విశాఖపట్నం, సాక్షి: కూటమి తరఫున అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌పై పోలీస్ కేసు నమోదు అయ్యింది. ‘‘నా సంగతి మీకు తెలియదంటూ..’’ జీఎస్టీ తనిఖీల కోసం వెళ్లిన డీఆర్‌ఐ(Directorate of Revenue Intelligence) అధికారులపై గుండాయిజం ప్రదర్శించారాయన. ఈ ఘటనపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ ఇంటిలిజెన్స్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ చోడవరం పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది.
డీఆర్‌ఐ అధికారులకు ఆటంకం కలిగించడంతో పాటు వాళ్ల చేతుల్లో ఫైళ్లను లాక్కునే ప్రయత్నం చేశారు సీఎం రమేష్. దీంతో.. అధికారుల విధులకు ఆటంకం కలిగించే యత్నం చేశారని.. బెదిరింపులకు పాల్పడ్డారని చోడవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 143, 506, 342, 353, 201, 188 red with 149 కింద కేసు నమోదు చేశారు. సీఎం రమేష్‌తో పాటు చోడవరం టీడీపీ అభ్యర్థి కేఎస్‌ఎన్‌ఎస్ రాజు, టైల్స్ వ్యాపారి బుచ్చిరాజు, రామకృష్ణలతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు అయ్యింది.
అసలేం జరిగిందంటే.. గాంధీ గ్రామంలో బుచ్చిరాజు అనే టీడీపీ సానుభూతిపరుడు హోల్‌సేల్ టైల్స్, మార్బుల్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. దానిపై డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం(డీఆర్‌ఐ) అధికారి శ్రీధర్ ఆధ్వర్యంలో ఆరుగురితో కూడిన ఓ బృందం గురువారం తనిఖీలు నిర్వహిస్తోంది. జీఎస్టీ సక్రమంగా కట్టడం లేదంటూ షాపు రికార్డులన్నీ వారు తనిఖీ చేస్తుండగా టైల్స్ వ్యాపారి బుచ్చిరాజు స్థానిక టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజుకు, అనకాపల్లి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌కు ఫోన్ చేశారు.
వెంటనే వారిద్దరూ తమ అనుచరులతో టైల్స్ షాపు దగ్గరకు చేరుకున్నారు. అధికారుల దగ్గర్నుంచి రికార్డులను సీఎం రమేష్ లాక్కున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా తనిఖీలు చేస్తారంటూ వారిపై దౌర్జన్యానికి దిగారు. అంతేనా అధికారులని కూడా చూడకుండా పరుషపదజాలంతో వారిపై విరుచుకుపడ్డారు. ఔ
ఇదీ చదవండి: బ్యాంకుల మోసగాడు ఎంపీ అభ్యర్థా?
Comments
Please login to add a commentAdd a comment