
స్పెయిన్, జర్మనీ బోణీ
* చెక్ రిపబ్లిక్‌పై నెగ్గిన డిఫెండింగ్ చాంపియన్
* ఉక్రెయిన్‌ను ఓడించిన విశ్వవిజేత
* యూరో కప్
తులూజ్ (ఫ్రాన్స్): వరుసగా మూడోసారి చాంపియన్‌గా నిలిచి హ్యాట్రిక్ సాధించాలనుకుంటున్న స్పెయిన్... రెండు దశాబ్దాలుగా ఊరిస్తోన్న టైటిల్‌ను మళ్లీ నెగ్గాలనే పట్టుదలతో ఉన్న జర్మనీ... యూరో ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో శుభారంభం చేశాయి. గ్రూప్ ‘డి’లో భాగంగా సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్ 1-0 గోల్ తేడాతో చెక్ రిపబ్లిక్‌పై కష్టపడి నెగ్గగా...
ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జర్మనీ 2-0తో ఉక్రెయిన్‌ను ఓడించింది. గత రెండు యూరో టోర్నమెంట్‌లలో ఓటమి ఎరుగని స్పెయిన్ తమ జోరును ఈసారీ కొనసాగించింది. అయితే చెక్ రిపబ్లిక్‌పై ఆ జట్టు ఒక్క గోలే చేయగలిగింది. ఆట 87వ నిమిషంలో గెరార్డ్ పీకే హెడర్ షాట్‌తో చెక్ రిపబ్లిక్ గోల్ కీపర్ పీటర్ సెచ్‌ను బోల్తా కొట్టించడంతో స్పెయిన్ ఖాతా తెరిచింది.
అంతకుముందు స్పెయిన్‌కు పలుమార్లు గోల్ చేసే అవకాశాలు వచ్చాయి. అయితే చెక్ రిపబ్లిక్ గోల్ కీపర్ పీటర్ సెచ్ అడ్డుగోడలా నిలబడి స్పెయిన్ బృందంలో ఆందోళన పెంచాడు. కానీ మూడు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా ఎడమవైపు నుంచి ఇనియెస్టా కొట్టిన షాట్ ‘డి’ ఏరియాలో పీకే గాల్లోకి ఎగిరి హెడర్ షాట్‌తో లక్ష్యానికి చేర్చడంతో స్పెయిన్ ఊపిరి పీల్చుకుంది.
సబ్‌స్టిట్యూట్‌గా వస్తూనే: ఉక్రెయిన్‌తో జరి గిన మ్యాచ్‌లో జర్మనీ తరఫున 19వ నిమిషంలో ముస్తాఫీ... 92వ నిమిషంలో (ఇంజ్యురీ టైమ్) బాస్టియన్ ష్వాన్‌స్టీగర్ ఒక్కో గోల్ చేశారు. స్టార్ ప్లేయర్ ష్వాన్‌స్టీగర్ 90వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగాడు. ఆ తర్వాత రెండు నిమిషాలకే గోల్ చేశాడు. ఎడమవైపు నుంచి ఒజిల్ కొట్టిన షాట్‌ను ‘డి’ ఏరియాలో అందుకున్న ష్వాన్‌స్టీగర్ బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపిం చాడు. 2009 తర్వాత ష్వాన్‌స్టీగర్ అంతర్జాతీయ మ్యాచ్‌లో గోల్ చేయడం ఇదే ప్రథమం.
ఐర్లాండ్, స్వీడన్ మ్యాచ్ ‘డ్రా’: గ్రూప్ ‘ఇ’లో భాగంగా స్వీడన్, ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో ‘డ్రా’గా ముగిసింది. 48వ నిమిషంలో హూలాహన్ ఐర్లాండ్‌కు తొలి గోల్ అందించగా... 71వ నిమిషంలో ఐర్లాండ్ ప్లేయర్ క్లార్క్ చేసిన సెల్ఫ్ గోల్‌తో స్వీడన్ స్కోరును సమం చేసింది.
‘యూరో’లో నేడు ఆస్ట్రియా X హంగేరి రా.గం. 9.30 నుంచి పోర్చుగల్ X ఐస్‌లాండ్
రా. గం. 12.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం