇండియన్స్ (31), కేకేఆర్ (29) ఉన్నాయి. ఐపీఎల్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు సన్‌రైజర్స్ హైదరాబాద్ పేరిట ఉంది. 2024 ఎడిషన్‌లో ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి ఏకంగా 287 పరుగులు చేసింది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే ఆయుశ్ మాత్రే (73) అర్ద సెంచరీతో సత్తా చాటడంతో భారీ స్కోర్ చేసింది. శివమ్ దూబే (45 నాటౌట్), సర్ఫరాజ్ ఖాన్ (32) ఓ మోస్తరు స్కోర్లతో రాణించగా.. రుతురాజ్ గైక్వాడ్ (28) పర్వాలేదనిపించాడు. సంజూ శాంసన్ (7), కార్తీక్ శర్మ (1) నిరాశపరిచారు. పంజాబ్ బౌలర్లలో విజయ్ కుమార్ 2, చహల్, జన్సెన్, బార్ట్లెట్ తలో వికెట్ తీశారు.అనంతరం 210 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ సైతం ధాటిగా ఆడుతుంది. 8 ఓవర్లలోనే ఆ జట్టు వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది. ప్రియాంశ్ ఆర్య (39) విధ్వంసం సృష్టించి ఔట్ కాగా.. ప్రభ్‌సిమ్రన్ (38), కూపర్ కన్నోల్లీ (7) క్రీజ్‌లో ఉన్నారు. ప్రియాంశ్ ఆర్యను మ్యాట్ హెన్రీ క్లీన్ బౌల్డ్ చేశాడు. -
IPL 2026: ముగ్గురు మొనగాళ్లు!
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభమై రెండు రోజులే అయినప్పటికీ రెండు మ్యాచ్‌ల్లోనూ చేజింగ్ చేసిన జట్లే గెలవడం అభిమానులకు కిక్ ఇస్తోంది. అంతకంటే ఎక్కువ కిక్ ఇస్తున్న వార్త ఏదైనా ఉందంటే.. టీమిండియా సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, అజింక్యా రహానే, విరాట్ కోహ్లీల బ్యాటింగ్ అని చెప్పొచ్చు. 40 ఏండ్లకు దగ్గర్లో ఉన్న ఈ ముగ్గురు మొనగాళ్లు బ్యాటింగ్‌లో అద్భుతాలు చేస్తున్నారు. ఈ సీజన్లో తాము ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఈ త్రయం తమ ప్రదర్శనతో అదరగొట్టారు. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత రోహిత్, కోహ్లీలు పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికితే.. జట్టులో అవకాశాల్లేక టీ20 క్రికెట్ ఆడే అవకాశం రహానే ఎప్పుడో కోల్పోయాడు. కానీ తాజాగా ప్రారంభమైన ఐపీఎల్ 19వ సీజన్లో మాత్రం తమ బ్యాటింగ్ విన్యాసాలతో అభిమానులను అలరిస్తున్నారు. ఈ ముగ్గురూ ఇలాగే ఆడుతూ పోతే రాబోయే మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చుక్కలే అని చెప్పొచ్చు.రోహిత్ శర్మ..భారత కెప్టెన్‌గా 2024 టీ20 ప్రపంచకప్‌ను అందుకున్న రోహిత్ శర్మ ఆ తర్వాత ఆ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్ శర్మ జనవరిలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆడాడు. ఆ సిరీస్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ లేదు. మూడు వన్డేలు కలిపి కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఇవాళ ఐపీఎల్లో మాత్రం తొలి మ్యాచ్‌లోనే రోహిత్ శర్మ విధ్వంసకర ఆటతీరును ప్రదర్శించాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో 38 బంతుల్లోనే 78 పరుగులు చేసిన రోహిత్ అలవోకగా బంతులను బౌండరీ అవతలకు పంపిస్తూ పాత హిట్‌మ్యాన్‌ను గుర్తు చేశాడు. రికిల్టన్ కంటే ముందే ఔటైనప్పటికీ ఫోర్లు, సిక్సర్లతో కేకేఆర్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముఖ్యంగా మ్యాచ్‌లో రోహిత్ ఫుట్‌వర్క్ అద్భుతమని చెప్పొచ్చు. ఎక్కడా చిన్న తప్పిదం లేకుండా ఇన్నింగ్స్ ఆసాంతం మంచి టైమింగ్‌తో షాట్లు ఆడాడు. తొలి మ్యాచ్‌తోనే ఫామ్ అందుకున్న రోహిత్ నుంచి సీజన్ ముగిసేలోపు మరిన్ని అద్భుత ఇన్నింగ్స్‌లు వచ్చే అవకాశముంది. View this post on Instagram A post shared by IPL (@iplt20)విరాట్ కోహ్లీ..కోహ్లీది కూడా అచ్చం రోహిత్ స్టోరీనే. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియాలో సభ్యుడైన కోహ్లీ రోహిత్‌తో కలిసి ఏకకాలంలో టీ20లకు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ కోహ్లీ అదరగొట్టాడు. ఆ సిరీస్‌లో కోహ్లీ 3 మ్యాచ్‌ల్లో 240 పరుగులు సాధించి భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తాజాగా అదే ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కంటిన్యూ చేశాడు. ఐపీఎల్ 19వ సీజన్లో ఎస్ఆర్హెచ్తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో బెంగళూరు స్టార్ కోహ్లీ చివరి వరకు నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు. కోహ్లీ (38 బంతుల్లో 69 నాటౌట్) చేజింగ్‌లో తనను కొట్టేవారు లేరని మరోసారి నిరూపించాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. సీజన్ ఆద్యంతం కోహ్లీ ఇదే దూకుడు ప్రదర్శిస్తే ఆరెంజ్ క్యాప్ కూడా సొంయ్యే అవకాశం లేకపోలేదు. View this post on Instagram A post shared by IPL (@iplt20)అజింక్యా రహానే..రోహిత్, కోహ్లీలు రెండేళ్ల కిందట టీ20లకు వీడ్కోలు పలికితే రహానే టీమిండియా తరఫున తన చివరి టీ20 ఆడి దాదాపు పదేళ్లు కావొస్తోంది. రహానే 2016లో వెస్టిండీస్‌తో చివరి టీ20 ఆడాడు. అప్పటి నుంచి టెస్టుల్లో కొన్నాళ్లు ఆడిన రహానే ఇప్పుడు అవకాశాలు లేవు. దీంతో ఐపీఎల్లో మాత్రమే కొనసాగుతున్న రహానే గత రెండు, మూడు సీజన్లలో ఆట స్వరూపాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. రహానేను ఎక్కువగా టెస్టు క్రికెట్లో చూడడం వల్ల అతడి నుంచి నెమ్మదైన ఆటనే అభిమానులు ఊహించేవారు. కానీ ఐపీఎల్లో రహానే ఆడుతున్న తీరు షాక్ కలిగిస్తోందని చెప్పొచ్చు. తాజాగా ఐపీఎల్ 19వ సీజన్లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో రహానే కేకేఆర్ కెప్టెన్‌గా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 40 బంతుల్లో 67 పరుగులు చేసిన రహానే ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. గతంలో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడినప్పుడు కూడా రహానే ఇదే దూకుడును ప్రదర్శించి సరికొత్త ఆటను రుచి చూపించాడు. మొత్తంగా టీమిండియా సీనియర్లయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానేలు ఒక్క మ్యాచ్‌తోనే ఆటలో మొనగాళ్లమని నిరూపించుకున్నారు.చదవండి: ‘14 ఏండ్లకు మమ్మల్ని కరుణించాడు’ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ఆర్సీబీ
ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆర్సీబీ.. తొలి మ్యాచ్‌లోనే అదిరిపోయే విజయం సాధించింది. నిన్న (మార్చి 28) జరిగిన టోర్నీ ఓపెనర్‌లో సన్‌రైజర్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొంది, ఏకపక్ష విజయం నమోదు చేసింది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని మరో 26 బంతులు మిగిలి ఉండగానే (15.4 ఓవర్లలో) ఛేదించడం ద్వారా ఓ భారీ రికార్డు నెలకొల్పింది.ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 200 ప్లస్ టార్గెట్‌ను ఊదేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. గతంలో ఈ రికార్డు రాజస్థాన్ రాయల్స్ పేరిట ఉండేది. రాయల్స్ గత ఎడిషన్‌లో (2025లో గుజరాత్‌పై) 200 ప్లస్ లక్ష్యాన్ని 15.5 ఓవర్లలో ఛేదించింది. తాజాగా ఆర్సీబీ ఈ రికార్డును బద్దలు కొట్టింది.ఆర్సీబీ ఈ రికార్డు సాధించడంలో కింగ్ విరాట్ కోహ్లి కీలకపాత్ర పోషించాడు. భారీ ఛేదనలో విరాట్ తన సహజ శైలికి భిన్నంగా భారీ షాట్లతో అలరించి (38 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మ్యాచ్‌ను వేగంగా ముగించాడు. గెలుపుకు 17 పరుగులు కావాల్సిన తరుణంలో విరాట్ వరుసగా 6, 4, 4, 4 బాది ఆర్సీబీ ఈ రికార్డు సొంతం చేసుకునేలా చేశాడు.ఆర్సీబీ ఈ రికార్డు సొంతం చేసుకోవడంలో దేవ్‌దత్ పడిక్కల్ (26 బంతుల్లో 61; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), రజత్ పాటిదార్ (12 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా తమవంతు పాత్ర పోషించారు. వీరిద్దరు కూడా వేగంగా ఆడి కొండంత లక్ష్యాన్ని కరిగించారు. అంతకుముందు ఇషాన్ కిషన్ (38 బంతుల్లో 80; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం, అనికేత్ వర్మ (18 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపుల కారణంగా సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది.ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన 200 ప్లస్ లక్ష్య ఛేదనలు..15.4 - RCB vs SRH, బెంగళూరు, 2026*15.5 - RR vs GT, జైపూర్, 202516.0 - RCB vs GT, అహ్మదాబాద్, 202416.3 - MI vs RCB, వాంఖేడే, 202317.3 - DC vs GL, ఢిల్లీ, 2017 -
ఎస్ఆర్హెచ్పై విజయం.. కోహ్లీ ఫ్లయింగ్ కిస్
ఐపీఎల్ 2026 సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) శుభారంభం చేసింది. శనివారం ఎస్ఆర్హెచ్తో జరిగిన సీజన్ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం ఖరారు కాగానే స్టేడియంలో అందరినీ ఆకట్టుకునేలా ఒక క్యూట్ ‘విరుష్క’ మూమెంట్ చోటుచేసుకుంది. గెలుపు ఆనందంలో విరాట్ కోహ్లీ తన హెల్మెట్ తీసి, స్టాండ్స్‌లో తన కోసం ఉత్సాహంగా చీర్ చేస్తున్న భార్య అనుష్క శర్మ వైపు చూస్తూ ముద్దుగా ‘ఫ్లయింగ్ కిస్’ ఇచ్చాడు. దానికి స్పందనగా అనుష్క కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా అంతే ప్రేమగా కోహ్లీకి రిటర్న్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. ఈ దృశ్యాన్ని అక్కడే మ్యాచ్ చూడటానికి వచ్చిన ఆర్సీబీ మహిళల జట్టు క్రికెటర్లు స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, శ్రేయాంక పాటిల్ నవ్వుతూ ఆశ్చర్యంగా చూశారు. ఈ అందమైన క్షణంతో చిన్నస్వామి స్టేడియం ఒక్కసారిగా అభిమానుల అరుపులతో హోరెత్తిపోయింది.మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు, కెప్టెన్ ఇషాన్ కిషన్ 80 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ క్రీజులో ఉండటంతో ఆర్సీబీ చాలా సులువుగా ఊదేసింది. కేవలం 15.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఆర్సీబీ విజయాన్ని అందుకుంది. THE WAY VIRAT KOHLI GIVING FLYING KISS TO ANUSHKA SHARMA AFTER WON THE MATCH. ♥️😍- Video of the Day! pic.twitter.com/lQugBW89Ju— Tanuj (@ImTanujSingh) March 28, 2026 -
RCB Vs SRH: అదరగొట్టిన RCB.. SRHపై 6 వికెట్ల తేడాతో RCB గెలుపు
-
విన్యాసాల వీరుడు.. ఫిల్ సాల్ట్
‘క్యాచ్స్ విన్ మ్యాచెస్’ అని ఊరికే అనలేదు. ఐపీఎల్ 2026 సీజన్ తొలి మ్యాచ్‌లోనే అది మరోసారి నిరూపితమయ్యింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాడు ఫిల్ సాల్ట్ తన స్టన్నింగ్ క్యాచ్‌లతో హీరోగా నిలిచాడు. ఫిల్ సాల్ట్ తన అసాధారణ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. సాల్ట్ అందుకున్న మూడు క్యాచ్‌లు దేనికవే సాటి. 14వ ఓవర్లో హెడ్ కొట్టిన బంతిని బౌండరీ సమీపంలోక్లాసెన్ క్యాచ్ వివాదాస్పదమైనప్పటికీ ఎస్ఆర్హెచ్తో అతడు అందుకున్న మూడు క్యాచ్‌లు దేనికవే సాటి అని చెప్పొచ్చు. ఫిల్ సాల్ట్ చేతికి చిక్కిన ముగ్గురు (ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్) డేంజర్ బ్యాటర్లే. ఈ ముగ్గురు సూపర్ బ్యాటింగ్‌తో అలరిస్తున్న సమయంలో సాల్ట్ అడ్డుగోడలా నిలిచాడు. ఇన్నింగ్స్ 2.4 ఓవర్లో జాకబ్ డఫీ వేసిన బంతిని హెడ్ బ్యాక్వర్డ్ స్వ్కేర్ దిశగా ఆడాడు. అయితే అక్కడే కాచుకు కూర్చున్న సాల్ట్ వెనక్కి పరిగెత్తి అద్భుతమైన రివర్స్ క్యాచ్ తీసుకున్నాడు. షెఫర్డ్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్ తొలి బంతికి క్లాసెన్ డీప్ మిడ్‌వికెట్ దిశగా భారీ షాట్ ఆడగా... అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న సాల్ట్ దాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలో అతడు బౌండరీ రోప్ మీద పడ్డట్లు కనిపించింది. పలుమార్లు పరిశీలించిన థర్డ్ అంపైర్ క్లాసెన్‌ను అవుట్‌గా ప్రకటించాడు. దీంతో క్లాసెన్ అసంతృప్తిగా మైదానాన్ని వీడాడు. ఏదీ ఏమైనా సాల్ట్ అందుకున్న ఈ క్యాచ్ కూడా కాస్త క్లిష్టతరమైనదే. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్‌కు వెన్నుముకలా నిలిచిన ఇషాన్ కిషన్ ఇచ్చిన క్యాచ్‌ను సాల్ట్ అందుకున్న తీరు నభూతో నభవిష్యత్తు అని చెప్పొచ్చు. అభినందన్ వేసిన ఇన్నింగ్స్ 15.6 ఓవర్లో ఇషాన్ భారీ షాట్‌కు యత్నించాడు. పాయింట్ దిశగా ఇషాన్ కొట్టిన బంతిని సాల్ట్ రెప్పపాటులో అందుకున్నాడు. డీప్ బ్యాక్వర్డ్ పాయింట్ బౌండరీ వద్ద కుడివైపు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఒంటి చేత్తో బంతిని అందుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతేడాది ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్లోనూ ఫీల్డింగ్‌లో ఇదే తరహా విన్యాసాలతో ఫిల్ సాల్ట్ అదరగొట్టాడు. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ప్రియాన్ష్ ఆర్య భారీ షాట్ ఆడాడు. అయితే బౌండరీ లైన్ వద్ద ఉన్న సాల్ట్ అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్‌ను ఒడిసిపట్టడం అప్పట్లో ట్రేడ్‌మార్క్ క్యాచ్‌గా నిలిచిపోయింది. మొత్తంగా సాల్ట్ బ్యాటింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపించి విన్యాసాల వీరుడిగా ముద్ర వేసుకున్నాడు.𝐒𝐓𝐎𝐏 𝐖𝐇𝐀𝐓 𝐘𝐎𝐔 𝐀𝐑𝐄 𝐃𝐎𝐈𝐍𝐆 𝐀𝐍𝐃 𝐖𝐀𝐓𝐂𝐇 𝐓𝐇𝐈𝐒! 🛑🎥 Phil Salt with an absolute one-handed screamer at the ropes 🫡Do we already have the Catch of the Season on Day 1 of #TATAIPL 2026 🤔Updates ▶️ https://t.co/Eo5z0jh4K4 #KhelBindaas | #RCBvSRH |… pic.twitter.com/pPax3pVNt9— IndianPremierLeague (@IPL) March 28, 2026That’s not just a catch, that’s a full-on rollercoaster at the ropes 😮💨Screen badi, awaazein badi. Apne smart TV ke JioHotstar app pe dekhiye Champions waali commentary LIVE💥#TATAIPL 2026 | #RCBvSRH | LIVE NOW 👉 https://t.co/LWOEeT2vNG pic.twitter.com/IzIDC3MtkX— Star Sports (@StarSportsIndia) March 28, 2026Picking up where he left off... 🔥🔥Never change, Phil Salt. Never change. 🙏#PlayBold #ನಮ್ಮRCB #IPL2026 #RCBvSRH pic.twitter.com/gGu6BD388g— Royal Challengers Bengaluru (@RCBTweets) March 28, 2026చదవండి: అందుకే చేజింగ్ మాస్టర్ అనేది! -
అందుకే చేజింగ్ మాస్టర్ అనేది!
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే పలు రికార్డులు బద్దలయ్యాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అసలైన చాంపియన్ ఆటతీరును ప్రదర్శించి సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)పై సునాయాస విజయాన్ని నమోదు చేసుకుంది. ఎస్ఆర్హెచ్ విధించిన 202 పరుగుల టార్గెట్‌ను ఉఫ్ అని ఉదేసింది. పడిక్కల్, పటిదార్లు మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుంటే.. కోహ్లీ మాత్రం లక్ష్య ఛేదనలో తనను మాస్టర్ అని ఎందుకు పిలుస్తారో మరోసారి నిరూపించాడు. చేజింగ్ అంటేనే కోహ్లీలో ఎక్కడలేని ఊపు కనిపిస్తుంది. అందుకేనేమో ఈ చేజింగ్ మాస్టర్‌ను వెతుక్కుంటూ రికార్డులు వస్తుంటాయి. తాజాగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లోనూ కోహ్లీ రెండు అరుదైన రికార్డులు అందుకున్నాడు. ఐపీఎల్లో లక్ష్య ఛేదన సమయంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ రికార్డులకెక్కాడు. 4027 పరుగులతో కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీ తర్వాత వార్నర్ (3,285), రోహిత్ శర్మ (3,238), శిఖర్ ధావన్ (2,843), రాబిన్ ఊతప్ప (2,832) వరుసగా ఉన్నారు. ఎస్ఆర్హెచ్తో గత ఐదు మ్యాచ్‌ల్లో వరుసగా 100, 42, 51, 43, 69* పరుగులు చేయడం ద్వారా మరో రికార్డు లిఖించుకున్నాడు. మరిన్ని రికార్డులు..ఇక కోహ్లీకి వరుసగా రెండో ఐపీఎల్ సీజన్‌ను కూడా అర్థసెంచరీతోనే మొదలుపెట్టాడు. 2025 సీజన్లో కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అర్థసెంచరీ చేశాడు. తాజాగా ఎస్ఆర్హెచ్పై అర్థసెంచరీతో ఈ సీజన్లో బ్యాటింగ్‌ను షురూ చేశాడు.ఇక ఐపీఎల్లో 200 పరుగులకు పైగా ఛేదనను అతి తక్కువ ఓవర్లలో చేధించిన జట్టుగాను ఆర్సీబీ రికార్డు అందుకుంది. ఎస్ఆర్హెచ్ విధించిన 202 పరుగులు లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఛేదించింది. అంతకముందు 2025 సీజన్లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ 15.5 ఓవర్లలో అందుకుంది.ఐపీఎల్లో 200లకు పైగా పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ ఛేదించడం ఇది నాలుగోసారి. గతంలో 2025లో లక్నో సూపర్‌జెయింట్స్‌పై, 2010లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై, 2024లో గుజరాత్ టైటాన్స్‌పై 200 ప్లస్ స్కోర్లు ఛేదించింది. -
దంచికొట్టిన పడిక్కల్, కోహ్లి.. భారీ లక్ష్యాన్ని ఊదేసిన ఆర్సీబీ
డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ ఐపీఎల్ 2026 సీజన్లో ఘనంగా బోణీ కొట్టింది. ఛాంపియన్ హోదాకు సార్దకత చేకూరుస్తూ, తొలి మ్యాచ్‌లోనే అబ్బురపరిచే విజయం సాధించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఇవాళ (మార్చి 28) జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్.. ఇషాన్ కిషన్ (38 బంతుల్లో 80; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం, అనికేత్ వర్మ (18 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపుల కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. జేకబ్ డఫీ (4-0-22-3) ధాటికి 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సన్‌రైజర్స్‌ను ఇషాన్.. హెన్రిచ్ క్లాసెన్ (22 బంతుల్లో 31; 2 ఫోర్లు, సిక్స్) సాయంతో గట్టెక్కించాడు.వరుస విరామాల్లో వికెట్లు పడినా ఆఖర్లో అనికేత్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా సన్‌రైజర్స్ 200 పరుగుల మార్కును దాట గలిగింది. మిగతా బ్యాటర్లలో హెడ్ 11, అభిషేక్ 7, నితీశ్ కుమార్ రెడ్డి 1, సలీల్ అరోరా 9, హర్ష్ దూబే 3, హర్షల్ పటేల్ డకౌట్ కాగా.. డేవిడ్ పేన్ 6, ఉనద్కత్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో డఫీ, రొమారియో షెపర్డ్ చెరో 3 వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, సుయాశ్ శర్మ తలో వికెట్ తీశారు.దంచికొట్టిన పడిక్కల్, కోహ్లిఅనంతరం బరిలోకి దిగిన ఆర్సీబీ.. దేవ్‌దత్ పడిక్కల్ (26 బంతుల్లో 61; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), విరాట్ కోహ్లి (38 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), రజత్ పాటిదార్ (12 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం ధాటికి కేవలం 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఊదేసింది. విరాట్ సిక్సర్, హ్యాట్రిక్ బౌండరీలతో మ్యాచ్‌ను ముగించాడు. తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన చేసిన జేకబ్ డఫీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. -
ఇషాన్ విధ్వంసం.. అనికేత్ మెరుపులు.. సన్‌రైజర్స్ భారీ స్కోర్
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీతో ఇవాళ (మార్చి 28) ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్.. ఇషాన్ కిషన్ (38 బంతుల్లో 80; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం, అనికేత్ వర్మ (18 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపుల కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.ఆర్సీబీ అరంగేట్రం బౌలర్ జేకబ్ డఫీ (4-0-22-3) ధాటికి 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సన్‌రైజర్స్‌ను ఇషాన్.. హెన్రిచ్ క్లాసెన్ (22 బంతుల్లో 31; 2 ఫోర్లు, సిక్స్) సాయంతో గట్టెక్కించాడు. వరుస విరామాల్లో వికెట్లు పడినా ఆఖర్లో అనికేత్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా సన్‌రైజర్స్ 200 పరుగుల మార్కును దాట గలిగింది. మిగతా సన్‌రైజర్స్ బ్యాటర్లలో హెడ్ 11, అభిషేక్ 7, నితీశ్ కుమార్ రెడ్డి 1, సలీల్ అరోరా 9, హర్ష్ దూబే 3, హర్షల్ పటేల్ డకౌట్ కాగా.. డేవిడ్ పేన్ 6, ఉనద్కత్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో డఫీ, రొమారియో షెపర్డ్ చెరో 3 వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, సుయాశ్ శర్మ తలో వికెట్ తీశారు.తుది జట్లు..ఆర్సీబీ: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్‌కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మసన్‌రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్/వికెట్‌కీపర్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ -
సన్‌రైజర్స్‌పై ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్ 2026 ఓపెనింగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.4 ఓవర్లలో ఊదేసి, 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలింగ్‌లో డఫీ (4-0-22-3).. బ్యాటింగ్‌లో పడిక్కల్ (26 బంతుల్లో 61; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), విరాట్ కోహ్లి (38 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) అదరగొట్టారు. అంతకుముందు ఇషాన్ కిషన్ (38 బంతుల్లో 80; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం, అనికేత్ వర్మ (18 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపుల కారణంగా సన్‌రైజర్స్ భారీ స్కోర్ చేసింది. వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన ఆర్సీబీఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఆర్సీబీ వరుస బంతుల్లో (2,3) వికెట్లు కోల్పోయింది. డేవిడ్ పేన్ వరుసగా రజత్ పాటిదార్ (31), జితేశ్ శర్మ (0)ను ఔట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలవాలంటే 45 బంతుల్లో 39 పరుగులు చేయాలి. రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ8.4వ ఓవర్-110 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. విధ్వంసకర అర్ద శతకం బాదిన పడిక్కల్ (26 బంతుల్లో 61; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) హర్ష్ దూబే బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ202 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 9 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది. ఉనద్కత్ బౌలింగ్‌లో క్లాసెన్ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ పట్టడంతో ఫిల్ సాల్ట్ (8) ఔటయ్యాడు. అయితే సాల్ట్ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన పడిక్కల్ (11 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తొలి బంతి నుంచే ఎస్ఆర్హెచ్ బౌలర్లపై ఎదురుదాడి ప్రారంభించాడు. అతనికి జతగా విరాట్ కోహ్లి (17 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నాడు. 4.3 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 61-1గా ఉంది.ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే..?వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయినా ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్ (80) విధ్వంసం.. క్లాసెన్ క్లాస్ (31), ఆఖర్లో అనికేత్ వర్మ (43) మెరుపుల కారణంగా ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. హెడ్ 11, అభిషేక్ 7, నితీశ్ కుమార్ రెడ్డి 1, సలీల్ అరోరా 9, హర్ష్ దూబే 3, హర్షల్ పటేల్ డకౌట్ కాగా.. డేవిడ్ పేన్ 6, ఉనద్కత్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో డఫీ, రొమారియో షెపర్డ్ చెరో 3 వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, సుయాశ్ శర్మ తలో వికెట్ తీశారు. ఇషాన్ కిషన్ ఔట్15.6వ ఓవర్- 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి ఇషాన్ కిషన్ ఔటయ్యాడు. అభినందన్ సింగ్ బౌలింగ్‌లో సాల్ట్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు. 16 ఓవర్ల తర్వాత ఎస్ఆర్హెచ్ స్కోర్ 155-6గా ఉంది. ఐదో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్14.3వ ఓవర్- 137 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ ఐదో వికెట్ కోల్పోయింది. సుయాశ్ శర్మ బౌలింగ్‌లో పడిక్కల్‌కు క్యాచ్ ఇచ్చి సలీల్ అరోరా (9) ఔటయ్యాడు.నాలుగో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్13.1వ ఓవర్లో సన్‌రైజర్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. అద్భుతంగా ఆడుతున్న హెన్రిచ్ క్లాసెన్ (31) రొమారియో షెపర్డ్ బౌలింగ్‌లో ఫిల్ సాల్ట్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు. ఇషాన్ కిషన్‌కు (72) జతగా సలీల్ అరోరా క్రీజ్‌లోకి వచ్చాడు. 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్ఎస్ఆర్హెచ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. డఫీ ఎస్ఆర్హెచ్ను దారుణంగా దెబ్బకొట్టాడు. 3వ ఓవర్లో ఓపెనర్లు అభిషేక్, హెడ్ వికెట్లు తీసిన ఇతను.. ఐదో ఓవర్ తొలి బంతికే నితీశ్‌కుమార్ రెడ్డిని (1) పెవిలియన్‌కు పంపాడు. హెడ్ ఔట్.. 23 పరుగులకే ఓపెనర్లు డౌన్23 పరుగులకే (3 ఓవర్లు) ఎస్ఆర్హెచ్ ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. డేంజరెస్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ (11) డఫీ బౌలింగ్‌లో సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అభిషేక్ ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ 18 పరుగుల వద్ద (2.1వ ఓవర్) తొలి వికెట్ కోల్పోయింది. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ (7) జేకబ్ డఫీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి వికెట్ కీపర్ జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఇవాల్టి (మార్చి 28) మ్యాచ్‌తో ఐపీఎల్ 2026 ప్రారంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.తుది జట్లు..ఆర్సీబీ: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్‌కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మసన్‌రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్/వికెట్‌కీపర్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ -
ఎప్పటికీ మా హృదయాల్లో...
ఐపీఎల్లో గత ఏడాది ఆర్సీబీ విజేతగా నిలిచిన తర్వాత జరిగిన విజయోత్సవంలో 11 మంది అభిమానులు మృతి చెందారు. వారి స్మారకార్థం ఆర్సీబీ యాజమాన్యం భిన్న రీతిలో నివాళి అర్పించనుంది. ఇకపై చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లలో 11 సీట్లను ఖాళీగా ఉంచనుంది. పీ1 స్టాండ్‌లోని ఈ సీట్లలో ఎవరూ కూర్చోకుండా ఆ 11 మంది జ్ఞాపకార్ధం శాశ్వతంగా అలాగే ఉంచనుంది. ‘జట్టుతో వారికి ఉన్న అనుబంధానికి ఇవి గుర్తుగా ఉండిపోతాయి. వారు ఎప్పటికీ ఆర్సీబీ అభిమానులే’ అని తమ గౌరవాన్ని ప్రకటించింది. -
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్.. ఆర్సీబీకి భారీ షాక్
ఐపీఎల్-2026 సీజన్‌కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ గాయం కారణంగా మొదటి మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ హెడ్ కోచ్ అండీ ఫ్లవర్ ధ్రువీకరించాడు. హాజిల్‌వుడ్ గురువారం జట్టుతో చేరి ప్రాక్టీస్ చేసినప్పటికి, అతడు ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్‌కు అతడు అందుబాటులో లేడు."ఎస్ఆర్హెచ్తో జరిగే మా మొదటి మ్యాచ్‌కు జోష్ హాజిల్‌వుడ్ అందుబాటులో లేడు. అతడు ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. జోష్ నిన్ననే మా జట్టుతో చేరాడు. అతడిపి ఫిట్నెస్ను మా వైద్యబృందం పరీక్షించనుంది. తర్వాతే తదుపరి మ్యాచ్‌లకు అతడి అందుబాటుపై నిర్ణయం తీసుకుంటాము" అని ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో ఫ్లవర్ పేర్కొన్నాడు. కాగా ఈ జింబాబ్వే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించాడు."కోహ్లీ చాలా ఫిట్‌గా ఉన్నాడు, ఈసారి మరిన్ని పరుగులు సాధించాలన్న కసితో ఉన్నాడు. అతడు బంతిని హిట్ చేస్తున్న తీరు చూస్తుంటే ఈ సీజన్లో పరుగుల వరద పారించడం ఖాయమనిపిస్తోంది" అని ఫ్లవర్ అన్నారు.బెంగళూరు తుది జట్టు(అంచనా): ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రాజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జాకబ్ డఫీ.చదవండి: IPL 2026: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఇదే.. వికెట్ల వీరుడు అరంగేట్రం? -
IPL 2026: ఆర్సీబీకి ఓ గుడ్ న్యూస్, ఓ బ్యాడ్ న్యూస్
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ఆర్సీబీకి ఓ గుడ్ న్యూస్, ఓ బ్యాడ్ న్యూస్ అందుతుంది. స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ సీజన్ ప్రారంభానికి ముందే జట్టుతో చేరాడు. హాజిల్‌వుడ్ ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని తొలుత ప్రచారం జరిగింది. అయితే అతను సీజన్ ప్రారంభానికి ముందే జట్టుతో కలిసి ఆర్సీబీ అభిమానుల్లో జోష్ నింపాడు. తమ బౌలింగ్ యూనిట్‌కు బ్యాక్ బోన్ అయిన హాజిల్‌వుడ్ జట్టులో చేరడంతో ఆర్సీబీ టైటిల్ నిలబెట్టుకోగలమన్న ధీమా వ్యక్తం చేస్తుంది. గత ఎడిషన్‌లో ఆర్సీబీ టైటిల్ గెలవడంలో హాజిల్ కీలకపాత్ర పోషించాడు. అందుకే ఈ సీజన్లో అతనిపై భారీ అంచనాలు ఉన్నాయి. గాయాల కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న హాజిల్‌వుడ్, ఎట్టకేలకు జట్టులో చేరడంతో ఆర్సీబీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. హాజిల్‌వుడ్‌ను ఆర్సీబీ రూ. 12.5 కోట్లకు రీటైన్ చేసుకున్న విషయం తెలిసిందే.బ్యాడ్ న్యూస్ ఏంటంటే.. రూ. 1.6 కోట్లకు రీటైన్ చేసుకోబడిన నువాన్ తుషార (శ్రీలంక) ఈ సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. ఫిట్నెస్ కారణాల చేత లంక క్రికెట్ బోర్డు అతనికి ఎన్ఓసీ మంజూరు చేయలేదు. దీంతో అతను ఐపీఎల్ 2026లో పాల్గొనడానికి అనర్హుడయ్యాడు. తుషారపై ఆర్సీబీ భారీ అంచనాలు పెట్టుకొని ఉండింది. డెత్ ఓవర్లలో అతని వైవిధ్యం జట్టుకు ఉపయోగపుడుతుందని భావించింది. అయితే చివరి నిమిషంలో ఇలా జరగడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.తుషార అంశం బయటికి రాక ముందే ఆర్సీబీ పేస్ బౌలింగ్ విభాగానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. వ్యక్తిగత కారణాల చేత లెఫ్ట్ ఆర్మ్ పేసర్ యశ్ దయాల్ సీజన్ మొత్తానికే దూరమయ్యాడు.ఈ సీజన్లో ఆర్సీబీ ఆరంభ మ్యాచ్‌తోనే తమ ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. ఢిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో మార్చి 28న జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగనుంది. ఈ సీజన్లోనూ ఆర్సీబీ రజత్ పాటిదార్ నేతృత్వంలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గత సీజన్‌తో పోలిస్తే, ఆర్సీబీలో పెద్ద మార్పులు జరగలేదు. విరాట్ కోహ్లి, టిమ్ డేవిడ్, జేకబ్ బేతెల్, కృనాల్ పాండ్యా, దేవ్‌దత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్, రొమారియో షెపర్డ్, జితేశ్ శర్మ, భువనేశ్వర్ కుమార్, హాజిల్‌వుడ్, సుయాశ్ శర్మ తదితర ఆటగాళ్లు జట్టులో కొనసాగుతున్నారు. -
‘ఆర్సీబీ ఎప్పటికీ నా డీఎన్ఏలో భాగమే’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత ఆదరణ కలిగిన ఫ్రాంచైజీల్లో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) యాజమాన్యం మారిన నేపథ్యంలో ఆ జట్టు వ్యవస్థాపక యజమాని విజయ్ మాల్యా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సుమారు రూ.16,500 కోట్లకు ఈ ఫ్రాంచైజీ విక్రయించిన తర్వాత మాల్యా తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ‘ఆర్సీబీ ఎప్పటికీ నా డీఎన్ఏలో భాగం’ అని పేర్కొన్నారు.2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు మాల్యా ఈ ఫ్రాంచైజీని రూ.450 కోట్లకు (సుమారు 111.6 మిలియన్ డాలర్లు) దక్కించుకున్నారు. ఆ సమయంలో తన నిర్ణయాన్ని చాలా మంది తప్పుబట్టారని ఆయన గుర్తుచేసుకున్నారు. ‘నేను 2008లో ఈ జట్టును కొనుగోలు చేసినప్పుడు చాలా మంది నన్ను చూసి నవ్వుతూ ఇది కేవలం ఒక ‘వానిటీ ప్రాజెక్ట్’(ప్రదర్శన కోసం చేసే ఖర్చు) అని విమర్శించారు. కానీ నా లక్ష్యం స్పష్టంగా ఉంది. రాయల్ ఛాలెంజ్ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేయడమే నా ఉద్దేశం. అందుకే జట్టుకు ఆ పేరు పెట్టాను. ఈ రోజు ఆర్సీబీ అత్యంత విలువైన ఫ్రాంచైజీగా నిలవడం గర్వంగా ఉంది’ అని మాల్యా ఎక్స్ (ట్విట్టర్)లో రాశారు.కోహ్లీ ఎంపికే నా విజయం!ప్రపంచ క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీని జట్టులోకి తీసుకోవడం తన అత్యుత్తమ నిర్ణయమని మాల్యా అభివర్ణించారు. 18 ఏళ్ల క్రితం ఒక కుర్రాడిగా కోహ్లీని గుర్తించి జట్టులో చేర్చుకున్న జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకున్నారు. కోహ్లీతో పాటు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ వంటి దిగ్గజాలను జట్టులోకి తీసుకురావడం తన అదృష్టమని పేర్కొన్నారు.I would like to heartily congratulate the new owners of RCB. I wish them the very best and Godspeed with the most valuable IPL franchise. When I bought the franchise in 2008 for INR 450 crores, most people laughed at me and criticised my investment as a vanity project. Behind my…— Vijay Mallya (@TheVijayMallya) March 26, 2026నూతన యాజమాన్యంఇటీవలే ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం (టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బ్లాక్ స్టోన్, బోల్ట్ వెంచర్స్) రూ.16,660 కోట్లకు ఆర్సీబీని కైవసం చేసుకుంది. కుమార మంగళం బిర్లా కుమారుడు ఆర్యమన్ విక్రమ్ బిర్లా ఇకపై ఈ ఫ్రాంచైజీకి సారథ్యం వహించనున్నారు. యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ తన ప్రధాన వ్యాపారంపై దృష్టి పెట్టేందుకు ప్రాంఛైజీలోని తన వాటాను విక్రయించినట్లు వెల్లడించింది.ఇదీ చదవండి: సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన? -
యశ్ దయాళ్ విషయంలో ఆర్సీబీ కీలక ప్రకటన
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు కీలక ప్రకటన చేసింది. తమ పేసర్ యశ్ దయాళ్ ఐపీఎల్-2026లో పాల్గొనడం లేదని తెలిపింది. వ్యక్తిగత కారణాల వల్ల అతడిని పక్కనపెట్టామని.. అయితే, కాంట్రాక్టు మాత్రం కొనసాగిస్తామని వెల్లడించింది.సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆర్సీబీ తొలిసారి గతేడాది ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన విషయం తెలిసిందే. ఇందులో యశ్ దయాళ్ (Yash Dayal) కూడా తన వంతు పాత్ర పోషించాడు. సీజన్ మొత్తం కలిపి 13 వికెట్లతో రాణించి జట్టును చాంపియన్‌గా నిలపడంలో తోడ్పడ్డాడు.సంచలన ఆరోపణలుఅయితే, అనూహ్య రీతిలో యశ్ దయాళ్‌పై సంచలన ఆరోపణలు వచ్చాయి. ఘజియాబాద్‌లోని ఇందిరాపురం పోలీస్ స్టేషన్లో గతేడాది జూలైలో అతడిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఐదేళ్లు తనతో రిలేషన్షిప్లో ఉండి.. పెళ్లి పేరిట మోసం చేశాడని ఓ అమ్మాయి ఫిర్యాదు చేసింది. శారీరకంగా, మానసికంగా తనను హింసించాడని.. లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది.పోక్సో కేసు కూడాఆ తర్వాత ఓ టీనేజర్ తెరమీదకు వచ్చింది. 2023 నుంచి తనపై యశ్ దయాళ్ లైంగిక దాడికి పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేయగా.. పోక్సో చట్టం కింద జైపూర్‌లో మరో కేసు నమోదైంది. ఐపీఎల్-2025 సందర్భంగానూ హోటల్ గదిలో దయాళ్ తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని సదరు టీనేజర్ ఆరోపించింది. క్రికెట్లో తనకు కెరీర్ ఆశ చూపి ఇలా చేశాడని వాపోయింది.అయితే, మొదటి కేసులో అలహాబాద్ హైకోర్టు యశ్ దయాళ్ అరెస్టు కాకుండా స్టే విధించగా.. రెండోకేసులో జైపూర్‌లోని పోక్సో కోర్టు యాంటిసిపేటరీ బెయిల్‌ను 2025 డిసెంబరులో తిరస్కరించింది. ఇందుకు సంబంధించి విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఇటీవలే యశ్ దయాళ్ ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ను పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.అతడిని ఈ సీజన్లో ఆడించము.. కానీకాగా యశ్ దయాళ్ను కొనసాగించడంపై ఆర్సీబీపై విమర్శలు రాగా.. ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మొ బొబాట్ తాజాగా స్పందించాడు. ‘‘యశ్ దయాళ్ ఈసారి జట్టుతో చేరడం లేదు. వ్యక్తిగతంగా అతడు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటి వరకు మేము అతడికి మద్దతుగానే నిలబడ్డాము.అతడిపై నమ్మకం ఉంది కాబట్టే రిటైన్ చేసుకున్నాము. అతడి కాంట్రాక్టు కొనసాగుతుంది. అతడితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాము. ఈరోజు కూడా అతడిని సంప్రదించిన తర్వాతే జట్టుతో చేర్చకూడదనే నిర్ణయానికి వచ్చాము. అతడితో పాటు జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాము. అతడికి మా మద్దతు ఉంటుంది’’ అని మొ బొబాట్ పేర్కొన్నాడు. కాగా మార్చి 28న ఐపీఎల్-2026 టోర్నీకి తెరలేవనుండగా.. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ- సన్‌రైజర్స్ తలపడతాయి. ఇందుకు చిన్నస్వామి స్టేడియం వేదిక.చదవండి: రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం.. జీతం ఎంతంటే? -
ఆర్సీబీ టికెట్ కొంటే మెట్రోలో ఫ్రీ జర్నీ
బెంగళూరు (శివాజీనగర): ఐపీఎల్ టోర్నీ ప్రారంభానికి ఒక వారం మాత్రమే గడువు ఉంది. పోటీలను స్వస్థలం బెంగళూరులోని ఎం.చిన్నస్వామి క్రీడా మైదానంలో జరిపేందుకు అనుమతి పొందిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టు తన అభిమానులకు బంపర్ ఆఫర్‌ను ఇచ్చింది. టికెట్ కొనుగోలు చేసిన వారికి ‘నమ్మ మెట్రో’లో ఆయా రోజుల్లో ఉచితంగా ప్రయాణానికి అవకాశం లభించనుంది. మెట్రో ప్రయాణపు క్యూర్ కోడ్ సైతం లభించనుంది. టికెట్ కొనుగోలు ఎలా? ఈసారి ఆర్సీబీ జట్టు స్వస్థలంలో పోటీలకు ఆన్లైన్ టికెట్లకు మాత్రమే ప్రాధాన్యత కల్పించింది. జట్టు అధికారిక వెబ్సైట్ లేదా, యాప్ ద్వారా టికెట్ కొనుగోలు చేయవచ్చు. త్వరలో టికెట్ అమ్మకాల తేదీని ప్రకటిస్తారు. ఇతర వెబ్సైట్లకు గాని వ్యక్తులకు కాని టికెట్ అమ్మకాల హక్కులు లేవు. ఐపీఎల్ ప్రారంభం ఎప్పుడు? 2026వ సంవత్సర ఐపీఎల్ టోర్నీ ఈనెల 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయమై తొలి దశ టైం టేబల్‌ను సైతం విడుదల చేశారు. పశి్చమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న కారణంగా తొలి 20 పోటీల టైం టేబల్‌ను మాత్రం ప్రకటించారు. టోర్నీ ప్రారం¿ోత్సవ పోటీల్లో ప్రస్తుతం చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైసర్స్ హైదరాబాద్ జట్లు ముఖాముఖి తలపడతాయి. ఈ పోటీలకు బెంగళూరులోని ఎం.చిన్నస్వామి క్రీడా మైదానం అతిథ్యం ఇస్తోంది. తొలి దశలో ఆర్సీబీ తలపడే మ్యాచ్‌లు: -
చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు ‘సై’
బెంగళూరు: సందిగ్ధత వీడింది. బెంగళూరు క్రికెట్ అభిమానులకు కర్ణాటక ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఈ ఏడాది యధావిధిగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 క్రికెట్ టోర్నీ మ్యాచ్‌లను బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతించింది. చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), మాజీ విజేత సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మార్చి 28న జరిగే తొలి మ్యాచ్‌తో ఐపీఎల్ 19వ సీజన్‌కు తెర లేవనుంది. కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర్‌తో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ), ఆర్సీబీ ప్రతినిధులు, ఆర్సీబీ ఈవెంట్ మెనేజ్మెంట్ సంస్థ డీఎన్ఏ ప్రతినిధులు సోమవారం సమావేశమయ్యారు. చిన్నస్వామి స్టేడియంలో అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, మ్యాచ్‌లు సాఫీగా జరిగేలా తాము తీసుకున్న భద్రతా చర్యలను ఈ సమావేశంలో వివరించారు. కేఎస్‌సీఏ, ఆర్సీబీ తీసుకున్న చర్యలపట్ల నిపుణుల కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. దాంతో చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ సీజన్లో చిన్నస్వామి స్టేడియంలో మొత్తం ఏడు ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో ఆర్సీబీ ఐదు హోం మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ ఐదు కాకుండా ఒక ప్లే ఆఫ్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ జరుగుతాయి. డిఫెండింగ్ చాంపియన్ జట్టు మైదానంలో తదుపరి సీజన్ ఫైనల్ జరగడం ఐపీఎల్లో ఆనవాయితీగా వస్తోంది. ఆర్సీబీ మరో రెండు హోం మ్యాచ్‌లు రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో ఆడుతుంది. గత ఏడాది రజత్ పాటీదార్ సారథ్యంలోని ఆర్సీబీ జట్టు సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి ఐపీఎల్ చాంపియన్‌గా అవతరించింది. అనంతరం విజయోత్సవ వేడుకలను చిన్నస్వామి స్టేడియంలో ఏర్పాటు చేశారు. అయితే ముందు జాగ్రత్తగా పకడ్బందీ ఏర్పాటు చేయకపోవడం, వేలాది సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో పరిస్థితి అదుపు తప్పి చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 11 మంది అభిమానులు మృతి చెందారు. ఈ ఉదంతంపై తీవ్రంగా స్పందించిన కర్ణాటక ప్రభుత్వం ఆర్సీబీ ఫ్రాంచైజీ నిర్వాహకులపై కేసులు నమోదు చేసింది. చిన్నస్వామి స్టేడియంలో ఎలాంటి మ్యాచ్‌లు జరగకుండా తాత్కాలిక నిషేధం విధించింది. -
IPL 2026: బెంగళూరు స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు!
ఎన్నో ప్రఖ్యాత క్రికెట్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన బెంగళూరు చిన్నస్వామి స్టేడియం ఓ ఘోరం తరువాత అపఖ్యాతి పాలైంది. అక్కడ మ్యాచ్‌లను చూడాలనే క్రికెట్ అభిమానులు, నగర వాసుల ఆకాంక్ష ఎప్పుడు తీరేనా? అని ఎదురు చూస్తున్నారు. బుధవారం ఏదో ఒకటి నిర్ధారణ కానుంది.సాక్షి బెంగళూరు: చిన్నస్వామి మైదానంలో ఐపీఎల్ క్రికెట్ పోటీల నిర్వహణపై అనుమతి గురించి బుధవారం ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. గతేడాది మార్చిలో ఆర్సీబీ విజయోత్సవాలలో చిన్నస్వామి క్రికెట్ మైదానం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృత్యువాత పడడంతో అప్పటినుంచి ఐపీఎల్ సహా అన్నిరకాల మ్యాచ్‌లను నిర్వహించడం లేదు. ఆ ఘోర ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం మైకేల్ కున్హా నేతృత్వంలో ఒక కమిటీతో విచారణ జరిపించింది. ఆ కమిటీ తనిఖీలు చేసి క్రికెట్ పోటీలు నిర్వహించాలంటే ఏమేమి భద్రతా చర్యలు తీసుకోవాలో పలు సిఫారసులు చేసింది. ఇందుకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) కూడా ఆమోదించింది. రేపు సీఎంతో భేటీలో తీర్మానం: హోంమంత్రి ఈ నేపథ్యంలో బుధవారం జరిగే ముఖ్య సమావేశంలో ఐపీఎల్ పోటీల నిర్వహణపై ఒక నిర్ణయానికి వస్తామని రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వర తెలిపారు. బెంగళూరు సదాశివనగరలో మీడియాతో మాట్లాడుతూ సోమవారం ఉదయం అధ్యక్షుడు వెంకటేశ్‌ప్రసాద్, అధికార ప్రతినిధి వినయ్ మృత్యుంజయ, ఆర్సీబీ ప్రతినిధి రాజేశ్ మీనన్ తనను కలసి మ్యాచ్‌ల నిర్వహణపై చర్చించినట్లు తెలిపారు. బెంగళూరులో ఐపీఎల్ నిర్వహణకు అనుమతివ్వాలని కోరినట్లు, ఇదే సమయంలో ఈ ఏడాది ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నామో వివరించారన్నారు. తాను సీఎం సిద్ధరామయ్యతో ఈ విషయంపై చర్చించాల్సి ఉందని, అందుకే బుధవారం ఐపీఎల్ నిర్వహణపై తుది దఫా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రజల భద్రత ప్రభుత్వం బాధ్యత అని, తొక్కిసలాటలు వంటివి పునరావృతం కాకూడదని, జీబీఏ కమిషనర్, నగర పోలీసు కమిషనర్, విద్యుత్ తదితర శాఖల ఉన్నతాధికారులతో చర్చిస్తామని తెలిపారు. తీయని వార్త రావచ్చు: వెంకటేశ్ అభిమానులకు త్వరలోనే తీయని వార్త వస్తుందని ఆశిస్తున్నట్లు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్ ప్రసాద్ తెలిపారు. హోంమంత్రిని కలసిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. వీలయినంత త్వరగా పోటీల నిర్వహణపై ఒక నిర్ణయం తీసుకోవాలని హోం మంత్రిని కోరినట్లు తెలిపారు. ప్రజల భద్రత కోసం ప్రభుత్వం సూచించిన సిఫార్సులన్నింటినీ తమ అసోసియేషన్ పూర్తిగా పాటిస్తుందని చెప్పారు. -
ఈ సాలా కూడా కప్ నమ్దే.. కుమ్మేసిన RCB..
