Khalistani terrorist
-
ఫాస్ట్ ట్రాక్ వీసాలకు కెనడా మంగళం
న్యూఢిల్లీ: ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ నిజ్జర్ హత్యోదంతం తిరిగి తిరిగి చివరకు భారతీయ విద్యార్థులకు స్టడీ వీసా కష్టాలను తెచ్చిపెట్టింది. కెనడా–భారత్ దౌత్యసంబంధాలు అత్యంత క్షీణదశకు చేరుకుంటున్న వేళ కెనడా ప్రభుత్వం భారతీయ విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కల్గించే నిర్ణయాన్ని అమలుచేసింది. విద్యార్థి వీసాలను వేగంగా పరిశీలించి పరిష్కరించే ఫాస్ట్ ట్రాక్ వీసా విధానం స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్(ఎస్డీఎస్)ను నిలిపేస్తున్నట్లు కెనడా శుక్రవారం ప్రకటించింది. తమ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తున్నట్లు పేర్కొంది. దీంతో కెనడాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు వీసా జారీ ప్రక్రియ పెద్ద ప్రహసనంగా మారనుంది. ఇన్నాళ్లూ భారత్, చైనా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, వియత్నాంసహా 13 దేశాల విద్యార్థులకే ఎస్డీఎస్ కింద ప్రాధాన్యత దక్కేది. ఈ దేశాల విద్యార్థులకు స్టడీ పర్మిట్లు చాలా వేగంగా వచ్చేవి. తాజా నిర్ణయంతో ఈ 13 దేశాల విద్యార్థులు సాధారణ స్టడీ పర్మిట్ విధానంలోని దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది. తాజా నిర్ణయాన్ని కెనడా సమర్థించుకుంది. జాతీయతతో సంబంధంలేకుండా అన్ని దేశాల విద్యార్థులకు సమాన అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతోనే ఎస్డీఎస్ను నిలిపేశామని వివరణ ఇచ్చింది. -
పన్నూ మమ్మల్ని బెదిరించాడు: ఆస్ట్రేలియన్ టుడే
భారతదేశ విదేశాంగశాఖ మంత్రి ఎస్. జైశంకర్ ఇంటరర్వ్యూ ప్రసారం చేసినందుకు ఆస్ట్రేలియా టుడే మీడియా సంస్థపై ఇటీవల కెనడా నిషేధం విధించింది. అయితే.. వ్యవహారంపై తాజాగా ఆ మీడియా సంస్థ వ్యవస్థాపకుడు, ఎడిటర్-ఇన్-చీఫ్ జితార్థ్ జై భరద్వాజ్ స్పందించారు. ప్రతికాస్వేచ్ఛను హత్య చేయటమేనని జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై మండిపడ్డారు. గుళ్లపై పదేపదే దాడులు జరుగుతున్నా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నిచారు.‘‘ కెనడా చర్య.. పత్రికా స్వేచ్ఛను హతమార్చటం అవుతుంది. ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ఉంది. విభిన్న అభిప్రాయాలన్నింటినీ చర్చించడానికి, అర్థం చేసుకోవడానికి, విశ్లేషించడానికే పత్రికలు ఉన్నాయి. గురుపత్వంత్ సింగ్ పన్నూ మమ్మల్ని బెదిరించాడు. ...ఇతర వేర్పాటువాదుల నుంచి కూడా బెదిరింపులు వచ్చాయి. అమెరికా, కెనడాలో కవరేజీ చేసినందుకు మా చిత్రాలను పన్నూ ఆన్లైన్లో పెట్టారు. అనేక రకాలుగా హాని తలపెట్టమని ఆయన మద్దతుదారులను ఉసిగొల్పారు. అయినా.. మేం భయపడకుండా నిరంతరం రిపోర్టింగ్ చేస్తున్నాం’’అని అన్నారు.చదవండి: కెనడాలో ‘ఆస్ట్రేలియా టుడే’పై నిషేధం -
హిందూ ఆలయంపై ఖలిస్తానీ మద్దతుదారుల దాడి
బ్రాంప్టన్: కెనడా ప్రభుత్వం భారత్‌పై విషం చిమ్మిన అనంతరం అక్కడి ఖలిస్తానీ మద్దతుదారుల మనోబలం మరింతగా పెరిగినట్టు కనిపిస్తోంది. తాజాగా ఆదివారం కెనడాలోని బ్రాంప్టన్‌లో ఖలిస్తానీ మద్దతుదారులు దాడులకు తెగబడ్డారు. ఒక హిందూ దేవాలయం వెలుపల విధ్వంసం సృష్టించారు.బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంపై జరిగిన దాడిపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఒక ప్రకటనలో తన స్పందన తెలియజేశారు. బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంపై జరిగిన హింసాత్మక సంఘటనలు ఆమోదయోగ్యం కాదు. ప్రతి కెనడియన్‌కు తన ఇష్టం మేరకు మతాభిమానాలకు కొనసాగించే హక్కు ఉంది. అయితే ఒక వర్గపు సమాజాన్ని రక్షించడానికి, ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి తక్షణమే స్పందించాలని ఆయన ప్రాంతీయ పోలీసులను ఆదేశించారు.BREAKING: The RCMP start attacking Hindu worshippers on their own temple grounds in Surrey BC.Watch as an RCMP officer goes into the crowd to go after Hindu devotees after pushing them back to protect the Khalistanis who came to harass the temple goers on Diwali. Punching Hindus… pic.twitter.com/uugAJun59q— Daniel Bordman (@DanielBordmanOG) November 4, 2024బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్ ఈ ఘటనపై మాట్లాడుతూ బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయం వెలుపల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల గురించి విని ఆందోళన చెందాను. కెనడాలో మత స్వేచ్ఛ అనేది ఒక ప్రాథమిక హక్కు. ప్రతి వ్యక్తి తమ ప్రార్థనా స్థలంలో సురక్షితంగా ఉండాలి. ప్రార్థనా స్థలం వెలుపల జరిగిన హింసాత్మక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. శాంతిభద్రతల పరిరక్షణకు, హింసాత్మక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపట్టేందుకు పోలీసులు ఉపక్రమిస్తున్నారు. దోషులుగా తేలిన వారిని చట్టం ప్రకారం శిక్షిస్తామని పేర్కొన్నారు.కాగా కెనడాలోని ఖలిస్తానీ తీవ్రవాదులు పరిధులు దాటిపోయారని కెనడా పార్లమెంటులో భారత సంతతికి చెందిన ఎంపీ చంద్ర ఆచార్య అన్నారు. హిందూ దేవాలయంపై జరిగిన దాడి.. కెనడాలో ఖలిస్తానీ హింసాత్మక తీవ్రవాదం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుందని, భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో కెనడాలో ఖలిస్తాన్ తీవ్రవాదులకు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని చంద్ర ఆరోపించారు.ఇది కూడా చదవండి: 2025.. ప్రపంచం అంతానికి ఆరంభం: బాబా వంగా కాలజ్ఞానం -
వెన్నుపోటు పొడిచింది
న్యూఢిల్లీ: ఒక ఖలిస్తానీ వేర్పాటువాద ఉగ్రవాదికి వంతపాడుతూ భారత్ వంటి ప్రజాస్వామ్య దేశం పట్ల కెనడా అత్యంత అనైతికంగా వ్యవహరించిందని అక్కడి నుంచి తిరిగొచ్చిన భారత హైక మిషనర్ సంజయ్ కుమార్ వర్మ ఆగ్రహం వ్యక్తంచేశారు. కెనడాలో ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యోదంతంలో సంజయ్ వర్మసహా పలువురు దౌత్యాధికారులను విచారిస్తామని కెనడా ప్రకటించడం, కెనడా చర్యపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ భారత్ తన దౌత్యాధికారులను వెంటనే వెన క్కి రప్పించి, కెనడా దౌత్యాధికారులను బహిష్కరించడం తెల్సిందే. హఠాత్తుగా భారత్– కెనడా దౌత్యబంధంలో భారీ బీటలు వారిన వేళ సంజయ్ గురువారం ‘పీటీఐ’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.పాలకవర్గం మొదలు పార్లమెంట్‌దాకా‘‘ కెనడాలో పాలకవర్గం మొదలు రక్షణ బలగాలు, చివరకు పార్లమెంట్‌దాకా అన్ని రాజ్యాంగబద్ధ్ద సంస్థల్లో ఖలిస్తానీ సానుభూతిపరులు చొరబడ్డారు. ఇలా ఖలిస్తానీవాదులు తమ అజెండాను బలంగా ముందుకు తోస్తున్నారు. భారత సార్వభౌమత్వాన్ని సైతం సవాల్ చేసే సాహసం చేస్తున్నారు. మన సమగ్రతను అక్కడి ఎంతోమంది కెనడియన్ పార్లమెంటేరియన్లు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. తోటి ప్రజాస్వామ్య మిత్రదేశంగా భారత సమగ్రతను కెనడా గౌరవిస్తుందని భావించా. కానీ వాళ్లు వెన్నుపోటు పొడిచారు. అత్యంత అనైతికంగా వ్యవహరించారు. ఖలిస్తానీవాదుల కారణంగా కెనడా విదేశాంగ విధానం పెడతోవలో వెళ్తోంది. ఓటు బ్యాంక్‌ను కాపాడుకునేందుకు రాజకీయనేతలకు ఖలిస్తానీ వాదుల మద్దతు అవసరమైంది. ఇదే చివరకు ఇరుదేశాల దౌత్యసత్సంబంధాల క్షీణతకు ప్రధాన హేతువు. రోజురోజుకూ కెనడా రాజకీయ ముఖ చిత్రంపై ఖలిస్తానీవాదుల పాత్ర పెద్దదవుతోంది. అక్కడి భారతీయ సంతతి ప్రజలు ప్రశాంత జీవనం గడుపుతుంటే ఖలిస్తానీవాదులు మాత్రం తమ అనైతిక డిమాండ్ల కోసం తెగిస్తున్నారు. ‘ఖలిస్తాన్’ వాదనను ఖలిస్తానీవాదులు కెనడాలో ఒక వ్యాపారంగా మార్చేశారు. ఆయుధాలు, మత్తుపదార్థాల అమ్మకాలు, మానవుల అక్రమ రవాణా, వ్యభిచారం, బెదిరింపులు వంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. ఓట్లు పోతాయన్న భయంతో అక్కడి ప్రభుత్వం ఇవన్నీ తెల్సి కూడా కళ్లుమూసుకుంటోంది’’ అని అన్నారు.దౌత్య రక్షణ పీకేస్తామన్నారుతనతోపాటు మరో ఐదుగురు దౌత్యసిబ్బందిని కెనడా బహిష్కరించిన ఘటనను వర్మ గుర్తుచేసుకున్నారు. ‘‘ అక్టోబర్ 12వ తేదీ సాయంత్రం టొరంటో ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నప్పుడు నాకొక మెసేజ్ వచ్చింది. అర్జంటుగా కెనడా విదేశాంగ శాఖకు వచ్చి అధికారులను కలవాలని ఆ సందేశంలో ఉంది. 13వ తేదీన గ్లోబల్ అఫైర్స్ కెనడా(విదేశాంగశాఖ) ఆఫీస్‌కు నేను, డెప్యూటీ హైకమిషనర్ వెళ్లాం. ‘నిజ్జర్ హత్య కేసులో మీ ప్రమేయంపై మిమ్మల్ని ఇంటరాగేషన్ చేయాల్సి ఉంది. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు మిమ్మల్ని విచారిస్తారు. వీటికి అవరోధంగా ఉన్న, మిమ్మల్ని కాపాడుతున్న ‘దౌత్యరక్షణ’ను తీసేస్తాం’ అని కెనడా అధికారులు మాతో చెప్పారు. దాంతో మాకో విషయం స్పష్టమైంది. దౌత్యనీతిని అవహేళన చేస్తూ, నిబంధనలకు నీళ్తొదిలేస్తూ హైకమిషనర్‌ను ప్రశ్నిస్తామని చెప్పడంతో నిర్ఘాంతపోయాం. పలు దేశాల్లో దౌత్యవేత్తగా పనిచేసిన నా 36 సంవత్సరాల కెరీర్లో ఇలాంటి అవమానాన్ని ఏ దేశంలోనూ ఎదుర్కోలేదు. నిజ్జర్హత్యసహా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు మేం పాల్పడలేదు. అయినా దౌత్యవేత్తలతో వ్యవహరించాల్సిన పద్ధతి ఇదికాదు’’ అని ఆయన అన్నారు. -
‘నవంబరు 1-19 వరకు ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించొద్దు’
దేశంలో విమానలకు గత కొన్ని రోజులుగా వరుసగా బాంబు బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాల వేళ ఖలిస్థానీ వేర్పాటువాది గుర్పత్వంత్ సింగ్ పన్నూ.. విమానాలకు సంబంధి హెచ్చరికలు చేయడం తీవ్ర కలకలం రేపింది. నవంబరు 1 నుంచి 19 వరకు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని గురుపత్వంత్ సింగ్ ప్రయాణికులను హెచ్చరించాడు.భారత్‌లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 ఏళ్లు కావొస్తున్న సందర్భంగా ఎయిర్ ఇండియా విమానాలపై దాడి జరిగే అవకాశం ఉందని, కావును ఆయా తేదీల్లో ఆ సంస్థ విమానాల్లో ప్రయాణించొద్దంటూ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నాడు. కాగా సిక్కుల ఫర్ జస్టిస్ (ఎస్జేఎఫ్) వ్యవస్థాపకుడైన పన్నూ ఇలాంటి హెచ్చరికలు చేయడం ఇది మొదటి సారి కాదు. గతేడాది కూడా నవంబర్ నెలలోనే ఇలాంటి బెదిరింపులే చేశాడు. నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో సిక్కులు ప్రయాణించొద్దని సూచించాడు. లేని పక్షంలో మీ ప్రాణాలకు ముప్పు ఉంటుందని హెచ్చరించాడు. ‘నవంబర్ 19న ఎయిర్ ఇండియాలో ప్రయాణించవద్దని సిక్కు ప్రజలను కోరుతున్నాం. ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్ ఇండియాను దిగ్బంధిస్తాం. నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దు. లేదంటే మీ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది’ అని పేర్కొన్నాడు.అంతేగాక నవంబరు 19న దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆ రోజు మూతపడుతుందని, దాని పేరు కూడా మార్చేస్తామని గతేడాది అతడు ఓ వీడియోలో హెచ్చరించాడు. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (ఉపా) కింద భారత ప్రభుత్వం పన్నూను 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇతడికి కెనడాతోపాటు అమెరికా పౌరసత్వం కూడా ఉంది. -
దృష్టి మరల్చేందుకే.. నిజ్జర్ హత్య తెరపైకి
ఒట్టావా: ఇతర వివాదాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యోదంతాన్ని తెరపైకి తెచ్చి భారత్‌పై ఆరోపణలు చేస్తున్నారని కెనడా విపక్షనేత మాక్సిమ్ బెర్నియర్ అన్నారు. గతంలో జరిగిన తప్పిదాన్ని సరిచేసుకోవాలంటే మరణానంతరం నిజ్జర్ పౌరసత్వాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. నిజ్జర్ హత్యలో భారత రాయబారి ప్రమేయముందని ట్రూడో ఆరోపించడం, పరస్పర దౌత్యవేత్తల బహిష్కరణతో భారత్– కెనడా సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ వివాదానికి కేంద్రబిందువైన నిజ్జర్ విదేశీ ఉగ్రవాది అని, అతనికి 2007లో కెనడా పౌరసత్వం లభించిందని పీపుల్స్ పార్టీ ఆఫ్ కెనడా నేత బెర్నియర్ అన్నారు. కెనడా గడ్డపై భారత రాయబార సిబ్బంది నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్నారనేది నిజమైతే.. అది చాలా తీవ్రమైన విషయమని, తగుచర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కానీ ఇప్పటిదాకా భారత్ ప్రమేయంపై ఎలాంటి ఆధారాలను ప్రభుత్వం బయటపెట్టలేదని, ఇతర వివాదాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ట్రూడో నిజ్జర్ హత్యను వాడుకుంటున్నారని సుస్పష్టంగా కనపడుతోందన్నారు. నిజ్జర్ విదేశీ ఉగ్రవాది అని, 1997 నుంచి పలుమార్లు తప్పుడు పత్రాలతో కెనడా పౌరసత్వాన్ని పొందడానికి ప్రయత్నించాడని అన్నారు. పలుమారు తిరస్కరణకు గురైనా మొత్తానికి 2007 పౌరసత్వం దక్కించుకున్నాడని తెలిపారు. నిజ్జర్ కెనడా పౌరుడు కాదని, అధికారిక తప్పిదాన్ని సరిచేసుకోవడానికి వీలుగా.. మరణానంతరం అతని పౌరసత్వాన్ని రద్దు చేయాలని బెర్నియర్ డిమాండ్ చేశారు. అతని దరఖాస్తు తిరస్కరణకు గురైన మొదటిసారే నిజ్జర్‌ను వెనక్కిపంపాల్సిందన్నారు. -
నిరాధార ఆరోపణలు... అనవసర ఉద్రిక్తతలు
న్యూఢిల్లీ: ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి అడ్డగోలు ఆరోపణలు చేసిన కెనడా తీరును భారత్ మరోసారి తూర్పారబట్టింది. ఈ విషయమై ఏ ఆధారాలూ లేకున్నా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో బాధ్యతారహితంగా చేసిన తీవ్ర ఆరోపణలే ఇరు దేశాల మధ్య తాజా దౌత్య వివాదానికి ఆజ్యం పోశాయంటూ ఆక్షేపించింది. నిజ్జర్ హత్య వెనక భారత ఏజెంట్లున్నారన్న తన ఆరోపణలకు నిఘా సమాచారమే ఆధారం తప్ప దాన్ని నిరూపించేందుకు ఎలాంటి రుజువులూ తమ వద్ద లేవని ట్రూడో బుధవారం స్వయంగా అంగీకరించడం తెలిసిందే. భారత్‌పై ఆయన ఆరోపణల్లో పస ఎంతో దీన్నిబట్టే అర్థమవుతోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. నిజ్జర్ ఉదంతానికి సంబంధించి కెనడా తమకు ఇప్పటిదాకా ఎలాంటి రుజువులూ ఇవ్వలేదని భారత్ పదేపదే చెబుతూ వస్తుండటం తెలిసిందేది.దొంగ ఏడ్పులు...నిజ్జర్ హత్య వెనక కూడా బిష్ణోయ్ గ్యాంగే ఉందని కెనడా చెబుతుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో కెనడా నుంచి భారత్‌లో అరాచకాలకు పాల్పడుతున్న ఆ గ్యాంగ్‌కు చెందిన పలువురు సభ్యులను అరెస్టు చేసి అప్పగించాలని ఎన్నిసార్లు కోరినా స్పందనే లేదని జైస్వాల్ స్పష్టం చేశారు. ‘‘కెనడా గడ్డపై ఉంటూ భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఖలిస్తానీ శక్తుల్లో గుర్జీత్‌సింగ్, గుర్జీందర్‌సింగ్, అర్‡్షదీప్‌సింగ్ గిల్, లఖ్బీర్సింగ్ లండా, గుర్‌ప్రీత్‌సింగ్ తదితరుల పేర్లను ట్రూడో సర్కారుకు ఎప్పుడో ఇచ్చాం. వీరిలో పలువురు బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులూ ఉన్నారు. వీరంతా ఉగ్రవాదం తదితర తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే. వీరిని అప్పగించాల్సిందిగా ఏళ్ల క్రితమే కోరాం. తాజాగా ఇటీవల కూడా విజ్ఞప్తి చేశాం. కానీ కనీస స్పందన లేదు’’ అని వివరించారు. ‘‘ఇలాంటి కనీసం 26 విజ్ఞప్తులు కెనడా వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. భారత భద్రత కోణం నుంచి చూస్తే ఇది చాలా తీవ్రమైన అంశం’’ అని వివరించారు. ‘‘వారిపై కనీసం గట్టి చర్యలైనా తీసుకోవాలని భారత్ ఎన్నిసార్లు కోరినా ట్రూడో సర్కారు పెడచెవిన పెడూతూ వస్తోంది. వారి రెచ్చగొట్టే ప్రసంగాలను భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో చూసీ చూడనట్టు వదిలేస్తోంది’’ అని ఆరోపించారు. ‘‘ఓవైపేమో భారత్ ఎంతగా విజ్ఞప్తి చేసినా వారిని ఉద్దేశపూర్వకంగానే పట్టుకోవడం లేదు. మరోవైపు అదే బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు భారత ఆదేశాల మేరకు తమ దేశంలో అరాచకాలకు పాల్పడుతున్నారంటూ దొంగ ఏడ్పులు ఏడుస్తోంది’’ అంటూ జైస్వాల్ నిప్పులు చెరిగారు. ట్రూడో సర్కారు తాలూకు ఈ ప్రవర్తన కచ్చితంగా రాజకీయ ప్రేరేపితమేనని ఆయన స్పష్టం చేశారు. మరో ఏడాదిలో కెనడాలో ఎన్నికలు జరగనుండటం తెలిసిందే. -
ఖలిస్తానీ బంధంలో కెనడా ప్రధాని కార్యాలయం
ఒట్టావా: భారత వ్యతిరేక శక్తులు కెనడాలో ఏకంగా అధికారవర్గంతోనూ అంటకాగాయన్న వాదనలు నిజమని నిర్ధారణ అయింది. జస్టిన్‌ట్రూడో నేతృత్వంలోని కెనడా ప్రభుత్వంతో సంప్రతింపులు జరుపుతున్నామని భారత్‌లో నిషేధిత ఉగ్రసంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్, ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ తాజాగా ప్రకటించారు. కెనడా ప్రధాని కార్యాలయంతో గత రెండు, మూడేళ్లుగా ఉత్తరప్రత్యుత్తరాల తంతు కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. సీబీసీ న్యూస్ ముఖాముఖిలో ట్రూడోను పన్నూ పొగిడారు. ‘‘మీడియా సమావేశంలో ట్రూడో చేసిన ప్రకటనతో జాతి భద్రతకు, న్యాయం, చట్టం అమలుకు కెనడా ప్రభుత్వం ఎంతగా కట్టుబడిందో చాటిచెబుతోంది. పీఎం కార్యాలయంతో గత మూడేళ్లుగా సంప్రతింపులు జరుపుతున్నాం. కెనడాలో భారతీయ ఏజెంట్ల నిఘా నెట్వర్క్ గుట్టుమట్లను ప్రభుత్వానికి అందజేశాం. హర్దీప్ సింగ్ పన్నూ హత్యకు కెనడాలో భారత హైకమిషనర్ సంజయ్ వర్మ, అతని సిబ్బంది ఎలా కుట్ర పన్నారో, ఎలా అమలుచేశారో పీఎంఓకు తెలియజేశాం’’అని అన్నారు. కెనడాలో భారతీయ ఏజెంట్లు హింసను ఉసిగొల్పుతున్నారని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు చేసిన ఆరోపణలనే పన్నూ వల్లెవేయడం గమనార్హం. భారతీయ–కెనడియన్ పౌరులు కెనడా రాజ్యాంగాన్ని గౌరవించట్లేరని పన్నూ ఆరోపించారు. భారతీయ కెనడియన్లను దేశం విడిచిపోవాలని పన్నూ గతంలో హెచ్చరించారు. ‘‘కెనడా రాజ్యాంగాన్ని పాటించని మీరు కెనడాలో ఉండకూడదు. కెనడాను వదిలేసి భారత్‌కు వెళ్లిపొండి’అని గత ఏడాది ఇండో కెనడియన్ హిందువులను పన్నూ హెచ్చరించడం తెల్సిందే. -
Justin Trudeau: నిఘా సమాచారమే.. గట్టి ఆధారాల్లేవు
న్యూఢిల్లీ: ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్సింగ్నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయముందని ఊదరగొట్టిన కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో వెనక్కితగ్గారు. ఈ హత్యకు సంబంధించి నిఘా సమాచారాన్ని మాత్రమే భారత్‌తో పంచుకొన్నామని, ఎలాంటి ఆధారాలను అందజేయలేదని విదేశీ జోక్యపు ఎంక్వైరీ ముందు బుధవారం హాజరైనపుడు అంగీకరించారు. నిజ్జర్ హత్య కేసులో భారత రాయబారి ప్రమేయముందని కెనడా ఆరోపించడంతో ఇరుదేశాల మధ్య దౌత్యసంబంధాలు దెబ్బతిని.. దౌత్యవేత్తలను పరస్పరం బహిష్కరించుకునే దాకా పరిస్థితి వెళ్లిన విషయం తెలిసిందే. ‘భారత్‌ను సహకరించాల్సిందిగా కోరాం. ఆధారాలు చూపమన్నారు. భారత నిఘా సంస్థలు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లి మాకు సహకరించాలని కోరాం. ఎందుకంటే ఈ దశలో కెనడా దగ్గరున్నది కేవలం నిఘా సమాచారం మాత్రమే’ అని ఎంకైర్వీ ముందు ట్రూడో చెప్పుకొచ్చారు. ‘జి20 సమావేశాల ముగింపు సమయంలో నేనీ విషయాన్ని భారత ప్రధాని మోదీ దృష్టికి తెచ్చాను. భారత్ ప్రమేయముందని మాకు తెలుసని చెప్పాను. కెనడాలో చాలామంది భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. వారందరినీ అరెస్టు చేయాలని కోరారు. జి20 సదస్సు నుంచి కెనడాకు తిరిగి వచ్చేసరికి భారత్ అసలు ఉద్దేశం సుస్పష్టమైంది. కెనడాను విమర్శించడం, మన ప్రజాస్వామ్యపు సమగ్రతను ప్రశ్నించడమే వారి అసలు ఉద్దేశం’ అని ట్రూడో ఎంక్వైరీ ముందు చెప్పారు.లేవంటూనే.. మళ్లీ పాతపాటనిఘా సమాచారం తప్పితే.. గట్టి ఆధారాలు అందజేయలేదని ఒకవైపు చెబుతూనే ట్రూడో మళ్లీ పాతపాట పాడారు. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉన్నట్లు తమ వద్ద విశ్వసనీయ ఆధారాలు ఉన్నాయని ఎంక్వైరీ కమిటీ ముందు ట్రూడో బుధవారం పునరుద్ఘాటించారు. భారత రాయబారులు కెనడా పౌరుల సమాచారం సేకరించి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చేరవేస్తున్నారని ఆరోపించారు. సోమవారం ఇవే ఆరోపణలు చేసినపుడు భారత్ గట్టిగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే. నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయంపై ఏ చిన్న ఆధారాన్ని కూడా కెనడా అందజేయలేదని విదేశాంగశాఖ పేర్కొంది. పలుమార్లు విజ్ఞప్తి చేసిన కెనడా స్పందించలేదని దుయ్యబట్టింది. కెనడా గడ్డపై వేర్పాటువాద శక్తులను కట్టడి చేయడానికి ఆ దేశం ఏమీ చేయడం లేదని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ట్రూడో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేసింది. -
అమర్నాథ్ యాత్రలో విధ్వంసానికి ఐఎస్ఐ కుట్ర
హిందువులు ఎంతో పవిత్రమైనదిగా భావించే అమర్నాథ్ యాత్రలో విధ్వంసానికి ఐఎస్ఐ తాజాగా ఖలీస్థానీ ఉగ్రవాద గ్రూపు బబ్బర్ ఖల్సాతో జతకట్టి కుట్ర పన్నినట్లు భారత రక్షణ విభాగం గుర్తించింది.బీజేపీ, హిందూ నేతలే టార్గెట్‌గా ఈ విధ్వంసానికి ఐఎస్ఐ వ్యూహం రచించినట్లు రక్షణశాఖ అధికారులు కనుగొన్నారు. పంజాబ్‌లోని గ్యాంగ్స్టర్లు.. ఉగ్రవాదులతో కలిసి ఈ కుట్రకు ప్లాన్ చేశారని అధికారులు భావిస్తున్నారు. కాగా గత నెలలో పంజాబ్‌లోని పఠాన్‌కోట్ పరిసరాల్లో ఉగ్రవాద కదలికలను ఇండియన్ ఆర్మీ గుర్తించింది. ఇదే సమయంలో జమ్ములో ఏడుగురు పాకిస్తాన్ ఉగ్రవాదులు చొరబడినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఇటీవలికాలంలో భద్రతా బలగాలపై జరుగుతున్న దాడుల వెనుక పాక్ కుట్ర ఉందని భారత రక్షణ విభాగం భావిస్తోంది. తాజాగా నియంత్రణ రేఖ వద్ద భారత బలగాలపై పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ (బీఏటీ) చేసిన దాడిని భారత ఆర్మీ దళాలు భగ్నం చేశాయి. -
పన్నూ హత్యకు కుట్ర: ‘భారత్ దర్యాప్తు వివరాలపై ఎదురు చూస్తున్నాం’
న్యూయార్క్: ఖలీస్తానీ ఉగ్రవాది గురు పత్వంత్‌సింగ్ పన్నూ హత్య కుట్రలో భారత్‌కు చెందిన వ్యక్తి ప్రమేయం ఉందని అమెరికా ఆరోపణలు చేసింది. గత ఏడాది ఇదే అంశంపై అమెరికా సమాచారాన్ని పంపించగా దానిపై భారత ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తున్నామని తెలిపింది. ఇటీవల అమెరికా సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ సభ్యులు పన్నూ హత్యకుట్రలో భారత్ ప్రమేయంపై దౌత్యపరమైన స్పందన కోరాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌కు లేఖ రాశారు. సెనేట్ సభ్యులు రాసిన లేఖపై మీడియా అడిగిన ప్రశ్నకు బుధవారం విదేశాంగ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పందించారు.‘ఎప్పటిలాగే ఆ సభ్యుల గురించి నేను ప్రైవేట్‌గా మాత్రమే స్పందిస్తాను. ప్రస్తుతం ఇక్కడ ఆ విషయంపై ఏం వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు. పన్నూ హత్య కుట్ర ముందుగా మా దృష్టికి వచ్చినప్పుడు స్పష్టంగా భారత ప్రభుత్వానికి సమాచారం అందించాం. ఈ కేసులో భారత ప్రభుత్వం పూర్తి జవాబుదారితనంతో దర్యాప్తు చేస్తుందని ఆశిస్తున్నాం. ఇప్పటికే ఈ కేసులో భారత్ ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొంది. భారత్ దర్యాప్తు తుది వివరాలను తెలుసుకోవడానికి ఎదురుచేస్తున్నాం’’ అని మిల్లర్ తెలిపారు.పన్నూ హత్యకు భారతీయ వ్యక్తి నిఖిల్ గుప్తా ( 52 ) మరో వ్యక్తితో కలసి కుట్ర చేశారనే ఆరోపణలపై చెక్ రిపబ్లిక్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఆయన్ను విచారించేందుకు చెక్ రిపబ్లిక్ పోలీసులు.. అమెరికాకు అప్పగించగా కోర్టులో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. -
