Czech Republic
-
నీరజ్ కోచ్‌గా జాన్ జెలెజ్నీ
న్యూఢిల్లీ: జావెలిన్ త్రోలో ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకరు...ఇదే క్రీడాంశంలో సంచలన ప్రదర్శనతో దేశానికి ఒలింపిక్స్ స్వర్ణం అందించిన ఆటగాడు మరొకరు...వీరిద్దరు ఇప్పుడు మరిన్ని రికార్డులను సృష్టించే లక్ష్యంతో జోడీగా మారారు. భారత్ స్టార్ జావెలిన్ త్రోయర్, 2 ఒలింపిక్ పతకాల విజేత నీరజ్ చోప్రా తన కొత్త కోచ్‌గా చెక్ రిపబ్లిక్ దిగ్గజం జాన్ జెలెన్జీని కోచ్‌గా ఎంచుకున్నాడు.రాబోయే 2025 సీజన్‌కు ముందు జత కలిసిన నీరజ్, జెలెజ్నీ అద్భుతమైన ఫలితాలు సాధించాలని పట్టుదలగా ఉన్నారు. 58 ఏళ్ల జెలెజ్నీ 1988 సియోల్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన అనంతరం వరుసగా మూడు ఒలింపిక్స్ (1992, 1996, 2000)లలో స్వర్ణాలు గెలుచుకున్నాడు. మూడు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన అతని పేరిటే జావెలిన్‌ను అతి ఎక్కువ దూరం విసిరిన వరల్డ్ రికార్డు (98.48 మీటర్లు) కూడా ఉంది.2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రజతం సాధించిన నీరజ్‌కు ఇటీవలి వరకు జర్మనీకి చెందిన బయోమెకానిక్స్ ఎక్స్పర్ట్ క్లాస్ బార్టొనిట్జ్ కోచ్‌గా ఉన్నాడు. ‘చిన్నప్పటినుంచి నేను జెలెజ్నీకి వీరాభిమానిని. ఆయన టెక్నిక్ అంటే ఎంతో ఇష్టం. నా ఆటను మెరుగుపర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో ఆయన వీడియోలు చూస్తుండేవాడిని. ఇప్పుడు జెలెజీ్నతో కలిసి పని చేసే అవకాశం రావడం నా అదృష్టం.మా ఇద్దరి త్రోయింగ్ శైలి ఒకటే. మున్ముందు నా కెరీర్లో మరిన్ని అత్యుత్తమ విజయాలు సాధిస్తాననే నమ్మకం ఉంది’ అని నీరజ్ వ్యాఖ్యానించాడు. నీరజ్ ఆట గురించి తనకు బాగా తెలుసని.. ఎంతో మంది అథ్లెట్లు కోచింగ్ కోసం తనను సంప్రదించినా వారందరినీ కాదని భారత ఆటగాడిని ఎంచుకోవడం అతనిలో ప్రతిభను చూసేనని జెలెన్జీ వెల్లడించాడు. గతంలో ఈ దిగ్గజం శిక్షణలోనే జేకబ్ వాలెజ్, విటెస్లావ్ వెసెలి, బార్బరా స్పొటకోవా లాంటి ఆటగాళ్లు ఒలింపిక్స్‌లో పతకాలు గెలుచుకోవడం విశేషం. -
వాళ్లు వచ్చిన తరువాతే ఆడతామన్నారు...
బుడాపెస్ట్ (హంగేరి) వేదికగా 45వ చెస్ ఒలింపియాడ్ టోర్నీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో చెక్ రిపబ్లిక్ జట్టు తమ మంచి మనసును చాటుకుంది. భారత్‌తో మ్యాచ్ సందర్భంగా చెక్ రిపబ్లిక్ గ్రాండ్‌మాస్టర్లు అద్భుతమైన క్రీడా స్పూర్తిని ప్రదర్శించి అందరితో శెభాష్ అనిపించుకుంటున్నారు.అసలేం ఏం జరిగిందంటే?ఈ టోర్నీలో భాగంగా భారత మహిళల జట్టు గురువారం తమ రెండో రౌండ్ మ్యాచ్‌లో SYMA స్పోర్ట్స్ అండ్ కాన్ఫరెన్స్ సెంటర్ వేదికగా చెక్ రిపబ్లిక్‌తో తలపడింది. అయితే తానియా సచ్దేవ్, హారిక ద్రోణవల్లి, వంటికా అగర్వాల్, దివ్య దేశ్‌ముఖ్‌లతో కూడిన భారత బృందం.. వేదిక వద్దకు చేరుకోవడం కాస్త ఆలస్యమైంది.ట్రావిలింగ్లో సమస్యల కారణంగా రెండు బృందాలుగా వేదిక వద్దకు చేరుకున్నారు. టీమిండియాలోని కొంతమంది సభ్యులు వేదిక వద్దకు వచ్చిన వెంటనే టోర్నమెంట్ అధికారులు చెక్ రిపబ్లిక్ ఆటగాళ్లను గడియారం(క్లాక్)ను ప్రారంభించాలని సూచించారు. సరిగ్గా ఇదే సమయంలో చెక్ రిపబ్లిక్ జట్టు తమ క్రీడా స్పూర్తిని చాటుకుంది. భారత జట్టు మొత్తం సభ్యులందరూ వచ్చేవరకు తమ గడియారాలను ప్రారంభించకూడదని వారు నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత సభ్యులందరూ వచ్చాక గేమ్ ప్రారంభమైంది. అయితే ఈ రెండో రౌండ్లో మ్యాచ్‌లో భారత మహిళల జట్టు చెక్ రిపబ్లిక్‌పై 3.5-05 తేడాతో విజయం సాధించారు.చదవండి: అంతా అనుకున్నట్టే జరిగింది.. న్యూజిలాండ్- అఫ్గాన్ టెస్టు రద్దు Due to conveyance issues, the Indian women team arrived late. After some of the team members arrived and the arbiter asked to start the clocks, the Czech Republic players decided not to start the clocks and wait for their opponents. This is true sportsmanship! pic.twitter.com/0GbbWlNcrl— ChessBase India (@ChessbaseIndia) September 12, 2024 -
Euro Cup 2024: బోణీ కొట్టిన రొనాల్డో టీమ్
యూరో కప్ 2024లో దిగ్గజ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో జట్టు పోర్చుగల్ బోణీ కొట్టింది. గ్రూప్-ఎఫ్‌లో భాగంగా ఇవాళ (జూన్ 19) జరిగిన మ్యాచ్‌లో పోర్చుగల్.. చెక్ రిపబ్లిక్‌పై 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి అర్ద భాగంలో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా సాధించలేదు. ద్వితియార్ధంలో తొలుత (62వ నిమిషంలో, లుకాస్ ప్రొవోద్) చెక్ రిపబ్లిక్, ఆతర్వాత పోర్చుగల్ (69వ నిమిషంలో, రాబిన్ హ్రనాక్) గోల్స్ చేయడంతో స్కోర్లు సమం అయ్యాయి. అయితే నిర్ణీత సమయం ముగిశాక 92వ నిమిషంలో ఫ్రాన్సిస్కో అద్భుతమైన గోల్ చేయడంతో పోర్చుగల్ 2-1 తేడాతో విజయం సాధించింది.చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డోచెక్ రిపబ్లిక్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో చరిత్ర సృష్టించాడు. రొనాల్డో ఆరు యూరో కప్‌లు ఆడిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. రొనాల్డో 2004, 2008, 2012, 206, 2020, 2024 ఎడిషన్లలో పాల్గొన్నాడు. రొనాల్డో తర్వాత క్రొయేషియా ఆటగాడు లూకా మోడ్రిక్, పోర్చుగల్ ఆటగాడు పెపె అత్యధికంగా ఐదు యూరో కప్‌లు ఆడాడు.జార్జియాను చిత్తు చేసిన తుర్కియేగ్రూప్-ఎఫ్‌లో భాగంగా నిన్న జరిగిన మరో మ్యాచ్‌లో జార్జియాపై తుర్కియే 3-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. తుర్కియే తరఫున మెర్ట్ ముల్దర్ (25వ నిమిషం), ఆర్దా గులెర్ (65వ నిమిషం), ముహమ్మెద్ కెరెమ్ (97వ నిమిషం) గోల్స్ చేయగా.. జార్జియా తరఫున జార్జెస్ 32వ నిమిషంలో గోల్ చేశాడు.ఇవాల్టి మ్యాచ్‌లు..క్రొయేషియా వర్సెస్ అల్బేనియా (గ్రూప్-బి)జర్మనీ వర్సెస్ హంగేరీ (గ్రూప్-ఏ) -
పన్నూ హత్యకు కుట్ర ఆరోపణలు..
వాషింగ్టన్: ఖలిస్తానీ ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై భారత్‌కు చెందిన నిఖిల్ గుప్తాను చెక్ రిపబ్లిక్ గత వారం అమెరికాకు అప్పగించింది. గుర్తు తెలియని భారతీయ అధికారి ఆదేశాల మేరకు కెనడా, అమెరికా ద్వంద పౌరసత్వమున్న పన్నూను అమెరికా గడ్డపైనే చంపేందుకు నిఖిల్ గుప్తా కిరాయి హంతకుడికి డబ్బులిచి్చనట్లు అమెరికా ఆరోపిస్తోంది. అమెరికా ప్రభుత్వ వినతి మేరకు చెక్ రిపబ్లిక్లో ఉన్న నిఖిల్‌ను అక్కడి ప్రభుత్వం గత ఏడాది అరెస్ట్ చేసింది. అయితే, అమెరికా ఆరోపణలను భారత్ ఖండించింది. నిఖిల్ ప్రస్తుతం అమెరికాలోని బ్రూక్లిన్‌లో ఫెడరల్ మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో ఉన్నారు. -
పన్నూ కేసు: భారత వ్యక్తి అమెరికాకు అప్పగింత!
న్యూయార్క్: సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ హత్య కుట్రలో ప్రమేయం ఉందని నిఖిల్ గుప్తా(52) అనే భారతీయుడిని గతేడాది చెక్ రిపబ్లిక్ అదుపులోకి తీసుకుంది. అమెరికా అనుమతితోనే చెక్ రిపబ్లిక్ నిఖిల్ గుప్పాను అరెస్ట్ చేసింది. తాజాగా సోమవారం ఆయన్ను అమెరికాలోని ఫెడరల్ కోర్టులో ప్రవేశపెట్టి విచారించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిఖిల్ గుప్తా బ్రూక్లిన్‌లోని ఫెడరల్ మెట్రోపాలిటన్ నిర్భంద కేంద్రంలో ఉన్నారని స్థానిక మీడియా పేర్కొంది. చెక్ రిపబ్లిక్ నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించటంతో ఆయన్ను బ్రూక్లిన్ నిర్భంద కేంద్రంలో ఖైదీగా ఉంచినట్లు వెల్లడించింది. అయితే కోర్టు విచారణ కోసం ఆయన్ను అమెరికా తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడికి చేరుకున్న ఒక్కరోజు వ్యవధిలోనే నిఖిల్‌ను కోర్టులో ప్రవేశపెట్టి విచారించనున్నట్లు తెలుస్తోంది. జూన్ 30, 2023న చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్లో నిఖిల్ గుప్తా అరెస్ట్ అరెస్ట్ చేసింది. అయితే ఆయన్ను తమకు అప్పగించాలని అమెరికా కోరిన విషయం తెలిసిందే.ఇక ఇప్పటికే ఫెడరల్ కోర్టు నిఖిల్ గుప్తా.. పన్నూను హత్య చేసేందుకు ఓ వ్యక్తికి 15వేల అమెరికా డాలర్లు ఇచ్చినట్లు అభియోగాలు మోపింది. పన్నూ హత్య కుట్రలో ఓ భారతీయ ప్రభుత్వ అధికారి ప్రమేయం కూడా ఉందని ఆరోపణలు చేసింది. అయితే ఆయన పేరు మాత్రం వెల్లడించలేదు. నిఖిల్ గుప్తాను అమెరికా అప్పగించటం.. యూఎస్ జాతీయ భద్రతా సలహాదారుడు జేక్ సుల్లివన్ వార్షిక ఐసీఈటీ చర్చల్లో ఢిల్లీ పర్యటనకు ముందు చోటు చేసుకుంది. అయితే ఈ విషయంపై భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్‌తో జేక్ సుల్లివన్ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పన్నూ హత్య కుట్ర వెనక భారతీయుల ప్రమేయం ఉందన్న అమెరికా ఆరోపణలను ఇండియా తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. మరోవైపు.. నిఖిల్ గుప్తాపై అన్యాయంగా అభియోగాలు మోపారని అతని తరఫు న్యాయవాది రోహిణి మూసా అన్నారు. ‘‘ నిఖిల్ గుప్తాపై అన్యాయంగా అభియోగాలు మోపారు. పన్నూ హత్యకు కుట్ర చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవు’’ అని రోహిణి భారత సుప్రీం కోర్టుకు లేఖ రాసింది. నిఖిల్ గుప్తా అభియోగాల కేసు విషయంలో చెక్ రిపబ్లిక్ నియమించిన న్యాయవాదిపై అమెరికా ప్రభావం ఉందని ఆమె అన్నారు. -
చెక్ రిపబ్లిక్ అందాలు ఆస్వాదిస్తున్న సైనా.. మరో బ్యూటీ ఎవరంటే? (ఫొటోలు)
-
మిస్ వరల్డ్-2024 కిరీటాన్ని దక్కించుకున్న చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టినా (ఫోటోలు)
-
ప్రపంచ సుందరి 2024
-
మిస్ వరల్డ్‌గా చెక్ రిపబ్లిక్ సుందరి క్రిస్టినా పిజ్కోవా
మిస్ వరల్డ్–2024 కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ సుందర్ క్రిస్టినా పిజ్కోవా గెలుచుకున్నారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం ఫైనల్స్ జరిగాయి. విజేతగా నిలిచిన క్రిస్టినాకు పోలండ్‌కు చెందిన ప్రస్తుత మిస్ వరల్డ్ కరోలినా కిరీటం ధరింపజేశారు. రన్నరప్‌గా మిస్ లెబనాన్ యాస్మినా జెటౌన్ ఎంపికయ్యారు. భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన ముంబై వాసి ఫెమినా మిస్ ఇండియా సిని షెట్టి(22) అయిదో స్థానంతో సరిపెట్టుకున్నారు. మిస్ వరల్డ్ పోటీలకు 28 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యమిచ్చింది. -
చెక్ రిపబ్లిక్లో కాల్పులు.. 15 మంది మృతి
ప్రేగ్: చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్లో జరిగిన కాల్పుల ఘటనలో నిందితుడు సహా 15 మంది చనిపోయారు. మరో 30 మంది వరకు గాయపడ్డారు. జన్ పలాచ్ స్క్వేర్‌కు సమీపంలోని చార్లెస్ యూనివర్సిటీ వద్ద ఓ వ్యక్తి యథేచ్ఛగా కాల్పులకు తెగబడ్డాడు. ఘటనలో మృతి చెందిన నిందితుడు కూడా విద్యార్థేనని పోలీసులు తెలిపారు. -
హెలికాప్టర్ నుంచి కరెన్సీ నోట్ల వర్షం.. ఎగబడ్డ జనం
చెక్ రిపబ్లిక్ ఇన్ఫ్లుయెన్సర్, టీవీ హోస్ట్ కమిల్ బార్టోషేక్ తన ఫాలోయర్లకోసం కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా 10 లక్షల డాలర్లను వారి కోసం హెలికాప్టర్ నుంచి జార విడవడం వైరల్ అవుతోంది. ప్రపంచంలోనే తొలిసారి డాలర్ల వర్షం అంటూ ముందుగానే ప్రకటించి మరీ తన ఫ్యాన్స్‌ను అబ్బుర పరిచాడు. దీంతో ఈ డబ్బులను దక్కించుకునేందుకు సంచులతో ఎగబడ్డారు ఫ్యాన్స్. లైసా నాడ్ లాబెమ్ పట్టణానికి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కజ్మా అనే మారుపేరుతో బార్టోస్జెక్ సోషల్‌మీడియాలో బాగా పాపులర్. తను ప్రకటించిన ఒక పోటీ ప్రకారం కజ్మా తన చిత్రం 'వన్‌మాన్‌షో: ది మూవీ'లో పొందుపరిచిన కోడ్‌ను ఛేదించాలి. అయితే, దీన్ని ఎవరూ పరిష్కరించలేకపోయారు. దీంతో మరో ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రకటించాడు. ఈ ప్రోగ్రాం కింద సైన్ చేసిన వారిందరికీ ఈ ప్రైజ్మనినీ గిఫ్ట్‌గా ఇవ్వాలని నిర్ణయించాడు. దీని ప్రకారం ఆదివారం ఉదయం ఆరు గంటలకు డబ్బును ఎక్కడ పడేస్తాడనే ఎన్క్రిప్టెడ్ సమాచారంతో వారికి ఈమెయిల్ పంపాడు. అన్నట్టుగా సేమ్ ప్లేస్‌కి వెళ్లి నిర్ణీత సమయంలో తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. హెలికాప్టర్ నుంచి డాలర్ల వర్షం కురపించాడు. ఈ వీడియోను కజ్మా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు ''ప్రపంచంలో తొలిసారి నిజమైన డబ్బు వర్షం. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేదు. గాయాలు కాలేదు కూడా అంటూ తన పోస్ట్‌లో వెల్లడించాడు. View this post on Instagram A post shared by Kazma Kazmitch (@kazma_kazmitch) -
వింబుల్డన్‌కు ముందు అన్నీ అడ్డంకులే.. వండర్ వొండ్రుసోవా
అన్‌సీడెడ్...మణికట్టుకు రెండు శస్త్రచికిత్సలు...మెగా టోర్నీకి ముందు తప్పుకున్న స్పాన్సర్...వింబుల్డన్‌లో అడుగు పెట్టే సమయానికి మర్కెటా వొండ్రుసోవా పరిస్థితి ఇది. గ్రాస్ కోర్టు గ్రాండ్‌స్లామ్ ఈవెంట్లో గతంలో నాలుగు ప్రయత్నాల్లో రెండో రౌండ్ కూడా దాటలేకపోయింది... గత ఏడాది గాయంతో దూరమైన ఆమె ఈ సారీ మొదటి రౌండ్ దాటితే చాలనే ఆలోచనతోనే ఆమె బరిలోకి దిగింది.. అయితే ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో ఆమె అద్భుతం చేసింది. ఏకపక్షంగా సాగిన తుది పోరులో సంచలన విజయంతో చాంపియన్‌గా నిలిచింది. మహిళల విభాగం ఓపెన్ ఎరాలో వింబుల్డన్ గెలుచుకున్న తొలి అన్‌సీడెడ్‌గా వొండ్రుసోవా నిలిచింది. మరో వైపు వింబుల్డన్‌లో వరుసగా రెండో ఏడాది రన్నరప్‌గానే పరిమితమై అన్స్ జబర్ కన్నీళ్లపర్యంతమైంది. లండన్: వింబుల్డన్ మహిళల సింగిల్స్‌లో కొత్త విజేత అవతరించింది. చెక్ రిపబ్లిక్కు చెందిన 24 ఏళ్ల మర్కెటా వొండ్రుసోవా చాంపియన్‌గా ‘వీనస్ రోజ్‌వాటర్ డిష్’ను సగర్వంగా అందుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో వొండ్రుసోవా 6–4, 6–4 స్కోరుతో ఆరో సీడ్ అన్స్ జబర్ (ట్యునీషియా)పై విజయం సాధించింది. 80 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో ప్రపంచ 42వ ర్యాంకర్ వొండ్రుసోవా జోరు ముందు 6వ ర్యాంకర్ జబర్ నిలవలేకపోయింది. 2019 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచిన వొండ్రుసోవాకు ఇది మొదటి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కాగా... గత ఏడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్ ఫైనల్లలో ఓడిన జబర్ మూడో ప్రయత్నంలోనూ గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలవలేకపోయింది. టైటిల్ సాధించిన వొండ్రుసోవాకు 23 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 25 కోట్ల 29 లక్షలు), రన్నరప్ జబర్‌కు 11 లక్షల 75 వేల పౌండ్లు (రూ. 12 కోట్ల 64 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. నలుగురు గ్రాండ్‌స్లామ్ విజేతలు, వారిలో ముగ్గురు ప్రస్తుత టాప్–10 ప్లేయర్లను ఓడించి ఫైనల్ చేరిన జబర్పైనే అందరి అంచనాలు ఉన్నాయి. దానికి తగినట్లుగా శుభారంభం చేస్తూ తొలి సెట్లో ఆమె 2–0తో ముందంజ వేసింది. అయితే కోలుకున్న వొండ్రుసోవా 2–2తో స్కోరు సమం చేసింది. చక్కటి ఫోర్హ్యాండ్లలో మళ్లీ చెలరేగిన జబర్ ముందంజ వేస్తూ 4–2తో మళ్లీ ఆధిక్యం కనబర్చింది. అయితే ఇక్కడే ఆట మలుపు తిరిగింది. వరుస తప్పులతో జబర్ ఒత్తిడిలో పడిపోగా, దూకుడుగా ఆడిన చెక్ రిపబ్లిక్ ప్లేయర్ వరుసగా నాలుగు గేమ్‌లు గెలిచి 6–4తో తొలి సెట్‌ను తన ఖాతాలో వేసుకుంది. రెండో సెట్లో దాదాపు ఇదే ప్రదర్శన పునరావృతమైంది. అభిమానులు తనకు మద్దతు పలుకుతుండగా జబర్ 3–1తో దూసుకుపోయింది. అయితే బేస్‌లైన్ గేమ్‌తో ప్రశాంతంగా ఆడిన వొండ్రుసోవా 3–3కు, ఆపై 4–4కు స్కోరును చేర్చింది. తొమ్మిదో గేమ్‌లో పదే పదే నెట్‌పై ఆడి పాయింట్లు కోల్పోయిన జబర్ 4–5తో వెనుకబడింది. చివరి గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంలో వొండ్రుసోవా సఫలమై ఆనందంలో కోర్టుపై కుప్పకూలిపోయింది. ఏకంగా 31 అనవసర తప్పిదాలు చేసిన జబర్ చేజేతులా తన ఓటమిని ఆహ్వానించింది. -
Miami Open 2023: 13వ ప్రయత్నంలో సఫలం
ఫ్లోరిడా: ఎట్టకేలకు చెక్ రిపబ్లిక్ టెన్నిస్ స్టార్ పెట్రా క్విటోవా నిరీక్షణ ముగిసింది. ప్రతిష్టాత్మక మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 ప్రీమియర్ టోర్నమెంట్లో 33 ఏళ్ల క్విటోవా తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. గతంలో 12 సార్లు ఈ టోర్నీలో పాల్గొని ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేకపోయిన క్విటోవా 13వ ప్రయత్నంలో ఏకంగా టైటిల్ సాధించడం విశేషం. ప్రపంచ ఏడో ర్యాంకర్ ఎలీనా రిబాకినా (కజకిస్తాన్)తో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ క్విటోవా గంటా 42 నిమిషాల్లో 7–6 (16/14), 6–2తో విజయం సాధించింది. క్విటోవా కెరీర్లో ఇది 30వ సింగిల్స్ టైటిల్‌కాగా, డబ్ల్యూటీఏ–1000 విభాగంలో తొమ్మిదోది. ఈ గెలుపుతో క్విటోవా 2021 సెప్టెంబర్ తర్వాత మళ్లీ ప్రపంచ టాప్–10 ర్యాంకింగ్స్‌లోకి రానుంది. రెండు వారాల క్రితం ఇండియన్ వెల్స్ ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టోర్నీలో విజేతగా నిలిచి సూపర్ ఫామ్‌లో ఉన్న రిబాకినా ఫైనల్లో తొలి సెట్లో గట్టిపోటీ ఇచ్చింది. చివరకు 22 నిమిషాలపాటు జరిగిన టైబ్రేక్‌లో క్విటోవా పైచేయి సాధించి తొలి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్లో క్విటోవా దూకుడుకు రిబాకినా చేతులెత్తేసింది. కేవలం రెండు గేమ్‌లు మాత్రమే ఆమె గెల్చుకుంది. విజేతగా నిలిచిన క్విటోవాకు 12,62,220 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 10 కోట్ల 36 లక్షలు), రన్నరప్ రిబాకినాకు 6,62,360 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 కోట్ల 43 లక్షలు) లభించాయి. -
స్టార్ ఫుట్‌బాలర్ సంచలన నిర్ణయం
చెక్ రిపబ్లిక్ స్టార్ ఫుట్‌బాలర్.. మిడ్పీల్డర్ జకుబ్ జాంట్కో తనను తాను 'గే'(Gay-స్వలింగ సంపర్కుడు)గా ప్రకటించుకున్నాడు. సోమవారం ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఎమోషనల్ అయ్యాడు. ''నేను హోమోసెక్సువల్.. ఈ విషయాన్ని ఇంకా దాచుకోవాలనుకోవడం లేదు. అందరిలాగే నేను కూడా నా జీవితాన్ని స్వేచ్ఛగా, భయం, పక్షపాతం లేకుండా ప్రేమతో జీవించాలనుకుంటున్నా. ఒక ఫుట్‌బాలర్‌గా నా కెరీర్లో ఇంకా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తా. ప్రొఫెషనలిసమ్, అభిరుచితో వర్క్ చేయడానికి ఇష్టపడుతా.. ఎవరిపై ఆధారపడాల్సి అవసరం నాకు లేదు. ఒక స్వలింగ సంపర్కుడిగా నాకు నేను స్వేచ్ఛను ప్రకటించుకున్నా'' అంటూ పేర్కొన్నాడు. ఇక ఫుట్‌బాల్‌లో కెరీర్లో కొనసాగుతూ తాము స్వలింగ సంపర్కులమని కొంతమంది ఆటగాళ్లు మాత్రమే ధైర్యంగా బయటకు చెప్పగలిగారు. 1990లో జస్టిన్ ఫషాను, 2021లో ఆస్ట్రేలియాకు చెందిన జోష్ కావల్లో, 2022లో ఇంగ్లీష్ ఫుట్‌బాలర్ జేక్ డేనియల్స్.. తాజాగా జకుబ్ జాంట్కో తనను తాను గేగా ప్రకటించుకున్నాడు. ఇక జాంట్కో చెక్‌రిపబ్లిక్ తరపున 45 మ్యాచ్‌లాడి నాలుగు గోల్స్ కొట్టాడు. సీరీ-ఎ క్లబ్లో ఉడినీస్, సంప్డోరియా క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. pic.twitter.com/PZNSAteOch — Jakub Jankto (@jakubjanktojr) February 13, 2023 చదవండి: Viral: భారత క్రికెట్‌కు సంబంధించిన ఆసక్తికర విషయం -
Diamond League Final: ‘కోహినూర్’ నీరజ్
జ్యూరిచ్: అంతర్జాతీయ వేదికలపై భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా విజయ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. ఒలింపిక్స్ స్వర్ణంతోనే తాను ఆగిపోనని చాటుతూ ఆపై ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ పతకం అందుకున్న అతను... ఇప్పుడు మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అథ్లెటిక్స్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా విజేతగా నిలిచాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్‌గా గుర్తింపు పొందాడు. గురువారం రాత్రి జరిగిన ఈ పోటీల్లో సత్తా చాటిన అతను 88.44 మీటర్ల దూరం జావెలిన్ విసిరి అగ్రస్థానం అందుకున్నాడు. చెక్ రిపబ్లిక్కు చెందిన జాకబ్ వాలెచ్ (86.94 మీటర్లు) రెండో స్థానంలో నిలవగా, జూలియన్ వెబర్ (ఇంగ్లండ్)కు మూడో స్థానం దక్కింది. విజేతగా నిలిచిన నీరజ్‌కు డైమండ్ ట్రోఫీతో పాటు 30 వేల డాలర్లు (సుమారు రూ. 24 లక్షలు) ప్రైజ్‌మనీగా దక్కింది. ఎదురు లేని ప్రదర్శన... గాయం కారణంగా బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడలకు దూరమైన నీరజ్ గత నెల 26న లాసానేలో జరిగిన డైమండ్ లీగ్ అంచెలో అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచాడు. ఫలితంగా ఫైనల్స్‌కు అర్హత సాధించడంతో పాటు 2023లో జరిగే వరల్డ్ చాంపియన్‌షిప్‌కు కూడా క్వాలిఫై అయ్యాడు. గురువారం ఈవెంట్లో నీరజ్ తొలి ప్రయత్నం ‘ఫౌల్’ అయింది. అయితే రెండో ప్రయత్నంలో అతని జావెలిన్ 88.44 మీటర్లు దూసుకుపోయింది. తర్వాతి మరో నాలుగు ప్రయత్నాల్లోనూ (88 మీ., 86.11 మీ., 87 మీ., 83.60 మీ.) దీనికంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వలేకపోయినా... విజేతగా నిలిచేందుకు 88.44 మీటర్లు సరిపోయాయి. -
బోన్ చర్చ్.. 70000 అస్థిపంజరాలతో అరుదైన కళాఖండం
భక్తి, భయం.. రెండూ మిళితమైన ఓ అద్భుత కళాఖండమిది. యూరప్ దేశాల్లో ఒకటైన చెక్ రిపబ్లిక్లో కుట్నా హోరాలోని సెడ్లెక్‌లో.. పర్యాటక కేంద్రంగా మారిన.. సెడ్లెక్ ఓస్యూరీ రోమన్ క్యాథలిక్ చర్చి ఇది. ఇందులోకి అడుగుపెట్టగానే.. 40,000 నుంచి 70,000 అస్థిపంజరాలు అక్షరాలా ముక్తకంఠంతో స్వాగతం పలుకుతాయి. 1278లో సెడ్లెక్‌లోని సిస్టెర్సియన్ మఠానికి చెందిన మఠాధిపతి హెన్రీని.. బొహీమియా రాజు ఒటాకర్ 2.. గోల్గోతా (సువార్తతో ఏసు శిలువ వేయబడిన స్థలం)కు పంపాడు. అక్కడ నుంచి కొద్దిపాటి మట్టిని తీసుకొచ్చిన హెన్రీ.. సెడ్లెక్‌లోని అబ్బే శ్మశానవాటికపై చల్లాడు. నాటి నుంచి అది పవిత్రస్థలంగా మారింది. దీంతో స్థానికులు.. చనిపోయిన తమవారిని అక్కడే ఖననం చేయడం సంప్రదాయంగా మారింది. 14వ శతాబ్దం వరకు అది కొనసాగింది. ఆ సమయంలోనే యూరోప్ అంతా ప్లేగు ప్రబలింది. ఆ వ్యాధికి 30వేల మందిపైనే బలయ్యారు. ఆ తర్వాత మతయుద్ధాలతో మరో పదివేల మంది చనిపోయారు. 1870లో అక్కడ చర్చి నిర్మాణం కోసం.. పాతిపెట్టిన శవాలను తవ్వడంతో పాటు.. చనిపోయిన వారి ఎముకలు, పుర్రెలతో చర్చి లోపల అలంకరణ చెయ్యాలని నిర్ణయించారు. అందులో భాగంగానే నాటి స్థానిక శిల్పులు.. ఈ అద్భుత కళాఖండాన్ని నిర్మించారు. ఆ చిన్న చర్చిలో.. అస్థిపంజరాలు ఎన్నో రూపాల్లో పర్యాటకులను ఆకట్టుకుంటాయి. దాంతో ఈ చర్చికి ‘బోన్ చర్చ్’ అనే పేరు కూడా వచ్చింది. -
Monkeypox: మంకీపాక్స్ కరోనాలాగా విజృంభిస్తుందా?
ఊహించినదానికంటే వేగంగానే.. మంకీపాక్స్ వైరస్ మరికొన్ని దేశాలకు శరవేగంగా విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, చెక్ రిపబ్లిక్ దేశాల్లోనూ మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి. వెస్ట్ ఆఫ్రికా నుంచి వచ్చిన ఓ మహిళ శాంపిల్‌లో మంకీపాక్స్ వైరస్‌ను గుర్తించినట్లు యూఏఈ వైద్యాధికారులు వెల్లడించారు. వైరస్ నిర్ధారణ కావడంతో ఆమె నుంచి వివరాలు సేకరించి కాంటాక్ట్ ట్రేసింగ్ చేపడతాం అని అధికారులు వెల్లడించారు. అలాగే బెల్జియం నుంచి తిరిగి స్వదేశానికి(చెక్ రిపబ్లిక్) చేరుకున్న ఓ మహిళలోనూ వైరస్ జాడ గుర్తించారు. వీటితో పాటు మరో మూడు అనుమానిత కేసుల ఫలితాలు రావాల్సి ఉందని చెక్ రిపబ్లిక్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే వైరస్ కేసులు పెరుగుతున్న వేళ.. వైద్య నిపుణులు అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని చెబుతున్నారు. మంకీపాక్స్‌కు చికిత్స ఉందని, పైగా ప్రమాదం తక్కువగా పొంచి ఉందని, SARS-COV-2 లాగా వైరస్ అంత తేలికగా వ్యాప్తి చెందే అవకాశమే లేదని భరోసా ఇస్తున్నారు. ఇక మంకీపాక్స్ వైరస్‌లోనూ వేరియెంట్లు గుర్తించిన సైంటిస్టులు.. ప్రస్తుత విజృంభణ పట్ల అప్రమత్తంగా ఉండాలని దేశాలకు సూచిస్తున్నారు. ఇప్పటివరకు 19 దేశాల్లో.. 237 మంకీపాక్స్ కేసులు బయటపడ్డాయి. యూరప్, నార్త్ అమెరికా, ఆస్ట్రేలియాలో మంకీపాక్స్ విజృంభణ వెలుగు చూశాక.. ప్రపంచ ఆరోగ్య సంస్థ పలుదేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. చదవండి: అసాధారణ శృంగారం వల్లే మంకీపాక్స్! చదవండి: మంకీపాక్స్ లక్షణాలు ఇవే.. -
చెక్ జోడీ ఖాతాలో ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్
Czech Top Seeds Win Womens Doubles Crown: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 మహిళల డబుల్స్ టైటిల్‌ను టాప్ సీడ్ బార్బోరా క్రెజికోవా, కత్రీనా సినికోవా(చెక్ రిపబ్లిక్) జోడీ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో కజకిస్థాన్‌కు చెందిన అన్నా డానిలీనా, బేట్రిజ్ హద్దాద్ మయ్యాపై 6-7(3-7), 6-4, 6-4 తేడాతో విజయం సాధించి, కెరీర్లో నాలుగో గ్రాండ్‌స్లామ్‌ను ఎగురేసుకుపోయింది. 2 గంటల 42 నిమిషాల పాటు రసవత్తరంగా సాగిన ఈ పోరులో చెక్ జోడీకి కజకిస్థాన్ ద్వయం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అయినప్పటికీ చెక్ జోడీ పట్టుదలగా ఆడి విజేతగా నిలిచింది. ఇదిలా ఉంటే, నిన్న జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో థనాసి కొకినాకిస్-నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా) జంట 7–5, 6–4తో ఎబ్డెన్–పర్సెల్ (ఆస్ట్రేలియా)పై గెలిచి తొలి గ్రాండ్‌స్లామ్‌ను సాధించింది. ఈ క్రమంలో ‘వైల్డ్ కార్డు’ ఎంట్రీ ద్వారా బరిలోకి దిగి డబుల్స్ టైటిల్ నెగ్గిన జోడీగా చరిత్ర సృష్టించింది. చదవండి: కొకినాకిస్–కిరియోస్ జంటకు డబుల్స్ టైటిల్ -
కరోనా సోకినా.. వీల్ ఛైర్‌పై ప్రమాణస్వీకారానికి హాజరై!
పరాగ్వే: కరోనా వైరస్ సోకితే వెంటనే వైద్యుల సూచనల మేరకు ఐసోలేషన్లోకి వెళుతాము. అయితే కరోనా సోకి ఐసోలేషన్‌లో ఉన్న చెక్ రిపబ్లిక్ అధ్యక్షుడు మిలోస్ జెమాన్ మాత్రం.. ప్రత్యేక పరిస్థితుల్లో దేశ నూతన ప్రధానమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రెసిడెంట్ మిలోస్ జెమాన్.. ప్రమాణ స్వీకారం చేసే ప్రాంగణంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గాజు బాక్స్‌లోకి వీల్‌ఛైర్ మీద వచ్చి పీటర్ ఫియాలా చేత ప్రధానమంత్రిగా ప్రమాణం చేయించారు. చదవండి: Omicron: పెను ముప్పు.. డబ్ల్యూహెచ్ఓ కీలక సూచనలు ఎన్నికల్లో పీటర్ ఫియాలా నేతృత్వంలోని సెంటర్-రైట్ కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల అధ్యక్షుడు మిలోన్.. అస్వస్థకు గురై ఆస్పత్రిలో చేరారు. అనంతరం ఆయనకు కరోనా పరీక్షలు చేయగా.. కోవిడ్ సోకినట్లు నిర్థారణ అయింది. చదవండి: చైనా బల ప్రదర్శన.. ఏకంగా 27 విమానాలు బఫర్ జోన్లో ప్రవేశం ఇక కొత్త ప్రధాని ఫియాలా మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతికుల సవాళ్లు ఎదుర్కొనే గడ్డు కాలంలో ఉందని తెలిపారు. అయితే భవిష్యత్తులో తమ ప్రభుత్వం దేశంలో మార్పు తీసుకువస్తుందని పేర్కొన్నారు. దేశ ప్రజలంతా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలిపారు. కరోనా కాలంలో సేవలందించిన వ్యైదులు, వైద్య సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. -
వారెవ్వా… డ్రోన్లకు ‘మెదడు’ బిగించిన సైంటిస్టులు!
అన్నిరంగాల్లోనూ టెక్నాలజీకి ప్రాముఖ్యత పెరిగింది. నేరాలను అరికట్టడానికి, నేర పరిశోధనలోనూ టెక్నాలజీ ఇప్పుడు ముఖ్య భూమిక పోషిస్తోంది. అయితే ఎంత టెక్నాలజీ ఉపయోగిస్తున్నా.. దానికంటూ కొన్ని పరిమితులు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పరిమితులను సైతం అధిగమించే ప్రయత్నాలు నడుస్తున్నాయి. తాజాగా చెక్ రిపబ్లిక్(యూరప్) సైంటిస్టులు.. డ్రోన్లకు అచ్చు మనిషి బుర్ర లాంటి వ్యవస్థను బిగించారు. యస్.. మీరు చదివేది కరెక్టే. సాధారణంగా జన సందోహం ఎక్కువగా ఉన్న చోట మ్యాన్ పవర్‌తో నిఘా నిర్వహించడం కష్టతరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో డ్రోన్ ద్వారా కదలికలను పరిశీలిస్తుంటారు. అయితే డ్రోన్ సేవలు పరిమితమే కావడం, అనుమానిత కదలికలను సరిగా అంచనా వేయడంలో డ్రోన్లు విఫలమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మనిషి మేధస్సును డ్రోన్లకు బిగించాలని చెక్ సైంటిస్టులు ఫిక్స్ అయ్యారు. ఎలా పని చేస్తుందంటే.. మనిషి బుర్రలాంటి మెకానిజాన్ని(న్యూరాల్ నెట్వర్క్).. డ్రోన్లలో సెటప్ చేశారు. ఇది ఒక సర్వేలెన్స్ సిస్టమ్‌లాగా పని చేస్తుంది. ఏదైనా ఎదురైనప్పుడు మనిషిలాగే బుర్ర పెట్టి ఆలోచన స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. జన సందోహంలో మనుషుల ముఖ కవళికలు, ప్రవర్తన ద్వారా ఏది నార్మల్.. ఏది అబ్నార్మల్ అనేది నిర్ణయించుకుంటుంది. ప్రయోగదశలో ఫుట్‌బాల్ మైదానంలో ఆటగాళ్ల మీద ఈ ‘బ్రెయిన్ డ్రోన్’లను ప్రయోగించారు. ఆట కొనసాగుతున్నప్పుడు మధ్యలో ఆటగాళ్లు అబద్ధాలు చెప్పగా.. వెంటనే ఈ డ్రోన్ సిస్టమ్ పని చేయడం ప్రారంభించింది. ముందుగా ఫుటేజ్‌ను చిన్న కణాలుగా(భాగాలుగా) విభజించింది. ఆపై పిక్చర్ క్లియర్ ద్వారా అక్కడ ఏం జరుగుతుందనేది అనలసిస్ చేసింది. ఆటగాళ్ల ముఖ కవళికలు, వాళ్ల ప్రవర్తన ఆధారంగా వాళ్లు అబద్దం ఆడారనే ఒక నిర్ధారణకు వచ్చింది. వెంటనే ఈ డ్రోన్ సిస్టమ్ అబ్జర్వర్(సైంటిస్ట్)ను అప్రమత్తం చేసింది. కొంత ప్రతికూలత.. బ్రోనో యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, చెక్ రిపబ్లిక్ పోలీస్ వ్యవస్థ సహకారంతో ఈ హ్యూమన్ బ్రెయిన్ న్యూరాల్ నెట్‌వర్క్‌ను రూపొందించారు. కేవలం జన సందోహం నడుమ నిఘాతో పాటు ట్రాఫిక్ మనేజ్మెంట్ కోసం కూడా ఈ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. ఈ రియల్ టైం టెక్నాలజీ కీలక సమయాల్లో పని చేయడం మామూలు విషయం కాదన్నది సైంటిస్టుల మాట. అయితే జన సందోహం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ డ్రోన్ సిస్టమ్ కొంత తడబడే ఛాన్స్ ఉంది. అందుకని సెన్సిటివ్ లెవల్‌ను ఏర్పాటు చేశాకే పూర్తిస్థాయిలో వాడకంలోకి తీసుకొస్తామని బ్రోనో సైంటిస్ట్ డేవిడ్ బేజౌట్ చెప్తున్నాడు. -
వాటర్‌తో గోల్డ్! వాట్ ఏ టైమింగ్
నీటిని బంగారంగా మార్చేసేయొచ్చు. కానీ, కొన్ని షరతులు వర్తిస్తాయి. టైమింగ్‌తో కొన్ని మూలకాలను ఉపయోగించి తయారు చేశారు. అయితే అది కొన్ని సెకండ్లు మాత్రమే. ఈ అరుదైన ప్రయోగం టైంలో ‘టైమింగ్’ మరీ ముఖ్యం అంటున్నారు చెక్ రిపబ్లిక్ సైంటిస్టులు. ప్రేగ్ లోని చెక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు నీటిని బంగారం, మెరిసే లోహంగా మార్చేసి చూపించారు. కొన్ని క్షణాల పాటు నీటి బిందువును బంగారంగా మార్చారు. సాధారణంగా లోహాలు కాని చాలా వస్తువుల్ని.. లోహాలుగా మార్చొచ్చన్నది ఎప్పటి నుంచో ఉన్నదే. అయితే, దానికి ఎక్కువ పీడనం అవసరమవుతుంది. ఓ వస్తువులోని అణువులు, పరమాణువులను గ్యాప్ లేకుండా అత్యంత దగ్గరకు చేరిస్తే.. ఆ వస్తువు లోహంగా మారుతుంది. దాని చుట్టూ ఉండే బాహ్య ఎలక్ట్రాన్లు విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి. నీటి విషయంలో.. నీటి విషయంలోనూ అధిక పీడనం ద్వారా జరుగుతుందని.. లోహంగా మార్చాలంటే కోటిన్నర అట్మాస్ఫియర్స్ పీడనం అవసరమవుతుందని సైంటిస్టులు తేల్చారు. కానీ, ఈసారి ప్రయోగంలో అంత పీడనం అవసరం లేకుండా.. లోహంగా మార్చే ఉపాయాన్ని చెక్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు గుర్తించారు. కొన్ని క్షార (ఆల్కలీ) లోహాల నుంచి ఎలక్ట్రాన్లను తీసుకుని.. నీటిపై ప్రయోగించి సుసాధ్యం చేశారు. సిరంజీ సాయంతో.. పిరియాడిక్ టేబుల్లోని గ్రూప్-1లో ఉన్న సోడియం, పొటాషియం వంటి మూలకాలతో అది సాధ్యమవుతుందని గుర్తించారు చెక్ యూనివర్సిటీ సైంటిస్టులు. ఓ సిరంజీలో సోడియం, పొటాషియం ద్రావణాన్ని తీసుకున్నారు. దానిని ఓ వాక్యూమ్ (పీడనం) చాంబర్ లో పెట్టారు. కానీ, ఆ మూలకాలకు నీటి చుక్క తగిలితే పేలే స్వభావం ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు నీరు, ఆ మూలకాల మధ్య ప్రతిచర్య నిదానంగా సాగేలా చూసుకున్నారు. తర్వాత ఆ సిరంజీ నుంచి నిదానంగా ఆ ద్రావణం బిందువులను విడుదల చేసి.. నీటి ఆవిరితో చర్య జరిపేలా చూశారు. అంతే కొన్ని క్షణాల పాటు ఆ నీటి బిందువు బంగారంగా.. ఆ వెంటనే మెరిసే లోహంగా మారిపోయింది. రిస్క్ ఉంది అయితే, ఇది చాలా రిస్క్ తో కూడుకున్న పని అంటున్నారు శాస్త్రవేత్తలు. మూలకాలు పేలకుండా ఉండాలంటే.. నీటితో వాటిని ప్రతిచర్య జరిపించే టైమింగే చాలా ముఖ్యమని చెప్పారు. నీరు, లోహాల మధ్య జరిగే రియాక్షన్ కన్నా ఎలక్ట్రాన్ల ప్రవాహం చాలా వేగంగా ఉంటుందని, కాబట్టి, జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని సైంటిస్టులకు సూచిస్తున్నారు. ‘నేచర్’ జర్నల్‌లో గురువారం ఈ పరిశోధనలకు సంబంధించిన ఆర్టికల్ పబ్లిష్ అయ్యింది. -
తుదిపోరుకు బార్టీ, ప్లిస్కోవా
లండన్: వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్లో మహిళల ప్రపంచ నంబర్‌వన్, ఆస్ట్రేలియా భామ యాష్లే బార్టీ, చెక్ రిపబ్లిక్ తార కరోలినా ప్లిస్కోవా తుది పోరుకు అర్హత సాధించారు. వింబుల్డన్‌లో ఫైనల్‌కు చేరడం వీరిద్దరికీ ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో ఈసారి సరికొత్త చాంపియన్ అవతరించడం ఖాయమైం ది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఎనిమిదో సీడ్ ప్లిస్కోవా 5–7, 6–4, 6–4తో రెండో సీడ్ అరీనా సబలెంకా (బెలారస్)పై గెలుపొందగా... టాప్‌సీడ్ బార్టీ 6–3, 7–6 (7/3)తో ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ)పై గెలిచింది. ఏస్‌ల వర్షం... ప్లిస్కోవా, సబలెంకా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఏస్‌ల వర్షం కురిసింది. మొత్తం 31 ఏస్‌లు నమోదవ్వగా... అందులో సబలెంకా 18, ప్లిస్కోవా 13 సంధించింది. గంటా 53 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్ హోరాహోరీగా సాగింది. 11వ గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకున్న సబలెంకా... ఆ తర్వాతి గేమ్‌లో ప్లిస్కోవా సర్వీస్‌ను బ్రేక్ చేసి తొలి సెట్‌ను గెల్చుకుంది. రెండో సెట్లో సబలెంకా అనవసర తప్పిదాలు చేస్తూ పాయింట్లను చేజార్చుకుంది. ఇదే అదనుగా ఐదో గేమ్‌లో సబలెంకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ప్లిస్కోవా అదే దూకుడుతో సెట్‌ను సొంతం చేసుకుంది. ఇక నిర్ణాయక మూడో సెట్లోనూ చక్కటి ఆటతీరు కనబర్చిన ప్లిస్కోవా ఫైనల్‌కు చేరుకుంది. వారెవ్వా... బార్టీ మరో సెమీస్‌లో టాప్‌సీడ్ బార్టీ మ్యాచ్‌ను దూకుడుగా ఆరంభించింది. తొలి సెట్‌ను ఆమె 6–3తో సొంతం చేసుకుంది. అయితే రెండో సెట్లో కెర్బర్ గట్టిపోటీ ఇవ్వడంతో బార్టీ శ్రమించక తప్పలేదు. రెండో గేమ్‌లో బార్టీ సర్వీస్‌ను బ్రేక్ చేసిన కెర్బర్ ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలుపుకొని 5–2తో ఆధిక్యంలో నిలిచింది. ఇక్కడి నుంచి బార్టీ తన అసాధారణ ఆటతీరుతో ఆకట్టుకుంది. బలమైన ఫోర్ హ్యాండ్ షాట్లతో ప్రత్యర్థి పనిపట్టింది. వరుసగా మూడు గేమ్‌లను కైవసం చేసుకుని 5–5 వద్ద రెండో సెట్‌ను సమం చేసింది. అనంతరం ఇరువురు కూడా తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో మ్యాచ్ ‘టై బ్రేక్’కు దారి తీసింది. ఏకపక్షంగా సాగిన ‘టై బ్రేక్’లో బార్టీ చెలరేగింది. వరుసగా పాయింట్లు సాధించి 6–0 ఆధిక్యంలో నిలిచింది. బార్టీ మూడు అనవసర తప్పిదాలతో ఆధిక్యం 6–3కు తగ్గినా గెలిచేందకు ఎంతోసేపు పట్టలేదు. -
క్రిచికోవా ‘డబుల్’ ధమాకా
పారిస్: ఐదో ప్రయత్నంలోనే తొలిసారి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ చాంపియన్‌గా అవతరించిన చెక్ రిపబ్లిక్ అమ్మాయి బర్బోర క్రిచికోవా 24 గంటలు గడవకముందే తన ఖాతాలో మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను జమ చేసుకుంది. శనివారం ఫ్రెంచ్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన 25 ఏళ్ల క్రిచికోవా ఆదివారం మహిళల డబుల్స్ టైటిల్‌ను కూడా దక్కించుకుంది. ఫైనల్లో క్రిచికోవా –కాటరీనా సినియకోవా (చెక్ రిపబ్లిక్) ద్వయం 6–4, 6–2తో బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా) –ఇగా స్వియాటెక్ (పోలాండ్) జోడీపై గెలిచింది. విజేతగా నిలిచిన క్రిచికోవా జంటకు 2,44,925 యూరోలు (రూ. 2 కోట్ల 17 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సోమవారం విడుదలయ్యే ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో క్రిచికోవా ఏడో ర్యాంక్ నుంచి నంబర్‌వన్ ర్యాంక్‌కు ఎగబాకనుంది. ‘డబుల్’ విజయంతో క్రిచికోవా దిగ్గజ క్రీడాకారిణిల సరసన నిలిచింది. సెరెనా (2016 వింబుల్డన్‌లో) తర్వాత ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీలో మహిళల సింగిల్స్, డబుల్స్ టైటిల్ నెగ్గిన క్రీడాకారిణగా క్రిచికోవా గుర్తింపు పొందింది. అంతేకాకుండా ఫ్రెంచ్ ఓపెన్‌లో ఈ తరహా ఘనత సాధించిన ఏడో క్రీడాకారిణిగా ఆమె నిలిచింది. గతంలో బిల్లీ జీన్ కింగ్ (1972), మార్గరెట్ కోర్ట్ (1973), క్రిస్ ఎవర్ట్ (1974, 1975), వర్జీనియా(1978), మార్టినా నవ్రతిలోవా (1982, 1984), మేరీ పియర్స్ (2000) ఈ ఘనత సాధించారు. -
Barbora Strycova: టెన్నిస్‌కు స్ట్రికోవా గుడ్‌బై
ప్రాగ్ (చెక్ రిపబ్లిక్): మహిళల టెన్నిస్ డబుల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) కెరీర్‌కు వీడ్కోలు పలికింది. 35 ఏళ్ల స్ట్రికోవా తల్లి కాబోతున్నట్లు గత మార్చిలో ప్రకటించింది. 2019 వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో స్ట్రికోవా చైనీస్ తైపీకి చెందిన సు వె సెయితో కలిసి మహిళల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అదే ఏడాది సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్‌కు చేరుకుంది. ‘నా అంతర్జాతీయ టెన్నిస్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నాను. ప్రసవం జరిగాక పునరాగమనం చేస్తానని చెప్పడంలేదు. అయితే చివరిసారి అభిమానులతో మ్యాచ్ ఆడాలని ఉంది’ అని 2016 రియో ఒలింపిక్స్‌లో తన దేశానికే చెందిన లూసీ సఫరోవాతో కలిసి మహిళల డబుల్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన స్ట్రికోవా తెలిపింది. చివరిసారి ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడిన స్ట్రికోవా సింగిల్స్ విభాగంలో కెరీర్ బెస్ట్ 16వ ర్యాంక్ చేరుకోవడంతోపాటు రెండు టైటిల్స్‌ను గెలిచింది. డబుల్స్‌లో స్ట్రికోవా వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలువడంతోపాటు 31 టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. ఈ 31 టైటిల్స్‌లో రెండింటిలో (2016–సిన్సినాటి, టోక్యో ఓపెన్) భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భాగస్వామిగా ఉంది. -
కోట్లు దోచేస్తున్న యాప్స్ : చెక్ చెప్పిన చిన్నారి
సాక్షి, న్యూఢిల్లీ: ఆడపిల్లలని చులకనగా చూడకండి..వారు ప్రపంచాన్ని సృష్టించడమే కాదు.. తమ నైపుణ్యంతో ప్రపంచాన్ని కాపాడతారు కూడా. చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్లోని ఒక చిన్న అమ్మాయి నిరూపించింది ఇదే. భద్రతా పరిశోధకులే నివ్వెరపోయేలా మాలావేర్ గుర్తించి,కోట్లను దోచేసిన కేటుగాళ్లను పట్టించింది. తద్వారా టెక్ సంస్థలు నష్టపోతున్న కోట్ల రూపాయల ఆదాయాన్ని కాపాడింది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లోని యాప్స్ భద్రతపై ఎన్ని చర్యలు తీసుకుంటున్నా స్కామర్ల ముప్పు తప్పడం లేదు. పిల్లలను లక్ష్యంగా ఈ యాప్స్ 2.4 మిలియన్లకు పైగా సార్లు డౌన్లోడ్ అయినట్టు పరిశోధకులు కనుగొన్నారు. వివరాల్లోకి వెళ్లితే గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో ఏడు నకిలీ యాప్స్ ద్వారా ఇప్పటివరకు 5 లక్షల డాలర్లను (సుమారు రూ.3.7 కోట్లు) దోచేశారు. ప్రధానంగా టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా యాప్స్‌లో ఈ మోసపూరిత యాప్స్‌కు సంబంధించిన ప్రకటను ప్లే అవుతాయట. ఇవి సాధారణంగా ఎవరికీ కనిపించకుండా మాల్వేర్ ద్వారా లోప్రొఫైల్ మెయిన్‌టెయిన్ చేస్తాయి. ఈ యాప్స్ ద్వారా ఒక్కో యూజర్ ద్వారా 10 డాలర్ల మధ్య ఆర్జిస్తున్నాయి. అయితే టిక్‌టాక్‌లో ఇలాంటి యాడ్స్ చూసిన ఒక పాప ఈ విషయమై ఫిర్యాదు చేసింది. పిల్లలు ఆన్లైన్లో ఎలా సేఫ్‌గా ఉండాలో తెలిపే అవాస్ట్ ‘బీ సేఫ్’ ఆన్లైన్ ప్రాజెక్టుకు దీన్ని రిపోర్ట్ చేసింది. దీంతో వారు రంగంలోకి మరింత పరిశోధించడంతో విషయం వెలుగు చూసింది. ఇవి వాల్‌పేపర్, మ్యూజిక్ లేదా ఎంటర్ టైన్ మెంట్ యాప్స్ ముసుగులో ఉంటాయని, వీటి ద్వారానే యాడ్వేర్ స్కామ్‌లు జరుగుతున్నట్లు సెన్సార్ టవర్‌కు సంబంధించిన పరిశోధకులు తెలిపారు. అంతేకాదు టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్రముఖ సోషల్ మీడియా యాప్స్‌లో లక్షల్లో ఫాలోవర్లు ఉన్నవారు కూడా ఈ యాప్స్‌ను ప్రమోట్ చేయడం బాధాకరమైన విషయమని పరిశోధకులు వ్యాఖ్యానించారు. 5 వేల నుంచి 33 లక్షల వరకు ఫాలోవర్లు ఉన్నవారు కూడా ఈ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారట. దీన్ని తమ దృష్టికి తీసుకువచ్చిన చిన్నారికి అవాస్ట్ ధన్యవాదాలు తెలిపింది. అలాగే పరిశోధకుల ద్వారా విషయాన్ని తెలుసుకున్న గూగుల్ వెంటనే ప్లేస్టోర్ నుంచి ఈ యాప్స్‌ను తొలగించింది. దీనిపై యాపిల్ ఇంతవరకు స్పందించలేదు.