semi final
-
వెంకటేశ్ అయ్యర్ ఆల్‌రౌండ్ షో.. సెమీస్‌లో మధ్యప్రదేశ్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024 సెమీఫైనల్లో మధ్యప్రదేశ్ అడుగుపెట్టింది. ఈ టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 6 వికెట్ల తేడాతో సౌరాష్ట్రను చిత్తు చేసిన మధ్యప్రదేశ్.. తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. సౌరాష్ట్ర బ్యాటర్లలో చిరాగ్ జాని(80) టాప్ స్కోరర్‌గా నిలవగా.. హర్విక్ దేశాయ్917), మన్కడ్916) రాణించారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో వెంకటేశ్ అయ్యర్, అవేష్ ఖాన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. త్రిపురేష్ సింగ్, రాహుల్ బాథమ్, శుక్లా తలా వికెట్ సాధించారు.అదరగొట్టిన అర్పిత్, అయ్యర్.. అనంతరం 174 పరుగుల లక్ష్యాన్ని మధ్యప్రదేశ్ 4 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో చేధించింది. మధ్యప్రదేశ్ బ్యాటర్లలో ఓపెనర్ అర్పిత్ గౌడ్(42) టాప్ స్కోరర్‌గా నిలవగా.. వెంకటేశ్ అయ్యర్(38 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. వీరితో పాటు హర్‌ప్రీత్ సింగ్ భాటియా(9 బంతుల్లో 22) మెరుపు మెరిపించాడు. సౌరాష్ట్ర బౌలర్లలో ఉనద్కట్, అనుకుర్ పన్వార్, జాని తలా వికెట్ సాధించారు. కాగా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన వెంకటేశ్ అయ్యర్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. మరోవైపు సెమీఫైనల్లో మధ్యప్రదేశ్ ప్రత్యర్ధి ఎవరో బెంగాల్, బరోడా మ్యాచ్‌తో తేలనుంది.చదవండి: PAK vs SA: షాహీన్ అఫ్రిది ప్రపంచ రికార్డు.. -
సెమీఫైనల్లో సాకేత్–రామ్ జోడీ
సాక్షి, హైదరాబాద్: సియోల్ ఓపెన్ ఏటీపీ–100 చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఈ టోరీ్నలో పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ జంట 6–3, 6–1తో యోంగ్ సియోక్ జియోంగ్–యుసంగ్ పార్క్ (దక్షిణ కొరియా) జోడీపై గెలిచింది. 59 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్–రామ్ జంట నాలుగు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగు సార్లు బ్రేక్ చేసింది. నేడు జరిగే సెమీఫైనల్లో జిసుంగ్ నామ్ (దక్షిణ కొరియా)–జోషువా పారిస్ (బ్రిటన్) జంటతో సాకేత్–రామ్‌కుమార్ ద్వయం ఆడుతుంది. ఇదే టోర్నీలో ఆడుతున్న హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ భారత్‌కే చెందిన తన భాగస్వామి నిక్కీ కలియంద పూనాచా జోడీ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ అనిరు«ద్–నిక్కీ జంట 1–6, 3–6తో జిసుంగ్ నామ్ (దక్షిణ కొరియా)–జోషువా పారిస్ (బ్రిటన్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
T20 WC 2024: సెమీస్‌లో ఆసీస్-దక్షిణాఫ్రికా ఢీ
మహిళల టి20 ప్రపంచకప్ అంటే మొదటగా గుర్తొచ్చే పేరు ఆ్రస్టేలియానే. అంతలా పొట్టి ప్రపంచకప్‌లో దుర్బేధ్యమైన జట్టుగా ప్రత్యర్థుల్ని హడలెత్తిస్తోంది. ఆరు టైటిళ్లతో అరుదైన ముద్ర వేసుకుంది. ఇప్పుడు తాజా మెగా ఈవెంట్లోనూ తమకు షరామామూలైన ఫైనల్ బెర్త్‌ను సాధించే పనిలో ఉంది. గురువారం దక్షిణాఫ్రికాతో తొలి సెమీఫైనల్ సమరానికి సిద్ధమైంది. ఇందులో చిత్రమేమిటంటే ఈ మెగా ఈవెంట్ చరిత్రలోనే కేవలం ఒక్కసారి ఫైనల్ చేరిన జట్టు... ఒకే ఒక్కసారి మాత్రమే టైటిల్ పోరుకు అర్హత సాధించని హాట్ ఫేవరెట్ ఆ్రస్టేలియాను ‘ఢీ’కొట్టబోతోందిమహిళల టి20 ప్రపంచకప్ 2009లో మొదలైతే... ఆ ప్రథమ టైటిల్ పోరుకు మాత్రమే ఆ్రస్టేలియా అర్హత సాధించలేదు. తర్వాత జరిగిన ఏడు ప్రపంచకప్‌లలోనూ వరుసబెట్టి తుదిపోరుకు చేరిన కంగారూ జట్టు ప్రత్యర్థుల్ని కంగారు పెట్టించి మరీ ఆరు టైటిళ్లను సాధించింది. ఇందులో రెండుసార్లు (2010, 2012, 2014; 2018, 2020, 2023) ‘హ్యాట్రిక్’ టైటిల్స్ ఉండటం మరో విశేషం. గత మెగా ఈవెంట్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు అమీతుమీ తేల్చుకుంటే సొంతగడ్డపై కూడా సఫారీకి ఓటమి తప్పలేదు. తాజా టోర్నీలోలో ఇరుజట్లు సెమీస్‌లో తలపడుతుండటంతో గత పరాభవానికి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో సఫారీ అమ్మాయిలు ఉన్నారు. కానీ ఈ టోరీ్నలో అజేయంగా దూసుకెళ్తున్న ఫేవరెట్‌ను ఓడించడం అంతసులువు కానేకాదని దక్షిణాఫ్రికా శిబిరానికి బాగా తెలుసు. దీనికి తగిన ఎత్తుగడలతో బరిలోకి దిగాలని చూస్తోంది. మరోవైపు గత ప్రపంచకప్ ఆడిన 11 మందిలో ఒక్క మెగ్ లానింగ్ (రిటైర్డ్) మినహా మిగతా పది మంది కూడా అందుబాటులో ఉండటం జట్టుకు లాభించే అంశం. ఆసీస్ అంటేనే ఆల్‌రౌండ్ జట్టు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉంది. అమ్మాయిలంతా ఫామ్‌లో ఉండటంతో ఆసీస్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. -
న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓటమి.. భారత్ సెమీస్ చేరాలంటే?
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024 టోర్నీని భారత జట్టు ఘోర ఓటమితో ఆరంభించింది. శుక్రవారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 58 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 102 పరుగులకే కుప్పకూలింది. ఈ ఓటమితో హర్మాన్ ప్రీత్ సారథ్యంలోని భారత జట్టు తమ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ మెగా ఈవెంట్లో భారత జట్టు.. గ్రూపు-ఎలో న్యూజిలాండ్, పాకిస్థాన్,శ్రీలంక, ఆస్ట్రేలియాతో పాటు కలిసి ఉంది. ప్రస్తుతం టీమిండియా -2.900 రన్‌రేట్‌తో గ్రూప్-ఏలో ఆఖరి స్థానంలో ఉంది.సెమీస్ చేరాలంటే?భారత్ సెమీస్ చేరే దారులు ఇంకా మూసుకుపోలేదు. ఒక్కో గ్రూపు నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు మాత్రమే సెమీఫైనల్‌కు ఆర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో ఇంకా భారత్‌కు మూడు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఉమెన్ ఇన్ బ్లూ తమ తదుపరి మ్యాచ్‌ల్లో పాక్, శ్రీలంక, ఆస్ట్రేలియాతో తలపడనుంది.భారత్ సెమీఫైనల్‌కు చేరాలంటే తమ తర్వాతి మ్యాచ్‌ల్లో పాకిస్తాన్, శ్రీలంకను భారీ తేడాతో ఓడించాలి. అప్పుడు భారత్ ఖాతాలో 4 పాయింట్లు చేరడమే కాకుండా రన్ రేట్ కూడా మెరుగుపడుతోంది. ఆ తర్వాత తమ చివరి లీగ్‌లో మ్యాచ్‌లో ఆసీస్‌పై భారత్ సాధారణ విజయం సాధించినా చాలు సెమీఫైనల్‌కు ఆర్హత సాధించవచ్చు. ఒకవేళ ఆసీస్‌పై భారత్ ఓడిపోతే.. న్యూజిలాండ్ తమ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌లలోనైనా పరాజయం పొందాలి. అప్పుడు మెరుగైన రన్-రేట్ కారణంగా భారత్‌కు సెమీఫైనల్ చేరే అవకాశం ఉంటుంది. కాగా గ్రూప్-ఏ నుంచి డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్ దక్కించుకోవడం దాదాపు ఖాయం. అయితే ఇదే సమయంలో ఆసీస్ మినహా పాక్, శ్రీలంక, న్యూజిలాండ్ తమ తదుపరి మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండు మ్యాచ్‌లు అయినా ఓడాలి. అప్పుడే ఈ మూడు జట్ల కంటే భారత్ పాయింట్లు ఎక్కువగా సాధించి సెమీస్‌లో అడుగు పెడుతోంది.చదవండి: అరంగేట్రంలోనే దుమ్ములేపిన సెహ్వాగ్ కుమారుడు -
Olympics: సెమీస్‌లో వినేశ్.. పతకం ఖాయం చేసే దిశగా
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ మరో సంచలన విజయం సాధించింది. మహిళల 50 కేజీల విభాగంలో సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ప్రిక్వార్టర్స్‌లో వరల్డ్ నంబర్ వన్, టోక్యో స్వర్ణ పతక విజేత సుసాకేకు షాకిచ్చిన వినేశ్.. క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది.ఈ క్రమంలో ఉక్రెయిన్ రెజ్లర్ లివాచ్‌తో తలపడ్డ వినేశ్ ఫొగట్.. శుభారంభం చేసింది. 4-0తో లీడ్‌లోకి వెళ్లింది. అయితే, లివాచ్ కూడా అంత తేలికగా తలొగ్గలేదు. ఈ క్రమంలో తన శక్తినంతటినీ ధారపోసిన వినేశ్ ఫొగట్.. ఆఖరికి లివాచ్‌ను 7-5తో ఓడించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది.వినేశ్ ఫొగట్ తదుపరి క్యూబాకు చెందిన రెజ్లర్ యుస్నెలిస్ గుజ్మాన్ లోపెజ్‌తో సెమీ పోరులో తలపడనుంది. మంగళవారం రాత్రి 10.15 నిమిషాలకు ఈ బౌట్ ఆరంభం కానుంది. కాగా వినేశ్ ఫొగట్ ప్రస్తుతం వరల్డ్ నంబర్ 65 ర్యాంకర్ కాగా.. వరుసగా వరల్డ్ నంబర్ వన్ సుసాకే, ఎనిమిదో సీడ్ లివాచ్‌లను ఓడించి... తన కెరీర్లో తొలిసారిగా ఒలింపిక్స్ సెమీస్‌కు చేరుకుంది. రియో 2016లో క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగిన వినేశ్.. టోక్యో 2020 ఒలింపిక్స్‌లో రెండో రౌండ్లోనే ఓడిపోయి.. రిక్తహస్తాలతో తిరిగి వచ్చింది.చదవండి: Olympics 2024: ఫైనల్లో నీరజ్ చోప్రా Vinesh Phogat in control💪The 🇮🇳 WRESTLER is closing on a semi-final spot in #Paris2024!#Cheer4Bharat & watch the Olympics LIVE on #Sports18 & stream FREE on #JioCinema📲#OlympicsonJioCinema #OlympicsonSports18 #JioCinemaSports #Wrestling #Olympics pic.twitter.com/mNajPsKh2V— JioCinema (@JioCinema) August 6, 2024 -
ఫైనల్ లక్ష్యంగా...
దంబుల్లా: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీలో జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత మహిళల జట్టు ఇప్పుడు ఫైనల్ వేటలో పడేందుకు సిద్ధమైంది. నేడు జరిగే తొలి సెమీఫైనల్లో గ్రూప్ ‘ఎ’ టాపర్, డిఫెండింగ్ చాంపియన్ భారత్... గ్రూప్ ‘బి’లో రెండో స్థానంలో నిలిచిన బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. రాత్రి ఏడు గంటలకు జరిగే రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్‌తో ఆతిథ్య శ్రీలంక జట్టు ఆడుతుంది. అజేయంగా హర్మన్‌సేన ఈ టోర్నీలో ‘హ్యాట్రిక్’ విజయాలతో అజేయంగా దూసుకెళ్తున్న భారత్ ఇక నాకౌట్ దశలోనూ ఇదే జోరును కొనసాగించాలనే లక్ష్యంతో ఉంది. ఓపెనర్లలో షఫాలీ వర్మ సూపర్ ఫామ్‌లో ఉండటం జట్టు విజయాలకు దోహదం చేస్తోంది. మరో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన, హేమలతలతో టాపార్డర్ పటిష్టంగా ఉంది. కెపె్టన్ హర్మన్‌ప్రీత్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్‌లు కూడా రాణిస్తుండటంతో బ్యాటింగ్ ఆర్డర్‌కు ఏ ఢోకా లేదు. లోయర్ ఆర్డర్లో దీప్తి శర్మ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కీలకంగా మారింది. రేణుకా సింగ్, పూజ వస్త్రకర్ నిలకడగా వికెట్లు తీస్తున్నారు. ముఖ్యంగా ఈ టోర్నీలో గట్టి ప్రత్యర్థి అయిన పాకిస్తాన్‌ను కట్టడి చేయడంలో ఈ ముగ్గురు కీలకపాత్ర పోషించారు. యూఏఈ, నేపాల్‌లపై భారీస్కోర్లు సాధించిన భారత మహిళల జట్టు ఈ నాకౌట్ దశలోనూ బంగ్లాదేశ్‌పై మరోభారీ స్కోరును నమోదు చేస్తే మిగతా పనిని బౌలర్లు సమర్థంగా పూర్తి చేస్తారు. సర్వశక్తులు ఒడ్డేందుకు... మరోవైపు బంగ్లాదేశ్ కూడా ఫైనల్ కోసం గట్టి పోరాటానికే సన్నద్ధమైంది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత్ మెడకు తమ స్పిన్ ఉచ్చు బిగించాలని చూస్తోంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ నహిదా అక్తర్, లెగ్ స్పిన్నర్ రబియా ఖాన్లు ఈ టోరీ్నలో చక్కగా రాణించారు. సెమీస్ మ్యాచ్‌లో పిచ్ ఏమాత్రం అనుకూలించినా... తమ మాయాజాలంతో భారత బ్యాటర్ల ఆటకట్టించే ఎత్తుగడలతో పాక్ సేన ఉంది. మలేసియాతో ఆడిన చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లా భారీస్కోరు (191/2) నమోదు చేసింది. టాపార్డర్ బ్యాటర్లు ముర్షిదా, దిలార, కెపె్టన్ నిగర్ సుల్తానా ఫామ్‌లోకి రావడం బంగ్లా శిబిరానికి కలిసొచ్చే అంశం. జట్లు (అంచనా) భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), షఫాలీ, స్మృతి మంధాన, హేమలత, జెమీమా, రిచాఘో‹Ù, దీప్తిశర్మ, అరుంధతి, రాధాయాదవ్, తనూజ, రేణుకా సింగ్. బంగ్లాదేశ్ మహిళల జట్టు: నిగర్ సుల్తానా (కెపె్టన్), ముర్షిదా, దిలార రుమానా, ఇష్మా తంజిమ్, రీతు మోని, రబియా, షోర్న, నహిదా, సబికున్ జాస్మిన్, జహనారా. -
సెమీస్ సమరం.. స్పెయిన్‌తో ఫ్రాన్స్ ఢీ! ఫైనల్ బెర్త్ ఎవరిదో?
‘యూరో’ కప్ ఫుట్‌బాల్ టోర్నీ-2024 తొలి సెమీఫైనల్‌కు సర్వం సిద్దమైంది. మంగళవారం అలియాంజ్ ఎరీనా వేదికగా జరగనున్న సెమీఫైనల్-1లో ఫ్రాన్స్, స్పెయిన్ జట్లు తాడో పేడో తెల్చుకోనున్నాయి. ఈ సెమీస్ పోరులో గెలిచి ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకోవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. స్పెయిన్ ఫైనల్‌కు చేరుతుందా?అయితే ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచి జోరు మీదున్న స్పెయిన్‌కు సెమీస్ ముందు గాయాలు, కార్డ్ సస్పెన్షన్ల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే కీలక మ్యాచ్‌కు ముందు రాబిన్ లే నార్మాండ్, డాని కార్వాజల్ ఇద్దరూ సస్పెండ్ అయ్యారు. మరోవైపు , యువ మిడ్‌ఫీల్డర్ పెడ్రీ టోని క్రూస్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. ఈ క్రమంలో డిఫెన్స్‌లో రాబిన్ లే నార్మాండ్, డాని కార్వాజల్ స్ధానాలను నాచో, జీసస్ నెవాస్ భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా పెడ్రీ ప్రత్యామ్నాయంగా వచ్చిన డాని ఓల్మో ప్లేయింగ్‌లో తన స్దానాన్ని సుస్థిరం చేసుకోనున్నాడు.స్పెయిన్ జోరును ఫ్రాన్స్ అడ్డుకుంటుందా?ఇక సెమీస్‌కు ముందు ఫ్రాన్స్ టీమ్‌లో ఎటవంటి గాయాలు, కార్డ్ సస్పెన్షన్లు లేవు. జట్టు మొత్తం క్లియర్‌గా ఉంది. కానీ ఫ్రాన్స్ సెమీస్‌కు వచ్చినప్పటికి తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. గోల్స్ సాధించడంలో ఫ్రాన్స్ తమ మార్క్ చూపించలేకపోయింది. కెప్టెన్ కైలియన్ ఎంబాపే గాయం కావడం ఫ్రాన్స్‌ను కాస్త దెబ్బతీసింది. అతడు తిరిగి జట్టులోకి వచ్చినప్పటి మునపటి జోరును ప్రదర్శించలేకపోతున్నాడు. సెమీఫైనల్లోనైనా ఎంబాపే సత్తాచాటుతాడో లేదో వేచి చూడాలి. కాగా సెమీఫైనల్ చేరే క్రమంలో స్పెయిన్ 11 గోల్స్ చేయగా... ఫ్రాన్స్ కేవలం మూడు గోల్స్ మాత్రమే సాధించింది. -
సెమీఫైనల్లో ఫ్రాన్స్
హాంబర్గ్: యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో మాజీ చాంపియన్ ఫ్రాన్స్ సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ ‘షూటౌట్’ ద్వారా మరో మాజీ విజేత పోర్చుగల్‌ను ఓడించింది. నిర్ణీత సమయంతో పాటు అదనపు సమయం ముగిశాక కూడా ఇరు జట్లు 0–0తో సమంగా నిలవగా షూటౌట్ అనివార్యమైంది. ఇందులో ఫ్రాన్స్ 5–3తో పోర్చుగల్‌పై విజయం సాధించింది. ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడైన క్రిస్టియానో రొనాల్డో తన జాతీయ జట్టు తరఫున ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. ఆరో సారి యూరో కప్‌లో బరిలోకి దిగిన రొనాల్డో ముందే ఇది తనకు చివరి యూరో అని ప్రకటించాడు. 2026 వరల్డ్ కప్‌లో 41 ఏళ్లు ఉండే అతను వరల్డ్ కప్ ఆడే అవకాశాలు దాదాపుగా లేవు! పేరుకు రెండు పెద్ద జట్లే అయినా ఈ క్వార్టర్స్ పోరు పెద్దగా ఉత్కంఠ, మలుపులు లేకుండా సాగింది. ఇరు జట్లూ కూడా డిఫెన్స్‌కే ప్రాధాన్యనివ్వడంతో ఆటలో వేగం కనిపించలేదు. అటు రొనాల్డో, ఇటు ఎంబాపె కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. పోర్చుగల్ ప్లేయర్లలో బ్రూనో ఫెర్నాండెజ్, వితిన్హ కొట్టిన షాట్లను ప్రత్యర్థి గోల్‌కీపర్ మైక్ మెగ్నన్ నిలువరించగా...ఫ్రాన్స్ ఆటగాళ్లు రాండల్, కామవింగాలకకు గోల్స్ అవకాశం వచి్చనా కీపర్ రూబెన్ డయాస్‌ను దాటి బంతి వెళ్లలేకపోయింది. అదనపు సమయంలో రొనాల్డో కొట్టిన ఒక కిక్ కూడా గోల్ బార్ మీదనుంచి వెళ్లిపోయింది. ఇక ఆ తర్వాత ఇరు జట్లు జాగ్రత్తగానే ఆడాయి. షూటౌట్లో తొలి నాలుగు ప్రయత్నాల్లో ఫ్రాన్స్ తరఫున డెంబెలె, ఫొఫానా, కౌండే, బార్కొలా గోల్స్ కొట్టగా...పోర్చుగల్ తరఫున రొనాల్డో, బెర్నార్డో సిల్వ, న్యూనో మెండెస్ గోల్ సాధించగా జోవో ఫెలిక్స్ విఫలమయ్యాడు. దాంతో స్కోరు ఫ్రాన్స్ పక్షాన 4–3తో నిలిచింది. ఐదో షాట్‌ను కూడా ఫ్రాన్స్ ప్లేయర్ హెర్నాండెజ్ గోల్ సాధించి తమ జట్టును గెలిపించాడు. మరో క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 2–1 తేడాతో ఆతిథ్య జర్మనీని ఓడించింది. శనివారం జరిగిన క్వార్టర్స్‌లో ఇంగ్లండ్ షూటౌట్లో 5–3తో స్విట్జర్లాండ్‌ను ఓడించి సెమీస్ చేరింది. -
టీ20 వరల్డ్‌కప్ 2024 తొలి సెమీఫైనల్.. ఏ జట్టు గెలిచినా రికార్డే..!
టీ20 వరల్డ్‌కప్ 2024 ఫైనల్ మ్యాచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఈ సారి ఫైనల్‌కు క్వాలిఫై అయ్యే మొదటి జట్టుకు ప్రపంచకప్ టోర్నీల్లో ఇది మొదటి ఫైనల్ అవుతుంది. భారతకాలమానం ప్రకారం రేపు (జూన్ 27) ఉదయం జరుగుబోయే తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లలో ఏ జట్టు ఫైనల్‌కు చేరినా రికార్డే అవుతుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు ప్రపంచకప్ టోర్నీల్లో (వన్డే, టీ20) ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరలేదు. సౌతాఫ్రికా పలు మార్లు సెమీఫైనల్‌కు చేరగా.. ఆఫ్ఘనిస్తాన్‌కు మాత్రం ఇదే తొలి సెమీఫైనల్.కాగా, ట్రినిడాడ్ వేదికగా సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య రేపు ఉదయం తొలి సెమీఫైనల్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు జూన్ 29 జరిగే ఫైనల్ మ్యాచ్‌కు అర్హత సాధిస్తుంది. మరోవైపు రెండో సెమీఫైనల్లో భారత్- ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రేపు రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తుంది. మ్యాచ్ జరిగే సమయానికి 88 శాతం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే.. సూపర్-8లో గ్రూప్ టాపర్‌గా ఉన్నందున్న టీమిండియా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే కూడా లేదు. మరోవైపు సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగే తొలి సెమీఫైనల్‌కు రిజర్వ్ డే ఉంది. ఒకవేళ రేపు సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా సాధ్యపడకపోయినా రిజర్వ్ డే అయిన 28న తేదీన మ్యాచ్‌ను జరిపిస్తారు. -
ఇంగ్లండ్‌తో సెమీస్.. రవీంద్ర జడేజాపై వేటు! స్టార్ బ్యాటర్‌కు చోటు
టీ20 వరల్డ్‌కప్-2024 తుది అంకానికి చేరుకుంది. మంగళవారం జరిగిన బంగ్లాదేశ్-అఫ్గానిస్తాన్ మ్యాచ్‌తో సూపర్-8 దశ ముగిసింది. గ్రూప్ ఏ నుండి భారత్,అఫ్ఘానిస్థాన్ జట్లు సెమిస్ కు చేరగా..గ్రూప్ బినుండి సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు సెమిస్ కు చేరాయి.భారత కాలమానం ప్రకారం గురువారం(జూన్ 27) నుంచి నాకౌట్స్ దశ షూరూ కానుంది. తొలి సెమీఫైనల్లో అఫ్గానిస్తాన్- దక్షిణాఫ్రికా జట్లు అమీతుమీ తెల్చుకోగా.. రెండో సెమీఫైనల్లో భారత్- ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. తొలి సెమీఫైనల్ గురువారం ఉదయం 6:00 గంటలకు ప్రారంభం కాగా.. రెండో సెమీఫైనల్ రాత్రి 8:00 గంటలకు మొదలు కానుంది.ఇక సెకెండ్ సెమీఫైనల్ విషయానికి వస్తే.. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌ను ఎలాగైనా ఓడించి ఫైనల్లో అడుగుపెట్టాలని భారత్ భావిస్తోంది. ఇరు జట్లు బలబలాల పరంగా సమంగా ఉన్నాయి. కాబట్టి ఈ పోరులో ఎవరిది పైచేయి అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ కీలక మ్యాచ్‌లో భారత జట్టు మెనెజ్‌మెంట్ తమ తుది జట్టులో ఒకే మార్పు చేయనున్నట్లు తెలుస్తోంది. బౌలింగ్, బ్యాటింగ్ లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై వేటు వేయాలని మెనెజ్‌మెంట్ నిర్ణయించకున్నట్లు సమచారం. గయనా వికెట్‌కు బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశమున్నందన జడేజా స్థానంలో స్పెషలిస్ట్ బ్యాటర్ సంజు శాంసన్ ను జట్టులోకి తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జట్టులో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఉండడంతో జడ్డూను పక్కన పెట్టాలని ఫిక్స్ అయినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇక ప్రధాన జట్టులో ఉన్న సంజూ శాంసన్ ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాచదవండి: T20 WC: వారసుడిని ప్రకటించిన డేవిడ్ వార్నర్.. ఆసీస్ కొత్త ఓపెనర్ ఎవరంటే? -
బంగ్లాదేశ్ అత్యంత చెత్త రికార్డు.. ఏకైక జట్టుగా
టీ20 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్ అత్యంత చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఇప్పటివరకు అన్ని వరల్డ్‌కప్‌లు ఆడి ఒక్కసారి కూడా సెమీఫైనల్‌కు చేరని ఆ జట్టుగా బంగ్లాదేశ్ నిలిచింది. టీ20 ప్రపంచకప్-2024లో సూపర్-8లో రౌండ్లో నిష్క్రమించిన బంగ్లా జట్టు.. ఈ చెత్త రికార్డును మూటగట్టుకుంది. 2007లో జరిగిన తొట్టతొలి టీ20 వరల్డ్‌కప్ నుంచి ఈ మెగా టోర్నీలో భాగమవుతున్న బంగ్లాదేశ్ ఒక్కసారి కూడా సెమీస్‌లో అడుగుపెట్టలేకపోయింది. టాప్-10లో ఉన్న ఇతర 9 జట్లు కనీసం ఒక్కసారైనా టీ20 వరల్డ్‌కప్ సెమీస్‌కు చేరుకున్నాయి.భారత్, ఆసీస్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక, వెస్టిండీస్, అఫ్గానిస్తాన్ జట్లు ఏదో ఒక వరల్డ్‌కప్‌లోనైనా సెమీస్‌కు చేరాయి. చివరగా ఈ ఏడాది సూపర్-8లో సంచలన ప్రదర్శన చేసిన అఫ్గానిస్తాన్ తొలి సారి టీ20 వరల్డ్‌కప్ సెమీస్‌లో అడుగుపెట్టింది. టీ20 ప్రపంచకప్-2024లో 7 మ్యాచ్‌లు ఆడిన బంగ్లాదేశ్ కేవలం మూడింట మాత్రమే విజయం సాధించింది. -
T20 World Cup 2024: ఇలా జరిగితే ఫైనల్స్‌కు టీమిండియా..!
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా గయానా వేదికగా రేపు (భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు) జరగాల్సిన భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచ్‌కు వరుణ గండం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మ్యాచ్ జరిగే సమయానికి 88 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వెదర్ ఫోర్‌క్యాస్ట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే పరిస్థితి ఏంటి..?షెడ్యూల్ ప్రకారం భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే (ఒక్క బంతి కూడా పడకుండా) సూపర్-8 దశలో గ్రూప్ (గ్రూప్-1) టాపర్‌గా ఉన్న కారణంగా టీమిండియా ఫైనల్ చేరుతుంది.ఒకవేళ భారత్-ఇంగ్లండ్ సెమీస్ మ్యాచ్‌కు వర్షం కారణంగా పాక్షికంగా అంతరాయం కలిగితే.. ఫలితం తేలేందుకు 250 నిమిషాల అదనపు సమయం ఉంటుంది. ఇక్కడ కూడా ఫలితం తేలకపోతే డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఫలితాన్ని నిర్దారిస్తారు.తొలి సెమీఫైనల్‌కు రిజర్వ్ డేమరోవైపు సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ట్రినిడాడ్ వేదికగా రేపు ఉదయం 6 గంటలకు ప్రారంభంకావాల్సిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉండటంతో వంద శాతం ఫలితం తేలే అవకాశం ఉంది. -
సఫారీలకు సెమీస్ గండం.. ఈ సారైనా గట్టెక్కుతారా?
ఐసీసీ వరల్డ్‌కప్‌లలో అత్యంత దురదృష్టకరమైన జట్టు ఎదైనా ఉందంటే మనకు టక్కున గుర్తుచ్చేది దక్షిణాఫ్రికానే. టోర్నీ మొత్తం ఆసాధరణమైన ప్రదర్శన.. వరుసగా విజయాలు. కానీ కీలకమైన సెమీఫైనల్స్‌లో మాత్రం ఒత్తిడికి చిత్తు. ఇప్పటివరకు అటు వన్డే వరల్డ్‌కప్‌లోనూ, ఇటు టీ20 వరల్డ్‌కప్‌లోనూ కనీసం ఒక్కసారి కూడా ఫైనల్లో అడుగుపెట్టలేకపోయింది.ప్రతీసారి సెమీస్ లో ఓడిపోతూ చోకర్స్ గా ముద్రపడ్డ సఫారీలు మరోసారి టైటిల్ రేసులో నిలబడ్డారు. పొట్టి వరల్డ్‌కప్‌లలో ముచ్చటగా మూడోసారి సెమీస్‌లో సౌతాఫ్రికా అడుగుపెట్టింది. టీ20 వరల్డ్‌కప్-2024 తొలి సెమీఫైనల్లో భాగంగా ట్రినడాడ్ వేదికగా శుక్రవారం సంచలనాల అఫ్గానిస్తాన్‌తో దక్షిణాఫ్రికా తలపడనుంది.ఈ సారైనా గట్టుకెక్కుతుందా?ఓవరాల్‌గా వన్డే, టీ20 ప్రపంచకప్‌ల నాకౌట్స్‌లో దక్షిణాఫ్రికా 10 సార్లు తలపడింది. ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం మ్యాచ్‌లో మాత్రం విజయం సాధించింది. అది కూడా క్వార్టర్ ఫైనల్లో కావడం గమనార్హం. ఇక 8 మ్యాచ్‌ల్లో ఓటమి పాలవ్వగా.. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది.టీ20 వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు రెండు సార్లు సెమీఫైన్సల్ ఆడిన దక్షిణాఫ్రికా ఓసారి పాకిస్తాన్ చేతిలో ఓటమి పాలవ్వగా.. మరోసారి ఇండియా చేతిలో పరాజయం పాలైంది. కానీ ఈసారి మాత్రం తమ పేరిట ఉన్న చోకర్స్ ముద్రను ఎలాగైనా చెరేపేయాలన్న కసితో దక్షిణాఫ్రికా ఉంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆజేయంగా ఉన్న సౌతాఫ్రికా అదే జోరును సెమీస్‌లోనూ కొనసాగించి తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతోంది.దక్షిణాఫ్రికా బలబలాలు..దక్షిణాఫ్రికా బ్యాటింగ్ బౌలింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. బ్యాటింగ్‌లో క్వింటన్ డికాక్, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్ వంటి అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. ప్రస్తుతం వారు అంతా మంచి రిథమ్‌లో కూడా ఉన్నారు. అయితే కెప్టెన్ మార్క్రమ్ ఫామ్ మాత్రం ప్రోటీస్ జట్టు మెనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. అదేవిధంగా స్పిన్‌ను కూడా ఎదుర్కొనేందుకు సఫారీ బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడుతున్నారు. అఫ్గాన్ ప్రధాన బలం స్పిన్నర్లే. మరి అఫ్గాన్ స్పిన్నర్లు దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి. ఇక దక్షిణాఫ్రికా బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సఫారీ బౌలర్లు అదరగొడుతున్నారు. నోర్జే, రబాడ, జానెసన్ వంటి పేసర్లు ప్రత్యర్ధి జట్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ పేస్ త్రయం చెలరేగితే అఫ్గాన్ బ్యాటర్లకు కష్టాల్లు తప్పవు.అఫ్గాన్‌తో అంత ఈజీ కాదు..అయితే ప్రస్తుత వరల్డ్‌కప్‌లో సంచలనాలు నమోదు చేస్తున్న అఫ్గానిస్తాన్‌ను ఓడించడం దక్షిణాఫ్రికాకు అంత ఈజీ కాదు. ఈ మెగా టోర్నీలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు వంటి పటిష్టమైన జట్లను ఓడించి తొలిసారి సెమీస్‌లో అడుగుపెట్టిన అఫ్గాన్.. రెట్టింపు ఆత్మవిశ్వాసంతో సఫారీలను ఢీ కొట్టనుంది. అఫ్గాన్ బ్యాటింగ్ పరంగా కాస్త వీక్‌గా కన్పిస్తున్నప్పటకి బౌలింగ్‌లో మాత్రం బలంగా కన్పిస్తోంది. అఫ్గాన్ జట్టులో వరల్డ్‌క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు. అదేవిధంగా పేస్ బౌలింగ్‌లోనూ ఫరూఖీ, నవీన్ ఉల్ హక్ సత్తాచాటుతున్నారు. బ్యాటింగ్‌లో ఎక్కువగా ఓపెనర్లపైనే అఫ్గాన్ ఆధారపడుతోంది. సెమీస్‌లో ఆల్‌రౌండ్ షోతో అఫ్గాన్ అదరగొడితే దక్షిణాఫ్రికాకు ఇబ్బందులు తప్పవు. -
T20 World Cup: అఫ్‘గన్’ పేలింది
కన్నీళ్లు ఆగడం లేదు... భావోద్వేగాలను నియంత్రించుకోవడం సాధ్యం కావడం లేదు... పట్టరాని ఆనందాన్ని ప్రదర్శించేందుకు పదాలు దొరకడం లేదు... ఒకరు కాదు, ఇద్దరు కాదు అందరి ఆటగాళ్లది ఇదే పరిస్థితి... తాము సాధించిన ఘనత ఎంత అసాధారణమైనదో వారికి తెలుస్తున్నా ఇంకా నమ్మశక్యంగా అనిపించని స్థితి... సొంత దేశంలో క్రికెట్ మైదానంలో అడుగు పెట్టడమే కష్టంగా మారిపోగా... జట్టు సభ్యులంతా కలిసి సాధన చేసే అవకాశం లేకపోగా... ఎప్పుడో టోర్నీకి ముందు కలిసి ప్రాక్టీస్ చేయడమే... కానీ తమ పోరాటం, పట్టుదల ముందు వాటన్నంటినీ చిన్న విషయాలుగా మార్చేసింది. అగ్రశ్రేణి జట్లు క్రికెట్‌ను శాసిస్తున్న చోట అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ అసాధారణ ఆటను చూపించింది... అద్భుత ఆటతో సత్తా చాటుతూ ప్రపంచకప్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది.టోర్నీకి ముందు అంచనాలు లేవు... అండర్డాగ్ కిందే లెక్క.. కానీ లీగ్ దశలో న్యూజిలాండ్‌పై భారీ విజయం గాలివాటం కాదని, సూపర్–8లో ఆ్రస్టేలియాను చిత్తు చేసిన వైనం అదృష్టం వల్ల కాదని అఫ్గానిస్తాన్ నిరూపించింది... గత టి20 వరల్డ్‌కప్‌లో ఒక్క విజయానికి కూడా నోచుకోని జట్టు ఇప్పుడు ఏకంగా సెమీస్ చేరింది. బంగ్లాదేశ్‌తో చివరి సూపర్–8 పోరులో విజయం దోబూచులాడింది. 115 పరుగులు మాత్రమే చేసి దానిని కాపాడుకోవడం అంత సులువు కాదు. కానీ అఫ్గాన్ ఆటగాళ్లంతా ప్రాణాలు పణంగా పెట్టినట్లు మైదానంలో పోరాడారు... మళ్లీ మళ్లీ పలకరిస్తూ వచ్చిన వర్షంతో కూడా పోటీ పడాల్సి వచ్చి0ది... చివరకు తాము అనుకున్నది సాధించారు. బంగ్లాపై పైచేయి సాధించి తొలిసారి ఓ ఐసీసీ టోర్నీలో సగర్వంగా సెమీస్ స్థానాన్ని ఖాయం చేసుకోగా, తాము ఎప్పటికీ మారమన్నట్లుగా బంగ్లాదేశ్ ఆటగాళ్లు నిష్క్రమించారు. కింగ్స్టౌన్ (సెయింట్ విన్సెంట్): ‘కమాన్ బంగ్లాదేశ్’... భారత్‌తో ఓటమి తర్వాత ఆ్రస్టేలియా కెప్టెన్ మిచెల్ మార్‡్ష మాట ఇది. ఆల్‌టైమ్ గ్రేట్ జట్టు కూడా మరో టీమ్ ప్రదర్శనను నమ్ముకుంటూ అదృష్టం పలకరిస్తుందేమోనని ఆశపడింది. బంగ్లాదేశ్ గెలిస్తే తాము సెమీఫైనల్ చేరవచ్చని కంగారూలు కలగన్నారు. కానీ అఫ్గానిస్తాన్ ఆ అవకాశం ఇవ్వలేదు. మంగళవారం జరిగిన గ్రూప్–1 చివరి సూపర్–8 మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 8 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ ప్రకారం) బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం జరిగే తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాతో అఫ్గాన్ టీమ్... రాత్రి జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడతాయి. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. రహ్మనుల్లా గుర్బాజ్ (55 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. బంగ్లాదేశ్ స్పిన్నర్ రిషాద్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ మధ్యలో వర్షం రావడంతో ఒక ఓవర్ తగ్గించి లక్ష్యాన్ని 19 ఓవర్లలో 114 పరుగులుగా నిర్దేశించారు. అయితే బంగ్లాదేశ్ 17.5 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది. లిటన్ దాస్ (49 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) పోరాటం వృథా కాగా... జట్టులో నలుగురు డకౌటయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నవీన్ ఉల్ హక్ (4/26), కెపె్టన్ రషీద్ ఖాన్ (4/23) ప్రత్యర్థిని దెబ్బ కొట్టారు. తాజా ఫలితంతో గ్రూప్–1 నుంచి 2 విజయాలతో 4 పాయింట్లు సాధించిన అఫ్గానిస్తాన్ రెండో స్థానంతో సెమీస్ చేరింది. బంగ్లాదేశ్ ఓటమితో ఆస్ట్రేలియా జట్టు కూడా ‘సూపర్–8’ దశలోనే ఇంటిదారి పట్టింది. ఆద్యంతం ‘డ్రామా’ సాగి... స్వల్ప స్కోర్ల ఈ మ్యాచ్ పలు మలుపులతో ఆసక్తికరంగా సాగింది. పదే పదే వాన అంతరాయం కలిగించడంతో విజయం దోబూచులాడింది. అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో గుర్బాజ్ మినహా అంతా విఫలమయ్యారు. అతను కూడా తన శైలికి భిన్నంగా చాలా నెమ్మదిగా ఆడాడు. చివర్లో రషీద్ ఖాన్ (10 బంతుల్లో 19 నాటౌట్; 3 సిక్స్‌లు) మెరుపులతో స్కోరు 100 పరుగులు దాటింది. రన్‌రేట్‌లో అఫ్గాన్, ఆసీస్‌లను దాటి సెమీస్ చేరాలంటే 12.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించాల్సిన స్థితిలో బంగ్లాదేశ్ మైదానంలోకి దిగింది. అయితే సెమీస్ సంగతేమో కానీ ఆ జట్టు మ్యాచ్ గెలిచే అన్ని అవకాశాలను కూడా వృథా చేసుకుంది. ఫజల్ తన తొలి ఓవర్లోనే తన్జీద్ (0)ను అవుట్ చేయగా, నవీన్ వరుస బంతుల్లో నజు్మల్ (5), షకీబ్ (0)లను అవుట్ చేయడంతో స్కోరు 23/3 వద్ద నిలిచింది. ఈ దశలో వాన వచ్చి ఆగిన తర్వాత రషీద్ వరుస ఓవర్లలో సౌమ్య సర్కార్ (10), తౌహీద్ (14)లను వెనక్కి పంపించాడు. అయినా సరే చేతిలో 5 వికెట్లతో 56 బంతుల్లో 36 పరుగులు చేయాల్సిన బంగ్లాదేశ్ గెలిచే స్థితిలో నిలిచింది. కానీ రషీద్ మళ్లీ వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను తమ చేతుల్లోకి తెచ్చుకున్నాడు. 81/7 నుంచి బంగ్లా డక్‌వర్త్ లూయిస్ స్కోరుతో పోటీ పడుతూ వచ్చింది. ఒక ఎండ్‌లో నిలిచిన దాస్ ఎంతో ప్రయత్నించినా... మరోవైపు మిగిలిన మూడు వికెట్లు తీసేందుకు అఫ్గాన్ బౌలర్లకు ఎక్కువ సమయం పట్టలేదు. ముస్తఫిజుర్‌ను నవీన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేయడంతో అఫ్గాన్ ఆటగాళ్లు, అభిమానుల సంబరాలతో మైదానం హోరెత్తిపోగా... అక్కడి నుంచి దాదాపు 12 వేల కిలోమీటర్ల దూరంలో కాబూల్‌లో కూడా ఆ విజయధ్వానం బ్రహ్మాండంగా వినిపించింది! ఉత్తమ నటుడు గుల్బదిన్! 11.4 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోరు 81/7 వద్ద వానతో మ్యాచ్ ఆగినప్పుడు ఒక ఆసక్తికర ఘటన జరిగింది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఆ సమయానికి బంగ్లా 2 పరుగులు వెనుకబడి ఉంది. అక్కడే మ్యాచ్ ముగిసిపోతే అఫ్గాన్ గెలుస్తుంది. ఈ దశలో పరిస్థితి మెరుగ్గా ఉంది, తొందరపడ వద్దన్నట్లుగా డ్రెస్సింగ్ రూమ్ నుంచి అఫ్గాన్ కోచ్ జొనాథన్ ట్రాట్ సైగ చేశాడు. అప్పటి వరకు స్లిప్‌లో చక్కగా ఫీల్డింగ్ చేస్తున్న గుల్బదిన్ ‘అలా అయితే ఓకే’ అన్నట్లుగా ఒక్కసారిగా కండరాలు పట్టేశాయంటూ కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే పిచ్‌పై కవర్లు వచ్చేశాయి. అయితే ఆ తర్వాత మళ్లీ చక్కగా మైదానంలోకి దిగిన గుల్బదిన్ తర్వాతి వికెట్ కూడా తీశాడు. దాంతో ఇదంతా నటన అంటూ అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. మ్యాచ్ తర్వాత రషీద్ మాత్రం తన ఆటగాడికి మద్దతుగా నిలిచాడు. నిజానికి అక్కడే మ్యాచ్ ముగిసి ఉంటే వివాదం జరిగేదేమో కానీ ఆట కొనసాగి ఆలౌట్ వరకు వెళ్లడంతో ఇది సమస్యగా మారలేదు.‘వెల్డన్’ అంతర్జాతీయ క్రికెట్లో అఫ్గానిస్తాన్ ప్రస్థానం అసాధారణంఅగ్రశ్రేణి జట్లకు దీటుగా ఎదిగిన వైనం‘మిమ్మల్ని నిరాశపర్చము, మీ నమ్మకాన్ని నిలబెడతాం’... టి20 వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందు జరిగిన వెల్కమ్ పార్టీలో క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారాతో రషీద్ ఖాన్ అన్న మాట ఇది. ఎందుకంటే ఈ టోర్నీలో సెమీస్ చేరే నాలుగు జట్ల పేర్లు చెప్పమని మాజీలు, విశ్లేషకులతో అడిగితే ఒక్క లారా మాత్రమే అఫ్గానిస్తాన్ పేరు చెప్పాడు. వారి ఆటపై అతనికి ఉన్న నమ్మకాన్ని ఇది చూపించింది. రేపు ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలోనే రషీద్ బృందం సెమీఫైనల్ మ్యాచ్ ఆడబోతోంది! గత కొన్నేళ్లుగా అటు వన్డే, ఇటు టి20 ఫార్మాట్లలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన అఫ్గానిస్తాన్ ఇప్పుడు ‘సంచలనాల’ జట్టు నుంచి సమర్థమైన జట్టుగా ఎదిగింది. ప్రస్తుతం ఆ దేశంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా జట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కేంద్రంగానే తమ హోం మ్యాచ్‌లు ఆడుతోంది. ఆటగాళ్లంతా కూడా అక్కడే దాదాపుగా స్థిరపడ్డారు. 2023లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లోనే అఫ్గానిస్తాన్ పదును ఏమిటో ప్రపంచానికి తెలిసింది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, పాకిస్తాన్లను ఓడించిన టీమ్, ఆ్రస్టేలియాను కూడా ఒకదశలో 91/7తో ఓటమి దిశగా నెట్టింది. ఆసీస్ అదృష్టవశాత్తూ మ్యాక్స్‌వెల్ అద్భుత ఇన్నింగ్స్ జట్టును గెలిపించినా... ఇప్పుడు టి20 వరల్డ్‌కప్ లో నాటి పనిని అఫ్గాన్ పూర్తి చేసింది. –సాక్షి క్రీడా విభాగం10 అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రపంచకప్ (వన్డే/టి20) టోర్నీల చరిత్రలో సెమీఫైనల్ దశకు చేరిన పదో జట్టుగా అఫ్గానిస్తాన్ గుర్తింపు పొందింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా (1975), ఇంగ్లండ్ (1975), న్యూజిలాండ్ (1975), వెస్టిండీస్ (1975), పాకిస్తాన్ (1979), భారత్ (1983), దక్షిణాఫ్రికా (1992), శ్రీలంక (1996), కెన్యా (2003) జట్లు ఉన్నాయి. 1 ప్రపంచకప్ టోర్నీల్లో బంగ్లాదేశ్‌పై అఫ్గానిస్తాన్ తొలిసారి విజయం అందుకుంది. గతంలో బంగ్లాదేశ్‌తో జరిగిన నాలుగు ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో (టి20; 2014లో...వన్డే వరల్డ్‌కప్; 2015, 2019, 2023) అఫ్గానిస్తాన్ ఓడిపోయింది.9 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ల్లో ఇన్నింగ్స్‌లో నాలుగు అంతకన్నా ఎక్కువ వికెట్లు తీయడం రషీద్ ఖాన్కిది తొమ్మిదిసారి. షకీబ్ అల్ హసన్ (8 సార్లు) పేరిట ఉన్న రికార్డును రషీద్ బద్దలు కొట్టాడు.న్యూజిలాండ్, ఆ్రస్టేలియావంటి జట్లను ఓడించి సెమీస్ వరకు సాగిన మీ ప్రయాణం అద్భుతం. మీ శ్రమకు, పట్టుదలకు ఫలితమే ఈ విజయం. మిమ్మల్ని చూసి గర్విస్తున్నా. దీనిని ఇలాగే కొనసాగించండి. – సచిన్ టెండూల్కర్ మైదానంలో దృశ్యాలు చాలా గొప్పగా కనిపిస్తున్నాయి. అఫ్గాన్‌కు గొప్ప విజయమిది. తొలిసారి సెమీస్ చేరిన పఠాన్లలో భావోద్వేగాలు బలంగా కనిపిస్తున్నాయి. అత్యుత్తమ క్రికెట్ ప్రదర్శన ఇది. –యువరాజ్ సింగ్ -
అఫ్గనిస్తాన్‌ను ఓడిస్తే టైటిల్ సౌతాఫ్రికాదే: ఆసీస్ దిగ్గజం
టీ20 ప్రపంచకప్‌లో ముచ్చటగా మూడోసారి సెమీ ఫైనల్ చేరిన దక్షి ణాఫ్రికా.. ఈసారి గతంలో మాదిరి పొరపాట్లకు తావివ్వకూడదని పట్టుదలగా ఉంది. 2009, 2014లలో సెమీస్‌లోనే వెనుదిరిగి అపఖ్యాతిని మూటగట్టుకున్న ప్రొటిస్ జట్టు.. ఎలాగైనా ఫైనల్ చేరాలని పట్టుదలగా ఉంది. దర్జాగా సెమీస్లోకాగా తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తమ జోరు ప్రదర్శించిన విషయం తెలిసిందే. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం మూడు వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించి దర్జాగా సెమీస్‌లో అడుగుపెట్టింది. సూపర్–8 దశలో ఆడిన మూడూ గెలిచిన సఫారీ 6 పాయింట్ల తో గ్రూప్–2 టాపర్‌గా, 4 పాయింట్లతో ఇంగ్లండ్ రెండో జట్టుగా సెమీఫైనల్స్‌కు చేరాయి.మరోవైపు రెండుసార్లు టీ20 చాంపియన్, ఆతిథ్య వెస్టిండీస్ కథ ‘సూపర్–8’లోనే ముగిసింది. ముందుగా వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులే చేసింది. కైల్ మేయర్స్ (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), రోస్టన్ చేజ్ (42 బంతుల్లో 52; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.వర్షంతో 50 నిమిషాలు ఆటకు అంతరాయంరోవ్మన్ పావెల్ (1), రూథర్‌ఫోర్డ్ (0), రసెల్ (15) చేతులెత్తేయడంతో కరీబియన్ జట్టు ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తబ్రేజ్ షమ్సీ 3 వికెట్లు తీశాడు. 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 15 పరుగులు చేసిన దశలో వర్షంతో 50 నిమిషాలు ఆటకు అంతరాయం కలిగింది.దాంతో దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 17 ఓవర్లలో 123 పరుగులుగా నిర్ణయించారు. ఆ జట్టు 16.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసి నెగ్గింది. స్టబ్స్ (27 బంతుల్లో 29; 4 ఫోర్లు), క్లాసెన్ (10 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్), జాన్సెన్ (14 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) లక్ష్యంవైపు తీసుకెళ్లారు. ఛేజ్ 3, రసెల్, జోసెఫ్ చెరో 2 వికెట్లు తీశారు.రషీద్ ఖాన్ బృందంతో అమీతుమీఇక ఈ విజయంతో టోర్నీలో ముందుకు సాగే అవకాశం దక్కించుకున్న సౌతాఫ్రికా.. గురువారం నాటి తొలి సెమీ ఫైనల్లో అఫ్గనిస్తాన్‌తో తలపడనుంది. ఊహించని రీతిలో బంగ్లాదేశ్‌ను ఓడించి తొలిసారి వరల్డ్‌కప్‌లో సెమీస్ చేరిన రషీద్ ఖాన్ బృందంతో అమీతుమీ తేల్చుకోనుంది. ట్రినిడాడ్‌లోని బ్రియన్ లారా స్టేడియం ఇందుకు వేదిక.అఫ్గనిస్తాన్‌ను ఓడిస్తే ఈసారి టైటిల్ వాళ్లదేఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. టోర్నీ ఆరంభం నుంచి సౌతాఫ్రికా అద్బుతంగా ఆడిందన్న ఈ కంగారూ క్రికెటర్.. రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్‌తో పాటు స్పిన్ దళం మ్యాజిక్ చేసిందని కొనియాడాడు.ముఖ్యంగా హెండ్రిక్స్ సూపర్‌గా ఆడుతున్నాడని.. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో అతడు అదరగొట్టి ఫైనల్‌కు చేర్చుతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ కెప్టెన్సీ నైపుణ్యాలు అమోఘమన్న బ్రాడ్ హాగ్.. ప్రొటిస్ జట్టు అన్ని విభాగాల్లో సమతూకంగా ఉందన్నాడు.సౌతాఫ్రికా సెమీస్‌లో గనుక అఫ్గనిస్తాన్‌ను ఓడిస్తే ఈసారి టైటిల్ వాళ్లదేనంటూ బ్రాడ్ హాగ్ జోస్యం చెప్పాడు. కాగా తొలి సెమీస్‌లో సౌతాఫ్రికా- బంగ్లాదేశ్ తలపడనుండగా.. రెండో సెమీస్ ఫైనల్లో టీమిండియా- ఇంగ్లండ్ తాడోపేడో తేల్చుకోనున్నాయి.చదవండి: ట్రోఫీ గెలిచే అర్హత అతడికే ఉంది: షోయబ్ అక్తర్ -
