england
-
ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు (ఫిబ్రవరి 22) బిగ్ ఫైట్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఇవాళ (ఫిబ్రవరి 22) బిగ్ ఫైట్ జరుగనుంది. గాయాలతో సతమతమవుతున్న వరల్డ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా.. ఇటీవలే భారత్ చేతిలో భంగపడ్డ ఇంగ్లండ్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానుంది. గ్రూప్-బిలో భాగంగా ఈ మ్యాచ్ జరుగనుంది. గ్రూప్-బిలో భాగంగా నిన్న జరిగిన తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా.. ఆఫ్ఘనిస్తాన్‌ను 107 పరుగుల తేడాతో చిత్తు చేసింది.కీలక ఆటగాళ్లు దూరంఈ టోర్నీలో ఆస్ట్రేలియా ద్వితియ శ్రేణి జట్టుతో బరిలోకి దిగుతుంది. కీలక ఆటగాళ్లు పాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ మార్ష్ గాయాల బారిన పడగా.. మిచెల్ స్టార్క్ వ్యక్తిగత కారణాల చేత ఈ టోర్నీకి దూరంగా ఉన్నాడు. మరో స్టార్ ప్లేయర్ మార్కస్ స్టోయినిస్ టోర్నీ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ గైర్హాజరీలో స్టీవ్ స్మిత్ ఆసీస్ సారథ్య బాధ్యతలను మోస్తున్నాడు.భారత్ చేతిలో భంగపాటుఈ టోర్నీ ప్రారంభానికి ముందు ఇంగ్లండ్ భారత్ చేతిలో వన్డే సిరీస్‌ను కోల్పోయి భంగపాటుకు గురైంది. భారత్‌తో సిరీస్‌లో ఇంగ్లండ్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైంది. ఆసీస్‌తో మ్యాచ్ ప్రారంభానికి రెండు రోజుల ముందే ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. యువ ఆటగాడు జేమీ స్మిత్ మూడో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. రూట్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు.ఆసీస్‌తో వన్డే కోసం ఇంగ్లండ్ తుది జట్టు..ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జేమీ స్మిత్ (వికెట్‌కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్‌హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా..!ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ఇప్పటివరకు వన్డేల్లో 161 సార్లు ఎదురెదురుపడ్డాయి. ఇందులో ఆసీస్ 91 సార్లు గెలుపొందగా.. ఇంగ్లండ్ 65 మ్యాచ్‌ల్లో విజేతగా నిలిచింది. రెండు మ్యాచ్‌లు టై కాగా.. మూడు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.ఛాంపియన్స్ ట్రోఫీలో ఎవరిది ఆధిపత్యం..?ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్, ఇంగ్లండ్ ఇప్పటివరకు 5 మ్యాచ్‌ల్లో తలపడగా.. ఇంగ్లండ్ 3, ఆసీస్ 2 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. చివరి రెండు ఎడిషన్లలో (2013, 2017) ఇంగ్లండ్ ఆసీస్‌పై జయకేతనం ఎగురవేసింది. ఇక ఇరు జట్లు చివరిగా తలపడిన ఐదు వన్డేల్లో ఆసీస్ 3, ఇంగ్లండ్ 2 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ఆసీస్ జట్టు..స్టీవ్ స్మిత్ (కెప్టెన్), జోస్ ఇంగ్లిస్ (వికెట్‌కీపర్), మాథ్యూ షార్ట్, ట్రవిస్ హెడ్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, సీన్ అబాట్, బెన్ డ్వార్షుయిష్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా, నాథన్ ఇల్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబూషేన్, అలెక్స్ క్యారీ -
ఆస్ట్రేలియాతో మ్యాచ్.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఇంగ్లండ్ తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమవుతోంది. ఈ మెగా టోర్నీ గ్రూపు-బిలో భాగంగా ఫిబ్రవరి 23న లహోర్ వేదికగా ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ తలపడనుంది. ఇప్పటికే లహోర్‌కు చేరుకున్న ఇంగ్లీష్ జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని బట్లర్ సేన భావిస్తోంది.ఈ క్రమంలో ఆసీస్‌తో మ్యాచ్‌కు ఇంగ్లండ్ క్రికెట్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. భారత్‌తో వన్డే సిరీస్‌కు గాయం కారణంగా దూరమైన వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ తిరిగి జట్టులోకి వచ్చాడు. కెప్టెన్ జోస్ బట్లర్ స్ధానంలో వికెట్ కీపర్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఇంగ్లండ్ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగనుంది.ఆసీస్‌తో మ్యాచ్‌కు ఇంగ్లండ్ తుది జట్టు ఇదేఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్చదవండి: Champions Trophy: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ రికార్డు బద్దలు -
భారత హాకీ జట్లకు మిశ్రమ ఫలితాలు
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌ల్లో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ముందుగా భారత మహిళల జట్టు ‘షూటౌట్’లో 1–2తో ఇంగ్లండ్ జట్టు చేతిలో ఓడిపోగా... అనంతరం భారత పురుషుల జట్టు 2–0 గోల్స్ తేడాతో స్పెయిన్ జట్టుపై విజయం సాధించింది. భారత జట్టు తరఫున మన్దీప్ సింగ్ (32వ నిమిషంలో), దిల్‌ప్రీత్ సింగ్ (39వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఇంగ్లండ్–భారత్ మహిళల జట్ల మధ్య మ్యాచ్‌లో నిర్ణీత సమయం ముగిశాక రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. భారత్ తరఫున నవ్‌నీత్ కౌర్ (53వ నిమిషంలో), రుతుజా (57వ నిమిషంలో)... ఇంగ్లండ్ తరఫున పెయిజ్ గిలోట్ (40వ నిమిషంలో), టెసా హొవార్డ్ (56వ నిమిషంలో) ఒక్కో గోల్ నమోదు చేశారు. విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించారు. తొలి ఐదు షాట్లు ముగిశాక రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. ఆ తర్వాత ఆరో షాట్లో రెండు జట్ల క్రీడాకారిణులు విఫలమయ్యారు. ఏడో షాట్లో భారత ప్లేయర్ లాల్రెమ్సియామి గురి తప్పగా... ఇంగ్లండ్ ప్లేయర్ సోఫీ హామిల్టన్ బంతిని లక్ష్యానికి చేర్చడంతో భారత్‌కు ఓటమి ఖరారైంది. -
అబ్బాయిల ఓటమి...అమ్మాయిల గెలుపు
భువనేశ్వర్: ఎఫ్ఐహెచ్ పురుషుల ప్రొ లీగ్‌లో భారత జట్టు పరాజయం పాలైంది. భారత అంచె పోటీల్లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత్ 1–3 గోల్స్ తేడాతో స్పెయిన్ చేతిలో ఓడింది. 2024 పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో భారత జట్టు చేతిలో ఎదురైన పరాజయానికి స్పెయిన్ బదులు తీర్చుకున్నట్లైంది. భారత్ తరఫున సుఖ్జీత్సింగ్ (25వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. స్పెయిన్ తరఫున బోర్జా లాకల్లె (28వ నిమిషంలో), ఇగ్నాషియా కొబొస్ (38వ ని.లో), బ్రూనో అవిలా (56వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. భారత జట్టు పదే పదే దాడులు చేసినా స్పెయిన్ రక్షణ పంక్తి సమర్థవంతంగా అడ్డుకుంది. తొలి క్వార్టర్లో ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా... గోల్ చేయలేకపోయాయి. రెండో క్వార్టర్‌ను ఇరు జట్లు మరింత దూకుడుగా ప్రారంభించాయి. ఈ క్రమంలో సుఖ్జీత్ సింగ్ గోల్‌తో భారత్ ఆధిక్యంలోకి వెళ్లగా... మూడు నిమిషాల వ్యవధిలోనే గోల్ కొట్టిన స్పెయన్ స్కోరు సమం చేసింది. ఆ తర్వాత వరుసగా రెండు క్వార్టర్స్‌లో ఒక్కో గోల్ బాదిన స్పెయిన్ మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. ఆదివారం మరోసారి స్పెయిన్‌తో భారత్ ఆడనుంది. హోరాహోరీ పోరులో భారత అమ్మాయిల విజయం ఎఫ్ఐహెచ్ మహిళల ప్రొ లీగ్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. భారత అంచె పోటీల్లో భాగంగా శనివారం హోరాహోరీగా సాగిన తొలి పోరులో భారత్ 3–2 పాయింట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. కళింగ స్టేడియంలో జరిగిన పోరులో తమకన్నా మెరుగైన ర్యాంక్ ఉన్న ఇంగ్లండ్ జట్టుపై భారత్ స్ఫూర్తిదాయకమైన ప్రదర్శన కనబర్చింది. భారత్ తరఫున వైష్ణవి (6వ నిమిషంలో), దీపిక (25వ ని.లో) నవ్‌నీత్ కౌర్ (59వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. వైష్ణవి, దీపిక పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచగా... ఆట ఆఖరి నిమిషంలో అదిరిపోయే ఫీల్డ్‌గోల్‌తో నవ్‌నీత్ జట్టుకు విజయాన్ని అందించింది. ఇంగ్లండ్ తరఫున డార్సీ బౌర్నె (12వ నిమిషంలో), ఫియానా క్రాక్లెస్ (58వ ని.లో) చెరో గోల్ కొట్టారు. ఎఫ్ఐహెచ్ ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో ఉన్న భారత్.. వైష్ణవి గోల్‌తో తొలి క్వార్టర్‌లోనే ఖాతా తెరిచింది. అయితే కాసేపటికే ఏడో ర్యాంక్‌లో ఉన్న ఇంగ్లండ్ స్కోరు సమం చేసింది. రెండో క్వార్టర్లో దీపిక గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లిన భారత్... సునాయాసంగానే మ్యాచ్ గెలిచేలా కనిపించింది. ఈ క్రమంలో గోల్‌కీపర్ సవిత పూనియా కొన్ని చక్కటి సేవ్‌లతో ప్రత్యర్థికి స్కోరు చేసే అవకాశం ఇవ్వలేదు. చివర్లో ఇంగ్లండ్ స్కోరు సమం చేసినా... నిమిషం వ్యవధిలోనే మరో గోల్ కొట్టిన భారత్ విజయం సాధించింది. ఆదివారం జరగనున్న మ్యాచ్‌లో మరోసారి ఇంగ్లండ్‌తో భారత అమ్మాయిల జట్టు తలపడుతుంది. -
ఇంగ్లండ్‌తో భారత మహిళల తొలి పోరు
మరోవైపు మహిళల ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్‌లో భాగంగా నేడు జరగనున్న తొలి పోరులో ఇంగ్లండ్‌తో భారత్ తలపడుతుంది. ఆదివారం రెండో మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్‌తో ఆడుతుంది. ఫలితాలతో సంబంధం లేకుండా మెరుగైన ఆటతీరు కనబర్చడమే తమ ముందున్న లక్ష్యమని భారత మహిళల హాకీ జట్టు సారథి సలీమా టెటె పేర్కొంది. మెరుగు పర్చుకోవాల్సిన అంశాలపై దృష్టి పెట్టేందుకు ఈ లీగ్ ఎంతగానో ఉపయోగపడుతుందిన సలీమా వెల్లడించింది. ఈ నెల 18, 19న స్పెయిన్‌తో... 21, 22న జర్మనీతో... 24, 25న నెదర్లాండ్స్‌తో భారత్ మ్యాచ్‌లు ఆడుతుంది. ‘మా ఆటపైనే ప్రధానంగా దృష్టి పెడతాం. పలువురు ప్లేయర్లు తొలిసారి ప్రొ లీగ్ మ్యాచ్‌లు ఆడనున్నారు. గెలుపోటములు ఆటలో భా గం. మా వరకు అత్యుత్తమ ప్రదర్శన చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. హరేంద్ర సింగ్ చీఫ్ కోచ్‌గా వచ్చినప్పటి నుంచి గేమ్‌ప్లాన్ మెరుగైంది. ప్లేయర్ల మధ్య అనుబంధం కూడా పెరిగింది. అదే మైదానంలో ప్రస్ఫుటమవుతోంది’ అని సలీమా వెల్లడించింది. -
ఛాంపియన్స్ ట్రోఫీ.. భారత తుది జట్టు ఇదే! ఆ స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్?
క్రికెట్ మికులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు సమయం అసన్నమైంది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఈ ఐసీసీ మహాసంగ్రామానికి తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లు కరాచీ వేదికగా తలపడనున్నాయి. ఈ మెగా టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గోనున్నాయి. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉండగా.. గ్రూప్-బీలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, అప్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి. ఈ ఈవెంట్లో భారత జట్టు తమ మ్యాచ్‌లను దుబాయ్ వేదికగా ఆడనుంది. సెమీ ఫైనల్స్, ఫైనల్స్‌కి వెళ్తే ఆ మ్యాచ్‌లు కూడా దుబాయ్‌లోనే జరగనున్నాయి. ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు పీసీబీ అంగీకరించింది. తొలుత మొండి పట్టుపట్టినప్పటికి ఐసీసీ డిమాండ్లకు పీసీబీ తలొగ్గింది.ఇక ఈ మెగా ఈవెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 19న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడునుంది. ఆ తర్వాత ఈ నెల 23న దాయాది పాకిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. అయితే భారత్‌కు జస్ప్రీత్ బుమ్రా గాయం రూపంలో గట్టి ఎదురు దెబ్బ తగలింది. బుమ్రా గాయం కారణంగా ఈ ఐసీసీ టోర్నీకి దూరమయ్యాడు. అతడి స్ధానాన్ని హర్షిత్ రాణాతో సెలక్టర్లు భర్తీ చేశారు. అదేవిధంగా ఆఖరి నిమిషంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని కూడా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను ఇంగ్లండ్ మాజీ సారథి కెవిన్ పీటర్సన్ ఎంపిక చేశాడు. పేసర్ హర్షిత్ రాణా, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్, స్పిన్ ద్వయం వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్‌లను పీటర్సన్ పట్టించుకోలేదు. ఓపెనర్లగా రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్‌లకు తన జట్టులో పీటర్సన్ చోటిచ్చాడు. అదేవిధంగా విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్‌లకు ఫస్ట్ డౌన్, సెకెండ్ డౌన్లో అతడు అవకాశమిచ్చాడు.మిడిలార్డర్లో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను పీటర్సన్ సెలక్ట్ చేశాడు. ఫినిషర్లగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలకు ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఫాస్ట్ బౌలర్ల కోటాలో అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ.. స్పెషలిస్టు స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ను పీటర్సన్ ఎంపిక చేశాడు. కాగా ఈ మెగా టోర్నీకి ముందు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో భారత క్లీన్ స్వీప్ చేసింది. ఇదే జోరును ఛాంపియన్స్ ట్రోఫీలోనూ కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది.ఛాంపియన్స్ ట్రోఫీకి పీటర్సన్ ఎంపిక చేసిన భారత తుది జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.చదవండి: ప్లీజ్.. నన్ను కింగ్ అని పిలవకండి: బాబర్ ఆజం -
సెమీస్‌కు చేరే జట్లు ఇవే.. పప్పులో కాలేసిన ఇంగ్లండ్ దిగ్గజం
ఛాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy) కు మరో ఐదు రోజుల్లో తెరలేవనుంది. ఫిబ్రవరి 19 నుంచి కరాచీ (పాకిస్తాన్) వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్లో పాల్గోనే అన్ని జట్లు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. ఎనిమిదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ఎలాగైనా ఛాంపియన్స్‌గా నిలవాలని ఆయా జట్లు పట్టుదలతో ఉన్నాయి.ఈ మినీ వరల్డ్‌కప్ కోసం టీమ్స్ ఒక్కొక్కటిగా పాకిస్తాన్‌కు చేరుకుంటున్నాయి. పాకిస్తాన్ 1996 వన్డే ప్రపంచకప్ తర్వాత ఓ ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వనుండడం ఇదే మొదటి సారి. ఇక భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. టీమిండియా తమ మొత్తం మ్యాచ్‌లు దుబాయ్‌లోనే ఆడనుంది.కాగా ఈ మెగా టోర్నీకి సమయం దగ్గరపడుతుండడంతో ఏయే టీమ్స్ సెమీస్ చేరుతాయి, విజేత ఎవరన్నది? మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ చేరాడు. భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు సెమీస్‌కు చేరుతాయని పీటర్సన్ చెప్పుకొచ్చాడు.అదేలా సాధ్యం కెవిన్?అయితే ఇక్కడే పీటర్సన్ పప్పులో కాలేశాడు. ఎందుకంటే కెవిన్ ఎంచుకున్న జట్లలో మూడు టీమ్స్ ఒకే గ్రూపులో ఉన్నవి కావడం గమనార్హం. ఈ మినీ వరల్డ్‌కప్‌లో మొత్తం 8 జట్లు పాల్గోంటున్నాయి. వీటిని రెండు గ్రూప్‌లుగా విభజించారు. అందులో గ్రూప్-ఎలో పాకిస్థాన్, భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. గ్రూప్-బిలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, అప్ఘానిస్థాన్, ఇంగ్లండ్‌లు ఉన్నాయి. ప్రతి గ్రూప్ నుండి పాయింట్ల పట్టికలో తొలి రెండు రెండు స్ధానాల్లో నిలిచిన జట్లు మాత్రమే సెమీ-ఫైనల్‌కు చేరుకుంటాయి. కానీ ఈ ఇంగ్లండ్ దిగ్గజం మాత్రం గ్రూపు-ఎ నుంచే మూడు జట్లు సెమీస్‌కు చేరుకుంటాయని అంచనావేశాడు.మ్యాథమెటికల్‌గా ఒకే గ్రూపు నుంచి మూడు జట్లు సెమీస్‌కు చేరడం సాధ్యం కాదు. దీంతో నెటిజన్లు పీటర్సన్‌ను ట్రోలు చేస్తున్నారు. కాగా ఈ మెగా టోర్నీకి టీమిండియా స్టార్ ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్ధానాన్ని హర్షిత్ రాణాతో బీసీసీఐ భర్తీ చేసింది.ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిచదవండి:Champions Trophy 2025: ఫేక్ అక్రెడిటేషన్‌తో కరాచీ స్టేడియానికి.. భద్రతపై సందేహాలు -
ఘనమైన ముగింపు
వన్డేల్లో భారత జట్టు మరోసారి తమ బలాన్ని ప్రదర్శించింది. సొంతగడ్డపై తమ స్థాయిని చూపిస్తూ ఇంగ్లండ్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. గత రెండు మ్యాచ్‌ల తరహాలో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన టీమిండియా చివరి పోరులోనూ ఘన విజయాన్ని అందుకుంది. కెరీర్లో 50వ వన్డే ఆడిన శుబ్‌మన్ గిల్ శతకానికి తోడు శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లి రాణించడంతో భారీ స్కోరు సాధించిన టీమిండియా ఆ తర్వాత బలమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టి పడేసింది.‘బజ్‌బాల్‘ మాయలో ‘బ్యాడ్బాల్’గా మారిపోయిన ఆటతో ఇంగ్లండ్ మరో భారీ ఓటమిని మూటగట్టుకుంది. మరోవైపు కోహ్లి సహా ప్రధాన బ్యాటర్లంతా ఫామ్‌లోకి వచ్చిన సానుకూలతతో ఇక చాంపియన్స్ ట్రోఫీ సమరానికి రోహిత్ బృందం సన్నద్ధమైంది. అహ్మదాబాద్: ఇంగ్లండ్‌పై టి20 సిరీస్‌ను 4–1తో గెలుచుకున్న భారత్ జట్టు ఇప్పుడు వన్డే సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. బుధవారం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన చివరిదైన మూడో మ్యాచ్‌లో భారత్ 142 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్‌మన్ గిల్ (102 బంతుల్లో 112; 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా... శ్రేయస్ అయ్యర్ (64 బంతుల్లో 78; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), కోహ్లి (55 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు. కోహ్లితో 116 పరుగులు జోడించిన గిల్, అయ్యర్‌తో 104 పరుగులు జత చేశాడు. అనంతరం ఇంగ్లండ్ 34.2 ఓవర్లలో 214 పరుగులకే ఆలౌటైంది. అట్కిన్సన్ (19 బంతుల్లో 38; 6 ఫోర్లు, 1 సిక్స్), బాంటన్ (41 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సిరీస్‌లో 259 పరుగులు చేసిన గిల్‌కే ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. శతక భాగస్వామ్యాలు... గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ (1) ఈసారి రెండో బంతికే వెనుదిరిగాడు. అయితే గిల్, కోహ్లి భాగస్వామ్యంలో భారత్ ఇన్నింగ్స్ సరైన దిశలో సాగింది. 7 పరుగుల వద్ద సమన్వయ లోపంతో కోహ్లి రనౌట్ ప్రమాదంలో పడినా వుడ్ త్రో నేరుగా వికెట్లను తగలకపోవడంతో బతికిపోయాడు. తొలి 10 ఓవర్లలో భారత్ 52 పరుగులు చేసింది. ఆ తర్వాత వీరిద్దరు కొన్ని చక్కటి షాట్లతో అలరించారు. ఐదు బంతుల వ్యవధిలో గిల్ (51 బంతుల్లో), కోహ్లి (50 బంతుల్లో) అర్ధ సెంచరీలు పూర్తయ్యాయి. అయితే తర్వాతి ఓవర్లో రషీద్ వేసిన చక్కటి బంతిని ఆడలేక కోహ్లి వెనుదిరిగాడు. అనంతరం ఫామ్‌లో ఉన్న అయ్యర్...గిల్‌తో జత కలిశాడు. ఈ జోడీ కూడా పదునైన బ్యాటింగ్‌తో అలవోకగా పరుగులు సాధించింది. వుడ్ ఓవర్లో డీప్ మిడ్‌వికెట్ మీదుగా ఫోర్ కొట్టి 95 బంతుల్లోనే గిల్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ఆ వెంటనే 43 బంతుల్లో అయ్యర్ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే తక్కువ వ్యవధిలో వీరిద్దరిని ఆదిల్ రషీద్ వెనక్కి పంపించాడు. గత రెండు వన్డేల్లో విఫలమైన కేఎల్ రాహుల్ (29 బంతుల్లో 40; 3 ఫోర్లు, 1 సిక్స్) ఈసారి మెరుగ్గా ఆడగా... రషీద్ ఓవర్లో వరుసగా 6, 6 బాది తర్వాతి బంతికి హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 17) అవుటయ్యాడు.తర్వాత వచ్చిన బ్యాటర్లందరూ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వరుసగా వికెట్లు కోల్పోయినా... భారత్ 350 పరుగుల స్కోరును దాటగలిగింది. ఆఖరి 7 బంతుల్లో 3 వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. భారత తుది జట్టులో వరుణ్ చక్రవర్తి, షమీ, రవీంద్ర జడేజా స్థానాల్లో కుల్దీప్, వాషింగ్టన్ సుందర్, అర్ష్ దీప్ తుది జట్టులోకి వచ్చారు. సమష్టి వైఫల్యం... భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (21 బంతుల్లో 23; 4 ఫోర్లు), బెన్ డకెట్ (22 బంతుల్లో 34; 8 ఫోర్లు) సరైన ఆరంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 6.2 ఓవర్లలోనే 60 పరుగులు జోడించారు. రాణా తన తొలి 2 ఓవర్లలో 5 ఫోర్లతో 22 పరుగులు ఇవ్వగా... అర్ష్ దీప్ ఓవర్లో డకెట్ వరుసగా 4 బంతుల్లో 4 ఫోర్లు కొట్టాడు. అయితే ఈ భాగస్వామ్యం విడిపోయిన తర్వాత ఇంగ్లండ్ తడబడింది. బాంటన్, రూట్ (29 బంతుల్లో 24; 2 ఫోర్లు) కొద్దిసేపు నిలబడినా వీరిద్దరు ఎనిమిది పరుగుల వ్యవధిలో వెనుదిరిగారు. ఆ తర్వాత జట్టు కోలుకోలేకపోయింది. టపటపా వికెట్లను కోల్పోయి ఓటమి దిశగా పయనించింది. రాణా వరుసగా రెండు ఓవర్లలో బట్లర్ (6), బ్రూక్ (26 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్)లను బౌల్డ్ చేయడంతో జట్టు ఆశలు కోల్పోయింది. మిగతా లాంఛనం ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. మరో 15.4 ఓవర్లు మిగిలి ఉండగానే జట్టు కుప్పకూలింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) సాల్ట్ (బి) వుడ్ 1; గిల్ (బి) రషీద్ 112; కోహ్లి (సి) సాల్ట్ (బి) రషీద్ 52; అయ్యర్ (సి) సాల్ట్ (బి) రషీద్ 78; రాహుల్ (ఎల్బీ) (బి) మహమూద్ 40; పాండ్యా (బి) రషీద్ 17; అక్షర్ (సి) బాంటన్ (బి) రూట్ 13; సుందర్ (సి) బ్రూక్ (బి) వుడ్ 14; రాణా (సి) బట్లర్ (బి) అట్కిన్సన్ 13; అర్ష్ దీప్ (రనౌట్) 2; కుల్దీప్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్) 356. వికెట్ల పతనం: 1–6, 2–122, 3–226, 4–259, 5–289, 6–307, 7–333, 8–353, 9–353, 10–356. బౌలింగ్: సాఖిబ్ మహమూద్ 10–0–68–1, మార్క్ వుడ్ 9–1–45–2, అట్కిన్సన్ 8–0–74–1, రూట్ 5–0–47–1, ఆదిల్ రషీద్ 10–0–64–4, లివింగ్‌స్టోన్ 8–0–57–0. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) అక్షర్ (బి) అర్ష్ దీప్ 23; డకెట్ (సి) రోహిత్ (బి) అర్ష్ దీప్ 34; బాంటన్ (సి) రాహుల్ (బి) కుల్దీప్ 38; రూట్ (బి) అక్షర్ 24; బ్రూక్ (బి) రాణా 19; బట్లర్ (బి) రాణా 6; లివింగ్‌స్టోన్ (స్టంప్డ్) రాహుల్ (బి) సుందర్ 9; అట్కిన్సన్ (బి) అక్షర్ 38; రషీద్ (బి) పాండ్యా 0; వుడ్ (సి) అయ్యర్ (బి) పాండ్యా 9; మహమూద్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (34.2 ఓవర్లలో ఆలౌట్) 214. వికెట్ల పతనం: 1–60, 2–80, 3–126, 4–134, 5–154, 6–161, 7–174, 8–175, 9–193, 10–214. బౌలింగ్: అర్ష్ దీప్ 5–0–33–2, హర్షిత్ రాణా 5–1–31–2, వాషింగ్టన్ సుందర్ 5–0–43–1, అక్షర్ పటేల్ 6.2–1–22–2, పాండ్యా 5–0–38–2, కుల్దీప్ యాదవ్ 8–0–38–1. ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడకుండానే..చాంపియన్స్ ట్రోఫీ బరిలో టీమిండియా దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీకి ముందు సన్నాహకంగా భారత జట్టు ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడటం లేదు. బుధవారం వరకు స్వదేశంలో ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడిన టీమిండియా... తమకు ప్రాక్టీస్ మ్యాచ్‌ల అవసరం లేదని తేల్చేసింది. టోర్నీలో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఫిబ్రవరి 14–17 మధ్య జరుగుతాయి. 19న టోర్నీ ప్రారంభం కానుండగా, భారత జట్టు 15న దుబాయ్ చేరుకుంటుంది. మరోవైపు అఫ్గానిస్తాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ టీమ్‌లు మాత్రం పాక్ గడ్డపైనే ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడబోతున్నాయి. ఈ మూడు మ్యాచ్‌లలో తలపడేందుకు ప్రత్యర్థులుగా పాకిస్తాన్ మూడు వేర్వేరు జట్లను ఎంపిక చేసింది. మరో ప్రాక్టీస్ పోరులో న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్ తలపడతాయి. 1ఒకే మైదానంలో మూడు ఫార్మాట్లలోనూ (టెస్టు, వన్డే, టి20) సెంచరీలు చేసిన తొలి భారతీయ క్రికెటర్‌గా శుబ్‌మన్ గిల్ గుర్తింపు పొందాడు. నరేంద్ర మోదీ స్టేడియంలో గిల్ టి20ల్లో (న్యూజిలాండ్‌పై 126 నాటౌట్; 2023లో), టెస్టుల్లో (ఆ్రస్టేలియాపై 128; 2023లో), వన్డేల్లో (ఇంగ్లండ్‌పై 112; 2025లో) ఒక్కో సెంచరీ సాధించాడు. -
మూడో వన్డేలో భారత్ గ్రాండ్ విక్టరీ.. సిరీస్ క్లీన్ స్వీప్ (ఫోటోలు)
-
క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి
సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను టి20ల్లో చిత్తు చేసిన తర్వాత వన్డే సిరీస్ కూడా గెలుచుకొని భారత జట్టు ఒక లాంఛనం ముగించింది. ఇప్పుడు ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఒకే ఒక వన్డే అందుబాటులో ఉంది. ఇప్పటికే సిరీస్ గెలుచుకుంది కాబట్టి బెంచీపై ఉన్న ఆటగాళ్లకు మేనేజ్మెంట్ ఒక అవకాశం ఇస్తుందా లేక విజయాల బాటలో ఉన్న జట్టును కొనసాగించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తుందా అనేది చూడాలి. మరోవైపు ఇంగ్లండ్ కోణంలో ఇది కాస్త పరువు దక్కించుకునే ప్రయత్నం. ఇక్కడ ఆడిన 7 మ్యాచ్‌లలో 6 ఓడి నిరాశలో మునిగిన టీమ్ కనీసం చివరి పోరులోనైనా గెలిచి పర్యటనను ముగించాలని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అతి పెద్ద స్టేడియం ఆఖరి పోరుకు వేదిక కానుంది. అహ్మదాబాద్: భారత గడ్డపై ఇంగ్లండ్ జట్టు పరిమిత ఓవర్ల పర్యటన చివరి అంకానికి చేరింది. సిరీస్ ఫలితం తేలిపోయిన తర్వాత నేడు మొతేరా లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగే నామమాత్రపు చివరి వన్డేలో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. తాజా ప్రదర్శనను బట్టి చూస్తే అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న టీమిండియాకు మరో విజయం కూడా కష్టం కాకపోవచ్చు. ఇక్కడా గెలిచి సిరీస్‌ను 3–0తో సాధించాలని రోహిత్ శర్మ బృందం భావిస్తోంది. మరోవైపు కొంత కాలం క్రితం వరకు అభేద్యమైన టీమ్‌గా కనిపించిన ఇంగ్లండ్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో పూర్తిగా విఫలమై చేతులెత్తేసింది. ఈ పోరు తర్వాత ఇరు జట్లు చాంపియన్స్ ట్రోఫీ బాట పడతాయి. కోహ్లి కొడతాడా! చాంపియన్స్ ట్రోఫీకి ముందు రోహిత్ భారత్ బెంగ తీర్చాడు. చక్కటి సెంచరీతో సత్తా చాటుతూ అతను ఫామ్‌లోకి వచ్చాడు. శుబ్‌మన్ గిల్ వరుసగా రెండు అర్ధసెంచరీలతో ఆకట్టుకోగా, శ్రేయస్ అయ్యర్ కూడా నిలకడగా రాణిస్తున్నాడు. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తమ విలువను చూపించారు. పదే పదే బ్యాటింగ్ ఆర్డర్ స్థానం మారడం వల్ల ఇబ్బంది పడుతున్న కేఎల్ రాహుల్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. పంత్‌కు కాకుండా రాహుల్‌కే మరో అవకాశం దక్కవచ్చు. అయితే అన్నింటికి మించి ప్రధాన బ్యాటర్లలో విరాట్ కోహ్లి ప్రదర్శన కోసమే అంతా ఎదురు చూస్తున్నారు. ఆసీస్ గడ్డపై తొలి టెస్టు తర్వాత మొదలైన వైఫల్యం రంజీ మ్యాచ్ మీదుగా ఇక్కడ రెండో వన్డే వరకు సాగింది. అతని స్థాయిని బట్టి చూస్తే ఎప్పుడైనా చెలరేగిపోగలడు. కానీ అలాంటి ఇన్నింగ్సే ఇంకా రావడం లేదు. 14 వేల మైలురాయికి మరో 89 పరుగుల దూరంలో ఉన్న కోహ్లి ఈ మ్యాచ్‌లోనే దానిని పూర్తి చేసుకుంటాడా చూడాలి. బౌలింగ్ విభాగంలో షమీ ఇంకా పూర్తిగా తన లయను అందుకోలేదని గత మ్యాచ్‌లో అర్థమైంది. యువ బౌలర్ హర్షిత్ రాణా కూడా తడబడుతున్నాడు. అతని స్థానంలో అర్‡్షదీప్‌ను ఆడించే విషయంపై మేనేజ్మెంట్ చర్చిస్తోంది. స్పిన్నర్లలో వరుణ్ చక్రవర్తి చక్కటి బౌలింగ్ ప్రదర్శన కనబర్చడం మరో సానుకూలాంశం. ఓవరాల్‌గా అన్ని రంగాల్లో జట్టు పటిష్టంగా ఉంది. బాంటన్‌కు చాన్స్... ప్రత్యర్థితో పోలిస్తే ఇంగ్లండ్ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఒక్క ఆటగాడు కూడా తనదైన స్థాయి ప్రదర్శనను కనబర్చి జట్టును గెలిపించేలా కనిపించడం లేదు. రెండు వన్డేల్లో ప్రధాన బ్యాటర్లంతా తలా ఓ చేయి వేసినా విజయానికి అది సరిపోలేదు. గతంలో చూపించి విధ్వంసకర బ్యాటింగ్ ఇంగ్లండ్ నుంచి రావడం లేదు. ఓపెనర్లు సాల్ట్, డకెట్ శుభారంభాలు ఇస్తున్నారు కానీ ఆ తర్వాత దానిని ఇతర బ్యాటర్లు కొనసాగించలేకపోతున్నారు. కెపె్టన్ బట్లర్, జో రూట్ మాత్రమే నమ్మకమైన ఆటగాళ్లుగా కనిపిస్తుండగా, రెండో వన్డేలో హ్యారీ బ్రూక్ మరీ నెమ్మదిగా ఆడాడు. ఒవర్టన్ స్థానంలో బాంటన్‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. మరోవైపు బౌలింగ్ పూర్తిగా బలహీనంగా కనిపిస్తోంది. భారత బ్యాటర్ల ముందు ఈ బౌలర్లంతా అనామకుల్లా కనిపిస్తున్నారు. ఏ ఒక్కరిలో కూడా ప్రత్యర్థిని నిలువరించే సత్తా కనిపించడం లేదు. సాఖిబ్ స్థానంలో ఆర్చర్ బరిలోకి దిగవచ్చు. అట్కిన్సన్, వుడ్, రషీద్ ఏమాత్రం రాణిస్తారో చూడాలి. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్ ), గిల్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, పాండ్యా, అక్షర్, జడేజా, రాణా, షమీ, వరుణ్. ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్ ), సాల్ట్, డకెట్, బాంటన్, రూట్, బ్రూక్, లివింగ్‌స్టోన్, కార్స్, ఆర్చర్, రషీద్, వుడ్.పిచ్, వాతావరణం సాధారణ బ్యాటింగ్ పిచ్. చక్కగా పరుగులు సాధించవచ్చు. వర్షసూచన ఏమాత్రం లేదు. వేడి వాతావరణం. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.13 మరో 13 పరుగులు చేస్తే రోహిత్ వన్డేల్లో 11 వేల మైలురాయిని అందుకుంటాడు. -
ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమిండియా ప్రయాణానికి ముహూర్తం ఖరారు!?
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ప్రారంభం కానుంది. పాక్ జట్టు ఈసారి ఆతిథ్య హోదాలో బరిలోకి దిగనుంది. పాకిస్తాన్ ఓ ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వనుండడం 29 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో ఈ మెగా టోర్నీని విజయవంతంగా నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్‌బోర్డు భావిస్తోంది.అయితే భారత్ ఆడే మ్యాచ్‌లు మొత్తం దుబాయ్ వేదికగా జరగనున్నాయి. భారత్ సెమీఫైనల్, ఫైనల్‌కు చేరినా ఈ మ్యాచ్‌లు కూడా దుబాయ్‌లోనే జరగనున్నాయి. ఇక ఇప్పటికే ఈ ఈవెంట్లో పాల్గోనే ఆ దేశ క్రికెట్ బోర్డులు తమ జట్లను సైతం ప్రకటించాయి. ఈ మినీ వరల్డ్‌కప్ కోసం అన్ని దాదాపు అన్ని తమ సన్నాహకాల్లో బీజీబీజీగా ఉన్నాయి. భారత్ స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఆడుతుండగా.. దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు ట్రైసిరీస్‌లో తలపడుతున్నాయి.ముహూర్తం ఖరారు..కాగా మెగా టోర్నీ కోసం భారత జట్టు దుబాయ్ వెళ్లేందుకు ముహర్తం ఖారారైంది. ఫిబ్రవరి 15న రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా దుబాయ్‌కు పయనం కానుంది. భారత జట్టు ప్రస్తుతం మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడుతోంది. ఇప్పటికే రెండు వన్డేల ముగియగా.. ఆఖరి వన్డే బుధవారం(ఫిబ్రవరి 12) జరగనుంది. ఆ తర్వాత రెండు రోజులు విశ్రాంతి తీసుకుని ఈ మెగా టోర్నీలో పాల్గోనేందుకు రోహిత్ సేన వెళ్లనుంది.అదేవిధంగా స్పోర్ట్స్ టాక్ రిపోర్ట్ ప్రకారం.. భారత జట్టు ఎటువంటి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకుండానే నేరుగా ఈ మెగా టోర్నీ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.సాధారణంగా ప్రతీ ఐసీసీ ఈవెంట్‌కు ముందు ఆయా జట్లు కనీసం ఒక ప్రాక్టీస్ మ్యాచ్ అయినా ఆడుతాయి.తొలుత భారత్ కూడా యూఏఈ లేదా బంగ్లాదేశ్‌తో ఓ వార్మాప్ మ్యాచ్ ఆడనున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ జట్ల బీజీ షెడ్యూల్ కారణంగా వార్మాప్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు ఐసీసీకి వీలుపడలేదు. ఇక ఈ మెగా టోర్నీలో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్‌తో టీమిండియా అమీతుమీ తెల్చుకోనుంది.ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, షమీ, అర్ష్‌దీప్ సింగ్చదవండి: అరంగేట్రంలోనే శతక్కొట్టిన సౌతాఫ్రికా ఓపెనర్.. వరల్డ్ రికార్డు -
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్‌కు భారీ ఎదురుదెబ్బ
ఛాంపియన్స్ ట్రోఫీకి (Champion Trophy-2025) ముందు ఇంగ్లండ్‌కు (England) భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు యువ ఆల్‌రౌండర్ జేకబ్ బేతెల్ (Jacob Bethell) గాయం కారణంగా మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ధృవీకరించాడు. బేతెల్ లాంటి ప్రామిసింగ్ ఆల్‌రౌండర్ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం కావడం దురదృష్టకరమని బట్లర్ అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో బేతెల్ సేవలు కోల్పోనుండటంపై విచారం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్ మేనేజ్మెంట్ బేతెల్‌కు కవర్‌గా టామ్ బాంటన్‌ను ఎంపిక చేసింది.21 ఏళ్ల బేతెల్ ఇటీవలే మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో పెద్దగా రాణించలేని బేతెల్.. నాగ్‌పూర్ వేదికగా భారత్‌తో జరిగిన తొలి వన్డేలో హాఫ్ సెంచరీ సహా వికెట్ తీసుకున్నాడు. గాయం కారణంగా బేతెల్ భారత్‌తో జరిగిన రెండో వన్డేలో ఆడలేదు.తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ను ఢీకొట్టనున్న ఇంగ్లండ్ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 22న ఆడనుంది. కరాచీలో జరిగే ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మొదలువుతుంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగుతాయి. ఈ టోర్నీలో భారత్ ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్-బిలో ఉండగా.. భారత్, పాక్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ గ్రూప్-ఏలో పోటీపడనున్నాయి. మెగా టోర్నీలో భారత్, పాక్‌ల సమరం ఫిబ్రవరి 23న జరుగనుంది.రెండో వన్డేలోనూ భారత్‌దే విజయంమూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా కటక్ వేదికగా నిన్న జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు తొలి వన్డేలోనూ నెగ్గిన భారత్.. మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. అంతకుముందు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కూడా భారత్ 4-1 తేడాతో గెలుపొందింది.రెండో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (65), జో రూట్ (69) అర్ద సెంచరీలతో రాణించారు. సాల్ట్ 26, హ్యారీ బ్రూక్ 31, బట్లర్ 34, లివింగ్‌స్టోన్ 41, ఆదిల్ రషీద్ 14 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లు పడగొట్టగా.. షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ దక్కించుకున్నారు.సెంచరీతో చెలరేగిన రోహిత్ఛేదనలో రోహిత్ శర్మ (119) సెంచరీతో చెలరేగడంతో భారత్ 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (60), శ్రేయస్ అయ్యర్ (44), అక్షర్ పటేల్ (41 నాటౌట్) రాణించారు. విరాట్ కోహ్లి (5) మరోసారి నిరాశపరిచాడు. కేఎల్ రాహుల్ 10, హార్దిక్ పాండ్యా 10 పరుగులకు ఔటయ్యారు. రవీంద్ర జడేజా (11 నాటౌట్) సాయంతో అక్షర్ భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమీ ఓవర్టన్ రెండు వికెట్లు పడగొట్టగా.. అట్కిన్సన్, ఆదిల్ రషీద్, లివింగ్‌స్టోన్ తలో వికెట్ తీశారు. నామమాత్రపు మూడో వన్డే ఫిబ్రవరి 12న అహ్మదాబాద్‌లో జరుగనుంది. -
రో‘హిట్స్’... భారత్‌దే సిరీస్
చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత శిబిరానికి గొప్ప శుభవార్త! క్రికెట్‌ను శ్వాసించే అభిమానులకు కచ్చితంగా ఇది తీపి కబురు! ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ(Rohit Sharma) ఫామ్‌లోకి వచ్చాడు. అట్లాంటి... ఇట్లాంటి... ఆటతో కాదు. 300 పైచిలుకు పరుగుల వేటలో భారత్ ఉండగా... తనశైలి రో‘హిట్స్’తో అలరిస్తూ, లక్ష్యాన్ని కరిగిస్తూ, శతకంతో కదంతొక్కాడు. అతని జోరుకు మైదానం హోరెత్తింది. పెద్ద లక్ష్యమే అయినా చిన్నబోయింది. ఇంకో మ్యాచ్ ఉండగానే వన్డే సిరీస్ కూడా టీమిండియా వశమైంది.కటక్: భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) వరుసగా రెండు, మూడు మ్యాచ్‌లు విఫలమైనా... తక్కువ స్కోరుకు అవుటైనా... విమర్శకులు ఈ మధ్య నెట్టింట తెగ విరుచుకుపడుతున్నారు. ఆదివారం ‘హిట్‌మ్యాన్’ విరుచుకుపడ్డాడు. నోటితో కాదు... బ్యాట్‌తో! నెట్లో కాదు... మైదానంలో! అద్భుతమైన సెంచరీతో కొండంత లక్ష్యాన్ని టీమిండియా అలవోకగా ఛేదించేలా చేశాడు. దీంతో ఆఖరి పోరు మిగిలుండగానే వన్డే సిరీస్ కూడా భారత్ చేతికి చిక్కింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (56 బంతుల్లో 65; 10 ఫోర్లు), జో రూట్ (72 బంతుల్లో 69; 6 ఫోర్లు), లివింగ్‌స్టోన్ (32 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. బ్యాట్ గర్జిస్తున్న వేళ భారత బౌలర్లంతా పరుగులు సమరి్పంచుకుంటే... రవీంద్ర జడేజా (10–1–35–3) మాత్రం పూర్తి కోటా వేసి వికెట్లు తీసి పరుగుల వేగాన్ని అడ్డుకున్నాడు. అనంతరం కఠినమైన లక్ష్యమే అయినా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ రోహిత్ (90 బంతుల్లో 119; 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) వీరోచిత శతకంతో భారత్ 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (52 బంతుల్లో 60; 9 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్ (47 బంతుల్లో 44; 3 ఫోర్లు, 1 సిక్స్) ఇద్దరూ కెపె్టన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0తో దక్కించుకుంది. చివరిదైన మూడో వన్డే ఈనెల 12న అహ్మదాబాద్‌లో జరుగుతుంది. డకెట్, రూట్... ఫిఫ్టీ–ఫిఫ్టీ ఇంగ్లండ్ ఓపెనర్లు సాల్ట్ (26; 2 ఫోర్లు, 1 సిక్స్), డకెట్ దూకుడుగా ఆడి తొలి వికెట్‌కు 81 పరుగులు జోడించారు. డకెట్ 36 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు. అతడు అవుటయ్యాక రూట్, హ్యారీ బ్రూక్ (31; 3 ఫోర్లు, 1సిక్స్) నింపాదిగా ఆడటంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఆద్యంతం సాఫీగా సాగిపోయింది. రూట్ 60 బంతుల్లో తన వన్డే కెరీర్లో 56వ అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అనంతరం కెపె్టన్ బట్లర్ (34; 2 ఫోర్లు), లివింగ్‌స్టోన్ (32 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు సైతం పరుగులు సాధించడంతో ఇంగ్లండ్ 300 పైచిలుకు స్కోరు చేయగలిగింది. షమీ, రాణా, పాండ్యా, వరుణ్ తలా ఒక వికెట్ తీశారు. 76 బంతుల్లో శతకం ఎంతటి బ్యాటింగ్ పిచ్ అయినా... 305 పరుగుల లక్ష్యం వన్డేల్లో అంత ఈజీ కానేకాదు. చక్కని శుభారంభం... కడదాకా ఓర్పుగా, నేర్పుగా ఒక బ్యాటరైనా క్రీజులో నిలిస్తేనే గెలుపు ఆశలుంటాయి. సరిగ్గా నాయకుడు రోహిత్ కూడా ఇదే చేశాడు. ఓపెనింగ్‌లో గిల్‌తో జతగా మొదట లక్ష్యానికి అనువైన ఆరంభమిచ్చాడు. దీంతో 6.2 ఓవర్లలోనే భారత్ స్కోరు 50 దాటింది. భారీ షాట్లతో విరుచుకుపడిన ‘హిట్‌మ్యాన్’ 30 బంతుల్లో అర్ధసెంచరీ సాధించగా, గిల్ 45బంతుల్లో పూర్తి చేశాడు. ఇద్దరి పట్టుదలతో 14వ ఓవర్లోనే జట్టు 100కు చేరుకుంది. తర్వాత గిల్ ని్రష్కమించినా, కోహ్లి (5) విఫలమైనా ... ఆ ప్రభావం ఇన్నింగ్స్‌పై పడకుండా అయ్యర్‌తో కలిసి ధాటిని కొనసాగిస్తూ టీమిండియాను లక్ష్యంవైపు నడిపించాడు. ఈ క్రమంలో 76 బంతుల్లో సెంచరీ సాధించాక భారీ షాట్‌కు యతి్నంచి అవుటయ్యాడు. అప్పుడు జట్టు స్కోరు 29.4 ఓవర్లలో 220/3. ఇక గెలిచేందుకు 125 బంతుల్లో 85 చేస్తే చాలు. ఈ పనిలో అక్షర్ పటేల్ (43 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు) అజేయంగా భాగమవడంతో 33 బంతులు మిగిలుండగానే భారత్ మ్యాచ్ నెగ్గింది.ఫ్లడ్‌లైట్లు మొరాయించడంతో... బారాబతి స్టేడియంలోని ఫ్లడ్‌లైట్లు మొరాయించడంతో ఆటకు అరగంటకు పైగానే అంతరాయం ఏర్పడింది. డేనైట్ వన్డేలు, టి20ల కోసం మైదానం చుట్టూరా... ఎనిమిది చోట్ల ఫ్లడ్లైట్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఒకదాంట్లో సమస్య వచ్చింది. భారీ లక్ష్యఛేదనకు దిగిన భారత్ 6.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ధనాధన్ వేగంతో 48 పరుగులు చేసింది. ఈ సమయంలో క్లాక్ టవర్ వద్ద వున్న ఫ్లడ్‌లైట్లు ఆగిపోయాయి. దీంతో 35 నిమిషాల పాటు మ్యాచ్‌ను నిలిపేసి లైట్లు వెలిగాకే తిరిగి మ్యాచ్‌ను నిర్వహించారు.స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) జడేజా (బి) వరుణ్ 26; డకెట్ (సి) పాండ్యా (బి) జడేజా 65; రూట్ (సి) కోహ్లి (బి) జడేజా 69; బ్రూక్ (సి) గిల్ (బి) రాణా 31; బట్లర్ (సి) గిల్ (బి) పాండ్యా 34; లివింగ్‌స్టోన్ (రనౌట్) 41; ఓవర్టన్ (సి) గిల్ (బి) జడేజా 6; అట్కిన్సన్ (సి) కోహ్లి (బి) షమీ 3; రషీద్ (రనౌట్) 14; మార్క్ వుడ్ (రనౌట్) 0; సఖిబ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్) 304. వికెట్ల పతనం: 1–81, 2–102, 3–168, 4–219, 5–248, 6–258, 7–272, 8–297, 9–304, 10–304. బౌలింగ్: షమీ 7.5–0–66–1, హర్షిత్ రాణా 9–0–62–1, పాండ్యా 7–0–53–1, వరుణ్ 10–0–54–1, జడేజా 10–1–35–3, అక్షర్ 6–0–32–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) రషీద్ (బి) లివింగ్‌స్టోన్ 119; గిల్ (బి) ఓవర్టన్ 60; కోహ్లి (సి) సాల్ట్ (బి) రషీద్ 5; అయ్యర్ (రనౌట్) 44; అక్షర్ పటేల్ (నాటౌట్) 41; కేఎల్ రాహుల్ (సి) సాల్ట్ (బి) ఓవర్టన్ 10; పాండ్యా (సి) ఓవర్టన్ (బి) అట్కిన్సన్ 10; జడేజా (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (44.3 ఓవర్లలో 6 వికెట్లకు) 308. వికెట్ల పతనం: 1–136, 2–150, 3–220, 4–258, 5–275, 6–286. బౌలింగ్: సఖిబ్ 6–0–36–0, అట్కిన్సన్ 7–0–65–1, మార్క్ వుడ్ 8–0–57–0, ఆదిల్ రషీద్ 10–0–78–1, ఓవర్టన్ 5–0– 27–2, లివింగ్‌స్టోన్ 7–0–29–1, రూట్ 1.3–0–15–0. -
IND Vs ENG: హిట్‌మ్యాన్ సూపర్ షో.. సిరీస్ టీమిండియా కైవసం
కటక్: ఇంగ్లండ్‌తో కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగి ఆడి జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. ఇంగ్లండ్ నిర్దేశించిన 305 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 44.3 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. రోహిత్ శర్మ వీరవిహారంతో టీమిండియా అవలీలగా విజయం సాధించింది. ఫలితంగా సిరీస్‌ను 2-0 తేడాతో ఇంకోమ్యాచ్ ఉండగానే కైవసం చేసుకుంది టీమిండియా.హిట్‌మ్యాన్ సూపర్ షో..చాలాకాలం తర్వాత బ్యాటింగ్‌లో చెలరేగిన రోహిత్.. సెంచరీతో మెరిశాడు. గత కొంతకాలంగా ఫామ్ కోసం తంటాలు పడుతున్న హిట్ మ్యాన్.. తిరిగి సత్తా చాటాడు. తనపై వరుసగా వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే సమాదానం చెప్పాడు రోహిత్. 76 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో తనదైన శైలిలో రెచ్చిపోయి శతకం పూర్తి చేసుకున్నాడు. సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేయడం విశిషం. ఇది రోహిత్‌కు 18 నెలల తర్వాత వన్డేల్లో తొలి సెంచరీ. 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 119 పరుగులు చేశాడు రోహిత్. ఇది రోహిత్‌కు 32వ వన్డే శతకం.కోహ్లి విఫలం..శుభ్‌మన్ గిల్(60; 52 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) తో కలిసి భారీ ాభాగస్వామ్యాన్ని నెలకొల్పాడు రోహిత్. ఈ జోడి తొలి వికెట్‌కు 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత గిల్ తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లి(5) మరోసారి విఫలమయ్యాడు. 8 బంతుల్లో ఒక ఫోర్ కొట్టిన అనంతరం కోహ్లి ెపెవిలియన్ బాట పట్టాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో ాసాల్ట్ుకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు ివిరాట్.ఆకట్టుకున్న అయ్యర్కోహ్లి ఔటైన తర్వాత సెకండ్ డౌన్లోక్రీజ్లోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఆకట్టుకున్నాడు. రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించాడు. ఒకవైపు రోహిత్ దూకుడుగా ఆడుతుంటే అయ్యర్.. స్ట్రైక్‌రొటేట్ చేస్తూ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ జోడి 70 పరుగులు జోడించిన తర్వాత రోహిత్ మూడో వికెట్‌గా ఔటయ్యాడు.లివింగ్ స్టోన్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి రషీద్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో 220 పరుగుల వద్ద రోహిత్ రూపంలో టీమిండియా మూడో వికెట్ ను కోల్పోయింది. రోహిత్ ఔటైన స్వల్ప వ్యవధిలోనే అయ్యర్ సైతం పెవిలియన్ చేరాడు. 47 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 44 పరుగులు చేసిన అయ్యర్..రనౌట్ అయ్యాడు.నిరాశపరిచిన రాహుల్.. మెరిసిన అక్షర్ఫోర్త్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన కేఎల్ రాహుల్ మరోసారి నిరాశపరిచాడు. 14 బంతుల్లో 1 ఫోర్ సాయంతో 10 పరుగులు చేసిన రాహుల్.. జెమీ ఓవర్టాన్ బౌలింగ్ లో సాల్ట్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అక్షర్ పటేల్ మాత్రం బ్యాటింగ్ లో మెరిశాడు. ఆడపా దడపా షాట్లుకొడుతూ నిలకడగా బ్యాటింగ్ చేశాడు. 43 బంతుల్లో 4 ఫోర్లతో41 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు అక్షర్.అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(26), బెన్ డకెట్(65)లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ జోడి 81 పరుగులు జత చేసిన తర్వాత సాల్ట్ తొలి ివికెట్ గా పెవిలియన్ చేరాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి సాల్ట్ ఔటయ్యాడు. అనంతరం జో రూట్ తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందకు తీసుకెళ్లాడు డకెట్. అయితే వీరి భాగస్వామ్యం ఎంతో సేపో నిలవలేదు. డకెట్‌ను రవీంద్ర జడేజా పెవిలియన్ కు పంపాడు.ఆపై బ్రూక్(31), జాస్ బట్లర్(34)లు కాస్త ఫర్వాలేదనిపించారు. జో రూట్ 72 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 69 పరుగులు చేసి ఇన్నింగ్స్,ను చక్కదిద్దాడు. ఆఖరి ఓవర్ వరకూ లివింగ్‌స్టోన్(41) ఉండటంతో ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు సాధించగా, షమీ, హర్షిత్ రానా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలకు తలో వికెట్ దక్కింది.నాగ్‌పూర్‌లో జరిగిన తొలి వన్డేలో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసింది. ఇక నామమాత్రమైన మూడో వన్డే అహ్మదాబాద్‌లో బుధవారం జరుగనుంది. -
రెండో వన్డే: హిట్‌మ్యాన్ వీరవిహారం
కటక్: టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ వీరవిహారం చేశాడు. చాలాకాలం తర్వాత బ్యాటింగ్‌లో చెలరేగిన రోహిత్.. సెంచరీతో మెరిశాడు. గత కొంతకాలంగా ఫామ్ కోసం తంటాలు పడుతున్న హిట్ మ్యాన్.. తిరిగి సత్తా చాటాడు. తనపై వరుసగా వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే సమాదానం చెప్పాడు రోహిత్. 76 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో తనదైన శైలిలో రెచ్చిపోయి శతకం పూర్తి చేసుకున్నాడు. సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేయడం విశిషం. ఇది రోహిత్‌కు 18 నెలల తర్వాత వన్డేల్లో తొలిసారి సెంచరీ.కటక్‌లో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ నిర్దేశించిన 305 పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో ఓపెనర్‌గా దిగిన రోహిత్,.. సొగసైన ఇన్నింగ్స్ ఆడాడు. శుభ్‌మన్ గిల్(60; 52 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ జోడి తొలి వికెట్‌కు 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత గిల్ తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లి(5) మరోసారి విఫలమయ్యాడు. రోహిత్ సెంచరీ చేసే సమయానికి టీమిండియా ఇంకా 119 పరుగులు చేయాల్సింది ఉంది. రోహిత్‌కు జతగా శ్రేయస్ అయ్యార్ క్రీజ్‌లో ఉన్నాడు. ఇది రోహిత్‌కు 32వ వన్డే శతకం. అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(26), బెన్ డకెట్(65)లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ జోడి 81 పరుగులు జత చేసిన తర్వాత సాల్ట్ తొలి ివికెట్ గా పెవిలియన్ చేరాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి సాల్ట్ ఔటయ్యాడు. అనంతరం జో రూట్ తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందకు తీసుకెళ్లాడు డకెట్. అయితే వీరి భాగస్వామ్యం ఎంతో సేపో ినిలవలేదు. డకెట్‌ను రవీంద్ర జడేజా పెవిలియన్ కు పంపాడు.ఆపై బ్రూక్(31), జాస్ బట్లర్(34)లు కాస్త ఫర్వాలేదనిపించారు. జో రూట్ 72 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 69 పరుగులు చేసి ఇన్నింగ్స్,ను చక్కదిద్దాడు. ఆఖరి ఓవర్ వరకూ లివింగ్‌స్టోన్(41) ఉండటంతో ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు సాధించగా, షమీ, హర్షిత్ రానా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలకు తలో వికెట్ దక్కింది. -
రెండో వన్డే: టీమిండియా టార్గెట్ 305
కటక్: బారాబతి స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ 305 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(26), బెన్ డకెట్(65)లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ జోడి 81 పరుగులు జత చేసిన తర్వాత సాల్ట్ తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి సాల్ట్ ఔటయ్యాడు. అనంతరం జో రూట్ తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు డకెట్. అయితే వీరి భాగస్వామ్యం ఎంతో సేపు నిలవలేదు. డకెట్‌ను రవీంద్ర జడేజా పెవిలియన్ కు పంపాడు.ఆపై బ్రూక్(31), జాస్ బట్లర్(34)లు కాస్త ఫర్వాలేదనిపించారు. జో రూట్ 72 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 69 పరుగులు చేసి ఇన్నింగ్స్,ను చక్కదిద్దాడు. ఆపై ఆఖరి ఓవర్ వరకూ లివింగ్‌స్టోన్(41) ఉండటంతో ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగుల గౌరవప్రదమైన స్కోరును బోర్డుపై ఉంచింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు సాధించగా, షమీ, హర్షిత్ రానా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలకు తలో వికెట్ దక్కింది.కాగా,తొలి వన్డేకు గాయం కారణంగా దూరమైన కోహ్లి.. పూర్తి ఫిట్నెస్ సాధించడంతో తిరిగి జట్టులోకి జట్టులోకి వచ్చాడు. అదేవిధంగా ఈ మ్యాచ్‌తో వరుణ్ చక్రవర్తి భారత తరపున వన్డే అరంగేట్రం చేశాడు. టీ20ల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండడంతో వరుణ్‌కు వన్డేల్లో కూడా అవకాశం దక్కింది. కోహ్లి, వరుణ్ రాకతో జైశ్వాల్,కుల్దీప్ యాదవ్ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. మరోవైపు ఇంగ్లండ్ తమ జట్టులో మూడు మార్పులు చేసింది. గుస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, జేమీ ఓవర్టన్ తుది జట్టులోకి వచ్చారు. దీంతో జాకబ్ బెతల్, కార్స్, అర్చర్లకు ఇంగ్లండ్ మేనేెజ్మెంట్ విశ్రాంతినిచ్చింది. -
రోహిత్ శర్మకు భారీ షాక్!.. వన్డే కెప్టెన్సీ కూడా అవుట్?
-
నేడు భారత్, ఇంగ్లండ్ రెండో వన్డే
-
సిరీస్ విజయమే లక్ష్యంగా...
ఇంగ్లండ్‌పై టి20 సిరీస్ జోరును కొనసాగిస్తూ వన్డేల్లోనూ శుభారంభం చేసిన భారత జట్టు ఇప్పుడు మరో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమైంది. అన్ని రకాలుగా ఫామ్‌లో ఉన్న టీమిండియా ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో చెలరేగుతున్న భారత్‌ను నిలువరించడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతూ వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న ఇంగ్లండ్ ఈ సారైనా కోలుకొని పోటీనిస్తుందా చూడాలి. కటక్: ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీకి ముందు సొంతగడ్డపై తమ సత్తాను ప్రదర్శిస్తున్న భారత జట్టు ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్‌ను గెలుచుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. బారాబతి స్టేడియంలో నేడు జరిగే రెండో వన్డేలో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసి 38.4 ఓవర్లలోనే ఛేదన పూర్తి చేసిన భారత్ అదే స్థాయి ఆటను ప్రదర్శిస్తే మరో మ్యాచ్ కూడా రోహిత్ సేన ఖాతాలో చేరుతుంది.టి20ల్లో చిత్తుగా ఓడి తొలి వన్డేలో కూడా 248కే పరిమితమైన ఇంగ్లండ్ మెరుగైన ప్రదర్శనతో సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. 2006 నుంచి భారత గడ్డపై 31 సార్లు భారత్‌తో తలపడిన ఇంగ్లండ్ 5 మ్యాచ్‌లే గెలిచి 25 ఓడింది. కోహ్లి సిద్ధం... గాయంతో తొలి మ్యాచ్‌కు దూరమైన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పూర్తి ఫిట్‌గా సిద్ధమయ్యాడు. రెండో వన్డేలో అతను బరిలోకి దిగడం ఖాయమైంది. కోహ్లి కూడా చాలా రోజులుగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. లయ అందుకునేందుకు అతనికి ఇదే సరైన అవకాశం. అయితే ఎవరి స్థానంలో విరాట్ ఆడతాడనేది ఆసక్తికరం. గత మ్యాచ్‌లో చెప్పినదాని ప్రకారం శ్రేయస్‌ను తప్పించి కోహ్లిని తీసుకోవాలి. కానీ మెరుపు అర్ధసెంచరీతో ఆకట్టుకున్న శ్రేయస్‌ను పక్కన పెడితే టీమ్ మేనేజ్మెంట్పై తీవ్ర విమర్శలు రావచ్చు. కోచ్ గంభీర్ సాధారణంగా ఓపెనింగ్ ఎడమ, కుడిచేతివాటం కాంబినేషన్‌ను ఇష్టపడతాడు. అలా చూస్తే శ్రేయస్‌పైనే వేటు వేసి జైస్వాల్‌ను ఆడించవచ్చు. కానీ చాంపియన్స్ ట్రోఫీ ప్రణాళికలను దృష్టిలో ఉంచుకొని చూస్తే ప్రయోగాలు చేయకుండా జైస్వాల్‌ను పక్కన పెట్టడం సరైన నిర్ణయమవుతుంది. మరో వైపు రాహుల్ స్థానంలో కీపర్‌గా పంత్‌ను ఆడించే ఆలోచన కూడా ఉంది. లెఫ్టార్మ్ పేసర్ అర్ష్ దీప్ సింగ్‌ను పరీక్షించేందుకు రాణాను పక్కన పెట్టాలనే చర్చ కూడా జరుగుతోంది. ఎలాగైనా ఈ సిరీస్ గెలవాలని భావిస్తే భారత జట్టు మార్పులపై దృష్టి పెట్టకపోవచ్చు. కానీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ సిరీస్‌లో ఆటగాళ్లను పరీక్షించాలనే ఆలోచన ఉంటే మాత్రం మార్పులు ఖాయం. సీనియర్ పేసర్ షమీ గత మ్యాచ్‌లో వికెట్లు తీయకపోయినా చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆల్‌రౌండర్ అక్షర్ బ్యాటింగ్‌లో రాణించడం సానుకూలాంశం. అయితే అన్నింటికి మించి కెపె్టన్ రోహిత్ ఫామ్‌లోకి రావడం భారత్‌కు ముఖ్యం. చాలా కాలంగా వరుసగా విఫలమవుతున్న రోహిత్ ఇక్కడైనా రాణిస్తాడా చూడాలి. గిల్, పాండ్యా, జడేజాలతో మన బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. గెలిపించేదెవరు? ఈ పర్యటనలో ఐదు మ్యాచ్‌లలో ఓడిన ఇంగ్లండ్ ఆట దిశానిర్దేశం లేకుండా సాగుతోంది. పేరుకు భారీ బ్యాటింగ్ లైనప్ కనిపిస్తున్నా ఆ జట్టు వ్యూహాల్లో పదును లోపించింది. గుడ్డిగా బ్యాట్లు ఊపడం తప్ప ఆటగాళ్లు విఫలమవుతున్న చోట రెండో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. కోచ్ మెక్‌కలమ్ ప్రణాళికలు ఏవీ పని చేయడం లేదు. భారత గడ్డపై అనుభవం ఉన్న బట్లర్ మాత్రమే ఎంతో కొంత రాణిస్తుండగా బెతెల్ కాస్త పట్టుదలగా ఆడగలిగాడు. జట్టు ఆధారపడుతున్న రూట్, బ్రూక్ స్థాయికి తగ్గ ఆటను కనబర్చాల్సి ఉంది. ముఖ్యంగా బ్రూక్ 5 టి20లు, వన్డే కలిపి 91 పరుగులే చేశాడు. డకెట్ ఇంకా వన్డే ఓపెనర్‌గా కుదురుకోకపోగా, సాల్ట్ మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. ఆర్చర్, కార్స్ పేస్ భారత బ్యాటర్లపై ఎలాంటి ప్రభావం చూపకపోగా, రషీద్ తేలిపోయాడు. ఈ మ్యాచ్‌లో మరో పేసర్ వుడ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. 40 ఓవర్లలోపే భారత్ తొలి వన్డే ముగించడం ఇంగ్లండ్ బౌలింగ్ బలహీనతను కూడా చూపించింది. దీనిని ఆ జట్టు ఎలా అధిగమిస్తుందో చూడాలి. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్ ), గిల్, కోహ్లి, శ్రేయస్, రాహుల్/ పంత్, పాండ్యా, జడేజా, అక్షర్, కుల్దీప్, అర్ష్ దీప్, షమీ ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్ ),సాల్ట్, రూట్, బ్రూక్,డకెట్, లివింగ్‌స్టోన్, బెతెల్, కార్స్, ఆర్చర్, రషీద్, వుడ్. పిచ్, వాతావరణం ఈ మైదానంలో ఐదేళ్ల తర్వాత వన్డే మ్యాచ్ జరుగుతోంది. మొదటినుంచి ఇక్కడి పిచ్ బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఈ సారి కూడా పరుగుల వరద ఖాయం. వర్షం అంతరాయం కలిగించే అవకాశం లేదు. -
IND Vs ENG: శుబ్‌మన్, శ్రేయస్ సత్తా చాటగా...
స్వదేశంలో జరుగుతున్న పోరులో ఇంగ్లండ్‌పై భారత్ సంపూర్ణ ఆధిపత్యం కొనసాగుతోంది. టి20 సిరీస్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా ఇప్పుడు వన్డేల్లో గెలుపుతో బోణీ చేసింది. బౌలింగ్‌లో జడేజా, రాణా రాణించడంతో ముందుగా ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన జట్టు...ఆపై గిల్, శ్రేయస్, అక్షర్ బ్యాటింగ్‌తో 11.2 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరింది. పేలవ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ మరోసారి పరాజయానికే పరిమితమైంది. నాగ్‌పూర్: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో భారత్ 1–0తో ముందంజ వేసింది. గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్ (67 బంతుల్లో 52; 4 ఫోర్లు), జాకబ్ బెతెల్ (64 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేయగా...ఫిల్ సాల్ట్ (26 బంతుల్లో 43; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు.భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 38.4 ఓవర్లలో 6 వికెట్లకు 251 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్‌మన్ గిల్ (96 బంతుల్లో 87; 14 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 59; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), అక్షర్ పటేల్ (47 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నారు. రెండో వన్డే ఆదివారం కటక్‌లో జరుగుతుంది. కీలక భాగస్వామ్యాలు... ఓపెనర్లు సాల్ట్, బెన్ డకెట్ (29 బంతుల్లో 32; 6 ఫోర్లు) ఇంగ్లండ్‌కు శుభారంభం అందించారు. వీరిద్దరు దూకుడుగా ఆడుతూ తొలి వికెట్‌కు 8.5 ఓవర్లలోనే 75 పరుగులు జోడించారు. ఓపెనర్లను నిలువరించడంలో భారత బౌలర్లు విఫలమవుతున్న స్థితిలో ఇంగ్లండ్ స్వయంకృతం ఇన్నింగ్స్‌ను మలుపు తిప్పింది. లేని మూడో పరుగు కోసం ప్రయత్నించిన సాల్ట్‌ను చక్కటి ఫీల్డింగ్‌తో శ్రేయస్ రనౌట్ చేయడంతో జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత రెండు పరుగుల వ్యవధిలో మరో 2 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో పడింది. సుదీర్ఘ విరామం తర్వాత వన్డే ఆడిన జో రూట్ (19) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఈ దశలో బట్లర్, బెతెల్ కలిసి ఇంగ్లండ్‌ను ఆదుకున్నారు. వీరిద్దరు భారీ షాట్లకు పోకుండా జాగ్రత్తగా ఆడారు. 58 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తయిన వెంటనే బట్లర్ నిష్క్రమించాడు. బెతెల్‌తో కలిసి ఐదో వికెట్‌కు అతను 14.3 ఓవర్లలో 59 పరుగులు జత చేశాడు. 62 బంతుల్లో బెతెల్ హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకోగా...తర్వాతి బ్యాటర్లెవరూ నిలవలేకపోవడంతో మరో 16 బంతులు మిగిలి ఉండగానే ఇంగ్లండ్ ఆట ముగిసింది. రాణించిన అక్షర్... ఛేదనలో ఆరంభంలో భారత్ తడబడింది. 19 పరుగుల వద్దే యశస్వి జైస్వాల్ (15), రోహిత్ శర్మ (2) వెనుదిరిగారు. అయితే గిల్, శ్రేయస్ భాగస్వామ్యంలో జట్టు దూసుకుపోయింది. ముఖ్యంగా శ్రేయస్ మెరుపు బ్యాటింగ్‌తో అలరించాడు. ఆర్చర్ ఓవర్లో వరుసగా 2 సిక్స్‌లు బాదిన అతను, కార్స్ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టాడు. ఈ జోరులో 30 బంతుల్లోనే అతని అర్ధసెంచరీ పూర్తయింది. గిల్‌తో కలిసి మూడో వికెట్‌కు 94 పరుగులు (10.4 ఓవర్లలో) జోడించిన తర్వాత శ్రేయస్ వెనుదిరిగాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ అయిన అక్షర్ పటేల్ కూడా గిల్‌కు తగిన విధంగా సహకరించడంతో జట్టు లక్ష్యం దిశగా సాగింది. ఈ క్రమంలో గిల్ 60 బంతుల్లో, అక్షర్ 46 బంతుల్లోనే హాఫ్ సెంచరీలను అందుకున్నారు. నాలుగో వికెట్‌కు 17.5 ఓవర్లలో 108 పరుగులు జత చేసిన అనంతరం అక్షర్ అవుటయ్యాడు. ఈ దశలో భారత్ విజయానికి 28 పరుగులు, గిల్ సెంచరీకి 19 పరుగులు అవసరమయ్యాయి. అయితే గిల్ సెంచరీ చేజార్చుకోగా, రాహుల్ (2) కూడా నిలబడలేదు. కానీ పాండ్యా (9 నాటౌట్), జడేజా (12 నాటౌట్) కలిసి మ్యాచ్‌ను ముగించారు.26 పరుగులు సమర్పించుకున్నా... కెరీర్లో తొలి వన్డే ఆడుతున్న రాణా బౌలింగ్ ఆరంభంలో తడబడ్డాడు. ముఖ్యంగా అతని మూడో ఓవర్లో సాల్ట్ 3 సిక్స్‌లు, 2 ఫోర్లతో చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో సాల్ట్ వరుసగా 6, 4, 6, 4, 0, 6 బాదడంతో మొత్తం 26 పరుగులు వచ్చాయి. అయితే తన నాలుగో ఓవర్లో అతను సత్తా చాటి పరిస్థితిని మార్చాడు. మూడో బంతికి డకెట్‌ను అవుట్ చేసిన రాణా చివరి బంతికి బ్రూక్‌ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత కీలకమైన లివింగ్‌స్టోన్ వికెట్ కూడా రాణా ఖాతాలోనే చేరింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (రనౌట్) 43; డకెట్ (సి) జైస్వాల్ (బి) రాణా 32; రూట్ (ఎల్బీ) (బి) జడేజా 19; బ్రూక్ (సి) రాహుల్ (బి) రాణా 0; బట్లర్ (సి) పాండ్యా (బి) అక్షర్ 52; బెతెల్ (ఎల్బీ) (బి) జడేజా 51; లివింగ్‌స్టోన్ (సి) రాహుల్ (బి) రాణా 5; కార్స్ (బి) షమీ 10; రషీద్ (బి) జడేజా 8; ఆర్చర్ (నాటౌట్) 21; మహమూద్ (స్టంప్డ్) రాహుల్ (బి) కుల్దీప్ 2; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (47.4 ఓవర్లలో ఆలౌట్) 248. వికెట్ల పతనం: 1–75, 2–77, 3–77, 4–111, 5–170, 6–183, 7–206, 8–220, 9–241, 10–248. బౌలింగ్: షమీ 8–1–38–1, రాణా 7–1–53–3, అక్షర్ 7–0–38–1, పాండ్యా 7–1–37–0, కుల్దీప్ 9.4–0–53–1, జడేజా 9–1–26–3. భారత్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) సాల్ట్ (బి) ఆర్చర్ 15; రోహిత్ శర్మ (సి) లివింగ్‌స్టోన్ (బి) మహమూద్ 2; గిల్ (సి) బట్లర్ (బి) మహమూద్ 86; శ్రేయస్ (ఎల్బీ) (బి) బెతెల్ 59; అక్షర్ (బి) రషీద్ 52; రాహుల్ (సి) అండ్ (బి) రషీద్ 2; పాండ్యా (నాటౌట్) 9; జడేజా (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (38.4 ఓవర్లలో 6 వికెట్లకు) 251. వికెట్ల పతనం: 1–19, 2–19, 3–113, 4–221, 5–225, 6–235. బౌలింగ్: ఆర్చర్ 7–1–39–1, మహమూద్ 6.4–0–47–2, కార్స్ 5–0–52–0, రషీద్ 10–1–49–2, బెతెల్ 3–0–18–1, లివింగ్‌స్టోన్ 5–0–28–0, రూట్ 2–0–10–0. సినిమా చూస్తుండగా... ‘నేను ఈ మ్యాచ్ ఆడతానని అనుకోలేదు. కాస్త ఎక్కువ సేపు మెలకువతో ఉండవచ్చు అనుకొని రాత్రి సినిమా చూస్తూ కూర్చున్నాను. అయితే కోహ్లి మోకాలికి గాయం అయిందని నువ్వు ఆడాల్సి ఉంటుందని కెప్టెన్ రోహిత్నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే సినిమాను సగంలోనే ఆపేసి వెంటనే వెళ్లి పడుకున్నాను’ –శ్రేయస్ అయ్యర్ జైస్వాల్‌ను ఆడించాలని టీమ్ మేనేజ్మెంట్ ముందే సిద్ధమైందని శ్రేయస్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. గత కొంత కాలంగా వన్డేల్లో ఘనమైన రికార్డు ఉన్నా సరే... శ్రేయస్‌కు తుది జట్టులో చోటు లేకపోవడం ఆశ్చర్యకరం.గాయంతో దూరమైన కోహ్లి టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లి లేకుండానే భారత జట్టు తొలి వన్డేలో బరిలోకి దిగింది. కుడి మోకాలికి గాయం కారణంగా కోహ్లి ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. బుధవారం ప్రాక్టీస్ సమయంలోనే అతనికి ఈ గాయమైందని టాస్ సమయంలో కెప్టెన్ రోహిత్ వెల్లడించాడు. అయితే మ్యాచ్ ముందు రోజు టీమ్ మేనేజ్మెంట్ ఈ విషయాన్ని చెప్పలేదు. గురువారం జట్టు సభ్యులందరితో కలిసి మైదానానికి వచ్చిన కోహ్లి స్వల్పంగా డ్రిల్స్‌లో పాల్గొన్నాడు. అయితే ఈ సమయంలో అతను కాలికి ప్లాస్టర్‌తో కనిపించాడు. యశస్వి జైస్వాల్, రాణా అరంగేట్రం పేస్ బౌలర్ హర్షిత్ రాణా, ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్‌తో వన్డే క్రికెట్లోకి అడుగు పెట్టారు. భారత్ తరఫున వన్డేలు ఆడిన 257, 258వ ఆటగాళ్లుగా వీరిద్దరు గుర్తింపు పొందారు. భారత్ తరఫున ఇప్పటికే 19 టెస్టులు, 23 టి20లు ఆడిన 23 ఏళ్ల ముంబై ఆటగాడు జైస్వాల్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగా... ఢిల్లీకి చెందిన రాణా ఆ్రస్టేలియా గడ్డపై తొలి రెండు టెస్టులు ఆడాడు. ఆపై ఇంగ్లండ్‌తో గత శుక్రవారం జరిగిన చివరి మ్యాచ్‌తో అంతర్జాతీయ టి20ల్లోకి అడుగు పెట్టాడు. -
తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం (ఫోటోలు)
-
‘చాంపియన్స్’కు సన్నాహం
టి20 సిరీస్‌లో ఇంగ్లండ్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు ఇప్పుడు వన్డే సమరానికి సిద్ధమైంది. సరిగ్గా ఆరు నెలల విరామం తర్వాత వన్డేల్లో బరిలోకి దిగుతున్న టీమిండియా రాబోయే చాంపియన్స్ ట్రోఫీకి ముందు సన్నాహకంగా ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను వాడుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఒకరిద్దరు మినహా దాదాపు టి20 టీమ్‌తోనే వన్డే సిరీస్ కూడా ఆడనున్న బట్లర్ బృందం ఈ ఫార్మాట్లోనైనా రాణించి పరువు నిలబెట్టుకోవాలని కోరుకుంటోంది. తుది జట్టు ఎంపిక, వ్యూహాల విషయంలో ఈ మూడు మ్యాచ్‌లో రోహిత్ బృందానికి కీలకం కానున్నాయి. నాగ్‌పూర్: వన్డే వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరిన అనంతరం 6 మ్యాచ్‌లే ఆడిన భారత జట్టుదక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్ గెలిచి, ఆ తర్వాత శ్రీలంక చేతిలో ఓడింది. మన ఆటగాళ్లు ఈ ఫార్మాట్లో గత ఏడాది ఆగస్టు తర్వాత మళ్లీ మ్యాచ్ ఆడలేదు. ఇప్పుడు కొంత విరామం తర్వాత భారత్‌లోనే మన జట్టు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో తలపడనుంది. జమ్తాలోని విదర్భ క్రికెట్ సంఘం (వీసీఏ) మైదానంలో నేడు ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగు తుంది. ఇటీవల టెస్టుల్లో ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొ న్న కెపె్టన్ రోహిత్, కోహ్లి తమదైన శైలిలో చెలరేగేందుకు వన్డేలే సరైన వేదిక. టి20 ఫామ్‌ను కొనసాగిస్తూ ఇక్కడా జట్టు సిరీస్‌ను గెలుచుకుంటుందా అనేది ఆసక్తికరం. షమీ, కుల్దీప్ ఫామ్ కీలకం... టెస్టు, టి20 ఫార్మాట్లతో పోలిస్తే భారత వన్డే జట్టు కూర్పు చాలా కాలంగా గందరగోళం లేకుండా దాదాపు ఒకేలా ఉంది. ముఖ్యంగా టాప్–6 విషయంలో సందేహాలు లేవు. వరల్డ్ కప్ తరహాలోనే రోహిత్, గిల్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, పాండ్యాలు వరుసగా ఆయా స్థానాల్లో ఆడతారు. వీరంతా కుడిచేతి వాటం బ్యాటర్లే. అయితే ఇప్పుడు కొత్త ప్రణాళికల్లో భాగంగా వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ స్థానంలో వైవిధ్యం కోసం పంత్‌ను తీసుకుంటారా అనేది చూడాలి. నాగ్‌పూర్ పిచ్‌ను బట్టి చూస్తే ముగ్గురు స్పిన్నర్లు ఆడవచ్చు. గాయం నుంచి కోలుకొని పునరాగమనం చేస్తున్న కుల్దీప్ ఆడటం ఖాయం. అతనికి తోడు జట్టుకు నాలుగు స్పిన్ ప్రత్యామ్నాయాలు జడేజా, అక్షర్, సుందర్, వరుణ్ చక్రవర్తి రూపంలో అందుబాటులో ఉన్నాయి. పేసర్లుగా షమీ, అర్ష్ దీప్ పై బాధ్యత ఉంది. తాజాగా ఇంగ్లండ్‌పై 2 టి20లు ఆడిన షమీకి వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ఇదే తొలి వన్డే కానుంది. బుమ్రా గైర్హాజరీలో షమీపై అదనపు బాధ్యత కూడా ఉంది. రూట్, బట్లర్ మినహా... టి20ల్లో చిత్తయిన ఇంగ్లండ్‌పై తీవ్ర ఒత్తిడి ఉంది. కొంత కాలం క్రితం వరకు భీకరమైన లైనప్‌తో ఈ ఫార్మాట్‌ను శాసించిన ఆ జట్టు వరుస వైఫల్యాలతో తడబడుతోంది. వరల్డ్ కప్ తర్వాత టీమ్‌లో స్థానం కోల్పోయిన సీనియర్ జో రూట్‌ను మళ్లీ ఈ సిరీస్ కోసం ఎంపిక చేశారు. అతనితో పాటు కెప్టెన్ బట్లర్‌కు మాత్రం భారత్‌లో చెప్పుకోదగ్గ అనుభవం ఉంది. ఎక్కువ మంది టి20 స్పెషలిస్ట్‌లే ఉన్న జట్టు వన్డేల్లో ఏమాత్రం రాణించగలదనేది చూడాలి. మ్యాచ్‌కు ముందు రోజే ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. తుది జట్ల వివరాలు: భారత్ (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్ ), గిల్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, పాండ్యా, జడేజా, సుందర్, కుల్దీప్, అర్ష్ దీప్, షమీ.ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్ ), డకెట్, సాల్ట్, రూట్, బ్రూక్, లివింగ్‌స్టోన్, బెతెల్, కార్స్, ఆర్చర్, రషీద్, సాఖిబ్.107 భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇప్పటి వరకు 107 వన్డేలు జరిగాయి. 58 మ్యాచ్‌ల్లో భారత్ నెగ్గగా... 44 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలిచింది. 2 మ్యాచ్‌లు ‘టై’గా ముగిశాయి. 3 మ్యాచ్‌లు రద్దయ్యాయి.52 స్వదేశంలో ఇంగ్లండ్‌తో భారత్ ఆడిన వన్డేలు. 34 మ్యాచ్‌ల్లో టీమిండియా, 17 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలిచాయి. 1 మ్యాచ్ ‘టై’ అయింది.6 వీసీఏ స్టేడియంలో భారత్ ఆడిన వన్డేలు. ఇక్కడ 4 వన్డేల్లో నెగ్గిన టీమిండియా, 2 వన్డేల్లో ఓడిపోయింది. 2019 తర్వాత వీసీఏ స్టేడియంలో భారత్ వన్డే ఆడనుంది.పిచ్, వాతావరణంచక్కటి బ్యాటింగ్ వికెట్. అయితే పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుంది. వర్షసూచన ఏమాత్రం లేదు. -
‘ఒక్క సిరీస్‌తో తక్కువ చేయవద్దు’
నాగ్‌పూర్: ఆ్రస్టేలియాతో ఇటీవల జరిగిన బోర్డర్–గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో భారత్ 1–3 తేడాతో పరాజయం పాలైంది. దాంతో జట్టులో ప్రధాన ఆటగాళ్ల ప్రదర్శనపై పలు రకాల విశ్లేషణలు సాగాయి. సీనియర్ల ఆటపై పలు విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఈ తరహా విమర్శలను వన్డే టీమ్ వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తప్పు పట్టాడు. నిజానికి తాము ఆసీస్ గడ్డపై కూడా మెరుగ్గానే ఆడామని, కొద్దిలో ఓటమి పాలయ్యామని అతను వివరించాడు. ‘ఒక్క సిరీస్ ఫలితం మా జట్టు ఫామ్‌ను చూపించదు. జట్టులోని కీలక ఆటగాళ్లంతా గతంలో ఎన్నో టోర్నీల్లో నిలకడగా రాణించారు. ఆ్రస్టేలియాతో సిరీస్‌లో మేం అంచనాలకు తగినట్లుగా ఆడలేదనేది వాస్తవం. అయితే మరీ ఘోరంగా విఫలమేమీ కాలేదు. చివరి రోజు బుమ్రా లేకపోవడం దురదృష్టకరం. అతను ఆడితే మేం మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేసేవాళ్లం. ఒక మ్యాచ్ లేదా ఒక రోజు మా ఆటేంటో చెప్పదు. గతంలో అక్కడ రెండుసార్లు సిరీస్ సాధించాం. వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ వెళ్లడంతో పాటు టి20 వరల్డ్ కప్ కూడా గెలిచామని మరచి పోవద్దు’ అని గిల్ సమాధానమిచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేల్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడన్న గిల్... టీమ్‌లో వరుసగా మార్పులు చేర్పులు సరైంది కాదన్నాడు. ‘విజయ్ హజారే వన్డే ట్రోఫీలో కరుణ్ నాయర్ చాలా గొప్పగా ఆడాడు. అందరూ ఇది అంగీకరించాలి. కానీ ఎవరి స్థానంలో తీసుకుంటారు. మేమంతా కూడా ఇక్కడికి రావడానికి ఎంతో కష్టపడ్డాం. ఇప్పుడు జట్టులో ఉన్నవాళ్లంతా చాలా బాగా ఆడుతున్నారు. మేం వరల్డ్ కప్‌లో ఒక్కటే మ్యాచ్ ఓడాం. కాబట్టి టీమ్‌లో అనవసరపు మార్పులు చేయవద్దు. కొంతకాలం ఒకే టీమ్‌ను కొనసాగించకపోతే జట్టు బలహీనంగా మారుతుంది’ అని గిల్ విశ్లేషించాడు. వైస్ కెప్టెన్ గా తనపై అదనపు బాధ్యత ఉందని... జట్టుకు అవసరమైనప్పుడల్లా రోహిత్‌కు తన సూచనలు అందిస్తానని గిల్ చెప్పాడు. టి20ల్లో చిత్తుగా ఓడినా... వన్డేల్లో ఇంగ్లండ్ బలమైన జట్టు కాబట్టి గట్టి పోటీ తప్పదని అతను అభిప్రాయపడ్డాడు. -
భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు బిగ్ షాక్
టీమిండియాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు వికెట్‌కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ తొలి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడని తెలుస్తుంది. జేమీ స్మిత్ భారత్‌తో ఇటీవల జరిగిన మూడో టీ20 సందర్భంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి అతను చికిత్స తీసుకుంటున్నాడు. తొలి వన్డేకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండగా.. జేమీ స్మిత్ ఇంకా కోలుకోలేదు. దీంతో అతను తొలి రెండు వన్డేలకు దూరం కానున్నాడని తెలుస్తుంది. అయితే ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. భారత్‌తో వన్డే సిరీస్‌లో స్మిత్ లేకపోయినా ఇంగ్లండ్‌కు మరో రెండు వికెట్‌కీపింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. కెప్టెన్ జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్‌లలో ఎవరో ఒకరు వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టవచ్చు. అయితే బట్లర్ గాయం నుంచి కోలుకున్న తర్వాత ఇప్పటివరకు వికెట్‌కీపింగ్ చేయలేదు. మరోవైపు సాల్ట్‌కు వన్డేల్లో పెద్దగా వికెట్‌కీపింగ్ చేసిన అనుభవం లేదు. మరి ఈ పరిస్థితుల్లో ఇంగ్లండ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందో వేచి చూడాలి.కాగా, భారత్‌తో తాజాగా ముగిసిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ 1-4 తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో పరాభవం తర్వాత ఇంగ్లండ్ కోలుకోవాలని చూస్తుంది. ఫిబ్రవరి 6 నుంచి భారత్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఎలాగైనా కైవసం చేసుకోవాలని భావిస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్‌కు ఇదే ఆఖరి వన్డే సిరీస్. ఈ సిరీస్‌లో సత్తా చాటి ఛాంపియన్స్ ట్రోఫీలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వాలని ఇంగ్లండ్ ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు ఇంగ్లండ్ వన్డే జట్టులో స్టార్ ఆటగాడు జో రూట్ చేరాడు. రూట్ చేరికతో ఇంగ్లండ్ బలం పెరుగుతుంది.ఫిబ్రవరి 6 నుంచి మొదలుభారత్తో తొలి వన్డే నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 6న జరుగనుంది. అనంతరం ఫిబ్రవరి 9, 12 తేదీల్లో రెండు, మూడు వన్డేలు జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌లకు కటక్, అహ్మదాబాద్ వేదికలు కానున్నాయి. ఈ మూడు మ్యాచ్‌లు మధ్యాహ్నం 1:30 గంటల నుంచి ప్రారంభమవుతాయి.భారత్‌తో వన్డే సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు..జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, జో రూట్, బెన్ డకెట్, జేకబ్ బేతెల్, లియామ్ లివింగ్‌స్టోన్, ఫిల్ సాల్ట్, జేమీ స్మిత్, బ్రైడన్ కార్స్, జేమీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ -
అదరగొడుతున్న ‘అభి’
142.3 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఒక బంతి... ఆ తర్వాత అదే ఓవర్లో 146.1 కిలోమీటర్ల వేగంతో మరో బంతి... 147.2 కిలోమీటర్ల వేగంతో తర్వాతి బంతి... మొదటిది ఎక్స్ట్రా కవర్ మీదుగా బౌండరీ దాటింది. తర్వాతి షార్ట్ బంతి బ్యాక్వర్డ్ పాయింట్ మీదుగా, మూడోది కవర్స్ మీదుగా సిక్సర్లుగా మారాయి! ప్రపంచంలో ఫాస్టెస్ట్ బౌలర్లలో ఒకడైన జోఫ్రా ఆర్చర్‌ను ఒకే ఓవర్లో అభిషేక్ శర్మ ఇలా చితకబాదిన తీరు అతని అసలైన బ్యాటింగ్ శైలిని చూపించాయి. ఒకదానితో మరొకటి పోటీ పడినట్లుగా అభిషేక్ బాదిన భారీ సిక్సర్లలో ఈ రెండు మరింత హైలైట్‌గా నిలిచాయి. అండర్–16 స్థాయి నుంచే దూకుడైన ఆటకు మారుపేరుగా నిలిచిన అభిషేక్ ఇప్పుడు 24 ఏళ్ల వయసులో భారత్ తరఫున టి20ల్లో భీకరమైన హిట్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంగ్లండ్‌తో ఆదివారం మ్యాచ్‌లో అభిషేక్ శర్మ అద్భుతమైన షాట్లతో వీరవిధ్వంసం సృష్టించిన ఇన్నింగ్స్ భారత టి20లో అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచిపోయింది. అతను కొట్టిన 7 ఫోర్లు, 13 సిక్స్‌లు కూడా పూర్తి ఆత్మవిశ్వాసంతో కొట్టిన అసలైన క్రికెటింగ్ షాట్లే. ఒక్కటి కూడా అనుకోకుండా తగిలి లేదా ఎడ్జ్ తీసుకొని వెళ్లింది లేదు. డ్రైవ్, లాఫ్టెడ్ డ్రైవ్, ఫ్లిక్, కట్... ఇలా ఏదైనా శ్రమ లేకుండా అలవోకగా, చూడముచ్చటగా ఆడటం అభిషేక్‌కే చెల్లింది. ఇక ప్రభావాన్ని చూస్తే మాత్రం అన్ని షాట్లూ ఫలితం రాబట్టినవే. ఐపీఎల్ ద్వారానే అభిమానులకు చేరువైన అతను ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా తన బ్యాటింగ్ పదును చూపించాడు. అక్కడే మొదలు... భారీ షాట్లు బాదడం, సిక్సర్లతో పండగ చేసుకోవడం అభిషేక్‌కు కొత్త కాదు. తన స్వస్థలం అమృత్‌సర్‌లోని గాంధీ స్టేడియంలో చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే అతను ఇలా ఆడేవాడు. అతని దెబ్బకు ఎంతో విలువైన కొత్త ఎస్జీ, కూకూబుర్రా, డ్యూక్ బంతులు గ్రౌండ్ బయట పడేవి. చివరకు కోచ్‌లు, సిబ్బంది ఈ జోరును తగ్గించమని, లేదంటే చాలా ఖర్చు అవుతుందని అభిషేక్ తండ్రి రాజ్‌కుమార్ శర్మకు మొర పెట్టుకోవాల్సి వచ్చేది. అయితే మీకు కావాలంటే చండీగఢ్ నుంచి నేను కొత్త బంతులు కొని ఇస్తానే తప్ప శైలి మార్చుకోమని నా కొడుకుకు చెప్పను అతని ఆయన ఖరాఖండీగా తేల్చేశారు. దాంతో టీనేజ్‌లో వచ్చిన ఆ ధాటి అన్ని చోట్లా అలాగే కొనసాగింది. బీసీసీఐ అండర్–16 టోర్నీ విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఒకే సీజన్ (2015–16)లో అతను ఇలాంటి బ్యాటింగ్‌తోనే ఏకంగా 1200కు పైగా పరుగులు సాధించి తానేంటో చూపించాడు. యువరాజ్ అండతో... దూకుడైన బ్యాటింగ్‌తో పాటు లెఫ్టార్మ్ స్పిన్‌తో కీలక ఓవర్లు వేయగల అభిషేక్ పంజాబ్ జట్టులో మిడిలార్డర్ నుంచి టాపార్డర్‌కు మారడంతో అతని బ్యాటింగ్ సత్తా అందరికీ తెలిసింది. కెపె్టన్‌గా అండర్–19 ఆసియాకప్‌ను గెలిపించిన అభిషేక్ 2018 అండర్–19 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు కూడా. పంజాబ్ తొలిసారి 2023లో దేశవాళీ టి20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలుచుకోవడంలో అతనిదే కీలక పాత్ర. ఈ టోర్నిలో ఏకంగా 192.46 స్ట్రయిక్‌రేట్‌తో అతను 485 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉండగా... ఆంధ్రపై 51 బంతుల్లోనే 9 ఫోర్లు, 9 సిక్స్‌లతో చేసిన 112 పరుగులు టోర్నిలో హైలైట్‌గా నిలిచాయి. అతని ఎదుగుదలలో భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ పాత్ర ఎంతో ఉంది. అభిషేక్‌కు మెంటార్‌గా యువీ ఎన్నో రకాలుగా మార్గనిర్దేశనం చేశాడు. ‘అభి’లోని హిట్టింగ్ సామర్థ్యాన్ని గుర్తించిన యువీ సరైన దిశలో ప్రోత్సహించిన ఫలితమే ఇప్పుడు ఈ సిక్సర్ల పండగ. అందుకే యువరాజ్ ఎప్పుడు, ఎక్కడ ప్రాక్టీస్‌కు పిలిచినా అభిషేక్ వెంటనే హాజరైపోతాడు. ఐపీఎల్లో జోరు... భారత క్రికెట్ అభిమానులకు అభిషేక్ విధ్వంసం విలువ 2024లోనే కనిపించింది. 2022 సీజన్లో కూడా సన్‌రైజర్స్ తరఫున 426 పరుగులు చేసినా గత సీజన్ మాత్రమే అతని స్థాయిని అమాంతం పెంచేసింది. ట్రవిస్ హెడ్‌తో కలిసి అతను నెలకొల్పిన భాగస్వామ్యాలు ఐపీఎల్లో అద్భుతాన్ని చూపించాయి. ఈ టోర్నిలో ఏకంగా 204.21 స్ట్రయిక్‌రేట్‌తో అభిషేక్ 484 పరుగులు చేసి టీమ్‌ను ఫైనల్ వరకు చేర్చాడు. ఇందులో 36 ఫోర్లు ఉంటే, సిక్స్‌లు 42 ఉన్నాయి! రెండు సార్లు సన్‌రైజర్స్ ఐపీఎల్లో అత్యధిక స్కోరు రికార్డులు బద్దలు కొట్టడంతో అతని పాత్రను అంతా ప్రత్యక్షంగా చూశారు. ఇదే సీజన్లో 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో అతను అదరగొట్టాడు. నిజానికి పంజాబ్ గెలిచిన ముస్తాక్ అలీ ట్రోఫీ నుంచే అతని స్థాయి ఎక్కడికో వెళ్లిపోయింది. నాటి నుంచి ఆదివారం మ్యాచ్ వరకు అతను టి20ల్లో 199.47 స్ట్రయిక్‌రేట్‌తో 1893 పరుగులు చేశాడంటే అభి ఆట ఎలా సాగుతోందో అర్థమవుతుంది. డకౌట్‌తో మొదలై... ఐపీఎల్ మెరుపుల తర్వాత భారత్ తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లో ‘డకౌట్’తో అభిషేక్ కెరీర్ మొదలైంది. అయితే దానిని మరచిపోయేలా తర్వాతి మ్యాచ్‌లో 46 బంతుల్లో సెంచరీతో అతను చెలరేగాడు. కానీ ఆ తర్వాత వరుస వైఫల్యాలతో మళ్లీ తడబాటు. దక్షిణాఫ్రికాపై రెండు మ్యాచ్‌లలో రాణించినా తాజా సిరీస్‌కు ముందు కాస్త ఒత్తిడి. కానీ కోల్‌కతాలో తొలి మ్యాచ్‌లో 34 బంతుల్లో 79 పరుగులతో చెలరేగి దానిని కాస్త తగ్గించుకోగలిగాడు. ఇప్పుడు చివరి మ్యాచ్‌కు వచ్చేసరికి అభిషేక్ విశ్వరూపం చూపించాడు. 17 మ్యాచ్‌ల టి20 కెరీర్లో అతను 276 బంతులు ఆడితే 46 ఫోర్లు, 41 సిక్సర్లతో 535 పరుగులు చేసి పరాక్రమించాడు. మున్ముందూ ఇదే ధాటి కొనసాగితే 2026 టి20 వరల్డ్ కప్ వరకు కూడా మనకు ఎదురుండదు. –సాక్షి క్రీడా విభాగం -
అభిషేక్...అమోఘం
ఇన్నింగ్స్ తొలి బంతికే సామ్సన్ సిక్స్‌తో భారత్ ఆట ఆరంభం. మూడో ఓవర్లో బౌండరీతో అభిషేక్ ధాటి కాస్త ఆలస్యం! అంతే ఇక ఆ ఓవర్లోనే రెండు సిక్స్‌లతో పదునెక్కిన ప్రతాపం. ఆర్చర్, మార్క్ వుడ్, ఓవర్టన్ ఇలా పేసర్లు మారినా... లివింగ్‌స్టోన్, రషీద్‌లు స్పిన్నేసినా... బంతి గమ్యం, అభిషేక్ వీరవిహారం... ఈ రెండూ ఏమాత్రం మారలేదు. 13 సిక్సర్లతో ‘వాంఖెడే’కు అభిషేకం... 37 బంతుల్లోనే శతకం... 18వ ఓవర్ దాకా అతనొక్కడిదే విధ్వంసం!ఆఖరి పోరు గెలిచి ఆతిథ్య దేశం ఆధిక్యానికి గండి కొట్టేద్దామనుకుంటే ఇంగ్లండ్ కనీసం జట్టంతా కలిపి 100 పరుగులైనా కొట్టలేకపోయింది. ప్రత్యర్థి పేస్, స్పిన్ వైవిధ్యం అభిషేక్ శర్మ ధాటిని ఏ ఓవర్లోనూ, ఏ బౌలింగ్‌తోనూ అసలు ప్రభావమే చూపలేకపోయింది. ముంబై: ఏఐ... అదేనండీ అర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ వైపే ఇప్పుడు ప్రపంచం చూస్తోంది. కానీ వాంఖెడే స్టేడియంలో మాత్రం మరో ఏఐ... అదే భయ్యా అభిషేక్ ఇంటలిజెంట్ బ్యాటింగ్ వైపే ఓ గంటసేపు కన్నార్పకుండా చూసేలా చేసింది. ఇది కదా ఫన్... ధన్ ధనాధన్! ఇదే కదా ఈ టి20 ద్వైపాక్షిక సిరీస్‌లో గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ మిస్సయ్యింది. అయితేనే ఆఖరి పోరులో ఆవిష్కృతమైంది. అభిషేక్ శర్మ (54 బంతుల్లో 135; 7 ఫోర్లు, 13 సిక్స్‌లు) ఆమోఘ శతకం, అదేపనిగా విధ్వంసం ముంబై వాసుల్ని మురిపించింది. టీవీ, మొబైల్ యాప్‌లలో యావత్ భారత అభిమానుల్ని కేరింతలతో ముంచెత్తింది. అతని ఆటలో అయ్యో ఈ షాట్‌ను చూడటం మిస్ అయ్యామే అని బహుశా ఏ ఒక్కరికీ అనిపించి ఉండకపోవచ్చు! ఎందుకంటే ప్రతి షాట్ హైలైట్స్‌నే తలదన్నేలా ఉంది. ఆదివారం అసలైన టి20 వినోదాన్ని పంచిన చివరి టి20లో భారత్ 150 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4–1తో సొంతం చేసుకుంది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 247 పరుగుల భారీస్కోరు చేసింది. శివమ్ దూబే (13 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఉన్న కాసేపు మెరిపించాడు. బ్రైడన్ కార్స్ 3, మార్క్‌వుడ్ 2 వికెట్లు తీశారు. తర్వాత కష్టమైన లక్ష్యం ఛేదించేందుకు దిగిన ఇంగ్లండ్ 10.3 ఓవర్లలోనే 97 పరుగుల వద్దే ఆలౌటైంది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (23 బంతుల్లో 55; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) బాదిన అర్ధశతకంతో ఆ మాత్రం స్కోరు చేసింది. మిగతావారిలో జాకబ్ బెథెల్ (10; 1 సిక్స్) తప్ప అందరివి సింగిల్ డిజిట్లే! షమీ 3 వికెట్లు పడగొడితే ఒక్క ఓవర్ వేసిన అభిషేక్, దూబే, వరుణ్‌లు తలా 2 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను 11వ ఓవర్ ముగియక ముందే స్పిన్‌తో దున్నేశారు. ఇంగ్లండ్ పాలిట సిక్సర పిడుగల్లే... మ్యాచ్ గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే మ్యాచ్ అంతటిని అభిషేక్ ఒక్కడే షేక్ చేశాడు. ఐదు పదుల బంతులు (54) ఎదుర్కొంటే ఇందులో కేవలం 5 మాత్రమే డాట్ బాల్స్. అంటే పరుగు రాలేదు. కానీ మిగతా 49 బంతుల్లో ‘రన్’రంగమే... ప్రత్యర్థి బౌలర్లేమో లబో... దిబో! ఇది అభిషేక్ సాగించిన విధ్వంసం. 17 బంతుల్లోనే అతను సాధించిన ఫిఫ్టీ భారత్ తరఫున రెండో వేగవంతమైన అర్ధశతకమైంది. అంతేనా... పవర్ ప్లే (6 ఓవర్లు)లో జట్టు స్కోరు 95/1 ఇది భారత్ తరఫున అంతర్జాతీయ టి20ల్లోనే అత్యధిక స్కోరైంది. ఆ తర్వాత 37 బంతుల్లోనే దంచేసిన మెరుపు శతకం శాశ్వత దేశాల మధ్య రెండో వేగవంతమైన సెంచరీగా పుటలకెక్కింది. 2017లో మిల్లర్ (దక్షిణాఫ్రికా) బంగ్లాదేశ్‌పై 35 బంతుల్లో శతక్కొట్టాడు. 3.5 ఓవర్లో 50 పరుగులు దాటిన భారత్ స్కోరు అతనొక్కడి జోరుతో 6.3 ఓవర్లోనే వందకు చేరింది. భారత్ 12వ ఓవర్లో 150, 16వ ఓవర్లో 200 పరుగుల్ని అవలీలగా దాటేసింది. మిగతావారిలో శివమ్ దూబే కాస్త మెరిపించాడు. అయితే దూబే (2–0–11–2) బౌలింగ్ స్పెల్‌తో గత మ్యాచ్ ‘కన్కషన్’ విమర్శలకు తాజా మ్యాచ్‌లో బంతితో సమాధానమిచ్చాడు. అభిషేక్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... వరుణ్ చక్రవర్తికి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) ఆర్చర్ (బి) వుడ్ 16; అభిషేక్ (సి) ఆర్చర్ (బి) రషీద్ 135; తిలక్‌వర్మ (సి) సాల్ట్ (బి) కార్స్ 24; సూర్యకుమార్ (సి) సాల్ట్ (బి) కార్స్ 2; దూబే (సి) రషీద్ (బి) కార్స్ 30; హార్దిక్ (సి) లివింగ్‌స్టోన్ (బి) వుడ్ 9; రింకూసింగ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఆర్చర్ 9; అక్షర్ రనౌట్ 15; షమీ నాటౌట్ 0; రవి బిష్ణోయ్ (సి) కార్స్ (బి) ఓవర్టన్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 247. వికెట్ల పతనం: 1–21, 2–136, 3–145, 4–182, 5–193, 6–202, 7–237, 8–247, 9–247. బౌలింగ్: జోఫ్రా ఆర్చర్ 4–0–55–1, మార్క్‌వుడ్ 4–0–32–2, ఓవర్టన్ 3–0–48–1, లివింగ్‌స్టోన్ 2–0–29–0, అదిల్ రషీద్ 3–0–41–1, బ్రైడన్ కార్స్ 4–0–38–3. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) సబ్–జురేల్ (బి) దూబే 55; డకెట్ (సి) అభిషేక్ (బి) షమీ 0; బట్లర్ (సి) తిలక్‌వర్మ (బి) వరుణ్ 7; హ్యారీ బ్రూక్ (సి) వరుణ్ (బి) రవి బిష్ణోయ్ 2; లివింగ్‌స్టోన్ (సి) రింకూ (బి) వరుణ్ 9; జాకబ్ (బి) దూబే 10; కార్స్ (సి) వరుణ్ (బి) అభిషేక్ 3; ఓవర్టన్ (సి) సూర్యకుమార్ (బి) అభిషేక్ 1; ఆర్చర్ నాటౌట్ 1; రషీద్ (సి) సబ్–జురేల్ (బి) షమీ 6; మార్క్‌వుడ్ (సి) సబ్–జురేల్ (బి) షమీ 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (10.3 ఓవర్లలో ఆలౌట్) 97. వికెట్ల పతనం: 1–23, 2–48, 3–59, 4–68, 5–82, 6–87, 7–90, 8–90, 9–97, 10–97. బౌలింగ్: షమీ 2.3–0–25–3, హార్దిక్ పాండ్యా 2–0–23–0, వరుణ్ 2–0–25–2, రవి బిష్ణోయ్ 1–0–9–1, శివమ్ దూబే 2–0–11–2, అభిషేక్ 1–0–3–2. ఆహా... ఆదివారంభారత క్రీడాభిమానులకు ఆదివారం పండుగలా గడిచింది. మధ్యాహ్నం కౌలాలంపూర్‌లో భారత అమ్మాయిల జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో వరుసగా రెండోసారి అండర్–19 టి20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష చిరస్మరణీయ ఆటతీరుతో అదరగొట్టింది. భారత జట్టు రెండోసారి విశ్వవిజేతగా నిలువడంలో కీలకపాత్ర పోషించింది. రాత్రి ఇటు ముంబైలో భారత పురుషుల జట్టు ఇంగ్లండ్‌పై వీరంగం సృష్టించింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి టి20ల్లో రెండోసారి ‘శత’క్కొట్టాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ అందుకున్న అభిషేక్ అమోఘమైన ఆటతో భారత జట్టు ఈ మ్యాచ్‌లో ఏకంగా 150 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4–1తో సొంతం చేసుకుంది. 1 భారత్ తరఫున అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (135) చేసిన ప్లేయర్‌గా అభిషేక్ నిలిచాడు. శుబ్‌మన్ గిల్ (126 నాటౌట్; న్యూజిలాండ్‌పై) రెండో స్థానంలో ఉన్నాడు. 2 భారత్ తరఫున అంతర్జాతీయ టి20ల్లో వేగవంతమైన సెంచరీ (37 బంతుల్లో) చేసిన రెండో ఆటగాడు అభిషేక్. రోహిత్ శర్మ (35 బంతుల్లో; శ్రీలంకపై) అగ్రస్థానంలో ఉన్నాడు. 13 ఈ మ్యాచ్‌లో అభిషేక్ కొట్టిన సిక్స్‌లు. భారత్ తరఫున అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో ఇదే అత్యధికం. రోహిత్ (10 సిక్స్‌లు; శ్రీలంకపై), సామ్సన్ (10 సిక్స్‌లు; దక్షిణాఫ్రికాపై), తిలక్ (10 సిక్స్‌లు; దక్షిణాఫ్రికాపై) రెండో స్థానాల్లో ఉన్నారు. -