-
ఢిల్లీ, ఆర్ సీబీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్
-
WPL-2026: ఫైనల్లో బెంగళూరు
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్లో మాజీ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టైటిల్ పోరుకు చేరింది. వరుసగా ఐదు విజయాలతో అందరికంటే ముందుగా ‘ప్లే ఆఫ్స్’ చేరిన ఆర్సీబీ జట్టు ఆపై రెండు ఓటములు ఎదుర్కొంది. అయితే చివరి పోరులో మళ్లీ సత్తా చాటి యూపీ వారియర్స్‌ని చిత్తు చేసింది. 12 పాయింట్లతో ‘టాప్’గా నిలిచిన స్మృతి మంధాన బృందం తుది పోరుకు అర్హత సాధించింది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌కు ‘జిరాక్స్’ తరహాలోనే దాదాపు ఈ మ్యాచ్ సాగింది... యూపీ గత మ్యాచ్‌లాగే సరిగ్గా 143 పరుగులే చేయగా, ఛేదనలో గ్రేస్ హారిస్ దాదాపు ఒకే తరహాలో 200కు పైగా స్ట్రయిక్‌రేట్‌తో ఒంటి చేత్తో గెలిపించింది. నాడు 47 బంతులు మిగిలి ఉండగా నెగ్గిన ఆర్సీబీ ఈసారి 41 బంతుల ముందు లక్ష్యాన్ని ఛేదించింది. స్కోర్లు సమమైన చోట వికెట్ పడకుండా ఉంటే గెలుపు అంతరం కూడా ఒకేలా ఉండేది! ఈ పరాజయంతో యూపీ వారియర్స్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్ అవకాశాలు కోల్పోయింది. వడోదర: మాజీ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండోసారి డబ్ల్యూపీఎల్ టోర్నీలో ఫైనల్లోకి అడుగు పెట్టింది. గురువారం జరిగిన తమ చివరి మ్యాచ్‌లో 2024 విజేత ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌పై నెగ్గింది. ముందుగా యూపీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. దీప్తి శర్మ (43 బంతుల్లో 55; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ నమోదు చేయగా, కెప్టెన్ మెగ్ లానింగ్ (30 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది. నదైన్ డిక్లెర్క్ (4/22) నాలుగు వికెట్లతో యూపీని దెబ్బ తీసింది. అనంతరం బెంగళూరు 13.1 ఓవర్లలో 2 వికెట్లకు 147 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గ్రేస్ హారిస్ (37 బంతుల్లో 75; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగింది. హారిస్, స్మృతి మంధాన (27 బంతుల్లో 54 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) కలిసి తొలి వికెట్‌కు 55 బంతుల్లోనే 108 పరుగులు జత చేశారు. రాణించిన ఓపెనర్లు అనూహ్యంగా తొలిసారి ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు దిగిన దీప్తి, కెప్టెన్ లానింగ్ కలిసి జట్టుకు శుభారంభం అందించారు. పవర్‌ప్లే ముగిసేసరికి యూపీ వికెట్ నష్టపోకుండా 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50 పరుగులు సాధించింది. అయితే 9వ ఓవర్ నుంచి ఆట మారిపోయింది. తన తొలి బంతికే లానింగ్‌ను అవుట్ చేసిన డిక్లెర్క్, ఐదో బంతికి ఎమీ జోన్స్ (1)ను పెవిలియన్ పంపించింది. ఆ తర్వాత తక్కువ వ్యవధిలో హర్లీన్ (14), ట్రయాన్ (6), శ్వేత సెహ్రావత్ (7) వెనుదిరగ్గా... మరో ఎండ్‌లో జాగ్రత్తగా బ్యాటింగ్ చేసిన దీప్తి 18వ ఓవర్ చివరి బంతికి 40 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. తొలి 10 ఓవర్లలో 82 పరుగులు చేసిన వారియర్స్ తర్వాతి 10 ఓవర్లలో 61 పరుగులు మాత్రమే సాధించింది. హారిస్ దూకుడు యూపీతో ఆడిన గత మ్యాచ్‌లో 40 బంతుల్లోనే 85 పరుగులు చేసిన హారిస్... ఈసారి కూడా సరిగ్గా అంతే లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అదే తరహాలో బ్యాటింగ్ చేసింది. గత మ్యాచ్‌లో బౌండరీల ద్వారా 70 పరుగులు రాబట్టిన ఆమె ఈసారి బౌండరీలతో 64 పరుగులు సాధించింది! పవర్‌ప్లేలో జట్టు 63 పరుగులు చేయగా, హారిస్ వాటానే 49 పరుగులు కావడం విశేషం. ఆ తర్వాత శోభన ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన ఆమె 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకుంది. ఎట్టకేలకు ఆర్సీబీ విజయానికి 36 పరుగులు చేయాల్సిన దశలో హారిస్‌ను అవుట్ చేయగలిగినా ...స్మృతి 26 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించి మ్యాచ్‌ను ముగించింది. స్కోరు వివరాలు యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: లానింగ్ (సి) రాధ (బి) డిక్లెర్క్ 41; దీప్తి (సి) డిక్లెర్క్ (బి) శ్రేయాంక 55; జోన్స్ (ఎల్బీ) (బి) డిక్లెర్క్ 1; హర్లీన్ (బి) హారిస్ 14; ట్రయాన్ (స్టంప్డ్) రిచా (బి) హారిస్ 6; శ్వేత (సి) స్మృతి (బి) బెల్ 7; సిమ్రన్ (సి) అరుంధతి (బి) డిక్లెర్క్ 10; ఎకెల్‌స్టోన్ (ఎల్బీ) (బి) డిక్లెర్క్ 0; శోభన (నాటౌట్) 0; శిఖా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–74, 2–78, 3–95, 4–103, 5–122, 6–137, 7–138, 8–143. బౌలింగ్: బెల్ 4–0–21–1, సయాలీ 2–0–21–0, శ్రేయాంక 4–0–27–1, అరుంధతి 1–0–14–0, డిక్లెర్క్ 4–0–22–4, హారిస్ 3–0–22–2, రాధ 2–0–11–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: హారిస్ (బి) శిఖా 75; స్మృతి (నాటౌట్) 54; వోల్ (సి) సిమ్రన్ (బి) శోభన 16; రిచా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (13.1 ఓవర్లలో 2 వికెట్లకు) 147. వికెట్ల పతనం: 1–108, 2–143. బౌలింగ్: క్రాంతి 2–0–29–0, శిఖా 4–0–36–1, దీప్తి 2.1–28–0, ఎకెల్‌స్టోన్ 2–0–14–0, శోభన 2–0–24–1, ట్రయాన్ 1–0–15–0. డబ్ల్యూపీఎల్‌లో నేడుముంబై ఇండియన్స్ x గుజరాత్ జెయింట్స్ రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
రెచ్చిపోయిన ఆర్సీబీ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన వారియర్జ్
డబ్ల్యూపీఎల్ 2026 ఎడిషన్‌లో ఆర్సీబీ బౌలర్లు మరోసారి రెచ్చిపోయారు. ఇవాళ (జనవరి 29) జరుగుతున్న తమ చివరి లీగ్ మ్యాచ్‌లో కలిసికట్టుగా రాణించి, ప్రత్యర్ధిని స్వల్ప స్కోర్‌కే పరిమితం చేశారు. వడోదర వేదికగా యూపీ వారియర్జ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ.. యూపీని 143 పరుగులకే (8 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది.ఓపెనర్లు మెగ్ లాన్నింగ్ (41), దీప్తి శర్మ (55) తొలి వికెట్‌కు 49 బంతుల్లో 74 పరుగులు జోడించి శుభారంభం అందించినా.. ఆతర్వాత ఆర్సీబీ బౌలర్లు చెలరేగిపోయారు. స్వల్ప విరామాల్లో వికెట్లు తీసి వారియర్జ్‌ను కుదురుకోన్విలేదు. పేసర్ లారెన్ బెల్ (4-0-21-1) మరోసారి తన అద్భుత ప్రదర్శనను కొనసాగించగా.. నదినే డి క్లెర్క్ (4-0-22-4) వారియర్జ్ వెన్ను విరిచింది. ఆఫ్ స్పిన్నర్లు శ్రేయాంక పాటిల్ (4-0-27-1), గ్రేస్ హ్యారిస్ (3-0-22-2) కూడా అద్భుతంగా రాణించారు. రాధా యాదవ్ (2-0-11-0) వికెట్ తీయకపోయినా పొదుపుగా బౌలింగ్ చేసింది. సయాలీ సత్ఘరే (2-0-21-0), అరుంధతి రెడ్డి (1-0-14-0) ఓ మోస్తరుగా పరుగులు సమర్పించుకున్నారు. వారియర్జ్ ఇన్నింగ్స్‌లో లాన్నింగ్, దీప్తి శర్మ మినహా ఎవ్వరూ రాణించలేదు. హర్లీన్ డియోల్ (14), సిమ్రన్ షేక్ (10) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేయగా.. యామీ జోన్స్ (1), క్లో ట్రయెన్ (6), శ్వేతా సెహ్రావత్ (7), సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సోఫీ ఎక్లెస్టోన్ డకౌటైంది. ఆఖరి ఓవర్లో క్లెర్క్ 2 వికెట్లు తీసి వారియర్జ్‌ను కనీసం 150 పరుగుల మార్కును కూడా చేరుకోనివ్వలేదు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిస్తే, నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ ఎడిషన్‌లో ఆ జట్టు వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకున్న ఏకైక జట్టుగా చలామణి అవుతంది. అయితే చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, ఫైనల్ బెర్త్ దక్కించుకునేందుకు చివరి మ్యాచ్ వరకు వేచి చూడాల్సి వచ్చింది. -
చరిత్ర సృష్టించిన ఆర్సీబీ
మహిళల ఐపీఎల్లో (WPL) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ సరికొత్త చరిత్ర సృష్టించింది. లీగ్ చరిత్రలో వరుసగా ఆరు విజయాలు సాధించిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. నిన్న (జనవరి 19) గుజరాత్ జెయింట్స్‌పై విజయం సాధించిన ఈ జట్టు.. అంతకుముందు ఇదే ఎడిషన్‌లో (2026) ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్, ముంబై ఇండియన్స్‌పై వరుస విజయాలు సాధించింది. FIRST TEAM TO PLAYOFFS - ITS RCB...!!!!- The Historic moment with 6 consecutive wins. 💥 pic.twitter.com/ufVqDnuPZq— Johns. (@CricCrazyJohns) January 19, 2026అంతకుముందు ఎడిషన్‌లో (2025) తమ చివరి మ్యాచ్‌లోనూ ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించిన ఆర్సీబీ.. డబ్ల్యూపీఎల్‌లో వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది. లీగ్ చరిత్రలో ఏ జట్టు వరుసగా ఇన్ని మ్యాచ్‌ల్లో విజయాలు సాధించలేదు. గతంలో ముంబై ఇండియన్స్ రెండు సార్లు వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. ఆర్సీబీనే గతంలో ఓ సారి వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలుపొందింది.ప్లే ఆఫ్స్‌కు ఆర్సీబీతాజాగా గుజరాత్ జెయింట్స్‌పై విజయంతో ఆర్సీబీ ఈ ఎడిషన్‌లో ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ప్లే ఆఫ్స్‌కు ముందు ఆ జట్టు ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. 24న ఢిల్లీతో, 26న ముంబై ఇండియన్స్‌తో, 29న యూపీతో తలపడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో ఓడినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌లో ఉంటుంది.నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీ అన్ని విభాగాల్లో సత్తా చాటి గుజరాత్‌ను 61 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసి, అనామక ప్లేయర్ గౌతమి నాయక్ (55 బంతుల్లో 73; 7 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. మంధన (26), రిచా ఘోష్ (27) ఓ మోస్తరు స్కోర్లతో రాణించగా.. ఆఖర్లో రాధా యాదవ్ (17), శ్రేయాంక పాటిల్ (8 నాటౌట్) బ్యాట్ ఝులిపించారు. గుజరాత్ బౌలర్లలో కశ్వీ గౌతమ్, ఆష్లే గార్డ్నర్ తలో 2, రేణుకా సింగ్, సోఫి డివైన్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం 179 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ పూర్తిగా చేతులెత్తేసింది. సయాలి సత్ఘరే (4-0-21-3), డి క్లెర్క్ (4-0-17-2), లారెన్ బెల్ (4-1-23-1), రాధా యాదవ్ (4-0-34-1), శ్రేయాంక పాటిల్ (4-0-19-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 117 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో ఆష్లే గార్డ్నర్ (54) ఒంటరిపోరాటం చేసినా, ప్రయోజనం లేకుండా పోయింది. అనుష్క శర్మ (18), భారతి ఫుల్మాలి (14), తనుజా కన్వర్ (11 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
చెలరేగిన గౌతమి నాయక్.. ఆర్సీబీ భారీ స్కోర్
మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో ఆర్సీబీ తమ జోరును కొనసాగిస్తుంది. ఈ ఎడిషన్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేసిన ఆ జట్టు.. ఇవాళ (జనవరి 19) గుజరాత్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ చేసి భారీ స్కోర్ చేసింది.టాస్ ఓడి ప్రత్యర్థి ఆహ్వానం మేరకు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బరిలోకి దిగిన గౌతమి నాయక్ ఊహించని రీతిలో చెలరేగింది. 55 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 73 పరుగులు చేసింది. స్టార్ ప్లేయర్ మంధనతో (26) కలిసి మూడో వికెట్‌కు 60 పరుగులు జోడించింది.అనంతరం రిచా ఘోష్‌తో (27) కలిసి నాలుగో వికెట్‌కు 69 పరుగులు జోడించింది. గౌతమి నాయక్ ఔటయ్యాక ఆఖర్లో రాధా యాదవ్ (17), శ్రేయాంక పాటిల్ (8) బ్యాట్ ఝులిపించడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో గ్రేస్ హ్యారిస్, జార్జియా వాల్ తలో పరుగు చేసి ఔట్ కాగా.. డి క్లెర్క్ (4), శ్రేయాంక (8) అజేయంగా నిలిచారు.గుజరాత్ బౌలర్లలో కశ్వీ గౌతమ్, కెప్టెన్ ఆష్లే గార్డ్నర్ తలో 2 వికెట్లు తీయగా.. రేణుకా సింగ్ ఠాకూర్, సోఫి డివైన్ చెరో వికెట్ తీశారు. కాగా, ఈ ఎడిషన్‌లో ఆర్సీబీ వరుసగా డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, యూపీ వారియర్జ్, గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.ఎవరీ గౌతమి నాయక్..?మహారాష్ట్రకు చెందిన 27 ఏళ్ల గౌతమి నాయక్‌ను ఆర్సీబీ ఈ సీజన్ వేలంలో రూ. 10 లక్షలకు సొంతం చేసుకుంది. కుడి చేతి వాటం స్పిన్ బౌలింగ్ (ఆఫ్) ఆల్‌రౌండర్ అయిన ఈమెకు దేశవాలీ క్రికెట్లో హార్డ్ హిట్టర్‌గా పేరుంది. గౌతమి బరోడా, మహారాష్ట్ర జట్లకు ప్రాతినిథ్యం వహించింది. మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లో రత్నగిరి జెట్స్ తరఫున సత్తా చాటి ఆర్సీబీని ఆకర్శించింది. -
RCB vs UPW: రాయల్ ఛాలెంజర్స్ ఘన విజయం
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్ జట్టుతో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఘన విజయం సాధించింది. గ్రేస్ హారిస్ కేవలం 40 బంతుల్లో 85 పరుగులు, స్మృతి మంధాన 32 బంతుల్లో అజేయంగా 47 పరుగులు చేయడంతో ఆర్సీబీ యూపీ వారియర్స్ ను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది.నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ కేవలం 12.1 ఓవర్లలో 144 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇది డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే రాయల్ ఛాలెంజర్స్‌కు వేగవంతమైన చేజ్. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో ఇది ఆర్సీబీ జట్టుకు రెండో విజయం.అంతకుముందు టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన వారియర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేయగలింది. -
వివాదంలో విరాట్ కోహ్లి భక్తుడు
విరాట్ కోహ్లి భక్తుడు, గత సీజన్లో ఆర్సీబీ టైటిల్ గెలిచిన జట్టులో భాగమైన స్వస్తిక్ చికారా వివాదంలో చిక్కుకున్నాడు. రాధికా శర్మ అనే యువతితో అతను చేసిన అభ్యంతరకర సంభాషణ సోషల్‌మీడియాలో లీకైంది. ఇందులో చికారా రాధికాను కేఫ్ లేదా రెస్టారెంట్లో కలవాలని ఒత్తిడి చేశాడు. చికారా రాధికాను కన్పూర్‌లోని ఓ మాల్లో కలిశాడు. ఆ పరిచయంతో ఆమెను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. విసిగిపోయిన రాధికా చికారా వేధింపులను బయటపెట్టింది. చికారా తనను సోషల్ మీడియాలో స్టాక్ చేసి, ఫ్లర్ట్ మెసేజ్‌లు పంపాడని ఆధారాలతో (చాట్ స్క్రీన్షాట్లు) సహా సోషల్‌మీడియాలో షేర్ చేసింది. లీకైన ఈ చాట్ల వల్ల చికారా వ్యక్తిగత ఇమేజ్ దెబ్బతినడంతో పాటు అతని మాజీ జట్టు, డిఫెండింగ్ ఐపీఎల్ ఛాంపియన్ అయిన ఆర్సీబీ బ్రాండ్‌కు భంగం వాటిల్లుతుంది. క్రికెటేతర విషయాల కారణంగా ఆర్సీబీ పరువు పోవడం ఇది తొలిసారి కాదు. గతంలో వేర్వేరు ఘటనల్లో అమ్మాయిలను వేధించి, ఇబ్బంది పెట్టాడన్న కారణంగా ప్రస్తుత ఆర్సీబీ బౌలర్ యశ్ దయాల్‌పై ఘాజియాబాద్, జైపూర్‌లో కేసులు నమోదయ్యాయి. యశ్ దయాల్ ఉదంతంతోనే ఆర్సీబీ పరువు గంగలో కలిసింది. తాజాగా చికారా ఎపిసోడ్ ఆ ఫ్రాంచైజీ పరువును మరింత దిగజార్చింది. 17 సీజన్ల పాటు టైటిల్ గెలవలేకపోయినా, ఫ్రాంచైజీగా క్లీన్ ఇమేజ్ కలిగిన ఆర్సీబీ దయాల్, చికారా కారణంగా బజారుకెక్కింది. దయాల్‌ను ఆర్సీబీ 2026 మినీ వేలానికి ముందు అట్టిపెట్టుకోగా.. చికారాను విడుదల చేసింది. చికారాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. అతను ఆర్సీబీలో ఉండగా కూడా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. యూపీలో జన్మించిన 20 ఏళ్ల చికారాను ఆర్సీబీ 2024 సీజన్లో కొనుగోలు చేసింది. కుడి చేతి వాటం ఓపెనింగ్ బ్యాటర్ అయిన చికారా విరాట్ కోహ్లిని దేవుడి కంటే ఎక్కువగా కొలుస్తాడు. ఆర్సీబీలో ఉండగా అతనెప్పుడూ విరాట్ వెంటే ఉండేవాడు. కొన్ని సందర్భాల్లో విరాట్ చికారా అతి వినయానికి తట్టుకోలేక కోపడ్డాడని కూడా వార్తలు వచ్చాయి. చికారా విరాట్‌ను బాగా విసిగించేవాడని ప్రచారం ఉంది.మొత్తంగా యశ్ దయాల్, చికారా ఉదంతాలు ఆర్సీబీ ప్రతిష్ట దెబ్బ తీశాయి. దీనిపై ఆ ఫ్రాంచైజీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆటగాళ్లను ఎంపిక చేసుకునేప్పుడు వారి బ్యాక్ గ్రౌండ్ కూడా చెక్ చేసుకోవాలని ఫ్రాంచైజీ యాజమాన్యానికి సూచిస్తున్నారు.కాగా, ఆర్సీబీ 17 సీజన్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం గత సీజన్లోనే తమ తొలి ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో పంజాబ్‌పై జయకేతనం ఎగురవేసి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ గెలుపును ఆర్సీబీ ఆటగాళ్లు దిగ్గజ ప్లేయర్ విరాట్ కోహ్లికి అంకితమిచ్చారు. ఈ గెలుపుతో విరాట్ కోహ్లి పాత్ర కూడా చాలా ఉంది. సీజన్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించి టైటిల్ కలను నెరవేర్చుకున్నాడు. అయితే ఈ సంతోషం ఆర్సీబీకి కానీ విరాట్ కోహ్లికి కానీ ఎన్నో గంటలు మిగల్లేదు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడయంలో జరిగిన విజయోత్సవ వేడుకలో తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఈ కారణంగా బెంగళూరు ఇప్పుడు ఆర్సీబీకి హోం గ్రౌండ్ అయ్యే అర్హత కూడా కోల్పోనుందని తెలుస్తుంది. ఈ ఘటనపై విరాట్ కోహ్లి చాలా విచారం వ్యక్తం చేశాడు. -
విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన కృనాల్ పాండ్యా
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీకి గ్రేట్ న్యూస్ అందుతుంది. ఆ ఫ్రాంచైజీ స్టార్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. బ్యాట్‌తో పోలిస్తే బంతితో మెరుగ్గా రాణించే కృనాల్.. విజయ్ హజారే ట్రోఫీలో బ్యాట్‌తోనూ చెలరేగుతున్నాడు. ఈ టోర్నీలో వరుసగా బెంగాల్ (63 బంతుల్లో 57), ఉత్తర్ప్రదేశ్పై (77 బంతుల్లో 82) అర్ద సెంచరీలు చేసిన అతను.. ఇవాళ (డిసెంబర్ 31) హైదరాబాద్‌పై మరింత రెచ్చిపోయి విధ్వంసకర శతకం బాదాడు.కేవలం 63 బంతుల్లోనే 18 ఫోర్లు, సిక్సర్ సాయంతో అజేయమైన 109 పరుగులు చేశాడు. కృనాల్‌కు ఓపెనర్లు నిత్యా పాండ్యా (122), అమిత్ పాసి (127) సెంచరీలు కూడా తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కృనాల్ జట్టు బరోడా భారీ స్కోర్ (417-4) చేసింది. ఇదే బరోడా జట్టులో సభ్యుడైన టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. 6 బంతులు ఎదుర్కొని ఖాతా కూడా తెరవలేకపోయాడు. నిత్యా, పాసి, కృనాల్ మెరుపు శతకాలతో కదంతొక్కడంతో హైదరాబాద్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. కెప్టెన్ మిలింద్ 2, త్యాగరాజన్, వరుణ్ గౌడ్ తలో వికెట్ తీశారు. -
ఆర్సీబీకి భారీ షాకిచ్చిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్
వచ్చే ఏడాది (2026) జనవరి 9 నుంచి ప్రారంభం కాబోయే మహిళల ఐపీఎల్ 2026కు ముందు 2024 ఎడిషన్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, ఆస్ట్రేలియా ప్లేయర్ ఎల్లిస్ పెర్రీ వ్యక్తిగత కారణాల చేత సీజన్ మొత్తానికి దూరం కానుంది. పెర్రీ స్థానాన్ని ఆర్సీబీ యాజమాన్యం దేశీయ ఆల్‌రౌండర్ సయాలీ సత్ఘరేతో భర్తీ చేసింది.సత్ఘరే గతంలో గుజరాత్ జెయింట్స్ తరఫున ఆడింది. ఈ సీజన్ వేలంలో సత్ఘరేను (30 లక్షలు) ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. తాజాగా ఎల్లిస్ లీగ్ నుంచి తప్పుకోవడంతో సత్ఘరేను అదృష్టం వరించింది. ఎల్లిస్ వైదొలిగిన తర్వాత ఆర్సీబీలో నడినే డి క్లెర్క్ మాత్రమే నాణ్యమైన విదేశీ ఆల్‌రౌండర్‌గా ఉంది.ఎల్లిస్ ఆర్సీబీ 2024లో టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించింది. ఎల్లిస్‌కు డబ్ల్యూపీఎల్ మొత్తంలోనూ మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ లీగ్‌లో 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి బౌలర్ ఎల్లిసే. ఈ లీగ్‌లో ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు ఆడిన ఈ వెటరన్ ఆల్‌రౌండర్.. 8 హాఫ్ సెంచరీల సాయంతో 972 పరుగులు చేసి, 8.25 ఎకానమీతో 14 వికెట్లు తీసింది.ఢిల్లీ క్యాపిటల్స్‌కు కూడా..!డబ్ల్యూపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు కూడా భారీ షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్, ఆసీస్ ప్లేయరే అయిన అన్నాబెల్ సదర్‌ల్యాండ్ కూడా వ్యక్తిగత కారణాల చేత సీజన్ మొత్తానికే దూరం కానుంది. సదర్‌ల్యాండ్ స్థానాన్ని డీసీ యాజమాన్యం అలానా కింగ్‌తో భర్తీ చేసింది. -
ఆస్ట్రేలియాకు భారీ షాక్.. ఇక కష్టమే?
