Chinnaswamy Stadium
-
బెంగళూరులో వర్షం.. భారత్ - కివీస్ తొలి టెస్టు మొదటి సెషన్ ఆట కష్టమే! (ఫొటోలు)
-
IND vs NZ 1st Test: బెంగళూరులో భారీ వర్షం.. అభిమానులకు చేదువార్త
Ind vs NZ 1st Test Day 1: Toss delayed due to rain: టీమిండియా- న్యూజిలాండ్ తొలి టెస్టుకు వర్షం ఆటంకం కలిగించింది. బెంగళూరులో భారీగా వాన పడుతుండటంతో టాస్ ఆలస్యం కానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో భాగంగా మూడు మ్యాచ్‌లు ఆడేందుకు కివీస్ జట్టు భారత్‌కు వచ్చింది.షెడ్యూల్ ప్రకారం... ఇరుజట్ల మధ్య బుధవారం ఉదయం 9.30 నిమిషాలకు మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉంది. అయితే, భారత్- కివీస్ తొలి టెస్టుకు వేదికైన చిన్నస్వామి స్టేడియం వద్ద ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇప్పటికే మైదానాన్ని కవర్స్‌తో కప్పినా.. సమయానికి మ్యాచ్ మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు.ఫైనల్ దారిలో టీమిండియాడబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌లో ఫైనల్ చేరాలంటే టీమిండియాకు ఈ సిరీస్ కీలకం. ఇప్పటికే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రోహిత్ సేన కివీస్‌తో మూడు టెస్టుల్లో గెలిస్తే నేరుగా తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. లేదంటే.. ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టుల రూపంలో కఠిన సవాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు.. పట్టికలో ఆరోస్థానంలో ఉన్న న్యూజిలాండ్ ఇటీవలే శ్రీలంక చేతిలో చిత్తుగా ఓడింది. అయితే, భారత్‌లో సత్తా చాటి పరువు నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది.టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ టెస్టు సిరీస్ 2024 జట్లుటీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.రిజర్వ్ ప్లేయర్లు: హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.న్యూజిలాండ్‌డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, మార్క్ చాప్మన్, విల్ యంగ్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర, టామ్ బ్లండెల్, అజాజ్ పటేల్, జాకోబ్ డఫీ, మాట్ హెన్రీ, టిమ్ సౌథీ, విలియం ఓ రూర్కే.A wet start to Day 1 in Bengaluru. Heavy rain around M Chinnaswamy Stadium means the toss will be delayed until further notice 🏏 #INDvNZ pic.twitter.com/eowepdeila— BLACKCAPS (@BLACKCAPS) October 16, 2024 -
వివాదాల మయం, విరాట్ కోహ్లీ పబ్‌పై కేసు నమోదు.. కారణం ఏంటంటే?
బెంగళూరు : స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి చెందిన వన్8 కమ్యూన్ పబ్ విషయంలో వరుస వివాదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే దేశంలో ఉన్న వన్ 8 కమ్యూన్ పబ్‌లపై పలు కేసులు నమోదు కాగా.. తాజాగా బెంగళూరు పబ్‌పై కేసు నమోదైంది.బెంగళూరులోని చిన్నస్వామీ స్టేడియం సమీపంలో ఎంజీ రోడ్లో వన్8 కమ్యూన్ పేరిట కోహ్లీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే నిబంధనలకు విరుద్దంగా అర్ధరాత్రి 1.౩౦ గంటల వరకు పబ్‌ను నిర్వహిస్తున్నారంటూ స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో సమాచారం అందుకున్న పోలీసులు పబ్‌కు చేరుకున్నారు. పబ్ తెరిచే ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.సాధారణంగా పబ్ కార్యకలాపాలు అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే అనుమతి ఉంది. సమయం దాటితో సదరు పబ్‌లపై పోలీసులు కేసు నమోదు చేస్తుంటారు. వన్8 కమ్యూన్ పబ్ విషయంలో సైతం ఇదే జరిగింది.ఇక కోహ్లీ పబ్‌పై కేసు నమోదు చేయడంపై సెంట్రల్ డీసీపీ స్పందించారు. అర్ధరాత్రి వరకు పబ్‌లో ఓపెన్ చేసి ఉండడం, పెద్ద శబ్దాలతో మ్యూజిక్ పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన స్థానికులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. స్థానికుల ఫిర్యాదుతో పబ్‌ను పరిశీలించగా సమయం పాలన పాటించకపోవడంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.గతేడాది ముంబై వన్8 కమ్యూన్ పబ్ బ్రాంచ్‌లో తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ధోతి ధరించి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ పబ్ సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. వన్8 కమ్యూన్ పబ్ సిబ్బంది కస్టమర్ల మనోభావాల్ని పట్టించుకోవడం లేదని విచారం వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదిగా ట్వీట్ చేశాడు. కాగా,గతేడాది కోహ్లి రెస్టారెంట్లపై కాపీరైట్ వివాదం చుట్టుముట్టింది. ఈ అంశంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఆ సమయంలో ఫోనోగ్రాఫిక్ పెర్ఫార్మెన్స్ లిమిటెడ్ (PPL) కాపీరైట్ ఉన్న పాటలను ప్లే చేయకుండా నిషేధం విధించడంతో ఒక్కసారిగా వార్తల్లోకి నిలిచింది. -
బెంగళూరులో దుమ్మురేగొట్టిన ఆరెంజ్ ఆర్మీ ‘ఓ రేంజ్’ బ్యాటింగ్ (ఫొటోలు)
-
IPL 2024 RCB Vs SRH: 277 కాదు... 287
బెంగళూరు: సన్‌రైజర్స్ ఆటతీరు చిన్నస్వామి స్టేడియాన్ని పెద్ద పెద్ద రికార్డుల్లో నిలిపింది. బెంగళూరు టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకోగానే విధ్వంసానికి పునాది పడింది...బ్యాటింగ్ తుఫాన్‌తో హైదరాబాద్ మ్యాచ్ గెలిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక సీజన్లో తమ రికార్డుకు ‘2.0’ ను చూపించింది. ముంబైపై 277 రికార్డును రోజుల వ్యవధిలోనే 287 పరుగుల అత్యధిక స్కోరుతో హైదరాబాద్ జట్టు తిరగరాసింది. ఈ ఎండల్ని తట్టుకోలేని జనాలకు మెరుపుల పండగని పంచిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 25 పరుగుల తేడాతో బెంగళూరుపై గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి మునుపెన్నడూ చేయని 287 పరుగుల భారీ స్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రవిస్ హెడ్ (41 బంతుల్లో 102; 9 ఫోర్లు, 8 సిక్స్‌లు) శతకం బాదగా... హెన్రిచ్ క్లాసెన్ (31 బంతుల్లో 67; 2 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఆకాశానికే చిల్లులుపడేలా సిక్స్‌లు కొట్టాడు. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ (35 బంతుల్లో 83; 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) దంచేశాడు చివరి వరకు పోరాడగా..డుప్లెసిస్ (28 బంతుల్లో 62; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరిపించాడు. దంచుడే... దంచుడు! రెండో ఓవర్ నుంచే హెడ్ వీరంగం మొదలైంది. టాప్లీ ఓవర్లో 4, 6 కొట్టగా, ఫెర్గూసన్ ఐదో ఓవర్లో రెండు సిక్స్‌లతో పాటు ఓ బౌండరీ బాదాడు. దీన్ని యశ్ తదుపరి ఓవర్లోనూ రిపీట్ చేయడంతో 20 బంతుల్లో హెడ్ ఫిఫ్టీ పూర్తవగా, పవర్‌ప్లే స్కోరు 76/0. జాక్స్ ఏడో ఓవర్ వేస్తే హెడ్ వరుసగా 4, 6, 6 బాదేశాడు. తర్వాత అభిషేక్ సిక్సర్‌తో 7.1 ఓవర్లోనే సన్‌రైజర్స్ వందను దాటేసింది. తర్వాతి ఓవర్లో అభిషేక్ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను టాప్లీ అవుట్ చేసి 108 పరుగుల ఓపెనింగ్ జోడీని విడగొట్టాడు. క్లాసెన్ క్రీజులోకి రాగా... వైశాక్ 12వ ఓవర్లో మూడు ఫోర్లతో హెడ్ 39 బంతుల్లో శతకం పూర్తి చేసుకొని కాసేపటికే అవుటయ్యాడు. ఇక క్లాసెన్ వంతు! అప్పటిదాకా అడపాదడపా షాట్లతో 21 పరుగులు చేసిన క్లాసెన్ బాదే బాధ్యత తను తీసుకున్నాడు. లోమ్రోర్ 9 బంతులేసిన 14వ ఓవర్లో రెండు భారీ సిక్స్‌లు కొట్టాడు. తదుపరి వైశాక్ బౌలింగ్‌లో ఫోర్, సిక్స్ కొట్టి 23 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. టాప్లీ, ఫెర్గూసన్‌ల వరుస ఓవర్లలో ఒక్కో సిక్స్‌తో విరుచుకుపడిన క్లాసెన్‌కు ఫెర్గూసన్ చెక్‌పెట్టాడు. క్రీజులో ఉన్న మార్క్రమ్ (17 బంతుల్లో 32నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)కు అప్పుడే వచి్చన సమద్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) తోడయ్యాడు. వచ్చీ రాగానే టార్గెట్ తుఫాన్‌పై కదం తొక్కుతూ టాప్లీ వేసిన 19వ ఓవర్లో ఆడిన ఐదు బంతుల్ని 4, 4, 6, 6, 4లుగా బాదాడు. ఆఖరి ఓవర్లో మార్క్రమ్ 4, 6 కొడితే సమద్ మరో సిక్సర్ బాదాడు. 19వ ఓవర్లో 25, 20వ ఓవర్లో 21 పరుగులు హైదరాబాద్ గెలుపులో కీలకమయ్యాయి. బెంగళూరు తగ్గలేదు! ఎంతకొట్టినా ఎంతకీ కరగని లక్ష్యమని బెంగళూరు బెదిరిపోలేదు. ఆఖరి దాకా తగ్గేదే లే అన్నట్లుగా సన్‌రైజర్స్ ఫీల్డర్లను చెమటలు పట్టించింది. ఓపెనర్లు కోహ్లి (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), డుప్లెసిస్ కొండంత లక్ష్యానికి దీటైన ఆరంభం ఇచ్చారు. ఇద్దరు తొలి ఓవర్లో చెరో బౌండరీతో ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టారు. తర్వాత ఓవర్ ఓవర్‌కూ సిక్స్‌లు, ఫోర్లతో వేగాన్ని పెంచారు. భువీ నాలుగో ఓవర్లో ఇద్దరు చెరో 2 బౌండరీలతో 3.5 ఓవర్లోనే బెంగళూరు 50 దాటింది. నటరాజన్, కమిన్స్ ఓవర్లలో అవలీలగా ఫోర్లు, సిక్స్‌లు బాదడంతో పవర్‌ప్లేలో జట్టు 78/0 స్కోరు చేసింది. కోహ్లిని మార్కండే బౌల్డ్ చేయడంతో తొలిదెబ్బ తగిలింది. మరోవైపు డుప్లెసిస్ 24 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. కానీ విల్‌జాక్స్ (7) నాన్‌స్ట్రయిక్ ఎండ్‌లో దురదృష్టవశాత్తు రనౌటవడం, పటిదార్ (9)తో పాటు డుప్లెసిస్ స్వల్పవ్యవధిలో పెవిలియన్ చేరడం జట్టును వెనుకబడేలా చేసింది. అయితే పదో ఓవర్లో క్రీజులోకి వచి్చన దినేశ్ కార్తీక్ షాట్లతో విరుచుకుపడటంతో భారీ స్కోరు కాస్తా దిగి వస్తుండటంతో హైదరాబాద్ శిబిరం కాస్తా ఇబ్బంది పడింది. 23 బంతుల్లో కార్తీక్ ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. అయితే 12 బంతుల్లో 58 పరుగుల సమీకరణం కష్టసాధ్యం కావడంతో పాటు 19వ ఓవర్లో 6, 4 కొట్టిన కార్తీక్‌ను నటరాజన్ అవుట్ చేయడంతో పరాజయం ఖాయమైంది. 11, 12 ఓవర్లలో వరుసగా 5, 8 పరుగులే రావడం.... 15వ ఓవర్లో కమిన్స్... హిట్టర్ మహిపాల్ (11 బంతుల్లో 19; 2 సిక్స్‌లు)ను అవుట్ చేసి 6 పరుగులే ఇవ్వడం సన్‌రైజర్స్‌ను గట్టెక్కించింది. లేదంటే పరిస్థితి కచి్చతంగా మరోలా ఉండేది! స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) ఫెర్గూసన్ (బి) టాప్లీ 34; హెడ్ (సి) డుప్లెసిస్ (బి) ఫెర్గూసన్ 102; క్లాసెన్ (సి) వైశాక్ (బి) ఫెర్గూసన్ 67; మార్క్రమ్ నాటౌట్ 32; సమద్ నాటౌట్ 37; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 287. వికెట్ల పతనం: 1–108. 2–165, 3–231. బౌలింగ్: విల్ జాక్స్ 3–0–32–0, టాప్లీ 4–0–68–1, యశ్ దయాళ్ 4–0–51–0, ఫెర్గూసన్ 4–0–52–2, వైశాక్ 4–0–64–0, మహిపాల్ 1–0–18–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (బి) మార్కండే 42; డుప్లెసిస్ (సి) క్లాసెన్ (బి) కమిన్స్ 62; జాక్స్ రనౌట్ 7; పటిదార్ (సి) నితీశ్ (బి) మార్కండే 9; సౌరవ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కమిన్స్ 0; దినేశ్ కార్తీక్ (సి) క్లాసెన్ (బి) నటరాజన్ 83; మహిపాల్ (బి) కమిన్స్ 19; అనూజ్ నాటౌట్ 25; వైశాక్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 262. వికెట్ల పతనం: 1–80, 2–100, 3–111, 4–121, 5–122, 6–181, 7–244. బౌలింగ్: అభిషేక్ 1–0–10–0, భువనేశ్వర్ 4–0–60–0, షహబాజ్ 1–0–18–0, నటరాజన్ 4–0–47–1, కమిన్స్ 4–0–43–3, మార్కండే 4–0–46–2, ఉనాద్కట్ 2–0–37–0. 287: ఐపీఎల్లో ఒక టీమ్ సాధించిన అత్యధిక స్కోరు. ఇదే సీజన్లో తాము చేసిన 277 స్కోరును సన్‌రైజర్స్ సవరించింది. ఓవరాల్‌గా టి20ల్లో ఇది రెండో అత్యధిక స్కోరు. ఆసియా క్రీడల్లో మంగోలియాపై నేపాల్ 314 పరుగులు చేసింది. 22: సన్‌రైజర్స్ సిక్సర్లు. గతంలో బెంగళూరు కొట్టిన 21 సిక్సర్ల రికార్డు బద్దలైంది. 4: హెడ్ చేసిన సెంచరీ (39 బంతుల్లో) ఐపీఎల్లో నాలుగో వేగవంతమైంది. గేల్ (30), యూసుఫ్ పఠాన్ (37), మిల్లర్ (38) ముందున్నారు. సన్‌రైజర్స్ తరఫున గతంలో వార్నర్ 43 బంతుల్లో సెంచరీ చేశాడు. 549: ఒక టి20ల్లో నమోదైన అత్యధిక పరుగులతో కొత్త రికార్డు. ఇదే సీజన్లో హైదరాబాద్, ముంబై మధ్య 523 పరుగులు నమోదయ్యాయి. ఐపీఎల్లో నేడు కోల్‌కతా X రాజస్తాన్ వేదిక: కోల్‌కతా రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఐపీఎల్ అంత బోరింగ్‌గా ఉందా..!? అమ్మడు పనికి నెటిజన్లు షాక్!
బెంగళూరు ఎం. చిన్నస్వామి స్టేడియంలో తాజా ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా దర్శమిన్చిన దృశ్యాలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఐపీఎల్ మ్యాచ్‌లు స్వయంగా స్టేడియంలో కూచుని చూడటమంటే చాలా ఖరీదైన వ్యవహారం. టికెట్లు దొరకడం చాలా గగనం కూడా. అయితే టికెట్ కొనుక్కుని మరీ మ్యాచ్‌ను చూడటం మానేసిన ఒక అమ్మడు తీరిగ్గా అమెరికన్ పాపులర్ షో చూస్తూ కూచోవడం కెమెరా కంట పడింది. దీంతో ఇది నెట్టింట్ వైరల్‌గా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ సందర్బంగా ఏప్రిల్ 2న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీపక్ కుమార్ అనే ట్విటర్ యూజర్ "ఈ అమ్మాయి ఐపిఎల్ మ్యాచ్‌లో ‘ఫ్రెండ్స్’ చూస్తోందంటే నమ్మలేకపోతున్నాను" అనే క్యాప్షన్‌తో ఈ ఫోటోను షేర్ చేశాడు. అంతే ఇది లక్షల వ్యూస్, లైక్స్‌తో చక్కర్లు కొడుతోంది. ‘‘ఈ సంవత్సరం ఐపీఎల్ అస్సలు ఆసక్తికరంగా లేదు, బోరింగ్‌గా కనీసం నా సర్కిల్లో కూడా ఆసక్తికరంగా లేదు’’ ఒకరు, ‘‘ఇందులో నమ్మలేకపోవడానికేమీ లేదు.. చిన్న స్వామి స్టేడియం అంతే.. ఆ అమ్మాయిని నిందించి లాభం లేదు’’ అని మరొకరు "మ్యాచ్ తప్పనిసరిగా బోరింగ్‌గా ఉందేమో బ్రో’’, ‘‘ఆర్సీబీ ఫ్యాన్ అందుకే’’ ఇలా రక రకాల కమెంట్లు చేయడం విశేషం. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడో ఓటమిని మూట గట్టుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ 28 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. Can’t believe this girl is watching Friends during an IPL match 😭 pic.twitter.com/fgL14lPGyC — Deepak Kumaar (@immunewolf_) April 2, 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చి 22నప్రారంభమైంది. ఐపీఎల్ క్రికెట్ అనగానే లైవ్‌లో మ్యాచ్‌ను, అభిమాన ఆటగాళ్లను చూడాలనే ఉత్సాహం, థ్రిల్ కోసం స్టేడియం టిక్కెట్లను కూడా బుక్ చేసుకుంటారు. టికెట్లు దక్కని వారు, స్థోమత లేని క్రికెట్ అభిమానులు టెలివిజన్ స్క్రీన్లకు అతుక్కుపోతారు.అన్నట్టు మ్యాచ్ సందర్బంగా కెమెరా మెన్లు పనితీరును మెచ్చుకోవాల్సిందే. మ్యాచ్‌లోని అద్భుత క్షణాలను మాత్రమే కాదు, గ్యాలరీలో చోటు చేసుకునే దృశ్యాలను క్యాప్చర్ చేయడంలో వీరి తర్వాతే ఎవరైనా అన్నట్టు ఉంటారు. అందమైన అమ్మాయిలు వారి చేష్టలు, సెలబ్రిటీ హావభావాలు, తదితర దృశ్యాలు టీవీల ముందు కూర్చున్నవారికి మంచి కాలక్షేపం. -
మహిళల లీగ్‌కు వేళాయె.. తొలి మ్యాచ్‌లో ముంబై వర్సెస్ ఢిల్లీ
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీ రెండో సీజన్‌కు రంగం సిద్ధమైంది. గత ఏడాది తొలి సీజన్లో అభిమానులను ఆకట్టుకొని పలువురు యువ క్రికెటర్లను వెలుగులోకి తెచ్చిన ఈ లీగ్ మరోసారి అదే స్థాయిలో ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. నేడు చిన్నస్వామి స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్ లో గత సీజన్ విజేత ముంబై ఇండియన్స్‌తో రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతుంది. మిగతా మూడు జట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియల్స్, గుజరాత్ జెయింట్స్ కూడా ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. గత ఏడాదిలాగే ఈసారి కూడా టోర్నీలో మొత్తం 22 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. మార్చి 17న ఢిల్లీ వేదికగా ఫైనల్ జరుగుతుంది. తాజా సీజన్ విశేషాలు.... ♦ గత సీజన్లో ఒక్క ముంబైలోనే అన్ని మ్యాచ్ లు జరిగాయి. ఈసారి బెంగళూరు, ఢిల్లీలను వేదికలుగా ఎంపిక చేశారు. ♦ తొలి సీజన్‌లాగే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ‘ఎలిమినేటర్’ మ్యాచ్‌లో తలపడతాయి. ♦ గత ఏడాది ఐదు టీమ్‌లకు కెపె్టన్లుగా వ్యవహరించిన వారే ఈసారి సారథులుగా ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన మెగ్ లానింగ్ (ఢిల్లీ), అలీసా హీలీ (యూపీ), బెత్ మూనీ (గుజరాత్) ఆ్రస్టేలియన్లే కాగా...హర్మన్‌ప్రీత్ (ముంబై), స్మృతి మంధాన (బెంగళూరు) భారత స్టార్లు. భారత్ మినహా ఆసీస్ నుంచే గరిష్టంగా 13 మంది ప్లేయర్లు బరిలోకి దిగుతున్నారు. ♦ 2023 సీజన్లో సత్తా చాటిన సైకా ఇషాక్, శ్రేయాంక పాటిల్ ఆ తర్వాత భారత జట్టుకు ఎంపికయ్యారు. గత ఏడాది వీరిని కనీస ధర రూ.10 లక్షలకు తీసుకోగా... రెండు సీజన్ల మధ్య భారత జట్టుకు ఆడటంతో బీసీసీఐ నిబంధనల ప్రకారం వీరిద్దరికి రూ. 30 లక్షల చొప్పున లభిస్తాయి. ♦ ఈ సీజన్ వేలంలో కాశ్వీ గౌతమ్‌ను రూ.2 కోట్లకు గుజరాత్ జెయింట్స్ టీమ్ ఎంచుకుంది. అయితే గాయం కారణంగా ఆమె ఈ సీజన్ నుంచి అనూహ్యంగా తప్పుకోవడం గమనార్హం. ♦ హైదరాబాద్, ఆంధ్ర జట్ల నుంచి 8 మంది ఈసారి డబ్ల్యూపీఎల్‌లో బరిలోకి దిగనున్నారు. హైదరాబాద్ ప్లేయర్లు అరుంధతి రెడ్డి (ఢిల్లీ), త్రిష పూజిత (గుజరాత్), యషశ్రీ, గౌహర్ సుల్తానా (యూపీ) జట్లకు... ఆంధ్ర క్రికెటర్లు స్నేహ దీప్తి (ఢిల్లీ), సబ్బినేని మేఘన (బెంగళూరు), షబ్నమ్ (గుజరాత్), అంజలి శర్వాణి (యూపీ) టీమ్‌ల తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు. -
IND vs AFG 3rd T20I: రోహిత్ సూపర్... భారత్ ‘డబుల్ సూపర్’...
ఏమా ఉత్కంఠ... ఏమిటా మలుపులు... ఒక టి20 సమరం అభిమానులందరినీ కట్టిపడేసింది. ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో, అదీ అఫ్గానిస్తాన్‌తో పోరు ఏకపక్షం అనుకుంటే నరాలు తెగే పరిస్థితి వచి్చంది. 212 పరుగులు చేశాక భారత్ గెలుపు ఖాయమనిపించి నిశి్చంతగా ఉండగా... అఫ్గానిస్తాన్ మేమేమీ తక్కువ కాదన్నట్లుగా స్కోరు సమం చేసేసింది. ‘సూపర్ ఓవర్’లో ఫలితం తేలుతుందనుకుంటే అక్కడా ఇరు జట్లూ సమమే. చివరకు అంతా రెండో సూపర్‌ను ఆశ్రయించాల్సి వచి్చంది... ఇక్కడ చివరకు పైచేయి సాధించిన టీమిండియా గట్టెక్కింది. తుది ఫలితంతో గెలుపు భారత్‌దే అయినా ఆఖరి వరకు అఫ్గాన్ చూపిన పోరాటపటిమ అసమానం. బెంగళూరు: టి20 ప్రపంచకప్‌కు ముందు తాము ఆడిన ఆఖరి సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల పోరును టీమిండియా 3–0తో సొంతం చేసుకుంది. చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన చివరి టి20లో భారత్ రెండో ‘సూపర్ ఓవర్’లో విజయం సాధించింది. తొలి సూపర్ ఓవర్ ఓవర్లో ఇరు జట్లు 16 పరుగులతో సమంగా నిలిచాయి. రెండో సూపర్ ఓవర్లో ముందుగా భారత్ 11 పరుగులు చేయగా... అఫ్గాన్ 1 పరుగుకే 2 వికెట్లు కోల్పోయింది. నిబంధనల ప్రకారం ‘సూపర్ ఓవర్’లో రెండు వికెట్లు పడితే ఇన్నింగ్స్ ముగిసినట్టే కావడంతో భారత విజయం ఖరారైంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (69 బంతుల్లో 121 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు) అంతర్జాతీయ టి20ల్లో ఐదో సెంచరీతో చెలరేగగా... రింకూ సింగ్ (39 బంతుల్లో 69 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు) మరో మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 95 బంతుల్లోనే అభేద్యంగా 190 పరుగులు జోడించారు. అనంతరం అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 212 పరుగులు సాధించింది. గుల్బదిన్ (23 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), గుర్బాజ్ (32 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఇబ్రహీమ్ జద్రాన్ (41 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. శతక భాగస్వామ్యం... ఫరీద్ వేసిన మూడో బంతిని భారీ షాట్ ఆడబోయి వెనుదిరిగిన యశస్వి... కోహ్లి తొలి బంతికి డకౌట్... అంతా నిశ్శబ్దం... ఫామ్‌లో ఉన్న శివమ్ దూబే కూడా కీపర్‌కు క్యాచ్ ఇవ్వగా, తర్వాతి ఓవర్లో తన తొలి బంతికే సామ్సన్ కూడా సున్నాకే అవుట్! ఐదో ఓవర్ మూడో బంతి ముగిసేసరికి టీమిండియా స్కోరు 21/4... అయితే రోహిత్, రింకూ భాగస్వామ్యం జట్టుకు భారీ స్కోరు అందించింది. 15 ఓవర్లు ముగిసేసరికి 109/4తో స్కోరు మరీ గొప్పగా ఏమీ లేదు. అయితే చివరి ఐదు ఓవర్లలో 22, 13, 10, 22, 36 స్కోర్లతో భారత్ ఏకంగా 103 పరుగులు సాధించింది. 6 ఫోర్లు, 5 సిక్సర్లతో రోహిత్ వీర విధ్వంసం ప్రదర్శించగా... 1 సిక్స్, 4 ఫోర్లతో రింకూ చెలరేగిపోయాడు. 64 బంతుల్లోనే శతకం అందుకొని అంతర్జాతీయ టి20ల్లో ఐదో సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా రోహిత్ నిలవగా... రింకూ ఖాతాలో రెండో అర్ధ సెంచరీ చేరింది. వీరిద్దరి దెబ్బకు అఫ్గాన్ కుదేలైంది. రోహిత్ తన శైలికి భిన్నంగా ఈసారి కొన్ని వైవిధ్యమైన షాట్లతో అలరించడం విశేషం. కరీమ్ వేసిన చివరి ఓవర్లో తొలి మూడు బంతుల్లో రోహిత్ 4, 6 (నోబాల్), 6 కొట్టగా... చివరి మూడు బంతుల్లో రింకూ 6, 6, 6 బాదాడు. అనంతరం అఫ్గాన్ ఓపెనర్లు గుర్బాజ్, ఇబ్రహీమ్ 66 బంతుల్లోనే 93 పరుగులు జోడించి తమ జట్టుకు శుభారంభం అందించారు. వీరు వెనుదిరగడంతో పరిస్థితి మారిపోయింది. ఆ తర్వాత గుల్బదిన్, నబీ (16 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) కలిసి జట్టుకు విజయానికి చేరువగా తెచ్చారు. విజయం కోసం చివరి ఓవర్లో 19 పరుగులు అవసరం కాగా, అఫ్గాన్ 18 పరుగులు చేయడంతో స్కోరు సమమైంది. రిలీఫ్..! ‘ఏంటి వీరూ... లెగ్‌బై ఇచ్చావా, బ్యాట్‌కు అంత బలంగా బంతి తగిలింది... అసలే ఇక్కడ రెండు సున్నాలు ఉన్నాయి’... తను ఆడిన తొలి బంతి లెగ్‌సైడ్ దిశగా ఆడి బౌండరీని తాకగా, అంపైర్ లెగ్‌బై ఇవ్వడంతో అంపైర్ వీరేందర్ శర్మతో రోహిత్ అన్న మాట ఇది! అతని దృష్టిలో ఆ పరుగులు ఎంత విలువైనవో ఇది చెబుతుంది. నిజంగానే టి20ల్లో చాలా కాలంగా రోహిత్ ఫామ్ బాగా లేదు. వన్డేల్లో అద్భుతంగా ఆడుతున్నా 2022 నుంచి అంతర్జాతీయ టి20ల్లో ఈ మ్యాచ్‌కు ముందు 31 ఇన్నింగ్స్‌లలో అతను 3 అర్ధ సెంచరీలే చేశాడు. ఐపీఎల్లో కూడా అంతంతమాత్రంగానే ఆడాడు. ఇటీవలి పరిణామాలు సహజంగానే అతడిని ఇబ్బంది పెట్టాయి. ముంబై ఇండియన్స్ కెపె్టన్సీ పోవడంతో పాటు టీమిండియా కెపె్టన్సీపై కూడా సందేహాలు వచ్చాయి. అసలు వచ్చే టి20 వరల్డ్ కప్‌లో అతను ఆడతాడా అన్నట్లుగా కూడా చర్చ సాగింది. దానికి తోడు తొలి రెండు మ్యాచ్‌లలో డకౌట్. ఇలాంటి స్థితిలో ఈ ఇన్నింగ్స్ అతని స్థాయిని చూపించింది. అఫ్గాన్ మరీ బలమైన ప్రత్యర్థి కాకపోయినా... ఇక్కడా విఫలమైతే పరిస్థితి ఇంకా జఠిలంగా మారేంది. ఈ నేపథ్యంలో సరైన లెక్కలతో చేసిన సెంచరీ రోహిత్‌కు ఊరటనిచి్చందనడంలో సందేహం లేదు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: యశస్వి (సి) నబీ (బి) ఫరీద్ 4; రోహిత్ (నాటౌట్) 121; కోహ్లి (సి) ఇబ్రహీమ్ (బి) ఫరీద్ 0; దూబే (సి) గుర్బాజ్ (బి) అజ్మతుల్లా 1; సామ్సన్ (సి) నబీ (బి) ఫరీద్ 0; రింకూ (నాటౌట్) 69; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 212. వికెట్ల పతనం: 1–18, 2–18, 3–21, 4–22. బౌలింగ్: ఫరీద్ 4–0–20–3, అజ్మతుల్లా 4–0–33–1, ఖైస్ 4–0–28–0, సలీమ్ 3–0–43–0, షరాఫుద్దీన్ 2–0–25–0, కరీమ్ 3–0–54–0. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) సుందర్ (బి) కుల్దీప్ 50; ఇబ్రహీమ్ (స్టంప్డ్) సామ్సన్ (బి) సుందర్ 50; గుల్బదిన్ (నాటౌట్) 55; అజ్మతుల్లా (సి) రవి బిష్ణోయ్ (బి) సుందర్ 0; నబీ (సి) అవేశ్ (బి) సుందర్ 34; కరీమ్ (రనౌట్) 2; నజీబుల్లా (సి) కోహ్లి (బి) అవేశ్ 5; షరాఫుద్దీన్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 212. వికెట్ల పతనం: 1–93, 2–107, 3–107, 4–163, 5–167, 6–182. బౌలింగ్: ముకేశ్ 4–0–44–0, అవేశ్ 4–0–55–1, బిష్ణోయ్ 4–0–38–0, సుందర్ 3–0–18–3, దూబే 2–0–25–0, కుల్దీప్ 3–0–31–1. సూపర్ ఓవర్లలో ఇలా... ముకేశ్ వేసిన తొలి సూపర్ ఓవర్లో అఫ్గానిస్తాన్ 1 సిక్స్, 1 ఫోర్‌తో 16 పరుగులు చేసింది. ఛేదన లో రోహిత్ 2 సిక్స్‌లు కొట్టినా చివరకు భారత్ కూడా 16 పరుగులకే పరిమితమైంది. అవసరమైతే చివరి బంతికి వేగంగా పరుగు తీయాల్సి వస్తుందనే ఆలోచనతో రోహిత్ ఐదో బంతి తర్వాత రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగి రింకూను పంపించాడు. అయితే ఆఖరి బంతికి యశస్వి 2 పరుగులు రాబట్టలేకపోయాడు. ఫరీద్ వేసిన రెండో సూపర్ ఓవర్లో రోహిత్ 4, 6తో భారత్ 11 పరుగులు చేసింది. అయితే బిష్ణోయ్ వేసిన ఈ ఓవర్ తొలి 3 బంతుల్లోనే అఫ్గాన్ 2 వికెట్లు కోల్పోవడంతో భారత్ గెలుపు ఖాయమైంది. -
Rishabh Pant: టీమిండియాతో పంత్.. కోహ్లి, రింకూలతో ముచ్చట (ఫొటోలు)
-
ఆర్సీబీలోకి రచిన్ రవీంద్ర.. హింట్ ఇచ్చిన యువ సంచలనం!
న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అరంగేట్ర వరల్డ్‌కప్‌లోనే అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. కేవలం 23 ఏళ్ల వయస్సులోనే ప్రపంచస్థాయి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారిస్తున్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో మూడు సెంచరీలతో చెలరేగిన రవీంద్ర.. ప్రస్తుతం టోర్నీ టాప్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. టోర్నీలో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన రచిన్.. 565 పరుగులు చేశాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌లోనూ రవీంద్ర అదరగొట్టాడు. తొలుత బౌలింగ్‌లో 2 వికెట్లు పడగొట్టిన రవీంద్ర.. అనంతరం బ్యాటింగ్‌లో 42 పరుగులు చేశాడు. కాగా రవీంద్ర భారత సంతతికి చెందిన క్రికెటర్ అనే విషయం తెలిసిందే. బెంగళూరుకి చెందిన రచిన్ రవీంద్ర తండ్రి రవి కృష్ణమూర్తి, 1990ల్లోనే న్యూజిలాండ్‌కి వెళ్లి అక్కడ స్ధిరపడ్డారు. రవీంద్ర కూడా అక్కడే పుట్టాడు. 2021లో టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్‌తో రవీంద్ర న్యూజిలాండ్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆర్సీబీలోకి రవీంద్ర..! కాగా వరల్డ్‌కప్‌లో అదరగొడుతున్న రవీంద్ర ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాలని భావిస్తున్నట్లు పరోక్షంగా హింట్ ఇచ్చాడు. శ్రీలంకతో మ్యాచ్‌తో అనంతరం రవీంద్ర మాట్లాడుతూ.. "బెంగళూరు, చిన్నస్వామి స్టేడియం అంటే నాకు చాలా ఇష్టం. ఈ రెండు నా హృదయానికి చాలా దగ్గరగా ఉన్నాయి. భవిష్యత్తులో నేను ఇక్కడ మరింత క్రికెట్ ఆడతానని ఆశిస్తున్నాను’’ అని నవ్వుతూ అన్నాడు. కాగా ఇప్పటికే చాలా మంది యువ సంచలనాలకు అవకాశమిచ్చిన ఆర్సీబీ .. రచిన్‌ను కూడా తన అక్కున చేర్చుకుంటుందో లేదో చూడాలి మరి. కాగా ఐపీఎల్-2024 సీజన్‌కు సంబంధించిన మినీవేలం డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనుంది. చదవండి: టీవీల ముందు కూర్చుని ఎవరైనా సలహాలు ఇస్తారు.. అలా కాకుండా: బాబర్ ఆజం -
#ViratKohli: అరుదైన ఘనత.. టి20 చరిత్రలో తొలి ఆటగాడిగా
ఆర్సీబీ తాత్కాలిక కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనత సాధించాడు. టి20 చరిత్రలో ఒకే స్టేడియం వేదికగా 3వేల పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా బుధవారం కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. ఆర్సీబీకి హోంగ్రౌండ్ అయిన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోహ్లి మూడువేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతోపాటు మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అదేంటంటే.. ఐపీఎల్లో కేకేఆర్‌పై అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా కోహ్లి నిలిచాడు. కేకేఆర్‌పై ఇప్పటివరకు కోహ్లి 858 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ 1075 పరుగులతో తొలి స్థానంలో ఉండగా.. 1040 పరుగులతో రోహిత్ శర్మ రెండో స్థానంలో, 858 పరుగులతో కోహ్లి మూడో స్థానంలో, 850 పరుగులతో శిఖర్ ధావన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. King Kohli stamping his authority on #RCBvKKR #TATAIPL #IPLonJioCinema #IPL2023 | @imVkohli pic.twitter.com/pNmi5kdQaA — JioCinema (@JioCinema) April 26, 2023 Virat Kohli completed 3000 runs in Chinnaswamy in the T20 format. First player in history to score 3000 runs in a single venue in T20 pic.twitter.com/856KrGv46P — Johns. (@CricCrazyJohns) April 26, 2023 చదవండి: చెత్త ఫీల్డింగ్‌తో మూడు లైఫ్‌లు.. సిక్సర్లతో రికార్డులకెక్కాడు Virat Kohli: చరిత్రకెక్కిన కోహ్లి.. 580 రోజుల తర్వాత -
Ranji Trophy 2022: ముంబైను ఆపతరమా!
బెంగళూరు: భారత దేశవాళీ క్రికెట్ దిగ్గజ జట్టు ముంబై ఇప్పటికే 41 సార్లు రంజీ ట్రోఫీలో విజేతగా నిలిచింది. 46 సార్లు ఫైనల్ చేరిన ఆ టీమ్ ఐదుసార్లు మాత్రమే తుది పోరులో పరాజయం పాలైంది. మరోవైపు మధ్యప్రదేశ్ ఖాతాలో ఇప్పటి వరకు ఒక్క రంజీ టైటిల్ కూడా లేదు. 23 ఏళ్ల క్రితం ఒకే ఒకసారి ఫైనల్ చేరిన ఆ టీమ్ ఓటమితో సరిపెట్టుకుంది. ఇప్పుడు తమ అంకెను 42కు పెంచుకునేందుకు ముంబైకి, తొలి ట్రోఫీని ముద్దాడేందుకు మధ్యప్రదేశ్‌కు అవకాశం వచ్చింది. ఇరు జట్ల మధ్య నేటి నుంచి చిన్నస్వామి స్టేడియంలో ఫైనల్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. రాబోయే ఐదు రోజుల పాటు ఏ జట్టు ఆధిపత్యం ప్రదర్శించి విజేతగా నిలుస్తుందనేది ఆసక్తికరం. బలాబలాలను బట్టి చూస్తే ముంబైది పైచేయిగా కనిపిస్తున్నా... ఈ సీజన్లో చక్కటి ప్రదర్శన కనబర్చిన మధ్యప్రదేశ్ అంత సులువుగా ఓటమిని అంగీకరించకపోవచ్చు. ఫామ్‌లో బ్యాటర్లు... 7 ఇన్నింగ్స్‌లలో 3 సెంచరీలు, 2 అర్ధసెంచరీలతో ఏకంగా 803 పరుగులు... ఈ సీజన్లో సర్ఫరాజ్ ఖాన్ ఫామ్ ఇది. యశస్వి జైస్వాల్ (419) కూడా సత్తా చాటగా, అర్మాన్ జాఫర్, సువేద్ పార్కర్ కూడా కీలక పరుగులతో ముంబైని నడిపించారు. రజత్ పటిదార్ కీలకం... ఆదిత్య శ్రీవాస్తవ కెప్టెన్సీలోని మధ్యప్రదేశ్ జట్టులో స్టార్స్ లేకపోయినా సమష్టి తత్వమే టీమ్‌ను ఫైనల్ వరకు చేర్చింది. ఐపీఎల్లో సత్తా చాటిన రజత్ పటిదార్ (506 పరుగులు) దేశవాళీ టీమ్ తరఫున కూడా టాప్ స్కోరర్‌గా బ్యాటింగ్ భారం మోస్తున్నాడు. యశ్ దూబే (480), శుభమ్ శర్మ (462), హిమాన్షు (307) కీలక ఆటగాళ్లు. వీరిలో ఏ ఇద్దరు రాణించినా మధ్యప్రదేశ్ మెరుగైన స్థితికి చేరగలదు. ఐపీఎల్లో ముంబై తరఫున ఆకట్టుకున్న లెఫ్టార్మ్ స్పిన్నర్ కుమార్ కార్తికేయ (27 వికెట్లు) బౌలింగ్‌లో మరోసారి ముందుండి నడిపించనున్నాడు. -
Ind Vs SA: ప్రపంచంలోనే సంపన్న బోర్డు.. ఇక్కడేమో దిక్కుమాలిన పరిస్థితి!
Ind Vs SA T20 Series- 5th T20: ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి! వైట్‌వాష్‌కు బదులు వైట్వాష్తోనే సమాధానం చెప్పాలి.. కానీ రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ.. అనువజ్ఞుడైన బ్యాటర్ విరాట్ కోహ్లి, సీనియర్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ.. చాలా మంది సీనియర్లు జట్టులో లేరు!.. ఆఖరి నిమిషంలో కేఎల్ రాహుల్ అవుట్! యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌కు సారథ్య బాధ్యతలు! స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు భారత జట్టులో జరిగిన పరిణామాలు.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి రెండింటిలో తెంబా బవుమా బృందం చేతిలో ఓటమి.. 0-2తో వెనుకంజ.. క్లీన్‌స్వీప్ సంగతి దేవుడెరుగు.. ఎలాగైనా సిరీస్ గెలిస్తే చాలు.. సగటు అభిమాని ఆశ..! అందుకు తగ్గట్టుగానే పడిలేచిన కెరటంలా పంత్ సేన వరుసగా రెండు విజయాలు సాధించింది. ప్రొటిస్ జోరుకు బ్రేక్ వేస్తూ 2-2తో సిరీస్‌ను సమం చేసింది. అదే జోష్‌లో మూడో గెలుపు నమోదు చేసి ట్రోఫీ గెలవాలనే కసితో బెంగళూరుకు చేరుకుంది. కానీ, వరుణుడు టీమిండియా, అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు. రూఫ్ లీకేజీ(PC: Twitter) ఇదేం ఖర్మరా బాబు! సిరీస్ విజేతను నిర్ణయించే మ్యాచ్ రద్దు అయిపోయింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఆసక్తికర పోరును వీక్షిద్దామనుకుంటే ఇలా జరిగిందేమిటబ్బా అని ఉసూరుమన్నారు. మ్యాచ్ పోయిందనే బాధతో పాటు డబ్బులు ఖర్చు పెట్టుకుని మ్యాచ్ చూడటానికి వస్తే ఇదేం ఖర్మరా బాబూ అంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి తీరును తిట్టిపోశారు. మ్యాచ్‌కు వేదిక అయిన ఎం. చిన్నస్వామి స్టేడియం పైకప్పు నుంచి నీళ్లు కారడమే ఇందుకు కారణం. స్టేడియంలో ప్రేక్షకుల అసౌకర్యాన్ని వివరిస్తూ ఓ నెటిజన్.. రూఫ్ నుంచి వాటర్ లీక్ అవుతున్న వీడియోను ట్విటర్లో షేర్ చేశాడు. ‘‘ఈరోజు మ్యాచ్ రద్దైన దాని కంటే ఎక్కువగా స్టేడియంలోని పరిస్థితులే మరింత ఎక్కువ నిరాశకు గురిచేశాయి! ప్రపంచంలోనే సంపన్న బోర్డు... కానీ ఫ్యాన్స్‌కు మాత్రం ఇలాంటి దిక్కుమాలిన పరిస్థితి. బీసీసీఐ, కర్ణాటక బోర్డు ఇంకా ఎప్పుడు వీటిని సరిదిద్దుతాయి. అభిమానికి ఆటను ఆస్వాదించే మజాను అందిస్తాయి’’ అంటూ సెటైర్లు వేశాడు. ఈ క్రమంలో బీసీసీఐ తీరుపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కోట్లకు కోట్లు వస్తున్నా దిక్కుమాలిన పరిస్థితి! బోర్డుపై కనక వర్షం కురుస్తున్నా.. మ్యాచ్ చూద్దామని వచ్చిన ప్రేక్షకులపై వర్షం పడకుండా కనీస సౌకర్యాలు కల్పించలేరా అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఏంటి? మాకేంటి? ఇదంతా! అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా.. ఇటీవల ఐపీఎల్ మీడియా హక్కులు రికార్డు స్థాయిలో భారీ ధరకు అమ్ముడుపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ బోర్డు తీరును తప్పుపడుతున్నారు. చదవండి: Trolls On Ruturaj Gaikwad: అసలేంటి రుతురాజ్ నువ్వు? నీ నుంచి ఇది అస్సలు ఊహించలేదు.. మరీ ఇలా చేస్తావా? పాపం.. Rishabh Pant: ఆటగాడిగా, కెప్టెన్‌గా వందకు వంద శాతం.. ఏదేమైనా: పంత్ కౌంటర్! What was even more disappointing was the state of affairs inside the stadium! The richest board in the world and these are the kind of conditions their fans need to put up with! When will @BCCI @kscaofficial1 improve fan experience befitting the stature of the sport?? pic.twitter.com/eacucPnwUp — Srinivas Ramamohan (@srini_ramamohan) June 19, 2022 🚨 Update 🚨 Play has heen officially called off. The fifth & final @Paytm #INDvSA T20I has been abandoned due to rain. #TeamIndia pic.twitter.com/tQWmfaK3SV — BCCI (@BCCI) June 19, 2022 -
ఆఖరి సమరానికి సమయం.. పిచ్ ఎలా ఉందంటే!
బెంగళూరు: భారత్, దక్షిణాఫ్రికా మధ్య టి20 సిరీస్‌లో విజేతను తేల్చే చివరి పోరుకు రంగం సిద్ధమైంది. నేడు చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఐదో మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. తొలి రెండు మ్యాచ్‌లలో గెలిచి ఒక్కసారిగా దక్షిణాఫ్రికా ఆధిపత్యం ప్రదర్శించగా... భారత్ సరైన సమయంలో కోలుకొని రెండు వరుస విజయాలతో సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. తాజా ఫామ్‌ను కొనసాగిస్తూ సొంతగడ్డపై పంత్ సేన తమ ఖాతాలో గెలుపును వేసుకుంటుందో లేక సఫారీ టీమ్ మళ్లీ చెలరేగుతుందా చూడాలి. అదే జట్టుతో... కొత్త ఆటగాళ్లు అప్పుడే తుది జట్టులో స్థానం ఆశించవద్దని సిరీస్‌కు ముందే చెప్పిన హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ దానికే కట్టుబడ్డాడు. రెండు ఓటముల తర్వాత కూడా అనూహ్య మార్పులకు అవకాశం ఇవ్వకుండా అదే టీమ్‌ను కొనసాగించడం ఫలితాన్ని ఇచ్చింది. అటు బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్, రుతురాజ్, హార్దిక్ పాండ్యా ఆకట్టుకోగా, బౌలింగ్‌లో హర్షల్, అవేశ్, చహల్ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. కెప్టెన్ రిషభ్ పంత్ మాత్రం తన స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చకపోగా, శ్రేయస్ అయ్యర్ నుంచి కూడా ఆశించిన ప్రదర్శన రాలేదు. వీరిద్దరు చివరి మ్యాచ్‌లో చెలరేగాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ఫినిషర్‌గా దినేశ్ కార్తీక్ తనకు అప్పజెప్పిన పాత్రను మరింత సమర్థంగా పోషించాడు. ఇప్పుడు తన సొంత మైదానంలాంటి బెంగళూరులో అతను ఎలా చెలరేగుతాడో చూడాలి. అన్నింటికి మించి భువనేశ్వర్ ఒకప్పటి తన ఆటను గుర్తుకు తెస్తూ చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకోవడం సానుకూలాంశం. డికాక్ రాణించేనా! దక్షిణాఫ్రికా జట్టులో అనుభవం, ఆటతీరును బట్టి చూస్తే డికాక్ అందరికంటే కీలక ఆటగాడు. గాయంతో సిరీస్‌లో రెండు మ్యాచ్‌లకు దూరమైన అతను మిగిలిన రెండు మ్యాచ్‌లలోనూ ప్రభావం చూపలేదు. ఐపీఎల్ తరహాలో దూకుడుగా ఆడితే సఫారీ టీమ్‌కు శుభారంభం లభిస్తుంది. ప్రిటోరియస్, డసెన్, క్లాసెన్ తాము ఒక్క మ్యాచ్ హీరోలం మాత్రమే కాదని నిరూపించుకోవాల్సి ఉంది. మిడిలార్డర్లో మిల్లర్ మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. బౌలింగ్‌లో ఇద్దరు స్పిన్నర్లు కేశవ్, షమ్సీ తేలిపోయారు. వీరిని భారత బ్యాటర్లు చితక్కొట్టారు. నోర్జే ఫర్వాలేదనిపించగా, గత మ్యాచ్‌లో ఆడని రబడ బరిలోకి దిగితే జట్టు బలం పెరుగుతుంది. గాయపడిన కెప్టెన్ బవుమా కోలుకోకపోతే హెన్డ్రిక్స్ ఓపెనర్‌గా ఆడతాడు. ఇదే సిరీస్‌లో తమ జట్టు అత్యధిక ఛేదన, అత్యల్ప టి20 స్కోరు సాధించిన దక్షిణాఫ్రికా విజయంతో ముగిస్తుందా అనేది చూడాలి. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: పంత్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్, శ్రేయస్, హార్దిక్, కార్తీక్, అక్షర్, హర్షల్, భువనేశ్వర్, అవేశ్, చహల్. దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్)/హెన్డ్రిక్స్, డికాక్, ప్రిటోరియస్, వాన్‌డర్ డసెన్, క్లాసెన్, మిల్లర్, జాన్సన్, రబడ, నోర్జే, ఇన్‌గిడి, షమ్సీ. పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు బాగా అనుకూలమైన మైదానం. చిన్న బౌండరీలతో భారీ స్కోరుకు అవకాశం. అయితే వాతావరణం మ్యాచ్‌కు అంతరాయం కలిగించవచ్చు. శుక్రవారం బెంగళూరులో భారీ వర్షం కురవగా, శనివారం కూడా వర్షంతో రంజీ సెమీస్ ఆలస్యంగా మొదలైంది. -
Ind Vs Sl 2nd Test: విహారికి ఛాన్స్.. మరి సిరాజ్?
India Vs Sri Lanka 2nd Test- బెంగళూరు: మూడు రోజుల్లోపే తొలి టెస్టులో శ్రీలంక ఆట ముగించిన భారత్ ఇప్పుడు అదే ప్రదర్శనను పునరావృతం చేసేందుకు సిద్ధమైంది. నేటి నుంచి చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది. తాజా ఫామ్, బలాబలాల దృష్ట్యా ప్రత్యర్థికంటే ఎంతో పటిష్టంగా ఉన్న టీమిండియాకు ఇక్కడా అడ్డు ఉండకపోవచ్చు. తొలి పోరులో ఘోర వైఫల్యం తర్వాత రెండో టెస్టులో లంక ఏమాత్రం పోటీనిస్తుందనేది చూడాలి. ఫ్లడ్ లైట్ల వెలుగులో ‘డే అండ్ నైట్’గా గులాబీ బంతితో జరగనున్న ఈ మ్యాచ్‌కు మైదానంలో ప్రేక్షకులను 100 శాతం అనుమతిస్తుండటం చెప్పుకోదగ్గ విశేషం. సిరాజ్‌కు అవకాశం ఇస్తారా! మొహాలీలో భారత జట్టు ప్రదర్శన చూసిన తర్వాత సహజంగానే తుది జట్టులో మార్పులకు అవకాశం కనిపించదు. రోహిత్‌తో పాటు సొంతగడ్డపై మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. మూడో స్థానంలో హనుమ విహారికి మళ్లీ అవకాశం ఖాయం కాగా... కోహ్లి ఈ మ్యాచ్‌లోనైనా సెంచరీ సాధించి సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతాడా చూడాలి. శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజాలతో మిడిలార్డర్ పటిష్టంగా ఉండగా ఆ తర్వాత అశ్విన్ కూడా సత్తా చాటగలడు. బుమ్రా, షమీ ఖాయం కాగా... మూడో స్పిన్నర్‌గా జయంత్ యాదవ్ స్థానంలో అక్షర్ పటేల్‌ను ఆడించడంపై టీమ్ మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది. అయితే ‘పింక్ బంతి’ బాగా స్వింగ్ అయ్యే అవకాశం ఉండటంతో దాదాపు సొంత మైదానంలాంటి చిన్నస్వామిలో మూడో పేసర్‌గా హైదరాబాద్ బౌలర్ సిరాజ్‌కు చాన్స్ లభిస్తుందేమో చూడాలి. తుది జట్టులో ఎవరు? మొదట టి20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్ అయి తొలి టెస్టులోనూ ఓడిన శ్రీలంక ఇప్పుడు రెండో మ్యాచ్ కోసం తుది జట్టును సిద్ధం చేసుకోవడమే కష్టంగా మారింది. గత మ్యాచ్‌లో ఆడిన కుమార, నిసాంకా గాయాలతో దూరం కాగా, ఆడే అవకాశం ఉన్న చమీరా కూడా గాయపడ్డాడు. కుశాల్ మెండిస్ కోలుకోవడం ఆ జట్టుకు ఊరట. అసలంక స్థానంలో చండిమాల్‌కు అవకాశం దక్కవచ్చు. మరోసారి టీమ్ బ్యాటింగ్ సీనియర్లు కరుణరత్నే, ఏంజెలో మాథ్యూస్లపైనే ఆధారపడి ఉంది. ఎంబుల్డెనియాతో పాటు కొత్తగా వస్తున్న చమిక కరుణరత్నే భారత్‌ను ఏమాత్రం కట్టడి చేయగలరో చూడాలి. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్న సురంగ లక్మల్ ఆటపై అందరి దృష్టీ ఉంది. 4:భారత్‌కు ఇది నాలుగో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్... స్వదేశంలో బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌లపై గెలిచిన భారత్ ఆస్ట్రేలియా గడ్డపై ఓడింది. 400: మూడు ఫార్మాట్లలో కలిపి రోహిత్‌కిది 400వ అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. #TeamIndia vice-captain @Jaspritbumrah93 on the mental changes that need to be made for a Pink Ball Test.@Paytm #INDvSL pic.twitter.com/PCfrY6sJe7 — BCCI (@BCCI) March 11, 2022 -
నంబర్‌వన్ మా లక్ష్యం కాదు
* మంచి క్రికెట్ ఆడడమే ముఖ్యం * టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి బెంగళూరు: నిరంతరం మారే ర్యాంకులను దృష్టిలో పెట్టుకుని టీమిండియా ఆడదని టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. అలాగే రానున్న రోజుల్లో జరగబోయే టెస్టు మ్యాచ్‌లకు తామెలా సన్నద్ధమయ్యామో వెస్టిండీస్ పర్యటన తేలుస్తుందని అన్నాడు. తమ లక్ష్యం నంబర్‌వన్‌కు చేరడం కాదని, మంచి క్రికెట్ ఆడడమే తమకు ముఖ్యమని తేల్చాడు. కరీబియన్ టూర్‌కు వెళ్లే ముందు కోచ్ అనిల్ కుంబ్లేతో కలిసి చిన్నస్వామి స్టేడియంలో విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. విండీస్‌తో ఈనెల 21 నుంచి భారత జట్టు నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్‌ను 4-0తో క్లీన్‌స్వీప్ చేస్తే భారత్ నంబర్‌వన్ ర్యాంకును దక్కించుకుంటుంది. ‘ఓ టెస్టు జట్టుగా మాకు మేము సవాల్‌ను ఎదుర్కొంటూ ఓ అంచనాకు రావడానికి ఇదే సరైన అవకాశం. భవిష్యత్‌లో మేమెలా ఆడతామో కొన్ని నెలల్లో తేలుతుంది. ఈ ఫార్మాట్లో నంబర్‌వన్ ర్యాంకును పొందడం మా లక్ష్యం కాదు. మా ప్రధాన లక్ష్యం మంచి క్రికెట్ ఆడడమే. ఒక్కో టెస్టుపై దృష్టి పెడుతూ ముందుకు సాగుతాం’ అని కోహ్లి అన్నాడు. టెస్టు జట్టులో కేఎల్ రాహుల్ ఉన్నా కీపర్‌గా తమ తొలి ప్రాధాన్యం వృద్ధిమాన్ సాహాకేనని తేల్చాడు. దాదాపు 15 నెలలు భారత జట్టుకు దూరంగా ఉన్న పేసర్ మొహమ్మద్ షమీ నాణ్యమైన బౌలర్ అని కొనియాడాడు. టెస్టు మ్యాచ్‌లకు అతడి లైన్ అండ్ లెంగ్త్ సరిగ్గా సరిపోతుందని, విండీస్ పిచ్‌లపై అతడు రాణించడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశాడు. విరాట్ దూకుడును అడ్డుకోను: కుంబ్లే మైదానంలో కెప్టెన్ విరాట్ కోహ్లి దూకుడును తాను అడ్డుకోనని కోచ్ కుంబ్లే తెలిపారు. అయితే తామంతా భారత రాయబారులమనే విషయాన్ని కూడా క్రికెటర్లు గుర్తుంచుకోవాలని సూచించారు. దేనికైనా ఓ హద్దు ఉంటుందని గుర్తుచేశారు. ఏ ఆటగాడి సహజసిద్ధమైన దూకుడును తాను అడ్డుకోనని, కానీ క్రికెట్ గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం కూడా వారిపైనే ఉందని అన్నారు. రానున్న 17 టెస్టుల్లో నిలకడగా ఆడి వీలైనన్ని మ్యాచ్‌లను గెలవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆటను ఆస్వాదించండి: ధోని బిజీ షెడ్యూల్ ముందుండడంతో మైదానం వెలుపలా, లోపలా సరదాగా ఉండడం ఎంతో ముఖ్యమని వన్డే కెప్టెన్ ఎంఎస్ ధోని ఆటగాళ్లకు తెలిపాడు. ఆదివారం జరిగిన డ్రమ్ సర్కిల్లో పాల్గొన్న అనంతరం కొద్దిసేపు క్రికెటర్లతో సంభాషించాడు. తొలిసారిగా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు కలిగిన అనుభూతే క్రికెట్లోనూ చూపించాలని అన్నాడు. యువ ఆటగాళ్లతో కూడిన టెస్టు జట్టు ఇక సత్తా నిరూపించుకుని భవిష్యత్‌పై భరోసా కల్పించేలా ఆడాల్సిన తరుణం ఇదేనని వారికి హితబోధ చేశాడు. -
ఐపీఎల్ నవాబ్స్
హమారా హైదరాబాద్ ఐపీఎల్ చాంపియన్ బన్‌గయా... సన్‌రైజర్స్ అద్భుతాన్ని చేసి చూపించింది. టోర్నీ ఆద్యంతం నిలకడను ప్రదర్శించిన ఆరెంజ్ ఆర్మీ ఆఖరి పోరులో కూడా సత్తా చాటింది. గేల్, కోహ్లిల తుఫాన్ బ్యాటింగ్‌కు అసమాన బౌలింగ్‌తో ఎదురొడ్డి విజయబావుటా ఎగరేసింది. ఆదినుంచి నమ్ముకున్న బౌలర్లు మరోసారి నమ్మకాన్ని నిలబెట్టడంతో లీగ్‌లో తొలి సారి విజేతల జాబితాలో సగర్వంగా తమ పేరును లిఖించుకుంది. జట్టులో సూపర్ స్టార్లు లేకపోయినా... కీలక సమయంలో ప్రతీ ఒక్కరూ చెలరేగడంతో ఐపీఎల్-9కు సన్‌రైజర్స్ అద్భుత ముగింపునిచ్చింది. సీజన్ ఆరంభం నుంచి జట్టులో ఉన్నా అనామకుడిలా కనిపించిన కటింగ్ ఫైనల్‌కు ముందు ఆడింది మూడు మ్యాచ్‌లే. కానీ అసలు మ్యాచ్‌లో అతను హీరోగా అవతరించాడు. 15 బంతుల్లో అతను చేసిన 39 పరుగులు రైజర్స్ భారీ స్కోరుకు బాటలు వేయగా, తర్వాత 2 వికెట్లు తీసి తన విలువను చూపించాడు. ఇక ఎప్పటిలాగే ప్రాణం పెట్టి ఆడిన కెప్టెన్ వార్నర్ మరో అర్ధ సెంచరీతో తన పరుగుల ఆకలిని తీర్చుకున్నాడు. నాయకుడిగా జట్టును గెలిపించి విజయ గర్జన చేశాడు. విరాట్ కోహ్లికి సంబంధించి ఇదో విషాదాంత ముగింపు. సీజన్లో 973 పరుగులతో ఒంటి చేత్తో జట్టును నడిపించిన అతను చివరి మెట్టుపై కూలిపోయాడు. సొంతగడ్డపైనే బెంగళూరుకు అనూహ్య పరాజయం ఎదురవడం అతడిని చాలా కాలం వెంటాడవచ్చు. గేల్‌తో కలిసి ఒక దశలో సునాయాసంగా గెలుపు దిశగా వెళ్లినా... చివరకు ఓటమినే జీర్ణించుకోవాల్సి వచ్చింది. బెంగళూరు: ఐపీఎల్-2016 చాంపియన్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ అవతరించింది. ఆదివారం ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్లో హైదరాబాద్ 8 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (38 బంతుల్లో 69; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీకి తోడు బెన్ కటింగ్ (15 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), యువరాజ్ (23 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగారు. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 200 పరుగులు చేసింది. క్రిస్ గేల్ (38 బంతుల్లో 76; 4 ఫోర్లు, 8 సిక్సర్లు), కోహ్లి (35 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్‌కు 63 బంతుల్లోనే 114 పరుగులు జోడించి గట్టి పునాది వేసినా... ఇతర బ్యాట్స్‌మెన్ వైఫల్యం జట్టును దెబ్బ తీసింది. 2013లో ఐపీఎల్‌లోకి అడుగు పెట్టిన సన్‌రైజర్స్ నాలుగో ప్రయత్నంలో టైటిల్ సాధించింది. గతంలో డెక్కన్ చార్జర్స్ పేరుతో ఉన్న హైదరాబాద్ జట్టు 2009లో విజేతగా నిలిచింది. కటింగ్ దూకుడు... 24 బంతుల్లోనే అర్ధ సెంచరీ... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రైజర్స్ కెప్టెన్ వార్నర్ దానికి న్యాయం చేస్తూ బౌండరీలతో చెలరేగిపోయాడు. ఒక వైపు ధావన్ (25 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) నెమ్మదిగా ఆడినా, వార్నర్ జోరుతో సన్ స్కోరు దూసుకుపోయింది. వాట్సన్ వేసిన ఐదో ఓవర్లో 2 సిక్సర్లు, ఫోర్‌తో 19 పరుగులు కొల్లగొట్టిన హైదరాబాద్, గేల్ వేసిన తర్వాతి ఓవర్లో మరో 13 పరుగులు రాబట్టడంతో పవర్‌ప్లేలో స్కోరు 59 పరుగులకు చేరింది. తర్వాతి ఓవర్లోనే ధావన్ వెనుదిరగ్గా, హెన్రిక్స్ (4) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. 52 పరుగుల వద్ద కీపర్ రాహుల్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన వార్నర్, జోర్డాన్ వేసిన తర్వాతి ఓవర్లో రెండు వరుస ఫోర్లు కొట్టాడు. అయితే అరవింద్ వేసిన బంతిని కట్ చేయబోయి షార్ట్ థర్డ్‌మాన్‌లో క్యాచ్ ఇవ్వడంతో అతని అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. మరో ఎండ్‌లో యువరాజ్ ధాటిని ప్రదర్శిస్తూ కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. చహల్ ఓవర్లో అతను వరుసగా 4, 6 బాదడంతో స్కోరు వేగం పుంజుకుంది. అయితే కీలక సమయంలో వరుస బంతుల్లో హుడా (3) యువరాజ్ వెనుదిరగడం సన్ను దెబ్బ తీసింది. చివర్లో కటింగ్ మెరుపు బ్యాటింగ్‌తో రైజర్స్ 200 పరుగులు దాటింది. వాట్సన్ వేసిన చివరి ఓవర్లో కటింగ్ 3 సిక్సర్లు, 2 ఫోర్లు బాదడంతో మొత్తం 24 పరుగులు వచ్చాయి. ఆర్సీబీ చక్కటి బౌలింగ్‌కు 13-17 ఓవర్ల మధ్య ఐదు ఓవర్లలో 40 పరుగులు మాత్రమే చేసిన రైజర్స్ ఆఖరి 3 ఓవర్లలో 52 పరుగులు రాబట్టింది. గేల్ సునామీ... భారీ లక్ష్య ఛేదనలో బెంగళూరుకు గేల్ అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. భువనేశ్వర్ బౌలింగ్‌లో జాగ్రత్తగానే ఆడినా... బరీందర్ 2 ఓవర్లలో అతను 3 సిక్సర్లు, ఫోర్ బాదడంతో మొత్తం 29 పరుగులు వచ్చాయి. కటింగ్ ఓవర్లోనూ సిక్స్, ఫోర్ కొట్టిన గేల్ 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ముస్తఫిజుర్ వేసిన ఆరో ఓవర్లో మాత్రం 4 పరుగులు చేసిన బెంగళూరు తర్వాతి మూడు ఓవర్లలో మరింత చెలరేగిపోయింది. ఈ మూడు ఓవర్లలో మొత్తం 41 పరుగులు వచ్చాయి. హెన్రిక్స్ ఓవర్లోనైతే గేల్ 2 సిక్సర్లు, 2 ఫోర్లతో పండగ చేసుకున్నాడు. ఎట్టకేలకు 11వ ఓవర్ మూడో బంతికి గేల్ అవుట్ కావడంతో భారీ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత కోహ్లి తన దూకుడును కొనసాగిస్తూ 32 బంతుల్లో హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. అయితే ఏడు బంతుల వ్యవధిలో కోహ్లి, డివిలియర్స్ (5) అవుట్ కావడంతో బెంగళూరు ఇబ్బందుల్లో పడింది. ఆ తర్వాత రాహుల్ (11), వాట్సన్ (11) విఫలం కావడంతో చాలెంజర్స్‌కు ఓటమి తప్పలేదు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) అబ్దుల్లా (బి) అరవింద్ 69; ధావన్ (సి) జోర్డాన్ (బి) చహల్ 28; హెన్రిక్స్ (సి) చహల్ (బి) జోర్డాన్ 4; యువరాజ్ (సి) వాట్సన్ (బి) జోర్డాన్ 38; హుడా (సి) కోహ్లి (బి) అరవింద్ 3; కటింగ్ (నాటౌట్) 39; ఓజా (రనౌట్) 7; బిపుల్ (సి) చహల్ (బి) జోర్డాన్ 7; భువనేశ్వర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1-63; 2-97; 3-125; 4-147; 5-148; 6-158; 7-174. బౌలింగ్: అరవింద్ 4-0-30-2; గేల్ 3-0-24-0; వాట్సన్ 4-0-61-0; చహల్ 4-0-35-1; అబ్దుల్లా 1-0-10-0; జోర్డాన్ 4-0-45-3. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: గేల్ (సి) బిపుల్ (బి) కటింగ్ 76; కోహ్లి (బి) బరీందర్ 54; డివిలియర్స్ (సి) హెన్రిక్స్ (బి) బిపుల్ 5; రాహుల్ (బి) కటింగ్ 11; వాట్సన్ (సి) హెన్రిక్స్ (బి) ముస్తఫిజుర్ 11; సచిన్ బేబీ (నాటౌట్) 18; బిన్నీ (రనౌట్) 9; జోర్డాన్ (రనౌట్) 3; అబ్దుల్లా (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1-114; 2-140; 3-148; 4-160; 5-164; 6-180; 7-194. బౌలింగ్: భువనేశ్వర్ 4-0-25-0; బరీందర్ 3-0-41-1; కటింగ్ 4-0-35-2; ముస్తఫిజుర్ 4-0-37-1; హెన్రిక్స్ 3-0-40-0; బిపుల్ 2-0-17-1. -
ఐపీఎల్ ఫీవర్
బెంగళూరు (బనశంకరి) : వీకెండ్ రోజు ఉద్యానగరి వాసులకు ఐపీఎల్ మంచి కాలక్షేపమైంది. దీంతో ఆదివారం చిన్నస్వామి స్టేడియం క్రికెట్ అభిమానులతో కిటకిటలాడింది. రాత్రి 8 గంటలకు చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్, ఢిల్లీ డేర్‌డేవిల్స్ మధ్య జరిగిన మ్యాచ్ తిలకించడానికి ఉదయం నుంచి పడిగాపులు పడ్డారు. స్టేడియం వద్ద స్టార్ బ్యాట్స్‌మెన్ కటౌట్లు, ఫోర్, సిక్సర్‌తో కూడిన ప్లకార్డులకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఢిల్లీ డేర్‌డేవిల్స్ కోచ్‌గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రావిడ్, క్రికెటర్లు కరుణ్నాయర్ కటౌట్, స్టిక్కర్లును వ్యాపారులు విక్రయిస్తున్న దృశ్యాలు స్టేడియం వద్ద కనిపించాయి. ఇదే సందర్భంలో పలు ప్రధాన రోడ్లలో ట్రాఫిక్ స్తంభించి పోయింది. -
ఐపీఎల్‌పై హైకోర్టులో పిల్
బెంగళూరు : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్‌ల విషయమై కర్ణాటక హైకోర్టులో సోమవారం ప్రజాహిత వాజ్యం దాఖలైంది. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితుల వల్ల తాగునీటి విషయమై ప్రజలు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని అయితే ఐపీఎల్ కోసమంటూ ఎక్కువ పరిమాణంలో నీటిని స్టేడియంలోని పిచ్‌లను తడపడం సరికాదంటూ నగరానికి చెందిన శ్రీనివాస్‌శర్మ అనే అర్చకుడు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. అంతేకాకుండా సదరు నీటిని కూడా జలమండలి అక్రమంగా సరఫరా చేస్తోందని ఫిర్యాదుదారుడు న్యాయస్థానానికి తెలిపారు. అందువల్ల చిన్నస్వామి స్టేడియంకు వినియోగించే నీటిపై ఆడిట్‌ను జరపాల్సిన అవసరం ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
వర్ణ రంజితం కావాలి
నేడు బంగ్లాదేశ్‌తో భారత్ ఢీ నెట్న్ర్రేట్పై ధోనిసేన దృష్టి తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోగానే... తెల్ల గోడ వెలిసిపోయినట్లు అనిపించింది. మన నీలి రంగు మెరుపు తగ్గిందనే ఆందోళన కలిగింది. తర్వాత మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేయగానే... ప్రత్యర్థిపై పచ్చరంగు చల్లి బల్లే బల్లే అంటూ గంతులేశాం. ఇప్పుడు ప్రత్యర్థిపై అన్ని రంగులూ కలిపి బలంగా చల్లాల్సిన సమయం వచ్చింది. ఏదో సాదాసీదా గెలుపు గులాల్‌తో సరిపెట్టకుండా రంగ్‌దే బసంతి అంటూ రంగుల్లో ముంచెత్తాలి. హోళీ వేల యావత్ దేశం ధోనిసేన నుంచి ‘కలర్‌ఫుల్’ విజయాన్ని ఆశిస్తోంది. పాక్‌ను కసితీరా ఓడించినా... మరో పక్క అడపాదడపా విజయాలతో పక్కలో బల్లెంలా మారుతున్న బంగ్లాదేశ్‌నూ తక్కువ అంచనా వేయకూడదు. తర్వాతి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఉన్నందున ఈ మ్యాచ్‌లో బంగ్లాపై భారీ విజయం సాధించి నెట్న్‌ర్రేట్‌ను మెరుగు పరుచుకోవాలి. సెమీస్ బెర్త్‌లను ఖరారు చేసే ప్రక్రియలో నెట్న్‌ర్రేట్ కూడా అవసరం కావచ్చు మరి. బెంగళూరునుంచి సాక్షి క్రీడా ప్రతినిధి: టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు తమ మూడో లీగ్ మ్యాచ్‌కు సన్నద్ధమైంది. నేడు (బుధవారం) ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో భారత్ జట్టు బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఒక మ్యాచ్ గెలిచి, మరో మ్యాచ్‌లో ఓడిన ధోనిసేన ఇక్కడా నెగ్గితే సెమీస్ అవకాశాలు మరింత మెరుగవుతాయి. మరో వైపు ఇప్పటికే రెండు ఓటములు మూటగట్టుకున్న బంగ్లా ఓడితే అధికారికంగా టోర్నీనుంచి నిష్ర్కమిస్తుంది. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉండటంతో ఈ మ్యాచ్‌లో విజయంతో పాటు సాధ్యమైనంతగా రన్‌రేట్‌ను పెంచుకోవాలని కూడా భారత జట్టు భావిస్తోంది. రైనా, ధావన్‌లపై ప్రత్యేక దృష్టి: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు భారత ఆటగాళ్లు మంగళవారం నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. మూడు గంటల పాటు క్రికెటర్లు ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. అయితే టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి ప్రత్యేకంగా మరో నెట్స్‌లో ధావన్, రైనాల చేత ప్రాక్టీస్ చేయించారు. అంతా బాగుందని చెబుతున్నా ప్రస్తుతం జట్టు ఫామ్, ఆటతీరును చూస్తే వీరిద్దరు రాణించడమే ముఖ్యమని జట్టు గుర్తించినట్లుంది. వీరిద్దరికి అన్ని రకాల బౌలింగ్‌లు వేయిస్తూ శాస్త్రి సాధనను పర్యవేక్షించారు. అందరికంటే ముందుగా వచ్చిన ధావన్ ఆఖర్లో వెళ్లగా, రైనా కూడా సుదీర్ఘ సమయం పాటు సాధన చేశాడు. అశ్విన్ బౌలింగ్‌కంటే బ్యాటింగ్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టడం కనిపించింది. ఆసియా కప్‌లో ఇటీవలే రెండు సార్లు బంగ్లాదేశ్‌తో తలపడి గెలవడం, ఇరు జట్లలో పెద్దగా మార్పులు కూడా లేకపోవడంతో టీమిండియా అదే జోరులో హ్యట్రిక్ విజయంపై దృష్టి పెట్టింది. జట్టులో మార్పులకు కూడా ఇక ఏ మాత్రం అవకాశం లేదు. నైరాశ్యంలో బంగ్లాదేశ్: సోమవారం ఇదే మైదానంలో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన బంగ్లాదేశ్ భారత్‌తో మ్యాచ్‌కు ముందు రోజు ప్రాక్టీస్‌లో పాల్గొనలేదు. ఐసీసీ నిషేధం కారణంగా ఇద్దరు కీలక ఆటగాళ్లను కోల్పోవడంతో గత మ్యాచ్‌లో టాస్ సమయంలోనే కెప్టెన్ మషఫ్ ్రమొర్తజా మొహంలో ఒకింత నైరాశ్యం కనిపించింది. ప్రధాన బౌలర్ అయి ఉండీ అతను ఒక్క ఓవర్ మాత్రమే వేయడం అతని మానసిక పరిస్థితిని సూచిస్తోంది. జట్టు పరిస్థితి కూడా ఇలాగే ఉన్నట్లు అనిపిస్తోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఓడిన బంగ్లాదేశ్ ఇక ముందంజ వేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. గత కొంత కాలంగా బంగ్లాదేశ్ ఫామ్, దూకుడు చూస్తే భారత్‌కు కూడా గట్టి పోటీ ఇవ్వగల జట్టుగా కనిపించింది. అయితే ఈ వరల్డ్‌కప్‌లో పరిస్థితి మారిపోయింది. పాకిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడిన జట్టు, ఆస్ట్రేలియాకు తలవంచింది. ఆసీస్‌తో ఆడని తమీమ్ ఫిట్‌నెస్‌పై ఇంకా స్పష్టత లేకపోవడంతో మరోసారి బంగ్లా సీనియర్ షకీబ్‌పై ఆధార పడుతోంది. జట్లు (అంచనా) భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, యువరాజ్, పాండ్యా, జడేజా, అశ్విన్, నెహ్రా, బుమ్రా. బంగ్లాదేశ్: మొర్తజా (కెప్టెన్), మిథున్, సర్కార్, షబ్బీర్, షకీబ్, షువగత, మహ్ముదుల్లా, ముష్ఫికర్, సక్లాయిన్, అల్ అమీన్, ముస్తఫిజుర్. నేనూ... నా నోకియా... ఆశిష్ నెహ్రా సాధారణంగా పెద్దగా మీడియాలో హడావిడి చేయడు. గంభీరంగా ఉంటూ తన పనేదో తాను చేసుకునే రకం. అయితే మంగళవారం మీడియా సమావేశంలో అతను చేసిన వ్యాఖ్య నవ్వులు పంచింది. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో భారత్, బంగ్లాదేశ్ ఆటగాళ్ల ఫోటోలతో రచ్చ చేస్తున్న ధోరణి పెరిగిపోవడంపై ప్రశ్నకు అతను సరదాగా జవాబిచ్చాడు. ‘మీరు ఎవరిని అడుగుతున్నారో చూడండి. నాకు ఫేస్బుక్ అకౌంట్ లేదు. ట్విట్టర్, ఇన్‌స్టగ్రామ్ వాడను. ఇప్పటికీ ఎప్పటిదో నోకియా ఫోన్‌నే వాడుతున్నాను. కాస్త పాతకాలం మనిషిలాగా కనిపించవచ్చు కానీ ఇలాగే ఉంటాను. పత్రికలూ చదవను కాబట్టి సోషల్ మీడియా సంగతులు నేను పట్టించుకోను’ అని నెహ్రా అన్నాడు. ► 4 భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇప్పటి వరకూ నాలుగు టి20లు జరిగితే అన్నింటిలోనూ భారత్ గెలిచింది. పిచ్, వాతావరణం చిన్నస్వామి సాధారణంగా బ్యాటింగ్‌కు మంచి వేదిక. విండీస్, లంక మధ్య జరిగిన మ్యాచ్ పిచ్‌నే దీని కోసం ఉపయోగిస్తున్నారు. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. ముందు రోజు నగరంలో వాతావరణం కాస్త చల్లబడినా... వర్షం వల్ల మ్యాచ్‌కు అంతరాయం ఉండకపోవచ్చు. -
మా బౌలర్లు భేష్
ఫలితం నిరాశపర్చింది విరాట్ కోహ్లి వ్యాఖ్య బెంగళూరు: వర్షం కారణంగా రెండో టెస్టులో నాలుగు రోజుల పాటు ఆట జరగకపోవడం తమను పూర్తిగా నిరాశకు గురి చేసిందని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్యానించాడు. శుభారంభం కొనసాగించాలని పట్టుదలగా ఉన్నా సాధ్యం కాలేదని అన్నాడు. ‘మేం పటిష్టమైన స్థితిలో నిలిచాం. అక్కడినుంచి మ్యాచ్‌ను శాసించే ప్రయత్నంలో ఉండగా వాతావరణం ప్రభావం చూపించింది. తర్వాతి నాలుగు రోజులు ఏమి చేయలేకపోయాం’ అని కోహ్లి నిరాశగా చెప్పాడు. చిన్నస్వామి స్టేడియం సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలమని, ఇలాంటి చోట మూడు సెషన్ల లోపే నంబర్‌వన్ జట్టును ఆలౌట్ చేయడం తమ బౌలర్ల ఘనతగా పేర్కొన్న కెప్టెన్, వారిపై ప్రశంసలు కురిపించాడు. నాలుగు రోజుల ఆట పోయాక రిజర్వ్ డే ఉన్నా ప్రయోజనం ఉండదని, ప్రస్తుతం ఉన్న నియమ నిబంధనలే కొనసాగడం మంచిదని అతను అభిప్రాయ పడ్డాడు. తొలి టెస్టులో విఫలమైన శిఖర్ ధావన్, ఆశించిన స్థాయిలో ఆడలేకపోతున్న కీపర్ సాహాలకు కోహ్లి మద్దతుగా నిలిచాడు. వారిద్దరు బాగా ఆడుతున్నారని, అనవసరపు ఒత్తిడి పెంచవద్దని అతను కోరాడు. మరో వైపు ఈ మ్యాచ్‌లో దురదృష్టవశాత్తూ తమ బ్యాటింగ్ విఫలమైందని, అయితే ఇంకా సిరీస్‌లో కోలుకునేందుకు అవకాశం ఉందని దక్షిణాఫ్రికా కెప్టెన్ హషీం ఆమ్లా విశ్వాసం వ్యక్తం చేశాడు. -
ఏబీడీ...ఏబీడీ...
మార్మోగిన చిన్నస్వామి స్టేడియం బెంగళూరు: చూడటానికి ఇదేమీ ఐపీఎల్ మ్యాచ్ కాదు.. అలాగని ఆడుతున్నది భారత క్రికెటరూ కాడు. అయినా సరే బెంగళూరు అభిమానులు ఓ వ్యక్తిపై తమ అభిమానాన్ని పెద్ద ఎత్తున చాటుకున్నారు. కెరీర్లో వందో టెస్టు ఆడుతున్న ఏబీ డివిలియర్స్ క్రీజులోకి వస్తున్నప్పుడు దాదాపు 20 వేల మంది ప్రేక్షకులు ఏబీడీ... ఏబీడీ... అంటూ స్టేడియాన్ని హోరెత్తించారు. ఈ పరిణామాన్ని చూసి వీఐపీ స్టాండ్స్‌లో కూర్చున్న ఏబీ తల్లిదండ్రులు ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యారు. ఓవరాల్‌గా చిన్నస్వామి స్టేడియం కాసేపు కింగ్స్‌మీడ్ (డర్బన్), న్యూలాండ్స్ (కేప్‌టౌన్) మైదానంలా మారిపోయాయి. ఫోర్ కొట్టినా... అర్ధసెంచరీ పూర్తి చేసినా విదేశీ అభిమానుల్లాగానే తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇదే మైదానంలో ఐపీఎల్లో ఎన్నో మ్యాచ్‌లను గెలిపించిన ఏబీని బెంగళూరు ప్రేక్షకులు సొంతవాడిగా భావిస్తారనే దానికి ఇదే నిదర్శనం. ఏబీడీ...ఏబీడీ అంటూ కేరింతలు కొట్టడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందని డివిలియర్స్ తండ్రి సీనియర్ ఏబీ డివిలియర్స్ అన్నారు. ‘ఏబీ అవుటైనప్పుడు అభిమానులు కాస్త నిరాశ చెందారు. సుదీర్ఘంగా ఆర్సీబీకి ఆడుతుండటంతో బెంగళూరు మా వాడికి రెండో ఇల్లు అయ్యింది. ఇక భారత భాషలు కూడా నేర్చుకుంటాడని అనుకుంటున్నాం. మా కుటుంబంలో చాలా మంది విద్యావంతులు ఉన్నారు. డివిలియర్స్ డాక్టర్ కాకపోవడం మమ్ముల్ని నిరాశకు గురి చేయలేదు. కెరీర్లో ఉన్నతస్థితికి ఎదిగినందుకు గర్వంగా ఉంది. ఏదో ఓ డిగ్రీ అయితే సంపాదిస్తాడు’ అని సీనియర్ ఏబీ పేర్కొన్నారు. కుర్రాడుగా ఉన్నప్పుడు ఏబీ గోల్ఫ్ బాగా ఆడేవాడని అతని తల్లి మిలి వెల్లడించారు. ‘గోల్ఫ్‌లో ఏబీ ఆటను చూశాక ఏదో ఓ రోజు ఏర్నీ ఎల్స్ అంతటి గొప్పవాడు అవుతాడని భావించాం. అలాగే టెన్నిస్ కూడా బాగా ఆడతాడు. అయితే వ్యక్తిగత క్రీడకు కాకుండా టీమ్‌గా ఆడే ఆటైతే బాగుండేదని అనుకున్నాం. ఎందుకంటే డివిలియర్స్‌కు ఎప్పుడూ జనంలో ఉండటం ఇష్టం. అయితే మైదానంలో కనిపించినంత అణకువగా బయట ఉండడు’ అని మిలి తెలిపారు. -
బంగ్లాను గెలిపించిన నాసిర్
రెండో వన్డేలో భారత్ ‘ఎ’ ఓటమి బెంగళూరు : మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ నాసిర్ హుస్సేన్ (96 బంతుల్లో 102 నాటౌట్; 12 ఫోర్లు, 1 సిక్స్; 5/36) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టు 65 పరుగుల తేడాతో భారత్ ‘ఎ’పై విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 50 ఓవర్లలో 8 వికెట్లకు 252 పరుగులు చేసింది. లిట్టన్ దాస్ (45), అనాముల్ హక్ (34), సౌమ్య సర్కార్ (24) ఓ మోస్తరుగా ఆడారు. ఆరంభంలో భారత పేసర్ల ధాటికి బంగ్లా 82 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే లిట్టన్ దాస్, నాసిర్‌లు ఆరో వికెట్‌కు 70 పరుగులు జోడించడంతో కోలుకుంది. రిషి ధావన్ 3, కర్ణ్ శర్మ 2 వికెట్లు తీశారు. తర్వాత భారత్ 42.2 ఓవర్లలో 187 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ (75 బంతుల్లో 56; 7 ఫోర్లు) టాప్ స్కోరర్. మనీష్ పాండే (36), గురుకీరత్ సింగ్ (34), మయాంక్ అగర్వాల్ (24) కాసేపు పోరాడారు. భారత సీనియర్ ఆటగాడు సురేశ్ రైనా (17) మరోసారి విఫలమయ్యాడు. ఓ దశలో 5 వికెట్లకు 146 పరుగులు చేసిన టీమిండియాను చివర్లో బంగ్లా బౌలర్లు ఘోరంగా దెబ్బతీశారు. 41 పరుగుల తేడాలో చివరి 5 వికెట్లు తీయడంతో ఓటమి తప్పలేదు. రూబెల్కు 4 వికెట్లు దక్కాయి. ఆదివారం ఇదే వేదికపై ఇరుజట్ల మధ్య ఆఖరిదైన మూడో వన్డే జరుగుతుంది. -
గౌరవప్రదమైన నిష్ర్కమణ కోసం...నేడు సీఎస్కేతో ఆర్సీబీ ఢీ
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ప్లే ఆఫ్ ఆశలు మృగ్యమవడంతో టోర్నీ నుంచి గౌరవప్రదంగా నిష్ర్కమించడానికి రాయ్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఉబలాటపడుతోంది. ఇప్పటికే ‘సెమీస్’లో బెర్త్‌ను ఖరారు చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఓడినా పెద్దగా నష్టమేమీ లేదు కనుక ఆడుతూ పాడుతూ ఆర్సీబీని కవ్వించనుంది. ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఇరు జట్లు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు తలపడనున్నాయి. ఈ నెల 18న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో గెలుపు వాకిట బోల్తా పడిన సీఎస్కే ధోనీ సేన ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. గురువారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 30 పరుగులు తేడాతో ఓటమి పాలైన ఆర్సీబీ మూటా ముల్లె సర్దుకుంది. టైటిల్‌ను చేజిక్కించుకోవాలనే సంకల్పంతో యువరాజ్ సింగ్‌ను రూ.14 కోట్లకు వేలం పాడుకున్న ఆర్సీబీ యజమాని విజయ్ మాల్యకు ఈ టోర్నీ తీవ్ర నిరాశనే మిగిల్చింది. గత ఐపీఎల్లో 600 పరుగులు చేయడమే కాకుండా ఎలాంటి తప్పిదాలకు పాల్పడని ఆర్సీబీ స్కిప్పర్ విరాట్ కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎస్కేపై కన్సొలేషన్ గెలుపు ద్వారా పరువు దక్కించుకోవాలని అతను ఉబలాటపడుతున్నాడు. అయితే సీఎస్కే ఫామ్‌ను పరిశీలిస్తే, కోహ్లీ అనుకున్నట్లుగా ఈ మ్యాచ్ సాగడం కష్టం. కీలకమైన బ్యాట్స్‌మెన్ అత్యవసర సమయాల్లో విఫలమైన తీరును చూస్తే... ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ పేపర్ టైగర్లనే హాస్యోక్తిని గుర్తు చేస్తోంది. విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్, అప్పుడప్పుడు మెరుపులు మెరిపించే పార్థివ్ పటేల్‌లు పేలమైన ఆట తీరును కనబరిచారు. దరిమిలా యువరాజ్‌పై విపరీతంగా ఆధార పడాల్సి వచ్చింది. వారాంతంతో పాటు ఆఖరి లీగ్ మ్యాచ్ కావడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి తరలి రానున్నారు. టికెట్లన్నీ దాదాపుగా అమ్ముడు పోయాయి. -
ఐపీఎల్ ఫైనల్ బెంగళూరులో
న్యూఢిల్లీ: ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) కు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ (జీసీ) పెద్ద ఝలక్ ఇచ్చింది. జూన్ 1న జరగనున్న ఐపీఎల్ ఫైనల్‌ను వాంఖడే నుంచి బెంగళూరు చిన్నస్వామి స్టేడియానికి తరలించింది. క్వాలిఫయర్స్ మ్యాచ్‌ల్లో ఒకదాన్ని ఈడెన్ గార్డెన్స్‌లో, ఎలిమినేటర్ మ్యాచ్‌ను బ్రబౌర్న్‌లో నిర్వహించనున్నారు. శనివారం జరిగిన ఐపీఎల్ జీసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే వేదిక మార్పుకు సంబంధించి స్పష్టమైన కారణాన్ని బీసీసీఐ వెల్లడించకపోవడంతో ఎంసీఏ ఆగ్రహంతో ఊగిపోతోంది. దీనిపై వివరణ ఇవ్వాలని ఐపీఎల్ చైర్మన్ బిస్వాల్‌కు లేఖ రాసింది. వేదిక మార్పుపై గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన వ్యక్తులు కూడా నోరు మెదపడం లేదు. అయితే వాంఖడే ఆతిథ్య బాక్స్‌లో సౌకర్యాలు బాగాలేవని, మ్యాచ్‌ను తిలకించేందుకు వచ్చే ఉన్నతస్థాయి వ్యక్తుల ముందు ఇది చిన్నచూపుగా ఉంటుందని బోర్డు చెబుతోంది. బీసీసీఐ సభ్యులకు వీవీఐపీ కారు పార్కింగ్ పాస్‌లను ఇవ్వడంలో ఎంసీఏ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వాదిస్తోంది. పొలార్డ్ (ముంబై), స్టార్క్ (బెంగళూరు)ల గొడవపై కూడా జీసీలో చర్చించారు. సభ్యులందరూ దీన్ని తీవ్రంగా ఖండించారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.