దక్షిణాసియా వాలీబాల్ విజేత భారత్ | Volleyball champion South India | Sakshi
Sakshi News home page

దక్షిణాసియా వాలీబాల్ విజేత భారత్

Published Wed, Dec 24 2014 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM

దక్షిణాసియా వాలీబాల్ విజేత భారత్

దక్షిణాసియా వాలీబాల్ విజేత భారత్

త్రిపురేశ్వర్ (నేపాల్): మొదటి దక్షిణాసియా మహిళల వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు విజేతగా నిలిచింది. మంగళవారం ఇక్కడ జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 25-13, 25-6, 25-8తో బంగ్లాదేశ్‌పై నెగ్గింది.
 
 టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు ఆడిన భారత్, అన్నీ గెలిచి మొత్తం 12 పాయింట్లతో టైటిల్ సొంతం చేసుకుంది. టోర్నీలో భారత్ ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. నేపాల్‌కు రెండో స్థానం లభించింది. ఐదు జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో విజేత భారత్‌కు 2 వేల డాలర్లు ప్రైజ్‌మనీ లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement