అమెరికాకు నిఖిల్ గుప్తా అప్పగింత
వాషింగ్టన్: ఖలిస్తానీ ఉగ్రవాది గుర్‌పత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై భారత్‌కు చెందిన నిఖిల్ గుప్తాను చెక్ రిపబ్లిక్ గత వారం అమెరికాకు అప్పగించింది.
గుర్తు తెలియని భారతీయ అధికారి ఆదేశాల మేరకు కెనడా, అమెరికా ద్వంద పౌరసత్వమున్న పన్నూను అమెరికా గడ్డపైనే చంపేందుకు నిఖిల్ గుప్తా కిరాయి హంతకుడికి డబ్బులిచి్చనట్లు అమెరికా ఆరోపిస్తోంది. అమెరికా ప్రభుత్వ వినతి మేరకు చెక్ రిపబ్లిక్‌లో ఉన్న నిఖిల్‌ను అక్కడి ప్రభుత్వం గత ఏడాది అరెస్ట్ చేసింది. అయితే, అమెరికా ఆరోపణలను భారత్ ఖండించింది. నిఖిల్ ప్రస్తుతం అమెరికాలోని బ్రూక్లిన్‌లో ఫెడరల్ మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment