Threatening
-
‘‘రేయ్.. నీ కథ చూస్తా!’’ జేసీ బెదిరింపులు వెలుగులోకి
అనంతపురం, సాక్షి: కూటమి సర్కార్ అండతో తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) రెచ్చిపోతూనే ఉన్నారు. అధికారులు, రాజకీయ నేతలు ఎవరనేది చూడకుండా దురుసుగా ప్రవర్తిస్తూ నిత్యం వార్తల్లోక్కి ఎక్కుతున్నారు. తాజాగా మరోసారి ఆయన వివాదంలో నిలిచారు. ఓ దళిత నేతను ఫోన్లో బెదిరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పైగా ఇది ఇక్కడితోనే ఆగలేదు. దళిత సంఘం నేత రాంపుల్లయ్య మున్సిపల్ సమావేశాలకు హాజరు కావడం లేదు. ఈ విషయంపై ఆయన్ని ఫోన్లో బెదిరించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పిలిచినా మీటింగ్‌కు రాకపోవం ఏంటని జేసీ ప్రశ్నించగా.. ఆ ఆహ్వానం గౌరవంగా ఉండాలని రాంపుల్లయ్య అన్నారు. ఆ సమాధానం తట్టుకోలేని జేసీ ‘‘నేను పిలిస్తే రావా.. రేయ్.. నీ కథ చూస్తా’’ అంటూ చిందులు తొక్కాతూ ఫోన్ పెట్టారు. అయితే.. ఈ బెదిరింపుల వ్యవహారాన్ని తాడిపత్రి(Tadipatri) సీఐ సాయి ప్రసాద్ దృష్టికి ఫోన్ ద్వారా రాంపుల్లయ్య తీసుకెళ్లారు. ఈ క్రమంలో.. సీఐ కూడా జేసీకి మద్దతుగా రాం పులయ్యనే దూర్భాషలాడారు. పరస్పర దూషణలతో కూడిన ఆ ఆడియో క్లిప్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇదీ చదవండి: ఏపీ రాజకీయాలకు సరిగ్గా సరిపోయే సామెత! -
ప్రధాని మోదీ హత్యకు ప్లాన్ అంటూ బెదిరింపు కాల్.. మహిళ అరెస్ట్
ముంబై: ఈ మధ్యకాలంలో బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయి. రాజకీయ ప్రముఖులు, స్కూల్స్, ఎయిర్‌పోర్టులు, మాల్స్ లక్ష్యంగా ప్రతిచోట బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకే బెదిరింపులు వచ్చాయి. ప్రధాని హత్యకు ప్లాన్ చేస్తున్నట్లు ఓ మహిళ ముంబై పోలీసులకు ఫోన్ చేసి ఈ బెదిరింపులకు పాల్పడింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.గురువారం ఉదయం ముంబై పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ప్రధాని హత్యకు ప్లాన్ చేసినట్లు ఓ మహిళ బెదిరించారు. అందుకు ఓ ఆయుధాన్ని సైతం సిద్ధం చేసుకున్నట్లు తెలినింది.దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఫోన్‌కాల్‌ను ట్రేస్ చేయగా.. 34 ఏళ్ల మహిళ ఈ బెదిరింపులకు పాల్పడినట్లు తేలింది. కేసు నమోదు చేసుకున్న అంబోలీ పోలీసులు.. వెంటనే దర్యాప్తు చేపట్టారు. బెదిరింపులకు పాల్పడిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళపై గతంలో ఏం కేసులు లేవని, ఆమె మానసిక అనారోగ్యంతో బాధపడుతుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. ఇటీవల బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను బెదిరిస్తూ ముంబయి ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్‌రూమ్‌కు వరుసగా బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. -
అమెరికా వ్యాప్తంగా... జాత్యహంకార మెసేజ్‌లు
వాషింగ్టన్: జాత్యాహంకార సందేశాలు అమెరికాలో ఆందోళన రేపుతున్నాయి. మిడిల్ స్కూల్ విద్యార్థులతో పాటు నల్లజాతీయులనే లక్ష్యంగా చేసుకుని బెదిరింపు ఫోన్ సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. న్యూయార్క్, అలబామా, కాలిఫోర్నియా, ఒహాయో, పెన్సిల్వేనియా, టెనెసీ వంటి పలు రాష్ట్రాల్లో ఈ ఉదంతాలపై కేసులు నమోదయ్యాయి. సందేశాల్లో వాడిన పదాలు భిన్నంగా ఉన్నా బెదిరింపులు మాత్రం ఒకేలా ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. కొందరిని స్వస్థలం చిరునామా చెప్పాలంటూ బెదిరించగా మరికొందరిని రాబోయే అధ్యక్ష పాలన గురించి హెచ్చరించారు. ఈ సందేశాలపై న్యాయ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఎఫ్‌బీఐ తెలిపింది. ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్, ఫెడరల్, స్టేట్ లా ఎన్ఫోర్స్మెంట్తో కలిసి దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. ఒహాయో అటార్నీ జనరల్ కార్యాలయం కూడా ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. కించపరిచే వ్యాఖ్యలు పోలింగ్ జరిగిన గత బుధవారం సాయంత్రం తన 16 ఏళ్ల కుమార్తె ఫోన్‌కు సందేశం వచి్చనట్టు కాలిఫోరి్నయాలోని లోడీకి చెందిన తాషా డన్హామ్ చెప్పారు. ‘‘నా కూతురిని తక్షణం నార్త్ కరోలినాలోని ఒక తోటకు రావాలని ఆదేశించారు. ఆరా తీస్తే అక్కడో మ్యూజియం ఉంది’’అని తెలిపారు. ఈ పరిణామాలు తమను కలవరపరుస్తున్నాయన్నారు. పెన్సిల్వేనియాలోని మాంట్గోమెరీ కౌంటీలో ఆరుగురు మిడిల్ స్కూల్ విద్యార్థులకు కూడా ఇలాంటి సందేశాలే అందాయి. దక్షిణ కరోలినాలోని క్లెమ్సన్, అలబామా వంటి పలు విశ్వవిద్యాలయాల విద్యార్థులు తమకూ ఇలాంటి సందేశాలు వచి్చనట్టు చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ టెనెసీలోని నాష్‌విల్లేలో ఉన్న చరిత్రాత్మక నల్లజాతి విశ్వవిద్యాలయం ఫిస్క్ ప్రకటన విడుదల చేసింది. కొంతమంది విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్న ఈ సందేశాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయని తెలిపింది. మిస్సోరీ స్టేట్ వర్సిటీ చాప్టర్లో సభ్యులుగా ఉన్న నల్లజాతి విద్యార్థులకు కూడా సందేశాలు వచ్చాయి. వాటిలో ట్రంప్ గెలుపును ప్రస్తావించారు. నల్లజాతి విద్యార్థులను పత్తి ఏరడానికి ఎంపిక చేశారంటూ అందులో పేర్కొన్నారని మిస్సోరి ఎన్ఏఏసీపీ అధ్యక్షుడు నిమ్రోద్ చాపెల్ చెప్పారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఈ సందేశాల వెనుక ఎవరున్నారో ఇంకా తెలియలేదని లాయర్స్ కమిటీ ఫర్ సివిల్ రైట్స్ అండర్ లా డిజిటల్ జస్టిస్ ఇనిషియేటివ్ డైరెక్టర్ డేవిడ్ బ్రాడీ తెలిపారు. మేరీలాండ్, ఓక్లహామా వంటి 10కి పైగా రాష్ట్రాలతో పాటు డీసీలోనూ ఇలాంటి ఈ ఉదంతాలు చోటుచేసుకున్నట్టు అంచనా వేశారు. దీనిపై తమ ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తు చేస్తోందని పోలీసులు తెలిపారు. ఈ విద్వేష ఘటనలపై పలు పౌర హక్కుల చట్టాలను వర్తింపజేయవచ్చని బ్రాడీ చెప్పారు. సదరన్ పావర్టీ లా సెంటర్ ప్రెసిడెంట్, సీఈఓ మార్గరెట్ హువాంగ్ సహా పలు ఇతర పౌర హక్కుల సంస్థల నేతలు ఈ సందేశాలను ఖండించారు. ‘‘విద్వేషాలకు అమెరికాలో స్థానం లేదు. 2024లోనూ బానిసత్వ ప్రస్తావనలు తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. నల్లజాతి అమెరికన్ల జీవితాలు ప్రమాదంలో పడ్డాయి’’అని ఎన్ఏఏసీపీ అధ్యక్షుడు, సీఈఓ డెరిక్ జాన్సన్ ఆందోలన వెలిబుచ్చారు. -
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కు బెదిరింపులు
-
అమెరికా నుంచి లారెన్స్‌బిష్ణోయ్ తమ్ముడి బెదిరింపులు
న్యూఢిల్లీ:గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్‌పై గురుగ్రామ్‌లో బెదిరింపుల కేసు నమోదైంది. భీమ్‌సేన చీఫ్ సత్పల్ తన్వర్‌ను విదేశాల నుంచి బెదిరించినందుకు అన్మోల్‌పై కేసు రిజిస్టర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తన్వర్‌ను ముక్కలుముక్కలుగా నరికేస్తామంటూ అన్మోల్ గ్యాంగ్ బెదిరించినట్లు సమాచారం.అన్మోల్ జింబాబ్వే,కెన్యా ఫోన్ నెంబర్లను వాడుతూ అమెరికా, కెనడాల నుంచి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెప్పారు.ఈ కేసులో దర్యాప్తు కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అన్మోల్ను భారత్ తీసుకు రావడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.కాగా, అన్మోల్ బిష్ణోయ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.అతడి ఆచూకీ తెలిపితే రూ.10 లక్షల రివార్డు ఇస్తామని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ(ఎన్ఐఏ) పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. ఇదీ చదవండి: భీమ్ ఆర్మీచీఫ్ ప్రయాణిస్తున్న వందేభారత్ రైలుపై దాడి -
యూపీ సీఎం ఆదిత్యనాథ్ కు బెదిరింపు కాల్
-
పాక్ నుంచి బెదిరింపు కాల్స్
బనశంకరి: బెంగళూరు నగరంలో విద్యార్థుల తల్లిదండ్రులకు పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. బుధవారం ప్రైవేటు కంపెనీ ఉద్యోగినికి ప్లస్ 92 కోడ్‌తో 3165788678 నంబరుతో వాట్సాప్ కాల్ వచ్చింది. గుర్తుతెలియని దుండగులు మాట్లాడుతూ మేము ఢిల్లీ సీబీఐ అధికారులమని చెప్పారు, మీ కుమారున్ని డ్రగ్స్ కేసులో అరెస్ట్‌చేశాం, అతన్ని వదిలిపెట్టాలంటే వేలాది రూపాయలు నగదును మాకు పంపాలని సూచించారు. తమ కాల్ని కట్చేయరాదని పదేపదే హెచ్చరించారు. తక్షణం మహిళ ఫోన్ కట్‌చేసి కుమారునికి కాల్ చేసింది. తాను స్కూల్లో ఉన్నట్లు కొడుకు చెప్పడంతో ఆమె స్థిమితపడింది. కాల్ గురించి వివేక్‌నగర పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు.పెద్దసంఖ్యలో ఫోన్లునగరంలో గత రెండువారాల్లో ఇలాంటి వాట్సాప్ కాల్స్ అనేకమంది తల్లిదండ్రులకు వచ్చాయి. మీ పిల్లల్ని అరెస్ట్ చేశామని, డబ్బు పంపాలని బెదిరిస్తారు. ఇంట్లోనే పిల్లలు ఆడుకుంటున్నప్పటికీ ఇలా తప్పుడు కాల్స్ చేసి బెదిరించే ముఠాలు ఎక్కువయ్యాయి. ప్లస్ 92, లేదా అపరిచిత వాట్సాప్ కాల్స్‌ను తల్లిదండ్రులు స్వీకరించరాదు. -
దుర్గాపూజ మండపంలో కలకలం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని మెటియాబ్రూజ్ ప్రాంతంలో దుర్గాపూజ సందర్భంగా కలకలం చెలరేగింది. పశ్చిమ బెంగాల్ బీజేపీ సోషల్ మీడియా సైట్ ‘ఎక్స్’లో ఈ ఉదంతానికి సంబంధించిన పోస్ట్‌ను షేర్ చేసింది.ఆ పోస్ట్‌లోని వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని మెటియాబ్రూజ్‌లోని బెంగాలీ హిందువులు దుర్గాపూజ చేస్తున్నారు. ఇంతలో కలకలం నెలకొంది. పూజలో భాగంగా శంఖం ఊదుతుండగా, సీఎం మమతా బెనర్జీ మద్దతుదారులు మండపంలోకి ప్రవేశించి, వేడుకలను వెంటనే ఆపకపోతే, అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తామని బెదిరించారని బీజేపీ ఆరోపించింది. వెంటనే బీజేపీ నేతలు తాము నమాజ్ జరుగుతున్నప్పుడు స్పీకర్ ఆపివేస్తామని తెలిపారు. కాగా ఈ ఘటనపై ‘న్యూ బెంగాల్ స్పోర్టింగ్ క్లబ్’ పోలీసులకు ఫిర్యాదు చేసింది.బెంగాల్ బీజేపీ ఈ ఫిర్యాదు లేఖను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దుర్గామండపంలోకి 50 మంది బలవంతంగా ప్రవేశించారని, వారు మహిళలను కూడా దూషించారని బీజేపీ ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా బీజేపీ షేర్ చేసింది. నిందితులపై వెంటనే కఠిన చర్యలు చేపట్టాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. Disturbing scenes have emerged from West Bengal, in KMC Ward 133, Metiaburuz, where Bengali Hindus were celebrating Durga Puja. This year, many of the Tithis occurred in the morning, which led to the sound of Dhaks and conch shells being heard earlier in the day.This angered a… pic.twitter.com/h8JYHCBYX8— BJP West Bengal (@BJP4Bengal) October 11, 2024ఇది కూడా చదవండి: అంబరాన్నంటుతున్న దసరా సంబరాలు -
ఫీల్డ్ అసిస్టెంట్ కు బెదిరింపులు
-
అనంతపురం: టీడీపీ నేతల బరితెగింపు.. ఆడియో వైరల్
సాక్షి, అనంతపురం: రాష్ట్రంలో టీడీపీ నేతల ఆగడాలు ఆగడం లేదు. కప్పం కట్టాలంటూ కోళ్ల వ్యాపారిని బెదిరిస్తూ.. యథేచ్ఛగా బరితెగించారు. తెలంగాణ కేంద్రంగా కోళ్ల వ్యాపారం చేస్తున్న స్నేహ కంపెనీపై టీడీపీ నేత గణేష్ నాయుడు బెదిరింపులకు దిగారు. బెదిరింపులకు దిగారు. తనతో సెటిల్ చేసుకోకపోతే అనంతపురం, తాడిపత్రి ప్రాంతాల్లో కోళ్ల క్రయవిక్రయాలు జరగనివ్వనంటూ హుకుం జారీ చేశారు. టీడీపీ నేతల వార్నింగ్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వైఎస్సార్సీపీ నాయకుడి ఇల్లు కూల్చివేతకు కుట్రతూర్పుగోదావరి జిల్లా: గోపాలపురం మండలం చిట్యాల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు, మండల సేవాదళ్ అధ్యక్షుడు ముచ్చికర్ల రవి ఇంటిని కూల్చేందుకు టీడీపీ నాయకులు కుట్ర పన్నారు. ఇంటిని కూల్చివేసేందుకు శుక్రవారం సుమారు 100 మంది పోలీసులు, జేసీబీతో టీడీపీ నాయకులు అతడి ఇంటిని చుట్టుముట్టారు. రవి కుటుంబ సభ్యులు 40 ఏళ్లపాటు పంచాయతీ పోరంబోకు భూమిలో పూరిగుడిసెలో ఉన్నారు.పదేళ్ల క్రితం రెవెన్యూ అధికారులు పట్టా మంజూరు చేశారు. గత ఏడాది రేకుల షెడ్డు నిర్మించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో రవి చిట్యాలలో బలమైన నాయకుడిగా పనిచేశాడని టీడీపీ నాయకులు అతనిపై కక్ష పెట్టుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే రవి ఇంటిని తొలగించాలంటూ గ్రామ కార్యదర్శితో నోటీసులు జారీ చేయించారు. రవి హైకోర్టునుంచి స్టే తెచ్చుకున్నాడు.టీడీపీ నాయకులు స్టే ఆర్డర్‌ను ఎత్తివేయించి మళ్లీ పంచాయతీ ద్వారా నోటీసులు పంపారు. టీడీపీ నాయకులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు కలసి రవి ఉంటున్న రేకుల షెడ్డును తొలగించడానికి పూనుకున్నారు. అప్పటికే రవి హైకోర్టు నుంచి మరో స్టే ఆర్డర్ తీసుకున్నాడు. అయినా ఇబ్బందిపెట్టడంతో హైకోర్టు ప్రభుత్వ లాయర్‌తో ఫోన్లో మాట్లాడించాడు. దీంతో చేసేదేమీలేక వెనుదిరిగారు. ఒక్కసారిగా పోలీసులు ఇంటిని చుట్టుముట్టడంతో రవి తలి వరలక్ష్మి గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. -
రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్
అబిడ్స్(హైదరాబాద్): గోషామహల్ ఎమ్మె ల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. బుధవారం ఉదయం 9:19 గంటల నుంచి క్రమం తప్పకుండా తన ఫోన్‌కు గుర్తు తెలియనివ్యక్తులు బెదిరింపు కాల్స్ చేస్తూనే ఉన్నారని రాజాసింగ్ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు. చేసిన ప్రతిసారి ఒక్కో నంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయని చెప్పారు.కొన్నిసార్లు వాయిస్ మెసేజ్ కూడా చేసి బెదిరిస్తున్నారన్నారు. వచ్చిన కాల్స్‌లో పాలస్తీనాకు చెందిన ఒక తీవ్రవాది ఫొటో, నంబరు స్పష్టంగా కనిపించిందని రాజాసింగ్ వెల్లడించారు. బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తి తనను ఇంకో నంబరు ఉందా? అని అడిగాడని, దానికి సమాధానంగా గూగుల్‌లో అన్వేషించి సీఎం రేవంత్‌రెడ్డి నంబర్‌ను ఇచ్చానని తన వీడియోలో పేర్కొన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ చాలాసార్లు వచ్చాయని, పోలీసు ఉన్నతాధికారులు, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదన్నారు. ఒక ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్స్ వస్తే అది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారన్నది కూడా పోలీసులు తెలుసుకోలేకపోయారని ఆ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, మళ్లీ బెదిరింపు కాల్స్ వస్తున్నందున సీఎం రేవంత్‌రెడ్డి నంబర్‌ను ఇచ్చానని, ఒకవేళ ఆ వ్యక్తులు ఆ నంబరకు బెదిరింపు కాల్స్ చేస్తే ప్రభుత్వం, పోలీసులు విచారణ జరిపిస్తారేమో అనే భావంతోనే సీఎం నంబర్ ఇచ్చానంటూ రాజాసింగ్ వెల్లడించారు. -
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మళ్లీ బెదిరింపు కాల్స్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మళ్లీ బెదిరింపు కాల్స్ వచ్చాయి. చంపుతామని బెదిరిస్తూ పదేపదే కాల్స్ చేస్తున్నారని రాజాసింగ్ తెలిపారు. పలు నంబర్ల నుంచి ఫోన్లు వస్తున్నాయని.. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేవని ఆయన మండిపడ్డారు.తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ నంబర్లను కాల్ లిస్ట్ స్క్రీన్ షాట్‌ను రాజాసింగ్ తన ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఈ కాల్స్ తనకు కొత్తేమీ కాదని.. వీటిపై గతంలో ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. అయినా ఒక బాధ్యత గల పౌరుడుగా పోలీసుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు ఎక్స్‌లో పేర్కొన్నారు.మరోవైపు, బెదిరింపు కాల్స్ చేసిన వారికి రాజాసింగ్ ట్విస్ట్ ఇచ్చారు. తనకు ఎన్ని నంబర్లు ఉన్నాయని బెదిరింపు కాల్స్ చేసిన వారు అడిగారు. ఇంకో నంబర్ ఉందని చెప్పి సీఎం రేవంత్ నంబర్ ఇచ్చాని తెలిపారు. ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పినా పోలీసులు పట్టించుకోవడంలేదు. అందుకే ముఖ్యమంత్రి నంబర్ ఇచ్చాను. ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా? లేదా?. విచారణ ముందుకు సాగుతుందా? లేదా?’’ అంటూ ప్రశ్నించారు.ఇవాళ నాకు కంటిన్యూయస్‌గా బెదిరింపు కాల్స్ వచ్చాయి. పాలస్తీనాకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ధర్మం కోసం నువ్వు పనిచేస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు. నా ఫ్యామిలీని కూడా చంపేస్తామని బెదిరించారన్నారు.కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటివి ఎన్నో కాల్స్ వచ్చాయి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు సీఎంగా రేవంత్ ఉన్నాడు.. ఇప్పుడైనా వీటిపై చర్యలు తీసుకుంటారో లేదో అని సీఎం నంబర్ ఇచ్చాను. ఒక ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్ వస్తే ఎలాగూ పట్టించుకోలేదు. అందుకే ముఖ్యమంత్రి నంబర్ కు బెదిరింపు కాల్ వస్తే అయినా చర్యలు తీసుకుంటారా? లేదా?. విచారణ సాగుతుందా? లేదా? అనేది చూద్దాం.. నాకు ఈ కాల్స్ రావడం ఎప్పుడు బంద్ అవుతాయో చూద్దాం’’ అంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు. Once again, I'm receiving death threats from multiple numbers today. This isn't the first time I've been targeted with such threats. Despite previous complaints, it seems no action will be taken.Nonetheless, as a responsible citizen, I feel obligated to inform the police… pic.twitter.com/exIFElcrUx— Raja Singh (Modi Ka Parivar) (@TigerRajaSingh) May 29, 2024 -
చంపుతామని బెదిరిస్తున్నారు: స్వాతిమలివాల్
న్యూఢిల్లీ: చంపేస్తామని, అత్యాచారం చేస్తామని తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ఎంపీ స్వాతి మలివాల్ అన్నారు. తన మీద సీఎం కేజ్రీవాల్ ఇంట్లో జరిగిన దాడి ఘటనపై ఓ యూట్యూబ్ ఛానల్లో వన్‌సైడ్ వీడియో పెట్టారని, ఆ తర్వాతే బెదిరింపులు ఎక్కువయ్యాయని తెలిపారు. ఈ మేరకు ఆదివారం(మే26) ఎక్స్(ట్విటర్)లో ఆమె ఒక ట్వీట్ చేశారు. యూట్యూబ్ ఛానళ్లు నడిపే ఇండిపెండెంట్ జర్నలిస్టులు కూడా ఆప్ అధికార ప్రతినిధుల అవతారమెత్తడం సరికాదన్నారు. దాడి ఘటనపై ఆ జర్నలిస్టులకు తన వెర్షన్ చెప్పుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఫోన్లు ఎత్తడం లేదన్నారు. తాను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని తమ పార్టీ నేతలు బెదిరిస్తున్నారని తెలిపారు. -
కేంద్ర హోం శాఖకు బాంబు బెదిరింపు.. నార్త్ బ్లాక్ హై అలర్ట్
సాక్షి,ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర హోం శాఖ కొలువు దీరిన నార్త్ బ్లాక్ భవనానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. హోం శాఖకు బుధవారం(మే22) బాంబు బెదిరింపుల మెయిల్ అందినట్లు పోలీస్ కంట్రోల్ రూమ్ వెల్లడించింది. బాంబు బెదిరింపులు వచ్చిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా రెండు ఫైర్ ఇంజిన్లను నార్త్‌బ్లాక్ వద్దకు తరలించారు. గత కొన్ని రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లోని స్కూళ్లకు, ఎయిర్‌పోర్టులకు ఫేక్ బెదిరింపు కాల్స్ వస్తున్న విషయం తెలిసిందే. -
కేజ్రీవాల్‌కు బెదిరింపులు బీజేపీ పనే: ఆప్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను హెచ్చరిస్తూ ఢిల్లీ మెట్రో రైళ్లలో వెలిసిన బెదిరింపు రాతలు బీజేపీ పనేనని ఆప్ ఆరోపించింది. ఈ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు ఎంపీ సీట్లలో ఓడిపోతున్నామని తెలిసే బీజేపీ ఇలాంటి దిగజారుడు పనులు చేస్తోందని సోమవారం(మే20) నిర్వహించిన మీడియా సమావేశంలో ఢిల్లీ మంత్రి ఆతిషి ఫైర్ అయ్యారు.‘తొలుత మా అధినేత కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. తర్వాత జైలులో ఆయనకు ఇన్సులిన్‌ను ఆపేశారు. మధ్యంతర బెయిల్‌పై కేజ్రీవాల్ బయటికి వచ్చిన తర్వాత స్వాతి మలివాల్‌తో కలిసి ఆయనపై కుట్ర చేశారు. ఇప్పుడేమో ఆయన ప్రాణాలు తీస్తామంటూ హెచ్చరిస్తున్నారు’అని ఆతిషి అన్నారు. కాగా, అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ వదిలి వెళ్లాలని వార్నింగ్ ఇస్తూ రాసిన రాతలు ఢిల్లీ మెట్రో రైలు బోగీల గోడలపై ప్రత్యక్షమయ్యాయి. ఈ ఫొటోలు సోమవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే వీటిని తొలుత ఎవరు షేర్ చేశారన్నది తెలియరాలేదు. బెదిరింపు రాతలపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. -
హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కు బెదిరింపులు
-
ఫ్రాన్స్: ఇరాన్ కాన్సులేట్‌లో మానవ బాంబు కలకలం
ప్యారిస్: ఫ్రాన్స్ రాజధాని నగరం ప్యారిస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయంలో శుక్రవారం(ఏప్రిల్19) మానవ బాంబు కలకలం రేగింది. ఉదయం రాయబార కార్యాలయంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి తనను తాను పేల్చుకుంటానని బెదిరించాడు. అయితే అతడిని కార్యాలయం బయటికి తీసుకువచ్చిన పోలీసులు తొలుత తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అతడి వద్ద ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని వెల్లడైంది. అనంతరం అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఇరాన్ రాయబార కార్యాలయాన్ని పూర్తిగా చుట్టుముట్టారు. కాగా, ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ వాతావారణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. ఇరాన్లో భారీ పేలుళ్లు -
సీఎం రమేష్‌పై కేసు నమోదు
విశాఖపట్నం, సాక్షి: కూటమి తరఫున అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌పై పోలీస్ కేసు నమోదు అయ్యింది. ‘‘నా సంగతి మీకు తెలియదంటూ..’’ జీఎస్టీ తనిఖీల కోసం వెళ్లిన డీఆర్ఐ(Directorate of Revenue Intelligence) అధికారులపై గుండాయిజం ప్రదర్శించారాయన. ఈ ఘటనపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ ఇంటిలిజెన్స్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ చోడవరం పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది. డీఆర్ఐ అధికారులకు ఆటంకం కలిగించడంతో పాటు వాళ్ల చేతుల్లో ఫైళ్లను లాక్కునే ప్రయత్నం చేశారు సీఎం రమేష్. దీంతో.. అధికారుల విధులకు ఆటంకం కలిగించే యత్నం చేశారని.. బెదిరింపులకు పాల్పడ్డారని చోడవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 143, 506, 342, 353, 201, 188 red with 149 కింద కేసు నమోదు చేశారు. సీఎం రమేష్‌తో పాటు చోడవరం టీడీపీ అభ్యర్థి కేఎస్ఎన్ఎస్ రాజు, టైల్స్ వ్యాపారి బుచ్చిరాజు, రామకృష్ణలతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు అయ్యింది. అసలేం జరిగిందంటే.. గాంధీ గ్రామంలో బుచ్చిరాజు అనే టీడీపీ సానుభూతిపరుడు హోల్‌సేల్ టైల్స్, మార్బుల్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. దానిపై డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం(డీఆర్ఐ) అధికారి శ్రీధర్ ఆధ్వర్యంలో ఆరుగురితో కూడిన ఓ బృందం గురువారం తనిఖీలు నిర్వహిస్తోంది. జీఎస్టీ సక్రమంగా కట్టడం లేదంటూ షాపు రికార్డులన్నీ వారు తనిఖీ చేస్తుండగా టైల్స్ వ్యాపారి బుచ్చిరాజు స్థానిక టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజుకు, అనకాపల్లి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌కు ఫోన్ చేశారు. వెంటనే వారిద్దరూ తమ అనుచరులతో టైల్స్ షాపు దగ్గరకు చేరుకున్నారు. అధికారుల దగ్గర్నుంచి రికార్డులను సీఎం రమేష్ లాక్కున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా తనిఖీలు చేస్తారంటూ వారిపై దౌర్జన్యానికి దిగారు. అంతేనా అధికారులని కూడా చూడకుండా పరుషపదజాలంతో వారిపై విరుచుకుపడ్డారు. ఔ ఇదీ చదవండి: బ్యాంకుల మోసగాడు ఎంపీ అభ్యర్థా? -
ట్రంప్ ప్రపంచానికే ముప్పు
వాషింగ్టన్: తన కంటే ముందు దేశాధ్యక్షుడిగా పనిచేసిన ఒక నాయకుడు అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం, స్వేచ్ఛకు ముప్పుగా పరిణమించాడని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోపించారు. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్‌పై పరోక్షంగా దుమ్మెత్తి పోశారు. ఏ అధ్యక్షుడైనా అమెరికా ప్రజలను రక్షించడాన్ని కనీస బాధ్యతగా భావిస్తాడని, ఈ విషయంలో ఆ మాజీ అధ్యక్షుడు పదవిలో ఉన్నప్పుడు ఈ విషయంలో దారుణంగా విఫలమయ్యాడని, అతడిని క్షమించలేమని అన్నారు. బైడెన్ గురువారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గంటపాటు మాట్లాడిన బైడెన్.. ట్రంప్ పేరును 13 సార్లు పరోక్షంగా ప్రస్తావించారు. పలు అంశాల్లో ట్రంప్ వైఖరిని తప్పుపట్టారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ముందు ట్రంప్ మోకరిల్లాడని, ఇది చాలా ప్రమాదకరమని అన్నారు. ‘నాటో’ దేశాలను ఏమైనా చేసుకోండి అంటూ పుతిన్‌కు సూచించాడని ఆరోపించారు. పుతిన్ చర్యలను అడ్డుకోకపోతే ప్రపంచ దేశాలకు నష్టం తప్పదని హెచ్చరించారు. పుతిన్ ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ఉక్రెయిన్‌కు అన్ని రకాలుగా సాయం అందించాల్సి ఉందని పేర్కొన్నారు. గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో సాధారణ పాలస్తీనియన్లు మరణించడం చూసి తాను తీవ్రంగా చలించిపోయానని బైడెన్ చెప్పారు. గంజాయి తీసుకుంటే నేరం కాదు డెమొక్రటిక్ పార్టీ నేత జో బైడెన్ మరోసారి అమెరికా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మళ్లీ నెగ్గడానికి యువ ఓటర్ల మనసులు గెలుచుకొనే పనికి శ్రీకారం చుట్టారు. గంజాయి తీసుకుంటే, గంజాయి కలిగి ఉంటే నేరంగా పరిగణించవద్దని తేలి్చచెప్పారు. గంజాయి విషయంలో అమల్లో ఉన్న నిబంధనలను సమీక్షించాలని తన మంత్రివర్గాన్ని ఆదేశించానని చెప్పారు. సాధారణంగా స్టేట్ ఆఫ్ ద యూనియన్ అడ్రస్‌లో తమ విదేశాంగ విధానంతోపాటు దేశీయంగా కీలక అంశాలను అమెరికా అధినేతలు ప్రస్తావిస్తుంటారు. కానీ, గంజాయి గురించి మాట్లాడిన మొట్టమొదటి అధ్యక్షుడు మాత్రం బైడెన్ కావడం విశేషం. -
TN: తమిళనాడులో స్కూళ్లకు బాంబు బెదిరింపు
చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూర్, కాంచీపురంలలో సోమవారం( మార్చ్ 4) బాంబు కలకలం రేగింది. రెండు నగరాల్లోని అగ్రశ్రేణి స్కూళ్లకు సోమవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో స్కూళ్లలోని విద్యార్థులు, సిబ్బంది, తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. వీటిలో ఆదివారం రాత్రి ఒక మెయిల్ రాగా సోమవారం ఉదయం మరో బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. బాంబు బెదిరింపు సమాచారం అందుకున్న వెంటనే కోయంబత్తూరులోని పీఎస్‌బీబీ మిలీనియం స్కూల్‌కు బాంబు స్క్వాడ్ చేరుకుని తనిఖీలు చేపట్టింది. తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బెదిరింపులు వచ్చిన రెండు స్కూళ్లలో ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయి. స్కూళ్ల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపుతున్నారు. కాగా, మార్చ్ 1వ తేదీ బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పేలుడులో 10 మంది గాయపడ్డారు. ఇదీ చదవండి.. అశ్లీల వీడియో వైరల్.. పోలీసులకు ఎంపీ ఫిర్యాదు -
ఫిర్యాదు చేస్తే అంతు చూస్తాం
‘మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పైనే ఫిర్యాదు చేస్తారా ... మీ సంగతి తేలుస్తాం’ ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితులు.. అని సంఘం పెట్టేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది’ ‘మీ ష్యూరిటీ పత్రాలు మా దగ్గర ఉన్నాయి.. మీ ఆస్తులు వేలం వేయిస్తాం..’ ఇవీ రాజగురివింద రామోజీరావు ఆర్థిక అక్రమాల పుట్ట.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ నుంచి చందాదారులకు కొన్ని నెలలుగా వస్తున్న బెదిరింపులు. నేరుగా చందాదారుల ఇళ్లకే వచ్చి బెదిరిస్తుండటంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. మరికొందరికి రామోజీ ముఠా ఫోన్లు చేసి వేధిస్తోంది. కొందరిని తమ చిట్‌ఫండ్ కార్యాలయాలకు పిలిపించుకుని మరీ బెదిరిస్తోంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాల పుట్ట బద్దలు కావడంతో రామోజీరావు బెంబేలెత్తుతున్నారు. దశాబ్దాల తరబడి ఆయన, ఆయన కోడలు శైలజ వేధింపులు భరించిన చందాదారులు ప్రస్తుతం ధైర్యం చేసి ఫిర్యాదులు చేస్తుండటంతో రామోజీ ముఠా బెదిరింపుల పర్వానికి బరితెగించింది. దీంతో చందాదారుల భద్రతే లక్ష్యంగా ఫిర్యాదులు చేసేందుకు సీఐడీ ప్రత్యేక వాట్సాప్ నంబరును అందుబాటులోకి తెచ్చింది. తాజాగా కొందరు చందాదారులు ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘాన్ని’ ఏర్పాటు చేసి రిజిస్టర్ చేయించడంతో ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ధైర్యంగా బాధితుల ముందడుగు.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసును విచారిస్తున్న సీఐడీ.. బాధితులు ఫిర్యాదు చేసేందుకు 94931 74065తో వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ వాట్సాప్ నంబరుకు ఇప్పటికే వేల సంఖ్యలో చందాదారులు ఫిర్యాదులు చేశారు. తమ అనుమతి లేకుండా చిట్టీలు పాడటం, చిట్ పాడుకున్న నగదు ఇవ్వకుండా రశీదు డిపాజిట్లుగా జమ చేయడం, ష్యూరిటీలు ఇచ్చినా తిరస్కరించి వేధించడం, తమ సంతకాలు ఫోర్జరీ చేయడం వంటి అక్రమాలపై బాధితులు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేస్తున్నారు. వీటిని సీఐడీ ప్రత్యేక విభాగం నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. వేధింపులకు పాల్పడ్డ పలువురు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచ్ మేనేజర్లు, ఇతర సిబ్బందిని సీఐడీ విచారిస్తుండటంతో రామోజీ బెంబేలెత్తుతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ కార్యాచరణతో చందాదారులు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. విజయవాడ కేంద్రంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. బాధితులు తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రత్యేకంగా 99481 14455 ఫోన్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో కేవలం మూడు రోజుల్లోనే వందల సంఖ్యలో బాధితులు ఈ సంఘాన్ని సంప్రదించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అందరి ఫిర్యాదులను నమోదు చేస్తూ అటు సీఐడీ ద్వారా, ఇటు న్యాయపరంగా చర్యలు తీసుకునేందుకు ఆ సంఘం సన్నద్ధమవుతోంది. బాధితులపై మార్గదర్శి వేధింపుల పర్వం మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాల పుట్ట బద్దలు కావడంతో రామోజీరావు హడలిపోతున్నారు. సీఐడీ అధికారులు కేసు నమోదు చేయడం, ఏకంగా తన ఇంటికే వచ్చి మరీ విచారించడంతో ఆయన బెంబేలెత్తుతున్నారు. ఇవి చాలవన్నట్టు ఇప్పుడు బాధితులు కూడా దూకుడు పెంచడంతో ఏక్షణం ఏం జరుగుతుందోనని రామోజీ బేజారెత్తుతున్నారు. దీంతో కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు తన ముఠాలను ఆయన రంగంలోకి దించారు. సీఐడీ అధికారులు, బాధితుల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నవారిని లక్ష్యంగా చేసుకుని వారికి ఫోన్లు చేసి రామోజీ ముఠా వేధిస్తోంది. సీఐడీకి ఫిర్యాదు చేసిన చందాదారులను మొదట లక్ష్యంగా చేసుకుంది. సీఐడీ దర్యాప్తునకు సహకరించవద్దని వారిని బెదిరిస్తోంది. ఏకంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజ కిరణ్ ఆఫీసు నుంచే చందాదారులకు ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతుండటం గమనార్హం. రామోజీ కోడలు శైలజ కిరణ్ పీఏ శశికళ, మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లు స్వయంగా ఫోన్లు చేసి మరీ బెదిరిస్తుండటం ఆ సంస్థ దిగజారుడుతనానికి నిదర్శనం. మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం అందుబాటులోకి తెచ్చిన ఫోన్ నంబరుకు కూడా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ‘అసలు సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు.. మీ వెనుక ఎవరు ఉన్నారు.. ఎవరున్నాసరే మిమ్మల్ని కాపాడలేరు.. మీ సంగతి చూస్తాం.. అంతు తేలుస్తాం’ అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. – సాక్షి, అమరావతి న్యాయపోరాటానికి బాధితులు సిద్ధం.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ సిబ్బంది కాల్‌మనీ రాకెట్ గూండాల మాదిరిగా చందాదారుల ఇళ్లపై పడుతున్నారు. వారి ఇళ్లకు వెళ్లి మరీ బెదిరిస్తున్నారు. ప్రధానంగా ప్రైవేటు వ్యక్తులకే తెలియకుండా తాము ఘోస్ట్ చందాదారులుగా నమోదు చేసిన వారి ఇళ్లకు వెళ్లి దౌర్జన్యం చేస్తున్నారు. అసలు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తాము చందాదారులుగా చేరిన విషయమే తమకు తెలియదనివారు ఎంతగా చెబుతున్నా వినిపించుకోవడం లేదు. ‘సీఐడీ అధికారులు అడిగితే మీరే చందాదారులుగా చేరారని చెప్పండి.. మీకు ఇబ్బందిరాకుండా చూస్తాం.. అంతేగానీ తెలియదని చెబితే మాత్రం మీరు మాకు భారీగా బకాయిలు ఉన్నారని కోర్టులో కేసులు వేస్తాం’ అని హడలెత్తిస్తున్నారు. దాంతో తమకు తెలియకుండానే తమ పేరుతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ సాగిస్తున్న ఆర్థిక అవకతవకలపై వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక చందాదారుల కోసం ష్యూరిటీ సంతకాలు చేసిన వారి ఇళ్లకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ సిబ్బంది వెళ్లి వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ‘మీరు ఇచ్చిన ఖాళీ చెక్కులు మా వద్ద ఉన్నాయి.. వాటిపై భారీ మొత్తం రాసి బ్యాంకులో జమ చేసి బౌన్స్ అయ్యేలా చేస్తాం. తరువాత కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తాం’ అని కొందరిని బెదిరించడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరికొందరు చందాదారుల ఇళ్లకు వెళ్లి ‘మీరు భారీగా బకాయి పడ్డారు...అందుకు ప్రతిగా మీ ఇళ్లు, ఆస్తులు వేలం వేయిస్తాం’ అని వేధింపులకు దిగారు. చందాదారుల తరపున మార్గదర్శి చిట్‌ఫండ్స్ సిబ్బందే ఫోర్జరీ సంతకాలు చేసేసి.. తిరిగి చందాదారులపైనే ఫోర్జరీ కేసు పెడతామని బెదిరిస్తున్నారు. ఈ పరిణామాలతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం ద్వారా అటు సీఐడీని ఆశ్రయించడంతోపాటు మరోవైపు న్యాయపోరాటం చేసేందుకు ఉద్యుక్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో కీలక పరిణామాలు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
20 ఉత్తుత్తి బెదిరింపు కాల్స్.. నాలుగేళ్లు నిజమైన జైలు?
అమెరికాలోని వాషింగ్టన్కు చెందిన ఒక యువకుడు ఒకేరోజు నాలుగు నేరాలకు పాల్పడి, దోషిగా నిలిచాడు. అమెరికా, కెనడాలలో 20కిపైగా బెదిరింపు కాల్స్ చేశాడు. బాంబు దాడులు, కాల్పులు, ఇతర బెదిరింపులకు పాల్పడి, ప్రభుత్వ అత్యవసర విభాగాలలో గాభరా పుట్టించాడు. అస్టన్ గార్సియా(21) అనే యువకుడు టకోమాలోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో తన నేరాన్ని ఒప్పుకున్నాడు. రెండు దోపిడీలు, పేలుడు పదార్థాలకు సంబంధించిన బెదిరింపులలో గార్సియా తన నేరాన్ని అంగీకరించినట్లు యుఎస్ అటార్నీ టెస్సా ఎం. గోర్మాన్ ఒక వార్తా ప్రకటనలో తెలిపారు. గార్సియాపై తొలుత 10 నేరాలు మోపారు. ఫెడరల్ ప్రాసిక్యూటర్లు మాట్లాడుతూ గార్సియా 2022, 2023లో బెదిరింపు కాల్స్ చేసే సమయంలో తన గుర్తింపును దాచేందుకు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ టెక్నాలజీని ఉపయోగించాడని చెప్పారు. దీనిని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ డిస్కార్డ్లో ప్రసారం చేస్తూ, అందరినీ వినాలని కూడా గార్సియా కోరేవాడన్నారు. గార్సియా తాను టార్గెట్ చేసుకున్న ప్రముఖుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి.. డబ్బు, క్రెడిట్ కార్డుల సమాచారం లేదా అసభ్యకరమైన చిత్రాలను పంపించకపోతే ప్రభుత్వ అత్యవసర సిబ్బందిని వారి ఇళ్లకు పంపిస్తానని బెదిరించేవాడు. గార్సియా.. ఓహియోలోని క్లీవ్‌ల్యాండ్‌లోని ఫాక్స్ న్యూస్ స్టేషన్‌కు ఫోన్ చేసి, లాస్ ఏంజెల్స్‌కు వెళ్లే విమానాలలో బాంబు ఉన్నదంటూ వదంతులు వ్యాప్తి చేశాడు. అలాగే బిట్‌కాయిన్ రూపంలో భారీ మొత్తాన్ని అందించకపోతే లాస్ ఏంజిల్స్‌లోని విమానాశ్రయంలో బాంబు పెడతానని బెదిరించాడు. 2017లో గార్సియా ఇటువంటి బెదిరింపు కాల్ప్ చేసి, తప్పుదారి పట్టించిన నేపధ్యంలో కాన్సాస్‌లో ఒక పోలీసు అధికారి ఒక వ్యక్తిని కాల్చి చంపారు. కాగా బ్రెమెర్టన్కు చెందిన గార్సియాకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు సూచించారు. గార్సియాకు ఏప్రిల్‌లో శిక్ష ఖరారు కానుంది. అమెరికాలోని వాషింగ్టన్, కాలిఫోర్నియా, జార్జియా, ఇల్లినాయిస్, కెంటుకీ, మిచిగాన్, మిన్నెసోటా, న్యూజెర్సీ, ఒహియో, పెన్సిల్వేనియా, కొలరాడో, కెనడాలోని అల్బెర్టాలో గల అత్యవసర ఏజెన్సీలకు గార్సియా బెదిరింపు కాల్ చేశాడని ప్రాసిక్యూటర్లు తెలిపారు. గార్సియాను వాషింగ్టన్‌లోని సీటాక్లోని ఫెడరల్ డిటెన్షన్ సెంటర్లో ఉంచి విచారిస్తున్నారు. -
కోటి సుపారీ: ‘హత్యకు కుట్ర.. అతనిపైనే అనుమానం’
ప్రముఖ వ్యాపారవేత్త సామ దామోదర్ రెడ్డి హత్య కుట్ర కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సామ దామోదర్‌రెడ్డిని చంపుతామంటూ ఫోన్ చేసి.. 27న ముహూర్తం అంటూ ఓ సుపారీ గ్యాంగ్ బెదిరించింది. రూ. 50 లక్షలు అడ్వాన్స్ ముట్టిందని.. దామోదర్ రెడ్డిని హత్య చేయడానికి కోటి రూపాయల డీల్ కుదిరిందని వీడియో పంపించారు. బీహారీ గ్యాంగ్ క్షణాల మీద నిన్ను చంపి పడేస్తారంటూ వారి ఫోటోలు ఓ దుండగుడు దామోదర్‌రెడ్డికి పంపించాడు. దీంతో తనకు ప్రాణహాని ఉందని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో దామోదర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. జీవన్‌రెడ్డి తనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడని దామోదర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. శంకర్ పల్లిలోని చైతన్య రిసార్ట్ భూమి షయంలో కొంతకాలంగా ఇద్దరి మధ్య వివాదం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై లుక్ అవుట్ నోటీసులు -
బెంగళూరులో స్కూల్స్‌కు బాంబు బెదిరింపులు
బెంగళూరు: బెంగళూరులో బాంబు బెదిరింపు ఈ-మెయిల్ కలకలం సృష్టించింది. సుమారు 15 పాఠశాలలకు బాంబు బెదిరింపు మొయిల్స్ రావడంతో విద్యార్థులు, స్కూల్స్ యాజమాన్యం వణికిపోయింది. దీంతో, ఒక్కసారిగా గందరగోళం నెలకొనడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులను పాఠశాలలను నుంచి బయటకు పంపించారు. వివరాల ప్రకారం.. కర్ణాటక రాజధాని బెంగళూరులోని పలు పాఠశాలలకు శుక్రవారం ఉదయం బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. గుర్తుతెలియని ఒక ఈ మెయిల్ నుంచి ఈ బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పాఠశాలల యజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులను పాఠశాలలను నుంచి బయటకు పంపించారు. తర్వాత బాంబ్‌స్క్వాడ్ బృందాలు అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టాయి. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి. కాగా, బెదిరింపులపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది నకిలీ బెదిరింపు అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, శుక్రవారం మధ్యాహ్నం కర్ణాటకలోని సుమారు 15 పాఠశాలలకు బాంబు బెదిరింపు వచ్చింది. తొలుత ఏడు స్కూళ్లకు ఈ బెదిరింపు మెయిళ్లు రాగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే మరికొన్ని విద్యాసంస్థలకు అదే తరహా ఈ మెయిళ్లు వచ్చాయి. దీంతో, అప్రమత్తమైన స్కూల్స్ యాజమాన్యం.. విద్యార్థుల పేరెంట్స్‌కు సమాచారం అందించారు. ‘ఈ రోజు మన పాఠశాల అనూహ్య పరిస్థితిని ఎదుర్కొంది. గుర్తుతెలియని వర్గాల నుంచి ఒక ఈ మెయిల్ వచ్చింది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని, వెంటనే వారిని బయటకు పంపించాలని నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు. మరోవైపు.. బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిన పాఠశాల్లలో ఒక్క స్కూల్.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నివాసానికి అతి సమీపంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, వైట్‌ఫీల్డ్, కొరెమంగళ, బసవేశ్వరనగర్, యెళహంక, సదాశివనగర్‌లోని పాఠశాలలకు ఈ బెదిరింపులు వచ్చాయి. ఇదిలా ఉండగా.. గత ఏడాది కూడా బెంగళూరులోని ఏడు పాఠశాలలకు ఇలాగే బాంబు బెదిరింపు వచ్చింది. అయితే, తర్వాత అది నకిలీ బెదిరింపు అని తేలింది. ఇదీ చదవండి: తమిళనాడులో భారీ వర్షాలు .. ఐఎమ్‌డీ హెచ్చరిక -
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నిలిపివేయాలని బెదిరింపులు
అహ్మదాబాద్: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోమారు బెదిరింపులకు పాల్పడ్డాడు. క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను నిలిపివేయాలని హెచ్చరిస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లు, 2002 నాటి గుజరాత్ అల్లర్ల గురించి పేర్కొంటూ మతపరంగా ఓ వర్గం ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై భారత్ అభిప్రాయాన్ని కూడా ప్రశ్నించాడు. అమెరికా ఆధారిత నిషేధిత సంస్థ సిక్ ఫర్ జస్టిస్ సంస్థకు గురుపత్వంత్ సింగ్ నాయకునిగా ఉన్నాడు. భారత్‌కు వ్యతిరేకంగా ఈయన హెచ్చరికలు చేయడం ఇదే మొదటి సారి కాదు. ప్రధాని నరేంద్ర మోదీపై హెచ్చరికలు చేస్తూ గత నెలలో కూడా ఓ వీడియోను విడుదల చేశాడు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నుంచి ప్రధాని గుణపాఠం నేర్చుకోవాలని పేర్కొన్నాడు. ఇండియాలో కూడా ఇలాంటి యుద్ధం ప్రారంభమైతుందని బెదిరించాడు. సెప్టెంబరులో భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా కూడా పన్నూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇరుదేశాల మధ్య శత్రుత్వాన్ని పోత్రహించే చర్యలకు పాల్పడినందుకు ఆయనపై కేసు కూడా నమోదైంది. అహ్మదాబాద్ వేదికగా క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మొతేరా స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌కి దేశ విదేశాల నుంచి ప్రముఖులతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ఉపప్రధాని రిచర్డ్ మార్లెస్ కూడా హాజరవనున్నారు. ఇదీ చదవండి: దక్షిణ గాజాను వీడండి.. పాలస్తీనాకు ఇజ్రాయెల్ హెచ్చరికలు