ఆయనొక్కడే మమ్మల్ని నమ్మాడు: రషీద్ ఖాన్ భావోద్వేగం
అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. తొలిసారి ప్రపంచకప్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. టీ20 వరల్డ్‌కప్-2024 సూపర్-8 మ్యాచ్‌లో భాగంగా బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి ఈ మేరకు చరిత్ర సృష్టించింది. View this post on Instagram A post shared by ICC (@icc)అంతేకాదు అఫ్గన్ దెబ్బకు.. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన ఆస్ట్రేలియా టోర్నీ నుంచే నిష్క్రమించింది. దీంతో అఫ్గనిస్తాన్‌లో సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లు సైతం తీవ్ర భావోద్వేగంలో మునిగిపోయారు. View this post on Instagram A post shared by ICC (@icc)నమ్మశక్యం కాని రీతిలోఇక చారిత్రాత్మక విజయానంతరం అఫ్గనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సెమీస్ చేరడం ఓ కలలాగా ఉందని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. నమ్మశక్యం కాని రీతిలో న్యూజిలాండ్‌ను ఓడించామని.. ఇప్పుడిలా ఇక్కడిదాకా చేరుకున్నామని హర్షం వ్యక్తం చేశాడు.ఈ సంతోష సమయంలో తనకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదని రషీద్ ఖాన్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. తమ జట్టును చూస్తే తనకు గర్వంగా ఉందని పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరు తమ పాత్రను సమర్థవంతంగా పోషించారని.. టీ20 ఫార్మాట్లో ముఖ్యంగా తమ బౌలర్లు అద్భుతంగా ఆడుతున్నారని కొనియాడాడు.ఇలా తొలిసారి సెమీ ఫైనల్లోఅండర్-19 వరల్డ్‌కప్‌లో సెమీస్ చేరిన ఘనత అఫ్గనిస్తాన్‌కు ఉందని.. అయితే, మెగా టోర్నీలో ఇలా తొలిసారి సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన అనుభూతిని మాటల్లో వర్ణించలేనని పేర్కొన్నాడు.అదే విధంగా.. తమపై నమ్మకం ఉంచిన ఏకైక వ్యక్తి బ్రియన్ లారా అంటూ ఈ సందర్భంగా రషీద్ ఖాన్ వెస్టిండీస్ దిగ్గజానికి కృతజ్ఞతలు తెలిపాడు. ఆయన నమ్మకాన్ని నిలబెడతామని చెప్పానని.. అందుకు తగ్గట్లుగానే తమ జట్టు విజయం సాధించిందని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc)మేము సెమీ ఫైనల్ చేరతామని చెప్పిన ఏకైక వ్యక్తి‘‘మేము సెమీ ఫైనల్ చేరతామని చెప్పిన ఏకైక వ్యక్తి బ్రియన్ లారా. ఆయన మాటలు నిజమని మేము రుజువు చేశాం. వెల్కమ్ పార్టీ సమయంలో లారాను కలిసినపుడు.. మీ నమ్మకం నిజం చేస్తామని చెప్పాను’’ అంటూ రషీద్ ఉద్వేగానికి లోనయ్యాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 సెమీ ఫైనలిస్టు అంచనాల నేపథ్యంలో చాలా మంది మాజీ క్రికెటర్లు.. టీమిండియాతో పాటు సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లేదంటే న్యూజిలాండ్ పేర్లు చెప్పారు. అయితే, లారా మాత్రం ఈసారి అఫ్గనిస్తాన్ కచ్చితంగా టాప్-4లో చేరుతుందని అంచనా వేశాడు. ఇప్పుడదే నిజమైంది.కాగా గ్రూప్ దశలో గ్రూప్-సిలో ఉన్న అఫ్గనిస్తాన్ నాలుగింట మూడు విజయాలతో సూపర్-8లో అడుగుపెట్టింది. ఇక ఇందులో గ్రూప్-1లో భాగమైన రషీద్ ఖాన్ బృందం.. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లను ఓడించి సెమీస్‌కు చేరుకుంది.చదవండి: T20 World Cup 2024 IND VS AUS: సెంచరీ గురించి ఆలోచనే లేదు.. రోహిత్ -
T20 WC 2024: ఆస్ట్రేలియాపై ఘన విజయం.. సెమీస్‌కు టీమిండియా
టీ20 వరల్డ్‌కప్-2024 సెమీఫైనల్లో భారత జట్టు అడుగుపెట్టింది. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా సెయింట్ లూసియా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. గ్రూపు-1 నుంచి తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఓ దశలో ట్రావిస్ హెడ్ క్రీజులో ఉన్నంతసేపు ఆసీస్‌దే విజయమని అంతా భావించారు. కానీ 17 ఓవర్ వేసిన బుమ్రా అద్బుతమైన బంతితో హెడ్‌ను బోల్తా కొట్టించడంతో మ్యాచ్ స్వరూపామే మారిపోయింది. అంతకుముందు ఓవర్ అర్ష్‌దీప్ కూడా అద్బుతంగా బౌలింగ్ చేశాడు. ఇక ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్(76) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మార్ష్(37) పరుగులతో పర్వాలేదన్పించాడు.భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ రెండు, బుమ్రా, అక్షర్ పటేల్ తలా ఒక్క వికెట్ సాధించారు. ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(92) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సూర్యకుమార్ యాదవ్(31), శివమ్ దూబే(28) పరుగులతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, స్టోయినిష్ తలా రెండు వికెట్లు సాధించగా.. హాజిల్ వుడ్ తలా వికెట్ పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైన ఆస్ట్రేలియా.. అఫ్గానిస్తాన్-బంగ్లాదేశ్ ఫలితం కోస ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బంగ్లాదేశ్‌పై అఫ్గానిస్తాన్ గెలిస్తే ఆసీస్ ఇంటిముఖం పడుతోంది. గ్రూపు-1 నుంచి రెండో జట్టుగా అఫ్గానిస్తాన్ సెమీస్‌కు చేరుతోంది. -
T20 World Cup 2024: క్రిస్ జోర్డాన్ హ్యాట్రిక్.. సెమీస్‌లో ఇంగ్లండ్
బ్రిడ్జ్‌టౌన్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగిపోయిన డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ జట్టు టి20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అమెరికా జట్టుతో ఆదివారం జరిగిన గ్రూప్–2 ‘సూపర్–8’ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన అమెరికా 18.5 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌటైంది. నితీశ్ (24 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్స్‌లు), కోరె అండర్సన్ (28 బంతుల్లో 29; 1 సిక్స్) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ జోర్డాన్ ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు. జోర్డాన్ 2.5 ఓవర్లలో కేవలం 10 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో జోర్డాన్ 5 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టాడు. 19వ ఓవర్ తొలి బంతికి అండర్సన్‌ను అవుట్ చేసిన జోర్డాన్... మూడో బంతికి అలీఖాన్‌ను, నాలుగో బంతికి కెనిజిగెను, ఐదో బంతికి నేత్రావల్కర్‌ను అవుట్ చేసి ‘హ్యాట్రిక్’ పూర్తి చేసుకున్నాడు. బట్లర్ మెరుపులు 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 9.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 117 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ జోస్ బట్లర్ (38 బంతుల్లో 83 నాటౌట్; 6 ఫోర్లు, 7 సిక్స్‌లు), ఫిల్ సాల్ట్ (21 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు) మెరిపించారు. అమెరికా బౌలర్ హర్మీత్ సింగ్ వేసిన తొమ్మిదో ఓవర్లో బట్లర్ ఏకంగా 5 సిక్స్‌లు కొట్టాడు. ఈ గెలుపుతో ఇంగ్లండ్ 4 పాయింట్లతో సెమీఫైనల్ చేరుకుంది. నేడు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో నెగ్గిన జట్టు గ్రూప్–2 నుంచి రెండో జట్టుగా సెమీఫైనల్ చేరుకుంటుంది. -
T20 World Cup 2024: ఇలా జరిగిందా.. సౌతాఫ్రికా పని గోవిందా..!
టీ20 ప్రపంచకప్ 2024లో అజేయ జట్టుగా ఉన్న సౌతాఫ్రికాకు ఏ జట్టుకు ఎదురుకాని కష్టం వచ్చి పడింది. ఆ జట్టు ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడితే ఏకంగా టోర్నీ నుంచే నిష్క్రమించే ప్రమాదంలో పడుతుంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో గెలిచినా సెమీస్ అవకాశాలు ఇంకా సంక్లిష్టంగానే ఉన్నాయి. ఆ జట్టు సూపర్-8లో తమ చివరి మ్యాచ్‌లో ఓడితే ఏకంగా టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంది.గ్రూప్ దశలో అన్ని మ్యాచ్‌లు.. సూపర్-8లో రెండు మ్యాచ్‌లు గెలిచినా కేవలం ఒక్క ఓటమే సౌతాఫ్రికా కొంపముంచుతుంది. ఆ జట్టుకు ఇలాంటి అనుభవాలు కొత్త కానప్పటికీ.. ఈసారి మాత్రం జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం మంచి జట్టు కలిగి ఉండి కూడా ప్రపంచకప్ గెలిచే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంటుంది.ఇలా జరిగిందా..గ్రూప్-2లో భాగంగా సౌతాఫ్రికా రేపు (జూన్ 24) ఉదయం 6 గంటలకు (భారతకాలమానం ప్రకారం) జరుగబోయే మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఓడి.. దీనికి ముందు జరిగే మ్యాచ్‌లో యూఎస్ఏపై ఇంగ్లండ్ 10 కంటే ఎక్కువ పరుగులు లేదా ఓవర్ మార్జిన్ తేడాతో గెలిస్తే.. వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు సెమీస్‌కు చేరతాయి.అదెలా అంటే.. యూఎస్ఏపై ఇంగ్లండ్, సౌతాఫ్రికాపై వెస్టిండీస్ గెలిస్తే.. అప్పుడు మూడు జట్ల (వెస్టిండీస్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా) ఖాతాల్లో తలో నాలుగేసి పాయింట్లు ఉంటాయి. అప్పుడు నెట్ రన్‌రేట్ ఆధారంగా వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు సెమీస్‌కు చేరతాయి. సౌతాఫ్రికా ఇంటిముఖం పడుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఇంగ్లండ్‌పై యూఎస్ఏ అయినా గెలవాలి లేదా విండీస్‌పై సౌతాఫ్రికా అయినా గెలవాలి. -
T20 World Cup 2024: ఇలా జరిగితే ఆసీస్ ఇంటికే..!
టీ20 వరల్డ్‌కప్ 2024 సూపర్-8 దశలో పెను సంచనలం నమోదైన విషయం తెలిసిందే. గ్రూప్-1లో భాగంగా ఇవాళ (జూన్ 23) జరిగిన మ్యాచ్‌లో అండర్ డాగ్ ఆఫ్ఘనిస్తాన్.. మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు ఊహించని షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో ఆస్ట్రేలియా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకోగా.. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి, ఒకదాంట్లో ఓడిన (భారత్ చేతిలో) ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ అవకాశాలను మెరుగుపర్చుకుంది.ఇలా జరిగితే ఆసీస్ ఇంటికే..!భారత్‌తో జరుగబోయే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడి.. ఆతర్వాత జరుగబోయే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధిస్తే.. ఆస్ట్రేలియా ఇంటికి, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరుతాయి.ఇలా జరిగినా ఆసీస్ ఇంటికే..!ఒకవేళ భారత్‌తో రేపు జరిగే మ్యాచ్‌లో ఆసీస్ ఓ మోస్తరు తేడాతో గెలుపొందినా సెమీస్ చేరుతుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే.. తదుపరి బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ భారీ తేడాతో గెలిస్తే.. అప్పుడు భారత్, ఆసీస్, ఆఫ్ఘన్ ఖాతాలో చెరి నాలుగు పాయింట్లు ఉంటాయి. నెట్ రన్‌రేట్ ఆధారంగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరుకుంటాయి. ప్రస్తుతం భారత్ నెట్ రన్ రేట్ (2.425) మిగతా జట్లకంటే మెరుగ్గా ఉంది కాబట్టి.. ఆస్ట్రేలియా చేతిలో ఓడినా టీమిండియా సెమీస్ అవకాశాలకు ఎలాంటి ఢోకా ఉండదు. బంగ్లాదేశ్‌పై భారీ విజయం సాధిస్తే అప్పుడు భారత్‌తో పాటు ఆఫ్ఘన్ సెమీస్‌కు చేరుతుంది. ఆసీస్ సెమీస్‌కు చేరాలంటే ఇలా జరగాలి..గ్రూప్-1 నుంచి ఆసీస్ సెమీస్‌కు చేరాలంటే రేపు జరుగబోయే మ్యాచ్‌లో భారత్‌ను ఓడించాలి. అలాగే బంగ్లాదేశ్ చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోవాలి. ఇలా జరిగితే భారత్, ఆసీస్ సెమీస్‌కు చేరుకుంటాయి. ఆఫ్ఘనిస్తాన్ ఇంటి ముఖం పడుతుంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన బంగ్లాదేశ్ సెమీస్‌కు చేరడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. అయితే టెక్నికల్‌గా ఆ జట్టుకు కూడా ఇంకా సెమీస్ అవకాశాలు ఉన్నాయి (ఆస్ట్రేలియాపై భారత్.. ఆఫ్ఘనిస్తాన్పై బంగ్లాదేశ్ భారీ తేడాలతో గెలవాలి). -
T20 World Cup 2024: సూపర్-8లో గ్రూప్-2 బెర్త్‌లు ఖరారు
టీ20 వరల్డ్‌కప్ 2024 గ్రూప్-2కు సంబంధించిన సూపర్-8 బెర్త్‌లు ఖరారయ్యాయి. నమీబియాపై ఇంగ్లండ్.. స్కాట్లాండ్పై ఆస్ట్రేలియా విజయాలు సాధించడంతో గ్రూప్-బిలో రెండో బెర్త్ ఖరారైంది. ఈ గ్రూప్ నుంచి నెట్ రేట్ ఆధారంగా ఇంగ్లండ్ సూపర్-8 రెండో బెర్త్ ఖరారు చేసుకుగా.. ఆసీస్ ఇదివరకే గ్రూప్-బి నుంచి సూపర్-8కు అర్హత సాధించింది.సూపర్-8 గ్రూప్ 2లో గ్రూప్-ఏ నుంచి యూఎస్ఏ (A2).. గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ (B2).. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్ (C2).. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా (D1) జట్లు ఉన్నాయి. గ్రూప్-2లోని ఈ నాలుగు జట్లు మిగతా మూడు జట్లతో తలో మ్యాచ్ ఆడతాయి. అన్ని మ్యాచ్‌లు ముగిశాక మొదటి రెండు స్థానాల్లో ఉండే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.సూపర్-8లో గ్రూప్-2 మ్యాచ్‌లు..జూన్ 19- యూఎస్ఏ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)జూన్ 19- ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ (సెయింట్ లూసియా)జూన్ 21- ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా (సెయింట్ లూసియా)జూన్ 21- యూఎస్ఏ వర్సెస్ వెస్టిండీస్ (బార్బడోస్)జూన్ 23- యూఎస్ఏ వర్సెస్ ఇంగ్లండ్ (బార్బడోస్)జూన్ 23- వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)ఇదిలా ఉంటే, సూపర్-8 గ్రూప్-1కు సంబంధించిన బెర్త్‌లు కూడా దాదాపుగా ఖరారయ్యాయి. గ్రూప్-1లో గ్రూప్-ఏ నుంచి భారత్ (A1).. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా (B1).. గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ (C1).. గ్రూప్-డి నుంచి బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్ (D2) జట్లు ఉంటాయి. ఇవాళ (జూన్ 16) జరిగే గ్రూప్-డి మ్యాచ్‌లో నేపాల్‌పై విజయం సాధిస్తే బంగ్లాదేశ్ సూపర్-8కు (గ్రూప్-1) అర్హత సాధిస్తుంది.సూపర్-8లో గ్రూప్-1 మ్యాచ్‌లు..జూన్ 20- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా (బార్బడోస్)జూన్ 20- ఆస్ట్రేలియా వర్సెస్ D2 (బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్) (ఆంటిగ్వా)జూన్ 22- ఇండియా వర్సెస్ D2 (బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్) (ఆంటిగ్వా)జూన్ 22- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (సెయింట్ విన్సెంట్)జూన్ 24- ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా (సెయింట్ లూసియా)జూన్ 24- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ D2 (బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్) (సెయింట్ విన్సెంట్) -
టీ20 వరల్డ్‌కప్ 2024.. ఐసీసీ కీలక నిర్ణయం!? అలా అయితే కష్టమే
ఐపీఎల్-2024 ముగిసిన వారం రోజులకే మరో క్రికెట్ మహాసంగ్రామానికి తెరలేవనుంది. జూన్ 1 నంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా టీ20 వరల్డ్‌కప్-2024 ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డల్లాస్ వేదికగా అమెరికా, కెనడా జట్లు తలపడనున్నాయి.అయితే ఈ మెగా ఈవెంట్‌కు సబంధించి ఓ ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. ఈ మెగా టోర్నీలో సెకెండ్ సెమీఫైనల్‌కు రిజర్వ్ డే ఉండదని ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ క్రిక్‌బజ్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. సాధరణంగా ఐసీసీ ఈవెంట్లలో నాకౌట్ గేమ్‌లకు రిజర్వ్ డే కచ్చితంగా ఉంటుంది. కానీ ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్ ప్రకారం.. రెండో సెమీఫైనల్‌కు, ఫైనల్ పోరుకు మధ్య కేవలం ఒక రోజు మాత్రమే గ్యాప్ ఉంది. ఈ క్రమంలోనే ఐసీసీ సెకెండ్ సెమీఫైనల్‌కు రిజర్వ్‌డేను కెటాయించలేదని క్రిక్‌బజ్ తెలిపింది. అయితే రిజర్వ్ డే బదలుగా 250 నిమిషాల అదనపు సమయాన్ని ఐసీసీ, వెండీస్ క్రికెట్ బోర్డులు కెటాయించినట్లు తెలుస్తోంది. గయానా వేదికగా రెండో సెమీఫైనల్ జరగనుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే నిర్ణీత సమయంలో మ్యాచ్ ఫినిష్ కాకపోతే.. మరో నాలుగు గంటల సమయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. అంటే అంపైర్లు మ్యాచ్‌ను ముగించడానికి దాదాపు ఎనిమిది గంటల సమయం ఉంటుంది. -
సెమీస్‌లో కిడాంబి శ్రీకాంత్.. పీవీ సింధుకు చుక్కెదురు
Swiss Open Super 300 badminton tournament- బాసెల్ (స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో అతను 21–10, 21–14తో చియా హా లీ (చైనీస్ తైపీ)ని వరుస గేముల్లో కంగుతినిపించాడు. తద్వారా పదహారు నెలల కాలం తర్వాత తొలిసారి ఓ టోర్నీ సెమీస్‌లో అడుగుపెట్టాడు. ఇక శనివారం జరుగనున్న సెమీ ఫైనల్లో చైనీస్ తైపీ, వరల్డ్ నంబర్ 22 లిన్ చున్ యీని కిడాంబి శ్రీకాంత్ ఎదుర్కోనున్నాడు. అంతకు ముందు పురుషుల ప్రిక్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్ శ్రీకాంత్ 21–16, 21–15తో మలేసియన్ టాప్ సీడ్ ప్లేయర్ లీ జీ జియాను వరుస గేముల్లో కంగు తినిపించిన విషయం తెలిసిందే. పీవీ సింధుకు చుక్కెదురు మరోవైపు.. రెండు ఒలింపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట సింధు, లక్ష్యసేన్‌లకు ప్రి క్వార్టర్ ఫైనల్లోనే చుక్కెదురైంది. ఏడో సీడ్ లక్ష్యసేన్ 17–21, 15–21తో చియా హా లీ (చైనీస్ తైపీ) జోరుకు నిలువలేకపోయాడు. మహిళల ప్రిక్వార్టర్స్‌లో నాలుగో సీడ్ సింధు 21–16, 19–21, 16–21తో జూనియర్ ప్రపంచ చాంపియన్, 17 ఏళ్ల టొమొకా మియజకి (జపాన్) చేతిలో పరాజయం చవిచూడగా, మహిళల డబుల్స్‌లో 8వ సీడ్ గాయత్రి–ట్రెసా జాలీ జంట 14–21, 15–21తో సెటియాన–ఎంజెలా యూ (ఆస్ట్రేలియా) జోడీ చేతిలో కంగుతింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సిక్కిరెడ్డి–సుమిత్ రెడ్డి జంట 11–21, 14–21తో రాబిన్ టాబెలింగ్–సెలెనా పేక్ (నెదర్లాండ్స్) జోడీ చేతిలో ఓడింది. -
మరీ ఇంత స్వార్థమా?.. కోచ్ ఇలా చేయడం తప్పే: డీకే ఫైర్
DK Fumes As Tamil Nadu Coach 'Throws Captain Under The Bus': తమిళనాడు క్రికెట్ కోచ్ సులక్షణ్ కులకర్ణి తీరుపై టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ మండిపడ్డాడు. జట్టు ఓటమికి కెప్టెన్‌ను బాధ్యుడిని చేసేలా స్వార్థపూరితంగా మాట్లాడటం కోచ్ స్థాయికి తగదని చురకలు అంటించాడు. కాగా రంజీ ట్రోఫీ 2023-24లో భాగంగా ముంబైతో జరిగిన సెమీ ఫైనల్లో తమిళనాడు ఓటమిపాలై.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇన్నింగ్స్ 70 పరుగుల భారీ తేడాతో ఓడి ఇంటిబాటపట్టింది. ఈ నేపథ్యంలో తమిళనాడు కోచ్ సులక్షణ్ కులకర్ణి స్పందిస్తూ.. కెప్టెన్ ఆర్.సాయి కిషోర్ నిర్ణయాలను తప్పుబట్టాడు. ఓ ముంబైకర్‌గా నాకన్నీతెలుసు.. కానీ టాస్ గెలిచినప్పుడు తొలుత బ్యాటింగ్ ఎంచుకుని పొరపాటు చేశాడని విమర్శించాడు. ఈ మేరకు.. ‘‘ఆరోజు వికెట్‌ను నేను గమనించాను. కోచ్‌గా, మంబైకర్(ముంబైకి చెందినవాడు)గా అక్కడి పిచ్ పరిస్థితులపై నాకు పూర్తి అవగాహన ఉంది. టాస్ గెలిచినపుడు బౌలింగ్ చేయించాలని అనుకుంటే.. మా కెప్టెన్ మాత్రం తనకు నచ్చినట్లుగా నిర్ణయం తీసుకున్నాడు. ఏదేమైనా బాస్ అతడే. అతడి నిర్ణయమే ఫైనల్. కేవలం ఇన్పుట్స్, ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం వరకే నేను పరిమితం’’ అని సులక్షణ్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో పేర్కొన్నాడు. నిజానికి తాము మొదటి రోజు ఆట టాస్ సమయంలోనే ఓడిపోయామంటూ సాయి కిషోర్‌ను ఓటమికి బాధ్యుడిని చేసేలా వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయంపై దినేశ్ కార్తిక్ ఎక్స్ వేదికగా స్పందించాడు. కోచ్‌కు ఇంత స్వార్థం పనికిరాదు.. ‘‘ఇలా మాట్లాడటం కచ్చితంగా తప్పే. కోచ్ నుంచి ఇలాంటి మాటలు వినాల్సి రావడం నన్ను నిరాశకు గురిచేసింది. ఏడేళ్ల తర్వాత తొలిసారి జట్టును రంజీ సెమీస్ వరకు తీసుకువచ్చిన కెప్టెన్‌ను అభినందించాల్సింది పోయి.. ఇలా కోచే స్వయంగా.. బహిరంగంగా అతడిని విమర్శించడం సరికాదు’’ అని తమిళనాడు వికెట్ కీపర్ బ్యాటర్ డీకే ఆగ్రహం వ్యక్తం చేశాడు. This is soo WRONG This is so disappointing from the coach ..instead of backing the captain who has brought the team to the semis after 7 yrs and thinking it's a start for good things to happen, the coach has absolutely thrown his captain and team under the bus 👎🏽👎🏽👎🏽👎🏽👎🏽 https://t.co/Ii61X7Ajqs — DK (@DineshKarthik) March 5, 2024 తమిళనాడు ఆట ముగిసిందిలా.. ఫైనల్లో ముంబై రంజీ ట్రోఫీలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ 41 సార్లు చాంపియన్ ముంబై జట్టు 47వ సారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. సొంతమైదానంలో తమిళనాడుతో జరిగిన తొలి సెమీఫైనల్లో ముంబై ఇన్నింగ్స్ 70 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 353/9తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబై 106.5 ఓవర్లలో 378 పరుగులకు ఆలౌటైంది. తమిళనాడు బౌలర్లలో కెప్టెన్ సాయికిశోర్ 6 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం 232 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తమిళనాడు షమ్స్ ములానీ (4/53), శార్దుల్ ఠాకూర్ (2/16), మోహిత్ (2/26), తనుష్ (2/18) ధాటికి 162 పరుగులకే కుప్పకూలి ఓడిపోయింది. శార్దుల్ ఠాకూర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. చదవండి: గోపీచంద్ అకాడమీకి బైబై..!.. అమెరికాకు పయనం! -
తమిళనాడు 146 ఆలౌట్
ముంబై: రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్లో ముంబై సమష్టి బౌలింగ్ ప్రదర్శనతో తమిళనాడును పడగొట్టింది. మ్యాచ్ తొలి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 64.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. విజయ్ శంకర్ (44), వాషింగ్టన్ సుందర్ (43) కొంత పోరాడినా...మిగతావారంతా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో తుషార్ పాండే 24 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... తనుష్ కొటియాన్, ముషీర్ ఖాన్, శార్దుల్ ఠాకూర్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం ముంబై బ్యాటింగ్ కూడా తడబడింది. శనివారం ఆట ముగిసే సమయానికి ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. పృథ్వీ షా (5) విఫలం కాగా...ముïÙర్ ఖాన్ (24 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆడని కారణంగా బీసీసీఐ కాంట్రాక్ట్‌ను కోల్పోయిన భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఈ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. విదర్భ 170 ఆలౌట్... నాగ్‌పూర్: మధ్యప్రదేశ్ పేస్ బౌలర్ అవేశ్ ఖాన్ (4/49) పదునైన బౌలింగ్ ముందు విదర్భ బ్యాటర్లు విఫలమయ్యారు. రంజీ ట్రోఫీ రెండో సెమీస్ మ్యాచ్‌లో విదర్భ తమ తొలి ఇన్నింగ్స్‌లో 56.4 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. కరుణ్ నాయర్ (63) అర్ధ సెంచరీ సాధించగా, అథర్వ తైడే (39) ఫర్వాలేదనిపించాడు. ఒక దశలో 101/2తో మెరుగైన స్థితిలో కనిపించిన విదర్భ 36 పరుగుల వ్యవధిలో తర్వాతి 6 వికెట్లు కోల్పోయింది. వెంకటేశ్ అయ్యర్, కుల్వంత్ ఖెజ్రోలియా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆట ముగిసే సరికి మధ్యప్రదేశ్ వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది.