ఎప్పటికీ మా హృదయాల్లో... | RCB leaves 11 seats empty in tribute to fans lost in first IPL victory | Sakshi
Sakshi News home page

ఎప్పటికీ మా హృదయాల్లో...

Mar 28 2026 1:39 AM | Updated on Mar 28 2026 1:39 AM

RCB leaves 11 seats empty in tribute to fans lost in first IPL victory

ఐపీఎల్‌లో గత ఏడాది ఆర్‌సీబీ విజేతగా నిలిచిన తర్వాత జరిగిన విజయోత్సవంలో 11 మంది అభిమానులు మృతి చెందారు. వారి స్మారకార్థం ఆర్‌సీబీ యాజమాన్యం భిన్న రీతిలో నివాళి అర్పించనుంది. ఇకపై చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌లలో 11 సీట్లను ఖాళీగా ఉంచనుంది. 

పీ1 స్టాండ్‌లోని ఈ సీట్లలో ఎవరూ కూర్చోకుండా ఆ 11 మంది జ్ఞాపకార్ధం శాశ్వతంగా అలాగే ఉంచనుంది. ‘జట్టుతో వారికి ఉన్న అనుబంధానికి ఇవి గుర్తుగా ఉండిపోతాయి. వారు ఎప్పటికీ ఆర్‌సీబీ అభిమానులే’ అని తమ గౌరవాన్ని ప్రకటించింది.   

Advertisement
 
Advertisement
Advertisement