India team
-
ఘనమైన ముగింపు
వన్డేల్లో భారత జట్టు మరోసారి తమ బలాన్ని ప్రదర్శించింది. సొంతగడ్డపై తమ స్థాయిని చూపిస్తూ ఇంగ్లండ్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. గత రెండు మ్యాచ్‌ల తరహాలో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన టీమిండియా చివరి పోరులోనూ ఘన విజయాన్ని అందుకుంది. కెరీర్లో 50వ వన్డే ఆడిన శుబ్‌మన్ గిల్ శతకానికి తోడు శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లి రాణించడంతో భారీ స్కోరు సాధించిన టీమిండియా ఆ తర్వాత బలమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టి పడేసింది.‘బజ్‌బాల్‘ మాయలో ‘బ్యాడ్బాల్’గా మారిపోయిన ఆటతో ఇంగ్లండ్ మరో భారీ ఓటమిని మూటగట్టుకుంది. మరోవైపు కోహ్లి సహా ప్రధాన బ్యాటర్లంతా ఫామ్‌లోకి వచ్చిన సానుకూలతతో ఇక చాంపియన్స్ ట్రోఫీ సమరానికి రోహిత్ బృందం సన్నద్ధమైంది. అహ్మదాబాద్: ఇంగ్లండ్‌పై టి20 సిరీస్‌ను 4–1తో గెలుచుకున్న భారత్ జట్టు ఇప్పుడు వన్డే సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. బుధవారం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన చివరిదైన మూడో మ్యాచ్‌లో భారత్ 142 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్‌మన్ గిల్ (102 బంతుల్లో 112; 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా... శ్రేయస్ అయ్యర్ (64 బంతుల్లో 78; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), కోహ్లి (55 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు. కోహ్లితో 116 పరుగులు జోడించిన గిల్, అయ్యర్‌తో 104 పరుగులు జత చేశాడు. అనంతరం ఇంగ్లండ్ 34.2 ఓవర్లలో 214 పరుగులకే ఆలౌటైంది. అట్కిన్సన్ (19 బంతుల్లో 38; 6 ఫోర్లు, 1 సిక్స్), బాంటన్ (41 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సిరీస్‌లో 259 పరుగులు చేసిన గిల్‌కే ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. శతక భాగస్వామ్యాలు... గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ (1) ఈసారి రెండో బంతికే వెనుదిరిగాడు. అయితే గిల్, కోహ్లి భాగస్వామ్యంలో భారత్ ఇన్నింగ్స్ సరైన దిశలో సాగింది. 7 పరుగుల వద్ద సమన్వయ లోపంతో కోహ్లి రనౌట్ ప్రమాదంలో పడినా వుడ్ త్రో నేరుగా వికెట్లను తగలకపోవడంతో బతికిపోయాడు. తొలి 10 ఓవర్లలో భారత్ 52 పరుగులు చేసింది. ఆ తర్వాత వీరిద్దరు కొన్ని చక్కటి షాట్లతో అలరించారు. ఐదు బంతుల వ్యవధిలో గిల్ (51 బంతుల్లో), కోహ్లి (50 బంతుల్లో) అర్ధ సెంచరీలు పూర్తయ్యాయి. అయితే తర్వాతి ఓవర్లో రషీద్ వేసిన చక్కటి బంతిని ఆడలేక కోహ్లి వెనుదిరిగాడు. అనంతరం ఫామ్‌లో ఉన్న అయ్యర్...గిల్‌తో జత కలిశాడు. ఈ జోడీ కూడా పదునైన బ్యాటింగ్‌తో అలవోకగా పరుగులు సాధించింది. వుడ్ ఓవర్లో డీప్ మిడ్‌వికెట్ మీదుగా ఫోర్ కొట్టి 95 బంతుల్లోనే గిల్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ఆ వెంటనే 43 బంతుల్లో అయ్యర్ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే తక్కువ వ్యవధిలో వీరిద్దరిని ఆదిల్ రషీద్ వెనక్కి పంపించాడు. గత రెండు వన్డేల్లో విఫలమైన కేఎల్ రాహుల్ (29 బంతుల్లో 40; 3 ఫోర్లు, 1 సిక్స్) ఈసారి మెరుగ్గా ఆడగా... రషీద్ ఓవర్లో వరుసగా 6, 6 బాది తర్వాతి బంతికి హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 17) అవుటయ్యాడు.తర్వాత వచ్చిన బ్యాటర్లందరూ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వరుసగా వికెట్లు కోల్పోయినా... భారత్ 350 పరుగుల స్కోరును దాటగలిగింది. ఆఖరి 7 బంతుల్లో 3 వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. భారత తుది జట్టులో వరుణ్ చక్రవర్తి, షమీ, రవీంద్ర జడేజా స్థానాల్లో కుల్దీప్, వాషింగ్టన్ సుందర్, అర్ష్ దీప్ తుది జట్టులోకి వచ్చారు. సమష్టి వైఫల్యం... భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (21 బంతుల్లో 23; 4 ఫోర్లు), బెన్ డకెట్ (22 బంతుల్లో 34; 8 ఫోర్లు) సరైన ఆరంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 6.2 ఓవర్లలోనే 60 పరుగులు జోడించారు. రాణా తన తొలి 2 ఓవర్లలో 5 ఫోర్లతో 22 పరుగులు ఇవ్వగా... అర్ష్ దీప్ ఓవర్లో డకెట్ వరుసగా 4 బంతుల్లో 4 ఫోర్లు కొట్టాడు. అయితే ఈ భాగస్వామ్యం విడిపోయిన తర్వాత ఇంగ్లండ్ తడబడింది. బాంటన్, రూట్ (29 బంతుల్లో 24; 2 ఫోర్లు) కొద్దిసేపు నిలబడినా వీరిద్దరు ఎనిమిది పరుగుల వ్యవధిలో వెనుదిరిగారు. ఆ తర్వాత జట్టు కోలుకోలేకపోయింది. టపటపా వికెట్లను కోల్పోయి ఓటమి దిశగా పయనించింది. రాణా వరుసగా రెండు ఓవర్లలో బట్లర్ (6), బ్రూక్ (26 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్)లను బౌల్డ్ చేయడంతో జట్టు ఆశలు కోల్పోయింది. మిగతా లాంఛనం ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. మరో 15.4 ఓవర్లు మిగిలి ఉండగానే జట్టు కుప్పకూలింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) సాల్ట్ (బి) వుడ్ 1; గిల్ (బి) రషీద్ 112; కోహ్లి (సి) సాల్ట్ (బి) రషీద్ 52; అయ్యర్ (సి) సాల్ట్ (బి) రషీద్ 78; రాహుల్ (ఎల్బీ) (బి) మహమూద్ 40; పాండ్యా (బి) రషీద్ 17; అక్షర్ (సి) బాంటన్ (బి) రూట్ 13; సుందర్ (సి) బ్రూక్ (బి) వుడ్ 14; రాణా (సి) బట్లర్ (బి) అట్కిన్సన్ 13; అర్ష్ దీప్ (రనౌట్) 2; కుల్దీప్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్) 356. వికెట్ల పతనం: 1–6, 2–122, 3–226, 4–259, 5–289, 6–307, 7–333, 8–353, 9–353, 10–356. బౌలింగ్: సాఖిబ్ మహమూద్ 10–0–68–1, మార్క్ వుడ్ 9–1–45–2, అట్కిన్సన్ 8–0–74–1, రూట్ 5–0–47–1, ఆదిల్ రషీద్ 10–0–64–4, లివింగ్‌స్టోన్ 8–0–57–0. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) అక్షర్ (బి) అర్ష్ దీప్ 23; డకెట్ (సి) రోహిత్ (బి) అర్ష్ దీప్ 34; బాంటన్ (సి) రాహుల్ (బి) కుల్దీప్ 38; రూట్ (బి) అక్షర్ 24; బ్రూక్ (బి) రాణా 19; బట్లర్ (బి) రాణా 6; లివింగ్‌స్టోన్ (స్టంప్డ్) రాహుల్ (బి) సుందర్ 9; అట్కిన్సన్ (బి) అక్షర్ 38; రషీద్ (బి) పాండ్యా 0; వుడ్ (సి) అయ్యర్ (బి) పాండ్యా 9; మహమూద్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (34.2 ఓవర్లలో ఆలౌట్) 214. వికెట్ల పతనం: 1–60, 2–80, 3–126, 4–134, 5–154, 6–161, 7–174, 8–175, 9–193, 10–214. బౌలింగ్: అర్ష్ దీప్ 5–0–33–2, హర్షిత్ రాణా 5–1–31–2, వాషింగ్టన్ సుందర్ 5–0–43–1, అక్షర్ పటేల్ 6.2–1–22–2, పాండ్యా 5–0–38–2, కుల్దీప్ యాదవ్ 8–0–38–1. ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడకుండానే..చాంపియన్స్ ట్రోఫీ బరిలో టీమిండియా దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీకి ముందు సన్నాహకంగా భారత జట్టు ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడటం లేదు. బుధవారం వరకు స్వదేశంలో ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడిన టీమిండియా... తమకు ప్రాక్టీస్ మ్యాచ్‌ల అవసరం లేదని తేల్చేసింది. టోర్నీలో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఫిబ్రవరి 14–17 మధ్య జరుగుతాయి. 19న టోర్నీ ప్రారంభం కానుండగా, భారత జట్టు 15న దుబాయ్ చేరుకుంటుంది. మరోవైపు అఫ్గానిస్తాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ టీమ్‌లు మాత్రం పాక్ గడ్డపైనే ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడబోతున్నాయి. ఈ మూడు మ్యాచ్‌లలో తలపడేందుకు ప్రత్యర్థులుగా పాకిస్తాన్ మూడు వేర్వేరు జట్లను ఎంపిక చేసింది. మరో ప్రాక్టీస్ పోరులో న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్ తలపడతాయి. 1ఒకే మైదానంలో మూడు ఫార్మాట్లలోనూ (టెస్టు, వన్డే, టి20) సెంచరీలు చేసిన తొలి భారతీయ క్రికెటర్‌గా శుబ్‌మన్ గిల్ గుర్తింపు పొందాడు. నరేంద్ర మోదీ స్టేడియంలో గిల్ టి20ల్లో (న్యూజిలాండ్‌పై 126 నాటౌట్; 2023లో), టెస్టుల్లో (ఆ్రస్టేలియాపై 128; 2023లో), వన్డేల్లో (ఇంగ్లండ్‌పై 112; 2025లో) ఒక్కో సెంచరీ సాధించాడు. -
క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి
సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను టి20ల్లో చిత్తు చేసిన తర్వాత వన్డే సిరీస్ కూడా గెలుచుకొని భారత జట్టు ఒక లాంఛనం ముగించింది. ఇప్పుడు ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఒకే ఒక వన్డే అందుబాటులో ఉంది. ఇప్పటికే సిరీస్ గెలుచుకుంది కాబట్టి బెంచీపై ఉన్న ఆటగాళ్లకు మేనేజ్మెంట్ ఒక అవకాశం ఇస్తుందా లేక విజయాల బాటలో ఉన్న జట్టును కొనసాగించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తుందా అనేది చూడాలి. మరోవైపు ఇంగ్లండ్ కోణంలో ఇది కాస్త పరువు దక్కించుకునే ప్రయత్నం. ఇక్కడ ఆడిన 7 మ్యాచ్‌లలో 6 ఓడి నిరాశలో మునిగిన టీమ్ కనీసం చివరి పోరులోనైనా గెలిచి పర్యటనను ముగించాలని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అతి పెద్ద స్టేడియం ఆఖరి పోరుకు వేదిక కానుంది. అహ్మదాబాద్: భారత గడ్డపై ఇంగ్లండ్ జట్టు పరిమిత ఓవర్ల పర్యటన చివరి అంకానికి చేరింది. సిరీస్ ఫలితం తేలిపోయిన తర్వాత నేడు మొతేరా లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగే నామమాత్రపు చివరి వన్డేలో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. తాజా ప్రదర్శనను బట్టి చూస్తే అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న టీమిండియాకు మరో విజయం కూడా కష్టం కాకపోవచ్చు. ఇక్కడా గెలిచి సిరీస్‌ను 3–0తో సాధించాలని రోహిత్ శర్మ బృందం భావిస్తోంది. మరోవైపు కొంత కాలం క్రితం వరకు అభేద్యమైన టీమ్‌గా కనిపించిన ఇంగ్లండ్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో పూర్తిగా విఫలమై చేతులెత్తేసింది. ఈ పోరు తర్వాత ఇరు జట్లు చాంపియన్స్ ట్రోఫీ బాట పడతాయి. కోహ్లి కొడతాడా! చాంపియన్స్ ట్రోఫీకి ముందు రోహిత్ భారత్ బెంగ తీర్చాడు. చక్కటి సెంచరీతో సత్తా చాటుతూ అతను ఫామ్‌లోకి వచ్చాడు. శుబ్‌మన్ గిల్ వరుసగా రెండు అర్ధసెంచరీలతో ఆకట్టుకోగా, శ్రేయస్ అయ్యర్ కూడా నిలకడగా రాణిస్తున్నాడు. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తమ విలువను చూపించారు. పదే పదే బ్యాటింగ్ ఆర్డర్ స్థానం మారడం వల్ల ఇబ్బంది పడుతున్న కేఎల్ రాహుల్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. పంత్‌కు కాకుండా రాహుల్‌కే మరో అవకాశం దక్కవచ్చు. అయితే అన్నింటికి మించి ప్రధాన బ్యాటర్లలో విరాట్ కోహ్లి ప్రదర్శన కోసమే అంతా ఎదురు చూస్తున్నారు. ఆసీస్ గడ్డపై తొలి టెస్టు తర్వాత మొదలైన వైఫల్యం రంజీ మ్యాచ్ మీదుగా ఇక్కడ రెండో వన్డే వరకు సాగింది. అతని స్థాయిని బట్టి చూస్తే ఎప్పుడైనా చెలరేగిపోగలడు. కానీ అలాంటి ఇన్నింగ్సే ఇంకా రావడం లేదు. 14 వేల మైలురాయికి మరో 89 పరుగుల దూరంలో ఉన్న కోహ్లి ఈ మ్యాచ్‌లోనే దానిని పూర్తి చేసుకుంటాడా చూడాలి. బౌలింగ్ విభాగంలో షమీ ఇంకా పూర్తిగా తన లయను అందుకోలేదని గత మ్యాచ్‌లో అర్థమైంది. యువ బౌలర్ హర్షిత్ రాణా కూడా తడబడుతున్నాడు. అతని స్థానంలో అర్‡్షదీప్‌ను ఆడించే విషయంపై మేనేజ్మెంట్ చర్చిస్తోంది. స్పిన్నర్లలో వరుణ్ చక్రవర్తి చక్కటి బౌలింగ్ ప్రదర్శన కనబర్చడం మరో సానుకూలాంశం. ఓవరాల్‌గా అన్ని రంగాల్లో జట్టు పటిష్టంగా ఉంది. బాంటన్‌కు చాన్స్... ప్రత్యర్థితో పోలిస్తే ఇంగ్లండ్ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఒక్క ఆటగాడు కూడా తనదైన స్థాయి ప్రదర్శనను కనబర్చి జట్టును గెలిపించేలా కనిపించడం లేదు. రెండు వన్డేల్లో ప్రధాన బ్యాటర్లంతా తలా ఓ చేయి వేసినా విజయానికి అది సరిపోలేదు. గతంలో చూపించి విధ్వంసకర బ్యాటింగ్ ఇంగ్లండ్ నుంచి రావడం లేదు. ఓపెనర్లు సాల్ట్, డకెట్ శుభారంభాలు ఇస్తున్నారు కానీ ఆ తర్వాత దానిని ఇతర బ్యాటర్లు కొనసాగించలేకపోతున్నారు. కెపె్టన్ బట్లర్, జో రూట్ మాత్రమే నమ్మకమైన ఆటగాళ్లుగా కనిపిస్తుండగా, రెండో వన్డేలో హ్యారీ బ్రూక్ మరీ నెమ్మదిగా ఆడాడు. ఒవర్టన్ స్థానంలో బాంటన్‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. మరోవైపు బౌలింగ్ పూర్తిగా బలహీనంగా కనిపిస్తోంది. భారత బ్యాటర్ల ముందు ఈ బౌలర్లంతా అనామకుల్లా కనిపిస్తున్నారు. ఏ ఒక్కరిలో కూడా ప్రత్యర్థిని నిలువరించే సత్తా కనిపించడం లేదు. సాఖిబ్ స్థానంలో ఆర్చర్ బరిలోకి దిగవచ్చు. అట్కిన్సన్, వుడ్, రషీద్ ఏమాత్రం రాణిస్తారో చూడాలి. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్ ), గిల్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, పాండ్యా, అక్షర్, జడేజా, రాణా, షమీ, వరుణ్. ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్ ), సాల్ట్, డకెట్, బాంటన్, రూట్, బ్రూక్, లివింగ్‌స్టోన్, కార్స్, ఆర్చర్, రషీద్, వుడ్.పిచ్, వాతావరణం సాధారణ బ్యాటింగ్ పిచ్. చక్కగా పరుగులు సాధించవచ్చు. వర్షసూచన ఏమాత్రం లేదు. వేడి వాతావరణం. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.13 మరో 13 పరుగులు చేస్తే రోహిత్ వన్డేల్లో 11 వేల మైలురాయిని అందుకుంటాడు. -
సిరీస్ విజయమే లక్ష్యంగా...
ఇంగ్లండ్‌పై టి20 సిరీస్ జోరును కొనసాగిస్తూ వన్డేల్లోనూ శుభారంభం చేసిన భారత జట్టు ఇప్పుడు మరో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమైంది. అన్ని రకాలుగా ఫామ్‌లో ఉన్న టీమిండియా ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో చెలరేగుతున్న భారత్‌ను నిలువరించడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతూ వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న ఇంగ్లండ్ ఈ సారైనా కోలుకొని పోటీనిస్తుందా చూడాలి. కటక్: ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీకి ముందు సొంతగడ్డపై తమ సత్తాను ప్రదర్శిస్తున్న భారత జట్టు ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్‌ను గెలుచుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. బారాబతి స్టేడియంలో నేడు జరిగే రెండో వన్డేలో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసి 38.4 ఓవర్లలోనే ఛేదన పూర్తి చేసిన భారత్ అదే స్థాయి ఆటను ప్రదర్శిస్తే మరో మ్యాచ్ కూడా రోహిత్ సేన ఖాతాలో చేరుతుంది.టి20ల్లో చిత్తుగా ఓడి తొలి వన్డేలో కూడా 248కే పరిమితమైన ఇంగ్లండ్ మెరుగైన ప్రదర్శనతో సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. 2006 నుంచి భారత గడ్డపై 31 సార్లు భారత్‌తో తలపడిన ఇంగ్లండ్ 5 మ్యాచ్‌లే గెలిచి 25 ఓడింది. కోహ్లి సిద్ధం... గాయంతో తొలి మ్యాచ్‌కు దూరమైన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పూర్తి ఫిట్‌గా సిద్ధమయ్యాడు. రెండో వన్డేలో అతను బరిలోకి దిగడం ఖాయమైంది. కోహ్లి కూడా చాలా రోజులుగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. లయ అందుకునేందుకు అతనికి ఇదే సరైన అవకాశం. అయితే ఎవరి స్థానంలో విరాట్ ఆడతాడనేది ఆసక్తికరం. గత మ్యాచ్‌లో చెప్పినదాని ప్రకారం శ్రేయస్‌ను తప్పించి కోహ్లిని తీసుకోవాలి. కానీ మెరుపు అర్ధసెంచరీతో ఆకట్టుకున్న శ్రేయస్‌ను పక్కన పెడితే టీమ్ మేనేజ్మెంట్పై తీవ్ర విమర్శలు రావచ్చు. కోచ్ గంభీర్ సాధారణంగా ఓపెనింగ్ ఎడమ, కుడిచేతివాటం కాంబినేషన్‌ను ఇష్టపడతాడు. అలా చూస్తే శ్రేయస్‌పైనే వేటు వేసి జైస్వాల్‌ను ఆడించవచ్చు. కానీ చాంపియన్స్ ట్రోఫీ ప్రణాళికలను దృష్టిలో ఉంచుకొని చూస్తే ప్రయోగాలు చేయకుండా జైస్వాల్‌ను పక్కన పెట్టడం సరైన నిర్ణయమవుతుంది. మరో వైపు రాహుల్ స్థానంలో కీపర్‌గా పంత్‌ను ఆడించే ఆలోచన కూడా ఉంది. లెఫ్టార్మ్ పేసర్ అర్ష్ దీప్ సింగ్‌ను పరీక్షించేందుకు రాణాను పక్కన పెట్టాలనే చర్చ కూడా జరుగుతోంది. ఎలాగైనా ఈ సిరీస్ గెలవాలని భావిస్తే భారత జట్టు మార్పులపై దృష్టి పెట్టకపోవచ్చు. కానీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ సిరీస్‌లో ఆటగాళ్లను పరీక్షించాలనే ఆలోచన ఉంటే మాత్రం మార్పులు ఖాయం. సీనియర్ పేసర్ షమీ గత మ్యాచ్‌లో వికెట్లు తీయకపోయినా చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆల్‌రౌండర్ అక్షర్ బ్యాటింగ్‌లో రాణించడం సానుకూలాంశం. అయితే అన్నింటికి మించి కెపె్టన్ రోహిత్ ఫామ్‌లోకి రావడం భారత్‌కు ముఖ్యం. చాలా కాలంగా వరుసగా విఫలమవుతున్న రోహిత్ ఇక్కడైనా రాణిస్తాడా చూడాలి. గిల్, పాండ్యా, జడేజాలతో మన బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. గెలిపించేదెవరు? ఈ పర్యటనలో ఐదు మ్యాచ్‌లలో ఓడిన ఇంగ్లండ్ ఆట దిశానిర్దేశం లేకుండా సాగుతోంది. పేరుకు భారీ బ్యాటింగ్ లైనప్ కనిపిస్తున్నా ఆ జట్టు వ్యూహాల్లో పదును లోపించింది. గుడ్డిగా బ్యాట్లు ఊపడం తప్ప ఆటగాళ్లు విఫలమవుతున్న చోట రెండో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. కోచ్ మెక్‌కలమ్ ప్రణాళికలు ఏవీ పని చేయడం లేదు. భారత గడ్డపై అనుభవం ఉన్న బట్లర్ మాత్రమే ఎంతో కొంత రాణిస్తుండగా బెతెల్ కాస్త పట్టుదలగా ఆడగలిగాడు. జట్టు ఆధారపడుతున్న రూట్, బ్రూక్ స్థాయికి తగ్గ ఆటను కనబర్చాల్సి ఉంది. ముఖ్యంగా బ్రూక్ 5 టి20లు, వన్డే కలిపి 91 పరుగులే చేశాడు. డకెట్ ఇంకా వన్డే ఓపెనర్‌గా కుదురుకోకపోగా, సాల్ట్ మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. ఆర్చర్, కార్స్ పేస్ భారత బ్యాటర్లపై ఎలాంటి ప్రభావం చూపకపోగా, రషీద్ తేలిపోయాడు. ఈ మ్యాచ్‌లో మరో పేసర్ వుడ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. 40 ఓవర్లలోపే భారత్ తొలి వన్డే ముగించడం ఇంగ్లండ్ బౌలింగ్ బలహీనతను కూడా చూపించింది. దీనిని ఆ జట్టు ఎలా అధిగమిస్తుందో చూడాలి. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్ ), గిల్, కోహ్లి, శ్రేయస్, రాహుల్/ పంత్, పాండ్యా, జడేజా, అక్షర్, కుల్దీప్, అర్ష్ దీప్, షమీ ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్ ),సాల్ట్, రూట్, బ్రూక్,డకెట్, లివింగ్‌స్టోన్, బెతెల్, కార్స్, ఆర్చర్, రషీద్, వుడ్. పిచ్, వాతావరణం ఈ మైదానంలో ఐదేళ్ల తర్వాత వన్డే మ్యాచ్ జరుగుతోంది. మొదటినుంచి ఇక్కడి పిచ్ బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఈ సారి కూడా పరుగుల వరద ఖాయం. వర్షం అంతరాయం కలిగించే అవకాశం లేదు. -
సిరాజ్‌లో పదును తగ్గిందా!
