భారీ స్కోరు దిశగా భారత్: రోహిత్ శర్మ సెంచరీ
బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో శనివారం జరుగుతున్న ‘ఫైనల్’ వన్డేలో మరోసారి భారత్ దీపావళి టపాసు గట్టిగానే పేలింది. భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. భారత్ ఓపెనర్ ఆటగాడు రోహిత్ శర్మ సెంచరీతో అధ్బుతమైన ఇన్నింగ్స్ తో చెలరేగి ఆడాడు. 41 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 123 బంతుల్లో 5ఫోర్లు, 7 సిక్స్‌లతో 113 పరుగులతో నిలకడగా ఆడుతున్నాడు. రోహిత్ శర్మ ఈ సిరీస్ లో సెంచరీ చేయడం ఇది రెండోసారి.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 17 ఓవర్లు ముగిసే సరికి వర్షం అడ్డంకిగా మారడంతో 17ఓవర్లలో 107 పరుగులు చేసింది. ఇప్పటికే సిరీస్‌లో రెండుసార్లు భారీ లక్ష్యాలను ఛేదించిన ధోనిసేన తుది మెట్టుపై ఫోరును సాగిస్తుండగా అంతలోనే వరుణుడు కాస్తా అడ్డుపడ్డాడు. మ్యాచ్‌ను చూసి ముచ్చటెసినా వరుణుడికి ఈ మ్యాచ్‌ను చివరకు వీక్షించాలనే అనకున్నాడోమో.. బహుషా పక్కకు తప్పుకున్నాడు. అప్పటి వరకూ నిరాశ అవహించినా ఆసీస్‌కు కాస్తా ఊపిరిపోసినట్టైంది.