టీ20 వరల్డ్‌కప్ 2024 సూపర్-8 దశలో పెను సంచనలం నమోదైన విషయం తెలిసిందే. గ్రూప్-1లో భాగంగా ఇవాళ (జూన్ 23) జరిగిన మ్యాచ్‌లో అండర్ డాగ్ ఆఫ్ఘనిస్తాన్.. మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు ఊహించని షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో ఆస్ట్రేలియా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకోగా.. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి, ఒకదాంట్లో ఓడిన (భారత్ చేతిలో) ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ అవకాశాలను మెరుగుపర్చుకుంది.
ఇలా జరిగితే ఆసీస్ ఇంటికే..!
భారత్‌తో జరుగబోయే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడి.. ఆతర్వాత జరుగబోయే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధిస్తే.. ఆస్ట్రేలియా ఇంటికి, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరుతాయి.
ఇలా జరిగినా ఆసీస్ ఇంటికే..!
ఒకవేళ భారత్‌తో రేపు జరిగే మ్యాచ్‌లో ఆసీస్ ఓ మోస్తరు తేడాతో గెలుపొందినా సెమీస్ చేరుతుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే.. తదుపరి బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ భారీ తేడాతో గెలిస్తే.. అప్పుడు భారత్, ఆసీస్, ఆఫ్ఘన్ ఖాతాలో చెరి నాలుగు పాయింట్లు ఉంటాయి.
నెట్ రన్‌రేట్ ఆధారంగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరుకుంటాయి. ప్రస్తుతం భారత్ నెట్ రన్ రేట్ (2.425) మిగతా జట్లకంటే మెరుగ్గా ఉంది కాబట్టి.. ఆస్ట్రేలియా చేతిలో ఓడినా టీమిండియా సెమీస్ అవకాశాలకు ఎలాంటి ఢోకా ఉండదు. బంగ్లాదేశ్‌పై భారీ విజయం సాధిస్తే అప్పుడు భారత్‌తో పాటు ఆఫ్ఘన్ సెమీస్‌కు చేరుతుంది.
ఆసీస్ సెమీస్‌కు చేరాలంటే ఇలా జరగాలి..
గ్రూప్-1 నుంచి ఆసీస్ సెమీస్‌కు చేరాలంటే రేపు జరుగబోయే మ్యాచ్‌లో భారత్‌ను ఓడించాలి. అలాగే బంగ్లాదేశ్ చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోవాలి. ఇలా జరిగితే భారత్, ఆసీస్ సెమీస్‌కు చేరుకుంటాయి. ఆఫ్ఘనిస్తాన్ ఇంటి ముఖం పడుతుంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన బంగ్లాదేశ్ సెమీస్‌కు చేరడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. అయితే టెక్నికల్‌గా ఆ జట్టుకు కూడా ఇంకా సెమీస్ అవకాశాలు ఉన్నాయి (ఆస్ట్రేలియాపై భారత్.. ఆఫ్ఘనిస్తాన్‌పై బంగ్లాదేశ్ భారీ తేడాలతో గెలవాలి).
Comments
Please login to add a commentAdd a comment