ముంబై: 2023 నుంచి చూస్తే 28 మ్యాచ్‌లలో 22.7 సగటుతో 47 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ కూడా చాలా మెరుగ్గా (5.41) ఉంది. ఎలా చూసినా ఇది చెప్పుకోదగ్గ ప్రదర్శనే. సిరాజ్ చాలా వరకు నిలకడగా రాణించాడు. అతను మరీ ఘోరంగా విఫలమైన మ్యాచ్‌లు కూడా అరుదు. అయినా సరే...నలుగురు స్పిన్నర్లతో ఆడాలనే టీమిండియా ప్రణాళికల కారణంగా అతనికి చోటు దక్కలేదు.కెప్టెన్ రోహిత్ శర్మ మాటల్లో చెప్పాలంటే ఆరంభ ఓవర్లలో కొత్త బంతితో చెలరేగినంతగా సిరాజ్ చివర్లో ఆకట్టుకోలేకపోతున్నాడు. బంతి పాతబడిన కొద్దీ అతని ప్రభావం తగ్గుతోంది. ఇప్పటికే టి20ల్లో తనను తాను నిరూపించుకోవడంతో పాటు దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా ఆకట్టుకున్న అర్ష్‌దీప్ సింగ్‌పై సెలక్టర్లు నమ్మకముంచారు. ఎడమచేతి వాటం బౌలర్ కావడం అతనికి మరో అదనపు అర్హతగా మారింది. ‘ఆరంభంలో, చివర్లో కూడా బాగా బౌలింగ్ చేయగలిగే ఆటగాడు మాకు కావాలి. కొత్త బంతితో షమీ ఏం చేయగలడో అందరికీ తెలుసు. చివర్లో ఆ బాధ్యతఅర్ష్దీప్ తీసుకోగలడు. సరిగ్గా ఇక్కడే సిరాజ్ ప్రభావం తగ్గుతూ వస్తోంది. అతను కొత్త బంతితో తప్ప చివర్లో ఆశించిన ప్రదర్శన ఇవ్వడం లేదు. దీనిపై మేం చాలా సుదీర్ఘంగా చర్చించాం. ఆల్‌రౌండర్లు కావాలి కాబట్టి ముగ్గురు పేసర్లనే తీసుకున్నాం. సిరాజ్ లేకపోవడం దురదృష్టకరమే కానీ కొన్ని రకాల బాధ్యతల కోసం కొందరిని తీసుకొని మరికొందరిని పక్కన పెట్టక తప్పదు’ అని రోహిత్ వివరించాడు. -
భారత క్రికెట్‌కు ‘బ్యాడ్ సండే’
క్రికెట్ మైదానంలో ఆదివారం భారత్‌కు ఏదీ కలిసిరాలేదు! ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ రెండో టెస్టులో రోహిత్ శర్మ సారథ్యంలోని పురుషుల జట్టు ఆ్రస్టేలియా చేతిలో పరాజయం చవిచూడగా... ఆస్ట్రేలియాలోని మరో వేదిక బ్రిస్బేన్‌లో భారత మహిళల జట్టుకూ భారీ ఓటమి ఎదురైంది. అడిలైడ్ ‘పింక్ బాల్’ టెస్టులో పురుషుల జట్టు ప్రభావం చూపలేకపోగా... రెండో వన్డేలో ఓడిన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని మహిళల జట్టు కంగారూలకు సిరీస్ కోల్పోయింది. ఇక దుబాయ్‌లో జరిగిన ఆసియా జూనియర్ కప్ అండర్–19 టోర్నీలో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన యువ భారత జట్టు తుదిపోరులో బంగ్లాదేశ్ చేతిలో ఓడి టైటిల్‌కు దూరమైంది. మొత్తానికి ఒకే రోజు మూడు వేర్వేరు విభాగాల్లో భారత క్రికెట్ జట్లను పరాజయం పలకరించడంతో ‘హ్యాపీ సండే’ కావాల్సిన చోట ‘బ్యాడ్ సండే’గా మారింది.అడిలైడ్‌లో అదే వ్యథఅడిలైడ్: గులాబీ బంతి పరీక్షలో భారత జట్టు గట్టెక్కలేదు. నాలుగేళ్ల క్రితం అడిలైడ్‌లో జరిగిన ‘పింక్ బాల్’ టెస్టులో ఘోర పరాజయం ఎదుర్కొన్న టీమిండియా... ఇప్పుడు మరోసారి అడిలైడ్ వేదికగా ఓటమి వైపు నిలిచింది. ఆదివారం ముగిసిన ‘డే అండ్ నైట్’ టెస్టులో భారత్ 10 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియా చేతిలో ఓడింది. తొలి టెస్టులో చిత్తుగా ఓడిన ఆ్రస్టేలియా... తమకు అచ్చొచి్చన ‘పింక్ బాల్’ టెస్టులో ఘనవిజయంతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ‘ని 1–1తో సమం చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 128/5తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా... 36.5 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (47 బంతుల్లో 42; 6 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి భారత టాప్ స్కోరర్‌గా నిలవగా... మిగతా వాళ్లు ప్రభావం చూపలేకపోయారు. ఆ్రస్టేలియా బౌలర్లలో కెపె్టన్ కమిన్స్ 5 వికెట్లు పడగొట్టగా... బోలండ్ 3 వికెట్లు, స్టార్క్ 2 వికెట్లు తీశారు. అనంతరం 19 పరుగుల స్వల్ప విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 3.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు మెక్‌స్వీనీ (10 నాటౌట్), ఖ్వాజా (9 నాటౌట్) అజేయంగా నిలిచారు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీతో చెలరేగిన ట్రావిస్ హెడ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఈ నెల 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్టు జరుగుతుంది. మరో 47 పరగులే జోడించి... ప్రధాన ఆటగాళ్లు రెండో రోజే అవుటైనా... రిషబ్ పంత్ (28), నితీశ్ కుమార్ రెడ్డి క్రీజులో ఉండటంతో... భారత అభిమానులు అడిలైడ్‌లో అద్భుతం జరగకపోతుందా అని ఆశిస్తే... అది అడియాశే అయింది. క్రితం రోజు స్కోరు వద్దే పంత్.. స్టార్క్ బౌలింగ్‌లో స్లిప్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పుడే పరాజయం ఖాయమైపోగా... నితీశ్ రెడ్డి దూకుడు పెంచి జట్టుకు ఇన్నింగ్స్ ఓటమిని తప్పించాడు. ఈ ఆంధ్ర కుర్రాడు జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లిన తర్వాత 9వ వికెట్ రూపంలో అవుటయ్యాడు. తాజా సిరీస్‌లో ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌ల్లో మూడుసార్లు భారత్ తరఫున నితీశ్ రెడ్డి టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం. అశి్వన్ (7), హర్షిత్ రాణా (0), సిరాజ్ (7) ఇలా ఒకరివెంట ఒకరు పెవిలియన్ చేరిపోవడంతో టీమిండియా ఆలౌటైంది. చేతిలో ఐదు వికెట్లతో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన రోహిత్ బృందం క్రితం రోజు స్కోరుకు మరో 47 పరుగులు మాత్రమే జోడించగలిగింది. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి భారత జట్టు కేవలం 81 ఓవర్లు మాత్రమే ఆడింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 180; ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 337; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) కేరీ (బి) బోలండ్ 24; రాహుల్ (సి) కేరీ (బి) కమిన్స్ 7; గిల్ (బి) స్టార్క్ 28; కోహ్లి (సి) కేరీ (బి) బోలండ్ 11; పంత్ (సి) స్మిత్ (బి) స్టార్క్ 28; రోహిత్ (బి) కమిన్స్ 6; నితీశ్ రెడ్డి (సి) మెక్‌స్వీనీ (బి) కమిన్స్ 42; అశి్వన్ (సి) కేరీ (బి) కమిన్స్ 7; హర్షిత్ (సి) ఖ్వాజా (బి) కమిన్స్ 0; బుమ్రా (నాటౌట్) 2; సిరాజ్ (సి) హెడ్ (బి) బోలండ్ 7; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (36.5 ఓవర్లలో ఆలౌట్) 175. వికెట్ల పతనం: 1–12, 2–42, 3–66, 4–86, 5–105, 6–128, 7–148, 8–153, 9–166, 10–175. బౌలింగ్: స్టార్క్ 14–1–60–2; కమిన్స్ 14–0–57–5; బోలండ్ 8.5–0–51–3. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: మెక్‌స్వీనీ (నాటౌట్) 10; ఖ్వాజా (నాటౌట్) 9; మొత్తం (3.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 19. బౌలింగ్: బుమ్రా 1–0–2–0; సిరాజ్ 1.2–0–9–0; నితీశ్ కుమార్ రెడ్డి 1–0–8–0.12 ఇప్పటి వరకు 13 డే అండ్ నైట్ టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా 12 టెస్టుల్లో నెగ్గడం విశేషం. అడిలైడ్‌లో ఆడిన 8 డే నైట్ టెస్టుల్లోనూ ఆ్రస్టేలియా గెలిచి అజేయంగా ఉంది. మరోవైపు ఇప్పటి వరకు ఐదు డే అండ్ నైట్ టెస్టులు ఆడిన భారత జట్టు రెండింటిలో ఓడిపోయింది. ఈ రెండూ అడిలైడ్‌లోనే కావడం గమనార్హం. -
Mohammed Siraj: సిరాజ్‌కు అసలేమైంది? ఫామ్‌పై ఆందోళన!
న్యూఢిల్లీ: భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ చాలా కాలంగా టెస్టు జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. షమీ కూడా లేకపోవడంతో బుమ్రాకు జతగా కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. అయితే పేస్‌కు అనుకూలించే విదేశీ మైదానాలతో పోలిస్తే సొంతగడ్డపై అతని ప్రదర్శన పేలవంగా ఉంది. 17 విదేశీ టెస్టుల్లో సిరాజ్ 61 వికెట్లు పడగొట్టాడు. భారత గడ్డపై మాత్రం 13 టెస్టుల్లో 192.2 ఓవర్లు బౌలింగ్ చేసి 36.15 సగటుతో 19 వికెట్లే తీయగలిగాడు! ఇందులో కొన్ని సార్లు స్పిన్‌కు బాగా అనుకూలమైన పిచ్‌లపై దాదాపుగా బౌలింగ్ చేసే అవకాశమే రాకపోవడం కూడా ఒక కారణం. అయితే పిచ్‌తో సంబంధం లేకుండా స్వదేశంలో కూడా ప్రత్యరి్థపై చెలరేగే బుమ్రా, షమీలతో పోలిస్తే సిరాజ్ విఫలమవుతున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో బుమ్రా తరహాలో వికెట్లు అందించలేకపోతున్నాడు. ముఖ్యంగా గత ఏడు టెస్టుల్లో అతను 12 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి న్యూజిలాండ్‌తో పుణేలో జరిగే రెండో టెస్టులో అతని స్థానంపై సందేహాలు రేకెత్తుతున్నాయి. సిరాజ్ స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ పేరును మేనేజ్మెంట్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. సిరాజ్ బౌలింగ్‌లో స్వల్ప సాంకేతిక లోపాలే భారత్‌లో వైఫల్యాన్ని కారణమని మాజీ కోచ్ ఒకరు విశ్లేíÙంచారు. ‘టెస్టుల్లో సిరాజ్ అత్యుత్తమ ప్రదర్శనలన్నీ కేప్‌టౌన్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, బ్రిస్బేన్వంటి బౌన్సీ పిచ్‌లపైనే వచ్చాయి. బంతి పిచ్ అయిన తర్వాత బ్యాటర్ వరకు చేరే క్రమంలో అక్కడి లెంగ్త్‌కు ఇక్కడి లెంగ్త్‌కు చాలా తేడా ఉంటుంది. దీనిని అతను గుర్తించకుండా విదేశీ బౌన్సీ వికెట్ల తరహా లెంగ్త్‌లో ఇక్కడా బౌలింగ్ చేస్తున్నాడు. దీనికి అనుగుణంగా తన లెంగ్త్‌ను మార్చుకోకపోవడంతో ఫలితం ప్రతికూలంగా వస్తోంది. ఈ లోపాన్ని అతను సరిదిద్దుకోవాల్సి ఉంది. వన్డే, టి20ల్లో అయితే లెంగ్త్ ఎలా ఉన్నా కొన్ని సార్లు వికెట్లు లభిస్తాయి. కానీ టెస్టుల్లో అలా కుదరదు. బ్యాటర్ తగిన విధంగా సన్నద్ధమై ఉంటాడు. అయితే నా అభిప్రాయం ప్రకారం ఆ్రస్టేలియాకు వెళితే సిరాజ్ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడు’ అని ఆయన వివరించారు. -
టీ20 వరల్డ్ కప్ ను గెలిచిన భారత్
-
అంధుల భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా దుర్గారావు
వంగర: విజయనగరం జిల్లా వంగర మండలం కొప్పరవలస గ్రామానికి చెందిన టొంపాకి దుర్గారావు (26)ను భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా (కేబీ) ఎంపిక చేసింది. ఈ విషయాన్ని అసోసియేషన్ చైర్మన్ కె.మహేంతేష్ గురువారం ఢిల్లీలో ప్రకటించారు. దుర్గారావు నేపథ్యమిదీ నిరుపేద కుటుంబానికి చెందిన దుర్గారావు చిన్నతనంలోనే తండ్రి దాలయ్య మరణించారు. తల్లి సుందరమ్మ రెక్కల కష్టంతో దుర్గారావును పెంచి పెద్దచేశారు. విజయనగరం జిల్లా మెట్టవలస అంధుల పాఠశాలలో పదో తరగతి వరకు చదివాడు. ఇంటర్ సికింద్రాబాద్‌లో, డిగ్రీ హైదరాబాద్‌లోని కాలేజీల్లో పూర్తిచేశాడు. అంధుల క్రికెట్లో భారత్ తరఫున రాణిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. రెండుసార్లు అంధుల వన్డే క్రికెట్ ప్రపంచ కప్, మూడుసార్లు అంధుల టీ–20 వరల్డ్ కప్ భారత్ కైవసం చేసుకోవడంలో దుర్గారావు కీలక పాత్ర పోషించాడు. 2014 భారత అంధుల క్రికెట్ జట్టులో ఆల్ రౌండర్‌గా ఆరంగేట్రం చేశాడు. 2014 నవంబర్ 7 నుంచి డిసెంబర్ 25 వరకు దక్షిణాఫ్రికాలో జరిగిన అంధుల క్రికెట్ ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో 2016 జనవరి 28 నుంచి ఫిబ్రవరి 12 వరకు భారత్‌లో జరిగిన టీ–20 జట్టులో స్థానం లభించింది. 2018 జనవరిలో దుబాయ్‌లో జరిగిన అంధుల వరల్డ్ కప్‌లో కూడా ఆల్‌రౌండర్‌గా ప్రతిభ చాటాడు. 2019లో వెస్టిండీస్‌లో ద్వైపాక్షిక సిరీస్‌లో సత్తాచాటి భారత్‌కు విజయాన్ని అందించాడు. 2022 భారత్‌లో జరిగిన వరల్డ్ కప్ విజయంలోనూ, ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ (ఇప్సా) లండన్‌లో జరిగిన క్రికెట్ టోర్నీలో ద్వితీయ స్థానం సాధించడంలో కీలక భూమిక పోషించాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 21నుంచి 26 వరకు దుబాయ్‌లో జరిగే ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక దేశాల ముక్కోణపు టోర్నీకి భారత అంధుల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహించనున్నాడు. నా ఆశయానికి అమ్మే తోడు నేను మంచి క్రికెటర్‌గా ఎదగాలని ఆకాక్షించాను. కష్టపడి సాధన చేశాను. నా ఆశయానికి మా అమ్మ సుందరమ్మ సహకారం తోడైంది. పాఠశాల, కళాశాలల్లో ఉపాధ్యాయులు, స్నేహితులు ప్రోత్సాహం నాకు మరింత ఉత్సాహాన్నివ్వడంతో భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాను. కష్టపడితే ఎంతటి విజయమైనా సిద్ధిస్తుందని నమ్ముతాను. ఇదే నా విజయ రహస్యం – టొంపాకి దుర్గారావు, కెప్టెన్ భారత అంధుల జట్టు -
టీం ఇండియాకి భారీ షాక్..ఎందుకంటే..!
-
భారత బాస్కెట్‌బాల్ జట్టులో ఆర్యన్
ఆసియా కప్ అండర్–16 బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులో తెలంగాణకు చెందిన ఆర్యన్ శర్మకు చోటు లభించింది. ఈ టోర్నీ ఈనెల 17 నుంచి 24 వరకు ఖతర్ రాజధాని దోహాలో జరుగుతుంది. హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థి అయిన ఆర్యన్ శర్మ భారత కోచ్ పీఎస్ సంతోష్ ఆధ్వర్యంలో కీస్టోన్ బాస్కెట్‌బాల్ అకాడమీలో శిక్షణ తీసుకుంటాడు. ఈ టోరీ్నలో రాణిస్తే భారత జట్టు వచ్చే ఏడాది జూలైలో తుర్కియేలో జరిగే ప్రపంచకప్ అండర్–17 టోర్నమెంట్‌కు అర్హత సాధిస్తుంది. -
బుమ్రా రీ ఎంట్రీ కన్ఫర్మ్
-
WTC ఫైనల్లో ఇషాన్ కిషన్ బెస్ట్ ఎందుకంటే..!
-
యశస్విజైస్వాల్ రుతురాజ్ గైక్వాడ్.. వెల్కమ్ టు టీమ్ ఇండియా
-
Sudirman Cup 2023: భారత జట్టు ఎంపిక
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్ సుదిర్మన్ కప్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. మే 14 నుంచి 21 వరకు చైనాలోని సుజౌలో ఈ టోర్నీ జరుగుతుంది. గ్రూప్ ‘సి’లో మలేసియా, చైనీస్ తైపీ, ఆస్ట్రేలియా జట్లతో భారత జట్టు ఆడుతుంది. పురుషుల, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో ఒక్కో మ్యాచ్ జరుగుతుంది. భారత జట్టు: ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్ (పురుషుల సింగిల్స్), పీవీ సింధు, అనుపమ (మహిళల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి, ఎంఆర్ అర్జున్–ధ్రువ్ కపిల (పురుషుల డబుల్స్), పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ, అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్), తనీషా క్రాస్టో–సాయిప్రతీక్ (మిక్స్డ్ డబుల్స్). -
కేఎల్ రాహుల్‌కు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. హార్దిక్ పాండ్యాకు ప్రమోషన్!
టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ బీసీసీఐ బిగ్ షాకిచ్చింది. రాహుల్‌ను భారత జట్టు వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి బీసీసీ సీనియర్ సెలక్షన్ కమిటీ తొలిగించింది. అతడి స్థానంలో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నియమించింది. స్వదేశంలో శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్‌తో భారత జట్టు వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక వచ్చే ఏడాది జనవరిలో శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్‌లకు రెండు వేర్వేరు జట్లను బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. కాగా చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీకి ఇదే ఆఖరి జట్టు ఎంపిక కావడం గమానార్హం. ఇక టీ20 సిరీస్‌కు భారత రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ దూరమయ్యారు. యువ పేసర్లు ముఖేష్ కుమార్, శివమ్ మావికి తొలి సారి భారత జట్టులో చోటు దక్కింది. అదేవిధంగా ఈ సిరీస్‌కు రోహిత్ దూరం కావడంతో హార్దిక్ జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. అతడికి డిప్యూటీగా సూర్యకుమార్ యాదవ్ ఎంపిక అయ్యాడు. ఇక రోహిత్, విరాట్, కేఎల్ రాహుల్ తిరిగి వన్డే సిరీస్‌కు తిరిగి జట్టులో చేరనున్నారు. అయితే గత కొంత కాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు సెలక్టర్లు మొండి చేయి చూపించారు. లంకతో టీ20 సిరీస్‌కు భారత జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, శివం మావి, ముఖేష్ కుమార్ లంకతో వన్డే సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ , ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్ చదవండి: సివిల్స్ క్లియర్ చేసిన టీమిండియా క్రికెటర్ ఎవరో తెలుసా? -
ఛటోగావ్ టెస్ట్ లో భారత్ ఘన విజయం
-
ప్రపంచకప్ సమరం.. ఒకే ఫ్రేమ్‌లో 16 జట్ల కెప్టెన్లు (ఫొటోలు)
-
బుమ్రా వచ్చేశాడు...
ముంబై: ఎలాంటి అనూహ్య, ఆశ్చర్యకర ఎంపికలు లేవు. అంచనాలకు అనుగుణంగానే బీసీసీఐ సెలక్టర్లు టి20 ప్రపంచకప్ కోసం భారత జట్టును ప్రకటించారు. ఇప్పటికే తామేంటో రుజువు చేసుకున్న టాప్ ఆటగాళ్లతో పాటు ఇటీవలి ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుంటూ ఈ ఎంపిక జరిగింది. గాయాలతో కొంత కాలంగా టీమ్‌కు దూరమైన అగ్రశ్రేణి పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రాకతో భారత జట్టు బలం పెరిగింది. గాయం నుంచి కోలుకున్న హర్షల్ పటేల్ కూడా పునరాగమనం చేయడం బౌలింగ్‌ను మరింత పదునుగా మార్చింది. రోహిత్ శర్మ నాయకత్వంలో 15 మంది సభ్యుల జట్టుతో పాటు మరో నలుగురిని స్టాండ్‌బైలుగా సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియాలో టి20 ప్రపంచకప్ జరుగుతుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఏదైనా జట్టు తమ తొలి మ్యాచ్ బరిలోకి దిగే సమయం వరకు కూడా ఈ టీమ్‌లో మార్పులు చేసుకోవచ్చు. భారత్ తమ తొలి మ్యాచ్‌లో అక్టోబర్ 23న పాకిస్తాన్‌తో తలపడుతుంది. 2021 టోర్నీలో భారత్ సెమీస్ చేరడంలో విఫలమైంది. తొలి ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన జట్టులో (2007) భాగంగా ఉన్న రోహిత్ శర్మ 15 ఏళ్ల తర్వాత కెప్టెన్‌గా టీమ్‌ను నడిపించనున్నాడు. హుడా, అశ్విన్‌లకు చాన్స్ ఆసియా కప్ ఫలితం ఎలా ఉన్నా, ఒకరిద్దరు తప్పితే మిగతా వారిని ప్రపంచకప్‌కు ఎంపిక చేసే విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. ఈ ఏడాదే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టినా... నిలకడైన ఆటతో ఆకట్టుకున్న దీపక్ హుడాకు చోటు లభించింది. ఆఫ్‌స్పిన్ బౌలింగ్ చేయగల అదనపు నైపుణ్యం కూడా అతనికి అవకాశం తెచ్చి పెట్టింది. ప్రధాన స్పిన్నర్ చహల్ ఖాయం కాగా... రవీంద్ర జడేజా కోలుకునే అవకాశం లేకపోవడంతో అక్షర్ పటేల్‌కు సహజంగానే అవకాశం దక్కింది. అయితే మూడో స్పిన్నర్‌గా యువ లెగ్‌స్పిన్నర్ రవి బిష్ణోయ్, సీనియర్ అశ్విన్ మధ్య పోటీ నడిచింది. అయితే ఆఫ్‌స్పిన్‌తో జట్టుకు వైవిధ్యం చేకూరడంతో పాటు ఆసీస్ గడ్డపై అపార అనుభవం ఉండటంతో సీనియర్ అశ్విన్‌కే ఓటు వేసిన సెలక్టర్లు... డెత్ ఓవర్లలో ఆకట్టుకుంటున్న పేసర్ అర్‡్షదీప్‌పై నమ్మకం ఉంచారు. 12 ఏళ్ల తర్వాత... వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ 12 ఏళ్ల తర్వాత మళ్లీ టి20 వరల్డ్‌కప్‌లో ఆడను న్నాడు. కార్తీక్ 2007, 2010లలో టి20 ప్రపంచ కప్‌లు ఆడాడు. ఆ తర్వాత నాలుగు వరల్డ్ కప్‌లు జరిగినా కార్తీక్‌కు స్థానం దక్కలేదు. 2021లో జరిగిన టి20 ప్రపంచకప్ ఆడిన జట్టుతో పోలిస్తే ఇషాన్ కిషన్, వరుణ్ చక్రవర్తి, రాహుల్ చహర్, శార్దుల్ ఠాకూర్ తమ స్థానాలు కోల్పోయారు. మరోవైపు వరల్డ్ కప్ టీమ్‌లో స్టాండ్‌బైగా ఉన్న షమీని స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో జరిగే టి20 సిరీస్‌లకు ఎంపిక చేశారు. ఆస్ట్రేలియాతో సెప్టెంబర్ 20, 23, 25 తేదీల్లో... దక్షిణాఫ్రికాతో సెప్టెంబర్ 28, అక్టోబర్ 2, 4 తేదీల్లో టీమిండియా టి20 సిరీస్ ఆడుతుంది. భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), కోహ్లి, సూర్యకుమార్, దీపక్ హుడా, పంత్, దినేశ్ కార్తీక్, పాండ్యా, అశ్విన్, చహల్, అక్షర్, బుమ్రా, భువనేశ్వర్, హర్షల్ పటేల్, అర్‡్షదీప్ సింగ్. స్టాండ్‌బై: షమీ, అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చహర్. స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో జరిగే టి20 సిరీస్‌లలో కూడా స్వల్ప మార్పు మినహా ఇదే జట్టు బరిలోకి దిగుతుంది. హార్దిక్, భువనేశ్వర్ దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు, అర్‡్షదీప్ ఆస్ట్రేలియాతో సిరీస్‌కు దూరం కానున్నారు. రెండు సిరీస్‌ల సమయంలో ఈ ముగ్గురు ఆటగాళ్లు ఫిట్నెస్ మెరుగుదలకు సంబంధించి జాతీయ క్రికెట్ అకాడమీలో ఉంటారు. షమీ, దీపక్ చహర్ ఈ రెండు సిరీస్‌లు ఆడతారు. -
U19 Asia Cup: భారత జట్టు ప్రకటన.. హైదరాబాదీ ఆల్‌రౌండర్‌కు చోటు
U19 Asia Cup 2021: India Squad Announced, Yash Dhull To Lead Rishith Reddy Got Place: ఏసీసీ ఆసియా అండర్ 19 కప్-2021నేపథ్యంలో ఆల్ఇండియా జూనియర్ సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా డిసెంబరు 23 నుంచి ఆరంభం కానున్న టోర్నీ కోసం 20 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది. ఢిల్లీ క్రికెటర్ యశ్ ధుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. వినోద్ మన్కడ్ ట్రోఫీలో అత్యధిక పరుగులు(302) సాధించిన బ్యాటర్లలో ఒకడైన యశ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఇక హైదరాబాదీ ఆల్‌రౌండర్ రిషిత్ రెడ్డికి ఈ జట్టులో చోటు దక్కడం విశేషం. ఇటీవల బంగ్లాదేశ్‌తో తలపడిన ఇండియా ఏ జట్టులో భాగమైన రిషిత్.. ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇదిలా ఉండగా.. మెగా టోర్నీ సన్నాహకాల్లో భాగంగా.. డిసెంబరు 11 నుంచి 19 వరకు జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ కార్యక్రమంలో పాల్గొనే 25 మంది సభ్యుల జట్టును కూడా సెలక్షన్ కమిటీ ప్రకటించింది. కాగా ఇప్పటి వరకు ఏడు సార్లు అండర్ 19 ఆసియా కప్ గెలిచిన భారత జట్టు ఈసారి కూడా ఎలాగేనా చాంపియన్‌గా నిలవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇక 2019లో బంగ్లాదేశ్‌ను ఐదు పరుగుల తేడాతో ఓడించి ట్రోఫీ గెలిచిన సంగతి తెలిసిందే. ఇండియా అండర్ 19 ఆసియా కప్ జట్టు హర్నూర్ సింగ్ పన్ను, అంగ్క్రిష్ రఘువన్శి, అన్ష్ గోసాయి, ఎస్ కే రషీద్, యశ్ ధుల్(కెప్టెన్), అనేశ్వర్ గౌతమ్, సిద్దార్థ్ యాదవ్, కౌశల్ థంబే, నిశాంత్ సింధు, దినేశ్ బనా(వికెట్ కీపర్), రాజంగడ్ బవా, రాజ్వర్ధన్ హంగ్రేకర్, గర్వ్ సంగ్వాన్, రవి కుమార్, రిషిత్ రెడ్డి, మానవ్ ప్రకాశ్, అమ్రిత్ రాజ్ ఉపాధ్యాయ్, విక్కీ ఒత్వాల్, వాసు వట్స్. స్టాండ్ బై ప్లేయర్స్: ఆయుశ్ సింగ్ ఠాకూర్ ,ఉదయ్ సహరాన్, షశ్వత్ దంగ్వాల్, ధనుశ్ గౌడ, పీఎం సింగ్ రాథోడ్. చదవండి: Vijay Hazare Trophy: సెంచరీలతో చెలరేగిన రుతురాజ్, వెంకటేశ్ అయ్యర్ NEWS 🚨: India U19 squad for Asia Cup & preparatory camp announced. More details 👇https://t.co/yJAHbfzk6A — BCCI (@BCCI) December 10, 2021 -
ఆడుతోంది మన జట్టేనా అన్న అనుమానాలు
-
స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్ ఫొటోలు
-
ఈ క్రికెటర్లో పూర్తి అథ్లెట్‌ను చూశాను: టీమిండియా ఫీల్డింగ్ కోచ్
భారత ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ టీమిండియా ఆటగాడు శుబ్‌మన్ గిల్‌పై ప్రశంసలు కురిపించాడు. తాను ఇటువంటి క్రికెటర్‌ను చూడలేదంటూ కితాబిచ్చాడు. కాగా ఐపీఎల్ రాణించడంతో వెలుగులోకి వచ్చిన గిల్ జాతీయ జట్టులోనూ సత్తా చాటి తానేంటో నిరూపించుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ జాబితాలో గిల్ చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. శుభమన్ గిల్ ఒక పూర్తి అథ్లెట్: భారత ఫీల్డింగ్ కోచ్ కేవలం ఏడు టెస్టుల అనుభవంతో శుభమన్ అంతర్జాతీయ క్రికెట్‌కు చాలా కొత్తవాడనే చెపాలి. గత కొన్ని సంవత్సరాలుగా టెస్ట్ ఓపెనర్లకు ఇంగ్లండ్ పిచ్‌లు అంతటి అనుకూలం కాదు. పైగా ఈ మెగా ఈవెంట్లో ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌతీ, నీల్ వాగ్నెర్ లాంటి పేసర్లని ఎదుర్కొనే గిల్ రాణించాల్సి ఉంటుందని శ్రీధర్ తెలిపారు. గిల్ గురించి మాట్లాడుతూ.. '' అతను సన్నగా పొడవైనవాడు, గ్రౌండ్‌లోనే చురుకుగా కదలడం, బ్యాటింగ్ పద్ధతిలోనూ లోపాలు లేవు, అలాగే ఫీల్డింగ్ పరంగానూ ఆకట్టుకుంటున్నాడు. ఇలా నేను చూసిన క్రికెటర్లలో పూర్తి అథ్లెట్ అతనేనని భావిస్తున్నట్లు'' టైమ్స్ ఆఫ్ ఇండియాతో చాట్‌లో అన్నారు. ఈ నెలాఖరులో జరిగే ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌తో తలపడినప్పుడు చాలా మంది కళ్ళు శుబ్‌మన్ గిల్‌పై ఉండనున్నాయి. ఇదిలావుండగా.. డబ్ల్యుటీసీ ఫైనల్, ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు జూన్ 2న ఇంగ్లండ్ వెళ్లనుంది. విరాట్ కోహ్లి జట్టు అక్కడికి వెళ్లిన తర్వాత 10 రోజుల క్వారంటైన్లో గడపనున్నారు. అందువల్ల, కివీస్‌పై అంతిమ యుద్ధానికి సిద్ధం కావడానికి వారికి ఎక్కువ సమయం లభించదు. చదవండి: దుమ్మురేపాడు.. నెటిజన్లచే చివాట్లు తిన్నాడు -
అక్తర్ వార్నింగ్.. మళ్లీ అలా ఆడేందుకు ధైర్యం చేయలేదు: ఊతప్ప
పాకిస్థాన్ బౌలర్ షాయబ్ అక్తర్ గతంలో ఒకసారి తనని హెచ్చరించాడని భారత క్రికెటర్ రాబిన్ ఊతప్ప తెలిపాడు. 'వేక్ అప్ విత్ సోరబ్' కార్యక్రమంలో కమెడియన్ సోరబ్ పంత్‌తో మాట్లాడుతూ ఊతప్ప ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. 2007లో పాక్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్ సందర్భంగా ఈ ఘటన జరిగిందని చెప్పాడు. ఆ సిరీస్‌లో గువాహటి వన్డే తర్వాత జరిగిన డిన్నర్ సమయంలో అక్తర్ తనతో మాట్లాడిన సంగతిని చెప్పుకొచ్చాడు. గువాహటి వన్డేలో.. నేను క్రీజులో ఉన్న సమయానికి 25 బంతుల్లో 12 పరుగులు కావాలి. ఇర్ఫాన్, నేను క్రీజులో ఉన్నాం. ఆ సమయంలో షాయబ్ అక్తర్ బౌలింగ్ చేస్తున్నాడు. అతనను బంతిని 154 కి.మీ. వేగంతో ఓ యార్కర్ విసిరాడు. దానిని నేను ఆపగలిగాను. ఆ తర్వాత బంతికి మరో యార్కర్ ట్రై చేసి ఫుల్ టాస్ రావడంతో ఆ బంతిని బౌండరీకి తరలించాను. ఇక అక్తర్ తరువాత బంతలను వరుసగా యార్కర్లు వేస్తున్నాడు. ఆ సమయంలో పరుగులు రావలంటే క్రీజు దాటి ఫ్రంట్ ఫుట్‌లో ఆడాలని నిర్ణయించుకున్నా. తరువాత బంతికి క్రీజు బయటికొచ్చి నా బ్యాట్‌ను తాకించా. అది బౌండరీ వెళ్లింది. మేం ఆ మ్యాచ్‌ను గెలిచాం. మ్యాచ్ అనంతరం మేము జట్టు సభ్యులతో కలిసి విందు చేస్తున్నట్లు నాకు గుర్తుంది. అక్తర్ భాయ్ కూడా అక్కడే ఉన్నాడు. అప్పుడు నా వద్దకు వచ్చి రాబిన్.. ఇవాల్టి మ్యాచ్‌లో క్రీజు దాటి బయటకు వచ్చి ఆడావు. కానీ మళ్ళీ అలా ఆడితే.. నీ తలకి గురిపెడుతూ బౌన్సర్‌ను వేస్తా అని హెచ్చరించి వెళ్లిపోయాడు. ఆ తరువాత, నేనతని బౌలింగ్‌లో అలా ఆడటానికి ధైర్యం చేయలేదని ఊతప్ప తెలిపాడు. ( చదవండి: కెప్టెన్ చెప్పిన వాళ్లను ఎంపిక చేయరు.. మా పద్దతి అదే ) -
ఇండియాదే రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టి20 కప్
-
ఇండియాదే లెజెండ్స్ కప్
రాయ్‌పూర్: రిటైర్డ్ క్రికెటర్లతో నిర్వహించిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టి20 క్రికెట్ టోర్నీ కప్‌లో భారత్ లెజెండ్స్ జట్టు చాంపియన్‌గా నిలిచింది. సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలోని భారత జట్టు 14 పరుగుల తేడాతో శ్రీలంక లెజెండ్స్ జట్టును ఓడించింది. యూసుఫ్ పఠాన్ (36 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు)... యువరాజ్ సింగ్ (41 బంతుల్లో 60; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో... తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగుల భారీ స్కోరు చేసింది. సెహ్వాగ్ (12 బంతుల్లో 10; 1 సిక్స్) విఫలంకాగా... సచిన్ టెండూల్కర్ (23 బంతుల్లో 30; 5 ఫోర్లు) రాణించాడు. అనంతరం శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసి ఓడింది. దిల్షాన్ (18 బంతుల్లో 21; 3 ఫోర్లు), జయసూర్య (43; 5 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అయితే వీరిద్దరు అవుటయ్యాక లంక జోరు తగ్గింది. చివర్లో జయసింఘే (30 బంతుల్లో 40; ఫోర్, 2 సిక్స్‌లు), వీరరత్నే (15 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా ఫలితం లేకపోయింది. భారత స్పిన్నర్ యూసుఫ్ పఠాన్ రెండు వికెట్లు తీశాడు. చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బాఘేల్ చేతుల మీదుగా సచిన్ లెజెండ్స్ కప్‌ను అందుకున్నాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: (యువీ దూకుడు.. యూసఫ్ మెరుపులు) -
ఆంధ్ర క్రికెటర్లు భారత జట్టులోకి ఎంపికవ్వాలి
అనంతపురం సప్తగిరి సర్కిల్: ఆంధ్ర క్రికెట్ జట్టుకు ఆడుతున్న యువ ఆటగాళ్లు భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలని ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) అధ్యక్షుడు శరత్‌చంద్రారెడ్డి ఆకాంక్షించారు. యువ క్రికెటర్లలను ప్రోత్సహించడంలో, వారికి తగిన అవకాశాలు ఇవ్వడంతో ఏసీఏ ఎప్పుడూ ముందుంటుందని ఆయన అన్నారు. ఏసీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆంధ్ర టి20 లీగ్‌ను ఆయన ఆర్డీటీ మైదానంలో గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీ నవంబర్ 8 వరకు జరుగుతుంది. మొత్తం 33 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. తొలి రోజు మ్యాచ్‌ల్లో కింగ్స్ ఎలెవన్‌పై 6 వికెట్లతో టైటాన్స్ ఎలెవన్ గెలుపొందగా... రెండో మ్యాచ్‌లో చార్జర్స్ ఎలెవన్ జట్టు 56 పరుగులతో లెజెండ్స్ ఎలెవన్‌ను ఓడించింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏసీఏ రాష్ట్ర కార్యదర్శి దుర్గాప్రసాద్, సీఈఓ వెంకటశివారెడ్డి, ట్రెజరర్ గోపీనాథ్‌రెడ్డి, అండర్–14 ఆంధ్ర జట్టు సెలెక్టర్ ప్రసాద్‌రెడ్డి, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్, మాజీ క్రికెటర్ షాబుద్దీన్ తదితరులు హాజరయ్యారు. -
భారత టెస్టు స్పెషలిస్ట్‌లు దుబాయ్‌కి
ముంబై: ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత టెస్టు జట్టు స్పెషలిస్ట్‌లు, కోచింగ్ బృందం కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. ఐపీఎల్లో ఆడని చతేశ్వర్ పుజారా, హనుమ విహారిలతోపాటు హెడ్ కోచ్ రవిశాస్త్రి, ఇతర సహాయక సిబ్బందిని నేరుగా ఆస్ట్రేలియా పంపించకుండా సహచరులతో కలిసి దుబాయ్ నుంచి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం వీరందరినీ బోర్డు ఈ నెలాఖరులో దుబాయ్‌కు పంపించనుంది. యూఏఈ నిబంధనల ప్రకారం వీరంతా అక్కడే ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉంటారు. వారంలో మొదటి, మూడో, ఆరో రోజున కోవిడ్–19 పరీక్షలకు హాజరవుతారు. అంతా ఓకే అనుకుంటే బయో బబుల్‌లో అక్కడే ఉన్న భారత జట్టు ఆటగాళ్లతో కలుస్తారు. వీరంతా ఒకే చార్టెర్డ్ ఫ్లయిట్లో ఆస్ట్రేలియా బయల్దేరతారు. ఆస్ట్రేలియా సిరీస్ పూర్తిగా బయో బబుల్ వాతావరణంలో జరగనున్న నేపథ్యంలో భారత బృందమంతా ఒకే తరహా వాతావరణం నుంచి వెళితే బాగుంటుందని బోర్డు భావిస్తోంది. సరిగ్గా చెప్పాలంటే ఒక బయో బబుల్ రక్షణ కవచం నుంచి మరో బయో బబుల్ (ఆస్ట్రేలియాలో)లోకి వెళ్లడం సులువవుతుందని, అందుకే అందరూ కలిసి వెళ్లడం మంచిదని తాము భావించినట్లు బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. మరోవైపు ఆస్ట్రేలియాలో భారత జట్టు నేరుగా ఏ నగరానికి వెళుతుందో, ఎక్కడ మ్యాచ్‌లు ఆడుతుందో ఇంకా ఖరారు కాలేదు. ఆస్ట్రేలియాలో ఆ సమయంలో ఉండే కరోనా పరిస్థితిని బట్టి మార్పులు జరగవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీసం రెండు వారాలు క్వారంటీన్ కావాల్సి ఉంటుంది. దీనిపై కూడా ఇప్పటి వర కు ఇంకా ఎలాంటి సడలింపులు ఇవ్వలేదు. -
‘ధోనీపై గంగూలీ మాటలు ఇంకా గుర్తున్నాయి..’
న్యూఢిల్లీ : మెరికల్లాంటి ఆటగాళ్లను గుర్తించి ప్రోత్సహించడంలో భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ చేసిన ఎనలేని కృషిని కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ డైరెక్టర్ జాయ్ భట్టాచార్య నెమరు వేసుకున్నారు. మహేంద్ర సింగ్ ధోనీ గొప్ప స్టార్ అవుతాడాని గంగూలీ ముందే పసిగట్టాడని జాయ్ భట్టాచార్య తెలిపాడు. ధోనీ వీఐపీ అవుతాడని తనతో అన్నాడని గౌరవ్ కపూర్ యూట్యూబ్ షోలో జాయ్ భట్టాచార్య మాట్లాడుతూ గుర్తు చేసుకున్నాడు. భారత్ ఏ, పాకిస్తాన్ ఏ, బంగ్లాదేశ్ ఏ త్రైపాక్షిక సిరీస్ అనంతరం 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన ధ్వైపాక్షిక సీరీస్‌కు ధోనీ తొలిసారిగా ఆడాడు. 2004లో బంగ్లాదేశ్‌కు వెళ్లే విమానంలో గంగూలీ తనతో చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయని జాయ్ అన్నాడు. ధోనీని చూపిస్తూ..'మనకు ఓ విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఉన్నాడు. అతను భవిష్యత్తులో గొప్ప స్టార్ అవుతాడు' అని దాదా చెప్పాడని జాయ్ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. గంగూలీలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఆటగాళ్ల ప్రతిభను పసిగట్టడం. ప్లేయర్ టాలెంట్ అతను గుర్తించాడంటే, ఆ ఆటగాడు విఫలమైనా అతనికి అండగా ఉంటాడు. ఎందుకంటే టాలెంట్ ఉన్న ఆటగాళ్లు రాణిస్తారని అతని గట్టి నమ్మకం' అని భట్టాచార్య చెప్పుకొచ్చాడు.(ఐపీఎల్‌పై కేంద్రానికి లేఖ రాసిన బీసీసీఐ) భారత జట్టు క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో సారథిగా పగ్గాలు అందుకున్న సౌరవ్ గంగూలీ భారత క్రికెట్లో ఓ నూతన అధ్యయాన్ని లిఖించాడు. యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్ వంటి ఆటగాళ్లను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసి బలమైన జట్టుగా భారత్‌ను నిలిపాడు. ఇక 2004 బంగ్లాదేశ్ పర్యటనతో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ధోనీ, ఆ టూర్లో విఫలమైనా గంగూలీ అవకాశం ఇచ్చాడు. ఆ టూర్ అనంతరం స్వదేశంలో విశాఖలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇవ్వడంతో మహీ సత్తా ప్రపంచానికి తెలిసింది. ఆ మ్యాచ్‌లో ధోనీ విధ్వంసకర బ్యాటింగ్‌తో 123 బంతుల్లో 148 పరుగులు చేసి వీరవిహారం చేశాడు. అనంతరం ధోనీ క్రికెట్ ప్రయాణం తెలిసిందే. (ఆస్ట్రేలియాలో జరిగితే ఆ టికెట్లు చెల్లుతాయి: ఐసీసీ) -
నాపై ద్రవిడ్ ప్రభావం చాలా ఎక్కువ
రాజ్‌కోట్: టెస్టు క్రికెట్లో భారత దిగ్గజం రాహుల్ ద్రవిడ్‌కు, ప్రస్తుత టీమిండియా సభ్యుడు చతేశ్వర్ పుజారాకు దగ్గరి పోలికలు కనిపిస్తాయి. మూడో స్థానంలో ఆడటం నుంచి బ్యాటింగ్ శైలి వరకు చాలా సందర్భాల్లో ఇద్దరి ఆట ఒకే తరహాలో ఉంటుంది. ఈ విషయాన్ని పుజారా కూడా అంగీకరిస్తాడు. నిజానికి ఆటతో పాటు వ్యక్తిగతంగా కూడా తనపై ద్రవిడ్ ప్రభావం చాలా ఎక్కువగా ఉందని పుజారా చెప్పాడు. చిన్నప్పటి నుంచి ద్రవిడ్ ఆటను చూస్తూ పెరిగానని... తనంతట తానుగా అనుకరించకపోయినా ఆ శైలి వచ్చేసిందని అతను అన్నాడు. ‘చిన్నప్పటి నుంచి ద్రవిడ్ ఆటను నేను చాలా బాగా పరిశీలించేవాడిని. పట్టుదలగా క్రీజులో నిలవడం, సులువుగా వికెట్ ఇవ్వకపోవడం నా మనసులో ముద్రించుకుపోయాయి. ఆయనను ఇంతగా అభిమానించినా అనుకరించాలని మాత్రం అనుకోలేదు. ఇద్దరి శైలి ఒకేలా ఉండటం యాదృచ్ఛికమే. దేశవాళీలో బలహీనమైన సౌరాష్ట్ర తరఫున ఆడటంతో జట్టు కోసం సుదీర్ఘంగా క్రీజ్‌లో పాతుకుపోవాల్సి వచ్చేది. అది అలా అలవాటైంది. భారత జట్టు తరఫున ఆయనతో కలిసి ఆడినప్పుడు మాత్రం పలు సూచనలిచ్చారు. టెక్నిక్‌పై దృష్టి పెడితే సరిపోదని ఇంకా ఇతర అంశాలపై కూడా పట్టు సాధించాలని ద్రవిడ్ నాకు సూచించారు’ అని పుజారా వెల్లడించాడు. క్రికెట్ బయట కూడా జీవితం ఉంటుందని, అప్పుడు ఎలా ఉండాలో ద్రవిడ్ నేర్పించాడని పుజారా గుర్తు చేసుకున్నాడు. ‘క్రికెట్ మాత్రమే కాకుండా జీవితం ప్రాధాన్యత ఏమిటో నేను అర్థం చేసుకునేలా ఆయన చేశారు. ఆట ముగిశాక ఎలా ఉండాలో నేర్పించారు. ప్రొఫెషనల్ కెరీర్‌ను, వ్యక్తిగత జీవితాన్ని ఎలా భిన్నంగా చూడాలో కౌంటీ క్రికెట్లో నాకు తెలిసింది. ద్రవిడ్ ఇచ్చిన సలహాలు అమూల్యమైనవి. నాపై ఆయన ప్రభావం ఏమిటో ఒక్క మాటలో చెప్పలేను’ అని పుజారా తన అభిమానాన్ని ప్రదర్శించాడు. 32 ఏళ్ల పుజారా 10 ఏళ్ల కెరీర్లో 77 టెస్టుల్లో 48.66 సగటుతో 5,840 పరుగులు సాధించాడు. 5 వన్డేల్లో కూడా అతను భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. -
నా ప్రాక్టీస్‌కు నాన్న సాయం: సాహా
కోల్‌కతా: దాదాపు రెండు నెలలుగా ప్రాక్టీస్‌కు దూరమైన భారత టెస్టు జట్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా తమ నివాస స్థలంలోనే సాధనను కొనసాగిస్తున్నట్లు చెప్పాడు. తను ఉంటున్న అపార్ట్మెంట్లో తండ్రి సాయంతో వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్నానన్నాడు. ‘మా ఫ్లాట్‌లో ఖాళీగా ఉన్న స్థలాన్ని సన్నాహకానికి ఉపయోగించుకుంటున్నా. సాఫ్ట్ బాల్‌తో క్యాచ్‌లు పడుతున్నా. బంతిని గోడకేసి కొట్టి... క్యాచ్‌లుగా పట్టేందుకు శ్రమిస్తున్నా. దీనికి మా నాన్న ప్రశాంత సాహా సాయమందిస్తున్నారు. నేను చేసే ప్రాక్టీస్‌కు ఈ స్థలం, మా నాన్న సాయం సరిపోతుంది. అటు ఇటు కీపింగ్ క్యాచింగ్ చేస్తున్నాను. లాక్‌డౌన్‌తో బయటికి వెళ్లకుండానే కీపింగ్ డ్రిల్స్ చేస్తున్నాను. రన్నింగ్‌కు వీల్లేకపోయినా అపార్ట్మెంట్ లోపలే వాకింగ్‌తో సరిపెట్టుకున్నాను. పూర్తిస్థాయి జిమ్ లేదు కానీ అందుబాటులోని ఎక్సర్సైజ్ సామాగ్రితో రోజు కసరత్తు చేస్తున్నా’ అని సాహా చెప్పాడు. -
తుది జట్టులో పేస్
న్యూఢిల్లీ: ఈ ఏడాది అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకనున్న భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) చివరిసారి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించింది. మార్చి 6, 7 తేదీల్లో జాగ్రెబ్‌లో క్రొయేషియా జట్టుతో జరిగే డేవిస్ కప్ టీమ్ టెన్నిస్ వరల్డ్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో పాల్గొనే ఐదుగురు సభ్యులతో భారత తుది జట్టును ఏఐటీఏ మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు ఆటగాళ్ల జాబితాను అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్)కు పంపించింది. 24 జట్లు పాల్గొనే క్వాలిఫయర్స్‌లో గెలిచిన 12 జట్లు ఈ ఏడాది చివర్లో జరిగే డేవిస్ కప్ ఫైనల్స్ టోర్నీకి అర్హత సాధిస్తాయి. సింగిల్స్‌లో భారత టాప్–3 ర్యాంకర్లు సుమీత్ నాగల్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్, రామ్‌కుమార్ రామనాథన్... డబుల్స్‌లో భారత నంబర్‌వన్ రోహన్ బోపన్న, నాలుగో ర్యాంకర్ లియాండర్ పేస్‌లను భారత జట్టులో ఎంపిక చేశామని ఏఐటీఏ తెలిపింది. డబుల్స్‌లోభారత రెండో ర్యాంకర్ దివిజ్ శరణ్‌ను రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపిక చేశారు. ‘ఈ సీజన్లో పేస్ బాగా రాణిస్తున్నాడు. మంచి ఫామ్‌లో ఉన్నాడు. టాటా ఓపెన్‌లో దివిజ్ శరణ్ జంటపై పేస్ జోడీ గెలిచింది. బెంగళూరు ఓపెన్ చాలెంజర్ టోర్నీలో పేస్ ద్వయం రన్నరప్‌గా నిలిచింది. అంతేకాకుండా ఈ ఏడాది పేస్ కెరీర్లో చివరిది. 30 ఏళ్లుగా దేశానికి సేవ అందిస్తున్న వ్యక్తికి అత్యున్నత గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా అతడిని ఎంపిక చేశాం. దివిజ్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాడు’ అని భారత నాన్ ప్లేయింగ్ కెప్టెన్ రోహిత్ రాజ్‌పాల్ తెలిపారు. డేవిస్ కప్‌లో క్రొయేషియా, భారత్ తలపడనుండటం ఇది రెండోసారి మాత్రమే. 1995లో న్యూఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 3–2తో క్రొయేషియాను ఓడించింది. ఈ పోటీలో పేస్ సింగిల్స్‌తోపాటు డబుల్స్‌లోనూ బరిలోకి దిగి విజయం సాధించాడు. -
భారత్ చేతిలో ఆసీస్ షూటౌట్
భువనేశ్వర్: గోల్ కీపర్ శ్రీజేశ్ అడ్డుగోడగా నిలవడంతో ప్రపంచ రెండో ర్యాంకర్ ఆస్ట్రేలియాపై భారత హాకీ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ప్రొ హాకీ లీగ్ సీజన్–2లో భాగంగా శనివారం ఇక్కడి కళింగ స్టేడియంలో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 3–1తో పెనాల్టీ షూటౌట్లో ఆస్ట్రేలియాపై గెలుపొందింది. దాంతో శుక్రవారం ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. నిర్ణీత 60 నిమిషాల ఆటలో ఇరు జట్లు కూడా 2–2 గోల్స్‌తో సమంగా నిలిచాయి. భారత తరఫున రూపిందర్ పాల్ సింగ్ (25వ నిమిషంలో), హర్మన్‌ప్రీత్ సింగ్ (27వ నిమిషంలో) చెరో గోల్ చేయగా... ఆసీస్ ఆటగాళ్లలో ట్రెంట్ మిట్టన్ (23వ నిమిషంలో), అరాన్ జలేవ్స్కీ (46వ నిమిషంలో) చెరో గోల్ సాధించారు. ఫలితంగా మ్యాచ్ షూటౌట్‌కు దారి తీసింది. -
ఓపెనింగ్ పరీక్ష
హామిల్టన్: న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు పంచుకున్న తర్వాత టెస్టు పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు భారత్ సన్నద్ధమవుతుంది. అయితే ఈ నెల 21నుంచి జరిగే తొలి టెస్టుకు ముందు సన్నాహకంగా టీమిండియా మరో మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది. నేటినుంచి ఇక్కడి సెడెన్ పార్క్‌లో జరిగే మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఎలెవన్‌తో భారత్ తలపడుతుంది. ఇటీవలి కాలంలో ప్రత్యర్థులకు ప్రాక్టీస్ మ్యాచ్ కోసం నాసిరకం వేదికలు ఇవ్వడం, దిగువ స్థాయి ఆటగాళ్లను బరిలోకి దించడం వంటివి ఆతిథ్య జట్లు తరచుగా చేస్తున్న నేపథ్యంలో తాజా మ్యాచ్ మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. కివీస్ సీనియర్, ‘ఎ’ జట్లకు చెందిన పలువురు కీలక ఆటగాళ్లు ఈ మ్యాచ్ ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ సరైన రీతిలో మ్యాచ్‌ను ఉపయోగించుకునేందుకు ఇది మంచి అవకాశం. ఓపెనర్లను పరీక్షించడం, పేస్ బౌలర్ల ఫిట్నెస్ తదితర అంశాలను పరిశీలించుకోవడం టీమిండియాకు తొలి టెస్టుకు ముందు ప్రధాన లక్ష్యం. మూడు రోజుల మ్యాచ్ కాబట్టి ప్రధాన ఆటగాళ్లందరికీ బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ లభించవచ్చు. మయాంక్‌కు జోడీగా... సొంతగడ్డపై వరుస విజయాలు సాధించిన భారత టెస్టులో జట్టులో ఓపెనర్లుగా రోహిత్, మయాంక్ భారీగా పరుగులు సాధించారు. ఇప్పుడు గాయంతో రోహిత్ సిరీస్‌కు దూరం కావడంతో మయాంక్‌కు జోడీగా మరో ఆటగాడిని దించడం అనివార్యమైంది. నిజానికి మయాంక్ ఫామ్ కూడా గొప్పగా లేదు. ‘ఎ’ జట్టు తరఫున అనధికారిక టెస్టు రెండు ఇన్నింగ్స్‌లోనూ అతను డకౌటయ్యాడు. ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్‌లో విఫలం కావడంతో పాటు అతని పేలవ డిఫెన్స్‌పై విమర్శలు వచ్చాయి. ఇప్పటికే రెండు టెస్టులు ఆడిన పృథ్వీ షా తన సత్తా చాటి పునరాగమనం చేయగా...‘ఎ’ మ్యాచ్‌లలో 83, 204 నాటౌట్, 136 స్కోర్లతో గిల్ చెలరేగాడు. తాజా ప్రాక్టీస్ మ్యాచ్ వీరిద్దరి ప్రదర్శనను అంచనా వేయడానికి టీమ్ మేనేజ్మెంట్కు ఉపయోగపడుతుంది. ఇషాంత్ దాదాపుగా సిరీస్‌కు దూరమయ్యాడు కాబట్టి బుమ్రా, షమీలపై బాధ్యత మరింత పెరిగింది. శనివారం జరిగే ఫిట్నెస్ టెస్టులో అర్హత సాధిస్తేనే ఇషాంత్ జట్టుతో చేరవచ్చు. ఉమేశ్ యాదవ్‌కు విదేశాల్లో తనను తాను నిరూపించుకునేందుకు ఇది మంచి అవకాశం. ఈ మ్యాచ్‌లో రాణిస్తే మూడో పేసర్‌గా అతని స్థానం ఖాయమవుతుంది. ఇంత వరకు అరంగేట్రం చేయని నవదీప్ సైనీనుంచి అతనికి పోటీ పొంచి ఉంది. ఇద్దరు స్పిన్నర్లు అశ్విన్, జడేజాల ప్రాక్టీస్‌కు కూడా మ్యాచ్ సరైన వేదిక. దీటైన జట్టు... న్యూజిలాండ్ ఎలెవన్ తరఫున ఆడుతున్న జట్టులో పలువురు గుర్తింపు పొందిన ఆటగాళ్లు ఉన్నారు. జాతీయ జట్టు రెగ్యులర్ క్రికెటర్లు ఇష్ సోధి, జిమ్మీ నీషమ్, వికెట్ కీపర్ టీమ్ సీఫెర్ట్‌లతో ఆ జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. వీరంతా ఇటీవల భారత్‌తో వన్డే, టి20 సిరీస్‌లలో తలపడిన జట్టులో ఉన్నవారే. కుగ్లీన్, టిక్నర్లు కూడా సొంత మైదానంలో చెలరేగిపోగల సమర్థులు. డరైన్ మిషెల్, టామ్ బ్రూస్‌వంటి టెస్టు స్పెషలిస్ట్‌లు కూడా తమ సత్తా చాటాలని సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈ జట్టు గనక టీమిండియాను ఇబ్బంది పెట్టగలిగితే రాబోయే టెస్టు సిరీస్‌లో భారత్‌కు సవాల్ ఎదురవడం ఖాయం. పృథ్వీతో పోటీ లేదు యువ బ్యాట్స్‌మన్ శుబ్‌మన్ గిల్ తనకు ఓపెనింగ్‌లో పృథ్వీ షాతో పోటీ లేదన్నాడు. అయితే అవకాశం వస్తే దాన్ని జారవిడుచుకోనని చెప్పాడు. ఇటీవలే న్యూజిలాండ్ ‘ఎ’తో జరిగిన అనధికారిక టెస్టుల్లో భారత్ ‘ఎ’ తరఫున గిల్ అద్భుతంగా రాణించాడు. డబుల్ సెంచరీ, సెంచరీతో మెరిశాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 21 నుంచి వెల్లింగ్టన్లో జరిగే తొలి టెస్టులో అతను ఆడే అవకాశాలు మెరుగయ్యాయి. దీంతో పృథ్వీషాతో అతను పోటీ పడుతుండటంపై చర్చ మొదలైంది. దీనిపై అతను మాట్లాడుతూ ‘పృథ్వీ నా అండర్–19 సహచరుడు. ఇద్దరి కెరీర్లు ఒకేసారి మొదలయ్యాయి. కానీ అతనితో నాకు పోటీ లేదు. మేమిద్దరం బాగా ఆడుతున్నాం. జట్టులో ఎవరుండాలనేది టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయిస్తుంది. అయితే ఇది మా మధ్య పోటీ కానేకాదు. ఎవరికి అవకాశమొచ్చినా సద్వినియోగం చేసుకోవాలి తప్ప దాన్ని వృథా చేయొద్దు’ అని అన్నాడు. ఆరు వారాలుగా భారత్ ‘ఎ’ తరఫున కివీస్‌లో ఉండటంతో అక్కడి పరిస్థితులు, పిచ్‌లను అతను చక్కగా అలవాటు చేసుకున్నాడు. దీంతో అనధికారిక టెస్టుల్లో 20 ఏళ్ల గిల్ విశేషంగా రాణించాడు. అక్కడి పేసర్లతో జాగ్రత్త అని చెప్పాడు. ‘కివీస్ బౌలింగ్ అటాక్ వికెట్లు పడగొట్టేందుకు షార్ట్‌పిచ్ బంతుల్నే సంధిస్తుంది. ముఖ్యంగా నీల్ వాగ్నర్‌తో అప్రమత్తంగా ఉండాలి. వాళ్లు ఆడిన ఆస్ట్రేలియా సిరీస్‌నే పరిశీలిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. వికెట్లు పడకపోతే... ఇక పిచ్‌తో లాభం లేదని అదేపనిగా షార్ట్‌పిచ్ బంతుల్నే ప్రయోగించారు. బ్యాట్స్‌మన్ గా నేను చెప్పేది ఒకటే... షార్ట్‌పిచ్ బంతుల్ని అలా వదిలేస్తేనే మనం పరుగులు చేయగలం’ అని శుబ్‌మన్ వివరించాడు. అక్కడి వాతావరణ పరిస్థితులు కూడా బ్యాటింగ్‌పై ప్రభావం చూపిస్తాయన్నాడు. ఈ పరిస్థితుల ఆధారంగానే వారి (ఆతిథ్య బౌలర్ల) ప్రణాళికలు ఉంటాయన్నాడు. తీవ్రంగా గాలి వీస్తే బ్యాట్స్‌మెన్‌కు పుల్ షాట్లు, హుక్ షాట్లు ఆడటం కష్టమవుతుందని చెప్పాడు. నాలుగో స్థానంలో ఆడటం కన్నా ఓపెనర్‌గా దిగడమే బాగుంటుందని... యథేచ్చగా ఆడే అవకాశం ఉంటుందని చెప్పాడు. అదే 4వ స్థానమైతే అప్పటికే 2 వికెట్లు పడిన ఒత్తిడి ఉంటుందని తెలిపాడు. ‘న్యూజిలాండ్ కంటే ఇంగ్లండ్‌లోనే స్వింగ్ ఎక్కువ అవుతుంది. అక్కడ ఎరుపురంగు డ్యూక్స్ బంతుల్ని ఎదుర్కోవడం కష్టం. కానీ కివీస్‌లో అలా వుండదు. ఇక్కడి వికెట్లు బ్యాటింగ్‌కు అనుకూలంగానే ఉంటాయి. అయితే బౌన్స్‌ను ఎదుర్కోవడమే కాస్త కష్టం’ అని గిల్ విశ్లేషించాడు. -
భారత్ శుభారంభం
మనీలా: ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు శుభారంభం చేసింది. మంగళవారం గ్రూప్ ‘బి’లో కజకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4–1తో ఘనవిజయం సాధించింది. ముందుగా జరిగిన మూడు సింగిల్స్ పోటీల్లో కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్, శుభాంకర్ డే విజయం సాధించారు. తొలి డబుల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్–చిరాగ్ శెట్టి జోడీ కంగుతినగా, రెండో డబుల్స్‌లో ఎం.ఆర్.అర్జున్–ధ్రువ్ కపిల ద్వయం గెలుపొందింది. ఈ విజయంతో భారత్ క్వార్టర్ ఫైనల్స్‌ను దాదాపు ఖాయం చేసుకుంది. తొలి మ్యాచ్ బరిలోకి దిగిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ కేవలం 23 నిమిషాల్లోనే ప్రత్యర్థిని ఓడించాడు. శ్రీకాంత్ 21–10, 21–7తో డిమిత్రి పనరిన్‌పై అలవోక విజయం సాధించాడు. లక్ష్యసేన్ కూడా 21 నిమిషాల్లో ఆట ముగించాడు. అతను 21–13, 21–8తో అర్తుర నియజోవ్‌పై నెగ్గగా... శుభాంకర్ డే 21–11, 21–5తో కైత్‌మురత్ కుల్మతోవ్‌పై గెలిచేందుకు 26 నిమిషాలే పట్టింది. డబుల్స్‌లో ప్రణయ్–చిరాగ్ శెట్టి జోడీ 21–18, 16–21, 19–21తో నియజోవ్–పనరిన్ జంట చేతిలో ఓడింది. మరో డబుల్స్‌లో అర్జున్–ధ్రువ్ కపిల ద్వయం 21–14, 21–8తో నికిట బ్రగిన్–కైత్‌మురత్ జోడీపై వరుస గేముల్లో గెలిచింది. ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ మంగళవారం బరిలోకి దిగలేదు. గురువారం జరిగే తమ తదుపరి లీగ్ మ్యాచ్‌లో మలేసియాతో భారత్ ఆడుతుంది. ఒక్కో గ్రూప్ నుంచి రెండేసి జట్లు క్వార్టర్స్ చేరతాయి. -
‘నేను’ కాదు... ‘మనం’...
ఆక్లాండ్: ఈ ఏడాది టి20 ప్రపంచకప్ సాధించడమే తమ లక్ష్యమని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నారు. ఈ ఏడాది వన్డే మ్యాచ్‌ల్ని టి20 చాంపియన్‌షిప్‌కు సన్నాహకంగా మలచుకుంటామని చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘టాస్‌తో మాకు పనే లేదు. మేం ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగలం. ప్రపంచంలోని ఏ దేశమైనా... ఎంతటి ప్రత్యర్థులనైనా ఎదుర్కోగలం. భారీస్కోరైనా ఛేదిస్తాం. అంతిమంగా అదే మా లక్ష్యం. ఈ సంవత్సరం టి20 ప్రపంచకప్‌ను లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని అన్నారు. జట్టు మొత్తం సమష్టిగా ఉందని, ఎవరు రాణించినా అందరూ దాన్ని ఆస్వాదిస్తున్నారని చెప్పారు. ‘మా జట్టులో ‘నేను’ అనే పదానికి చోటు లేదు. ఇప్పుడు ‘మనం’ అనేదే జట్టును నడిపిస్తోంది’ అని 57 ఏళ్ల రవిశాస్త్రి చెప్పుకొచ్చారు. పూర్తిస్థాయి బలగంతో వచి్చన ఆ్రస్టేలియాను ఓడించడంతో తమ జట్టు మానసిక స్థైర్యం ఏంటో ప్రపంచానికి తెలిసిందని అన్నారు. రాహుల్‌ను బ్యాట్స్‌మన్‌గా కీపర్‌గా వినియోగించుకోవడం జట్టుకు లాభిస్తుందన్నారు. న్యూజిలాండ్ పర్యటనకు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ గాయంతో దూరమవడం బాధాకరమని చెప్పారు. కేదార్ జాదవ్‌కు వన్డే జట్టులో దారులు మూసుకుపోయాయనే వార్తల్ని ఆయన ఖండించారు. కివీస్ పర్యటనలో వన్డే క్రికెట్లో అతను భాగమేనని అన్నారు. శుక్రవారం న్యూజిలాండ్‌తో తొలి టి20 మ్యాచ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్ మొదలవుతుంది. -
ఈ దళం... కోహ్లీ బలం
భారత కెప్టెన్ కోహ్లి విజయవంతమైన సారథిగా ఎదిగాడు. టెస్టుల్లో భారత్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఇవన్నీ టీమిండియా విజయాల వల్లే సాధ్యమయ్యాయి. ఆ సాధించిన విజయాలన్నీ బౌలింగ్ దళంతోనే సాకారమయ్యాయన్న సంగతి తెలుసా. మరే కెప్టెన్‌కు లేనంత బలం మన కోహ్లి వెన్నంటే ఉంది. అతన్ని ముందంజ వేసేలా నడిపిస్తోంది. ఇప్పటివరకు స్వదేశంలో వరుసగా 11 టెస్టు సిరీస్ విజయాలు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారత జట్టు సొంతగడ్డపై మరో సిరీస్ విజయమే లక్ష్యంగా బంగ్లాదేశ్‌తో పోరుకు సన్నద్ధమవుతోంది.–సాక్షి క్రీడా విభాగం ‘‘జోహన్నెస్‌బర్గ్, ముంబై, ఆక్లాండ్, మెల్బోర్న్... ఇలా వేదిక ఏదైనా సరే మేం పిచ్‌లను పట్టించుకోం. టెస్టు గెలవాలంటే మా లక్ష్యం 20 వికెట్లు తీయడమే! పరిపూర్ణ బౌలింగ్ దళంతోనే ఇదంతా సాధ్యమవుతుంది. పేసర్లు, స్పిన్నర్లు అందరు సమష్టిగా రాణిస్తే 20 వికెట్లు కష్టమేమీ కాదు’’ అని భారత చీఫ్ కోచ్ రవిశాస్త్రి దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్ గెలిచాక అన్న మాటలివి. ఇంటా బయటా మన టెస్టు విజయాల్ని లోతుగా పరిశీలిస్తే ఇదే స్పష్టమవుతుంది. మన బౌలింగ్ సత్తాతోనే మనమెన్నో మ్యాచ్‌ల్ని, వరుసగా సిరీస్‌లనీ గెలిచాం. గత కొన్నేళ్లుగా అంతలా భారత బౌలింగ్ అటాక్ రాటుదేలింది. మేటి బ్యాట్స్‌మెన్‌ను సైతం తలవంచేలా చేస్తోంది. ఎవరైనా ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ పేస్‌ను ఎదిరిస్తే... వెంటనే స్పిన్ తిరుగుతుంది. అతని వికెట్‌ను బలితీసుకుంటుంది. ఇలా పేసర్లు, స్పిన్నర్లు కలసికట్టుగా ప్రత్యర్థి జట్ల ఆట కట్టిస్తున్నారు. అతని కసరత్తు... బౌలర్ల కనికట్టు నిజానికి కోహ్లిని విజయసారథిగా మలిచిందే బౌలర్లంటే అతిశయోక్తి లేదు. పిచ్ ఎలా ఉన్నా... ఎలాంటి పరిస్థితులు ఎదురైనా... గత కొన్నేళ్లుగా భారత బౌలర్ల ప్రదర్శన అసాధారణంగా ఉంది. ఈ అసాధారణ ప్రదర్శన ప్రతీ సిరీస్‌లోనూ నిలకడగా కొనసాగడం వల్లే మూడు టెస్టుల సిరీస్‌ల్లో భారత్ గెలుపోటముల నిష్పత్తి 3:1గా ఉంది. అంటే సగటున మూడు గెలిస్తే ఒకటి అరా ఓడుతున్నామన్న మాట. ఇక కోహ్లిసేన విజయాల శాతమెంతో తెలుసా 61 శాతం. మొత్తం 27 మంది భారత కెప్టెన్లలో మూడో అత్యుత్తమ సారథిగా కోహ్లిని నిలబెట్టిన ఘనత కచ్చితంగా బౌలర్లదే. తుది జట్టులో బౌలర్ల ఎంపిక, ఆటలో అటాకింగ్‌కు కోహ్లి చేసే కసరత్తు, పరిస్థితులకు తగ్గట్లుగా బౌలర్లను ప్రయోగించే నైపుణ్యం అతన్ని మేటి కెప్టెన్‌గా ఎదిగేలా చేశాయి. 2014–15 సీజన్లో ఆస్ట్రేలియా సిరీస్‌తో సందర్భంగా నాయకుడయ్యాక ఇప్పటి వరకు 14 సిరీస్‌లకు నేతృత్వం వహించాడు. 51 టెస్టుల్లో తన కెప్టెన్సీలో... తన సూచనలతో బౌలర్లు సగటున 26.11 పరుగులకు వికెట్ చొప్పున తీశారు. అదే సొంతగడ్డపై 24.56 సగటుతో వికెట్లను పడేసిన బౌలర్లు... ఆశ్చర్యకరంగా దక్షిణాఫ్రికాలో 23.49, ఆస్ట్రేలియాలో 25.00, ఇంగ్లండ్‌లో 29.81 సగటుతో వికెట్లను తీయడం విశేషం. విదేశీ సారథిలకు దీటుగా... కోహ్లి కేవలం భారత సారథుల్లోనే మేటి కాదు... పలువురు విదేశీ సారథులకు దీటుగా జట్టును నడిపిస్తున్నాడు. కనీసం 40 టెస్టులకు సారథ్యం వహించిన కెప్టెన్ల రికార్డును పరిశీలిస్తే ముగ్గురు మాత్రమే కోహ్లికి దగ్గరగా ఉన్నారు. 1950, 1960 దశకాల్లో ఇంగ్లండ్ సారథి పీటర్ మే (21.94 సగటు... విజయాల శాతం 48.80) మెరుగైన బౌలింగ్ దళాన్ని కలిగి ఉన్నప్పటికీ అప్పటి క్రికెట్ లో పరుగుల రేటు మందకొడిగా ఉండేదన్న సంగతి గుర్తుంచుకోవాలి. మిగిలిన ఇద్దరిలో క్రానే (దక్షిణాఫ్రికా; 25.84 సగటు; విజయాల శాతం 50.90), రిచర్డ్స్ (వెస్టిండీస్; 25.97 సగటు; విజ యాల శాతం 54.00) జట్ల బౌలింగ్ అటాక్ బాగుండేది. అయితే వీరి బౌలింగ్ దళం పేసర్లతో ఉండేది. ప్రస్తుత టి20ల యుగంలో కోహ్లిసేనకు ఇలాంటి బౌలింగ్ సగటు ఉండటం అద్భుతమే అనుకోవాలి. -
‘థ్యాంక్యూ’...
న్యూఢిల్లీ: తీవ్ర కాలుష్యం నగరాన్ని కమ్మేసిన సమయంలో కూడా ఆదివారం భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య టి20 మ్యాచ్ మాత్రం ఆగలేదు. ఇరు జట్లు కూడా ఎలాంటి ఫిర్యాదు చేయకుండా ఆటను కొనసాగించాయి. ఒక దశలో రద్దు అవుతుందేమో అనిపించినా... అవాంతరం లేకుండా నిర్ణీత సమయం ప్రకారమే మ్యాచ్ జరిగింది. దాంతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఊపిరి పీల్చుకున్నాడు. రెండు జట్లకు కూడా అతను కృతజ్ఞతలు చెప్పాడు. ‘కఠిన పరిస్థితుల మధ్య మ్యాచ్ ఆడినందుకు ఇరు జట్లకు కృతజ్ఞతలు. బాగా ఆడిన బంగ్లా జట్టుకు అభినందనలు’ అని గంగూలీ ట్వీట్ చేశాడు. మరోవైపు ఢిల్లీ మ్యాచ్‌లో ఆడిన ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బందీ కలగలేదని బయటకు చెప్పినా... సౌమ్య సర్కార్‌తో పాటు మరో బంగ్లా క్రికెటర్ కాలుష్యం దెబ్బకు తట్టుకోలేక మైదానంలో వాంతి చేసుకున్నట్లు సమాచారం. ‘మహా’ ఆపుతుందా! భారత్, బంగ్లా మధ్య గురువారం రెండో టి20 మ్యాచ్ జరగడంపై సందేహాలు రేగుతున్నాయి. ఈ మ్యాచ్‌కు వేదిక అయిన రాజ్‌కోట్ తీవ్రమైన తుఫాన్ ‘మహా’ బారిన పడే అవకాశం కనిపిస్తోంది. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం గుజరాత్ తీరానికి వంద కిలోమీటర్ల దూరంలోనే ఉన్న రాజ్‌కోట్‌పై తుఫాన్ ప్రభావం ఉండవచ్చు. ‘మహా’ కారణంగా 6, 7 (మ్యాచ్ జరిగే రోజు) తేదీల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే మ్యాచ్ సమయానికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నట్లు సౌరాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు జైదేవ్ షా అన్నారు. -
రెఢీ
-
ఫైనల్లో భారత్
కొలంబో: ఎమర్జింగ్ ఆసియా కప్‌లో ఓటమి ఎరుగని యువ భారత్ జట్టు తుది పోరుకు అర్హత సాధించింది. గురువారం సెమీఫైనల్లో 7 వికెట్లతో పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చిరకాల ప్రత్యర్థిని చిత్తుచేసింది. మొదట బౌలింగ్‌లో స్పిన్నర్లు మయాంక్ మార్కండే (4/38), జయంత్ (2/29), పేసర్ అంకిత్ రాజ్‌పుత్ (2/19), తర్వాత బ్యాటింగ్‌లో హిమ్మత్ సింగ్ (59 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), నితీశ్ రాణా (60 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) పాక్ పనిపట్టారు. భారత బౌలర్ల ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 44.4 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రిజ్వాన్ (67; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), షకీల్ (62; 7 ఫోర్లు) రాణించారు. మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. తర్వాత స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ కూడా తడబడింది. రుతురాజ్ గైక్వాడ్ (20; 2 ఫోర్లు, 1 సిక్స్), అంకుశ్ బెయిన్స్ (9), ములాని (19; 2 ఫోర్లు) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. 52 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో హిమ్మత్, రాణా అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 126 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. రెండో సెమీస్ లో శ్రీలంక 4 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై గెలి చింది. శనివారం ఇక్కడే జరిగే టైటిల్ పోరులో భారత్, లంక అమీతుమీ తేల్చుకుంటాయి. -
ప్రజ్నేశ్‌తో సాకేత్ అమీతుమీ
బెంగళూరు: వరుసగా రెండో ఏడాది భారత క్రీడాకారుడి ఖాతాలోనే బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్ చేరనుంది. గతేడాది సుమీత్ నాగల్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకోగా... ఈ సంవత్సరం భారత డేవిస్ కప్ జట్టు సభ్యులు సాకేత్ మైనేని, ప్రజ్నేశ్ గుణేశ్వరన్ టైటిల్ కోసం నేడు అమీతుమీ తేల్చుకోనున్నారు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని 4–6, 6–4, 6–4తో అలెగ్జాండర్ నెదోవ్‌యెసోవ్ (కజకిస్తాన్)పై గెలుపొందగా... ప్రజ్నేశ్ 6–4, 6–1తో బ్రైడెన్ ష్నుర్ (కెనడా)ను చిత్తుగా ఓడించాడు. నెదోవ్‌యెసోవ్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణాయక మూడో సెట్లో సాకేత్ 5–0తో ఆధిక్యంలోకి వెళ్లి ఆ తర్వాత వరుసగా నాలుగు గేమ్‌లు చేజార్చుకున్నాడు. అయితే పదో గేమ్‌లో పైచేయి సాధించి సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. పురుషుల డబుల్స్ విభాగంలో పురవ్ రాజా (భారత్)–ఆంటోనియో సాన్సిచ్ (క్రొయేషియా) జోడీ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో పురవ్ రాజా–సాన్సిచ్ ద్వయం 6–7 (3/7), 3–6తో మాక్స్ పర్సెల్–ల్యూక్ సావిల్లె (ఆస్ట్రేలియా) జంట చేతిలో ఓడిపోయింది. -
చివరి మ్యాచ్‌లోనూ భారత్ పరాజయం
జొహన్నెస్‌బర్గ్ (దక్షిణాఫ్రికా): బ్రిక్స్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ చివరి లీగ్ మ్యాచ్‌లోనూ భారత అండర్–17 మహిళల ఫుట్‌బాల్ జట్టు పరాజయం పాలైంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లో ఓడిన భారత్... ఆదివారం ఇక్కడ జరిగిన చివరిదైన నాలుగో మ్యాచ్‌లో 1–2తో చైనా చేతిలో ఓటమి పాలైంది. మన జట్టు తరఫున నమోదైన ఏకైక గోల్ మనీషా (25వ ని.లో) చేసింది. మ్యాచ్ ప్రారంభం నుంచి సాధికారికంగా ఆడిన భారత జట్టు తొలి అర్ధభాగాన్ని 1–0 ఆధిక్యంతో ముగించినా... రెండో సగంలో రెండు గోల్స్ సమర్పించుకొని ఓటమి పాలైంది. -
రోహిత్ శర్మకు షాక్..
ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కానీ టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు ఊహించని షాక్ తగిలింది. తొలి మూడు టెస్ట్‌లకు సెలక్షన్ కమిటీ రోహిత్‌ను ఎంపిక చేయలేదు. గాయంతో దూరమైన టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాను జట్టులోకి తీసుకున్నారు. యోయో టెస్టు విఫలమవడంతో వన్టే, టీ20 సిరీస్‌లకు దూరమైన పేసర్ మహ్మద్ షమీ పునరాగమనం చేశాడు. బుమ్రా జట్టులోకి రావడంతో టీమిండియాకు బౌలింగ్ విభాగంలో మరింతగా బలపడనుంది. యువ ఆటగాళ్లైన రిషబ్ పంత్, కరుణ్ నాయర్, కుల్దీప్ యాదవ్, శార్దూల్‌లకు జట్టులో స్థానం లభించింది. యువ వికెట్ కీపర్ రిషబ్‌పంత్, పేసర్ శార్దుల్ ఠాకూర్లను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. దీంతో ఈ సిరీస్ ద్వారా యువ ఆటగాళ్లు టెస్టులో అరంగ్రేటం చేయనున్నారు. ఆగస్టు 1వ తేదీన ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్-ఇంగ్లండ్‌ల మధ్య తొలి టెస్టు జరగనుంది. ప్రతిష్టాత్మకమైన సిరీస్ కావడంతో 18 మందితో భారత జట్టును ప్రకటించినట్లు తెలుస్తోంది. కోహ్లి సేన మంగళవారం జరిగిన వన్డే మ్యాచ్‌లో 8 వికెట్లతో ఓడిపోయి సిరీస్‌ను కోల్పోయిన విషయం విదితమే. మొదటి మూడు టెస్టుల జట్టు : విరాట్ కోహ్లి(కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మురళీ విజయ్, పుజారా, రహానే(వైఎస్- కెప్టెన్), కరుణ్ నాయర్, కార్తీక్(వికెట్ కీపర్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్, హర్దిక్ పాండ్య, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, బుమ్రా, శార్దుల్ ఠాకూర్. -
మరోసారి కుల్దీప్ స్పిన్ మాయలో ఇంగ్లండ్..!
లార్డ్స్ మైదానంలో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ఇంగ్లండ్‌కు శుభారంభాన్ని అందించారు. ఆది నుంచి వికెట్ ఇవ్వకుండా జాసన్ రాయ్, బెయిర్ స్టో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. పది ఓవర్లలో ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌కు కొరకరాని కొయ్యగా మారిన చైనామన్ కుల్దీప్ యాదవ్ రంగంలోకి దిగాడు. అంతే కుల్దీప్ వేసిన 11 ఓవర్ రెండో బంతికే బెయిర్ స్టో 38 పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అప్పటివరకూ క్రీజ్‌లో పాతుకుపోయిన ఇంగ్లండ్ ఓపెనర్లను చైనామన్ విడదీశాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన జోరూట్‌తో కలిసి జాసన్ రాయ్ ఇన్సింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ ఆ జోడిని కూడా కుల్దీప్ వదలలేదు. కుల్దీప్ వేసిన 15 ఓవర్ మొదటి బంతికే షాట్ కొట్టబోయి లాంగ్‌లో ఉన్న ఉమేష్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చాడు. రెండో వన్డేలో కూడా కుల్దీప్ స్పిన్ మాయలో ఇంగ్లండ్ చిక్కుకుంది. 20 ఓవరల్లో ఇంగ్లండ్ 2వికెట్లు నష్టపోయి 121 పరుగులు చేసింది. ప్రస్తుతం కెప్టెన్ మోర్గాన్(18) పరుగులతో, జోరూట్‌లు(24) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కుల్దీప్ నాలుగు ఓవర్లు వేసి రెండు వికెట్లు తీశాడు. -
స్పిన్ అస్త్రాలతో అఫ్గాన్ సిద్ధం
న్యూఢిల్లీ: స్పిన్‌కు అనుకూలించే భారత్‌లో స్పిన్నర్లతోనే బరిలోకి దిగేందుకు అఫ్గానిస్తాన్ జట్టు సిద్ధమైంది. భారత్‌తో వచ్చే నెల 14 నుంచి బెంగళూరులో జరిగే ఏకైక చారిత్రక టెస్టు కోసం అఫ్గానిస్తాన్ జట్టును ఎంపిక చేశారు. ఇందులో ఏకంగా ఐదుగురు స్పిన్నర్లకు చోటు కల్పించారు. ఐపీఎల్ సంచలనం రషీద్ ఖాన్‌తో పాటు నబీ, ముజీబుర్, జహీర్ ఖాన్, ఆమిర్ హమ్జా ఇందులో ఉన్నారు. వీరిలో ముజీబ్ మినహా మిగతా వారికి కేవలం నాలుగు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవముంది. ముజీబ్‌కు ఆ అనుభవం కూడా లేదు. అఫ్గాన్ జట్టుకు అస్గర్ స్తానిక్‌జై నాయకత్వం వహించనున్నాడు. జట్టు: స్తానిక్‌జై (కెప్టెన్), షహజాద్, జావెద్, రహ్మత్ షా, ఇహ్సానుల్లా జనత్, నాసిర్ జమాల్, హష్మతుల్లా, అఫ్సర్ జజయ్, నబీ, రషీద్ ఖాన్, జహీర్ ఖాన్, ఆమిర్ హమ్జా, ముజీబ్, అహ్మద్ షిర్జాద్, యామిన్ అహ్మద్‌జై, వఫాదార్. -
పరువు నిలబెట్టుకోవాలని...
వడోదర: ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో చివరిదైన మూడో మ్యాచ్‌కు భారత జట్టు సిద్ధమైంది. ఇప్పటికే 0–2తో సిరీస్ కోల్పోయిన మిథాలీ బృందం ఆదివారం జరిగే చివరి వన్డేలోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. అన్ని రంగాల్లో ఆధిపత్యం చలాయిస్తున్న ఆసీస్‌ను నిలువరించాలంటే భారత్ సర్వశక్తులు ఒడ్డాల్సిందే. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు బ్యాటింగ్‌లో స్మృతి మంధాన మెరుపులు మినహా మిగతావారు ఆకట్టుకోలేకపోయారు. ఆమెకు తోడు కెప్టెన్ మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, వేద కృష్ణమూర్తి, దీప్తి శర్మ, పూనమ్ రౌత్ రాణిస్తే భారత్‌కు తిరుగుండదు. మరోవైపు సీనియర్ పేసర్ జులన్ గోస్వామి గైర్హాజరీలో శిఖా పాండే, పూజ వస్త్రకర్ ప్రభావం చూపలేకపోతున్నారు. స్పిన్నర్లు ఏక్తా బిష్త్, పూనమ్ యాదవ్ కూడా ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఉంది. మరోవైపు టాపార్డర్ రాణించడంతో రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన ఆసీస్ ఆదివారం జరిగే పోరులోనూ గెలవాలని చూస్తోంది. రెండు వన్డేల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన బోల్టన్‌తో పాటు పెర్రీ, మూనీ, కెప్టెన్ మెగ్ లానింగ్ ఫామ్‌లో ఉండటం కంగారూలకు కలిసొచ్చే అంశం. -
చాహల్ కళ్లజోడు రహస్యం చెప్పిన తండ్రి..
ముంబై: టీమిండియా మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఇటీవల వాండరర్స్ లో జరిగిన టీ20 మ్యాచ్‌లో కళ్లజోడుతో కనిపించాడు. చాహల్ బౌలింగ్ లేదా బ్యాటింగ్ చేసేటప్పుడు కళ్లద్దాలు ఉపయోగించాడు. ఫీల్డిండ్ చేసేటప్పుడు మాత్రమే వాడుతున్నాడు. ఈ విషయం వెనుక ఉన్న నిజాన్ని అతడి తండ్రి బయటపెట్టారు. ‘ దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లే ముందు చాహల్ కంటి వైద్యుడిని సంప్రదించాడు. కేవలం డాక్టర్ చెప్పడం వల్లే తన కుమారుడు కళ్లజోడు ధరిస్తున్నాడు. చాహల్ కంటిచూపు మంచిగా ఉంది. కానీ అరుదుగా వాడమని వైద్యుడు సలహా ఇచ్చాడు’ అని తెలిపాడు. ప్రస్తుతం ఇండియా టీంలో చాహల్ మాత్రమే గ్లాసెస్ ఉపయోగిస్తున్నాడు. టీమిండియా విజయాల్లో ఇటీవల చాహల్ కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. కెప్టెన్ విరాట్ కోహ్లి, కీపర్ మహేంద్ర సింగ్ ధోనిలు కూడా బయట గ్లాసెస్ వాడుతారు. మ్యాచ్ జరిగే సమయంలో మాత్రం వారు కళ్లద్దాలు ఉపయోగించరు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, స్పీన్నర్ వెటోరి కూడా మ్యాచ్‌లో నిత్యం కళ్లజోడు ధరించేవాడు. నేడు సెంచూరియన్‌లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0తో అధిక్యంలో ఉంది. -
చహల్ వీడియోపై గేల్ కామెంట్..!
-
చాహల్ వీడియోపై గేల్ కామెంట్స్.. వైరల్!
భారత యువ స్పిన్నర్ యుజవేంద్ర చాహల్ ఈ ఏడాది టీ20లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో తొలిస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాతో ఫిబ్రవరిలో జరగనున్న టీ20 కోసం మంగళవారం బెంగళూరులో చాహల్ కసరత్తులు మొదలుపెట్టాడు. చహల్ ఇస్టాగ్రామ్‌లో తన జిమ్ సెషన్ వీడియోను పోస్టు చేశాడు. ఈ వీడియోపై ఆర్సీబీ ఆటగాళ్లు(రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), దక్షిణాఫ్రికా స్పీనర్ తబ్రాజ్ షమ్సీ, వెస్టిండిస్ ఆటగాడు క్రిస్‌గేల్, ఇండియా బౌలింగ్ కోచ్‌లు తమదైన రీతిలో కామెంట్స్ చేశారు. ‘ఓ మై గాడ్.. ఈజ్ దీస్ చాహల్ ఆర్ క్రిస్‌గేల్’ అని షమ్సీ ఆ వీడియోపై కామెంట్ చేశాడు. దీనిపై స్పందించిన చాహల్.. నేను క్రిస్ గేల్ కన్నా ఎక్కువ బరువు ఎత్తగలను. ఇది నా వామప్ సెట్ అని సమాధానం చెప్పాడు. దీనిపై టీ20ల సింహాం వెస్టిండీస్ ప్లేయర్ క్రిస్‌గేల్ ఆసక్తికరమైన ట్రోల్ చేశాడు. ‘నన్ను చంపేయండి’ అని గేల్ ఫన్నీగా కామెంట్ చేశాడు. ‘ నీ శక్తికి ఆ డంబెల్స్ చాలా తక్కువ. మరిన్ని కేజీలు కలుపుకోవాలి’ అని గేల్, ఫిల్డింగ్ కోచ్‌లు ట్రోల్ చేశారు. గత సంవత్సరం ఐపీఎల్లో ఆర్సీబీ తరపున చాహల్ 13 మ్యాచ్‌లు ఆడాడు. ఆర్సీబీ జట్టులో అత్యధిక వికెట్లను సాధించిన రెండో ఆటగాడు చహల్. అతను 2016 ఐపీఎల్లో 21 వికెట్లను తీశాడు. ఇప్పటివరకు 56 ఐపీఎల్ మ్యాచ్‌లను ఆడిన చాహల్ 70 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అయినా 2018 ఐపీఎల్‌కు ఆర్సీబీ చాహల్‌ను అంటిపెట్టుకోలేదు. ఆర్సీబీ యాజమాన్యం 2018 ఐపీఎల్ కోసం కెప్టెన్ విరాట్ కోహ్లి, ఎబీ డివిలియర్స్, సర్ఫారాజ్ ఖాన్‌లను అంటి పెట్టుకుంది. ప్రస్తుతం చాహల్ పోస్టు చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. -
కోహ్లితో అభిమాని ఫొటో.. వైరల్ !
విరాట్ కోహ్లి-అనుష్కల వివాహం ఇటీవల చాలా హాట్ టాఫిక్ మారిన విషయం తెలిసిందే. సఫారీ పర్యటనకు బయలుదేరే ముందు కోహ్లి తనకు క్రికెట్‌పై ఉన్న ఇష్టాన్ని తెలిపారు. క్రికెట్ అంటే తనకు రక్తంతో సమానం అన్నారు. అంతేకాక పెళ్లి తనలో ఏ విధమైన మార్పు తేలేదని కోహ్లి అన్నారు. విరాట్ కేప్ టౌన్లో ప్రాక్టీస్ సెషన్ అనంతరం ఓ అభిమానితో కలిసి ఫొటో దిగారు. ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పెళ్లిలో అనుష్క విరాట్ కోహ్లి వేలికి ఉంగరం తొడిగింది. ఆ రింగ్‌ను మన కెప్టెన్ ఒక గొలుసుతో కలిపి మెడలో వేసుకున్నట్లు ఆ ఫొటోలో కనిపిస్తోంది. సఫారీ పర్యటనలో టీమిండియా మూడు టెస్టు మ్యాచ్‌లు, 6 వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లను ఆడనుంది. రేపు (జనవరి 5న) కేప్ టౌన్ లో తొలి టెస్టు ప్రారంభకానున్న విషయం తెలిసిందే. -
పాండ్యా మన జట్టుకు ఒక ఆయుధం..!
ఇండియా-సౌతాఫ్రికాల మధ్య మొదటి టెస్టు జనవరి 5న కేప్‌టౌన్‌లో ప్రారంభకానున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ టీమిండయాకు తన అనుభవంతో కూడిన సలహాలు, సూచనలు ఇచ్చారు. అంతేకాక కెప్టెన్ విరాట్‌కోహ్లి, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలపై ప్రశంసల జల్లుకురిపించారు. ‘ప్రస్తుతం ఉన్న టీమిండియా జట్టు చాలా బలంగా ఉంది. నా క్రికెట్ కెరీర్లో ఇండియా జట్టు ఇప్పుడు ఉన్నంతా బలంగా ఎప్పుడూ లేదు. ఇండియా జట్టులో బౌలింగ్, బ్యాటింగ్‌లో కూడా బాగా రాణించే వాళ్లు ఉన్నారు. అంతేకాక ఆల్‌రౌండర్ హార్దికపాండ్యా సఫారీ పర్యటనలో మనకు అదనపు బలమని చెప్పవచ్చు. అతను కోహ్లికి దొరికిన ఆయుధం. అతను 7లేదా 8వ ప్లేస్‌లో కూడా వచ్చి చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు.’ అని సచిన్ పొగడ్తలతో ముంచెత్తారు. అంతేకాక మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా సచిన్ పంచుకున్నారు. ‘ సఫరీ గడ్డపై ఇండియా జట్టు జాగ్రత్తగా ఆడి, బాగా రాణిస్తే కోహ్లి సేనకు గెలుపు ఖాయం. జట్టులోని బౌలర్లు, బ్యాట్స్మెన్లు ఉమ్మడిగా రాణించాలి. ఏ టెస్టు మ్యాచ్‌లోనైనా ఫస్ట్ రోజు ఆటే ముఖ్యం. మొదటి స్పెల్‌లో బ్యాట్్తో లేదా బౌలింగ్‌తో ఏ జట్టు అయితే రాణిస్తుందో వారే విజయదుందుబి మోగించే అవకాశం ఎక్కువగా ఉంది.’ అని మాస్టర్ బ్లాస్టర్ తెలిపారు. కపిల్ దేవ్ సారథ్యంలో కూడా ఇండియా జట్టు ఎప్పుడు ముగ్గురు పేసర్లతో దిగడం గురించి ఆలోచన జరగలేదు. సఫారీ పిచ్‌పై బంతులు లైన్ అండ్ లెంగ్త్‌తో దూసుకోస్తాయి. అందుచేత స్లిప్‌లో ఫీల్డిండ్ ఉన్నవాళ్లు చాలా చురుకుగా ఉండాలి. దక్షిణాఫ్రికా జట్టులో ఏబీ డివిలియర్స్, హసీమ్ ఆమ్లాలు చాలా బాగా ఆడుతున్నారు. వారిని త్వరగా ఫెవిలియన్ కు పంపిస్తే టీమిండియాకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి* అని మాస్టర్ అన్నారు. -
‘కోహ్లి సేనకు ఆ సత్తా ఉంది..!’
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన కోహ్లి సేనపై ప్రశంసలు కురిపించారు. సచిన్ తన మనసులోని మాటలను ఆసీస్ మాజీ బౌలర్ బ్రెట్ లీకి ఇచ్చిన ఇంటార్య్వూలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక దశాబ్దం(1990) పాటు ఆస్ట్రేలియా జట్టు ప్రపంచ క్రికెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. అదే విధంగా టీమిండియా కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందని సచిన్ అన్నారు. మాస్టర్ బ్లాస్టర్ అన్న ఈ మాటలతో మన ఆటగాళ్లకు మరింత ప్రొత్సాహాం లభించింది. ‘ అతి చిన్న వయసులో(16) ఇండియా తరపున ఆడే అవకాశం రావడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తానని సచిన్ పేర్కొన్నారు. ‘నాకు క్రికెట్ ఆక్సిజన్‌తో సమానం. అది లేని జీవితాన్ని ఊహించుకోలేను. ఫ్యూచర్లోను క్రికెట్‌ను కొనసాగిస్తాను’ అని క్రికెట్ దిగ్గజం తెలిపారు. అంతేకాక నన్ను ఆదరించిన అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని సచిన్ అన్నారు. సఫారీ గడ్డపై టీమిండియా జట్టు మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లను ఆడనుంది. జనవరి 5వ తేదీ నుంచి మొదటి టెస్టు ప్రారంభం కానుంది. బ్రెట్ లీ ‘అప్ ఇన్ ది గ్రిల్’ అనే తన యూట్యూబ్ షో కోసం చేసిన ఇంటార్య్వూలో సచిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
శ్రీలంక ముమ్మర ప్రాక్టీస్..విశ్రాంతిలోభారత్..
విశాఖ స్పోర్ట్స్ : సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా శ్రీలంక జట్టు శుక్రవారం బ్యాటింగ్, బౌలింగ్‌లతో పాటు ఫీల్డింగ్‌ను ప్రాక్టీస్ చేసింది. భారత్ జట్టు విశ్రాంతి తీసుకోగా శ్రీలంక ప్రాక్టీస్‌లో పాల్గొంది. శ్రీలంక జట్టు కోచ్ పోతాస్ ఆటగాళ్లకు నెట్స్‌లోనే మెళకువల్ని నేర్పించారు. చమిరా ఫాస్ట్ బౌలింగ్‌కు మెరుగులు దిద్దుకోగా కెప్టెన్ పెరీరా నెట్ ప్రాక్టీస్‌లో ఉల్లాసంగానే గడిపాడు. బ్యాటింగ్‌కు ప్రాక్టీస్ చేశాడు. ఏంజిలియో తన ఫాస్ట్ బౌలింగ్‌కు మరింత పదును పెట్టేందుకు తోటి ఆటగాళ్లతో ప్రాక్టీస్ చేశాడు. స్పిన్నర్లు సచిత్, డిసిల్వ సయితం ప్రాక్టీస్ చేశారు. వన్డే నిర్వాహక కమిటీ సమావేశం విశాఖలోని వైఎస్ఆర్ స్టేడియం వేదికగా ఆదివారం జరగనున్న వన్డే మ్యాచ్ నిర్వహణకై నిర్వాహక కమిటీ శుక్రవారం సమావేశమైంది. వైఎస్ఆర్ స్టేడియంలో నిర్వాహక కమిటీ చైర్మన్ ఎంటి కృష్ణబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అటగాళ్ల భద్రత ఏర్పాట్లు, టికెట్ల విక్రయాలు, అత్యవసర పరిస్థితిలో ఏర్పాట్లు, పిచ్‌తో పాటు ఔట్‌ఫీల్డ్ నిర్వహాణ తదితర అంశాలపై చర్చించారు. డే అండ్ నైట్ మ్యాచ్ కావడంతో ఫ్లడ్లైట్లను పరిశీలించారు. ఏసీఏ కార్యదర్శి అరుణ్‌కుమార్ , కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ సృజన, డీసీపీలు ఫకీరప్ప, షిమోషిన్, ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం సుదేశ్‌కుమార్, ఏసీఏ కార్యదర్శి అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారత్ జట్టు నెట్ ప్రాక్టీస్... గురువారమే విశాఖ చేరిన భారత్ జట్టు శుక్రవారం పూర్తిగా విశ్రాంతి తీసుకుంది. వాస్తవానికి సాయంత్రం నాలుగు గంటల నుంచి వైఎస్ఆర్ స్టేడియంలోని నెట్స్‌లో ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. శనివారం ఒంటిగంటన్నర నుంచి భారత్ జట్టు ప్రాక్టీస్ సెషన్ జరగనుంది. శ్రీలంక శనివారం సయితం పదిగంటలనుంచి ప్రాక్టీస్ చేసుకోనుంది. అప్పన్న సన్నిధిలో రవిశాస్త్రి శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శుక్రవారం టీం ఇండియా క్రికెట్ కోచ్ రవిశాస్త్రి , బ్యాటింగ్ కోచ్ సంజయ్బంగర్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ ధ్వజస్తంభం వద్ద దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం రవిశాస్త్రి, సంజయ్బంగర్ కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా ప్రదక్షిణ చేశారు. –సింహాచలం (పెందుర్తి) -
కల నిజమైంది: విజయ్ శంకర్
భారత జట్టులోకి ఎంపిక కావాలన్న తన సుదీర్ఘ స్వప్నం నిజం కావడం పట్ల తమిళనాడు ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ సంతోషం వ్యక్తం చేశాడు. టీమిండియా పిలుపును ఊహించలేదన్న అతను, తన ఇన్నేళ్ల కష్టం ఫలించిందని ఉద్వేగంగా చెప్పాడు. భారత ‘ఎ’ జట్టు సభ్యుడిగా ఉన్న సమయంలోనే తన ఆట ఎంతో మెరుగైందని అన్నాడు. 26 ఏళ్ల విజయ్ శంకర్ 32 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 49.14 సగటుతో 1671 పరుగులు చేయడంతో పాటు 27 వికెట్లు పడగొట్టాడు. తన వివాహం కారణంగా శ్రీలంకతో జరిగే చివరి రెండు టెస్టులకు భువనేశ్వర్ అందుబాటులో లేకపోవడంతో అతని స్థానంలో విజయ్ శంకర్ జట్టులోకి వచ్చాడు. -
తారాజువ్వలా...
ధనవంతుల బిడ్డ కాదు... పెద్దల అండదండలూ లేవు... ఎవరి నుంచైనా పైరవీలు తెచ్చుకోగలిగే స్థాయి కాదు... అతనికి తెలిసిందల్లా అమిత వేగంతో, కచ్చితత్వంతో బంతులను వికెట్లపైకి నేరుగా సంధించడమే... గంటల కొద్దీ విరామం లేకుండా బౌలింగ్, బౌలింగ్, బౌలింగ్ మాత్రమే! కేవలం ప్రతిభ ఉంటే చాలు, ఇంకేమీ లేకపోయినా భారత క్రికెట్ జట్టు స్థాయికి ఎదగవచ్చని, అది సాధ్యమని నమ్మవచ్చంటూ ఈ 23 ఏళ్ల హైదరాబాద్ కుర్రాడు నిరూపించాడు. ఒకప్పుడు చిన్న మొత్తం కోసం అతను ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ గల్లీ క్రికెట్, టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడాడు... ఆ తర్వాత ఐపీఎల్ వేలంలో కోట్లు కొల్లగొట్టినా ఆటలో మాత్రం ఉదాసీనత చూపించలేదు. అదే పట్టుదల, అదే సాధనను కొనసాగించాడు. ఐపీఎల్ తర్వాత వచ్చిన గుర్తింపుతో సరిపెట్టుకోకుండా ఇప్పుడు టీమిండియాకు ఎంపికై మొహమ్మద్ సిరాజ్ సత్తా చాటాడు. సాక్షి, హైదరాబాద్: గత ఏడాది కాలంగా మొహమ్మద్ సిరాజ్ ఆటను చూస్తే ఏదో ఒక రోజు భారత్‌కు ఆడగల స్థాయి అతనికుందని అంతా ఊహించారు. అయితే ఆ అవకాశం చాలా తొందరగా వచ్చిందనేది మాత్రం వాస్తవం. ఒక సంవత్సరం వెనక్కి వెళితే అతను దిగువ స్థాయి గ్రూప్‌లో ఉన్న హైదరాబాద్ రంజీ ట్రోఫీలో జట్టు సభ్యుడు మాత్రమే. కానీ అంది వచ్చిన ప్రతీ అవకాశాన్ని అద్భుతంగా వాడుకున్న సిరాజ్ తన బౌలింగ్‌లాగే వేగంగా దూసుకుపోయాడు. కేవలం 14 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలోనే 22.30 సగటుతో 53 వికెట్లు... 16 టి20ల్లో తీసిన 26 వికెట్లు సెలక్టర్లను ఆకట్టుకున్నాయి. భరత్ అరుణ్ పర్యవేక్షణలో... సిరాజ్ తండ్రి మొహమ్మద్ గౌస్ ఆటోడ్రైవర్. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. అయినా సరే ఆయన కొడుకును క్రికెట్ దిశగా ప్రోత్సహించారు. ‘ఇక్కడ ఇంత వేగంగా బౌలింగ్ చేస్తే చాలా కష్టం. మేం ఆడలేం’ అంటూ గల్లీ క్రికెట్లో ప్రత్యర్థుల ప్రశంసలు పొందిన తర్వాత హెచ్‌సీఏ అధికారిక లీగ్‌లో (2 రోజులు) ఆడే అవకాశం దక్కింది. అక్కడ పడిన సిరాజ్ అడుగు ఇక ఆగలేదు. అతను బౌలింగ్‌కు దిగడం... టపటపా వికెట్లు పడగొట్టడం రొటీన్‌గా మారిపోయింది. ఆ తర్వాత 3 రోజుల లీగ్, హైదరాబాద్ అండర్–23 జట్టులో చోటు, కొన్నాళ్లకే రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో అవకాశం చకచకగా జరిగిపోయాయి. గత సీజన్ (2016–17) సిరాజ్ కెరీర్‌ను మలుపు తిప్పింది. అతనిలోని సహజ ప్రతిభను గుర్తించి అప్పటి హైదరాబాద్ కోచ్ భరత్ అరుణ్ మరింత తీర్చిదిద్దారు. లోపాలను సరిదిద్దడంతో పాటు సరైన మార్గనిర్దేశనం చేశారు. ఆయన ప్రోత్సాహంతో కేవలం 18.92 సగటుతో 41 వికెట్లతో రంజీల్లో మూడో స్థానంలో నిలిచాడు. తాజాగా భారత జట్టుకు ఎంపిక కావడంలో కూడా టీమ్ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ పాత్ర కూడా ఉందనే చెప్పవచ్చు. ఐపీఎల్ తర్వాత కూడా... ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ. 2 కోట్ల 60 లక్షలకు సిరాజ్‌ను తీసుకోవడం సంచలనం రేపింది. ఇందులో 6 మ్యాచ్‌లలో 10 వికెట్లు తీసిన అతను ఆ తర్వాత అదే జోరును కొనసాగించాడు. భారత ‘ఎ’ జట్టు తరఫున దక్షిణాఫ్రికా పర్యటనలో ఏకైక టెస్టులో 5 వికెట్లు, 3 వన్డేల్లో 5 వికెట్లు, దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో 2 వికెట్లు, న్యూజిలాండ్ ‘ఎ’తో టెస్టులో 2 వికెట్లు, వన్డేల్లో 2 వికెట్లు... ఇలా వరుస పెట్టి సిరాజ్ వికెట్ల పండగ చేసుకున్నాడు. ఇదే భారత జట్టు ఎంపికకు కారణమైంది. కివీస్ ‘ఎ’తో టెస్టుల్లో స్టంప్ విరగ్గొట్టే వేగంతో అతను బంతులు సంధించాడు. ఐపీఎల్ ద్వారా వచ్చిన డబ్బుతో కొత్తగా సొంతిల్లు కొనుక్కోవడంతో పాటు తండ్రిని ఆటోడ్రైవర్ వృత్తి నుంచి దూరం చేయడాన్ని గర్వంగా భావిస్తానన్న సిరాజ్... లీగ్ ఆకర్షణలో ఏకాగ్రత కోల్పోకుండా అంతే పట్టుదలగా తను ఆటను మెరుగుపర్చుకోవడం విశేషం. భారత జట్టులో చోటు దక్కించుకోవాలన్న నా కల నిజమైంది. భవిష్యత్తులో ఎప్పుడైనా ఆడతానని నమ్మాను కానీ ఇంత తొందరగా ఎంపికవుతానని అసలు ఏమాత్రం ఊహించలేదు. ఈ విషయం చెప్పినప్పుడు నా తల్లిదండ్రులు ఉద్వేగంతో ఏమీ మాట్లాడలేకపోయారు. ఐపీఎల్ కంటే కూడా రంజీ ట్రోఫీ ప్రదర్శన వల్లే నాకు గుర్తింపు వచ్చిందని నమ్ముతున్నా. అన్ని రకాలుగా నా ఆటను తీర్చిదిద్దిన భరత్ అరుణ్ సార్‌కు రుణపడి ఉంటాను. ఇటీవల ‘ఎ’ పర్యటనల్లో నా సహజశైలిని మార్చుకోవాల్సిన అవసరం లేదని కోచ్ ద్రవిడ్ సార్ సూచించారు. భారత్ తరఫున కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నా. – ‘సాక్షి’తో సిరాజ్ -
కనీస టికెట్ రూ. 800
సాక్షి, హైదరాబాద్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య అక్టోబర్ 13న హైదరాబాద్‌లో జరిగే చివరి టి20 మ్యాచ్ కోసం నేటి నుంచి ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఉదయం 11 గంటల నుంచి www.eventsnow.comలో టికెట్లను కొనుగోలు చేయవచ్చని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ప్రకటించింది. మ్యాచ్‌కు వారం రోజుల ముందు అక్టోబర్ 7 నుంచి ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం, సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లలో నేరుగా టికెట్లు కొనుక్కోవచ్చు. టికెట్ ధరలను రూ. 800, రూ. 1,000, రూ. 1,500, రూ.7,500, రూ.12,500లుగా నిర్ణయించా రు. కార్పొరేట్ బాక్స్‌లకు సంబంధించిన ఒక్కో టికెట్ రూ. 20 వేలకు లభిస్తుంది. మొత్తం 39,632 టికెట్లు కొనుగోలు కు అందుబాటులో ఉన్నాయని హెచ్‌సీఏ వెల్లడించింది. కాంప్లిమెంటరీ పాస్‌లు లేవు... సాధారణ ప్రేక్షకులకు కేటాయించిన స్టాండ్లకు సంబంధించి అన్ని టికెట్లు అమ్ముతున్నామని... తొలిసారిగా ఒక్క కాంప్లిమెంటరీ పాస్‌ను కూడా ఇవ్వడంలేదని హెచ్‌సీఏ కార్యదర్శి టి.శేష్ నారాయణ్ తెలిపారు. నకిలీ టికెట్లకు అవకాశం లేకుండా... కొత్త తరహా టెక్నాలజీతో మ్యాచ్ టికెట్లను ముద్రిస్తున్నామని ఆయన తెలిపారు. -
బ్రేక్ పడింది!
-
బ్రేక్ పడింది!
భారత జట్టు ఓడిపోయింది...అవును, నిజమే. వరుసగా తొమ్మిది మ్యాచ్‌లలో గెలిచి ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగుతున్న టీమ్ ఎట్టకేలకు తలవంచింది. ముందుగా బ్యాటింగ్ చేసినా, లక్ష్యాన్ని ఛేదించినా... అలవాటుగా అలవోకగా విజయాలు అందుకున్న కోహ్లి సేన, భారీ లక్ష్యాన్ని వేటాడే క్రమంలో చేరువగా వచ్చి చివరకు ఓటమి పక్షాన నిలిచింది. వరుసగా పదో గెలుపు సాధించి కొత్త చరిత్రను లిఖించాలని భావించిన టీమిండియా ఆ ప్రయత్నంలో విఫలం కాగా... విదేశాల్లో 11 వరుస పరాజయాల తర్వాత ఆస్ట్రేలియాకు బెంగళూరులో విజయంతో ఊరట లభించింది. సిరీస్‌లో తొలి విజయంతో స్మిత్ సేన క్లీన్‌స్వీప్ అవకాశం లేకుండా చేసి పరువు కాపాడుకుంది. 335 పరుగుల పేద్ద లక్ష్యం... చిన్నస్వామిలాంటి చిన్న స్టేడియంలో అసాధ్యం ఏమీ కాదు. అందుకే మన బ్యాట్స్‌మెన్ ఎక్కడా తగ్గలేదు. రోహిత్, రహానే ఇచ్చిన శుభారంభాన్ని ఆ తర్వాత హార్దిక్ పాండ్యా తన దూకుడుతో కొనసాగిస్తే... కేదార్ జాదవ్, మనీశ్ పాండే జంట గెలుపు దిశగా నడిపించింది. అయితే ఆఖర్లో ఆసీస్ పేస్ బౌలర్ల అద్భుత బౌలింగ్ భారత్‌ను కట్టి పడేసింది. చేయాల్సిన రన్‌రేట్ పెరిగిపోయి వికెట్లు కోల్పోవడంతో మనకు మరో విజయం చిక్కలేదు. అంతకు ముందు తన వందో వన్డేలో వార్నర్ మెరుపు సెంచరీకి తోడు ఫించ్ దూకుడైన బ్యాటింగ్ ఆస్ట్రేలియాకు భారీ స్కోరు అందించి మ్యాచ్‌లో విజయంపై ఆశలు రేపేలా చేశాయి. బెంగళూరు : భారత పర్యటనలో ఆస్ట్రేలియాకు ఎట్టకేలకు విజయం లభించింది. తమ బ్యాటింగ్ బలంపై ఆధార పడుతూ వచ్చిన ఆ జట్టుకు ఈ మ్యాచ్‌లో ప్రధాన పేసర్లు కూడా అండగా నిలవడంతో దాదాపు తొమ్మిది నెలల తర్వాత కంగారూలు గెలుపు బాట పట్టారు. గురువారం ఇక్కడ జరిగిన నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ డేవిడ్ వార్నర్ (119 బంతుల్లో 124; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకం బాదగా, ఆరోన్ ఫించ్ (96 బంతుల్లో 94; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) త్రుటిలో ఆ అవకాశం కోల్పోయాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 231 పరుగులు జోడించడం విశేషం. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 313 పరుగులు చేసింది. కేదార్ జాదవ్ (69 బంతుల్లో 67; 7 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్ శర్మ (55 బంతుల్లో 65; 1 ఫోర్, 5 సిక్సర్లు), అజింక్య రహానే (66 బంతుల్లో 53; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేయగా... హార్దిక్ పాండ్యా (40 బంతుల్లో 41; 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించాడు. కేన్ రిచర్డ్సన్ 3 వికెట్లు పడగొట్టాడు. తాజా ఫలితంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 3–1తో ముందంజలో ఉంది. సిరీస్‌లో ఆఖరి వన్డే ఆదివారం నాగపూర్‌లో జరుగుతుంది. ఓపెనర్ల జోరు... ఆస్ట్రేలియాకు మరోసారి ఓపెనర్లు ఫించ్, వార్నర్ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. తొలి ఓవర్ నుంచే వీరిద్దరు ఒకరితో మరొకరు పోటీ పడుతూ బౌండరీలు సాధించారు. ఫలితంగా పది ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ స్కోరు 63 పరుగులకు చేరింది. ఇందులో షమీ, ఉమేశ్ చెరో ఐదు ఓవర్లు వేయగా... మొత్తం 12 బౌండరీలు వచ్చాయి. ఆ తర్వాత అక్షర్, పాండ్యా, చహల్ కూడా ప్రభావం చూపలేకపోవడంతో ఆసీస్ అలవోకగా పరుగులు రాబట్టింది. ఈ క్రమంలో వార్నర్ 45 బంతుల్లో, ఫించ్ 65 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అంతకుముందు 47 పరుగుల వద్ద ఫించ్‌ను స్టంపౌట్ చేయడంతో ధోని విఫలమయ్యాడు. 30 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ స్కోరు 191 పరుగులకు చేరింది. జాదవ్ బౌలింగ్‌లో బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఫోర్ కొట్టిన వార్నర్ వన్డేల్లో 14వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అనంతరం అక్షర్ ఓవర్లో సిక్స్, 2 ఫోర్లతో వార్నర్ 16 పరుగులు రాబట్టాడు. ఎట్టకేలకు పార్ట్ టైమర్ జాదవ్ ఈ భారీ భాగస్వామ్యాన్ని విడదీశాడు. జాదవ్ వేసిన 35వ ఓవర్ చివరి బంతికి లాంగాన్‌లో అక్షర్‌కు క్యాచ్ ఇచ్చి వార్నర్ వెనుదిరగడంతో ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కంగారూలను నియంత్రించారు. మరో ఐదు పరుగుల వ్యవధిలో ఫించ్, స్మిత్ (3) కూడా అవుట్ కావడంతో వేగంగా ఆడటంలో ఆసీస్ విఫలమైంది. ఒక దశలో 50 బంతులపాటు ఆ జట్టు బౌండరీ కొట్టలేదు. అయితే చివర్లో టిమ్ హెడ్ (38 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించగా... హ్యాండ్స్కోంబ్ (30 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడటంతో ఆసీస్ మెరుగైన స్కోరు సాధించగలిగింది. భారత్ తమ ప్రధాన బౌలర్లు ముగ్గురు భువనేశ్వర్, బుమ్రా, కుల్దీప్లకు విశ్రాంతినిచ్చి వారి స్థానంలో షమీ, ఉమేశ్, అక్షర్‌లకు అవకాశం కల్పించింది. మూడు అర్ధ సెంచరీలు... గత మ్యాచ్‌లాగే మరోసారి భారత జట్టు ఓపెనర్లు రహానే, రోహిత్ సెంచరీ భాగస్వామ్యంతో శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు చక్కటి సమన్వయంతో ఆడటంతో తొలి పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ 65 పరుగులు సాధించింది. ముందుగా రహానే 58 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, జంపా ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదిన రోహిత్ 42 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అయితే రిచర్డ్సన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రహానే వెనుదిరగడంతో 106 పరుగుల తొలి వికెట్ పార్ట్‌నర్‌షిప్‌కు తెర పడింది. కొద్ది సేపటికే కోహ్లితో సమన్వయ లోపం, స్మిత్ అద్భుత ఫీల్డింగ్ కారణంగా రోహిత్ రనౌటయ్యాడు. ఆ వెంటనే కూల్టర్‌నీల్ బౌలింగ్‌లో కట్ చేయబోయి వికెట్లపైకి ఆడుకోవడంతో కోహ్లి (21) ఆట ముగిసింది. ఈ దశలో పాండ్యా, జాదవ్ కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరు ఒకవైపు జాగ్రత్తగా ఆడుతూనే మరోవైపు భారీ షాట్లతో దూకుడు ప్రదర్శించారు. ఈ క్రమంలో జంపా బౌలింగ్‌పై మరోసారి తన ఆధిపత్యం ప్రదర్శిస్తూ పాండ్యా వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. అయితే నాలుగో వికెట్‌కు 78 పరుగులు జత చేసిన అనంతరం జంపా బౌలింగ్‌లో మళ్లీ భారీ షాట్‌కు ప్రయత్నించి పాండ్యా పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో జాదవ్, పాండే కలిసి మరో చక్కటి భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 61 పరుగులు జోడించారు. 54 బంతుల్లో జాదవ్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అయితే ఇలాంటి స్థితిలో ఆసీస్ పేసర్లు కమిన్స్, రిచర్డ్సన్ చక్కటి యార్కర్లతో పరుగులు ఇవ్వకుండా కట్టడి చేసి భారత జోడీపై ఒత్తిడి పెంచారు. ఫలితంగా భారీ షాట్‌కు ప్రయత్నించి జాదవ్ వెనుదిరగ్గా... మరో మూడు బంతులకే పాండేను కమిన్స్ బౌల్డ్ చేశాడు. ధోని (13) కూడా తన ముద్ర చూపలేకపోవడంతో భారత్ విజయంపై ఆశలు కోల్పోయింది. ►8 కెరీర్ వందో వన్డేలో సెంచరీ చేసిన ఎనిమిదో, ఆస్ట్రేలియా తరఫున తొలి ఆటగాడు వార్నర్. ►100 ఉమేశ్ యాదవ్ వన్డేల్లో 100 వికెట్లు పడగొట్టాడు. అతను మొత్తం 71 వన్డేలు ఆడాడు. ►2000 కెప్టెన్‌గా వన్డేల్లో కోహ్లి 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అందరికంటే తక్కువ ఇన్నింగ్స్ (36)లలో అతను ఈ ఘనత నమోదు చేశాడు. -
సొంతగడ్డపై భారత్ చాలా బలమైన జట్టు
భారత్‌లో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఆస్ట్రేలియాకు పెద్ద సవాల్ ఎదురు కానుందని ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. టెస్టులతో పోలిస్తే వన్డేల్లో పిచ్‌లు కాస్త మెరుగ్గా ఉంటాయి కాబట్టి హోరాహోరీ పోరు సాగవచ్చన్న క్లార్క్... సొంతగడ్డపై టీమిండియాను ఓడించడం అంత సులువు కాదని అన్నాడు. కోహ్లి నాయకత్వంలో అన్ని రంగాల్లో ఈ జట్టు పటిష్టంగా కనిపిస్తోందని చెప్పాడు. అశ్విన్‌లో అపార ప్రతిభ ఉంది కాబట్టి ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్లో కూడా రాణించగలడని క్లార్క్ అన్నాడు. -
ఆసీస్ గురించి టెన్షన్ అక్కర్లేదు: కోహ్లీ
-
ఆసీస్ గురించి టెన్షన్ అక్కర్లేదు: కోహ్లీ
పుణే: సొంతగడ్డపై విజయయాత్రను కొనసాగిస్తూ బంగ్లాదేశ్‌ను కూడా చిత్తు చేసిన టీమిండియా మరింత కాన్ఫిడెంట్ గా ఉంది. జట్టుగా తాము ప్రస్తుతం అత్యుత్తంగా రాణించడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హర్షం వ్యక్తం చేశాడు. పుణేలో బుధవారం మీడియాతో కోహ్లీ మాట్లాడుతూ.. 'మా జట్టు ఏంతో పటిష్టంగా ఉంది. ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టు గురించి మేము ఆందోళన చెందడం లేదు. జట్టుతో పాటు ఆటగాడిగానూ, కెప్టెన్ గానూ మెరుగవుతున్నాను. ఆసీస్ జట్టులో కొందరు మాత్రమే ఫామ్ లో ఉన్నారు. నాకు 22 ఏళ్లున్ననప్పుడు 35 ఏళ్ల వ్యక్తులతో పోల్చి చూశారు. క్రమక్రమంగా నేను ఆ దశకు చేరుకుంటున్నానను. క్రికెట్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తాను' అని వివరించాడు. రేపటి (గురువారం) నుంచి ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య పుణేలో తొలి టెస్టు ప్రారంభం కానుంది. టీమిండియా ఆటగాళ్లు పుణేలో ప్రాక్టీస్ సెషన్లో చెమటోడుస్తున్నారు. కెప్టెన్ కోహ్లీ సహా ప్రధాన ఆటగాళ్లు నెట్ సెషన్లకే పరిమితమయ్యారు. రవీంద్ర జడేజా, అశ్విన్ బౌలింగ్ లో బ్యాట్స్ మెన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. రెండు టెస్టులకు గానూ ఎలాంటి మార్పు లేకుండా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని కమిటీ భారత జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 23 నుంచి 27 వరకు పుణేలో తొలి టెస్ట్, మార్చి 4 నుంచి 8 వరకు బెంగళూరులో రెండో టెస్టు జరగనున్నాయి. మరోవైపు టీమిండియానే ఫెవరెట్ గా బరిలోకి దిగుతుంది. 2013 తరహాలోనే 4-0తో మరోసారి ఆసీస్ వైట్‌వాష్‌కు గురికాక తప్పదని హర్బజన్, మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. 2001లో జరిగిన సిరీస్‌లో హేడెన్ , స్లేటర్, గిల్‌క్రిస్ట్, పాంటింగ్, స్టీవ్ వాలాంటి దిగ్గజాలుండగా.. ప్రస్తుత ఆసీస్ జట్టులో స్మిత్, వార్నర్ మాత్రమే ప్రధాన ఆటగాళ్లు. అశ్విన్, జడేజాలను ఇతర బ్యాట్స్ మెన్ ఎదుర్కోవడం ప్రత్యర్ధులకు అంత ఈజీ కాదని భావిస్తున్నారు. -
మార్పులు లేకుండానే...
ఆసీస్‌తో తొలి రెండు టెస్టులకు భారత జట్టు ముంబై: సొంతగడ్డపై విజయయాత్రను కొనసాగిస్తూ బంగ్లాదేశ్‌ను కూడా చిత్తు చేసిన జట్టుపైనే భారత సెలక్టర్లు నమ్మకముంచారు. 16 మంది సభ్యుల ఈ టీమ్‌లో ఎలాంటి మార్పులు చేయకుండానే ఆసీస్‌తో తలపడే జట్టును ప్రకటించారు. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని కమిటీ మంగళవారం తొలి రెండు టెస్టుల కోసం జట్టును ఎంపిక చేసింది. ఫిట్నెస్ సమస్యలతో షమీ, మిశ్రా పేర్లను పరిగణలోకి తీసుకోలేదు. ఈనెల 23 నుంచి 27 వరకు పుణేలో తొలి టెస్టు, మార్చి 4 నుంచి 8 వరకు బెంగళూరులో రెండో టెస్టు జరుగుతుంది. జట్టు వివరాలు విరాట్ కోహ్లి (కెప్టెన్), మురళీ విజయ్, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్‌యాదవ్, కరుణ్ నాయర్, జయంత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అభినవ్ ముకుంద్, హార్దిక్ పాండ్యా. -
విజయం విండీస్‌దే..
సొంతగ్రౌండ్‌లో తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన స్థానిక క్రికెటర్ సబ్బినేని మేఘన ప్రేక్షకులను నిరాశపరిచింది. మూలపాడులో వెస్టిండీస్ మహిళ జట్టుతో ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో తనదైన శైలిలో దూకుడుగా ఆడి 17 పరుగులకే విండీస్ బౌలిర్ మ్యాథ్యూస్ చేతిలో ఎల్బీగా చిక్కి పెవిలిన్ పట్టింది. మంధన, మేఘన ఇద్దరూ ఓపెనింగ్‌కు దిగగా, విండీస్ బౌలర్ల ధాటికి తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. విండీస్ జట్టు మూడింటిలో వరుసగా రెండు టీ20 మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం కావడంతో ప్రేక్షకులు భారీగా వచ్చారు. మేఘన ఆట కోసం స్కూల్ బ్యాండ్‌తో సహా పెద్ద సంఖ్యలో విద్యార్థులు మ్యాచ్‌ను తిలకించేందుకు వచ్చారు. ప్లకార్డులు పట్టుకుని జేజేలు పలికారు. విండీస్ స్కిప్పర్ స్టెఫాన్ టేలర్ రెండో మ్యాచ్‌లో కూడా రాణించి జట్టును విజయంపథం వైపు మళ్లించింది. మొదటి నుంచీ నిలకడగా రాణిస్తూ స్థానిక ప్రేక్షకుల మనసు దోచుకున్న వేద కృష్ణమూర్తి ఐదు పరుగులకే పెవిలియన్ పట్టడంతో మ్యాచ్‌పై ఆశలు ఆవిరయ్యాయి. భారత జట్టులో స్కిపర్ హర్మన్ ప్రీత్‌కౌర్ కాస్త రాణించినా మిగిలిన వారంతా కూలబడటంతో స్వల్ప లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. మంగళవారం చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. - విజయవాడ స్పోర్ట్స్ -
ఈ దశాబ్దం మనదే కావాలి: సచిన్
కాన్పూర్: భారత టెస్టు క్రికెట్ చరిత్రలో 500వ మ్యాచ్ ఆడుతోన్న కోహ్లి సేన మరో పదేళ్లు కొనసాగాలని దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ అభిలషించాడు. వచ్చే 8-10 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్లో ఆధిపత్యం చాటాలని కోరాడు. చారిత్రక టెస్టును ప్రత్యక్షంగా తిలకించేందుకు విశిష్ట అతిథిగా విచ్చేసిన సచిన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ దశాబ్దమంతా భారత్ రికార్డులతో టెస్టు క్రికెట్ దద్దరిల్లాలని ఆకాంక్షించాడు. కోహ్లి సారథ్యంలోని జట్టులో ఆల్‌రౌండ్ నైపుణ్యముందని కితాబిచ్చాడు. బౌలింగ్, బ్యాటింగ్ విషయంలో ప్రస్తుత జట్టులో చక్కని సమతౌల్యం ఉందన్నాడు. మరో దశాబ్దం పాటు కోహ్లి సైన్యం భారత క్రికెట్‌ను మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని, వాళ్లంతా పూర్తి ఫిట్నెస్తో ఆటను ఆస్వాదించాలని సచిన్ శుభాకాంక్షలు తెలిపాడు. -
ఫెడ్ కప్‌లో భారత్ బోణీ
హువా హిన్ (థాయ్‌లాండ్): రెండు వరుస పరాజయాల తర్వాత ఫెడ్ కప్ గ్రూప్-1 ఆసియా ఓసియానియా జోన్ మహిళల టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత జట్టు బోణీ చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 3-0తో ఉజ్బెకిస్తాన్‌పై నెగ్గింది. అంకిత రైనా సింగిల్స్, డబుల్స్‌లో గెలవడం టీమిండియాకు కలిసొచ్చింది. తొలి సింగిల్స్‌లో ప్రేరణ బాంబ్రీ 6-1, 6-1తో సబీనా షరిపోవాపై; రెండో సింగిల్స్‌లో అంకిత 6-1, 6-0తో నిజినా అబ్డురామివాపై గెలిచారు. డబుల్స్‌లో అంకిత-సానియా 6-2, 6-0తో అగుల్ అమన్మురదోవా-అరినా ఫోల్ట్స్పై గెలవడంతో భారత్ విజయం పరిపూర్ణమైంది. -
‘సెట్’ అయింది..!
‘సొంతగడ్డపై జరిగే ప్రపంచకప్‌కు కావాల్సిన భారత జట్టు ఇదే’... నేను వర్తమానంలోనే జీవిస్తాను తప్ప భవిష్యత్తు గురించి మాట్లాడను అని తరచుగా చెప్పే కెప్టెన్ ధోని నోటినుంచి వచ్చిన మాట ఇది. ఇందులో ఆస్ట్రేలియాపై సాధించిన విజయగర్వంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా మెండుగా కనిపిస్తోంది. ఆసీస్ సిరీస్ ఇంతగా కెప్టెన్, జట్టు ఆలోచనలను మార్చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. అసలు వన్డేల్లో చిత్తుగా ఓడిన భారత జట్టు టి20ల్లో ఇంత బాగా ఆడుతుందని కూడా ఎవరూ అనుకోలేదు. కానీ టీమిండియా అనూహ్యంగా అద్భుతాన్ని చేసి చూపించింది. సిరీస్ గెలవడమే కాదు జట్టులో ప్రతీ ఆటగాడు తన బాధ్యతను పూర్తిగా నెరవేర్చడంతో ఒక రకంగా టీమ్‌లో ప్రస్తుతం ఎలాంటి లోపం లేదన్నట్లుగా కనిపిస్తోంది. 11 మంది జట్టును మార్చకుండా సిరీస్ మొత్తం ఆడించడం చూస్తే జట్టు బలమేంటో అర్థమవుతుంది. ఇదే ఆటతీరు, సొంత మైదానాలు కలగలిస్తే భారత్‌కు వరల్డ్‌కప్‌లో తిరుగుండకపోవచ్చు. - సాక్షి క్రీడావిభాగం * ప్రపంచకప్‌కు భారత జట్టు సిద్ధం * నమ్మకం పెంచిన సీనియర్లు * ఆకట్టుకున్న కుర్రాళ్లు * ఆసీస్ టూర్ సూపర్ సక్సెస్ వరల్డ్ కప్‌కు ముందు సన్నాహకంగా భారత్‌కు అందుబాటులో ఉన్న కనీస టి20 మ్యాచ్‌ల సంఖ్య పది. గతంలో జరిగిన ఐదు టి20 ప్రపంచకప్‌ల కోసం కూడా ధోని సేన ఇంతగా ఎప్పుడూ సిద్ధం కాలేదు. ఈ కౌంట్‌డౌన్‌లో మొదటి మూడు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇక శ్రీలంకతో మూడు మ్యాచ్‌లు, ఆ తర్వాత ఆసియా కప్‌లో కనీసం ఐదు మ్యాచ్‌లు ఉన్నాయి. ఫైనల్‌కు చేరితే మరో మ్యాచ్ కూడా దక్కుతుంది. 2007లో తొలిసారి ఎవరూ ఊహించని విధంగా తొలి చాంపియన్‌గా నిలిచిన టీమిండియా... ఆ తర్వాత పొట్టి క్రికెట్లో ఎందుకో తమదైన ముద్ర వేయలేకపోయింది. అపారమైన ఐపీఎల్ అనుభవం వరుసగా మూడు టోర్నీలలో అక్కరకు రాకపోవడంతో కనీసం సెమీస్‌కు కూడా చేరలేని భారత్, గత టోర్నీలో మాత్రం ఫైనల్లో ఓడింది. ఈ కసితోనే కావచ్చు ఆటగాళ్లు, బీసీసీఐ కూడా ఈసారి టోర్నీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. టాప్ లేపుతున్నారు బ్యాటింగ్‌లో భారత టాపార్డర్ తిరుగులేనిదిగా కనిపిస్తోంది. 20 ఓవర్ల ఆటకు మొదటి ముగ్గురు చాలు, తర్వాతి బ్యాట్స్‌మెన్ అవసరం లేదన్నట్లుగా వీరి జోరు సాగుతోంది. కోహ్లి టి20ల్లో 50 సగటును అధిగమించి ఈ ఫార్మాట్లో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఆసీస్‌తో సిరీస్‌లో 3 ఇన్నింగ్స్‌లలోనే అతను 199 పరుగులు చేయడం అసాధారణం. రోహిత్ శర్మ కూడా అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ధావన్ ప్రభావమేమిటో చివరి టి20లో కనిపించింది. ఈ ముగ్గురి దూకుడు భారత్‌కు భారీ స్కోరు అందించగలదు. వీరి ధాటితోనే ఛేదన కూడా సులువవుతోంది. ఇక టి20ల్లో రైనా తన సామర్థ్యాన్ని సిడ్నీ మ్యాచ్‌లో చూపించాడు. ‘ఐపీఎల్లో అందరికంటే బెస్ట్ అయిన రైనానుంచి ప్రపంచకప్‌లో చాలా ఆశిస్తున్నాం’ అని ధోని వ్యాఖ్యానించడం అతను ఎంత కీలకం కానున్నాడో సూచిస్తుంది. ఇక అవసరమున్నప్పుడు ధోని మెరుపు బ్యాటింగ్ ముందుకు వస్తుంది. యువరాజ్ బ్యాటింగ్ ఫామ్‌పై ఇంకా స్పష్టత లేకపోయినా, అతని బౌలింగ్‌పై కెప్టెన్ నమ్మకముంచడం జట్టులో స్థానాన్ని దాదాపు ఖాయం చేసింది. అదే బ్యాటింగ్‌లోనూ చెలరేగితే తిరుగుండదు. గాయంతో ఈ సిరీస్ ఆడని రహానే అదనపు బ్యాట్స్‌మన్‌గా జట్టులో ఎలాగూ ఉన్నాడు. హార్దిక్ పాండ్యా రూపంలో మీడియం పేస్ ఆల్‌రౌండర్ దక్కడం ధోనికి కూడా సంతోషాన్ని కలిగిం చింది. సీనియర్లు లేకున్నా... సీనియర్ బౌలర్లు పదే పదే అదే తప్పులు చేయడంతో కొత్తగా ప్రయత్నించానని చెప్పిన ధోని అందుకు తగిన ఫలితాన్ని రాబట్టాడు. సాధారణంగా ఎవరినీ కెరీర్ ఆరంభంలోనే పెద్దగా ప్రశంసించని ధోని...నాక్కావలసింది ఇలాంటి బౌలరే అంటూ బుమ్రాను పదే పదే అభినందించాడు. ముఖ్యంగా కీలక సమయంలో తన యార్కర్లతో బుమ్రా ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. నమ్మకం నిలబెట్టిన వెటరన్ నెహ్రా కూడా ఐపీఎల్ అనుభవంతో భారత గడ్డపై కీలకం కావచ్చు. పాండ్యా బౌలింగ్‌తో కూడా జట్టు సంతృప్తిగా ఉంది. ఇషాంత్, ఉమేశ్ తిరిగి జట్టులోకి రావడం కష్టమేనని కెప్టెన్ చూచాయగా చెప్పడం కూడా పేస్ లైనప్ ఇదే అని అర్థమవుతోంది. ఇక ఆస్ట్రేలియాలో అంత ప్రభావం చూపలేకపోయినా... అశ్విన్, జడేజాలు భారత్‌లో ఎంత ప్రమాదకరమో అందరికీ తెలుసు. హర్భజన్ స్థానం గురించి ధోని ఎలాంటి హామీ ఇవ్వలేదు. పరిస్థితులను బట్టి అప్పటి జట్టును ఎంపిక చేస్తామని, అవసరమైతే ఒకటి రెండు మా ర్పులు మాత్రమే ఉంటాయని సూచించడంతో జట్టు కూర్పు పై టీమ్ మేనేజ్మెంట్కు స్పష్టత వచ్చినట్లే. వరల్డ్ కప్ తరహా పరిస్థితులే ఉండే శ్రీలంక సిరీస్, ఆసియా కప్‌లలో ఇక ఇదే జట్టుకు ఎక్కువ మ్యాచ్ ప్రాక్టీస్ కల్పించడమే మిగిలింది. ధోని ‘స్ఫూర్తి సందేశం’ ఆసీస్‌పై సిరీస్ విజయం భారత జట్టులో కొత్త ఉత్సాహం నింపిందనడంలో సందేహం లేదు. సిరీస్ విజయం తర్వాత ధోనికి కూ డా మంచి ఊపొచ్చింది. అందుకే జట్టులో స్ఫూర్తి పెంచేందుకు ‘ఇక్కడినుంచి పడిపోవద్దు’ అంటూ డ్రెస్సింగ్ రూమ్‌లో ఒక పేద్ద సందేశం ఇచ్చేశాడు. ‘అదో అద్భుతమైన ప్రసంగం. ఈ సిరీస్ విజయం ప్రాధాన్యతపై 20 నిమిషాల పాటు ధోని మాట్లాడాడు. ఆస్ట్రేలియా గడ్డపై మన జట్టు గతంలో ఇంత బాగా ఆడలేదని, తొలిసారి భారీ విజయం రుచి చూసిన కుర్రాళ్లు దీని విలువను తెలుసుకోవాలని, ఆత్మవిశ్వాసంతో వచ్చే మ్యా చ్‌లలోనూ ఇదే జోరును కొనసాగించాలని కెప్టెన్ చెప్పాడు’ అని టీమ్ మేనేజ్మెంట్లోని ఒక కీలక వ్యక్తి వెల్లడించాడు. ఇదే సమావేశంలో డెరైక్టర్ రవిశాస్త్రి... భారత ఆటగాళ్లు పులుల్లా ఆడారని, దిగ్గజాలు ఉన్న సమయంలోనూ మనం విదేశాల్లో ఇంత బాగా ఆడలేదని ప్రశంసించారు. కోహ్లికి టాప్ ర్యాంక్ ఆసీస్‌తో సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన విరాట్ కోహ్లి ఐసీసీ టి20 బ్యాట్స్‌మన్ ర్యాం కింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. నంబర్‌వన్‌గా ఉన్న ఆరోన్ ఫించ్ రెండో స్థానానికి దిగజారాడు. మొత్తం 892 రేటింగ్ పాయింట్లతో కోహ్లి ముందంజలో ఉండగా, ఫించ్ ఖాతాలో 868 పాయింట్లు ఉన్నాయి. రైనా 13, రోహిత్ 16వ స్థానాల్లో కొనసాగుతున్నారు. బౌలర్లలో అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. -
నేడు భారత్, కివీస్ పోరు
అండర్-19 ప్రపంచకప్ మిర్పూర్: అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టు తమ రెండో మ్యాచ్‌ను నేడు (శనివారం) న్యూజిలాండ్‌తో ఆడనుంది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడిన కుర్రాళ్లు ఆరంభంలో బ్యాటింగ్‌లో తడబడ్డారు. సర్ఫరాజ్, సుందర్ ఆటతీరుతో గట్టెక్కిన భారత్ నేటి వన్డేలో తమ టాప్ ఆర్డర్లో లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉంది. కెప్టెన్ ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, అర్మాన్ జాఫర్ బ్యాట్ ఝుళిపించాల్సి ఉంది. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సుందర్‌ను వన్‌డౌన్‌లో ఆడించే అవకాశాలున్నాయి. మరోవైపు తమ ప్రారంభ మ్యాచ్‌లో కివీస్‌కు నేపాల్ చేతిలో షాక్ తగిలింది. అనూహ్య రీతిలో 32 పరుగుల తేడాతో ఓడిన ఈ జట్టు భారత్‌తో సత్తా చూపాలనే కసితో ఉంది. అన్ని రంగాల్లోనూ కివీస్‌కన్నా భారత్ పటిష్టంగా ఉంది. ఇంగ్లండ్ విజయం శుక్రవారం జరిగిన మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్‌ను 61 పరుగుల తేడాతో ఓడించింది. ఫిజిపై జింబాబ్వే జట్టు 7 వికెట్ల తేడాతో గెలవగా... నమీబియా 9 వికెట్ల తేడాతో స్కాట్లాండ్ను ఓడించింది. -
కొత్త అధ్యాయం
* ఆసీస్ గడ్డపై తొలి ద్వైపాక్షిక సిరీస్ గెలిచిన ధోని బృందం * 2-0తో టి20 సిరీస్ కైవసం * రెండో మ్యాచ్‌లో 27 పరుగులతో ఓడిన ఫించ్‌సేన మెల్బోర్న్: దుమ్మురేపే బ్యాటింగ్... కళ్లు చెదిరే క్యాచ్‌లు... మెరుపు ఫీల్డింగ్... బౌలర్ల రాణింపు... ప్రతీకారేచ్ఛతో రెచ్చిపోయిన భారత జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టి20లో చేసిన సమష్టిపోరాటం ఇది. ఏమాత్రం అలసత్వం చూపకుండా... ఏ అవకాశాన్ని వదలకుండా... అదరహో అన్న రీతిలో ఆడుతూ కంగారూల గడ్డపై తొలి ద్వైపాక్షిక సిరీస్‌ను గెలిచి కొత్త అధ్యాయాన్ని లిఖించింది. శుక్రవారం ఎంసీజీలో జరిగిన రెండో టి20లోనూ 27 పరుగుల తేడాతో ఫించ్‌సేనపై నెగ్గిన ధోని బృందం... మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో టి20 సిరీస్‌ను కైవసం చేసుకుని ఈ ఘనత అందుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 184 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (47 బంతుల్లో 60; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లి (33 బంతుల్లో 59 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) ఫామ్‌ను కొనసాగించగా, శిఖర్ ధావన్ (32 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరిశాడు. తర్వాత ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులకే పరిమితమైంది. ఫించ్ (48 బంతుల్లో 74; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరిపోరాటం చేశాడు. కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆఖరి టి20 ఆదివారం సిడ్నీలో జరుగుతుంది. సూపర్ భాగస్వామ్యం: తొలి మూడు ఓవర్లలో 12 పరుగులు మాత్రమే చేసిన రోహిత్, ధావన్ ఆ తర్వాత చెలరేగిపోయారు. బంతి ఎలాంటిదైనా బౌండరీ దాటించడంతో స్కోరు బోర్డు కదం తొక్కింది. ఏడో ఓవర్లో ఫాల్క్‌నర్ సంధించిన బౌన్సర్‌ను ధావన్ సిక్సర్‌గా మల్చడం అతని బ్యాటింగ్‌కే హైలైట్. లయోన్, మ్యాక్స్‌వెల్‌లకు రోహిత్ సిక్సర్ల రుచి చూపెట్టాడు. ఆరు ఓవర్లలో 50 పరుగులు చేసిన భారత్... 11.2 ఓవర్లలో 100 పరుగులను అందుకుంది. తొలి వికెట్‌కు 97 పరుగులు జత చేశాక ధావన్ రివర్స్ స్వీప్‌తో అవుటయ్యాడు. ఈ దశలో వచ్చిన కోహ్లి కూడా ఏమాత్రం తగ్గలేదు. 13వ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి ఊపు తెచ్చాడు. ఓవర్‌కు 9 పరుగుల చొప్పున రాబట్టిన కోహ్లి, రోహిత్ రెండో వికెట్‌కు 46 పరుగులు జత చేశారు. 16వ ఓవర్లో రోహిత్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన ధోని (14) వేగంగా ఆడాడు. 29 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లితో కలిసి ధోని మూడో వికెట్‌కు 38 పరుగులు జోడించాడు. ఫించ్ పోరాడినా...: లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన ఆసీస్ ఓపెనర్లు ఫించ్, మార్ష్ (23) మెరుపు ఆరంభాన్నిచ్చారు. బౌండరీల వర్షం కురిపించడంతో రన్‌రేట్ దూసుకుపోయింది. దీనికి తోడు 9, 10 ఓవర్లలో ఫించ్ ఇచ్చిన మూడు క్యాచ్‌లను ఉమేశ్, రిషి ధావన్, శిఖర్ ధావన్‌లు జారవిడిచారు. అయితే 10వ ఓవర్లో మార్ష్ ఇచ్చిన క్యాచ్‌ను లాంగాన్‌లో పాండ్యా చక్కగా అందుకోవడం, ఆ వెంటనే తన బౌలింగ్‌లో లిన్ (2)ను వెనక్కిపంపడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. ఫించ్, మార్ష్‌లు తొలి వికెట్‌కు 9.5 ఓవర్లలో 94 పరుగులు జోడించారు. 12వ ఓవర్లో ‘డేంజర్ మ్యాన్’ మ్యాక్స్‌వెల్ (1)ను ధోని స్టంప్ చేశాడు. తర్వాత ఫించ్‌తో జత కలిసిన వాట్సన్ (15) నిలకడగా ఆడే ప్రయత్నం చేసినా జడేజా కుదురుకోనీయలేదు. 15వ ఓవర్లో కళ్లు చెదిరే రీతిలో రిటర్న్ క్యాచ్ తీసుకోవడంతో ఆసీస్ స్కోరు 124/4గా మారింది. తర్వాతి ఓవర్లో ఎక్స్ట్రా కవర్ నుంచి జడేజా విసిరిన బంతికి ఫించ్ రనౌట్ కావడంతో కంగారులు కుదేలయ్యారు. విజయానికి 61 పరుగులు చేయాల్సిన దశలో జడేజా మరోసారి మ్యాజిక్ చూపెట్టాడు. 17వ ఓవర్లో ఫాల్క్‌నర్‌ను అవుట్ చేస్తే... చివరి ఓవర్లో బుమ్రా యార్కర్లతో హాస్టింగ్స్ (4), టై (4)లను వెనక్కి పంపి చిరస్మరణీయ విజయాన్ని పూర్తి చేశాడు. 1 ఆసీస్ గడ్డపై ద్వైపాక్షిక సిరీస్ గెలవడం భారత్‌కు ఇదే మొదటిసారి. అంతకుముందు 2007-08లో ముక్కోణపు సిరీస్, 1985లో బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్ చాంపియన్‌షిప్‌ను గెలిచారు. స్కోరు వివరాలు:- భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ రనౌట్ 60; ధావన్ (సి) లిన్ (బి) మ్యాక్స్‌వెల్ 42; కోహ్లి నాటౌట్ 59; ధోని (సి) వాట్సన్ (బి) టై 14; రైనా నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 184. వికెట్ల పతనం: 1-97; 2-143; 3-181. బౌలింగ్: వాట్సన్ 3-0-17-0; హాస్టింగ్ 3-0-35-0; బోలాండ్ 4-0-30-0; ఫాల్క్‌నర్ 3-0-35-0; టై 4-0-28-1; లయోన్ 1-0-15-0; మ్యాక్స్‌వెల్ 2-0-17-1. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఫించ్ రనౌట్ 74; మార్ష్ (సి) హార్డిక్ పాండ్యా (బి) అశ్విన్ 23; లిన్ (సి) ధోని (బి) హార్డిక్ పాండ్యా 2; మ్యాక్స్‌వెల్ (స్టంప్) ధోని (బి) యువరాజ్ 1; వాట్సన్ (సి అండ్ బి) జడేజా 15; వేడ్ నాటౌట్ 16; ఫాల్క్‌నర్ (స్టంప్) ధోని (బి) జడేజా 10; హాస్టింగ్స్ (బి) బుమ్రా 4; టై (బి) బుమ్రా 4; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1-94; 2-99; 3-101; 4-121; 5-124; 6-137; 7-152; 8-157. బౌలింగ్: నెహ్రా 4-0-34-0; బుమ్రా 4-0-37-2; జడేజా 4-0-32-2; అశ్విన్ 4-0-27-1; హార్డిక్ పాండ్యా 2-0-17-1; యువరాజ్ 2-0-7-1. -
అజేయ భారత్‌దే టైటిల్
* అండర్-19 ముక్కోణపు టోర్నీ * ఫైనల్లో శ్రీలంక చిత్తు కొలంబో: అండర్-19 ముక్కోణపు వన్డే టోర్నీని భారత జట్టు సొంతం చేసుకుంది. సోమవారం ఇక్కడ జరిగిన ఫైనల్లో భారత్ 5 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంక 47.2 ఓవర్లలో 158 పరుగులకే కుప్పకూలింది. పీవీఆర్ డిసిల్వా (75 బంతుల్లో 58; 7 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో లెఫ్టార్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా... మయాంక్, అవేశ్ ఖాన్, శుభమ్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 33.5 ఓవర్లలో 5 వికెట్లకు 159 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (77 బంతుల్లో 56; 6 ఫోర్లు) టోర్నీలో మూడో సెంచరీ సాధించగా, రిషభ్ పంత్ (35), రికీ భుయ్ (29 నాటౌట్) రాణించారు. లంక బౌలర్లలో దమిత సిల్వ (3/18) ఆకట్టుకున్నాడు. లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌లు కూడా గెలిచిన యువ జట్టు టోర్నీలో అజేయంగా నిలవడం విశేషం. -
మేరీకోమ్‌కు అవకాశం
న్యూఢిల్లీ: ఒలింపిక్ టెస్ట్ ఈవెంట్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టులో మహిళా స్టార్ బాక్సర్ ఎంసీ మేరీకోమ్‌కు స్థానం లభించింది. వచ్చే నెలలో 4 నుంచి 6 వరకు బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో ఈ టోర్నీ జరుగుతుంది. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ-ఐబా) ఎంపిక చేసిన ఆరుగురు సభ్యులుగల భారత బృందంలో మేరీకోమ్ రూపంలో ఏకైక మహిళా బాక్సర్‌ను ఎంపిక చేశారు. రోహిత్ టొకాస్, మనోజ్ కుమార్, దేవాన్షు జైస్వాల్, ప్రవీణ్ కుమార్, సతీశ్ కుమార్ జట్టులోని ఇతర సభ్యులు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాకర శ్యామ్ కుమార్‌ను రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపిక చేశారు. -
టి20 ప్రపంచకప్ భారత్ గెలుస్తుంది
క్రిష్ శ్రీకాంత్ ఆశాభావం హైదరాబాద్: వచ్చే ఏడాది సొంతగడ్డపై జరిగే టి20 ప్రపంచకప్‌ను గెలిచే సత్తా భారత జట్టుకు ఉందని మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయ పడ్డారు. ‘టి20ల్లో భారత్ ప్రదర్శన ఎప్పుడైనా బాగానే ఉంది. ఈ సారి కూడా టీమ్ మరింత మెరు గ్గా ఆడుతుందని నాకు నమ్మకముంది. 2016లో స్వదేశంలో జరిగే ప్రపంచకప్ గెలుస్తుంది’ అని శ్రీకాంత్ వ్యాఖ్యానించారు. వర్షం అడ్డు పడకపోతే భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టులోనూ మొహాలి ఫలితం పునరావృతం అయ్యేదని ఆయన అన్నారు. ‘ఏకపక్షంగా తొలి టెస్టు గెలవడంతో టీమిండియా ఆత్మవిశ్వాసం పెరిగింది. కనీసం మూడు రోజులు ఆట జరిగినా మ్యాచ్ మన సొంతమయ్యేది. కోహ్లి సేనను నిలువరించే సత్తా దక్షిణాఫ్రికా జట్టులో కనిపించడం లేదు. నిలకడగా ఆడుతున్న యువ ఆటగాళ్లతో ఇప్పుడు భారత జట్టు సరైన దిశలోనే పయనిస్తోంది’ అని శ్రీకాంత్ విశ్లేషించారు. -
‘ఏడు’పు ఆగేదెలా?
పరిమిత ఓవర్ల భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ‘ఏడు’ అదృష్ట సంఖ్య. జెర్సీ నంబర్ మొదలు బ్యాటింగ్ కిట్నుంచి పెర్ఫ్యూమ్ బాటిల్స్ వరకు అంతటా ‘7’ కనిపిస్తుంది. అదేంటో గానీ కెప్టెన్‌గా మైదానంలో మాత్రం అతనికి ఇప్పుడు అదే అంకె అచ్చి రావడం లేదనిపిస్తోంది. దానిని అతను పదే పదే గుర్తు చేస్తున్నాడు కూడా. భారత జట్టుకు ఏడో స్థానంలో ఆడగల సమర్థుడైన ‘ఆల్‌రౌండర్’ లేడని... అతను దొరికే వరకు ఫలితాలు ఇలాగే ఉంటాయని కెప్టెన్ చెప్పేశాడు. మరి రాబోయే రోజుల్లో టీమిండియా ఈ సమస్యకు పరిష్కారం వెతకగలదా... అసలు జట్టు ముందు ఉన్న ప్రత్యామ్నాయాలు ఏమిటి? భారత జట్టుకు ఆల్‌రౌండర్ కొరత * వన్డేలు, టి20ల్లో తీరని సమస్య * ఏడో స్థానంలో ఆటగాడి కోసం అన్వేషణ సాక్షి క్రీడా విభాగం: భారత జట్టు ఇటీవల దక్షిణాఫ్రికాతో పరాజయానికి ముందు సొంతగడ్డపై 16 వన్డే సిరీస్‌లు ఆడితే 2 మాత్రమే ఓడింది. అయితే ఆ రెండు సార్లూ వెంటనే కోలుకొని ప్రపంచకప్‌ను, ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. బంగ్లాదేశ్‌లో ఓటమి అనంతరం స్వదేశంలో సఫారీల చేతిలోనూ చిత్తయ్యాక మరోసారి టీమిండియా మేనేజ్మెంట్ తమను తాము సమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. ఇందులో అన్నింటికంటే ముఖ్యమైంది ‘ఆల్‌రౌండర్’ సమస్యకు పరిష్కారం. సుదీర్ఘ కాలంగా వన్డేలు, టి20ల్లో భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను పరిశీలిస్తే ఐదో స్థానం వరకు ఢోకా లేకుండా రెగ్యులర్ బ్యాట్స్‌మన్, ఆ తర్వాత ఆరో స్థానంలో ధోని ఆడటం కనిపిస్తోంది. చివరి నాలుగు స్థానాలు బౌలర్లకు పోగా, మధ్యలో ఏడో స్థానంలో మాత్రం నిఖార్సయిన ఆల్‌రౌండర్ కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. అయితే ఎన్ని ప్రయోగాలు, ప్రయత్నాలు చేసినా రెండు విభాగాల్లోనూ జట్టుకు ఉపయోగపడగల ‘సవ్యసాచి’ మాత్రం దొరకలేదు. యువీ లేకపోవడంతో... 2012 డిసెంబర్లో పాకిస్తాన్‌తో వన్డేలో ధోని ఆఖరిసారిగా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. భారత్ స్కోరు 29/5 ఉన్న దశలో అతను అద్భుత సెంచరీ సాధించాడు. అప్పటి బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్థానంలో యువరాజ్ ఆడాడు. అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్ కావడంతో పాటు బౌలింగ్‌లో కనీసం 7-8 ఓవర్ల వేయగల యువీ ఉన్నంత వరకు జట్టుకు సమస్య ఎదురు కాలేదు. అయితే ప్రస్తుత టీమ్‌లో టాప్-5 రెగ్యులర్ బ్యాట్స్‌మెన్ ఉన్నారు. దక్షిణాఫ్రికాతో ఐదు వన్డేలు కలిపి 14 ఓవర్లు మాత్రమే వేసిన రైనానుంచి ఎక్కువగా ఆశించలేం. పైగా ఐసీసీ కొత్త నిబంధనలు వచ్చాక పార్ట్‌టైమర్లను వాడుకోవడం ధోనికి ఇబ్బందిగానే మారింది. గత మూడేళ్లుగా ధోని ఆరో స్థానంలో ఆడుతుండటంతో ఏడో నంబర్ ఆటగాడి పాత్ర కీలకంగా మారింది. అటు బౌలర్‌గా ఉపయోగపడటంతో పాటు ఇన్నింగ్స్ చివరి దశలో భారీ హిట్టింగ్ చేయగల ఆటగాడు అవసరం. గతంలో యూసుఫ్ పఠాన్ సరిగ్గా ఇలాంటి పాత్ర పోషించాడు. ఫామ్ కోల్పోయి అతను చోటు కోల్పోయాక అలాంటి హిట్టర్ మరొకరు దొరకలేదు. అంతకుముందు ఇర్ఫాన్ పఠాన్ కూడా కొంత వరకు అలాంటి ఆట ప్రదర్శించినా గాయాలతో దూరమయ్యాడు. ఈ సీజన్లో అతను ఇంతవరకు దేశవాళీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆ ముగ్గురే దిక్కా? ‘చాలా ప్రయోగాలు చేశాం. మీకు నచ్చినా నచ్చకపోయినా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అంటే బిన్నీ, స్పిన్ ఆల్‌రౌండర్ అంటే జడేజా, అక్షర్లే’ అని ధోని నేరుగా వ్యాఖ్యానించాడు. ఇందులో ఏ మాత్రం వాస్తవం ఉందనేది ఆసక్తికరం. 14 వన్డేల్లో 230 పరుగులు చేసిన బిన్నీ 20 వికెట్లు పడగొట్టాడు. ఇందులో బంగ్లా, జింబాబ్వేలపై కలిపి తీసినవి 13 ఉన్నాయి. అయితే జట్టుకు అవసరమైన కీలక దశలో అతను బ్యాటింగ్‌లో ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. కాన్పూర్ వన్డే ఓటమిలో అతని పాత్ర కూడా ఉంది! ఇక ధోని ఆత్మీయుడు రవీంద్ర జడేజా చాంపియన్స్ ట్రోఫీ సహా అనేక మ్యాచ్‌లలో బౌలర్‌గా తన బాధ్యతను బాగా నిర్వహించాడు గానీ బ్యాటింగ్‌లో అతను చేసిందేమీ లేదు. తన చివరి 16 వన్డేల్లో అతను ఒక్కసారి కూడా కనీసం 40 పరుగులు చేయలేదు. ఓవర్లు అందుబాటులో ఉండి ముందుగా బ్యాటింగ్ అవకాశం వచ్చినా ఐపీఎల్‌లాంటి విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఇక బౌలింగ్‌లో పర్వాలేదనిపించిన అక్షర్ పటేల్ 15 ఇన్నింగ్స్‌లలో కలిపి చేసింది 91 పరుగులే. మరి ఇంతకంటే ఎవరూ లేరనడం భారత క్రికెట్‌కు అవమానకరం. కొత్తగా ప్రయత్నించరా... దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు గుర్కీరత్ మాన్‌ను ఎంపిక చేసినా ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం ఇవ్వలేదు. దేశవాళీలో గుర్కీరత్ రికార్డు చాలా బాగుంది. ఆరో స్థానం, అంతకంటే దిగువన ఆడుతూ 20 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 50 సగటు, 80 స్ట్రయిక్ రేట్ ఉన్న అతను...40 వన్డేల్లో 90 స్ట్రయిక్ రేట్, 46 సగటుతో పరుగులు సాధించాడు. తన ఆఫ్‌స్పిన్‌తో ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న ఇలాంటి ఆటగాడే ఇప్పుడు భారత్‌కు కావాలి. అక్షర్‌కు బదులు అతనికి అవకాశం ఇచ్చి ఉంటే ఆట గురించి తెలిసేది. ఇక రిషి ధావన్ కూడా నిలకడకు మారుపేరు. దేశవాళీ వన్డేల్లో 90 స్ట్రయిక్ రేట్‌తో పరుగులు చేసిన అతను బౌలింగ్‌లో 31 సగటుతో రెగ్యులర్‌గా వికెట్లు తీస్తున్నాడు. హిమాచల్‌ప్రదేశ్ ఆటగాడిగా రంజీల్లో గ్రూప్ ‘సి’లో ఉండటంతో అతని ప్రతిభకు గుర్తింపు దక్కనట్లు కనిపిస్తోంది. అయితే అదే నిజమైతే ఇటీవల జడేజా 37 వికెట్ల రికార్డుకు కూడా విలువ ఉండదు! గత ఏడాది మీడియం పేసర్‌గా రం జీల్లో 40 వికెట్లు తీసిన అతను, ఈసారి 3 మ్యాచుల్లోనే 16 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల బంగ్లాదేశ్ ‘ఎ’తో జరిగిన సిరీస్‌లోనూ అతను రాణించాడు. ఇక రెండు వారాల క్రితం రైల్వేస్‌తో మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన బరోడా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌గా భారత ‘ఎ’ జట్టు తరఫున ఆకట్టుకున్న తమిళనాడు ఆటగాడు విజయ్ శంకర్ల రూపం లో యువ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. మాకున్న ముగ్గురు చాలు... అం టూ బిగదీసుకోకుండా ఇలాంటి ఆటగాళ్లను పరీక్షిస్తేనే ఆల్‌రౌండర్లు వెలుగులోకి వస్తారు. జట్టు ‘ఏడు’పు ఆగుతుంది. -
సొంతగడ్డపై భారత్ ప్రమాదకారి
వచ్చే టి20 ప్రపంచకప్‌లో ధోనిసేన ఫేవరెట్ విండీస్ బ్యాటింగ్ దిగ్గజం లారా అభిప్రాయం సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జరగనున్న టి20 ప్రపంచకప్‌లో భారత్ కూడా గట్టిపోటీదారని విండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారా అభిప్రాయపడ్డాడు. టోర్నీలో ధోనిసేన ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుందన్నాడు. ‘స్వదేశంలో భారత్ జట్టు చాలా ప్రమాదకరమైంది. 2011లో ధోని నేతృత్వంలోని జట్టు వరల్డ్‌కప్ గెలవడమే ఇందుకు నిదర్శనం. జట్టులో కుర్రాళ్లతో పాటు భిన్నమైన ఆటగాళ్లు ఉన్నారు. సొంతగడ్డపై ఒత్తిడి అనేది ఎప్పుడూ ఉంటుంది. అయినప్పటికీ కుర్రాళ్లు దాన్ని జయిస్తారు. ఓవరాల్‌గా భారత్‌కు మరోసారి వరల్డ్‌కప్ గెలిచే మంచి అవకాశం వచ్చింది’ అని లారా పేర్కొన్నాడు. ప్రస్తుత విండీస్ జట్టుకు తను కోచ్‌గా, మెంటార్‌గా పనిచేసినా పెద్దగా మార్పులేమీ ఉండబోవని స్పష్టం చేశాడు. ‘సమస్య మూలం చాలా లోతుగా ఉంది. మౌలిక వసతులు చాలా అధ్వాన్నంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేను బాధ్యతలు స్వీకరించినా సమర్థంగా పని చేయలేను. ఎంతటి సమర్థుడైనా.. ఇప్పటికిప్పుడు తన మ్యాజిక్‌తో ఫలితాలను చూపెడతాడని భావించడంలేదు. అయితే విండీస్ జట్టులో కొంత మంది ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పుడు వస్తున్న కుర్రాళ్లలో నైపుణ్యానికి కొదువలేదు. బోర్డు పాలన బాగుంటే వాళ్లతో కలిసి అద్భుతాలు చేయొచ్చు. సమీప భవిష్యత్‌లోనైనా ఇది నెరవేరుతుందేమో చూడాలి’ అని లారా వ్యాఖ్యానించాడు. భారత్‌లో పర్యటించడం తనకు చాలా ఆనందాన్నిస్తుందన్నాడు. ‘క్రికెట్ ఆడే రోజుల్లో కూడా భారత్ అంటే నాకు చాలా ఇష్టం. భారత్‌లో అభిమానం ఎలా ఉంటుందో నా స్నేహితులు సచిన్, లక్ష్మణ్, ద్రవిడ్, ధోని, కోహ్లిలను చూస్తేనే అర్థమవుతుంది’ అని ఈ విండీస్ మాజీ కెప్టెన్ వివరించాడు. -
'విన్' డోర్ తెరుస్తారా!
తీవ్ర ఒత్తిడిలో భారత్ ఉత్సాహంగా సఫారీలు నేడు ఇండోర్‌లో రెండో వన్డే ఓడితే సిరీస్‌లో కోలుకోవడం కష్టం రెండేళ్ల క్రితం భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించినప్పుడు ఒక్క విజయం కూడా లేకుండా వెనుదిరిగింది. కానీ ఇప్పుడు ఆడుతోంది సొంతగడ్డపైనా లేక మళ్లీ దక్షిణాఫ్రికాలో అన్న తీరుగా ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటికే మూడు మ్యాచ్‌లలోనూ పరాజయం టీమిండియాను వెక్కిరించింది. మ్యాచ్ మ్యాచ్‌కీ ప్రత్యర్థి ఆత్మవిశ్వాసం పెరుగుతుంటే... మన శిబిరంలో ఆందోళన కనిపిస్తోంది. మరో మ్యాచ్ ఓడితే ఇక వన్డే సిరీస్‌లోనూ కోలుకోవడం మహా కష్టంగా మారిపోతుంది. ఈ నేపథ్యంలో జట్టు మళ్లీ గాడిలో పడాలంటే అత్యవసరంగా విజయం కావాలి. ఇండోర్: టి20 సిరీస్‌ను కోల్పోయి, తొలి వన్డేలోనూ ఓటమిపాలైన భారత జట్టు కీలక పోరుకు సన్నద్ధమైంది. ఇక్కడి హోల్కర్ స్టేడియంలో నేడు (బుధవారం) జరిగే రెండో వన్డేలో దక్షిణాఫ్రికాతో ధోని సేన తలపడుతుంది. ఈ మ్యాచ్ గనక చేజారితే సిరీస్‌లోని చివరి మూడు వన్డేలూ నెగ్గాల్సిన సవాల్ భారత్‌కు ఎదురవుతుంది. ప్రస్తుతం జట్టు ఫామ్‌తో అది అంత సులభం కాదు. కాబట్టి ఈ మ్యాచ్‌లో గెలిస్తే తర్వాతి దశలో సిరీస్ విజయంపై దృష్టి పెట్టవచ్చు. మరో వైపు దక్షిణాఫ్రికా తమ జోరును కొనసాగించాలని పట్టుదలగా ఉంది. హర్భజన్‌కు చాన్స్! ఈ పర్యటనలో దక్షిణాఫ్రికాను ఇబ్బంది పెట్టిన ఏకైక బౌలర్ అశ్విన్. పక్కటెముకల గాయంతో గత మ్యాచ్లోంచి మధ్యలోనే తప్పుకున్న అశ్విన్ ఈ మ్యాచ్‌లోగా కోలుకోనే అవకాశం కనిపించడం లేదు. దీనిపై అధికారికంగా మేనేజ్మెంట్నుంచి ప్రకటన లేకపోయినా...అతను ఆడకపోతే హర్భజన్‌కు తుది జట్టులో స్థానం లభిస్తుంది. టి20ల్లాగే గత వన్డేలోనూ పేసర్ల వైఫల్యం జట్టును దెబ్బ తీసింది. ఉమేశ్, భువీ ఇద్దరూ సమష్టిగా విఫలమయ్యారు. భువీ స్థానంలో మోహిత్‌కు అవకాశం దక్కవచ్చు. బ్యాటింగ్ విషయంలో భారత్ ఎప్పుడూ పటిష్టంగానే కనిపిస్తుంది. కానీ గత మ్యాచ్‌లో కీలక సమయంలో మిడిలార్డర్ రాణించలేకపోయింది. రోహిత్ శర్మ తిరుగులేని ఫామ్‌లో ఉండగా, మరో ఓపెనర్ ధావన్ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. రహానే మళ్లీ మూడో స్థానంలో ఆడటం ఖాయం. కానీ కోహ్లి, రైనాలు ఇంకా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేదు. గత మ్యాచ్‌లో అనూహ్యంగా కోహ్లి తడబడ్డాడు. ఆల్‌రౌండర్‌గా రెండు రంగాల్లోనూ విఫలమైన స్టువర్ట్ బిన్నీ ఇక్కడైనా రాణిస్తాడా చూడాలి. అయితే అన్నింటికంటే మరోసారి అందరి దృష్టి కెప్టెన్ ధోనిపైనే ఉంది. విమర్శకులు మళ్లీ తమ కత్తికి పదును పెడుతుండటంతో అటు బ్యాట్స్‌మన్‌గా, ఇటు కెప్టెన్‌గా కూడా అతను సత్తా చాటాల్సి ఉంది. డు ప్లెసిస్ అనుమానం! భారత్ పర్యటనకు వచ్చినప్పుడు తాము ఆరంభంలోనే ఆధిక్యం ప్రదర్శిస్తామని దక్షిణాఫ్రికా కూడా ఊహించి ఉండదు. కానీ ఆ జట్టు ఇప్పుడు వరుస విజయాలతో ఒక్కసారిగా ఫేవరెట్‌గా మారిపోయింది. ఫార్మాట్ ఏదైనా డివిలియర్స్ ముందు భారత బౌలర్లు నిలబడలేకపోతున్నారు. గత మ్యాచ్‌లో అది మరింత స్పష్టంగా కనిపించింది. ఒకటినుంచి ఏడో నంబర్ వరకు మిల్లర్ మినహా ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా రాణిస్తుండటం జట్టు బ్యాటింగ్‌ను పటిష్టంగా మార్చింది. గత ఆరు ఇన్నింగ్స్‌లలో ఒక్కసారి కూడా కనీసం 15 పరుగులు చేయలేకపోయిన మిల్లర్ తనను తాను నిరూపించుకోవాల్సి ఉంది. అయితే గత మ్యాచ్‌లో గాయపడిన డు ప్లెసిస్ కోలుకోకుంటేనే మిల్లర్‌కు మరో అవకాశం దక్కవచ్చు. ఒక వేళ ప్లెసిస్ సిద్ధమైతే మిల్లర్ స్థానంలో ఆల్‌రౌండర్ మోరిస్ గానీ కొత్త ఆటగాడు జోండోకు గానీ చోటు లభిస్తుంది. ముగ్గురు ప్రధాన పేసర్లతో పాటు స్పిన్నర్ తాహిర్ గత మ్యాచ్‌లాగే కీలక సమయంలో వికెట్లు తీసి ఆటను మలుపు తిప్పగల సమర్థుడు. ఓవరాల్‌గా దక్షిణాఫ్రికా అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. మ. గం. 1.30నుంచి స్టార్ స్పోర్ట్స్ 1, డీడీలలో ప్రత్యక్ష ప్రసారం జట్ల వివరాలు (అంచనా) భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, రహానే, కోహ్లి, రైనా, బిన్నీ, హర్భజన్, మిశ్రా, ఉమేశ్, భువనేశ్వర్/మోహిత్. దక్షిణాఫ్రికా: డివిలియర్స్ (కెప్టెన్), డి కాక్, ఆమ్లా, డు ప్లెసిస్, డుమిని, బెహర్దీన్, మిల్లర్/మోరిస్, స్టెయిన్, రబడ, మోర్కెల్, తాహిర్. గతంలో ఇక్కడ ఆడిన మూడు వన్డేల్లోనూ భారత్ విజయం సాధించింది. 2011 తర్వాత ఇక్కడ మ్యాచ్ జరుగుతోంది. పిచ్, వాతావరణం: హోల్కర్ మైదానం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే భారీ స్కోర్ల వేదిక. చిన్న మైదానం కావడంతో పాటు లాంగాన్, లాంగాఫ్ బౌండరీలు కూడా చిన్నవి. సెహ్వాగ్ వన్డే డబుల్ సెంచరీ కొట్టింది ఇక్కడే. మ్యాచ్ రోజు ఉదయం ఎక్కువ వేడి (37 డిగ్రీల వరకు), ఆ తర్వాత బాగా చల్లగా ఉండవచ్చు. వర్ష సూచన లేదు. మేం నంబర్‌వన్ జట్టుగా నిలవాలంటే చిన్న చిన్న తప్పులకు కూడా అవకాశం ఇవ్వకూడదు. కాబట్టి ఈ సారి అవే తప్పులు పునరావృతం చేయబోం. గతంలో ఇలాంటి ఎన్నో సందర్భాల్లో జట్టు కోలుకొని బాగా ఆడింది. చివరి ఓవర్లలో మా బౌలింగ్ విఫలమైన మాట వాస్తవం. అయితే డివిలియర్స్‌లాంటి బ్యాట్స్‌మన్‌కు బౌలింగ్ చేసేటప్పుడు మరింత తెలివిగా వ్యవహరించాలి. జట్టులోని బౌలర్లంతా బాగా ఆడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. టాపార్డర్ బ్యాట్స్‌మన్‌గా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవాల్సిన బాధ్యత నాది. అదే క్రమంలో భారీ స్కోర్లు సాధ్యమవుతున్నాయి. సెంచరీ కాగానే ఏకాగ్రత కోల్పోను. మైదానం రికార్డును బట్టి చూస్తే కనీసం 350 పరుగులైనా చేయవచ్చు’ -రోహిత్ శర్మ, భారత బ్యాట్స్‌మన్ ప్రస్తుతం రోహిత్ అద్భుతంగా ఆడుతున్నాడు. 20 పరుగులు దాటితే అతడిని ఆపడం కష్టమైపోతోంది కాబట్టి తొలి 10 బంతుల్లోనే అవుట్ చేయాలి. మా పేస్ విభాగంలో మార్పులు ఉండవు. కొత్త నిబంధనలు వచ్చాయి కాబట్టి తొలి 10 ఓవర్లు, చివరి 5 ఓవర్లు బ్యాట్స్‌మెన్‌ను నియంత్రించగలిగితే మ్యాచ్ గెలవొచ్చు. చిన్న మైదానం కాబట్టి బౌలర్లకు చాలా కష్టం. పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది’ -లాంగ్‌వెల్ట్, దక్షిణాఫ్రికా బౌలింగ్ కోచ్ -
తొలి సెషన్ కీలకం
అనిల్ కుంబ్లే క్రికెట్ అంటేనే అనిశ్చితికి మారుపేరు. అయితే భారత జట్టు మాత్రం మూడో టెస్టును శాసించే స్థితిలో ఉంది. ఇక శ్రీలంక జట్టు గెలవడానికి బదులు ఓటమి నుంచి తప్పించుకునేందుకు తమ చూపంతా వాతావరణంపైనే పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ జట్టు ఉన్న పరిస్థితి అలాంటిది. భారత బ్యాటింగ్‌లో మిడిల్, లోయర్ ఆర్డర్ కారణంగా జట్టు గౌరవప్రదమైన స్థితిలో నిలిచింది. నాలుగు రోజుల ఆటను గమనిస్తే... బ్యాట్స్‌మెన్‌కు సవాల్‌గా మారిన పిచ్‌పై నిలబడిన ఒకే ఒక్క టాపార్డర్ ఆటగాడు పుజారా. తొలి ఇన్నింగ్స్‌లో తన సెంచరీ అమూల్యం. లంక మాత్రం తమ పేసర్లను ఎక్కువ సేపు ఉపయోగించుకోవడంలో విఫలమైంది. ఓ ఎండ్‌లో స్పిన్నర్లు సుదీర్ఘంగా బౌలింగ్ చేయడం భారత బ్యాట్స్‌మెన్‌కు కలిసొచ్చింది. దీంతో విలువైన భాగస్వామ్యాలను నెలకొల్పే అవకాశం చిక్కింది. కష్టసాధ్యమైన లక్ష్య ఛేదనలో శ్రీలంక మరోసారి ఇషాంత్ దెబ్బను చవిచూడాల్సి వచ్చింది. తన లైనప్‌ను తగ్గించుకున్న అనంతరం ఇషాంత్ లాభపడ్డాడు. ఇప్పుడు తను కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌ను పాటిస్తున్నాడు. అయితే కొన్నిసార్లు అదుపు తప్పుతున్నాడు. ఇక చివరి రోజు మంగళవారం లంక ఆటలో మాథ్యూస్ వికెట్ కీలకం. రెండో టెస్టులోనూ భారత్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తొలి బంతికే అతడిని పెవిలియన్‌కు పంపి మ్యాచ్‌ను కాపాడుకుంది. చివరి రోజు తొలి సెషన్ చాలా కీలకం. ఇందులోనే లంక వికెట్లు తీసి ఒత్తిడిలోకి నెట్టాలి. శ్రీలంక జట్టు రెండో టెస్టును పోరాడలేక వదులుకుంది. పరిస్థితి చూస్తే ఇప్పుడు కూడా అలాంటి సన్నివేశమే పునరావృతమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఓవరాల్‌గా భారత్ ఈ టెస్టునే కాకుండా సిరీస్‌ను కూడా దక్కించుకునేందుకు సిద్ధంగా ఉంది. -
విజయానికి 7 వికెట్లు
శ్రీలంక గడ్డపై 22 ఏళ్ల టెస్టు సిరీస్ విజయం నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది. దిగ్గజ క్రికెటర్లు తమ కెరీర్లో సాధించలేకపోయిన ఘనతకు యువ భారత్ చేరువయింది. శ్రీలంకతో ఆఖరి టెస్టులో భారత్ జట్టు విజయం దిశగా సాగుతోంది. ఆఖరి రోజు ఏడు వికెట్లు తీస్తే... కోహ్లి ఖాతాలో తొలి టెస్టు సిరీస్ విజయం చేరుతుంది. భారీ వర్షం పడితేనో... అద్భుతమేదైనా జరిగితేనో తప్ప శ్రీలంక ఓటమి నుంచి గట్టెక్కడం కష్టం. - మూడో టెస్టులో గెలుపు దిశగా భారత్ - శ్రీలంక లక్ష్యం 386... ప్రస్తుతం 67/3 - సమష్టిగా రాణించిన భారత బ్యాట్స్‌మెన్ కొలంబో: నాటకీయ మలుపులు తిరుగుతోన్న మూడో టెస్టులో భారత్ జట్టు అన్ని విభాగాల్లోనూ ఆకట్టుకుంది. టాప్ ఆర్డర్ విఫలమైన చోట మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌తో పాటు టెయిలెండర్లు సమయోచితంగా రాణించడంతో... భారత జట్టు శ్రీలంకకు 386 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. బ్యాట్స్‌మెన్ కష్టానికి మరింత వన్నె తెస్తూ ఇషాంత్ శర్మ మరోసారి చెలరేగడంతో శ్రీలంక టాప్ ఆర్డర్ మరోసారి తడబడింది. సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (ఎస్ఎస్సీ) మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో నాలుగో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 18.1 ఓవర్లలో మూడు వికెట్లకు 67 పరుగులు చేసింది. సిల్వ (24 బ్యాటింగ్), మ్యాథ్యూస్ (22 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఇషాంత్ రెండు వికెట్లు, ఉమేశ్ ఒక్క వికెట్ తీశారు. అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 76 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటయింది. రోహిత్ (72 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్సర్), స్పిన్నర్ అశ్విన్ (87 బంతుల్లో 58; 7 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు. బిన్నీ (49), నమన్ ఓజా (35), అమిత్ మిశ్రా (39) రాణించారు. లంక బౌలర్లలో ప్రసాద్, ప్రదీప్ నాలుగేసి వికెట్లు తీసుకున్నారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 111 పరుగులు కలుపుకుని భారత్‌కు మొత్తం 385 పరుగుల ఆధిక్యం సమకూరింది. ఆట చివరి రోజు శ్రీలంక గెలవాలంటే మరో 319 పరుగులు చేయాలి. భారత్ గెలవాలంటే 7 వికెట్లు తీయాలి. సమష్టిగా... గౌరవప్రదంగా ఓవర్‌నైట్ స్కోరు 21/3తో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్ రోహిత్, కోహ్లి నిలకడగా ఆడటంతో భారీస్కోరు దిశగా సాగింది. కోహ్లి (21) అవుటైనా... రోహిత్, బిన్నీ కలిసి బాగా ఆడారు. ముఖ్యంగా బిన్నీ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. లంచ్ విరామానికి ముందు రోహిత్ అవుటైనా... నమన్ ఓజా, బిన్నీ కలిసి బాగా ఆడారు. లంచ్ తర్వాత ఈ ఇద్దరూ బాగా దూకుడు పెంచారు. ఈ క్రమంలో బిన్నీ ఒక్క పరుగు తేడాతో అర్ధసెంచరీని కోల్పోగా... ఓజా కూడా భారీ షాట్ ఆడబోయి అవుటయ్యాడు. దీంతో భారత్ 179 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. ఈ సమయంలో లంక శిబిరంలో మ్యాచ్‌పై ఆశలు పెరిగాయి. అయితే అశ్విన్, మిశ్రా అద్భుతంగా ఆడారు. ఈ స్పిన్నర్లిద్దరూ సమయోచితంగా స్ట్రయిక్ రొటేట్ చేయడంతో పాటు అడపాదడపా బౌండరీలతో ఎనిమిదో వికెట్‌కు 55 పరుగులు జోడించారు. మిశ్రా అవుటైన తర్వాత అశ్విన్... ఉమేశ్, ఇషాంత్‌ల సహాయంతో భారత్‌కు మంచి స్కోరు అందించి ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా టెయిలెండర్ల పుణ్యమాని 274 పరుగుల స్కోరుతో మ్యాచ్‌పై పట్టు బిగించింది. ఆరంభంలో వికెట్లు భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శ్రీలంకకు తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇషాంత్ బౌలింగ్‌లో తరంగ అవుటయ్యాడు. మరో ఎండ్‌లో ఉమేశ్ బౌలింగ్‌లో కరుణరత్నే కూడా పెవిలియన్‌కు చేరడంతో 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. చండీమల్ (17 బంతుల్లో 18; 3 ఫోర్లు) ఎదురుదాడి చేసే ప్రయత్నంలో ఇషాంత్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మరో ఓపెనర్ సిల్వ, మ్యా థ్యూస్ జాగ్రత్తగా ఆడి మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. వెలుతురు సరిగా లేకపోవడంతో మరో 4 ఓవర్లు ఉన్నా ఆట నిలిపివేశారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 312; శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 201; భారత్ రెండో ఇన్నింగ్స్: పుజారా (బి) ప్రసాద్ 0; రాహుల్ (బి) ప్రదీప్ 2; రహానే ఎల్బీడబ్ల్యు (బి) ప్రదీప్ 4; కోహ్లి (సి) తరంగ (బి) ప్రదీప్ 21; రోహిత్ (సి) ప్రదీప్ (బి) ప్రసాద్ 50; బిన్నీ (సి) తరంగ (బి) ప్రసాద్ 49; నమన్ ఓజా (సి) కరుణరత్నే (బి) హెరాత్ 35; అమిత్ మిశ్రా రనౌట్ 39; అశ్విన్ (సి) పెరీరా (బి) ప్రసాద్ 58; ఉమేశ్ (సి) హెరాత్ (బి) ప్రదీప్ 4; ఇషాంత్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (76 ఓవర్లలో ఆలౌట్) 274. వికెట్ల పతనం: 1-0; 2-2; 3-7; 4-64; 5-118; 6-160; 7-179; 8-234; 9-269; 10-274. బౌలింగ్: ప్రసాద్ 19-3-69-4; ప్రదీప్ 17-2-62-4; హెరాత్ 22-0-89-1; మాథ్యూస్ 6-3-11-0; కౌశల్ 12-2-41-0. శ్రీలంక రెండో ఇన్నింగ్స్: తరంగ (సి) నమన్ (బి) ఇషాంత్ 0; సిల్వ బ్యాటింగ్ 24; కరుణరత్నె (సి) నమన్ (బి) ఉమేశ్ 0; చండీమల్ (సి) కోహ్లి (బి) ఇషాంత్ 18; మ్యాథ్యూస్ బ్యాటింగ్ 22; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.1 ఓవర్లలో మూడు వికెట్లకు) 67. వికెట్ల పతనం: 1-1; 2-2; 3-21. బౌలింగ్: ఇషాంత్ 7-2-14-2; ఉమేశ్ 5-1-32-1; బిన్నీ 4-1-13-0; మిశ్రా 2-0-2-0; అశ్విన్ 0.1-0-4-0. -
వరల్డ్ గ్రూప్ ప్లేఆఫ్‌లో చోటుపై భారత్ దృష్టి
నేటి నుంచి కివీస్‌తో డేవిస్ కప్ పోరు క్రైస్ట్‌చర్చ్: ప్రత్యర్థి జట్టు కంటే అక్కడి వాతావరణం నుంచే ఎక్కువ సవాలు ఎదురుకానున్న నేపథ్యంలో భారత్ జట్టు డేవిస్ కప్ పోరుకు సిద్ధమైంది. నేటి నుంచి జరగనున్న ఆసియా ఓసియానియా గ్రూప్-1లో రెండో రౌండ్లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇందులో గెలిచిన జట్టు వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. పేపర్ మీద బలంగా కనిపిస్తున్న భారత్ జట్టు... ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే కివీస్‌లో ఉష్ణోగ్రత 5 నుంచి 7 డిగ్రీలు మాత్రమే నమోదవుతోంది. ఈ ప్రతికూలతను అధిగమించి కివీస్‌ను ఏ మేరకు నిలువరిస్తుందన్నదే ఇప్పుడు ఆసక్తికర అంశం. మ్యాచ్‌లన్నీ ఇండోర్ స్టేడియంలో జరిగినా ఇప్పటి వరకు భారత ఆటగాళ్లు ఇలాంటి పరిస్థితుల్లో ఆడలేదు. కివీస్‌తో తలపడిన చివరి నాలుగుసార్లూ భారత్ ఓడిపోలేదు. చండీగఢ్‌లో ఆడినప్పుడైతే 5-0తో వైట్‌వాష్ చేసింది. ఇప్పుడు కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. శుక్రవారం జరిగే తొలి సింగిల్స్‌లో ప్రపంచ 148వ ర్యాంకర్ సోమ్‌దేవ్... ప్రపంచ 345వ ర్యాంకర్ జోస్ సాంతమ్‌తో; రెండో సింగిల్స్‌లో 151వ ర్యాంకర్ యూకీ బాంబ్రీ... 548వ ర్యాంకర్ మైకేల్ వీనస్‌తో తలపడతారు. శనివారం జరిగే డబుల్స్‌లో రోహన్ బోపన్న-సాకేత్ మైనేని... మార్కస్ డానియెల్-అర్టెమ్ సీతక్లను ఎదుర్కొంటారు. ఆదివారం జరిగే రివర్స్ సింగిల్స్‌లో సోమ్‌దేవ్.. వీనస్‌తో; యూకీ... సాంతమ్‌తో అమీతుమీ తేల్చుకుంటారు. -
ఓ పనైపోయింది!
రెండో వన్డేలోనూ భారత్ గెలుపు ♦ జింబాబ్వేపై 2-0తో సిరీస్ వశం ♦ రాణించిన విజయ్, రహానే, రాయుడు తొలి వన్డేలో తడబడ్డా... రెండో వన్డేలో భారత కుర్రాళ్లు సత్తా చూపించారు. అన్ని రంగాల్లోనూ జింబాబ్వేపై పూర్తి ఆధిపత్యం కనబరిచి అద్భుత విజయంతో సిరీస్‌ను గెలుచుకున్నారు. ఇక నామమాత్రపు చివరి వన్డేలో మిగిలిన రిజర్వ్లనూ పరిశీలిస్తే సరిపోతుంది. హరారే : జింబాబ్వేపై సిరీస్ గెలవడానికి భారత్‌కు ద్వితీయ శ్రేణి జట్టు సరిపోయింది. రెండో వన్డేలోనే సిరీస్ గెలిచి రహానే సేన ఓ పని పూర్తి చేసింది. మురళీ విజయ్ (95 బంతుల్లో 72; 1 ఫోర్, 2 సిక్సర్లు), కెప్టెన్ రహానే (83 బంతుల్లో 63; 7 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించడంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 62 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది. టాస్ గెలిచి ఆతిథ్య జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా... భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 271 పరుగులు చేసింది. తొలి మ్యాచ్ సెంచరీ హీరో రాయుడు (50 బంతుల్లో 41; 3 ఫోర్లు) ఫామ్‌ను కొనసాగించగా, మనోజ్ తివారీ (26 బంతుల్లో 22; 1 సిక్స్), స్టువర్ట్ బిన్నీ (16 బంతుల్లో 25; 3 ఫోర్లు) మోస్తరుగా ఆడారు. విజయ్, రహానే తొలి వికెట్‌కు 112 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. తర్వాత నిలకడగా ఆడిన రాయుడు... విజయ్‌తో కలిసి రెండో వికెట్‌కు 47; తివారీతో కలిసి మూడో వికెట్‌కు 44 పరుగులు జోడించాడు. చివర్లో బిన్నీ, జాదవ్ (16) ఆరో వికెట్‌కు 17 బంతుల్లో 31 పరుగులు జోడించడంతో ప్రత్యర్థి ముందు భారత్ మంచి లక్ష్యాన్ని ఉంచగలిగింది. మద్జీవా 4 వికెట్లు తీశాడు. తర్వాత జింబాబ్వే 49 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటై ఓడింది. చిబాబా (100 బంతుల్లో 72; 9 ఫోర్లు) టాప్ స్కోరర్. ముత్తుబామి (32), క్రెమెర్ (27), సీన్ విలియమ్స్ (20)తో సహా మిగతా వారు విఫలమయ్యారు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వేకు సరైన ఆరంభం లభించలేదు. విలియమ్స్‌తో నాలుగో వికెట్‌కు 52 పరుగులు జోడించిన చిబాబా... రజా (18)తో ఐదో వికెట్‌కు 35 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. భారత బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఓ దశలో ఆతిథ్య జట్టు 132 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. అయితే ముత్తుబామి, క్రెమెర్‌లు ఏడో వికెట్‌కు 52 పరుగులు జోడించినా... రన్‌రేట్ పెరిగిపోవడంతో జింబాబ్వేకు ఓటమి తప్పలేదు. భువనేశ్వర్ 4 వికెట్లు తీశాడు. మురళీ విజయ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య మూడో వన్డే మంగళవారం జరుగుతుంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రహానే (సి) రజా (బి) చిబాబా 63; విజయ్ (సి) సబ్ వాలర్ (బి) మద్జీవా 72; రాయుడు (సి) సబ్ వాలర్ (బి) రజా 41; తివారీ (సి) విటోరి (బి) తిరిపానో 22; ఉతప్ప (బి) మద్జీవా 13; బిన్నీ (సి) రజా (బి) విటోరి 25; జాదవ్ (సి) ముత్తుబామి (బి) మద్జీవా 16; హర్భజన్ నాటౌట్ 5; అక్షర్ పటేల్ (సి) రజా (బి) మద్జీవా 1; భువనేశ్వర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: (50 ఓవర్లలో 8 వికెట్లకు) 271. వికెట్ల పతనం: 1-112; 2-159; 3-203; 4-205; 5-233; 6-264; 7-266; 8-269. బౌలింగ్: విటోరి 8-0-47-1; తిరిపానో 9-0-42-1; మద్జీవా 10-0-49-4; విలియమ్స్ 5-0-23-0; క్రెమెర్ 5-0-32-0; చిబాబా 5-0-27-1; మసకద్జా 4-0-26-0; సికిందర్ రజా 4-0-25-1. జింబాబ్వే ఇన్నింగ్స్: సిబండా (సి) విజయ్ (బి) ధవల్ 2; చిబాబా రనౌట్ 72; మసకద్జా (సి) ఉతప్ప (బి) భువనేశ్వర్ 5; చిగుంబురా (సి) రహానే (బి) భువనేశ్వర్ 9; సీన్ విలియమ్స్ (బి) అక్షర్ 20; రజా (సి) ఉతప్ప (బి) హర్భజన్ 18; ముత్తుబామి (సి) అక్షర్ (బి) బిన్నీ 32; క్రెమెర్ (సి) రహానే (బి) భువనేశ్వర్ 27; మద్జీవా రనౌట్ 0; తిరిపానో (సి) అక్షర్ (బి) భువనేశ్వర్ 6; విటోరి నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: (49 ఓవర్లలో ఆలౌట్) 209. వికెట్ల పతనం: 1-24; 2-31; 3-43; 4-95; 5-130; 6-132; 7-184; 8-186; 9-195, 10-209. బౌలింగ్: భువనేశ్వర్ 10-3-33-4; ధవల్ 9-1-39-1; హర్భజన్ 10-0-29-1; బిన్నీ 7-0-42-1; అక్షర్ పటేల్ 10-1-40-1; విజయ్ 3-0-18-0. -
సిరీస్ విజయంపై గురి
మధ్యాహ్నం గం. 12.30 నుంచి టెన్ క్రికెట్లో ప్రత్యక్ష ప్రసారం నేడు జింబాబ్వేతో భారత్ రెండో వన్డే హరారే: తొలి వన్డేలో జింబాబ్వే ఎదురుదాడి నుంచి తృటిలో తప్పించుకున్న భారత్ జట్టు ఇప్పుడు రెండు అంశాలపై దృష్టిసారించింది. వీలైనంత త్వరగా మిడిలార్డర్ వైఫల్యాన్ని అధిగమించాలని భావిస్తున్న టీమిండియా రెండో వన్డేతోనే సిరీస్‌ను గెలిచి ఒత్తిడి లేకుండా మూడో మ్యాచ్ ఆడాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు (ఆదివారం) జింబాబ్వేతో జరగనున్న రెండో వన్డేలో భారత్ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. తొలి వన్డేలో రాయుడు మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలం కావడం మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. సింగిల్ డిజిట్‌కే పరిమితమైన మురళీ విజయ్, మనోజ్ తివారీ, ఉతప్ప, కేదార్ జాదవ్‌లు కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గాడిలో పడతారేమో చూడాలి. కెరీర్లో తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రహానే కూడా తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. రాయుడు, బిన్నీలు ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశమే అయినా జింబాబ్వేలాంటి ప్రత్యర్థిపై కనీసం మూడొందలకు పైగా స్కోరు చేయాలి. లేదంటే ఊహించని పరాజయం తప్పకపోవచ్చు. ఇక బౌలింగ్‌లో అక్షర్ పటేల్, స్టువర్ట్ బిన్నీ ఫర్వాలేదనిపించినా.. పేసర్లు గాడిలో పడాల్సి ఉంది. భువనేశ్వర్ పరుగులు నియంత్రిస్తున్నా వికెట్లు తీయలేకపోతున్నాడు. ధవల్ రెండింటిలోనూ నిరాశపరుస్తున్నాడు. సీనియర్ ఆటగాడు హర్భజన్ ఫామ్‌లోకి రావడం జట్టుకు అత్యంత అవసరం. మరోవైపు జింబాబ్వే స్ఫూర్తిదాయకమైన ఆటతీరుతో చెలరేగుతోంది. భారీ లక్ష్యం కళ్లముందున్నా... కెప్టెన్ చిగుంబురా చూపిన తెగువ అమోఘం. సహచరుల నుంచి అతనికి ఇంకాస్త సహకారం అందితే ఈ సిరీస్‌లో భారత్ పరాజయం తప్పకపోవచ్చేమో. తొలి మ్యాచ్‌ను తృటిలో చేజార్చుకున్నా... రెండో వన్డేలో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని జింబాబ్వే కృతనిశ్చయంతో ఉంది. మసకద్జా, సికిందర్ రజా, సీన్ విలియమ్స్, సిబండా, చిబాబా కుదురుకుంటే భారీ స్కోరు ఖాయం. బౌలర్లు ఓ మోస్తరుగా రాణిస్తున్నా... మంచి భాగస్వామ్యాలను విడగొట్టలేకపోవడం నిరాశ కలిగించే అంశం. -
భారత్‌కు రెండో విజయం
ప్రపంచ పురుషుల టీమ్ చెస్ సాగ్‌కద్జోర్ (ఆర్మేనియా): ప్రపంచ పురుషుల టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. హంగేరితో జరిగిన నాలుగో రౌండ్లో భారత్ 2.5-1.5 తేడాతో గెలి చింది. పెంటేల హరికృష్ణ, పీటర్ లెకో గేమ్ 22 ఎత్తుల్లో; సేతరామన్, ఎర్దోస్ గేమ్ 21 ఎత్తుల్లో; శశికిరణ్, అల్మాసీ గేమ్ 39 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. నాలుగో గేమ్‌లో విదిత్ 64 ఎత్తుల్లో రాపోట్‌ను ఓడించి భారత్‌కు విజయాన్ని అందించాడు. రష్యా చేతిలో భారత్ ఓటమి మరోవైపు చైనాలో జరుగుతున్న ప్రపంచ మహిళల టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో ఓటమి ఎదురైంది. రష్యా జట్టుతో బుధవారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో భారత్ 1.5-2.5 తేడాతో ఓడింది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 60 ఎత్తుల్లో ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్‌ను ఓడించగా... ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి 42 ఎత్తుల్లో వాలెంటినా గునీనా చేతిలో పరాజయం పాలైంది. పద్మిని రౌత్, అలెగ్జాండ్రా గొర్యాచికినాల మధ్య గేమ్ 55 ఎత్తుల్లో ‘డ్రా’ కాగా... సౌమ్య స్వామినాథన్ 76 ఎత్తుల్లో ఓల్గా గిర్యా చేతిలో ఓడిపోయింది. గురువారం జరిగే ఐదో రౌండ్లో అమెరికాతో భారత్ తలపడుతుంది. -
భారత్‌కు ప్రమోషన్