టీ20 ప్రపంచకప్-2026కు ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు విధ్వంసకర బ్యాటర్ టిమ్ డేవిడ్ తొడ కండరాల (హ్యామ్‌స్ట్రింగ్ ) గాయం బారిన పడ్డాడు. బిగ్ బాష్ లీగ్ (BBL) 2025-26 సీజన్లో భాగంగా పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా డేవిడ్(హోబర్ట్ హరికేన్స్) తొడ కండరాలు పట్టేశాయి.151 పరుగుల లక్ష్య చేధనలో హోబర్ట్ హరికేన్స్ ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన డేవిడ్.. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 26 బంతుల్లోనే 41 పరుగులు చేసి దూకుడుగా ఆడుతున్న సమయంలో అతడు అనుహ్యంగా గాయపడ్డాడు.సింగిల్ తీసే క్రమంలో అతడి కుడి తొడ వెనుక కండరాలు పట్టేశాయి. దీంతో అతడు నొప్పితో విలవిలాడాడు. ఫిజియో వచ్చి పరీక్షించిన తర్వాత, నొప్పితోనే డేవిడ్ మైదానాన్ని వీడాడు. అయితే అతడి పరిస్థితిని చూస్తుంటే గాయం తీవ్రమైనది అనిపిస్తోంది. స్కాన్ రిపోర్ట్‌ల తర్వాత అతడి గాయం తీవ్రత తేలనుంది. ఏదేమైనప్పటికి డేవిడ్ వంటి కీలక ఆటగాడు ప్రపంచకప్‌నకు ముందు గాయపడటం ఆస్ట్రేలియాను కలవరపెడుతోంది.ఒకవేళ అతడి గాయం తీవ్రత గ్రేడ్-1గా ఉంటే కోలుకోవడానికి సుమారు మూడు వారాల సమయం పడుతోంది. అదే గ్రేడ్-2 అయితే రెండు నుంచి మూడు నెలలు.. గ్రేడ్ 3 అయితే 3 నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు.డేవిడ్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అతడు త్వరగా కోలుకోవాలని ఆర్సీబీ అభిమానులు కోరుకుంటున్నారు. అదేవిధంగా టీ20 ప్రపంచకప్-2026 ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: ఐపీఎల్ వద్దంది.. కట్ చేస్తే! అక్కడ చుక్కలు చూపిస్తున్నాడు -
చిన్నస్వామిలో మ్యాచ్‌లపై సమీక్ష
బెంగళూరు: ఇటీవల ప్రాణాంతకమైన తొక్కిసలాట జరిగిన బెంగళూరు చిన్నస్వామి క్రీడా మైదానంలో మళ్లీ క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహించే విషయం పరిశీలనకు కమిటీని నియమించినట్లు హోం మంత్రి జీ.పరమేశ్వర్ తెలిపారు. సోమవారం విధానసౌధలో క్రికెట్ సంఘం అధికారులు, పోలీసు అధికారులతో ఆయన భేటీ జరిపారు. 24న విజయ్ హజారె టోర్నీ జరపడానికి క్రికెట్ సంఘం అనుమతి కోరిందన్నారు. జీబీఏ కమిషనర్ నేతృత్వంలో పలు ప్రభుత్వ శాఖలతో కమిటీని ఏర్పాటు చేశామని, స్టేడియాన్ని పరిశీలించి మార్పులు చేర్పుల గురించి ప్రభుత్వానికి నివేదికను ఇస్తుందని, దానిని బట్టి చర్యలు తీసుకుంటామన్నారు. -
దినేశ్ కార్తీక్‌కు మరో కీలక పదవి
టీమిండియా మాజీ వికెట్‌కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్‌కు మరో కీలక పదవి దక్కింది. ద హండ్రెడ్ లీగ్ 2026 సీజన్ కోసం పురుషుల లండన్ స్పిరిట్ ఫ్రాంచైజీకి బ్యాటింగ్ కోచ్ మరియు మెంటర్‌గా ఎంపికయ్యాడు. హండ్రెడ్ లీగ్‌లో డీకే ఏ ఫ్రాంచైజీతో అయిన పని చేయడం (కోచ్‌గా) ఇదే మొదటిసారి.డీకే 2025 ఐపీఎల్ సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో బ్యాటింగ్ కోచ్ మరియు మెంటర్‌గా చేరి, ఆ జట్టు మొదటి సారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అదే పోర్ట్‌ఫోలియోతో లండన్ స్పిరిట్‌తోనూ జతకట్టాడు.లండన్ స్పిరిట్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మో బోబాట్ (ఆర్సీబీ డైరెక్టర్ కూడా) డీకేను స్వాగతిస్తూ.. ఈ టీ20 ఫార్మాట్ స్పెషలిస్ట్ లండన్ స్పిరిట్‌లో చేరడం ఆనందకరం. అతని ఆలోచన విధానం ప్రత్యేకం. పొట్టి ఫార్మాట్లో డీకేకు ఉన్న అనుభవం, అతని ఉత్సాహం మా ఆటగాళ్లకు అమూల్యమవుతుందని అన్నారు. లండన్ స్పిరిట్‌తో ఒప్పందం అనంతరం డీకే భావోద్వేగానికి లోనయ్యాడు. లార్డ్స్‌లో ఇంగ్లీష్ సమ్మర్ గడపనుండటం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇదే గ్రౌండ్లో నేను భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడాను. చివరి టెస్ట్ కూడా ఇక్కడే ఆడాను. లండన్ స్పిరిట్‌తో కొత్త ప్రయాణం ప్రారంభించడం చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుందని అన్నాడు. 40 ఏళ్ల దినేశ్ కార్తీక్ భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 180 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అలాగే ఐపీఎల్లో ప్రారంభ సీజన్ (2008) నుంచి 2024 ఎడిషన్ వరకు ఆడాడు. ఈ మధ్యలో అతను వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున 257 మ్యాచ్‌లు ఆడాడు. -
పడిక్కల్ విధ్వంసకర శతకం
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో కర్ణాటక స్టార్ ఆటగాడు దేవదత్ పడిక్కల్ చెలరేగిపోయాడు. తమిళనాడుతో ఇవాళ (డిసెంబర్ 2) జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 46 బంతుల్లోనే అజేయమైన శతకం (102) బాదాడు. ఇందులో 10 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి.పడిక్కల్‌తో పాటు శరత్ (23 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), స్మరణ్ రవిచంద్రన్ (29 బంతుల్లో 46 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా సత్తా చాటడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక 3 వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోర్ చేసింది.మిగతా ఆటగాళ్లలో మయాంక్ అగర్వాల్ 24, కరుణ్ నాయర్ 4 పరుగులు చేశారు. తమిళనాడు బౌలర్లలో సోనూ యాదవ్ 2, టి నటరాజన్ ఓ వికెట్ తీశారు.కాగా, ప్రస్తుత SMAT సీజన్లో ఇప్పటికే ఏడు సెంచరీలు (పడిక్కల్‌ది కాకుండా) నమోదయ్యాయి. ముంబై ఆటగాడు ఆయుశ్ మాత్రే 2, అభిమన్యు ఈశ్వరన్, రోహన్ కున్నుమ్మల్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ఉర్విల్ పటేల్ తలో సెంచరీ చేశారు. -
IPL: సంచలన నిర్ణయం తీసుకున్న 'డుప్లెసిస్'
దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ డుప్లెసిస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకుతూ సోషల్‌మీడియాలో ఒక లేఖను పంచుకున్నాడు.. ఇప్పటి వరకు 14 సీజన్లలో అద్భుతమైన ప్రదర్శన చేసిన డుప్లెసిస్ ఈ ఏడాది వేలంలో పాల్గొనట్లేదని తాజాగా సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే, పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో ఆడతానని తెలిపాడు. డుప్లెసిస్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) కెరీర్లో ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ (CSK), పుణే(RPS),రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఢిల్లీ జట్లకు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.డుప్లెసిస్ IPL కెరీర్లో 154 మ్యాచుల్లో 4,773 పరుగులు చేశాడు. 2021లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవడంలో అతను కీలకపాత్ర పోషించాడు. అయితే, 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అతన్ని కొనుగోలు చేసింది. ఆపై కెప్టెన్‌గా నియమించింది. 14 సీజన్ల తర్వాత ఈ ఏడాదిలో జరిగే వేలంలో పాల్గొనడం లేదని తాజాగా ఇలా ప్రకటించాడు. 'ఐపీఎల్ నా ప్రయాణంలో చాలా ముఖ్యమైన భాగం. ప్రపంచ స్థాయిలో పేరు పొందిన ఆటగాళ్లతో భాగమయ్యాను. చాలా గొప్ప ఫ్రాంఛైజీలతో బరిలోకి దిగాను. భారత్‌లో నాకు మంచి స్నేహితులు ఉన్నారు. ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. ఒక వ్యక్తిగా నన్ను తీర్చిదిద్దిన జ్ఞాపకాలను ఐపీఎల్ నాకు ఇచ్చింది. నాకు అండగా ఉన్న ప్రతి కోచ్‌తో పాటు సహాయక సిబ్బంది, అభిమానులకు ధన్యవాదాలు. 14 ఏళ్ల పాటు ఈ అధ్యాయాన్ని తలుచుకుంటుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నా హృదయంలో భారత్‌కు ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. మనం తప్పకుండా మళ్లీ కలుస్తాం. ఇదీ వీడ్కొలు కాదు. ఈ ఏడాదిలో ఒక కొత్త సవాలును స్వీకరిస్తున్నాను. రాబోయే పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) సీజన్లో ఆడబోతున్నాను.' అంటూ డుప్లెసిస్ తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. -
అమ్మకానికి మరో ఐపీఎల్ టీమ్!
మెగా క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్లో మరో జట్టు యాజమాన్యం మారనుందా? ఇప్పటికే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) టీమ్‌ను అమ్మకానికి పెట్టారు. తాజాగా మరో జట్టు కూడా ఇదే బాటలో పయనిస్తోందన్న సమాచారం బయటకు వచ్చింది. ఇంతకీ ఆ రెండో జట్టు ఏది? ఈ రెండు జట్లను దక్కించుకునేందుకు పోటీ పడుతున్న కొనుగోలుదారులు ఎవరో తెలుసుకోవాలని ఉందా?ఒకటి కాదు, రెండు ఐపీఎల్ జట్లు ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయని ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయంకా (Harsh Goenka) ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆర్సీబీతో పాటు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టును విక్రయించనున్నట్టు తెలిసిందని పేర్కొన్నారు. ఈ రెండు టీమ్‌లను దక్కించుకునేందుకు నలుగురైదుగురు కొనుగోలుదారులు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. పుణే, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు లేదా అమెరికా చెందిన వారు ఈ జట్లను దక్కించుకోవచ్చన్నారు. వచ్చే ఐపీఎల్ సీజన్ నాటికి ఆర్సీబీ, ఆర్ఆర్ జట్ల యాజమాన్యం మారే అవకాశాలు ఉన్నట్టు దీన్నిబట్టి స్పష్టమవుతోంది.రాజస్థాన్ రాయల్స్ (RR) ఫ్రాంచైజీకి మనోజ్ బాదాలే యజమానిగా ఉన్నారు. ఆయనకు చెందిన ఎమర్జింగ్ మీడియా IPL లిమిటెడ్‌కు ఈ జట్టులో దాదాపు 65% వాటా ఉంది. రెడ్‌బర్డ్ క్యాపిటల్ పార్టనర్స్, మీడియా-వ్యాపార దిగ్గజం లాచ్లాన్ ముర్డోచ్ మైనారిటీ వాటాదారులుగా కొనసాగుతున్నారు. రెడ్‌బర్డ్ క్యాపిటల్ పార్టనర్స్ సుమారు 15% వాటాను కలిగి ఉంది. ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం దివంగత షేన్ వార్న్ కుటుంబానికి కూడా చిన్న షేర్ ఉన్నట్టు తెలుస్తోంది. 2008లో ఐపీఎల్ ప్రారంభమైప్పటి నుంచి రాజస్థాన్ రాయల్స్ కార్యకలాపాలు, వ్యూహాత్మక నిర్ణయాలలో మనోజ్ బాదాలే కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా, 2008లో ఐపీఎల్ తొలి టైటిల్‌ను రాజస్థాన్ రాయల్స్ గెలిచిన సంగతి క్రికెట్ అభిమానులకు గుర్తుండే ఉంటుంది.మార్చి నాటికి ఆర్సీబీ అమ్మకం పూర్తి2025 ఐపీఎల్ టైటిల్ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చే ఏడాది సీజన్‌కు ముందే అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఆర్సీబీ ఫ్రాంచైజీని విక్రయించే ప్రక్రియను నవంబర్ 5న అధికారికంగా ప్రారంభించినట్లు ప్రస్తుత యాజమాన్యం డియాజియో ధ్రువీకరించింది. అమ్మకపు ప్రక్రియ వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ముగుస్తుందని భావిస్తున్నట్టు తెలిపింది. చదవండి: స్మృతి పెళ్లి వివాదం.. చాట్లను బయటపెట్టింది నేనే..I hear, not one, but two IPL teams are now up for sale- RCB and RR. It seems clear that people want to cash in the rich valuations today. So two teams for sale and 4/5 possible buyers! Who will be the successful buyers- will it be from Pune, Ahmedabad, Mumbai, Bengaluru or USA?— Harsh Goenka (@hvgoenka) November 27, 2025 -
IPL 2026: ఆర్సీబీ అభిమానులకు చేదు వార్త
2025, జూన్ 3.. ఆర్సీబీ అభిమానుల జీవితాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, ఆ రోజు ఆర్సీబీ (RCB) తమ తొలి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. అయితే ఆర్సీబీ ఆటగాళ్లకు, ముఖ్యంగా అభిమానులకు ఆ ఆనందం ఎంతో సేపు మిగల్లేదు. మరుసటి రోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెందరో గాయపడ్డారు. అభిమానుల ఉత్సాహం, అధికారుల నిర్లక్ష్యం కలిసినప్పుడు ఎంతటి విషాదం చోటు చేసుకుంటుందో ఈ ఘటన రుజువు చేసింది.సురక్షితం కాదుఈ ఘోర విషాదంపై కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రిటైర్డ్ జడ్జి జాన్ మైఖేల్ డికున్హా నేతృత్వంలో ఓ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ చిన్నస్వామి స్టేడియం మ్యాచ్‌ల నిర్వహణకు సురక్షితం కాదని తేల్చింది. ఈ స్టేడియం భారీ జనసమూహాలు గుమి కూడటానికి అనర్హంగా ప్రకటించింది. కమిషన్ నిర్ణయం వల్ల ఆర్సీబీ 2026 ఐపీఎల్ సీజన్లో తమ హోం మ్యాచ్‌లను చిన్నస్వామి స్టేడియంలో ఆడే అవకాశం కోల్పోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సమాచారం తెలిసింది. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఆర్సీబీ తమ తాత్కాలిక హోం గ్రౌండ్‌గా పూణేలోని గహున్జే స్టేడియాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.ఓ ప్రముఖ దినపత్రిక కథనం ప్రకారం.. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ పుణేలోని గహున్జే స్టేడియాన్ని ఆర్సీబీకి తాత్కాలిక హోం గ్రౌండ్‌గా ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ అంశంపై చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. కొన్ని సాంకేతిక అంశాలు పరిష్కారమైతే, ఆర్సీబీకి పుణే వేదికగా మారే అవకాశం ఉంది.ఆర్సీబీ అభిమానులకు చేదు వార్తఈ వార్త ఆర్సీబీ అభిమానులకు తీరని శోకాన్ని కలిగిస్తుంది. 17 ఏళ్ల తర్వాత తొలి టైటిల్ సాధిస్తే.. ఆ సంతోషాన్ని హోం గ్రౌండ్లో ఆస్వాదించలేమా అని వారు వాపోతున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో తాము హోం గ్రౌండ్లో మ్యాచ్‌లు ఆడలేమని తెలిసి తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అన్నీ కుదిరి హోం గ్రౌండ్ పూణేకి మారితే ఆర్సీబీకి సొంత అభిమానులు దూరమయ్యే ప్రమాదం ఉంది. కొత్త వాతావరణంలో ఆర్సీబీ ఫ్యాన్స్ పూర్తి స్థాయిలో ఇమడటానికి చాలా సమయం పడుతుంది. ఈ విషయంపై బీసీసీఐ నుంచి కాని ఐపీఎల్ నుంచి కాని ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. చదవండి: IND vs SA: భారత తుది జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లు.. క్లారిటీ ఇచ్చిన కోచ్ -
ఆర్సీబీకి సంబంధించి మరో బిగ్ న్యూస్
ఆర్సీబీ (RCB) ఫ్రాంచైజీకి సంబంధించి మరో బిగ్ న్యూస్ అందింది. తొలుత ఫ్రాంచైజీ అమ్మకానికి పెట్టిన వార్త రాగా.. తాజాగా మహిళల ఆర్సీబీ కొత్త హెడ్ కోచ్‌ను (Malolan Rangarajan) నియమించుకుందన్న వార్త వెలువడింది. ఈ విషయాన్ని ఆర్సీబీ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది. మలోలన్ రంగరాజన్ తమిళనాడుకు చెందిన మాజీ క్రికెటర్.🚨 OFFICIAL ANNOUNCEMENT Malolan Rangarajan, a key member of the RCB support staff for the last 6 years in various roles, has now been appointed as 𝗛𝗘𝗔𝗗 𝗖𝗢𝗔𝗖𝗛 for the upcoming WPL cycle. More details, and WPL retentions announcement soon… 🤩#PlayBold #ನಮ್ಮRCB pic.twitter.com/PLiDY9sxef— Royal Challengers Bengaluru (@RCBTweets) November 6, 2025రంగరాజన్ గతంలో ఆర్సీబీ పురుషులు, మహిళల జట్లకు స్కౌట్, ఫీల్డింగ్ కోచ్‌గా పని చేశారు. 2024 సీజన్లో ఆర్సీబీని ఛాంపియన్‌గా నిలిపిన ల్యూక్ విలియమ్స్ వేరే కోచింగ్ కమిట్మెంట్స్ కారణంగా ఆర్సీబీని వీడారు. వచ్చే సీజన్ నుంచి మలోలన్ ల్యూక్ విలియమ్స్ స్థానాన్ని భర్తీ చేస్తారు.మరోవైపు ఇంగ్లండ్ మాజీ పేసర్ అన్యా ష్రబ్సోల్ (Anya Shrubsole)ను ఆర్సీబీ తమ బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేసింది. అన్యా గతంలో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధానతో కలిసి 'ది హండ్రెడ్'లో సదరన్ బ్రేవ్ తరఫున ఆడింది. ష్రబ్సోల్..గత సీజన్ వరకు బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన సునేత్ర పరంజాపే స్థానంలో బాధ్యతలు చేపట్టనుంది.అమ్మకానికి ఆర్సీబీపురుషుల ఐపీఎల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఆర్సీబీని అమ్మకానికి పెట్టినట్లు యాజమాన్యం (డియాజియో కంపెనీ) అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కు కూడా సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది. ఫ్రాంచైజీలో పెట్టుబడిదారుల కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపింది. కొత్త యజమానులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సం ముగిసే నాటికి... అంటే వచ్చే మార్చి 31వ తేదీకల్లా విక్రయ ప్రక్రియ పూర్తిచేయనుంది.చదవండి: సీఎస్కే అభిమానులకు శుభవార్త -
బెంగళూరు తొక్కిసలాటపై తొలిసారి స్పందించిన విరాట్ కోహ్లి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ యేడు ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఆనందం ఆ ఫ్రాంచైజీ ఆటగాళ్లకు కానీ, అభిమానాలకు కానీ, యాజమాన్యానికి కానీ ఎన్నో రోజుల మిగల్లేదు. ఆర్సీబీ టైటిల్ గెలిచిన మరుసటి రోజు, అంటే జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 75 మందికి పైగా గాయపడ్డారు.ఈ విషాద సంఘటనపై నాడు యావత్ క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మానవాళి మొత్తం మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. చాలా కాలం సైలెంట్‌గా ఉన్న ఆర్సీబీ యాజమాన్యం కొద్ది రోజుల కిందటే మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ప్రకటించింది.తాజాగా ఈ ఘటనపై ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి కూడా స్పందించాడు (తొలిసారి). ఆర్సీబీ అధికార వెబ్సైట్ ద్వారా తన భావాలను పంచుకున్నాడు.జూన్ 4 లాంటి విషాదాన్ని జీవితంలో ఏదీ సిద్ధం చేయదు. ఇది మా ఫ్రాంచైజీ చరిత్రలో అత్యంత ఆనందకరమైన క్షణంగా ఉండాల్సింది. కానీ విషాదంగా మారింది. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను. గాయాలపాలైన వారు పూర్తిగా కోలుకోవాలని దేవుడిని వేడుకుంటున్నాను. వారి బాధ మా కథలో భాగమైంది. ఇకపై జాగ్రత్తగా, గౌరవంతో, బాధ్యతతో ముందుకు సాగుతామని పేర్కొన్నాడు.“Nothing in life really prepares you for a heartbreak like June 4th. What should’ve been the happiest moment in our franchise’s history… turned into something tragic. I’ve been thinking of and praying for the families of those we lost… and for our fans who were injured. Your… pic.twitter.com/nsJrKDdKWB— Royal Challengers Bengaluru (@RCBTweets) September 3, 2025కాగా, బెంగళూరు దుర్ఘటనపై ఏర్పాటైన రిటైర్డ్ జడ్జి మైఖేల్ డికున్హా నేతృత్వంలోని కమిషన్ ఆర్సీబీ యాజమాన్యాన్ని బాధ్యులుగా చేసిన విషయం తెలిసిందే. తదనంతర పరిణామాల్లో ఆర్సీబీ యాజమాన్యం బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. బెంగళూరులో శ్రద్ధాంజలి స్థూపం నిర్మించనున్నట్లు వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా 6-పాయింట్ల మానిఫెస్టోను విడుదల చేసింది. -
విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన ఆర్సీబీ కెప్టెన్
ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ దులీప్ ట్రోఫీ రెండో క్వార్టర్ ఫైనల్లో విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ టోర్నీలో సెంట్రల్ జోన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రజత్.. నార్త్ ఈస్ట్ జోన్‌తో ఇవాళ (ఆగస్ట్ 28) ప్రారంభమైన మ్యాచ్‌లో కేవలం 80 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 18 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.ఈ మ్యాచ్‌లో రజత్తో పాటు మరో సెంట్రల్ జోన్ ఆటగాడు కూడా సెంచరీ చేశాడు. వన్ డౌన్లో బరిలోకి దిగిన దనిశ్ మలేవార్ 171 బంతుల్లో 25 ఫోర్ల సాయంతో 132 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. మలేవార్‌కు జతగా రజత్ పాటిదార్ 111 పరుగుల వద్ద (85 బంతుల్లో 20 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజ్‌లో ఉన్నాడు.టీ విరామం సమయానికి సెంట్రల్ జోన్ స్కోర్ వికెట్ నష్టానికి 314 పరుగులుగా (61 ఓవర్లలో) ఉంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-బిలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ జోన్ టాస్ గెలిచి సెంట్రల్ జోన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. నార్త్ ఈస్ట్ జోన్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ జోన్‌కు ఆదిలోనే షాక్ తగిలింది.ఓపెనర్ ఆయుశ్ పాండే 3 పరుగులకే ఔటయ్యాడు. ఆకాశ్ చౌదరీ బౌలింగ్‌లో హేమ్ ఛెత్రీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆయుశ్ పాండే ఔటయ్యాక సెంట్రల్ జోన్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడింది. మరో ఓపెనర్ ఆర్యన్ జుయల్ 60 పరుగుల వద్ద అనుకోకుండా గాయపడి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అనంతరం బరిలోకి దిగిన రజత్ పాటిదార్ టీ20లకు తలపిస్తూ షాట్లు ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో మలేవార్ కూడా వీలు చిక్కినప్పుడల్లా చెత్త బంతులను బౌండరీలకు తరలించి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ సెంట్రల్ జోన్‌ను ఇప్పటికే పటిష్ట స్థితిలో ఉంచారు. ఈ మ్యాచ్ గెలిస్తే సెంట్రల్ జోన్ సెమీస్‌కు చేరుతుంది. -
ఆర్సీబీని భయపెడుతున్న భువనేశ్వర్ కుమార్
వచ్చే ఐపీఎల్ సీజన్‌కు ముందు వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీని భయపెడుతున్నాడు. గత సీజన్లో ఆర్సీబీని ఛాంపియన్‌గా నిలపడంలో కీలకపాత్ర పోషించిన భువీ.. ప్రస్తుతం జరుగుతున్న ఉత్తర్‌ప్రదేశ్ టీ20 లీగ్‌లో చెత్త ప్రదర్శనలు చేస్తూ ఆందోళన కలిగిస్తున్నాడు. ఈ లీగ్‌లో లక్నో ఫాల్కన్స్‌కు ఆడుతున్న భువీ.. ఇవాళ (ఆగస్ట్ 27) మీరట్ మెవెరిక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ ఓవర్లో ఏకంగా 29 పరుగులు సమర్పించుకుని ఆర్సీబీ యాజమాన్యాన్ని, ఆ ఫ్రాంచైజీ అభిమానులను ఉలిక్కి పడేలా చేశాడు. భువీపై ఆర్సీబీ వచ్చే సీజన్లో కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో అతడి నుంచి ఇలాంటి చెత్త ప్రదర్శనలు ఆర్సీబీ యాజమాన్యాన్ని తప్పక కలవరపెడతాయి. భువీ చెత్త ప్రదర్శన ఈ ఒక్క ఓవర్‌కే పరిమితం కాలేదు. ఈ సీజన్లో అతనాడిన 5 మ్యాచ్‌ల్లోనూ ఇలాగే ఉంది. 8కిపైగా ఎకానమీతో, కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు. మీరట్‌తో జరిగిన మ్యాచ్‌లో భువీ తన తొలి మూడు ఓవర్లు బాగానే వేశాడు. అందులో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చాడు. నాలుగో ఓవర్లోనే భువీని ప్రత్యర్థి బ్యాటర్ రితురాజ్ శర్మ ఆడుకున్నాడు. మొదటి బంతిని సిక్సర్‌గా మలిచిన రితు.. ఆతర్వాత వరుసగా నాలుగు బౌండరీలు కొట్టి, చివరి బంతికి మరో సిక్సర్ బాదాడు. ఈ ఓవర్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టిన రితు 29 పరుగులు పిండుకున్నాడు. మొత్తంగా భువీ ఈ మ్యాచ్‌లో తన కోటా నాలుగు ఓవర్లు వేసి ఏకంగా 49 పరుగులు సమర్పించుకున్నాడు. భువీతో పాటు మిగతా లక్నో బౌలర్లందరినీ కూడా చెడుగుడు ఆడుకున్న మీరట్ బ్యాటర్లు తమ జట్టుకు భారీ స్కోర్‌ను అందించారు. స్వస్తిక్ చికారా (55), రితురాజ్ శర్మ (74 నాటౌట్), రింకూ సింగ్ (57), రితిక్ వట్స్ (8 బంతుల్లో 35 నాటౌట్) చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన లక్నో 18.2 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌటైంది. జీషన్ అన్సారీ (4-0-23-3), యశ్ గార్గ్ (4-0-25-3), కార్తీక్ త్యాగి (2.2-0-9-2), విజయ్ కుమార్ (3-0-20-2) లక్నోను దెబ్బకొట్టారు. లక్నో ఇన్నింగ్స్‌లో సమీర్ చౌధరీ (46) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
ఒకే బంతికి 3 సిక్సర్లు, 22 పరుగులు.. బీభత్సం సృష్టించిన ఆర్సీబీ ఆల్‌రౌండర్
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2025లో గయానా అమెజాన్ వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్సీబీ బ్యాటర్ రొమారియో షెపర్డ్ చెలరేగిపోయాడు. సెయింట్స్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 34 బంతుల్లో 7 భారీ సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో అజేయమైన 73 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. షెపర్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగినా ఈ మ్యాచ్‌లో వారియర్స్ ఓడిపోవడం కొసమెరుపు.బీభత్సం సృష్టించిన షెపర్డ్అయితే ఈ మ్యాచ్‌లో షెపర్డ్ ఓ అద్భుతమైన ఫీట్ సాధించాడు. ఒకే బంతికి 3 సిక్సర్లు సహా 22 పరుగులు రాబట్టాడు. ఒషేన్ థామస్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్ మూడో బంతికి ఇది జరిగింది. After 12.1 overs - 78/5.After 20 overs - 202/6.ITS ROMARIO SHEPHERD SHOW IN CPL - 73*(34) - 5 FOURS & 7 SIXES 🥶🔥 pic.twitter.com/UI71kIkzX6— Johns. (@CricCrazyJohns) August 27, 2025తొలుత నో బాల్ (ఒక పరుగు), ఆతర్వాత వైడ్ (మరో పరుగు), మళ్లీ నో బాల్ (1+6), మళ్లీ నో బాల్ (1+6), ఆతర్వాత మరో సిక్సర్.. ఇలా ఓ లీగల్ బంతిని ఐదు సార్లు బౌల్ చేయగా మొత్తంగా 22 పరగులు వచ్చాయి. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్ ఆడిన అనుభవం ఉన్న ఒషేన్ థామస్ లాంటి బౌలర్ ఇంత చెత్తగా బౌలింగ్ చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మొత్తంగా ఆ ఓవర్లో అతడు 10 బంతులు వేసి 33 పరుగులిచ్చాడు.మ్యాచ్ విషయానికొస్తే.. షెపర్డ్ బీభత్సం ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. 12.1 ఓవర్ల తర్వాత 78/5గా ఉన్న వారియర్స్ స్కోర్ షెపర్డ్ విధ్వంసం ధాటికి ఆతర్వాతి 47 బంతుల్లో ఏకంగా 124 పరుగులు చేసింది. షెపర్డ్‌కు ఇఫ్తికార్ అహ్మద్ (27 బంతుల్లో 33; ఫోర్, 3 సిక్సర్లు), ప్రిటోరియస్ (6 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) సహకరించారు. అంతకుముందు బెన్ మెక్‌డెర్మాట్ (18 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), షాయ్ హోప్ (27 బంతుల్లో 23; 2 ఫోర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. వారియర్స్ ఇన్నింగ్స్‌లో కెవ్లన్ ఆండర్సన్ 5, మొయిన్ అలీ 0, షిమ్రోన్ హెట్‌మైర్ 3 పరుగులు చేసి నిరాశపరిచారు. లూసియా కింగ్స్ బౌలర్లలో గాస్టన్ 2, పియెర్రీ, డేవిడ్ వీస్, ఒషేన్ థామస్ తలో వికెట్ తీశారు.అనంతరం 203 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన లూసియా కింగ్స్.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అఖీమ్ అగస్టీ (35 బంతుల్లో 73; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో మరో 11 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. లూసియా కింగ్స్ గెలుపులో టిమ్ సీఫర్ట్ (24 బంతుల్లో 37), టిమ్ డేవిడ్ (15 బంతుల్లో 25) తలో చేయి వేశారు. జాన్సన్ ఛార్లెస్ (13), రోస్టన్ ఛేజ్ (12), ఆరోన్ జోన్స్ (16) తక్కువ స్కోర్లకే ఔటైనా లూసియా కింగ్స్ సునాయాసంగా విజయం సాధించింది. వారియర్స్ బౌలర్లలో గుడకేశ్ మోటీ (4-0-32-2) ఒక్కడే కింగ్స్ బ్యాటర్లను కంట్రోల్ చేయగలిగాడు. -
పాపం పడిక్కల్.. వెంట్రుక వాసిలో సెంచరీ మిస్సయ్యాడు..!
కర్ణాటకలో జరుగుతున్న మహారాజా ట్రోఫీలో ఆర్సీబీ ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో హుబ్లీ టైగర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ లీడింగ్ రన్ స్కోరర్‌గా (11 మ్యాచ్‌ల్లో 439 పరుగులు, 5 అర్ద సెంచరీలు) కొనసాగుతున్న అతడు.. ఇవాళ (ఆగస్ట్ 26) మంగళూరు డ్రాగన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వెంట్రుక వాసిలో సెంచరీ చేజార్చుకున్నాడు. 98 పరుగుల వద్ద పడిక్కల్‌కు సెంచరీ పూర్తి చేసుకునే అవకాశం వచ్చినప్పటికీ చేజార్చుకున్నాడు. 19వ ఓవర్ ఐదో బంతికి సింగిల్ మాత్రమే తీసి 99 పరుగుల వద్ద ఆగిపోయాడు. పడిక్కల్ ఆ బంతికి సింగిల్ తీయకుండా ఉండి, చివరి బంతిని ఎదుర్కొని ఉంటే సెంచరీ పూర్తి చేసకునే అవకాశం ఉండేది. అయితే సింగిల్‌తో సంతృప్తి చెందిన అతడు.. 99 పరుగుల వద్ద నాటౌట్‌గా నిలిచిపోయాడు. చివరి బంతిని ఎదుర్కొన్న మన్వంత్ కుమార్ సిక్సర్ బాది టైగర్స్ ఇన్నింగ్స్‌ను ముగించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 64 బంతులు ఎదుర్కొన్న పడిక్కల్ 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేశాడు. పడిక్కల్ రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన టైగర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. టైగర్స్ ఇన్నింగ్స్‌లో పడిక్కల్‌తో పాటు సన్‌రైజర్స్ ఆటగాడు అభినవ్ మనోహర్ కూడా చెలరేగాడు. మనోహర్ 23 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. పడిక్కల్‌తో పాటు ఓపెనర్‌గా బరిలోకి దిగిన మొహమ్మద్ తాహా 28 బంతుల్లో 37, మన్వంత్ కుమార్ 6 బంతుల్లో 16 పరుగులు చేశారు.మంగళూరు బౌలర్లలో రోనిత్ మోరే, క్రాంతి కుమార్ తలో వికెట్ తీశారు.కాగా, ఐపీఎల్ 2025లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన పడిక్కల్ తొడ కండరాల సమస్య కారణంగా సీజన్ మధ్యలోనే వైదొలిగాడు. ఆ సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడిన అతడు.. 150కి పైగా స్ట్రయిక్‌రేట్‌తో 247 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ద సెంచరీలు ఉన్నాయి. ఆ సీజన్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరడంలో పడిక్కల్ కీలకపాత్ర పోషించాడు. పడిక్కల్ వైదొలగడంతో ఆర్సీబీ అతని స్థానాన్ని మరో కర్ణాటక ఆటగాడు మయాంక్ అగర్వాల్‌తో భర్తీ చేసింది. -
ఆండీ ఫ్లవర్‌పై వేటు.. కొత్త హెడ్ కోచ్‌గా జోనాథన్ ట్రాట్
ఇంటర్నేషనల్ టీ20 లీగ్ (దుబాయ్) ఫ్రాంచైజీ గల్ఫ్ జెయింట్స్ తమ కోచింగ్ బృందంలో సమూల ప్రక్షాళన చేపట్టింది. వచ్చే సీజన్ కోసం హెడ్ కోచ్, బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, స్ట్రెంగ్త్ అండ్ కండీషనింగ్ కోచ్ పదవుల్లో కొత్త వారిని నియమించుకుంది.ఐపీఎల్ 2025లో ఆర్సీబీని ఛాంపియన్‌గా నిలబెట్టిన జింబాబ్వే మాజీ బ్యాటర్ ఆండీ ఫ్లవర్ గత ILT20 సీజన్లో గల్ఫ్ జెయింట్స్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఆండీ ఫ్లవర్ పర్యవేక్షణలో జెయింట్స్ గత సీజన్లో పేలవ ప్రదర్శన చేసింది. 10 మ్యాచ్‌ల్లో నాలుగే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. దీంతో జెయింట్స్ యాజమాన్యం ఆండీ ఫ్లవర్‌పై వేటు వేసి ఇంగ్లండ్ మాజీ ఆటగాడు జోనాథన్ ట్రాట్‌ను హెడ్ కోచ్‌గా నియమించుకుంది.అలాగే గత సీజన్లో జెయింట్స్ కోచింగ్ బృందంలో పని చేసిన ఒట్టిస్ గిబ్సన్, రిచర్డ్ హల్సాల్, గ్రాంట్ ఫ్లవర్, గ్యారీ బ్రెంట్ స్థానాల్లో బ్యాటింగ్ కోచ్‌గా ఆండ్రూ పుట్టిక్, బౌలింగ్ కోచ్‌గా షేన్ బాండ్, ఫీల్డింగ్ కోచ్‌గా జేమీ ట్రఫ్టన్, స్ట్రెంగ్త్ అండ్ కండీషనింగ్ కోచ్‌గా నికోలస్ లీను నియమించుకుంది.తమ కోచింగ్ బృందంలో సమూల ప్రక్షాళన చేసిన విషయాన్ని గల్ఫ్ జెయింట్స్ యాజమాన్యం ఇవాళ (ఆగస్ట్ 25) సోషల్‌మీడియా వేదికగా ప్రకటించింది. గల్ఫ్ జెయింట్స్ మహిళల ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన గుజరాత్ జెయింట్స్‌కు సిస్టర్ ఫ్రాంచైజీ. ఇంటర్నేషనల్ టీ20 లీగ్ అరంగేట్రం ఎడిషన్‌లో (2023) ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత గల్ఫ్ జెయింట్స్ వరుసగా రెండు ఎడిషన్లలో చెత్త ప్రదర్శన చేసింది. 2024 ఎడిషన్‌లో మూడో స్థానంలో, 2025 ఎడిషన్‌లో ఐదో స్థానంలో నిలిచింది. ఈ లీగ్ వచ్చే ఎడిషన్ 2026 జనవరి తొలి అర్ద భాగంలో ప్రారంభమవుతుంది. -
'సిరాజ్‌ను అందుకే వద్దనుకున్నాం'
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఈ ఏడాది ఐపీఎల్ విజేతగా నిలిచి 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికింది. ఇండియన్ ప్రీమియల్ లీగ్ మెగా వేలం నుంచే ఆర్సీబీ ఆచితూచి అడుగులు వేసింది. జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, ఫిల్ సాల్ట్ వంటి ఆటగాళ్లను వేలంలో దక్కించుకుంది. అదే సమయంలో గ్లెన్ మాక్స్వెల్, మహమ్మద్ సిరాజ్‌లను వదులుకుంది. ఏడేళ్ల పాటు తమ జట్టులో ఉన్న సిరాజ్‌ను ఎందుకు వదులుకోవాల్సిందో ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్ తాజాగా వెల్లడించారు.'భారత అంతర్జాతీయ బౌలర్లను దక్కించుకోవడం అంత సులభం కాదు. సిరాజ్‌ను జట్టులో ఉంచుకోవాలా, విడుదల చేయాలా లేదా రైట్ టు మ్యాచ్ ఉపయోగించాలా అని ఆలోచించాం. దీనికి సంబంధించిన ప్రతి విషయాన్ని మేము అతనితో చర్చించాం. అయితే అది నేరుగా కాదు. కొత్త బంతితో పాటు డెత్ ఓవర్లలోనూ బౌలింగ్ చేయగల భువీని జట్టులోకి తీసుకోవాలని గట్టిగా ప్రయత్నించాం. దీంతో సిరాజ్‌ను కొనసాగించడం కుదరదని అర్థమైంది. ఇదొక్కటే కాదు, ఇతర అంశాలు కూడా ఉన్నాయి. సిరాజ్ గురించే ఎక్కువగా చర్చించామ'ని క్రిక్‌బజ్‌తో మో బోబాట్ చెప్పారు. ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను గాయం కారణంగా మాత్రమే నిలుపుకోలేదని వెల్లడించారు. అతడు ఫిట్‌గా ఉంటే తమతో పాటు కొనసాగించేవాళ్లమని తెలిపారు.సిరాజ్‌కు రూ.12.25 కోట్లుఐపీఎల్లో మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) ఆర్సీబీ తరపున 102 మ్యాచ్‌లు ఆడి 99 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో హాజిల్‌వుడ్‌ను రూ.12.50 కోట్లకు, భువనేశ్వర్‌ను రూ.10.75 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది. రూ.12.25 కోట్లకు సిరాజ్‌ను గుజరాత్ టైటాన్స్‌కు సొంతం చేసుకుంది. ఈ సీజన్లో గుజరాత్ తరఫున సిరాజ్ 15 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. ఆర్సీబీ తరపున 14 మ్యాచ్‌ల్లో భువనేశ్వర్ 17 వికెట్లు తీశాడు. హాజిల్‌వుడ్ 12 మ్యాచ్‌లు ఆడి 22 వికెట్లు దక్కించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ 25 వికెట్లతో టాప్‌లో నిలిచి పర్పుల్ క్యాప్ అందుకున్న సంగతి తెలిసిందే.సిరాజ్‌పై ప్రశంసలుమరోవైపు ఇటీవల ఇంగ్లండ్‌లో ముగిసిన టెస్ట్ సిరీస్‌లో అద్భుతంగా రాణించి సిరాజ్ అందరి ప్రశంసలు అందుకున్నాడు. ముఖ్యంగా చివరి టెస్ట్ మ్యాచ్‌లో ఈ హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ ప్రదర్శన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌ను టీమిండియా సమం చేయడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించడంతో అతడి పేరు మీడియాలో మార్మోగిపోయింది. -
వరల్డ్‌కప్ మ్యాచ్‌ల నిర్వహణ హక్కులను కోల్పోయిన ఆర్సీబీ హోం గ్రౌండ్
ఆర్సీబీ ఐపీఎల్ 2025 విజయోత్సవాల్లో జరిగిన తొక్కిసలాట బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంకు మాయని మచ్చగా మిగిలిపోనుంది. ఈ స్డేడియం తాజాగా మహిళల వన్డే వరల్డ్‌కప్ మ్యాచ్‌ల నిర్వహణ హక్కులను కోల్పోయింది. షెడ్యూల్ ప్రకారం మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో ఐదు మ్యాచ్‌లు చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సి ఉండింది.అయితే ఈ మ్యాచ్‌ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం ఒప్పుకోలేదని తెలుస్తుంది. ఆర్సీబీ విజయోత్సవ తొక్కిసలాటపై ఏర్పాటు చేసిన జస్టిస్ కున్హా కమిటీ చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణకు ససేమిరా అన్నట్లు సమాచారం. స్టేడియం డిజైన్, స్ట్రక్చర్ భారీ సమూహాలు గుమి కూడేందుకు సేఫ్ కాదని కున్హా కమిటీ తేల్చినట్లు తెలుస్తుంది.దీంతో చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్‌లను వేరే వేదికకు తరలించేందుకు బీసీసీఐ సిద్దమైంది. మ్యాచ్‌ల నిర్వహణ రేసులో తిరువనంతపురం ముందువరుసలో ఉన్నట్లు తెలుస్తుంది.షెడ్యూల్ ప్రకారం భారత్-శ్రీలంక మధ్య ఇనాగురల్ మ్యాచ్ సహా మరో నాలుగు మ్యాచ్‌లు చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సి ఉండింది. ఇందులో ఓ సెమీస్ సహా భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్, ఇంగ్లండ్-సౌతాఫ్రికా మ్యాచ్‌లు ఉన్నాయి.మహిళల వన్డే వరల్డ్‌కప్ సెప్టెంబర్ 30-నవంబర్ 2 మధ్యలో భారత్, శ్రీలంక దేశాల్లో పలు వేదికల్లో జరుగనుంది. కున్హా కమిటీ నివేదిక ప్రకారం.. చిన్నస్వామి స్టేడియం డిజైన్‌ను పూర్తిగా మార్చే వరకు ఈ వేదకపై ఎలాంటి క్రికెట్ మ్యాచ్‌లు జరగవు. దీన్ని బట్టి చూస్తే వచ్చే ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీకి హోం గ్రౌండ్‌గా చిన్నస్వామి స్టేడియం ఉండే అవకాశం లేనట్లే.కున్హా కమిటీ నివేదిక ఆధారంగా కొద్ది రోజుల కిందట కేఎస్‌సీఏ ఆథ్వర్యంలో జరిగే మహారాజా టీ20 టోర్నీని కూడా మైసూరుకు తరలించారు. మహిళల వన్డే వరల్డ్‌కప్‌కు ముందు జరగాల్సిన పలు ప్రాక్టీస్ మ్యాచ్‌లను కూడా చిన్నస్వామి స్టేడియం నుంచి తరలించారు. -
విజృంభించిన ఆర్సీబీ స్టార్ స్పిన్నర్.. మరోసారి విఫలమైన ప్రియాంశ్ ఆర్మ
ఆర్సీబీ స్టార్ స్పిన్నర్ సుయాశ్ శర్మ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ఆరో మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. ఈ టోర్నీలో ఔటర్ ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న సుయాశ్.. నిన్న (ఆగస్ట్ 5) పురానీ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లతో విజృంభించాడు. తన జట్టు 149 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో సుయాశ్ మ్యాజిక్ చేశాడు. 4 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఫలితంగా అతని జట్టు ప్రత్యర్థిని 14.3 ఓవర్లలో 66 పరుగులకే ఆలౌట్ చేసింది. పురానీ ఢిల్లీ పతనాన్ని శాశించడంలో సుయాశ్‌కు శౌర్య మాలిక్ (3-0-10-3) జత కలిశాడు. శివమ్ శర్మ, హర్ష్ త్యాగి తలో వికెట్ తీశారు. పురానీ ఢిల్లీ ఇన్నింగ్స్‌లో సమర్థ్ సేథ్ (18), లలిత్ యాదవ్ (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.అంతకుముందు ఔటర్ ఢిల్లీ.. ఉధవ్ మోహన్ (4-0-26-5) విజృంభించడంతో 148 పరుగులకే పరిమితమైంది. ఉధవ్ మోహన్‌తో పాటు రజ్నీశ్ దాదర్ (4-0-22-2), పర్దీప్ పరాషార్ (3-0-11-2) రాణించారు. ఔటర్ ఢిల్లీ ఇన్నింగ్స్‌లో సనత్ సాంగ్వాన్ (26) టాప్ స్కోరర్‌గా నిలువగా.. సిద్దాంత్ శర్మ (21), వరున్ యాదవ్ (18), ధృవ్ సింగ్ (19), హర్ష్ త్యాగి (17) రెండంకెల స్కోర్లు చేశారు. ఐపీఎల్ సంచలనం, పంజాబ్ కింగ్స్ విధ్వంసకర ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (16) వరుసగా రెండో మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఈ లీగ్ తొలి మ్యాచ్‌లో ఆర్మ 26 పరుగులకే పరిమితమయ్యాడు.వాస్తవానికి డీపీఎల్ 2025 ప్రారంభానికి ముందు నుంచి ప్రియాంశ్ ఆర్మపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ లీగ్ ఇనాగురల్ ఎడిషన్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడిన ఆర్య మరోసారి సీన్ రిపీట్ చేస్తాడని అంతా ఆశించారు. డీపీఎల్ అరంగేట్రం సీజన్లో ఆర్య 67.56 సగటున, 198.69 స్ట్రయిక్‌రేట్‌తో 608 పరుగులు చేసి వెలుగులోకి వచ్చాడు. ప్రియాంశ్ ఓ మ్యాచ్‌లో 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదాడు. అలాగే 50 బంతుల్లో 120 పరుగులు చేశాడు.ఆర్య ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్లో 17 మ్యాచ్‌లు ఆడి సెంచరీ, 2 అర్ద సెంచరీల సాయంతో 179.24 స్ట్రయిక్‌రేట్‌తో 475 పరుగులు చేసి పంజాబ్ ఫైనల్స్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు. -
అనుమతి లేకుండానే విజయోత్సవాలు
బెంగళూరు: ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) విజయం తర్వాత బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటకు ఆర్సీబీ యాజమాన్యం, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డీఎన్ఏ నెట్వర్క్స్ లిమిటెడ్‌తోపాటు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్(కేఎస్‌సీఏ) కారణమని కర్ణాటక ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ మేరకు ఒక నివేదికను హైకోర్టుకు సమర్పించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముందస్తుగా అనుమతి తీసుకోకుండానే విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు కర్ణాటక సర్కార్ స్పష్టంచేసింది. ఈ ర్యాలీ నిర్వహించాలని ఆర్సీబీ యాజమాన్యం, డీఎన్ఏ సంస్థ, కేఎస్‌సీఏ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు తప్పు పట్టింది. పోలీసులకు ముందుగా సమా చారం ఇవ్వలేదని, చట్టప్రకారం తీసుకోవాల్సి అనుమతులేవీ తీసుకోలేదని వెల్లడించింది. జూన్ 4న జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించగా, మరో 30 మందికిపైగా గాయపడిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ గెలిస్తే బెంగళూరులో విజయో త్సవాలు నిర్వహిస్తామంటూ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు కేవలం సమాచారం మాత్రమే ఇచ్చారని, అధికారికంగా అనుమతి తీసుకోలేదని ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఆ సమాచారంలో పూర్తి వివరాలు లేకపోవడంతో విజయోత్సవాలకు పోలీసులు అంగీకరించలేదని తెలిపింది. కేవలం సమాచారం ఇవ్వడాన్ని అనుమతి కోసం చేసుకున్న దరఖాస్తుగా పరిగణించలేమని తేల్చిచెప్పింది. అయినప్పటికీ జూన్ 4న ఆర్సీబీ టీమ్ యాజమన్యం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని, విధాన సౌధ నుంచి చిన్న స్వామి స్టేడియం ద్వారా విక్టరీ పరేడ్ నిర్వహించబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటనలు జారీ చేసిందని వెల్లడించింది. సోషల్ మీడియాలో మొదటి పోస్టు ఉదయం 7.01 గంటలకు, చివరి పోస్టు మధ్యాహ్నం 3.14 గంటలకు పెట్టినట్లు తెలిపింది. ఆన్లైన్లో ఉచిత పాసులు అందుబాటులో ఉన్నాయని యాజమాన్యం చెప్పగా, అప్పటికే జనం స్టేడియం వద్దకు చేరుకున్నారని వివ రించింది. మొత్తానికి ఆర్సీబీ యాజమాన్యం, డీఎన్ఏ నెట్వర్క్స్ లిమిటెడ్, కేఎస్‌సీఏ నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్లు ప్రభు త్వం స్పష్టంచేసింది. ఈ దుర్ఘటనకు వారే పూర్తి బాధ్యత వహించాలని పేర్కొంది. CAT says IPL Team #RCB is prima facie responsible for Bengaluru Stampede which claimed 11 lives.Police is not magician, can't be expected manage huge crowds if not given sufficient time to make arrangements, the Tribunal observed.@RCBTweets @KarnatakaCops #BengaluruStampede pic.twitter.com/2QdmvohATs— Live Law (@LiveLawIndia) July 1, 2025ఆర్సీబీ సేవకులుగా పోలీసులు బెంగళూరు తొక్కిసలాట ఘటనలో ఐపీఎస్ అధికారి వికాస్ కుమార్‌తోపాటు మరికొందరు పోలీసులను సస్పెండ్ చేయడాన్ని కర్ణాటక ప్రభుత్వం సమర్థించుకుంది. పోలీసులు ఆర్సీబీ టీమ్‌కు సేవకులుగా వ్యవహరించారని హైకోర్టుకు సమర్పించిన నివేదికలో ఆక్షేపించింది. ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయకుండానే ఆర్సీబీ విజయోత్సవాల కోసం ఏర్పాటు చేశారని ఆరోపించింది. అనుమతి ఉందో లేదో కూడా తెలుసుకోకుండా ఆర్సీబీ సేవలో తరించారని విమర్శించింది. 🚨 Karnataka Govt blames RCB for Bengaluru Stampede🚨Govt to High Court—No permission was taken for RCB’s victory paradePublic was invited without police consultationOver 3 lakh people gathered near Chinnaswamy Stadium11 people died, 50+ injured in the chaos… pic.twitter.com/KQTFFJxoWx— VIPIN_UPDATE🚨 (@Vipin_Update) July 17, 2025 -
జట్టు మారనున్న ఆర్సీబీ స్టార్ జితేశ్ శర్మ
తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును (ఆర్సీబీ) ఛాంపియన్‌గా నిలపడంతో కీలకపాత్ర పోషించిన జితేశ్ శర్మ.. రానున్న దేశవాలీ సీజన్ కోసం జట్టు మారనున్నాడు. అరంగేట్రం నుంచి గత సీజన్ వరకు విదర్భకు ప్రాతినిథ్యం వహించిన జితేశ్.. వచ్చే సీజన్ నుంచి బరోడాకు ఆడనున్నాడు. గత రంజీ సీజన్లో (2024-25) మొత్తం బెంచ్‌కే పరిమితం కావడంతో జితేశ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. జట్టు మారే విషయంలో జితేశ్‌ను బరోడా కెప్టెన్, ఆర్సీబీ సహచరుడు కృనాల్ పాండ్యా ప్రభావితం చేసినట్లు తెలుస్తుంది.విదర్భ తరఫున పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు మాత్రమే పరిమితమైన జితేశ్.. రెడ్ బాల్ ఫార్మాట్లో సత్తా చాటాలని అనుకుంటున్నాడు. ఇందుకు అతనికి సరైన అవకాశాలు కావాలి. అయితే విదర్భలో ఇది జరగడం లేదు. అందుకే అతను బరోడాకు మారాలని నిర్ణయించుకున్నాడు. విదర్భలో జితేశ్‌కు బదులు అక్షయ్ వాద్కర్కు అవకాశాలు ఎక్కువగా దొరికేవి.రైట్ హ్యాండ్ వికెట్‌కీపర్ బ్యాటర్ అయిన జితేశ్.. 2015-16 సీజన్లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేసినప్పటికీ ఇప్పటివరకు కేవలం 18 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇందులోనూ అతని ప్రదర్శన ఏమంత ఆశాజనకంగా లేదు. ఈ మ్యాచ్‌ల్లో జితేశ్ 24.48 సగటున కేవలం 661 పరుగులు మాత్రమే చేశాడు.జితేశ్ పరిమిత ఓవర్ల కెరీర్ (దేశవాలీ) విషయానికొస్తే.. అతను ఇప్పటివరకు 56 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 141 టీ20లు ఆడాడు. ఇందులో 3 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీల సాయంతో 4419 పరుగులు చేశాడు. 31 ఏళ్ల జితేశ్ తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో అత్యుత్తమంగా రాణించాడు. ఈ సీజన్లో అతను 176.35 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించి, ఆర్సీబీ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.మరో ఆర్సీబీ ఆటగాడు కూడా..!దేశవాలీ క్రికెట్లో మరో ఆర్సీబీ ఆటగాడు కూడా జట్టు మారనున్నాడు. గత ఐపీఎల్ సీజన్లో బెంచ్‌కే పరిమితమైన స్వప్నిల్ సింగ్.. రానున్న దేశవాలీ సీజన్ కోసం ఉత్తరాఖండ్ నుంచి త్రిపురకు మారనున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ అయిన స్వప్నిల్.. ఉత్తరాఖండ్ తరఫున 5 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 18 వికెట్లు తీశాడు. -
ఆర్సీబీ ప్లేయర్‌కు జాక్‌పాట్.. వేలంలో అత్యధిక ధర
నిన్న (జులై 15) జరిగిన మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20 టోర్నీ 2025 ఎడిషన్ వేలంలో ఆర్సీబీ ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ జాక్‌పాట్ కొట్టాడు. ఈ వేలంలో పడిక్కల్ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు. పడిక్కల్‌ను హుబ్లీ టైగర్స్ రూ. 13.20 లక్షలకు సొంతం చేసుకుంది. పడిక్కల్ తర్వాత ఈ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లుగా సన్‌రైజర్స్ హిట్టర్ అభినవ్ మనోహర్ (12.20 లక్షలు), కేకేఆర్ వెటరన్ మనీశ్ పాండే (12.20 లక్షలు), విధ్వత్ కావేరప్ప (10.80 లక్షలు), విద్యాధర్ పాటిల్ (8.40 లక్షలు) నిలిచారు.ఈ వేలంలో రాహుల్ ద్రవిడ్ తనయుడు సమిత్ ద్రవిడ్‌కు నిరాశ ఎదురైంది. అతన్ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. గత సీజన్లో సమిత్ మైసూర్ వారియర్స్‌కు ఆడాడు. రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో కరుణ్ నాయర్ (6.8 లక్షలు), ప్రసిద్ద్ కృష్ణ (2 లక్షలు), మయాంక్ అగర్వాల్ (14 లక్షలు) లాంటి టీమిండియా స్టార్లు ఉన్నారు.మహారాజా ట్రోఫీ 2025 ఎడిషన్ ఆగస్ట్ 11 నుంచి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మొదలుకానుంది. ఈ లీగ్‌లో మొత్తం 6 ఫ్రాంచైజీలు (మైసూర్ వారియర్స్, హుబ్లీ టైగర్స్, బెంగళూరు బ్లాస్టర్స్, శివమొగ్గ లయన్స్, మంగళూరు డ్రాగన్స్, మరియు గుల్బర్గా మిస్టిక్స్) పాల్గొంటాయి. ప్రతి ఫ్రాంచైజీ 18 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేసుకుంది.జట్ల వివరాలు..శివమొగ్గ లయన్స్కౌశిక్ వి, హార్దిక్ రాజ్, అవినాష్ బి, నిహాల్ ఉల్లాల్, విధ్వత్ కావేరప్ప, అనిరుధ జోషి, అనీశ్వర్ గౌతమ్, ధృవ్ ప్రభాకర్, సంజయ్ సి, ఆనంద్ దొడ్డమణి, సాహిల్ శర్మ, భరత్ ధురి, దీపక్ దేవాడిగ, రోహిత్ కుమార్ కె, తుషార్ సింగ్, దర్శన్ ఎంబి. మరిబసవ గౌడ, శిరీష్ బాల్గార్మైసూర్ వారియర్స్కరుణ్ నాయర్, కార్తీక్ CA, ప్రసిద్ధ్ కృష్ణ, కార్తీక్ SU, మనీష్ పాండే, గౌతమ్ K, యశోవర్ధన్ పరంతప్, వెంకటేష్ M, హర్షిల్ ధర్మాని, లంకేష్ KS, కుమార్ LR, గౌతమ్ మిశ్రా, శిఖర్ శెట్టి, సుమిత్ కుమార్, ధనుష్ గౌడ, కుశాల్ M వాధ్వాని, శరత్ శ్రీనివాస్, షమంత్మంగళూరు డ్రాగన్స్అభిలాష్ శెట్టి, మక్నీల్ నోరోన్హా, లోచన్ ఎస్ గౌడ, పరాస్ గుర్బాక్స్ ఆర్య, శరత్ బిఆర్, రోని మోర్, శ్రేయాస్ గోపాల్, మేలు క్రాంతి కుమార్, సచిన్ షిండే, అనీష్ కెవి, తిప్పా రెడ్డి, ఆదిత్య నాయర్, ఆదర్శ్ ప్రజ్వల్, అభిషేక్ ప్రభాకర్, శివరాజ్ ఎస్, పల్లవ్ కుమార్ దాస్హుబ్లీ టైగర్స్కెసి కరియప్ప, శ్రీజిత్ కెఎల్, కార్తికేయ కెపి, మాన్వత్ కుమార్ ఎల్, అభినవ్ మనోహర్, దేవదత్ పడిక్కల్, మహ్మద్ తాహా, విజయరాజ్ బి, ప్రఖర్ చతుర్వేది, సంకల్ప్ ఎస్ఎస్, సమర్థ్ నాగరాజ్, రక్షిత్ ఎస్, నితిన్ ఎస్ నాగరాజా, యష్ రాజ్ పుంజా, రితేష్ ఎల్ భత్కల్, శ్రీషా ఆచార్, నాథన్ మెల్లో, నిశిచిత్ పాయ్గుల్బర్గా మిస్టిక్స్వైషాక్ విజయ్‌కుమార్, లువ్నిత్ సిసోడియా, ప్రవీణ్ దూబే, స్మరణ్ ఆర్, సిద్ధత్ కెవి, మోనిష్ రెడ్డి, హర్ష వర్ధన్ ఖుబా, పృథ్వీరాజ్, లవిష్ కౌశల్, శీతల్ కుమార్, జాస్పర్ ఇజె, మోహిత్ బిఎ, ఫైజాన్ రైజ్, సౌరబ్ ఎమ్ ముత్తూర్, ఎస్‌జె నికిన్ జోస్, ప్రజ్వల్ పవన్, యూనిస్ అలీ బేగ్, లిఖిత్ బన్నూర్బెంగళూరు బ్లాస్టర్స్మయాంక్ అగర్వాల్, శుభాంగ్ హెగ్డే, నవీన్ MG, సూరజ్ అహుజా, A రోహన్ పాటిల్, చేతన్ LR, మొహ్సిన్ ఖాన్, విద్యాధర్ పాటిల్, సిద్ధార్థ్ అఖిల్, మాధవ్ ప్రకాష్ బజాజ్, రోహన్ నవీన్, కృతిక్ కృష్ణ, అద్విత్ ఎం శెట్టి, భువన్ మోహన్ రాజు, రోహన్ ఎం రాజు, నిరంజన్ నాయక్, ప్రతీక్ జైన్, ఇషాన్ ఎస్ -
అత్యంత విలువైన జట్టుగా ఆర్సీబీ.. పడిపోయిన సీఎస్కే.. భారీగా పెరిగిన పంజాబ్ విలువ
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 17 సీజన్ల పాటు ఒక్కసారి టైటిల్ సాధించకపోయినా సరే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు అభిమానుల్లో మంచి క్రేజ్ కొనసాగింది. 2025 సీజన్లో తొలి సారి విజేతగా నిలవడంతో ఇప్పుడు వాణిజ్యపరంగా కూడా ఆ జట్టు విలువ అమాంతం పెరిగిపోయింది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ హూలీహాన్ లోకీ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఆర్సీబీ టీమ్ విలువ అక్షరాలా 269 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2306 కోట్లు).ఈ జాబితాలో ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌ను (సీఎస్కే) వెనక్కి నెట్టిన ఆర్సీబీ టాప్కు చేరింది. ఈ సీజన్లో చెత్త ప్రదర్శనతో చివరి స్థానంలో నిలిచిన సీఎస్కే 235 మిలియన్ డాలర్లు (రూ. 2014 కోట్లు) విలువతో మూడో స్థానానికి పడిపోయింది. ముంబై ఇండియన్స్ విలువను 242 మిలియన్ డాలర్లు (రూ. 2074 కోట్లు)గా బ్యాంక్ హూలీహాన్ లెక్కగట్టింది. ఇతర ఐపీఎల్ జట్లలో కోల్‌కతా నైట్‌రైడర్స్ (రూ. 1946 కోట్లు) , సన్‌రైజర్స్ హైదరాబాద్ (రూ. 1320 కోట్లు), పంజాబ్ కింగ్స్ (రూ. 1209 కోట్లు) విలువ కలిగి ఉన్నాయి. ఈ సీజన్లో అత్యధిక వృద్ధి సాధించిన జట్టు పంజాబ్ కింగ్స్. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో ఈ సీజన్ ఫైనల్‌కు చేరిన పంజాబ్ ఏకంగా 39.6 శాతం వృద్ధి సాధించింది. మరో వైపు ఐపీఎల్ విలువ కూడా 13.8 శాతం పెరిగి 3.9 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 33 వేల కోట్లు)కు చేరింది.అత్యంత విలువైన ఐపీఎల్ జట్లు1) RCB - 269 మిలియన్లు (సుమారు రూ. 2306 కోట్లు)2) MI - 242 మిలియన్లు (రూ. 2074 కోట్లు)3) CSK - 235 మిలియన్లు (రూ. 2014 కోట్లు)4) KKR - 227 మిలియన్లు (రూ. 1946 కోట్లు) 5) SRH - 154 మిలియన్లు (రూ. 1320 కోట్లు)6) DC - 152 మిలియన్లు (రూ. 1303 కోట్లు)7) RR - 146 మిలియన్లు (రూ. 1252 కోట్లు)8) GT - 142 మిలియన్లు (రూ. 1217 కోట్లు)9) PBKS - 141 మిలియన్లు (రూ. 1209 కోట్లు)10) LSG - 122 మిలియన్లు (రూ. 1046 కోట్లు) -
ఆర్సీబీ స్టార్ క్రికెటర్‌పై మహిళ ఫిర్యాదు.. కేసు నమోదు
ఆర్సీబీ స్టార్ క్రికెటర్ యశ్ దయాల్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ యువతి యశ్ దయాల్‌పై లైంగిక వేధింపులు సహా శారీరక హింస, మానసిక వేధింపులు మరియు తప్పుడు వాగ్దానాల వంటి ఆరోపణలు చేస్తూ సీఎం గ్రీవెన్స్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసింది. Ghaziabad, UP: An FIR has been registered against cricketer Yash Dayal at PS Indirapuram, under BNS Section 69, on charges of sexual exploitation, physical violence, mental harassment and cheating by making false promises of marriage.— ANI (@ANI) July 7, 2025ఈ ఫిర్యాదు ఆధారంగా ఇందిరాపురం పోలిస్ స్టేషన్లో యశ్ దయాల్‌పై కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 69 కింద యశ్‌పై కేసు కట్టారు. పెళ్లి, ఉద్యోగం వంటి తప్పుడు వాగ్దానాలతో మోసం చేసిన ఘటనల్లో ఈ సెక్షన్ వాడతారు. ఈ కేసులో నేరం రుతువైతే పదేళ్ల వరకు శిక్ష పడుతుంది.ఫిర్యాదు ప్రకారం.. ఘజియాబాద్‌కు చెందిన యువతి దయాల్‌తో తనకు ఐదేళ్ల సంబంధం ఉందని తెలిపింది. దయాల్ తనను అతని కుటుంబానికి పరిచయం చేశాడని, వారు తనను కోడలుగా స్వాగతించారని ఆమె పేర్కొంది. సదరు యువతి గత 5 సంవత్సరాలుగా దయాల్‌తో సంబంధంలో ఉన్నట్లు చెప్పుకొచ్చింది.దయాల్ మోసాన్ని గ్రహించి నిరసన తెలిపినప్పుడు శారీరక, మానసిక వేధింపులకు గురయ్యానని ఫిర్యాదు చేసింది. దయాల్‌తో సంబంధంలో ఉన్నప్పుడు ఆర్దికంగానూ నష్టపోయానని ఆరోపించింది. దయాల్‌కు తనతో పాటు మరో ముగ్గురు మహిళలలో కూడా సంబంధాలు ఉన్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నట్లు పేర్కొంది. దయాల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాగా, 27 ఏళ్ల యశ్ దయాల్‌ను ఆర్సీబీ గత ఐపీఎల్ సీజన్‌కు ముందు రూ. 5 కోట్లకు రీటైన్ చేసుకుంది. తాజాగా ముగిసిన సీజన్లో దయాల్ 15 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసి పర్వాలేదనిపించాడు. ఈ సీజన్లో దయాల్ మంచి ఎకానమీతో బౌలింగ్ చేసి ఆర్సీబీ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. దయాల్ 2023 సీజన్లో రింకూ సింగ్‌కు బౌలింగ్ చేస్తూ చివరి ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు ఇచ్చి తొలిసారి వార్తల్లో నిలిచాడు. దయాల్ విరాట్ కోహ్లి మద్దతుతో ఆర్సీబీలో కొనసాగుతున్నాడు. -
పోలీసులంటే దేవుళ్లు కాదు
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో గత నెల 4న జరిగిన తొక్కిసలాటకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) క్రికెట్ జట్టు బాధ్యత వహించాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్(క్యాట్) పేర్కొంది. ఈ తొక్కిసలాటలో 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఐపీఎస్ అధికారి వికాశ్ కుమార్‌తోపాటు పలువురు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తనను సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ వికాశ్ కుమార్ ‘క్యాట్’ను ఆశ్రయించారు. సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు. ఆయన విజ్ఞప్తిపై క్యాట్ విచారణ జరిపింది. విజయోత్సవాలకు దాదాపు 5 లక్షల మంది తరలివచ్చారని, ఇందుకు ఆర్సీబీదే బాధ్యత అని స్పష్టంచేసింది. పోలీసుల నుంచి ముందస్తుగా అనుమతులు తీసుకోలేదని తప్పుపట్టింది. ఐపీఎల్లో ఆర్సీబీ గెలిచిన తర్వాత బెంగళూరులో విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జట్టు యాజమాన్యం హఠాత్తుగా సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో లక్షల మంది తరలివచ్చారని, వారిని అదుపులో చేయడం పోలీసులకు సాధ్యం కాలేదని వెల్లడించింది. తగినంత సమయం లేకపోవడంతో వారు ఏర్పాట్లు చేయలేకపోయారని తెలిపింది. ‘పోలీసులు కూడా మామూలు మనుషులే. వారు దేవుళ్లు కాదు. ఇంద్రజాలికులు కూడా కాదు. వారు మాయలు మహిమలు ప్రదర్శించలేరు. పోలీసుల వద్ద అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు’’అని క్యాట్ తేలి్చచెప్పింది. వికాశ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును రద్దు చేసింది. -
మరో ఫ్రాంచైజీతో ఒప్పందం చేసుకున్న ఆర్సీబీ హెడ్ కోచ్
మహిళల ఆర్సీబీ హెడ్ కోచ్ లూక్ విలియమ్స్ మహిళల హండ్రెడ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2025 సీజన్ కోసం సథరన్ బ్రేవ్ హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుత కోచ్ చార్లోట్ ఎడ్వర్డ్స్ ఇంగ్లండ్ మహిళల జట్టుకు హెడ్ కోచ్‌గా వెళ్లడంతో లూక్ నియామకం జరిగింది.లూక్ హండ్రెడ్ లీగ్ ప్రారంభ ఎడిషన్ నుంచి చార్లోట్ ఎడ్వర్డ్స్‌కు డిప్యూటీగా వ్యవహరించాడు. వీరి ఆధ్వర్యంలో బ్రేవ్ 2021, 2022 ఎడిషన్లలో రన్నరప్‌గా.. 2023 ఎడిషన్‌లో విజేతగా నిలిచింది.లూక్ మహిళల ఐపీఎల్లో స్మృతి మంధన నేతృత్వంలోని ఆర్సీబీకి తొలి టైటిల్‌ను అందించాడు. 2024 ఎడిషన్‌లో లూక్ ఆధ్వర్యంలో ఆర్సీబీ టైటిల్ ఎగరేసుకుపోయింది. లూక్‌కు మహిళల బిగ్‌బాష్ లీగ్‌లోనూ ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. అతని ఆథ్వర్యంలో అడిలైడ్ స్ట్రయికర్స్ వరుసగా 2022, 2023 ఎడిషన్లలో విజేతగా నిలిచింది.బ్రేవ్ ఫ్రాంచైజీ రానున్న సీజన్ కోసం లూక్‌తో పాటు మరో కీలక నియామకం చేపట్టింది. ఆ ఫ్రాంచైజీ తమ బ్యాటింగ్ కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ మార్కస్ ట్రెస్కోధిక్కు నియమించుకుంది. జిమ్మీ కానర్స్ స్థానంలో ట్రెస్కోధిక నియామకం జరిగింది.సథరన్ బ్రేవ్ గత సీజన్లో ఘోర ప్రదర్శన చేసింది. 8 మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయం సాధించి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచింది.2025 మహిళల హండ్రెడ్ లీగ్ కోసం సథరన్ బ్రేవ్ జట్టు.. లారా వోల్వార్డ్, డాని వ్యాట్-హాడ్జ్, మైయా బౌచియర్, లారెన్ బెల్, ఫ్రెయా కెంప్, జార్జియా ఆడమ్స్, టిల్లీ కోర్టీన్-కోల్మన్, రియానా సౌత్‌బై, సోఫీ డెవిన్, క్లోయ్ ట్రయాన్, మాడీ విలియర్స్, జోసీ గ్రోవ్స్, ఫోబ్ గ్రాహం -
విధ్వంసం సృష్టించిన ఆర్సీబీ స్టార్
మేజర్ లీగ్ క్రికెట్లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్ చెలరేగిపోయాడు. సియాటిల్ ఓర్కాస్‌తో ఇవాళ (భారతకాలమానం ప్రకారం) జరిగిన మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 31 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేశాడు. అనంతరం బౌలింగ్‌లోనూ రెచ్చిపోయాడు. 3 ఓవర్లలో కేవల 16 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.షెపర్డ్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టడంతో శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ సియాటిల్ ఓర్కాస్‌పై 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించిన యూనికార్న్స్ ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. షెపర్డ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. The ball striking of Romario Shepherd. pic.twitter.com/MvXzg673pJ— Mufaddal Vohra (@mufaddal_vohra) June 26, 2025షెపర్డ్ తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో సీఎస్కేపై 14 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు. తాజాగా అదే తరహా ప్రదర్శన చేసి వార్తల్లో నిలిచాడు. ఈ ప్రదర్శన షెపర్డ్‌కు వచ్చే ఐపీఎల్ సీజన్ రిటెన్షన్‌కు ఉపయోగపడవచ్చు. షెపర్డ్ ప్రస్తుత ఎంఎల్సీ సీజన్లో ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపిస్తున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన యూనికార్న్స్.. షెపర్డ్ (56), మాథ్యూ షార్ట్ (52) మెరుపు అర్ద సెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (34) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా ఆటగాళ్లలో ఫిన్ అలెన్ (4), సంజయ్ కృష్ణమూర్తి (4), హసన్ ఖాన్ (1), జేవియర్ బార్ట్లెట్ (3), హ్యామిల్టన్ (6) నిరాశపరిచారు. ఓర్కాస్ బౌలర్లలో హర్మీత్ సింగ్, కొయెట్జీ తలో 3 వికెట్లు తీయగా.. ఒబెద్ మెక్కాయ్, గానన్ చెరో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన ఓర్కాస్.. హరీస్ రౌఫ్ (4-0-32-4) నిప్పులు చెరగడంతో 18.2 ఓవర్లలో 144 పరుగులకే ఆలౌటైంది. రౌఫ్‌కు మాథ్యూ షార్ట్ (4-0-12-3), షెపర్డ్ (3-0-16-2), బార్ట్లెట్ (2.2-0-37-1) కూడా జత కలవడంతో ఓర్కాస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఓర్కాస్ జట్టులో ఓపెనర్ షయాన్ జహంగీర్ (40), షిమ్రోన్ హెట్‌మైర్ (30), డేవిడ్ వార్నర్ మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కైల్ మేయర్స్ (0), హెన్రిచ్ క్లాసెన్ (7) వైఫల్యాల పరంపరను కొనసాగించారు. ఈ సీజన్లో ఓర్కాస్‌కు ఇది వరుసగా ఐదో ఓటమి. ఈ ఓటమితో ఓర్కాస్ ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్లే. -
బెంగళూరు తొక్కిసలాట ఎఫెక్ట్.. విజయోత్సవాలకు బీసీసీఐ సరికొత్త నిబంధనలు
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన ఆర్సీబీ విజయోత్సవ సంబరాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఆర్సీబీ విన్నింగ్ సెలబ్రేషన్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మందికి పైగా గాయపడ్డారు.ఈ క్రమంలో భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండడానికి భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) కఠిన నియమాలను తీసుకురానుంది. ఇకపై విన్నింగ్ సెలబ్రేషన్స్, సత్కార కార్యక్రమాలు సురక్షితంగా జరిగేలా భద్రతా నియమాలను రూపొందించడానికి బీసీసీఐ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ధ్రువీకరించారు.బీసీసీఐ ప్రతిపాదించిన గైడ్‌లైన్స్ ఇవే..👉కూలింగ్-ఆఫ్ పీరియడ్: ఏ జట్టు అయినా టైటిల్ గెలిచిన తర్వాత మూడు, నాలుగు రోజుల్లోపు వేడుకలు నిర్వహించడానికి అనుమతి నిరాకరణ.👉బీసీసీఐ క్లియరెన్స్ తప్పని సరి: జట్లు ఏదైనా వేడుకను నిర్వహించే ముందు బీసీసీఐ నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాలి.👉బోర్డు నుండి లిఖిత పూర్వకంగా అనుమతి లేకుండా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు.👉భద్రతా బ్లూప్రింట్‌ను ముందే సమర్పించాలి. ఫైవ్ టైర్ సెక్యూరిటీ కచ్చితంగా ఉండాలి.👉విమానాశ్రయం నుండి కార్యక్రం జరిగే వేదిక వరకు జట్టు వెళ్లే మార్గమంతా భద్రతా ఏర్పాట్లను పరిశీలించాలి.👉ఈవెంట్ షెడ్యూల్ అంతటా ఆటగాళ్లు, సిబ్బందికి పూర్తి రక్షణ కల్పించడం.👉జిల్లా పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక అధికారుల నుండి అనుమతి పొందాలి. -
'RCB గెలిచాక ఏ ఒక్కటీ మంచి జరగడం లేదు' సింగర్ అంతమాట అన్నాడా?
పద్దెనిమిదేళ్ల నిరీక్షణ.. కోట్లాది అభిమానుల కల.. ఐపీఎల్ ట్రోఫీ. ఎట్టకేలకు కింగ్ కోహ్లి (RCB Won IPL 2025) సేన ఆ కప్పు గెలుచుకోవడంతో కేవలం కర్ణాటకలోనే కాదు దేశవ్యాప్తంగా సంబరాలు జరిగాయి. అయితే ఆర్సీబీ గెలుపు తర్వాత దేశంలో ఏదీ మంచి జరగడం లేదంటూ ఓ ట్వీట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అంటే ఆర్సీబీ విజయం తర్వాత అన్నీ అనర్థాలే జరుగుతున్నాయని దాని అర్థం. సోనూ నిగమ్ అన్న పేరుతో ఉన్న ట్వీట్ కావడంతో ఇది కచ్చితంగా సింగర్ సోనూ పనే అని చాలామంది ఫిక్సయ్యారు. అసలే కన్నడ భాషపై ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల ఇంకా అక్కడి ప్రజల ఆగ్రహం చల్లారలేదు. ఇంతలో మరోసారి కన్నడ టీమ్ గెలుపుపై ఇలా విషం చిమ్ముతున్నాడేంటి? అని నెటిజన్లు ఫైర్ అయ్యారు.అసలు నిజమిదే!ఆర్సీబీ ఐపీఎల్ గెలిచాక ప్రపంచంలో ఏదీ మంచి జరగడం లేదు అని సోనూ నిగమ్ (Sonu Nigam) ట్వీట్ చేసిన మాట వాస్తవం! కానీ ఈయన సింగర్ సోనూ నిగమ్ కాదు, బిహార్‌కు చెందిన లాయర్ సోనూ నిగమ్. ఇద్దరి పేర్లు ఒకటే కావడం.. అందులోనూ ఆయన ప్రొఫైల్‌కు బ్లూ టిక్ ఉండటంతో ఆ ట్వీట్ చేసి సింగర్ అని పలువురు పొరబడుతున్నారు. కానీ సింగర్ సోషల్ మీడియాలో ఆర్సీబీ గెలుపు గురించి ఎటువంటి విద్వేషపూరిత కామెంట్లు చేయలేదు.సోనూ నిగమ్ కన్నడ వివాదమేంటి?బెంగళూరులో సోనూ నిగమ్ ఇటీవల ఒక సంగీత కచేరీ నిర్వహించారు. ఆ సమయంలో కొందరు ప్రేక్షకులు సోనూ నిగమ్‌ను కన్నడ పాటలు పాడాలని కోరారు. "కన్నడ, కన్నడ" అని పదేపదే అరవడంతో ఆయన చిరాకు పడ్డారు. ‘కన్నడ..కన్నడ..కన్నడ.. పహల్గాంలో ఏం జరిగిందో దానికి ఇదే కారణం.. ఇప్పుడు మీరు ఏం చేశారో అలాంటి కారణంగానే ఆ దాడి జరిగింది. డిమాండ్ చేసే ముందు కనీసం మీ ముందు ఎవరున్నారో చూడండి’ అని అసహనం వ్యక్తం చేశారు.సారీ కర్ణాటకసోనూ నిగమ్ కన్నడ భాష, సంస్కృతిని అవమానించారంటూ కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భాషా విద్వేషాన్ని రెచ్చగొట్టారంటూ ఆయనపై కేసు కూడా నమోదైంది. కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆయనపై బ్యాన్ విధించినట్లు తెలుస్తోంది. దీంతో సోనూ మెట్టు దిగి వచ్చారు. కన్నడ ప్రజలు చూపించే ప్రేమ వెలకట్టలేనిది. మీ కోసం మీ భాషలో పాటలు పాడతాను. కానీ, ఆ అభిమాని నన్ను కన్నడ భాషలోనే పాడమని బెదిరించడంతో నా మనసు నొచ్చుకుంది. సారీ కర్ణాటక, నాకున్న అహం కంటే మీపై ఉన్న ప్రేమే ఎక్కువ అని క్షమాపణలు చెప్పారు.ఇటీవల జరిగిన ప్రమాదాలు⇒ జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో.. ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు.⇒ జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం పైకి ఎగిరిన కొన్ని సెకన్లలోనే మెడికల్ కాలేజీపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మంది చనిపోయారు. అలాగే మెడికల్ కాలేజీ ఉన్న 34 మంది ప్రాణాలు విడిచారు.⇒ జూన్ 15న కేదార్నాథ్ సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు. Jabse RCB IPL jeeti hai tabse duniya mein kuch bhi achcha nahi ho raha hai!— Sonu Nigam (@SonuNigamSingh) June 16, 2025 చదవండి: రామోజీ ఫిలిం సిటీ.. రాశీ, తాప్సీలకు అదే భయానక అనుభవాలు -
ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగించిన జితేశ్ శర్మ.. మెరుపు ఇన్నింగ్స్‌తో మరో టైటిల్
ఆర్సీబీ స్టార్ ఆటగాడు జితేశ్ శర్మ ఐపీఎల్ 2025 ఫామ్‌ను కొనసాగించాడు. తాజాగా ముగిసిన విదర్భ టీ20 లీగ్ ఫైనల్లో తన జట్టు NECO మాస్టర్ బ్లాస్టర్‌ను సుడిగాలి ఇన్నింగ్స్‌తో గెలిపించాడు. రెండు వారాల వ్యవధిలో జితేశ్ గెలిచిన రెండో టీ20 టైటిల్ ఇది. విదర్భ టీ20 లీగ్ ఫైనల్లో జితేశ్ జట్టు NECO మాస్టర్ బ్లాస్టర్ పరగారియా స్ట్రయికర్స్పై 7 వికెట్ల తేడాతో గెలుపొంది టైటిల్ కైవసం చేసుకుంది. ఈ గెలుపులో జితేశ్ కీలకపాత్ర పోషించాడు. 179 పరుగుల లక్ష్య ఛేదనలో జితేశ్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 14వ ఓవర్లో బ్యాటింగ్‌కు దిగి 11 బంతుల్లో 3 సిక్సర్లు, బౌండరీ సాయంతో అజేయమైన 30 పరుగులు చేశాడు. జితేశ్ ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో లక్నోపై ఏ తరహాలో సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడో, ఈ మ్యాచ్‌లోనూ అదే తరహాలో సిక్సర్‌తో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. జితేశ్ మెరుపు బ్యాటింగ్ ధాటికి అతని జట్టు మరో రెండు ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.జితేశ్ ఐపీఎల్ 2025లో ఆర్సీబీ తరఫున నాలుగో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ సీజన్లో అతను 11 ఇన్నింగ్స్‌ల్లో 261 పరుగులు చేశాడు. లక్నోతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో తాత్కాలిక కెప్టెన్‌గా బరిలోకి దిగి జితేశ్ ఆడిన సుడిగాలి ఇన్నింగ్స్ సీజన్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. ఆ ఇన్నింగ్స్‌లో జితేశ్ 33 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 85 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అయితే జితేశ్ నమ్మశక్యంకాని ఇన్నింగ్స్‌తో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. జితేశ్ విధ్వంసం ధాటికి ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ 228 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే ఛేదించింది. అదే మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మెరుపు శతకం (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) బాదాడు. జితేశ్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో పంత్ శతకానికి విలువ లేకుండా పోయింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్లోనూ జితేశ్ ఓ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 10 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 24 పరుగులు చేశాడు. ఈ పరుగులు ఆర్సీబీ గెలుపుకు దోహదపడ్డాయి. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ పంజాబ్‌ను 6 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. సీజన్ మొత్తంలో జితేశ్ ఆర్సీబీ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. -
ఆ రోజు ఏం జరిగింది?
బనశంకరి(కర్ణాటక): ఈ నెలారంభంలో ఆర్సీబీ జట్టు సంబరాల సమయంలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద సంభవించిన తొక్కిసలాట దుర్ఘటనలో బెంగళూరు నగర జిల్లా కలెక్టర్ జగదీశ్ మెజస్టీరియల్ విచారణ కొనసాగుతోంది. బుధవారం 14 మంది క్షతగాత్రుల వాంగ్మూలం నమోదు చేశారు. తొక్కిసలాటలో 11 మంది చనిపోగా, 50 మందికి పైగా గాయపడడం తెలిసిందే. కలెక్టర్ పిలుపుతో కేజీ రోడ్డులోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పలువురు బాధితులు గాయాలతోనే వచ్చారు. ఆ రోజు ఏం జరిగింది అని ఒక్కొక్కరి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. స్టేడియం అంటే భయం మోనీశ్ అనే క్షతగాత్రుడు మాట్లాడుతూ.. కలెక్టర్ నోటీస్ ఇవ్వడంతో వచ్చానని, ఘటన గురించి ప్రశ్నలు అడగడంతో సమాధానం ఇచ్చానని తెలిపారు. దుర్ఘటనకు ఆర్సీబీ మేనేజ్మెంట్, రాష్ట్ర ప్రభుత్వం తప్పు ఉందని, ఒకేసారి రెండుచోట్ల కార్యక్రమం ఏర్పాటు చేయకుండా ఉండాల్సిందన్నారు. రెండురోజులు తరువాత వేడుకలు జరపాల్సిందన్నారు. విధానసౌధ వద్ద ఎక్కువమంది పోలీసులు ఉండగా, స్టేడియం వద్ద తక్కువ సంఖ్యలో నియమించారు. ఇకపై స్టేడియంలో మ్యాచ్ చూడాలంటే భయం వేస్తుందని వాపోయాడు. ముందుగా టికెట్లు ఇచ్చినట్లయితే ఈ దుర్ఘటన జరిగేది కాదని అన్నారు. మరోవైపు నూతన పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ చిన్నస్వామి స్టేడియాన్ని పరిశీలించారు. తొక్కిసలాటలు జరిగిన గేట్ల వద్దకు వెళ్లి సమాచారం సేకరించారు. -
సీఎం సిద్ధరామయ్యపై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం
సాక్షి, బెంగళూరు: సీఎం సిద్ధరామయ్యపై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ 5న ఎం చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ అభిమానుల తొక్కిసలాటలో 11మంది దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. మంగళవారం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా తొక్కిసలాట మరణాలపై జవాబుదారీతనం, ఈ సంఘటనను ప్రభుత్వం నిర్వహించిన తీరు, దాని పర్యవసానాల గురించి పలు ప్రశ్నలను లేవనెత్తింది. ఈ సందర్భంగా సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది.ఐపీఎల్-18లో ఆర్సీబీ విజయం సాధించింది. ఇందులో భాగంగా జూన్ 5న ఆర్సీబీ టీం విజయోత్సవ వేడుకలు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగాయి. అయితే, ఈ వేడుకలు విషాదానికి దారితీశాయి. తమ అభిమాన క్రికెటర్లను వీక్షించేందుకు పరిమితి మించి పబ్లిక్ రావడం, తగు చర్యలు తీసుకోకపోవడంతో అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను కర్ణాటక హైకోర్టు.. కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఘటనకు గల కారణాలు, భవిష్యత్తులో మరోసారి ఈ తరహా విషాదాలు భవిష్యత్తులో చోటు చేసుకోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. జూన్ 10న కేసు విచారణ చేపట్టింది.ఇవాళ జరిగిన విచారణ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం తరుఫు వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్(ఏజీ)ను పలు ప్రశ్నలు సంధించింది. తొక్కిసలాట ఘటనపై విచారణను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) నుంచి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్(సీఐడీ)కి బదిలీ చేసింది. సీసీబీ ఇప్పటికే నిందితుణ్ని అరెస్ట్ చేసింది.కర్ణాటక ప్రభుత్వానికి కర్ణాటక హైకోర్టు తొమ్మిది ప్రశ్నలు 1.ఆర్సీబీ సెలబ్రేషన్స్ నిర్వహించాలని ఎప్పుడు? ఎక్కడ నిర్ణయం తీసుకున్నారు? 2.ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు?3.పబ్లిక్ని,క్రౌడ్‌ను కంట్రోల్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు?4.ఆర్సీబీ విజయోత్సవ వేడుకలకు స్టేడియం దగ్గర మెడికల్ ఎమర్జెన్సీ ఏర్పాట్లు చేశారు?5.వేడుక జరిగే సమయంలో ఎంతమంది ఉండవచ్చు అనే దానిపై ముందస్తుగా ఏదైనా అంచనా వేశారా? 6.గాయపడిన వారికి వెంటనే వైద్య సహాయం అందించారా? లేకపోతే ఎందుకు?7. గాయపడిన వారిని ఆసుపత్రులకు తీసుకెళ్లడానికి ఎంత సమయం పట్టింది?8.ఈ తరహా వేడుకలు నిర్వహణ సమయంలో 50వేలు అంతకంటే ఎక్కువ మంది జనసమూహాన్ని నిర్వహించడానికి ఏదైనా ఎలాంటి విధానాన్ని అవలబించారు? రూపొందించబడిందా?9. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏదైనా అనుమతి కోరారా?ఈ ప్రశ్నలకు ప్రభుత్వం తన సమాధానాలను సీల్డ్ కవర్లో అందించాలని కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అనంతరం కర్ణాటక ప్రభుత్వం తరుఫున ఏజే కోర్టులో తన వాదనల్ని వినిపించారు. నిందితులు తమ అరెస్టుల చట్టబద్ధతను సవాలు చేయడానికి, ఉపశమనం పొందడానికి దర్యాప్తు, అరెస్టు సంస్థల మధ్య వ్యత్యాసాన్ని ఉదహరిస్తున్నారని తెలిపారు. ఈ కారణంగా తొక్కిసలాటపై బహిరంగ కోర్టులో మరిన్ని వివరాలను వెల్లడించలేమని అన్నారు.సోమవారం, తొక్కిసలాటకు సంబంధించి అరెస్టయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రతినిధి నిఖిల్ సోసలే తన అరెస్టు చట్టవిరుద్ధమని కోర్టుకు తెలిపారు. ఈవెంట్ నిర్వహించిన డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ తన పిటిషన్లో సీఎం సిద్ధరామయ్యతో సహా పలువురు ప్రముఖుల్ని కార్యక్రమానికి ఆహ్వానించారని పేర్కొంది. వాటికి స్పందించేందుకు ఏజే సమయం కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కేసు విచారణను వాయిదా వేసింది. Shocking visuals from RCB event — people carried off after stampede, organisers failed miserably. pic.twitter.com/6RqfONWjDJ— South Asian Digest (@SADigestOnline) June 4, 2025 -
అమ్మకానికి ఆర్సీబీ..?
గత కొన్ని రోజులుగా ఆర్సీబీ అభిమానులు మిశ్రమ అనుభవాలను ఎదుర్కొంటున్నారు. జూన్ 3న ఆ జట్టు 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తమ తొలి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ గెలుపును ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్సీబీ అభిమానులు అవథుల్లేకుండా ఎంజాయ్ చేశారు. అయితే ఆ మరుసటి రోజే ఓ ఊహించని ఘటన ఆర్సీబీ అభిమానులను కృంగదీసింది. విజయోత్సవాల్లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన నుండి తేరుకోకఉందే ఆర్సీబీ అభిమానులకు మరో షాకింగ్ వార్త తెలిసింది. ఈ ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టినట్లు ఓ ప్రముఖ దినపత్రిక తమ కథనంలో పేర్కొంది. సదరు కథనం ప్రకారం, ఆర్సీబీ చేతులు మారే అవకాశం ఉంది. ప్రస్తుత యాజమాన్యం (డియాజియో అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ స్పిరిట్స్) ఆర్సీబీని సుమారు 2 బిలియన్ డాలర్లకు విక్రయించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.ఎందుకు విక్రయించాలని అనుకుంటుందంటే..?ఆర్సీబీకి భారత్‌లోనే కాక ప్రపంచవ్యాప్తంగా విశేషమైన ప్రజాదరణ ఉంది. ఈ ఫ్రాంచైజీ ఒక్కసారే టైటిల్ గెలిచినా (అది కూడా ఈ ఏడాదే) ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన బ్రాండ్లలో ఒకటిగా చలామణి అవుతుంది. దీన్నే ప్రస్తుత యాజమాన్యం క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.ఫ్రాంచైజీ యొక్క పెరుగుతున్న విలువను ఉపయోగించుకుని ఎక్కువ భాగం కాకపోయినా, కొన్ని వాటాలైనా విక్రయించాలని యునైటెడ్ స్పిరిట్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. తద్వారా యునైటెడ్ స్పిరిట్స్ భారీగా లబ్ది పొందే అవశామున్నట్లు సమాచారం. యునైటెడ్ స్పిరిట్స్ ఆర్సీబీని విక్రయించడానికి మరో కారణం కూడా ఉండొచ్చని తెలుస్తుంది. గత కొన్ని సీజన్ల నుండి బీసీసీఐ పొగాకు ఉత్పత్తులు, ఆల్కహాల్ కంటెంట్ ప్రకటనలపై అనేక ఆంక్షలు విధించింది. దీని వల్ల యునైటెడ్ స్పిరిట్స్ ఉత్పత్తుల యొక్క ప్రచారం కష్టతరం అవుతుంది. ఇది తమ కంపెనీ వృద్ధికి ఆటంకం కలిగిస్తుందని యునైటెడ్ స్పిరిట్స్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఆందోళనలో ఫ్యాన్స్ఇదిలా ఉంటే, యాజమాన్యం చేతులు మారే ప్రచారం మొదలైనప్పటి నుంచి ఆర్సీబీ అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు. వారు ఎంతగానో ఇష్టపడే ఆర్సీబీ పేరు మారుతుందేమోనని దిగాలు పడుతున్నారు.విజయ్ మాల్యా నుంచి చేజిక్కించుకున్న డియాజియోఆర్సీబీకి భారత వ్యాపారవేత్త విజయ్ మాల్యా పురుడు పోశాడు. వేర్వేరు కారణాల వల్ల మాల్యా తన స్పిరిట్స్ వ్యాపారాన్ని డియాజియోకు విక్రయించడంతో వారి భారత విభాగం 'యునైటెడ్ స్పిరిట్స్' ఆర్సీబీ యాజమాన్యాన్ని చేజిక్కించుకుంది. డియాజియో గురించి చెప్పాలంటే.. ఇది 1997లో స్థాపించబడిన బ్రిటిష్ కంపెనీ. ఈ బ్రాండ్ ఆల్కహాలిక్ మరియు నాన్ ఆల్కహాలిక్ పానీయాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్పిరిట్స్ కంపెనీ. -
బామ్మ కోరిక నెరవేర్చిన ఆర్సీబీ స్టార్
ఆర్సీబీ స్టార్ బ్యాటర్, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ జేకబ్ బేతెల్ ఓ ముసలి మహిళా అభిమాని కోరిక తీర్చాడు. వెస్టిండీస్‌తో నిన్న (జూన్ 8) జరిగిన రెండో టీ20 సందర్భంగా ఓ యువకుడు తన బామ్మ కోసం ఓ సిక్స్ కొట్టాలని బేతెల్‌ను కోరాడు. అడిగిందే తడువుగా బేతెల్ ఇన్నింగ్స్ 16వ ఓవర్లో (రెండో బంతి) సిక్సర్ కొట్టి బామ్మ కోరిక నెరవేర్చాడు. అల్జరీ జోసఫ్ వేసిన ఆ ఓవర్లో అంతకుముందు బంతికి కూడా బేతెల్ సిక్సర్ బాదాడు. అదే ఓవర్లో ఐదో బంతిని కూడా సిక్సర్‌గా మలిచిన బేతెల్, చివరి బంతికి ఔట్ కావడం కొసమెరుపు. ఈ మ్యాచ్‌లో బేతెల్ ఆడిన ఇన్నింగ్స్ ఛేదనలో ఇంగ్లండ్ గెలుపుకు దోహదపడింది. ఈ ఇన్నింగ్స్‌లో బేతెల్ 10 బంతులు ఆడి 3 సిక్సర్లు, బౌండరీ సాయంతో 26 పరుగులు చేశాడు. తద్వారా విండీస్ నిర్ధేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ మరో 9 బంతులు మిగిలుండగానే ఛేదించింది.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. జాన్సన్ ఛార్లెస్ (47), షాయ్ హోప్ (49) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. ఇన్నింగ్స్ చివర్లో రోవ్‌మన్ పావెల్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రొమారియో షెపర్డ్ (11 బంతుల్లో 19; 2 సిక్సర్లు), జేసన్ హోల్డర్ (9 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రోస్టన్ ఛేజ్ (1 బంతిలో 6 పరుగులు (నాటౌట్)) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.పావెల్, షెపర్డ్, హోల్డర్, ఛేజ్ విజృంభించడంతో విండీస్ చివరి 4 ఓవర్లలో ఏకంగా 75 పరుగులు చేసింది. ఆదిల్ రషీద్ వేసిన 19 ఓవర్లో హోల్డర్, షెపర్డ్ ఊచకోత కోశారు. ఈ ఓవర్లో ఇరువురు కలిసి 5 సిక్సర్లు బాదారు. ఫలితంగా ఆ ఓవర్లో 31 పరుగులు వచ్చాయి. అంతకుముందు 17 ఓవర్లో 20, 18వ ఓవర్లో 8, ఆఖరి ఓవర్లో 16 పరుగులు వచ్చాయి.అనంతరం 197 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 18.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసి గెలిచింది. బెన్ డకెట్ (18 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్), జోస్ బట్లర్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), హ్యారీ బ్రూక్ (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), బేతెల్ (10 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్స్‌లు), టామ్ బాంటన్ (11 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించి ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌లు సిరీస్‌ను ఇంగ్లండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో చేజిక్కించుకుంది. సిరీస్‌లోని చివరిదైన మూడో టీ20 మంగళవారం సౌతాంప్టన్‌లో జరుగుతుంది. -
నన్ను రమ్మని పిలిచారు అంతే.. నాకు ఇంకేమీ తెలీదు: సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2025 టైటిల్‌ను గెలిచిన సందర్భంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్ల సన్మానం కార్యక్రమం.. పెను విషాదాన్ని మిగిల్చింది. గతవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆ ఈవెంట్లో తొక్కిసలాట జరిగి 11 మంది మృత్యువాత పడగా, 48 మంది వరకూ గాయపడ్డారు. దీనిపై ప్రతిపక్ష బీజేపీ.. అధికార కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించింది. ప్రభుత్వం తప్పిదం వల్లే ఈ ఘోరం జరిగిందంటూ ధ్వజమెత్తింది. దీనిపై కర్ణాటక ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టినా అది ప్రభుత్వ వైఫల్యం అని విమర్శ ప్రధానంగా వినిపిస్తోంది. దీనిపై తాజాగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ‘ఆర్సీబీకి సంబంధించిన ఈవెంట్‌ను తాము నిర్వహించలేనప్పుడు ప్రభుత్వ వైఫల్యం ఎలా అవుతుందని అంటున్నారు. ‘నన్ను ఆ ఈవెంట్‌కు రమ్మని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(కేఎస్‌సీఏ) ఆహ్వానించింది. నా వద్దకు వచ్చి మరీ కేఎస్‌సీఏ పెద్దలు నన్ను ఆహ్వానించారు. గవర్నర్ కూడా ఆ ఈవెంట్‌కు వస్తున్నారని నాకు చెప్పారు. నేను కూడా ఆ ఈవెంట్‌కు వెళ్లా. అంతేకానీ మేము ఆ ఈవెంట్‌ను నిర్వహించలేదు. నన్ను రమ్మన్నారు.. వెళ్లాను.. అంతకుమించి నాకైతే ఏమీ తెలీదు’ అని స్పష్టం చేశారు. ఆ కార్యక్రమాన్ని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిందని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఐపీఎల్ టైటిల్‌ను సాధించాలనే చిరకాల కోరిక ఆర్సీబీకి ఎట్టకేలకు లభించడంతో ఆ జట్టును ఘనంగా సన్మానించాలనుకున్నారు. దాంతో ఆదరా బాదరగా ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. దీనికి పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగింది. లక్షల్లో అభిమానల హాజరుకావడంతో ఆ ఈవెంట్ కాస్తా విషాదంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ, కేఎస్‌సీఏలతో పాటు కర్ణాటక ప్రభుత్వంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీ టీమ్ పెద్ద ఈవెంట్‌ను నిర్వహిస్తంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటూ విమర్శల వర్షం కురిసింది. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే సీఎం సిద్ధరామయ్యతో పాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లు సంజాయిషీలు ఇస్తూనే వస్తున్నారు. -
ఆర్సీబీలోకి బుమ్రా, సూర్యకుమార్, పంత్: విజయ్ మాల్యా డ్రీమ్ టీమ్
ఐపీఎల్-2025 ఛాంపియన్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించిన ఆర్సీబీ.. తమ 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తొలి టైటిల్‌ను ముద్దాడింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ మాజీ యాజమాని విజయ్ మాల్యా పేరు తెరపైకి వచ్చింది.ఎందుకంటే ఆర్సీబీకి ఒక ప్రత్యేకమైన బ్రాండ్ గుర్తింపును తీసుకురావడంలో ఆయనది కీలక పాత్ర. ఐపీఎల్ ఆరంభం వేలంలో విరాట్ కోహ్లిని కూడా ఆర్సీబీ సొంతం చేసుకోవడం మాల్యా నిర్ణయమే. ఆ తర్వాత ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ వంటి దిగ్గజ క్రికెటర్లను తమ జట్టులోకి తీసుకు రావడానికి ఆయన కృషి చేశారని క్రికెట్ నిపుణులు ఇప్పటికి అభిప్రాయపడుతుంటారు. ఆర్సీబీ తొలి టైటిల్ విజయనంతరం మాల్యా సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ క్రమంలో తాజాగా రాజ్ షమానీ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాల్యా తన ఆర్సీబీ డ్రీమ్ టీమ్‌ను ఎంచుకున్నాడు. ఇప్పటికిప్పుడు బెంగళూరు జట్టులోకి ఏ ప్లేయర్లను కొనుగోలు చేస్తారన్న ప్రశ్న మాల్యాకు ఎదురైంది."నాకు అవకాశం వస్తే.. జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌ను కొనుగోలు చేస్తాను. వీరి మినహా నాకు మరెవరూ అవసరం లేదు. ఈ నలుగురు ప్లేయర్లు జట్టులో ఉంటే చాలు, ట్రోఫీ ఈజీగా గెలవచ్చు" అని మాల్యా పేర్కొన్నారు. బ్యాంకు రుణాల ఎగవేత కేసులో నిందితుడిగా ఉన్న మాల్యా.. ప్రస్తుతం లండన్‌లో తలదాచుకుంటున్నాడుచదవండి: French Open 2025: ఫ్రెంచ్ ‘క్వీన్’ కోకో.. ఫైనల్లో సబలెంకా ఓటమి -
రాష్ట్రాన్నిబట్టి న్యాయం మారుతుందా?
కర్ణాటక రాజధాని బెంగుళూరులో జరిగిన ఘోర విషాదం క్రీడాభిమానులు అందరినీ విచారంలోకి నెట్టింది. ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లో 18 ఏళ్ల ఎదురుచూపులు తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలిసారి కప్పు గెలవడంతో విజయోత్సవాలు జరిగాయి. అయితే జనం అంత స్థాయిలో వస్తారని ఊహించలేదో.. పోలీసుల నిర్లక్ష్యమో తెలియదు కాని 11 మంది నిండుప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అనేక మంది గాయాలపాలయ్యరు. దీనిపై కర్ణాటక హైకోర్టు సుమోటోగా కేసు తీసుకుంది. దీనిని స్వాగతించవచ్చు. కర్ణాటక ప్రభుత్వం బెంగుళూరు జట్టు ప్రతినిధులను అరెస్టు కూడా చేసింది. సిటీ పోలీస్ కమిషనర్‌తో సహా ఆరుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది.ఈ ఘటన జరిగిన వెంటనే తెలుగు వారికి కొన్ని ఘటనలు గుర్తుకు వస్తాయి. రాజమండ్రి వద్ద పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణిస్తే కనీసం ఒక్క పోలీస్ కానిస్టేబుల్ కూడా సస్పెండ్ అవ్వలేదు. అంత పెద్ద ఘటనపై అప్పట్లో న్యాయ వ్యవస్థ కూడా స్పందించలేదు. అంతేకాదు.. కందుకూరు, గుంటూరులలో జరిగిన టీడీపీ ర్యాలీలలో, తిరుపతి, సింహాచలం పుణ్యక్షేత్రాలలో జరిగిన ఘటనల్లో పలువురు మరణించినా తూతూ మంత్రపు చర్యలే జరిగాయి. న్యాయ వ్యవస్థ స్పందించినట్లు కనబడదు. పాలన, న్యాయ వ్యవస్థలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా వ్యవహరించవచ్చా?.బెంగుళూరులో జరిగిన తొక్కిసలాట విషయానికి వస్తే, కొన్ని సందర్భాలలో ప్రజలు ఫ్రెంజీ అవుతారనిపిస్తుంది. చిత్రం ఏమిటంటే ఐపీఎల్ టోర్నమెంట్ జట్లలో స్థానికత నేతి బీరకాయ చందమే. బెంగుళూరు జట్టులో స్థానికులు లేదా కర్ణాటకకు చెందిన వారు అతి కొద్ది మంది. టోర్నీ మొత్తం వ్యాపారమే. క్రికెటర్లు కోట్ల రూపాయలకు అమ్ముడు పోతుంటారు. ఈ మొత్తాలు ఆట సమయంలో వారిని ఒత్తిడికి గురి చేస్తూంటాయి కూడా. బాగా ఆడలేకపోతే నిర్వాహకుల ఆగ్రహానికి గురవుతూంటారు. లక్నో జట్టుకు ఆడుతున్న సమయంలో కేఎల్ రాహుల్‌ను టీమ్ యజమాని బహిరంగంగా నిందించిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఇది కూడా ఒక కోణం. ఒక్కొక్క జట్టు రెండేసి సార్లు మరో జట్టుతో తలపడేలా ప్లాన్ చేశారు. పోటీల నిర్వహణ తీరును మనం తప్పు పట్టనక్కర్లేదు. సుమారు 18 ఏళ్లుగా దేశ ప్రజలను బాగా ఆకట్టుకున్న టోర్నీ ఇది. బెట్టింగులు కూడా జోరుగా సాగుతుంటాయని అంచనా. ఆటను ఆటగా చూడడం వరకు ఓకే కాని అది పిచ్చిగా మారకూడదు.బెంగుళూరు జట్టు గెలిచిన మాట నిజం. కానీ, అందులో ఎందరు ఆ నగరం లేదా రాష్ట్ర ప్లేయర్లు ఉన్నారు?. దానిని కూడా గమనించకుండా గెలిచిన జట్టును అభినందించడానికి వేలు, లక్షల సంఖ్యలో తరలి రావడం ఏమిటి?. ఫలితంగా తొక్కిసలాట జరగడం ఏమిటి?. అంతమంది మరణించడం ఏమిటి. కొన్ని యూరప్ దేశాలలో ఫుట్ బాల్ మ్యాచ్ తర్వాత ఘర్షణలు చోటు చేసుకుని అనేక మంది మరణించిన సందర్భాలు ఉన్నాయి. మన దేశంలో ఆ పరిస్థితి పెద్దగా కనిపించదు. అంతవరకు బాగానే ఉందనుకుంటే ఈ విజయోత్సవ కార్యక్రమం ప్రమాదం తెచ్చిపెట్టింది. ఈ ఘటనపై కర్ణాటక హైకోర్టు స్పందించి తొమ్మిది ప్రశ్నలు వేసి వివరంగా నివేదిక సమర్పించాలని కోరింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య.. నగర పోలీస్ కమిషనర్ దయానంద్, మరో ఐదుగురిని సస్పండ్ చేశారు. ఆర్సీబీ ప్రతినిధులను కూడా అరెస్టు చేశారు. యజమానులను అరెస్టు చేయాలని చెప్పకపోవడం గమనించదగ్గ అంశమే.కొన్ని నెలల క్రితం హైదరాబాద్‌లో ఒక థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి, ఇప్పటికీ కోలుకోలేదు. ఈ ఘటనలో ప్రముఖ నటుడు అల్లు అర్జున్ను పోలీసులు అరెస్టు చేశారు. నిజానికి ఇందులో అర్జున్ తప్పు ఏ మేరకు ఉందన్న మీమాంస ఉంది. చంద్రబాబు గత టర్మ్‌లో రాజమండ్రి వద్ద పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 29 మంది మరణించారు. ఆ తొక్కిసలాటకు కారణం చంద్రబాబు నాయుడు కుటుంబం. వీఐపీ ఘాట్ వద్ద కూడా సామాన్య ప్రజలకు కేటాయించిన ఘాట్‌లో స్నానం చేయడం, దానిని ప్రచార డాక్యుమెంటరీగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ చిత్రీకరించడం, ఆ క్రమంలో జనం పెరిగిపోయి గేట్లను ఒక్కసారిగా తెరవడంతో తొక్కిసలాట సంభవించడం జరిగింది.ఆ తర్వాత దీనికి సంబంధించిన సీసీటీవీ పుటేజ్ కూడా మాయమైందని చెబుతారు. ఇంతమంది మృతి చెందిన ఘటనపై ఆనాటి న్యాయ వ్యవస్థ స్పందించలేదు. అలాగే పాలనా వ్యవస్థ కనీసం సీనియర్ అధికారులను కాదు కదా!.. ఒక్క కానిస్టేబుల్ ను కూడా సస్పెండ్ చేయలేదు. ఎందుకంటే అలా చేస్తే చంద్రబాబు చేసిన తప్పిదాలు కూడా బయటకు వస్తాయనే కదా! న్యాయ విచారణ కు ఆదేశం అంటూ ఒక రిటైర్డ్ న్యాయమూర్తితో కమిషన్ వేశారు. ఆయనేమో ఇదంతా మీడియా ప్రచారం వల్ల అని తేల్చారు తప్ప చంద్రబాబు జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. దానిపై చాలా విమర్శలు వచ్చాయి. ఇక చంద్రబాబేమో ప్రమాదాలు ఎక్కడ జరగడం లేదు.. పూరీలో జరగలేదా? రోడ్డు ప్రమాదాలలో చనిపోవడం లేదా.. అంటూ పుష్కరాల తొక్కిసలాట మరణాలను తక్కువ చేసే యత్నం చేశారు.అదే కాదు.. తిరుపతి శేషాచలం కొండలలో 20 మంది ఎర్ర చందనం కూలీలను ఎన్ కౌంటర్ చేస్తే కూడా న్యాయ వ్యవస్థ ఆశించిన రీతిలో స్పందించ లేదన్న విమర్శ ఉంది. ఆ కూలీలు తమిళులు కావడంతో అక్కడి ప్రభుత్వం వారికి పరిహారం ఇచ్చింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం వారిని నేరస్తులుగా పరిగణిస్తే, ఇంకో రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా వారిని గుర్తించింది. ఈ మధ్యనే తిరుపతి తొక్కిసలాట, సింహాచలం ఆలయ గోడ కూలిన ఘటనలపై న్యాయవ్యవస్థ సుమోటోగా తీసుకోలేదు. విశాఖపట్నంలో సుధాకర్ అనే డాక్టర్ తాగి రోడ్డుపై అల్లరి చేసి ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తుంటే అక్కడ ఉన్న కానిస్టేబుల్ అతని చేతులు వెనక్కి కట్టి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళితే అప్పట్లో హైకోర్టు ఏకంగా సీబీఐ విచారణకే ఆదేశించిందింది. అదేమీ తేలలేదు. అది వేరే విషయం.మరి కొద్ది రోజుల క్రితం తెనాలిలో ముగ్గురు దళిత, ముస్లిం యువకులను పోలీసులు నడిరోడ్డులో అరికాళ్లపై లాఠీలతో కొడుతూ హింసించి వీడియో తీస్తే న్యాయ వ్యవస్థ ఎందుకు అదే స్థాయిలో స్పందించలేదో తెలియదు. న్యాయ వ్యవస్థలు కొన్ని ప్రభుత్వాల పట్ల సానుకూల ధోరణితో, మరికొన్ని ప్రభుత్వాల పట్ల వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తున్నాయన్న భావన ప్రజలలో నెలకొంది. ప్రత్యేకించి ఏపీలో జగన్ టైమ్‌లో న్యాయ వ్యవస్థ స్పందించిన తీరుపై చాలా విమర్శలు వచ్చేవి. చంద్రబాబుకు ఎప్పుడో అరుదుగా తప్ప న్యాయ వ్యవస్థ నుంచి ఎలాంటి ఇబ్బందులు రావన్న భావన నెలకొంది. అలాగే ఆయా రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలను బట్టి కాకుండా, ధర్మం, న్యాయాలను బట్టి వ్యవస్థలు స్పందించడం అవసరం అని చెప్పవలసి ఉంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బెంగళూరు విషాదం: పాపం.. ఆ 11 మంది
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవం సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి వివరాలను కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసింది. మృతుల్లో ఎక్కువగా ఇతర ప్రాంతాలవాసులు ఉన్నారు. చదువుకుంటూ, ఉద్యోగాలు చేస్తూ బెంగళూరులో ఉంటున్నవారు ప్రాణాలు కోల్పోయారు. చిన్న వయసులోనే మృత్యువు బారిన పడ్డారు. మృతుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారు. కాగా, మృతుల తల్లిదండ్రులు, బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 194 కింద కబ్బన్ పార్కు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. మృతుల వివరాలు దివ్యాన్షి (14), నివాసం.. యలహంక కట్టిగేనహళ్లిశివలింగ (17), యాదగిరి జిల్లా హూనిగేరి గ్రామంమనోజ్కుమార్ (18), తుమకూరు జిల్లా నాగసంద్ర గ్రామంచిన్మయ శెట్టి (19), బెంగళూరు దొడ్డకల్లసంద్రశ్రవణ్ కేటీ (20), చిక్కబళ్లాపుర జిల్లా కురటిహళ్లి గ్రామంపూర్ణచంద్ర (20) మండ్య జిల్లా రాయసముద్రభూమిక్ లక్ష్మణ్(21), ఎం.ఎస్.రామయ్య లేఔట్, బెంగళూరుఅక్షతా పాయ్ (26), ఉత్తర కన్నడ జిల్లా రవీంద్రనగరప్రజ్వల్(22), యలహంక న్యూ టౌన్సహన (23), కోలారు ఎస్.వీ.లేఔట్కామాక్షిదేవి (29), తమిళనాడు కోయంబత్తూరు జిల్లా ఉడుమాలపేట్దివ్యాన్షిఆర్సీబీ జట్టు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన విజయోత్సవ సభ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో అన్నమయ్య జిల్లాకు చెందిన బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు గురువారం మీడియాకు వెల్లడించారు. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం వండాడికి చెందిన బి.శివకుమార్, అశ్విని దంపతులు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ బెంగళూరులోని యలహంకలో స్థిరపడ్డారు. వారి కుమార్తె దివ్యాన్షి(14) తొమ్మిదో తరగతి చదువుతోంది. దివ్యాన్షికి ఆర్సీబీ జట్టు అంటే ఎనలేని అభిమానం. బుధవారం చిన్నస్వామి స్టేడియంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ కార్యక్రమాన్ని చూసేందుకు ఆమె కుటుంబసభ్యులతో కలిసి వెళ్లింది. కానీ తొక్కిసలాటలో దివ్యాన్షి ప్రాణాలు కోల్పోయింది. శివలింగ10వ తరగతి బోర్డు పరీక్షలలో ఉత్తీర్ణుడైన శివలింగ, పాఠశాల నుంచి తన బదిలీ సర్టిఫికేట్ (TC) తీసుకోవడానికి వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఆర్సీబీ అంటే అతడికి ఎంతో అభిమానం. తన ఫేవరేట్ ప్లేయర్లను చూసేందుకు వెళ్లి చిన్న వయసులోనే మరణించాడు. యాద్గిర్ జిల్లాలోని హోనిగెరె గ్రామానికి చెందిన అతడి తల్లిదండ్రులు బెంగళూరులో రోజువారీ కూలీలుగా ఉన్నారు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఆశతో 10 సంవత్సరాల క్రితం బెంగళూరు వలస వచ్చారు. కొడుకు అకాల మరణంతో వారి జీవితం అంధకారమయం అయింది.భూమిక్ లక్ష్మణ్బెంగళూరులోని ఎం.ఎస్.రామయ్య లేఔట్లో ఉంటూ ఇంజినీరింగ్ చదువుతున్న భూమిక్ లక్ష్మణ్.. పది మంది స్నేహితులతో కలిసి చిన్నస్వామి స్టేడియానికి వెళ్లాడు. తొక్కిసలాటలో స్నేహితుల నుంచి విడిపోయాడు. అదే అతడిని ఆఖరిసారిగా ప్రాణాలు చూడడం. హాసన్ జిల్లా బేలూరు తాలూకా కుప్పుగోడుకు చెందిన లక్ష్మణ, అశ్విని దంపతులకు ఏకైక కుమారుడు భూమిక్. తమ ఒక్కగానొక్క కొడుకు హఠాన్మరణం చెందడంతో భూమిక్ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.మనోజ్ కుమార్బెంగళూరులోని హెబ్బాళ సమీపంలోని కెంపాపుర రెసిడెన్సీ కాలేజీలో బీబీఎం చదువుతున్న 18 ఏళ్ల మనోజ్ కుమార్ తల్లిదండ్రులు, సోదరితో కలిసి యలహంకలో ఉండేవాడు. తాను అభిమానించే ఆర్సీబీ జట్టు విజయోత్సవంలో పాలుపంచుకోవాలని వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. మనోజ్ తండ్రి దేవరాజ్ ఎన్టీ(45) పానీపూరి అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తుమకూరు జిల్లాలోని కుణిగల్ తాలూకా ఎడెయూరు సమీపంలోని నాగసంద్ర గ్రామం.. దేవరాజ్ సొంతూరు. తన కొడుకు చనిపోయాడంటే అతడు నమ్మలేకపోతున్నాడు. పెద్ద చదువులు చదివి తమను ఉద్దరిస్తాడనుకున్న కొడుకు అర్థాంతరంగా తనువు చాలించడంతో మనోజ్ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు.శ్రవణ్చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో విషాదకరంగా ప్రాణాలు కోల్పోయిన వారిలో బీడీఎస్ విద్యార్థి శ్రవణ్ కూడా ఉన్నాడు. కర్ణాటకలోని చింతామణికి చెందిన అతడు.. అంబేద్కర్ మెడికల్ అండ్ డెంటల్ కాలేజీలో బీడీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న 20 ఏళ్ల శ్రవణ్ అకాల మరణం చెందాడు.సహనబెంగుళూరులోని బాష్ కంపెనీలో ఇంజినీరుగా ఉద్యోగం చేస్తున్న సహన (23) సహోద్యోగులతో కలిసి విక్టరీ పరేడ్ వీక్షించేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయింది. ఉపాధ్యాయులైన తల్లిదండ్రులతో కలిసి కోలారులోని ఎస్జి కాలనీలో నివాసం ఉండే సహన.. ఆర్సీబీ మీద అభిమానంతో చిన్నస్వామి స్టేడియానికి వెళ్లి అశువులు బాసింది. తన పెద్ద కూతురైన సహనకు త్వరలో పెళ్లి చేయాలనుకున్నామని, ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని ఆమె తండ్రి సురేశ్ కుమార్ కన్నీటిపర్యంతమయ్యారు.చదవండి: కొడుకా.. లేవరా, 100 కోట్ల ఆస్తి పెట్టానుప్రజ్వల్ఉద్యోగం ఇంటర్వ్యూకు వెళ్లిన కొడుకు ఇంటికి తిరిగొస్తాడని ఆ తల్లిదండ్రులు ఎదురు చూశారు. కానీ అంతలోనే పిడుగు లాంటి వార్త వినాల్సి వస్తోందని వారు అస్సలు ఊహించలేదు. తొక్కిసలాటలో తమ కుమారుడు మరణించాడని తెలిసి ప్రజ్వల్ ఫ్యామిలీ శోకసంద్రంలో ముగినిపోయింది. 22 ఏళ్ల ప్రజ్వల్ ఇంటర్వ్యూ ముగిసిన చిన్నస్వామి స్టేడియానికి వెళ్లి హఠాన్మరణం పాలయ్యాడు. దీంతో యలహంక న్యూ టౌన్ ప్రాంతంలోని అతడి నివాసంలో విషాద ఛాయలు అలముకున్నాయి.కామాక్షిదేవిఅమెజాన్లో పనిచేస్తున్న 29 ఏళ్ల కామాక్షిదేవి.. విరాట్ కోహ్లి అభిమాని. ఐపీఎల్ విజేత అయిన RCB విజయోత్సవంలో పాల్గొనేందుకు చిన్నస్వామి స్టేడియానికి వెళ్లిన ఆమె అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయింది. తమిళనాడు కోయంబత్తూరు జిల్లా ఉడుమాలపేట్ ఆమె స్వస్థలం. అక్షతా పాయ్, చిన్మయ శెట్టి, పూర్ణచంద్ర కూడా తొక్కిసలాటలో చనిపోయారు. -
బెంగళూరు తొక్కిసలాట.. విరాట్ కోహ్లిని అరెస్ట్ చేయండి..!
ఆర్సీబీ విజయోత్సవాల నేపథ్యంలో జరిగిన బెంగళూరు తొక్కిసలాట దారుణమైన మలుపు తీసుకుంది. సోషల్‌మీడియాలో కొందరు ఈ విషాద ఘటనకు విరాట్ కోహ్లిని బాధ్యున్ని చేస్తూ, అరెస్ట్‌కు డిమాండ్ చేస్తున్నారు. '#ArrestKohli' హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతుంది. బెంగళూరులో జరిగిన ప్రాణనష్టానికి విరాట్ కోహ్లీనే కారణమని ఓ వర్గం ఆరోపిస్తుంది. కోహ్లికి వ్యతిరేకంగా ట్విటర్లో 36 వేలకు పైగా ట్వీట్లు ఉన్నాయి. తమను చూడటానికి వచ్చి జనాలు ప్రాణాలు కోల్పోయారని తెలిసి కూడా కోహ్లి పట్టీపట్టనట్లు ఉన్నాడని చాలా మంది ఆరోపిస్తున్నారు. దుర్ఘటన విషయం తెలియగానే కోహ్లి బెంగళూరు వదిలి పారిపోయాడని అంటున్నారు. ఆర్సీబీ యాజమాన్యం చుట్టూ ఉచ్చుబిగుసుకున్న తరుణంలో కోహ్లి లండన్‌కు పారిపోవాలని చూస్తున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కోహ్లి దేశం విడిచి పారిపోయేలోపు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ (పుష్ప-2 తొక్కిసలాట) అరెస్ట్‌ను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. కోహ్లికి మానవత్వమే లేదని అంటున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు కూడా ముందుకు రావడం లేదని అంటున్నారు. కోట్లకు కోట్లు సంపాదిస్తూ, బాధిత కుటుంబాలకు కనీస ఆర్దిక సాయం ప్రకటించలేదని దుయ్యబడుతున్నారు.మరోపక్క కోహ్లికి మద్దతుగా నిలుస్తున్న వారు కూడా ఉన్నారు. ఎవరూ కోరుకోని, ఊహించని ఘటనకు కోహ్లిని ఎలా బాధ్యున్ని చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కోహ్లి అరెస్ట్‌ను డిమాండ్ చేయడం మూర్ఖత్వమని అంటున్నారు. కోహ్లి దేశం విడిచి పారిపోతున్నాడనటానికి ఆధారాలు ఉన్నాయా అని నిలదీస్తున్నారు. కోహ్లి త్వరలోనే బాధిత కుటుంబాలను పరామర్శిస్తాడని భరోసా ఇస్తున్నారు. అర్దిక సాయం ప్రకటించి చేతులు దులుపుకోవడం ఇష్టం లేకే, కోహ్లి ఎలాంటి ఆర్దిక సాయం ప్రకటించలేదని అంటున్నారు. కోహ్లి అంటే గిట్టని వారే ఈ రకమైన ప్రచారానికి పూనుకున్నారని ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ విషయంలో కోహ్లికి మద్దతుగా నిలిచే వారంతా ముందుక రావాలని పిలుపునిస్తున్నారు. 11 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమరని అంటూనే, ప్రాణ నష్టాన్ని కోహ్లికి ఆపాదించడం కరెక్ట్ కాదని అంటున్నారు. కాగా, బెంగళూరు దుర్ఘటనకు సంబంధించి ఇవాళ (జూన్ 6) ఉదయం ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను అరెస్టు చేశారు. ముంబైకి వెళ్తుండగా బెంగళూరు ఎయిర్‌పోర్టులో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అదే విధంగా ఈ ఈవెంట్ నిర్వాహక సంస్థ డీఎన్ఎ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ముగ్గురు సిబ్బందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.ఇదిలా ఉంటే, ఆర్సీబీ 18 ఏళ్ల ఐపీఎల్ జర్నీలో తొలిసారి టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. ఈ సీజన్ ఫైనల్లో ఆ జట్టు పంజాబ్‌పై విజయం సాధించి, తమ తొలి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఆర్సీబీ యాజమాన్యం తమ జట్టు గెలుపును ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని భావించింది. ట్రోఫీ గెలిచిన మరుసటి రోజు బెంగళూరులో ఓపెన్ టాప్ బస్‌లో పరేడ్ నిర్వహించాలని ప్లాన్ చేసింది. అయితే దీనికి పోలిసుల అనుమతి లభించకపోవడంతో చిన్నస్వామి స్టేడియంలో ఆటగాళ్ల సన్మాన కార్యక్రమానికి పూనుంది. ఇది కాస్తా విషాదాంతంగా ముగిసింది. ఆటగాళ్ల సన్మాన కార్యక్రమం గురించి తెలిసిన వెంటనే లక్షల సంఖ్యలో అభిమానులు స్టేడియం వద్ద గుమికూడారు. స్టేడియం లోపలికి వెళ్లడానికి ఉచిత పాస్‌లు ఇస్తున్నారని ప్రచారం జరగడంతో అభిమానులు ఒక్కసారిగా ఓ ప్రాంతం వద్దకు దూసుకువచ్చారు. ఈ క్రమంలో భారీ తొక్కిసలాట జరిగింది. ఇందులో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 13 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు గల యువకులు, మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారు. -
బెంగళూరు దుర్ఘటన.. ఆర్సీబీ యాజమాన్యంపై ధ్వజమెత్తిన గంభీర్
బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా (జూన్ 4న) జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనపై యావత్ క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా స్పందించాడు. మృతులకు సంతాపం తెలుపుతూ, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశాడు.శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరుతున్న సందర్భంగా నిన్న బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో గిల్‌తో పాటు పాల్గొన్న గంభీర్ విలేఖరి అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ ఇలా అన్నాడు. ముందుగా నేను రోడ్ షోలకు వ్యతిరేకం. 11 మంది ప్రాణాలు కోల్పోవడం అంటే మామూలు విషయం కాదు. విజయోత్సవాల కంటే జనం ప్రాణాలు ముఖ్యం. రోడ్ షో విజయవంతంగా నిర్వహించే సామర్థ్యం లేకపోతే నిర్వహించకుండా ఉండాల్సింది. ఈ ఘటనకు ఆర్సీబీ యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలి.గెలుపు సంబరాలు చేసుకోవద్దని నేను అనను. కానీ దానికీ ఓ పద్దతి ఉంటుంది. ఇతరుల ప్రాణాలు రిస్క్ అయ్యే విధంగా సంబరాలు ఉండకూడదు. ఇంత ప్రాణ నష్టం కలిగించిన రోడ్ షోలను భవిష్యత్తులో నిర్వహించకూడదు.కాగా, ఆర్సీబీ 18 ఏళ్ల ఐపీఎల్ జర్నీలో తొలిసారి టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. ఈ సీజన్ ఫైనల్లో ఆ జట్టు పంజాబ్‌పై విజయం సాధించి, తమ తొలి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఆర్సీబీ యాజమాన్యం తమ జట్టు గెలుపును ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని భావించింది. ట్రోఫీ గెలిచిన మరుసటి రోజు బెంగళూరులో ఓపెన్ టాప్ బస్‌లో పరేడ్ నిర్వహించాలని ప్లాన్ చేసింది. అయితే దీనికి పోలిసుల అనుమతి లభించకపోవడంతో చిన్నస్వామి స్టేడియంలో ఆటగాళ్ల సన్మాన కార్యక్రమానికి పూనుంది. ఇది కాస్తా విషాదాంతంగా ముగిసింది. ఆటగాళ్ల సన్మాన కార్యక్రమం గురించి తెలిసిన వెంటనే లక్షల సంఖ్యలో అభిమానులు స్టేడియం వద్ద గుమికూడారు. స్టేడియం లోపలికి వెళ్లడానికి ఉచిత పాస్‌లు ఇస్తున్నారని ప్రచారం జరగడంతో అభిమానులు ఒక్కసారిగా ఓ ప్రాంతం వద్దకు దూసుకువచ్చారు. ఈ క్రమంలో భారీ తొక్కిసలాట జరిగింది. ఇందులో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 13 నుంచి35 ఏళ్ల మధ్య వయసు గల యువకులు, మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారు. -
కొడుకా.. లేవరా, 100 కోట్ల ఆస్తి పెట్టాను
యశవంతపుర: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో మృతి చెందిన హాసన్ జిల్లా వాసి భూమిక్ (20) ఇంటిలో చెప్పకుండా ఈ కార్యక్రమానికి వచ్చి విగతజీవి అయ్యాడు. ఇంజనీరింగ్ చదువుతున్న భూమిక్ మృతితో తండ్రి తల్లడిల్లిపోతున్నారు. 100 కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించి భూమిక్ కోసం పెట్టానంటూ కొడుకు శవం వద్ద తండ్రి బోరుమంటున్న వీడియో అందరినీ కలిచివేస్తోంది.హాసన్ జిల్లా బేలూరు తాలూకా కుప్పుగోడుకు చెందిన లక్ష్మణ, అశ్విని దంపతులకు ఏకైక కుమారుడు భూమిక్. బెంగళూరులో ఉంటు ఇంజినీరింగ్ రెండో ఏడాది చదువుతున్నాడు. కాలేజీ స్నేహితులతో కలిసి చిన్నస్వామి స్టేడియం వద్దకెళ్లి తొక్కిసలాటలో మరణించాడు. విక్టోరియా ఆస్పత్రిలో గురువారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.పోస్టుమార్టం చేయొద్దుఎంతో ముద్దుగా పెంచాను. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదని తండ్రి రోదించాడు. నా కొడుక్కి పోస్టుమార్టం చేయవద్దు, కోసి ముక్కలు చేయొద్దు అని ప్రాధేయపడ్డాడు. సీఎం, డీసీఎం వచ్చి పరామర్శిస్తారు, కానీ నా కుమారుడు రాడంటూ తండ్రి లక్ష్మణ బోరుమన్నాడు. అంబులెన్స్ లేని కారణంగా జీపులో భూమిక్ మృతదేహాన్ని తీసుకుని వెళ్లారు.కన్నీటి మధ్య అంత్యక్రియలుతుమకూరు: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన మనోజ్ (20) అంత్యక్రియలు కుటుంబ సభ్యులు, బంధువుల అశ్రునయనాల మధ్య జిల్లాలోని కుణిగల్ తాలూకా ఎడెయూరు సమీపంలోని నాగసంద్ర గ్రామంలోని వారి తోటలో జరిగాయి. అంత్యక్రియల సమయంలో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.బెంగళూరులోని హెబ్బాళ సమీపంలోని కెంపాపుర రెసిడెన్సీ కాలేజీలో బీబీఎం చదువుతున్న మనోజ్ యలహంకలో తల్లిదండ్రులు, సోదరితో కలిసి ఉండేవాడు. బుధవారం స్నేహితులతో కలిసి చిన్నస్వామి స్టేడియానికి వెళ్లి అక్కడ జరిగిన తొక్కిసలాటలో మృత్యువాత పడ్డాడు.ప్రభుత్వానిదే బాధ్యత: మంత్రియశవంతపుర: తొక్కిసలాటకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఐటీబీటీ మంత్రి ప్రియాంక ఖర్గే తెలిపారు. బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ ఈ ఘటన జరగిఉండరాదు, ఎక్కువమంది అభిమానులు రావడంతో జరిగింది.సరైన వ్యవస్థలను కల్పించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదన్నారు. ప్రభుత్వం నుంచి లోపం జరిగిన మాట వాస్తవమే, అంగీకరిస్తున్నాం అన్నారు. ఒక ప్లాన్ ప్రకారం కార్యక్రమంను నిర్వహించి ఉంటే బాగుండేదని అన్నారు. మంత్రి ప్రకటనను జేడీఎస్ ఎక్స్‌లో పోస్టు చేసింది.చదవండి: పెళ్లి చేసి పంపాలనుకున్నాం.. పాడె కట్టి సాగనంపారు


