యూరో ఫుట్‌బాల్ కప్-2024 ఛాంపియన్స్‌గా స్పెయిన్ జట్టు నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ను 2-1 తేడాతో ఓడించిన స్పెయిన్.. నాలుగో సారి యూరో కప్ టైటిల్‌ను ముద్దాడింది. స్పెయిన్ విజయంలో మైకెల్ ఓయర్జాబల్ కీలక పాత్ర పోషించాడు.
చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో 86వ నిమిషంలో గోల్‌కొట్టిన ఓయర్జాబల్ స్పెయిన్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు.
చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో 86వ నిమిషంలో గోల్‌కొట్టిన ఓయర్జాబల్ స్పెయిన్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఈ ఫైనల్ మ్యాచ్ ఫస్ట్‌హాఫ్ నీవా నేనా అన్నట్లు సాగింది. ఇరు జట్లు కూడా తొలి ఆర్ధ భాగంలో ఒక్క గోల్‌కూడా సాధించలేకపోయాయి.
ఫస్ట్‌హాప్ ముగిసే సమయానికి ఇరు జట్లు 0-0గా నిలిచాయి. ఆ తర్వాత సెకెండ్ హాఫ్‌లో 46వ నిమిషంలో నికో విలియమ్స్ అద్భుత గోల్‌తో స్పెయిన్ ఖాతా తెరిచాడు. ఇంగ్లండ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటకి గోల్ సాధించడంలో విఫలమైంది.
ఈ క్రమంలో మ్యాచ్ 60 నిమిషంలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్ బయటకు వెళ్లిపోయాడు. అతడి స్ధానంలో సెమీఫైనల్ హీరో వాట్కిన్స్ వచ్చాడు. అతడు వచ్చిన కూడా ఫలితం మాత్రం మారలేదు. ఇంగ్లీష్ జట్టు నిరాశలో కూరుకుపోయిన వేళ మిడ్‌ఫీల్డర్ కోల్ పామర్ 73వ నిమిషంలో సంచలన గోల్‌తో తమ జట్టుకు తొలి గోల్‌ను అందించాడు.
దీంతో స్కోర్లు 1-1తో సమమయ్యాయి. మళ్లీ ఇంగ్లండ్ కమ్‌బ్యాక్ ఇవ్వడంతో స్పెయిన్ కాస్త ఒత్తడికి గురైంది. అయితే సెకెండ్ హాఫ్ సమయం ముగుస్తున్నప్పటికి గోల్ మాత్రం ఇరు జట్లు సాధించలేకపోయాయి. దీంతో పెనాల్టీ షుటౌట్ తప్పదని అంతా భావించారు.
కానీ మ్యాచ్ 86వ నిమిషంలో ఓయర్జాబల్ సూపర్ గోల్‌తో స్పెయిన్‌కు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. స్పెయిన్‌కు ఇది నాలుగో యూరో కప్ టైటిల్ కావడం గమనార్హం. 1964, 2008, 2012 యూరో కప్ టైటిల్స్‌ను స్పెయిన్ సొంతం చేసుకుంది.
🇪🇸 Spain are champions of Europe 🏆#EURO2024 pic.twitter.com/Ch0AF0iPWl
— UEFA EURO 2024 (@EURO2024) July 14, 2024
Comments
Please login to add a commentAdd a comment