బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో శనివారం జరగుతున్న ‘ఫైనల్’ వన్డేలో భారత్‌కు దీపావళి టపాసుకు వర్షం అడ్డంకిగా మారడంతో భారత్ 17ఓవర్లలో 107 పరుగులు చేసింది. ఇప్పటికే సిరీస్‌లో రెండుసార్లు భారీ లక్ష్యాలను ఛేదించిన ధోనిసేన తుది మెట్టుపై ఫోరును సాగిస్తుండగా అంతలోనే వరుణుడు కాస్తా అడ్డుపడ్డాడు. ఈ మ్యాచ్‌లోనైనా నెగ్గాలన్న ఆసీస్ ఆశలపై నీళ్లు చల్లినట్టైయింది.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత ఓపెనర్లు శేఖర్ ధావన్, రోహిత్ శర్మలు చక్కని భాగస్వామ్యంతో శుభారంభాన్ని ఇచ్చారు. భారత్ ఓపెనర్ బ్యాట్సమెన్ శేఖర్ ధావన్ మెరుపువేగంతో దూకుడుగా ఆడి పరుగుల పటాసులు పేల్చాడు. ఆసీస్ వేసిన చెత్తబంతులను ఆడిందే తడువుగా వచ్చిన బంతి వచ్చినట్టుగా బౌండరీలను దాటించాడు. ధావన్ 51 బంతుల్లో 9ఫోర్లతో 58 పరుగులు చేయగా, రోహిత్ శర్మ కూడా అదే దూకుడుతో ఆడి 51బంతుల్లో 3ఫోర్లు, 1సిక్స్ తో 37పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు.
దీనికి తోడూ దీపావళి పండుగ కూడా కలిసిరావడంతో ఇక క్రికెట్ అభిమానులకు పండుగ వాతావరణం నెలకొంది. అంతకముందు టాస్‌గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్ భారత్‌పై ప్రతికారం తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నతరుణంలో వరుణుడు సహాకరించలేదు. ఈ సిరీస్ విజేతను నిర్దేశించే మ్యాచ్ కావడంతో రెండు జట్లూ నాణ్యమైన క్రికెట్ ఆడేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. నాగ్‌పూర్‌లో భారీ స్కోరు చేసినా మ్యాచ్‌ను ఆసీస్ చేజార్చుకున్న విషయం తెలిసిందే.