Euro Cup
-
యూరో కప్‌లో ఓటమి.. రిటైర్మెంట్ ప్రకటించిన ఫుట్‌బాల్ దిగ్గజం
జర్మనీ ఫుట్‌బాల్ దిగ్గజం థామస్ ముల్లెర్ తన 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు విడ్కోలు పలికాడు. తమ సొంత గడ్డపై జరిగిన యూరో కప్-2024లో జర్మనీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ మెగా టోర్నీ క్వార్టర్ ఫైనల్లోనే జర్మనీ కథ ముగిసింది.ఈ టోర్నీలో మిల్లర్ కూడా తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఈ క్రమంలో తమ జట్టు ఓటమిని జీర్ణించుకోలేకపోయిన ముల్లెర్.. తన ఫుట్‌బాల్ కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాడు."దేశం తరపున అత్యున్నతస్ధాయిలో ఆడటం ఎల్లప్పుడూ గర్వకారణమే. నా కెరీర్లో ఎన్నో విజయాలను చూశాను. కొన్నిసార్లు కన్నీళ్ల పెట్టున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నేను జర్మనీ తరపున అరంగేట్రం చేసినప్పుడు ఇవన్నీ సాధిస్తాని కలలో కూడా ఊహించలేదు. ఇన్నేళ్లగా నాకు మద్దతుగా నిలిచిన నా సహచరులకు, అభిమానులకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నానని" తన రిటైర్మెంట్ నోట్లో ముల్లర్ పేర్కొన్నాడు. కాగా అటాకింగ్ మిడ్‌ఫీల్డర్‌గా ముల్లెర్ జర్మనీకి ఎన్నో అద్భుత విజయాలను అందించాడు. 2014లో ఫిఫా వరల్డ్ కప్ గెలుపొందిన జర్మనీ జట్టుకు ముల్లెరె కెప్టెన్ కావడం గమనార్హం. తన కెరీర్లో 131 మ్యాచ్‌లు ఆడిన ముల్లెర్.. 45 గోల్స్, 41 అసిస్ట్‌లు తన పేరిట లిఖించుకున్నాడు. ఇక ఇది ఇలా ఉండగా.. యూరోకప్ విజేతగా స్పెయిన్ నిలిచింది. ఫైనల్లో ఇంగ్లండ్‌ను 2-1 తేడాతో ఓడించి టైటిల్‌ను స్పెయిన్ సొంతం చేసుకుంది. -
Euro Cup: ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన స్పెయిన్.. తొలి జట్టుగా
పుష్కర కాలం తర్వాత స్పెయిన్ జట్టు అంతర్జాతీయ ఫుట్‌బాల్ వేదికపై మళ్లీ మెరిసింది. ప్రతిష్టాత్మక ‘యూరో’ టోర్నీలో స్పెయిన్ రికార్డుస్థాయిలో నాలుగోసారి చాంపియన్‌గా నిలిచింది. అంతేకాదు రెండు అత్యంత అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకుంది.భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఫైనల్లో అల్వారో మొరాటో సారథ్యంలోని స్పెయిన్ 2–1 గోల్స్ తేడాతో ఇంగ్లండ్ జట్టును ఓడించింది. స్పెయిన్ తరఫున నికో విలియమ్స్ (47వ ని.లో), మికెల్ ఒయర్జబాల్ (86వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... ఇంగ్లండ్ జట్టుకు పాల్మెర్ (73వ ని.లో) ఏకైక గోల్ అందించాడు.ఆట 68వ నిమిషంలో కెప్టెన్ అల్వారో మొరాటో స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ఒయర్జబాల్ సహచరుడు మార్క్ కుకురెల్లా క్రాస్ పాస్‌ను లక్ష్యానికి చేర్చి స్పెయిన్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 90వ నిమిషంలో ఇంగ్లండ్ ప్లేయర్ మార్క్ గుయెహి హెడర్ షాట్‌ను గోల్ పోస్ట్ ముందు స్పెయిన్ డిఫెండర్ డాని ఓల్మో హెడర్ షాట్‌తో అడ్డుకోవడం కొసమెరుపు.తొలి జట్టుగా చరిత్రఈ గెలుపుతో స్పెయిన్ జట్టు 66 ఏళ్ల టోర్నీ చరిత్రలో అత్యధికంగా నాలుగుసార్లు విజేతగా నిలిచిన జట్టుగా గుర్తింపు పొందింది. గతంలో స్పెయిన్ 1964, 2008, 2012లలో యూరో టైటిల్‌ను సాధించింది.జర్మనీ జట్టు మూడుసార్లు (1972, 1980, 1996) విజేతగా నిలిచింది. 1966లో ఏకైక ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన తర్వాత మరో అంతర్జాతీయ టైటిల్ నెగ్గలేకపోయిన ఇంగ్లండ్ జట్టుకు వరుసగా రెండోసారి యూరో టోర్నీలో నిరాశ ఎదురైంది. 2021 యూరో ఫైనల్లో ఇటలీ చేతిలో ఓడిన ఇంగ్లండ్‌కు ఈసారి స్పెయిన్ షాక్ ఇచ్చింది.బంతిని 63 శాతం తమ ఆధీనంలో ఉంచుకొని ఇంగ్లండ్ ఆటగాళ్లను కట్టడి చేసింది. ఏకంగా 60 సార్లు ఇంగ్లండ్ గోల్‌పోస్ట్ వైపునకు వెళ్లిన స్పెయిన్ 15 సార్లు గోల్ చేసేందుకు ప్రయత్నించింది. మరోవైపు హ్యారీ కేన్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ జట్టు 31 సార్లు స్పెయిన్ గోల్‌పోస్ట్ వైపునకు వెళ్లి తొమ్మిదిసార్లు గోల్ లక్ష్యంగా షాట్లు సంధించింది.విజేతకు రూ. 72 కోట్ల 89 లక్షలుస్పెయిన్ టీనేజ్ స్టార్, 17 ఏళ్ల లమీన్ యమాల్ ‘యంగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’... స్పెయిన్‌కే చెందిన రోడ్రి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డులు గెల్చుకున్నారు. ఫైనల్ విజేత స్పెయిన్ జట్టుకు 80 లక్షల యూరోలు (రూ. 72 కోట్ల 89 లక్షలు), రన్నరప్ ఇంగ్లండ్ జట్టుకు 50 లక్షల యూరోలు (రూ. 45 కోట్ల 56 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఓవరాల్‌గా రూ. 253 కోట్ల ప్రైజ్ మనీ స్పెయిన్‌కు దక్కింది.స్పెయిన్ అరుదైన రికార్డులు ఇవే1. యూరో టోర్నీలో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ గెలుపొంది విజేతగా నిలిచిన తొలి జట్టుగా స్పెయిన్ రికార్డు నెలకొల్పింది. 2. ఒకే యూరో టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన జట్టుగా స్పెయిన్ గుర్తింపు పొందింది. ఫ్రాన్స్ (14 గోల్స్; 1984లో) పేరిట ఉన్న రికార్డును స్పెయిన్ తాజాగా తిరగరాసింది. 🔝 performance 🔝 tournament Nico Williams is the real deal 👏@Vivo_GLOBAL | #EUROPOTM pic.twitter.com/lPu38RWoX0— UEFA EURO 2024 (@EURO2024) July 14, 2024 -
యూరో కప్ విజేతకు ఘన స్వాగతం.. మాడ్రిడ్ దద్దరిల్లిపోయింది! వీడియో
యూరో కప్-2024 విజేత స్పెయిన్‌కు ఆపూర్వ స్వాగతం లభించింది. ట్రోఫీతో స్వదేశానికి చేరుకున్న స్పెయిన్ జట్టుకు అభిమానులు అడుగడుగునా నీరాజనాలు పలికారు. తమ సొంత గడ్డపై అడుగుపెట్టిన స్పెయిన్ జట్టు.. తొలుత ఆ దేశ రాజు ఫెలిపే VI, అతని కుటుంబాన్ని కలిశారు.ఆ తర్వాత రాజధాని మాడ్రిడ్‌లో ఓపెన్-టాప్ బస్ పరేడ్‌లో స్పెయిన్ ఆటగాళ్లు పాల్గోనున్నారు. తమ ఆరాధ్య జట్టుకు ఘనస్వాగతం పలికేందుకు అభిమానులు పెద్ద ఎత్తున మాడ్రిడ్‌లోని సిబిలెస్ స్క్వేర్ వద్దకు చేరుకున్నారు.అభిమానుల కేరింతల మధ్య స్పెయిన్ జట్టు బస్ విక్టరీ పరేడ్ జరిగింది. స్పెయిన్ ఆటగాళ్లు ట్రోఫీతో ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.కాగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ను 2-1 తేడాతో ఓడించిన స్పెయిన్ యూరోకప్ ఛాంపియన్స్‌గా నిలిచింది. స్పెయిన్‌కు ఇది నాలుగో యూరో కప్ టైటిల్ కావడం గమనార్హం. 1964, 2008, 2012 యూరో కప్ టైటిల్స్‌ను స్పెయిన్ సొంతం చేసుకుంది. 🎉🇪🇦 ¡Ojo al ambientazo en Cibeles para recibir a los #C4MPEONES de la #EURO2024!📹 @ernestoasc_ pic.twitter.com/piTQDDiqKm— MARCA (@marca) July 15, 2024 -
నాలుగోసారి యూరోకప్ విజేతగా నిలిచిన స్పెయిన్ ఫుట్‌బాల్ జట్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
'స్పెయిన్'దే యూరో కప్.. ఇంగ్లండ్‌కు మళ్లీ నిరాశే (ఫోటోలు)
-
సోమాలియాలో బాంబు పేలుడు.. ఐదుగురి మృతి
మొగదీషు: సోమాలియా రాజధాని మొగదీషులోని రద్దీగా ఉండే ఓ కేఫ్ బయట ఆదివారం(జులై 14) బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. మరో 20 మంది దాకా గాయపడ్డారు. కేఫ్ లోపల కొంత మంది టీవీలో యూరో కప్ ఫుట్‌బాల్ ఫైనల్ మ్యాచ్ చూస్తుండగా బయట కారులో పేలుడు సంభవించింది. పేలుడు తర్వాత జరిగిన తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పేలుడుకు కారణం తామే అని ఇప్పటివరకు ఎవరూ ప్రకటించలేదు. సోమాలియా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూపు అల్షబాబ్ మొగదీషులో తరచూ బాంబు పేలుళ్లకు పాల్పడుతుంటుంది. -
‘యూరో’ చాంపియన్‌గా స్పెయిన్
యూరో ఫుట్‌బాల్ కప్-2024 ఛాంపియన్స్‌గా స్పెయిన్ జట్టు నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ను 2-1 తేడాతో ఓడించిన స్పెయిన్.. నాలుగో సారి యూరో కప్ టైటిల్‌ను ముద్దాడింది. స్పెయిన్ విజయంలో మైకెల్ ఓయర్జాబల్ కీలక పాత్ర పోషించాడు.చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో 86వ నిమిషంలో గోల్‌కొట్టిన ఓయర్జాబల్ స్పెయిన్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు.చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో 86వ నిమిషంలో గోల్‌కొట్టిన ఓయర్జాబల్ స్పెయిన్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఈ ఫైనల్ మ్యాచ్ ఫస్ట్‌హాఫ్ నీవా నేనా అన్నట్లు సాగింది. ఇరు జట్లు కూడా తొలి ఆర్ధ భాగంలో ఒక్క గోల్కూడా సాధించలేకపోయాయి. ఫస్ట్‌హాప్ ముగిసే సమయానికి ఇరు జట్లు 0-0గా నిలిచాయి. ఆ తర్వాత సెకెండ్ హాఫ్‌లో 46వ నిమిషంలో నికో విలియమ్స్ అద్భుత గోల్‌తో స్పెయిన్ ఖాతా తెరిచాడు. ఇంగ్లండ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటకి గోల్ సాధించడంలో విఫలమైంది. ఈ క్రమంలో మ్యాచ్ 60 నిమిషంలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్ బయటకు వెళ్లిపోయాడు. అతడి స్ధానంలో సెమీఫైనల్ హీరో వాట్కిన్స్ వచ్చాడు. అతడు వచ్చిన కూడా ఫలితం మాత్రం మారలేదు. ఇంగ్లీష్ జట్టు నిరాశలో కూరుకుపోయిన వేళ మిడ్‌ఫీల్డర్ కోల్ పామర్ 73వ నిమిషంలో సంచలన గోల్‌తో తమ జట్టుకు తొలి గోల్‌ను అందించాడు.దీంతో స్కోర్లు 1-1తో సమమయ్యాయి. మళ్లీ ఇంగ్లండ్ కమ్‌బ్యాక్ ఇవ్వడంతో స్పెయిన్ కాస్త ఒత్తడికి గురైంది. అయితే సెకెండ్ హాఫ్ సమయం ముగుస్తున్నప్పటికి గోల్ మాత్రం ఇరు జట్లు సాధించలేకపోయాయి. దీంతో పెనాల్టీ షుటౌట్ తప్పదని అంతా భావించారు.కానీ మ్యాచ్ 86వ నిమిషంలో ఓయర్జాబల్ సూపర్ గోల్‌తో స్పెయిన్‌కు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. స్పెయిన్‌కు ఇది నాలుగో యూరో కప్ టైటిల్ కావడం గమనార్హం. 1964, 2008, 2012 యూరో కప్ టైటిల్స్‌ను స్పెయిన్ సొంతం చేసుకుంది. 🇪🇸 Spain are champions of Europe 🏆#EURO2024 pic.twitter.com/Ch0AF0iPWl— UEFA EURO 2024 (@EURO2024) July 14, 2024 -
Euro Cup 2024: సెమీస్‌లో నెదర్లాండ్స్‌కు షాక్.. ఫైనల్లో ఇంగ్లండ్
యూరో కప్-2024 ఫైనల్లో ఇంగ్లండ్ అడుగుపెట్టింది. డార్ట్మండ్ వేదికగా జరిగిన నెదర్లాండ్స్‌తో జరిగిన రెండో సెమీఫైనల్లో 2-1 తేడాతో విజయం సాధించిన ఇంగ్లీష్ జట్టు.. రెండో సారి ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఆద్యంతం తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఆఖరి నిమిషం గోల్ సాధించిన ఇంగ్లండ్ ప్లేయర్ ఓలీ వాట్కిన్స్.. తన జట్టుకు సంచలన విజయాన్ని అందించాడు.ఈ సెమీస్ పోరులో ఫస్ట్‌హాఫ్ తొలి 10 నిమిషాల్లో ఇంగ్లండ్‌పై నెదర్లాండ్స్ ఆధిపత్యం చెలాయించింది. తొలి ఆర్ధబాగం 7వ నిమిషంలో డచ్ మిడ్ ఫీల్డర్ క్జేవీ సైమన్స్ తమ జట్టుకు మొదటి గోల్‌ను అందించాడు. దీంతో ఆరంభంలోనే డచ్ జట్టు 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. అయితే కొద్దిసేపటికే ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్ పెనాల్టీ గోల్‌తో స్కోర్‌ను సమం చేశాడు. ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి ఇరు జట్లు చెరో గోల్‌తో సమంగా నిలిచాయి.ఇక సెకెండ్ హాఫ్ ప్రారంభమైన తర్వాత ఇరు జట్లు కొన్ని వ్యూహాత్మక మార్పులు చేశాయి. డచ్ తరుపున డోనియెల్ మాలెన్ స్ధానంలో వుత్ వెఘోర్స్ట్ సబ్‌స్ట్యూట్‌గా రాగా.. మరోవైపు త్రీ లయన్స్ జట్టుకు కీరన్ ట్రిప్పియర్ స్థానంలో ల్యూక్ షా వచ్చాడు. అయినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. ఈ క్రమంలో ఇంగ్లండ్ ఆఖరి 20 నిమిషాలకు ముందు తమ జట్టులో మరో రెండు మార్పులు చేసింది. స్టార్ ప్లేయర్లు హ్యారీ కేన్, ఫిల్ ఫోడెన్లు బయటకు వెళ్లగా.. వారిస్ధానాల్లో ఒల్లీ వాట్కిన్స్ , కోల్ పామర్ మైదానంలో వచ్చారు. అయితే సెకెండ్ హాఫ్ సమయం ముగుస్తున్నప్పటికి గోల్ మాత్రం ఇరు జట్లు సాధించలేకపోయాయి. దీంతో పెనాల్టీ షుటౌట్ తప్పదని అంతా భావించారు. కానీ మ్యాచ్ ఆఖరి నిమిషం(90వ మినిట్)లో సబ్‌స్ట్యూట్‌గా వచ్చిన వాట్కిన్స్ అద్భుతం చేశాడు. సంచలన గోల్‌తో వాట్కిన్స్ తన జట్టును రెండో సారి ఫైనల్‌కు చేర్చాడు. ఇక జూలై 15న జరగనున్న ఫైనల్లో స్పెయిన్‌తో ఇంగ్లండ్ తలపడనుంది. -
EURO CUP 2024: సెమీస్‌లో ఫ్రాన్స్ ఓటమి.. ఫైనల్లో స్పెయిన్
యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో స్పెయిన్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇవాళ (జులై 10) జరిగిన తొలి సెమీఫైనల్లో స్పెయిన్.. ఫ్రాన్స్‌పై 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలి అర్ద భాగంలోనే మూడు గోల్స్ నమోదయ్యాయి. 8వ నిమిషంలో రాండల్ కోలో ముఆని గోల్ సాధించి ఫ్రాన్స్‌కు ఆధిక్యాన్ని అందించాడు. అనంతరం స్పెయిన్ ఆటగాళ్లు 21వ నిమిషంలో లామిన్ యమాల్, 25వ నిమిషంలో డానీ ఓల్మో గోల్స్ సాధించారు. రెండో అర్ద భాగంలో ఫ్రాన్స్ ఎంత ప్రయత్నించినా.. స్పెయిన్ ఆధిక్యతను తగ్గించలేక పోయింది. ఫలితంగా ఓటమిపాలైంది. లామిన్ యమాల్ యూరో కప్ చరిత్రలోనే అత్యంత పిన్నవయస్కుడైన గోల్ స్కోరర్‌గా రికార్డుల్లోకెక్కాడు.ఇదిలా ఉంటే, నెదర్లాండ్స్-ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ రేపు (జులై 11) జరుగనుంది. ఈ మ్యాచ్‌లో విజేత జులై 15న జరిగే ఫైనల్లో స్పెయిన్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. -
సెమీస్ సమరం.. స్పెయిన్‌తో ఫ్రాన్స్ ఢీ! ఫైనల్ బెర్త్ ఎవరిదో?
‘యూరో’ కప్ ఫుట్‌బాల్ టోర్నీ-2024 తొలి సెమీఫైనల్‌కు సర్వం సిద్దమైంది. మంగళవారం అలియాంజ్ ఎరీనా వేదికగా జరగనున్న సెమీఫైనల్-1లో ఫ్రాన్స్, స్పెయిన్ జట్లు తాడో పేడో తెల్చుకోనున్నాయి. ఈ సెమీస్ పోరులో గెలిచి ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకోవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. స్పెయిన్ ఫైనల్‌కు చేరుతుందా?అయితే ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచి జోరు మీదున్న స్పెయిన్‌కు సెమీస్ ముందు గాయాలు, కార్డ్ సస్పెన్షన్ల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే కీలక మ్యాచ్‌కు ముందు రాబిన్ లే నార్మాండ్, డాని కార్వాజల్ ఇద్దరూ సస్పెండ్ అయ్యారు. మరోవైపు , యువ మిడ్‌ఫీల్డర్ పెడ్రీ టోని క్రూస్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. ఈ క్రమంలో డిఫెన్స్‌లో రాబిన్ లే నార్మాండ్, డాని కార్వాజల్ స్ధానాలను నాచో, జీసస్ నెవాస్ భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా పెడ్రీ ప్రత్యామ్నాయంగా వచ్చిన డాని ఓల్మో ప్లేయింగ్‌లో తన స్దానాన్ని సుస్థిరం చేసుకోనున్నాడు.స్పెయిన్ జోరును ఫ్రాన్స్ అడ్డుకుంటుందా?ఇక సెమీస్‌కు ముందు ఫ్రాన్స్ టీమ్‌లో ఎటవంటి గాయాలు, కార్డ్ సస్పెన్షన్లు లేవు. జట్టు మొత్తం క్లియర్‌గా ఉంది. కానీ ఫ్రాన్స్ సెమీస్‌కు వచ్చినప్పటికి తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. గోల్స్ సాధించడంలో ఫ్రాన్స్ తమ మార్క్ చూపించలేకపోయింది. కెప్టెన్ కైలియన్ ఎంబాపే గాయం కావడం ఫ్రాన్స్‌ను కాస్త దెబ్బతీసింది. అతడు తిరిగి జట్టులోకి వచ్చినప్పటి మునపటి జోరును ప్రదర్శించలేకపోతున్నాడు. సెమీఫైనల్లోనైనా ఎంబాపే సత్తాచాటుతాడో లేదో వేచి చూడాలి. కాగా సెమీఫైనల్ చేరే క్రమంలో స్పెయిన్ 11 గోల్స్ చేయగా... ఫ్రాన్స్ కేవలం మూడు గోల్స్ మాత్రమే సాధించింది. -
అమెరికన్ జట్టు సహ యజమానిగా అశ్విన్
న్యూఢిల్లీ: భారత సీనియర్ స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ చెస్‌లో అడుగు పెట్టాడు. గ్లోబల్ చెస్ లీగ్‌లో ఈసారి కొత్తగా చేరిన అమెరికన్ గ్యాంబిట్స్ జట్టుకు అశ్విన్ సహ యజమానిగా ఉన్నాడు. గత ఏడాది పోటీపడిన చింగారీ గల్ఫ్ టైటాన్స్ జట్టు స్థానంలో కొత్తగా అమెరికన్ గ్యాంబిట్స్ జట్టు వచ్చింది.టెక్ మహీంద్రా, అంతర్జాతీయ చెస్ సమాఖ్యసంయుక్త ఆధ్వర్యంలో గత ఏడాది దుబాయ్‌లో తొలి గ్లోబల్ చెస్ లీగ్ జరిగింది. ఈ ఏడాది టోర్నీకి లండన్ నగరం వేదిక కానుంది. అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు ఆరు జట్ల మధ్య గ్లోబల్ చెస్ లీగ్ రెండో ఎడిషన్ జరగనుంది. ఫైనల్ బెర్త్ ఎవరిదో! మ్యూనిక్: ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచి జోరు మీదున్న స్పెయిన్... నిలకడలేమితో సతమతమవుతున్న ఫ్రాన్స్... ‘యూరో’ కప్ ఫుట్‌బాల్ టోర్నీ లో ఫైనల్లో చోటు కోసం నేడు తొలి సెమీఫైనల్లో ‘ఢీ’కొననున్నాయి. సెమీఫైనల్ చేరే క్రమంలో స్పెయిన్ 11 గోల్స్ చేయగా... ఫ్రాన్స్ మూడు గోల్స్ సాధించింది. ‘యూరో’ టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య ఆరు మ్యాచ్‌లు జరిగాయి. నాలుగుసార్లు ఫ్రాన్స్ గెలుపొందగా...ఒక మ్యాచ్ ‘డ్రా’గా ముగిసి, ఒక మ్యాచ్‌లో స్పెయిన్ నెగ్గింది. తొలి విజయం కోసం... అంతర్జాతీయ మహిళల ఫుట్‌బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్‌ల్లో భాగంగా మయన్మార్ జట్టుతో భారత జట్టు రెండు మ్యాచ్‌లు ఆడనుంది. యాంగూన్‌లో నేడు జరిగే తొలి మ్యాచ్‌లో ఆశాలతా దేవి సారథ్యంలో భారత్ బరిలోకి దిగనుంది. తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ కూడా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించనుంది.ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 67వ స్థానంలో ఉన్న భారత జట్టు ఇప్పటివరకు ఐదుసార్లు మయన్మార్ జట్టుతో తలపడినా ఒక్కసారీ విజయం సాధించలేదు. నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన టీమిండియా ఒక మ్యాచ్‌ను మాత్రం ‘డ్రా’ చేసుకుంది. -
యూరో కప్-2024 సెమీస్ బెర్తులు ఖరారు..
జర్మనీ వేదికగా జరుగుతున్న యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీ-2024లో సెమీఫైనల్ బెర్త్‌లు అధికారకంగా ఖరారయ్యాయి. శనివారం రాత్రి స్విట్జర్లాండ్‌తో ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో విజయం సాధించిన ఇంగ్లండ్ మూడో జట్టుగా సెమీస్‌కు అర్హత సాధించగా.. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టర్కీని ఓడించి నెదర్లాండ్స్ నాలుగో జట్టుగా సెమీస్‌లో అడుగుపెట్టింది.ఇంగ్లండ్-స్విట్జర్లాండ్ మ్యాచ్ నిర్ణీత సమయానికి 1-1తో సమమైంది. కానీ పెనాల్టీ షూటౌట్లో ఇంగ్లండ్ 5 గోల్స్ చేయగా స్విస్ జట్టు 3 గోల్స్‌కే పరిమితమై ఓటమి చవి చూసింది. మరోవైపు నాలుగో క్వార్టర్స్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 2-1తో టర్కీని ఓడించింది.కాగా యూరో కప్ సెమీఫైనల్లో నెదర్లాండ్స్ అడుగుపెట్టడం 20 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా ఇప్పటికే ఫ్రాన్స్, స్పెయిన్ తమ సెమీఫైనల్స్ బెర్త్‌లను ఖారారు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక మంగళవారం జరిగే తొలి సెమీఫైనల్లో స్పెయిన్‌తో ఫ్రాన్స్; బుధవారం జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో నెదర్లాండ్స్ తలపడతాయి. -
20 ఏళ్ల తర్వాత సెమీఫైనల్లో నెదర్లాండ్స్
బెర్లిన్: యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో రెండు దశాబ్దాల తర్వాత నెదర్లాండ్స్ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. టర్కీ జట్టుతో ఆదివారం జరిగిన చివరి క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. 35వ నిమిషంలో సామెత్ అకెదిన్ గోల్‌తో టర్కీ ఖాతా తెరిచింది. 70వ నిమిషంలో డెవ్రిజ్ గోల్‌తో నెదర్లాండ్స్ స్కోరును 1–1తో సమం చేసింది. 76వ నిమిషంలో టర్కీ ప్లేయర్ మెర్ట్ ముల్డర్ ‘సెల్ఫ్ గోల్’ చేయడంతో నెదర్లాండ్స్ 2–1తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని నెదర్లాండ్స్ కాపాడుకొని 2004 తర్వాత మళ్లీ యూరో టోరీ్నలో సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మంగళవారం జరిగే తొలి సెమీఫైనల్లో స్పెయిన్‌తో ఫ్రాన్స్; బుధవారం జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో నెదర్లాండ్స్ తలపడతాయి. -
సెమీఫైనల్లో ఫ్రాన్స్
హాంబర్గ్: యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో మాజీ చాంపియన్ ఫ్రాన్స్ సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ ‘షూటౌట్’ ద్వారా మరో మాజీ విజేత పోర్చుగల్‌ను ఓడించింది. నిర్ణీత సమయంతో పాటు అదనపు సమయం ముగిశాక కూడా ఇరు జట్లు 0–0తో సమంగా నిలవగా షూటౌట్ అనివార్యమైంది. ఇందులో ఫ్రాన్స్ 5–3తో పోర్చుగల్‌పై విజయం సాధించింది. ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడైన క్రిస్టియానో రొనాల్డో తన జాతీయ జట్టు తరఫున ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. ఆరో సారి యూరో కప్‌లో బరిలోకి దిగిన రొనాల్డో ముందే ఇది తనకు చివరి యూరో అని ప్రకటించాడు. 2026 వరల్డ్ కప్‌లో 41 ఏళ్లు ఉండే అతను వరల్డ్ కప్ ఆడే అవకాశాలు దాదాపుగా లేవు! పేరుకు రెండు పెద్ద జట్లే అయినా ఈ క్వార్టర్స్ పోరు పెద్దగా ఉత్కంఠ, మలుపులు లేకుండా సాగింది. ఇరు జట్లూ కూడా డిఫెన్స్‌కే ప్రాధాన్యనివ్వడంతో ఆటలో వేగం కనిపించలేదు. అటు రొనాల్డో, ఇటు ఎంబాపె కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. పోర్చుగల్ ప్లేయర్లలో బ్రూనో ఫెర్నాండెజ్, వితిన్హ కొట్టిన షాట్లను ప్రత్యర్థి గోల్‌కీపర్ మైక్ మెగ్నన్ నిలువరించగా...ఫ్రాన్స్ ఆటగాళ్లు రాండల్, కామవింగాలకకు గోల్స్ అవకాశం వచి్చనా కీపర్ రూబెన్ డయాస్‌ను దాటి బంతి వెళ్లలేకపోయింది. అదనపు సమయంలో రొనాల్డో కొట్టిన ఒక కిక్ కూడా గోల్ బార్ మీదనుంచి వెళ్లిపోయింది. ఇక ఆ తర్వాత ఇరు జట్లు జాగ్రత్తగానే ఆడాయి. షూటౌట్లో తొలి నాలుగు ప్రయత్నాల్లో ఫ్రాన్స్ తరఫున డెంబెలె, ఫొఫానా, కౌండే, బార్కొలా గోల్స్ కొట్టగా...పోర్చుగల్ తరఫున రొనాల్డో, బెర్నార్డో సిల్వ, న్యూనో మెండెస్ గోల్ సాధించగా జోవో ఫెలిక్స్ విఫలమయ్యాడు. దాంతో స్కోరు ఫ్రాన్స్ పక్షాన 4–3తో నిలిచింది. ఐదో షాట్‌ను కూడా ఫ్రాన్స్ ప్లేయర్ హెర్నాండెజ్ గోల్ సాధించి తమ జట్టును గెలిపించాడు. మరో క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 2–1 తేడాతో ఆతిథ్య జర్మనీని ఓడించింది. శనివారం జరిగిన క్వార్టర్స్‌లో ఇంగ్లండ్ షూటౌట్లో 5–3తో స్విట్జర్లాండ్‌ను ఓడించి సెమీస్ చేరింది. -
EURO 2024: పోర్చుగల్ అవుట్.. చివరి మ్యాచ్ ఆడేసిన రొనాల్డో!
యూరో కప్-2024 ఫుట్‌బాల్ టోర్నీలో మాజీ చాంపియన్ పోర్చుగల్‌కు చేదు అనుభవం ఎదురైంది. కీలకమైన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ చేతిలో ఓడిపోయింది. తద్వారా రిక్తహస్తాలతో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.ఈ క్రమంలో ప్రతిష్టాత్మక యూరో కప్ టోర్నీలో పోర్చుగల్ లెజెండరీ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో శకం ముగిసినట్లయింది. కాగా జర్మనీ వేదికగా జరుగుతున్న యూరో కప్ 2024 ఎడిషన్‌లో స్లొవేనియాను ఓడించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టిన పోర్చుగల్.. తాజాగా ఫ్రాన్స్‌తో తలపడింది.ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకనూట ఇరవై నిమిషాల పాటు సాగిన ఈ కీలక మ్యాచ్‌లో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. ఈ నేపథ్యంలో పెనాల్టి షూటౌట్లో భాగంగా ఫ్రాన్స్ 5-3తో పోర్చుగల్‌పై పైచేయి సాధించింది. ఈ క్రమంలో కెలియన్ ఎంబాపే బృందం సెమీస్‌కు దూసుకెళ్లింది.మరోవైపు భారీ అంచనాలతో టోర్నీలో అడుగుపెట్టిన పోర్చుగల్ ఇంటిబాట పట్టింది. కాగా 39 ఏళ్ల రొనాల్డోకు జాతీయ జట్టు తరఫున ఇదే చివరి మ్యాచ్ కానుంది. ఇందుకు సంబంధించి ఈ పోర్చుగల్ ఆటగాడు ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు.ఇక ఆరోసారి యూరో కప్‌లో భాగమైన రొనాల్డో ఈ టోర్నీలో రికార్డు స్థాయిలో 14 గోల్స్ సాధించాడు. అయితే, ఈసారి మాత్రం షూటౌట్లో మినహా గోల్స్ స్కోర్ చేయలేకపోయాడు.పోర్చుగల్ వీరుడిగానే కాదు..అంతర్జాతీయ ఫుట్‌బాల్ చరిత్రలో క్రిస్టియానో రొనాల్డో అత్యధిక గోల్స్ వీరుడిగా కొనసాగుతున్నాడు. పోర్చుగల్ తరఫున అతడు 130 గోల్స్ కొట్టాడు.మరోవైపు.. అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ 108 గోల్స్‌తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, మెస్సీ ఖాతాలో వరల్డ్‌కప్ ఉండగా.. రొనాల్డోకు మాత్రం ఆ లోటు అలాగే ఉండిపోయింది. కాగా యూరో కప్-2024లో ఫ్రాన్స్ సెమీ ఫైనల్లో స్పెయిన్‌తో తలపడనుంది. -
EURO CUP 2024: ఉత్కంఠ పోరులో ఆస్ట్రియాపై విజయం.. క్వార్టర్ ఫైనల్లో తుర్కియే
యూరో కప్ 2024 క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లన్నీ ఖరారయ్యాయి. స్పెయిన్, జర్మనీ, పోర్చుగల్, ఫ్రాన్స్, ఇంగ్లండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, తుర్కియే జట్లు ఫైనల్ 8కి అర్హత సాధించాయి. ఇవాళ (జులై 3) జరిగిన చివరి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో ఆస్ట్రియాపై తుర్కియే 2-1 గోల్స్ తేడాతో గెలిచింది. Mert Günok's incredible 95th-minute save 🤯😱#EUROLastMinute | @Hublot pic.twitter.com/N2AImAbc7A— UEFA EURO 2024 (@EURO2024) July 2, 2024తుర్కియే తరఫున మెరి దెమిరల్ రెండు గోల్స్ చేయగా.. ఆస్ట్రియా తరఫున మైఖేల్ గ్రెగోరిచ్ గోల్ చేశాడు. చివరి నిమిషంలో తుర్కియే గోల్‌కీపర్ మెర్ట్ గునాక్ అద్భుతమైన స్టాప్‌తో మ్యాచ్ డ్రా కాకుండా చేశాడు. మరోవైపు, నిన్న జరిగిన మరో రౌండ్ ఆఫ్ 16 (ప్రీ క్వార్టర్ ఫైనల్స్) మ్యాచ్‌లో రొమేనియాపై నెదర్లాండ్స్ 3-0 గోల్స్ తేడాతో గెలుపొంది, క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది.క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్..స్పెయిన్ వర్సెస్ జర్మనీ (జులై 5)పోర్చుగల్ వర్సెస్ ఫ్రాన్స్ (జులై 6)ఇంగ్లండ్ వర్సెస్ స్విట్జర్లాండ్ (జులై 6)నెదర్లాండ్స్ వర్సెస్ తుర్కియే (జులై 7) -
Euro Cup 2024: క్వార్టర్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్న ఎంబపే, రొనాల్డో జట్లు
యూరో కప్ 2024లో ఆరు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. స్పెయిన్, జర్మనీ, ఇంగ్లండ్, స్విట్జర్లాండ్, పోర్చుగల్, ఫ్రాన్స్ జట్లు ఫైనల్-8కు చేరాయి. మరో రెండు బెర్త్‌లు ఖరారు కావల్సి ఉంది.ఇవాళ (జులై 2) జరిగిన మ్యాచ్‌లో క్రిస్టియానో రొనాల్డో జట్టు పోర్చుగల్.. స్లొవేనియాపై 3-0 గోల్స్ తేడాతో గెలుపొందింది. నిర్ణీత సమయంతో పాటు (90 నిమిషాలు) అదనపు సమయంలోనూ (30 నిమిషాలు) గోల్స్ నమోదు కాకపోవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్ల వరకు వెళ్లింది. పెనాల్టీ షూటౌట్స్‌లో పోర్చుగల్ మూడు అవకాశాలను గోల్స్‌గా మలచగా.. స్లొవేనియా మూడు అవకాశాలను వృధా చేసుకుంది. పోర్చుగల్ గోల్ కీపర్ డియోగో కోస్టా అద్భుతమైన ప్రదర్శన కనబర్చి స్లోవేనియా మూడు ప్రయత్నాలను అడ్డుకున్నాడు. నిర్ణీత సమయంలో లభించిన పెనాల్టీని గోల్‌గా మలచడంలో విఫలమైన క్రిస్టియానో రొనాల్డో.. షూటౌట్స్‌లో ఓ గోల్ చేశాడు. పోర్చుగల్ క్వార్టర్ ఫైనల్లో కైలియన్ ఎంబపే జట్టు ఫ్రాన్స్‌తో తలపడనుంది.క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్..స్పెయిన్ వర్సెస్ జర్మనీ (జులై 5)పోర్చుగల్ వర్సెస్ ఫ్రాన్స్ (జులై 6)ఇంగ్లండ్ వర్సెస్ స్విట్జర్లాండ్ (జులై 6)నాలుగో క్వార్టర్ ఫైనల్ (జులై 7) -
స్పెయిన్ ‘హ్యాట్రిక్’
డసెల్డార్ఫ్ (జర్మనీ): యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో మాజీ చాంపియన్ స్పెయిన్ జట్టు ‘హ్యాట్రిక్’ విజయం నమోదు చేసింది. గ్రూప్ ‘బి’లో భాగంగా అల్బేనియాతో జరిగిన లీగ్ మ్యాచ్ లో స్పెయిన్ 1–0 గోల్ తేడాతో గెలిచింది. ఆట 13వ నిమిషంలో స్పెయిన్ జట్టుకు ఫెరాన్ టోరెస్ ఏకైక గోల్ అందించాడు. మూడు విజయాలతో స్పెయిన్ తొమ్మిది పాయింట్లతో గ్రూప్ ‘బి’ టాపర్‌గా నిలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. గ్రూప్ ‘బి’లో భాగంగా క్రొయేషియా జట్టుతో జరిగిన మ్యాచ్‌ను డిఫెండింగ్ చాంపియన్ ఇటలీ 1–1తో ‘డ్రా’ చేసుకుంది. క్రొయేíÙయా తరఫున లూకా మోడ్రిచ్ (55వ ని.లో), ఇటలీ తరఫున జకాగ్ని (90+8వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. యూరో టోర్నీ చరిత్రలో గోల్ చేసిన అతి పెద్ద వయస్కుడిగా మోడ్రిచ్ (38 ఏళ్ల 289 రోజులు) గుర్తింపు పొందాడు. నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన ఇటలీ జట్టు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. గ్రూప్ ‘డి’లో జరిగిన మ్యాచ్‌ల్లో ఆస్ట్రియా 3–2తో నెదర్లాండ్స్‌ను ఓడించగా... ఫ్రాన్స్, పోలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. ‘డి’ గ్రూప్ నుంచి ఆస్ట్రియా, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాయి. -
Euro Cup 2024: సెల్ఫ్ గోల్‌తో ఓడిన ఇటలీ
గెల్సెన్కిర్చెన్ (జర్మనీ): యూరో కప్ ఫుట్‌బాల్ టోరీ్నలో డిఫెండింగ్ చాంపియన్ ఇటలీ జట్టుకు చుక్కెదురైంది. మాజీ విజేత స్పెయిన్‌తో శుక్రవారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో ఇటలీ 0–1 గోల్ తేడాతో ఓడిపోయింది.మరోవైపు.. వరుసగా రెండో విజయంతో స్పెయిన్ జట్టు ప్రిక్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. ఆట 55వ నిమిషంలో స్పెయిన్ ఫార్వర్డ్ అల్వారో మొరాటో హెడర్ షాట్‌ను ఇటలీ గోల్‌కీపర్ గియాన్లుగి డొనారుమా నిలువరించాడు.అయితే ఇటలీ గోల్‌కీపర్ నిలువరించిన బంతి ఇటలీ డిఫెండర్ రికార్డో కాలాఫియోరి కాలికి తగిలి తిరిగి గోల్‌పోస్ట్‌లోకి వెళ్లింది. దాంతో ఇటలీ సెల్ఫ్ గోల్‌తో స్పెయిన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లి చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. ఇతర మ్యాచ్‌ల్లో ఆస్ట్రియా 3–1తో పోలాండ్ జట్టుపై, ఉక్రెయిన్ 2–1తో స్లొవేకియాపై గెలిచాయి. చదవండి: T20 WC 2024: దక్షిణాఫ్రికా సూపర్... -
ఇంగ్లండ్, డెన్మార్క్ మ్యాచ్ ‘డ్రా’
ఫ్రాంక్ఫర్ట్ (జర్మనీ): యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో గత రన్నరప్ ఇంగ్లండ్ జట్టు ఖాతాలో తొలి ‘డ్రా’ చేరింది. డెన్మార్క్‌తో గురువారం జరిగిన గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌ను ఇంగ్లండ్ 1–1 గోల్స్‌తో ‘డ్రా’గా ముగించింది. ఇంగ్లండ్ తరఫున ఆట 18వ నిమిషంలో హ్యారీ కేన్ గోల్ చేయగా... 34వ నిమిషంలో హిజుల్మండ్ గోల్‌తో డెన్మార్క్ జట్టు స్కోరును సమం చేసింది. ఆ తర్వాత రెండు జట్లు మరో గోల్ చేయలేకపోయాయి. గ్రూప్ ‘ఎ’లో స్కాట్లాండ్, స్విట్జర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో... గ్రూప్ ‘సి’లో స్లొవేనియా, సెర్బియా మధ్య జరిగిన మ్యాచ్ కూడా 1–1తో ‘డ్రా’గా ముగిశాయి. -
Euro Cup 2024: బోణీ కొట్టిన రొనాల్డో టీమ్
యూరో కప్ 2024లో దిగ్గజ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో జట్టు పోర్చుగల్ బోణీ కొట్టింది. గ్రూప్-ఎఫ్‌లో భాగంగా ఇవాళ (జూన్ 19) జరిగిన మ్యాచ్‌లో పోర్చుగల్.. చెక్ రిపబ్లిక్‌పై 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి అర్ద భాగంలో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా సాధించలేదు. ద్వితియార్ధంలో తొలుత (62వ నిమిషంలో, లుకాస్ ప్రొవోద్) చెక్ రిపబ్లిక్, ఆతర్వాత పోర్చుగల్ (69వ నిమిషంలో, రాబిన్ హ్రనాక్) గోల్స్ చేయడంతో స్కోర్లు సమం అయ్యాయి. అయితే నిర్ణీత సమయం ముగిశాక 92వ నిమిషంలో ఫ్రాన్సిస్కో అద్భుతమైన గోల్ చేయడంతో పోర్చుగల్ 2-1 తేడాతో విజయం సాధించింది.చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డోచెక్ రిపబ్లిక్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో చరిత్ర సృష్టించాడు. రొనాల్డో ఆరు యూరో కప్‌లు ఆడిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. రొనాల్డో 2004, 2008, 2012, 206, 2020, 2024 ఎడిషన్లలో పాల్గొన్నాడు. రొనాల్డో తర్వాత క్రొయేషియా ఆటగాడు లూకా మోడ్రిక్, పోర్చుగల్ ఆటగాడు పెపె అత్యధికంగా ఐదు యూరో కప్‌లు ఆడాడు.జార్జియాను చిత్తు చేసిన తుర్కియేగ్రూప్-ఎఫ్‌లో భాగంగా నిన్న జరిగిన మరో మ్యాచ్‌లో జార్జియాపై తుర్కియే 3-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. తుర్కియే తరఫున మెర్ట్ ముల్దర్ (25వ నిమిషం), ఆర్దా గులెర్ (65వ నిమిషం), ముహమ్మెద్ కెరెమ్ (97వ నిమిషం) గోల్స్ చేయగా.. జార్జియా తరఫున జార్జెస్ 32వ నిమిషంలో గోల్ చేశాడు.ఇవాల్టి మ్యాచ్‌లు..క్రొయేషియా వర్సెస్ అల్బేనియా (గ్రూప్-బి)జర్మనీ వర్సెస్ హంగేరీ (గ్రూప్-ఏ) -
EURO 2024: కళ్లుచెదిరే గోల్.. 24 ఏళ్ల తర్వాత తొలి విజయం
యూరో కప్-2024ను రొమేనియా ఘనంగా ఆరంభించింది. సోమవారం మ్యూనిచ్ వేదికగా గ్రూపు-ఈలో భాగంగా ఉక్రెయిన్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో 3-0 తేడాతో రొమేనియా ఘన విజయం సాధించింది. కాగా 24 ఏళ్ల యూరో ఛాంపియన్ షిప్ చరిత్రలో రొమేనియాకు ఇదే తొలి విజయం కావడం విశేషం.కళ్లుచెదిరే గోల్..ఈ మ్యాచ్ ఫస్ట్‌హాఫ్ హోరాహోరీగా సాగింది. తొలి 20 నిమిషాల పాటు ఇరు జట్ల గోల్ కీపర్స్ ఎటువంటి గోల్స్ సాధించేందుకు అవకాశమివ్వలేదు. ఈ క్రమంలో ఫస్ట్ హాఫ్‌లో 29వ నిమిషాన రొమేనియా కెప్టెన్ నికోలే స్టాన్సియు అద్బుతమైన గోల్‌తో మెరిశాడు. రజ్వాన్ మారిన్ నుంచి పాస్ అందుకున్న స్టాన్సియు రైట్ కార్నర్ వైపు నుంచి కళ్లుచెదిరే రీతిలో గోల్ కొట్టాడు. స్టాన్సియు పవర్ ఫుల్ కెనాన్ షాట్‌ను ఉక్రెయిన్ గోల్ కీపర్ ఆండ్రీ లునిన్ ఆపలేకపోయాడు. దీంతో ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి రొమినేయా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం సెకెండ్ హాఫ్‌లో రజ్వాన్ మారిన్, డెన్నిస్ మాన్ చెరో గోల్ సాధించి రొమేనియాకు చారిత్రత్మక విజయాన్ని అందించారు. 🇷🇴🚀 This goal from Nicolae Stanciu (31) vs Ukraine is absolutely incredible! 😍Hit with sweet perfection. 🤌 pic.twitter.com/LJGDwsHAJS— EuroFoot (@eurofootcom) June 17, 2024 -
ఫ్రాన్స్‌కు బిగ్ షాక్.. ఎంబాపేకు తీవ్ర గాయం! టోర్నీ నుంచి ఔట్?
యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీ-2024లో ఫ్రాన్స్ శుభారంభం చేసింది. సోమవారం డసెల్డార్ఫ్ అరేనా వేదికగా ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్‌లో 1-0 తేడాతో ఫ్రాన్స్ విజయం సాధించింది. 90 నిమిషాల గేమ్‌లో ఫ్రాన్స్ ఒక్క గోల్ సాధించగా.. ఆస్ట్రియా మాత్రం ఒక్కగోల్ కూడా నమోదు చేయలేకపోయింది.ఫ్రాన్స్‌కు బిగ్ షాక్..ఇక ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ కెప్టెన్, స్టార్ ప్లేయర్ కైలియన్ ఎంబాపె గాయపడ్డాడు. ఎంబాపే ముక్కుకు బలమైన గాయమైంది. ఈ మ్యాచ్ 86వ నిమిషంలో ఎంబాపే, ఆస్ట్రియన్ ఫార్వడ్డర్ కెవిన్ డాన్సో ఇద్దరూ అనూహ్యంగా ఒకరొకరు ఢీకొన్నారు.ఈ క్రమంలో కెవిన్ డాన్సో భుజం ఎంబాపే ముక్కుకు బలంగా తాకింది. దీంతో అతడి ముక్కు నుంచి రక్తస్రావం ప్రారంభమైంది. వెంటనే ఫిజియో వచ్చి ఎంబాపేకు చికిత్స అందించాడు. అయినప్పటకి రక్తం ఆగకపోవడంతో మైదానం నుంచి అతడిని బయటకు తీసుకువెళ్లారు. మ్యాచ్ అనంతరం అతడిని ఆస్పత్రికి తీసుకువెళ్లి స్కానింగ్ చేయించగా.. ముక్కు ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు. ఈ క్రమంలో ఎంబాపే గాయంపై ఫ్రెంచ్ ఫుట్‌బాల్ సమాఖ్య అప్డేట్ ఇచ్చింది. ముక్కు ఎముక విరిగినట్లు ఎఫ్ఎఫ్ఎఫ్ సైతం ధువీకరించింది."కైలియన్ ఎంబాపే ఆస్పత్రి నుంచి తిరిగి ఫ్రెంచ్ జట్టు బేస్ క్యాంప్‌నకు తిరిగి వచ్చాడు. సోమవారం డ్యూసెల్డార్ఫ్లో జరిగిన ఆస్ట్రియా-ఫ్రాన్స్ మ్యాచ్ సెకెండ్ హాఫ్‌లో ఎంబాపే ముక్కుకు గాయమైంది. దురదృష్టవశాత్తూ అతడి ముక్కు ఎముక ఫ్రాక్చర్ అయింది. మా కెప్టెన్‌కు తొలుత వైద్య సిబ్బంది చికిత్స అందించగా.. ఆ తర్వాతి ఆస్పత్రిలో డాక్టర్ ఫ్రాంక్ లే గాల్ పరిశీలించారు. అతడికి ముక్కు ఎముక విరిగినట్లు ఫ్రాంక్ లే నిర్ధారించాడు. అతడు కొద్ది రోజుల పాలు మా వైద్య బృందం పర్యవేక్షణలో ఉండనున్నాడు.అయితే ఎంబాపేకు వెంటనే సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. అతడు గాయం నుంచి కోలుకునేందుకు వైద్యులు ప్రత్యేకమైన మాస్క్‌ను ఇవ్వనున్నారు. అతడు తిరిగి మళ్లీ మైదానంలో అడుగుపెడతాడని ఆశిస్తున్నామని ఎఫ్ఎఫ్ఎఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఒకవేళ ఎంబాపే టోర్నీ మొత్తానికి దూరమైతే ఫ్రాన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి.🚨🇫🇷 Kylian Mbappé has just left the hospital after it was confirmed that he broke his nose.Mbappé will not undergo surgery despite initial indications, waiting to decide how to manage him for upcoming two games. pic.twitter.com/Fhbhft1OAO— Fabrizio Romano (@FabrizioRomano) June 17, 2024 -
వెఘొర్స్ 'సూపర్ గోల్'.. నెదర్లాండ్స్ సంచలన విజయం
యూరో కప్-2024లో నెదర్లాండ్స్ బోణీ కొట్టింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఆదివారం హాంబర్గ్ వేదికగా పోలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-1తో నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించింది. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ గేమ్‌లో ఆఖరికి విజయం డచ్ జట్టునే వరించింది.తొలుత ఫస్ట్‌హాఫ్ 16వ నిమిషంలో ఆడమ్ బుకస పోలండ్‌కు మొదటి గోల్‌ను అందించాడు. అనంతరం 29వ నిమిషంలో నెదర్లాండ్స్ ఫార్వర్డ్ కోడి గక్పో అద్బుతమైన గోల్ కొట్టి స్కోర్‌ను 1-1తో సమం చేశాడు.ఫస్ట్‌హాఫ్ ముగిసే సమయానికి ఇరు జట్లు చెరో గోల్‌తో సమంగా నిలిచాయి. ఈ క్రమంలో బ్రేక్ సమయంలో పొలాండ్ మేనెజర్ మిచాల్ ప్రోబియర్జ్ తమ జట్టులో ఒక మార్పు చేశాడు. జాకుబ్ మోడర్‌కు బదలుగా ఇంపాక్ట్ సబ్‌గా స్జిమాన్స్కీ జాకుబ్ తీసుకువచ్చాడు.కానీ ఎటువంటి ఫలితం లేదు. దీంతో ప్రోబియర్జ్ మళ్లీ 10 నిమిషాల తర్వాత మరో రెండు మార్పులు చేశాడు. కానీ ఫలితం ఏ మాత్రం మారలేదు. ఇక సెకెండ్ హాఫ్ ముగిసే సమయం దగ్గరపడుతుండడంతో 1-1 డ్రాగా ముగుస్తుందని అంతా భావించారు.వౌట్ వెఘొర్స్ అద్బుతం..ఈ క్రమంలో డచ్ మేనేజర్ రోనాల్డ్ కోమాన్ తీసుకున్న ఓ నిర్ణయం అందరి అంచనాలను తారుమారు చేసింది. ఆఖరి బ్రేక్ సమయంలో రోనాల్డ్ కోమాన్.. మెంఫిస్ డిపే స్థానంలో వౌట్ వెఘోర్స్ట్ని ఇంపాక్ట్ సబ్‌స్ట్యూట్‌గా తీసుకువచ్చాడు.మైదానంలో అడుగపెట్టిన వెఘొర్స్.. ఆట మరికొద్దిసేపట్లో ముగుస్తుందనగా 83వ నిమిషంలో గోల్‌కొట్టి డచ్ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. దీంతో నెదర్లాండ్స్ జట్టు ఒక్కసారిగా సంబరాల్లో మునిగి తేలిపోగా.. పొలాండ్ నిరాశలో కూరుకు పోయింది.చదవండి: ఆర్చరీలో భారత్‌కు ఒలింపిక్ బెర్త్ -
Euro 2024: యూరో కప్‌లో బోణీ కొట్టిన జర్మనీ, స్విట్జర్లాండ్
ఫుట్‌బాల్ అభిమానులు ఆసక్తికగా ఎదురుచూసిన ప్రతిష్ఠాత్మక యూరో కప్-2024కు తెర లేచింది. ఈ టోర్నమెంట్లో ఆతిథ్య జర్మనీ శుభారంభం చేసింది. శనివారం మ్యూనిక్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో స్కాట్లాండ్పై 5-1తో జర్మనీ అద్భుత విజయం సాధించింది.ఈ తొలిపోరులో ఏ దశలోనూ పత్యర్ధికి జర్మనీ అవకాశమివ్వలేదు. ఈ మ్యాచ్ 10వ నిమిషంలో ఫ్లోరియన్ విర్ట్జ్ జర్మనీకి తొలి గోల్‌ను అందించాడు. ఆ తర్వాత జమాల్ ముసియాలా, కై హావర్ట్జ్ ఫస్ట్‌హాఫ్‌లో మరో రెండు గోల్స్‌ను అందించారు. దీంతో ఫస్ట్‌హాఫ్ ముగిసేసరికి జర్మనీ 3-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సెకెండ్ హాఫ్‌లో కూడా జర్మనీ అదరగొట్టింది. ఇక ఈ విజయంతో జర్మనీ ఖాతాలో మూడు పాయింట్లు వచ్చి చేరాయి. అనంతరం జరిగిన మరో మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. హంగేరీ జట్టుపై 3-1తో స్విస్ జట్టు ఘన విజయం నమోదు చేసింది. ఇక ఈ మెగా టోర్నీ జర్మనీలోని 10 పట్టణాల్లో జరగనుంది. మొత్తం 24 జట్లను ఆరు గ్రూప్‌లుగా విభజించారు. ఈ టోర్నీ జూలై 14న బెర్లిన్‌లో జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఇక గ్రూప్ ‘ఎ’లో జర్మనీ, స్కాట్లాండ్, హంగేరి, స్విట్జర్లాండ్... గ్రూప్ ‘బి’లో స్పెయిన్, క్రొయేషియా, ఇటలీ, అల్బేనియా... గ్రూప్ ‘సి’లో ఇంగ్లండ్, స్లొవేనియా, సెర్బియా... గ్రూప్ ‘డి’లో నెదర్లాండ్స్, పోలాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రియా... గ్రూప్ ‘ఇ’లో బెల్జియం, స్లొవేకియా, రొమేనియా, ఉక్రెయిన్... గ్రూప్ ‘ఎఫ్’లో పోర్చుగల్, చెక్ రిపబ్లిక్, జార్జియా, టర్కీ జట్లు ఉన్నాయి.