నిజ్జర్‌కు కెనడా పార్లమెంటు నివాళి
న్యూఢిల్లీ: ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ మృతి చెంది ఏడాది గడిచిన సందర్భంగా మంగళవారం కెనడా పార్లమెంటు నివాళులరి్పంచింది. హౌస్ ఆఫ్ కామన్స్‌లో సభ్యులు మౌనం పాటించారు. ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్) అధినేత నిజ్జర్ గత ఏడాది జూన్ 18న కెనడాలోని బ్రిటిష్ కొలంబియా గురుద్వారా ఎదుట జరిగిన కాల్పుల్లో హతమాయ్యాడు. భారత ప్రభుత్వం ప్రకటించిన టెర్రిరిస్టుల జాబితాలో నిజ్జర్ పేరు ఉంది. నలుగురు భారతీయులు నిజ్జర్ హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందని కెనడా ఆరోపిస్తోంది. అప్పటినుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. 1997లో నకిలీ పాస్‌పోర్ట్‌పై నిజ్జర్ కెనడాకు వెళ్లాడు. శరణార్థిగా కెనడా పౌరసత్వాన్ని కోరాడు. ఇది తిరస్కరణకు గురైంది. అనంతరం తాను కెనడాకు రావడానికి సహాయపడ్డ మహిళను నిజ్జర్ వివాహమాడి మరోమారు పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోగా.. మళ్లీ తిరస్కరణకు గురైంది. అయితే నిజ్జర్ హత్యకు గురైన వెంటనే కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడెయూ అతను కెనడా పౌరుడని పార్లమెంటులో చెప్పారు. నిజ్జర్ కేటీఎఫ్ కోసం నియామకాలు చేసుకొని.. వారికి శిక్షణ ఇస్తున్నాడని భారత భద్రతా సంస్థలు పేర్కొన్నాయి. నిజ్జర్‌కు కెనడా పార్లమెంటు నివాళి అరి్పంచడంపై వాంకోవర్‌లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. 1985లో ఎయిర్ ఇండియా కనిష్క విమానంలో ఖలిస్తానీ తీవ్రవాదులు బాంబులు అమర్చడంతో 329 ప్రాణాలు కోల్పోయారు. వారి స్మృత్యర్థం ఈనెల 23న (విమాన ఘటన 39 ఏళ్లు) సంస్మరణ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. -
నిజ్జర్‌కు నివాళా?.. కెనడాకు భారత్ ‘కనిష్క’ కౌంటర్
ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ మొదటి వర్థంతి సందర్భంగా కెనడా పార్లమెంట్ (హౌస్ ఆఫ్ కామన్స్) మౌనం పాటించటంపై భారత్ స్పందించింది. ఈ మేరకు వాంకోవర్‌లోని భారత్ కాన్సలేట్ జనరల్ ‘ఎక్స్’లో ఓ పోస్ట్ పెట్టింది. ‘ఉగ్రవాద ముప్పును ఎదుర్కొవటంలో భారత్ ముందజంలో ఉంది. అదీకాక, ఉగ్రవాద ముప్పు పరిష్కారానికి ప్రపంచ దేశాలతో కలసి పనిచేస్తాం. 1985లో ఎయిరిండియా విమానం 182 (కనిష్క)పై ఖలిస్తానీ ఉగ్రవాదులు చేసిన బాంబు దాడి ఘటనకు జూన్ 23తో 39 ఏళ్లు పూర్తి అవుతుంది. ఈ దాడిలో 86 మంది చిన్నారులతో సహా 329 మంది ప్రాణాలు కోల్పోయారు. .. ఖలిస్తానీ ఉగ్రవాదులు కనిష్క ఎయిరిండియా విమానంపై చేసిన బాంబ్ దాడిలో మృతి చెందినవారికి స్మారకంగా నివాళులు అర్పిస్తాం. జూన్ 23న స్టాన్లీ పార్క్‌లోని సెపర్లీ ప్లేగ్రౌండ్‌లో జరిగే ఈ స్మారక కార్యకమంలో భారతీయులు పాల్గొని తీవ్రవాదానికి వ్యతిరేకంగా సంఘీభావం తెలపాలి’ అని భారత్ కాన్సలేట్ జనరల్ పేర్కొంది.India stands at the forefront of countering the menace of terrorism and works closely with all nations to tackle this global threat. (1/3)— India in Vancouver (@cgivancouver) June 18, 2024 ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ మొదటి వర్థంతి సందర్భంగా కెనడా పార్లమెంట్ నివాళులు అర్పించింది. ఈ మేరకు మంగళవారం కెనడా పార్లమెంట్( హౌస్ ఆఫ్ కామన్స్) మౌనం పాటించింది.ఖలిస్తానీ టైగర్ ఫోర్స్( కేటీఎఫ్) చీఫ్ హర్దిప్ సింగ్ నిజ్జర్ గతేడి జూన్ 18 కెనడాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా ముందు జరిగిన కాల్పుల్లో మృతి చెందారు. భారత్ విడుదల చేసిన 40 మంది తీవ్రవాదుల జాబితాలో హర్దిప్ సింగ్ నిజ్జర్ పేరు కూడా ఉండటం గమనార్హం. నిజ్జర్‌ను హత్య చేసిన వారిలో నలుగురు భరతీయులు.. కరణ్ బ్రార్, అమన్‌దీప్ సింగ్, కమల్‌ప్రీత్ సింగ్, కరణ్‌ప్రీత్ సింగ్ నిందితులుగా ఉన్నారు.తీవ్రవాది హర్దిప్ హత్యతో భారత్ హస్తం ఉందిన కెనడా ఆరోపలు చేసింది. ఈ ఆరోపణను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇక.. అప్పటి నుంచి ఇరు దేశాల దౌత్య పరమైన సంబంధాలు దెబ్బతిన్నాయి.ఇక.. ఇటీవల ఇటలీలో జరిగిన జీ-7 సమ్మిట్‌లో ప్రధాని మోదీ, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్థిక సంబంధాలు, జాతీయ భద్రత విషయాల్లో భారత్ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంతో సంబంధాలు ఏర్పరుచుకునే అవకాశం ఉందని ట్రూడో తెలిపారు.ఎవరీ హర్దీప్ సింగ్ నిజ్జర్.. భారత్ దేశంలో జరిగిన అనేక హింసాత్మక కార్యకలాపాల్లో అతని ప్రమేయముంది. ప్రస్తుతం నిజ్జర్ ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్‌గా వ్యవహరిస్తున్నాడు. పంజాబ్ రాష్ట్రాన్ని భారత్ దేశం నుండి వేరు చేయాలని డిమాండ్ చేస్తున్న సిఖ్ ఫర్ జస్టిస్(SFJ) సంస్థతో కూడా నిజ్జర్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని ప్రకటించని జాతీయ దర్యాప్తు సంస్థ. జలంధర్‌కు చెందిన ఒక పూజారిని హత్య చేయడానికి ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్‌తో కలిసి కుట్ర పన్నాడన్న ఆరోపణల మీద జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అతని కోసం కెనడా ప్రభుత్వాన్ని కోరింది. చివరకు కెనడా అధికారులు అతడిని అప్పగించేలోపే హత్య చేయబడ్డారు. -
పన్నూ హత్యకు కుట్ర ఆరోపణలు..
వాషింగ్టన్: ఖలిస్తానీ ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై భారత్‌కు చెందిన నిఖిల్ గుప్తాను చెక్ రిపబ్లిక్ గత వారం అమెరికాకు అప్పగించింది. గుర్తు తెలియని భారతీయ అధికారి ఆదేశాల మేరకు కెనడా, అమెరికా ద్వంద పౌరసత్వమున్న పన్నూను అమెరికా గడ్డపైనే చంపేందుకు నిఖిల్ గుప్తా కిరాయి హంతకుడికి డబ్బులిచి్చనట్లు అమెరికా ఆరోపిస్తోంది. అమెరికా ప్రభుత్వ వినతి మేరకు చెక్ రిపబ్లిక్లో ఉన్న నిఖిల్‌ను అక్కడి ప్రభుత్వం గత ఏడాది అరెస్ట్ చేసింది. అయితే, అమెరికా ఆరోపణలను భారత్ ఖండించింది. నిఖిల్ ప్రస్తుతం అమెరికాలోని బ్రూక్లిన్‌లో ఫెడరల్ మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో ఉన్నారు. -
నిజ్జర్ హత్య కేసు.. ముగ్గురు భారతీయుల అరెస్ట్
ఒట్టావా: భారత్-కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు అనుమానితులను శుక్రవారం కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు భారతీయులే కావడం గమనార్హం. కరణ్ బ్రార్(22), కమల్ ప్రీత్ సింగ్(22), కరణ్ ప్రీత్ సింగ్(28)లను అరెస్ట్ చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ముగ్గురు అనుమానితులు ఎడ్మోంటన్‌లోని అల్బెర్టాలో ఉంటున్నారని.. వారికి అక్కడే అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరు 3 నుంచి 5 ఏళ్ల నుంచి కెనడాలో ఉంటున్నారని తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు కొసాగుతోందని పోలీసులు తెలిపారు. మరోవైపు నిజ్జర్ హత్యలో భారత్‌కు ఉన్న సంబంధాలపై కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ హత్య కేసులో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోందని.. వారిని కూడా అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.గతేడాది జూన్ 18న కెనడా బ్రిటిష్ కొలంబియా ప్రావిన్సు సర్రే పట్టణంలో ఉన్న గురునానక్ సిక్ గురుద్వారా సాహిబ్ ఆవరణలో నిజ్జర్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపి హత్య చేసిన విషయం తెలిసిందే. నిజ్జర్ హత్య కేసులో భారత్‌కు సంబంధించిన ఏజెంట్ హస్తం ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేశాడు. ట్రూడో ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. ట్రూడో ఆరోపణల నేపథ్యంలో ఈ విషయంలో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. -
పన్నూ హత్యకు కుట్ర: వాషింగ్టన్ రిపోర్టుపై స్పందించిన యూఎస్
న్యూయార్క్: అమెరికాలో జరిగిన ఖలీస్తానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య చేసేందుకు ఓ భారతీయ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించిన నివేదికపై అమెరికా స్పందించింది. పన్నూ హత్య కుట్రకు సంబంధించిన ఆరోపణల దర్యాప్తులో తాము నిరంతరం భారత్‌తో టచ్‌లో ఉండి, ఈ వ్యవహారంపై పని చేస్తున్నామని అగ్రరాజ్యం అధికార ప్రతినిధి వేదాంత పటేల్ తెలిపారు.‘పన్నూ హత్య కుట్రకు సంబంధించి భారత్ ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల కమిటీ విచారణపై పూర్తి జవాబుదారితనాన్ని ఆశిస్తున్నాం. అమెరికా.. భారత్‌తో ఈ విషయంలో నిత్యం టచ్‌లో ఉంటుంది. ఈ కేసులో పురోగతి ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ.. మరింత సమాచారం తెలుసుకుంటున్నాం. పలు స్థాయిల్లో అమెరికా ఆందోళనను ప్రత్యేక్షంగా భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. నేను ఈ విషయంలో మరింత జోక్యం చేసుకోలేను’ అని వేదాంత పటేల్ తెలిపారు.ఇక.. వాషింగ్టన్ పోస్ట్ వెల్లండించిన నివేదికపై భారత్ తీవ్రంగా ఖండించింది. ‘వాషింగ్టన్ పోస్ట్ కథనం పూర్తిగా అసమంజసం, నిరాధారమం. క్రిమినల్, ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు సంబంధించి అమెరికా లేవనెత్తిన భద్రతా సమస్యలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ దర్యాప్తు చేస్తుంది. అయినప్పటికీ ఊహాగానాలు, బాధ్యతరహితమైన వ్యాఖ్యలు చేయటం సరికాదు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు’ భారత్ విదేశంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌దీర్ జైశ్వాల్ అన్నారు.ఈ కేసులో కుట్రదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత్‌కు చెందిన నిఖిల్ గుప్తాకు సీసీ-1 అనే పేరు తెలియని అధికారి ప్రమేయం ఉన్నట్లు అమెరికా పేర్కొంది. అయితే తాజాగా వాషింగ్టన్ పోస్ట్ ఆ అధికారిని విక్రమ్ యాదవ్‌గా గుర్తించింది. అమెరికా ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు భారత్ 2023 నవంబర్‌లో ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
పన్నూ హత్యకు కుట్ర.. యూఎస్ మీడియా రిపోర్డును ఖండించిన భారత్
ఢిల్లీ: అమెరికాలో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూను హత్యచేసేందుకు భారత మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ప్రణాళికా రచించాడని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించిన నివేదికను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత రా(RAW)మాజీ అధికారి విక్రమ్ యాదవ్ అమెరికాలో గురుపత్వంత్ సింగ్‌ను హత్య చేయాలని ఓ బృందాన్ని ఏర్పాటు చేశారని వాషింగ్టన్ పోప్ట్ తన రిపోర్టులో తెలిపింది. దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ స్పందించారు. ‘వాషింగ్టన్ పోస్ట్ కథనం పూర్తిగా అసమంజసం, నిరాధారమం. క్రిమినల్, ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు సంబంధించి అమెరికా లేవనెత్తిన భద్రతా సమస్యలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ దర్యాప్తు చేస్తుంది. అయినప్పటికీ ఊహాగానాలు, బాధ్యతరహితమైన వ్యాఖ్యలు చేయటం సరికాదు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు’ అని అన్నారు. ఈ కేసులో కుట్రదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత్‌కు చెందిన నిఖిల్ గుప్తాకు సీసీ-1 అనే పేరు తెలియని అధికారి సాయం చేసినట్లు అమెరికా పేర్కొంది. అయితే తాజాగా వాషింగ్టన్పోస్ట్ ఆ అధికారిని విక్రమ్ యాదవ్‌గా గుర్తించింది. ఈ కేసులో అమెరికా తరచూ చేస్తున్న ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికా ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు భారత్ 2023 నవంబర్‌లో ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
నిజ్జర్ హత్య కేసు.. కెనడా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
ఒట్టావో: ఖలిస్తానీ ఉద్యమ నేత హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య కేసు విచారణలో భారత్ నుంచి పూర్తి సహకారం అందుతోందని కెనడా తాజా మాజీ నేషనల్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ అడ్వైజర్ జోడీ థామస్ తెలిపారు. శుక్రవారం ఆమె తన పదవి నుంచి రిటైర్ అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘నిజ్జర్ హత్య కేసు విచారణలో భారత్ పూర్తిగా సహకరిస్తోంది. రెండు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ బలోపేతమయ్యే దిశగా ముందుకు వెళుతున్నాయి. నిజ్జర్ హత్య కేసులో ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారణ చేస్తోంది. విచారణ సాఫీగా సాగేందుకు భారత్ మాతో కలిసి పనిచేస్తోంది’ అని థామస్ చెప్పారు. కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలో ఉన్న సర్రే నగరంలో 2023 జూన్ 18న నిజ్జర్ హత్య జరిగింది. ఈ హత్యకు భారత్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్(రా) వింగ్‌కు చెందిన ఏజెంట్లకు ఉన్న లింకుపై విచారణ చేపట్టామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అప్పట్లో ఆ దేశ హౌజ్ ఆఫ్ కామన్స్‌లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యల తర్వాత ఇరు దేశాలు రాయబారులను పరస్పరం బహిష్కరించాయి. ట్రూడో వ్యాఖ్యలు అభ్యంతరకరమని అప్పట్లో భారత్ ఖండించింది. ఇదీచదవండి.. వేధింపుల కేసులో భారత అమెరికన్ జంటకు 20 ఏళ్ల జైలు -
ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ మరోసారి బెదిరింపులు
ఢిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను ఈ రిపబ్లిక్ డే రోజు హత్య చేస్తానని బెదిరింపులు చేశాడు. జనవరి 26న భగవంత్ మాన్‌పై గ్యాంగ్స్టర్లు ఏకమై దాడికి దిగాలని పన్నూ కోరారు. గ్యాంగ్స్టర్లపై రాష్ట్ర పోలీసు యంత్రాంగం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తున్నదని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు. పన్నూ బెదిరింపులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సిక్కు ఫర్ జస్టిస్ (SFJ) వ్యవస్థాపకుడు పన్నూ గతంలో భారతీయ సంస్థలు, అధికారులపై అనేకమార్లు బెదిరింపులకు పాల్పడ్డాడు. గత నెల, డిసెంబర్ 13న భారత పార్లమెంటుపై దాడి చేస్తానని వీడియోను విడుదల చేశాడు. అదే క్రమంలో పార్లమెంట్‌పై డిసెంబర్ 13న ఆగంతకులు కలర్ బాంబు షెల్స్‌తో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూ మరొక బెదిరింపు వీడియో ఇటీవల బయటపడింది. నవంబర్ 19న ఎయిర్ ఇండియాలో వెళ్లాలనుకుంటున్న ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని బెదిరింపులు చేశాడు. ఎయిరిండియా బెదిరింపు వీడియోపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పన్నూపై కేసు నమోదు చేసింది. ఇదీ చదవండి: కృష్ణ జన్మభూమి కేసు: మసీదు సర్వేపై సుప్రీంకోర్టు స్టే -
సిక్కు వేర్పాటువాది రెచ్చగొట్టే వ్యాఖ్యలు
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత 'సిఖ్స్ ఫర్ జస్టిస్' నేత గురుపత్వంత్ సింగ్ మరోసారి భారత్‌లో హింసాకాండ రెచ్చగొట్టే ప్రకటన చేశాడు. అయోధ్యలో రామ మందిరంలో రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగే రోజు (జనవరి 22న) అమృత్సర్ నుంచి అయోధ్య వరకు ఎయిర్‌పోర్టులు మూసివేయాలన్నాడు. సిఖ్స్ ఫర్ జస్టిస్(SFJ)సైతం రామ మందిరాన్ని ముస్లింలు వ్యతిరేకించాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. ‘ఇప్పుడు సమయం వచ్చింది.. ముస్లిలంతా రామ మందిరాన్ని వ్యతిరేకించాలి’ అని రెచ్చగొడుతూ.. గరుపత్వంత్ సింగ్ సోమవారం వీడియో రిలీజ్ చేశాడు. దీంతో భారత్ అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకోకుండా.. పోలీసులు అన్ని చోట్ల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇక.. అమెరికాలో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర జరిగిందని, దీనిని తాము భగ్నం చేశామని ఇటీవల అగ్రరాజ్యం ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పన్నూన్ హత్యకు కుట్రలో 52 ఏళ్ల నిఖిల్ గుప్తా అనే భారత పౌరుడి ప్రమేయం ఉందంటూ యూఎస్‌లోని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు అతనిపై అభియోగాలు మోపారు. గుప్తా భారత ప్రభుత్వ ఏజెన్సీ ఉద్యోగితో కుమ్మక్కయ్యాడని ఆరోపించారు. అతన్ని చెక్ రిపబ్లిక్లో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. చదవండి: Ayodhya Ram Mandir: ‘అయోధ్య’ విరాళాల మొత్తం ఇప్పటివరకూ ఎంత? అధిక మొత్తం ఇచ్చిందెవరు? -
ఖలిస్తానీ ఉగ్రవాది హత్యకు కుట్ర.. తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత 'సిఖ్స్ ఫర్ జస్టిస్' నేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర కేసులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ.. ఇతర దేశాల్లోని మా భారత పౌరులు చెడు పనులు చేసినట్లు తమకు సమాచారం అందిస్తే.. వాటిని తాము పరిశీలిస్తామని తెలిపారు. తగిన ఆధారాలు అందిస్తే విచారణ జరిపేందుకు సహకరిస్తామని తెలిపారు. అదే విధంగా భారత్- అమెరికా మధ్య సంబంధాలలో భద్రత, ఉగ్రవాద వ్యతిరేక సహకారం కీలకమైన అంశమని మోదీ పేర్కొన్నారు. ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలను ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలతో ముడిపెట్టడం సరికాదని అన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా విదేశాలలో తీవ్రవాద సంస్థల కార్యకలాపాలపై ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వీరంతా భావ ప్రకటనా స్వేచ్ఛ ముసుగులో బెదిరింపులకు పాల్పడుతున్నారని, హింసను ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. కాగా అమెరికాలో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర జరిగిందని, దీనిని తాము భగ్నం చేశామని ఇటీవల అగ్రరాజ్యం ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పన్నూన్ హత్యకు కుట్రలో 52 ఏళ్ల నిఖిల్ గుప్తా అనే భారత పౌరుడి ప్రమేయం ఉందంటూ యూఎస్‌లోని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు అతనిపై అభియోగాలు మోపారు. గుప్తా భారత ప్రభుత్వ ఏజెన్సీ ఉద్యోగితో కుమ్మక్కయ్యాడని ఆరోపించారు. అతన్ని చెక్ రిపబ్లిక్లో అదుపులోకి తీసుకున్నారు. చదవండి: ఈడీ విచారణకు సీఎం కేజ్రీవాల్ మళ్లీ డుమ్మా?.. కారణమిదే! -
భారత రాయబారిని అడ్డుకున్న ఖలిస్థానీ మద్దతుదారులు
న్యూయార్క్: అమెరికాలో భారత రాయబారిని ఖలిస్థానీ మద్దతుదారులు అడ్డుకున్నారు. న్యూయార్క్‌లోని గురుద్వారాలో రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధూని చుట్టుముట్టారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని ఆరోపించారు. సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నుతున్నారని నినాదాలు చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గురునానక్ జయంతి సందర్భంగా న్యూయార్క్ న్యూఐలాండ్లోని గురుద్వారాలో ప్రార్ధనల్లో పాల్గొని తరణ్‌జిత్ సింగ్ బయటకు వచ్చిన సందర్భంగా ఖలిస్థానీ మూకలు అడ్డుతగిలారు. ఈ ఘటనను బీజేపీ నాయకుడు మంజిందర్ సింగ్ తప్పుబట్టారు. ఇది సిక్కుల భావాజాలమా? గురునానక్ బోధనలు ఇదే చెబుతున్నాయా? ఈ ఖలిస్థానీ గుండాలు సిక్కులు కానేకాదని మంజిందర్ సింగ్ మండిపడ్డారు. Khalistanies tried to heckle Indian Ambassador @SandhuTaranjitS with basless Questions for his role in the failed plot to assassinate Gurpatwant, (SFJ) and Khalistan Referendum campaign. Himmat Singh who led the pro Khalistanies at Hicksville Gurdwara in New York also accused… pic.twitter.com/JW5nqMQSxO — RP Singh National Spokesperson BJP (@rpsinghkhalsa) November 27, 2023 కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ట్రూడో ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని విమర్శించింది. ఆనాటి నుంచి కెనడా-భారత్ మధ్య దౌత్య పరమైన సంబంధాల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. నిజ్జర్ హత్య కేసు తర్వాత భారత రాయబారులకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. సెప్టెంబర్‌లో యూకేలోనూ భారత రాయబారి విక్రమ్ దొరైస్వామిని గురుద్వారాలోకి ప్రవేశించకుండా దుండగులు అడ్డుకున్నారు. అయితే.. ప్రస్తుతం తరణ్‌జిత్ సింగ్‌ని ఖలిస్థానీ మద్దతుదారులు చుట్టుముట్టడంపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. రాయబారుల భద్రత పట్ల అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది. ఇదీ చదవండి: భారతీయులకు గుడ్‌న్యూస్.. ఆ దేశానికి వెళ్లాలంటే నో ‘వీసా’ -
పన్నూ హత్య ‘కుట్ర’ భగ్నం? భారత్ స్పందన ఇది
ఖలిస్థానీ వేర్పాటువాది, నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర జరిగిందన్న ఓ కథనం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ కుట్రను తాము భగ్నం చేశామని, పైగా ఈ విషయాన్ని భారత్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు అమెరికా ప్రకటించడంతో మరింత దుమారం రేపింది. అమెరికా గడ్డపై గురుపత్వంత్ సింగ్ పన్నూను చంపేందుకు చేసిన ప్రయత్నాలను.. తాము భగ్నం చేశామని అక్కడి అధికారులు వెల్లడించినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రచురించింది. అందులో సారాంశం.. ‘‘ఈ అంశాన్ని మేం తీవ్రంగా పరిగణించాం. అంతేకాదు.. భారత ప్రభుత్వానికి చెందిన ఉన్నతస్థాయి అధికారుల వద్ద దీనిని ప్రస్తావించాం. ఈ విషయం వినగానే భారత అధికారులు ఆశ్చర్యంతో పాటు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఢిల్లీ వర్గాలు తదుపరి దర్యాప్తు చేస్తాయని మాకు అర్థమైంది. రాబోయే రోజుల్లో దీని గురించి మరింత సమాచారం బయటకు వస్తుంది. ఈ కుట్రకు బాధ్యులైన వారికి శిక్ష పడాలని మేం భావిస్తున్నాం’’ అని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి ఆండ్రీన్ వాట్సన్ పేరిట కథనం ప్రచురితమైంది. ఇదీ చదవండి: గురుపత్వంత్ సింగ్ పన్నూ ఎవరో తెలుసా? మరోవైపు ఈ కథనంపై ఆందోళన వ్యక్తం చేసిన భారత విదేశాంగశాఖ.. అమెరికా ఇచ్చిన సమాచారాన్ని తాము పరిశీలిస్తున్నట్లు తెలిపింది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చి మాట్లాడుతూ.. భారత్-అమెరికా భద్రతా సహకారంపై ఇరు దేశాల మధ్య ఇటీవల కొన్ని చర్చలు జరిగాయి. వీటిలో భాగంగా వ్యవస్థీకృత నేరగాళ్లు, ఉగ్రవాదులు, వారి మధ్య బంధాలు, తదితర అంశాల గురించి అమెరికా అధికారులు కొంత సమాచారమిచ్చారు. ఆ సమాచార తీవ్రతను భారత్ గుర్తించింది. అది రెండు దేశాల భద్రతా ప్రయోజనాలకు ఆందోళనకరం. అమెరికా పంచుకున్న ఆ సమాచారాన్ని సంబంధిత శాఖలు పరిశీలిస్తున్నాయి’’ అని అన్నారు. మరోవైపు పన్నూ హత్యకు జరిగిన కుట్రకు సంబంధించి అమెరికా నిఘా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోందట. అయితే, ఈ కుట్ర గురించి అమెరికాకు ఎలా తెలిసింది? కుట్రను ఎలా భగ్నం చేశారన్న వివరాలను మాత్రం సదరు వర్గాలు బయటపెట్టలేదు. ఇదీ చదవండి: గురపత్వంత్కు భారత్ దెబ్బ.. అదుర్స్ -
కెనడాకు మళ్లీ ఈ వీసా సేవలు
ఒట్టావా/న్యూఢిల్లీ: కెనడాతో దౌత్య వివాదం నేపథ్యంలో ఆ దేశస్థులకు నిలిపేసిన ఎల్రక్టానిక్ వీసాల జారీ సేవలను కేంద్రం పునరుద్ధరించింది. ఒట్టావాలోని భారత హై కమిషన్ బుధవారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో ఈ మేరకు వెల్లడించింది. చేసింది. కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాద నేత హర్దీప్సింగ్ నిజ్జర్ గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో మరణించడం, అది భారత గూఢచారుల పనేనని ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం తెలిసిందే. దాంతో ఇరు దేశాల సంబంధాలు బాగా క్షీణించాయి. -
ఎయిరిండియా ఎక్కొద్దు: ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్‌కు ఎన్ఐఏ షాక్
టాటా యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎయిరిండియా కార్యకలాపాలను నిలిపివేస్తామని బెదిరింపులకు పాల్పడిన ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌కు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) షాకిచ్చింది. అతడిపై పలు సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేసినట్లు సోమవారం పేర్కొంది. భారతీయ శిక్షాస్మృతి, కఠినమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద కేసు పెట్టినట్టు వెల్లడించింది. సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ నవంబర్ 4 న ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. సిక్కులు ఎవరూ నవంబరు 19న ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించవద్దని, ఒకవేళ అలా ఎవరైనా ప్రయాణిస్తే ప్రాణాలు ప్రమాదంలో పడతాయని హెచ్చరించాడు. మొత్తం 37 సెకెన్ల వీడియోలో అదే రోజు నవంబర్ 19న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుందంటూ బెదిరించడం వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కలకలం రేపాయి. దీంతో హై అలర్ట్ జారీ చేసిన ఇండియా, కెనడాతోపాటు ఎయిరిండియా పయనిచంఏ ప్రయాణించే కొన్ని ఇతర దేశాలలో భద్రతా దళాలు దర్యాప్తు ప్రారంభించాయి. 2019లో యాంటీ టెర్రర్ ఏజెన్సీ అతనిపై తొలి కేసు నమోదైంది. అప్పటికీ అతడు ఎన్ఐఏ దృష్టిలో కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే పంజాబ్ ,చండీగఢ్‌లోని అమృత్‌సర్‌లో ఇల్లు , కొంతభూమిని జప్తు చేసింది. 2021 ఫిబ్రవరిలో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు పన్నన్‌పై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. గత ఏడాది నవంబర్ 29న అతన్ని "ప్రకటిత నేరస్థుడిగా" ప్రకటించింది. భారత్-కెనడా సంబంధాలు దెబ్బతిన్నప్పటి నుంచి గురుపత్వంత్ సింగ్ పన్నూన్ పేరు ప్రతిచోటా మారుమోగుతున్న సంగతి తెలిసిందే.