అమెరికన్ గ్యాంబిట్స్ జట్టుకు సహ యజమానిగా భారత క్రికెటర్
న్యూఢిల్లీ: భారత సీనియర్ స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ చెస్‌లో అడుగు పెట్టాడు. గ్లోబల్ చెస్ లీగ్‌లో ఈసారి కొత్తగా చేరిన అమెరికన్ గ్యాంబిట్స్ జట్టుకు అశ్విన్ సహ యజమానిగా ఉన్నాడు. గత ఏడాది పోటీపడిన చింగారీ గల్ఫ్ టైటాన్స్ జట్టు స్థానంలో కొత్తగా అమెరికన్ గ్యాంబిట్స్ జట్టు వచ్చింది.
టెక్ మహీంద్రా, అంతర్జాతీయ చెస్ సమాఖ్యసంయుక్త ఆధ్వర్యంలో గత ఏడాది దుబాయ్‌లో తొలి గ్లోబల్ చెస్ లీగ్ జరిగింది. ఈ ఏడాది టోర్నీకి లండన్ నగరం వేదిక కానుంది. అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు ఆరు జట్ల మధ్య గ్లోబల్ చెస్ లీగ్ రెండో ఎడిషన్ జరగనుంది.
ఫైనల్ బెర్త్ ఎవరిదో!
మ్యూనిక్: ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచి జోరు మీదున్న స్పెయిన్... నిలకడలేమితో సతమతమవుతున్న ఫ్రాన్స్... ‘యూరో’ కప్ ఫుట్‌బాల్ టోర్నీ లో ఫైనల్లో చోటు కోసం నేడు తొలి సెమీఫైనల్లో ‘ఢీ’కొననున్నాయి.
సెమీఫైనల్ చేరే క్రమంలో స్పెయిన్ 11 గోల్స్ చేయగా... ఫ్రాన్స్ మూడు గోల్స్ సాధించింది. ‘యూరో’ టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య ఆరు మ్యాచ్‌లు జరిగాయి. నాలుగుసార్లు ఫ్రాన్స్ గెలుపొందగా...ఒక మ్యాచ్ ‘డ్రా’గా ముగిసి, ఒక మ్యాచ్‌లో స్పెయిన్ నెగ్గింది.
తొలి విజయం కోసం...
అంతర్జాతీయ మహిళల ఫుట్‌బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్‌ల్లో భాగంగా మయన్మార్ జట్టుతో భారత జట్టు రెండు మ్యాచ్‌లు ఆడనుంది. యాంగూన్‌లో నేడు జరిగే తొలి మ్యాచ్‌లో ఆశాలతా దేవి సారథ్యంలో భారత్ బరిలోకి దిగనుంది. తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ కూడా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించనుంది.
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 67వ స్థానంలో ఉన్న భారత జట్టు
ఇప్పటివరకు ఐదుసార్లు మయన్మార్ జట్టుతో తలపడినా ఒక్కసారీ విజయం సాధించలేదు. నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన టీమిండియా ఒక మ్యాచ్‌ను మాత్రం ‘డ్రా’ చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment