
ఖలిస్తానీ ఉగ్రవాది బెదిరింపులపై కెనడా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ప్రతి బెదిరింపును తాము సీరియస్‌గా తీసుకుంటామని కెనడా రవాణాశాఖ మంత్రి మంత్రి పాబ్లో రోడ్రిగ్జ్ వెల్లడించారు.ముఖ్యంగా విమానయాన సంస్థలను హెచ్చరిస్తూ వచ్చిన బెదిరింపులలను తీవ్రంగా పరిగణిస్తామని పేర్కొన్నారు. ఎయిర్ ఇండియాపై వచ్చిన బెదిరింపు వీడియోపై తమ పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
కాగా గతవారం ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించవద్దని, అది ప్రమాదకరమని ఖలిస్తానీ వేర్పాటువాది, ‘సిఖ్ ఫర్ జస్టిస్’ వ్యవస్థాపకుల్లో ఒకరైన గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. అతను ఎయిరిండియా ప్రయాణికులకు తీవ్ర హెచ్చరికలు చేశాడు. ‘నవంబర్ 19 తరువాత ఎయిర్ ఇండియా విమానాల్లో సిక్కులవరూ ప్రయాణించకండి. మీ ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది’ అని వీడియో ద్వారా కెనడా మీడియాకు తెలిపారు.
అంతేగాక ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా ఆ విమానాలను అనుమతించబోమని హెచ్చరించాడు. దాంతోపాటు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఆ రోజు మూసివేస్తామని, దాని పేరు మారుస్తామని వీడియోలో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇది కేవలం బెదిరింపు మాత్రమే కాదని, భారత వ్యాపార సంస్థలను నిషేధించేందుకు ఇచ్చిన పిలుపు కూడా అని పేర్కొన్నారు. ఇక ఖలిస్థాన్ ఉగ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. ఢిల్లీ, పంజాబ్ విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది.
ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జార్ సింగ్ హత్య విషయంలో భారత్ కెనడా మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్న నెలకొన్న విషయం తెలిసిందే. నిజ్జార్ సింగ్ హత్య విషయంలో భారత ఏజెంట్ల ప్రమోయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ట్రూడ్ ఆరోపించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కెనడా ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది.
చదవండి: పాక్‌లో అంగతకుల కాల్పులు.. లష్కరే తోయిబా మాజీ కమాండర్ మృతి
Comments
Please login to add a commentAdd a comment