అభిషేక్ శర్మ విధ్వంసకర శతకం.. ఐదో టీ20లో టీమిండియా ఘన విజయం
స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ముంబై వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 2) జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో (54 బంతుల్లో 135; 7 ఫోర్లు, 13 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్.. భారత బౌలర్లు చెలరేగడంతో 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. తొలుత బ్యాట్‌తో విజృంభించిన అభిషేక్.. ఆతర్వాత బంతితోనూ రాణించి రెండు వికెట్లు తీశాడు. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టినందుకు గానూ అభిషేక్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించి 14 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కించుకున్నాడు. రికార్డులు కొల్లగొట్టిన అభిషేక్ఈ మ్యాచ్‌లో విధ్వంసకర సెంచరీ సాధించిన అభిషేక్ పలు రికార్డులు కొల్లగొట్టాడు. టీ20ల్లో భారత్ తరఫున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ (17), రెండో వేగవంతమైన సెంచరీని (37) నమోదు చేశాడు. టీ20ల్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు రోహిత్ శర్మ (35 బంతుల్లో) పేరిట ఉండగా.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ యువరాజ్ సింగ్ (12 బంతుల్లో) పేరిట ఉంది. 17 మ్యాచ్‌ల టీ20 కెరీర్లో అభిషేక్‌కు ఇది రెండో సెంచరీ.ఈ మ్యాచ్‌లో అభిషేక్ సాధించిన మరిన్ని రికార్డులు..- టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక స్కోర్ (135).- టీ20లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు (13).- అభిషేక్ ధాటికి భారత్ పవర్ ప్లేల్లో అత్యధిక స్కోర్ (95/1) నమోదు చేసింది.టీ20ల్లో నాలుగో అత్యధిక స్కోర్ఈ మ్యాచ్‌లో భారత్ నమోదు చేసిన స్కోర్ (247/9) టీ20ల్లో నాలుగో అత్యధికం. ఈ మ్యాచ్‌లో భారత్ మరింత భారీ స్కోర్ సాధించాల్సింది. అభిషేక్ సెంచరీ పూర్తయ్యాక భారత్ స్కోర్ బాగా నెమ్మదించింది. వరుస క్రమంలో వికెట్లు పడిపోయాయి. ఆరంభంలో సంజూ శాంసన్ (7 బంతుల్లో 16; ఫోర్, 2 సిక్సర్లు).. మధ్యలో తిలక్ వర్మ (15 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్), శివమ్ దూబే (13 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. వేగంగా పరుగులు రాబట్టే క్రమంలో సూర్యకుమార్ యాదవ్ (3 బంతుల్లో 2), హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 9; సిక్స్), రింకూ సింగ్ 6 బంతుల్లో 9; ఫోర్), అక్షర్ పటేల్ (11 బంతుల్లో 15; 2 ఫోర్లు), బిష్ణోయ్ (0) ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 3, మార్క్ వుడ్ 2, జోఫ్రా ఆర్చర్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఆది నుంచే తడబడుతూ వచ్చింది. భారత బౌలర్లు ఫిల్ సాల్ట్ (23 బంతుల్లో 55; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా ఏ ఒక్కరిని కుదురుకోనివ్వలేదు. షమీ (2.3-0-25-3), వరుణ్ చక్రవరి (2-0-25-2), శివమ్ దూబే (2-0-11-2), అభిషేక్ శర్మ (1-0-3-2), రవి బిష్ణోయ్ (1-0-9-1) తలో చేయి వేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో కేవలం సాల్ట్, జేకబ్ బేతెల్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. టీ20ల్లో పరుగుల పరంగా (150) ఇంగ్లండ్‌కు ఇది భారీ పరాజయం.చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తిఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన వరుణ్.. ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక వికెట్లు (14) తీసిన స్పిన్ బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు విండీస్ పేసర్ జేసన్ హోల్డర్ పేరిట ఉంది. 2022లో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో హోల్డర్ 15 వికెట్లు పడగొట్టాడు.ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్ బౌలర్ రికార్డు వరుణ్‌కు ముందు ఐష్ సోధి (న్యూజిలాండ్) పేరిట ఉండింది. 2021లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో సోధి 13 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ గతేడాది సౌతాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ 12 వికెట్లు పడగొట్టాడు. -
ఐదో టీ20లో భారత్ ఘన విజయం
ఐదో టీ20లో భారత్ ఘన విజయంముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఇంగ్లండ్‌ను 150 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. భారత బౌలర్లు తలో చేయి వేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను పేకమేడలా కూల్చారు. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది.మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్59 పరుగుల వద్ద ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. బిష్ణోయ్ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్ (2) ఔటయ్యాడు.రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్48 పరుగుల వద్ద ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. జోస్ బట్లర్‌ను (7) వరుణ్ చక్రవర్తి పెవిలియన్‌కు పంపాడు. టార్గెట్ 248.. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు శుభారంభమే లభించింది. అయితే ఆ జట్టు 3వ ఓవర్ తొలి బంతికి తొలి వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో బెన్ డకెట్ డకౌటాయ్యాడు. 4 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోర్ 48/1గా ఉంది. ఫిల్ సాల్ట్ (39) ధాటిగా ఆడుతున్నాడు. అభిషేక్ విధ్వంసకర శతకం.. టీమిండియా భారీ స్కోర్ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా భారీ స్కోర్ (247/9) చేసింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ (54 బంతుల్లో 135; 7 ఫోర్లు, 13 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. హాఫ్ సెంచరీని 17 బంతుల్లో పూర్తి చేసిన అభిషేక్.. సెంచరీని 37 బంతుల్లో శతక్కొట్టాడు. టీ20ల్లో అభిషేక్‌ది భారత్ తరఫున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ (17), సెంచరీ (37). టీ20ల్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు రోహిత్ శర్మ (35 బంతుల్లో) పేరిట ఉండగా.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ యువరాజ్ సింగ్ (12 బంతుల్లో) పేరిట ఉంది. అభిషేక్‌కు టీ20ల్లో ఇది రెండో సెంచరీ.టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక స్కోర్ (135) కూడా అభిషేక్‌దే. అలాగే ఓ టీ20లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు (13) కొట్టింది కూడా అభిషేకే. అభిషేక్ ధాటికి భారత్ పవర్ ప్లేల్లో అత్యధిక స్కోర్ (95/1) నమోదు చేసింది. అభిషేక్ సెంచరీ పూర్తయ్యాక భారత్ స్కోర్ బాగా నెమ్మదించింది. వరుస క్రమంలో వికెట్లు పడిపోయాయి. ఆరంభంలో సంజూ శాంసన్ (7 బంతుల్లో 16; ఫోర్, 2 సిక్సర్లు).. మధ్యలో తిలక్ వర్మ (15 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్), శివమ్ దూబే (13 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. వేగంగా పరుగులు రాబట్టే క్రమంలో సూర్యకుమార్ యాదవ్ (3 బంతుల్లో 2), హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 9; సిక్స్), రింకూ సింగ్ 6 బంతుల్లో 9; ఫోర్), అక్షర్ పటేల్ (11 బంతుల్లో 15; 2 ఫోర్లు), బిష్ణోయ్ (0) ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 3, మార్క్ వుడ్ 2, జోఫ్రా ఆర్చర్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.37 బంతుల్లో శతక్కొట్టిన అభిషేక్హాఫ్ సెంచరీ తర్వాత పేట్రేగిపోయిన అభిషేక్ శర్మ 37 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. టీ20ల్లో భారత్ తరఫున ఇది రెండో వేగవంతమైన శతకం. టీ20ల్లో భారత్ తరఫున వేగవంతమైన సెంచరీ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. హిట్‌మ్యాన్ 2017లో శ్రీలంకపై 35 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఓవరాల్‌గా టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. గతేడాది చౌహాన్ సైప్రస్‌పై కేవలం 27 బంతుల్లోనే సెంచరీ చేశాడు. అభిషేక్ శర్మ విధ్వంసం.. 17 బంతుల్లో అర్ధ శతకంఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. సంజూ ఔటయ్యాక ఒక్కసారిగా బీస్ట్ మోడ్‌లోకి వచ్చిన అభిషేక ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది 17 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ20ల్లో యువరాజ్ సింగ్ (12 బంతుల్లో) తర్వాత అభిషేక్‌దే ఫాస్టెస్ట్ ఫిఫ్టి. అభిషేక్ దెబ్బకు భారత్ తొలి 6 ఓవర్లలో 95 పరుగులు చేసిం్ది. అభిషేక్ 58, తిలక్ 19 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.సంజూ శాంసన్ మరోసారి విఫలంటీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ మరోసారి విఫలమయ్యాడు.వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమైనా టీమిండియా మేనేజ్మెంట్ సంజూకు మరో ఛాన్స్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో తొలి బంతికే సిక్సర్ బాదిన సంజూ.. ఆతర్వాత అదే ఓవర్లో మరో సిక్సర్, బౌండరీ బాదాడు. అయితే సంజూ (7 బంతుల్లో 16; ఫోర్, 2 సిక్సర్లు) ఆతర్వాతి ఓవర్లోనే మార్క్ వుడ్ బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ముంబై వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇవాళ (ఫిబ్రవరి 2) నామమాత్రపు ఐదో టీ20 జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. భారత్ తరఫున అర్షదీప్ సింగ్ స్థానంలో మహ్మద్ షమీ తుది జట్టులోకి రాగా.. గత మ్యాచ్‌లో సంచలన బౌలింగ్ ప్రదర్శన చేసిన సాకిబ్ మహమూద్‌కు ఇంగ్లండ్ రెస్ట్ ఇచ్చింది. సాకిబ్ స్థానంలో మార్క్ వుడ్ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.తుది జట్లు..ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జోస్ బట్లర్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్భారత్: సంజు శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి -
ఆధిక్యం కోసం ఆఖరి పోరు
ముంబై: ఇప్పటికే సిరీస్ భారత్ చేతికందింది. ఇక మిగిలిందల్లా ఆధిక్యం పెంచుకోవడమే! మూడు వన్డేల సిరీస్‌కు ముందు ఈ చివరి మ్యాచ్ గెలిచి... 4–1తో ఆధిక్యం, ఆత్మవిశ్వాసంతో వెళ్లాలని టీమిండియా భావిస్తోంది. ఇక ఇంగ్లండ్ పరిస్థితి దీనికి భిన్నం. చేజారిన సిరీస్‌తో ఒత్తిడిలో ఉన్న బట్లర్ బృందం ఇప్పుడు భారత్ ఆధిపత్యానికి గండి కొట్టాలని... ఈ పొట్టి సిరీస్‌లో ఆతిథ్య జట్టు శుభారంభమివ్వగా... విజయంతో ముగింపు తమది కావాలని ఇంగ్లండ్ జట్టు గట్టిగా ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో ఆఖరి పోరులో పైచేయి సాధించేందుకు పర్యాటక జట్టు సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమైంది. మొత్తంమీద ఇరుజట్ల మధ్య మరో రసవత్తర పోరుకు నేడు వాంఖెడే స్టేడియం వేదిక కానుంది.సంజూ... మెరిపించు! ఈ సిరీస్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ ఆడాడు. తిలక్ వర్మ గెలిపించే ‘షో’ చేశాడు. హార్దిక్ పాండ్యా అసలైన ఆటను గత మ్యాచ్‌లో బయటికి తెచ్చాడు. అక్షర్ పటేల్ బంతితో లేదంటే బ్యాటింగ్‌తో జట్టుకు అక్కరకొస్తున్నాడు. అంతెందుకు అరకొరగా... అంటే శివమ్ దూబే ‘కన్కషన్’తో తుది జట్టులోకి వచ్చిన హర్షిత్ రాణా కూడా మ్యాచ్ గెలిపించే బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. కానీ టాప్–4లో ఓపెనర్ సంజూ సామ్సన్, కెప్టెన్ సూర్యకుమార్లతోనే జట్టు మేనేజ్మెంట్ కలవరపడుతోంది. తర్వాతి ప్రపంచకప్ వేటకు కోచ్ గంభీర్ కోర్ గ్రూపులోని ఆటగాళ్లు ఇలా వరుసగా విఫలమవడం జట్టుకు ప్రతికూలంగా మారింది. బౌలింగ్‌లో అర్ష్ దీప్, పాండ్యాలు వెన్నుదన్నుగా నిలుస్తుంటే స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఉన్నపళంగా మ్యాచ్‌ను మలుపుతిప్పే మాయాజాలంతో ఆకట్టుకుంటున్నాడు. రవి బిష్ణోయ్ కూడా ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడు. 2–3 లక్ష్యంతో ఇంగ్లండ్ సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లండ్‌కు ఇప్పుడు ఆఖరి పంచ్ మాత్రమే మిగిలుంది. ఇందులో తమ పవర్ చాటుకొని తదుపరి వన్డే సిరీస్‌ను తాజాగా ప్రారంభించాలని బట్లర్ జట్టు అనుకుంటుంది. సాల్ట్ గత మ్యాచ్‌లో టచ్‌లోకి వచ్చినా కొద్దిసేపే క్రీజులో ఉన్నాడు. ఇప్పుడు లయను అందుకుంటే బెన్ డకెట్‌తో ఓపెనింగ్ వికెట్‌కు భారీ ఆరంభం ఇవ్వగలడు. ఇదే జరిగితే... తదుపరి పరుగుల ప్రవాహాన్ని బట్లర్, హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్స్‌లు తీసుకెళ్తారు. ఆర్చర్, సకిబ్ మహమూద్ పేస్‌తో ఆకట్టుకుంటుండగా, స్పిన్‌తో ఆదిల్ రషీద్ నిలకడను ప్రదర్శిస్తున్నాడు. సిరీస్ చేజారినా... సమరంలో పట్టు కోల్పోరాదని ఐదో టి20లో నిరూపించుకోవాలని ఇంగ్లండ్ బృందం చూస్తోంది. పిచ్, వాతావరణం వాంఖెడే బ్యాటింగ్‌కు అచ్చొచ్చే పిచ్. చాలా మ్యాచ్‌ల్లో, ప్రత్యేకించి టి20ల్లో చేజింగ్ జట్లకు విజయ అవకాశాలిచ్చింది. అలాగని బౌలింగ్ తేలిపోదు. స్పిన్నర్లు ప్రభావం చూపొచ్చు. వాన ముప్పు లేదు.5 వాంఖెడే మైదానంలో ఇప్పటి వరకు భారత జట్టు ఐదు టి20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో మూడింటిలో గెలిచి, రెండింటిలో ఓడిపోయింది. చివరి మూడు మ్యాచ్‌ల్లో భారత జట్టే నెగ్గింది. -
నాలుగో టీ20లో ఇంగ్లండ్ పై భారత్ విజయం
-
పాండ్యా, దూబే మెరుపులు.. సిరీస్ టీమిండియా వశం
టాప్–ఫోర్ పరుగుల్లో వెనుకబడినా... ఓ దశలో జట్టు స్కోరు(12/3) గుబులు రేపినా... మిడిలార్డర్లో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేల మెరుపులతో భారత్ మ్యాచ్ గెలిచి టి20 సిరీస్ కైవసం చేసుకుంది. వరుణ్ మాయాజాలం మలుపుతిప్పగా... రవి బిష్ణోయ్, హర్షిత్ రాణాల బౌలింగ్ భారత్ నాలుగో టి20లో గెలిచేలా చేసింది. పుణే: సమం కాదు... సొంతమే! సిరీస్‌ను ఆఖరి సమరం దాకా లాక్కెళ్ల కుండా భారత్ నాలుగో టి20లోనే తేల్చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ సేన 15 పరుగులతో ఇంగ్లండ్‌పై గెలిచి ఇంకో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా (30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శివమ్ దూబే (34 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించారు. ఇంగ్లండ్ బౌలర్ సకిబ్ మహమూద్ 3, జేమీ ఓవర్టన్ 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగుల వద్ద ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (26 బంతుల్లో 51; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), డకెట్ (19 బంతుల్లో 39; 7 ఫోర్లు, 1 సిక్స్) ఉన్నంతసేపూ దంచేశారు. అయితే గత మ్యాచ్ మాదిరి వరుణ్ చక్రవర్తి (2/28) స్పిన్ మలుపు మరుగున పడకుండా... దూబే స్థానంలో ‘కన్కషన్’గా వచ్చిన హర్షిత్ రాణా (3/33), రవి బిష్ణోయ్ (3/28) పేస్–స్పిన్‌ల వైవిధ్యం ఇంగ్లండ్‌ను లక్ష్యానికి దూరం చేసింది. దూబే, పాండ్యా ఫిఫ్టీ–ఫిఫ్టీ సంజూ సామ్సన్ (1), తిలక్‌వర్మ (0), కెపె్టన్ సూర్యకుమార్ (0)ల వైఫల్యంతో భారత్ 12/3 స్కోరు వద్ద కష్టాల్లోపడింది. అభిõÙక్ (19 బంతుల్లో 29; 4 ఫోర్లు, 1 సిక్స్), రింకూ సింగ్ (26 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్)ల జోరు ఎంతోసేపు సాగలేదు. ఈ దశలో దూబే, పాండ్యా ఆరో వికెట్‌కు వేగంగా 87 పరుగులు జోడించారు.27 బంతుల్లో హార్దిక్, 31 బంతుల్లో దూబే అర్ధసెంచరీలు సాధించారు. దీంతో భారత్ పోరాడే లక్ష్యం నిర్దేశించగలిగింది. మరోవైపు డకెట్, సాల్ట్ (23; 4 ఫోర్లు)లు ధాటిగా ఛేదన ఆరంభించారు. ఇంగ్లండ్ స్కోరు 62కు చేరగానే డకెట్, కాసేపటికే సాల్ట్, బట్లర్ (2)... వందకు చేరే క్రమంలో లివింగ్‌స్టోన్ (9) అవుటయ్యారు. అయినా 14 ఓవర్లలో 124/4 స్కోరు వద్ద ఇంగ్లండ్ పటిష్టంగానే కనిపించింది. ఈ దశలో 15వ ఓవర్ వేసిన వరుణ్ క్రీజులో పాతుకుపోయిన బ్రూక్‌తో పాటు బ్రైడన్ కార్స్ (0)లను అవుట్ చేయడంతో 30 బంతుల్లో 49 పరుగుల సమీకరణం విజయానికి ఊపిరిపోసింది. బిష్ణోయ్, రాణాలు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) కార్స్ (బి) సకిబ్ 1; అభిషేక్ (సి) జాకబ్ (బి) రషీద్ 29; తిలక్ (సి) ఆర్చర్ (బి) సకిబ్ 0; సూర్యకుమార్ (సి) కార్స్ (బి) సకిబ్ 0; రింకూసింగ్ (సి) రషీద్ (బి) కార్స్ 30; దూబే రనౌట్ 53; పాండ్యా (సి) బట్లర్ (బి) ఓవర్టన్ 53; అక్షర్ (సి) జాకబ్ (బి) ఓవర్టన్ 5; అర్ష్ దీప్ రనౌట్ 0; రవిబిష్ణోయ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–12, 2–12, 3–12, 4–57, 5–79, 6–166, 7–180, 8–180, 9–181. బౌలింగ్: ఆర్చర్ 4–0–37–0, సకిబ్ 4–1–35–3, బ్రైడన్ కార్స్ 4–0–39–1, ఓవర్టన్ 4–0–32–2, అదిల్ రషీద్ 4–0–35–1. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (బి) అక్షర్ 23; డకెట్ (సి) సూర్యకుమార్ (బి) బిష్ణోయ్ 39; బట్లర్ (సి) రాణా (బి) బిష్ణోయ్ 2; బ్రూక్ (సి) అర్ష్ దీప్ (బి) వరుణ్ 51; లివింగ్‌స్టోన్ (సి) సామ్సన్ (బి) రాణా 9; జాకబ్ (సి) సూర్యకుమార్ (బి) రాణా 6; కార్స్ (సి) అర్ష్ దీప్ (బి) వరుణ్ 0; ఓవర్టన్ (బి) రాణా 19; ఆర్చర్ (బి) బిష్ణోయ్ 0; రషీద్ నాటౌట్ 10; సకిబ్ (సి) అక్షర్ (బి) అర్ష్ దీప్ 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్) 166. వికెట్ల పతనం: 1–62, 2–65, 3–67, 4–95, 5–129, 6–133, 7–137, 8–146, 9–163, 10–166. బౌలింగ్: అర్ష్ దీప్‌సింగ్ 3.4–0–35–1, హార్దిక్ పాండ్యా 1–0–11–0, వరుణ్ చక్రవర్తి 4–0–28–2, అక్షర్ పటేల్ 3–0–26–1, రవి బిష్ణోయ్ 4–0–28–3, హర్షిత్ రాణా 4–0–33–3. -
హార్దిక్, దూబే విధ్వంసం.. నిప్పులు చెరిగిన రాణా.. నాలుగో టీ20లో టీమిండియా విజయం
స్వదేశంలో ఇంగ్లండ్‌తో (England) జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ (Team India) మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. పూణే వేదికగా ఇవాళ (జనవరి 31) జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ ఇంగ్లండ్‌పై టీ20 సిరీస్ గెలవడం ఇది వరుసగా ఐదుసారి. భారత్‌కు స్వదేశంలో ఇది వరుసగా 17వ సిరీస్ విజయం.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. హార్దిక్ పాండ్యా (Hardik Pandya) (30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), శివమ్ దూబే (Shivam Dube) (34 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోర్ చేసింది.12 పరుగుల వద్ద ఒకే ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన భారత్‌ను హార్దిక్, దూబే మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆదుకున్నారు.వీరికి ముందు అభిషేక్ శర్మ (19 బంతుల్లో 29; 4 ఫోర్లు, సిక్స్), రింకూ సింగ్ (26 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడారు. 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసిన భారత్.. చివరి ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్‌ను జేమీ ఓవర్టన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.భారత ఆటగాళ్లలో సంజూ శాంసన్ (1), తిలక్ వర్మ (0), సూర్యకుమార్ యాదవ్ (0) దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ 3, జేమీ ఓవర్టన్ 2, బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్ తలో వికెట్ పడగొట్టారు. 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ (51) అర్ద సెంచరీతో రాణించగా.. ఓపెనర్లు బెన్ డకెట్ (39), ఫిలిప్ సాల్ట్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.బ్రూక్ క్రీజ్‌లో ఉండగా.. ఇంగ్లండ్ విజయం సాధించేలా కనిపించింది. అయితే వరుణ్ చక్రవర్తి ఒకే ఓవర్లో బ్రూక్‌తో పాటు బ్రైడన్ కార్స్‌ను ఔట్ చేసి తిరిగి భారత్‌ను గేమ్‌లోకి తెచ్చాడు. బ్రూక్, కార్స్ ఔటయ్యాక జేమీ ఓవర్టన్ కొద్ది సేపు భారత బౌలర్లను బయపెట్టాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ గాయపడిన శివమ్ దూబేకు కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన హర్షిత్ రాణా (Harshit Rana) మ్యాజిక్ చేశాడు. తన కెరీర్లో తొలి టీ20 ఆడిన హర్షిత్.. ఏకంగా మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను చావుదెబ్బ కొట్టాడు. హర్షిత్.. ప్రమాదకరమైన లివింగ్‌స్టోన్ (9), జేకబ్ బేతెల్ (6), జేమీ ఓవర్టన్ (19) వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో హర్షిత్ 150 కిమీకు పైగా వేగంతో బంతులు సంధించడం విశేషం. హర్షిత్‌తో పాటు రవి బిష్ణోయ్ మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి 2, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ సిరీస్‌లో నామమాత్రపు ఐదో టీ20 ఫిబ్రవరి 2న ముంబైలో జరుగుతుంది. -
Ashes Series 2025: చరిత్ర సృష్టించిన ఆసీస్ బ్యాటర్
మహిళల యాషెస్ సిరీస్‌లోని (Women's Ashes Series 2025) ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్ యువ ఆల్‌రౌండర్ అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (Annabel Sutherland) చరిత్ర సృష్టించింది. ఎంసీజీలో (MCG) (మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్) సెంచరీ చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. గతంలో ఏ మహిళా క్రికెటర్ ఇక్కడ మూడంకెల స్కోర్ చేయలేదు. 1935, జనవరి 18న ఎలిజబెత్ అలెక్సాండ్రా స్నోబాల్ ఎంసీజీలో అజేయమైన 83 పరుగులు చేసింది. మరో ఆసీస్ బ్యాటర్ బెత్ మూనీ (98 నాటౌట్) ఇదే మ్యాచ్‌లో సెంచరీకి చేరువయ్యిందికాగా, మహిళల యాషెస్ సిరీస్‌లో భాగంగా జనవరి 30 నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య మెల్బోర్న్లో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో అన్నాబెల్ సెంచరీ (258 బంతుల్లో 21 ఫోర్లు, సిక్సర్ సాయంతో 163 పరుగులు) చేసింది. 23 ఏళ్ల అన్నాబెల్‌కు టెస్ట్‌ల్లో ఇది మూడో సెంచరీ. కేవలం ఆరు మ్యాచ్‌లో కెరీర్లోనే అన్నాబెల్ ఈ మూడు సెంచరీలు సాధించింది. ఈ మూడు సెంచరీల్లో ఓ డబుల్ సెంచరీ ఉండటం మరో విశేషం.ఆసీస్‌కు భారీ ఆధిక్యంఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 422 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో అన్నాబెల్ సెంచరీతో కదంతొక్కగా.. బెత్ మూనీ సెంచరీకి (98 నాటౌట్) చేరువైంది. మూనీకి జతగా తహ్లియా మెక్‌గ్రాత్ (9) క్రీజ్‌లో ఉంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 45, జార్జియా వాల్ 12, కెప్టెన్ అలైసా హీలీ 34, ఆష్లే గార్డ్నర్ 44 పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే 252 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్, సోఫీ ఎక్లెస్టోన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ర్యానా మెక్‌డొనాల్డ్ గే ఓ వికెట్ దక్కించుకుంది.అంతకుముందు అలానా కింగ్ (23-6-45-4) చెలరేగడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే చాపచుట్టేసింది. కిమ్ గార్త్, డార్సీ బ్రౌన్ తలో రెండు.. ఆష్లే గార్డ్నర్ ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో నాట్ సీవర్ బ్రంట్ (51) ఒక్కరే అర్ద సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. కెప్టెన్ హీథర్ నైట్ (25), వ్యాట్ హాడ్జ్ (22), సోఫీ డంక్లీ (21), ర్యానా మెక్‌డొనాల్డ్ గే (15 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. టామీ బేమౌంట్ 8, మయా బౌచియర్ 2, ఆమీ జోన్స్ 3, సోఫీ ఎక్లెస్టోన్ 1, లారెన్ ఫైలర్ 8, లారెన్ బెల్ 7 పరుగులు చేసి ఔటయ్యారు.కాగా, ప్రస్తుతం జరుగుతున్న మహిళల యాషెస్ సిరీస్ మల్టీ ఫార్మాట్లో జరుగుతుంది. ఈ సిరీస్‌లో తొలుత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అనంతరం జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సైతం ఆస్ట్రేలియా 3-0తోనే ఊడ్చేసింది. ప్రస్తుతం జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ పింక్ బాల్‌తో డే అండ్ నైట్ ఫార్మాట్లో జరుగుతుంది. ఈ సిరీస్‌లోని ఆరు పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు (3 వన్డేలు, 3 టీ20లు) గెలిచిన ఆసీస్.. 12-0 తేడాతో ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో ఒక్కో పరిమిత ఓవర్ల మ్యాచ్‌కు రెండు పాయింట్లు.. టెస్ట్ మ్యాచ్‌కు 4 పాయింట్లు లభిస్తాయి. -
ఫైనల్ బెర్త్ కోసం...
కౌలాలంపూర్: డిఫెండింగ్ చాంపియన్ హోదాకు నూటికి నూరుశాతం న్యాయం చేస్తూ అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్‌లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత్ టైటిల్ నిలబెట్టుకునే అర్హత కోసం సెమీఫైనల్స్‌కు సిద్ధమైంది. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లు ఒక ఎత్తయితే... ఈ రోజు ఆడే మ్యాచ్ ఒక ఎత్తు! ఎందుకంటే ఇన్నాళ్లు లీగ్ దశలో, సూపర్ సిక్స్‌లో తన గ్రూపులోని ప్రత్యర్థుల్ని చిత్తు చేసిన నికీ ప్రసాద్ నేతృత్వంలోని భారత్ ఇప్పుడు అసలైన సెమీఫైనల్ సవాల్‌కు రె‘ఢీ’ అయ్యింది. నేడు జరిగే సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్ ఆడుతుంది. మరో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడుతుంది. ఈ ప్రపంచకప్‌లో భారత్ అసాధారణ ప్రదర్శన కనబరుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ టీనేజ్ సంచలనం గొంగడి త్రిష ఫామ్ ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో గుబులు రేపుతోంది. బౌలింగ్‌లో వైజాగ్ సీమర్ షబ్నమ్ సహా ఆయుష్ , మిథిల, వైష్ణవి నిలకడగా రాణిస్తున్నారు. మరోవైపు ఇంగ్లండ్ జట్టు మెరుగ్గా ఆడుతున్న ప్పటికీ భారత్‌ను నిలువరిస్తుందో లేదో చూడాలి. చదవండి :తాలిబన్లను వ్యతిరేకించి క్రికెట్ బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ ధీర వనితలు -
సొంతమా... సమమా!
పుణే: ఓ జట్టుది సిరీస్ గెలిచే ఆరాటం... మరో జట్టుది సిరీస్‌లో నిలిచే పోరాటం... వేదికేమో పరుగుపెట్టే పుణే స్టేడియం... ఈ నేపథ్యంలో భారత్(India), ఇంగ్లండ్(England) జట్ల మధ్య శుక్రవారం జరిగే నాలుగో టి20(T20) అసలైన మెరుపుల మజాను పంచనుంది. ఆశించినట్లు రాత్రి ఇదే జరిగితే నిజమైన చుక్కలతో పాటు బంతి కూడా పదేపదే చుక్కల్లోకెక్కడం ఖాయం! ఈ పరుగుల విందులో పైచేయి సాధిస్తే భారత్ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను ఎగరేసుకుపోతుంది. కానీ గత మ్యాచ్‌లో పర్యాటక ఇంగ్లండ్ పట్టుబిగిస్తే మాత్రం సిరీస్ 2–2తో సమమవుతుంది. అప్పుడు ఇరుజట్లు ద్వైపాక్షిక సిరీస్ కోసం ‘ఫైనల్స్’ ఆడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో నాలుగో టి20 ఈ సిరీస్‌లోనే ఆసక్తికర సమరంగా జరగనుంది. దీంతో ప్రేక్షకులకు గత మూడు మ్యాచ్‌లుగా కరువైన టి20 విందు ఈ పోరుతో తీరుతుంది. సామ్సన్‌కు ఏమైంది... భారత స్టార్లు రోహిత్, కోహ్లిలు టి20లకు బైబై చెప్పడంతో తదుపరి టి20 ప్రపంచకప్‌కు కోచ్ గంభీర్ సన్నద్ధం చేసే జట్టులో ఓపెనర్ సంజూ సామ్సన్ కీలకం. కోచ్ గౌతీ వచ్చాక ప్రత్యేకించి పొట్టి ఫార్మాట్లో అతనికి విరివిగా ఆవకాశాలిస్తున్నాడు. అతనూ గత సిరీస్‌లలో వరుస సెంచరీలు, లేదంటే ఓపెనింగ్ మెరుపులతో అలరించాడు.కానీ ఇప్పుడు మాత్రం ఇంగ్లండ్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఆపసోపాలు పడుతున్నాడు. ఇది ఇన్నింగ్స్‌పై పెద్ద ప్రభావమే చూపిస్తోంది. దీనికి కెప్టెన్ సూర్యకుమార్ వైఫల్యం అదనం! దీనివల్ల టీమిండియా రెండు మ్యాచ్‌లైతే గెలిచింది కానీ... టి20లకు తగిన ఆటతీరును మాత్రం టి20 ప్రపంచ చాంపియన్ ఇంకా ఆడలేదన్నది వాస్తవం. బౌలింగ్ విభాగంలో షమీని కొనసాగించి, విశ్రాంతినిచి్చన అర్‡్షదీప్‌ను తుది జట్టులోకి తీసుకుంటే... గత మ్యాచ్‌లో భారీగా పరుగులు ఇచ్చుకున్న స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను పక్కనబెట్టే అవకాశముంది. పుంజుకున్న బట్లర్ బృందం మూడో టి20లో మెరిపించి తర్వాత కుదుపులకు గురైనా కూడా కోలుకున్న తీరు, పుంజుకున్న వైనం ఇంగ్లండ్ జట్టులో సిరీస్ ఆశల్ని రేపింది. ఇదే సమరోత్సాహంతో ఇప్పుడు వరుసగా రెండో విజయంపై కన్నేసిన బట్లర్ సేన సిరీస్‌ను 2–2తో సమం చేయడానికి సర్వసన్నద్ధమై ఉంది. సాల్ట్ ఓపెనింగ్‌లో దంచేస్తే ఇంగ్లండ్ జోరుకు అదనపు బలం ఖాయం. ఆర్చర్, వుడ్, కార్స్లతో పాటు స్పిన్‌తో కట్టిపడేస్తున్న అదిల్ రషీద్ ఉన్న బౌలింగ్ విభాగం భారత్‌కు సవాల్ విసిరేందుకు సై అంటోంది. 4 పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ సంఘం (ఎంసీఏ) స్టేడియంలో ఇప్పటి వరకు భారత జట్టు నాలుగు టి20 మ్యాచ్‌లు ఆడింది. 2 మ్యాచ్‌ల్లో గెలిచి, 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇంగ్లండ్ జట్టుతో 2012 ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. మిగతా మూడు టి20 మ్యాచ్‌లు శ్రీలంక జట్టుతో జరిగాయి. పిచ్, వాతావరణం పుణే పిచ్ బ్యాటింగ్‌కు, ప్రత్యేకించి పొట్టి ఫార్మాట్ మెరుపులకు అనువైంది. రెండేళ్ల క్రితం శ్రీలంక 200 పైచిలుకు స్కోరు చేస్తే... ఛేదనలో భారత్ 190 వరకు వచ్చి కేవలం 15 పరుగుల తేడాతోనే ఓడింది. ఈ నేపథ్యంలో బౌలర్లకు సవాల్ తప్పదు. వాతావరణంతో ఏ సమస్యా లేదు. వానముప్పూ లేదు. తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), సామ్సన్, అభి షేక్, తిలక్‌వర్మ, హార్దిక్ పాండ్యా, సుందర్, అక్షర్, జురేల్, షమీ, రవిబిష్ణోయ్/అర్ష్ దీప్, వరుణ్. ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్), సాల్ట్, డకెట్, హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టోన్, స్మిత్, ఓవర్టన్, కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్. -
Ashes Test Match: సత్తా చాటిన బౌలర్లు.. తొలి రోజు ఆసీస్‌దే..!
మహిళల యాషెస్ (Women's Ashes) మల్టీ ఫార్మాట్ సిరీస్‌లో ఇవాళ (జనవరి 30) ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. పింక్ బాల్‌తో డే అండ్ నైట్ జరిగే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా (Australia) టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆసీస్ బౌలర్లు, ముఖ్యంగా అలానా కింగ్ (Alana King) (23-6-45-4) చెలరేగడంతో ఇంగ్లండ్ (England) తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే చాపచుట్టేసింది. మిగతా ఆసీస్ బౌలర్లు కిమ్ గార్త్, డార్సీ బ్రౌన్ తలో రెండు వికెట్లు.. ఆష్లే గార్డ్నర్ ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో నాట్ సీవర్ బ్రంట్ (51) ఒక్కరే అర్ద సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. కెప్టెన్ హీథర్ నైట్ (25), వ్యాట్ హాడ్జ్ (22), సోఫీ డంక్లీ (21), ర్యానా మెక్‌డొనాల్డ్ గే (15 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. టామీ బేమౌంట్ 8, మయా బౌచియర్ 2, ఆమీ జోన్స్ 3, సోఫీ ఎక్లెస్టోన్ 1, లారెన్ ఫైలర్ 8, లారెన్ బెల్ 7 పరుగులు చేసి ఔటయ్యారు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది. జార్జియా వాల్ 12 పరుగులు చేసి ఔట్ కాగా.. ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 20, అన్నాబెల్ సదర్‌ల్యాండ్ 24 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. జార్జియా వాల్ వికెట్ లారెన్ బెల్కు దక్కింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 114 పరుగులు వెనుకపడి ఉంది.ఇదిలా ఉంటే, మల్టీ ఫార్మాట్లో జరుగుతున్న ఈ సిరీస్‌లో తొలుత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అనంతరం జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సైతం ఆస్ట్రేలియా 3-0తోనే ఊడ్చేసింది. ప్రస్తుతం జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో ఆసీస్ విజయం సాధిస్తే మల్టీ ఫార్మాట్ సిరీస్ మొత్తాన్ని 16-0 తేడాతో క్లీన్ స్వీప్ చేస్తుంది. ఈ సిరీస్‌లో ఒక్కో పరిమిత ఓవర్ల మ్యాచ్‌కు రెండు పాయింట్లు.. టెస్ట్ మ్యాచ్‌కు 4 పాయింట్లు లభిస్తాయి. సిరీస్‌లోని ఆరు పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు (3 వన్డేలు, 3 టీ20లు) గెలిచిన ఆసీస్ ప్రస్తుతం 12-0 ఆధిక్యంలో ఉంది. -
క్రికెట్ చరిత్రలో అసాధారణ రనౌట్
క్రికెట్ చరిత్రలో ఓ విచిత్రమైన రనౌట్ నమోదైంది. సౌతాఫ్రికా అండర్-19 జట్టుతో జరుగుతున్న అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ అండర్-19 జట్టు ఆటగాడు ఆర్యన్ సావంత్ అసాధారణ రీతిలో రనౌటయ్యాడు. మ్యాచ్ 3వ రోజు సావంత్ 11 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తూ జేసన్ రౌల్స్ వేసిన బంతిని స్లాగ్-స్వీప్ చేశాడు. అయితే బంతి షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న జోరిచ్ వాన్ షాల్క్విక్ హెల్మెట్‌ను బలంగా తాకి, స్టంప్స్‌పైకి తిరిగి వచ్చింది. ఆ సమయంలో సావంత్ క్రీజ్ బయట ఉన్నాడు. సెకెన్ల వ్యవధిలో జరిగిపోయిన ఈ తంతు చూసి కొందరు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు రనౌట్‌కు అప్పీల్ చేయగా.. మరికొందరు బంతి హెల్మెట్‌కు తాకి గాయపడిన జోరిచ్ను పరామర్శించే పనిలో పడ్డారు. The first and last time you'll see a run out like this... @collinsadam pic.twitter.com/ZIEFI8s1Te— Brent W (@brentsw3) January 28, 2025దక్షిణాఫ్రికా ఫీల్డర్ల అప్పీల్‌తో ఔటయ్యానన్న విషయాన్ని గ్రహించిన సావంత్ మెల్లగా పెవిలియన్ బాట పట్టగా.. బంతి బలంగా తాకడంతో జోరిచ్ మైదానంలో అపస్మారక స్థితిలో పడిపోయాడు. గాయపడిన జోరిచ్ను హుటాహుటిన అసుపత్రికి తరలించారు. జోరిచ్కు ఎలాంటి అపాయం కలగలేదని తదనంతరం దక్షిణాఫ్రికా మేనేజ్మెంట్ వెల్లడించింది. సావంత్ అసాధారణ రీతిలో రనౌటైన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.కాగా, ఈ మ్యాచ్‌లో సావంత్ ఔటయ్యే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ను కొనసాగించిన ఇంగ్లండ్, మూడో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌తో పోలిస్తే 20 పరుగులు వెనుకపడ్డ ఇంగ్లండ్ ప్రస్తుతం 255 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో థామస్ ర్యూ (71) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగులకు ఆలౌటైంది. ఫర్హాన్ అహ్మద్, జాక్ హోమ్ అర్ద సెంచరీలతో రాణించారు. బదులుగా సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులు చేసింది. సౌతాఫ్రికా తరఫున ముహమ్మద్ బుల్బులియా, జేసన్ రౌల్స్ అర్ద సెంచరీలు చేశారు. -
మూడో టీ20లో భారత్ పై 25 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం
-
టీ20 ప్రపంచకప్: భారత్‌తో పాటు సెమీస్ చేరిన జట్లు ఇవే.. షెడ్యూల్
మహిళల అండర్–19 టీ20 ప్రపంచకప్(ICC Under 19 Womens T20 World Cup 2025)లో చివరిదైన నాలుగో సెమీఫైనల్ బెర్త్ ఇంగ్లండ్ జట్టు దక్కించుకుంది. న్యూజిలాండ్ జట్టుతో సోమవారం జరిగిన ‘సూపర్ సిక్స్’ గ్రూప్–2 మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రన్‌రేట్ పరంగా వెనుకబడినా..ఇక ఇప్పటికే ‘సూపర్ సిక్స్’ గ్రూప్–1 నుంచి భారత్(India), ఆస్ట్రేలియా(Australia)... గ్రూప్–2 నుంచి దక్షిణాఫ్రికా(South Africa) సెమీఫైనల్ చేరుకున్నాయి. కాగా గ్రూప్–2లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు ఆరు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే మెరుగైన రన్‌రేట్ కారణంగా దక్షిణాఫ్రికా గ్రూప్ ‘టాపర్’గా ఉంది. మరోవైపు.. న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ గెలుపొందడంతో నైజీరియా సెమీఫైనల్ అవకాశాలకు తెరపడింది. ఈనెల 29న ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో నైజీరియా గెలిచినా ఐదు పాయింట్లకే పరిమితం అవుతుంది.40 పరుగుల తేడాలో పది వికెట్లుఇక మ్యాచ్ విషయానికొస్తే... మలేషియాలోని కుచింగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 89 పరుగులకు ఆలౌటైంది. ఒకదశలో 49/0తో పటిష్టంగా కనిపించిన న్యూజిలాండ్‌ను ఇంగ్లండ్ బౌలర్లు టిల్లీ కోర్టిన్ కోల్మన్ (4/8), ప్రిషా థానావాలా (3/19), ట్రూడీ జాన్సన్ (2/7) దెబ్బ కొట్టారు.ఫలితంగా న్యూజిలాండ్ 40 పరుగుల తేడాలో 10 వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు కేట్ ఇర్విన్(26 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్స్), ఎమ్మా మెక్లాయిడ్ (31 బంతుల్లో 18) మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.అనంతరం ఇంగ్లండ్ జట్టు 11.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసి గెలిచింది. డావినా పెరిన్ (15 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్), జెమీమా స్పెన్స్ (18 బంతుల్లో 29; 5 ఫోర్లు), చార్లోటి స్టబ్స్ (15 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. మహిళల అండర్–19 టీ20 ప్రపంచకప్-2025లో సెమీస్ చేరిన జట్లు ఇవే👉గ్రూప్-1: భారత్, ఆస్ట్రేలియా👉గ్రూప్-2: దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్సెమీ ఫైనల్, ఫైనల్ షెడ్యూల్ ఇదేమహిళల అండర్–19 టీ20 ప్రపంచకప్-2025 టోర్నీలో జనవరి 31న సెమీ ఫైనల్-1 జరుగనుంది. కౌలలంపూర్లోని బేయుమస్ ఓవల్ మైదానం ఇందుకు వేదిక. భారత కాలమానం ప్రకారం ఉదయం 8 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభమవుతుంది.ఇక రెండో సెమీ ఫైనల్ కూడా అదే రోజు అదే వేదికపై మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. ఇదిలా ఉంటే.. ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 2న మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభం కానుంది. ఇక ఈమ్యాచ్‌లను జియోస్టార్, స్టార్ స్పోర్ట్స్-2 లో వీక్షించవచ్చుభారత్, ఆసీస్, దక్షిణాఫ్రికా సెమీస్ చేరాయిలా..కౌలాలంపూర్: అండర్–19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో లీగ్ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా... ‘సూపర్ సిక్స్’ గ్రూప్–1 తొలి మ్యాచ్‌లోనూ గెలిచింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాకు తగ్గట్టు ఆడుతున్న భారత అమ్మాయిల జట్టు సెమీఫైనల్ బెర్త్‌ను ఆదివారం ఖరారు చేసుకుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో నికీ ప్రసాద్ సారథ్యంలోని భారత జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు కేవలం 64 పరుగులు మాత్రమే చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఎడంచేతి వాటం స్పిన్నర్ వైష్ణవి శర్మ 4 ఓవర్లలో 15 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్‌ను కట్టడి చేసింది.ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పేస్ బౌలర్ షబ్నమ్, జోషిత, తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష ఒక్కో వికెట్ తీసుకున్నారు. బంగ్లాదేశ్ బ్యాటర్లలో జన్నతుల్ మవువా (20 బంతుల్లో 14), కెప్టెన్ సుమయ అక్తర్ (29 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్) మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా బంగ్లాదేశ్ బ్యాటర్లు ఇన్నింగ్స్ మొత్తంలో ఒక్క బౌండరీ మాత్రమే కొట్టడం గమనార్హం.ఇక 65 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆడుతూ పాడుతూ విజయతీరానికి చేరింది. 7.1 ఓవర్లలో భారత జట్టు 2 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ గొంగడి త్రిష (31 బంతుల్లో 40; 8 ఫోర్లు) దూకుడుగా ఆడింది. త్రిష చేసిన 40 పరుగుల్లో 32 పరుగులు బౌండరీల ద్వారానే రావడం విశేషం.మరో ఓపెనర్ కమలిని (5) తక్కువ స్కోరుకే అవుటైనా... సనికా చాల్కె (5 బంతుల్లో 11 నాటౌట్; 2 ఫోర్లు), నికీ ప్రసాద్ (2 బంతుల్లో 5 నాటౌట్; 1 ఫోర్) మిగతా లాంఛనాన్ని పూర్తి చేశారు. వైష్ణవికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మంగళవారం జరిగే తమ చివరి ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో స్కాట్లాండ్తో భారత్ ఆడుతుంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలకు సెమీస్ బెర్తుమరోవైపు ‘సూపర్ సిక్స్’ గ్రూప్–1 నుంచి ఆస్ట్రేలియా కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఇదే గ్రూప్‌లో శ్రీలంక, స్కాట్లాండ్ జట్ల మధ్య ఆదివారమే జరగాల్సిన ‘సూపర్ సిక్స్’ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఆస్ట్రేలియాకు సెమీఫైనల్ బెర్త్ దక్కింది. ప్రస్తుతం ‘సూపర్ సిక్స్8 గ్రూప్–1లో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఆరు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉండగా ... శ్రీలంక మూడు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.ఈనెల 29న ఆస్ట్రేలియాతో జరిగే తమ చివరి ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో శ్రీలంక గెలిచినా ఐదు పాయింట్లకే పరిమితం అవుతుంది. ‘సూపర్ సిక్స్’ గ్రూప్–2 నుంచి దక్షిణాఫ్రికా జట్టు కూడా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. చదవండి: చరిత్ర సృష్టించిన ఆసీస్ యువ ఓపెనర్.. టీ20 ఫైనల్స్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ -
ఇంగ్లాండ్ తో రెండో టీ20లో భారత్ ఘనవిజయం
-
తిలక్ తడాఖా.. చెపాక్ టీ20లో భారత్ విజయం
భారత్ ముందున్న లక్ష్యం 166. స్కోరేమో 15 ఓవర్లలో 126/7. అంటే ఈ పాటికే అర్థమై ఉంటుంది. మిగిలిందల్లా టెయిలెండర్లే అని! గెలుపు కష్టమని!! కానీ వారితో పాటు ఒకడు మిగిలాడు. అతడే తెలుగు తేజం నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ. 30 బంతుల్లో 40 పరుగులు... ఇది గెలుపు సమీకరణం. సరిజోడు లేకపోయినా, బ్యాటింగ్ చేయగలిగే ఆటగాడు కరువైనా... వెన్నుచూపలేదు. ఇంగ్లండ్ బౌలింగ్‌కు తమ సహచరుల్లా తలొంచలేదు. ఆర్చర్ 16వ ఓవర్లో 0, 6, 6, 1, 4, 2లతో 19 పరుగులొచ్చాయి. ఇందులో 2 సిక్స్‌లు, 1 పరుగు తిలకే చేశాడు.ఇక 24 బంతుల్లో 21 పరుగులు కావాలి. ఇది భారత్‌ను ఊరించింది. కానీ ఆదిల్ రషీద్ 17వ ఓవర్లో 1 పరుగిచ్చి అర్ష్‌దీప్‌ను అవుట్ చేయడంతో మళ్లీ టెన్షన్... టెన్షన్... అప్పుడు రవి బిష్ణోయ్ (5 బంతుల్లో 9 నాటౌట్; 2 ఫోర్లు) ఆపద్భాంధవుడిలా వచ్చాడు. అతనిది సింగిల్ డిజిట్ స్కోరే కావొచ్చు. కానీ తిలక్‌తో అమూల్యమైన, అబేధ్యమైన విజయానికి ఆ పరుగులు, ఆ భాగస్వామ్యమే (తొమ్మిదో వికెట్‌కు 20 పరుగులు) టీమిండియాను గెలిపించింది. సిరీస్‌లో 2–0తో పైచేయి సాధించేలా చేసింది. చెన్నై: ఓపెనర్ల దూకుడు లేదు. సూర్యకుమార్ యాదవ్ జోరు కనిపించలేదు. హార్దిక్ పాండ్యా అనుభవం కలిసిరాలేదు. కానీ... ఇన్ని ప్రతికూలతల మధ్య భారత్ రెండో టి20లో గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలో నిలిచింది. కారణం ఒకేఒక్కడు తిలక్ వర్మ. అసలు ఆశలే లేని చోట... స్పెషలిస్టు బ్యాటర్లే కరువైన వేళ... పరుగుల వేటలో గెలుపుబాట పరిచాడు. 20వ ఓవర్ రెండో బంతికి బౌండరీతో విన్నింగ్షాట్ కొట్టేదాకా క్రీజులో కడదాకా నిలిచి భారత్‌ను గట్టెక్కించాడు. ఆఖరిదాకా విజయం కోసం పట్టుబిగించిన ఇంగ్లండ్ చివరకు 2 వికెట్ల తేడాతో భారత్ చేతిలో పరాజయం పాలైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కెపె్టన్ జోస్ బట్లర్ (30 బంతుల్లో 45; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), బ్రైడన్ కార్స్ (17 బంతుల్లో 31; 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించారు. అక్షర్, వరుణ్ చక్రవర్తి చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ 19.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తిలక్ వర్మ (55 బంతుల్లో 72 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. వాషింగ్టన్ సుందర్ (19 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. మెరిపించిన బట్లర్, కార్స్ ఆరంభంలోనే ఓపెనింగ్ జోడీ సాల్ట్ (4)ను అర్ష్‌దీప్, డకెట్ (3)ను సుందర్ పెవిలియన్ చేర్చారు. సొంత ప్రేక్షకుల మధ్య తొలి ఓవర్ (ఇన్నింగ్స్ 4వ) వేసేందుకు దిగిన సుందర్ తొలి బంతికే డకెట్‌ను బోల్తాకొట్టించాడు. హ్యారీ బ్రూక్ (13), లివింగ్‌స్టోన్ (13)లను వరుణ్, అక్షర్ కుదురుకోనివ్వలేదు. చెప్పుకోదగిన భాగస్వామ్యం లేకపోయినా... ధాటైన ఇన్నింగ్స్ ఏ ఒక్కరు ఆడలేకపోయినా... ఇంగ్లండ్ ఆఖరుకొచ్చే సరికి పుంజుకుంది. కెపె్టన్ బట్లర్ మెరుపులతో స్కోరు మోస్తరుగా సాగిపోగా... అరంగేట్రం హీరో జేమీ స్మిత్ (12 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్‌లు), కార్స్‌ల వేగంతో స్కోరు వేగం పెరిగింది. అర్ష్‌దీప్, పాండ్యా, సుందర్, అభిషేక్‌లకు తలా ఒక వికెట్ దక్కింది. తిలక్... అంతా తానై... ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లాగే మనకూ మంచి ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు అభిషేక్ (12)కు మార్క్ వుడ్, సామ్సన్ (5)కు ఆర్చర్ చెక్ పెట్టారు. తిలక్ వర్మ అడపాదడపా మెరుపులతో భారత్ స్కోరు 50 దాటింది. కానీ ఈ దశలో కెపె్టన్ సూర్యకుమార్ (12), ధ్రువ్ జురేల్ (4), హార్దిక్ పాండ్యా (7)లు స్వల్పవ్యవధిలో అదికూడా 10 ఓవర్లలోపే అవుటవడం భారత్ ఇన్నింగ్స్‌కు పెద్దకుదుపు... 9.1 ఓవర్లు 78/5 స్కోరు! గెలుపు చాలా దూరంలో ఉంటే మిగిలిన స్పెషలిస్టు బ్యాటర్ తిలక్ వర్మ ఒక్కడే! సుందర్, అక్షర్ పటేల్ (2) బ్యాటింగ్ చేయగలరు కానీ గెలిపించేదాకా నిలుస్తారా అన్న సందేహాలు భారత శిబిరాన్ని, స్టేడియంలోని ప్రేక్షకుల్ని కలవరపెట్టాయి. ఊహించినట్లే వారిద్దరు కలవరపెట్టే నిష్క్రమించారు. ఈ దశలో తిలక్‌వర్మ గెలిచేదాకా బాధ్యతను భుజానవేసుకొని విజయమాల భారత జట్టు మెడలో వేశాడు.స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) సుందర్ (బి) అర్ష్‌దీప్ 4; డకెట్ (సి) జురేల్ (బి) సుందర్ 3; బట్లర్ (సి) తిలక్ వర్మ (బి) అక్షర్ 45; బ్రూక్ (బి) వరుణ్ 13; లివింగ్‌స్టోన్ (సి) సబ్–హర్షిత్ (బి) అక్షర్ 13; స్మిత్ (సి) తిలక్ వర్మ (బి) అభిõÙక్ 22; ఓవర్టన్ (బి) వరుణ్ 5; కార్స్ (రనౌట్) 31; ఆర్చర్ (నాటౌట్) 12; రషీద్ (సి) సామ్సన్ (బి) పాండ్యా 10; మార్క్ వుడ్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–6, 2–26, 3–59, 4–77, 5–90, 6–104, 7–136, 8–137, 9–157. బౌలింగ్: అర్ష్‌దీప్ 4–0–40–1, హార్దిక్ పాండ్యా 2–0–6–1, వాషింగ్టన్ సుందర్ 1–0–9–1, అక్షర్ 4–0–32–2, రవి బిష్ణోయ్ 4–0–27–0, వరుణ్ 4–0–38–2, అభిషేక్ 1–0–12–1. భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) కార్స్ (బి) ఆర్చర్ 5; అభిõÙక్ (ఎల్బీ) (బి) వుడ్ 12; తిలక్ వర్మ (నాటౌట్) 72; సూర్యకుమార్ (బి) కార్స్ 12; జురేల్ (సి) సబ్–రేహన్ (బి) కార్స్ 4; పాండ్యా (సి) సాల్ట్ (బి) ఓవర్టన్ 7; సుందర్ (బి) కార్స్ 26; అక్షర్ (సి) డకెట్ (బి) లివింగ్‌స్టోన్ 2; అర్ష్‌దీప్ (సి) ఆర్చర్ (బి) రషీద్ 6; బిష్ణోయ్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–15, 2–19, 3–58, 4–66, 5–78, 6–116, 7–126, 8–146. బౌలింగ్: జోఫ్రా ఆర్చర్ 4–0–60–1, మార్క్ వుడ్ 3–0–28–1, కార్స్ 4–0–29–3, ఆదిల్ రషీద్ 4–0–14–1, ఓవర్టన్ 2.2–0–20–1, లివింగ్‌స్టోన్ 2–0–14–1. -
నేడు భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో టీ20
-
రెండో టి20: జోరు మీదున్న టీమిండియా
ఇంగ్లండ్‌తో బోణీ అదిరింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో టీమిండియా సత్తా చాటుకుంది. ఇక సిరీస్‌లో పైచేయే మిగిలింది. వరుస మ్యాచ్‌ల విజయాలతో ప్రత్యర్థిని దెబ్బతీయాలని ఆతిథ్య భారత్ చూస్తోంది. తద్వారా సిరీస్ ఫలితం కోసం ఆఖరి పోరు (ఐదో టి20) దాకా లాక్కెళ్లడం ఎందుకని భావిస్తోంది. అయితే ఇది టి20 ఫార్మాట్.ఇందులో సొంతగడ్డ అనుకూలతలు, పర్యాటక జట్టుకు ప్రతికూలతలంటూ ఉండవు. ఒక్క ఓవర్ మార్చేస్తుంది. ఇక మెరుపు ఇన్నింగ్స్ తేల్చేస్తుంది. అలాంటి స్పీడ్ గేమ్‌లో మనదే ఆధిపత్యమనుకొని ఆదమరిస్తే అంతే సంగతి! ఐసీసీ ర్యాంకింగ్‌తో సంబంధం లేకుండా అంతర్జాతీయ క్రికెట్లోనే ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లండ్ జట్లు ఎప్పుడైనా సరే టాప్–3 జట్లే! కాబట్టి బట్లర్ బృందాన్ని ఏమాత్రం తక్కువ అంచనా వేసినా భారత్ మూల్యం చెల్లించుకోక తప్పదు. పైగా ఐపీఎల్లో హార్డ్ హిట్టర్‌గా ఇక్కడి పిచ్‌లపై కెప్టెన్ బట్లర్‌కు చక్కని అవగాహన ఉంది. ఆ సంగతి సూర్యకుమార్ బృందం మర్చిపోకూడదు. ఈ నేపథ్యంలో నేడు జరిగే రెండో టి20లో భారత్, ఇంగ్లండ్ జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. చెన్నై: కోల్‌కతాలో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ బోల్తా పడింది. అలాగని ఒక్క మ్యాచ్‌తోనే పటిష్టమైన ఇంగ్లండ్‌ను తేలిగ్గా తీసుకోలేం. ఓపెనింగ్‌లో ఫిల్ సాల్ట్, మిడిలార్డర్లో హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టోన్‌లు బ్యాట్ ఝుళిపిస్తే భారత బౌలర్లకు కష్టాలు తప్పవు. ఈ ముగ్గురితో పాటు జోస్ బట్లర్‌కు ఇక్కడి పిచ్‌లు కొట్టిన పిండే! అతని విధ్వంసం కొన్ని ఓవర్లపాటే ఉన్నా ఆ ప్రభావం ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను గణనీయంగా మార్చేస్తుంది. బౌలింగ్‌లో పేస్ ఆల్‌రౌండర్ జోఫ్రా ఆర్చర్ మెరుగ్గా బౌలింగ్ చేశాడు. అట్కిన్సన్, మార్క్ వుడ్‌లతో పార్ట్‌టైమ్ బౌలర్‌గా లివింగ్‌స్టోన్ కూడా బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. గత మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన జట్టు వెనుకబడదు. కచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచేందుకు, 1–1తో సమం చేసేందుకు బట్లర్ బృందం గట్టి పోరాటమే చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. షమీ ఆడేనా? భారత వెటరన్ సీమర్ షమీ గాయాల తర్వాత దేశవాళీ క్రికెట్లో బరిలోకి దిగాడు. ఫిట్నెస్ నిరూపించుకున్నాడు. అయితే అంతర్జాతీయ పోటీలకు మాత్రం నిరీక్షణ తప్పడం లేదు. ‘ఈడెన్’లో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన భారత బృందం స్పిన్‌కు స్వర్గధామమైన ‘చెపాక్’లోనూ అదే ఎత్తుగడను కొనసాగిస్తే సీనియర్ పేసర్ డగౌట్‌కే పరిమితం కావొచ్చు. ఒకవేళ ఐదు మ్యాచ్‌ల సుదీర్ఘ సిరీస్‌లో అతన్ని దించాలనుకుంటే మాత్రం ‘ఈడెన్’లో ప్రభావం చూపలేకపోయిన స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ని పక్కనబెట్టే అవకాశమైతే ఉంది. ఈ మార్పు మినహా గత జట్టే యథాతథంగా కొనసాగుతుంది. ఓపెనర్లు సంజూ సామ్సన్, అభిషేక్ శర్మ మంచి ఆరంభమే ఇచ్చారు. తక్కువ లక్ష్యమే కావడంతో మిగతా వారు పెద్దగా రాణించే చాన్స్ రాలేదు. సంజూ కూడా అభిషేక్లాగే భారీ ఇన్నింగ్స్ ఆడితే భారత బ్యాటింగ్ ఆర్డర్‌కు ఏ ఢోకా ఉండదు. నితీశ్ రెడ్డి, అక్షర్ పటేల్ దాకా అంతా దంచేసే వాళ్లే ఉన్నారు. ఓవర్‌కు పది పైచిలుకు పరుగులిచ్చినా హార్దిక్ పాండ్యా రెండు వికెట్లతో సత్తా చాటాడు. అర్ష్ దీప్ సింగ్ ఈ ఫార్మాట్లో తన ప్రాధాన్యం పెంచుకునే ప్రదర్శన చేస్తున్నాడు. స్పిన్‌తో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ ఇంగ్లండ్ బలగాన్ని తిప్పేస్తుండటంతో బౌలింగ్ దళం కూడా దీటుగానే ఉంది.2 చెన్నైలో ఇప్పటి వరకు భారత జట్టు రెండు టి20లు ఆడింది. ఒక మ్యాచ్‌లో గెలిచి (2018లో వెస్టిండీస్‌పై ఆరు వికెట్ల తేడాతో)... మరో మ్యాచ్‌లో (2012లో న్యూజిలాండ్ చేతిలో ఒక పరుగు తేడాతో) ఓడిపోయింది.పిచ్, వాతావరణం గత ఈడెన్ పిచ్ సీమర్లకు, స్పిన్నర్లకు సమాన అవకాశమిచ్చిoది. కానీ ఇక్కడి చెపాక్ వికెట్ అలా కాదు. ఇది ఎప్పట్నుంచో స్పిన్ ఫ్రెండ్లీ పిచ్. వరుణ్, అక్షర్‌లతో పాటు రవి బిష్ణోయ్‌కు కలిసొచ్చే వేదికని చెప్పొచ్చు. మంచు ప్రభావం తప్ప వాన ముప్పయితే లేదు. -
చరిత్ర సృష్టించిన ఆండ్రూ ఫ్లింటాఫ్ తనయుడు
ఇంగ్లండ్ దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ తనయుడు రాకీ ఫ్లింటాఫ్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ లయన్స్ (అండర్-19 జట్టు) తరఫున సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. రాకీ 16 ఏళ్ల 291 రోజుల వయసులో లయన్స్ తరఫున సెంచరీ చేశాడు. 16 YEARS OLD ROCKY FLINTOFF SMASHED A BRILLIANT HUNDRED..!!!!! ⭐Andrew Flintoff's son Rocky Flintoff is 16 years old and he smashed a magnificent Hundred for England Lions vs Cricket Australia XI.- ROCKY, A STAR IS BORN..!!!! pic.twitter.com/UB0STrNET8— Tanuj Singh (@ImTanujSingh) January 23, 2025ఇక్కడ మరో విశేషమేమిటంటే.. రాకీ స్వయానా తన తండ్రి రికార్డునే బద్దలు కొట్టాడు. రాకీకి ముందు లయన్స్ తరఫున అతి చిన్న వయసులో సెంచరీ చేసిన రికార్డు ఆండ్రూ ఫ్లింటాఫ్ పేరిట ఉండేది. ఆండ్రూ ఫ్లింటాఫ్ 20 ఏళ్ల 28 రోజుల వయసులో లయన్స్ తరఫున సెంచరీ చేశాడు.క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవెన్‌తో జరిగిన మ్యాచ్‌లో రాకీ సెంచరీ చేశాడు. రాకీకి లయన్స్ తరఫున ఇదే తొలి సెంచరీ. ఈ మ్యాచ్‌లో రాకీ తొమ్మిదో స్థానంలో బరిలోకి దిగి కష్టాల్లో ఉన్న తన జట్టును (161/7) గట్టెక్కించాడు. ఈ మ్యాచ్‌లో (తొలి ఇన్నింగ్స్‌లో) రాకీ 127 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేశాడు.🚨 ANDREW FLINTOFF SON ROCKY FLINTOFF CREATED HISTORY 🚨 - Rocky Flintoff becomes the youngest player to score a Maiden for England Lions (16 Year age). 🤯pic.twitter.com/1oL1QpoGO8— Tanuj Singh (@ImTanujSingh) January 23, 2025రాకీ సెంచరీతో సత్తా చాటడంతో లయన్స్ తొలి ఇన్నింగ్స్‌లో 316 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు ఆస్ట్రేలియా ఎలెవెన్ 214 పరుగులకే చాపచుట్టేసింది. రాకీ హీరోయిక్ ఇన్నింగ్స్ కారణంగా లయన్స్‌కు 102 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.కాగా, ఆస్ట్రేలియా ఎలెవెన్‌తో మూడు నాలుగు రోజుల మ్యాచ్‌ల సిరీస్ కోసం లయన్స్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో లయన్స్ 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఆ మ్యాచ్‌లో రాకీ తొలి ఇన్నింగ్స్‌లో 19, రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో లయన్స్‌కు రాకీ తండ్రి ఆండ్రూ ఫ్లింటాఫ్ హెడ్ కోచ్ కావడం గమనార్హం. ఈ సిరీస్‌లో లయన్స్ తరఫున ఐదుగురు ఇంగ్లండ్ సీనియర్ జట్టు ఆటగాళ్లు (షోయబ్ బషీర్, పాట్ బ్రౌన్, టామ్ హార్ట్లీ, జోష్ టంగ్, జాన్ టర్నర్ ఆడుతున్నారు. -
టీ20ల్లో జోస్ బట్లర్ అరుదైన ఘనత
టీ20ల్లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అరుదైన ఘనత సాధించాడు. పొట్టి ఫార్మాట్లో 12000 పరుగులు పూర్తి చేసిన ఏడో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. భారత్‌తో తొలి టీ20 సందర్భంగా జోస్ ఈ అరుదైన మైలురాయిని అధిగమించాడు. జోస్‌కు ముందు క్రిస్ గేల్ (14562), షోయబ్ మాలిక్ (13492), కీరన్ పోలార్డ్ (13429), అలెక్స్ హేల్స్ (13361), విరాట్ కోహ్లి (12886), డేవిడ్ వార్నర్ (12757) మాత్రమే టీ20ల్లో 12000 పరుగులు చేశారు.టీ20ల్లో అత్యంత వేగంగా 12000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో బట్లర్ నాలుగో స్థానంలో ఉన్నాడు. గేల్ (343 మ్యాచ్‌ల్లో), విరాట్, వార్నర్ బట్లర్ కంటే వేగంగా ఈ మైలురాయిని చేరుకున్నారు. బట్లర్ తన టీ20 కెరీర్లో ఇప్పటివరకు (భారత్‌తో తొలి టీ20 కలుపుకుని) 430 మ్యాచ్‌లు ఆడి 145.29 స్ట్రయిక్‌రేట్‌తో, 35.08 సగటున 12035 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 84 అర్ద సెంచరీలు ఉన్నాయి.బట్లర్ ఒక్క అంతర్జాతీయ క్రికెట్లోనే సెంచరీ, 26 అర్ద సెంచరీల సాయంతో 3457 పరుగులు చేశాడు. బట్లర్ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ తరఫున 3000 టీ20 పరుగులు పూర్తి చేసిన ఏకైక బ్యాటర్ బట్లరే.భారత్, ఇంగ్లండ్ తొలి టీ20 విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జోస్ బట్లర్ (44 బంతుల్లో 68; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. బట్లర్‌తో పాటు ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ (17), జోఫ్రా ఆర్చర్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. భారత బౌలర్లు వరుణ్ చక్రవర్తి (4-0-23-3), అర్షదీప్ సింగ్ (4-0-17-2), అక్షర్ పటేల్ (4-1-22-2), హార్దిక్ పాండ్యా (4-0-42-2) అద్భుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్ బ్యాటర్ల భరతం పట్టారు.133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. అభిషేక్ శర్మ (34 బంతుల్లో 79; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో 12.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసిన అభిషేక్ కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అభిషేక్‌తో పాటు ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేసిన సంజూ శాంసన్ కూడా బ్యాట్‌ను ఝులిపించాడు. శాంసన్ 20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 26 పరుగులు చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ డకౌట్ కాగా.. తిలక్ వర్మ (19), హార్దిక్ పాండ్యా (3) భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2, ఆదిల్ రషీద్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌లో తదుపరి టీ20 జనవరి 25న చెన్నై వేదికగా జరుగనుంది. -
యాషెస్ సిరీస్‌లో ఆసీస్‌కు మరో విజయం
మహిళల యాషెస్ సిరీస్-2025లో ఆస్ట్రేలియా మరో విజయం సాధించింది. మల్టీ ఫార్మాట్లో జరుగుతున్న ఈ సిరీస్‌ను ఆసీస్ ఇదివరకే కైవసం చేసుకుంది. ఇవాళ (జనవరి 23) జరిగిన రెండో టీ20లో ఆసీస్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఓపెనర్ బెత్ మూనీ (44), కెప్టెన్ తహ్లియా మెక్‌గ్రాత్ (48 నాటౌట్), గ్రేస్ హ్యారిస్ (35 నాటౌట్) రాణించారు. జార్జియా వాల్ (5), ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (17), ఎల్లిస్ పెర్రీ (2), అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (18) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో చార్లీ డీన్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఫ్రేయా కెంప్, సోఫీ ఎక్లెస్టోన్ తలో వికెట్ దక్కించుకున్నారు.ఛేదనకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. ఆ జట్టు 19.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుండింది. ఈ దశలో వర్షం ఎడతెరిపిలేకుండా కురువడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్దతిన ఆసీస్‌ను విజేతగా ప్రకటించారు. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 19.1 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ టార్గెట్ 175గా ఉండింది. అయితే ఈ సమయానికి ఇంగ్లండ్ లక్ష్యానికి 7 పరుగుల దూరం ఉండింది. ఏ మాత్రం ఆశలు లేని మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు నిలదొక్కుకున్నారు. డేనియెల్ వ్యాట్ హాడ్జ్ (52), సోఫీ డంక్లీ (32), నాట్ సీవర్ బ్రంట్ (22), కెప్టెన్ హీథర్ నైట్ (43 నాటౌట్) ఇంగ్లండ్‌కు గెలుపుపై ఆశలు చిగురించేలా చేశారు. అయితే ఇంగ్లండ్ ఆశలపై వర్షం నీళ్లు చల్లింది. 5 బంతుల్లో 18 పరుగులు చేయాల్సి తరుణంలో మ్యాచ్ నిలిచిపోయింది. ఒకవేళ మ్యాచ్ కొనసాగినా ఇంగ్లండ్‌కు గెలుపు అంత ఈజీ కాదు. ఫామ్‌లో ఉన్న హీథర్ నైట్ క్రీజ్‌లో ఉండటంతో ఆ జట్టు గెలుపుపై ఆశలు పెట్టుకుని ఉండింది.కాగా, మూడు వన్డేలు, మూడు టీ20లు, ఏకైక టెస్ట్ మ్యాచ్ కలిగిన మల్టీ ఫార్మాట్ యాషెస్ సిరీస్ కోసం ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత జరిగిన వన్డే సిరీస్‌ను ఆసీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కూడా ఆసీస్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. రెండో టీ20లో గెలుపుతో ఆసీస్ ఖాతాలో 10 పాయింట్లు (ఒక్కో గెలుపుకు రెండు పాయింట్లు) చేరాయి.ఈ సిరీస్‌లో ఇంకా ఓ టీ20, ఓ టెస్ట్ మ్యాచ్ మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ గెలిచినా ఇంగ్లండ్ కనీసం సిరీస్‌ను సమం కూడా చేసుకోలేదు. తదుపరి రెండు మ్యాచ్‌లు గెలిస్తే ఇంగ్లండ్ ఖాతాలో 4 పాయింట్లు మాత్రమే ఉంటాయి.ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరిగే ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం 13 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టుకు అలైసా హీలీ సారధిగా వ్యవహరించనుంది. గాయం కారణంగా హీలీ టీ20 సిరీస్‌లో ఆడలేదు. టెస్ట్ మ్యాచ్ సమయానికంతా హీలీ కోలుకుంటుందని ఆసీస్ మీడియా వెల్లడించింది. అయితే టెస్ట్ మ్యాచ్‌లో హీలీ కేవలం బ్యాటర్‌గానే కొనసాగుతుందని పేర్కొంది. పింక్ బాల్‌తో డే అండ్ నైట్ ఫార్మాట్లో జరిగే టెస్ట్ మ్యాచ్ జనవరి 30 నుంచి ఫిబ్రవరి 2 వరకు మెల్బోర్న్లో జరుగనుంది. దీనికి ముందు జనవరి 25న మూడో టీ20 జరుగనుంది.ఇంగ్లండ్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా జట్టు..అలైసా హీలీ (కెప్టెన్), డార్సీ బ్రౌన్, ఆష్లే గార్డ్నర్, కిమ్ గార్త్, అలానా కింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, తహ్లియా మెక్‌గ్రాత్ (వైస్ కెప్టెన్), బెత్ మూనీ (వికెట్‌కీపర్), ఎల్లీస్ పెర్రీ, మెగాన్ షుట్, అన్నాబెల్ సదర్లాండ్, జార్జియా వోల్, జార్జియా వేర్హామ్ -
చెలరేగిన అభిషేక్ శర్మ..తొలి టి20లో భారత్ ఘన విజయం (ఫొటోలు)
-
ఆరంభం అదిరింది.. తొలి టీ20లో ఇంగ్లండ్ చిత్తు
టి20 వరల్డ్ చాంపియన్ భారత్ మరోసారి తమ స్థాయికి తగ్గ ఆటతో అదరగొట్టింది. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య ఏకపక్షంగా సాగిన పోరులో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. కట్టుదిట్టమైన పేస్, స్పిన్‌తో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన టీమిండియా... ఆపై దూకుడైన బ్యాటింగ్‌తో మరో 43 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. భారీ బ్యాటింగ్ బలగం ఉన్న ఇంగ్లండ్ కనీస స్థాయి ప్రదర్శన కూడా ఇవ్వలేక చేతులెత్తేసింది. అర్ష్ దీప్ , వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌తో పాటు అభిషేక్ శర్మ మెరుపు ప్రదర్శన భారత జట్టును ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో నిలిపాయి. రెండో టి20 మ్యాచ్ శనివారం చెన్నైలో జరుగుతుంది. కోల్‌కతా: ఇంగ్లండ్‌తో మొదలైన టి20 సిరీస్‌లో భారత్ 1–0తో ముందంజ వేసింది. బుధవారం జరిగిన తొలి పోరులో భారత్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. జోస్ బట్లర్ (44 బంతుల్లో 68; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. వరుణ్ చక్రవర్తికి 3 వికెట్లు దక్కగా...అర్ష్ దీప్ , అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తలా 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 12.5 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు సాధించి గెలిచింది. అభిషేక్ శర్మ (34 బంతుల్లో 79; 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) సిక్సర్లతో చెలరేగి జట్టును గెలిపించాడు. భారత బౌలర్ల జోరు... లెఫ్టార్మ్ పేసర్ అర్ష్ దీప్ పదునైన బంతులతో ఆరంభంలోనే ఇంగ్లండ్‌ను దెబ్బ తీశాడు. తొలి ఓవర్లో ఫిల్ సాల్ట్ (0)ను అవుట్ చేసిన అతను, తన రెండో ఓవర్లో డకెట్ (4)ను వెనక్కి పంపించాడు. బట్లర్, బ్రూక్ (17) కలిసి కొద్దిసేపు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. పాండ్యా ఓవర్లో నాలుగు ఫోర్లతో బట్లర్ దూకుడు ప్రదర్శించాడు. అయితే ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి స్పిన్‌కు ఇంగ్లండ్ కుదేలైంది. ఒకే ఓవర్లో అతను బ్రూక్, లివింగ్‌స్టోన్ (0)లను డగౌట్‌కు పంపించాడు. అనంతరం ఒక ఎండ్‌లో ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోగా... బట్లర్ ఒక్కడే పోరాడగలిగాడు. 34 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. ఆపై పాండ్యా, అక్షర్ మెరుగైన బౌలింగ్‌కు తోడు చక్కటి ఫీల్డింగ్ కారణంగా ఇంగ్లండ్ 26 పరుగుల వ్యవధిలో తర్వాతి 4 వికెట్లు చేజార్చుకుంది. మెరుపు బ్యాటింగ్... అట్కిన్సన్ వేసిన రెండో ఓవర్లో సంజు సామ్సన్ (20 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో వరుసగా 4, 4, 0, 6, 4, 4 బాదిన అతను 22 పరుగులు రాబట్టాడు. అయితే ఒకే ఓవర్లో సామ్సన్, సూర్యకుమార్ (0)లను అవుట్ చేసి ఆర్చర్ దెబ్బ తీశాడు. వుడ్ ఓవర్లో అభి షేక్ 2 సిక్స్‌లు, ఫోర్ కొట్టడంతో పవర్‌ప్లేలో భారత్ 63 పరుగులు చేసింది. ఆ తర్వాత 29 పరుగుల వద్ద ఆదిల్ రషీద్ రిటర్న్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన అభిషేక్ తర్వాతి మూడు బంతుల్లో వరుసగా 4, 6, 6 బాదాడు. ఆపై మరో సిక్స్‌తో 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాతా దూకుడుగా ఆడిన అభిషేక్ భారత విజయానికి 8 పరుగుల దూరంలో అవుటయ్యాడు. షమీకు నో చాన్స్!ఫిట్నెస్ నిరూపించుకొని దాదాపు 14 నెలల విరామం తర్వాత భారత జట్టులోకి వచి్చన సీనియర్ పేస్ బౌలర్ మొహమ్మద్ షమీకి ఇంకా మ్యాచ్ ఆడే అవకాశం మాత్రం రాలేదు. ఇంగ్లండ్‌తో తొలి టి20 కోసం ప్రకటించిన టీమ్‌లో అనూహ్యంగా అతనికి చోటు దక్కలేదు. దీనికి మేనేజ్మెంట్ ఎలాంటి కారణం చెప్పలేదు. జట్టు కూర్పులో భాగంగా అతడిని పక్కన పెట్టారా లేక పూర్తిగా కోలుకోలేదా అనే విషయంపై స్పష్టత లేదు.97 అంతర్జాతీయ టి20ల్లో అర్ష్ దీప్ సింగ్ వికెట్ల సంఖ్య. భారత్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా అతను నిలిచాడు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న యుజువేంద్ర చహల్ (96)ను అర్ష్ దీప్ అధిగమించాడు. స్కోరు వివరాలుఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) సామ్సన్ (బి) అర్ష్ దీప్ 0; డకెట్ (సి) రింకూ (బి) అర్ష్ దీప్ 4; బట్లర్ (సి) నితీశ్ రెడ్డి (బి) వరుణ్ 68; బ్రూక్ (బి) వరుణ్ 17; లివింగ్‌స్టోన్ (బి) వరుణ్ 0; బెతెల్ (సి) అభిషేక్ (బి) పాండ్యా 7; ఒవర్టన్ (సి) నితీశ్ రెడ్డి (బి) అక్షర్ 2; అట్కిన్సన్ (స్టంప్డ్) సామన్ (బి) అక్షర్ 2; ఆర్చర్ (సి) సూర్యకుమార్ (బి) పాండ్యా 12; రషీద్ (నాటౌట్) 8; వుడ్ (రనౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 132. వికెట్ల పతనం: 1–0, 2–17, 3–65, 4–65, 5–83, 6–95, 7–103, 8–109, 9–130, 10–132. బౌలింగ్: అర్ష్ దీప్ సింగ్ 4–0–17–2, హార్దిక్ పాండ్యా 4–0–42–2, వరుణ్ చక్రవర్తి 4–0–23–3, అక్షర్ పటేల్ 4–1–22–2, రవి బిష్ణోయ్ 4–0–22–0. భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) అట్కిన్సన్ (బి) ఆర్చర్ 26; అభిషేక్ శర్మ (సి) బ్రూక్ (బి) రషీద్ 79; సూర్యకుమార్ (సి) సాల్ట్ (బి) ఆర్చర్ 0; తిలక్‌వర్మ (నాటౌట్) 19; పాండ్యా (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (12.5 ఓవర్లలో 3 వికెట్లకు) 133. వికెట్ల పతనం: 1–41, 2–41, 3–125. బౌలింగ్: జోఫ్రా ఆర్చర్ 4–0–21–2, అట్కిన్సన్ 2–0–38–0, మార్క్ వుడ్ 2.5–0–25–0, రషీద్ 2–0–27–1, ఒవర్టన్ 1–0–10–0, లివింగ్‌స్టోన్ 1–0–7–0. -
ఇంగ్లాండ్ తో టీ20 సమరానికి సిద్ధమైన టీమిండియా
-
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేత భారత్.. ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఘన విజయం
భారత దివ్యాంగ క్రికెట్ టీమ్ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా నిలిచింది. శ్రీలంకలో జరిగిన ఫైనల్లో భారత్ ఇంగ్లండ్‌పై 79 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో చేతులెత్తేసిన ఇంగ్లండ్ 118 పరుగులకే ఆలౌటైంది.The Celebrations of Team India after winning Physical Disabled Champions Trophy 2025. 🇮🇳- A WHOLESOME VIDEO..!!!! 🥹❤️pic.twitter.com/HJ9Ic38RgT— Tanuj Singh (@ImTanujSingh) January 21, 2025భారత దివ్యాంగ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన విషయాన్ని భారత దివ్యాంగ క్రికెట్ కౌన్సిల్ (DCCI) ఎక్స్ వేదికగా ప్రకటించింది. కృషి, దృఢ సంకల్పం మరియు నైపుణ్యం యొక్క అసాధారణ ప్రదర్శన అంటూ కామెంట్ చేసింది.మెగా టోర్నీలో విక్రాంత్ కేనీ భారత జట్టును ముందుండి నడిపించాడు (కెప్టెన్‌గా). అద్భుతమైన జట్టును విజయపథంలో నడిపించడం నా కెరీర్‌కు గర్వకారణమని కేనీ అన్నాడు. ప్లేఆఫ్‌లో ప్రయాణం తమ జట్టులోని ప్రతిభ మరియు పోరాట స్ఫూర్తిని చూపిస్తుందని తెలిపాడు. జట్టులోని ప్రతి ఆటగాడు ఈ చారిత్రాత్మక విజయానికి దోహదపడ్డాడని పేర్కొన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయం భారతదేశం తరపున క్రికెట్ ఆడాలని కలలు కన్న ప్రతి దివ్యాంగుడికి చెందుతుందని అని DCCI విడుదల చేసిన ఒక ప్రకటనలో ఉటంకించారు.యోగేంద్ర భదోరియా విధ్వంసంఫైనల్లో భారత ఆటగాడు యోగేంద్ర భదోరియా విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అతను 40 బంతుల్లో నాలుగు బౌండరీలు, ఐదు సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు కూడా విశేషంగా రాణించారు. రాధికా ప్రసాద్ 3.2 ఓవర్లలో కేవలం 19 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. కెప్టెన్ విక్రాంత్ కేనీ 3 ఓవర్లలో 15 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర సంటే 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజయాన్ని జట్టు ప్రధాన కోచ్ రోహిత్ జలానీ కొనియాడాడు. తన జట్టు అసాధారణ ప్రదర్శన మరియు సన్నద్ధతను ప్రశంసించాడు. టోర్నీ ఆధ్యాంతం తమ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారని ఆకాశానికెత్తాడు. విభిన్న పరిస్థితుల్లో ఎదురైన ప్రతి సవాలును తమ ఆటగాళ్లు అధిగమించారని అన్నాడు. -
పరుగుల వరదకు సై
ఒకరిని మించి మరొకరు ధాటిగా ఆడే బ్యాటర్లు... భారీ స్కోర్లకు వేదికలైన చిన్న మైదానాలు... మంచు ప్రభావంతో బౌలర్లకు తిప్పలు... రాబోయే పక్షం రోజుల్లో టి20ల్లో క్రికెట్లో ఎన్ని కొత్త రికార్డులు నమోదు కానున్నాయో! వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత తొలుత బ్యాటింగ్ చేసిన 11 మ్యాచ్‌లలో 7 సార్లు 200 స్కోరు దాటించిన టీమిండియా తమ దూకుడును ప్రదర్శించగా... విధ్వంసానికి మారుపేరువంటి మెకల్లమ్ కోచింగ్‌లో ఇంగ్లండ్ కూడా ఓవర్‌కు పదికి పైగా రన్‌రేట్‌తో వరుసగా లక్ష్యాలను ఛేదిస్తూ తామూ తక్కువ కాదని నిరూపించింది. ఈ నేపథ్యంలో రాబోయే ఐదు టి20 సమరాలు అభిమానులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించనున్నాయి. గత వరల్డ్ కప్ సెమీస్‌లో భారత్ చేతిలో ఇంగ్లండ్ చిత్తయిన తర్వాత ఇరు జట్లు ఇప్పుడే తొలిసారి తలపడనుండగా... చివరకు పైచేయి ఎవరు సాధిస్తారనేది ఆసక్తికరం.కోల్‌కతా: ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ ముగిసిన రెండు వారాల తర్వాత భారత క్రికెట్ జట్టు మళ్లీ మైదానంలోకి దిగుతోంది. టెస్టులతో పోలిస్తే పూర్తిగా భిన్నమైన జట్టుతో ఇప్పుడు టీమిండియా టి20 ఫార్మాట్లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టి20 పోరులో విశ్వ విజేత జట్టు తలపడుతుంది. ఇందులో భాగంగా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో నేడు మొదటి మ్యాచ్ జరుగుతుంది. బలాబలాల దృష్ట్యా చూస్తే రెండు టీమ్‌లు దాదాపు సమానంగా కనిపిస్తున్నాయి. టి20 కోచ్‌గానూ పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకున్న మెకల్లమ్ తనదైన శైలిలో కొత్తగా ఇంగ్లండ్ జట్టును సిద్ధం చేశాడు. షమీపై అందరి దృష్టి... గాయం నుంచి కోలుకొని దాదాపు 14 నెలల తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ ఫిట్‌నెస్‌కు ఈ మ్యాచ్ పరీక్ష కానుంది. ఇప్పటికే చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌లోకి కూడా ఎంపికైన షమీ టి20 ఫార్మాట్ ద్వారా తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని పట్టుదలగా ఉన్నాడు. రెండు నెలల క్రితం భారత జట్టు దక్షిణాఫ్రికా గడ్డపై మెరుపు ప్రదర్శన కనబర్చి 3–1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికాతో సిరీస్ చివరి మ్యాచ్‌తో పోలిస్తే దాదాపు అదే జట్టు బరిలోకి దిగవచ్చు. ఆ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన సంజు సామ్సన్ అంతర్జాతీయ క్రికెట్లో తన జోరును ప్రదర్శించాలని భావిస్తుండగా, రెండో ఓపెనర్‌గా అభిషేక్ రాణించాల్సి ఉంది. వరుసగా రెండు అంతర్జాతీయ టి20 సెంచరీలు సాధించిన హైదరాబాదీ తిలక్ వర్మ కూడా అదే ఉత్సాహంతో సిద్ధం కాగా... మిడిలార్డర్లో సూర్యకుమార్, హార్దిక్, రింకూ సింగ్ భారీ స్కోరును అందించగలరు. నితీశ్ కుమార్ రెడ్డికి తుది జట్టులో చోటు దక్కుతుందా చూడాలి. కీపర్‌గా సాల్ట్... తొలి టి20 కోసం ఇంగ్లండ్ తుది జట్టును ముందు రోజే ప్రకటించింది. తొలిసారి వైస్ కెప్టెన్‌గా నియమితుడైన హ్యారీ బ్రూక్ మెరుపు బ్యాటింగ్‌తో సత్తా చాటగలడు. సాల్ట్ కీపర్‌గా వ్యవహరించనున్నాడు. చివరి స్థానం వరకు ఆటగాళ్లంతా బ్యాటింగ్ చేయగల సమర్థులు కావడం ఇంగ్లండ్ బలం. పిచ్, వాతావరణం ఈడెన్ మైదానం బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. కాబట్టి భారీ స్కోర్లు ఖాయం. మంచు ప్రభావం ఉంది కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌కు మొగ్గు చూపవచ్చు. వర్ష సూచన లేదు. 24 భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇప్పటి వరకు 24 టి20 మ్యాచ్‌లు జరిగాయి. 13 మ్యాచ్‌ల్లో భారత్ నెగ్గగా... 11 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ విజయం సాధించింది. భారత్ వేదికగా రెండు జట్లు 11 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. 6 మ్యాచ్‌ల్లో టీమిండియా గెలుపొందగా... 5 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌కు విజయం దక్కింది. 7 ఈడెన్ గార్డెన్స్ మైదానంలో భారత్ ఆడిన టి20 మ్యాచ్‌లు. ఇందులో ఆరింటిలో భారత్ నెగ్గగా... ఎదురైన ఒక పరాజయం ఇంగ్లండ్ చేతిలోనే (2011లో) కావడం గమనార్హం. తుది జట్ల వివరాలు భారత్ (అంచనా): సూర్యకుమార్ (కెప్టెన్), సామ్సన్, అభిషేక్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్, షమీ, అర్‡్షదీప్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్/సుందర్. ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్), సాల్ట్, డకెట్, హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టోన్, బెతెల్, ఒవర్టన్, అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, రషీద్, మార్క్ వుడ్. -
ఆసీస్‌దే యాషెస్
మహిళల యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా తిరిగి సొంతం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నిన్న (జనవరి 20) జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసీస్ 57 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఆసీస్ మరో రెండు టీ20లు, ఓ టెస్ట్ మ్యాచ్ మిగిలుండగానే 8-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.మూడు వన్డేలు, మూడు టీ20లు, ఏకైక టెస్ట్ మ్యాచ్ కలిగిన మల్టీ ఫార్మాట్ యాషెస్ సిరీస్ కోసం ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత జరిగిన వన్డే సిరీస్‌ను ఆసీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. నిన్న జరిగిన తొలి టీ20లోనూ ఆసీస్ విజయం సాధించింది. తద్వారా ఆసీస్ ఖాతాలో 8 పాయింట్లు (ఒక్కో గెలుపుకు రెండు పాయింట్లు) చేరాయి.ఈ సిరీస్‌లో ఇంకా రెండు టీ20లు, ఓ టెస్ట్ మ్యాచ్ మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ గెలిచినా ఇంగ్లండ్ కనీసం సిరీస్‌ను సమం కూడా చేసుకోలేదు. తదుపరి మ్యాచ్‌లన్నీ గెలిస్తే ఇంగ్లండ్ ఖాతాలో 6 పాయింట్లు మాత్రమే ఉంటాయి.తొలి టీ20 విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 198 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ బెత్ మూనీ (51 బంతుల్లో 75; 11 ఫోర్లు) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటింది. మరో ఓపెనర్ జార్జియా వాల్ (21), ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (25), కెప్టెన్ తహిల మెక్‌గ్రాత్ (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. స్టార్ ప్లేయర్ ఎల్లిస్ పెర్రీ (7), అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (3) తక్కుక స్కోర్లకే పెవిలియన్‌కు చేరగా.. గ్రేస్ హ్యారిస్ 8 బంతుల్లో 14, జార్జియా వేర్హమ్ 10 బంతుల్లో 11 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ బెల్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఫ్రేయా కెంప్, చార్లీ డీన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.199 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా దాడి చేయడంతో 16 ఓవర్లలో 141 పరుగులకే టపా కట్టేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో సోఫీ డంక్లీ (59) ఒక్కరే హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఏకంగా నలుగురు డకౌట్లయ్యారు. నాట్ సీవర్ బ్రంట్ (20), కెప్టెన్ హీథర్ నైట్ (18), ఆమీ జోన్స్ (12), సోఫీ ఎక్లెస్టోన్ (13), ఫ్రేయా కెంప్ (11 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో జార్జియా వేర్హమ్ 3 వికెట్లు పడగొట్టగా.. అలానా కింగ్ 2, మెగాన్ షట్, కిమ్ గార్త్, సదర్‌ల్యాండ్, తహిల మెక్‌గ్రాత్ తలో వికెట్ దక్కించుకున్నారు.కాగా, ఈ మ్యాచ్‌కు ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ ఆలైస్సా హీలీ దూరమైంది. గాయం కారణంగా ఆమె ఈ మ్యాచ్‌లో ఆడలేదు. హీలీ స్థానంలో తహిల మెక్‌గ్రాత్ ఆసీస్‌కు సారథ్యం వహించింది. హీలీ తదుపరి సిరీస్‌లో కొనసాగడం కూడా అనుమానమే అని తెలుస్తుంది. ఈ సిరీస్‌లో రెండో టీ20 జనవరి 23న కాన్బెర్రాలో జరుగనుంది. అనంతరం జనవరి 25న మూడో టీ20 అడిలైడ్‌లో.. ఏకైక టెస్ట్ మ్యాచ్ జనవరి 30 నుంచి ఫిబ్రవరి 2 వరకు మెల్బోర్న్లో జరుగనున్నాయి. -
వారానికి రూ. 5 కోట్లు.. జాక్‌పాట్ కాదు! అంతకు మించి..
నార్వే ఫుట్‌బాల్ స్టార్ ఎర్లింగ్ హాలాండ్(Erling Haaland) జాక్‌పాట్ కొట్టేశాడు. ఊహకందని రీతిలో వారానికి రూ. 5 కోట్ల చొప్పున సంపాదించనున్నాడు. ఈ మేరకు ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ సిటీ(Manchester City) ఫుట్‌బాల్ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కాగా 2000 సంవత్సరంలో జన్మించిన హాలాండ్ నార్వే జాతీయ జట్టు తరఫున ఫుట్‌బాల్ ఆడుతున్నాడు.రెండుసార్లు ‘గోల్డెన్ బూట్’ఈ క్రమంలో ఇంగ్లండ్‌లో జరిగే ప్రీమియర్ లీగ్(Premier League)లో అడుగుపెట్టిన హాలాండ్.. అరంగేట్రంలోనే రికార్డులు బద్దలుకొట్టాడు. తొలి సీజన్లోనే 36 గోల్స్‌తో దుమ్ములేపాడు ఈ స్ట్రైకర్. ఇక గత సీజన్లో మాంచెస్టర్ తరఫున 27 గోల్స్ కొట్టిన అతడు.. రెండుసార్లు ‘గోల్డెన్ బూట్’ గెలిచాడు.కానీ ఈ దఫా 16 గోల్స్‌తో సరిపెట్టాడు. ఇక గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. అతడు మాంచెస్టర్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌తో ఇంకో రెండేళ్లు మాత్రమే కొనసాగాల్సి ఉంది. కానీ తాజాగా ఈ డీల్‌ను పొడగిస్తూ మాంచెస్టర్ సిటీ నిర్ణయం తీసుకుంది. తొమ్మిదిన్నరేళ్ల పాటు హాలాండ్‌ను కొనసాగించనుంది.కళ్లు చెదిరే మొత్తంప్రీమియర్ లీగ్ చరిత్రలోనే ఇది సుదీర్ఘకాలం పాటు సాగే ఒప్పందం. అంతేకాదు.. ఈ డీల్ ద్వారా హాలాండ్ వారానికి ఐదు లక్షల పౌండ్లు(భారత కరెన్సీలో దాదాపు ఐదున్నర కోట్లకు పైగా) ఆర్జించనున్నాడట. ఈ నేపథ్యంలో హాలాండ్ స్పందిస్తూ.. ‘‘నేను చాలా చాలా సంతోషంగా.. గర్వంగా ఉన్నాను. సిటీ క్లబ్‌తో సుదీర్ఘకాలం కొనసాగేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ ఒప్పందం గురించి సులువుగానే నిర్ణయానికి వచ్చేశాను.ఇక ఆటపై నేను మరింత దృష్టి పెట్టగలను. ఒకే జట్టుతో ఎక్కువకాలం కలిసి ప్రయాణించడం సానుకూల ఫలితాలను ఇస్తుంది’’ అని పేర్కొన్నాడు. ఇక మాంచెస్టర్ సిటీ టీమ్ మేనేజర్(కోచ్) జోసెప్ గ్వార్డియోలా సలాతో కలిసి మరికొంతకాలం పనిచేయడం ద్వారా తన నైపుణ్యాలు మరింత మెరుగుపరచుకోవచ్చని హాలాండ్ హర్షం వ్యక్తం చేశాడు.అలాంటి వ్యక్తిని చూడలేదు‘‘నేను ఇప్పటికే చాలా మెరుగయ్యాను. అతడితో కలిసి పనిచేయడం చాలా బాగుంటుంది. అతడు కేవలం అత్యుత్తమ వ్యక్తి మాత్రమే కాదు.. హార్డ్‌వర్కర్ కూడా. అలాంటి వ్యక్తిని నేను ఇంతకు ముందు చూడనేలేదు’’ అని గ్వార్డియోలాపై హాలాండ్ ప్రశంసలు కురిపించాడు. కాగా స్పెయిన్‌కు చెందిన గ్వార్టియోలా మాంచెస్టర్ సిటీ క్లబ్‌కు 2016 నుంచి కోచ్‌గా ఉన్నాడు. వివిధ టోర్నీల్లో కలిపి మొత్తంగా 18 సార్లు ట్రోఫీ అందించాడు. ఇదిలా ఉంటే.. తాజా ఒప్పందం ప్రకారం ఎర్లిండ్ హాలాండ్ మాంచెస్టర్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌తో 2034 వరకు కొనసాగనున్నాడు.చదవండి: CT 2025: వన్డేల్లోనూ అదరగొడతాడు.. అతడిని సెలక్ట్ చేయండి: సెహ్వాగ్ -
ఇంగ్లండ్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్
మహిళల యాషెస్ సిరీస్-2025లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇవాళ (జనవరి 17) జరిగిన మూడో వన్డేలో ఆసీస్ 86 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ ఆష్లే గార్డ్నర్ (102 బంతుల్లో 102; 8 ఫోర్లు, సిక్స్) కెరీర్లో తొలి శతకంతో కదంతొక్కగా.. బెత్ మూనీ (64 బంతుల్లో 50; 4 ఫోర్లు), తహిళ మెక్‌గ్రాత్ (45 బంతుల్లో 55; 8 ఫోర్లు) అర్ద సెంచరీలతో రాణించారు. ఆఖర్లో జార్జియా వేర్హమ్ (12 బంతుల్లో 38 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 15, అలైసా హీలీ 15, ఎల్లిస్ పెర్రీ 2, అన్నాబెల్ సదర్‌ల్యాండ్ 10, అలానా కింగ్ 9, కిమ్ గార్త్ 1 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్, నాట్ సీవర్ బ్రంట్, చార్లీ డీన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. లారెన్ ఫైలర్, సోఫీ ఎక్లెస్టోన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.309 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 42.2 ఓవర్లలో 222 పరుగులకే ఆలౌటై, ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆసీస్ లెగ్ స్పిన్నర్ అలానా కింగ్ ఐదు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. మెగాన్ షట్ మూడు, జార్జియా వేర్హమ్ రెండు వికెట్లు పడగొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ట్యామీ బేమౌంట్ (54), నాట్ సీవర్ బ్రంట్ (61) అర్ద సెంచరీలతో రాణించగా.. డాన్ వ్యాట్ హాడ్జ్ (35), ఆమీ జోన్స్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ హీథర్ నైట్ 14, చార్లీ డీన్ 12, సోఫీ ఎక్లెస్టోన్ 2, లారెన్ బెల్ 6 (నాటౌట్) పరుగులు చేయగా.. మయా బౌచియర్, అలైస్ క్యాప్సీ, లారెన్ ఫైలర్ డకౌట్ అయ్యారు.కాగా, ప్రస్తుత యాషెస్ సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, ఏకైక టెస్ట్ మ్యాచ్ జరగాల్సి ఉంది. మల్టీ ఫార్మాట్లో జరుగుతున్న ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేయడంతో ఆస్ట్రేలియా ఖాతాలో ఆరు పాయింట్లు (ఒక్కో వన్డేకు రెండు పాయింట్లు) ఉన్నాయి. ఆసీస్ మరో రెండు పాయింట్లు సాధిస్తే యాషెస్ సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. ఒకవేళ ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే మూడు టీ20లతో పాటు ఏకైక టెస్ట్ మ్యాచ్ కూడా గెలవాల్సి ఉంటుంది. -
టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా కేపీ..?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో బ్యాటర్ల ఘోర వైఫల్యం నేపథ్యంలో భారత జట్టు బ్యాటింగ్ కోచ్ కోసం అన్వేషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి క్రిక్‌బజ్‌లో ఓ నివేదిక వచ్చింది. ఇందులో బీసీసీఐ భారత బ్యాటింగ్ విభాగంలో సహాయక సిబ్బందిని బలోపేతం చేయాలని చూస్తున్నట్లు పేర్కొని ఉంది. ఈ అంశాన్ని ఓ యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేయగా.. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ స్పందించాడు. భారత శిబిరంలో చేరడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.🚨 BATTING COACH FOR INDIA. 🚨- The BCCI exploring possibilities to add a batting coach to India's coaching staff. (Cricbuzz). pic.twitter.com/mIRTwPDxOX— Mufaddal Vohra (@mufaddal_vohra) January 15, 202544 ఏళ్ల కెవిన్ పీటర్సన్‌కు అద్భుతమైన బ్యాటర్‌గా పేరుంది. సౌతాఫ్రికాలో పుట్టిన కెవిన్.. 2004-2014 మధ్యలో మూడు ఫార్మాట్లలో ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఇంగ్లండ్ తరఫున 104 టెస్ట్‌లు ఆడిన కేపీ.. 23 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీల సాయంతో 47.3 సగటున 8181 పరుగులు చేశాడు.తన కెరీర్లో 136 వన్డేలు ఆడిన కేపీ 9 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీల సాయంతో 40.7 సగటున 4440 పరుగులు చేశాడు. టీ20ల్లోనూ మంచి రికార్డు కలిగిన కేపీ.. 37 మ్యాచ్‌ల్లో 141.5 స్ట్రయిక్‌రేట్‌తో 1176 పరుగులు చేశాడు. ఆఫ్ స్పిన్ బౌలర్ కూడా అయిన కేపీ మూడు ఫార్మాట్లలో కలిపి 18 వికెట్లు తీశాడు.2009 నుంచి 2016 వరకు ఐపీఎల్ ఆడిన కేపీ వివిధ ఫ్రాంచైజీల తరఫున 36 మ్యాచ్‌లు ఆడి 134.7 స్ట్రయిక్‌రేట్‌తో 1001 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కేపీ తన ఐపీఎల్ కెరీర్లో ఏడు వికెట్లు కూడా తీశాడు.రిటైర్మెంట్ అనంతరం కేపీ వివిధ క్రికెట్ లీగ్‌ల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇంగ్లండ్ ఆస్ట్రేలియాలో యాషెస్ సిరీస్ (2010-11) సొంతం చేసుకున్న బృందంలో కేపీ కీలక సభ్యుడిగా ఉన్నాడు. 2012-13 భారత పర్యటనలోనూ కేపీ ఇరగదీశాడు. దూకుడు స్వభావం కలిగిన కేపీ తన కెరీర్లో ఎన్నో వివాదాల్లో తల దూర్చాడు. వివాదాలు ఎలా ఉన్నా కేపీ అన్నింటికీ బ్యాట్‌తో సమాధానం చెప్పేవాడు.కాగా, ప్రస్తుతం భారత కోచింగ్ బృందంలో ఐదుగురు సభ్యులు ఉన్నారు. గౌతమ్ గంభీర్ టీమిండియాకు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తుండగా.. మోర్నీ మోర్కెల్ బౌలింగ్ కోచ్‌గా, టి దిలీప్ ఫీల్డింగ్ కోచ్‌గా సేవలందిస్తున్నారు. ర్యాన్ టెన్ డస్కటే, అభిషేక్ నాయర్ అసిస్టెంట్ కోచ్‌లుగా వ్యవహరిస్తున్నారు. భారత జట్టుకు ప్రత్యేకించి బ్యాటింగ్ కోచ్ లేడు. ఈ స్థానం కోసం ఎవరైనా అనుభవజ్ఞుడిని ఎంచుకుంటే టీమిండియాకు మేలు చేకూరే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే, ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ 1-3 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ మాత్రమే గెలిచిన భారత్ ఆతర్వాత దారుణంగా విఫలమై మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ప్రస్తుతం భారత్ ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రిపేర్ అవుతుంది. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతుంది.భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ షెడ్యూల్..జనవరి 22- తొలి టీ20(కోల్‌కతా)జనవరి 25- రెండో టీ20(చెన్నై)జనవరి 28- మూడో టీ20(రాజ్‌కోట్)జనవరి 31- నాలుగో టీ20(పుణే)ఫిబ్రవరి 2- ఐదో టీ20(ముంబై, వాంఖడే)భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ షెడ్యూల్..ఫిబ్రవరి 6- తొలి వన్డే(నాగ్‌పూర్)ఫిబ్రవరి 9- రెండో వన్డే(కటక్)ఫిబ్రవరి 12- మూడో వన్డే(అహ్మదాబాద్)ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ షెడ్యూల్..ఫిబ్రవరి 20- బంగ్లాదేశ్ (దుబాయ్)ఫిబ్రవరి 23- పాకిస్తాన్ (దుబాయ్)మార్చి 2- న్యూజిలాండ్ (దుబాయ్) -
ఆర్సీబీకి గుడ్ న్యూస్.. ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చిన స్టార్ ప్లేయర్
ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆర్సీబీకి గుడ్ న్యూస్ అందింది. బిగ్ బాష్ లీగ్‌లో పేలవ ఫామ్‌లో ఉండిన ఆ జట్టు స్టార్ ప్లేయర్ జేకబ్ బేతెల్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. హోబర్ట్ హరికేన్స్‌తో ఇవాళ (జనవరి 14) జరిగిన మ్యాచ్‌లో బేతెల్ మెరుపు అర్ద సెంచరీ (50 బంతుల్లో 87; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) సాధించాడు. ఫలితంగా అతని జట్టు మెల్బోర్న్ రెనెగేడ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. JACOB BETHELL - A SPECIAL PLAYER. 🌟The Highlights of Jacob Bethel's 87(50) in the BBL and all players combined made 61(70) - Bethel, The Future of RCB. 🔥pic.twitter.com/zIyhli7iOi— Tanuj Singh (@ImTanujSingh) January 14, 2025మెల్బోర్న్ ఇన్నింగ్స్‌లో బేతెల్ మినహా ఎవరూ రాణించలేదు. టిమ్ సీఫర్ట్ (24), కెప్టెన్ సదర్‌ల్యాండ్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. జోష్ బ్రౌన్ 6, మార్కస్ హ్యారిస్ 1, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ 7, హ్యారీ డిక్సన్ 1, టామ్ రోజర్స్ 5 (నాటౌట్), ఫెర్గస్ ఓనీల్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. హరికేన్స్ బౌలర్లలో రిలే మెరిడిత్ మూడు వికెట్లు పడగొట్టగా.. నాథన్ ఇల్లిస్, మిచెల్ ఓవెన్ తలో వికెట్ దక్కించుకున్నారు.155 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరికేన్స్ 7 ఓవర్ల అనంతరం రెండు వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. ఓపెనర్లు మిచెల్ ఓవెన్ (24), కాలెబ్ జువెల్ (1) ఔట్ కాగా.. చార్లీ వకీం (12), నిఖిల్ చౌదరీ (4) క్రీజ్‌లో ఉన్నారు. రెనెగేడ్స్ బౌలర్లలో ఫెర్గస్ ఓనీల్కు ఓ వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో హరికేన్స్ గెలవాలంటే 78 బంతుల్లో 105 పరుగులు చేయాలి.కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్ వేలంలో జేకబ్ బేతెల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2.6 కోట్లకు కొనుగోలు చేసింది. ఆర్సీబీ జేకబ్ బేతెల్పై భారీ అంచనాలే పెట్టుకుంది. అయితే బీబీఎల్ తొలి అర్ద భాగంలో బేతెల్ తుస్సుమనిపించాడు.బీబీఎల్-2025లో బేతెల్ ప్రదర్శనలు..87(50) vs హోబర్ట్ హరికేన్స్1(8) vs మెల్బోర్న్ స్టార్స్2(9) vs పెర్త్ స్కార్చర్స్49(36) vs మెల్బోర్న్ స్టార్స్21(21) vs అడిలైడ్ స్ట్రైకర్స్2(4) vs సిడ్నీ థండర్30(22) vs పెర్త్ స్కార్చర్స్3(6) vs హోబర్ట్ హరికేన్స్ -
Ashes Series 2025: రెండో వన్డే కూడా ఆసీస్‌దే
మహిళల యాషెస్ వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మెల్బోర్న్ వేదికగా ఇవాళ (జనవరి 14) జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌పై 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 44.3 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. ఎల్లిస్ పెర్రీ (60) అర్ద సెంచరీతో రాణించింది. లిచ్‌ఫీల్డ్ (29), అలైసా హీలీ (29), బెత్ మూనీ (12), అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. ఆష్లే గార్డ్నర్ 2, తహిళ మెక్‌గ్రాత్ 1, కిమ్ గార్త్ 9 పరుగులు చేశారు. మెగాన్ షట్ డకౌట్ కాగా.. డార్సీ బ్రౌన్ 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఇంగ్లండ్ బౌలర్లలఓ సోఫీ ఎక్లెస్టోన్ అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు పడగొట్టగా.. అలైస్ క్యాప్సీ 3, లారెన్ బెల్ 2, లారెన్ ఫైల్ ఓ వికెట్ దక్కించుకున్నారు.181 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ కూడా తడబడింది. ఆ జట్టు 48.1 ఓవర్లు బ్యాటింగ్ చేసి 159 పరుగులకే ఆలౌటైంది. ఆమీ జోన్స్ (103 బంతుల్లో 47 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) టెస్ట్ మ్యాచ్ తరహాలో బ్యాటింగ్ చేసి ఇంగ్లండ్‌ను గెలిపించే ప్రయత్నం చేసింది. నాట్ సీవర్ బ్రంట్ 35, కెప్టెన్ హీథర్ నైట్ 18, మయా బౌచియర్ 17, టామీ బేమౌంట్ 3, డానియెల్ వ్యాట్ హాడ్జ్ 0, అలైస్ క్యాప్సీ 14, చార్లోట్ డీన్ 3, సోఫీ ఎక్లెస్టోన్ 0, లారెన్ ఫైలర్ 7, లారెన్ బెల్ 1 పరుగు చేశారు. ఆసీస్ బౌలర్లలో అలానా కింగ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కిమ్ గార్త్ మూడు, మెగాన్ షట్, ఆష్లే గార్డ్నర్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌లో తొలి వన్డే కూడా ఆసీస్సే గెలిచింది. నామమాత్రపు మూడో వన్డే జనవరి 17న జరుగనుంది. -
యాషెస్ సిరీస్‌లో బోణీ కొట్టిన ఆసీస్
మహిళల యాషెస్ సిరీస్-2025లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. ఇవాళ (జనవరి 12) జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆష్లే గార్డ్నర్ ఆల్‌రౌండ్ షోతో (3/19, 42 నాటౌట్) అదరగొట్టి ఆసీస్‌ను గెలిపించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 43.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లు తలో చేయి వేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. ఆష్లే గార్డ్నర్ మూడు, కిమ్ గార్త్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, అలానా కింగ్ తలో రెండు, డార్సీ బ్రౌన్ ఓ వికెట్ తీశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ హీథర్ నైట్ (39), వ్యాట్ హాడ్జ్ (38), ఆమీ జోన్స్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. టామీ బేమౌంట్ (13), నాట్ సీవర్ బ్రంట్ (19), సోఫీ ఎక్లెస్టోన్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. మయా బౌచియర్ 9, అలైస్ క్యాప్సీ 4, చార్లీ డీన్ 1, లారెన్ బెల్ 1, లారెన్ ఫైలర్ 8 (నాటౌట్) పరుగులు చేశారు.అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 38.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ అలైసా హీలీ (70) ఆసీస్ గెలుపుకు పునాది వేయగా.. ఆష్లే గార్డ్నర్ (44 బంతుల్లో 42 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) తన జట్టును విజయతీరాలకు చేర్చింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 4, ఎల్లిస్ పెర్రీ 14, బెత్ మూనీ 28, అన్నాబెల్ సదర్‌ల్యాండ్ 10, తహిళ మెక్‌గ్రాత్ 2, అలానా కింగ్ 11 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్ తలో రెండు, లారెన్ బెల్, చార్లెట్ డీన్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో ఆసీస్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే మెల్బోర్న్ వేదికగా జనవరి 14న జరుగనుంది. కాగా, మూడు వన్డేలు, మూడు టీ20లు, ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఈ మ్యాచ్‌లన్నీ జరుగనున్నాయి. -
షమీ పునరాగమనం
న్యూఢిల్లీ: సీనియర్ పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ భారత జట్టులోకి 14 నెలల తర్వాత పునరాగమనం చేశాడు. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగే టి20 సిరీస్ కోసం సెలక్టర్లు శనివారం ఎంపిక చేసిన జట్టులో షమీకి చోటు లభించింది. ముందుగా కాలి మడమ, ఆపై మోకాలి గాయంతో బాధపడిన షమీ చాలా కాలంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు. 2023 నవంబర్ 19న ఆ్రస్టేలియాతో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడిన తర్వాత టీమిండియాకు ప్రాతినిధ్యం వహించలేదు. గాయంతో కోలుకొని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రీహాబిలిటేషన్ తర్వాత దేశవాళీ క్రికెట్లోకి అడుగు పెట్టిన షమీ వరుసగా మూడు ఫార్మాట్లలో కూడా ఆడి మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. రంజీ ట్రోఫీ, ముస్తాక్ అలీ టి20 టోర్నీలతో ప్రస్తుతం గురువారం విజయ్‌హజారే వన్డే టోర్నీ ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో కూడా షమీ బరిలోకి దిగాడు. ఇటీవల ఆ్రస్టేలియాతో ముగిసిన ఐదు టెస్టుల బోర్డర్–గావస్కర్ ట్రోఫీ కోసం షమీని ఎంపిక చేసే అంశంపై చర్చ జరిగింది. అయితే పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో అతడిని జట్టులోకి తీసుకునేందుకు సెలక్టర్లు ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు దేశవాళీ క్రికెట్లో పెద్ద సంఖ్యలో ఓవర్లు బౌలింగ్ చేసిన తర్వాత షమీ ఫిట్‌గా ఉన్నట్లు తేలింది. నిజానికి భారత్ తరఫున నవంబర్ 2022 తర్వాత అతను టి20 మ్యాచ్ ఆడలేదు. ఈ ఫార్మాట్లో యువ పేసర్ల రాకతో షమీ దాదాపుగా జట్టుకు దూరమైపోయాడు. అయితే ఈ సిరీస్ తర్వాత ఇంగ్లండ్‌తోనే జరిగే వన్డే సిరీస్, ఆపై చాంపియన్స్ ట్రోఫీ కోసం జట్లను ఎంపిక చేయనున్న నేపథ్యంలో వాటికి ముందు టి20ల ద్వారా షమీ ఫిట్నెస్ను పూర్తి స్థాయిలో పరీక్షించాలని సెలక్టర్లు భావిస్తున్నారు. అందుకే ఈ ఫార్మాట్లో అతనికి చోటు లభించింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో 15 మంది సభ్యుల ఈ బృందం ఎంపికలో ఎలాంటి భారీ మార్పులు, సంచలనాలు చోటు చేసుకోలేదు. అయితే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడిన రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్‌లకు విశ్రాంతినివ్వగా...గాయంపై స్పష్టత లేకపోవడంతో బుమ్రాను కూడా ఎంపిక చేయలేదు. భారత జట్టు తమ చివరి సిరీస్ ఆడిన టీమ్‌లో (దక్షిణాఫ్రికాతో) ఉన్న ఐదుగురు ఆటగాళ్లు తమ స్థానాలు నిలబెట్టుకోలేకపోయారు. రమణ్‌దీప్ సింగ్, జితేశ్ శర్మ, అవేశ్ ఖాన్, యశ్ దయాళ్, విజయ్‌కుమార్ వైశాక్‌లను పక్కన పెట్టిన సెలక్టర్లు ఆసీస్‌తో టెస్టులు ఆడిన నితీశ్, హర్షిత్, సుందర్, జురేల్‌లను ఈ టి20 టీమ్‌లోకి తీసుకున్నారు. భుజం గాయంతో బాధపడుతున్న రియాన్ పరాగ్నూ పక్కన పెట్టారు. ఈ నెల 22, 25, 28, 31, ఫిబ్రవరి 2న జరిగే ఐదు టి20 మ్యాచ్‌లలో ఇంగ్లండ్‌తో భారత్ తలపడుతుంది. భారత జట్టు వివరాలు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్ ), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్ ), సంజు సామ్సన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్ష్ దీప్ సింగ్, మొహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురేల్. -
వన్డే సిరీస్ నుంచి రాహుల్‌కు విశ్రాంతి!
న్యూఢిల్లీ: స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తనకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వాల్సిందిగా అతను కోరినట్లు సమాచారం. ‘ఆ్రస్టేలియాతో సిరీస్ ముగిసిన తర్వాత రాహుల్ విరామం కోరుకుంటున్నాడు. అందుకే ఈ సిరీస్‌కు తన పేరును పరిగణనలోకి తీసుకోవద్దని అతను చెప్పాడు. అయితే చాంపియన్స్ ట్రోఫీ కోసం మాత్రం తాను అందుబాటులో ఉంటానని రాహుల్ స్పష్టం చేశాడు’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఆసీస్‌తో ఐదు టెస్టులూ ఆడిన రాహుల్ 10 ఇన్నింగ్స్‌లలో 2 అర్ధసెంచరీలతో 276 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. చాంపియన్స్ ట్రోఫీకి తాను సిద్ధమని చెప్పినా... వన్డే జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ స్థానం కోసం పంత్, సంజు సామ్సన్ల నుంచి అతను పోటీని ఎదుర్కొంటున్నాడు. మరోవైపు కర్ణాటక జట్టు ఆడే విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కూ తాను అందుబాటులో ఉండనని రాహుల్ ఇప్పటికే సమాచారం అందించాడు. -
ఇంగ్లండ్ కెప్టెన్‌గా మైఖేల్ వాన్ తనయుడు
ఇంగ్లండ్ అండర్-19 జట్టు కెప్టెన్‌గా ఇంగ్లండ్ మాజీ సారధి మైఖేల్ వాన్ కొడుకు ఆర్కీ వాన్ (Archie Vaughan) ఎంపికయ్యాడు. 19 ఏళ్ల ఆర్కీ వాన్ త్వరలో సౌతాఫ్రికాలో పర్యటించబోయే ఇంగ్లండ్ యువ జట్టును సారధిగా వ్యవహరించనున్నాడు. ఆర్కీ వాన్ తన తండ్రి మైఖేల్ వాన్ బాటలోనే ఇంగ్లండ్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. మైఖేల్ వాన్ హయాం ఇంగ్లండ్ జట్టుకు స్వర్ణ యుగం లాంటిది. మైఖేల్ వాన్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ 2005 యాషెస్ సిరీస్ నెగ్గింది. 18 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌కు లభించిన తొలి యాషెస్ విజయం ఇది. మైఖేల్ వాన్ 51 టెస్ట్‌ల్లో, 60 వన్డేల్లో ఇంగ్లండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.మైఖేల్ వాన్ తనయుడు ఆర్కీ వాన్ తొలిసారి ఇంగ్లండ్ అంతర్జాతీయ జట్టుకు సారధిగా ఎంపికయ్యాడు. ఇంగ్లండ్ అండర్-19 జట్టు సౌతాఫ్రికా పర్యటనలో మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. సౌతాఫ్రికా పర్యటన జనవరి 17న ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో తొలుత వన్డే సిరీస్ జరుగనుంది. తొలి వన్డేకు కేప్‌టౌన్ ఆతిథ్యమివ్వనుంది. అనంతరం జనవరి 27న స్టెల్లెన్బాష్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభమవుతుంది.ఆర్కీ వాన్ ఇటీవలే ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లోకి కూడా అడుగుపెట్టాడు. వాన్ సోమర్సెట్ తరఫున నాలుగు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఆర్కీ వాన్ తన స్వల్ప ఫస్ట్ క్లాస్ కెరీర్లో అదరగొట్టాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన వాన్ 236 పరుగులు చేసి 15 వికెట్లు పడగొట్టాడు. సర్రేపై ఆర్కీ వాన్ రెండు ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. ఆర్కీ వాన్ ఇటీవలే లిస్ట్-ఏ క్రికెట్లో కూడా అరంగేట్రం చేశాడు. మెట్రో బ్యాంక్ కప్ ఆర్కీ వాన్ తన తొలి 50 ఓవర్ల మ్యాచ్ ఆడాడు.ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ అండర్-19 జట్టుకు ఎంపికైన రెండో మాజీ ఆటగాడి తనయుడు ఆర్కీ వాన్. కొద్ది రోజుల కిందట ఇంగ్లండ్ దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాప్ తనయుడు రాకీ ఫ్లింటాఫ్ ఇంగ్లండ్ అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. అయితే ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటన కోసం ఎంపిక చేసిన ఇంగ్లండ్ యువ జట్టులో రాకీ ఫ్లింటాఫ్‌కు చోటు దక్కలేదు.సౌతాఫ్రికా పర్యటన కోసం ఇంగ్లండ్ అండర్-19 జట్టు: ఆర్కీ వాన్ (కెప్టెన్), ఫర్హాన్ అహ్మద్, తజీమ్ అలీ, బెన్ డాకిన్స్, కేష్ ఫోన్సేకా, అలెక్స్ ఫ్రెంచ్, అలెక్స్ గ్రీన్, జాక్ హోమ్, జేమ్స్ ఇస్బెల్, ఎడ్డీ జాక్, బెన్ మాయెస్, జేమ్స్ మింటో, హ్యారీ మూర్, జో మూర్స్, థామస్ రెవ్, ఆర్యన్ సావంత్, నావ్య శర్మ, అలెగ్జాండర్ వేడే. -
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల సిరీస్‌ల పూర్తి వివరాలు
పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ జట్టు త్వరలో భారత్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్‌లు జనవరి 22 నుంచి మొదలవుతాయి. తొలుత ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతుంది. అనంతరం ఫిబ్రవరి 6 నుంచి ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా భారత్ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఆడుతుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసిన వెంటనే జరుగుతున్న సిరీస్‌లు కావడంతో ఈ సిరీస్‌లకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిమత ఓవర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.టీ20 సిరీస్ షెడ్యూల్..జనవరి 22- తొలి టీ20(కోల్‌కతా)జనవరి 25- రెండో టీ20(చెన్నై)జనవరి 28- మూడో టీ20(రాజ్‌కోట్)జనవరి 31- నాలుగో టీ20(పుణే)ఫిబ్రవరి 2- ఐదో టీ20(ముంబై, వాంఖడే)ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లన్నీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి.వన్డే సిరీస్ షెడ్యూల్..ఫిబ్రవరి 6- తొలి వన్డే(నాగ్‌పూర్)ఫిబ్రవరి 9- రెండో వన్డే(కటక్)ఫిబ్రవరి 12- మూడో వన్డే(అహ్మదాబాద్)వన్డే సిరీస్‌లోని మ్యాచ్‌లన్నీ మధ్యాహ్నం 1:30 గంటలకు మొదలవుతాయి.ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే..?భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20, వన్డే సిరీస్‌లలోని మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు.లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..?భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20, వన్డే సిరీస్‌లలోని మ్యాచ్‌లను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్ మరియు వెబ్సైట్లలో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడవచ్చు.ఇంగ్లండ్ వన్డే జట్టు..హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జో రూట్, జాకబ్ బెథెల్, లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్సే, జామీ ఓవర్టన్, జోస్ బట్లర్ (కెప్టెన్), జామీ స్మిత్, ఫిలిప్ సాల్ట్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, మార్క్ వుడ్ఇంగ్లండ్ టీ20 జట్టు..హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జాకబ్ బెథెల్, లియామ్ లివింగ్‌స్టోన్, రెహన్ అహ్మద్, జేమీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోస్ బట్లర్ (కెప్టెన్), జామీ స్మిత్, ఫిలిప్ సాల్ట్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సాకిబ్ మహమూద్టీ20, వన్డే సిరీస్‌ల కోసం భారత జట్లను ప్రకటించాల్సి ఉంది.కాగా, భారత జట్టు తాజాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని (2024-25) ఆస్ట్రేలియాకు కోల్పోయింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆసీస్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది. పదేళ్ల తర్వాత ఆసీస్ బీజీటీని సొంతం చేసుకుంది. బీజీటీ పూర్తయిన 17 రోజుల్లో భారత్ ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడుతుంది. ఈ సిరీస్‌ల అనంతరం టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా జరుగనుంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగుతాయి. పాక్‌తో సత్సంబంధాలు లేని కారణంగా టీమిండియా పాక్‌లో అడుగుపెట్టరాదని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ హైబ్రిడ్ మోడల్లో దుబాయ్‌లో జరుగుతాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న (బంగ్లాదేశ్‌తో) ఆడుతుంది. మెగా టోర్నీలో దాయాదుల సమరం (భారత్ వర్సెస్ పాక్) ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా జరుగుతుంది. మార్చి 2న భారత్ న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్.. పాక్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో కలిసి గ్రూప్-ఏలో ఉంది. గ్రూప్ దశ మ్యాచ్‌ల అనంతరం తొలి రెండు స్థానాల్లో ఉండే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. తొలి సెమీస్ మార్చి 4న జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గ్రూప్-ఏ టాపర్, గ్రూప్-బిలో రెండో స్థానంలో ఉండే జట్టు పోటీపడతాయి. మార్చి 5న రెండో సెమీఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గ్రూప్-బి టాపర్, గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉండే జట్టును ఢీకొంటుంది. సెమీస్‌లో విజేతలు మార్చి 9న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. -
Champions Trophy: ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించండి..!
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని ఇంగ్లండ్‌కు చెందిన ప్రజాప్రతినిధులు ఆ దేశ క్రికెట్ బోర్డును (ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు, ఈసీబీ) కోరారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం మహిళల హక్కులపై ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో ఇంగ్లండ్ పొలిటీషియన్స్ ఈ మేరకు పిలుపునిచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ ఫిబ్రవరి 26న ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని 160 మందికి పైగా రాజకీయ నాయకులు ఈసీబీకి విజ్ఞప్తి చేశారు. అయితే ఇంగ్లండ్ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తిని ఈసీబీ తిరస్కరించినట్లు సమాచారం. తాలిబన్ల పాలనలో మహిళలు, బాలికలపై వివక్షకు తాము వ్యతిరేకమని చెప్పిన ఈసీబీ.. ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించలేమని స్పష్టం చేసినట్లు తెలుస్తుంది.కాగా, 2021 ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలపై అడ్డగోలు అంక్షలు అమల్లో ఉన్నాయి. అమ్మాయిలు ఆరవ తరగతికి మించి చదవకూడదని.. మహిళలు ఉద్యోగాలు చేయకూడదని.. బహిరంగ ప్రదేశాల్లో (జిమ్‌లు, పార్కులు) మహిళలు కనిపించకూడదని.. మగ తోడు లేకుండా మహిళలు ప్రయాణం చేయకూడదని.. మహిళలు క్రీడల్లో పాల్గొనకూడదని తాలిబన్ ప్రభుత్వం మహిళలపై అంక్షలు విధించింది. ఈ అంక్షల కారణంగానే ఇంగ్లండ్ ప్రజాప్రతినిధులు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.గతంలో ఆస్ట్రేలియా కూడా ఇలాగే..!మహిళలపై తాలిబన్ ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా గతంలో ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ పురుషుల జట్టుతో ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు నిరాకరించింది. అయితే ఆతర్వాత ఇరు జట్లు 2023 వన్డే ప్రపంచకప్, 2024 టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో తలపడ్డాయి.జింబాబ్వేతో మ్యాచ్‌ను బహిష్కరించిన ఇంగ్లండ్ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ 2003 వన్డే ప్రపంచకప్‌లో జింబాబ్వేతో జరగాల్సిన మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసింది. అప్పట్లో జింబాబ్వేలో రాబర్ట్ ముగాబే పాలనకు వ్యతిరేకంగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఈ మేరకు నిర్ణయించింది.ఇదిలా ఉంటే, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్యలో జరుగనుంది. ఈ టోర్నీలో భారత్ ఆడాల్సిన మ్యాచ్‌లు మాత్రం దుబాయ్‌లో జరుగుతాయి. పాక్‌తో సత్సంబంధాలు లేని కారణంగా టీమిండియా పాక్‌లో అడుగుపెట్టరాదని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న (బంగ్లాదేశ్‌తో) ఆడుతుంది. మెగా టోర్నీలో దాయాదుల సమరం ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్-ఇంగ్లండ్ మ్యాచ్‌కు లాహోర్‌లోని గడాఫీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. -
అలెక్స్ హేల్స్ ఊచకోత
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఇంగ్లండ్ ఆటగాడు, రంగ్‌పూర్ రైడర్స్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిల్హెట్ స్ట్రయికర్స్‌తో ఇవాళ (జనవరి 6) జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. 56 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హేల్స్ శతక్కొట్టడంతో సిల్హెట్ స్ట్రయికర్స్పై రంగ్‌పూర్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సిల్హెట్ స్ట్రయికర్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రోనీ తాలుక్దార్ (32 బంతుల్లో 54; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), జకీర్ హసన్ (38 బంతుల్లో 50; 4 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించారు. జార్జ్ మున్సే 18, పాల్ స్టిర్లింగ్ 16 పరుగులు చేసి ఔట్ కాగా.. ఆఖర్లో ఆరోన్ జోన్స్ (19 బంతుల్లో 38 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు), జాకెర్ అలీ (5 బంతుల్లో 20 నాటౌట్; 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. రంగ్‌పూర్ రైడర్స్ బౌలర్లలో సైఫుద్దీన్ రెండు వికెట్లు పడగొట్టగా.. మెహిది హసన్, ఆకిఫ్ జావెద్ తలో వికెట్ దక్కించుకున్నారు.భారీ లక్ష్య ఛేదనకు దిగిన రంగ్‌పూర్ రైడర్స్ 19 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. అలెక్స్ హేల్స్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడగా.. సైఫ్ హసన్ 49 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేశాడు. రంగ్‌పూర్ రైడర్స్ బ్యాటర్లలో హకీమ్ తమీమ్ డకౌట్ కాగా.. ఇఫ్తికార్ అహ్మద్ 8 పరుగులు (నాటౌట్) చేశాడు. సిల్హెట్ స్ట్రయికర్స్ పేసర్ తంజిమ్ హసన్ సకీబ్‌కు రెండు వికెట్లు దక్కాయి.ఈ గెలుపుతో రంగ్‌పూర్ రైడర్స్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచినట్లైంది. పాయింట్ల పట్టికలో రంగ్‌పూర్ రైడర్స్ అగ్రస్థానంలో నిలిచింది. రెండింట రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన ఖుల్నా టైగర్స్ రెండో స్థానంలో ఉంది. చిట్టగాంగ్ కింగ్స్ (2 మ్యాచ్‌ల్లో ఓ విజయం), ఫార్చూన్ బారిషల్ (2 మ్యాచ్‌ల్లో ఓ విజయం), దర్బార్ రాజ్షాహి (3 మ్యాచ్‌ల్లో ఓ విజయం), సిల్హెట్ స్ట్రయికర్స్ (2 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలు), ఢాకా క్యాపిటల్స్ (3 మ్యాచ్‌ల్లో 3 పరాజయాలు) వరుసగా మూడు నుంచి ఏడు స్థానాల్లో ఉన్నాయి. -
ఆమె ఇళయరాజానా లేక రెహమానా..?
ఆమె ఇళయరాజానా లేక రెహమానా అనే సందేహం వస్తుంది ఇంగ్లండ్‌కు చెందిన అల్మా ఎలిజబెత్ డీషర్ను చూస్తే. చిన్నవయసులోనే కచరీలు చేసే స్థాయికి ఎదిగితే అనుమానం రాదూ?రెండేళ్ల వయసు నుంచే అల్మా పియానో వాయించడం మొదలుపెట్టింది. ఆ వయసులోనే స్పష్టంగా పాటలు పాడటం మొదలుపెట్టింది. అంత చిన్నవయసులో తన ఆసక్తి చూసి తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఆమె మూడో పుట్టినరోజు నాడు చిన్న వయెలిన్ని బహుమతిగా ఇచ్చారు. దాన్ని ఆటబొమ్మలా కాక, వాయిద్యంలా చూసి సాధన చేయడం మొదటుపెట్టింది అల్మా. ఏడాదిలోనే వయోలిన్ వాయించడంలో ఎంతో ప్రతిభ చూపింది అల్మా. ఐదో ఏట నుంచి పియానోపై సొంతంగా బాణీలు కట్టడం మొదలుపెట్టింది. అయితే అవన్నీ అస్పష్టంగా ఉండేవి. ఆరో ఏట నుంచి స్పష్టంగా అనేక బాణీలు కంపోజ్ చేసింది. 2013లో తన 8వ ఏట ఆ బాణీలన్నీ కలిపి ఆల్బమ్‌గా విడుదల చేశారు ఆమె తల్లిదండ్రులు. పదేళ్ల వయసుకు అల్మా వయోలిన్ వాయించడంలో మరింత నేర్పు సాధించింది. పూర్తి స్థాయి కచేరీకి అవసరమైన కంపోజిషన్‌ను రూపొందించింది. ఆమె ప్రతిభ చూసి అందరూ తనను మెచ్చుకున్నారు. మరి అల్మా స్కూల్ సంగతులేంటి? ఐదేళ్ల వయసులో తల్లిదండ్రులు ఆమెను స్కూల్‌కి పంపారు. కానీ అక్కడి పాఠాలు ఆమెకు నచ్చలేదు. దీంతో మొదటిరోజే ఆమె స్కూల్ మానేసింది. అప్పట్నుంచి ఇంట్లోనే అమ్మానాన్న ఆమెకు చదువు చెప్పడం మొదలుపెట్టారు. కళాకారులకు స్వేచ్ఛ కావాలని, ఎవరూ అడ్డుకోని స్వతంత్రం కావాలని అంటున్నారు. బాల సంగీతకారురాలిగా పేరు పొందిన అల్మా ‘ది స్వీపర్ ఆఫ్ డ్రీమ్స్(2012), ‘సిండ్రెల్లా’(2015), ‘ది ఎంపరర్స్ న్యూ వాల్డ్జ్(2023) వంటి సంగీత రూపకాలను స్వరపరిచి, ప్రదర్శించింది. 2021లో లియోనార్డో డావిన్సీ అంతర్జాతీయ పురస్కారం అందుకుని, ఆ పురస్కారం అందుకున్న చిన్నవయస్కురాలిగా రికార్డు సాధించింది. అనేక అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలు ఇస్తోంది. (చదవండి: రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా వాచ్‌మ్యాన్ -
స్టోక్స్... మూడు నెలలు ఆటకు దూరం
లండన్: ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ మూడు నెలల పాటు ఆటకు దూరం కానున్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో మూడో టెస్టు సందర్భంగా గాయపడ్డ స్టోక్స్... వచ్చే నెలలో శస్త్రచికిత్స చేయించుకోనున్నాడు. దీంతో మరో మూడు నెలల పాటు అతడు మైదానంలోకి దిగబోడని ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి స్టోక్స్ దూరం కానున్నాడు. ఇప్పటికే ఆ టోర్నీ కోసం ఇంగ్లండ్ బోర్డు జట్టును ప్రకటించగా... అందులో 33 ఏళ్ల స్టోక్స్‌కు చోటు కల్పించలేదు. గతంలోనూ కండరాల గాయంతో ఇబ్బంది పడ్డ స్టోక్స్... శ్రీలంక, పాకిస్తాన్‌తో సిరీస్‌లకు దూరమయ్యాడు. ఇప్పుడు మరోసారి అదే గాయం తిరగబెట్టడంతో శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. -
Ind vs Pak: క్రికెట్ ప్రేమికులకు శుభవార్త
క్రికెట్ ప్రేమికులకు శుభవార్త!.. వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్(World Championship Of Legends T20 League) రెండో సీజన్‌కు ముహూర్తం ఖరారైంది. దిగ్గజ క్రికెటర్లు పాల్గొనే ఈ టోర్నీ షెడ్యూల్‌ను నిర్వాహకులు మంగళవారం విడుదల చేశారు. కాగా భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ తదితర ఆరు జట్లు వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్(WCL)లో భాగమవుతున్న విషయం తెలిసిందే.యువీ కె ప్టెన్సీలో అంతర్జాతీయ క్రికెట్లో ఆయా దేశాలకు ప్రాతినిథ్యం వహించిన టాప్ క్రికెటర్లు ఈ టీ20 లీగ్‌తో మరోసారి వినోదాన్ని పంచుతున్నారు. ఈ ఏడాది తొలిసారిగా ప్రవేశపెట్టిన WCLలో ఇండియా చాంపియన్స్ జట్టు ఫైనల్లో.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చాంపియన్స్ టీమ్‌పై గెలుపొందింది. యువరాజ్ సింగ్ కెప్టెన్సీలో.. దాయాదిని ఐదు వికెట్ల తేడాతో ఓడించి WCLలో మొట్టమొదటి చాంపియన్‌గా నిలిచింది.పాక్‌ను ఓడించి టైటిల్ కైవసంపాక్ విధించిన 157 పరుగుల లక్ష్యాన్ని ఐదు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి టైటిల్ కైవసం చేసుకుంది. ఇక వచ్చే ఏడాది లీగ్ దశలో భాగంగా భారత్- పాకిస్తాన్(India vs Pakistan) మధ్య జూలై 20న తొలి మ్యాచ్ జరుగనుంది. కాగా ఇంగ్లండ్ వేదికగా WCL టోర్నీని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 షెడ్యూల్👉జూలై 18- ఇంగ్లండ్ చాంపియన్స్ వర్సెస్ పాకిస్తాన్ చాంపియన్స్👉జూలై 19- వెస్టిండీస్ చాంపియన్స్ వర్సెస్ సౌతాఫ్రికా చాంపియన్స్👉జూలై 19- ఇంగ్లండ్ చాంపియన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా చాంపియన్స్👉జూలై 20- ఇండియా చాంపియన్స్ వర్సెస్ పాకిస్తాన్ చాంపియన్స్👉జూలై 22- ఇంగ్లండ్ చాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ చాంపియన్స్👉జూలై 22- ఇండియా చాంపియన్స్ వర్సెస్ సౌతాఫ్రికా చాంపియన్స్👉జూలై 23- ఆస్ట్రేలియా చాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ చాంపియన్స్👉జూలై 24- సౌతాఫ్రికా చాంపియన్స్ వర్సెస్ ఇంగ్లండ్ చాంపియన్స్👉జూలై 25- పాకిస్తాన్ చాంపియన్స్ వర్సెస్ సౌతాఫ్రికా చాంపియన్స్👉జూలై 26- ఇండియా చాంపియన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా చాంపియన్స్👉జూలై 27- సౌతాఫ్రికా చాంపియన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా చాంపియన్స్👉జూలై 27- ఇండియా చాంపియన్స్ వర్సెస్ ఇంగ్లండ్ చాంపియన్స్👉జూలై 29- ఆస్ట్రేలియా చాంపియన్స్ వర్సెస్ పాకిస్తాన్ చాంపియన్స్👉జూలై 29- ఇండియా చాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ చాంపియన్స్👉జూలై 31- సెమీ ఫైనల్ 1(ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం, బర్మింగ్‌హాం)👉జూలై 31- సెమీ ఫైనల్ 2(ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం, బర్మింగ్‌హాం)👉ఆగష్టు 2- ఫైనల్(ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం, బర్మింగ్‌హాం).చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. విధ్వంసకర వీరుడు దూరం!? -
ఇంగ్లండ్ జట్టుకు అతి భారీ షాక్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025, దానికి ముందు టీమిండియాతో జరిగే కీలకమైన వైట్‌బాల్ సిరీస్‌లకు ముందు ఇంగ్లండ్ జట్టుకు అతి భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్థార్ ఆటగాడు, టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ గాయం కారణంగా పై రెండు ఈవెంట్లకు దూరమయ్యాడు. 33 ఏళ్ల స్టోక్స్ ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ సందర్భంగా హ్యామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరికి గురయ్యాడు. భారత్‌తో జరిగే టెస్ట్ సిరీస్, యాషెస్ సిరీస్ 2025-26 దృష్ట్యా స్టోక్స్‌కు విశ్రాంతి కల్పించారని తెలుస్తుంది.కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ-2025, దానికి ముందు టీమిండియాతో జరిగే వైట్‌బాల్ సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ జట్టును ఇవాళ (డిసెంబర్ 22) ప్రకటించారు. వన్డే, టీ20 జట్లకు కెప్టెన్‌గా జోస్ బట్లర్ ఎంపికయ్యాడు. టెస్ట్ జట్టు కీలక సభ్యుడు జో రూట్, 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత తొలి సారి వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ వన్డే, టీ20 జట్లలో చోటు దక్కించుకున్నాడు. వికెట్కీపర్లు జేమీ స్మిత్, ఫిల్ సాల్ట్.. రైజింగ్ స్టార్ జేకబ్ బేతెల్ కూడా రెండు జట్లలో చోటు దక్కించుకున్నారు.భారత్‌తో సిరీస్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ వ్యవహరిస్తాడు. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్ల హెడ్ కోచ్‌గా మెక్‌కల్లమ్‌కు ఇవే తొలి అసైన్మెంట్స్ అవుతాయి. ఇప్పటివరకు మెక్కల్లమ్ కేవలం టెస్ట్ జట్టుకు మాత్రమే హెడ్ కోచ్‌గా ఉన్నాడు.భారత్‌తో జరిగే వన్డే సిరీస్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీల కోసం ఇంగ్లండ్ జట్టు..జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జేకబ్ బేతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సకీబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్భారత్తో జరిగే టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు..జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జేకబ్ బేతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, సకీబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్భారత్లో ఇంగ్లండ్ పర్యటన షెడ్యూల్ వివరాలు..జనవరి 22- తొలి టీ20 (కోల్‌కతా)జనవరి 25- రెండో టీ20 (చెన్నై)జనవరి 28- మూడో టీ20 (రాజ్‌కోట్)జనవరి 31- నాలుగో టీ20 (పూణే)ఫిబ్రవరి 2- ఐదో టీ20 (ముంబై)ఫిబ్రవరి 6- తొలి వన్డే (నాగ్‌పూర్)ఫిబ్రవరి 9- రెండో వన్డే (కటక్)ఫిబ్రవరి 12- మూడో వన్డే (అహ్మదాబాద్)ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు పోటీపడనున్నాయి. ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు పాకిస్తాన్ వేదికగా జరుగనుంది. టోర్నీకి సంబంధించిన మ్యాచ్ తేదీలను, వేదికలను ప్రకటించాల్సి ఉంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లు తటస్థ వేదికలపై జరుగనున్నాయి. -
న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్.. ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం
హ్యామిల్టన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ ముందు న్యూజిలాండ్ భారీ లక్ష్యాన్ని ఉంచింది. కేన్ విలియమ్సన్ (156) సెంచరీతో కదంతొక్కడంతో న్యూజిలాండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 453 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే 658 పరుగులు చేయాలి.న్యూజిలాండ్ భారీ స్కోర్కేన్ విలియమ్సన్తో పాటు విల్ యంగ్ (60), డారిల్ మిచెల్ (60), రచిన్ రవీంద్ర (44), టామ్ బ్లండెల్ (44 నాటౌట్), మిచెల్ సాంట్నర్ (49) రాణించడంతో సెకెండ్ ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. విలియమ్సన్ ఔటైన తర్వాత న్యూజిలాండ్ టెయిలెండర్లు వేగంగా పరుగులు రాబట్టారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేకబ్ బేతెల్ 3, బెన్ స్టోక్స్, షోయబ్ బషీర్ చెరో 2, పాట్స్, అట్కిన్సన్, రూట్ తలో వికెట్ పడగొట్టారు.అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులకు ఆలౌటైంది. మ్యాట్ హెన్రీ (4/48), విలియమ్ ఓరూర్కీ (3/33), మిచెల్ సాంట్నర్ (3/7) ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జో రూట్ (32) టాప్ స్కోరర్‌గా నిలువగా.. జాక్ క్రాలే (21), బెన్ డకెట్ (11), జేకబ్ బేతెల్ (12), ఓలీ పోప్ (24), బెన్ స్టోక్స్ (27) రెండంకెల స్కోర్లు చేశారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 347 పరుగులకు ఆలౌటైంది. టామ్ లాథమ్ (63), సాంట్నర్ (76) అర్ద సెంచరీలతో రాణించగా.. విల్ యంగ్ (42), కేన్ విలియమ్సన్ (44) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో పాట్స్ 4, అట్కిన్సన్ 3, బ్రైడన్ కార్స్ 2, స్టోక్స్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌ను ఇంగ్లండ్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
NZ Vs ENG 3rd Test: చరిత్ర సృష్టించిన కేన్ మామ
హ్యామిల్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ సెంచరీ చేశాడు. కేన్‌కు టెస్ట్‌ల్లో ఇది 33వ సెంచరీ. జేకబ్ బేతెల్ బౌలింగ్‌లో సిక్సర్ బాది కేన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేన్ తన సెంచరీ మార్కును 137 బంతుల్లో అందుకున్నాడు. కేన్ సెంచరీలో 14 బౌండరీలు, ఓ సిక్సర్ ఉన్నాయి. కేన్ తన కెరీర్లో 105 టెస్ట్‌లు ఆడి 54.91 సగటున 33 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీల సాయంతో 9225 పరుగులు చేశాడు.చరిత్ర సృష్టించిన కేన్ మామఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో సెంచరీ చేసిన అనంతరం కేన్ మామ చరిత్ర సృష్టించాడు. ఒకే వేదికపై ఐదు వరుస సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కేన్ హ్యామిల్టన్ గడ్డపై వరుసగా ఐదు టెస్ట్ సెంచరీలు చేశాడు. హ్యామిల్టన్‌లో కేన్ సగటు 97.69గా ఉంది. ఇక్కడ కేన్ 12 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 1563 పరుగులు చేశాడు.ఒకే వేదికపై అత్యధిక సగటు కలిగిన రికార్డు క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ పేరిట ఉంది. బ్రాడ్‌మన్ మెల్బోర్న్లో 128.53 సగటు కలిగి ఉన్నాడు. బ్రాడ్‌మన్ తర్వాత ఒకే వేదికపై అత్యధిక సగటు కలిగి రికార్డు వీవీఎస్ లక్ష్మణ్ పేరిట ఉంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో లక్ష్యణ్ సగటు 110.63గా ఉంది.మ్యాచ్ విషయానికొస్తే.. కేన్ మామ సెంచరీతో కదంతొక్కడంతో మూడో టెస్ట్‌లో న్యూజిలాండ్ పట్టు బిగించింది. మూడో రోజు టీ విరామం సమయానికి న్యూజిలాండ్ 478 పరుగుల ఆధిక్యంలో ఉంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ స్కోర్ 274/4గా ఉంది. కేన్ విలియమ్సన్ (123), డారిల్ మిచెల్ (18) క్రీజ్‌లో ఉన్నారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ (60) అర్ద సెంచరీతో రాణించగా.. రచిన్ రవీంద్ర (44) పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ రెండు వికెట్లు పడగొట్టగా.. పాట్స్, అట్కిన్సన్ తలో వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులకే ఆలౌటైంది. మ్యాట్ హెన్రీ (4/48), విలియమ్ ఓరూర్కీ (3/33), మిచెల్ సాంట్నర్ (3/7) ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జో రూట్ (32) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.దీనికి ముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 347 పరుగులు చేసింది. టామ్ లాథమ్ (63), సాంట్నర్ (76) అర్ద సెంచరీలతో రాణించగా.. విల్ యంగ్ (42), కేన్ విలియమ్సన్ (44) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. -
ఇంగ్లండ్ బ్యాటర్ల రికార్డు.. ఒకరేమో అరంగేట్రంలోనే సెంచరీ, మరొకరు ఫాస్టెస్ట్ సెంచరీ
మహిళల క్రికెట్లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఇద్దరు ఇంగ్లండ్ బ్యాటర్లు సెంచరీలు చేసి రికార్డులు సృష్టించారు. ఈ మ్యాచ్‌లో మయా బౌచియర్ (126), నాట్ సీవర్ బ్రంట్ (128) మూడంకెల మార్కును అందుకున్నారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 395 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ట్యామీ బేమౌంట్ 21, హీథర్ నైట్ 20, డేనియెల్ వ్యాట్ హాడ్జ్ 12, ఆమీ జోన్స్ 39, చార్లోట్ డీన్ 8, సోఫీ ఎక్లెస్టోన్ 21, ర్యానా మెక్ డోనాల్డ్ గే 2 పరుగులు చేసి ఔట్ కాగా.. లారెన్ ఫైలర్ (0), లారెన్ బెల్ (0) అజేయంగా నిలిచారు. సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా నాలుగు వికెట్లు పడగొట్టగా.. అయాండా హ్లుబి 2, తుమీ సెఖుఖునే, మారిజన్ కాప్ తలో వికెట్ దక్కించుకున్నారు.అరంగేట్రంలోనే సెంచరీమయా బౌచియర్ అరంగేట్రంలోనే సెంచరీ చేసి రికార్డుల్లోకెక్కింది. అరంగేట్రంలో సెంచరీ చేసిన 14వ మహిళా క్రికెటర్‌గా బౌచియర్ రికార్డు సృష్టించింది. బౌచియర్ తన సెంచరీ మార్కును కేవలం 124 బంతుల్లో అందుకుంది. తద్వారా మహిళల క్రికెట్లో ఫాస్టెస్ట్ టెస్ట్ సెంచరీ చేసిన ఐదో బ్యాటర్‌గానూ రికార్డు నెలకొల్పింది.ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన నాట్ సీవర్మహిళల క్రికెట్లో ఫాస్టెస్ట్ టెస్ట్ సెంచరీ చేసిన ఘనత నాట్ సీవర్ బ్రంట్ దక్కింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బ్రంట్ ఈ ఫీట్‌ను సాధించింది. బ్రంట్ కేవలం 96 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకుంది. మహిళల క్రికెట్లో ఎవ్వరూ 100లోపు బంతుల్లో టెస్ట్ సెంచరీ పూర్తి చేయలేదు. మహిళల క్రికెట్లో టాప్-5 ఫాస్టెస్ట్ సెంచరీల్లో నాలుగు దక్షిణాఫ్రికాపైనే నమోదు కావడం విశేషం.మహిళల క్రికెట్లో ఫాస్టెస్ట్ టెస్ట్ సెంచరీలు..నాట్ సీవర్ బ్రంట్-96 బంతుల్లో సౌతాఫ్రికాపైచమానీ సెనెవిరతన-106 బంతుల్లో పాకిస్తాన్పైషఫాలీ వర్మ-113 బంతుల్లో సౌతాఫ్రికాపైస్మృతి మంధన-122 బంతుల్లో సౌతాఫ్రికాపైమయా బౌచియర్-124 బంతుల్లో సౌతాఫ్రికాపై -
న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన
హ్యామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో రేపటి నుంచి (డిసెంబర్ 14) ప్రారంభంకాబోయే మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టులో ఇంగ్లండ్ మేనేజ్మెంట్ ఓ మార్పు చేసింది. గత రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన క్రిస్ వోక్స్ స్థానంలో మాథ్యూ పాట్స్ తుది జట్టులోకి వచ్చాడు. ఈ ఒక్క మార్పు మినహా రెండో టెస్ట్ ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించనుంది ఇంగ్లండ్ మేనేజ్మెంట్.కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలుపొందింది. మరో టెస్ట్ మిగిలుండగానే ఇంగ్లండ్ 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. 2008 తర్వాత న్యూజిలాండ్ గడ్డపై ఇంగ్లండ్‌కు ఇది తొలి టెస్ట్ సిరీస్ విజయం.తొలి టెస్ట్‌లో 8 వికెట్ల తేడాతో విజయంక్రైస్ట్చర్చ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తరఫున హ్యారీ బ్రూక్ (171), బ్రైడన్ కార్స్ (10 వికెట్లు) అత్యుత్తమ ప్రదర్శనలు చేశారు.323 పరుగుల తేడాతో విజయంవెల్లింగ్టన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ 323 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తరఫున హ్యారీ బ్రూక్ (123, 55), జో రూట్ (106) సెంచరీలతో కదం తొక్కారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమైంది.మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్, ఒల్లీ పోప్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), గుస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్సే, మాథ్యూ పాట్స్, షోయబ్ బషీర్ -
గుండె తరుక్కుపోయే ఘటన: పాపం ఆ చిట్టితల్లి ..!
కొన్ని ఘటనలు అత్యంత పాశవికంగా ఉంటాయి. మనుషులేనా..? అనే భయం కలుగుతుంటుంది. అదికూడా అభం శుభం తెలియని చిన్నారులు పట్ల ఇంత హేయంగా ప్రవర్తించడమా..! అనే జుగుప్సకరమైన బాధకలుగుతుంటుంది. అచ్చం అలాంటి గుండె తరుక్కుపోయే ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. ఆ చిట్టి తల్లికి పదేళ్లకే నిండు నూరేళ్లు నిండిపోయాయి. కంటిపాపలా కాచుకోవాల్సిన తండ్రి చేతిలోనే హతమవుతానని ఊహించి ఉండదు పాపం. పదేళ్ల సారా షరీఫ్ ఇంగ్లండ్‌లో తన ఇంటిలోనే విగతజీవిగా కనిపించింది. ఒళ్లంతా తీవ్రమైన గాయాలతో మృతి చెంది ఉంది. చనిపోవడానికి ముందు దారుణమైన వేధింపులకు గురై ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. వారి అనుమానమే నిజమయ్యింది. చనిపోయినప్పుడు ఆ చిన్నారి ఒంటిపై మానవ పంటి గాయాలతో సహా మొత్తం 70 గాయలు ఉన్నట్లు పోస్ట్‌మార్టంలో వెల్లడయ్యింది. అలాగే మెడ, వెన్నుముకతో సహ మొత్తం 25 చోట్ల ఎముకలు విరిగినట్లు నివేదక పేర్కొంది. నా కెరీర్లో ఇలాంటి కేసు చూడలేదుపోలీసులు సైతం ఈ ఘటన చూసి తమ 30 ఏళ్ల కెరీర్లో ఇంతటి దారుణమైన కేసుని చూడలేదన్నారు. ఈ కేసుని సీరియస్‌గా తీసుకున్న డిటెక్టివ్ చీఫ్ ఇన్స్పెక్టర్ క్రెయిగ్ ఎమ్మెర్సన్ ఈ కేసుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడమే గాక ఈ ఘటనతో సంబంధం ఉన్న నిందితులందర్నీ అరెస్టు చేశారు. ఈ కేసులో అత్యంత బాధకరమైన విషయం ఏమిటంటే కన్నతండ్రే ఆ చిన్నారిని ఇంత ఘోరమైన బాధలకు గురిచేయడమే. ఆమె బాల్యమంత భరించలేని బాధలతోనే గడిచింది. యావత్తు ప్రపంచం ఉలిక్కిపడింది..అక్కడితో ఆగక ఆ కిరాతక తండ్రి తన భార్యతో కలిసి ఆ చిన్నారిని దారుణంగా హతమార్చాడు. ఇందులో ఆ చిన్నారి మేనమామ ప్రమేయం కూడా ఉన్నట్లు తేలడంతో అతడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సారా ఉదంతంతో ఒక్కసారిగా యావత్ ప్రపంచంలో పిల్లల సంరక్షణ ఏ స్థితిలో ఉందనే భయాందోళన రేకెత్తించింది. ఈ ఘటనతో పిల్లలు సంరక్షణకు సంబంధించిన సంస్కరణలకు పిలుపునిచ్చారు సామాజికవేత్తలు. నిజానికి ఇంగ్లాండ్‌లాంటి దేశంలో పిల్లల సంరక్షణకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అయినా కూడా ఆ చిన్నారి కథ విషాదంతో ముగిసిపోయే వరకు వెలుగులోకి రాలేదు. కాగా, ఈ కేసులో పోలీసులకు దొరికిన కీలక ఆధారం నిందితుడు ఉర్ఫాన్ షరీష్ స్వయంగా నా కూమార్తెను కొట్టి చంపానని చేతితో వ్రాసిన నోట్. అయితే విచారణలో మాత్రం బుకాయించే ప్రయంత్న చేశాడు, కానీ పోలీసులు తమదైన శైలిలో విచారించేటప్పటికీ..తన భార్యతో కలిసి ఈ నేరం చేసినట్లు ఉర్ఫాన్ ఒప్పుకున్నాడు.తీసుకోవాల్సిన చర్యలు..ఇలాంటి ఘటనలు వేధింపులకు గురవ్వుతున్న చిన్నారులు భద్రత గురించే గాక కర్కశంగా ప్రవర్తించే తల్లిదండ్రులకు ఎలా బుద్ధి చెప్పాలో తెలియజెప్పుతోంది. వాస్తవానికి ఇలాంటి ఘటనలు అంతతేలిగ్గా బయటకురావు. అలాగే చుట్టుపక్కల వాళ్లు లేదా ఎవ్వరైనా ధైర్యం చేసి..ఇలాంటి కేసు గురించి పోలీసుల దృష్టికొచ్చేలా చేయడం అనేది అంత ఈజీ కాదు. ఇవి అత్యంత సున్నితమైన కేసులు. ఈ విషయంలో చిన్నారుల భద్రత, సంక్షేమానికి సంబంధించి..ప్రభుత్వం హెల్ప్లైన్లు, కౌన్సిలింగ్ సెంటర్లతో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ విధంగా ఏ చిన్నారి బలవ్వకుండా ప్రభుత్వం, సమాజం చొరవ చూపితేగానీ..ఇలాంటి ఘటనలు పునరావృతం కావని అంటున్నారు విశ్లేషకులు.(చదవండి: సైంటిస్ట్ జంట రూటే సెపరేటు! ఏముంది వెడ్డింగ్ కార్డ్..!) -
జింబాబ్వే జట్టులో చోటు దక్కించుకున్న ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ సోదరుడు
ఇంగ్లండ్ ఆటగాళ్లు సామ్ కర్రన్, టామ్ కర్రన్ల సోదరుడు బెన్ కర్రన్ జింబాబ్వే జాతయ జట్టుకు ఎంపికయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జింబాబ్వే వన్డే జట్టులో బెన్ చోటు దక్కించుకున్నాడు. 28 ఏళ్ల బెన్ జింబాబ్వే మాజీ ఆటగాడు, ఆ జట్టు మాజీ హెడ్ కోచ్ కెవిన్ కర్రన్ తనయుడు. కెవిన్‌కు ముగ్గురు కుమారులు. వీరిలో సామ్, టామ్ కర్రన్లు ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించగా.. తాజాగా బెన్ జింబాబ్వే జట్టులో చోటు దక్కించుకున్నాడు. జింబాబ్వే దేశవాలీ సీజన్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చడం ద్వారా బెన్ జాతీయ జట్టు నుంచి తొలిసారి పిలుపునందుకున్నాడు. బెన్ ఎడమ చేతి వాటం బ్యాటర్.కాగా, స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే టీ20, వన్డే సిరీస్‌ల కోసం వేర్వేరు జింబాబ్వే జట్లను ఇవాళ (డిసెంబర్ 9) ప్రకటించారు. టీ20 జట్టుకు సికందర్ రజా, వన్డే జట్టుకు క్రెయిగ్ ఎర్విన్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. బెన్ కర్రన్ కేవలం వన్డే జట్టులో మాత్రమే చోటు దక్కించుకున్నాడు. బెన్‌తో పాటు న్యూమ్యాన్ న్యామ్హురి కూడా తొలిసారి జాతీయ జట్టు నుంచి పిలుపునందుకున్నాడు. న్యూమ్యాన్ వన్డేతో పాటు టీ20 జట్టుకు ఎంపికయ్యాడు.ఆఫ్ఘనిస్తాన్ పర్యటన తొలుత మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో మొదలవుతుంది. డిసెంబర్ 11, 13, 14 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం డిసెంబర్ 17, 19, 21 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. ఈ పర్యటనలో ఆఫ్ఘనిస్తాన్ రెండు టెస్ట్ మ్యాచ్‌లు కూడా ఆడనుంది. తొలి టెస్ట్ డిసెంబర్ 26 నుంచి.. రెండో టెస్ట్ వచ్చే ఏడాది జనవరి 2 నుంచి మొదలవుతాయి. జింబాబ్వే టెస్ట్ జట్టును ప్రకటించాల్సి ఉంది.టీ20 జట్టు: సికందర్ రజా (కెప్టెన్), ఫరాజ్ అక్రమ్, బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, ట్రెవర్ గ్వాండు, టకుద్జ్వానాషే కైటానో, వెస్లీ మాధేవెరే, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, తషింగా డి ముసెకివాని, బ్లెస్సింగ్ ముజరబానీ, డియాన్ మైర్స్, రిచర్డ్ నగరవ, న్యూమ్యాన్ న్యామ్హురివన్డే జట్టు: క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, బెన్ కర్రన్, జాయ్‌లార్డ్ గుంబీ, ట్రెవర్ గ్వాండు, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, తషింగా ముసెకివా, బ్లెస్సింగ్ ముజారబానీ, డియాన్ మైర్స్, రిచర్డ్ నగరవ, న్యూమ్యాన్ న్యామ్హురి, విక్టర్ న్యూయుచి, సికందర్ రజా, సీన్ విలియమ్స్ -
హ్యాట్రిక్ తీసిన ఇంగ్లండ్ బౌలర్
మహిళల క్రికెట్లో భాగంగా సౌతాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్ 8) జరిగిన వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్ చార్లీ డీన్ హ్యాట్రిక్ వికెట్లు తీసింది. సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో డీన్ ఈ ఘనత సాధించింది. ఇంగ్లండ్ తరఫున హ్యాట్రిక్ తీసిన మూడో మహిళా క్రికెటర్‌గా డీన్ రికార్డుల్లోకెక్కింది. ఓవరాల్‌గా (పురుషుల క్రికెట్‌తో పాటు) ఈ ఘనత సాధించిన ఏడో ఇంగ్లండ్ బౌలర్‌గా రికార్డు నెలకొల్పింది.సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో డీన్ ఇన్నింగ్స్ 17, 19 ఓవర్లలో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసింది. ఇన్నింగ్స్ 17వ ఓవర్ చివరి బంతికి మారిజన్ కాప్ వికెట్ తీసిన డీన్.. ఆతర్వాత 19వ ఓవర్ మొదటి రెండు బంతులకు నదినే డి క్లెర్క్, సినాలో జఫ్టా వికెట్లు తీసింది.ఇంగ్లండ్ తరఫున హ్యాట్రిక్ వికెట్లు తీసిన బౌలర్లు..కరోల్ హాడ్జస్ 1993లో డెన్మార్క్ మహిళల జట్టుపైక్లేర్ కాన్నర్ 1999లో భారత మహిళా జట్టుపైజేమ్స్ అండర్సన్ 2003లో పాకిస్తాన్ పురుషుల జట్టుపైస్టీవ్ హార్మిసన్ 2004లో భారత పురుషుల జట్టుపైఆండ్రూ ఫ్లింటాఫ్ 2009లో వెస్టిండీస్ పురుషుల జట్టుపైస్టీవెన్ ఫిన్ 2015లో ఆస్ట్రేలియా పురుషుల జట్టుపైచార్లీ డీన్ 2024లో సౌతాఫ్రికా మహిళల జట్టుపైమ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 31.3 ఓవర్లలో 135 పరుగులకే ఆలౌటైంది. చార్లీ డీన్ (4/45), సోఫీ ఎక్లెస్టోన్ (3/27), లారెన్ ఫైలర్ (3/32) రెచ్చిపోవడంతో సౌతాఫ్రికా జట్టు అనూహ్యంగా కుప్పకూలింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో క్లో టైరాన్ (45), లారా వోల్వార్డ్ట్ (35), డెర్క్సన్ (29) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 24 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. టామీ బేమౌంట్ (34), బౌచియర్ (33), డేనియల్ హాడ్జ్ (25 నాటౌట్), నాట్ సీవర్ బ్రంట్ (20) ఇంగ్లండ్ గెలుపులో కీలకపాత్ర పోషించారు. సౌతాఫ్రికా బౌలర్లలో డెర్క్సన్ 2, డి క్లెర్క్, మారిజన్ కాప్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో సౌతాఫ్రికా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. నిర్ణయాత్మక మూడో వన్డే డిసెంబర్ 11న జరుగనుంది. -
జాక్‌పాట్ కొట్టిన ఆర్సీబీ ప్లేయర్
ఇంగ్లండ్ యువ ఆటగాడు జాకబ్ బేతెల్ జాక్‌పాట్ కొట్టాడు. ఇప్పటివరకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) డెవలప్మెంట్ కాంట్రాక్ట్‌లో ఉన్న బేతెల్.. తాజాగా ఈసీబీ రెండేళ్ల కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నాడు. ఈసీబీ రెండేళ్ల కాంట్రాక్ట్ జాబితాలో జో రూట్,జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. తాజాగా బేతెల్ వీరి సరసన చేరాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ పేస్ త్రయం జోఫ్రా ఆర్చర్, మాథ్యూ పాట్స్, బ్రైడన్ కార్స్ తమ కాంట్రాక్ట్‌ను 2026 వరకు పొడిగించుకున్నారు. దీంతో ఈ ముగ్గురు కూడా రెండేళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో చేరిపోయారు.కాగా, 21 ఏళ్ల బేతెల్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ల్లో వన్డే, టీ20 అరంగేట్రం చేశాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బేతెల్ టెస్ట్ అరంగేట్రం కూడా చేశాడు. బేతెల్ మూడు ఫార్మాట్లకు తగ్గ ప్లేయర్. అందుకే అతనికి రెండేళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చారు. బేతెల్‌ను ఇటీవల జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్సీబీ 2.6 కోట్లకు కొనుగోలు చేసింది. న్యూజిలాండ్‌తో తాజాగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో బేతెల్ 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. బేతెల్ ఇంగ్లండ్ తరఫున ఒక టెస్ట్, 8 వన్డేలు, 7 టీ20లు ఆడాడు. ఇందులో 4 అర్ద సెంచరీలు ఉన్నాయి. -
WTC Final: న్యూజిలాండ్ అవకాశాలపై నీళ్లు చల్లిన ఐసీసీ
ఇంగ్లండ్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) షాకిచ్చింది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గానూ ఇరు జట్ల మ్యాచ్ ఫీజ్‌లో 15 శాతం కోత విధించింది. అలాగే ఇరు జట్లకు మూడు డబ్ల్యూటీసీ పాయింట్లు పెనాల్టీ పడ్డాయి.ఐసీసీ తీసుకున్న ఈ చర్య వల్ల ఇంగ్లండ్‌కు పెద్దగా నష్టమేమీ లేనప్పటికీ.. న్యూజిలాండ్‌కు మాత్రం డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే అవకాశాలు దెబ్బతిన్నాయి. తాజా పెనాల్టీ అనంతరం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ ఐదో స్థానానికి పడిపోయింది. దీనికి ముందు ఆ జట్టు శ్రీలంకతో పాటు సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉండింది.న్యూజిలాండ్.. ఇంగ్లండ్‌తో తదుపరి జరుగబోయే రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరలేదు. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పర్సెంటేజీ 47.92గా ఉంది. ఇంగ్లండ్‌తో తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా న్యూజిలాండ్ పాయింట్ల పర్సెంటేజీ 55.36 శాతం వరకు మాత్రమే చేరుకుంటుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరేందుకు ఇది సరిపోదు. కాబట్టి ఐసీసీ తాజాగా విధించిన పాయింట్ల కోత న్యూజిలాండ్ డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను దెబ్బతీసిందనే చెప్పాలి. మరోవైపు న్యూజిలాండ్‌తో పాటు పాయింట్ల కోత విధించబడ్డ ఇంగ్లండ్ డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి ఇదివరకే అనధికారికంగా నిష్క్రమించింది. ప్రస్తుతం ఆ జట్టు 40.75 శాతం పాయింట్లతో పట్టికలో ఆరో స్థానంలో ఉంది.ఇదిలా ఉంటే, క్రైస్ట్‌చర్చ్ వేదికగా తాజాగా ముగిసిన టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ (171), బ్రైడన్ కార్స్ (10 వికెట్లు) సత్తా చాటి ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ డిసెంబర్ 6 నుంచి మొదలవుతుంది. -
సచిన్ రికార్డు బద్దలు కొట్టిన జో రూట్
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండిన ఓ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు. టెస్ట్‌ల్లో నాలుగో ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. నాలుగో ఇన్నింగ్స్‌ల్లో సచిన్ 1625 పరుగులు చేయగా.. ప్రస్తుతం రూట్ ఖాతాలో 1630 పరుగులు ఉన్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ సందర్భంగా రూట్ ఈ ఫీట్‌ను సాధించాడు. ఛేదనలో రూట్ 23 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.సచిన్ కంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే..!ఫోర్త్ ఇన్నింగ్స్‌లో రూట్ సచిన్ కంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే 1630 పరుగులు చేశాడు. రూట్‌కు ఈ మైలురాయి చేరుకునేందుకు 49 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. సచిన్ 60 ఇన్నింగ్స్‌ల్లో 1625 పరుగులు చేశాడు. నాలుగో ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్-5 స్థానాల్లో వీరు ఉన్నారు.రూట్- 1630 పరుగులు (49 ఇన్నింగ్స్‌లు)సచిన్- 1625 (60 ఇన్నింగ్స్‌లు)అలిస్టర్ కుక్- 1611 (53 ఇన్నింగ్స్‌లు)గ్రేమ్ స్మిత్- 1611 (41 ఇన్నింగ్స్‌లు)శివ్‌నరైన్ చంద్రపాల్- 1580 (49 ఇన్నింగ్స్‌లు)కేన్ సచిన్ రికార్డును తన 150వ టెస్ట్‌లో బద్దలు కొట్టడం విశేషం. రూట్ ప్రస్తుతం టెస్ట్‌ల్లో 12777 పరుగులు చేసి సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో సచిన్ (15921) టాప్‌లో ఉండగా.. రికీ పాంటింగ్ (13378), కల్లిస్ (13289), ద్రవిడ్ (13288) రూట్ కంటే ముందున్నారు.కాగా, క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు హ్యరీ బ్రూక్ (171) భారీ సెంచరీతో కదంతొక్కగా.. బ్రైడన్ కార్స్ 10 వికెట్లతో విజృంభించాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన రూట్ రెండో ఇన్నింగ్స్‌లో జేకబ్ బేతెల్తో (50 నాటౌట్) కలిసి అజేయమైన 23 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. -
న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్
క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌటైంది. కేన్ విలియమ్సన్ (93) ఏడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకోగా.. గ్లెన్ ఫిలిప్స్ 58 పరుగుల అజేయమైన ఇన్నింగ్స్ ఆడాడు. టామ్ లాథమ్ (47), రచిన్ రవీంద్ర (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ తలో నాలుగు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.బ్రూక్ భారీ శతకంఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ భారీ సెంచరీతో (171) కదం తొక్కాడు. ఓలీ పోప్ (77), బెన్ స్టోక్స్ (80) అర్ద శతకాలతో రాణించారు. బెన్ డకెట్ (46), గస్ అట్కిన్సన్ (48), బ్రైడన్ కార్స్ (33 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. నాథన్ స్మిత్ మూడు, టిమ్ సౌథీ రెండు, విలియమ్ ఓరూర్కీ ఓ వికెట్ దక్కించుకున్నారు.నిప్పులు చెరిగిన బ్రైడన్ కార్స్తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసి న్యూజిలాండ్‌కు దెబ్బకొట్టిన బ్రైడన్ కార్స్ సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటాడు. ఈ ఇన్నింగ్స్‌లో కార్స్ 6 వికెట్లు పడగొట్టాడు. కార్స్‌తో పాటు క్రిస్ వోక్స్ (3/59), అట్కిన్సన్ (1/57) కూడా చెలరేగడంతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 254 పరుగులకు చాపచుట్టేసింది. కివీస్ ఇన్నింగ్స్‌లో విలియమ్సన్ (61), డారిల్ మిచెల్ (84) అర్ద సెంచరీలతో రాణించారు.ఆడుతూపాడుతూ విజయతీరాలకు..!104 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 12.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. అరంగేట్రం ఆటగాడు జాకబ్ బేతెల్ 37 బంతుల్లో 50 పరుగులు.. జో రూట్ 15 బంతుల్లో 23 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. బెన్ డకెట్ 27, జాక్ క్రాలే ఒక్క పరుగు చేసి ఔటయ్యారు. మ్యాట్ హెన్రీ, విలియమ్ ఓరూర్కీ తలో వికెట్ పడగొట్టారు. మ్యాచ్ మొత్తంలో 10 వికెట్లు తీసిన బ్రైడన్ కార్స్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానుంది. -
శతక్కొట్టిన హ్యారీ బ్రూక్.. సెకెండ్ ఫాస్టెస్ట్ ప్లేయర్‌గా రికార్డు
క్రైస్ట్‌చర్చ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ మిడిలార్డర్ ఆటగాడు హ్యారీ బ్రూక్ సెంచరీతో కదంతొక్కాడు. బ్రూక్ తన కెరీర్లో ఏడో టెస్ట్ సెంచరీని 123 బంతుల్లో పూర్తి చేశాడు. బ్రూక్ సెంచరీ మార్కును బౌండరీతో చేరుకోవడం విశేషం. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన బ్రూక్.. ఓలీ పోప్‌తో (77) కలిసి ఐదో వికెట్‌కు 151 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. అనంతరం బ్రూక్.. బెన్ స్టోక్స్‌తో (32 నాటౌట్) కలిసి ఆరో వికెట్‌కు అజేయమైన 86 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ప్రస్తుతం బ్రూక్ 126 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. 71 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 5 వికెట్ల నష్టానికి 309 పరుగులుగా ఉంది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంగ్లండ్ ఇంకా 39 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే 0, బెన్ డకెట్ 46, జాకబ్ బేతెల్ 10, జో రూట్ 0, ఓలీ పోప్ 77 పరుగులు చేసి ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో నాథన్ స్మిత్ 2, టిమ్ సౌథీ, మ్యాట్ హెన్రీ, విలియమ్ ఓరూర్కీ తలో వికెట్ పడగొట్టారు.అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌటైంది. కేన్ విలియమ్సన్ (93) ఏడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (58 నాటౌట్) బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ చేశాడు. టామ్ లాథమ్ (47), రచిన్ రవీంద్ర (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ తలో 4 వికెట్లు పడగొట్టగా.. అట్కిన్సన్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. 2000 పరుగులు పూర్తి చేసుకున్న బ్రూక్ఈ మ్యాచ్‌లో బ్రూక్ 2000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. టెప్ట్ల్లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో బ్రూక్ రెండో స్థానంలో నిలిచాడు. బ్రూక్ 2000 పరుగుల మార్కును తాకేందుకు 2300 బంతులు తీసుకున్నాడు. ఈ జాబితాలో బ్రూక్ సహచరుడు బెన్ డకెట్ టాప్‌లో ఉన్నాడు. డకెట్ 2293 బంతుల్లో 2000 పరుగులు పూర్తి చేశాడు.టెస్ట్‌ల్లో వేగంగా 2000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితా..బెన్ డకెట్-2293హ్యారీ బ్రూక్-2300టిమ్ సౌథీ-2418అడమ్ గిల్‌క్రిస్ట్-2483