ఫతుల్లా: ఇటు భారత్ జట్టు ఆస్ట్రేలియాపై పరుగుల వర్షం కురిపిస్తుంటే... అటు పక్కనే ఉన్న బంగ్లాదేశ్ కూడా తమ స్థాయిలో పరుగుల సంచలనం సృష్టించింది. న్యూజిలాండ్‌పై 308 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఆ జట్టు చరిత్రలో 300పై చిలుకు లక్ష్యాన్ని ఛేదించడం ఇది రెండోసారి. 2009లో జింబాబ్వేపై 313 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లాదేశ్ 3-0తో క్లీన్‌స్వీప్ చేయడం విశేషం. 2010లోనూ బంగ్లాదేశ్ 4-0తో కివీస్‌ను ఓడించింది.
ఒస్మాన్‌అలీ స్టేడియంలో ఆదివారం జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్ 4 వికెట్ల తేడాతో కివీస్‌ను ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 307 పరుగులు చేసింది.
రాస్ టేలర్ (93 బంతుల్లో 107 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ సెంచరీతో రాణించాడు. మున్రో (77 బంతుల్లో 85; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ చేశాడు. అనంతరం బంగ్లాదేశ్ 49.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ షంషుర్ (107 బంతుల్లో 96; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. నయీమ్ ఇస్లామ్ (63), నాసిర్ హొస్సేన్ (44) రాణించారు.
బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్
Published Mon, Nov 4 2013 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 12:15 AM
Advertisement
Advertisement