PC: INSIDE Sport
‘యూరో’ కప్ ఫుట్‌బాల్ టోర్నీ-2024 తొలి సెమీఫైనల్‌కు సర్వం సిద్దమైంది. మంగళవారం అలియాంజ్ ఎరీనా వేదికగా జరగనున్న సెమీఫైనల్-1లో ఫ్రాన్స్, స్పెయిన్ జట్లు తాడో పేడో తెల్చుకోనున్నాయి. ఈ సెమీస్ పోరులో గెలిచి ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకోవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.
స్పెయిన్ ఫైనల్‌కు చేరుతుందా?
అయితే ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచి జోరు మీదున్న స్పెయిన్‌కు సెమీస్ ముందు గాయాలు, కార్డ్ సస్పెన్షన్‌ల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే కీలక మ్యాచ్‌కు ముందు రాబిన్ లే నార్మాండ్, డాని కార్వాజల్ ఇద్దరూ సస్పెండ్ అయ్యారు.
మరోవైపు , యువ మిడ్‌ఫీల్డర్ పెడ్రీ టోని క్రూస్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. ఈ క్రమంలో డిఫెన్స్‌లో రాబిన్ లే నార్మాండ్, డాని కార్వాజల్ స్ధానాలను నాచో, జీసస్ నెవాస్ భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా పెడ్రీ ప్రత్యామ్నాయంగా వచ్చిన డాని ఓల్మో ప్లేయింగ్‌లో తన స్దానాన్ని సుస్థిరం చేసుకోనున్నాడు.
స్పెయిన్ జోరును ఫ్రాన్స్ అడ్డుకుంటుందా?
ఇక సెమీస్‌కు ముందు ఫ్రాన్స్ టీమ్‌లో ఎటవంటి గాయాలు, కార్డ్ సస్పెన్షన్‌లు లేవు. జట్టు మొత్తం క్లియర్‌గా ఉంది. కానీ ఫ్రాన్స్ సెమీస్‌కు వచ్చినప్పటికి తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. గోల్స్ సాధించడంలో ఫ్రాన్స్ తమ మార్క్ చూపించలేకపోయింది.
కెప్టెన్ కైలియన్ ఎంబాపే గాయం కావడం ఫ్రాన్స్‌ను కాస్త దెబ్బతీసింది. అతడు తిరిగి జట్టులోకి వచ్చినప్పటి మునపటి జోరును ప్రదర్శించలేకపోతున్నాడు. సెమీఫైనల్లోనైనా ఎంబాపే సత్తాచాటుతాడో లేదో వేచి చూడాలి. కాగా సెమీఫైనల్ చేరే క్రమంలో స్పెయిన్ 11 గోల్స్ చేయగా... ఫ్రాన్స్ కేవలం మూడు గోల్స్ మాత్రమే సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment