cm ramesh
-
తప్పుడు ఫిర్యాదు చేసిన వారిని చెప్పు తో కొడతా: ఆది
-
సీఎం రమేష్‌కు ఇక్కడేం పని.. ఎమ్మెల్యే ఆది ఆగ్రహం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: బీజేపీ నేతల మధ్య వార్ మరింత ముదిరింది. తప్పుడు ఫిర్యాదు చేసిన వారిని చెప్పుతో కొడతానంటూ.. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌పై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మండిపడ్డారు. జమ్మలమడుగులో ఆదినారాయణరెడ్డి అనుచరులు పేకాట క్లబ్బులు నడుపుతున్నారంటూ వారం క్రితం కలెక్టర్, ఎస్పీలకు సీఎం రమేష్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆది తీవ్రంగా స్పందించారు.మావాళ్లు తప్పు చేస్తే చెప్పుతో కొడతా.. లేదంటే ఆరోపించిన వారిని చెప్పుతో కొడతానన్న ఆది.. ఇష్టం వచ్చినట్లు లేఖలు ఎవడైనా రాస్తాడా అంటూ వ్యాఖ్యానించారు. ఎక్కడో అనకాపల్లిలో ఉన్న సీఎం రమేష్‌కు ఇక్కడేం పని అంటూ ఆదినారాయణరెడ్డి ప్రశ్నించారు.ఆయన లేఖ సినిమా కథలా ఉంది. మా నియోజకవర్గంలో ఉత్పత్తి చేసే ప్రతి దానిపై మాకు హక్కుంది. మీరెక్కడి నుంచో వచ్చి ఇక్కడ చేస్తానంటే కుదరదు’’ అంటూ ఆది మండిపడ్డారు. అదానీ హైడ్రో ఎనర్జీ ప్రాజెక్టు సబ్ కాంట్రాక్ట్ సీఎం రమేష్ పొందడంపై విమర్శలు గుప్పించారు. గతంలో ఆ కాంట్రాక్టు తమకే కావాలని అదానీ సైట్లోకి వెళ్లి ఆదినారాయణరెడ్డి వర్గీయులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: ఎల్లో మీడియా కొంపముంచిన చంద్రబాబు! -
ఎమ్మెల్యే ఆది వర్సెస్ ఎంపీ సీఎం రమేష్.. బీజేపీ నేతల మధ్య వార్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జిల్లాలో బీజేపీ నేతల మధ్య వార్ నడుస్తోంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌ల మధ్య పొసగడం లేదు. ఆదినారాయణరెడ్డి బంధువు పేకాట శిబిరాలు నడుపుతున్నాడంటూ కలెక్టర్, ఎస్పీకి సీఎం రమేష్ ఫిర్యాదు చేశారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు పంపిన సీఎం రమేష్.. ఆది బంధువు దేవగుడి నాగేశ్వరరెడ్డిపై కంప్లెంట్ చేశారు.ఆదినారాయణరెడ్డి వ్యవహారాలన్నీ చక్కబెట్టే నాగేశ్వరరెడ్డిపై సీఎం రమేష్ ఫిర్యాదుతో ఆదినారాయణ రెడ్డి అరాచకాలు బట్టబయలయ్యాయి. ఇప్పుడు పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారనే దానిపై చర్చ జరుగుతోంది. నిన్నటి వరకు కలిసి ఉన్న ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్‌ల మధ్య డైరెక్ట్ వార్ సాగుతోంది.ఇదీ చదవండి: ‘చంద్రబాబు పాలనలో రాయలసీమకు ప్రతిసారీ అన్యాయం’ -
అయ్యన్న ముంగిట్లో సీఎం రమేష్ హడావుడి రగులుతున్న కుంపటి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అయ్యన్న ముంగిట్లో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సంక్రాంతి సందడి చేశారు. నర్సీపట్నంలోని ప్రైవేటు రిసార్టులో గత మూడు రోజులుగా మకాం వేసిన రమేష్... సంక్రాంతి వేడుకలను బీజేపీ, జనసేన నేతలతో కలిసి నిర్వహించుకున్నారు. ఇటువైపు కనీసం టీడీపీ నేతలు కన్నెత్తి చూడలేదు. మరోవైపు స్పీకర్ ఆధ్వర్యంలో నర్సీపట్నంలో జరుగుతున్న మకర జ్యోతి మహోత్సవాలకు సీఎం రమేష్‌ను ఆహ్వానించలేదు. ఒకవైపు నర్సీపట్నం కేంద్రంగా పలువురు నేతలను తనకు తెలియకుండా బీజేపీలో చేర్చుకోవడంతోపాటు పోటీగా రాజకీయాలు చేస్తున్నారని అయ్యన్న భావిస్తున్నట్టు తెలుస్తోంది. తనకు కనీస సమాచారం లేకుండా జరుగుతున్న చేరికలపై ఆయన ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు కొద్దిరోజుల క్రితం విశాఖపట్నంలో జరిగిన ప్రధాని సభ సందర్భంగా కూడా స్పీకర్ హోదాలో తనకు కనీస గుర్తింపు దక్కలేదని ఆయన కినుక వహించినట్టు తెలుస్తోంది. ప్రధాని సభకు జన సమీకరణ సందర్భంగా... నర్సీపట్నంలో మీరు చేర్చుకున్న నేతల ద్వారా జనాలను తరలించుకోండంటూ సీఎం రమేష్‌కు అయ్యన్న గట్టిగా బదులిచ్చినట్టు సమాచారం. మొత్తంగా నర్సీపట్నంలోని ఓ ప్రైవేటు రిసార్టు కేంద్రంగా జరిగిన సంక్రాంతి వేడుకలు కాస్తా కూటమిలో భోగి మంటలను మించి వేడిని రాజేశాయని అర్థమవుతోంది. కొరివితో తలగోక్కున్నట్టు...! వాస్తవానికి అనకాపల్లి ఎంపీ పోటీలో స్థానికేతరుడైన దిలీప్‌కుమార్‌కు సీటు ఇవ్వాలని టీడీపీ భావించింది. ఈ సీటును తన కుమారుడి కోసం ఆశించిన అయ్యన్నపాత్రుడు... స్థానికేతరులకు టికెట్ ఇస్తే సహకరించేది లేదంటూ ఎన్నికల ముందు జరిగిన పార్టీ సమావేశాల్లో బహిరంగంగానే మాట్లాడారు. అయితే, పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈ స్థానంలో ఎంపీ అభ్యరి్థగా సీఎం రమేష్‌ను బీజేపీ ప్రకటించింది. అనూహ్యంగా అయ్యన్నపాత్రుడు రమేష్‌ను వెంటబెట్టుకుని మరీ ఎన్నికల్లో కలియతిరిగారు. మిగిలిన నేతల కంటే ఎక్కువగా సీఎం రమేష్ తో సఖ్యతగా మెలిగారు. తీరా ఎన్నికల తర్వాత నర్సీపట్నంలోనే సీఎం రమేష్ రాజకీయం మొదలుపెట్టారు. దీంతో కొరివితో తలగొక్కున్నట్టుగా పరిస్థితి తయారయ్యిందని అయ్యన్న వాపోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు విశాఖలో ప్రధాని పర్యటన సందర్భంగా నర్సీపట్నం నుంచి జనసమీకరణపై సీఎం రమేష్ అయ్యన్నను కదిపే ప్రయత్నం చేశారు. మీరు చేర్చుకున్న నాయకులతో జనాలను తరలించుకువెళ్లండంటూ అయ్యన్న గట్టిగానే బదులిచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సంక్రాంతి సందర్భంగా సీఎం రమేష్ నర్సీపట్నంలో మకాం వేయడం చర్చనీయాంశమవుతోంది. సీఎం రమేష్ సమక్షంలో బీజేపీలో చేరిన ఇద్దరు విశాఖ డెయిరీ డైరెక్టర్లతో పాటు ఓ డాక్టర్, జనసేన నేతలు సదరు ప్రైవేటు రిసార్టు వద్ద హడావుడి చేస్తున్నారు. అయితే, అటువైపు ఏ ఒక్క టీడీపీ నేత కానీ కార్యకర్త కానీ వెళ్లకపోవడం గమనార్హం. విశాఖ డెయిరీ డైరెక్టర్ల చేరికపై...! విశాఖ డెయిరీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ హడావుడిగా అసెంబ్లీలో సభా సంఘాన్ని స్పీకర్ అయ్యన్న ఏర్పాటు చేశారు. దీనిపై పార్టీలోని నేతల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయనే ప్రచారం ఉంది. మరోవైపు తమ పార్టీలో విశాఖ డెయిరీ నేతలను చేర్చుకుంటున్నట్టు సీఎం రమేష్.... అయ్యన్నకు సమాచారమిచ్చినప్పటికీ ఆ విషయంలో ముందుకు వెళ్లడంపై కూడా సీఎం రమేష్ అసహనాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నర్సీపట్నం నియోజకవర్గంలోని ఇద్దరు విశాఖ డెయిరీ డైరెక్టర్లు సూర్యనారాయణ, రాజకుమారిలను బీజేపీలో చేర్చుకున్నారు. అంతేకాకుండా నర్సీపట్నంలోని డాక్టర్ కిలాడి సత్యనారాయణను కూడా తాజాగా ప్రధాని పర్యటన సందర్భంగా బీజేపీలో చేర్చుకున్నారు. ఈ చేరిక వెనుక కూడా సీఎం రమేష్ ఉన్నట్టు అయ్యన్న మండిపడుతున్నారు. అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ అంటే ఎవరో తెలియని సందర్భంలో ప్రతీ చోట పరిచయం చేసిన తననే లెక్కచేయకపోవడంపై అయ్యన్న ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మొత్తంగా సంక్రాంతి పండుగ కాస్తా కూటమి నేతల మధ్య కుంపటి రాజేసిందని చెప్పవచ్చు. అది నేనే.. ఇది నేనే..! -
అటు ఆది.. ఇటు జేసీ ‘బూడిద’ రగడ!
సాక్షి ప్రతినిధి, కడప: అధికారం కోసం పరస్పరం సహకరించుకున్నా ఆదాయార్జనపై మాత్రం కూటమి పార్టీ నేతల మధ్య సయోధ్య కుదరడం లేదు. మొన్న ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ చేపట్టిన నిర్మాణ పనులపై దాడి చేసిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం తాజాగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి సవాల్ విసిరింది. ఫ్లైయాష్ రవాణా తమ కనుసన్నల్లోనే జరగాలంటూ ఇరు వర్గాలు ఆధిపత్య పోరుకు దిగాయి. తమ వాహనాలను ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం అడ్డు కోవడంపై రగిలిపోయిన జేసీ ప్రభాకర్‌రెడ్డి ఈసారి సహించేది లేదని.. తాను అదానీలా చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. కండ కలవాడిదే రాజ్యమన్నట్లుగా భూపేష్‌రెడ్డి వర్గీయులు అదానీ కంపెనీ ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈమేరకు జిల్లా ఎస్పీకి జేసీ లేఖ రాయడంతోపాటు స్వయంగా రంగంలోకి దిగడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. మంగళవారం తాడిపత్రి నుంచి ఆర్టీపీపీ వరకు మూడు చోట్ల చెక్ పోస్టుల్లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.⇒ వైఎస్సార్ కడప జిల్లాలోని ఆర్టీపీపీ (రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్) నుంచి నిత్యం 3,926 టన్నుల ఫ్లైయాష్ ఉత్పత్తి అవుతుండగా 25 ప్రైవేట్ కంపెనీలు, 15 సిమెంటు పరిశ్రమలకు కేటాయిస్తున్నారు. ప్రైవేట్ సంస్థలకు టన్ను రూ.550 చొప్పున, సిమెంట్ పరిశ్రమలకు టన్ను రూ.410 చొప్పున సరఫరా అవుతోంది. అయితే రవాణా మాత్రం కూటమి పార్టీ నేతల కనుసన్నల్లోనే జరుగుతుంది. తాడిపత్రిలో ఉన్న ఎల్ అండ్ టీ సిమెంట్ పరిశ్రమకు జేసీ ప్రభాకర్‌రెడ్డికి చెందిన ట్యాంకర్లు ఫ్లైయాష్ సరఫరా చేస్తున్నాయి. అయితే సిమెంట్ పరిశ్రమలకు తామే ఫ్లైయాష్ సరఫరా చేస్తామని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పట్టుబట్టారు. ఈ క్రమంలో తాడిపత్రికి కూడా సరఫరా చేసేందుకు సన్నాహాలు చేశారు. అందుకు అందుకు నిరాకరించిన జేసీ తమ లారీల ద్వారానే తరలిస్తామంటూ తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, జేసీ లారీలను నాలుగు రోజుల క్రితం అడ్డగించారు.⇒ ‘ఆర్టీపీపీ నుంచి ఫ్లైయాష్ సరఫరాను అడ్డుకుంటే తాడిపత్రికి వాళ్ల లారీలు వచ్చి వెళ్తాయా? తమాషాలు చేస్తున్నారా? ఎలా అడ్డుకుంటారో చూద్దాం. నేనే వస్తున్నా...’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించడంతో అప్రమత్తమైన పోలీసులు కొండాపురం మండలం సుగమంచుపల్లె నుంచి కలమల్ల వరకూ మూడు చోట్లు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. కలమల్ల ఆర్టీపీపీ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. జేసీ తన వాహనాలతో వస్తే అడ్డుకునేందుకు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం సిద్ధం కావడంతో ఉదయం ఉద్రిక్తత నెలకొంది.మొన్న రిత్విక్ కన్‌స్ట్రక్షన్స్‌పై కూడా..అదానీ హైడ్రో పవర్ ప్రాజెక్టు సివిల్ పనులను చేస్తున్న రిత్విక్ కన్‌స్ట్రక్షన్స్‌పై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుటుంబ సభ్యులు తాజాగా దాడి చేయడం తెలిసిందే. కాంట్రాక్టు పనులన్నీ తామే చేస్తామని డిమాండ్ చేయడంతో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ వ్యవహారం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. తాజాగా ఫ్లైయాష్ సరఫరా విషయంలో రగడ మొదలైంది. ఆదాయ మార్గాలపై ఆదినారాయణరెడ్డి వర్గం కన్నేసినట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు. ఆర్టీపీపీ నుంచి సరఫరా చేసే ఫ్లైయాష్కు ప్రతి నెలా ఒక్కో లారీకి రూ.లక్ష కమీషన్ ముట్టజెప్పనున్నట్లు సమాచారం. ఎన్ని వాహనాలు తిరిగితే అంత కమీషన్ లభించనుంది. దీంతో రవాణాపై ఇరువర్గాలు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఆదాయాన్ని వదులుకునేందుకు అటు జేసీ ప్రభాకరరెడ్డి, ఇటు ఆదినారాయణరెడ్డి వర్గం సిద్ధంగా లేదు.ఆర్టీపీపీలో పోలీసులకు సూచనలిస్తున్న పోలీసు అధికారులు అదానీలా ఊరుకోను– ఎస్పీకి జేసీ లేఖఆర్టీపీపీ నుంచి ఫ్లైయాష్ తరలించే తమ వాహనాలను జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సోదరుడి కుమారుడు భూపేష్‌రెడ్డి అడ్డుకుంటే సహించేది లేదని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఈ మేరకు కడప ఎస్పీకి మంగళవారం ఆయన లేఖ రాశారు. అక్టోబరు 15న ఆర్టీపీపీ వద్ద తమ వాహనాలను అడ్డుకోవడంపై ఎస్పీ, జమ్మలమడుగు ఎస్డీపీఓల దృష్టికి తెచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. భూపేష్‌రెడ్డి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడంతో విధిలేని పరిస్థితుల్లో తాము ఈనెల 23న కడప నుంచి వచ్చే సిమెంటు, ఇసుక అక్రమ రవాణా వాహనాలను నిలిపి వేసినట్లు చెప్పారు. కడప ఎస్పీ విజ్ఞప్తి మేరకు ఆ రోజు వాటిని వదిలి వేశామన్నారు. ఈనెల 25 నుంచి ఫ్లైయాష్ లోడింగ్‌కు తమ వాహనాలను అనుమతిస్తామని తాడిపత్రి రూరల్ ఇన్స్పెక్టర్ హామీ ఇచ్చారన్నారు. అయినా కూడా ఒక రోజు అదనంగా గడువు ఇచ్చామన్నారు. బుధవారం నుంచి లోడింగ్‌కు తమ వాహనాలు ఆర్టీపీపీకి వెళతాయని, ఈ దఫా కూడా అడ్డుకుంటే తేలికగా తీసుకోబోమని స్పష్టం చేశారు. తాము రాత్రికి రాత్రే రాజకీయ నాయకులుగా అవతరించలేదన్నారు. తమ కుటుంబం 1932 నుంచి రాజకీయాల్లో కొనసాగుతోందన్నారు. కండ కలవాడిదే రాజ్యమన్నట్లుగా భూపేష్‌రెడ్డి వర్గీయులు అదానీ కంపెనీ ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారన్నారు. ఈ దఫా తాము కచ్చితంగా ప్రతిస్పందిస్తామని, ముందుగానే ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తెస్తున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి టీడీపీ అధికారం కోల్పోయిన వెంటనే బీజేపీలో చేరారని, వైఎస్సార్ సీపీ హయాంలో తనపై 95 అక్రమ కేసులు బనాయించారని చెప్పారు. -
గళమెత్తిన రెడ్డెమ్మ...
ఆడవారి మాటలకు ఆర్థాలే వేరులే...అంటూ ఓ సినిగేయ రచయిత పాట రచించారు. వాస్తవానికి ఆ స్థానంలోకి రాజకీయ నాయకులు వచ్చి చేరిపోయారు. వారి మాటలకు చేష్టలకు పొంతన లేకుండా ఉంది. ‘నోటితో మాట్లాడడం, నొసలుతో వెక్కిరించడం, దేని పని దానిదే’అన్నట్లుగా ఉండిపోయింది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు అదే విషయాన్ని రూఢీ చేస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో ఆదానీ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు ఎంపీ రమేష్‌నాయుడుకు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ చేపడుతోంది. కొండాపురం మండలంలోని దొబ్బుడుపల్లె, రావికుంట, తిరువాలయపల్లె గ్రామాలతోపాటు మైలవరం మండలంలోని బొగ్గులపల్లె గ్రామాల పరిధిలో ఆ పనులు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పనులన్నీ తమ వర్గీయులే చేపట్టాలంటూ జమ్మలమడుడు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పట్టుబట్టారు. మంతనాలు, హెచ్చరికలు, రాయబేరాలు ఎలా నడిపినా, ఆశించిన తీరులో నిర్మాణ పనులు దక్కలేదు. దీంతో ఎమ్మెల్యే ఆది కుటుంబ సభ్యులు శివనారాయణరెడ్డి, రాజేష్రెడ్డిల నేతృత్వంలో దొబ్బుడుపల్లె వద్ద చేపడుతున్న నిర్మాణపనుల్లో విధ్వంసం సృష్టించారు. స్థానికంగా ఉన్న రిత్విక్ కన్స్ట్రక్షన్స్ సిబ్బందిపై దాడి చేసి, అక్కడే ఉన్న వాహనాలను పగులగొట్టారు.తెరవెనుక మంత్రాంగంలో సీఎం రమేష్నాయుడుక్షేత్రస్థాయిలో రిత్విక్ కన్స్ట్రక్షన్స్ సంస్థ పనులు అడ్డుకొని స్థానికంగా ఉన్న సైట్ ఇంజినీర్లపై ఎమ్మెల్యే ఆది వర్గీయులు దాడి చేస్తే ఎంపీ రమేష్ నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు నోరు మెదపలేదు. తెరవెనుక మంత్రాంగంలో రమేష్‌నాయుడు ఉండిపోయారని సమాచారం. ఆమేరకు తన సోదరుడు రాజేష్‌నాయుడును సీఎం వద్దకు పంపించి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. సీఎం స్థాయిలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు దాడి చేపట్టిన వ్యవహారంపై వాకబు చేయడంతో వైఎస్సా ర్సీపీ నాయకులతో కలిసి పనులు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆది చెప్పుకొచ్చా రు. అదే వాస్తవమైతే ఫలానా వైఎస్సార్సీపీ నా యకులు పనులు చేస్తున్నారని, వారు అక్కడే ఉండి రెచ్చగొట్టారని ఎందుకు బహిరంగంగా ప్రకటి ంచలేదని విశ్లేషకులు నిలదీస్తున్నారు. రూ.1800 కోట్ల సివిల్ పనులు రిత్విక్ కన్స్ట్రక్షన్స్ ఎలా ఇస్తారన్నదే ఎమ్మెల్యే వర్గీయుల అసలు ప్రశ్న. ఆ పను లు తామే చేయాలన్నదే వారి ఆకాంక్ష. ఆ విషయాన్ని తెరమరుగు చేసి, వైఎస్సార్సీపీ నేతల పనులంటూ దాడి వ్యవహారాన్ని ఎమ్మెల్యే ఆది రక్తి కట్టించారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. గళమెత్తిన రెడ్డెమ్మ...ఎమ్మెల్యే మాధవీ రెడ్డి కడపలో మద్యం షాపుల నిర్వహణ తీరుపై అసెంబ్లీలో గళ మెత్తారు. మార్పు పేరిట డీ–ఆడిక్షన్ సెంటర్ మేడపైన నిర్వహిస్తుంటే, ఆ బిల్డింగ్ కిందనే మద్యం షాపు ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు. వాస్తవంగా ఎమ్మెల్యే లేవనెత్తిన ప్రశ్న మంచిదే అయినా, ఈ వ్యవహారంలో పాత్రధారులు, సూత్రధారులను బహిరంగ పర్చి ఉంటే బాగుడేందని పలువురు చెప్పుకొస్తున్నారు. కడపలో రెడ్డి వైన్స్ వర్సెస్ మౌర్య వైన్స్ మధ్య పెద్ద ఎత్తున ఆధిపత్య పోరాటం నడిచిన విషయం జగమెరిగిన సత్యం. అక్క డ మౌర్య వైన్స్ ఉంచరాదనే విషయంపై అధికారులపై రాజకీయ ఒత్తిడులు వచ్చినా అక్కడే కొనసాగిస్తున్నారంటే మరో అధికార పార్టీ నేత ప్రమే యం ఉండడమేనని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అటు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది వ్యవహారంలోనైనా, ఇటు కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి అసెంబ్లీలో గళమెత్తినా ఈ వ్యవహారంలో పాత్రధారు లు కూటమి ప్రభుత్వ నేతలేనన్నది సుస్పష్టం. -
ప్రజాస్వామ్యానికి పచ్చ బ్యాచ్ తూట్లు
ఓటమి భయం కూటమి నేతల కుతంత్రాలకు తెరతీసింది. బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు అడుగడుగునా ఎన్నికల కోడ్‌ను అతిక్రమించారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ ధన, అనుచర బలంతో పేట్రేగిపోయారు. డబ్బులు వెదజల్లి సీటు దక్కించుకున్న కూటమి ఎంపీ అభ్యర్థి రమేష్ గత నెల రోజుల నుంచీ చేస్తున్న అరాచకాలను పోలింగ్ రోజైన సోమవారం మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. పోలింగ్ ప్రారంభానికి ముందే మొదలైన ఈ దారుణాలను పోలింగ్ పూర్తయ్యే వరకూ కొనసాగించారు. పోలీసులు, అధికారులు కూడా భయపడ్డ పరిస్థితి. సాక్షి, అనకాపల్లి: ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన ఎన్నికల్ని కూటమి నేతలు తమ అరాచకాలతో పలు చోట్ల ఓటర్లను భయాందోళనకు గురిచేశారు. పోలింగ్ బూత్‌ల వద్ద క్యూలో ఉన్న ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయతి్నంచారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా తన అనుచరులతో పోలింగ్ బూత్‌ల్లోకి నేరుగా సెల్ఫోన్లతో ప్రవేశించిచారు. టీడీపీ ఏజెంట్లతో ఫోటోలు దిగారు. జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారులపై దూషణలకు పాల్పడ్డారు. పార్టీ కండువాలతో పోలింగ్ బూత్‌ల్లో ప్రవేశించి ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ ఓట్లు వేశారు. ఓటర్ స్లిప్‌లతో పాటు టీడీపీ మేనిఫెస్టో పంపిణీ చేస్తూ అడుగడుగునా నిబంధనలకు తూట్లు పొడిచారు. సీఎం రమేష్ ఓవరాక్షన్ బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమే కాకుండా పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల ప్రచార కేంద్రంగా మార్చేశారు. మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం కాశీపురం ప్రభుత్వ హైసూ్కల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌కు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆయన వెళ్లారు. క్యూ లైన్లో ఉన్న ఓటర్లను కలిసి బీజేపీకి ఓటేయాలంటూ ప్రలోభాలకు గురిచేశారు. పోలింగ్ బూత్‌లో ఉన్న టీడీపీ ఏజెంట్లతో ఫొటో షూట్‌కు దిగారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ ఓటింగ్ ప్రక్రియకు ఆటంకం కల్గిస్తున్న ఆయన్ని లోపలికి రానించడంతోపాటు, ఎన్నికల సిబ్బంది సకల గౌరవ మర్యాదలు చేయడం, వంగి వంగి నమస్కారాలు పెట్టడం గమనార్హం. అనంతరం దేవరాపల్లి హైసూ్కల్ పోలింగ్ బూత్ వద్ద కూడా ఇదే విధంగా ఆయన వ్యవహరించారు. వారి అనుచరులతో పోలింగ్ బూత్‌లోకి చొరబడి ఓటింగ్ ప్రక్రియకు ఆటకం కలిగించారు.బూతుల అయ్యన్న ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో ప్రజల ఛీత్కాలు ఎదుర్కొనే మాజీ మంత్రి, టీడీపీ నర్సీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యన్నపాత్రుడు పోలింగ్ రోజూ తన నోటి దురుసును ప్రదర్శించారు. నర్సీపట్నం టౌన్ గరŠల్స్ హైసూ్కల్ పోలింగ్ కేంద్రంలో ఎన్నికల అధికారులను బండ బూతులు తిడుతూ రెచ్చిపోయారు. రాయడానికి వీళ్లేని తిట్లందుకున్నారు. దీంతో అధికారులు నివ్వెరపోయారు. ఆ బూతులు విని ఓటర్లు అయ్యన్నను అసహ్యించుకున్నారు. ఓటేసేందుకు లైన్లలో నిరీక్షిస్తున్న మహిళల ముందే ఈయన ఈ బూతుల్ని అందుకున్నారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రవి పట్టన్‌శెట్టి, రిటర్నింగ్ అధికారి హెచ్వీ జయరాంలను దూషించి మాట్లాడాడు. ఓటరు స్లిప్పుల పేరిట మేనిఫెస్టో కాపీలు ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలో టీడీపీ నేతలు మరింతగా దిగజారారు. ఓటర్ స్లిప్‌లతో పాటు టీడీపీ మేనిఫెస్టోను పంపిణీ చేశారు. భీమిలి నియోజకవర్గంలో మూలకుద్దు, మధురవాడ, సంతపేట అంబేడ్కర్ హైసూ్కల్, పెద»ొడ్డేపల్లి ఆర్సీఎం స్కూల్, రామారావుపేట, శివపురం తదితర ప్రాంతాల్లో ఓటరు స్లిప్‌తో పాటు టీడీపీ మేనిఫెస్టో పంపిణీ చేశారు. బంగారుమెట్ట మీద దుర్గాలమ్మ ఆలయం వద్ద సూపర్ సిక్స్ ఫ్లెక్సీ పెట్టి ప్రచారం చేశారు. పెద»ొడ్డేపల్లిలో మున్సిపల్ వైస్ చైర్మన్ తమరాన అప్పలనాయుడు నిలదీయడంతో పోలీసులు స్లిప్పులు స్వా«దీనం చేసుకున్నారు. రామారావుపేటలో మున్సిపల్ వైస్‌చైర్మన్ కోనేటి రామకృష్ణ, వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకుని ఫిర్యాదు చేశారు. డీఎస్పీ మోహన్ స్వయంగా వచ్చి స్లిప్పులు స్వా«దీనం చేసుకుని టీడీపీ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ వైఎస్సార్సీపీ శ్రేణులు ఈ అరాచకాలను అడ్డుకుని, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకపోయింది.పార్టీ కండువాతో ఓటింగ్‌కు పంచకర్ల పెందుర్తి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ కూడా నిబంధనల ఉల్లంఘనలో తానేమీ తక్కువ కాదని నిరూపించుకున్నారు. సుజాతనగర్ డీఏవీ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటేసేందుకు ఉదయం 10 గంటల సమయంలో ఆయన వచ్చారు. పార్టీ కండువాతో పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించిన అతన్ని అధికారులు ఏ మాత్రం అడ్డుకోకపోవపోడం గమనార్హం.ఓటర్ల చైతన్యం.. అధికారిపై చర్యలు ఓటర్లలో చైతన్యం పెరిగింది. వక్రబుద్ధితో వ్యవహరిస్తున్న ఎన్నికల అధికారికి బుద్ధి చెప్పేలా చేశారు. సోమవారం ఉదయం పాయకరావుపేట నియోజకవర్గం, నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లు పోలింగ్ బూత్‌లో కళ్లు సరిగా కనిపించని వృద్ధుల ఓట్లను అక్కడి పోలింగ్ అధికారి టీడీపీకి వేయించాడు. ప్రశ్నించిన ఏజెంట్‌పై దురుసుగా ప్రవర్తించాడు. దేవరాపల్లి మండలం ఎ.కొత్తపల్లిలోని పోలింగ్ బూత్ నెం.173లో వృద్ధురాలు ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరగా, పోలింగ్ అధికారి కమలం పువ్వు గుర్తుకు ఓటేశారు. దీన్ని గుర్తించిన 70 ఏళ్ల వృద్ధురాలు నిలదీయడంతో ఏజెంట్లు ప్రశ్నించారు. విషయం ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు కు తెలియడంతో ఆయన అక్కడికి చేరుకుని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతన్ని విధుల నుంచి తొలగించి వేరే వారిని నియమించారు.టీడీపీ కండువాతో గంటా హల్చల్తగరపువలస: భీమిలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పోలింగ్ రోజున కూడా ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కారు. ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్‌తో కలిసి సోమవారం టీడీపీ కండువా వేసుకుని ఆనందపురం మండలంలోని పలు పోలింగ్ బూత్‌ల్లో ప్రచారం చేశారు. ఎన్నికల నియమావళిని అనుసరించి పోలింగ్ బూత్ చుట్టుపక్కల ఇళ్లపై వైఎస్సార్ సీపీ జెండాలు తొలగించిన ఎన్నికల సిబ్బంది.. గంటా పచ్చ కుండువాతో పోలింగ్ బూత్‌ల్లోకి ప్రవేశించినా అడ్డు చెప్పలేదు. పైగా బూత్‌ల్లో, బయట ప్రచారం నిర్వహించిన గంటా సైకిల్‌కు ఓటు వేయాలని అభ్యరి్థంచారు. దీనికి తోడు గుంపుగా బూత్‌ల్లో ప్రవేశించినా.. పోలింగ్ సిబ్బంది గానీ, పోలీసులు గానీ అడ్డుకోలేదు. గంటాతో పాటు అతనికి సహకరించిన పోలీసులు, పోలింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రెడ్డిపల్లి పోలింగ్ స్టేషన్లో..పద్మనాభం: రెడ్డిపల్లి పోలింగ్ స్టేషన్ వద్ద సోమవారం భీమిలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పసుపు కండువాతో హల్చల్ చేశారు. తన అనుచరులతో కలిసి గంటా పోలింగ్ స్టేషన్లోకి వెళుతుండగా.. వైఎస్సార్ సీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కండువాతో వెళ్లడానికి వీల్లేదని వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. సుమారు 20 నిమిషాల పాటు గంటా శ్రీనివాసరావు లోపలికి వెళ్లకుండా గేటు వద్ద ఉండిపోయారు. చివరకు గంటా కండువా తీసి ఒక్కరే పోలింగ్ స్టేషన్లోకి వెళ్లారు. -
పోలింగ్ బూత్ లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు యత్నించిన సీఎం రమేష్
-
భూ ఆక్రమణల్లో బకాసురుడు సీఎం రమేష్
అతడు.. భూఆక్రమణల్లో బకాసురుడు. అరాచకాల్లో రజాకార్లు కూడా ఆయన ముందు దిగదుడుపే. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో తన గురువు చంద్రబాబుకు తగ్గ శిష్యుడు. చివరకు సొంత గ్రామస్తులు, బంధువులు కూడా ఆయన అంతులేని ధనదాహార్తికి చితికిపోయారు. తన ఆక్రమణలకు అడ్డూ అదుపు లేదు.నదీ, వాగు అనే అభ్యంతరాలు లేవు. దొరికినదాన్నల్లా కబ్జా చేయడమే. సారా వ్యాపారం నుంచి మొదలై చంద్రబాబు అనుంగు శిష్యుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టి వాటినీ కలుíÙతం చేసిన ఆ చీడపురుగు.. సీఎం రమేశ్. సొంత గ్రామస్తులు ఛీ కొడుతున్న ఆయన అక్రమాలు, అరాచకాలు తెలిస్తే కళ్లు తేలేయకమానరు.పోట్లదుర్తి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : సీఎం రమేశ్, ఆయన సోదరుడు సురేశ్ నాయుడు రజాకార్ల కన్నా దుర్మార్గులని వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామస్తులు ధ్వజమెత్తారు. అదే గ్రామానికి చెందిన సీఎం రమేశ్, ఆయన సోదరుడు అరాచకాలకు బలికాని వర్గమంటూ లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. వారి ఆవేదన, ఆక్రందన వింటే ఈ కాలంలోనూ ఇన్ని దురాగతాలు ఎలా చేయగలుగుతున్నారనే ఆశ్చర్యం కలుగుతుంది.అన్ని వ్యవస్థలను అంతలా ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారని అవాక్కవ్వక తప్పదు. సొంత గ్రామస్తులకు వారు బతికుండగానే నరకం చూపిన సీఎం రమేశ్ ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ తరఫున అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడేం చేయబోతున్నారో ఊహించడానికే కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రమేశ్ స్వగ్రామంలో ఆయన ‘వ్యవహారాలు’ తెలుసుకోవడానికి ‘సాక్షి’ పోట్లదుర్తిలో పర్యటించింది. సారా వ్యాపారంతో మొదలెట్టి.. సీఎం రమేశ్ కుటుంబం సారా వ్యాపారంతో మొదలైంది. టీడీపీలో చేరి చంద్రబాబుతో చెలిమి చేశాక ఇక ఆయన వెనుతిరిగి చూడలేదు. బాబు సహకారంతో రెండుసార్లు రాజ్యసభ సభ్యుడు అయ్యారు. అన్నిరకాల అక్రమాలు, అడ్డగోలు వ్యవహారాల్లో ఆరితేరి రూ.వేల కోట్లకు పడగలెత్తారనే ఆరోపణలున్నాయి. బయట కాంట్రాక్టులు, కంపెనీల వ్యవహారాలను అలా ఉంచినా.. సొంత గ్రామంలో మచ్చుకు కొన్నింటిని పరిశీలిస్తే వామ్మో రమేశ్ అనకుండా ఉండలేం. వాగులు, నదుల్ని చెరబట్టి.. ప్రొద్దుటూరు నుంచి ఎర్రగుంట్లకు వెళ్లే మార్గంలో పెన్నానది ఒడ్డున పోట్లదుర్తి ఉంది. పెన్నాకు– గ్రామానికి మధ్యలో కలమల్ల వాగు పోతోంది. సీఎం రమేశ్ అటు నదిని, ఇటు వాగును ఆక్రమించి ఫెన్సింగ్ వేశారు. ఆ భూమిని ఆక్రమించుకున్నారు. తన భూములకు చుట్టూ తీగతో ఫెన్సింగ్ వేయడం ద్వారా ఇతర రైతుల పొలాలకు రాకపోకలు లేకుండా చేశారు. పెన్నా నది, కలమల్ల వాగులకు రక్షణ గోడలు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణ పనులు దక్కించుకున్న సీఎం రమేశ్ కుటుంబం వాటిపై ఎవరూ నడవకుండా అడ్డంకులు సృష్టించింది. చివరకు పశువులు, మూగజీవాలు నీరు తాగడానికి కూడా వీల్లేకుండా చేసింది. స్థానికులు నిరసనలు వ్యక్తం చేసినా సీఎం రమేశ్ రాక్షసంగానే వ్యవహరించారు. రైతుల్నే అమ్ముకునేలా చేసి.. తమ భూములున్న చోట పరిసరాల్లో కొందరి భూములు కొనుగోలు చేసి ఫెన్సింగ్ తీయించడం, ఆ తరువాత ఇతరులకు అడ్డంకులు కలి్పంచడం, వాటిని సొంతం చేసుకోవడం సీఎం రమేశ్, ఆయన సోదరుడి స్టైల్. పోనీ ఆ భూములను అక్కడున్న వాస్తవ ధర ప్రకారం తీసుకుంటారా అంటే అదీలేదు. ఎకరం రూ.పది లక్షల నుంచి రూ. ఇరవై లక్షలకు పైగా విలువచేసే భూమిని రూ.నాలుగు నుంచి ఆరేడు లక్షలకు రైతులే స్వయంగా వచ్చి అమ్ముకుపోయేలా వారిని అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తారు. భూములను తక్కువకు ఇచ్చేలా బెదిరింపులకు పాల్పడటం షరామామూలని పలువురు సొంత బంధువులే వివరించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాం పాలన ముగిసే సమయానికి పోట్లదుర్తి పరిసరాల్లో మూడు వందల ఎకరాలకు పైగా భూములను సీఎం రమేశ్ తన వశం చేసుకున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. అనేక పట్టా భూములను బినామీ పేర్లతో ఉంచారని తెలుస్తోంది. గొడ్డును బాదినట్లు బాదాడయ్యా మా అన్నదమ్ముల మధ్య పొలం విషయంలో తేడాలు వచ్చాయి. న్యాయం చెప్పమని సురేశ్ నాయుడు వద్దకు వెళ్లాం. ఎంతకూ సమస్య పరిష్కారం కాలేదు. దీంతో మరో పెద్దమనిషి వద్దకు వెళ్లానని తెలుసుకుని ఇంటికి పిలిపించి గొడ్డును బాదినట్లు బాదాడు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో పో అని బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు మళ్లీ బెదిరిస్తున్నారు. మా ప్రభుత్వం రాగానే నీ అంతుచూస్తానని బెదిరిస్తున్నారు. – కలమల్ల బాదుల్లా, పోట్లదుర్తి బంధువులమైనా వదిలిపెట్టడం లేదు.. సీఎం రమేశ్, మేము అంతా దగ్గర బంధువులమే. మా భూములను తక్కువ ధరకు తీసేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. దీనిపై కోర్టుల్లో వ్యాజ్యాలు నడుస్తున్నాయి. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. పోలీసులకు చెప్పినా ప్రయోజనం లేదు. అయినా మా పోరాటం ఆపేది లేదు. – సీఎం రమేశ్ బంధువులు సీఎం రమేశ్ అక్రమాలు, అరాచకాలు» పెన్నా నది ఒడ్డున లిక్కర్ ఫ్యాక్టరీ నెలకొల్పుతానని, గ్రామంలోని వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలి్పస్తానని నమ్మబలికి సుమారు 40 ఎకరాలను పేదవర్గాల నుంచి సేకరించారు. అందులో అధునాతన అతిథిగృహాన్ని కట్టారు. » గ్రామంలో మోడల్ స్కూలు కట్టిస్తానని నమ్మబలికి ఎకరం రూ. కోటి విలువచేసే భూమిని కేవలం 11 లక్షలకే తీసుకుని గ్రామస్తులను మోసం చేశారు. ఆ భూముల్లో ఆకుకూరలు, కూరగాయలు పండేవని, భూయజమానులకు నిత్యం ఆదాయం ఉండేదని గ్రామస్తులు చెబుతున్నారు. భూమి ఇవ్వడానికి నిరాకరించిన వారిని పోలీసుల పేరిట బెదిరించి మరీ తీసుకున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. » చంద్రబాబు పాలన 1999–2004 మధ్య ఎన్టీఆర్ కాలనీల పేరిట 294 (ఉమ్మడి ఏపీ అసెంబ్లీ స్థానాల సంఖ్య)గృహాలను ప్రభుత్వం మంజూరు చేసింది. లబ్దిదారులకు ఆ ఇళ్ల హక్కుపట్టాలు రానీయకుండా సీఎం రమేశ్ తన కుటుంబీకుల వద్దే ఉంచుకుని రుణాల రూపంలో లబ్ధి పొందారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వాటిని అమ్మడానికి, ఇతరులకు అద్దెకు ఇవ్వడానికి వీల్లేకుండా పోయిందని లబ్దిదారులు వాపోతున్నారు. » గత టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కూల్ పిల్లలకు యూనిఫాం పేరిట కొనసాగిన పథకాన్ని సీఎం రమేశ్ తనకు అనుకూలంగా వినియోగించుకున్నారు. మహిళా టైలర్లకు తెలియకుండా వారి పేరిట బ్యాంకు అకౌంట్లు, పాన్ కార్డులు తీసుకుని టైలరింగ్ ఛార్జీలను ఆయా అకౌంట్లలో వేయించేవారు. అధికారులతో కుమ్మక్కయి బ్యాంకు లావాదేవీలు తనకు అనుకూలంగా కొనసాగించుకోవడంతో టైలర్లు తమకు తెలియకుండానే ఆదాయపన్ను పరి«ధిలోకి చేరారు. దీంతో వారు సంక్షేమ పథకాలకు దూరమయ్యారు. » గ్రామస్తులు ఎవరైనా అత్యవసరాల కోసం డబ్బు తీసుకున్నా.. పెద్ద మొత్తం అయ్యేవరకు వేచిఉండి ఆ ప్రాంశరీ నోట్లను తిరిగి రాయించేవారు. ఆ తర్వాత ఆర్థికంగా వారిని పూర్తిగా కుంగదీసేవారు. ఇళ్ల స్థలాలు, ఇల్లు, భూములు ఇలా ఏవో ఒకటి లాగేసుకోవడం అన్నదమ్ములకు రివాజని స్థానికులు వివరించారు. సీఎం రమేశ్ సోదరుడు సురేశ్‌తో నిత్యం కలిసి ఉండే సోమశేఖరరెడ్డి తన అవసరాల కోసం రూ.40 వేలు తీసుకోగా కొన్నేళ్ల తర్వాత రూ. ఎనిమిది లక్షలకు పైగా తిరిగి చెల్లించాలని, లేదంటే తనకు భూమి రాసిచ్చేయాలని ఒత్తిడి చేశారు. దీంతో సోమశేఖరరెడ్డి కుటుంబం దెబ్బతింది. అదేవిధంగా జబ్బుపడిన తన బిడ్డ వైద్యం కోసం ఒక పేద దళిత వ్యక్తి రూ.2 వేలు తీసుకోగా లక్షకు పైగా చెల్లించాలని అతడిని ఒత్తిడి చేశారు. సీఎం రమేశ్ సోదరుల దౌర్జన్యాలకు చివరకు వారి సొంత చిన్నాన్న కుటుంబం కూడా ఆర్థికంగా చితికిపోయింది. » ప్రొద్దుటూరులో ద్విచక్రవాహనాల స్కీమ్ పేరిట సీఎం రమేశ్ మోసం చేశారు. ప్రొద్దుటూరులో వ్యాపారులను, చుట్టుపక్కల గ్రామాల వారిని నిండా ముంచారు. » గ్రామానికి అంతటికి సోలార్ ఎనర్జీ వచ్చేలా చేస్తానని చెప్పి మోసగించారు. » పశువులు గ్రాసం కోసం ఇబ్బందిపడకుండా వసతి ఏర్పాటుచేస్తానని చెప్పి ప్రభుత్వ సొమ్ము దిగమింగారు. » నీరు – చెట్టు ప«థకంలోనూ రూ.కోట్ల రూపాయలు దిగమింగారు. » ఆర్టీపీపీకి వెళ్లే ఆర్ అండ్ బీ రోడ్డును కొంతమేర ఆక్రమించుకుని సీఎం రమేశ్ అపార్ట్మెంట్ నిర్మాణం చేపట్టారు. తన ఇంటి కోసం రోడ్డును ఓ వైపునకు పొడిగించి భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం కూడా లేకుండా చేశారు. తమ ఇంటి ముందు ఉన్న పది అడుగుల రోడ్డును ఆక్రమించడంతో పరిసరాల్లోని తమకు దగ్గరి నడక మార్గం లేక చుట్టూ తిరిగి రావాల్సి వస్తోందని స్థానికులు వాపోయారు. -
అభ్యర్థుల ఆస్తులపైనా కన్ను!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అనకాపల్లిలో మైనింగ్‌పై కన్నేసి.. ఇక్కడ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేశ్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థుల ఆస్తులపైనా కన్నేసినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే అభ్యర్థులకు నిధుల కొరత ఉందంటూ.. వారికి నిధుల సమీకరణ పేరుతో వారి ఆస్తులను తాకట్టు పెట్టుకునేందుకు సీఎం రమేశ్ ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే అభ్యర్థులు తమ వంతు వాటా నిధులను తన టీమ్ సభ్యులకు చూపించాకే ఆయన తన వాటా నిధులను విడుదల చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా తమ వద్ద నిధులు లేవంటే.. వారి ఆస్తి పత్రాలు తీసుకుని అప్పులిప్పిస్తున్నట్టు చెబుతున్నారు. అది కూడా అధిక వడ్డీకి తన సన్నిహితుల వద్ద నుంచే సీఎం రమేశ్ అప్పులిప్పుస్తుండటం అభ్యర్థుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఫోర్జరీ వ్యవహారంలో ఆయనపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ఈ వ్యవహారం తెలిసిన ఎమ్మెల్యే అభ్యర్థులందరూ తాజా పరిణామాలతో భయాందోళనకు గురవుతున్నారు. అధిక వడ్డీకి తీసుకున్న ఈ మొత్తాలను సకాలంలో చెల్లించలేదన్న సాకుతో తమ ఆస్తులను తీసేసుకుంటే తమ పరిస్థితి ఏమిటని కూటమి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఆస్తుల చిట్టాతో భయపెడుతున్న వైనం వాస్తవానికి కొందరు తెలుగుదేశం, జనసేన పార్టీల అభ్యర్థులు ఎంపీ కోటా నుంచి వచ్చిన నిధులతోనే ఎన్నికలు కానిచ్చేదామనుకున్నారు. ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.13 కోట్ల మేర సీఎం రమేశ్ నిధులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణకు ఈ నిధులు సరిపోతాయని.. తమ వంతు వాటా నిధులు అవసరం లేదని ఎమ్మెల్యే అభ్యర్థులు భావించారు. అయితే, మీ వాటా నిధులు ఎక్కడున్నాయో చెప్పాలని.. తన టీమ్ పరిశీలిస్తుందని ఎమ్మెల్యే అభ్యర్థులను సీఎం రమేశ్ డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. మీ వంతుగా మీ వద్ద రూ.10 కోట్ల మేర ఉన్నాయని తన టీమ్ నిర్ధారించాకే తన కోటా రూ.13 కోట్లు విడుదల చేస్తానని ఆయన తేల్చిచెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలో చోడవరం నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి తన వద్ద నిధులు లేవని.. తనకు పెద్దగా ఆస్తులు కూడా లేవని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో సదరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆస్తుల మొత్తం వివరాలను డాక్యుమెంట్స్‌తో సహా సీఎం రమేశ్ ఆయన ముందు ఉంచడంతో విస్తుపోవడం ఆ అభ్యర్థి వంతైందని చెబుతున్నారు. ఇందులో కొన్ని ఆస్తులను తాను అమ్మివేశానని.. ప్లాట్లుగా విభజించి విక్రయించినట్టు ఆ అభ్యర్థి చెప్పడంతో తాజా ఎన్కంబరెన్స్ సరి్టఫికెట్ (ఈసీ)ని కూడా సీఎం రమేశ్ ఆయనకు చూపించినట్టు తెలుస్తోంది. ఇంతగా తమ ఆస్తులు, వాటి పత్రాలను కూడా ఆయన సేకరించడం పట్ల అభ్యర్థులు ఒకింత ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం.అధిక వడ్డీకి తాకట్టు.. అనకాపల్లి ఎంపీ స్థానం పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులకు చెందిన ఆస్తి పత్రాలన్నింటినీ సీఎం రమేశ్ సేకరించినట్టు చెబుతున్నారు. తమ వద్ద నిధులు లేవన్న అభ్యర్థులకు.. ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులిప్పించే ఏర్పాట్లను కూడా ఆయన చూసుకుంటున్నారు. ‘నీ ఆస్తి పత్రాలను తీసుకెళ్లి.. వైజాగ్‌లో ఫలానా వారిని కలిసి వడ్డీకి నిధులు తీసుకో’ అని వారిని ఆదేశిస్తున్నట్టు సమాచారం. తమ ఆస్తుల చిట్టాను సేకరించి.. వాటిని ఎక్కడ తాకట్టు పెట్టాలో కూడా సీఎం రమేశ్ చెబుతుండటంతో అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ ఆస్తుల చిట్టాను ఎందుకు సేకరించారు? వాటిని తీసుకెళ్లి ఫలానా వారి వద్దనే తాకట్టు పెట్టాలని ఎందుకు ఒత్తిడి చేస్తున్నారని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా ఆస్తి పత్రాలను తాకట్టు పెట్టుకుని అధిక వడ్డీకి అప్పులు ఇస్తున్న వారంతా సీఎం రమేశ్‌కు చెందినవారే కావడంతో వీరి అనుమానాలు రెట్టింపవుతున్నాయి. ఎన్నికల తర్వాత తమ ఆస్తులు తమకు దక్కుతాయా? ఈ అప్పు పేరుతో తీసుకున్న పత్రాలను తీసుకెళ్లి సొంతం చేసుకుంటారా అనే భయాందోళనకు గురవుతున్నట్టు సమాచారం. ఏది ఏమైనప్పటికీ గతంలో ఎన్నడూ లేని విధంగా తమ ఆస్తుల చిట్టాను మొత్తం విప్పుతుండటంతో అభ్యర్థుల్లో ఆశ్చర్యంతో పాటు ఆందోళన కూడా నెలకొందని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. -
పారిపోయిన సీఎం రమేష్
-
డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర
-
డిప్యూటీ సీఎం బూడి హత్యకు కుట్ర
దేవరాపల్లి (అనకాపల్లి జిల్లా): డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు ఇంటి వద్ద డ్రోన్ కెమెరాతో నలుగురు రెక్కీ నిర్వహించడం వివాదాస్పదమైంది. గ్రామస్తులు వారిని పట్టుకుని, తమ నేత బూడి ముత్యాలనాయుడుç ßæత్యకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ పోలీసులకు అప్పగించారు. ముత్యాలనాయుడు ప్రత్యరి్థ, బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ జోక్యం చేసుకోవడంతో వివాదం ముదిరింది.రాత్రి వరకు హైడ్రామా నడిచింది. దేవరాపల్లి మండలం తారువలోని బూడి ఇంటి చుట్టూ శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో డ్రోన్‌తో రెక్కీ నిర్వహించారు. అరగంటకు పైగా ముత్యాలనాయుడు ఇంటి పరిసరాల్లో డ్రోన్ చక్కర్లు కొట్టడంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు డ్రోన్ ఆపరేటర్లను ఆరా తీశారు. పొంతన లేని సమాధానం చెప్పడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ డి.నాగేంద్ర గ్రామానికి చేరుకుని డ్రోన్, బీజేపీ జెండా సహా హైదరాబాద్‌కు చెందిన డ్రోన్ ఆపరేటర్ చిలకల పాండురంగారావు, అసిస్టెంట్ ఆపరేటర్ పొట్టి సాయికృష్ణ, చొప్ప గంగాధర్, కొమర అప్పారావులను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. తన హత్యకు కుట్ర పన్నారని, అనుమతులు లేకుండా తన ఇంటి చుట్టూ డ్రోన్‌తో రెక్కీ నిర్వహించారని ముత్యాలనాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం రమేష్ ఎదురుదాడి విషయం తన అనుచరుల ద్వారా తెలుసుకున్న సీఎం రమేష్ డ్రోన్ ఆపరేటర్లను తారువ గ్రామస్తులపై ఎదురు ఫిర్యాదు ఇవ్వాలని సూచించారు. సాయంత్రం 4 గంటల సమయంలో అనుచరులు, టీడీపీ కార్యకర్తలతో దేవరాపల్లి పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. తమ కార్యకర్తలపై దాడి చేసిన బూడి వర్గీయులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ముత్యాలనాయుడు ఇంటి వద్దకు వెళ్లేందుకు సీఎం రమేష్ సిద్ధం కాగా.. పోలీసులు నిరాకరించారు. రౌడీమూకల మాదిరిగా పోలీసులను నెట్టుకుంటూ తన వెంట ఉన్న పచ్చ దండుతో రమేష్ తారువకు వెళ్లారు. ముత్యాలనాయుడి మరో ఇంటి వద్దకు (ఆ ఇంట్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ముత్యాలనాయుడి కుమారుడు రవికుమార్ ఉంటున్నారు) వెళ్లగా.. రమేష్ వస్తున్న విషయం తెలుసుకుని ముత్యాలనాయుడు ఆ ఇంటి వద్ద తన అనుచరులతో బైఠాయించారు. ఈ ఇల్లు కూడా తన పేరిట ఉందని, ఎవరొస్తారో చూస్తానని హెచ్చరించారు. విషయం తెలుసుకుని అవాక్కయిన సీఎం రమేష్ తన అనుచరులతో కలిసి హనుమాన్ ఆలయం ముందు మెట్లపై కూర్చుండి పోయారు. తారువ గ్రామస్తులు, వైఎస్సార్సీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని తమ ఊళ్లో రౌడీ రాజకీయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పోలీసులు వెళ్లిపోవాలని కోరడంతో సీఎం రమేష్ పోలీసు జీపు ఎక్కారు. దీంతో రమేష్ ఎక్కిన జీపునకు అడ్డంగా గ్రామస్తులు బైఠాయించారు. గూండాగిరీ చేసిన సీఎం రమేష్ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. దీంతో అరగంటకు పైగా సీఎం రమేష్ ఎక్కిన పోలీసు వాహనం నిలిచిపోయింది. ఆ వాహనాన్ని గ్రామస్తులు చుట్టముట్టడంతో సీఎం రమే‹Ù, అతని అనుచరవర్గం భయంతో వణికిపోయారు. పోలీసులు అతికష్టంపై రమేష్ ఎక్కిన వాహనాన్ని ముందుకు పంపించగా.. గ్రామస్తులు మాత్రం ఊరి పొలిమేర దాటే వరకు వెంబడించారు. -
CM Ramesh: గనులపై కన్ను... పోటీకి దన్ను
భారీ బెల్లం మార్కెట్‌తోపాటు మైనింగ్‌కు కేంద్రంగా ఉన్న అనకాపల్లిలో ఎంపీగా పోటీ చేసేందుకు పక్కా ప్లాన్‌తోనే సీఎం రమేష్ రంగప్రవేశం చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ ఉన్న కొండలను పిండి చేసి అక్రమార్జనకు తెరలేపేందుకే ఇంతదూరం వచ్చినట్టు స్పష్టమవుతోంది. ప్రధానంగా అనకాపల్లి చుట్టుపక్కలున్న మైన్లతోపాటు నర్సీపట్నంలో ఉన్న రంగురాళ్లను దోచేందుకే చంద్రబాబు డైరెక్షన్లో అడుగుపెట్టారనే చర్చ నడుస్తోంది. పార్లమెంటు సభ్యుడిగా బరిలో నిలిచేందుకు బీ–ఫారం తీసుకునే సమయంలో పక్కనే మైనింగ్ డాన్ ఉండటం ఈ విమర్శలకు బలం చేకూరుస్తోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: చంద్రబాబు చెబితేనే వచ్చాను.. ఉత్తరాంధ్రకు పెద్దదిక్కుగా ఉంటానని ప్రకటించుకున్న సీఎం రమేష్ మాటల్లో మర్మం ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో అనకాపల్లిలోని కొండలను నుగ్గు చేసి భారీగా అక్రమ తవ్వకాలు చేపట్టిన వెంగమాంబ శ్రీనుతో కలిసి బీ–ఫారం తీసుకున్న ఫొటోలు చక్కర్లు కొట్టడంతో నాన్ లోకల్ నేత పక్కా స్కెచ్ తేటతెల్లమవుతోంది. వెంగమాంబ పేరుతో మైనింగ్ అధికారులను వెర్రిమాలోకాలను చేసి అక్రమ మైనింగ్‌తో దర్జాగా కోట్లాది రూపాయల మేర దండుకున్న చరిత్ర శ్రీనివాస్ చౌదరికి ఉంది. ఖజానాకు రావాల్సిన రాయల్టీ వగైరాలను ఎగ్గొటి సొంత జేబులు నింపుకున్న సదరు ఉల్లంఘనుడి సహాయ సహకారాలతో ఇప్పుడు అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తుండటంతో ఈ అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. అంతేకాకుండా తనకు తానుగా ఉత్తరాంధ్రకు పెద్దదిక్కుగా చెప్పుకుంటూ ఇటు అల్లూరి నుంచి అటు శ్రీకాకుళం జిల్లా వరకు ఉన్న వనరులను దోచేందుకే ఉత్తరాంధ్రకు పెద్ద దిక్కుగా ఉంటానంటూ చెప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా అనకాపల్లి జిల్లాలోని గనులను దోచుకునేందుకే ఈ ఘనుడు వచ్చాడని అర్థమవుతోంది. ఇదీ వెంగమాంబ బాగోతం...! వాస్తవానికి అనకాపల్లి ఎంపీ బరిలో సీఎం రమేష్ ఉండాలని నిర్ణయించుకున్న సమయంలోనే మైన్స్పై ఆరా తీసినట్టు తెలుస్తోంది. గతంలో తెలుగుదేశం పారీ్టకి దగ్గరగా ఉండి... 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత వెంగమాంబ క్వారీ సంస్థ అధినేత శ్రీనివాస్ చౌదరి బీజేపీకి దగ్గరగా వెళ్లారు. ఈ పరిస్థితుల్లో సీఎం రమేష్ కూడా శ్రీనివాస్ చౌదరికి దగ్గరయ్యారు. ఎంతగా దగ్గరయ్యారంటే.... బీ–ఫారం తీసుకునే సమయంలోనే అక్రమ మైనింగ్ వీరుడితో చెట్టాపట్టాలేసుకునేంతగా.. అక్రమ మైనింగ్ డాన్‌గా వీవీఆర్ స్టోన్‌క్రషర్స్ అధినేత శ్రీనివాస్ చౌదరికి పెట్టింది పేరు. అక్రమ మైనింగ్ అధికారులతో కుమ్మక్కై కోట్లాది విలువ చేసే వనరులను దోచుకున్న వెంగమాంబ శ్రీనివాస్ చౌదరి ఇటీవల మళ్లీ తెరపైకి వచ్చాడు. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యరి్థగా వచ్చిన సీఎం రమే‹Ùకు అత్యంత ఆప్తుడిగా ఎన్నికల ప్రచారాల్లో శ్రీనివాస్ చౌదరి ప్రచారం చేస్తున్నాడు. సీఎం రమేష్ ఎంపీ అయితే జిల్లాలో ఎక్కడా కొండలు లేకుండా అనకొండ శ్రీనివాస్ చౌదరి దోచుకుంటారనే అనుమానాలున్నాయి. అయితే కడప నుంచి వచ్చిన సీఎం రమేష్ లాంటి వారిని ఓడగొడితేనే ఇలాంటి వాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయగలమని స్ధానిక ప్రజలు భావిస్తున్నారు. అనకాపల్లి మండలం సీతానగరంలో సర్వే నెం.193, 303లో వీవీఆర్ స్టోన్ క్రషర్స్ ఖనిజ సంపదను అక్రమంగా దోచేసి మైనింగ్ చేయడంతో మైన్స్ శాఖ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గత ఏడాది జూలై 8న క్షేత్రస్ధాయిలో తనిఖీలు చేసి శ్రీనివాస్ చౌదరికి దాదాపు రూ.33 కోట్ల జరిమానా విధించారు. అయినా లెక్కచేయకుండా మైనింగ్ డాన్ శ్రీనివాస్ చౌదరి స్ధానిక మైనింగ్ అధికారులతో చేతులు కలిపి యథేచ్ఛగా మైనింగ్ కొనసాగిస్తున్నారు. వందలాది లారీల్లో ఖనిజం తరలిపోతుందని స్థానికులు చేసిన ఫిర్యాదులను సైతం అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వమంటే లెక్కలేనితనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జరిమానాకు సంబంధించి నోటీసులు జారీ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, శ్రీనివాస్ చౌదరి ఆగడాలకు తొత్తులుగా పనిచేస్తున్నారని అప్పట్లో ముగ్గురు అధికారులను, విశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డీవీవీ సత్యనారాయణరెడ్డిని ఏలూరు బదిలీ చేశారు. వెంగమాంబ స్టోన్ క్రషర్స్‌లో జరిగిన దోపిడీ అంతా ఇంతా కాదు. ఏకంగా 5 లక్షల 68 వేల 923 క్యూబిక్ మీటర్ల ఖనిజం దోచుకున్నారని మైన్స్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఏడీ ప్రతాప్‌రెడ్డి అప్పట్లో నిర్ధారించారు. దీనికి రూ.32.36 కోట్ల మేర జరిమానా విధించారు. అయినప్పటికీ ఆగకుండా అక్రమ మైనింగ్ చేశారనే ఆరోపణలున్నాయి. వాస్తవానికి గ్రామీణ జిల్లాగా పచ్చని వ్యవసాయ గ్రామాలతో ఉన్న అనకాపల్లి జిల్లాలో ఎంతో విలువైన ఖనిజ సంపద ఉంది. ఇప్పటికే శ్రీనివాస్ చౌదరి లాంటి అక్రమ మైనింగ్ డాన్లు జిల్లాలో ఖనిజాన్ని దోచేస్తున్నారు. వీరికి తోడు సీఎం రమేష్ లాంటి వాళ్లు వస్తే జిల్లాను పూర్తిగా సర్వనాశనం చేసే పరిస్థితి ఎదురుకావచ్చు. చంద్రబాబు డైరెక్షన్లోనే..వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ మొదటి నుంచీ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా ఉన్నారు. ఆ పార్టీ నుంచే రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు డైరెక్షన్లోనే బీజేపీలో చేరారు. అయినప్పటికీ ఆయన రాజ్యసభ అభ్యరి్థత్వంపై వేటు పడలేదు. దర్జాగా చివరి వరకూ ఆ పదవిని అనుభవించారు. తిరిగి రాజ్యసభకు వెళ్లాలని భావించినప్పటికీ ఆ అవకాశాన్ని బీజేపీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు కుదుర్చుకునేందుకు తహతహలాడిన చంద్రబాబు... అనకాపల్లి పార్లమెంటు సీటును మాత్రం తన వ్యక్తికే ఉండాలని భావించారు. మొదటగా ఈ సీటు నుంచి నాగబాబు పోటీ చేయాలని భావించారు. ఇందుకు అనుగుణంగా పావులు కూడా కదిపారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న భారీ గనులను దృష్టిలో ఉంచుకున్న బాబు... ఈ సీటు నుంచి నాగబాబు బరిలో ఉండటాన్ని ఇష్టపడలేదు. దీని ఫలితంగానే ఈ సీటును బీజేపీ గట్టిగా కోరడం... పవన్ ఈ సీటును వదులుకోవడం జరిగిపోయాయి. ఫలితంగా సీఎం రమేష్ తెరమీదకు వచ్చారు. ఈ వ్యవహారమమంతా బాబు డైరెక్షన్లోనే జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
మనిషి బీజేపీ.. మనసు టీడీపీ : ముత్యాలనాయుడు
నర్సీపట్నం: సీఎం రమేష్‌ను జిల్లా ప్రజలు ఎలాగూ నమ్మరని.. మనిషి బీజేపీ, మనసు టీడీపీ కావడంతో ఇరు పార్టీల కార్యకర్తలు సైతం ఆయనను విశ్వసించడం లేదని డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు అన్నారు. ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్‌తో కలిసి గురువారం క్యాంపు కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రమేష్‌లా తాను బ్యాంకులను మోసం చేయలేదన్నారు. దోపిడీలు చేయటం తనకు చేతకాదన్నారు.అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకు చంద్రబాబు అనుమతితో ఆయన బీజేపీలో చేరారని, రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినా ఏనాడూ స్టీల్‌ప్లాంట్ గురించి నోరు మెదపలేదన్నారు. స్థానికులకే ఎంపీ టికెట్ కేటాయించాలని తొలుత గట్టిగా మాట్లాడిన అయ్యన్నపాత్రుడు డబ్బుల కోసం సీఎం రమేష్‌కు సాగిలపడ్డారని విమర్శించారు.ఇక్కడి ప్రజలు విజ్ఞత కలిగినవారని, స్థానికేతర్లకు ఇక్కడ ప్రజలు పట్టం కట్టిన దాఖలాలు లేవన్నారు. రాయలసీమ ప్రాంతం నుంచి డబ్బు సంచులతో దిగిన సీఎం రమేష్ ఓటర్లను కొనేయాలనుకుంటే.. ఆయన ఆటలు చెల్లవన్నారు. టీడీపీ నాయకులు అమ్ముడు పోతారేమో కాని ఓటర్లు మాత్రం డబ్బులకు లొంగిపోయే వారు కాదన్నారు.ప్రజల కలలకు వాస్తవ రూపం..సీఎం రాష్ట్ర ప్రజల ప్రగతిని దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోకు రూపకల్పన చేశారని, వారి కలలకు వాస్తవ రూపం ఇచ్చారని ముత్యాలనాయుడు అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే రాష్ట్రం అప్పులు పాలవుతుందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. అవే సంక్షేమ పథకాలను అమలు చేస్తానని సిగ్గు లేకుండా మేనిఫెస్టో విడుదల చేశారని విమర్శించారు.ఆచరణ సాధ్యం కాని హామీలతో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. రైతన్నకు మంచి చేసే ఆలోచనతో జగనన్న ఉంటే, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు అసత్యప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రైతులకు ఉపయోగపడే ఏ పథకమైనా తీసుకోచ్చారా అని ప్రశ్నించారు. నేడు రైతు భరోసా, రైతులకు రుణాలు, కౌలు రైతుల చట్టం తదితర పథకాలను జగనన్న అమలు చేస్తుంటే ఓర్వలేని చంద్రబాబు ఆసత్యప్రచారం చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు చింతకాయల సన్యాసిపాత్రుడు, రుత్తల యర్రాపాత్రుడు పాల్గొన్నారు.ఇవి చదవండి: టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి -
ఫేక్ వీడియోకున్న విలువ.. సీఎం జగన్ ప్రాణానికి లేదా?
హైదరాబాద్, సాక్షి: చంద్రబాబు పబ్లిక్‌గా ఏపీ సీఎం జగన్‌ను చంపుతా అంటున్నారని, ఎన్నికల వేళ ఫేక్ వీడియోల గురించి తీవ్రంగా స్పందిస్తున్నవాళ్లు.. ఇంత సీరియస్ ఇష్యూపై స్పందించకపోవడం బాధాకరమని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్, YSRCP నేత పోసాని కృష్ణమురళి ఆవేదన వ్యక్తం చేశారు.బుధవారం ఉదయం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎన్నో రోజులుగా సీఎం జగన్‌ను చంపేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ‘రేపే నిన్ను(సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ..) చంపితే ఏం చేస్తారు’ అని చంద్రబాబు అడుగుతున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో దాడి జరిగితే మీరే చేపించుకున్నారంటూ చంద్రబాబు ఆరోపించారు. ఇది దుర్మార్గం కాదా?. దీనిపై ఎవరూ స్పందించరా?. ఒక ఫేక్ వీడియోకి ఉన్న విలువ సీఎం జగన్ ప్రాణానికి లేదా?.. సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు ఆర్థిక నేరస్తులు. ఈ విషయం అందరికీ తెలుసు. అసలు సుజనా చౌదరి బీజేపీలోకి ఎందుకు మారారు? బీజేపీలో ఉంటే వేల కోట్లు తినొచ్చా? అక్రమాలు చేసిన వాళ్లు బీజేపీలో ఉంటే శిక్ష పడదా?. మోదీగారు మీరు నిజాయితీవంతమైన నాయకులు. ఇలాంటి వారిని ప్రొత్సహించి మీ ఇమేజ్ను దెబ్బ తీసుకోకండి’’ అని పోసాని అన్నారు. -
అట్టర్ ఫ్లాప్..
-
Visakhapatnam: నాన్ లోకల్ నాడు వద్దు.. నేడు ముద్దు
విశాఖ సిటీ: నాన్ లోకల్ అంశం అనకాపల్లి తెలుగుదేశానికి శరాఘాతంగా మారింది. స్థానికేతరులను జిల్లా నుంచి తరిమికొట్టాలని అయ్యన్నపాత్రుడు ఇచ్చిన పిలుపే.. ఇపుడు ఆ పార్టీని భస్మాసుర హస్తంలా వెంటాడుతోంది. కూటమి తరపున ఎంపీతో పాటు రెండు ఎమ్మెల్యే స్థానాలను స్థానికేతరులకే కేటాయించడం టీడీపీ శ్రేణులకు మింగుపడడం లేదు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన స్థానిక నేతలకు మొండిచెయ్యి చూపించి.. ఆర్థిక నేరగాళ్లు, జనామోదం లేని నాన్‌లోకల్స్‌కు టికెట్లు కట్టబెట్టడంతో ఆ పార్టీ ఆశావహులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్యాకేజీలు పుచ్చుకొని, తమ స్వార్థానికి పార్టీ ప్రయోజనాలను బలి చేస్తున్నారని, కింది స్థాయి క్యాడర్‌కు అన్యాయం చేస్తున్నారన్న ఆవేదన వ్యక్తమవుతోంది. అయ్యన్న నాన్ లోకల్ బాణం తిరిగి తిరిగి తమ పార్టీకే తగులుతోందని టీడీపీ శ్రేణులు ఆందోళన పడుతున్నాయి. బైరాపై స్థానికేతర ముద్ర అనకాపల్లి ఎంపీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు బైరా దిలీప్ చక్రవర్తి ఆశించారు. చంద్రబాబు కూడా ప్రారంభంలో బైరా వైపే మొగ్గు చూపారు. అయితే ఈ స్థానం తన కుమారుడికి కేటాయించాలని అయ్యన్నపాత్రుడు గట్టిగా పట్టుబట్టారు. చంద్రబాబు సమక్షంలో జరిగిన బహిరంగ సమావేశంలోనే ఈ ప్రస్తావన తీసుకువచ్చారు. అనకాపల్లి ఎంపీ స్థానాన్ని తన కుమారుడికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బైరా దిలీప్ స్థానికేతరుడని, అతడిని అనకాపల్లి జిల్లావాసులు ఆదరించరని బహిరంగంగానే విమర్శలు చేశారు. అంతటితో ఆగకుండా స్థానికేతరులను జిల్లా నుంచి తరిమికొట్టాలని ప్రజలకు పిలుపిచ్చారు.పొత్తులో భాగంగా అనకాపల్లి ఎంపీ స్థానం బీజేపీ వశమైంది. బీజేపీ నుంచి కడప జిల్లా వాసి సి.ఎం.రమేష్ ఎన్నికల బరిలో దిగారు. స్థానికేతరుడన్న నెపంతో బైరాను వ్యతిరేకించిన అయ్యన్న.. నాన్ లోకల్ అయిన సి.ఎం.రమేష్‌తో రాసుకు పూసుకొని తిరగడం టీడీపీ నేతలకు మింగుడుపడడం లేదు. ఆర్థిక నేరగాడిగా ముద్ర పడిన సి.ఎం.రమేష్ తో సన్నిహితంగా మెలుగుతుండడంతో ద్వితీయ శ్రేణి నాయకులు సైతం అయోమయానికి గురవుతున్నారు. ఈ దోస్తీ వెనుక ‘భారీ’ వ్యవహారమే నడిచిందన్న చర్చ ఆ పారీ్టలో జరుగుతోంది. రెండు అసెంబ్లీ స్థానాల్లో స్థానికేతరులే.. అనకాపల్లి ఎంపీ అభ్యర్థి స్థానికేతర అంశం ప్రజల్లోకి వెళ్లకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో కిందామీద పడుతున్న టీడీపీ నాయకులకు.. మరో రెండు అసెంబ్లీ స్థానాలను సైతం స్థానికేతరులకే కేటాయించడం మరింత తలనొప్పిగా మారింది. 2019 ఎన్నికల్లో పెందుర్తిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి అదీప్‌రాజ్ చేతుల్లో ఓడిపోయిన బండారు సత్యనారాయణమూర్తికి ఈసారి కూడా ఐవీఆర్ఎస్ సర్వేలో ప్రతికూలంగా రిపోర్టు రావడంతో చంద్రబాబు అతడికి టికెట్ నిరాకరించారు. ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. దీంతో బండారు అలకపాన్పు ఎక్కారు.ఈ క్రమంలో సి.ఎం.రమేష్ బండారుతో చర్చలు జరిపి చంద్రబాబుతో రహస్య భేటీ ఏర్పాటు చేయించి మాడుగుల టికెట్ వచ్చేలా చక్రం తిప్పారు. దీంతో స్థానికులైన గడిరెడ్డి రామానాయుడు, పైలా ప్రసాద్‌లను పక్కనపెట్టి పెందుర్తిలో తరిమేసిన మరో స్థానికేతరుడిని మాడుగులకు తీసుకువచ్చారు. అలాగే పెందుర్తి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్‌బాబు కూడా మచిలీపట్నానికి చెందిన నేత. ఇలా మరో రెండు స్థానాలను కూడా నాన్‌లోకల్స్‌కు టికెట్లు కేటాయించడం ఆ పార్టీ ఆశావహులకు మింగుడుపడడం లేదు. నోరు మెదపని అయ్యన్న.. బైరా విషయంలో స్థానికేతరుడని ఘాటు విమర్శలు చేసిన అయ్యన్న పాత్రుడు ఇపుడు మాడుగుల, పెందుర్తి టికెట్లు నాన్‌లోకల్స్‌కు కేటాయించినా నోరు మెదపకపోవడం గమనార్హం. నాన్‌లోకల్స్‌ను జిల్లా నుంచి తరిమికొట్టాలని అయ్యన్న ఇచ్చిన పిలుపు.. ఇపుడు ఆ పార్టీ అభ్యర్థులను వెంటాడుతోంది. స్థానికేతర ముద్ర పడకుండా ప్రజల్లోకి ఎలా వెళ్లాలన్న అంశంపై తర్జనభర్జన పడుతున్నారు. తన కొడుకు టికెట్ కోసం అయ్యన్న వేసిన ఎరకు టీడీపీ అభ్యర్థులే చిక్కారంటూ టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నాన్‌లోకల్ అంశం ప్రజల్లోకి వెళితే ఓటమి తప్పదని ఆందోళన చెందుతున్నారు. -
సారా.. నారా అండతో దోపిడీకి C/O సీఎం రమేష్
దోచుకో.. పంచుకో.. సూత్రం సారా వ్యాపారంలో ఆరితేరిపోయిన సీఎం రమేష్‌ను చంద్రబాబు నాయుడుకు దగ్గర చేసింది. సారా వ్యాపారంతో మొదలైన ఆర్జన ఇరిగేషన్ కాంట్రాక్టుల వరకు వెళ్లింది. టీడీపీ ప్రభుత్వం ఉన్నంతకాలం ఈ అక్రమార్జనపరుడికి ఎదురే లేకుండా పోయింది. రిత్విక్ కన్స్ట్రక్షన్స్ పేరుతో హంద్రీ –నీవా, వెలిగొండ, తెలుగుగంగ,గుంతకల్లు బ్రాంచి కెనాల్, వంశధార.. ఒకటేమిటి.. అధికారంలో బాబు అండతో సీఎం రమేష్ అక్రమాల్లో చెలరేగిపోయారు. బాబు– సీఎం రమేష్లది ఆర్థిక రాజకీయ బంధం. ఈ బంధం ఫెవికాల్ అంతదృఢంగా పెనవేసుకుపోయింది. బాబుతో ముడిపడిన ఆర్థిక బంధం రెండు టర్మ్‌ల్లో సీఎం రమేష్‌ను రాజ్యసభ సభ్యుడిని చేసింది. రాజకీయ చక్రం బాగా తిప్పుతారని సదరు బాబు సూచనతో బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఇతనికి ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాలనిపించింది. స్థానికంగా అంత సీన్ లేనందున తన అక్రమాల నేపథ్యం తెలియని కోస్తాంధ్ర వైపు దృష్టి సారించారు. సాక్షి ప్రతినిధి, కడప : స్వయం కృషితో కష్టపడి ఉన్నత స్థాయికి చేరేవారు కొందరైతే, రాజకీయ అండ దొరకబుచ్చుకుని చెలరేగిపోయే వారు ఇంకొందరు. ఇందులో రెండో కోవకు చెందిన నేత చింతకుంట మునెయ్యగారి (సీఎం) రమేష్ నాయుడు. ఉరఫ్ సీఎం రమేష్. చిత్తూరు జిల్లా సారా వ్యాపారంలో చంద్రబాబుతో ఏర్పడ్డ సాన్నిహిత్యం ఉన్నత స్థాయికి ఎదిగేలా చేసింది. అదీ ఏ స్థాయిలో అంటే సొంత తమ్ముడు నారా రామ్మూర్తినాయుడినే బాబు పక్కన పెట్టే స్థాయిలో సంబంధాలు పెనువేసుకున్నాయని పరిశీలకుల అభిప్రాయం. విభజిత ఏపీలో సీఎం రమేష్‌నాయుడు కాంట్రాక్టు సంస్థ దినదినాభివృద్ధి చెందింది. చంద్రబాబు ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని అనేక అక్రమ కార్యకలాపాలను శరవేగంగా నడిపారు. ఎంతలా అంటే 2019 ఎన్నికల నోటిఫికేషన్‌కు కేవలం ఒక్క రోజు ముందే ఈయన కాంట్రాక్టు సంస్థకే ఇరిగేషన్ పనులు దక్కేలా చక్రం తిప్పారు. ఒక్కమాటలో చెప్పాలంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్నాళ్లూ సీఎం రమేష్ ఆర్థిక సామ్రాజ్యం విస్తరించింది. ఎవరీ సీఎం రమేష్‌నాయుడు? వైఎస్సార్ జిల్లా యర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామానికి చెందిన చింతకుంట మునెయ్యగారి (సీఎం) సుబ్బానాయుడు మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి అనుచరుడు. సారా వ్యాపారంలో రాణించారు. కడప జిల్లాలో పలుపాంత్రాల్లో ఈ వ్యాపారాన్ని విస్తరించారు. ఆయనకు నలుగురు కుమారులు. మునిస్వామినాయుడు, గోవర్ధన్‌నాయుడు, సత్యనారాయణనాయుడు, గోపాల్‌నాయుడు. తండ్రి సుబ్బానాయుడు వారసత్వంగా కుమారులు పలువ్యాపారాలను విస్తరించారు. ఈ క్రమంలో మునిస్వామినాయుడు సారా వ్యాపారాన్ని కొనసాగించారు. అప్పట్లో కడప జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న సారా కాంట్రాక్టును చిత్తూరు జిల్లాకు విస్తరించారు. ఈ జిల్లాలో సారా కాంట్రాక్టు కార్యకలాపాలను మునిస్వామినాయుడు కుమారుడు సీఎం రమేష్‌నాయుడు కొనసాగించారని ఈ వ్యవహారం మొత్తం తెలిసిన పలువురు వివరిస్తున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో అప్పటికే క్రియాశీలకంగా ఉన్న చంద్రబాబుతో సాన్నిహిత్యం కోసం తొలుత తమ్ముడు నారా రామ్మూర్తినాయుడితో సీఎం రమేష్ దోస్తీ చేశారు. క్రమంగా వీరి సాన్నిహిత్యం పెరిగి, తుదకు నారా రామ్మూర్తినాయుడినే చంద్రబాబు నుంచి దూరం పెట్టేలా చేసింది. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన యువతిని సీఎం రమేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాంతో వెలమ సామాజిక వర్గానికి చెందిన సీఎం రమేష్ బాబుకు మరింత దగ్గరైనట్లు సమాచారం. అనంతరం 1994 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఆయనకు చంద్రగిరి, కుప్పం నియోజకవర్గాల సమన్వయ బాధ్యతలు అప్పగించినట్లు పలువురు చెబుతున్నారు. 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో సీఎం రమేష్ సారా వ్యాపార సామ్రాజ్యం వేగంగా విస్తరించినట్లు సమాచారం. అప్పటి సాన్నిహిత్యమే అంచెలంచెలుగా ఎదిగి టీడీపీ నుంచి రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యే స్థాయికి చేరుకుందని విశ్లేషకులు వివరిస్తున్నారు. టీడీపీ హయాంలో రూ.3,658 కోట్ల పనులు రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ అధికార పగ్గాలు చేపట్టింది. రిత్విక్ కన్స్ట్రక్షన్స్కు ఇదో వరంగా పరిణమించింది. అప్పటి వరకూ వివిధ రాష్ట్రాల్లో కాంట్రాక్టు పనులు చేస్తూ ఆర్థిక లోటుపాట్లతో ఇబ్బందులు పడుతున్న ఆ సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదరించి అండగా నిలిచింది. ఈ క్రమంలో ఈ సంస్థకు కాంట్రాక్టు పనుల వరద పారిందని పలువురు వివరిస్తున్నారు. అందులో ప్రధానంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ రూ.522 కోట్లు, హంద్రీ–నీవా సుజల స్రవంతి ఫేజ్–2 రూ.1000 కోట్లు, హెచ్ఎన్ఎస్ఎస్ విస్తరణ పనులు రూ.195 కోట్లు, హెచ్ఎన్ఎస్ఎస్ 34వ ప్యాకేజీ రూ.234 కోట్లు, జీఎన్ఎస్ఎస్ ప్రాజెక్టులో రూ.350 కోట్లు, వెలిగొండ టన్నెల్ రూ.270 కోట్లు, తెలుగుగంగ లైనింగ్ పనులు రూ.289 కోట్లు, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ రూ.172 కోట్లు, వంశధార ప్రాజెక్టు పనులు రూ.120 కోట్లు, ఆర్టీపీపీ 6వ ప్లాంటు నిర్మాణ పనులు రూ.400 కోట్లు, గండికోట ప్రాజెక్టు పునరావాస నిర్మాణం పనులు రూ.106 కోట్ల పనులు దక్కినట్లు పలు కాంట్రాక్టు సంస్థలు వెల్లడిస్తున్నాయి. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో దాదాపు రూ.3,658 కోట్ల పైబడిన కాంట్రాక్టులను ఆ సంస్థ కొనసాగిస్తున్నట్లు పలువురు కాంట్రాక్టర్ల విశ్వసనీయ సమాచారం. అదే విషయాన్ని ప్రొద్దుటూరు నియోజకవర్గ అప్పటి టీడీపీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి (ప్రస్తుత టీడీపీ అభ్యర్థి) సైతం పలుమార్లు స్పష్టం చేశారు. ఎంపీ రమేష్‌నాయుడుకు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. ఆర్టీపీపీలో అడ్డగోలు టీడీపీ ఎంపీ హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రమేష్ దందా నిర్వహిస్తే, సోదరుడు సీఎం సురేష్‌నాయుడు స్థానికంగా ఆర్టీపీపీ (రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్) కేంద్రంగా దోపిడీ చేశారు. ఇనుము (స్క్రాప్), సిమెంటు, కంకర యథేచ్ఛగా తరలించారు. తన దారికి అడ్డు లేకుండా మరో రహదారి (అనధికారిక గేట్) ఏర్పాటు చేసి మరీ తరలించారు. మూడేళ్ల పాటు జెన్కో డైరెక్టర్లు చోద్యం చూడటం మినహా కట్టడి చేయలేని దుస్థితి. ఆర్టీపీపీలో అధికారికంగా రెండుగేట్లు ఉన్నాయి. వాటి పరిధిలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు(ఎస్పీఎఫ్) బందోబస్తు ఉంటుంది. ప్రతిదీ అక్కడ రికార్డు అవుతుంది. ఈ క్రమంలో అనధికారికంగా మూడో గేటు వెలసింది. అందుకు అప్పటి సీఈ, ఓ డైరెక్టర్ స్థాయిలో సహకరించారు. 6వ యూనిట్ నిర్మాణ పనుల నేపథ్యంలో వాహనాల రాకపోకలకు మూడో గేట్ ఏర్పాటు చేసినట్లు యంత్రాంగం సమర్థించుకుంది. ఆ గేటులో ఎలాంటి సిబ్బంది లేకపోవటంతో అవినీతి అక్రమాలకు నిలయంగా మారింది. యథేచ్ఛగా ఈదారి గుండా వాహనాలు ఆర్టీపీపీలోకి వెళ్లడం, బయటికి రావడంతో అందులో ఉన్న కోట్లాది రూపాయల స్క్రాప్, కంకర, సిమెంటు బయటకు వెళ్లింది. విజిలెన్సు విభాగం యాజమాన్యానికి అప్పట్లో ఈ విషయమై నివేదించినా ఫలితం లేకపోయింది. చంద్రబాబు అండ చిత్తూరు జిల్లాలో సారా వ్యాపారంతో అరంగేట్రం చేసిన సీఎం రమేష్ కుటుంబానికి అప్పటి నుంచే చంద్రబాబునాయుడు అండగా నిలిచి ఆదరించారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో గుడిమల్లం దేవాలయ భూములు 303 ఎకరాలు వేలానికి వచ్చాయి. అప్పటి రాజకీయ సంబంధాల కారణంగా సీఎం రమేష్ కుటుంబం తక్కువ ధరలకు ఆ భూములను వేలంలో దక్కించుకున్నట్లు సమాచారం. ఆ భూముల ఆధారంగా 90వ దశకం చివర్లో అప్పటి రాజకీయ పలుకుబడితో బ్యాంకులో దాదాపు రూ.400 కోట్ల రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది. తర్వాత రిత్విక్ కన్స్ట్రక్షన్స్ సంస్థ కార్యకలాపాలు చురుగ్గా సాగినట్లు వాటి కార్యకలాపాలే చెబుతున్నాయి. వ్యక్తిపై దాడి కేసు అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న సీఎం రమేష్నాయుడుపై 2019 ఏప్రిల్ 11న వైఎస్సార్ కడప జిల్లా యర్రగుంట్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 2019 ఎన్నికల సమయంలో యర్రగుంట్లలోని ఓ ఎన్నికల బూత్‌లోకి నిబంధనలకు విరుద్ధంగా ఒకరికంటే ఎక్కువ మంది వెళ్లడంతోపాటు ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపరిచారు. బాధితుడు పడిగపాటి వెంకటసుధాకర్ తండ్రి బాల సుబ్బిరెడ్డి ఇచి్చన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు సీఎం రమేష్‌పై 100/2019 ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, ఐపీసీ సెక్షన్ 323, 324/ఆర్/డబ్లు 34 కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిధులతో భూములకు ప్రొటెక్షన్ వాల్ అపోట్లదుర్తి గ్రామంలో నీరు–చెట్టు పథకం కింద ఫ్లడ్ ప్రొటెక్షన్ బ్యాంక్స్ ఏర్పాటు చేసేందుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ జీఓ జారీ చేసింది. జీఓ ఆర్టీ నంబర్ 74 ను 2019 జనవరి, 29న జారీ చేశారు. ఆ మేరకు నీరు–చెట్టు పథకం కింద ఫ్లడ్ ప్రొటెక్షన్ బ్యాంక్స్ నిర్మించేందుకు ఫిబ్రవరి 1న ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్లను ఆ శాఖ ఎస్ఈ ఆహా్వనించారు. అంటే విషయం గ్రహించేలోపు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేలా వ్యవహరించారు. ఎన్నికల కోడ్‌కు ముందే టెండర్లకు పిలిచిన నేపథ్యంలో ఫిబ్రవరి 19న టెండర్లు ఫైనల్ చేశారు. పలు కాంట్రాక్టు సంస్థలు పోటీపడ్డా ఆయా సంస్థలను డిస్క్వాలిఫై చేసి రిత్విక్ సంస్థకు మాత్రమే టెండర్‌ను 4 శాతం ఎక్సెస్ రేట్లకు ఖరారు చేశారు. అవే పనులను రూ.3.08 కోట్లతో రమేష్‌నాయుడు కుటుంబ సభ్యుల స్వా«దీనంలో ఉన్న ప్రభుత్వ భూమి చుట్టూ నిరి్మంచడం విశేషం. అఇకోస్తాంధ్రలోనే ఎందుకంటే.. సీఎం రమేష్‌నాయుడు ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నా, రాయలసీమలో అందునా కడప జిల్లాలో రాజకీయంగా గ్రామానికి ఎక్కువ, మండలానికి తక్కువ స్థాయి. అదే విషయాన్ని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అనేక పర్యాయాలు చెప్పుకొచ్చారు. అలాంటి స్థాయిలేని నాయకుడికి అనధికారికంగా జిల్లా బాధ్యతలు అప్పగించి ప్రజాధనం దోపీడీకి పాల్పడుతున్నారని అప్పట్లో తీవ్రంగా ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజాబలం లేని కడప నుంచి పోటీ చేయలేక, కోస్తాంధ్రలోని అనకాపల్లి బీజేపీ అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. ఎన్నికల్లో ఖర్చు చేయగల సామర్థ్యం, పైగా టీడీపీ అధినేత చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం వల్లే అక్కడ పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. -
తమ్ముడే అనుకుంటే.. అన్నయ్య కూడా అంతేనా..!?
ఎవరైనా తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలని అనుకుంటారు. అందులోను సమాజంలో ప్రముఖులుగా ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే అప్రతిష్టపాలవుతారు. కానీ ఆర్దిక, రాజకీయ సంబంధాలు పెనవేసుకుపోయినప్పుడు కొందరు సెలబ్రిటీలు సైతం తమ వ్యక్తిత్వాన్ని వదలుకుని దిగజారడం సామాన్యులను ఆశ్చర్యపరుస్తుంది. ఇదంతా మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి గురించే చెబుతున్నది. ఆయన అంటే అందరికి గౌరవమే. ఆ అభిమానాన్ని నిలబెట్టుకోవలసిన బాధ్యత ఆయనపైనే ఉంటుంది. కానీ అందుకు విరుద్దంగా ఆయన ప్రవర్తిస్తే అభిమానగణం అప్సెట్ అవుతుంది. ప్రస్తుతం చిరంజీవి అలాగే వ్యవహరించారు. ఈ మధ్యకాలంలో రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని పలుమార్లు చెప్పిన చిరంజీవి సడన్‌గా మాట మార్చి ఏపీ రాజకీయాలలో వేలు పెట్టారు. పోనీ అదేదో ఏదైనా రాజకీయ పార్టీలో పోటీచేసిన సామాన్యులకు మద్దతు ఇస్తే ఆయనకు పేరే వచ్చేది. ఏ పార్టీలో ఉన్న పేదలకైనా తన అండ ఉంటుందని చెబితే ఆయనకు కీర్తి వచ్చేది. కానీ ఆయన ఒక పెద్ద పెత్తందారీకి, ఆర్దిక నేరాభియోగాలు ఉన్న వ్యక్తికి సహకారం అందిస్తున్నట్లు ప్రకటించితే జనం ఏమని అనుకుంటారు. ఆయనకు ఈపాటి ఆలోచన రాకపోయిందా! అవును! కొన్ని సబంధాల ముందు అవేవి కనపించకపోవచ్చు. ఏపీలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పక్షాలు కలిసి కూటమి కట్టిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో టీడీపీకి చెందిన సీ.ఎం. రమేష్ వ్యూహాత్మకంగా బీజేపీలోకి వెళ్లి, ఇప్పుడు అనకాపల్లిలో లోక్ సభ సీటుకు కూడా పోటీచేస్తున్నారు. బహుశా చిరంజీవి, రమేష్‌లు రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడి ఉంటుంది. అదేదో ఢిల్లీ స్థాయిలో కనుక ఎవరి దృష్టికి రాలేదు. కానీ ఎన్నికల నేపథ్యంలో సీ.ఎం. రమేష్ కొద్ది రోజుల క్రితం చిరంజీవి ఇంటికి వెళ్లడం, అక్కడ సంప్రదింపులు జరిపి చిరంజీవి తనకు మద్దతు ప్రకటించేలా చేసుకున్నారు. సీ.ఎం. రమేష్ పలు ఆర్ధిక నేరాభియాలు ఎదుర్కుంటున్నారు. తాజాగా ఒక సినీ నటుడు వేణు ఈయనపై 450 కోట్ల రూపాయల మేర ఫోర్జరీ చేసి మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు. టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడుగా పేరొందిన రమేష్ గురించి చిరంజీవికి ఏమీ తెలియకుండా సంఘీభావం ప్రకటించి ఉంటారా? అన్న సందేహం రావచ్చు. తన సోదరుడు పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుని, ఆ తర్వాత బీజేపీని కూడా కలుపుకున్నారు. ఈ పొత్తులో పవన్ కల్యాణ్ ధోరణి చూసి పలువురు జనసేన నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. అది వేరే కథ. పవన్ కల్యాణ్ సొంతంగా పార్టీ పెట్టి 2014లో చంద్రబాబు కోసం పనిచేసినా చిరంజీవి వారితో కలవలేదు. అప్పట్లో ఈయన కాంగ్రెస్ నేతగా ఉండేవారు. చంద్రబాబును విమర్శిస్తూ కొన్ని ప్రకటనలు కూడా చేశారు. ప్రత్యేకించి హిందుపూర్ లో ముస్లిం అభ్యర్ధికి కాకుండా బాలకృష్ణకు సీటు ఇవ్వడాన్ని చిరంజీవి తప్పు పట్టారు. ఆ తర్వాత రోజుల్లో రాజకీయాలకు దూరం అయి సినిమాలపైనే దృష్టి పెడతామని ప్రకటించారు. అలాగే ఉంటారులే అనుకుంటే సడన్‌గా ఇప్పుడు కూటమి అభ్యర్ధికి మద్దతు ఇవ్వడం ద్వారా తాను కూడా పెత్తందారులలో భాగమేనని చిరంజీవి రుజువు చేసుకున్నారు. ఈయన నటించిన పలు సినిమాలు చూసి చాలామంది అభిమానులు ఏర్పడ్డారు. ఆ సినిమాల వల్ల స్పూర్తిపొంది చిరంజీవి అంటే అంత గొప్పవాడు.. ఇంత గొప్పవాడు అని భావిస్తుంటారు. ఆయన ఠాగూర్ సినిమాలో నటిస్తే, ఈయన అంత గొప్ప నిజాయితీపరుడు అని అభిమానులు అంతా సంతోషించారు. రుద్రవీణ వంటి ప్రోగ్రెసివ్ సినిమాలో హీరోగా నటించి ఆదర్శవాది అనిపించుకున్నారు. పేదల తరపున పనిచేసే నేతగా, మద్యపానాన్ని వ్యతిరేకించే వ్యక్తిగా గుర్తింపు పొందారు. తీరా వాస్తవ ప్రపంచంలోకి చూస్తే చిరంజీవి అందుకు భిన్నంగా కనిపించడం ఆయన అభిమానులకు ఆవేదన కలిగిస్తుంది. సీ.ఎం.రమేష్ సారా వ్యాపారంతో జీవితాన్ని మొదలుపెట్టి కాంట్రాక్టర్ అవతారం ఎత్తి, రాజకీయాలలోకి వచ్చి వేల కోట్లకు అధిపతి అయ్యారు. రమేష్ బీజేపీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల విరాళం ఇచ్చి సంచలనం సృష్టించారు. సొంతంగా విమానం కొని ఆయా పార్టీలవారిని అందులో తిప్పే స్థాయికి ఎదిగారు. అది చట్టబద్దంగా, న్యాయబద్దంగా చేస్తే మంచిదే. కానీ సీ.ఎం. రమేష్ నడిపిన లావాదేవీల గురించి చిరంజీవికి తెలియవని అనుకుంటే పొరపాటే అవుతుంది. కానీ ఏదో ఆతీత సంబంధం ఏర్పడి ఉండాలి. అందుకే రమేష్‌కు అనుకూలంగా చిరంజీవి ఏకంగా వీడియో రిలీజ్ చేశారు. దీంతో చిరంజీవి తన పరువు తానే పొగొట్టుకున్నారు. ప్రజల దృష్టిలో పలచన అయ్యారు. చిరంజీవి ఎన్నికలలో పోటీచేస్తున్న ఒక టిప్పర్ డ్రైవర్‌కు అనుకూలంగా మాట్లాడితే శభాష్ అనిపపించుకునేవారు. ఒక ఉపాధి హామీ కూలి ఈ ఎన్నికలలో పోటీచేస్తున్నారు. ఆయనకు సంఘీభావం చెప్పి ఉంటే అంతా మెచ్చుకునేవారు. కానీ ఆర్ధిక నేరారోపణలు ఉన్న బీజేపీ అభ్యర్ధులకు చిరంజీవి మద్దతు ఇవ్వడం అంటే ఆయన మాటలకు, చేతలకు ఉన్న తేడా తెలియచేస్తుంది. అసలు చిరంజీవి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారా? ఆ పార్టీ నేతలు కొందరు ఈయన కాంగ్రెస్‌కు ప్రచారం చేస్తారని చెప్పారు.. కానీ ఈయనేమో బీజేపీ కూటమి అభ్యర్ధికి భజన చేస్తున్నారు. ఒక్కసారి గతాన్ని పరిశీలిస్తే చిరంజీవి సినిమాల సంగతి ఎలా ఉన్నా, రాజకీయాలలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలే తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఒకప్పుడు చిరంజీవి ఎక్కడకు వెళ్లినా వేలు, లక్షల సంఖ్యలో అభిమానులు తరలివచ్చేవారు. దానిని చూసి ఆయన రాజకీయాలలోకి రావాలని ఆలోచన చేశారు. దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుని వచ్చి ఉంటే అదో రకంగా ఉండేది. కానీ రాజకీయాలలోకి వచ్చేది, రానిది చెప్పకుండా దాగుడుమూతలు ఆడేవారు.ఏదో వేరు పేరుతో సంస్థ పెట్టి కార్యకలాపాలు నిర్వహించి, తన బావమరిది అరవింద్‌ను ముందు పెట్టి కథ నడిపారు. ఆయా పార్టీలలోని నేతలు, ముఖ్యంగా తన సామాజికవర్గంవారు అంతా చిరంజీవి రాజకీయాలలోకి రావాలని కోరుతున్నట్లు ప్రకటనలు చేసేవారు. వారంతా కోరితే వస్తున్నట్లు కనిపించాలన్నది ఈయన ఉద్దేశం కావచ్చు. కానీ ఆ ప్రాసెస్ అంతా అయ్యేసరికి ప్రత్యర్థి రాజకీయ పార్టీలు చిరంజీవి గురించి, ఆయన పెట్టబోయే పక్షం గురించి వ్యతిరేక ప్రచారం చేసేశాయి. దాంతో ఆదిలోనే హంసపాదు మాదిరి ఆయన పార్టీకి విఘ్నాలు ఎదురయ్యేయి. ఆయన ఎట్టకేలకు చిరంజీవి తిరుపతిలో ఒక భారీ సభ పెట్టి ప్రజారాజ్యం పార్టీని అనౌన్స్ చేశారు. పార్టీ అయితే పెట్టారు కానీ, దానికి తగ్గ వ్యూహాలు, ఎజండాను సిద్ధం చేసుకోలేకపోయారు. తొలి రోజుల్లో ఈ పార్టీ వల్ల కాంగ్రెస్‌కు దెబ్బతగులుందని అనుకున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ఆయనకు బాగానే ప్రచారం చేశాయి. కానీ దానివల్ల తెలుగుదేశంకు నష్టం వాటిల్లుతోందని అంచనాకు వచ్చిన ఆ మీడియా వెంటనే ప్లేట్ ఫిరాయించి ప్రజారాజ్యాన్ని, చిరంజీవిని గబ్బు పట్టించేవి. ఇది కేవలం కాపుల పార్టీ అన్న ముద్రవేశారు. దానిని ఎదుర్కునే సత్తా ప్రజారాజ్యానికి లేకుండా పోయింది. తన బావమరిది అల్లు అరవింద్‌కు ప్రాధాన్యం ఇవ్వడం, ఆర్దిక విషయాలలో కొన్ని విమర్శలు వచ్చేలా చిరంజీవి వ్యవహరించారని అంటారు. టీడీపీ అయితే చిరంజీవి టిక్కెట్లు అమ్ముకుంటున్నారని ప్రచారం చేసేది. టిక్కెట్లు రాని కొందరు అదే తరహా ఆరోపణలు చేసేవారు. చంద్రబాబు నాయుడు తన కోవర్టులను కొందరిని ముందుగానే ప్రజారాజ్యంలో ప్రవేశపెట్టి, తర్వాత వారిని బయటకు తీసుకు వచ్చి తిట్టించేవారు. ఇదే చిరంజీవికి పెద్ద సమస్యగా ఉండేది. ఆ రోజుల్లో సీపీఐ, సీపీఎంలతో కలిసి పొత్తు పెట్టుకోవాలని చిరంజీవి ఆలోచన చేశారు. కానీ దానిని పడనివ్వకుండా వామపక్ష జాతీయ నేతలను చంద్రబాబు మేనేజ్ చేయగలిగారు. టిక్కెట్ల కేటాయింపులో అవకతవకలు తదితర కారణాల వల్ల ప్రజారాజ్యం ఎన్నికలకు ముందే చతికిలపడింది. చివరికి ఉమ్మడి ఏపీలో పద్దెనిమిది సీట్లకే పరిమితం అవడం కాకుండా, చిరంజీవే రెండు చోట్ల పోటీచేసి ఒక చోట ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పార్టీ నడపడంలో తడబడ్డారు. ఆ దశలో జెండా పీకేద్దాం అని చిరంజీవి భావిస్తున్నారని ఈనాడు మీడియా ఒక పెద్ద కథనాన్ని ప్రచురించింది. అది చూసి చిరంజీవి చాలా బాధపడ్డారు. తదుపరి అప్పట్లో జరిగిన వివిధ పరిణామాలలో కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు. అనూహ్యంగా వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ పరిస్థితులను తనకు అనుకకూలంగా మలచుకోవడంలో విఫలం అయిన ఈయన తనపార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, రాజ్యసభకు వెళ్లి కేంద్రంలో ఒక సహాయ మంత్రి పదవి పొంది సంతృప్తి చెందారు. కానీ 2014లో కాంగ్రెస్ ఓడిపోవడంతో చిరంజీవి మళ్లీ సినిమాలపైనే దృస్టి పెడతామని అన్నారు. ఇంతలో తన సోదరుడు పవన్ కల్యాణ్ జనసేనను ప్రకటించినా ఈయన పట్టించుకోలేదు. ఎవరి రాజకీయాలు వారివే అన్నట్లు వ్యవహరించారు. 2019లో పవన్ కల్యాణ్ సొంతంగా ఒక కూటమి పెట్టుకుని రెండు నియోజకవర్గాలలో పోటీచేసి ఓడిపోయారు. అప్పుడు కూడా చిరంజీవి పెద్దగా స్పందించలేదు. వైఎస్సార్సీపీ గెలిచి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చిరంజీవి సత్సంబంధాలు కొనసాగించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఆయనకు విశేష గౌరవాన్ని ఇచ్చారు. సినిమా సమస్యలపై చర్చలు జరపడానికి ఒక బృందాన్ని తీసుకువెళ్లారు. ఆ సందర్భంలో చిరంజీవిని అవమానించేలా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు వ్యాఖ్యానించినా పట్టించుకోలేదు. ఈ విషయాలన్ని చూసినవారు ఇక చిరంజీవి రాజీకీయాల జోలికి రారని అనుకుంటే పవన్ కల్యాణ్‌కు ఐదు కోట్ల చెక్ ఇచ్చి దానికి ప్రచారం కల్పించారు. బహుశా పవన్ వైపు నుంచి ఏదో ఒత్తిడి వచ్చి ఉండాలి. ఆ తర్వాత సీ.ఎం. రమేష్ ఉదంతంతో చిరంజీవి తన ప్రతిష్టను కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నారు. ఠాగూర్, రుద్రవీణ వంటి సినిమాలలో చిరంజీవి చేసింది నటనేనని, రియల్ జీవితంలో ఆయన అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంటారని అభిమానులంతా అనుకునే పరిస్థితి తెచ్చారు. కాపు సామాజికవర్గం ఒకసారి చిరంజీవిని నమ్మి, తదుపరి పవన్ కల్యాణ్‌ను నమ్మి మోసపోయిందన్న అభిప్రాయం ఉంది. పవన్ కల్యాణ్ ఇప్పటికీ వారిని మోసం చేయడానికి విశ్వయత్నం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పూర్తిగా సరెండర్ అయి జనసేన ఉనికినే నాశనం చేసుకున్న పవన్ కల్యాణ్‌కు చిరంజీవి మద్దతు ఇచ్చినా పెద్దగా ఒరిగేదేమీ లేదు. కాంగ్రెస్‌కు రాజీనామా చేయకుండా బీజేపీకి ఎందుకు సంఘీభావం ప్రకటించారని ఆలోచిస్తే కొందరు ఇది పద్మవిభూషణ్ బిరుదు ఇచ్చినదానికి ప్రతిఫలం అని అంటున్నారు. మరి కొందరు అదే కారణం అయితే కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి బీజేపీలో నేరుగా చేరి ఉండేవారన్నది మరికొందరి భావన. కేవలం సీ.ఎం. రమేష్‌ను పక్కన కూర్చోబెట్టుకుని ఆయన కోసం వీడియో చేయడం కేవలం వ్యక్తిగత కారణాలే అయి ఉండవచ్చన్నది మరికొందరి భావన. ఏది ఏమైనా చిరంజీవి చేసింది తప్పు. అనైతికం, పరువు కోల్పోయే విషయం అని అంతా ఒప్పుకుంటున్నారు. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
Anakapalle: సీఎం రమేష్ జేబులో తెలుగుదేశం
చంద్రబాబు పంపితేనే అనకాపల్లి వచ్చా.. ఉత్తరాంధ్ర టీడీపీకి ఒకప్పుడు ఎర్రన్నాయుడు పెద్దదిక్కుగా ఉండేవారు. ఇప్పుడు ఆ స్థానాన్ని నేను భర్తీ చేస్తా.. అంటూ ఈమధ్య సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలకు అప్పుడే టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి. ఇప్పుడు ఏకంగా మాడుగుల తెలుగుదేశం అభ్యర్థి పైలా ప్రసాదరావునే మార్చేలా పావులు కదపడంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ మీద బీజేపీ నేత పెత్తనమేమిటని ప్రశ్నిస్తున్నాయి. రమేష్ రాజకీయానికి మాడుగుల టీడీపీలోని రెండు వర్గాలు అమ్ముడుపోవడం క్యాడర్‌ను కుంగదీస్తోంది. సాక్షి, అనకాపల్లి: చంద్రబాబు చీదరించుకొని టికెట్ ఇవ్వను పొమ్మన్న నేతలందరూ ఒక్కటవుతున్నారు. పోయిన పరువును కాస్త కూడదీసుకునేందుకు తంటాలు పడుతున్నారు. వీరిని సీఎం రమేష్ చేరదీస్తున్నారు. వారిని కొనేసి తనకు అనుకూలమైన వ్యక్తిని తెచ్చి పెట్టేందుకు ఆయన చేసిన యత్నాలు కొలిక్కివచ్చాయని తెలుస్తోంది. మాడుగుల అభ్యర్థిగా పైలా ప్రసాదరావు బదులు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ పరిణామాలు మాడుగులలో అంతంత మాత్రంగా ఉన్న టీడీపీ ఆశలను మరింత ఆవిరి చేస్తాయేమోనన్న భయాందోళనలను పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. పార్టీని నమ్ముకున్న మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడికి టికెట్ దక్కలేదు. ఆయనను కాదని నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించిన పీవీజీ కుమార్‌కు కూడా చంద్రబాబు ఆశీస్సులు లభించలేదు. తమను కాదని పైలా ప్రసాదరావుకు టికెట్ కేటాయించడంపై వీరిద్దరూ గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరినీ తాయిలాలతో ప్రసన్నం చేసుకొని టీడీపీ అభ్యర్థి పైలాకు ఎసరు పెట్టడానికి సీఎం రమేష్ నడుం బిగించారు. తనకు సన్నిహితుడైన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని తెచ్చుకునేందుకు లైన్ క్లియర్ చేసుకున్నారు. ఇందుకు గవిరెడ్డి, పీవీజీలకు రూ.4 కోట్లు, రూ.2 కోట్లు ముట్టచెప్పినట్టు సమాచారం. రమేష్ టీడీపీ నేతలపై పైసలతో పెత్తనం చెలాయించడం.. తమ నేతలు అమ్ముడుపోయారన్న విషయం ప్రజల్లో తమ పార్టీని చులకన చేస్తుందన్న భయం వారిని వెంటాడుతోంది. పైలా రాజీనామా యోచన? అసలు స్థానికేతురుడైన సీఎం రమేష్‌కు అనకాపల్లి ఎంపీ టికెట్ ఇవ్వడమే తప్పు.. దీనికి తోడు చక్కగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీలో అగ్గి రాల్చుతున్నాడంటూ టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. స్థానికులను కాదని పొరుగు నియోజకవర్గాల నుంచి ఇక్కడకు తీసుకొస్తే సహించేది లేదని ప్రసాదరావు వర్గీయులు చెబుతున్నారు. అభ్యర్థి మార్పు జరిగితే తర్వాత జరిగే పరిణామాలు ఊహించుకోవడానికే భయంకరంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. మాడుగుల ఎమ్మెల్యే టికెట్ బండారుకు ప్రకటిస్తే.. పైలా ప్రసాదరావుతోపాటు ఆయన వర్గీయులు టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అధినేత వైఖరితో డీలా పడ్డ టీడీపీ క్యాడర్ ఒకప్పుడు చంద్రబాబు వ్యూహాలు పదునుగా ఉండేవి. ఎత్తు వేస్తే ప్రత్యర్థులు చిత్తు కావలసిందే అన్న రీతిలో పావులు కదిపేవారు. కానీ ఈసారి ఎన్నికల్లో ఆయన నిర్ణయాలు పార్టీ వర్గాలకు మింగుడుపడడం లేదు. అనకాపల్లి అసెంబ్లీ సీటు జనసేనకు కేటాయించారు. చాలాకాలంగా ప్రజలు మరచిపోయిన కొణతాల రామకృష్ణ ఆ టికెట్ దక్కించుకున్నారు. అనకాపల్లి పార్లమెంటు సీటు బీజేపీకి వదులుకున్నారు. అక్కడికి రాయలసీమ నుంచి సీఎం రమేష్‌ను తీసుకొచ్చారు. స్థానికేతరుడు మాకెందుకని ఒకపక్క టీడీపీ కార్యకర్తలు తల పట్టుకుంటుంటే.. చంద్రబాబే పంపారని రమేష్ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు దాదాపు నెల రోజుల క్రితమే చంద్రబాబు ప్రకటించిన పైలా ప్రసాదరావు.. సీఎం రమేష్ తలచుకున్నంతనే మారిపోతున్నారు. అధినేత స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారన్న భయం పార్టీ క్యాడర్‌ను వెంటాడుతోంది. -
రౌడీ రాజకీయం.. గ్రామాల్లో సీఎం రమేష్ అనుచరులు
సాక్షి, అనకాపల్లి: ప్రశాంతతకు మారుపేరుగా పేరొందిన అనకాపల్లి జిల్లాలో ఇప్పుడు కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి. వారి కదలికలు సందేహాస్పదంగా ఉంటున్నాయి. వారి కార్యకలాపాలు శాంతిభద్రతలకు భంగం కలిగిస్తాయేమోనన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థి సీఎం రమేష్ సాగిస్తున్న రౌడీ రాజకీయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. సీఎం రమేష్ అనుచరులైన రౌడీ మూకలు గ్రామాల్లో తిష్ట వేశాయి. స్థానికేతరుడైన ఆయనకు కూటమి నుంచి ఎంపీ టికెట్ ప్రకటించినప్పటి నుంచి.. మనుషులు మొదలుకొని ప్రచార వాహనాల వరకు అన్నీ తన స్వస్థలం కడప నుంచే తెచ్చుకున్నారు. 200మందికి పైగా అనుచరులను అనకాపల్లి జిల్లాకు రప్పించుకున్నారు. జిల్లాలో పట్టణ ప్రాంతాలైన అనకాపల్లి, చోడవరం, పాయకరావుపేట, యలమంచిలి, నర్సీపట్నం, మాడుగుల, సబ్బవరం, పెందుర్తిలలో ఉన్న లాడ్జీలలో వీరు మకాం చేశారు. ఈ పట్టణాల్లో శివారున ఉన్న లాడ్జిల్లో స్థానిక టీడీపీ కార్యకర్తల పేరిట రూమ్‌లు బుక్ చేశారు. కొన్ని రహస్య ప్రాంతాల్లో మద్యం డంపులను కూడా ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల యలమంచిలి నియోజకవర్గం సోమలింగంపాలెంలో భారీగా గోవా మద్యం పట్టుబడింది. ఇందులో ప్రధాన నిందితుడు కర్రి వెంకటస్వామి టీడీపీకి చెందిన కార్యకర్త కావడం.. గోవా నుంచి కంటైనర్‌లో భారీగా మద్యం అనకాపల్లికి దిగుమతి చేయడం.. ఇక్కడ యలమంచిలి నియోజకవర్గ జనసేన అభ్యర్థి సమావేశానికి మద్యం సరఫరా చేయడం వంటివి గమనించిన పోలీసులు దీని వెనక బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఉన్నారా..? అని అనుమానిస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన నలుగురినీ పోలీసులు విచారిస్తున్నారు. జిల్లాలో ఇంకేమైనా ఇలాంటి డంపులు ఉన్నాయా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఐదు గ్రామాలకు ఒక్కరు.. సీఎం రమేష్ తన అనుచరులను ఇప్పటికే ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్న మండల కేంద్రాలకు పంపించేశారు. ప్రతి ఐదు గ్రామాలకు ఒకరు చొప్పున జిల్లాలో ఉన్న 24 మండలాలతోపాటు పెందుర్తిలో కూడా వారిని మోహరించారు. సీఎం రమేష్ సమావేశాలు, టీడీపీ, జనసేన స్థానిక నేతల మీటింగ్‌లు, కుల సంఘాల సమావేశాల ఏర్పాటుకు ఎంత ఖర్చవుతుందో అంచనా వేసుకుని వారే సొమ్ము చెల్లిస్తున్నారు. సమావేశాల్లో పాల్గొనే నాయకులు, కార్యకర్తల ఆటో ఖర్చులు, వారి భోజనం ఖర్చులు, సమావేశ మందిరం అద్దెల చెల్లింపు వారి చేతుల మీదుగా జరుగుతోంది. పవన్ వారాహి యాత్రకు రూ.50 లక్షలు అనకాపల్లి జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగిన వారాహి యాత్ర, బహిరంగ సభ జన సమీకరణకు ఖర్చంతా సీఎం రమేష్ పెట్టుకున్నారు. సభ ఏర్పాట్లకు, జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చిన జనానికి సుమారు రూ.50 లక్షలు వెచ్చించినట్టు సమాచారం. ఈ ఏర్పాట్లను కూడా సీఎం రమేష్ అనుచరులే దగ్గరుండి చూసుకున్నట్లు భోగట్టా. వచ్చీ రాగానే ఘర్షణ మొదలు రమేష్ అడుగు పెట్టారో లేదో.. అప్పుడే తనదైన రౌడీ రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నారు. చోడవరంలో అధికారులపై దౌర్జన్యం, నర్సీపట్నంలో బహిరంగంగా చీరల పంపిణీ, గ్రామాల్లో సీఎం రమేష్ అనుచరుల హల్చల్ వంటి పరిణామాలను జిల్లా ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఇక్కడి ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారన్న భావం వారి మనసుల్లో అప్పుడే నాటుకుపోయింది. స్థానిక బీజేపీ నేతలు ఉండగా ప్రచార కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలను పూర్తిగా తన మనుషులకు అప్పగించడం పార్టీ జిల్లా వర్గాల్లో అసంతృప్తిని రేకెత్తించింది. మామీద నమ్మకం లేదా అని వారు మనస్తాపానికి గురవుతున్నట్టు తెలుస్తోంది. ఇవి చదవండి: ఓటమి భయంతో టీడీపీ అడ్డదారులు -
సీఎం రమేష్ రౌడీయిజం!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: టీడీపీ మాజీ నేత, బీజేపీ ప్రస్తుత నేత సీఎం రమేష్ తన మార్క్ రౌడీ రాజకీయాలకు తెరతీశారు. అనకాపల్లి జిల్లాలో అరాచకాలు సృష్టిస్తున్నారు. ఎక్కడా తనిఖీలు నిర్వహించకుండా ముందస్తుగానే అధికారులపై ఎదురుదాడికి దిగుతున్నారు. తనిఖీలు నిర్వహించే అధికారుల వద్దకు వెళ్లి నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు అధికారులు తనిఖీలు నిర్వహించకూడదంటూ ప్రశి్నస్తున్నారు. ఎదురుదాడికి మించిన ఆత్మరక్షణ లేదనే ధోరణితో ఎన్నికల్లో తాము చేసే అక్రమాలకు అడ్డురాకూడదనే ఆలోచనతో ఈ తరహాలో బెదిరింపులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే అనకాపల్లిలోని లాడ్జీల్లో కడప నుంచి వచ్చిన అనుచరులు మకాం వేసి హల్చల్ చేస్తున్నారు. అంతేకాకుండా టీడీపీ నేత అయ్యన్నపాత్రుడుతో తనకున్న పాత పరిచయాలతో ఇద్దరూ కలిసి నోటికి పనిచెబుతున్నారు. ఇప్పటికే అయ్యన్నకు భారీ ప్యాకేజీని సీఎం రమేష్ అందించారనే ప్రచారం జరుగుతోంది. రానున్న రోజుల్లో తాము చేసే విచ్చలవిడి అరాచకాలకు అడ్డులేకుండా చూసుకునేందుకే.. అధికారులు సక్రమంగా విధులు నిర్వర్తించకుండా అడ్డుకట్ట వేసేందుకు భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ప్రశాంతంగా ఉన్న అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో సీఎం రమేష్ రాకతో అలజడి ప్రారంభమైంది. ఈనెల 6వ తేదీన నర్సీపట్నంలో చీరల పంపిణీని అడ్డుకున్న పోలీసులపై చిందులేస్తున్న కూటమి అనకాపల్లి ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ కోతికి కొబ్బరి చిప్ప! అనకాపల్లి జిల్లాలో ఇప్పటికే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇష్టారీతిలో చెలరేగి అధికారులపై మాటల దాడికి దిగుతున్నారు. ఇప్పుడు కల్లు తాగిన కోతికి కొబ్బరి చిప్ప దొరికిన చందంగా... ఈయనకు కాస్తా సీఎం రమేష్ జతకలిశారు. దీంతో నోటికి అదుపులేకుండా అధికారులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. కొద్దిరోజుల క్రితం చోడవరంలోని ఒక షాపులో పన్ను ఎగవేతకు సంబంధించిన వ్యవహారంలో డీఆర్ఐ అధికారులు తనిఖీలు వస్తే.. వెంటనే సీఎం రమేష్ రంగంలోకి దిగారు. అధికారులు తనిఖీలు చేయవద్దంటూ అడ్డుకోవడంతోపాటు బెదిరింపులకు దిగారు. తాజాగా నర్సీపట్నంలో నోట్లు, చీరలు పంచుతూ ఓటర్లను ప్రలోభపరిచేందుకు కూటమి చేసే ప్రయత్నాలపై ఫిర్యాదు రావడంతో అధికారులు తనిఖీలకు వెళ్లారు. వెంటనే ఒకవైపు సీఎం రమేష్... మరోవైపు అయ్యన్నపాత్రుడులు అధికారులపై మాటల దాడికి దిగారు. తనిఖీలు ఎలా చేస్తారంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీపై పరుష వ్యాఖ్యలు ఇక అయ్యన్న ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీలు వెధవలు అంటూ పరుషంగా వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా ఎన్నికల సమయంలో అధికారులు తనిఖీలకు వస్తే అభ్యర్థులు సహకరించడం సహజం. అంతేకాకుండా ఎన్నికలకు సంబంధం లేని వ్యక్తుల వద్ద తనిఖీలు నిర్వహించినప్పటికీ ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా సహకరించడం పరిపాటి. ఇందుకు భిన్నంగా ఈ ఇద్దరూ అడ్డగోలుగా అధికారులపై ఆరోపణలు గుప్పిస్తూ బెదిరింపులకు దిగుతున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడుతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా సహకరిస్తూ తమ ప్రచారాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసే బెదిరింపుల ద్వారా లబ్ధి పొందేందుకు ఆ ఇద్దరూ ప్రయతి్నస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లాడ్జీల్లో మకాం! స్థానికంగా కనీసం ఒక్క ఓటరూతోనూ పరిచయం లేని సీఎం రమే‹Ù... కేవలం రౌడీయిజం ద్వారానే ఎన్నికల్లో ముందుకు వెళ్లేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా అనకాపల్లిలోని లాడ్జీల్లో ఇప్పటికే 200 మందికిపైగా తన అనుచరులు మకాం వేశారు. ఎన్నికల కౌంటింగ్ ముగిసే వరకూ అనకాపల్లిలోని లాడ్జీలను బుకింగ్ చేసుకున్నారు. కౌంటింగ్ వరకూ ఇక్కడే మకాం వేసి పార్లమెంటు నియోజకవర్గం మొత్తం తిరుగుతూ భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయతి్నస్తున్నట్టు సమాచారం. మరోవైపు మొదటగా సీఎం రమేష్ నియోజకవర్గంలో తిరుగుతూ టీడీపీ, జనసేన నాయకులను కలిసి తమకు సహకరించాలంటూ భారీగానే ప్యాకేజీని ముట్టచెప్పినట్టు తెలుస్తోంది. అనంతరం సీఎం రమేష్ రాక సందర్భంగా హడావుడి చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అయ్యన్నకు నోట్ల కట్టలు? ఇన్నాళ్లూ అనకాపల్లి ఎంపీ సీటు స్థానికుడికి ఇవ్వాలని హడావుడి చేసిన అయ్యన్న.. సీఎం రమేష్ విషయంలో మాత్రం ఒక్క మాట మాట్లాడడంలేదు. పైగా అయ్యన్ననే వెంటబెట్టుకుని మరీ తిరుగుతున్నారు. ఈ వ్యవహారంలో భారీగానే అయ్యన్నకు ప్యాకేజీ ముట్టిందని టీడీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. ఒకవైపు రౌడీయిజం.. మరోవైపు నోట్ల కట్టల ద్వారా ఎన్నికల్లో ముందుకెళ్లేందుకు సీఎం రమేష్ చేస్తున్న ప్రయత్నాలపై అనకాపల్లి జిల్లాలో ఓటర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రశాంతంగా ఉన్న అనకాపల్లి జిల్లాలో వీరి రాకతో రానున్న రోజుల్లో ఏమి జరుగుతుందోనని భయాందోళన చెందుతున్న ఓటర్లు అందరివాడు, సౌమ్యుడు బూడి ముత్యాలనాయుడుతో పాటు స్థానిక వైఎస్సార్సీపీ అభ్యర్థులవైపు మొగ్గుచూపుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చోడవరంలో కేసు నమోదు జీఎస్టీ చెల్లించకుండా అనధికారికంగా వ్యాపారం సాగిస్తున్న బుచ్చిబాబు ట్రేడర్స్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం (డీఆర్ఐ) అధికారుల విధులకు ఆటంకం కల్గించడమే కాకుండా వారిపై దౌర్జన్యం చేసినందుకు అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమే‹Ù, టీడీపీ చోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి కె.ఎస్.ఎన్.ఎస్.రాజు చోడవరం పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎన్నికల్లో ఓటర్లు రెచ్చగొట్టేలా ప్రవర్తించడంతో పాటు కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను ధిక్కరించడం, విధుల్లో ఉన్న అధికారులపై దౌర్జన్యాలకు పాల్పడడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శనివారం రాత్రి సీఎం రమేష్‌కు పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 9న విచారణకు హాజరు కావాలని అనకాపల్లి ఎస్డీపీవో ఆదేశించారు. -
వీళ్లు పెద్ద ముదుర్లు..! సీఎం రమేష్, చంద్రబాబు ఒకరికొకరు
భారతీయ జనతా పార్టీ దేశంలో పాటిస్తున్న ద్వంద్వ ప్రమాణాలకు అనకాపల్లి అభ్యర్ధి సీఎం రమేష్ ఒక ప్రత్యక్ష ఉదాహరణ కావచ్చు. రమేష్ తనకు ఉన్న అర్ధ,హంగు బలంతో అనకాపల్లి వద్ద పోలీసులపై తిరగబడ్డ తీరు ఆశ్చర్యం ఏమీ కాదు. ఆయన గత చరిత్ర ఒకసారి చూస్తే అనేక విషయాలు తెలుస్తాయి. ఒక చిన్న సారాయి వ్యాపారిగా ఉన్న సీఎం రమేష్ ఈ రోజు కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులకు అధిపతి. రాజకీయ సమాజాన్ని ప్రభావితం చేస్తున్న ఒక నేతగా చలామణి అవుతున్నారు. తనపై ఎన్ని ఆరోపణలు ఉన్నా దేశ ప్రధానమంత్రి ఎదుట కూర్చోగలుగుతున్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వారి సరసన నిలబడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జూబ్లీహిల్స్ లో ఒక ఇల్లు ఉంది. అందులోనే ఆయన నివసిస్తారు. ఆయన సీఎం పదవి చేపట్టాక తన ఇంటి పక్కనే ఉన్న మరో ఇంటిని తన రాజకీయ అవసరాల కోసం తీసుకున్నారు. అందులో సర్వే కార్యకలాపాలు నిర్వహించేవారికి, పార్టీ పనులు ,ఇతరత్రా వినియోగించేవారు. విశేషం ఏమిటంటే ఆ తర్వాత కాలంలో సీఎం రమేష్ ఆ ఇంటిని కొనుగోలు చేసి ఒక భారీ భవంతి ని నిర్మించారు. చంద్రబాబు పాత ఇల్లుకన్నా సీఎం రమేష్ ఇల్లే సూపర్‌గా కనిపించేది. ఆ తర్వాతకాలంలో చంద్రబాబు కుటుంబం కూడా మళ్లీ తమ ఇంటిని పునర్మించుకున్నారు. అంతేకాదు.చంద్రబాబు వాస్తు నమ్మకాల కోసం రమేష్ కొన్న ఇంటి స్థలం నుంచి 400 గజాలు తీసుకున్నారు. ఒక మాట ఎవరైనా అంగీకరించాలి. సీఎం రమేష్ ఎదుగుదలలో చంద్రబాబుకు పెద్ద పాత్రే ఉంది. ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో నిత్యం ఆయన కార్యాలయం చుట్టూనే రమేష్ తిరుగుతుండేవారు. ఒక మీడియా ప్రముఖుడితో కలిసి పైరవీలు,ఇతర లావాదేవీలు సాగించేవారని చెబుతారు. ఈ మీడియా ప్రముఖుడికి, రమేష్‌కు జిగినీ దోస్తి ఏర్పడింది. ఒకసారి సుజనా చౌదరికి రాజ్యసభ సీటు ఇవ్వాలని చంద్రబాబు ప్రతిపాదించినప్పుడు ఆ మీడియా ప్రముఖుడికి కోపం వచ్చింది. తన సన్నిహితుడు సీఎమ్ రమేష్‌కు రాజ్యసభ సీటు ఇవ్వకుండా సుజనాకు ఇస్తారా అని ఆగ్రహించి, సుజనాపై ఒక పెద్ద వ్యతిరేక స్టోరీని బ్యానర్‌గా ఇచ్చారు.అందులో సుజనాకుఉన్న బోగస్ కంపెనీలు ఇతరత్రా అనేక విషయాలను ప్రచురించారు. దాంతో చంద్రబాబు రాజీ చేసుకుని, సీఎమ్ రమేష్‌కు తదుపరి టర్మ్‌లో పదవి ఇవ్వవలసి వచ్చిందని టీడీపీ వర్గాలు చెబుతుంటాయి. రమేష్ తండ్రి కుప్పంలో సారా వ్యాపారం చేస్తుండేవారు.అప్పటికి ఇంకా చిన్నవాడు అయిన రమేష్ కుప్పంలో చదివేవాడట. తదుపరి అతను రైల్వే కోడూరులో ఇంటర్ వరకు చదివారట. ఆ తర్వాత పదేళ్లకు ఈయన యువకుడు అయి వ్యాపారంలోకి వచ్చారు. ఆ క్రమంలో రాయదుర్గం నుంచి సారా సాచెట్లు తెప్పించి వాటిలో సారా నింపి తమిళనాడుకు అక్రమ రవాణా చేస్తుండగా, తండ్రితో సహా రమేష్‌ను పోలీసులు అరెస్టు చేశారని ఆయన గురించి తెలిసినవారు గుర్తు చేస్తున్నారు. మరో కేసులో సీఎం రమేష్ తండ్రిని పి.డి చట్టం కింద కూడా అరెస్టు చేసి చంచల్ గూడ జైలులో ఉంచారట. ఈ దశలో రాజకీయ రంగంలో ముఖ్యులను ఆశ్రయించితే కేసుల నుంచి బయటపడవచ్చని తెలుసుకున్న రమేష్ అప్పట్లో కడప జిల్లాలో మంత్రిగా ఉన్న ఒక కాంగ్రెస్ నేతతో సంబంధాలు పెట్టుకున్నారు. ఆయన కూడా సాయం చేసి వీరిని కేసుల నుంచి బయటపడేశారు. అప్పటికి చంద్రబాబుతో రమేష్‌కు పెద్దగా సంబంధాలు లేవు. ఆ రోజుల్లో అసెంబ్లీలో కూడా రమేష్ ,ఆయన తండ్రిపై వచ్చిన ఆరోపణలను,వారిని రక్షించిన కాంగ్రెస్ మంత్రికి, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడుకు మద్య అసెంబ్లీలో వాగ్వాదం జరిగింది. చంద్రబాబు అప్పట్లో రమేష్ సన్నిహితులతో మంత్రికి ఉన్న సంబంధం పై ఆరోపణలు గుప్పించగా, చంద్రబాబుపైనే మంత్రి ప్రత్యారోపణలు చేశారు. చంద్రబాబును కూడా రమేష్ ఆకట్టుకోవడానికి ప్లాన్ చేసి సఫలం అయ్యారు. చంద్రబాబు తిరుపతి వస్తుంటే ,అక్కడ పత్రికలలో స్వాగత ప్రచార ప్రకటనలు ప్రచురించారట. దాంతో చంద్రబాబుకు ఈయనపై ఆసక్తి కలిగి టచ్‌లో పెట్టుకున్నారు. అప్పటి నుంచి వీరి మధ్య ఆర్ధిక సంబంధం ఏర్పడింది. తదుపరి అది రాజకీయ సంబంధంగా కూడా మారింది. ఇంతలో చంద్రబాబు తన మామ ఎన్.టి.రామారావును కూలదోసి ముఖ్యమంత్రి కావడంతో రమేష్ తన పట్టు బిగించడం ఆరంభించారు.పైరవీల స్థాయి నుంచి కాంట్రాక్టర్ అవతారం ఎత్తగలిగారు. కుప్పంలో ఎన్నికలు జరిగినప్పుడు పోట్లదుర్తి నుంచి ఒక వందమందిని తీసుకుని వెళ్లి చంద్రబాబు కోసం పనిచేసేవారట. దొంగ ఓట్లు మొదలు వివిధ కార్యకలాపాలను ఈ బృందం నిర్వహించేదట. ఆ రకంగా చంద్రబాబుతో బంధం పెనవేసుకుని పోయింది. చంద్రబాబు కూడా ఈయనకు ఇరిగేషన్ తదితర కాంట్రాక్టులు వచ్చేందుకు సహకరించారన్న ప్రచారం ఉంది. ఆ రకంగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక ఆర్ధిక సామాజ్రాన్ని ఏర్పరచుకోగలిగారు.వందల ఎకరాల భూములు సంపాదించారు. హైదరాబాద్‌లో స్థిరాస్తులు సమకూర్చుకున్నారు. ఒక విమానం కొనుగోలు చేసే దశకు వెళ్లగలిగారు. ఈ మధ్యనే ప్రముఖ నటుడు వేణు ఈయనపై ఒక ఫిర్యాదు చేస్తూ 450 కోట్ల మేర ఫోర్జరీ చేసి మోసం చేశారని ఆరోపించారు. బ్యాంకుల నుంచి రుణాలు పొందడం, వాటిలో కొంతమేర ఎగవేయడం తదితర ఆరోపణలు కూడా వచ్చాయి. 2019 ఎన్నికల సమయంలో తన ఇంటికి వచ్చిన ఆదాయపన్ను శాఖ అధికారులపై కూడా దౌర్జన్యపూరితంగా వ్యవహరించారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు సైతం సీఎం రమేష్, సుజనా చౌదరి వంటివారిపై కేంద్రం అక్రమ కేసులు పెడుతోందని, ఐటీ, సీబీఐ అక్రమ దాడులు చేస్తోందని ఆరోపించేవారు. ఆ ఎన్నికలలో టీడీపీ ఓటమి చెందడంతో సీఎమ్ రమేష్ ,సుజనా చౌదరి , టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావులు వెంటనే బీజేపీలో చేరిపోయారు. అప్పటివరకు బీజేపీని తిట్టిన రమేష్, సుజనాలు తమపై ఉన్న ఆర్దిక నేరారోపణల నేపథ్యంలో జాగ్రత్తపడ్డారని అంతా భావించారు. బీజేపీలో చేరిన వెంటనే వీరంతా ప్రధాని నరేంద్ర మోదీ ఎదుట కూర్చుని తెలుగు ప్రజలను ఆశ్చర్యపరిచారు. బీజేపీలోలో చేరితే ఎన్ని ఆరోపణలు ఉన్నా పునీతులు అయిపోతారా అన్న ప్రశ్న ఆ రోజే వచ్చింది.అక్కడ నుంచి మెల్లగా బీజేపీ పెద్దలను మంచి చేసుకుంటూ రమేష్ కాని, సుజనా చౌదరి కాని చంద్రబాబు తరపున పనిచేస్తుంటారన్నది సర్వత్రా ఉన్న అభిప్రాయం. దానికి తగ్గట్లుగానే బీజేపీ ఏపీ అధ్యక్షుడుగా ఉన్న సోము వీర్రాజును తప్పించి దగ్గుబాటి పురందేశ్వరికి ఆ పదవి వచ్చేలా చేసుకోగలిగారు. ఆ తర్వాత బీజేపీపై మరింత పట్టు బిగించారు. ఇదే టైమ్ లో ముఖ్యమంత్రి జగన్‌ను వ్యతిరేకించిన ఆయన చెల్లెలు షర్మిలకు కూడా తన విమానం సమకూర్చి ఢిల్లీకి పంపించి కాంగ్రెస్‌లో చేర్పించడానిక సహకరించారని అంటారు. ఈ రకంగా అంచెలంచెలుగా ఎదిగిన రమేష్‌ను చంద్రబాబు రెండుసార్లు రాజ్యసభకు పంపించారు. ఆ పదవి ద్వారా ఢిల్లీ స్థాయిలో కేంద్రంలో ఉన్న ప్రముఖులతో సంబంధబాంధవ్యాలు పెట్టుకోవడంలో నేర్పరిగా రమేష్ పేరుపొందారు. ఈ క్రమంలో ఏపీ బీజేపీపై కూడా పట్టు సాధించి అనకాపల్లి నుంచి ఆ పార్టీ పక్షాన పోటీచేయడానికి సిద్దం అయ్యారు. 2014 లో జగన్ మాతృమూర్తి విజయమ్మ విశాఖ నుంచి లోక్ సభకు పోటీచేశారు. అప్పట్లో తెలుగుదేశం ఒక ప్రణాళిక ప్రకారం ఒక తప్పుడు ప్రచారం చేసింది. ఆయా హోటళ్ల వద్ద, కూడళ్లలో ,నలుగురు కూర్చున్న చోటకు ప్రత్యేకంగా నియమితులైన టీడీపీ కార్యకర్తలతో,నారాయణ సంస్థల సిబ్బందితో కడప నుంచి వచ్చిన వారిని ఎన్నుకుంటే విశాఖలో భూములు ఆక్రమిస్తారు..గొడవలు చేస్తారు..అంటూ ప్రచారం చేయించింది. దాని ప్రభావం కూడా అప్పట్లో కొంత పడింది. ఫలితంగా విజయమ్మ ఓటమి పాలయ్యారు. విశేషం ఏమిటంటే అదే కడప జిల్లాకు చెందిన సీఎమ్ రమేష్ అనకాపల్లి నుంచి పోటీచేస్తున్నారు. తన స్వస్థలం పోట్లదుర్తి నుంచి సుమారు ఏభై మందిని అక్కడకు తరలించి ప్రచార,ఇతర కార్యాకలాపాలలో పెట్టుకున్నారట. అలాగే టీడీపీకి చెందిన నేతలకు తగు ఆర్ధిక వనరులు సమకూర్చి టీడీపీలో ఉన్న అసమ్మతిని తగ్గించుకునేందుకు కృషి చేశారట.ఈ క్రమంలో తనకు ఎదురు లేదని భావించిన సీఎం రమేష్ అక్కడ పోలీసు అధికారులను భయపెట్టేలా వ్యవహరించారు. చోడవరం వద్ద జీఎస్టీ ఎగవేతకు సంబందించి తనిఖీలకు అధికారులు వెళ్లగా, ఆ సంస్థ యజమాని సీఎమ్ రమేష్‌కు ఫోన్ చేసి రప్పించారు. ఆయన రావడంతో సీన్ సృష్టించి అధికారులు వెళ్లిపోయేలా చేశారు. విజయమ్మ ఆ ప్రాంతంలో పోటీచేసినప్పుడు ఎలాంటి గొడవలు, దౌర్జన్యాలు జరగలేదు. అయినా టీడీపీ, బీజేపీ అలా అసత్య ప్రచారం చేశాయి. ఇప్పుడు టీడీపీ నుంచి బీజేపీలో చేరి అనకాపల్లిలో పోటీచేస్తున్న సీఎం రమేష్ మాత్రం తన స్వరూపాన్ని బహిర్గతం చేశారు. దీనిని అనకాపల్లి ప్రాంత ప్రజలు సహిస్తారా? అన్నది అనుమానం. అసలే స్తానికుడు కాదన్న భావన ఉంటే,దానికి తోడు రమేష్ ,ఆయన మనుషులు దౌర్జన్యాలు చేస్తారేమో అన్న భయం ఏర్పడితే అది ఆయనకు మరింత నష్టం కలిగించవచ్చు. సీఎం రమేష్ టీడీపీ రాజకీయాలలో ఒక కీలకమైన వ్యక్తిగా,చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా ఇప్పటికీ కొనసాగగలుగుతున్నారు. నిజాయితీగా వ్యాపారం నిర్వహించుకుని పైకి వస్తే ఎవరికి అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు. కాని అడ్డదారుల ద్వారా వేగంగా ఎదిగినప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు. తమ వద్ద ఉన్న ఆర్ధిక వనరులను ఉపయోగించి వీలైనంతమందిని వీరు ఆకట్టుకోగలుగుతారు. ఒక చిన్న సారా వ్యాపారి ,ఇంత పెద్ద ఆర్దిక సామ్రాజ్యాన్నిసృష్టించుకోవడం సమాజ వైఫల్యమా? రాజకీయ వ్యవస్థ వైఫల్యమా అంటే ఏమి చెబుదాం? – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
మరోసారి దొరికిపోయిన సీఎం రమేష్..
-
సీఎం రమేష్‌కు 41ఏ నోటీసులు జారీ..
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సీఎం రమేష్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. ఇటీవల చోడవరంలో ఓ ఘటనలో కేసు నమోదు కాగా శనివారం నర్సీపట్నంలో కృష్ణా ప్యాలెస్‌లో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్యకర్తలకు చీరల పంపిణీ కార్యక్రమం వివాదానికి దారి తీసింది. విషయం తెలుసుకున్న నర్సీపట్నం టౌన్ సీఐ క్రాంతి కుమార్, మున్సిపల్ కమిషనర్ రవిబాబుతో పాటు ఎన్నికల యంత్రాంగం అక్కడికి చేరుకుని తీయడంతో సీఎం రమేష్ అధికారులపై చిందులు తొక్కారు. ఓటర్లుకు సింబల్ తెలియజేయడానికి కమలం గుర్తు కలిగిన చీరలు ఇవ్వడం తప్పా అని ప్రశ్నించారు. ఇవి తాయిలాలు కాదని అధికారులపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రమేష్‌కు 41ఏ నోటీసులు జారీ.. అనకాపల్లి జిల్లా చోడవరంలో జీఎస్టీ చెల్లించకుండా అనధికారికంగా టైల్స్ వ్యాపారం చేస్తున్న బుచ్చిబాబు ట్రేడర్స్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న డీఆర్ఐ అధికారులపై దాడికి దిగడమే కాకుండా, విధులకు ఆటంకం కలిగించిన వ్యవహారంలో సీఎం రమేష్‌కు శనివారం రాత్రి పోటీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో ఈనెల తొమ్మిదో తేదీన విచారణను హాజరు కావాలని అనకాపల్లి ఎస్డీపీవో ఆదేశించారు. కాగా, ఐపీసీలోని 353,342,506,201,188, 143/rw, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీఎం రమేష్, చోడవరం టీడీపీ అభ్యర్థి రాజు సహా ఆరుగురి పేర్లను పోలీసుల ఎఫ్ఐఆర్లో చేర్చారు. -
సీఎం రమేష్ ‘పువ్వు’ చెవిలో పెట్టుకొని వెళ్లిపోవడమే: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చెయ్యడం కోసం ఏదైనా చేస్తానని అన్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్. ఎన్నికల్లో పోటీలో ఎవరున్నారని పేదవాడికి కనిపించేంది సీఎం జగన్ మాత్రమేనని తెలిపారు. తమకు మంచి చేసిన వైఎస్ జగన్‌కే మళ్లీ ఓటువేసి గెలిపించాలని పేదవాడు అనుకుంటాడని పేర్కొన్నారు. సీఎం రమేష్ ఎంపీ నిధులను అనకాపల్లిలో ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టాడా అని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ ఎక్కడి నుంచి వచ్చాడో అనకాపల్లి ప్రజలు గమనించాలని అన్నారు. బ్యాంకులకు కన్నం వేసి అనకాపల్లిలో తల దాచుకునేందుకు వచ్చాడని విమర్శించారు. రమేష్ ఆధార్ కార్డుపై మైదరాబాద్ అడ్రస్ ఉంటుందని దుయ్యబట్టారు. సీఎం రమేష్ ఎస్టీడీ.. బూడి ముత్యాలనాయుడు(అనకాపల్లి వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి) లోకల్ అంటూ పేర్కొన్నారు. పువ్వు పార్టీ అనకాపల్లిలో గెలిచేది లేదని అమర్నాథ్ సెటైర్లు వేశారు సీఎం రమేష్ ఆ పువ్వు చెవిలో పెట్టుకొని వెళ్లిపోవడమేనని ఎద్దేవా చేశారు. అనకాపల్లిలో రాజకీయ శత్రువులను కలిపిందే తానంటూ కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావులను ఉద్ధేశిస్తూ అన్నారు. వాళ్ల ఇంట్లో తన ఫోటో పెట్టుకోవాలని అన్నారు. అలాంటి వారు తనమీద పడి ఏడుస్తున్నారని విమర్శించారు. -
సీఎం రమేష్ సారా అక్రమాల చరిత్ర ఇది
టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ఆయన నమ్మిన బంటు.. కూటమి తరఫున అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ అక్రమాల బాగోతాలు అన్నీ ఇన్నీ కావు.. సీఎం రమేష్‌పై తాజాగా పోలీస్ కేసు నమోదైంది. ‘‘నా సంగతి మీకు తెలియదంటూ..’’ జీఎస్టీ తనిఖీల కోసం వెళ్లిన డీఆర్ఐ అధికారులపై గుండాయిజం ప్రదర్శించిన సీఎం రమేష్ అక్రమాల చరిత్రను పరిశీలిస్తే.. కుప్పంలో ఒకప్పుడు సీఎం రమేష్ తన తండ్రితో పాటు సారా వ్యాపారం చేశారు. రాయదుర్గం నుంచి అక్రమంగా సారా ప్యాకెట్లు తెప్పిస్తుంటే సీఎం రమేష్‌ను, ఆయన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. మరొక కేసులో సీఎం రమేష్ తండ్రిని పీడీ యాక్ట్ కింద అరెస్టు అయ్యారు. అధికారంలో ఉన్నవాళ్లను ఎలా ఆకట్టుకోవాలో సీఎం రమేష్‌కు బాగా తెలుసు. 1989–94లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేసుల నుంచి బయట పడడానికి సీఎం రమేష్ ఆయన కుటుంబం కడపలో ఉన్న ఓ మంత్రి సాయం తీసుకునే వారు. చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పం వెళ్లాక సీఎం రమేష్ పోట్లదుర్తి నుంచి కొంతమందిని తీసుకెళ్లి కుప్పంలో దొంగ ఓట్లు నమోదు చేయించారు. కుప్పంలో ఓటు మేనేజ్మెంట్ అంతా సీఎం రమేష్ ఆయన తీసుకెళ్లిన పోట్లదుర్తి మనుషులే చూసుకునేవాళ్లు. అప్పటి నుంచి చంద్రబాబుతో సీఎం రమేష్‌కు వ్యక్తిగత, ఆర్థిక, రాజకీయ సాన్నిహిత్యం ఏర్పడింది. ఇప్పుడు సీఎం రమేష్ రూ.వేల కోట్లకు అధిపతిగా ఉన్నాడు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రమేష్ అనకాపల్లిలో సుమారు 200 మందిని తీసుకెళ్లి జీఎస్టీ అధికారులను భయభ్రాంతులకు గురి చేశారు. వీటికి బీజేపీ ఏమి సమాధానం చెబుతుంది.? కోల్‌కత్తాలో ఈడీ అధికారులపై అక్కడి టీఎంసీ నేతలు దాడికి దిగితే ఖండించిన బీజేపీ ఇప్పుడు సీఎం రమేష్ చేసిన ఈ దౌర్జన్యానికి ఏం సమాధానం చెబుతుంది? అక్రమ సారా నుంచి రూ.3 వేల కోట్లకు ఎదిగాడు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సీఎం రమేష్ తనకు ఏం కావాలో చెప్పి చేయించుకునేవారు. అనకాపల్లిలో ప్రస్తుత ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు చేయడానికి ఉన్నాడు. పోట్లదుర్తి నుంచి తన మనుషులను అనకాపల్లికి తీసుకొచ్చాడు. నీతులు చెబుతున్న చంద్రబాబు... సీఎం రమేష్ ఎదుగుదలలో ఆయన పాత్ర ఎంటో చెప్పగలరా?. గతంలో విజయమ్మ పోటీ చేసినప్పుడు కడప నుంచి మనుషులను తీసుకొచ్చారని టీడీపీ వాళ్లు అసత్య ప్రచారాలు చేయించారు. ఆమె ఓటమికి కారణమయ్యారు. కడప ప్రాంతానికే చెందిన రమేష్ ఇప్పుడు అనకాపల్లిలో చేస్తున్న దౌర్జన్యానికి ఏం సమాధానం చెబుతారు. -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
సీఎం రమేష్‌పై కేసు నమోదు
విశాఖపట్నం, సాక్షి: కూటమి తరఫున అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌పై పోలీస్ కేసు నమోదు అయ్యింది. ‘‘నా సంగతి మీకు తెలియదంటూ..’’ జీఎస్టీ తనిఖీల కోసం వెళ్లిన డీఆర్ఐ(Directorate of Revenue Intelligence) అధికారులపై గుండాయిజం ప్రదర్శించారాయన. ఈ ఘటనపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ ఇంటిలిజెన్స్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ చోడవరం పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది. డీఆర్ఐ అధికారులకు ఆటంకం కలిగించడంతో పాటు వాళ్ల చేతుల్లో ఫైళ్లను లాక్కునే ప్రయత్నం చేశారు సీఎం రమేష్. దీంతో.. అధికారుల విధులకు ఆటంకం కలిగించే యత్నం చేశారని.. బెదిరింపులకు పాల్పడ్డారని చోడవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 143, 506, 342, 353, 201, 188 red with 149 కింద కేసు నమోదు చేశారు. సీఎం రమేష్‌తో పాటు చోడవరం టీడీపీ అభ్యర్థి కేఎస్ఎన్ఎస్ రాజు, టైల్స్ వ్యాపారి బుచ్చిరాజు, రామకృష్ణలతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు అయ్యింది. అసలేం జరిగిందంటే.. గాంధీ గ్రామంలో బుచ్చిరాజు అనే టీడీపీ సానుభూతిపరుడు హోల్‌సేల్ టైల్స్, మార్బుల్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. దానిపై డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం(డీఆర్ఐ) అధికారి శ్రీధర్ ఆధ్వర్యంలో ఆరుగురితో కూడిన ఓ బృందం గురువారం తనిఖీలు నిర్వహిస్తోంది. జీఎస్టీ సక్రమంగా కట్టడం లేదంటూ షాపు రికార్డులన్నీ వారు తనిఖీ చేస్తుండగా టైల్స్ వ్యాపారి బుచ్చిరాజు స్థానిక టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజుకు, అనకాపల్లి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌కు ఫోన్ చేశారు. వెంటనే వారిద్దరూ తమ అనుచరులతో టైల్స్ షాపు దగ్గరకు చేరుకున్నారు. అధికారుల దగ్గర్నుంచి రికార్డులను సీఎం రమేష్ లాక్కున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా తనిఖీలు చేస్తారంటూ వారిపై దౌర్జన్యానికి దిగారు. అంతేనా అధికారులని కూడా చూడకుండా పరుషపదజాలంతో వారిపై విరుచుకుపడ్డారు. ఔ ఇదీ చదవండి: బ్యాంకుల మోసగాడు ఎంపీ అభ్యర్థా? -
అనకాపల్లి చోడవరంలో కూటమి అభ్యర్థి సీఎం రమేష్ దాదాగిరి
-
రెచ్చిపోయిన సీఎం రమేష్...ప్రభుత్వ అధికారులపై రౌడీయిజం
-
నా సంగతి మీకు తెలీదు.. తనిఖీలు ఆపి వెంటనే వెళ్లండి
చోడవరం: ‘ఎవరు మీరు? ఎందుకొచ్చారు? ఎవరు పంపిస్తే వచ్చారో నాకు తెలుసు. అసలు ఇలాంటి షాపుల్లో తనిఖీలు చేయాలని మీకు ఎవరు చెప్పారు? పెద్ద పెద్ద మాల్స్‌ను వదిలేసి ఇలాంటివాటిపై పడతారా? వెంటనే ఇక్కడి నుంచి వెళ్లకపోతే బాగుండదు. నా సంగతి మీకు తెలీదు’ అంటూ అనకాపల్లి టీడీపీ, బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి సీ.ఎం. రమేష్ విధి నిర్వహణలో ఉన్న అధికారులపై తన అనుచరులతో కలసి దౌర్జన్యానికి దిగారు. వారి చేతిలో ఉన్న ఫైళ్లు లాక్కుని వారిపై విరుచుకుపడి అందరినీ భయభ్రాంతులకు గురిచేశారు. ఒక దశలో అధికారుల చేతులను తోసేసి గూండాయిజం చేశారు. ఏక వచనంతో సంబోధించి అధికారులపై బెదిరింపులకు తెగబడ్డారు. తానేంటో... తన సహజ ధోరణి ఏంటో ఈ సంఘటన ద్వారా ఆయన స్థానికులకు రుచిచూపించారు. ప్రశాంతమైన అనకాపల్లి జిల్లాలో ఇలాంటి సంఘటనలు గతంలో ఎన్నడూ చూడని అక్కడి ప్రజలు ఆయన రౌడీయిజం చూసి భయభ్రాంతులకు లోనయ్యారు. ఇప్పుడే ఈయన ప్రవర్తన ఇలా ఉంటే ఇక ఆయన్ని గెలిపిస్తే ఇక తమను బతకనిస్తారా అంటూ అక్కడివారు గుసగుసలాడుకోవడం వినిపించింది. చోడవరం మండలం గాంధీ గ్రామంలో గురువారం చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జీఎస్టీ రికార్డులు తనిఖీ చేస్తుండగా... గాంధీ గ్రామంలో బుచ్చిరాజు అనే టీడీపీ సానుభూతిపరుడు హోల్‌సేల్ టైల్స్, మార్బుల్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. దానిపై డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం(డీఆర్ఐ) అధికారి శ్రీధర్ ఆధ్వర్యంలో ఆరుగురితో కూడిన ఓ బృందం గురువారం తనిఖీలు నిర్వహిస్తోంది. జీఎస్టీ సక్రమంగా కట్టడం లేదంటూ షాపు రికార్డులన్నీ వారు తనిఖీ చేస్తుండగా టైల్స్ వ్యాపారి బుచ్చిరాజు స్థానిక టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజుకు, అనకాపల్లి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌కు ఫోన్ చేశారు. వెంటనే వారిద్దరూ తమ అనుచరులతో టైల్స్ షాపు దగ్గరకు చేరుకున్నారు. అధికారుల దగ్గర్నుంచి రికార్డులను సీఎం రమేష్ లాక్కున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా తనిఖీలు చేస్తారంటూ వారిపై దౌర్జన్యానికి దిగారు. అంతేనా అధికారులని కూడా చూడకుండా పరుషపదజాలంతో వారిపై విరుచుకుపడ్డారు. టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు తన వెంట తీసుకొచ్చిన కార్యకర్తలను రెచ్చగొట్టి, దౌర్జన్యానికి మరింత పురిగొల్పేలా ప్రవర్తించారు. రాష్ట్ర ప్రభుత్వంపైనా, స్థానిక ఎమ్మెల్యేపైనా విమర్శలు చేయడంతో అక్కడి వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. ఇంతలో సమాచారం అందుకున్న స్థానిక పోలీసు సీఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో వచ్చి పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు వచ్చాక కూడా సీఎం రమేష్ అధికారులను బెదిరించడం మానలేదు. దాడులు ఆపే వరకూ ఇక్కడే ధర్నా చేస్తామంటూ హెచ్చరించారు. తమ షాపు అద్దాలను అధికారులు పగలగొట్టారని, కౌంటర్లో ఉన్న రూ.25 లక్షలు నగదు తీసుకున్నారంటూ షాపు యజమాని బుచ్చిరాజు సీఎం రమే‹Ùకు చెప్పడం, ఆయన అధికారులపై మరింత రెచ్చిపోయి ఆ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. అధికారులు మాత్రం తనిఖీలు ఆపబోమని చెప్పగా.. పరిస్థితి అదుపు తప్పేట్టు వుందని స్థానిక పోలీసులు చెప్పడంతో డీఆర్ఐ అధికారుల బృందం అక్కడ నుంచి వెళ్లిపోయింది. పోలీసులకు ఫిర్యాదు జరిగిన సంఘటనపై డీఆర్ఐ అధికారులు చోడవరం పోలీసులకు గురువారం రాత్రి ఫిర్యాదు చేశారు. అనకాపల్లి డీఎస్పీ అప్పలరాజు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి, చోడవరం పోలీసు స్టేషన్లో డీఆర్ఐ అధికారులతో మాట్లాడారు. వారి ఫిర్యాదుపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. కాగా ఎన్నడూ ఇలాంటి దౌర్జన్యకర సంఘటనలు చూడని స్థానికులు సీఎం రమేష్ ప్రవర్తనపై ఏవగించుకున్నారు.డ్యూటీకి అడ్డురావద్దని కోరినా.. తమ డ్యూటీ తమను చేసుకోనివ్వాలని డీఆర్ఐ అధికారులు ఎంత చెప్పినా వినిపించుకోకుండా వారిపై గూండాగిరీ ప్రదర్శించారు. అసలు ‘మిమ్మల్ని ఎవరు పంపించారు’ అంటూ అధికారులపై రుబాబు చేశారు. ఒక దశలో డీఆర్ఐ అధికారి చేయిని సీఎం రమేష్ తోసేసి మరీ హెచ్చరించారు. దాడులు ఆపేసి వెనుదిరిగి వెళ్లే వరకూ తాము ఇక్కడ నుంచి వెళ్లబోమంటూ భీషి్మంచుకొని కూర్చున్నారు. అక్కడకు వచ్చిన టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడుతూ అధికారులను నానా దుర్భాషలాడారు. తమ డ్యూటీని అడ్డుకోవడం సరికాదని, ఎవరి ఒత్తిళ్లతో తాము తనిఖీలకు రాలేదని, తమ విధి నిర్వహణలో భాగంగానే వచ్చామని అధికారులు ఎంత చెబుతున్నా వినకుండా అధికారులను బెదిరించి పెద్దపెద్దగా అరుస్తూ వారిపై దౌర్జన్యానికి దిగారు. ఆయన ప్రవర్తనతో హతాశులైన అధికారులు భయబ్రాంతులకు గురయ్యారు. -
బ్యాంకుల మోసగాడు ఎంపీ అభ్యర్థా?
నక్కపల్లి (అనకాపల్లి జిల్లా): బ్యాంకులను మోసగించి, సంతకాలు ఫోర్జరీ చేసి వేల కోట్లు దోచుకున్న వ్యక్తా కూటమి అనకాపల్లి అభ్యర్థి అంటూ సీఎం రమేశ్‌పై డిప్యూటీ సీఎం, అనకాపల్లి వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు నిప్పులు చెరిగారు. ఆదివారం ఆయన నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంతబయలు వద్ద అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తాను పదవులు కొనుక్కోలేదన్నారు. జగనన్న తనకు రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలిచానని, మంత్రిపదవి ఇచ్చి డిప్యూటీ సీఎంను చేశారన్నారు. ఆయన రుణం తీర్చుకోలేనిదన్నారు. పెత్తందార్లకు, పేదలకు మధ్య పోటీ జరుగుతోందని, జగనన్న సైన్యంగా ఎదుర్కొనేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దిగుమతి మోసగాళ్లకు అనకాపల్లి నియోజకవర్గ ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు. ఈ ప్రాంతంతో పరిచయం లేని, ముక్కుముఖం తెలియని వ్యక్తిని ఇక్కడ పోటీ చేయించి ఈ ప్రాంత సంపదను తన బినామీ ద్వారా దోచుకోడానికే చంద్రబాబు కుట్రలు పన్నారన్నారు. స్థానికేతరులను అనకాపల్లి ప్రజలు ఓడిస్తారని, గతంలో అల్లు అరవింద్, నూకారపు సూర్యప్రకాశరావులకు పట్టిన గతే సీఎం రమేశ్కూ పడుతుందన్నారు. బీజేపీ ముసుగులో ఉన్న టీడీపీ నాయకుడు సీఎం రమేశ్ అని ముత్యాలనాయుడు చెప్పారు. బీజేపీ అభిమానులు ఇది గమనించాలన్నారు. చీటింగ్ ఫోర్జరీ కేసులనుంచి బయటపడేందుకే సీఎం రమేశ్ బీజేపీలో చేరాడన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ పేదలకు పెత్తందార్లకు జరుగుతున్న యుద్ధంలో బీసీలు, ఎస్సీలు, ఇతర వర్గాలవారు జగనన్నకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంను చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. జగనన్న అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలన్నీ రద్దవుతాయన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎంపీగా ముత్యాల నాయుడు, ఎమ్మెల్యేగా కంబాల జోగులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీసం రామకృష్ణ పాల్గొన్నారు. -
ఏపీలో ‘పార్టీ’ లేదా పుష్పా?
సాక్షి, అమరావతి : ఏళ్ల తరబడి పార్టీనే నమ్ముకుని దానికోసమే అహరహం శ్రమిస్తున్న అసలు సిసలైన బీజేపీ నేతలకు ఊహించినట్లుగానే షాక్ తగిలింది. పొత్తులో బీజేపీకి కేటాయించిన ఆరు లోక్‌సభ సీట్లలో ఒక్క నరసాపురం మినహా మిగిలిన అరకు, అనకాపల్లి, రాజమహేంద్రవరం, రాజంపేట, తిరుపతి స్థానాలను వలస పక్షులే దక్కించుకున్నాయి. దీంతో బీజేపీకి అసలైన పార్టీ అభ్యర్థులే కరువయ్యారా అన్న అంశం ఇప్పుడు కరడుగట్టిన కమలనాథుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. 2019లో టీడీపీ ఘోరంగా ఓటమి చవిచూసిన తర్వాత చంద్రబాబు డైరెక్షన్లో హుటాహుటిన బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఆయన నమ్మినబంటు సీఎం రమేశ్‌కు అనకాపల్లి ఎంపీ స్థానం కేటాయించారు. ఈయన నిజానికి వైఎస్సార్ జిల్లా వ్యక్తి. ఎక్కడో రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకు వలస నేతను దిగుమతి చేయాల్సిన ఖర్మ ఏంటని 20–30 ఏళ్లుగా పార్టీలోనే కొనసాగుతున్న వారుప్రశ్నిస్తున్నారు. అలాగే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, చంద్రబాబుకు వదిన అయిన పురందేశ్వరి కూడా 2014లో కేంద్రంలో కాంగ్రెస్ పరాజయం పాలయ్యాక బీజేపీలోకి వచ్చిన వ్యక్తే. ఈమెకు రాజమహేంద్రవరం టికెట్ దక్కింది. అలాగే, రాజంపేట టికెట్ దక్కిన మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈమధ్యే బీజేపీలో చేరారు. అరకు అభ్యర్థి కొత్తపల్లి గీత అయితే గతంలో వైఎస్సార్సీపీ నుంచి ఎంపీగా గెలిచి పార్టీ ఫిరాయించారు. ఆ తర్వాత ఆమె జనజాగృతి పేరుతో సొంత పార్టీ పెట్టుకుని అనంతరం దానిని బీజేపీలో విలీనం చేశారు. ఇక గూడూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ అయితే బీజేపీ కండువా కప్పుకున్న రోజే పార్టీ ఆయనకు తిరుపతి టికెట్ కేటాయించింది. ఇలా.. ఒక్క నరసాపురం అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ మినహా మిగిలిన అందరూ వలస నేతలకే టికెట్లు దక్కాయి. ఎక్కువగా తన మనుషులకే టికెట్లు వచ్చేలా చంద్రబాబు చక్రం తిప్పారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో పొత్తులున్నా.. లేకున్నా ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేసేందుకు రెండు మూడేళ్లుగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్న జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్థన్‌రెడ్డి వంటి బీజేపీ సీనియర్లు ఎంపీ అభ్యర్థుల జాబితా చూసి తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఇక నిన్నటివరకూ కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేని తిరుపతి జిల్లా గూడూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌కు ఒక్కసారిగా తిరుపతి లోక్‌సభ సీటు దక్కడం వారిని తీవ్ర ఆశ్చర్యానికి గురిచేయడమే కాక పార్టీలో ఈ విషయం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. బాబు, పవన్ చుట్టూ వరప్రసాద్ చక్కర్లు.. వాస్తవానికి.. వరప్రసాద్‌కు ఈసారి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ టికెట్ ఇవ్వకపోవడంతో గత కొంతకాలంగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నారు. 20 రోజుల క్రితం బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదరక ముందు తిరుపతి లోకసభ సీటును జనసేనకు కేటాయించాలని భావిస్తున్న సమయంలో చంద్రబాబు సూచన మేరకు వరప్రసాద్ నెలరోజుల క్రితమే మంగళగిరి జనసేన కార్యాలయంలో పవన్‌ను కలిశారు. ఆ తర్వాత.. పొత్తులో బీజేపీ కూడా చేరడంతో తిరుపతి లోకసభ సీటు బీజేపీ కోటాలోకి వెళ్లింది. దీంతో చంద్రబాబు డైరెక్షన్లోనే వరప్రసాద్ మళ్లీ బీజేపీ చుట్టూ తిరగడం మొదలుపెట్టినట్లు కమలనాథులు చర్చించుకుంటున్నారు. ఇందులో భాగంగానే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఐదారు రోజులుగా ఢిల్లీలో వరప్రసాద్‌ను వెంటబెట్టుకుని కొందరు జాతీయ పెద్దల వద్ద లాబీయింగ్ చేసినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆమె ప్రతిపాదన మేరకే బీజేపీ జాతీయ నాయకత్వం వరప్రసాద్‌కు బీజేపీలో చేరక మునుపే తిరుపతి లోకసభ సీటు కేటాయించిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బీజేపీలో చేరేందుకు బద్వేలు అభ్యర్థి ‘నో’.. మరోవైపు.. పొత్తులో బీజేపీకి కేటాయించిన పది అసెంబ్లీ స్థానాల్లో బద్వేలు నియోజకవర్గం కూడా ఒకటి. ఈ స్థానంలో బీజేపీకి సరైన అభ్యర్థి కూడా లేనందున ఆ సీటును బలవంతంగా బీజేపీకి అంటగట్టారని మొదటి నుంచి పార్టీలో ఉన్న బీజేపీ సీనియర్ నేతలు చెబుతున్నారు. ఆ సీటులో బీజేపీ తరఫున పోటీచేసేందుకు పురందేశ్వరి ముగ్గురు పేర్లను జాతీయ నాయకత్వానికి ప్రతిపాదించారని.. ఆ ముగ్గురూ ఇప్పటిదాకా పార్టీలో చేరని వారేనని వారంటున్నారు. ఇప్పుడు ఆ ముగ్గురిలో ఒకరైన రోశన్న పేరుకు ఢిల్లీ పెద్దలు ఆమోదం తెలిపారు. దీంతో రోశన్నను బీజేపీలో చేర్చేందుకు పార్టీ రాష్ట్ర నేతలు, జిల్లా నాయకులు ఆదివారం ప్రయత్నించగా, ఆయన అందుకు విముఖత చూపారని పార్టీలో చర్చ జరుగుతోంది. దీంతో ఈ సీటు వ్యవహారాన్ని కొద్దిరోజులు వాయిదా వేయాలని భావిస్తున్నారు. సీనియర్ల ఆగ్రహావేశాలు.. ఇదిలా ఉంటే.. పొత్తు ఉన్నా, లేకపోయినా పార్టీ తరఫున పోటీచేసేందుకు 30 ఏళ్లుగా పార్టీలో ఉన్న చాలామంది ఆసక్తి వ్యక్తంచేశారని.. అలాంటప్పుడు పార్టీకి మంచి అభ్యర్థులున్న నియోజకవర్గాలే కేటాయించాలని పట్టుబట్టి ఉండొచ్చు కదా అని పలువురు సీనియర్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కానీ, చంద్రబాబు ఇస్తామన్న నియోజకవర్గాలను ఒప్పుకుని, ఇప్పుడా స్థానాల్లో పార్టీ సభ్యత్వంలేని వారికి సీట్లు కేటాయిస్తే, ఏళ్ల తరబడి పార్టీనే నమ్ముకున్న నాయకుల పరిస్థితి, పార్టీ పరువు ఏం కావాలని పార్టీ హార్డ్‌కోర్ సీనియర్లు రగిలిపోతున్నారు. -
షెల్ కంపెనీతో సీఎం రమేష్ టోకరా...రూ.450 కోట్లు స్వాహా..
-
స్కిల్ కేసులో ఎన్నికల బాండ్లు కీలకం కానున్నాయా ?
-
సీఎం రమేష్ పై కేసు
-
షెల్ కంపెనీతో సీఎం రమేశ్ టోకరా..
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ఆయన నమ్మిన బంటు.. ఆ పార్టీ మాజీ ఎంపీ, ప్రస్తుతం బీజేపీలో టీడీపీ కోటరీకి నాయకుడు సీఎం రమేశ్ అక్రమాల బాగోతం మరొకటి బయటపడింది. ఫోర్జరీ సంతకాలు చేసి షెల్ కంపెనీ ముసుగులో ఏకంగా రూ.450 కోట్లు కొట్టేసిన వ్యవహారం ఆధారాలతో సహా వెలుగుచూసింది. సీఎం రమేశ్, ఆయన సన్నిహితుడు పి. నాగేశ్వరరావు పక్కా స్కెచ్‌తో పాల్పడిన ఈ ఘరానా మోసంపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. సంతకాలు ఫోర్జరీ చేసి రిత్విక్ స్వాతి అనే బోగస్ కంపెనీ పేరిట సబ్‌కాంట్రాక్టు ఒప్పంద పత్రాలు సృష్టించి మరీ ఈ మోసానికి తెగబడ్డారు. ఈ మేరకు ప్రముఖ సినీ నటుడు, పీసీఎల్ ఇంటర్‌టెక్ లెన్హైడ్రో కాన్సార్షియం జాయింట్ వెంచర్ ఆథరైజ్డ్ సిగ్నేచరీగా ఉన్న తొట్టెంపూడి వేణు, కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావు కుమారుడు కావూరి భాస్కర్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు గత ఏడాదే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారిపై ఐపీసీ సెక్షన్లు 420, 468, 471 కింద కేసు నమోదు చేశారు. ఫోర్జరీ సంతకాలతో సీఎం రమేశ్ పాల్పడిన ఈ మోసానికి సంబంధించిన మరిన్ని కీలక ఆధారాలను తొట్టెంపూడి వేణు, కావూరి భాస్కర్‌రావు హైదరాబాద్ పోలీసులకు శనివారం అందించారు. కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని కోరారు. ఈ ఘరానా మోసం వివరాలిలా ఉన్నాయి.. పీసీఎల్ కన్సార్షియంకు తెహ్రీ హైడ్రో ప్రాజెక్టు.. ఉత్తరాఖండ్‌లో తెహ్రీ హైడ్రో ప్రాజెక్టు వద్ద సివిల్ ప్రాజెక్టు కాంట్రాక్టును పీసీఎల్ ఇంటర్‌టెక్ కన్సార్షియం దక్కించుకుంది. ఈ మేరకు తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీహెచ్‌డీసీ)తో 2002లో ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం ఆ ప్రాజెక్టు వ్యవహారాలను నిర్వహించేందుకు పీసీఎల్ కన్సార్షియం తమ ప్రతినిధిగా కావూరి భాస్కర్‌రావును జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ (జీపీఏ) ద్వారా నియమించింది. కొంతకాలం ప్రాజెక్టు పనులు చేపట్టిన తరువాత పీసీఎల్ కన్సార్షియంకు టీహెచ్డీసీతో విభేదాలు తలెత్తాయి. దీంతో ఆ వ్యవహారం న్యాయస్థానం ఆర్బిట్రేషన్‌కే చేరింది. ఢిల్లీ కోర్టులో ప్రస్తుతం వ్యాజ్యం కొనసాగుతోంది. పీసీఎల్ కన్సార్షియంకు చెల్లించాల్సిన బిల్లుల మొత్తాన్ని టీహెచ్‌డీఏ న్యాయస్థానంలో డిపాజిట్ చేసింది. ఫోర్జరీ సంతకాలతో సీఎం రమేశ్ మోసం.. ఇలా ఓ వైపు ఈ న్యాయ వివాదం కొనసాగుతుండగా.. సీఎం రమేశ్ గుట్టుచప్పుడు కాకుండా ఓ కథ నడిపించారు. పి. నాగేశ్వరరావు అనే వ్యక్తి తమ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని పీసీఎల్ కన్సార్షియం 2011లో గుర్తించింది. ఆ మేరకు ఆయన ఓ జీపీఏను కూడా సృష్టించారని తెలుసుకుని షాక్‌కు గురైంది. అంతేకాదు.. తమ కన్సార్షియం ప్రతినిధిగా చెప్పుకుంటూ ఆయన సీఎం రమేశ్‌కు చెందిన బోగస్ కంపెనీ రిత్విక్ స్వాతికి టీహెచ్‌డీఏ ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టును ఇచ్చినట్లు పత్రాలు సృష్టించారు. వాటిని చూపిస్తూ టీహెచ్‌డీఏ ప్రాజెక్టు బిల్లులు పొందేందుకు సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ స్వాతి కంపెనీ వ్యవహారం నడిపింది. పి. నాగేశ్వరరావు అనే వ్యక్తి కేవలం పరిమిత కాల జీపీఏతో పీసీఎల్ కన్సార్షియం ప్రతినిధిగా టీహెచ్‌డీఏ ప్రాజెక్టు పనులను పర్యవేక్షించారు. కానీ, ఆయన వ్యవహారశైలి నచ్చక ఆ జీపీఏ కాలపరిమితి ముగియగానే ఆయన్ని తొలగించారు. అయినాసరే.. తమ సంతకాలు ఫోర్జరీ చేసి మరోజీపీఏ సృష్టించుకోవడంతోపాటు.. సీఎం రమేశ్‌కు చెందిన బోగస్ కంపెనీ రిత్విక్ స్వాతితో తమ కంపెనీ పేరుతో సబ్ కాంట్రాక్టు ఒప్పందం చేసుకున్నట్లుగా పీసీఎల్ కన్సార్షియం గుర్తించింది. ఈ ఒప్పందంలో పి.నాగేశ్వరరావు తన చిరునామాలో ఆంధ్రప్రదేశ్‌లోని చిలకలూరిపేటను పేర్కొన్నారు. దీనిపై పీసీఎల్ కన్సార్షియం చిలకలూరిపేట పోలీసులను ఆశ్రయించగా ఆయన తప్పుడు చిరునామా ఇచ్చారని గుర్తించారు. అసలు చిరునామాను కూడా గుర్తించి వెల్లడించారు. షెల్ కంపెనీ ద్వారా నిధులు కొల్లగొట్టేందుకు ఉద్దేశించిన ఆ బోగస్ సబ్ కాంట్రాక్టు ఒప్పందం ద్వారా సీఎం రమేశ్, పి.నాగేశ్వరరావు ఈ మోసానికి పాల్పడ్డట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో పీసీఎల్ కన్సార్షియం ఈ విషయాన్ని ఈ–మెయిల్ ద్వారా టీహెచ్‌డీఏ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందిందని టీహెచ్‌డీఏ ఉన్నతాధికారులు నిర్ధారించారు. ఫోరెన్సిక్ పరీక్షల్లో ఫోర్జరీ నిర్ధారణ.. మరోవైపు.. ఆ సబ్ కాంట్రాక్టు ఒప్పంద పత్రాలను కావూరి భాస్కర్‌రావు ట్రూత్‌ల్యాబ్ అనే ప్రైవేటు సంస్థ ద్వారా ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించారు. పి. నాగేశ్వరరావు, రిత్విక్ స్వాతి కంపెనీ ఉద్దేశపూర్వకంగా సంతకాలు ఫోర్జరీ చేసినట్లు ఆ పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. ఈ అంశాన్ని పీసీఎల్ కన్సార్షియం ప్రతినిధులైన తొట్టెంపూడి వేణు, కావూరి భాస్కర్‌రావు హైదరాబాద్ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ స్వాతి కంపెనీ ప్రధాన కార్యాలయంలోనే ఫోర్జరీ సంతకాలతో బోగస్ సబ్ కాంట్రాక్టు ఒప్పందం చేసుకున్నారని తేలింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులకు గత ఏడాది నవంబరు 4న ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించి ఫోర్జరీ సంతకాల విషయాన్ని నిర్ధారించాలని కోరారు. తప్పుడు ఒప్పందంతో తమ కంపెనీని మోసం చేసిన సీఎం రమేశ్, పి. నాగేశ్వరరావులపై చట్ట ప్రకా రం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీరి మోసానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉండటంతో వారిపై హైదరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో.. తొట్టెంపూడి వేణు, కావూరి భాస్కర్‌రావు హైద రాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డిని శని వారం కలిసి ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కేసు కు సంబంధించి తాము సేకరించిన మరిన్ని కీలకపత్రాలను కూడా పోలీసులకు అందించారు. సీఎం రమేశ్ రూ.450 కోట్లు కొల్లగొట్టారు : కావూరి భాస్కర్‌రావు ‘పీసీఎల్ జాయింట్ వెంచర్ కంపెనీకి సంబంధించి సీఎం రమేశ్ ఫోర్జరీకి పాల్పడ్డారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఏసీపీ ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చాను. దాదాపు అరగంట పాటు నా స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. ఈ ఫోర్జరీ ద్వారా సీఎం రమేశ్ దాదాపు రూ.450 కోట్లు స్వాహా చేశారు. దీనికి సంబంధించి కోర్టులోనూ ఓ కేసు నడుస్తోంది. సీఎం రమేశ్‌పై సీబీఐ దర్యాప్తు జరిగితే రూ.వేల కోట్ల స్కాంలకు సంబంధించిన విషయాలు బయటకొస్తాయి’.. అని కావూరి భాస్కర్‌రావు మీడియాకు చెప్పారు. -
బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌పై ఫోర్జరీ కేసు
సాక్షి, హైదరాబాద్: సినీనటుడు వేణు ఫిర్యాదుతో బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్‌పై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫోర్జరీ కేసు నమోదైంది. పీసీఎల్ జాయింట్ వెంచర్ కంపెనీలో ఫోర్జరీకి పాల్పడి రూ.450 కోట్లు సీఎం రమేష్ కొట్టేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌కు బదిలీ చేశారు. కాగా, వేణు తరఫున కావూరి భాస్కర్‌రావు స్టేట్మెంట్ ఇచ్చారు. పీసీఎల్ జాయింట్ వెంచర్ కంపెనీకి సంబంధించి సీఎం రమేష్ ఫోర్జరీకి పాల్పడ్డారని కావూరి భాస్కర్ రావు తెలిపారు. ‘‘ఈ ఫోర్జరీకి సంబంధించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో వేణు ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్‌లో నమోదైన కేసును సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌కి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ రోజు క్రైమ్ ఏసీపీ నా స్టేట్మెంట్ రికార్డు కోసం రమ్మని పిలిచారు. అరగంట పాటు నా స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. కేసుకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తుంది. వేల కోట్ల స్కాంకి సీఎం రమేష్ పాల్పడ్డాడు సీబిఐ ఎంక్వయిరీ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి’’ అని కావూరి భాస్కర్‌రావు పేర్కొన్నారు. -
పవర్ బ్రోకర్..బయటపడ్డ బ్లాక్ మనీ గుట్టు
-
‘దేశ’ ముదుర్లు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ... కాంగ్రెస్ వేరువేరు కాదని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను చంద్రబాబు నాయుడే డబ్బులిచ్చి మరీ నడిపిస్తున్నారని మరోసారి స్పష్టంగా ఆధారాలతో సహా బయటపడింది. అవసరాల కోసం, కేసుల నుంచి రక్షణ కోసం చంద్రబాబు ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. అధికారికంగా జనసేనతోను, అనధికారికంగా కాంగ్రెస్‌తోను అంటకాగుతూనే ఉన్నారని స్పష్టంగా వెల్లడయింది. ఇందుకోసం చంద్రబాబు తన నమ్మిన బంటు సీఎం రమేశ్ ద్వారా... కాంగ్రెస్ పార్టీకి భారీ ప్యాకేజీ అందజేసినట్లు నేరుగా ఎలక్టొరల్ బాండ్లే వెల్లడించాయి. అది కూడా తెలంగాణలోను, కాంగ్రెస్‌లోను ఎన్నికలకు ముందు ఏకంగా 30 కోట్ల రూపాయలను అధికారికంగా పార్టీ ఫండ్ కింద చంద్రబాబు నాయుడు పంపించినట్లు వెల్లడయింది. ఇక అనధికారికంగా ఎంత ముట్టజెప్పారన్నది ఊహించటం కష్టమే. వీటన్నిటికీ తోడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఎలా మోశారో... కాంగ్రెస్ కోసం తన పార్టీని ఎన్నికల్లో పోటీ చేయించకుండా ఎలా కట్టడి చేశారో తెలియనివేమీ కావు. నిజానికి కడప జిల్లాకు చెందిన సీఎం రమేశ్ ఇప్పుడు బీజేపీలో ఉన్నా... నూటికి నూరుపాళ్లూ తెలుగుదేశం మనిషి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడే ఆయన రిత్విక్ ప్రాజెక్టŠస్ సంస్థను ఆరంభించి... బాబు అండదండలతో భారీ కాంట్రాక్టులు పొందారు. బాబు మనిషిగా సింగపూర్, మారిషస్‌ల నుంచి నిధులు తెచ్చుకుని చాలా తక్కువ కాలంలోనే వేల కోట్లకు ఎదిగాడు. అందుకే... 2019లో తాను ఓడిపోగానే సీఎం రమేశ్‌ను బీజేపీలోకి పంపించేశాడు చంద్రబాబు నాయుడు. ఇక అప్పటి నుంచి బీజేపీలో ఉంటూనే... నారా వారి ప్రయోజనాల కోసం సకల కార్యాలూ చక్కబెట్టడం మొదలెట్టాడు సీఎం రమేశ్. అలాంటి సీఎం రమేశ్... బీజేపీలో ఉంటూ బీజేపీకి ఒక్క పైసా కూడా అధికారికంగా ఇవ్వకపోయినా... రూ.30 కోట్లను మాత్రం బీజేపీకి బద్ధ శత్రువైన కాంగ్రెస్ ఖాతాలో వేయటం అందరినీ ఆశ్చర్యపరిచేదే. అంతేకాదు. చంద్రబాబు ఎవరెవరిని వాడాలని అనుకుంటున్నారో... వారందరికీ అవసరమైన ఖర్చులు పెట్టడం, ప్రత్యేక విమానాలు సమకూర్చటం ఇవన్నీ రమేశ్ విధులే. ఈయన విమానాన్ని ఇటీవల షర్మిల, పవన్ కల్యాణ్, ప్రశాంత్ కిషోర్ సహా బాబు బ్యాచ్ మొత్తం వాడేస్తుండటం అందరికీ తెలిసిన విషయమే. జగన్ టార్గెట్‌గా బాబు పావులు... 2019లో ప్రజా క్షేత్రంలో దారుణంగా ఓడిపోయినప్పటి నుంచీ చంద్రబాబు ఎన్ని పాచికలు వేసినా పారటం లేదు. ఆ తరవాత జరిగిన స్థానిక ఎన్నికలతో సహా ప్రతి ఎన్నికలోనూ ఘోరమైన ఓటమి పాలవుతుండటంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నేరుగా ప్రజాక్షేత్రంలో ఢీకొనటం కష్టమని తెలుసుకుని మాయోపాయాలకు దిగాడు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఆసరాగా చేసుకుని ఆయన కుటుంబీకుల్లో చిచ్చు పెడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టవచ్చనే నిర్ణయానికి వచ్చి... ఆ దిశగా పావులు కదిపాడు. హత్య కేసులో తన భర్త పాత్ర బయటపడి ఇరుక్కుంటామేమోనని భయపడుతున్న సునీతను చేరదీయటంతో పాటు... అధికారం ఆశ చూపించి వైఎస్ షర్మిలనూ తమవైపు తిప్పుకున్నారు. వారు గనక తెలుగుదేశంలో నేరుగా చేరితే తమ మాటలెవరూ నమ్మరన్న ఉద్దేశంతో... తన సన్నిహితుడు రేవంత్‌రెడ్డి ద్వారా కాంగ్రెస్‌లో ఆమె పార్టీని విలీనం చేయించటం వంటి కార్యక్రమాలను దిగ్విజయంగా చేయించాడు. ఇదే సమయంలో ఈ కార్యక్రమాలన్నీ చేయటానికి కాంగ్రెస్‌కు తన బంటు సీఎం రమేశ్ ద్వారా రూ.30 కోట్లను ఎలక్టొరల్ బాండ్ల ద్వారా అందజేశారు. నిజానికి ఎలక్టొరల్ బాండ్ల విషయంలో చాలా కంపెనీలు 2019 ఎన్నికల ముందు కొనుగోలు చేసి ఆయా పార్టీలకు అందజేశాయి. సీఎం రమేశ్ మాత్రం 2023లోనే తన రిత్విక్ ప్రాజెక్ట్ ద్వారా రూ.45 కోట్ల మేర ఎలక్టొరల్ బాండ్లను కొనుగోలు చేసి, అందులో రూ.30 కోట్లను కాంగ్రెస్ ఖాతాలోకి, రూ.5 కోట్లను తెలుగుదేశం ఖాతాలోకి, మరో 10 కోట్లను కర్ణాటకకు చెందిన జనతాదళ్ (ఎస్) ఖాతాలోకి వేశారు. కాంగ్రెస్‌లో మారిన పరిణామాలు... తెలుగుదేశం తరఫున రాజ్యసభకు ఎన్నికై... బీజేపీలో కొనసాగుతూ... కాంగ్రెస్‌కు భారీగా నిధులిచ్చిన సీఎం రమేశ్... ఇటీవల చంద్రబాబు నాయుడిని ఢిల్లీలో బీజేపీ పెద్దలు కలవటానికి కూడా ఇష్టపడనప్పుడు మొత్తం వ్యవహారాన్ని వెనక ఉండి నడిపించారు. మొత్తానికి బీజేపీ పెద్దల అపాయింట్మెంట్లు సంపాదించి బాబును వారితో భేటీ అయ్యేలా చేశారు. ఇక వాళ్లేం చెబితే అది చేస్తానని చంద్రబాబు సాగిలపడటంతో వారు కూడా పొత్తుకు సరేనన్న విషయం బహిరంగ రహస్యమే. ఆ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కూడా నేరుగానే చెప్పారు. బాబుకు బుద్ధొచ్చింది కనకనే తిరిగి తమ వద్దకు వచ్చాడని ఆయన చెప్పగా... గతంలో చంద్రబాబుజీ... నాయుడుజీ అన్న ప్రధాన మంత్రి మోదీ... ఇటీవల చిలకలూరిపేట సభలో మాత్రం నేరుగా చంద్రబాబు నాయుడు అని మాత్రమే... అదికూడా ఒక్కసారే సం¿ోదించడం గమనార్హం. బాబు మాత్రం మోదీజీ గారు అంటూ అతివినయం ప్రదర్శించటం ఎవ్వరి దృష్టినీ దాటిపోలేదు కూడా. కాకపోతే సీఎం రమేశ్ కాంగ్రెస్ పార్టీకి నిధులిచ్చాక పరిణామాలు వేగంగా మారాయి. కాంగ్రెస్‌లో షర్మిల పార్టీని విలీనం చేయటంతో పాటు ఆమెను కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా నియమించారు. నాటి నుంచీ ఆమె నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డినే టార్గెట్‌గా చేసుకుని రకరకాల విమర్శలు చేస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతకు కూడా తాను అండగా ఉన్నానని చెబుతూ... వివేకా హత్య విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డిపై విమర్శలకు దిగారు. ఒక దశలో వివేకా భార్యను గానీ, సునీతను గానీ కడపలో పోటీ చేయించాలని భావించి... ఇపుడు మాత్రం చంద్రబాబు సూచనలతో నేరుగా తానే పోటీక దిగే ప్రయత్నాలూ చేస్తున్నారు. కాకపోతే ఇప్పటిదాకా ఈ వ్యవహారాలపై ఎన్ని విమర్శలొచ్చినా కాంగ్రెస్‌తో తమకేం సంబంధమంటూ చంద్రబాబు దాటవేశారు. అటు కాంగ్రెస్ నేతలు కూడా ఇదే తరహాలో స్పందించేవారు. కాకపోతే సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నికల కమిషన్ ఎలక్టొరల్ బాండ్ల మొత్తం వివరాలన్నీ బయటపెట్టింది. ఎవరు కొన్నారు? ఏ పార్టీకి ఇచ్చారు? ఎంత ఇచ్చారు? అనే వివరాలన్నీ వెల్లడించటంతో... సీఎం రమేశ్ సంస్థ కాంగ్రెస్ పార్టీకి 30 కోట్లు ఇచ్చిన వ్యవహారం బట్టబయలయి... దొంగలు రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. ఇవీ.. బాండ్ నంబర్లు కాంగ్రెస్‌కు సీఎం రమేశ్ కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ ఇచ్చిన బాండ్ల నంబర్లు. ఒక్కొక్కటీ రూ.కోటి విలువ గల 30 బాండ్లను... అంటే రూ.30 కోట్లను కాంగ్రెస్‌కు అందజేశారు. 14402, 14412, 14414, 14416, 14418, 14420, 14422, 14424, 14426, 14427, 14429, 14431, 14433, 14435, 14437, 14439, 14441, 14443, 14445, 14447, 14449, 14451, 14454, 14456, 14458, 14460, 14462, 14464, 14466, 14477. -
బీటెక్ రవి వ్యవహారంలో ఆ బీజేపీ లీడర్‌కి ఏం పని?
సాక్షి ప్రతినిధి, కడప: రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీలో చేరిన టీడీపీ నేతలు సిగ్గు విడిచి ప్రవర్తిస్తున్నారు. విలువల్లేని రాజకీయాలు చేస్తూ నవ్వుల పాలవుతున్నారు. నవ్విపోదురుగాక...నాకేటి సిగ్గు అన్నట్లుగా కడప గల్లీలో టీడీపీ..ఢిల్లీలో బీజేపీ నేతగా చెలామణి అవుతున్నారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వ్యవహరిస్తున్న ధోరణితో ఇటు టీడీపీ, అటు బీజేపీ నాయకులు సైతం విస్తుపోతున్నారు. స్వప్రయోజనాలే పరమావధిగా కొనసాగేవారికి సీఎం రమేష్ నిదర్శనంగా నిలుస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. బీటెక్ రవి వ్యవహారంలో.. పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవిని ఓ కేసులో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌లో పెట్టారు. ఇటీ వల పరామర్శించిన బీజేపీ ఎంపీ రమేష్‌నాయుడు బీటెక్ రవిని పోలీసులు కిడ్నాప్ చేశారని, మీడియా వల్లే బతికిపోయారని చెబుతూనే పోలీసులు హింసించారని కూడా ఆరోపించారు. ఈ విషయమై ఎస్పీ సిద్ధార్థ కౌశల్ స్పందిస్తూ బీటెక్ రవిని 7.30 గంటలకు అరెస్టు చేస్తే, లీగల్ ఫార్మా లిటీస్ పూర్తి చేసి 10.30 గంటలకు మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చామన్నారు. 24గంటల్లో హాజరు పెట్టాల్సి ఉండగా తక్షణ నిర్ణయం తీసుకున్నామని వివరిస్తూనే, పోలీసులపై తప్పుడు ఆరోపణలు తగవని..చట్టపరిధిలోనే చర్యలు చేపట్టినట్లు వివరించారు. అయితే ఇదే విషయమై శనివారం ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ ఎస్పీకి తీరు సరిగా లేదంటూ హితబోధ చేశారు. కాగా జిల్లాలో బీజేపీ నేతలను ఏనాడూ పెద్దగా పట్టించుకోని సీఎం రమేష్ టీడీపీ నేత బీటెక్ రవి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడాన్ని పలువురు ఆశ్చర్యచకితులవుతున్నారు. టీడీపీకి కూడా తానే పెద్ద! బీటెక్ రవిని పోలీసులు హింసించి ఉంటే మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చేవాడు కదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.అవకాశమొస్తే పోలీసులను వదిలిపెడతాడా అంటున్నారు. అయి తే ఎంపీ రమేష్ జిల్లాలో టీడీపీకి తాను మాత్రమే పెద్దదిక్కు అన్నటు చెప్పుకోవడానికే ఈ వ్యవహారాన్ని వివాదస్పదం చేసినట్లు విశ్లేషకులు అంటున్నా రు.పైగా ఎంపీ రమేష్ సోదరుడు సురేష్ ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో టీడీపీ నేతను అరెస్టు చేస్తే, తా ను తప్ప మరెవ్వరూ ప్రొటెక్టు చేయలేకపోయారని చెప్పుకోవాలనే ఎంపీ ఇదంతా చేస్తున్నట్లు పరిశీలకులు వివరిస్తున్నారు. ప్రొద్దుటూరు టికెట్ కోసం తీవ్రయత్నం బీజేపీలో ఉంటూ ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ కోసం ఎంపీ రమేష్ కుటుంబం ప్రయత్నిస్తోంది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉంటున్న ఆయన సోదరుడు సురేష్‌ను ఈ మారు ప్రత్యక్ష ఎన్నికల్లో నిలపాలనే తపన మెండుగా ఉంది.అందుకు కారణం లేకపోలేదు. ఎంత డబ్బున్నా పోట్లదుర్తి నాయుళ్ల బలం పోట్లదుర్తికి ఎక్కువ.. ఎర్రగుంట్ల మండలానికి తక్కువ అనే విధంగా ఉంది. ఇదే విషయాన్ని అనేక పర్యాయాలు సీనియర్ నేత నంద్యాల వరదరాజులరెడ్డి లాంటి వారు ఎత్తిచూపారు. ఈమారు పోట్లదుర్తి నాయుళ్లకు ఉన్న డబ్బుతో ఆ మాట పోగోట్టుకోవాలనే తపన రమేష్‌నాయుడు కుటుంబంలో మెండుగా ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నా రు. ఆ మేరకే బీటెక్ రవి వ్యవహారంలో ఛీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. ఈ మొ త్తం వ్యవహారాన్ని పరిశీలిస్తున్న బీజేపీ సీనియర్ నేతలు సిద్ధాంతాలతో ముందుకొచ్చిన తమ పార్టీకి ఇదేం ఖర్మ అనుకుంటూ మధనపడుతున్నారు. -
నాపై ఆరోపణలు మాని.. ఆ పని చేస్తే మంచిది: సీఎం రమేష్
సాక్షి, న్యూఢిల్లీ: కొద్ది రోజుల క్రితం టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని మీడియాతో ఆఫ్ ది రికార్డు మాట్లాడుతూ తనపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఘాటుగా స్పందించారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఎంపీ కేశినేని నానిని ఉద్దేశిస్తూ పరోక్షంగా మండిపడ్డారు. ‘నాపై అసందర్భంగా, సత్యదూరమైన ఆరోపణలు.. కల్పితాలు ప్రచారం చేయడం మాని తమ కుటుంబ వ్యవహారాలు, వాళ్ల పార్టీలో లుకలుకలు సరిచేసుకోవడం మీద దృష్టిపెడితే మంచిదని సూచిస్తున్నాను. ఊహలకు, ఊహాజనిత వార్తలకు నిజాలు, ఆధారాలు అవసరం లేదు’ అని సీఎం రమేష్ తన ట్వీట్లో వెల్లడించారు. చదవండి: (BS Yediyurappa: కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప సంచలన నిర్ణయం!) -
బీజేపీలో దొరికిపోయిన టీడీపీ ఎంపీలు
-
ఫుట్ పాత్ ఆక్రమించిన ఎంపీ సీఎం రమేష్
-
హైదరాబాద్‌లో బరితెగించిన సీఎం రమేష్ అనుచరులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అనుచరులు బరితెగించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 66లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అక్రమ నిర్మాణానికి పాల్పడ్డాడు. అక్రమంగా నిర్మించిన ఇంటిని జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చే ప్రయత్నం చేశారు. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బందిని సీఎం రమేష్ అనుచరులు అడ్డుకున్నారు. ఈ ఘటన జరుగుతుండగానే సీఎం రమేష్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా, ఇప్పటికే కొంత భాగాన్ని కూల్చిన జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు సాయంతో మిగిలిన అక్రమ నిర్మాణాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చదవండి: (Revenue Deficit: రూ.9,871 కోట్ల నిధులను విడుదల చేసిన కేంద్రం) -
నిబంధనలను అతిక్రమించిన సీఎం రమేష్
సాక్షి, తిరుమల: బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సోమవారం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో చేతికి స్మార్ట్ వాచ్‌తో లోనికి ప్రవేశించడం వివాదాస్పదంగా మారింది. ఇక శ్రీవారిని దర్శించుకున్న సీఎం రమేష్‌కు వేద పండితులు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూకే నుంచి మన దేశానికి వచ్చిన కొందరికి కరోనా పాజిటివ్ రాగా, వారిలో కొత్త రకం వైరస్ లక్షణాలు ఉన్నాయన్నారు. ఈ క్రమంలో ప్రజలను, రాష్ట్రాన్ని కాపాడమని స్వామి వారిని ప్రార్థించినట్లు తెలిపారు. బీజేపీ పార్టీకి దేశమంతా మంచి ఫలితాలు వచ్చాయన్నారు. తిరుపతిలో జనసేన, బీజేపీ కలిసి పని చేస్తాయని స్పష్టం చేశారు. (చదవండి: శ్రీవారి సేవలో రాష్ట్రపతి కోవింద్) కాగా సీఎం రమేష్ చేతికి ఆపిల్ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచ్‌తో ఆలయంలోకి ప్రవేశించారు. టీటీడీ నిబంధనల ప్రకారం ఎలక్ట్రానిక్ వస్తువులు ఆలయంలోకి తీసుకువెళ్లరాదు. పైగా దేవాదాయశాఖ చట్టం ప్రకారం ఇది నేరం కూడా! అయితే సెక్యూరిటీ సిబ్బంది ఆయన స్మార్ట్ వాచ్‌తో వెళ్లడాన్ని పెద్దగా గమనించలేదు. అన్నీ తెలిసి కూడా సీఎం రమేష్ టీటీడీ నిబంధనలను అతిక్రమించడంపై భక్తులు మండిపడుతున్నారు. (చదవండి: సీఎం రమేశ్‌కు కరోనా పాజిటివ్) -
సీఎం రమేశ్‌కు కరోనా పాజిటివ్
సాక్షి, అమరావతి : బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆయనే స్వయంగా తన ట్విటర్లో వెల్లడించారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని... డాక్టర్ల సలహా మేరకు ఐసొలేషన్‌లో ఉన్నానని ట్వీట్ చేశారు. రమేశ్‌కు కరోనా సోకిందనే వార్తలతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కరోనా బారిన పడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.(తెలంగాణలో 75వేలు దాటిన కరోనా కేసులు) -
పీఎసీ డైరెక్టర్‌కు కరోనా.. సమావేశంలో సీఎం రమేష్
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశానికి హాజరైన పీఏసీ డైరెక్టర్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో పీఏసీ సమావేశానికి హాజరైన వారందరిని హోం క్వారంటైన్‌కు వెళ్లాల్సిందిగా పార్లమెంట్ మంగళవారం పిలుపు నిచ్చింది. ఈ సమావేశంలో ఎంపీ సీఎం రమేష్ కూడా పాల్గొన్నారు. అదే విధంగా జమ్మూ కశ్మీర్ బీజేపీ అధ్యక్షుడికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ హోం క్వారంటైన్‌కు వెళ్లారు. రెండు రోజుల క్రితం కశ్మీర్లో బీజేపీ అధ్యక్షుడిని కలిసినందున ఆయన క్వారంటైన్‌కు వెళ్లినట్లు ప్రకటించారు. చదవండి: ఆ దశకు భారత్ ఇంకా చేరుకోలేదు -
ఖజానా కొల్లగొట్టారు
సాక్షి, అమరావతి: ప్రజాధనాన్ని తమ వారికి దోచిపెట్టి కమీషన్లు వసూలు చేసుకోవడం కోసం గత ప్రభుత్వం ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనికట్టు చేసింది. పలు పథకాలకు సంబంధించి కంట్రోల్ బ్లాస్టింగ్ విధానంలో పనులు చేయాల్సిన అవసరం లేకున్నా, ఆ పద్ధతిలో పనులు చేయకుండానే చేసినట్లుగా చూపించి ఖజానాను కొల్లగొట్టింది. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం మొదటి దశకు సంబంధించిన 14 ప్యాకేజీల్లో మొత్తం రూ.109.7 కోట్లను కాంట్రాక్టర్లకు దోచిపెట్టినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో వెల్లడైంది. చంద్రబాబు బినామీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్‌కే రూ.37.76 కోట్ల మేర అదనపు ప్రయోజనం చేకూర్చినట్లు తేల్చింది. ఇక గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం మొదటి దశలో ఒక్క 26వ ప్యాకేజీలోనే రూ.46.45 కోట్లను కాంట్రాక్టు సంస్థకు దోచిపెట్టినట్లు స్పష్టం చేసింది. ఆ నిధులను తిరిగి రాబట్టడంతో పాటు, ఆ అక్రమాలకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. సాగునీటి ప్రాజెక్టుల పనులలో కఠినమైన బండరాళ్లను తొలగించేందుకు కంట్రోల్ బ్లాస్టింగ్ (పేలుళ్లు) చేయాల్సి వస్తే, అదనపు నిధులు చెల్లించాలన్న నిబంధన ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) విధానంలో ఎక్కడా లేదు. కానీ ఆ సాకు చూపి అదనపు బిల్లులు చెల్లించడానికి నవంబర్ 25, 2016న గత టీడీపీ ప్రభుత్వం సిద్ధమైంది. అదీ అప్పుడు జరుగుతున్న పనులకు కాదు. 2003 నుంచి 2014 దాకా చేసిన పనులతోపాటు, 2014 తర్వాత చేపట్టిన పనులకు కూడా అదనపు బిల్లులు చెల్లించేలా ఉత్తర్వు జారీ చేసింది. కంట్రోల్ బ్లాస్టింగ్ చేసినట్లుగా ఆర్డీవో స్థాయి అధికారి ధ్రువీకరిస్తే చాలని నిబంధన పెట్టింది. ఆ ఉత్తర్వును అడ్డుపెట్టుకుని అప్పటి ప్రభుత్వ పెద్దలు తమ వారికి అదనపు బిల్లుల రూపంలో భారీ ఎత్తున దోచిపెట్టారు. సీఎం రమేష్‌కు రూ.37.76 కోట్ల అదనపు లబ్ధి ఈ అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్పోర్స్మెంట్ దర్యాప్తు చేసింది. విచారణలో వెలుగుచూసిన అంశాలు.. - కంట్రోల్ బ్లాస్టింగ్ చేయకున్నా చేసినట్లు చూపి కాంట్రాక్టర్లకు అదనపు బిల్లులు చెల్లించినట్లు, డీ వాటరింగ్, పూడిక తీత తీయకున్నా– తీసినట్లుగా చూపించి బిల్లులు చెల్లించారు. నేల స్వభావాన్ని తప్పుగా వర్గీకరించి అదనపు ప్రయోజనాన్ని చేకూర్చారు. - హంద్రీ–నీవా మొదటి దశ ప్రధాన కాలువ (–1.150 కిమీ నుంచి 78.670 కిమీ వరకు) విస్తరణ పనుల్లో సీఎం రమేష్‌కు చెందిన కాంట్రాక్టు సంస్థ కంట్రోల్ బ్లాస్టింగ్ విధానంలో పనులు చేసిన దాఖలాలు లేవు. కంట్రోల్ బ్లాస్టింగ్ విధానంలో పని చేసినట్లు ఆర్డీవో నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోలేదు. అయినప్పటికీ సీఎం రమేష్‌కు 2018లో రూ.32.72 కోట్లను కట్టబెట్టారు. - హంద్రీ–నీవా తొలిదశలో 23వ ప్యాకేజీ (ప్రధాన కాలువ 3.4 కిమీ నుంచి 20 కిమీ వరకు తవ్వకం) పనుల్లో డీ వాటరింగ్, పూడిక తీతను సీఎం రమేష్ సంస్థ చేపట్టలేదు. 2005లో చేసిన ఆ పనులకు 2016లో డీవాటరింగ్.. పూడిక తీశారంటూ అదే ఏడాది రూ.94 లక్షలను ఆ సంస్థకు దోచిపెట్టారు. - హంద్రీ–నీవా తొలి దశలో 32వ ప్యాకేజీ (ప్రధాన కాలువ 115 కిమీ నుంచి 176 కిమీ వరకు తవ్వకం) పనులను 2005–2009 మధ్య పూర్తి చేశారు. అప్పట్లో సీఎం రమేష్ సంస్థ డీ వాటరింగ్, క్రాస్ బండ్స్ వేసి పనులు చేయలేదు. అయినా సరే 2016లో డీ వాటరింగ్, క్రాస్ బండ్స్ వేసి పనులు చేసినట్లు చూపి రూ.4.1 కోట్లను కట్టబెట్టారు. గాలేరు–నగరిలో రూ.46.45 కోట్లు... గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం తొలి దశలో 26వ ప్యాకేజీ (ప్రధాన కాలువ 25.067 కిమీ నుంచి 56.775 కిమీ వరకూ) పనులను 2005 నుంచి 2009 మధ్య పూర్తి చేశారు. అప్పట్లో కంట్రోల్ బ్లాస్టింగ్ విధానంలో పనులు చేయలేదు. డీ వాటరింగ్ చేయలేదు. అయినా సరే.. కంట్రోల్ బ్లాస్టింగ్, డీ వాటరింగ్ చేసినట్లు చూపి 2017లో కాంట్రాక్టర్‌కు రూ.46.45 కోట్లను దోచిపెట్టారు. -
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన సీఎం రమేష్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సోమవారం కలిశారు. ఫిబ్రవరి 7న తమ కుమారుడు రిత్విక్ వివాహానికి రావాల్సిందిగా ఆయన ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. కాగా ప్రముఖ పారిశ్రామికవేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజతో, రిత్విక్ నిశ్చితార్థం గత ఏడాది నవంబర్‌లో దుబాయ్ జరిగింది. కాగా ఇప్పటికే సీఎం రమేష్ తన కుటుంబసభ్యులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి, వివాహ ఆహ్వాన పత్రికను అందచేశారు. -
త్వరలో పాదయాత్ర: పరిపూర్ణానంద స్వామి
సాక్షి, తిరుమల: సంక్రాంతి తర్వాత ‘సేవ్ టెంపుల్స్’ పేరుతో పాదయాత్ర చేపడుతున్నట్లు పరిపూర్ణానంద స్వామి తెలిపారు. సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.50 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందని.. ఇలాంటి దేవస్థానంలో హిందూయేతరులు ఉండటం మంచి పద్ధతి కాదని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి హిందూ ఆలయాల్లో సమస్యలను తెలియజేస్తామని పరిపూర్ణానంద పేర్కొన్నారు. శ్రీవారిని దర్శించుకున్న సీఎం రమేష్ తిరుమల శ్రీవారిని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి అనుగుణంగా తాను కూడా సీఏఏకి మద్దతు తెలుపుతున్నానని వెల్లడించారు. సీఏఏపై అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇతర దేశాలలో ఉన్న హిందువులు వేధింపులకు గురవుతున్నారని తెలిపారు. ఇతర దేశాలలో ఉన్న హిందువులు భారత దేశానికి వస్తే..వారికి పౌరసత్వం ఇవ్వడం సిఏఏ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. -
గాలేరు–నగరి రెండో దశలో రూ.35.3 కోట్లు ఆదా
-
గాలేరు–నగరిలో రూ.35.3 కోట్లు ఆదా
సాక్షి, అమరావతి: గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం రెండో దశ తొలి ప్యాకేజీ పనులకు రూ.391.13 కోట్ల అంచనా వ్యయంతో గురువారం ప్రభుత్వం నిర్వహించిన రివర్స్ టెండరింగ్ విజయవంతం అయ్యింది. 5.04 శాతం తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థ ఆ పనులను దక్కించుకుంది. ఎన్నికలకు ముందు ఇదే పనులను 3.99 శాతం అధిక ధరకు తన బినామీ అయిన సీఎం రమేష్‌కు చెందిన సంస్థకు అప్పటి సీఎం చంద్రబాబు కట్టబెట్టారు. దీంతో అప్పట్లో ఖజానాపై రూ.15.60 కోట్ల భారం పడింది. ప్రస్తుతం వైఎస్సార్సీపీ సర్కారు ఈ పనులను రద్దు చేసి, తాజాగా టెండర్లు నిర్వహించి.. 9.03 శాతం తక్కువ ధరకే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించడం వల్ల ఖజానాకు రూ.35.3 కోట్లు ఆదా అయ్యాయి. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి 2 నెలల ముందు సీఎం రమేష్‌కు లబ్ధి చేకూర్చేంచేందుకు గాలేరు–నగరి రెండో దశలోని ఏడు ప్యాకేజీల కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి ఒప్పందాలను ‘ప్రీ–క్లోజ్’ చేసుకునేలా చంద్రబాబు చక్రం తిప్పారు. ఇదీ టెండర్ కథాకమామిషూ ►మొదటి ప్యాకేజీ (ప్రధాన కాలువ 32.64 కిలోమీటర్ల నుంచి 66.15 కిలోమీటర్ల వరకు తవ్వకం.. పది వేల ఎకరాలకు నీళ్లందించేలా పిల్ల కాలువలు తవ్వడం) పనుల వ్యయాన్ని 2018–19 ధరల ప్రకారం రూ.391.13 కోట్లుగా నిర్ణయించి గత ప్రభుత్వం లంప్సమ్–ఓపెన్ పద్ధతిలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ►తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థలపై సాంకేతిక కారణాలతో అనర్హత వేటు వేసేలా అధికారులపై ఒత్తిడి తెచ్చింది. ఈ వ్యవహారంపై కాంట్రాక్టు సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. న్యాయ విచారణ జరుగుతున్నా లెక్క చేయకుండా.. మొదటి ప్యాకేజీ పనులను 3.99 శాతం అధిక ధర (రూ.406.73 కోట్లు)కు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్‌కు అప్పగించారు. ►రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ హయాంలో టెండర్లు ఖరారు చేసి.. పనులు ప్రారంభించని కాంట్రాక్టు ఒప్పందాలను రద్దు చేసింది. గత ప్రభుత్వం నిర్ణయించిన రూ.391.13 కోట్ల విలువైన పనులకు ఈ నెల 2న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. గురువారం ఉదయం ప్రైస్ బిడ్ తెరవగా రెండు సంస్థలు షెడ్యూళ్లు దాఖలు చేశాయి. ►ప్రైస్ బిడ్, రివర్స్ టెండరింగ్‌లో 5.04 శాతం తక్కువ ధరకు (రూ.371.43 కోట్లు) కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించాలని సిఫార్సు చేస్తూ కమిషనర్ ఆఫ్ టెండర్స్(సీవోటీ)కు ప్రతిపాదనలు పంపుతామని ఎస్ఈ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. మొత్తమ్మీద 9.03 శాతం తక్కువ ధరలకే ప్రస్తుతం కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించనున్నారు. దీని వల్ల ఖజానాకు రూ.35.3 కోట్లు ఆదా అయ్యాయి. ఇప్పటి దాకా రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా అయిన మొత్తం రూ.1567.89 కోట్లకు చేరింది. -
టీడీపీ నేతల అండతో.. కొలువు పేరిట టోకరా..!
► ప్రొద్దుటూరుకు చెందిన జి.రాజశేఖర్, రాజుపాలెంకు చెందిన సురేష్‌తోపాటు జిల్లా వ్యాప్తంగా వందలాది మంది ఓ మహిళకు ఉద్యోగాల కోసం అడ్వాన్సుల కింద లక్షలు చెల్లించారు. కోటి రూపాయలకుపైనే వసూలు చేసినట్లు బాధితులు పేర్కొంటున్నారు. ఏ ఒక్కరికీ ఉద్యోగం లేదు. ఒక్కపైసా తిరిగి ఇవ్వలేదు ► పులివెందులకు చెందిన ప్రదీప్ సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం రూ.3 లక్షలు ముట్టజెప్పాడు. కడపలోని ఆయనకు తెలిసిన మురళీకృష్ణ ఆచారి ద్వారా ఈ మొత్తాన్ని ఉద్యోగం ఇప్పిస్తానన్న మహిళకు అందజేశాడు. ఏడాది అవుతున్నా అతనికి జాబు రాలేదు. డబ్బులు ఇచ్చిన వ్యక్తి ద్వారా జాబు విషయమై పలుమార్లు మహిళతో మాట్లాడారు. జాబు ఇప్పించలేదు..డబ్బు ఇవ్వలేదు.. చివరకు ఐపీ నోటీసు అందింది. ► ప్రొద్దుటూరుకు చెందిన సుధాకర్ సర్వశిక్ష అభియాన్‌లో సీఆర్పీ ఉద్యోగం కోసం సదరు మహిళకు రూ. 50 వేలు ముట్టజెప్పారు. ఉద్యోగం వచ్చిన తర్వాత మిగిలిన రూ. 2 లక్షల మొత్తాన్ని చెల్లిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు. అతనికి ఉద్యోగం ఇవ్వలేదు..డబ్బులూ ఇవ్వలేదు.. తీరా చూస్తే ఐపీ నోటీసు వచ్చింది. ► మండల కేంద్రమైన రాజుపాలెంకు చెందిన నాగ సురేంద్ర ఆంధ్రాబ్యాంకులో అటెండర్ ఉద్యోగం కోసం సదరు మహిళకు రూ. లక్ష ముట్టజెప్పారు. ఏడాదైనా జాబు లేదు.. డబ్బులు తిరిగి ఇవ్వలేదు.. ఇప్పుడు ఆయనకు ఐపీ నోటీసు వచ్చింది. ► కడపకు చెందిన ఆరూరు అశ్విని సీఎం రమేష్ పీఏ సుధాకర్ సూచనతో సర్వశిక్ష అభియాన్‌లో కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ పోస్టు కోసం రూ.80 వేలకు ఒప్పందం చేసుకున్నారు. అడ్వాన్స్ కింద రూ.50 వేలు ముట్టజెప్పారు. జాబు వచ్చిన మరుక్షణమే మిగిలిన రూ.30 వేలు చెల్లించేలా మాట్లాడుకున్నారు. రూ.50 వేల మొత్తాన్ని అశ్విని బావ ఏఎం కొండయ్య ద్వారా సదరు మహిళకు ముట్టజెప్పారు. జాబు లేదు...డబ్బులు ఇవ్వలేదు. చివరకు ఐపీ నోటీసు వచ్చింది. సాక్షి ప్రతినిధి కడప : కడపకు చెందిన ఓ మహిళ గత ప్రభుత్వంలో సర్వశిక్ష అభియాన్‌తోపాటు సాఫ్ట్వేర్, బ్యాంకుఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఆశచూపి జిల్లా వ్యాప్తంగా పలువురి వద్ద కోట్లలో వసూళ్లకు పాల్పడింది. ఎస్ఎస్ఏలో సీఆర్పీ ఉద్యోగానికి రూ.3 లక్షలకు బేరం కుదుర్చుకుంది. రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు అడ్వాన్సులు తీసుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం పలువురి నుంచి రూ.3 లక్షలకు తక్కువ లేకుండా వసూలు చేసింది. బ్యాంకు ఉద్యోగాలంటూ కొందరి నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేసింది. కడప నగరంతోపాటు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాజుపాలెం, బద్వేలు, పులివెందుల, కమలాపురం, మైదుకూరు ప్రాంతాల్లో పలువురు నిరుద్యోగుల వద్ద పెద్ద మొత్తంలో వసూలు చేసింది. ఈ మొత్తం కోట్లలోనే ఉంటుందని బాధితులు చెబుతున్నారు. అప్పట్లో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మాజీమంత్రి ఆదినారాయణరెడ్డితోపాటు పలువురు టీడీపీ నేతలు ఉద్యోగాల కోసం సదరు మహిళకు సిఫార్సు చేస్తూ పలువురిని పంపారు. వారంతా ఆ మహిళకు డబ్బులు ముట్టజెప్పారు. టీడీపీ నేతల అండతోనే సదరు మహిళ వసూళ్ల దందాకు దిగినట్లు తెలుస్తోంది. జిల్లాలో ముఖ్య అధికారుల పేర్లను సైతం వాడి ఆ మహిళ నిరుద్యోగులను మోసగించినట్లు తెలుస్తోంది. బాధితుల సొమ్ముతో సదరు మహిళ కార్లు, ఇతర వాహనాలు కొనుగోలు చేసి దర్పం వెలగబెడుతోంది. కడప నగరంలో ధనిక వర్గం ఉండే ప్రాంతంలో విలాసవంతమైన జీవితాన్ని వెలగబెడుతోంది. డామిట్ కథ అడ్డం తిరిగింది ప్రభుత్వం మారడంతో సదరు మహిళ బండారం బయటకు పొక్కింది. ఉద్యోగం ఇప్పించక, తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు కొందరు నిలదీశారు. డబ్బులు కట్టాలంటూ ఒత్తిడి తెచ్చారు. తన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు ఆమె కొత్త ఎత్తుగడకు తెరలేపింది. వారిని వంచించేందుకు ఐపీని ఆయుధంగా వాడింది. బాధితుల్లో 16 మంది వద్ద పలు వ్యాపారాల పేరుతో అప్పులు చేసినట్లు చూపించి ఐపీ నోటీసులు పంపింది. దీంతో బిత్తర పోయిన బాధితులు ఆ మహిళను సంప్రదించారు. తాను డబ్బులిచ్చేది లేదంటూ సదరు మహిళ ఎదురు బెదిరింపులకు దిగింది. చేసేది లేక బాధితులంతా లబోదిబోమంటున్నారు. ఉద్యోగం కోసం ఆమెకు డబ్బులు ఇచ్చిన కొందరు ముఖ్యులకు మాత్రం కొంతలో కొంత డబ్బులు చెల్లిస్తానని, గొడవ చేయవద్దని సర్దుబాటు ప్రయత్నానికి దిగింది. చాలాకాలంగా ఇదే చెబుతున్నా డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వడం లేదని ముఖ్యులైన బాధితులు కొందరు ‘సాక్షి’కి తెలిపారు. ఆమెపై ఫిర్యాదు చేసేందుకు కొందరు బాధితులు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన వచ్చిన తర్వాత కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్దమయ్యారు. జిల్లా ఎస్పీకి సైతం రాత పూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు వారు సిద్దమయ్యారు. ఈ సందర్బంగా పలువురు పాత్రికేయులను కలిసి మహిళ దోపిడీని వివరించారు. ఉద్యోగం వస్తుందన్న ఆశతోనే డబ్బులు ఇచ్చామని వారు వాపోయారు. సీఎం రమేష్ పీఏ సూచనతోనే ఆలూరి అశ్విని ఉద్యోగం కోసం డబ్బులు ముట్టజెప్పినట్లు ఆమె బావ ఏఎం కొండయ్య ‘సాక్షి’ ముందు వాపోయారు. సమీప బంధువులు సీఎం రమేష్ ఇంటిలో పనిచేస్తారని, వారి సూచన మేరకే మహిళకు డబ్బులు ముట్టజెప్పినట్లు చెప్పారు. మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి సిఫార్సు చేయడంతోనే ఉద్యోగం కోసం రూ. లక్ష మహిళకు ముట్టజెప్పినట్లు బాధితుడు వివరించారు. టీడీపీ నేతల అండతోనే మహిళ కోట్లలో వసూలు చేసిందని వారంతా వాపోతున్నారు. అధికారులు స్పందించి ఉద్యోగాల పేరుతో కోట్లు వసూళ్లకు పాల్పడిన మహిళపై తగు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. -
టీడీపీ నేతల అవినీతి కేంద్రంగా పోలవరం!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వరప్రదాయిని పోలవరం ప్రాజెక్టు తెలుగుదేశం హయాంలో అవినీతి సుడిగుండంలో ఇరుక్కుపోయింది. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలనే లక్ష్యంతో కాకుండా అందినకాడికి దోచుకోవాలనే లక్ష్యంతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సంకల్పించింది. జాతీయ హోదా దక్కించుకున్న పోలవరం ప్రాజెక్టు ఖర్చును కేంద్రం భరిస్తోంది, కానీ నిర్మాణ బాధ్యతలను రాష్ట్రమే చేపట్టడంతోనే అవినీతికి బీజం పడింది. చంద్రబాబు తన అనుయాయులకు, తెలుగుదేశం నాయకులకు ప్రాజెక్టు పనులను అప్పగించి అవినీతికి తెరతీశారు. ఈ నేపథ్యంలోనే పోలవరం ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీ నేతలకు ఏటీఎంలా మారిందని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే రాజమహేంద్రవరం ఎన్నికల సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ కూడా ఈ ప్రాజెక్టు పనుల్లో వేల కోట్ల అవినీతి జరిగిందని నిర్ధారించింది. వేగంగా పూర్తి చేసేందుకే రివర్స్ టెండరింగ్.. పోలవరం ప్రాజెక్టు ద్వారా డబ్బు దండుకోవాలనే తప్ప.. సకాలంలో ప్రాజెక్టును పూర్తిచేయడంపై చంద్రబాబు ప్రభుత్వం శ్రద్ధ వహించలేదు. ఈ ప్రాజెక్టు పనులను ఇకపై వేగంగా ముందుకు సాగాలనే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిపుణుల కమిటీని వేసి టీడీపీ హయాంలో జరిగిన అవినీతి వెలికి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టు ద్వారా 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు, 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, 80 టీఎంసీల గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజ్ ఎగువన కృష్ణా నదికి తరలించటం, 23.44 టీఎంసీల నీటిని విశాఖపట్నం నగర తాగునీటి అవసరాల నిమిత్తం తరలించటం, పోలవరం కాలువకు ఆనుకుని ఉన్న 540 గ్రామాల్లోని 28.5 లక్షల మంది ప్రజల దాహార్తిని తీర్చేందుకు తలపెట్టారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టును తెలుగుదేశం పార్టీ కేవలం తమ ఆర్థిక ప్రయోజనాల నేపథ్యంలోనే చూస్తూ.. అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మార్చింది. దీంతో ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తి కాలేదు. 2018 ఖరీఫ్ నాటికే రైతులకు నీళ్లిస్తానని చెప్పిన చంద్రబాబు.. ఆ తర్వాత డెడ్ లైన్‌ను మారుస్తూ వెళ్లారు. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేందుకు ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ను చేపట్టింది. అవినీతి బైటపడుతుందని టీడీపీ భయం.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టును తొలుత రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ దక్కించుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా కేంద్రం పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని తమకు అప్పగిస్తే శరవేగంతో పూర్తి చేస్తామని హామీనిచ్చింది. 2018లో తొలి పంటకు నీరిస్తామని, రాసుకోండి అని ప్రజలకు స్పష్టమైన హామీనిచ్చారు. అయితే చంద్రబాబు హడావుడి తప్ప ప్రాజెక్టు పనుల్లో సరైన పురోగతి కనిపించలేదు. పోలవరానికి సంబంధించిన ప్రధాన పనులన్నీ ఇప్పటికే పెండింగ్ లోనే ఉండటం ఖర్చు మాత్రం వేలకోట్లలో అవుతుండటంతో తాజాగా అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం నిజాలను తేల్చేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలనే ఉద్ధేశ్యంతో రివర్స్ టెండరింగ్‌కు వెళుతోంది. ఈ పద్ధతిలో ఎవరు అతి తక్కువ ధరలకు ప్రాజెక్టును నిర్మిస్తామని ముందుకు వస్తే వారికే పనులను అప్పగిస్తారు. రివర్స్ టెండరింగ్‌తో ప్రభుత్వంపై భారం కూడా తగ్గుతుంది. ఒకవేళ ఈ విధానం విజయవంతమైతే తాము చేసిన తప్పు, ముఖ్యంగా పోలవరం పేరుతో చేసిన దోపిడీ ఎక్కడ బైటకు వస్తుందోనన్న ఉద్ధేశ్యంతో ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతుందని చెప్తూ టీడీపీ నేతలు ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ అస్మదీయులకే పనులు... పోలవరం ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టును దక్కించుకున్న టీడీపీ నేత రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ కంపెనీ ఆర్ధికంగా దివాళా తీయటంతో తన అనుయాయులు, బినామీలను చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనుల్లోకి జొప్పించారు. ఈ ప్రాజెక్టు పనులను చంద్రబాబు ముఖ్య బినామీగా పేరుపడ్డ సీఎం రమేష్‌కు సన్నిహిత కంపెనీగా పేరుపడ్డ త్రివేణీ సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ద్వారా కట్టబెట్టారు. ఈ కంపెనీ చంద్రబాబు బినామీ అని రాజకీయ, ఇన్ఫ్రా కంపెనీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. పోలవరం కుడి, ఎడమ కాలువ పనులను కూడా ప్యాకేజీలుగా విభజించి చంద్రబాబు తనవారికి కట్టబెట్టారు. పార్టీలో కీలక స్థానంలో ఉండటంతోపాటు టీడీపీ ప్రభుత్వంలో రెండో స్థానంలో ఉన్న యనమల రామకృష్ణుడు.. తన వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్‌కు వంద కోట్ల విలువైన పనులను కట్టబెట్టారు. ఒకపక్క ప్రభుత్వ ఆర్దిక పరిస్థితి బాగా లేదని చెప్పిన యనమల మాత్రం తన వియ్యంకుడి కంపెనీ బిల్లులు వస్తే మాత్రం వెంటనే క్లియర్ చేసేవారు. రాజు తచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు టీడీపీ నేత బిల్లు పోవరం ప్రాజెక్టుకు సంబంధించి చాలా వేగంగా చెల్లించటంలో యనమల ఆర్ధికమంత్రిగా ఉన్న సమయంలో ఆరి తేరిపోయారు. అప్పటి ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్‌కు టీడీపీ ప్రభుత్వం పోలవరం ఎడమ కాలువ అయిదో ప్యాకేజ్‌లో రూ. 142 కోట్ల విలువైన పనులను కట్టబెట్టారు. ఇదే కాలువ ఆరో ప్యాకేజీ పనులను టీడీపీ తూర్పు గోదావరి జిల్లా నేత సుధాకరరావుకు అప్పగించారు. దీని విలువ 179 కోట్లు. ఇక చంద్రబాబు బినామీగా పేరు గాంచిన ప్రస్తుత బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ప్రవేశపెట్టిన త్రివేణీ సంస్థకు అత్యధికంగా రూ. 1708 కోట్ల విలువైన హెడ్ వర్క్స్ మట్టి పనిని కట్టబెట్టారు. పోలవరం కుడి కాలువ ఆరు, ఏడు ప్యాకేజీ పనులను టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్యకు చెందిన బీఎస్పీసీఎల్ కంపెనీకి అప్పగించారు. ఈ పనుల విలువ 286 కోట్లు. సూర్య కన్స్ట్రక్షన్స్ శ్రీనివాసరావుకు రూ. 103 కోట్ల పనులు అప్పగించారు. అధికారికంగా కాగితాలపై ఉన్న కంపెనీలు ఇవైతే అనధికారికంగా ఇంకా ఎన్ని ఉన్నాయో చెప్పలేని పరిస్థితి. అవకతవకలు నిజమేనని తేల్చిన కమిటీ.. పోలవరం ప్రాజెక్టులో అవకతవకలు నిజమేనని ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తేల్చింది. మొబిలైజేషన్ అడ్వాన్స్ చెల్లింపు ఇస్టానుసారం చేస్తున్నారని, మట్టి పనిని ఎం బుక్‌లో రికార్డ్ చేయలేదని కమిటీ తన నివేదికలో పేర్కొంది. పోలవరం ప్రాజెక్ట్‌లో 2015-16 ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం రూ. 1331 కోట్ల భారం పడింది. ప్రధాన కాంట్రాక్టర్ మొబిలైజేషన్ అడ్వాన్స్ లపై వడ్డీ 84.43 కోట్లు తిరిగి వసూలు చేయాల్సి ఉంది. ఇంప్రెస్ట్ కింద ప్రధాన కాంట్రాక్టర్ కు చెల్లించిన రూ.141.22 కోట్లు రికవరీ చేసుకోవాల్సి ఉంది. స్థలం స్వాధీనం చేయకముందే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మాణానికి చెల్లించిన అడ్వాన్సులు 787.20 కోట్లు తిరిగి రాబట్టాలి. మొత్తంగా రూ.2400 కోట్లు అదనంగా చెల్లించారు. -
పార్టీ మారినా.. ఆగని నాయకుల వర్గపోరు
సాక్షి, కడప : టీడీపీని వీడి బీజేపీలో చేరాలనుకున్న మాజీమంత్రి ఆదినారాయణరెడ్డికి భంగపాటు ఎదురవుతోంది. ఆయన చేరికయత్నాలను రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వ్యతిరేకిస్తున్నారు. టీడీపీకి గుడ్‌బై చెప్పి భారతీయ జనతా పార్టీలో చేరిన సీఎం రమేష్ మాజీ మంత్రి రాకుండా అడ్డుపడుతున్నట్లు తెలిసింది. రమేష్ ధోరణి వల్లే బీజేపీలో ఆది చేరిక వాయిదా పడుతున్నట్లు సమాచారం. పార్టీలో చేరక ముందే మొదలైన ఈ రచ్చ జిల్లా బీజేపీ నేతలకు తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. సీఎం రమేష్‌ను కాదని ఆదిని పార్టీలో చేర్చుకున్నా ఇరువురి ఆధిపత్య పోరు కమలం పార్టీకి ఇబ్బందులు తేవడం ఖాయమని ఆ పార్టీనేతలు భావిస్తున్నారు. ఇదే జరిగితే టీడీపీ తరహాలో బీజేపీ జనంలో పలచన అవుతుందని ఆందోళన చెందుతున్నారు. తొలినాళ్లనుంచే ప్రత్యర్థులే.. టీడీపీలో ఉంటున్నప్పుడు సీఎం రమేష్‌కు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డితో సత్సంబంధాలు లేవు. జిల్లాలో ఆదిపత్యం కోసం ఇరువురు సై అంటే సై అనేవరకూ వచ్చింది. దీంతో టీడీపీ పరువు బజారుకెక్కింది. సీఎం రమేష్‌ను టీడీపీలో అడ్డుకునేందుకు ఆది శతవిధాల ప్రయత్నించారు. కొత్తగా చేరిన ఆది పెత్తనాన్ని వ్యతిరేకించిన రమేష్ అడుగడుగునా అడ్డుపడ్డారు. కాంట్రాక్ట్ పనులు ..ఉపాధి నిధుల పంపిణి, నీరు చెట్టు పనుల కేటాయింపుతో మొదలు గత ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల కేటాయింపు వరకూ ఇరువురి మద్య పోరు నడిచింది. చంద్రబాబు స్థాయిలో చక్రం తిప్పిన సీఎం రమేష్ ఆదికి దాదాపు అడ్డకట్ట వేశారని టీడీపీ శ్రేణులు చెబుతాయి. గత ఎన్నికల్లో జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ తనకే కావాలంటూ ఆది పట్టుబట్టగా సీఎం రమేష్ అడ్డుపడ్డారు. రామసుబ్బారెడ్డి పేరును ఖరారు చేసేందుకు పావులు కదిపారు. తరువాత ఆదిని పార్లమెంట్ నుండి పోటీచేయించేందుకు సిద్దపడేలా చేశారు. తాను కడప పార్లమెంట్‌కు పోటీ చేయాలంటే అసెంబ్లీ స్థానాలు తాను చెప్పిన అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని ఆది పట్టుబట్టారు. ప్రధానంగా ప్రొద్దుటూరు,కమలాపురం,మైదుకూరు,కడప తదితర స్థానాలు తాను సూచించినవారికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీకోసం పనిచేసిన వారికే టికెట్ ఇవ్వాలని రమేష్ ఆది ప్రతిపాదనకు అడ్డుపడ్డారు. గతంలో ఇరువురి మధ్య వివాదాలు పతాక స్థాయికి చేరాయి గత ఎన్నికల్లో టీడీపీఘోర పరాభవం పొందిన నేపథ్యంలో అధికారం లేకుండా మనుగడ సాగించలేమని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ భావించారు. టీడీపీకి గుడ్‌బై చెప్పి ఇటీవలే బీజేపీలో చేరారు. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిదీ ఇదే పరిస్థితి. వైఎస్సార్సీపీ లో చేర్చుకునే పరిస్థితి లేకపోవడంతో బీజేపీ మినహా మరోమార్గం లేదని ఆయన భావించారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఆశీస్సులతో బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారు. పలుమార్లు బీజేపీ నేతలను కలిశారు. తాజాగా గురువారం ఢిల్లీకి వెళ్లి పార్టీ ముఖ్యనేత సమక్షంలో ఆది పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ అనూహ్య పరిణామాల మధ్య ఆది బీజేపీలో చేరలేపోయారని చర్చ నడుస్తోంది. ఆయన్ను బీజేపీ లోకి రాకుండా సీఎం రమేష్ అడ్డు పడుతున్నారని ప్రచారం గుప్పుమంది. ఆది వస్తే మళ్లీ ఆదిపత్య పోరాటం తప్పదని.. ముందే. అడ్డుకోవడం మేలని భావించిన సీఎం రమేష్ అందుకు అనుగుణంగా పావులు కదిపినట్లు భోగట్టా. ఆది కడపలో శనివారం బీజేపీలో చేరేఅ వకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆది చేరికపై సీఎం రమేష్ అభ్యంతరం చెబుతున్న నేపథ్యంలో బీజేపీకి తలనొప్పులు ఖాయమని ఆ పార్టీ నాయకులు కలవరపడుతున్నట్లు తెలిసింది. ఇలాంటి నేతలను పార్టీలోకి తెచ్చుకొని పార్టీని బలోపేతం చేసుకోవడం అటుంచితే ముక్కలు చేసుకున్నట్లు అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
చట్టం.. వారికి చుట్టం
సాక్షి, కడప : అవి కుల వృత్తులు చేసుకుంటూ జీవించే నిరుపేదలకు దక్కాల్సిన సర్వీస్ ఇనాం భూములు. ఎంతో విలువైనవి కావడంతో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కుటుంబీకుల కన్ను పడింది. ఇంకేముంది....తమ రాజకీయ పలుకుబడిని వినియోగించారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు చట్టాన్ని చుట్టచుట్టి ప్రక్కన పెట్టి వాటిని వ్యవసాయేతర అవసరాలకు మళ్లిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. పూర్వం గ్రామాల్లో కుల వృత్తులు ఉండేవి. ప్రజలకు ఆయా సేవలు అందించే వీరి జీవనోపాధి కోసం అప్పటి రాజులు కొన్ని భూములను ఇనాములుగా కేటాయించారు. కుల వృత్తి నిర్వహిస్తున్నంత కాలం ఆ భూములను సాగు చేసుకునే హక్కు వారికి ఉంటుంది. వీటిని సర్వీసు ఇనాములుగా పరిగణిస్తారు. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలో కూడా ఇలాంటి సర్వీస్ ఇనాం భూములు ఉన్నాయి. ఆ గ్రామానికి చెందిన చరణ్‌తేజ నాయుడు సతీమణి జ్యోతి తేజస్వి కొన్ని సర్వే నెంబర్లలోని 12ఎకరాల 60 సెంట్ల వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు బదలాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలంటూ రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం కన్వర్షన్ ఫీజు కింద రూ.3,74,814 చెల్లిస్తూ 2015 నవంబరు 20వ తేదిన చలానాలు కట్టారు. ప్రభుత్వ బేసిక్ వాల్యూ ప్రకారం ఎకరా 3,30,000 రూపాయలు చేస్తుంది. బహిరంగ మార్కెట్లో అనధికారికంగా ఈ భూముల విలువ ఇంకా అధికంగానే ఉంటుందన్నది నిర్వివాదాంశం. ఈ ఫైలు అప్పటి కలెక్టర్ కేవీ రమణ వద్దకు వెళ్లింది. రీ సర్వే అండ్ రీసెటిల్మెంట్ రిజిష్టర్ ప్రకారం అర్జీదారు పొందుపరిచిన సర్వే నెంబర్లలో కొన్ని పట్టా భూములు కాగా, మరికొన్ని సర్వీస్ ఇనామ్ భూములు ఉన్నాయని కలెక్టర్ గుర్తించారు. సర్వీస్ ఇనాం భూములను వ్యవసాయేతర అవసరాలకు మళ్లించడం వీలు కాదని కలెక్టర్ స్పష్టం చేశారు. గవర్నమెంటు అమెండ్మెంట్ యాక్ట్, 16/2013 ప్రకారం సర్వీస్ ఇనాం భూములు బదలాయించరాదని పేర్కొంటూ ఆ ప్రతిపాదనలు తిరస్కరించారు. పట్టా భూములు ఉన్నట్లయితే పరిశీలించి కొత్తగా ప్రతిపాదనలు తయారు చేసి పంపాలంటూ కలెక్టర్ 2015 డిసెంబరు 14వ తేది కడప ఆర్డీఓకు ఆదేశాలు జారీ చేశారు. బదలాయించిన భూములు దరఖాస్తుదారు ప్రతిపాదించిన సర్వే నెంబర్లలో మొత్తం 13.15 ఎకరాల భూమి ఉండగా, అందులో 12.62 ఎకరాల వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు బదలాయిస్తూ 2016 జనవరిలో అప్పటి ఆర్డీఓ చిన్నరాముడు ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ఇందులోని సర్వే నెంబరు 840, 841, 847, 849, 851, 859లలోని భూములు ఆర్ఎస్ఆర్ ప్రకారం సర్వీస్ ఇనాంలు. ఎంతో విలువైన ఇలాంటి భూములు అక్రమార్కుల పాలిట కాకుండా రెవెన్యూ ఉన్నతాదికారులు, విజిలెన్స్ అధికారులు నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లు దరఖాస్తుదారైన జ్యోతి తేజస్వి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు స్వయాన అన్న సురేష్నాయుని కోడలు. తమకున్న రాజకీయ బలంతో అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. అప్పటి ఎర్రగుంట్ల తహసీల్దార్ హడావుడిగా 2015 డిసెంబరు 31వ తేది పై అధికారులకు నివేదిక పంపారు. భూమి బదలాయింపు ప్రతిపాదన ఫైలు తిప్పి పంపిన కలెక్టర్ కేవీ రమణ నెలన్నర రోజులకే మనసు మార్చుకోవాల్సి వచ్చింది. ఏపీ ల్యాండ్ కన్వర్షన్ యాక్ట్–2006 ప్రకారం సదరు ప్రతిపాదనల ఆమోదానికి చర్యలు చేపట్టాలని 2016 జనవరి 30వ తేది కడప ఆర్డీఓకు ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. ఒక అధికారి చట్టంలోని నిబంధనలను పేర్కొంటూ తిరస్కరించిన ప్రతిపాదనలను అప్పీలేట్ అథారిటీ రద్దు చేయవచ్చు. కానీ అలాంటిదేమీ లేకుండానే కలెక్టర్ తాను తిరస్కరించిన ప్రతిపాదనలను తానే ఆమోదం తెలుపడం వెనుక చాలా కథే నడించిదంటున్నారు. ల్యాండ్ కన్వర్షన్ ప్రక్రియ ప్రారంభించాలంటూ కలెక్టర్ కడప ఆర్డీఓకు జారీ చేసిన ఉత్తర్వుల్లోని సూచికలో గతంలో అదే ఫైలును ఎందుకు తిరస్కరించిందీ, ఇప్పుడు ఎందుకు ఆమోదించారో కారణాలు తెలుపకపోవడం గమనార్హం. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఒక స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ అలా జరగలేదంటే అప్పటి అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ఏ మేరకు పనిచేశాయో అర్థమవుతోంది. ఈ సందర్బంగా గుర్తొచ్చే విషయం ఏంటంటే గతంలో ఇదే పోట్లదుర్తి గ్రామంలోని ప్రభుత్వ భూముల్లో కల్యాణ మండపాలు నిర్మించారు. ఇందుకు సంబంధించి రెవెన్యూ అధికారులపై ఛార్జెస్ ఫేమ్ అయ్యాయి. రెవెన్యూ ఇన్స్పెక్టర్ మొదలు తహసీల్దార్ వరకు పది మందిపై అభియోగాలు ప్రభుత్వ స్థాయిలో పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. -
సీఎం రమేష్ అక్రమాలకు చెక్
గత ప్రభుత్వ హయాంలో భారీగా అంచనాలు పెంచుకొని గాలేరు–నగరి ఫేజ్–2 పనుల్లో కోట్లలో లబ్ధి పొందాలనుకున్న సీఎం రమేష్ (రిత్విక్ కంపెనీ)కు ప్రస్తుత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌తో అడ్డుకట్ట వేసింది. టీడీపీ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టి కాంట్రాక్టర్లు పోటీకి రాకుండారూ.794 కోట్ల గాలేరు–నగరి పనులను రిత్విక్ కంపెనీ అధిక రేట్లకు దక్కించుకుంది. పని కోసం సదరు కంపెనీ జలవనరుల శాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడి పెట్టినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో హడావుడిగా గత ప్రభుత్వం పనులను సీఎం రమేష్ కంపెనీకి కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అధిక రేట్లకు పనులు అప్పగించడంతో సుమారు రూ.80 కోట్ల మేర ప్రభుత్వ ధనం దుర్వినియోగమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో వైఎస్ జగన్ ప్రభుత్వం గాలేరు–నగరి టెండర్లను సమీక్షించింది. పనుల్లో అక్రమాలు జరిగినట్లు నిర్ధారించుకుంది. వెంటనే సదరు పని టెండర్లను రద్దు చేయాలని జలవనరులశాఖ అధికారులను ఆదేశించింది. ఈనెల మొదటి వారంలో టెండర్లు పిలిచి పనుల వేగవంతానికి సిద్ధమవుతోంది. సాక్షి, కడప : జిల్లాలో గాలేరు–నగరి పనులకు సంబంధించి రూ.795 కోట్లు పనులను గత ప్రభుత్వం ఎన్నికల చివరి నిమిషంలో అప్పటి టీడీపీ నేత సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ కంపెనీకి కట్టబెట్టింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి వారం రోజులముందు పెంచిన అంచనా వ్యయంతో రెండు ప్యాకేజీల పనులకు అప్పటి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. పనులు దక్కించుకునేందుకు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్టు పావులు కదిపింది. అప్పటి సీఎం చంద్రబాబు పేషీ నుంచి జలవనరులశాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చింది. అంతకుముందే టెండర్లలో పాల్గొనకుండా మిగిలిన కాంట్రాక్టర్లను సైతం బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పటి సీఎం సైతం జలవనరులశాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి పనులను రిత్విక్‌కు కట్టబెట్టడంలో కీలక భూమిక పోషించారనే ఆరోపణలున్నాయి. అంతకుముందే గాలేరు–నగరిసుజలస్రవంతి రెండోదశ మొదటి ప్యాకేజీ ప్రధాన కాలువ 32.64కిమీ నుంచి 66.150 కి మీ వరకూ తవ్వాల్సి ఉంది. 10 వేల కరాలకు నీళ్లదించే డిస్ట్రిబ్యూటరీల ఏర్పాటు పనుల్లో 2014 నాటికి ుూ.69.89 కోట్ల విలువైన పనులు మిగిలాయి. రెండవ ప్యాకేజీ ప్రధాన కాలువ 66.15 కిమీ నుండి 96.50 వరకూ తవ్వకం చేపట్టాల్సి ఉంది. 12 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీలు ఏర్పాటు చేయాలి. రూ.110 కోట్ల పనులు చేస్తున్న కాంట్రాక్టర్ ను బెదిరించి ఒప్పందం రద్దుకు (ప్రీ–క్లోజర్) గత సర్కార్ దరఖాస్తు చేయించింది. దీనిపై జలవనరుల శాఖతో ఆమోదముద్ర వేయించిన చంద్రబాబు 2018–19 ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్) ఆధారంగా మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచారు. ఎన్నికల నోటిఫికేషన్ రెండు నెలల ముందు గాలేరు–నగరి రెండోదశ మొదటి ప్యాకేజీ పనులకు రూ. 391.31 కోట్లఅంచనాతో ప్రిబ్రవరి 11 ఎల్ఎస్(లంప్సమ్)–ఓపెన్ పద్ధతిలో గత ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 25న టెక్నికల్ బిడ్ తెరిచారు. రిత్విక్ ప్రాజెక్ట్, ఎన్సీసీ, ఎమ్మార్కేఆర్, ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్స్ షెడ్యూల్లు్న దాఖలు చేశాయి. ఇందులో ఎమ్మార్కేఆర్,ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్స్ కు అర్హతలున్నా షెడ్యూళ్లపై అనర్హత వేటు వేశారు. కోటరీలోని ఎన్సీసీ, రిత్విక్ ప్రాజెక్ట్ కంటే ఎక్కువ ధరకు షెడ్యూల్ దాఖలు చేసేలా పావులు కదిపారు. ఖజానాకు రూ. 54.74 కోట్లు మిగిలేవి ఈ టెండర్ల వ్యవహారం కేసు కోర్టు విచారణలో ఉండగానే చంద్రబాబు ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఫిబ్రవరి, 26న ఫైనాన్స్ బిడ్ ఓపన్ చేశారు. సీఎం రమేష్ సంస్థ 3.99 శాతం, ఎక్సెస్ (406.73 కోట్లు), ఎన్సీసీ 4.65 శాతం ఎక్సెస్ 409.50 కోట్లకు టెండరు దాఖలు చేశారు. వీటిని ప్రిబ్రవరి 28 సీవోటీ పరిశీలనకు పంపగా ఒత్తిళ్లకు తలొగ్గి అదే రోజు టెండర్‌ను ఆమోదించారు. సాధారణ పరిస్థితుల్లో టెండర్ నిర్వహించి ఉంటే కనీసం10 శాతం తక్కువకే పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చేవారు. అప్పుడు ఖజానాకు రూ. 54.74 కోట్లు మిగిలేవి. ఇదే పద్ధతిలో రెండో ప్యాకేజీ పనులకు రూ.343.52 కోట్ల అంచనాతో ఎల్ఎస్–ఓపెన్ విధానంతో నోటిఫికేషన్ జారీ చేయించి 4.76 శాతం అధిక ధరలకు సీఎం రమేష్ కు కట్టబెట్టారు. దీనివల్ల ఖజానాపై ’ 50.70 కోట్ల భారం పడింది. ఇప్పుడు ప్రజాధనం ఆదా రివర్స్ టెండరింగ్‌తో ప్రజాధనం ఆదా కానుంది. గాలేరు–నగరి పనులను జగన్ ప్రభుత్వం ఇటీవలనే సమీక్షించింది. గత ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో అక్రమాలు జరిగా యని నిర్దారణకు వచ్చింది. జలవనరుల శాఖ ప్రత్యేఖ అధికారి ఆదిత్యానాథ్ దాస్ ఎన్నికల ముందు టెండర్ల ద్వారా అప్పగించిన గాలేరు–నగరి మొదటి, రెండు ప్యాకేజీల కాంట్రాక్ట్ ఒప్పందాలను రద్దు చేయాలని ఆదేశించారు. ఆ రెండు ప్యాకేజీలకు గతంలో నిర్ణయించిన అంచనా విలువనే కాంట్రాక్ట్ విలువగా నిర్ణయించి ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పోటీ పడేలా నిబంధనలు సడలించారు. రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ మొదటి వారంలో గాలేరు–నగరి రెండు ప్యాకేజీలకు రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. దీనివల్ల భారీగా ప్రజాధనం ఆదా అవుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్యాకేజీ–1లో పనులు ఇలా ప్యాకేజీ–1 పరిధిలో 66.15వ కిలోమీటరు యు.రాజుపాలెం (పెండ్లిమర్రి మండలం) నుండి 94.561 కిలోమీటరు గంగనపల్లె వరకు 28.4 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ పనులు మిగిలి ఉన్నాయి. వీటితోపాటు 52 స్ట్రక్చర్లు, బ్రిడ్జిలు, యూటీ తదితర పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్యాకేజీ–2కు సంబంధించి 32.640 కిలోమీటరు సర్వేరాయసాగర్ నుండి 66.150 కిలోమీటరు నందిమండలం వరకు 33.510 కిలోమీటరు మేర ప్రధాన కాలువ ఉంది. ఈ పనుల్లో కొంతమేర అక్కడక్కడ గతంలోపనిచేసి ఉన్నారు. పాత అంచనాల ప్రకారం రూ.129.94 కోట్ల పనులకుగాను రూ.57.77 కోట్లు కాంట్రాక్టర్లు బిల్లులు చేసుకోగా, ఇంకా రూ.72.71 కోట్ల బ్యాలెన్స్ వర్క్ మిగిలి ఉంది. కొత్త అంచనాల ప్రకారం రూ. 391.13 కోట్లకు పనులు పెరిగాయి. ప్రస్తుతం ప్రధాన కాలువతోపాటు 70 స్ట్రక్చర్స్ నిర్మించాల్సి ఉండగా, వీటి పరిధిలో రెండు మాత్రమే నిర్మించారు. ఈ కాలువ పరిధిలో ముద్దనూరు, వీఎన్‌పల్లె, వేముల, ఎర్రగుంట్ల ప్రాంతాల్లో 10 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి రావాల్సి ఉంది. -
టెండర్లలో గోల్మాల్..
-
గాలేరు–నగరిలో రివర్స్ టెండరింగ్
సాక్షి, అమరావతి: గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం రెండో దశ పనుల ప్రక్షాళన, అవినీతి నిర్మూలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు సిద్ధమైంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి వారం రోజుల ముందు పెంచిన అంచనా వ్యయంతో రెండు ప్యాకేజీల పనులను సీఎం రమేష్ సంస్థకు అప్పగిస్తూ ఒప్పందం కుదుర్చుకునేలా నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు జలవనరుల శాఖపై ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో ఈ రెండు ప్యాకేజీల పనులను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వీటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని ఆదేశించింది. దీనివల్ల భారీ ఎత్తున ప్రజాధనం ఆదా అవుతుందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. బెదిరించి ప్రీ క్లోజర్! గాలేరు–నగరి సుజల స్రవంతి రెండో దశలో మొదటి ప్యాకేజీ(ప్రధాన కాలువ 32.64 కి.మీ. నుంచి 66.150 కి.మీ. వరకు తవ్వకం, పది వేల ఎకరాలకు నీళ్లందించి మిగతా డిస్ట్రిబ్యూటరీల ఏర్పాటు) పనుల్లో 2014 నాటికి రూ.69.89 కోట్ల విలువైన పనులు మాత్రమే మిగిలాయి. రెండో ప్యాకేజీ (ప్రధాన కాలువ 66.15 కి.మీ. నుంచి 96.50 కి.మీ. వరకు తవ్వకం, 12 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీల ఏర్పాటు)లో రూ.110 కోట్ల విలువైన పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ను బెదిరించి ఒప్పందం రద్దు (ప్రీ–క్లోజర్) కోసం గత సర్కారు దరఖాస్తు చేయించింది. దీనిపై జలవనరులశాఖతో ఆమోదముద్ర వేయించిన చంద్రబాబు 2018–19 ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్) ఆధారంగా మిగిలిపోయిన పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేయించారు. టెండర్లలో గోల్మాల్.. ఎన్నికల నోటిఫికేషన్‌కు రెండు నెలల ముందు గాలేరు–నగరి రెండో దశ మొదటి ప్యాకేజీ పనులకు రూ.391.31 కోట్ల అంచనా వ్యయంతో ఫిబ్రవరి 11న ఎల్ఎస్(లంప్సమ్)–ఓపెన్ పద్ధతిలో గత ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫ్రిబవరి 25న టెక్నికల్ బిడ్ తెరిచారు. రిత్విక్ ప్రాజెక్ట్స్, ఎన్సీసీ, ఎమ్మార్కేఆర్, ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్స్ షెడ్యూళ్లను దాఖలు చేశాయి. ఇందులో ఎమ్మార్కేఆర్, ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్స్కు అర్హతలున్నా షెడ్యూళ్లపై అనర్హత వేటు వేశారు. కోటరీలోని ఎన్సీసీ.. రిత్విక్ ప్రాజెక్ట్స్ కంటే ఎక్కువ ధరకు షెడ్యూలు దాఖలు చేసేలా చక్రం తిప్పారు. దీనికి సంబంధించిన కేసు కోర్టులో విచారణలో ఉండగానే అప్పటి సీఎం చంద్రబాబు ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు గత ఫిబ్రవరి 26న ఫైనాన్స్ బిడ్ ఓపెన్ చేశారు. సీఎం రమేష్ సంస్థ 3.99 శాతం ఎక్సెస్ (406.73 కోట్లు), ఎన్సీసీ 4.65 శాతం ఎక్సెస్ (రూ.409.50 కోట్లు)కు కోట్ చేస్తూ షెడ్యూలు దాఖలు చేసినట్లు వెల్లడైంది. వీటిని ఫిబ్రవరి 28న సీవోటీ పరిశీలనకు పంపగా ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలకు విరుద్ధంగా అదే రోజు టెండర్‌ను ఆమోదించింది. సాధారణ పరిస్థితుల్లో టెండర్ నిర్వహించి ఉంటే కనీసం పది శాతం తక్కువకే పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు వచ్చేశారు. అప్పుడు ఖజానాకు రూ.54.74 కోట్ల మేర మిగిలేది. ఇదే పద్ధతిలో రెండో ప్యాకేజీ పనులకు రూ.343.52 కోట్ల అంచనా వ్యయంతో ఎల్ఎస్–ఓపెన్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయించి 4.76 శాతం అధిక ధరలకు సీఎం రమేష్ సంస్థకే కట్టబెట్టారు. దీనివల్ల ఖజానాపై రూ.50.70 కోట్ల భారం పడింది. రివర్స్ టెండరింగ్‌తో ప్రజాధనం ఆదా గాలేరు–నగరి సుజల స్రవంతి రెండో దశ పనులను ఇటీవల సమీక్షించిన జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్.. ఎన్నికల ముందు టెండర్ల ద్వారా అప్పగించిన మొదటి, రెండు ప్యాకేజీల కాంట్రాక్టు ఒప్పందాలను రద్దు చేయాలని ఆదేశించారు. ఆ రెండు ప్యాకేజీలకు గతంలో నిర్ణయించిన అంచనా విలువనే కాంట్రాక్టు విలువగా నిర్ణయించి అధిక సంఖ్యలో కాంట్రాక్టర్లు పోటీ పడేలా నిబంధనలు సడలించి రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబరు మొదటి వారంలో గాలేరు–నగరి రెండు ప్యాకేజీలకు రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. దీనివల్ల భారీగా ప్రజాధనం ఆదా అవుతుందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
‘జ్యోతి ప్రజ్వలన’పై సీఎం రమేశ్‌కు గట్టి కౌంటర్
సాక్షి, అమరావతి : అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డల్లాస్‌లో తెలుగు కమ్యూనిటీ ఆఫ్ నార్త్ అమెరికా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని.. ప్రవాస తెలుగువారిని ఉద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సభలో జ్యోతి ప్రజల్వన చేయడానికి నిరాకరించి.. హిందువులను కించపరిచారంటూ బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ట్విటర్ వేదికగా దుష్ర్పచారానికి ఒడిగట్టారు. ఇటీవలే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఆయన ట్విటర్లో చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. జ్యోతి ప్రజ్వలన విషయమై ప్రజలను తప్పుదోవ పట్టించేవిధంగా సీఎం రమేశ్, బీజేపీ శ్రేణులు చేసిన ట్వీట్లపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. సీఎం రమేశ్ అజ్ఞానంతో, హిందువులను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునే దురుద్దేశంతో ఈ ఆరోపణలు చేశారని నెటిజన్లు అంటున్నారు. నిజానికి అమెరికాలోని స్టేడియంలలో జ్యోతి ప్రజ్వలన లాంటిది చేయనివ్వరని, అగ్నిప్రమాదాలు జరిగే అవకాశముండటంతో స్డేడియం లోపల లైటర్ కానీ, అగ్గిపెట్టెను కానీ వాడటానికి సెక్యూరిటీ సిబ్బంది అనుమతించబోరని, అయినా, మైదానంలోకి ప్రవేశించే ముందే సీఎం వైఎస్ జగన్‌కు వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారని, వారి నుంచి హారతి తీసుకొని, బొట్టు పెట్టుకొని ఆయన స్టేడియంలోకి ప్రవేశించారని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు. గతంలోనూ పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ జ్యోతి ప్రజ్వలన చేసిన ఫొటోలు, వీడియోలు పోస్టు చేసి.. సీఎం రమేశ్ దుష్ప్రచారాన్ని బట్టబయలు చేస్తున్నారు. సీఎం రమేశ్‌కు కౌంటర్ సీఎం రమేశ్ ఆరోపణలపై వైఎస్సార్సీపీ ఎన్నారై వింగ్ అధ్యక్షుడు కడప రత్నాకర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అమెరికాలోని స్టేడియంల లోపల జ్యోతి వెలిగించడానికి అక్కడి భద్రతా సిబ్బంది అనుమతివ్వలేదని, స్టేడియం లోపల ఎలాంటి నిప్పు వెలిగించరాదని కఠిన నిబంధనలు ఉన్నాయని ఆయన తెలిపారు. అందుకే స్డేడియంలో వేదిక మీద ఉన్న ఎలక్ట్రికల్ క్యాండిల్స్ వెలిగిస్తున్నట్లు చంద్రబాబులా వైఎస్ జగన్ యాక్టింగ్ చేయలేదని వివరించారు. అందుకే స్టేడియం లోపలికి వెళ్లేముందే సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు చేసి లోపలికి వచ్చారని తెలిపారు. కానీ కావాలని బీజేపీ, టీడీపీ నేతలు ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భక్తి, మతం ముసుగులో రాజకీయాల కోసం మాఫియా ముఠాలు చెలరేగుతున్నాయని, వీరిని అరికట్టకపోతే మతాన్ని భ్రష్టుపట్టిస్తారని ఆయన మండిపడ్డారు. -
జంపింగ్ టీడీపీ ఎంపీలపై కేశినేని నాని సెటైర్స్
సాక్షి, అమరావతి : పార్టీ ఫిరాయించిన టీడీపీ రాజ్యసభ ఎంపీలపై ఆపార్టీ ఎంపీ కేశినాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రవేశపెట్టిన 2019–20 బడ్జెట్‌ను ఉద్దేశిస్తూ.. జంపింగ్ ఎంపీలు సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్‌లకు ట్విటర్ వేదికగా చురకలంటించారు. ‘మీరేదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి బీజేపీలోకి వెళ్తున్నామని బిల్డప్ ఇచ్చారు. కానీ, నిన్న బడ్జెట్ చూసాక ఈ రాష్ట్ర ప్రజలకు బాగా అర్థమైంది. ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి బీజేపీలోకి వెళ్లారో లేక మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి చేరారో’ అంటూ ట్వీట్ చేశారు. తన మాజీ సహచరులపై విమర్శనాత్మక ధోరణిలో కేశినేని నాని చేసిన ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. @YSChowdaryMP@CMRamesh_MP@TGVenkatesh మీరేదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి BJP లోకి వెళుతున్నామని బిల్డప్ ఇచ్చారు. కానీ, నిన్న బడ్జెట్ చూసాక ఈ రాష్ట్ర ప్రజలకు బాగా అర్ధమయ్యింది, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి BJP లోకి చేరారో లేక మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోడానికి BJP లోకి చేరారో pic.twitter.com/NgUbJUiecw — Kesineni Nani (@kesineni_nani) July 6, 2019 -
చంద్రబాబు బినామీ సీఎం రమేష్
సాక్షి, లక్కిరెడ్డిపల్లె(కడప) : చంద్రబాబు బినామీ సీఎం రమేష్ నాయుడు అని జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. తిరుమల పాదయాత్ర సందర్భంగా బుధవారం తెల్లవారుజామున ఆయన మండలంలోని కోనంపేట నుంచి బయల్దేరారు. పాదయాత్ర లక్కిరెడ్డిపల్లె చేరుకోగానే మహిళలు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి హారతులతో స్వాగతం పలికారు. మండలంలోని మూడు రోడ్ల కూడలిలో బాణసంచా పేల్చారు. గజమాలతో సుధీర్‌రెడ్డిని ఘనంగా సత్కరించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ‘జోహార్ వైఎస్సార్’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మర్రిచెట్టు శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి స్వామిని దర్శించుకున్నారు. అక్కడే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మళ్లీ వైఎస్సార్ పాలన వచ్చిందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన 20ఏళ్లపాటు కొనసాగాలని, వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షిస్తూ తిరుమలకు పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ పాలన అంతా దొంగలమయమన్నారు. కేంద్ర మంత్రిగా పని చేసిన సుజనా చౌదరి, సీఎం రమేష్ తదితరులు చంద్రబాబు బినామీగా పని చేస్తూ ఆయన ఆస్తులను కాపాడేందుకు బీజేపీలోకి జంప్ అయ్యారని విమర్శించారు. అధికారం లేకపోతే అరగంట కూడా ప్రతి పక్షంలో ఉండలేరన్నారు. ఇంకా 16 మంది టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారనేది బహిరంగ రహస్యమేనని ఆయన పేర్కొన్నారు. టీడీపీని స్థాపించిన మహనీయుడు ఎన్టీఆర్ ఏ లోకంలో ఉన్నాడో ఆయన ఆత్మ క్షోభించక తప్పదన్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ ఖాళీ అయిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత జిల్లా కావడంతో అన్ని విధాలా అభివృద్ధి జరుగుతుందన్నారు. వైఎస్సార్ హయాంలో నిలిచిన కాలువల పనులను పూర్తి చేయించి సాగు నీటిని అందిస్తామన్నారు. వైఎస్ జగన్ సహకారంతో ఆరు నెలల్లోపు బ్రహ్మణి ఉక్కును ప్రారంభించి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. గండికోట ముంపు గ్రామాలలోని 7 గ్రామాలకు రూ.10లక్షలు పరిహారం అందజేస్తామన్నారు. జిల్లా వాసులు జగనన్నపై చూపిన అభిమానానికి వారి రుణం తీర్చుకునేందుకు కృషి చేస్తామన్నారు. -
కేసుల భయంతోనే!
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేతకు కుడి, ఎడమలుగా చెప్పుకునే ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు ముందస్తు ప్రణాళికలో భాగంగానే బీజేపీలో చేరినట్లు తెలుగు తమ్ముళ్లే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఈడీ, ఆదాయపన్ను కేసులతోపాటు రాజధానిలో కొనుగోలు చేసిన రూ.వందల కోట్ల విలువైన భూములను కాపాడుకోవడానికే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పంచన చేరారంటున్నారు. బ్యాంకుల నుంచి రూ.6,000 కోట్ల మేర రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ పూర్తి ఆధారాలను సేకరించడంతో అరెస్ట్‌ల భయంతోనే ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి సుజనా చౌదరి ఢిల్లీ పెద్దలతో చర్చలు జరిపినట్లు ఆ పార్టీ నేతలు అంటున్నారు. దొంగ కంపెనీల పేరు మీద తీసుకున్న రూ.364 కోట్ల రుణాలు ఎటువంటి వ్యాపార లావాదేవీలు జరపకుండానే హైదరాబాద్‌లోని వైస్రాయ్ హోటల్‌కు చేరినట్లు ఈడీ దర్యాప్తులో తేలడంతో వైస్రాయ్ హోటల్‌కు చెందిన రూ.315 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. ఇప్పుడు ఈ మొత్తం వైస్రాయ్ హోటల్ నుంచి చివరకు ఎక్కడకు చేరిందన్న అంశం వెల్లడి కావాల్సి ఉంది. ఈ కేసులో ఇక అరెస్ట్ తప్పకపోవడంతో పాటు కుంభకోణం వెనుక ఉన్న పెద్ద వ్యక్తులు బయటకు వస్తారన్న భయంతోనే బీజేపీ పెద్దలు అమిత్ షా, రాంమాధవ్‌లతో సంప్రదింపులు జరిపారని, దీనికి ప్రధాని మోదీ ఆమోదముద్ర వేయడంతో సుజనా చౌదరి బీజేపీలో చేరారంటున్నారు. సీఎం రమేష్ కూడా రిత్విక్ ఇన్ఫ్రా పేరిట దొంగ ఇన్వాయిస్లు సృష్టించి రూ.800 కోట్ల నిధులను డొల్ల కంపెనీల ద్వారా దారి మళ్లించినట్లు ఐటీ శాఖ అధికారులకు స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఈ కేసులో సీఎం రమేష్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు అరెస్ట్ చేయడమే మిగిలింది. రాజధానిపై విచారణ భయంతో.. రాజధానిగా అమరావతిని ప్రకటించడం వెనుక పెద్ద ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ఆరోపణలు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోళ్లు, కేటాయింపులపై సమీక్ష చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో బాబు బినామీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రాజధాని ప్రాంతం వివరాలను చంద్రబాబు ముందుగానే తన అనుయాయులకు లీక్ చేసి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయించినట్లు ఆరోపణలు రావడం తెలిసిందే. రాజధాని ప్రకటన వెలువడక ముందే సుజనా చౌదరి 700 ఎకరాలు, సీఎం రమేష్ 500 ఎకరాల వరకు బినామీల పేరుతో కొనుగోలు చేసినట్లు తెలుగు తమ్ముళ్లే బహిరంగంగా చెబుతున్నారు. టీజీ వెంకటేష్, గరికపాటి మోహనరావులు కూడా రాజధానికి చుట్టుపక్కల పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. వీరి వ్యాపారాలు కూడా ప్రస్తుతం సమస్యల్లో ఉన్నాయి. ఇప్పుడు రాజధాని భూములపై విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయన్న భయం వీరిని వెంటాడుతోంది. -
తెలుగుదేశం పార్టీలో ముసలం..
సాక్షి , ఏలూరు : తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టింది. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్ధం పుచ్చుకోగా, కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కాకినాడలో రహస్య సమావేశం నిర్వహించడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఓటమిపాలైన కాపు సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు 14 మంది కాకినాడలో సమావేశం అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఇందులో జిల్లా నుంచి ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి, తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని, నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరపరాజయం నేపథ్యంలో వీరు భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. తెలుగుదేశంలో కొనసాగాలా, లేక పార్టీ మారాలా అన్న విషయంపై చర్చ జరిపినట్లు సమాచారం. అందరూ ఒకే నిర్ణయంపై ఏ పార్టీలోనైనా చేరాలని భావిస్తున్నట్లు తెలిసింది. శుక్రవారం వీరు కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంతో చర్చించిన తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడిస్తారని సమాచారం. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడంపై కూడా చర్చ జరిగింది. అయితే వారు మాత్రం తాము పార్టీ మారడం లేదని, ఎన్నికల్లో ఓటమి కారణాలపై చర్చించామని చెబుతున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు రహస్య సమావేశం ఏర్పాటు చేసుకుని ఓటమిపై చర్చించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు రాజ్యసభలో టీడీఎల్పీ బీజేపీలో విలీనం అయ్యింది. ఎంపీ సుజనా చౌదరి నేతత్వంలో టీడీపీ రాజ్యసభ సభ్యులు గురువారం సాయంత్రం టీడీపీ లెజిస్లేటివ్ పార్టీనీ బీజేపీలో విలీనం చేస్తూ తీర్మానం లేఖను ఉప రాష్ట్రపతికి అందజేశారు. ఈ తీర్మానం ప్రతిపై ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి రాంమ్మోహన్రావు సంతకం చేశారు. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు, పార్టీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతా రామలక్ష్మి చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. తెలుగుదేశం ఎంపీలతోపాటు సీతా రామలక్ష్మి కూడా బీజేపీలో చేరతారని వార్తలు వెలువడ్డాయి. అయితే చివరి నిముషంలో ఆమె తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుని వెనక్కి తగ్గారు. దీంతో టీడీపీ రాజ్యసభ సభ్యుల్లో ప్రస్తుతానికి సీతా రామలక్ష్మితో పాటు రవీంద్రకుమార్ మాత్రమే మిగిలారు. తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు సర్వత్రా చర్చకు దారితీశాయి. -
బీజేపీలో చేరిన నలుగురు టీడీపీ ఎంపీలు
-
బీజేపీలో చేరిన నలుగురు టీడీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ : టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు గురువారం బీజేపీలో చేరారు. తెలుగుదేశం ఎంపీలైన సుజనా చౌదరి, గరికపాటి మోహన్‌రావు, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ గురువారం సాయంత్రం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో వీరి చేరికల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా వారికి పార్టీ కండువా కప్పి.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీడీపీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసినట్టు ప్రకటించారు. అయితే, కాలికి గాయం కావడంతో గరికపాటి మోహన్‌రావు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదని, కానీ, బీజేపీలో చేరేందుకు సమ్మతి తెలుపుతూ ఆయన కూడా పత్రం పంపించారని, దీంతో ఆయనను కూడా పార్టీలోకి చేర్చుకుంటున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. మోదీ నాయకత్వంలో దేశాభివృద్ధి, ప్రగతి.. అమిత్ షా నేతృత్వంలో బీజేపీ సాధిస్తున్న విజయాలను చూసి.. ఏపీ ప్రయోజనాల కోసం బీజేపీ చేరాలని చాలాకాలంగా నలుగురు టీడీపీ ఎంపీలు భావిస్తూ వచ్చారని, ఇందులో భాగంగా టీడీపీ రాజ్యసభా పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తామని తమను వారు కోరారని తెలిపారు. ఇందుకు ప్రధాని మోదీ, అమిత్ షా సమ్మతించారని, ఈ మేరకు విలీన పత్రాన్ని ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి అందజేశామని తెలిపారు. విలీనం పూర్తికావడంతో ఇకపై వీరు బీజేపీ ఎంపీలుగా మారిపోయారని తెలిపారు. బీజేపీ సానుకూల రాజకీయాలను విశ్వసిస్తోందని, సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్కా విశ్వాస్ అన్న నినాదం ధ్యేయంగా తాము ముందుకు సాగుతామన్నారు. వీరి చేరికల వల్ల ఏపీలో బీజేపీ బలోపేతం అవుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. సుజనా చౌదరి మాట్లాడుతూ.. ఇటీవల ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రజల అభీష్టం ఎలా ఉందో స్పష్టమైందని, దీనిని గమనించి.. దేశ నిర్మాణంలో భాగం కావాలని, ఏపీ ప్రయోజనాల కోసం కృషి చేయాలని తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అంతకుముందు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడును టీడీపీ ఎంపీలు కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ రాజ్యసభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్టు నలుగురి సంతకాలతో కూడిన లేఖను రాజ్యసభ చైర్మన్‌కు అందజేశారు. జాతి ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలు తమను ఆకర్షించాయని, అందువల్ల ఆయన నాయకత్వంలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తమ లేఖలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ 4వ పేరాగ్రాఫ్‌లో పేర్కొన్న అంశాలను అనుసరించి తమ పార్టీ సభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు తెలిపారు. నలుగురు ఎంపీలు బీజేపీలో చేరడంతో రాజ్యసభలో టీడీపీ దాదాపు ఖాళీ అయింది. రాజ్యసభలో టీడీపీకి ప్రస్తుతం సీతారామలక్ష్మీ, రవీంద్రకుమార్ మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
భారీ షాక్; రాజ్యసభలో టీడీపీ ఖాళీ!
సాక్షి, న్యూఢిల్లీ : మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా మారింది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ఎన్నికల్లో ఘోర పరాభవం నుంచి తేరుకోకముందే ఆ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు ఆ పార్టీని వీడారు. రాజ్యసభ సభ్యులు ఎంపీలు సుజనా సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహనరావు బీజేపీలో చేరనున్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిశారు. ఈ సందర్భంగా రాజ్యసభలో తమను ప్రత్యేక బృందంగా గుర్తించాలని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడుకు విఙ్ఞప్తి చేశారు. ఈ మేరకు నలుగురి సంతకాలతో కూడిన లేఖను రాజ్యసభ చైర్మన్‌కు అందజేశారు. జాతి ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలు తమను ఆకర్షించాయని లేఖలో పేర్కొన్నారు. ఈ కారణంగా ఆయన నాయకత్వంలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ 4 వ పేరగ్రాఫ్లో పేర్కొన్న అంశాలను అనుసరించి తమ పార్టీ సభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీకి ఇక ఇద్దరు రాజ్యసభ సభ్యులు మాత్రమే మిగిలారు. కాగా విజయవాడ ఎంపీ కేశినేని కూడా టీడీపీని వీడి బీజేపీలో చేరతారని ఢిల్లీ వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా... తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో టీడీపీ కాపు నేతలు రహస్యంగా సమావేశమైన సంగతి తెలిసిందే. దాదాపు 20 మంది మాజీ ఎమ్మెల్యేలు ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే పార్టీ ఓటమికి గల కారణాలను సమీక్షించేందుకే సమావేశమయ్యామని వారు చెబుతున్నా.. పార్టీలో అంతర్గత సంక్షోభానికి ఇది నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అదే విధంగా చంద్రబాబు సూచనల మేరకే తాజా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
టీడీపీలో భారీ సంక్షోభం!
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీలో ముసలం మొదలైంది. నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీకి వీడనున్నారని ఢిల్లీ నుంచి తాజా సమాచారం. బీజేపీలో చేరే యోచనలో ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహనరావు రాజ్యసభలో తమను ప్రత్యేక బృందంగా గుర్తించాలని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడిని స్వయంగా కలిసి కోరనున్నారు. దీనిపై ఈ సాయంత్రానికి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. తోట సీతారామలక్ష్మి కూడా టీడీపీని వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. టీడీపీ రాజ్యసభ సభ్యుల్లో రవీంద్రకుమార్ మినహా మిగిలిన వారందరూ బీజేపీలో చేరాలని నిర్ణయించినట్లు సమాచారం. విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా బీజేపీలో చేరతారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు రహస్యంగా సమావేశమయ్యారు. దాదాపు 20 మంది మాజీ ఎమ్మెల్యేలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో దేని గురించి చర్చించారనేది వెల్లడి కాలేదు. (చదవండి: నిట్టనిలువుగా చీలనున్న టీడీపీపీ) -
అంచనాల్లోనే వంచన!
సాక్షి, కర్నూలు సిటీ : ఇటీవలి ఎన్నికల ముందు వరకు టీడీపీ నాయకులు ఆడిందే ఆట..పాడిందే పాట. ప్రభుత్వ నిబంధనలు సైతం వారికి అనుకూలంగా మారుతూ వచ్చేవి. ప్రజాశ్రేయస్సు, అభివృద్ధిలో పారదర్శకత అనేవి ఏ కోశానా ఉండేవి కాదు. ఇక సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఇష్టారాజ్యం నడిచింది. అంచనాలు అమాంతం పెరిగిపోయేవి. తమ వారికి పనులు దక్కేలా టెండర్ నిబంధనలను ఎలా పడితే అలా మార్చేసే వారు. అధికార అండతో పనులు దక్కించుకుని రూ.కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారు. తెలుగు గంగ లైనింగ్ పనుల విషయంలోనూ ఇదే తరహా దోపిడీకి ఎత్తుగడ వేశారు. అమాంతం పెరిగిన అంచనాలు తెలుగుగంగ ప్రాజెక్టు కింద జిల్లాలో 1.14 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రధాన కాలువ ప్రారంభం నుంచి 18.20 కి.మీ. వరకు లైనింగ్, 18.20 కి.మీ నుంచి 42.566 కి.మీ. వరకు గతంలో లైనింగ్ చేయని పనుల పూర్తి, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ (బీసీఆర్) నుంచి వెలుగోడు రిజర్వాయర్ వరకు 7.380 కి.మీ మేర లైనింగ్ పనులు చేపట్టాలని నిర్ణయించారు. 2014 ఉత్తర్వుల ప్రకారం ఈ పనుల విలువ రూ.172.99 కోట్లు మాత్రమే. అయితే.. 2018 మార్చి 9న జారీ చేసిన ఉత్తర్వుల్లో రూ.180.48 కోట్లుగా అప్పటి ప్రభుత్వం ఖరారు చేసింది. అంతటితో వ్యవహారం ఆగలేదు. స్వయాన అప్పటి సీఎం చంద్రబాబు ఇంజినీర్లపై ఒత్తిడి చేసి మరీ అంచనాలను రూ.280.27 కోట్లకు పెంచేలా చేశారు. ఈ మేరకు 2018 జూన్ 8వ తేదీన ఉత్తర్వులు ఇచ్చారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే అంచనాలను ఏకంగా రూ.99.79 కోట్లు పెంచారంటే గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల్లో దోపిడీకి ఏ స్థాయిలో గేట్లు ఎత్తిందో అర్థం చేసుకోవచ్చు. అంచనాల పెంపునకు జల వనరుల శాఖ ఇంజినీర్లు కొందరు అభ్యంతరం చెప్పినా ఆనాడు చంద్రబాబు ఏ మాత్రమూ పట్టించుకోలేదన్న విమర్శలు వచ్చాయి. రూ.7 కోట్లతో అయ్యే పనులకు రూ.12.16 కోట్లు తెలుగుగంగ ప్రధాన కాలువకు 18.20 కి.మీ. వరకు మాత్రమే కొత్తగా లైనింగ్ చేపట్టాల్సి ఉంది. ఆ తర్వాత 18.20 కి.మీ. నుంచి 42.566 కి.మీ. మధ్యలో కేవలం 800–900 మీటర్లు, బీసీఆర్ నుంచి లింక్ చానల్(వెలుగు రిజర్వాయర్ వరకు ఉన్న కాలువ)లో 650 మీటర్లు మాత్రమే లైనింగ్ పనులు చేయాల్సి ఉంది. మొత్తం 19.650 కి.మీ. పొడవు మాత్రమే లైనింగ్ చేయాలి. వాస్తవానికి కి.మీ. లైనింగ్ పనులకు రూ.7 కోట్లకు మించి ఖర్చు కాదని ఇంజినీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. కానీ అప్పటి ప్రభుత్వం ఏకంగా రూ.12.16 కోట్లు కేటాయించింది. దీంతో పాటు కాంట్రాక్టర్‌కు జీఎస్టీ, లేబర్ సెస్, సీనరేజీ చార్జీల రూపంలో రూ.36.29 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. మొత్తమ్మీద సుమారు రూ.100 కోట్ల అదనపు దోపిడీకి ‘అధికారిక’ అనుమతి ఇచ్చింది. సీఎం రమేష్‌కు లబ్ధి చేకూర్చేలా.. చంద్రబాబు సన్నిహితుడు, టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు లబ్ధి చేకూర్చేలా తెలుగుగంగ లైనింగ్ టెండర్ల వ్యవహారం సాగింది. మొదటి సారి టెండర్లు పిలిచినప్పుడు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్టస్ తప్పుడు పత్రాలు దాఖలు చేసింది. ఈ విషయం బహిర్గతం కావడంతో వివాదాస్పదంగా మారింది. అయితే.. రిత్విక్కే టెండర్ దక్కేలా మరోసారి నోటిఫికేషన్ జారీ చేయాలని చంద్రబాబు సూచించిన మేరకు ఇంజనీర్లు 2018 జూలైలో ఓపెన్ టెండర్ పిలిచారు. వాస్తవానికి టెండర్ నిబంధనల్లో ‘పేపర్’ అనే యంత్రంతో కాలువ లైనింగ్ చేసిన అనుభవం ఉన్న కాంట్రాక్టర్లే బిడ్ దాఖలు అర్హులని పేర్కొనాలి. కానీ పేపర్‌తో పాటు ‘షార్ట్ క్రీటింగ్’ విధానంలో పనులు చేసిన అనుభవం ఉండాలనే నిబంధన కూడా పెట్టి సీఎం రమేష్ కంపెనీకి దక్కేలా చేశారు. ఆ కంపెనీతో ఎన్నికలకు కొద్ది రోజుల ముందే అంటే ఈ ఏడాది మార్చి 7వ తేదీన అగ్రిమెంట్ చేసుకున్నారు. మూడు నెలలు గడిచినా ఇంత వరకు పనులు మొదలు పెట్టలేదు. దీంతో ఇంజినీర్లు ఇటీవలే నోటీసులు ఇచ్చారు. పనులు మొదలు పెట్టకపోవడంతో కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల టెండర్ రద్దయ్యే అవకాశం ఉన్నట్లు ఇంజినీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. -
సర్వశిక్ష అభియాన్‌లో అడ్డగోలు దోపిడీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల గ్రంథాలయాలకు పంపిణీ చేసిన పుస్తకాల కొనుగోలులో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. దాదాపు రూ.4.66 కోట్ల సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) నిధులను మింగేసిన గోల్మాల్ భాగోతంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడితో పాటు ఎస్ఎస్ఏ ఎస్పీడీ కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో వివరణ ఇవ్వాలంటూ సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు అధికారి జి.శ్రీనివాస్‌కు అవినీతి నిరోధక శాఖ శుక్రవారం నోటీసులు జారీ చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన ‘డ్రీమ్‌వరల్డ్ ఇండియా’ సీడీలు, డీవీడీలతో కూడిన పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలల గ్రంథాలయాలకు పంపిణీ చేస్తామని రెండున్నరేళ్ల క్రితం మంత్రి గంటా శ్రీనివాసరావుకు 16 రకాల పుస్తకాలతో ప్రతిపాదనలు అందజేసింది. పుస్తకాల వాస్తవ ధరలపై 71 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తామని పేర్కొంది. ఎస్ఎస్ఏ ద్వారా పుస్తకాల కొనుగోలుకు మంత్రి ఆదేశించారు. రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎస్ఈఆర్టీ) ఆధ్వర్యంలో నిపుణుల కమిటీతో పరిశీలన తరువాత 11 రకాల పుస్తకాలు కొనుగోలు చేయాలని ఎస్ఎస్ఏ ఎస్పీడీ జి.శ్రీనివాస్ నిర్ణయించారు. ఎస్ఎస్ఏ అధికారులు, డ్రీమ్‌వరల్డ్ కంపెనీతో కుమ్మక్కు కావడంతో..ముందుగా చెప్పిన రేట్లకు బదులు పుస్తకాల ధరను భారీగా పెంచేశారు. సీఎం రమేష్ ప్రవేశంతో ‘డబుల్’ దందా! డ్రీమ్‌వరల్డ్ తొలుత పేర్కొన్న ధరల ప్రకారం 11 పుస్తకాల సెట్టు ధర రూ.7,200 మాత్రమే. కానీ తరువాత ఎస్ఎస్ఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్, ఆ సంస్థ కుమ్మక్కై ఈ ధరను అమాంతం రూ.13,489కి పెంచేశారు. దీని వెనుక తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ హస్తం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. పుస్తకాల కోసం డ్రీమ్వరల్డ్కు ఆగమేఘాల మీద ఆర్డర్లు ఇచ్చారు. డిస్కౌంట్‌ను కూడా 71 శాతానికి బదులు 30 శాతానికి పరిమితం చేశారు. భారీగా కమిషన్ల కోసం రేట్లను అమాంతం పెంచేశారు. డ్రీమ్ వరల్డ్ సంస్థకు రాష్ట్ర కార్యాలయం నుంచి బిల్లులు చెల్లించాల్సి ఉన్నా.. నిబంధనలను తుంగలో తొక్కి జిల్లా కార్యాలయాల నుంచి చెల్లింపులు చేయించారు. ముఖ్యకార్యదర్శి పరిశీలనలో తేలిన అక్రమాలు.. ఎస్ఎస్ఏలో నిధుల గోల్‌మాల్‌పై తనకు అందిన ఫిర్యాదుల ఫైలును పరిశీలించిన ముఖ్యకార్యదర్శి పుస్తకాల రేట్లు అమాంతం పెరిగిపోవడాన్ని గుర్తించారు. డ్రీమ్‌వరల్డ్ తొలుత ప్రభుత్వానికి అందించిన ధరల ప్రతిపాదనల పత్రాలు ఫైల్లో లేకపోవడం, వాటి స్థానంలో అధిక ధరలతో వేరే పత్రాలు ఉండడం ముఖ్యకార్యదర్శి దృష్టికి వచ్చింది. ముందుగా ఇచ్చిన ఆఫర్ ప్రకారం ఒక్కో సెట్టు వాస్తవ ధర రూ.7,200 కాగా రూ.13,489కి పెంచేశారు. 11 పుస్తకాల సెట్టు రూ.7200 చొప్పున 7,413 సెట్లకు రూ.5,33,73,600 మాత్రమే అవుతుంది. అయితే ఎస్ఎస్ఏ ఎస్పీడీ కొత్త ధరల పట్టికను చూపిస్తూ రూ.13,489 చొప్పున రూ.9,99,93,957 చెల్లింపులు చేశారు. అసలది పబ్లిషింగ్ సంస్థే కాదు.. విచిత్రమేమంటే డ్రీమ్‌వరల్డ్ ఇండియా సంస్థ అసలు పబ్లిషింగ్ సంస్థే కాదని.. కేవలం పంపిణీదారు మాత్రమేనని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. తొలుత ప్రతిపాదించిన ధరల కన్నా ఎక్కువ ఎందుకు చెల్లించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని ఎస్ఎస్ఏ ఎస్పీడీని ముఖ్యకార్యదర్శి ఆదేశించినా ఫలితం లేకుండాపోయింది. ఇదిలా ఉండగా..ఈ అక్రమాలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ రంగంలోకి దిగి రికార్డులను స్వాధీనం చేసుకుంది. వాస్తవాలు తేటతెల్లంగా తెలుస్తున్నా సీఎం రమేష్ సహా టీడీపీ నేతల ఒత్తిడితో గత ప్రభుత్వ హయాంలో కేసు ముందుకు సాగలేదు. తాజాగా ప్రభుత్వం అవినీతిపై స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో ఏసీబీ ఎస్పీడీకి నోటీసులు జారీ చేసింది. అక్రమాలకు సాక్ష్యాలివిగో.. ప్రభుత్వానికి ముందుగా సమర్పించిన ప్రతిపాదనల ప్రకారం ‘స్పిరిట్ ఆఫ్ ఇండియా’ పుస్తకం ధర రూ.1,495 ఉంటే ఎస్పీడీ ప్రతిపాదనల్లో అది రూ.2,495కి పెరిగింది. -
సీఎం రమేష్ బ్రదర్స్...అక్రమాలు అదుర్స్
నిన్న మొన్నటి వరకు జిల్లాలో ఆయనో మోనార్క్. నిబంధనలు ప్రభుత్వ ఉత్తర్వులు ఆయన మాట ముందు బలాదూర్. తాను చెప్పిందే నిబంధన, సూచించిందే ఆదేశం అన్నట్లుగా సాగింది. ఎంపీ హోదాతో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ధోరణి అవలంబించారు. ఆయన అండ చూసుకొని సోదరుడు జిల్లాలో ప్రకృతి సంపదను దోచుకోవడం, దాచుకోవడం చేశారు. కొండంత దోపిడీ కొనసాగించారు. ముద్దనూరు మండలం చిన్నదుద్యాల కేంద్రంగా కోట్లాది రూపాయలు అక్రమార్జన చేపట్టారు. సాక్షి, కడప: పోట్లదుర్తి బ్రదర్స్ ఈ పేరు చెప్పగానే ఎంపీ రమేష్, సురేష్నాయుడుగా జిల్లావాసులు గుర్తుపట్టగలరు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా వీరు ఆడిందే ఆట, పాడిందే పాట, చెప్పేందే వేదం అనే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పోట్లదుర్తి గ్రామానికి చెందిన జి.చెన్నకేశవనాయడు (సురేష్ నాయుడు బినామీ) పేరుతో 2015లో స్లాబ్‌స్టోన్ మైనింగ్ లీజు ఇప్పించారు. ఆపై ఎలాంటి మైనింగ్ అనుమతులు పొందకుండా అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారు. అందులో లక్షలాది క్యూబిక్ మీటర్లు రాయిని వెలికితీసి, కంకర కొట్టి కోట్లాది రూపాయాలు అక్రమంగా గడించారు. నాలుగేళ్లుగా ఇదే తంతు కొనసాగించారు. మైనింగ్ లీజుతోనే సరి.... పోట్లదుర్తి గ్రామానికి చెందిన చెన్నకేశవనాయుడు పేరుతో 2015 నుంచి 2025 వరకు స్లాబ్ స్టోన్ నిమిత్తం మైనింగ్ లీజు లభించింది. ముద్దనూరు మండలం చిన్నదుద్యాల గ్రామం సర్వే నంబర్ 242లో 10.11హెక్టార్లలో మైనింగ్ లీజు దక్కింది. అయితే అందులో మైనింగ్ చేసేందుకు కాలుష్యనియంత్రణ మండలి అనుమతి పొందాల్సి ఉంది. ఎలాంటి అనుమతులు లేకుండా మైనింగ్ చేస్తూ పక్కనే క్రషర్ ఏర్పాటు చేసి కంకర కొడుతున్నారు. నాలుగేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. కాగా 2018 నవంబర్ 30న కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు లేకుండా మైనింగ్ చేస్తున్నారంటూ ఎర్రగుంట్ల మైనింగ్ ఏడీ నోటీసు జారీ చేశారు. అవేవి లెక్కచేయని పోట్లదుర్తి బ్రదర్స్ వారి అక్రమ కార్యకలాపాలు కొనసాగిస్తూనే వచ్చారు. అధికారులు నోటీసులతో సరిపెట్టడం మినహా అక్రమ మైనింగ్‌ను నియంత్రించే సాహసం లేయలేకపోయారు. ఈ క్రమంలో అప్పటి అధికార టీడీపీలో ఉన్న ఆధిపత్య పోరు కారణంగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి వర్గీయులు ఎంపీ రమేష్ క్రషర్‌ను మూయించే చర్యల్లో భాగంగా పరస్పర దాడులు సైతం చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నా అటువైపు అధికారులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. 5లక్షల క్యూబిక్ మీటర్ల మైనింగ్.... ముద్దనూరు మండలం చిన్నదుద్యాల గ్రామంలో పోట్లదుర్తి బ్రదర్స్ 5.10లక్షల క్యూబిక్ మీటర్ల స్టోన్ క్రషర్ అక్రమంగా మైనింగ్ చేశారు. ఆమేరకు ఎర్రగుంట్ల మైనింగ్ ఏడీ నిర్ధారణ చేశారు. అందులోభాగంగా రూ.21.67కోట్లు అపరాధ రుసుం వేశారు. అనుమతులు లేకుండా మైనింగ్ చేయడం, ఆపై 5లక్షల10వేల260 క్యూబిక్ మీటర్ల రాయిని డైనమేట్లు పెట్టి పేల్చి యంత్రాల ద్వారా కొండను పెకళించారు. నిబంధనల మేరకు ప్రభుత్వానికి రూ.21.67కోట్లు చెల్లించాలని మైనింగ్ ఏడీ డిమాండ్ నోటీసును 2019 ఫిబ్రవరి 27న జారీ చేశారు. ఇవేవి పట్టించుకోకుండా పోట్లదుర్తి బ్రదర్స్ వారి అక్రమ కార్యకలాపాలు ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారని ప్రజలు వాపోతున్నారు. ఈవిషయమై మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు వివరణ కోరగా, డిమాండ్ నోటీసు జారీ చేసిన విషయం వాస్తమేనని, అయితే గడువులోపు నిర్వాహకుల స్పందన చూసి తదుపరి ఆర్ఆర్ యాక్టు అమలు చేస్తామని వెల్లడించారు. కలెక్టర్ గారు దృష్టి సారించండి... ఓ వైపు ప్రజాధనం, మరోవైపు ప్రకృతి సంపద ఆధారంగా అక్రమార్జన చేయడంలో పోట్లదుర్తి సోదరులకు పెట్టింది పేరు. ఈక్రమంలోనే పోట్లదుర్తి సమీపంలో పెన్నానది ప్రవాహానికి భూములు కోతకు గురి కాకుండా ఉండేందు ఈఏడాది జనవరి 29న జలవనరులశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే మైనర్ ఇరిగేషన్ యంత్రాంగం 2019 ఫిబ్రవరి 1న ప్రొటెక్షన్‌వాల్ ఏర్పాటుకు టెండర్లు పిలిచారు. 4.44శాతం అదనంగా సింగిల్ టెండర్‌కు ఎంపీ రమేష్‌కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్కు రూ.3.08కోట్లకు అప్పగించారు. ఇవే పనులను పెన్నానదిలో ప్రభుత్వ భూమి అక్రమించిన ప్రాంతానికి ప్రజాధనం వెచ్చించి ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తున్నారు. మరోవైపు చిన్నదుద్యాల గ్రామంలో వారి పేరుతో మైనింగ్ లీజు లేకపోయినా ఇప్పటీకీ కొండను కొల్లగొడుతున్నారు. ఇప్పటికే మైనింగ్ అధికారులు గుర్తించి దాదాపు రూ.21.67కోట్లు ప్రభుత్వానికి చెల్లించాలని డిమాండ్ నోటీసు జారీ చేశారు. నోటీసు జారీ చేసిన తర్వాత 90రోజులు వరకు గడువు ఉంటుంది ఈలోపు మరింత స్పీడుగా అక్రమ మైనింగ్ చేస్తున్నారు. నోటీసుతో సరిపెట్టడం మినహా అక్రమమైనింగ్‌కు అడ్డుకునే పరిస్థితి జిల్లా యంత్రాంగంలో కన్పించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కలెక్టర్ హరికిరణ్ ప్రత్యేక చొరవ చూపి అక్రమ మైనింగ్‌ను అరికట్టడంతోపాటు, అక్రమ మైనింగ్ ద్వారా నిల్వ ఉన్న కంకరను సీజ్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఏమేరకు చర్యలు చేపడుతారో వేచి చూడాల్సిందే! -
ఎన్నికల సంఘంపై టీడీపీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు
ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై టీడీపీ ఎంపీ సీఎం రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక ఎన్నికల సంఘంపై ఎంక్వైరీ చేసి పని పడతామని హెచ్చరికలు చేశారు. ఏ నివేదిక లేకుండా రీపోలింగ్‌కు ఎలా ఆదేశించారని ఎన్నికల సంఘంపై సీఎం రమేష్ చిందులు తొక్కారు. ఈ మొత్తం వ్యవహారంపై కోర్టుకు వెళ్తామని, పార్లమెంటులో ఎంక్వైరీ చేస్తామని వింతగా మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం ముందు నిలబడి ఇది బీజేపీ ఎన్నికల సంఘం అంటూ సీఎం రమేష్ పొంతనలేని వ్యాఖ్యలు చేశారు. రీపోలింగ్‌కు ఆదేశించిన ఐదు పోలింగ్ బూత్‌ల్లో టీడీపీకి వన్‌సైడ్‌గా ఓట్లు పడుతుంటాయని అన్నారు. చరిత్ర చూస్తే ఈ బూతులన్నీ టీడీపీవేనని తెలుస్తుందన్నారు. ఐదు బూత్‌ల్లో టీడీపీకే ఓట్లు పడ్డాయని పరోక్షంగా సీఎం రమేష్ వెల్లడించారు. ప్రశ్నలడిగిన మీడియాపై కూడా సీఎం రమేష్ చిందులేశారు. రీపోలింగ్‌కు భయపడుతున్నారా అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. నీకు బుద్ధి ఉండే అడుగుతున్నావా అని వంకర టింకర సమాధానాలు చెబుతూ సీఎం రమేష్ బెదిరింపులకు దిగారు. -
‘రిత్విక్ కంపెనీపై సీబీఐ విచారణ జరిపించండి’
హైదరాబాద్: టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ కంపెనీపై సీబీఐ విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి లేఖ రాశారు. రిత్విక్ ప్రాజెక్ట్స్ ఉత్తరాఖండ్‌లో నిర్మించిన కోటేశ్వర్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్‌లో భారీ అవినీతి జరిగిందని లేఖలో పేర్కొన్నారు. విజయసాయి రెడ్డి లేఖను క్షుణ్ణంగా పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం కోటేశ్వర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు పూర్తి స్థాయి విచారణ చేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. -
సీఎం రమేష్ మేనల్లుడు ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మేనల్లుడు ధర్మారామ్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న ధర్మారామ్ ఒక సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయ్యాడు. పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెందిన అతడు శుక్రవారం రాత్రి తాను నివాసం ఉంటున్న శ్రీనగర్ కాలనీలోని వాసవి భువన అపార్ట్ మెంట్ ఏడో అంతస్తుపై నుంచి కిందకు దూకేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. మరోవైపు ధర్మారామ్ మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా తెలంగాణలో ఇంటర్ బోర్డు తప్పిదాల వల్ల ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అధికారుల తప్పిదాలకు తమ బిడ్డల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఇవాళ ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళనకు దిగారు. అంతేకాకుండా తప్పిదాలపై ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు. పరీక్షకు హాజరు కాని విద్యార్థిని పాస్ చేసిన ఇంటర్ బోర్డు అధికారులను ఏం చేయాలంటూ .... విద్యాశాఖ ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 50వేల మంది విద్యార్థులు ఒక్క లెక్కల పరీక్షలోనే ఎందుకు ఫెయిల్ అవుతారని ప్రశ్నిస్తున్నారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి లెక్కలేనితనానికి విద్యార్థలు బాధితులు కావాలా అని ఆవేదన వ్యక్తం చేశారు. -
‘ఆ డీఎస్పీ అవినీతిపై విచారణ చేస్తే ఆధారాలు చూపిస్తా’
సాక్షి, వైఎస్సార్ జిల్లా : ప్రొద్దుటూరు డీఎస్పీ శ్రీనివాసరావు అవినీతికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆరోపించారు. ఆయన అవినీతిపై అధికారులు విచారణ చేస్తే ఆధారాలు చూపిస్తానని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ అండతో డీఎస్పీ శ్రీనివాసరావు రూ. రెండు కోట్ల మేర అవినీతి సొమ్ము సంపాదించారని ఆరోపించారు. డీఎస్పీపై గతంలో ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదన్నారు. వారం రోజుల్లో శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
వైఎస్సార్సీపీ ఏజెంట్‌పై కారెక్కించిన సీఎం రమేష్
సాక్షి, ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలోని ప్రభుత్వ ఎస్సీ వసతి గృహంలో ఉన్న 248 పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ ఏజెంట్ పడిగపాటి వెంకట సుధాకర్‌రెడ్డిపై రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ దాడి చేసి, ఆ ఏజెంట్‌పై కారు ఎక్కించిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఈ సంఘటన చూసి ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లందరు భయభ్రాంతులయ్యారు. బాధితుడు, వైఎస్సార్సీపీ ఏజెంటు పడిగపాటి వెంకటసుధాకర్‌రెడ్డి ఎర్రగుంట్ల పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఎంపీ రమేష్, అతని కారు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎర్రగుంట్ల పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పోట్లదుర్తి గ్రామానికి చెందిన పడిగపాటి వెంకట సుధాకర్‌రెడ్డి గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లోని 241 పోలింగ్ స్టేషన్లో వైఎస్సార్ సీపీ పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి తరుపున ఏజెంటుగా కూర్చున్నాడు. గ్రామంలోని ఎస్సీ వసతి గృహంలో 248 పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని తెలిసి రిలీవర్ ఏజెంట్ గా ఉన్న వెంకట సుధాకర్‌రెడ్డి అక్కడికి వచ్చారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అక్కడ ఉన్న మరో వ్యక్తితో నీవు ఎందుకు వచ్చావని ప్రశ్నించారు. అదే సమయంలో అక్కడే ఉన్న పడిగపాటి వెంకటసుధాకర్‌రెడ్డి మీరు కూడా ఏజెంట్ కాదు కదా ఎందుకు వచ్చారని ఎంపీ రమేష్‌తో అన్నారు. అంతే.. సీఎం రమేష్ ఆగ్రహించి వైఎస్సార్సీపీ ఏజెంట్ అయిన వెంకటసుధాకర్‌రెడ్డిపై చేయి చేసుకున్నాడు. దీంతో అవమానానికి గురైన వెంకటసుధాకర్‌రెడ్డి తనకు ఎంపీ రమేష్ క్షమాపణ చెప్పాలంటూ అతని కారుకు అడ్డంగా రోడ్డుపై భైఠాయించాడు. దీంతో ఆగ్రహించిన రమేష్ తన కారును సుధాకర్‌రెడ్డిపైకి ఎక్కించి వెళ్లిపోయాడు. ఈ ఘటనలో సుధాకర్‌రెడ్డి ఎడమ కాలు పాదం విరిగి వాపుడు గాయం అయింది. వెంటనే పోలీసులు సుధాకర్‌రెడ్డిని బలవంతంగా కారులో ఆçస్పత్రికి తరలించారు. ఈ మేరకు పడిగపాడి సుధాకర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంపీ రమేష్‌తో పాటు, అతని కారు డ్రైవర్లపై సెక్షన్ 323, 324, ఆర్/డబ్లు్య 34 ఐపీసీ కింద కేసు నమోదు చేసినట్లు ఎర్రగుంట్ల పోలీసులు తెలిపారు. -
టీడీపీ దౌర్జన్యం:వైఎస్సార్సీపీ ఏజెంట్ల కిడ్నాప్
-
ఏజెంట్‌పై చేయి చేసుకున్న సీఎం రమేష్
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల అరాచకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రశాంతంగా పోలింగ్ జరగకుండా ప్రత్యర్థి అభ్యర్థులపై దాడులకు పాల్పడుతూ... హింస సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తూ.. వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు దిగుతున్నారు. తాజాగా పోలింగ్ సమయంలో వైఎస్సార్సీపీకి చెందిన ముగ్గురు ఏజెంట్ల కిడ్నాప్ కలకరం రేపుతోంది. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం యల్లమందలో వైఎస్సార్సీపీ ఏజెంట్లను టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారు. ఏజెంట్లను బూత్‌లోకి వెళ్లకుండా అడ్డుకుని వారిపై దాడికి దిగారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. అతని ఫోన్, కెమెరాను ధ్వంసం చేసి బెదిరింపులకు దిగారు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు పొన్నతోటలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్నారు. సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి, సుధీర్ రెడ్డిలు అక్కడి చేరుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పోలింగ్ బూత్ నెంబర్. 31లో టీడీపీ నేతలకు ప్రలోభాలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్సీపీకి మద్దతు ఇస్తున్నారంటూ కొందరు మహిళలను ఓటు వేయకుండా అడ్డుకున్నారు. దీంతో మహిళలకు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాంనగర్ 9వ రోడ్డులోని పోలింగ్‌బూత్‌లో వైఎస్సార్సీపీ కన్వీనర్ మట్టా రాజుపై టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి దాడికి పాల్పడ్డారు. రాజు తలకు తీవ్ర గాయాలు కావడంతో ఏలూరు ఆసుపత్రికి తరలించారు. అంతటితో ఆగకుండా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజుపై బుజ్జి వర్గీయులు మరోసారి డాడికి దిగారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తూ.. టీడీపీ నేతలు అరాచకం సృష్టిస్తున్నారు. మరోవైపు వైఎస్సార్ కడప జిల్లాలో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ వైఎస్సార్సీపీ ఏజెంట్‌పై దాడికి పాల్పడ్డారు. ఓటర్ స్లిప్‌లు పంచుతూ.. గుర్తులు చెప్తున్న టీడీపీ నేతలను ప్రశ్నించినందుకు యర్లగుంట్ల మండలం పోట్లదుర్తి కేంద్రంలో వైఎస్సార్సీపీ ఏజెంట్‌పై సీఎం రమేష్ చేయి చేసుకున్నారు. కిృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం గొల్లపూడిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని చెప్తూ.. దేవినేని ఉమామహేశ్వరరావు వర్గీయులు ఓటర్ స్లిప్‌లను పంపిణీ చేస్తున్నారు. వారిని అడ్డుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై దౌర్జాన్యానికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరపురం జిల్లా యల్లనురు మండలం జంగంపల్లిలో టీడీపీ నేతల అరచకాలు కొనసాగుతున్నాయి. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడికి దిగారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న వారిని ప్రశ్నించిన వారిపై దౌర్జన్యానికి దిగుతున్నారు. వైఎస్సార్ జిల్లా చక్రయపేట మండలం తిమ్మరెడ్డిగారిపల్లెలో టీడీపీ నేతలు ప్రలోభాలకు పాల్పడుతున్నారు. క్యూలైన్ల్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చూస్తే.. కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారు. -
వామ్మో ఆ ఐటీ సోదాలు ఉత్తుత్తివేనా!?
సాక్షి ప్రతినిధి కడప : వైఎస్సార్ జిల్లా మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్ ఇంట్లో ఐటీ సోదాలు.. ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో పోలీసుల తనిఖీలు.. వీటిపై ఇప్పుడు పెద్దఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి నిజంగా జరిగాయా.. లేక వారే కావాలని చేయించుకుని డ్రామా ఆడుతున్నారా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ప్రొద్దుటూరులో నివాసం ఉంటున్న పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లో బుధవారం సాయంత్రం ఐటీ అధికారులు తనిఖీలకు వెళ్లారు. ఇరువురు పోలీసులను మాత్రమే బందోబస్తుకు తీసుకెళ్లారు. తనిఖీలకు వెళ్లిన అధికారులు సుధాకర్ తనయుడుతో కబుర్లలో మునిగిపోవడం, ఈలోపు సీఎం రమేష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తదితర టీడీపీ నేతలు అక్కడి చేరుకోవడం.. తనిఖీలు చేయాలని ఎవరు అదేశించారో చెప్పాలంటూ నానాయాగీ చేశారు. దీంతో ఐటీ అధికారులు వెనుతిరగడం అనుమానాలకు ఆస్కారమిచ్చింది. పైగా.. విధులకు ఆటంకం కల్గించినట్లు వారు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడంతో ఆ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. సానుభూతే లక్ష్యంగా ఐటీ తనిఖీలు మైదుకూరు నియోజకవర్గంలో ఇటీవల మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తన అనుచరులతో వైఎస్సార్సీపీలో చేరిపోయారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, మాజీమంత్రి రవీంద్రారెడి ్డకలిసికట్టుగా పనిచేస్తే అక్కడ మరే అభ్యర్థి అయినా నామమాత్రపు పోటీ ఇవ్వాల్సిందే. ఈ పరిస్థితుల్లో పుట్టా సుధాకర్‌యాదవ్ ఇంట్లో ఐటీ సోదాలకు టీడీపీ పెద్దలు స్కెచ్ వేసినట్లు సమాచారం. సానుభూతి కోసమే ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. సీఎం రమేష్ ఇంట్లోనూ ఇంతే.. సుధాకర్‌యాదవ్ ఇంట్లో జరిగిన సంఘటనకు రెండ్రోజుల అనంతరం శుక్రవారం ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పోట్లదుర్తి గ్రామంలో యర్రగుంట్ల సీఐ వెంకటరమణ నేతృత్వంలో ఇవి జరిగాయి. వాస్తవానికి ఎంపీ స్థాయి ఇంట్లో తనిఖీలు చేయాలంటే కనీసం డీఎస్పీ స్థాయి అధికారి వెళ్లాలి. కానీ, యర్రగుంట్ల సీఐ తన పై అధికారులైన ఎస్పీ అభిషేక్ మహంతి, డీఎస్పీ మాసూం బాషాకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తనిఖీలు చేసినట్లు సమాచారం. కాగా, కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న వెంకటరమణ ఇటీవల వైఎస్సార్ జిల్లాకు బదిలీపై వచ్చారు. సీఎం రమేష్ సిఫార్సుల కారణంగానే ఆయన ఇక్కడకు వచ్చారని.. ఎంపీ వ్యూహంలో భాగంగానే వెంకటరమణ తనిఖీలకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయినా, టీడీపీ నేతలు జిల్లా పోలీసు శాఖను, ఎన్నికల కమిషన్‌ను టార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డారు. ఇదంతా చూస్తుంటే.. టీడీపీ కుట్రలో భాగంగానే ఐటీ సోదాలు, పోలీసుల తనిఖీలు చోటుచేసుకున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
సీఎం రమేష్ ఇంటీపై పోలీసుల దాడులు బూటకం
-
‘సీఎం రమేష్‌కు అదేం కొత్త కాదు’
సాక్షి, విజయవాడ : టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంటిపై జరిగిన పోలీసులు దాడులు బూటకమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆదివారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ.. సీఎం రమేష్ కావాలనే పోలీసులతో తన ఇంటిపై దాడులు జరిపించుకున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల దినపత్రిక బట్టబయలు చేసిందన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా డ్రామాలు ఆడిన సీఎం రమేష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో సానుభూతి కోసమే టీడీపీ నేతలు పోలీసుల దాడులు అంటూ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. డ్రామాలు ఆడడం సీఎం రమేష్‌కు, టీడీపీ నేతలకు కొత్తేం కాదన్నారు. సీఎం రమేష్ డ్రామాలపై ఎన్నికల కమిషన్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఓటమి భయంతో టీడీపీ నేతలు ప్రజలను మభ్యపెట్టడానికి నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రజలను మోసం చేసిన టీడీపీకి ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. -
అమ్మ సీఎం రమేషా.. ఎంత ‘డ్రామా’?
హైదరాబాద్ : తప్పులు చేయడం..ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం అలవాటుగా మారిన టీడీపీ నేతల బరితెగింపు పరాకాష్టకు చేరింది. ఐటీ, ఈడీ దాడులపై గగ్గోలుపెడుతూ వ్యవస్థలను నీరుగారుస్తున్నారని మొసలి కన్నీరు కారుస్తున్న పచ్చతమ్ముళ్లు పోలింగ్‌కు ముందు హైడ్రామాలకు తెరలేపారు. టీడీపీ నేతల అరాచకాలపై దర్యాప్తు సంస్ధలు, అధికారులు స్పందిస్తే ప్రధాని మోదీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్‌ల కుట్రగా రంకెలేస్తున్న తమ్ముళ్లు సరికొత్త కుట్రలతో చెలరేగుతున్నారు. సీఎం చంద్రబాబు సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నివాసం వేదికగా మరో నాటకాన్ని రక్తికట్టించారు. ఓ ఆంగ్ల దినపత్రిక రమేష్ ఇంట్లో సోదాల పేరిట జరిగిన తంతును బట్టబయలు చేసింది. శుక్రవారం ఉదయం సీఎం రమేష్ ఇంట ఇటీవల విడుదలైన లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీకి మించిన ఉత్కంఠ, దానికి అనుగుణంగా పచ్చ మీడియా హడావిడి అంతా పక్కా స్ర్కిప్ట్ ప్రకారం సాగింది. చదవండి....(ఐటీ దాడులు.. హైడ్రామా.. సీఎం రమేశ్ దౌర్జన్యం!) కడప జిల్లా పోట్లదుర్తిలోని సీఎం రమేష్ ఇంటిలో పోలీసులు తనిఖీ రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది. ఎంపీ ఇంట్లోకి 40 మంది పోలీసులు ప్రవేశించి ఆయన బెడ్రూమ్లోనూ సోదాలు చేశారు. వారెంట్ లేకుండా నా ఇంటికి వచ్చి తనిఖీలు చేస్తారా అంటూ సీఎం రమేష్ ఖాకీలపై వీరంగం వేశారు. ఇదంతా మోదీ, జగన్, కేసీఆర్‌ల కుట్ర అంటూ సీఎం చంద్రబాబు నుంచి చోటా నేతల వరకూ హడావిడి చేశారు. అయితే సీఎం రమేష్ నివాసంలో సోదాలపై జిల్లా ఎస్పీ, డీఎస్పీలకే సమాచారం లేకపోవడం గమనార్హం. రమేష్ డైరెక్షన్...రమణ యాక్షన్.. ఉన్నతాధికారుల సూచనలు లేకుండా పచ్చనేతలల ప్రోద్బలంతో ఈ వ్యవహారాన్ని చక్కబెట్టిన ఎర్రగుంట్ల అర్బన్ ఇన్స్పెక్టర్ బీవీ రమణ ఈ వివాదానికి కేంద్రబిందువయ్యారు. కర్నూలు నుంచి కడపకు ఇటీవల బదిలీ అయిన రమణ ఎంపీ ఇంట్లో సోదాలు చేసిన 40 మంది పోలీసుల బృందానికి నేతృత్వం వహించారు. ఎంపీ, ఎంఎల్ఏ ఇంట్లో సోదాలు చేయాలంటే సంబంధిత డీఎస్పీ, ఎస్పీ, డీఐజీలకు సమాచారం అందించాల్సి ఉండగా, ఆయన ఇవేమీ ఖాతరు చేయకుండా ఎంపీ ఇంటి వద్ద ఉన్న సమయంలోనే సీనియర్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా సోదాలకు వెళ్లడం వివాదాస్పదమైంది. సోదాలపై వారెంట్ గురించి ఎంపీ అడగ్గా తాము ఎన్నికల విధుల్లో ఉన్నామని అందులో భాగంగానే తనిఖీలు చేపట్టామని చెప్పడం గమనార్హం. పోలీసులు ఇలా సీఎం రమేష్ ఇంట్లోకి రాగానే ఆయన అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఖాకీల వేధింపులు ఈసీ, ప్రధాని, జగన్‌ల కుట్రలో భాగమేనంటూ టీడీపీ నేతలంతా పాతపాట అందుకున్నారు. చంద్రబాబు సహా పచ్చనేతలు, బాకా మీడియా దీనిపై ఊదరగొట్టింది. చదవండి...(టీడీపీ అభ్యర్థి ఇంటిపై ఐటీ దాడులు) సోదాల కుట్ర ఇందుకే.. రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో సోదాల డ్రామాకు టీడీపీ వ్యూహాత్మకంగానే తెరలేపింది. కేంద్ర ప్రభుత్వం, ఈసీ, జగన్ లక్ష్యంగా పోలింగ్‌కు ముందు నిందలు మోపి ప్రజల్లో సానుభూతి రగిలించేందుకు ఈ ఎత్తుగడకు దిగారు. సోదా డ్రామకు పచ్చమీడియా ప్రచారం కలిసివస్తుందని పకడ్బందీగా తనిఖీల నాటకాన్ని రక్తికట్టించారు. మరోవైపు ఎన్నికల సమయంలో పాలక పార్టీ ఎంపీ విషయంలోనూ సోదాలకు తాము వెనుకాడమనే సంకేతాలను పంపడం ద్వారా పోలీసులకూ మంచిపేరు వచ్చేలా ఈ డ్రామాకు స్కెచ్ వేశారు. ఉన్నతాధికారుల సూచనలు లేకుండా, వారికి కనీస సమాచారం ఇవ్వకుండా ఇన్స్పెక్టర్ స్ధాయి అధికారి రాజ్యసభ ఎంపీ నివాసంలో తనిఖీలు ఎందుకు నిర్వహించారు, దీని వెనుక అతడిని ప్రేరేపించిన వారెవరనేది నిగ్గుతేల్చేందుకు విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగుచూస్తాయి. -
ఎంపీ ఇంట్లో సోదాలపై స్పందించిన ఈసీ
అమరావతి: టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో సోదాలపై ఆంధ్ర ప్రదేశ్ సీఈఓ గోపాల కృష్ణ ద్వివేది స్పందించారు. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామంలోని అన్ని ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారని తెలిపారు. ఎన్నికల సమయంలో సాధారణ ప్రక్రియలో భాగంగానే ఇలా చేస్తారని చెప్పారు. రాష్ట్రంలో మిగిలిన సమస్యాత్మక గ్రామాల్లో సైతం కార్డన్ సెర్చ్‌లు నిర్వహిస్తారని తెలిపారు. పార్టీలకు అతీతంగా కార్డన్ సెర్చ్‌లు జరగుతాయని, పోలీసులపై వచ్చిన ఫిర్యాదులన్నీ నిజం కాకపోవచ్చునని అభిప్రాయపడ్డారు. పార్టీల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదుపై విచారణ జరిపించామని, కేవలం నాలుగైదు జిల్లాల నుంచే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయన్నారు. గుంటూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల నుంచే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. ప్రతి ఫిర్యాదుపై విచారణ తర్వాత నివేదికలు అందాయని, జిల్లాల వారీగా ప్రత్యేక పరిశీలకుల ఆధ్వర్యంలో సమీక్ష చేస్తున్నామని వివరించారు. -
బరితెగించిన సీఎం రమేష్
సాక్షి, ప్రొద్దుటూరు : సోదాలకు వచ్చిన ఆదాయపన్ను శాఖ ఉన్నతాధికారులపై టీడీపీ ఎంపీ సీఎం రమేష్ దౌర్జన్యానికి దిగారు. వారి విధులకు ఆటంకం కల్గించడమే కాకుండా తమకు అనుకూలంగా స్టేట్మెంట్లు ఇవ్వకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. టీటీడీ చైర్మన్, వైఎస్సార్ జిల్లా మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్ ఇంట్లో చోటుచేసుకున్న ఈ బరితెగింపు వివరాలిలా ఉన్నాయి.. పుట్టా సుధాకర్‌యాదవ్ ఇంటికి బుధవారం సాయంత్రం 4.20 గంటలకు ఐటీ అధికారులు వచ్చారు. ఆ సమయంలో పుట్టా సుధాకర్‌యాదవ్ కుమారుడు మహేష్‌యాదవ్ ఇంట్లోనే ఉన్నారు. తనిఖీలు నిర్వహిస్తుండగా మహేష్‌యాదవ్ కొన్ని పేపర్లను నలిపి బయట పడేయడాన్ని గుర్తించిన ఐటీ అధికారులు అతన్ని ప్రశ్నించారు. ఇంతలో ఎంపీ సీఎం రమేష్, అతని వెంట కౌన్సిలర్ వీఎస్ ముక్తియార్, టీడీపీ పట్టణాధ్యక్షుడు ఈవీ సుధాకర్‌రెడ్డి పుట్టా ఇంట్లోకి కేకలు వేసుకుంటూ వెళ్లారు. సీఎం రమేష్ నేరుగా ఐటీ అధికారులందరిపై కేకలు వేశారు. ‘ఎవరు పంపారు, ఎన్నికల్లో అభ్యర్థిగా ఉన్న వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేయడానికి మీకు ఎంత ధైర్యం’.. అంటూ మండిపడ్డారు. తనిఖీలు చేయకుండా అడ్డుకున్నారు. మీడియా ప్రతినిధులను లోపలికి తీసుకెళ్లి వారి సాక్షిగా అధికారులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. మిమ్మల్ని ఎవరు పంపారో మీడియాకు చెప్పాలంటూ కడప ఐటీ అసిస్టెంట్ కమిషనర్ మహాదేశ్పై తీవ్ర ఒత్తిడి చేశారు. ‘మా పై అధికారుల ఆదేశాల మేరకు మేము తనిఖీలు చేస్తున్నాం.. అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు’ అని ఆయనన్నారు. దీంతో ఆయన చేతిలోని సూట్‌కేసును టీడీపీ నాయకులు లాక్కున్నారు. రమేష్ దానిని తెరిచారు. అందులోని పేపర్లను వీఎస్ ముక్తియార్ తీసి బయట వేయగా ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి విసిరికొట్టారు. మీడియాలో భారీగా డబ్బు, బంగారం దొరికిందని వస్తోందని.. ఏమీ దొరకలేదని చెప్పాలంటూ అసిస్టెంట్ కమిషనర్‌ను ఎంపీ ఒత్తిడిచేశారు. మీరు ఏమీ దొరకలేదని చెప్పకపోతే మా వాళ్లు వందల మంది వస్తారని, లా అండ్ ఆర్డర్ తప్పుతుందని హెచ్చరించారు. చెప్పేంత వరకు బయటకు వెళ్లనివ్వబోమని చుట్టుముట్టారు. దీంతో అధికారులు చేసేదేమీ లేక వారి వాహనాల్లో వెళ్లిపోయారు. పక్కా సమాచారంతోనే సోదాలు మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్ ఇంటికి రెండు రోజుల కిందట భారీగా డబ్బు వచ్చిందన్న పక్కా సమాచారంతోనే ఐటీ అధికారులు సోదాలు చేసినట్లు సమాచారం. తనిఖీల్లో ఆ డబ్బు ఎక్కడ బయట పడుతుందోనని రమేష్ వారి విధులకు ఆటంకం కలిగించినట్లు స్పష్టమవుతోంది. ఇంట్లో భారీగా బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారని, దీంతో అధికారులపై దౌర్జన్యంచేసి వారు వెళ్లిపోయేలా చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న మంత్రి ఆదినారాయణరెడ్డి, పుట్టా ఇంటికి చేరుకున్నారు. వారు మీడియాతో మాట్లాడారు. ఐటీ దాడులకు వైఎస్ జగన్ లోటస్ పాండ్‌లో పథకం రూపొందించారని, కేంద్రంతో కలిసి దాడులు చేయించారని ఆరోపించారు. ఎస్కార్ట్‌గా ఇద్దరు కానిస్టేబుళ్లే.. జిల్లా ఐటీ అసిస్టెంట్ కమిషనర్‌తో పాటు మరో ఏడుగురు అధికారులు అధికార పార్టీ నాయకుని ఇంట్లో సోదాలు చేసేందుకు వస్తే పోలీసు అధికారులు కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లను పంపడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఐ నాయక్, డీఎస్పీ శ్రీనివాస్‌రావు వచ్చి ఘటనపై వాకబు చేసి వెళ్లిపోయారు. ఐటీ అధికారులపై ఎంపీ, టీడీపీ నాయకులు దౌర్జన్యం చేసి నిర్బంధించినంత పనిచేసినా పోలీసులు స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈసీ అధికారి స్టిక్కర్ ఉన్న వాహనంలో వచ్చిన అధికారులకు పోలీసులు ఎందుకు బందోబస్తు కల్పించలేకపోయారనే విషయం చర్చనీయాంశమైంది. ఐటీ సోదాలు జరిగే ఇంట్లోకి ఎవ్వరినీ అనుమతించరు. అక్కడ కానిస్టేబుళ్లు మాత్రమే ఉండడంతో టీడీపీ నేతలు బలవంతంగా లోపలికి వెళ్లి అధికారులపై దౌర్జన్యానికి దిగారు. అసిస్టెంట్ కమిషనర్ స్థాయి ఉన్న ఓ ఐటీ ఉన్నతాధికారిపై భౌతిక దాడికి దిగినంత పనిచేసిన టీడీపీ నాయకులపై, తనిఖీలు చేయకుండా విధులకు అడ్డుకున్న సీఎం రమేష్‌పై కనీసం ఐటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. చదవండి: టీడీపీ అభ్యర్థి ఇంటిపై ఐటీ దాడులు -
ఆర్థిక నేరగాళ్లకు టీడీపీ అడ్డా
సాక్షి, అమరావతి: వ్యాపారవేత్తల ముసుగులో బ్యాంకులకు టోపీ పెడుతున్న వారికి తెలుగుదేశం పార్టీ అడ్డాగా మారింది. రుణాలు, పన్నులు ఎగ్గొట్టిన వారికే చంద్రబాబు.. ప్రభుత్వ పదవుల్లో పెద్దపీట వేశారు. ప్రజల సొమ్మును అడ్డంగా దోచేసిన వారినే దగ్గరకు తీసుకుంటూ అండగా నిలుస్తూ వచ్చారు. ఈ మధ్య కాలంలో దేశంలో ఏ మోసాన్ని వెలికితీసినా వాటి మూలాలు టీడీపీ దగ్గరకే చేరుతున్నాయి. టీడీపీ కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, సీఎం రమేశ్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆర్థిక మోసాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగ్గొట్టడంతో పాటు వ్యాపారాలు చేయకుండానే పన్ను రాయితీలు పొందడంలో వీరిని మించిన ఘనాపాఠీలు లేరు. వీరే కాదు మంత్రులుగా చెలామణి అవుతున్న గంటా శ్రీనివాసరావు, ఆదినారాయణ రెడ్డితో పాటు ఎంపీ రాయపాటి సాంబశివరావు, బీద మస్తానరావు, వాకాటి నారాయణరెడ్డి, బొల్లినేని కృష్ణయ్య, వైస్రాయ్ ప్రభాకర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి.. ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే టీడీపీలోని గజదొంగల లిస్ట్ చాలా పెద్దగానే ఉంటుంది. ‘సుజనా’.. రూ.వేల కోట్లు తినేశాడు బ్యాంకుల నుంచి రూ.6,000 కోట్ల రుణాలు తీసుకొని మోసం చేసిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరుగుతుండగా.. సుజనా చౌదరి మోసాలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రూ.1,289 కోట్ల మోసం బయటపడింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత అనేక డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి ఎటువంటి వ్యాపారాలు చేయకుండానే రూ.1,289 కోట్లకు ఇన్వాయిస్లను రూపొందించారు. ఈ మొత్తంపై రూ.224 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను తీసుకున్నారు. అంతే కాకుండా ఈ దొంగ ఇన్వాయిస్లను చూపించి బ్యాంకుల నుంచి రూ.700 కోట్ల రుణాలు తీసుకున్నారు. జీఎస్టీ విభాగం చేసిన దర్యాప్తులో ఈ మోసం బయటపడటంతో ఇప్పటికే ఈ గ్రూపునకు చెందిన డైరెక్టర్లలో కొందర్ని అరెస్ట్ చేశారు. చివరకు బ్యాంకు రుణాలు తీర్చడం లేదని సుజనా చౌదరికి తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో ఉన్న స్టీల్ ప్లాంటును బ్యాంకులు సీజ్ చేశాయి. విదేశీ బ్యాంకులను సైతం మోసం చేసిన చరిత్ర సుజనా చౌదరి సొంతం. మారిషస్ బ్యాంక్ నుంచి రూ.100 కోట్ల రుణం తీసుకున్న సుజనా చౌదరి ఆ మొత్తం చెల్లించకుండా తప్పించుకొని తిరిగారు. దీంతో ఆ బ్యాంక్ వాళ్లు హైదరాబాద్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో న్యాయస్థానం ఏకంగా అరెస్ట్ వారెంట్లు కూడా జారీ చేసింది. అయినా కూడా సీఎం చంద్రబాబు పట్టుబట్టి సుజనా చౌదరికి గతంలో కేంద్ర మంత్రి పదవి ఇప్పించుకున్నారు. అక్రమ లావాదేవీలకు కేరాఫ్ ‘సీఎం’ రమేశ్ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, బినామీగా పేరు పొందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ అక్రమ లావాదేవీల గుట్టును ఆదాయ పన్ను శాఖ రట్టు చేసింది. సబ్ కాంట్రాక్టర్ల ముసుగులో పనులేమీ చేయకుండానే దాదాపు రూ.800 కోట్ల నిధులను సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నాడు. పనులేమీ చేయకుండానే బిల్లులు మంజూరు చేయించుకున్నాడు. వాటిని చిరునామాల్లేని కంపెనీల్లోకి మళ్లించి.. ఆ కంపెనీల నుంచి నగదును వెనక్కి తీసుకోవడం సీఎం రమేశ్‌కు వెన్నతో పెట్టిన విద్య. రమేశ్‌కు చెందిన నిర్మాణ రంగ కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సుమారు రూ.800 కోట్ల నిధులను వివిధ కంపెనీల ద్వారా దారి మళ్లించినట్లు ఐటీ శాఖ అధికారులకు స్పష్టమైన ఆధారాలు లభించాయి. గత ఆరేళ్లలో ఎడ్కో(ఇండియా) అనే సబ్ కాంట్రాక్టర్‌కు రూ.12 కోట్లు చెల్లించినట్లు పుస్తకాల్లో చూపించగా.. రికార్డుల్లో పేర్కొన్న నాలుగు చిరునామాల్లో కూడా ఈ కంపెనీ ఆనవాళ్లు దొరకలేదు. పైగా రిత్విక్ ప్రాజెక్టులో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న సాయిబాబా వద్ద ఎడ్కో కంపెనీకి చెందిన స్టాంపులు దొరకడంతో గుట్టు రట్టయ్యింది. ఇలా దొంగ వ్యాపారాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని టీడీపీకి ఇస్తుండటంతో ఆయన్ని చంద్రబాబు వరుసగా రెండో సారి కూడా రాజ్యసభకు పంపించారు. బకాయిల ‘గంటా’ మంత్రి గంటా శ్రీనివాసరావుకు సంబంధించిన ప్రత్యూష గ్రూప్ కంపెనీలు వివిధ బ్యాంకులకు వడ్డీతో కలిపి రూ.196.51 కోట్ల మేర బకాయిలు పడ్డాయి. రూ.141 కోట్ల రుణం తీసుకొని ఇప్పటి వరకు ఒక్క వాయిదా కూడా చెల్లించకపోవడంతో ఇండియన్ బ్యాంకు ప్రత్యూష గ్రూప్‌కు చెందిన ఆస్తుల స్వాధీనానికి రంగంలోకి దిగింది. ఈ రుణానికి గంటా శ్రీనివాసరావు హామీ ఉండటంతో మంత్రికి చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్లు పత్రికా ప్రకటనలు కూడా జారీ చేసింది. ఇప్పుడు ఈ బకాయిల విలువ రూ.203.62 కోట్లకు చేరింది. దీంతో మంత్రికి చెందిన మరిన్ని ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకులు రంగంలోకి దిగాయి. రాయపాటి ఇంటి ముందు బ్యాంక్ సిబ్బంది ధర్నాలు.. ఇక టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ కంపెనీ ఏకంగా వివిధ బ్యాంకుల నుంచి రూ.4,300 కోట్ల రుణాలు తీసుకొని.. వాటిని తిరిగి చెల్లించలేదు. దీంతో కెనరా బ్యాంకు రూ.735 కోట్ల రుణానికి సంబంధించి పిటిషన్ దాఖలు చేసింది. ఆంధ్రా బ్యాంక్ ఉద్యోగులైతే తామిచ్చిన రూ.434 కోట్ల రుణం తిరిగి చెల్లించాలంటూ రాయపాటి ఇంటి ముందు ఏకంగా ధర్నాలు చేశారు. పైగా ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టును నిర్మించే సత్తా రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌కి లేదని అందరూ మొత్తుకున్నా కూడా చంద్రబాబు ఆ కంపెనీకి అండగా నిలబడ్డారు. ‘ఆది’ రాకతో ‘కేశవరెడ్డి’ కేసు మూలకు.. బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ప్రముఖ ఆర్థిక మోసాల్లో కేశవరెడ్డి స్కూల్ డిపాజిట్ల స్కీం ఒకటి. పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిపాజిట్ల రూపంలో రూ.700 కోట్లకు పైగా నగదు సేకరించి కేశవరెడ్డి నాగిరెడ్డి బోర్డు తిప్పేశారు. ఈ కేసును బూచిగా చూపించి కేశవరెడ్డి వియ్యంకుడైన ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి చేర్చుకొని మంత్రినే చేశారు. దీంతో ఈ కేసు వెలుగులోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా డిపాజిట్‌దారులకు ఇప్పటికీ ఒక్క పైసా కూడా రాలేదు. ‘వైస్రాయ్’ ప్రభాకరరెడ్డి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు వెన్నుపోటుకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన ‘వైస్రాయ్’ ప్రభాకర్‌రెడ్డి కూడా పెద్ద ఎత్తున బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టాడు. దీంతో ఆయన ఆస్తుల స్వాధీనానికి బ్యాంకులు నోటీసులు జారీ చేశాయి. రూ.310 కోట్ల రుణం చెల్లించకపోవడంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ బెంగళూరులోని ఆస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ చేసింది. రూ.వందల కోట్లు ఎగవేసిన ‘వాకాటి’ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డికి చెందిన వీఎన్ఆర్ ఇన్ఫ్రా, పవర్‌టెక్, లాజిస్టిక్స్ కంపెనీలు వివిధ బ్యాంకుల నుంచి రూ.529.34 కోట్ల రుణాలు తీసుకొని తిరిగి చెల్లించటం లేదు. దీంతో ఈ రుణాలకు హామీగా ఉన్న వాకాటి నారాయణరెడ్డికి చెందిన స్థిరాస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్లు బ్యాంకులు ప్రకటించాయి. దీనిపై డెట్ రికవరీ ట్రిబ్యునల్.. ఈ ఆస్తులు అమ్మి రుణం తీర్చడానికి ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పాలంటూ తాజాగా నోటీసులు జారీ చేసింది. మరోవైపు తప్పుడు పత్రాలిచ్చి రుణం తీసుకున్నారంటూ బ్యాంకులు సీబీఐని ఆశ్రయించాయి. దీంతో కేసు నమోదు చేసిన సీబీఐ వాకాటి ఇంటిపై దాడులు కూడా నిర్వహించింది. చెప్పుకుంటూ పోతే ఎందరో ఎగవేతదారులు.. బోర్డులు తిప్పిసి రూ.వేల కోట్ల మేర మోసం చేసిన ఘనులు టీడీపీలో చాలా మందే ఉన్నారు. శేఖర్‌రెడ్డి, బీద మస్తాన్‌రావు, బొల్లినేని కృష్ణయ్య వంటి వారితో పాటు.. టీడీపీకి పరోక్షంగా మద్దతిస్తున్న కంపెనీలు కూడా రూ.వందలాది కోట్ల మేర రుణాలు ఎగ్గొట్టాయి. వీటిలో బి.శీనయ్య కంపెనీ, సోమా కనస్ట్రక్షన్స్, మిక్ ఎలక్ట్రానిక్స్, బార్ట్రానిక్స్, నంది గ్రూపు, ప్రొగ్రెసివ్ కన్స్ట్రక్షన్, వెలగపూడి స్టీల్స్, టోటెమ్ ఇన్ఫ్రా ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. రూ.వేల కోట్లకు ‘నామా’ టీడీపీలో నిన్నమొన్నటి వరకు కీలక నేతగా ఉన్న నామా నాగేశ్వరరావుది కూడా ‘దొంగ’ చరిత్రనే. మధుకాన్ ప్రాజెక్ట్స్ చేపట్టిన ఎన్‌హెచ్–33 ప్రాజెక్టులో రూ.264.01 కోట్లను పక్కకు తరలించడం ద్వారా సీబీఐకి అడ్డంగా దొరికిపోయారు. రూ.1,655 కోట్ల విలువైన రాంచి–జంషెడ్పూర్ జాతీయ రహదారికి చెందిన ప్రాజెక్టులో.. బ్యాంకుల నుంచి మోసపూరితంగా రూ.1,029.39 కోట్ల రుణాలు తీసుకున్నాడు. అందులోంచి రూ.264.01 కోట్లను దారి మళ్లించినట్లు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ గుర్తించింది. దీంతో సీబీఐ రంగంలోకి దిగి కంపెనీకి చెందిన ముగ్గురు డైరెక్టర్లపై కేసులు నమోదు చేయడమే కాకుండా.. బ్యాంకు రుణాలకు గ్యారంటీగా పెట్టిన రూ.73.95 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ‘మధుకాన్’ మోసాలను ముందే గుర్తించిన ప్రపంచ బ్యాంకు తన ప్రాజెక్టుల నుంచి ఈ సంస్థను నిషేధిస్తూ గతేడాది నిర్ణయం తీసుకుంది. -
బాబు బినామీకి రూ.460 కోట్లు!
సాక్షి, అమరావతి: అధికారంలో ఉన్నప్పుడే అందినంత దోచుకోవాలన్న కొత్త నీతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సృష్టించారు. తన బినామీ, టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ సంస్థకు ఇప్పటికే ఎన్నోసార్లు లబ్ధి చేకూర్చిన చంద్రబాబు గాలేరు-నగరి సుజల స్రవంతి రెండో దశ పనులు సైతం అదే సంస్థకు అధిక ధరలకు దక్కేలా తన అధికార బలం ఉపయోగించారు. ఈ వ్యవహారంలో సీఎం రమేశ్‌కు ఉత్తినే రూ.460 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. ఇందులో మెజారిటీ వాటా కమీషన్ల రూపంలో ముఖ్యమంత్రి జేబులోకి వెళ్లనుంది. చంద్రబాబు అడ్డగోలుగా అధికార దుర్వినియోగానికి ఇదొక నిదర్శనమని అధికార వర్గాలు చెబుతున్నాయి. గాలేరుృనగరి సుజల స్రవంతి పథకం రెండో దశలో మొదటి ప్యాకేజీలో రూ.69.89 కోట్ల పనులు మాత్రమే మిగిలాయి. రెండో ప్యాకేజీలో రూ.110 కోట్ల విలువైన పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ను బెదిరించి, ఒప్పందాన్ని రద్దు చేసుకునేలా(ప్రీృక్లోజర్) ప్రభుత్వానికి దరఖాస్తు చేయించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు జల వనరుల శాఖ అధికారులు ఆమోదించారు. తర్వాత 2018ృ19 స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్(ఎస్ఎస్ఆర్) ఆధారంగా మిగిలిపోయిన పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేశారు. బినామీపై అంతులేని ప్రేమ తన బినామీ సీఎం రమేశ్ సంస్థ రిత్విక్ ప్రాజెక్ట్స్‌కే పనులు దక్కేలా నిబంధనలు రూపొందించి, టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. దాంతో మొదటి ప్యాకేజీ పనులకు రూ.391.31 కోట్ల అంచనా వ్యయంతో ఫిబ్రవరి 11న ఎల్ఎస్(లంప్సమ్)ృఓపెన్ పద్ధతిలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఫిబ్రవరి 25న టెక్నికల్ బిడ్ తెరిచారు. రిత్విక్ ప్రాజెక్టŠస్, ఎన్సీసీ, ఎమ్మార్కేఆర్, ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థలు షెడ్యూళ్లను దాఖలు చేశాయి. ఇందులో తస్మదీయులకు చెందిన ఎమ్మార్కేఆర్, ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థలకు అర్హతలు ఉన్నా.. ఆ సంస్థలు దాఖలు చేసిన షెడ్యూళ్లపై అనర్హత వేటు వేశారు. కోటరీలోని ఎన్సీసీ.. రిత్విక్ ప్రాజెక్ట్స్ కంటే ఎక్కువ ధరకు కోట్ చేస్తూ షెడ్యూల్ దాఖలు చేసేలా చక్రం తిప్పారు. అన్ని అర్హతలు ఉన్నా అనర్హత వేటు వేయడంపై ఇతర సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. కేసు విచారణలో ఉండగానే సీఎం చంద్రబాబు ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు బుధవారం ఫైనాన్స్ బిడ్ తెరిచారు. సీఎం రమేశ్ సంస్థ 3.99 శాతం ఎక్సెస్(రూ.406.73 కోట్లు), ఎన్సీసీ 4.65 శాతం ఎక్సెస్(రూ.409.50 కోట్లు) కోట్ చేస్తూ షెడ్యూలు దాఖలు చేసినట్లు వెల్లడైంది. వీటిని గురువారం కమిషనర్ ఆఫ్ టెండర్స్(సీవోటీ) పరిశీలనకు పంపారు. అదేరోజు సమావేశమైన సీవోటీ.. సీఎం చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గి నిబంధనలకు విరుద్ధంగా టెండర్‌ను ఆమోదించింది. సాధారణ పరిస్థితుల్లో టెండర్ నిర్వహించి ఉంటే కనీసం పది శాతం తక్కువకు పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకొచ్చేవారు. అప్పుడు సర్కార్‌కు రూ.54.74 కోట్ల మేర మిగిలేది. అంచనా వ్యయాన్ని రూ.321.42 కోట్లు పెంచడం వల్ల కాంట్రాక్టర్‌కు భారీ ఎత్తున లబ్ధి చేకూర్చారు. ఈ వ్యవహారంలో సీఎం రమేశ్‌కు కనీసం రూ.250 కోట్ల మేర ప్రయోజనం కలిగిందని అధికారవర్గాలే చెబుతున్నాయి. తస్మదీయ కంపెనీలపై అనర్హత వేటు రెండో ప్యాకేజీ పనులకు రూ.343.52 కోట్ల అంచనా వ్యయంతో ఫిబ్రవరి 27న ఎల్ఎస్ృఓపెన్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ టెండర్లో శుక్రవారం టెక్నికల్ బిడ్‌ను తెరిచారు. ఇందులోనూ యథావిధిగా తస్మదీయులకు చెందిన ఎమ్మార్కేఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థకు అన్ని అర్హతలు ఉన్నా అనర్హత వేటు వేయించారు. శనివారం ప్రైస్ బిడ్ తెరిచి.. దాదాపు 4.76 శాతం ఎక్సెస్‌కు షెడ్యూలు దాఖలు చేసిన సీఎం రమేష్ సంస్థ రిత్విక్ ప్రాజెక్ట్స్‌కు ఈ పనులను సైతం అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.50.70 కోట్ల మేర భారం పడుతుంది. అంచనా వ్యయాన్ని రూ.233.52 కోట్ల మేర పెంచడం ద్వారా సీఎం రమేశ్ సంస్థకు భారీ ఎత్తున ప్రయోజనం చేకూర్చారు. ఈ వ్యవహారంలో సీఎం రమేశ్‌కు రూ.210 కోట్ల మేర ప్రయోజనం చేకూరనున్నట్లు జలవనరుల శాఖ కీలక అధికారి ఒకరు చెప్పారు. అంటే రెండు ప్యాకేజీల్లో కలిపి చంద్రబాబు బినామీకి ఏకంగా రూ.460 కోట్ల లాభ అన్నమాట! -
టీడీపీ ఎంపీ సీఎం రమేష్ వాట్సాప్ అకౌంట్‌ను రద్దు
-
టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు వాట్సాప్ షాక్
సాక్షి, అమరావతి : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అన్నంత పనీ చేసింది. అనుమానాస్పద, వివాదాస్పద ఖాతాలను తొలగిస్తామని ఇటీవల ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు భారీ షాక్ ఇచ్చింది. సంస్థ నిబంధనలు ఉల్లంఘించడంతో ఆయన వాట్సాప్ అకౌంట్‌ను రద్దు చేసింది. వాట్సాప్ ఇతర వినియోగదారుల నుంచి అందిన ఫిర్యాదులపై విచారణ అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తన వాట్సాప్ అకౌంట్ పనిచేయడం లేదంటూ సీఎం రమేశ్ పంపిన లేఖకు స్పందించిన సంస్థ ఈ వివరణ ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వివాదాస్పద రాజకీయ పోస్టులు, కామెంట్లపై కఠినంగా వ్యవహరించనున్నట్లు సోషల్ మీడియా సంస్థలు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల అకౌంట్లపై నిఘా పెట్టింది. అయితే ఇలా కీలకమైన ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం కావాలనే తనపై ఇలాంటి కుట్రలు చేస్తోందని సీఎం రమేష్ ఆరోపించారు. అయితే పొరపాటున తప్పు జరిగి వుంటే ..ఇకపై అలాంటిది జరగకుండా చూసుకుంటానని తన ఖాతాను పునరుద్ధరించాలని ఆయన వాట్సాప్‌ను కోరారు. -
సీఎం రమేష్ చెప్పినట్టు వినాలి
సాక్షి, అమరావతి: తప్పు చేసిన వారిని శిక్షించాల్సిన ప్రభుత్వ పెద్ద.. తప్పు చేసిన వారికే పనులు అప్పగించాలని అధికారులపై తీవ్ర స్థాయిలోఒత్తిడి తెచ్చారు. ఈ వ్యవహారానికి తెలుగుగంగ ప్రధాన కాలువలో మిగిలిపోయిన లైనింగ్ పనుల టెండర్ వేదికైంది. వివరాల్లోకి వెళితే.. తెలుగుగంగ ప్రాజెక్టు పనుల అంచనా వ్యయాన్ని రూ. 4,460.64 కోట్లుగా ఖరారు చేస్తూ మార్చి 20, 2007న అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టులో 2009 నాటికి 95 శాతం పనులు పూర్తయ్యాయి. కేవలం 5 శాతం పనులు మాత్రమే మిగిలి ఉండగా అంచనా వ్యయాన్ని రూ. 6,671.62 కోట్లకు పెంచేస్తూ 2018 మార్చి 9న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయించింది. అడ్డగోలుగా పెంచేసిన అంచనా వ్యయంతో.. మిగిలిన పనులను బినామీ కాంట్రాక్టర్‌కు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకోవడానికి సీఎం చంద్రబాబు ఆదిలోనే స్కెచ్ వేశారు. తెలుగుగంగ ప్రధాన కాలువ 0.00 కి.మీ నుంచి 18.20 కి.మీ వరకు లైనింగ్ చేయడం, 18.200 కి.మీ నుంచి 42.566 కిమీ వరకు గతంలో లైనింగ్ చేయకుండా మిగిలిపోయిన పనులు, బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ (బీసీఆర్) నుంచి వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటిని సరఫరా చేసే లింక్ ఛానల్ 0.00 కి.మీ నుంచి 7.380 కి.మీ వరకు లైనింగ్ చేయకుండా మిగిలిపోయిన పనులను చేపట్టాలని నిర్ణయించారు. 2007 నాటి ఉత్తర్వుల ప్రకారం ఈ పనుల విలువ రూ.172.99 కోట్లు. కానీ.. మార్చి 9, 2018న జారీ చేసిన ఉత్తరులలో ఈ పనుల విలువను రూ. 180.48 కోట్లుగా ఖరారు చేశారు. ఆ పనుల వ్యయాన్ని మళ్లీ పెంచాలని ముఖ్యనేత ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. వాటికి తలొగ్గిన అధికారులు ఆ పనుల అంచనా వ్యయాన్ని రూ. 280.27 కోట్లకు పెంచేస్తూ జూన్ 8, 2018న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పనులకు రూ. 239.03 కోట్లను అంతర్గత విలువగా నిర్ణయించిన అధికారులు.. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థకు ఆ పనులు దక్కేలా నిబంధనలతో జూలై 16న ఎల్ఎస్–ఓపెన్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నెలల్లో ఈ పనులకు పూర్తి గడువు విధించారు. జూలై 31న టెక్నికల్ బిడ్‌ను తెరిచారు. సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థతో పాటు ష్యూ, హెచ్‌ఈఎస్ ఇన్‌ఫ్రాలు బిడ్లు దాఖలు చేశాయి. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో.. పనులు చేసిన అనుభవం లేకున్నా ఉన్నట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రాలను చూపి.. అధికార బలంతో పనులు దక్కించుకోవడంలో రిత్విక్‌ది అందెవేసిన చేయిగా జలవనరుల శాఖ అధికారవర్గాలు చెబుతున్నాయి. తెలుగు గంగ లైనింగ్ పనుల టెండర్లో టెక్నికల్ బిడ్‌ను తెరిచిన సమయంలో రిత్విక్ సంస్థ తప్పుడు అర్హత పత్రాలు సమర్పించినట్లు ష్యూ సంస్థ ప్రతినిధులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో మీర్జాపూర్, అలహాబాద్ జిల్లాల పరిధిలో బన్సాగర్ కెనాల్ ప్రాజెక్టు పనులను రిత్విక్ సంస్థ సబ్ కాంట్రాక్టర్లతో చేయించిందని.. కానీ ఆ పనులు తానే చేసినట్లు తప్పుడు పత్రాలు సమర్పించిందని, ఈ నేపథ్యంలో ఆ సంస్థపై అనర్హత వేటు వేయాలని కోరారు. కానీ, ఉన్నత స్థాయి ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఆగస్టు 6న ప్రైస్ బిడ్ తెరిచారు. 2.88% అధిక ధర (ఎక్సెస్)కు రిత్విక్ (ఎల్–1), 3.61% ఎక్సెస్‌కు ష్యూ (ఎల్–2), 4.31 శాతం ఎక్సెస్‌కు హెచ్‌ఈఎస్ (ఎల్–3) సంస్థలు బిడ్లు దాఖలు చేసినట్లు వెల్లడైంది. ఎల్–1గా నిలిచిన రిత్విక్ సంస్థకు పనులు అప్పగించాలని సీవోటీకి అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ అక్రమ వ్యవహారాన్ని ‘సాక్షి’ బహిర్గతం చేసింది. టెండర్‌ను ఖరారు చేసి సీఎం రమేష్‌కు అప్పగించాలని నవంబర్ 30న సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఈ అంశాన్ని ‘సాక్షి’ బయటపెట్టింది. దాంతో సీవోటీ అధికారులు టెండర్‌ను రద్దు చేశారు. అయినా తీరు మారలేదు.. తెలుగుగంగ ప్రధాన కాలువలో మిగిలిపోయిన లైనింగ్ పనులకు రూ. 239.03 కోట్ల అంచనా వ్యయంతో జనవరి 14న రెండోసారి టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. సీఎం రమేష్ సంస్థకే పనులు దక్కేలా నిబంధనలు పెట్టారు. ఇతర సంస్థలు టెండర్లో షెడ్యూళ్లు దాఖలు చేయకుండా ఇప్పటికే తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారు. ఈ క్రమంలో సీఎం రమేష్ చెప్పినట్టు విని.. పనులు ఆయనకు చెందిన సంస్థకే అప్పగించాలని జలవనరుల శాఖ అధికారులు, తెలుగుగంగ ప్రాజెక్టు అధికారులపై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ఈనెల 11లోగా షెడ్యూల్ దాఖలు చేసుకోవచ్చు. 12న టెక్నికల్ బిడ్.. 16న ఫైనాన్స్ బిడ్ ఖరారు చేసి సుమారు 4.85 శాతం అధిక ధర (ఎక్సెస్)కు సీఎం రమేష్ సంస్థ దాఖలు చేసిన షెడ్యూల్‌ను ఆమోదించి.. పనులు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేశారు. -
అన్నదమ్ములు.. అవినీతి అనకొండలు..
గ్రామానికి ఎక్కువ...మండలానికి తక్కువ స్థాయి కలిగిన రమేష్‌కు సీఎం చంద్రబాబు రాజ్యసభ సభ్యుడి పదవి కట్టబెడితే అడ్డంగా దోపిడీ చేస్తున్నారు. ఈ విషయం సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వెల్లడించారు. పోట్లదుర్తి బ్రదర్స్ అక్రమాలకు అంతే లేకుండా పోయిందని ఆరోపించారు. అందుకు నిదర్శనంగా జలయజ్ఞం పెండింగ్ పనులు నిలుస్తున్నాయి.వందల కోట్లల్లోనిలిచిపోయిన పనులు వేలకోట్లకు దక్కించుకున్నారు. నీరు– చెట్టు పథకంతో నిధులు కొల్లగొట్టారు. ఆర్టీపీపీలో ఉద్యోగాలు, కాంట్రాక్టు పనులు అడ్డంగా దోచేశారు. తుదకు ఐరన్ స్క్రాప్‌ను కూడా వదల్లేదు. పెన్నానది కేంద్రంగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడి కోట్లు ఆర్జించారు. అధికారం అండతో ఏటిపో రంబోకు భూమిని ఆక్రమించి సాగుచేస్తు న్నారు. రాజ్యసభ సభ్యుడు రమేష్ అవినీతి జిల్లా దాటి రాష్ట్రవ్యాప్తంగా విస్త రించిన నేపథ్యంలో సాక్షి ప్రత్యేక కథనం. ‘గ్రామానికి ఎక్కువ.. మండలానికి తక్కువ’ స్థాయి కల్గిన వారే అయినప్పటికీ ప్రభుత్వ అధినేత వద్ద పరపతి మెండుగాఉంది... ఆపై నడుచుకుంటూ వచ్చి హోదా వరించింది... అధికారం గుప్పిట్లో ఉండటంతో ప్రభుత్వ పథకాలతో కోట్లాది రూపాయాలు అప్పనంగా దండుకున్నారు... మరోవైపు పెన్నానదికి గర్భశోకం కల్గించి అక్రమార్జనకు తెరలేపారు... ఇంకోవైపు స్వగ్రామం చెంతనే ఆర్టీపీపీ ఉండటం అందివచ్చిన వరంగా మారింది... నిధుల దోపిడీకి పాల్పడుతూనాసిరకం పనులకుశ్రీకారం చుట్టారు...పెండింగ్‌లో ఉన్న జలయజ్ఞం పనుల అంచనాలను ఉన్నత స్థాయి పరపతితో అమాంతం పెంచుకొని వేలాది కోట్లు స్వాహా చేశారు... వెరసి వారు ‘ఆడిందే ఆట.. పాడిందే పాట’గా మారింది. వారు ఎవరో కాదు ‘పోట్లదుర్తి బ్రదర్స్’. సీఎం రమేష్, సీఎం సురేష్‌గా పిలువబడే వారి అవినీతి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. సాక్షి టాస్క్‌ఫోర్స్ : ప్రభుత్వ అండదండలతో పోట్లదుర్తి సోదరులు సీఎం రమేష్ నాయుడు, సీఎం సురేష్ నాయుడు అక్రమార్జనకు అడ్డే లేకుండా పోయింది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రోత్సాహంతో వీరు అంచెలంచెలుగా ఎదిగారు. జలయజ్ఞం పెండింగ్ పనులకు అమాంతంగా రేట్లు పెంచేసి, నామినేషన్‌పైన అప్పగించడం వరంగా మారింది. మునుపు పనులు చేసిన కాంట్రాక్టర్‌తో నిమిత్తం లేకుండా.. పెండింగ్‌లో ఉన్న పనులకు 200 శాతం అధికంగా రేట్లు పెంచి అప్పనంగా అప్పగించారు. జిల్లాలోని జీఎన్ఎస్ఎస్ పథకంలో భాగంగా ఫ్లడ్‌ఫ్లో కెనాల్ నుంచి ఇలాంటి తంతు ఆరంభమైంది. ఈ కెనాల్లో 29వ ప్యాకేజీలో రూ.52 కోట్ల పనులు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెండింగ్‌లో పడ్డాయి. నిలిచిపోయిన ఆ పనులకు టీడీపీ సర్కారు అంచనాలు పెంచి రూ.175.63 కోట్లకు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కాంట్రాక్టు సంస్థ అయిన రిత్విక్‌కు అప్పగించింది. ఇలా జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ తదితర పథకాలల్లో నిలిచిపోయిన రూ.800 కోట్ల పెండింగ్ పనుల అంచనాలు దాదాపు రూ.3 వేల కోట్లకు పెంచి రమేష్‌నాయుడు సంస్థకు అప్పగించారు. ‘సీఎం’తో చొరవ.. హోదా కారణంగా.. ముఖ్యమంత్రి అంతరంగికులుగా గుర్తింపు పడ్డ రమేష్‌నాయుడు సోదరులు జిల్లాలో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఏ స్థాయి అధికారి అయినా వీరి ఎదుట చేతులు కట్టుకొని నిలబడాల్సిందే. ఎక్కువ, తక్కువ మాట్లాడితే దాడి చేయడానికి కూడా వెనకాడని స్థితికి చేరారు. ఈ కారణంగా వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలో పెన్నానది ఏటి పొరంబోకు భూములను ఆక్రమించి పంటలు సాగు చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యుల పేర్లతో ఆక్రమించి స్మృతి వనాలు నిర్మించారు. సర్వే నంబర్ 906లో 736 ఎకరాల ఏటి పొరంబోకు భూమి ఉంది. ఇందులో 470 ఎకరాలు ఆక్రమణకు గురైంది. ప్రత్యేకించి వీరి కుటుంబ సభ్యుల నేతృత్వంలో 20 ఎకరాలు ఆక్రమించారని.. రెవెన్యూ అధికారులు స్మృతి వనానికి, ఏటి పోరంబోకు భూమికి నోటీసులు కూడా ఇచ్చారు. ఈ స్థలాల్లో ఏకంగా గదులు నిర్మించి, ఇటుకల తయారీ పరిశ్రమలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే హనుమనగుత్తి వద్ద వంక, ఏటి పొరంబోకు భూమినంతా ఆక్రమించడంతో వంక పూడిపోయింది. క్యూకట్టిన జలయజ్ఞం పెండింగ్ పనులు జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ జలయజ్ఞం పనులు కొన్ని పెండింగ్‌లో పడ్డాయి. ఈ పనులన్నీ తాజా అంచనాలంటూ అమాంతం పెంచి ఎంపీ రమేష్‌నాయుడు కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. అలా అప్పగించిన వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి. కుందూ– పెన్నా వరద కాలువ పనుల్లో 29వ ప్యాకేజీలో రూ.52 కోట్ల పనులు నిలిచిపోయాయి. అవే పనులను 240 శాతం అధికంగా రేట్లు పెంచి రూ.175.63 కోట్లకు అప్పగించారు. అలాగే 27వ ప్యాకేజీలో నిలిచిపోయిన పనులు రూ.126 కోట్లకు అప్పగించారు. సీబీఆర్ కుడి కాలువ పనులు రూ.27.15 కోట్లు, ముచ్చుమర్రి కెనాల్ విస్తరణ పనులు రూ.29 కోట్లు, గొడ్డుమర్రి ఆనకట్ట పనులు రూ.24.5 కోట్లు, హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్–2లో 2, 3 ప్యాకేజీలు రూ.192 కోట్లు, 6, 10 ప్యాకేజీలు రూ.71 కోట్లు, 9, 13, 17 ప్యాకేజీలు రూ.124.6 కోట్లకు అప్పగించారు. పుంగనూరు బ్రాంచ్ కెనాల్ పనులు రూ.29 కోట్ల విలువైనవి మిగిలిపోగా.. వాటిని రూ.151 కోట్లకు సీఎం రమేష్ కంపెనీకి అప్పగించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ రూ.432 కోట్లు కాగా.. అదనంగా రూ.143 కోట్ల అంచనాలు పెంచి అప్పగించారు. ఇలా రాయలసీమ వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న వందలాది కోట్ల పనులు వేల కోట్లుకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సోదరుని పరపతి.. జిల్లాలో సాగిలపడే యంత్రాంగం.. వెరసి పెన్నానది ఆధారంగా సురేష్‌నాయుడు ఇసుక వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రూ.కోట్లు కొల్లగొట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఎర్రగుంట్ల మండలం హనుమనగుత్తి గ్రామ సమీపాన పెన్నానదిలో క్వారీ పేరుతో దోపిడీ చేశారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇసుక క్వారీ మంజూరు చేయకపోవడం, ఆర్టీపీపీలో వేలాది కోట్ల నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో ఇసుక ద్వారా అక్రమార్జనకు పాల్పడ్డారు. హనుమనగుత్తి క్వారీలోకి సురేష్‌నాయుడు ఏర్పాటు చేసిన ట్రాక్టర్లు కాకుండా మరే ట్రాక్టర్లకు అనుమతులు ఉండేవి కావు. అటు ప్రొద్దుటూరు, ఇటు ఎర్రగుంట్ల, ఆర్టీపీపీ పరిసర ప్రాంతాల్లో ఇసుక కావాలంటే ట్రాక్టర్‌కు రూ.2,500 చెల్లించి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా అనధికారికంగా రుసుం వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన దాని కంటే ఎక్కువగా వంద రెట్లు అధికంగా ఇసుక తోడేసినా అడిగే అధికారే లేకపోయారు. ఇక్కడి ఇసుకను ఆర్టీపీపీలో డంప్ చేసి, అక్కడి నిర్మాణ పనులకు విక్రయించారు. ఈ వ్యవహారంపై అప్పట్లో ఆర్టీపీపీలో పెద్ద దుమారమే రేగింది. దౌర్జన్యాలు పోట్లదుర్తి గ్రామంలో సీఎం రమేష్ కుటుంబ సభ్యుల దౌర్జన్యాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. గట్టిగా ఎవరైనా ప్రతిఘటిస్తే అధికారుల ద్వారా అలాంటి వారి మెడలు వంచుతున్నారు. శివాలయం నడిగడ్డ వద్ద 100 ఎకరాలకు పైగా భూమలు ఉన్నాయి. వాటిపై సురేష్‌నాయుడు కన్ను పడింది. ఆ భూములు తమకే ఇచ్చేయాలంటూ ఒత్తిడి పెంచారు. ఇష్టమున్న లేకున్నా అప్పగించాలని బలవంతం చేశారు. పట్టా హక్కుదారుకు ఎకరాకు రూ.7 లక్షలు చెల్లించి స్వాధీనం చేసుకున్నారు. డీకేటీ పట్టాలున్న రైతులకు శఠగోపం పెట్టారు. భూములు నమ్ముకొని జీవించే వారిని జీవనోపాధి కోల్పోయేలా చేశారు. తమ వైరిపక్ష సామాజిక వర్గంపై ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. అలాంటి వారిపై మైనింగ్ అధికారులను ప్రయోగించి గనులు మూయించేశారు. అలాగే గనుల యజమానులు ఎవ్వరైనా సరే.. ఇతర పార్టీల వారితో వెళ్లకూడదంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఇవన్నీ ఇప్పటికీ చోటు చేసుకుంటుండటం గమనార్హం. కల్లు వ్యాపారం నుంచి అంచెలంచెలుగా ఎదిగి.. చింతకుంట సుబ్బనాయుడుది జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట్ల మండలంలో పోట్లదుర్తి గ్రామం. సాధారణ రైతు కుటుంబానికి చెందిన ఆయన తన కుమారులు చిన్న, చిన్న వ్యాపారాల వైపు వెళ్లేలా ప్రోత్సహించారు. ఈ క్రమంలో కమలాపురం, ప్రొద్దుటూరు ప్రాంతంలో కల్లు వ్యాపారం ఆరంభించారు. తదుపరి తన పెద్ద కుమారుడు మునిస్వామినాయుడు తన వ్యాపార వారసత్వంగా సారాయి అంగళ్ల వేలం పాటలలో పాల్గొన్నారు. ఈ క్రమంలో సారాయి వ్యాపారం క్రమక్రమంగా విస్తరించింది. జిల్లాలో పలు ప్రాంతాలతోపాటు ఇతర జిల్లాల్లో సారాయి వ్యాపార భాగస్వామిగా మునిస్వామినాయుడు వ్యాపారాన్ని విస్తరించారు. అందులో భాగంగా చిత్తూరు జిల్లాలో మద్యం వ్యాపారుల సిండికేట్ నిర్వాహకుల చెంతకు మునిస్వామినాయుడు తన తనయుడు చింతకుంట మునెయ్యగారి రమేష్‌నాయుడు (సీఎం రమేష్ నాయుడు)ను చేర్చారు. అక్కడ మద్యం వ్యాపారంలో దూసుకుపోయిన సీఎం రమేష్‌కు చంద్రగిరి ఎమ్మెల్యే రామ్మూర్తినాయుడితో సాన్నిహిత్యం ఏర్పడింది. 1995లో అనూహ్యంగా ముఖ్యమంత్రి పీఠాన్ని చంద్రబాబునాయుడు వరించడం సీఎం రమేష్‌కు లాభించింది. చిత్తూరు జిల్లాలో ఉన్న సంబంధాల రీత్యా రమేష్‌నాయుడు తక్కువ కాలంలోనే చంద్రబాబు అనుచరుడిగా చేరిపోయారు. ఆ తర్వాత 1999లో కాంట్రాక్టు సంస్థ ఏర్పాటు చేసి అనతి కాలంలోనే భారీ టర్నోవర్ దిశగా చేరింది. కాంట్రాక్టర్‌గా, వ్యాపారవేత్తగా సీఎం రమేష్ నిలదొక్కుకున్న తర్వాత తన సోదరుడు సురేష్‌నాయుడు పోట్లదుర్తి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే మునిస్వామి నాయుడు కుటుంబంలో మొదటి రాజకీయ పదవి. అంతకు మునుపు మునిస్వామి తమ్ముడు గోవర్ధన్‌నాయుడు సతీమణి భాగ్యమ్మ ఎర్రగుంట్ల మండలాధ్యక్ష పదవికి ఎంపికయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా అనూహ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2012లో సీఎం రమేష్ తొలిసారి రాజ్యసభకు ఎంపికయ్యారు. తర్వాత 2018 ఏప్రెల్ 3న రెండో పర్యాయం రాజ్యసభ సభ్యుడిగా మరోమారు ఎంపికయ్యారు. పోట్లదుర్తి మినహా ఎర్రగుంట్ల మండల వ్యాప్తంగా కూడా ప్రజాబలం లేని రమేష్‌నాయుడికి రాజ్యసభ సీటు రెండుసార్లు వరించడం గమనార్హం. అన్న ప్రాబల్యంతో సురేష్‌నాయుడు ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. బెల్టు చోరీలో ప్రధాన పాత్ర ఆర్టీపీపీలోని కోల్ ప్లాంట్ బెల్టు చోరీలో సురేష్‌నాయుడు అనుచరుల పాత్ర ప్రధానంగా ఉంది. ఈ విషయం అధికారులకు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. జెన్కో ఎండీ స్థాయిలో పరిచయాలు ఉండటంతో సీఈ స్థాయి అధికారి నోరుమెదపలేని పరిస్థితి. ఎట్టకేలకు కల్లమల్ల పోలీసుస్టేషన్లో ఎస్పీఎఫ్, కోల్‌ప్లాంట్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఎక్కడ తన మెడకు చుట్టుకుంటుందోనని అధికారులను బతిమలాడి సగం బెల్టును ఆర్పీపీపీకి తీసుకు వచ్చారు. దీనిపై ఏపీ జెన్కో విజిలెన్స్ అధికారులు విచారణ చేసి, చోరీ వాస్తవమేనని ఏపీ జెన్కో ఉన్నతాధికారులకు నివేదికలు కూడా ఇచ్చారు. లక్షలు విలువ చేసే బెల్ట్ అర్ధాంతరంగా కనుమరుగు కావడంతో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టి నిగ్గు తేల్చారు. ఆర్టీపీపీలోని కోల్ ప్లాంట్ బెల్టు చోరీలో సురేష్‌నాయుడు అనుచరుల పాత్ర ప్రధానంగా ఉంది. ఈ విషయం అధికారులకు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. జెన్కో ఎండీ స్థాయిలో పరిచయాలు ఉండటంతో సీఈ స్థాయి అధికారి నోరుమెదపలేని పరిస్థితి. ఎట్టకేలకు కల్లమల్ల పోలీసుస్టేషన్లో ఎస్పీఎఫ్, కోల్‌ప్లాంట్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఎక్కడ తన మెడకు చుట్టుకుంటుందోనని అధికారులను బతిమలాడి సగం బెల్టును ఆర్పీపీపీకి తీసుకు వచ్చారు. దీనిపై ఏపీ జెన్కో విజిలెన్స్ అధికారులు విచారణ చేసి, చోరీ వాస్తవమేనని ఏపీ జెన్కో ఉన్నతాధికారులకు నివేదికలు కూడా ఇచ్చారు. లక్షలు విలువ చేసే బెల్ట్ అర్ధాంతరంగా కనుమరుగు కావడంతో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టి నిగ్గు తేల్చారు. ఆర్టీపీపీ.. అక్షయపాత్ర పోట్లదుర్తి బ్రదర్స్ బినామీ కాంట్రాక్టర్ సంస్థలైన శ్రీనివాస కన్స్ట్రక్షన్స్, ద్వారకా కన్స్ట్రక్షన్స్ పనులు దక్కించుకోగా.. సురేష్‌నాయుడు కనుసన్నల్లో సాగాయి. ఆర్టీపీపీ సీఎస్ఆర్ ఫండ్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్షబులిటీ) పనుల్లో దోపిడీ చేశారు. ఎర్రగుంట్ల మండలంలో రూ.41 కోట్లతో వివిధ రోడ్ల పనులు చేశారు. చిలంకూరు నుంచి పోట్లదుర్తి వరకు రూ.16 కోట్లు, పి.గోపులాపురం నుంచి సిరిగేపల్లె వరకు రూ.1.20 కోట్లు, పోట్లదుర్తి గనుల రక్షణ గోడ పేరుతో రూ.1.30 కోట్లు, మాలపాడు నుంచి నిడిజువ్వి వరకు పొలాల మీదుగా రూ.4 కోట్లతో పనులు, ఎర్రగుంట్ల నుంచి వీ.ఎన్ పల్లె వరకు రూ.15 కోట్లు, పోట్లదుర్తి నుంచి ఎర్రగుంట్ల వరకు ప్యాచ్ వర్కులకు రూ.4 కోట్లు.. ఈ పనులన్నీ సురేష్‌నాయుడు నేతృత్వంలో సాగాయి. సీఎస్ఆర్ ఫండ్ కింద మంజూరైన పనులన్నీ నాసిరకంగా చేపట్టారు. ఎక్కడికక్కడ సీసీ రోడ్లు బీటలు వారాయి. తక్కువ సమయంలోనే సిమెంటు రోడ్లు నెర్రెలు బారి దర్శనమిస్తున్నా.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా చూస్తుండిపోయారు. మితిమీరిన దోపిడీ పోట్లదుర్తి బ్రదర్స్ దోపిడీ మితి మీరింది. అధికారం అండతో హనుమనగుత్తి గ్రామ పంచాయతీ పరిధిలో ఇసుకను కొల్లగొట్టి రూ.కోట్లు ఆర్జించారు. ఇదే గ్రామ సమీపంలో పునరావాస కేంద్రం ఏర్పాటుకు నిధుల అంచనాలు పెంచి దోచుకున్నారు. వీరు ఏమి చేసినా ప్రశ్నించే అధికారులు లేరు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ పునరావాస కేంద్రంలో నివాసాలు లేకపోయినా వందలాది దొంగ (నకిలీ) ఓట్లు ఎక్కించారు. – సత్యనారాయణరెడ్డి, ఎంపీటీసీ, హనుమనగుత్తి నీరు– చెట్టు పేరుతో దోచేశారు నీరు– చెట్టు పథకం పేరుతో పోట్లదుర్తి బ్రదర్స్ దోచేశారు. తూతూ మంత్రంగా పనులు చేసి బిల్లులు చేసుకున్నారు. అధికార పార్టీ నాయకులు కావడంతో అడిగేవారే లేరు. పోట్లదుర్తి నుంచి చిలంకూరు వరకు నీరు–చెట్టు పనుల్లో భాగంగా వేల మొక్కలు నాటినట్లు రికార్డుల్లో ఉన్నా.. ఒక్క మొక్క కూడా పెరగలేదు. రోడ్డుకు ఇళ్లు పోగోట్టుకున్న వారికి నష్ట పరిహారం చెల్లించకుండా ..నూతనంగా నిర్మించిన గృహాల్లో చేరాల్సిందిగా బలవంతంగా తరలించారు. తక్కువ డబ్బు ఇచ్చి, రైతులను బెదిరించి, మభ్యపెట్టి వందల ఎకరాలు కొనుగోలు చేశారు. – సుధాకర్‌రెడ్డి, పోట్లదుర్తి అవినీతిలో ఆరితేరారు రాష్ట్రంలో అతిపెద్ద అవినీతి తిమింగళం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌నాయుడు. ప్రజల్లో పట్టు లేకపోయినా ప్రభుత్వ అధినేత వద్ద పరపతి ఉండటంతో ఇష్టారాజ్యంగా దోపిడీ పర్వం కొనసాగింది. ఆయన కుటుంబం నియంతృత్వం కారణంగా భూములు వదిలి వెళ్లాల్సిన దుస్థితి పోట్లదుర్తిలో ఉంది. వీరి కుటుంబం ప్రొద్దుటూరు కేంద్రంగా దందాలు చేస్తోంది. – హనుమంతరెడ్డి, జమ్మలమడుగు -
రిత్విక్ ప్రాజెక్ట్స్‌కు మరో రూ.21.95 కోట్లు
సాక్షి, అమరావతి: రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థకు కుప్పం బ్రాంచ్ కెనాల్లో మట్టి పనులకు అదనంగా రూ.21.95 కోట్లు ఇవ్వడానికి ఆమోదం తెలుపుతూ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే కాంక్రీట్ పనుల్లో రూ.122.75 కోట్లను సీఎం రమేష్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఇచ్చేయడం గమనార్హం. వాస్తవానికి కుప్పం బ్రాంచ్ కెనాల్ అలైన్‌మెంట్‌ను మార్చడం వల్ల కాలువ పొడవు 20 కి.మీలు తగ్గింది. ఆ మేరకు బిల్లుల్లో కోత పెట్టాల్సిన ప్రభుత్వం, ఆ పని చేయకపోగా అదనంగా రూ.144.7 కోట్లు కట్టబెట్టడంపై అధికారవర్గాలే నివ్వెరపోతున్నాయి. సీఎం చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంకు హంద్రీ–నీవా రెండో దశలో పుంగనూరు బ్రాంచ్ కెనాల్ నుంచి కృష్ణా జలాలను తరలించడానికి రూ.403.65 కోట్లతో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు 2015లో టెండర్లు పిలిచారు. పుంగనూరు బ్రాంచ్ కెనాల్లో 207.8 కి.మీ నుంచి 143.9ల కి.మీ పొడవు ఈ కెనాల్ తవ్వాలి. రూ.207 కోట్లతో పూర్తయ్యే ఈ పనుల అంచనాను రూ.403.65 కోట్లకు పెంచేసి టెండర్ పిలిచిన ప్రభుత్వం.. 4 శాతం అదనపు (ఎక్సెస్) ధరలకు, అంటే రూ.430.26 కోట్లకు కోట్ చేస్తూ.. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డికి చెందిన ఆర్కే ఇన్ఫ్రా–కోయా–హెచ్‌ఈఎస్ (జేవీ) దాఖలు చేసిన సింగిల్ బిడ్‌ను నిబంధనలకు విరుద్ధంగా ఆమోదించేసింది. అయితే ఉత్తినే రూ.223 కోట్లు మిగలనుండటంతో ఈ పనులపై సీఎం రమేష్ కన్ను పడింది. అంతే.. సీఎం చంద్రబాబు ఒత్తిడి మేరకు నిబంధనలకు విరుద్ధంగా ఈ పనులను దొడ్డిదారిన జలవనరుల శాఖ అధికారులు ఆయనకు కట్టబెట్టేశారు. తాజాగా మరో రూ.21.95 కోట్లు ఈ నేపథ్యంలో ఎంబాక్‌మెంట్ పనులకు అదనంగా రూ.91 కోట్లు చెల్లించాలంటూ రిత్విక్ సంస్థ మళ్లీ ప్రతిపాదనలు పంపింది. గతంలోలాగే ఎస్ఎల్ఎస్సీ కుదరదని చెప్పింది. ముఖ్యనేత మరోసారి జోక్యం చేసుకోవడంతో ఆ ప్రతిపాదనను నవంబర్ 22, 2018న బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ (బీవోసీఈ)కు పంపారు. తీవ్రస్థాయి ఒత్తిళ్లతో బీవోసీఈ రూ.21.95 ఆదనపు చెల్లింపులకు ఆమోదించింది. ఈ నేపథ్యంలోనే జలవనరుల శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మట్టి పనుల్లో అదనంగా మరో రూ.69 కోట్లు ఇవ్వాల్సిందిగా రిత్విక్ సంస్థ పట్టుబడుతున్నట్లు జలవనరుల శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. తొలుత రూ.122.75 కోట్లు కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం 90 శాతం తవ్వకం.. పది శాతం భూమిపై గట్ల (ఎంబాక్‌మెంట్) నిర్మాణం ద్వారా చేయాలి. కానీ రిత్విక్ సంస్థ ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండానే డిజైన్ మార్చేసింది. 60 శాతం తవ్వకం, 40 శాతం ఎంబాక్‌మెంట్ ద్వారా కాలువ పని చేసింది. డిజైన్ మార్చితే సీడీవో (సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్) చీఫ్ ఇంజనీర్ ఆమోదం పొందాలి. జలవనరులు, ఆర్థిక శాఖ అనుమతులూ తప్పనిసరి. ఇవేమీ పట్టించుకోకుండా పనులు చేసిన సంస్థ.. ఎంబాక్‌మెంట్ ద్వారా చేసిన పనులకు, కాంక్రీట్ పనులకు అదనంగా రూ.213.75 కోట్లు చెల్లించాలని స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ(ఎస్ఎల్ఎస్సీ)కి ప్రతిపాదనలు పంపింది. అయితే గడువులోగా పనులు పూర్తి చేయలేదని, అనుమతి తీసుకోకుండానే డిజైన్ మార్చేశారని, అందువల్ల అదనపు బిల్లులు చెల్లించడం కుదరదనిఎస్‌ఎల్‌ఎస్‌సీ తేల్చిచెప్పింది. దాంతో ముఖ్యనేత జోక్యం చేసుకుని అదనపు బిల్లులు చెల్లించడానికి వీలుగా ఏప్రిల్ 16, 2018న మంత్రివర్గంలో తీర్మానం చేయించారు. దాన్ని అమలు చేస్తూ మే 3, 2018న జలవనరుల శాఖ ఉత్తర్వులు (జీవో 32)జారీ చేసింది. వాటి ఆధారంగా కాంక్రీట్ పనులకు రూ.122.75 కోట్లను సీఎం రమేష్ సంస్థకు చెల్లిస్తూ సెప్టెంబర్ 7, 2018న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
అజేయ కల్లం సంచలన ఆరోపణలు
‘‘సాగునీటి ప్రాజెక్టుల్లో పెద్ద బాస్‌కు (సీఎం) భారీగా కమీషన్ అందుతోంది. ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఖర్చు చేసిన నిధుల్లో ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రులు, అధికార పార్టీ నేతలు 40 శాతం మేర కమీషన్ దండుకుంటున్నారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం గత నాలుగున్నరేళ్లలో ఖర్చు చేసినట్టు ప్రభుత్వం చెబుతున్న రూ.50,000 కోట్లలోనే ఏకంగా రూ.20,000 కోట్ల అవినీతి జరిగింది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఏకంగా రూ.20,000 కోట్ల అవినీతి జరిగిందని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అజేయ కల్లం సంచలన ఆరోపణలు చేశారు. దీంతోపాటు మొత్తం రూ.3 లక్షల కోట్లకుపైగా అవినీతి జరిగిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నింగి, నేల హద్దుగా అవినీతి పెచ్చుమీరుతోందని దుయ్యబట్టారు. సాగునీటి ప్రాజెక్టులు, ఇసుక, మట్టి, ఫైబర్ గ్రిడ్, నీరు–చెట్టు, నీటి కుంటలు, రెయిన్ గన్లు.. ఇలా ప్రతిదాంట్లోనూ అవినీతి రాజ్యమేలుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో 600 మంది ఒక్కొక్కరు రూ.500 కోట్లకుపైగా సంపాదించారని ధ్వజమెత్తారు. అంతేకాకుండా 50 మంది రూ.100 కోట్లకుపైగా, మరో 50 మంది రూ.50 కోట్లకుపైగా అక్రమంగా ఆర్జించారని చెప్పారు. జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం కర్నూలులో నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సదస్సుకు అజేయ కల్లం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే... కమీషన్ల కోసమే ప్రైవేట్ కరెంటు కొనుగోళ్లు రాష్టంలో చేపడుతున్న కాంట్రాక్టులన్నీ కేవలం కొన్ని కంపెనీలకు... నవయుగ, మేఘా, కావూరి, రాయపాటి, సీఎం రమేష్‌కు చెందిన కంపెనీలకు మాత్రమే అప్పగిస్తున్నారు. వీరు ఎక్కడా పనులు చేయడం లేదు. సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి నేరుగా 8 శాతం వరకు కమీషన్లు మింగేస్తున్నారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు, సెల్ఫోన్ల కొనుగోళ్లలోనూ భారీగా అవినీతి జరిగింది. ఇక నీరు–చెట్టు పథకం కింద రూ.10 లక్షల విలువైన పనులే కాకుండా.. రెండు పనులు కలిపి మొత్తం రూ.20 లక్షల పనులను కూడా నామినేషన్ విధానంలో కావాల్సిన వారికి అప్పగిస్తున్నారు. ఈ పనుల్లో లెక్కలేనంత అవినీతి చోటుచేసుకుంది. మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ రంగంలోని జెన్కో ప్లాంట్లలో గతంలో 90 శాతం ప్లాంట్లు ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్)తో నడిచేవి. ఇప్పుడు కమీషన్ల కోసం ప్రైవేటు కంపెనీల నుంచి కరెంటును కొనుగోలు చేస్తుండటంతో జెన్కో ప్లాంట్ల పీఎల్ఎఫ్ 50 శాతానికి పడిపోయింది. స్పీకర్ వ్యవస్థను భ్రష్టు పట్టించారు 23 మంది విపక్ష పార్టీ ఎమ్మెల్యేలను సంతల్లో పశువుల్లాగా కొనుగోలు చేసి స్పీకర్ వ్యవస్థను భ్రష్టు పట్టించారు. గ్రామ పంచాయతీకి దక్కాల్సిన ఇసుకను దోపిడీ చేసి సంపాదించిన సొమ్ముతో రూ.2 వేలు, రూ.5 వేలు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటామనే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి పోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. ఇసుక నుంచి మట్టి వరకు అన్ని పనుల్లోనూ అవినీతి రాజ్యమేలుతోంది. నీరు–చెట్టు కింద పనులు చేయకున్నా బిల్లులు మాత్రం చేసుకుంటున్నారు. ఇక నీటి కుంటలు(ఫారం పాండ్స్) తవ్వకపోయినప్పటికీ తవ్వినట్టుగా లెక్కలు చూపుతున్నారు. ఈ విధంగా 600 మంది రూ.500 కోట్లకుపైగా అక్రమంగా సంపాదించారు. 50 మంది రూ.100 కోట్లకుపైగా, మరో 50 మంది రూ.50 కోట్లకుపైగా సంపాదించినట్టు తెలుస్తోంది. అంటే కేవలం 600 మంది రూ.500 కోట్ల చొప్పున లెక్కిస్తే ఏకంగా రూ.3 లక్షల కోట్ల మేర అవినీతికి పాల్పడి ఆర్జించినట్టు స్పష్టమవుతోంది. ఫైబర్ లేదు.. గ్రిడ్ లేదు రాష్ట్రంలో చివరకు సెల్ఫోన్ల కొనుగోళ్లలోనూ అవినీతి జరుగుతోంది. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు చేపడతామని కేంద్ర ప్రభుత్వం చెబితే.. మేమే చేపడతామని రూ.400 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ఎక్కడా కనిపించడం లేదు. ఫైబర్ లేదు.. గ్రిడ్ లేదు. మార్కెట్లో కేవలం రూ.2,000కు దొరికే సెట్‌టాప్ బాక్సులను రూ.4,000కు అమ్ముతున్నారన్నారు. ఇలా ఏ రంగంలో చూసినా అవినీతే సాక్షాత్కరిస్తోంది. జనం సొమ్మును విచ్చలవిడిగా ధారపోస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌లో నింగి, నేల హద్దుగా అవినీతి పెరిగిపోయింది. ఏమిటీ అవినీతి అని ప్రశ్నిస్తే.. మా కార్యకర్తలు బతకొద్దా అని అధికార పార్టీ నేతలు అంటున్నారు. సేవ చేయడం కాకుండా దోచుకోవడమే పని అనేవాడు కార్యకర్త ఎలా అవుతాడు? ప్రోటోకాల్ రూపంలో భారీగా ఖర్చు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులు, అధికారులు చేసే ఖర్చుకు ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత పదింతలు ఖర్చు పెడుతున్నారు. ఒకవైపు లోటు బడ్జెట్ అంటూనే నవ నిర్మాణ దీక్షలు, ధర్మపోరాట దీక్షలు, పుష్కరాల పేరుతో ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జనం సొమ్మును విచ్చలవిడిగా ధారపోస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార పార్టీ రూ.200 కోట్లు ఖర్చు పెట్టింది. దేశంలోనే అత్యధిక ఎన్నికల వ్యయం జరిగిన ఎన్నికగా ఈ ఉప ఎన్నికలు గుర్తింపు పొందాయి. ఇలాంటి రాజకీయాలు మనకు అవసరమా? నీతిమాలిన రాజకీయాల నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వైఎస్‌కు పేరు రాకూడదనే... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పులిచింతల ప్రాజెక్టు పూర్తయ్యింది. అయితే నేటికి ప్రాజెక్టులో నీళ్లు నింపుకోవడానికి వీలు కావడం లేదు. ఇక్కడ భూసేకరణ కోసం తెలంగాణ రైతులకు రూ.200 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంది. ఆ పరిహారం చెల్లిస్తే తమకేమి వాటా రాదని ఏపీ ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తయితే వైఎస్ రాజశేఖరరెడ్డికి పేరు వస్తుందనే కాలయాపన చేస్తున్నారు. దోపిడీలో ఇక వారసుల వంతు ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి వెధవలైనా మంత్రులవుతున్నారు. కనీసం సర్పంచ్ కాకున్నా, ఏమాత్రం పరిజ్ఞానం లేకపోయిన, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా మంత్రులు అవుతున్నారు. అందులో భాగంగా ఎలాంటి రాజకీయ అనుభవం లేకున్నా కిడారి శ్రావణ్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో 25–30 మంది టీడీపీ నాయకుల వారసులు రాజకీయాల్లో రాబోతున్నారు. ఇప్పటికే నాన్నలు రాష్ట్రాన్ని దోచేశారు. ఇప్పుడు వారసులు కూడా వచ్చి దోచేయడమే పనిగా పెట్టకుంటారు. కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలు, అవినీతి నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలి. పొట్టి శ్రీరాములు, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి లాంటి త్యాగధనులను సమాజం హీరోలుగా గుర్తించాలి. ఏపీలో అత్యున్నత విద్యాసంస్థలేవీ? 1980కి ముందే హైదరాబాద్ గణనీయంగా అభివృద్ధి చెందింది. పీవీ నరసింహారావు, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డిల హయాంలోనే సైబర్స్ టవర్స్ కోసం పదెకరాల భూమి, రూ.4.5 కోట్లు కేటాయించారు. తరువాత వచ్చిన కొందరు నాయకులు దాని చుట్టూ భూములు కొనుగోలు చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ సైబరాబాద్ తామే నిర్మించినట్లు మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ప్రపంచంలోని అత్యున్నత 1,000 విద్యా సంస్థల్లో ఏపీలో ఒక్కటి కూడా లేదు. నేను 1970ల్లో బాపట్లలో అగ్రికల్చర్ చదువుతున్న సమయంలో మైక్రో ఇరిగేషన్ కింద రెయిన్గన్ల గురించి విన్నాను. ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా రైతులకు కూడా 1994ల్లో చూపించాం. ఇప్పటి పాలకులు తామే కొత్తగా రెయిన్గన్లను కనుగొన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. వాటి కొనుగోళ్లల్లోనూ అవినీతికి పాల్పడుతున్నారు. ఇప్పుడు ఆ రెయిన్గన్లు ఎక్కడ ఉన్నాయో కనిపించడం లేదు. వ్యవస్థలన్నీ కుప్పకూలాయి అసెంబ్లీలో గతంలో ప్రతిపక్ష నేతలు చెప్పే మాటలకు ఎంతో విలువ ఇచ్చేవారని రిటైర్డు డీజీపీ ఆంజనేయరెడ్డి గుర్తుచేశారు. అయితే, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కనీసం మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సదస్సులో ఆంజనేయరెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్యేల కొనుగోలు, విక్రయాలకు అసెంబ్లీ నిలయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. విపక్ష సభ్యులను అక్కడ మాట్లాడనీయకపోవడంతో రోడ్లపైన అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మిస్తుందని చెప్పినప్పటికీ కమీషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని చేపట్టడం దారుణమన్నారు. ఒక విపక్ష ఎమ్మెల్యేను సంవత్సరం పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తే ప్రజాస్వామ్యానికి విలువ ఏముంటుందని ప్రశ్నించారు. ఇందులో గవర్నర్, కోర్టులు ఎందుకు మౌనంగా ఉన్నాయో అర్థం కావడం లేదన్నారు. తెలంగాణలో అక్కడి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ప్రజలు ప్రశ్నిస్తున్నారని, అయితే, ఏపీలో మాత్రం మీడియా మాఫియాతో అ పరిస్థితి లేకుండా పోయిందని చెప్పారు. ఏపీలో కుల ప్రతిపాదికన రాజకీయాలు నడుస్తున్నాయని, ఇందుకు పాలక పక్షమే కారణమని ఆరోపించారు. రాజధానికి దొనకొండ అనుకూలమైన ప్రాంతమని శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇచ్చినా, దానిని పక్కనబెట్టి వరద, సునామీలు వచ్చే ప్రాంతమైన అమరావతిని ఎంపిక చేసి సారంతమైన 30 వేల ఎకరాల భూములను బీడుగా మార్చారని విమర్శించారు. అక్కడ అన్ని తాత్కాలిక భవనాలను ఏర్పాటు చేసే ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు ఏపీలో వ్యవస్థలన్నీ కుప్పకూలాయని, అవినీతి లేకుండా ఏ పనీ కావడం లేదని ఆంజనేయరెడ్డి మండిపడ్డారు. మానవ వనరుల సూచికలో ఏపీ 27వ స్థానంలో ఉందన్నారు. ఏపీని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత పాలకులకే దక్కుతుందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు కుదేలయ్యాయని... ఆయా రంగాల్లో సమూల మార్పులను తేవాల్సిన అవసరం ఉందని డాక్టర్ బ్రహ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. సిద్దేశ్వరం అలుగును నిర్మించని వారికి పాలించే హక్కు లేదన్నారు. మద్యపాన నిషేధాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో మార్పునకు నాంది పలకాలని జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణ్‌రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ తహసీల్దార్ రోషన్ అలీ, అజయ్‌కుమార్, కేవీ సుబ్బారెడ్డి, రవీంద్ర సుబ్బయ్య, డాక్టర్ సంజీవ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. - నేను 1970ల్లో బాపట్లలో అగ్రికల్చర్ చదువుతున్న సమయంలో మైక్రో ఇరిగేషన్ కింద రెయిన్గన్ల గురించి విన్నాను. ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా రైతులకు కూడా 1994ల్లో చూపించాం. ఇప్పటి పాలకులు తామే కొత్తగా రెయిన్గన్లను కనుగొన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. వాటి కొనుగోళ్లల్లోనూ అవినీతికి పాల్పడుతున్నారు. ఇప్పుడు ఆ రెయిన్గన్లు ఎక్కడున్నాయో కనిపించడం లేదు. - ఏమిటీ అవినీతి అని ప్రశ్నిస్తే.. మా కార్యకర్తలు బతకొద్దా అని అధికార పార్టీ నేతలు అంటున్నారు. - లోటు బడ్జెట్ అంటూనే నవ నిర్మాణ దీక్షలు, ధర్మపోరాట దీక్షలు, పుష్కరాల పేరుతో, ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జనం సొమ్మును విచ్చలవిడిగా ధారపోస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార పార్టీ రూ.200 కోట్లు ఖర్చు పెట్టింది. ఇలాంటి నీతిమాలిన రాజకీయాల నుంచి మనం బయట పడాలి. - ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి వెధవలైనా మంత్రులవుతున్నారు. కనీసం సర్పంచ్ కాకున్నా, ఏమాత్రం పరిజ్ఞానం లేకపోయినా, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా మంత్రులు అవుతున్నారు. -
‘రిత్విక్’పైనే విచారణ చేస్తారా!?
సాక్షి, అమరావతి : తన సంస్థ తప్పు చేస్తే.. విచారణ చేస్తారా అంటూ జలవనరుల శాఖ ఉన్నతాధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు బినామీ సీఎం రమేష్ చిందులు తొక్కినట్లు విశ్వసనీయ సమాచారం. విచారణ నివేదికను పక్కన పెట్టి తన సంస్థకే పనులు కట్టబెట్టాలంటూ ఆయన తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ఈయనకు ముఖ్యనేత కూడా వత్తాసు పలకడంతో చేసేదిలేక రూ.239.03 కోట్లను ఆయన సంస్థకే కట్టబెట్టడానికి సీవోటీ (కమిషనర్ ఆఫ్ టెండర్స్) సిద్ధమైనట్లు అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. తెలుగుగంగ ప్రాజెక్టు పనుల అంచనా వ్యయాన్ని రూ.4,460.64 కోట్లకు ఖరారు చేస్తూ మార్చి 20, 2007న అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2009 నాటికి 95 శాతం పనులు పూర్తయ్యాయి. కేవలం 5 శాతం పనులు మాత్రమే మిగిలిన నేపథ్యంలో అంచనా వ్యయాన్ని రూ.6,671.62 కోట్లకు పెంచేస్తూ 2018 మార్చి 9న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అడ్డగోలుగా పెంచేసిన అంచనా వ్యయంతో.. మిగిలిన పనులను బినామీ కాంట్రాక్టర్‌కు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకోవడానికి ముఖ్యనేత స్కెచ్ వేశారు. ఈ క్రమంలో తెలుగుగంగ ప్రధాన కాలువ 0.00 కి.మీ నుంచి 18.20 కి.మీ వరకూ లైనింగ్ చేయడం, 18.200 కి.మీ నుంచి 42.566 కి.మీ వరకూ గతంలో లైనింగ్ చేయకుండా మిగిలిపోయిన పనులు, బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ (బీసీఆర్) నుంచి వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటిని సరఫరా చేసే లింక్ ఛానల్ 0.00 కి.మీ నుంచి 7.380 కి.మీ వరకూ లైనింగ్ చేయకుండా మిగిలిపోయిన పనులను చేపట్టాలని నిర్ణయించారు. 2007 నాటి ఉత్తర్వుల ప్రకారం ఈ పనుల విలువ రూ.172.99 కోట్లు. కానీ.. ఈ ఏడాది మార్చి 9న జారీ చేసిన ఉత్తరులలో ఈ పనుల విలువను రూ.180.48 కోట్లుగా ఖరారు చేశారు. ఆ పనుల వ్యయాన్ని మళ్లీ పెంచాలని ముఖ్యనేత ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. వాటికి తలొగ్గిన అధికారులు ఆ పనుల అంచనా వ్యయాన్ని రూ.280.27 కోట్లకు పెంచేస్తూ జూన్ 8న ఉత్తర్వులు జారీచేశారు. ఈ పనులకు రూ.239.03 కోట్లను అంతర్గత విలువగా నిర్ణయించిన అధికారులు.. ముఖ్యనేత ఆదేశాల మేరకు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సంస్థకు ఆ పనులు దక్కేలా రూపొందించిన నిబంధనలతో జూలై 16న ఎల్ఎస్–ఓపెన్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీచేశారు. 18 నెలల్లో ఈ పనుల పూర్తికి గడువు విధించారు. జూలై 31న టెక్నికల్ బిడ్‌ను తెరిచారు. సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థతోపాటూ ‘స్యూ’, హెచ్‌ఈఎస్ ఇన్‌ఫ్రాలు బిడ్లు దాఖలు చేశాయి. రిత్విక్ అనర్హతపై స్యూ ఫిర్యాదు ఇదిలా ఉంటే.. తెలుగుగంగ ప్రధాన కాలువ లైనింగ్ పనుల టెండర్లలో టెక్నికల్ బిడ్‌ను తెరిచిన సమయంలో రిత్విక్ సంస్థ తప్పుడు అర్హత పత్రాలు సమర్పించినట్లు స్యూ సంస్థ ప్రతినిధులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్, అలహాబాద్ జిల్లాల పరిధిలో బన్సాగర్ కెనాల్ ప్రాజెక్టు పనులను రిత్విక్ సంస్థ సబ్ కాంట్రాక్టర్లతో చేయించిందని.. కానీ, ఆ పనులు తానే చేసినట్లు తప్పుడు పత్రాలు సమర్పించిందని.. ఈ నేపథ్యంలో ఆ సంస్థపై అనర్హత వేటు వేయాలని స్యూ సంస్థ ప్రతినిధులు కోరారు. కానీ, ఉన్నత స్థాయి ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఆగస్టు 6న ప్రైస్ బిడ్ తెరిచారు. 2.88 శాతం అధిక ధర(ఎక్సెస్)కు రిత్విక్ (ఎల్–1), 3.61 శాతం ఎక్సెస్‌కు స్యూ (ఎల్–2), 4.31 శాతం ఎక్సెస్‌కు హెచ్‌ఈఎస్ (ఎల్–3) సంస్థలు బిడ్లు దాఖలు చేసినట్లు వెల్లడైంది. ఎల్–1గా నిలిచిన రిత్విక్ సంస్థకు పనులు అప్పగించాలని సీవోటీకి అధికారులు ప్రతిపాదనలు పంపారు. నాపైనే విచారణకు ఆదేశిస్తారా? స్యూ సంస్థ ఫిర్యాదుతో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలంటూ తెలుగుగంగ ప్రాజెక్టు అధికారులను సీవోటీ ఆదేశించారు. దీంతో సీఎం రమేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన సంస్థపైనే విచారణకు ఆదేశిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే టెండర్లు ఆమోదించి తన సంస్థకు పనులు అప్పగించాలంటూ ఒత్తిడి తెచ్చారు. కానీ, ఆ ఒత్తిళ్లకు జలవనరుల శాఖ ఉన్నతాధికారులు తలొగ్గకపోవడంతో మూడు రోజుల క్రితం నేరుగా జలవనరుల శాఖ ఉన్నతాధికారుల వద్దకు చేరుకుని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యవహారాన్ని ముఖ్యనేత దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన కూడా జలవనరుల శాఖ ఉన్నతాధికారులపై మండిపడినట్లు చెబుతున్నారు. దాంతో చేసేదిలేక విచారణ నివేదికను పక్కన పెట్టి సీఎం రమేష్ సంస్థకు పనులు కట్టబెట్టేందుకు అధికారులు సిద్ధమైనట్లు సమాచారం. -
‘సుజనా చౌదరి, సీఎం రమేశ్‌లను అనర్హులగా ప్రకటించాలి’
సాక్షి, విజయవాడ: టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌లను అనర్హులుగా ప్రకటించాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఎథిక్స్ కమిటీ సభ్యుడిగా ఉన్న సుజనా చౌదరి పైనే దర్యాప్తు సంస్థలు ఆరోపణలు చేస్తున్నందున్న.. ఆయనకు ఎంపీగా కొనసాగే అర్హత లేదన్నారు. టీడీపీ ఎంపీల అవినీతిని చూసి ప్రజలు విస్తుపోతున్నారని విమర్శించారు. గురువారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ, ఈడీ దాడుల్లో టీడీపీ నేతల అవినీతి బయటపడుతున్నా.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సిగ్గు లేకుండా వారిని సమర్థిస్తున్నారని తెలిపారు. తన బినామీలను కాపాడుకునే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు రాజకీయాల్లో విశ్వసనీయత లేదన్నారు. టీడీపీ దొంగల పార్టీ అని ప్రజలకు తెలిసిపోయిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, టీడీపీ నేతలు ఆలీబాబా 40 దొంగల్లా వ్యవహరిస్తున్నారని జీవీఎల్ మండిపడ్డారు. లక్షల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దొంగిలిస్తే.. సంజాయిషీ అడగకూడదా అని ప్రశ్నించారు. తెలంగాణలో మహాకూటమికి ఓటమి తప్పదన్నారు. కాంగ్రెస్‌తో కలిస్తే ప్రజలు గుడ్డలు ఇప్పి తంతారంటూ టీడీపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తుచేశారు. ఇందిరా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని.. కానీ నేడు ఆ పార్టీని చంద్రబాబు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని అన్నారు. -
బాబు ట్రైనింగ్ ఇలానే ఉంటుంది: విజయసాయి
సాక్షి, హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో బినామీ సీఎం రమేశ్‌పై ఐటీ సోదాల్లో దోపిడీ వ్యవహారాలన్నీ బయటపడ్డాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మండిపడ్డారు. పుట్టుకతోనే వేల కోట్ల సంపన్నుడని బిల్డప్ ఇచ్చి, ఇప్పుడు కోర్టుకెళ్లి ఐటీ అధికారుల అంతుతేలుస్తానని వార్నింగ్ ఇస్తున్నాడని సీఎం రమేశ్‌పై నిప్పులు చెరిగారు. చంద్రబాబు ట్రైనింగ్ ఇలాగే ఉంటుందని ధ్వజమెత్తారు. సీఎం రమేశ్ సంస్థలపై ఐటీ అధికారుల దాడుల వార్తల కంటే డెకాయిట్ల వివరణనే కొన్ని మీడియా సంస్థలు ప్రముఖంగా ఇచ్చి స్వామి భక్తిని ప్రదర్శించుకున్నాయని విజయసాయి రెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు. pic.twitter.com/aDfo1xqKGd — Vijayasai Reddy V (@VSReddy_MP) November 28, 2018 -
‘వారిద్దరు దేశంలోనే నెంబర్ వన్ దొంగలు’
సాక్షి, విజయవాడ : టీడీపీ నాయకులు సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు అని బీజేపీ అధికార ప్రతినిధి క్రోసూరు వెంకట్ వ్యాఖ్యానించారు. వీరిద్దరు దేశంలోనే నెంబర్ వన్ దొంగలు అని ఎద్దేవా చేశారు. మంగళవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ... బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన కేసులో సుజనా చౌదరిపై ఈడీ దాడులు చేస్తోంటే సీఎం చంద్రబాబుతో సహా టీడీపీ నాయకులంతా వణికిపోతున్నారన్నారు. నిజంగా తప్పు చేయకుంటే భయపడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టింది చాలదన్నట్లు ప్రధాని మోదీ కావాలనే దాడులు చేయిస్తున్నారంటూ అసత్య ప్రచారం చేయడం వారికే చెల్లిందంటూ వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుద్ధా వెంకన్న కాల్ మనీ వ్యాపారస్తుడని, భూకబ్జాదారుడు అని ఆరోపించారు. అటువంటి వ్యక్తులకు మోదీని విమర్శించే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. -
సీఎం రమేశ్ గడ్డం కోసమే పునాది రాయి వేస్తారా
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు: రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ గడ్డం తీయడానికే సీఎం చంద్రబాబు ఉక్కు పరిశ్రమ కోసం పునాది రాయి వేస్తున్నారా అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ధ్వజమెత్తారు. రమేశ్ దీక్షా సమయంలో రెండు నెలల్లో పరిశ్రమ కోసం పునాది రాయి వేస్తామని చెప్పారని, నిన్నటి ప్రొద్దుటూరు సభలో మరో నెల రోజుల్లో అని, కేబినెట్ మీటింగ్‌లో నెల రోజుల్లో అని ప్రకటించారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యం లో రాయలసీమలో తన ఉనికిని కోల్పోకుండా ఉండేందుకు చంద్రబాబు ఉక్కు కర్మాగారం కోసం పునాది రాయి వేయాలని నిర్ణయించాడే తప్ప, పరశ్రమపై చిత్తశుద్ధి లేదన్నారు. స్థానిక 16వ వార్డులోని ముస్లిం మైనారిటీ నాయకుడు దాదాపీర్ స్వగృహంలో బుధవారం విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడారు. పరిశ్రమ ఏర్పాటుపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే విధి విధానాలను ప్రకటించాలని కోరారు. ఇందుకు అవసరమైన రూ.18వేల కోట్లు బడ్జెట్లో పెట్టకుండా, భూ సేకరణ చేపట్టకుండా, అవసరమైన ఖనిజం ఎలా వస్తుంది, నీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో తెలియకుండా పరిశ్రమ పెట్టడం అంత సులువా అని అన్నారు. కుందూ–పెన్నా పథకానికి సంబం ధించి 400 ఎకరాల భూమిని సేకరించేందుకే 11 ఏళ్లుగా ప్రభుత్వానికి చేతకాలేదని, అలాంటిది వేల ఎకరాల భూమిని ఇప్పటికప్పుడు ఏవిధంగా సేకరిస్తారన్నారు. పండుగపూట కూడా పాతమొగుడేనా అన్న చందంగా దీపావళి రోజున కూడా ప్రజలు చంద్రబాబు అబద్ధాలను వినాల్సి వస్తోం దన్నారు. నాలుగున్నరేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై ఏమి చేశాయని ప్రశ్నిం చారు. తీరా ఎన్నికల ముందు పునాది రాయి వేసి ఈ ప్రాంత వాసులను మభ్యపెట్టడానికి జిల్లా ప్రజలు ఏమైనా అమాయకులా అని అన్నారు. రమేశ్ కోసమే ఉక్కు పరిశ్రమ పేరుతో 11 రోజులపాటు సీఎం రమేశ్ ద్రవ రూపంలో ఆహారం తీసుకుని దొంగ దీక్ష చేశాడని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. ఆ ప్రకా రం ఆయన గడ్డం మూరెడు అయి, బారెడు పెరుగుతుందని ప్రస్తుతం పునాది రాయి వేస్తున్నారన్నారు. సీఎం రమేశ్ కేశఖండన కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేయడానికి టీడీపీ నేతలు వ్యూహం పన్నారన్నారు. రూ.వేల కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేస్తారని, ఇన్ని వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ఆర్థిక గణాంకాలు వేసి అందరిని భ్రమలో పెట్టే ప్రయత్నమే టీడీపీ నేతలు చేస్తున్నారన్నారు. ప్రజలెవ్వరూ ఈ నాటకాన్ని నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. సమావేశంలో వార్డు ఇన్చార్జి పాపిగారి నాగసుబ్బారెడ్డి, మార్కెట్ జాఫర్, వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, ఆటో నగర్ అసోసియేషన్ అధ్యక్షుడు నన్నే సాహెబ్ పాల్గొన్నారు. -
ఆ ముగ్గురు ఎక్కడ?
సాక్షి, అమరావతి: జాతీయ స్థాయిలో సంచలనం రేపిన రాష్ట్రంలోని మూడు ప్రధాన ఘటనల్లో కీలక పాత్రధారులైన ముగ్గురు కొద్ది రోజులుగా కన్పించకపోవడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. దీంతో ‘ఆపరేషన్ గరుడ’ అంటూ భవిష్య వాణి వినిపించిన సినీనటుడు శివాజీ, ఐటీ దాడులపాలైన సీఎం రమేష్, సీబీఐ హిట్ లిస్ట్‌లో ఉన్న సాన సతీష్‌ల కదలికలపై నిఘా మొదలైంది. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం జరుగుతుందని ముందే చెప్పిన శివాజీని అదుపులోకి తీసుకుని విచారిస్తే గరుడ పురాణం వెనుక అసలు విషయాలు వెలుగు చూస్తాయనే వాదన బలపడుతోంది. ఈ నేపథ్యంలో ఆయన కొద్ది రోజుల క్రితం అమెరికాకు వెళ్లారు. ఆదివారం రాత్రి ఒక మీడియా ఛానల్‌కు అమెరికా నుంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. చంద్రబాబు కనుసన్నల్లోనే నిర్వహిస్తున్న ఆపరేషన్ గరుడలో కుట్రదారుడైన నటుడు శివాజీని అరెస్టు చేసి, విచారించాలంటూ విజయవాడకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, పి.గౌతంరెడ్డి తదితరులు సోమవారం విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావుకు ఫిర్యాదు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఇతర నాయకులు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం సమాచారాన్ని శివాజీకి ముందస్తుగా ఎవరు అందించారో బయట పెట్టాలని వారు డిమాండ్ చేశారు. అమెరికా నుంచి కడపకు.. టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌పై కడప, హైదరాబాద్‌లలో ఇటీవల పెద్ద ఎత్తున ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సోదాల అనంతరం ఆయన అమెరికాకు వెళ్లిపోయారు. ఆయన కన్పించకపోవడంతో రాష్ట్రంలో ఆసక్తికర చర్చసాతున్న తరుణంలో ఆదివారం రాత్రి ఆయన కడపకు చేరుకున్నారు. మంగళవారం సీఎం చంద్రబాబు నిర్వహించనున్న ధర్మపోరాట దీక్షలో పాల్గొనేందుకే సీఎం రమేష్ వచ్చారని చెబుతున్నారు. కాగా, సీబీఐ హిట్‌లిస్ట్‌లో ఉన్న సాన సతీశ్ ఎక్కడ ఉన్నారనేదానిపై చర్చ జరుగుతోంది. కాకినాడలోని సతీశ్ గెస్ట్‌హౌస్, ఆయన అనుచరుల ఇళ్లలో సీబీఐ అధికారులు ఆదివారం సోదాలు నిర్వహించారు. దీంతో సీబీఐ నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ సతీష్ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. -
ఆ ‘గరుడపక్షి’ని ఆడించేదెవరు?
‘ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాప్రయత్నంపైన ప్రత్యేక దర్యాప్తు అనవసరమ’ని చంద్రబాబు ప్రకటించడం దాని వెనుక దాగిన అసలు రహస్యాన్ని దాచడానికి చేస్తున్న అజ్ఞాత వ్యూహంగా భావించక తప్పదు. వివిధ భంగిమలలో, పలురకాల చూచిరాతలతో పది పదకొండు పేజీలతో లేఖ రాసి, దాన్ని నిందితుని జేబులో కుక్కి తప్పుకున్న వారెవరో అసలు ‘గండికోట’ రహస్యం. దాన్ని ఛేదించి వాస్తవాలు రాబట్టేదాకా చంద్రబాబు ఆనందంగా పదే పదే ఉచ్చరిస్తున్న ఆ ‘గరుడపక్షి’ ఎవడో, అతని ఆ మిత్రుడు సినీ పరిశ్రమ తోసిరాజన్న ఛత్రపతికాని ఆ ముసుగు వీరుడు ‘శివాజీ’ ఎవరో అతనితో ఉన్న బాదరాయణ సంబంధం లోతుపాతులన్నీ బయటికి రావాల్సిందే. ఏదేశ చరిత్ర చూసినా సమస్తమూ నరజాతి చరిత్రగా పైకి కనిపించినా పరస్పర పీడనా దోసిళ్లతోనే, అధికార దాహంతో ప్రతి పక్షాన్ని చంపుకోవడంతోనే నిండిఉందని ఒక్క శ్రీశ్రీ ‘దేశచరిత్రలు’లో కాదు, పురాణ సాహిత్యం పేర్కొన్న క్రీస్తుపూర్వపు మగధ రాజ్య చరిత్రలో ఒక ఆసక్తికర ఘట్టం కూడా తిరుగులేని సాక్ష్యం పలుకుతోంది. బహుశా ఆ చరిత్ర మరొకసారి పునరావృత్తమవుతోందని ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ఆధ్వర్యంలో సాగు తున్న భ్రష్టుపట్టిన టీడీపీ పాలన నిరూపిస్తోంది. భారత రాజ్యాంగ నిర్మాతలలో అగ్రగణ్యుడైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 75 ఏళ్ల నాడే ఎందుకన్నాడో గానీ మన దేశంలో కొన్ని రాజకీయ పక్షాలకు దేశంలో అసంఖ్యాకులైన దళిత, మహాజనులు, మైనారిటీల జీవితాలే బహు చులకనగా కనిపిస్తోందన్నారు. కొన్ని నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, దళితుడిగా పుట్టాలని ఎవరూ కోరుకోరని వ్యంగ్యంగా మాట్లాడుతూ దళితుల్ని తూలనాడారు. అందుకు దళిత సంఘాలన్నీ ఆయన్ని దుమ్మెత్తిపోయవలసిన పరిస్థితి వచ్చిందనీ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఈమాట ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే చరిత్ర ఎలా పునరావృత్తమవుతుందో మరోసారి చెప్పడానికే. క్రీస్తుపూర్వం మగధ సామ్రాజ్యానికి నంది వర్ధనుడు, ఆ తర్వాత మహానందనుడు అనే చక్రవర్తులు ఇద్దరు రాజులుగా ఉండేవారు. కానీ ఈ ఇరువురు శూద్రులు కావడం వల్ల శూద్రులైన నంద వంశం పొడగిట్టని మౌర్య చక్రవర్తులకు కొమ్ముకాసిన కుటిల నీతిపరుడు, మౌర్యుల పురోహితుడైన చాణక్యుడికి కన్నెర్రగా ఉండి శూద్రజాతికి చెందిన నందవశం నిర్మూలనే కంకణం కట్టుకున్నాడు. సరుకులేని అభినవ చాణక్యుడిగా చంద్రబాబు కూడా ఒక దళితుడినే వినియోగించి తన కుట్రలకు ఆసరాగా పావుచెక్కలా వాడుకుంటున్నాడని లోకం కోడై కూస్తోంది. శతాబ్దాలనాటి చాణక్యనీతికి, ఈనాటి అపర చాణక్యుని నీతికి మధ్య తేడా కన్నా సామీప్యతే ఎక్కువని బోధపడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏకైక పెద్ద ప్రతిపక్ష నాయకుడిగా అనుపమానమైన ప్రజాదరణ మధ్య ప్రజాసంకల్ప పాదయాత్ర ద్వారా దూసుకువెళుతూ ఆ వేల కిలోమీటర్ల యాత్ర ఇక కొద్ది రోజుల్లోనే విజయవంతంగా ముగుస్తున్న సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ జీవనాడిగా, రాష్ట్ర భవిష్యత్ దీపశిఖగా ఉన్న చిరంజీవి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన (లేదా జరిపించిన) హత్యాప్రయత్నం, ‘అభిమాని’ ముసుగులో విశాఖ విమానాశ్రయంలో చొప్పించిన ఆధునిక ‘జుడాస్’ చర్య! ఈ అమానుష రాజకీయ కుట్ర బహిర్గతం కాకుండా పోలీస్ యంత్రాంగం ఒక స్థాయిలో జరిపి, సమర్పించిన రిమాండ్ రిపోర్టులో మాత్రం జగన్‌పై జరిగింది హత్యాప్రయత్నమేనని, ఆయన్ని అంతం చేయడానికే కత్తితో ఆయనపై దాడి జరిగిందని స్పష్టం చేశారు. కానీ ఆ రిమాండ్ రిపోర్టులో రాజకీయ కుట్రదారులెవరో మాత్రం ఎలాంటి వివరణ లేకపోవడం, ‘‘కొత్తదాసరికి పంగనామాలెక్కువ’’ అన్నట్లుగా టీడీపీకి అనుకూలంగా పొత్తుల కోసం ‘డూడూబసవన్నలు’గా మారిన కాంగ్రెస్ సహా ‘ఐక్య సంఘటన’ దుస్తులు ధరించిన కొన్ని ప్రతిపక్షాల నాయకులు సహా, మినహాయింపులు లేకుండా ఈ ఘాతుకాన్ని, కుట్రను ఖండించారు. ఆ నాయకులు జగన్‌ని పరామర్శించారు. ఒకనాడు అలిపిరి సలపరానికి గురైన చంద్రన్నను ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి పరామర్శించి, త్వరలో కోలుకోవాలని కోరుకున్నారు కూడా. కానీ నేడు పాలకుడిగా ఉన్న చంద్రబాబు కానీ, బాధ్య తగల ‘దేశం’ నాయకులు కానీ ఏకైక పెద్ద ప్రతి పక్షంగా ఉన్న పార్టీ నాయకుడు జగన్‌ని కనీసం పరామర్శించే సంస్కారాన్ని కూడా పాటించలేకపోయారు. పైగా జగన్‌ని వాడు ఇంటికి పోయాడుగా అని కనీస వాక్శుద్ధి కూడా లేకుండా ముఖ్యమంత్రి వెటకరించడం హేయం. పోలీసుల రిమాండ్ రిపోర్టులో.. ఇది జగన్‌ని అంతమొందించడానికే జరిగిన హత్యాప్రయత్నమేనని స్పష్టం చేస్తున్నా, ఆ ప్రయ త్నాన్ని ఓ ‘చిన్నగాయం’గా కావాలని ‘చీరుకున్న’ గాయం గానూ, తలచుకుంటే టీడీపీ కార్యకర్తలూ, టీడీపీ వ్యక్తులూ జగన్‌ను కైమా, కైమా చేసేవాళ్లని’ మరికొందరు ‘దేశం’ నాయకులు, మంత్రులూ అమానుషంగా ప్రకటనలు చేయడం దుస్సహం. పైగా ‘ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాప్ర యత్నం పైన ప్రత్యేక దర్యాప్తు అనవసరమ’ని చంద్ర బాబు ప్రకటించడం హత్యాప్రయత్నం వెనుక దాగిన అసలు రహస్యాన్ని దాచడానికి చేస్తున్న అజ్ఞాత వ్యూహంగా భావించక తప్పదు. వివిధ భంగిమలలో, పలురకాల చూచిరాతలతో పది పదకొండు పేజీలతో లేఖ రాసి, దాన్ని నిందితుని జేబులో కుక్కి తప్పుకున్న వారెవరన్నదే అసలు ‘గండికోట’ రహస్యం. దాన్ని ఛేదించి వాస్తవాలు రాబట్టేదాకా చంద్రబాబు ఆనందంగా పదే పదే ఉచ్చరిస్తున్న ఆ ‘గరుడపక్షి’ ఎవడో, సినీ పరిశ్రమ తోసిరాజన్న ఛత్రపతికాని ఆ ముసుగు వీరుడు ‘శివాజీ’ ఎవరో అతనితో ఉన్న బాదరాయణ సంబంధం లోతుపాతులన్నీ బయటికి రావాల్సిందే. అలిపిరి దుర్ఘటనను ఊహించి, ముందు హెచ్చరిక చేయలేని ఆ ‘గండ భేరుండ పక్షి’ శివాజీకి ఆ శక్తిని కల్పించింది, నీడ నిచ్చిందీ ఎవరో తేలాలి. అసలా ‘పక్షి’ కనపడ్డేం? కొన్ని మాసాలనాడే ‘బాబు ప్రభుత్వాన్ని కూల దోసేందుకు కుట్రలు జరుగుతున్నాయని అదే సమయంలో జగన్‌పై హత్యాప్రయత్నం జరుగుతుందన్న ఆ శివాజీ మరోవైపున ఆంధ్రప్రదేశ్‌లో అలజడులు రెచ్చగొట్టేందుకు బీజేపీ నేతలు ‘ఆపరేషన్ గరుడ’ చేపట్టి, ‘ఐటీ’ దాడులకు, హత్యలకు తెరలేపనున్నారని వీడియోల్లో కనపడి అకస్మాత్తుగా తప్పుకుపోయిన ఆ ‘అపర శివాజీ’ బాబు చేయి, బీజేపీ నేతల చేతులకు దొరక్కుండా ఎక్కడికిపోయి తలదాచుకు న్నాడు?! ‘ఆపరేషన్ గరుడ’ పదాన్ని శివాజీ ఆశీస్సులతోనే టీడీపీ మీడియా గుంపు ప్రచారంలో పెట్టిందా? పదే పదే చంద్రన్న వర్ణిస్తూ వల్లిస్తున్న శివాజీ ‘గరుడ’ రూపంలో ‘గండిపేట’ కార్యాలయంలో తలదాచుకుంటున్నాడా, జూబ్లీహిల్స్‌లోని నేలమాళిగలోనా? హాస్యనటుడిగా ఉన్నట్టుండి రహస్య జీవితంలోకి జారుకున్న ఆ గరుడపక్షిని పట్టుకోవడం మాల్యా, చౌక్సీ, నీరద్మోదీల ఉనికికి మించినంత కష్టమా? తెలుగుదేశం పార్టీ నిర్మాత ఎన్టీఆర్‌ను క్రమంగా పాలకునిగా తప్పించి, ఆ స్థానాన్ని ఆక్రమిం చేందుకు అల్లుడి హోదాలోనే, పార్టీ కార్యదర్శి రూపంలోనే సాగించిన నాటకాలను తెలుగు ప్రజలు కళ్లారా చూశారు. అందులో తొలి నాటకం మల్లెల బాజ్జీ ద్వారా పూర్తి చేయగా, మలి నాటకంలో ‘ఎన్కౌంటర్’ పత్రిక సంపాదకుడు దశరథరామ్ హత్యతో ముగిసింది. ఆ తరువాత చిన్నవీ, పెద్దవీ రకరకాల అంకాలుగా ముగిశాయి, కొత్త అంకాలకు తెర లేపడానికి ముందు సీఎంగా ఎన్టీఆర్‌పై ‘దేశం’లోని తన తైనాతీలను బాబు ఉసిగొల్పి ఎన్టీఆర్పైన చెప్పులు వేయించాడు. ఫలితంగా ‘దేశం’ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మనస్తాపంతో తనువు చాలించాల్సి వచ్చింది. తన ‘వెన్నుపోటు’ చరిత్రను అనుక్షణం గమనిస్తున్న దేశ ప్రతిపక్షాలు నేడు ఆంధ్రప్రదేశ్‌లో తన చేష్టల వల్ల, ఇన్నాళ్లుగా అనుసరిస్తున్న ‘ఉల్టా పల్టా’ రాజ కీయాలవల్ల తన పట్ల ఆమోదం చూపవని బాబుకి తెలుసు. తాజాగా, జగన్‌పై జరిగిన హత్యా ప్రయత్నంతో ఆ ‘అపవాదు; తన పార్టీకి రాకుండా చేసుకునేందుకే బాబు ఢిల్లీ యాత్ర తలపెట్టాడు. ఆంధ్ర ప్రదేశ్‌లోని తాజా పరిణామాల దృష్ట్యా ప్రతి పక్షాల నాయకులు బాబుతో శాలువాలు కప్పించుకోవడం మినహా, తనను మించిన కాంగ్రెస్‌తోనే బాబు చేతులు కలిపి ఐక్యసంఘటన ఏర్పాటుకు ప్రయత్నించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మాట నిలకడ లేని బాబుతో చేతులు కలపడం ఏ రోజుకైనా ప్రమాదమేనన్న అనుభవం కాంగ్రెస్‌తోపాటు మరికొన్ని ఇతర ప్రతిపక్షాలకూ లేకపోలేదు. జాతీయ స్థాయిలో తన ఐక్యసంఘటన ఏర్పాటుయత్నం విఫలం కాక తప్పదని, తన ఇంట్లో కాలుతున్న చేతుల్ని కాపాడుకునేందుకు మాత్రమే బాబు చేసే ప్రయత్నమని జాతీయ ప్రతిపక్షాలకు తెలుసు. ఒకసారి జాతీయ ఐక్యసంఘటన ప్రయత్నాల్నీ, ప్రభుత్వాల్నీ ముంచేసిన బాబును మరోసారి ఆదరిస్తాయనుకోవటం భ్రమ. కాబట్టి, ఈ దుస్థితిలో దేశాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల్ని రక్షించగల్గింది నిలువెల్లా ‘మశూచి’ మచ్చలతో నిండిన తె.దే.పా.ను మినహాయించి బుద్ధి, జ్ఞానంగల ప్రతిపక్షాల (వామపక్షాలు సహా)తో ఐక్యసంఘటన ముందుకు సాగడమే. అందుకు ముందుగా నెరవేర్చుకోదగిన షరతు– మానవ ద్వేషులైన ‘శాడిస్టు’లు నాయక స్థానంలో ఉన్న పార్టీలను, ఆ శాడిస్టు రాజకీయవేత్తలు అంట కాగుతున్న శివాజీ లాంటి అజ్ఞాత గరుడపక్షులనూ వదిలించుకోవడమూ! ఇంతకీ ప్రస్తుతం దేశ విపక్షాలపై ఢిల్లీలో వాలిన బాబుగారి శివాజీ గరుడపక్షి ప్రస్తుత ఉనికి ఎక్కడ? ప్రస్తుతం ఆ గరుడ శివాజీతోనే అమెరికా చేరిందట, అంటే శివాజీ ఒక మాల్యాలా, ఒక నీరద్మోదీలా, ఒక చౌక్సీలా దేశ పాలకుల కళ్లుకప్పి అమెరికాకు ఉడాయించాడు. సీఎం రమేష్ సింగపూర్‌కు వెళ్లినట్టు వెళ్లి ఒమన్‌కు జారుకున్నాడు. విద్యుచ్చక్తి శాఖలో ఓ చిన్న ఉద్యోగి హోదాలో ఉండి కోటికి పడగలెత్తిన సానా సతీష్ (తూర్పుగోదావరి) సీబీఐ కేసులో ఇరుక్కుని అడ్రస్ లేకుండా ఎటో పోయాడు. మరి ఇక చంద్రబాబు ప్రయాణించే మార్గం ఎన్ని తీరాలకో చూడాలి. అధి కారాంతమందు చూడవలె నా అయ్య సౌభా గ్యముల్!! - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
హస్తిన లింకు హైదరాబాద్‌లో...
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సీబీఐ అంతర్గత పోరుకు ప్రధాన ‘కీ’ హైదరాబాద్‌లో ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్ మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీ ఎపిసోడ్‌పై కేసు.. ఢిల్లీ సీబీఐ పరిధిలో జరిగిన దాని మూలాలు ఇక్కడ ఉన్నాయి. ఈ కేసులో అలోక్‌వర్మతోపాటు స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తాన్‌ల మధ్య పోరు తీవ్రమవడం, ఆ తర్వాత ఇద్దరినీ సెలవులో పంపడం, కొందరిని బదిలీ చేయడం, ఇన్చార్జి డైరెక్టర్‌గా మరో అధికారి రావడం అన్ని చకచకా జరిగిపోయాయి. అయితే ఈ మొత్తం వ్యవహారానికి కారణమైన సాన సతీశ్‌బాబు సీబీఐ అధికారులపై చేసిన అవినీతి ఆరోపణలు, డబ్బుల డిమాండ్ వ్యవహారంపై ప్రత్యేక బృందం శుక్రవారం హైదరాబాద్ చేరుకుంది. ఓ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని అధికార బృందం ఢిల్లీ నుంచి మొయిన్ ఖురేషీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ విచారించేందుకు రావడం రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. ఖురేషీతో సంప్రదింపులు జరిపిన సుఖేశ్‌గుప్తా, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ, వ్యాపారవేత్త సాన సతీశ్‌బాబును మరోసారి విచారించేందుకు సీబీఐ అధికారులు హైదరాబాద్ వచ్చినట్లు తెలిసింది. సీఎం రమేశ్ లింకేంటి? అలాగే సాన సతీశ్ బాబును కాపాడేందుకు టీడీపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేశ్ కూడా సీబీఐ డైరెక్టర్లను సంప్రదించిన ఎపిసోడ్‌పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నట్లు తెలిసింది. సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న వారితో ఖురేషీ మధ్యవర్తిత్వం, అప్పటి సీబీఐ డైరెక్టర్లు ఏపీ సింగ్, రంజిత్ సిన్హాలతో సాగించిన లావాదేవీలపై వీరిని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు డైరెక్టర్లపై సతీశ్‌బాబు ఇచ్చిన వాంగ్మూలంలో నిజానిజాలు తేల్చే వ్యవహారంలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీఎం రమేశ్‌కు సీబీఐ డైరెక్టర్లకు ఉన్న లింకు ఏంటి? డైరెక్టర్లతో ఎప్పటి నుంచి లాబీయింగ్ చేస్తున్నారు? ఏయే కేసులో వారిపై ఒత్తిడి తీసుకువచ్చారు? తదితర అంశాలపై రమేశ్‌ను ప్రశ్నించడంతో పాటు ఆయన కార్యాలయాలు, నివాసంలో సోదాలు కూడా నిర్వహించే అవకాశం ఉందని కేంద్ర వర్గాల ద్వారా తెలిసింది. ఇటీవల జరిగిన ఐటీ సోదాల్లో ఈ కేసులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు లభించాయని, వీటి ద్వారా డైరెక్టర్ల వ్యవహారంలో మరింత క్లారిటీ వస్తుందని, ఈ కోణంలోనూ విచారణకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు స్పష్టం చేశాయి. మంగళవారమే సతీశ్‌బాబును సీబీఐ ఢిల్లీ అధికారులు అక్కడికి పిలిపించి కొన్ని అంశాలపై ప్రశ్నించినట్లు తెలిసింది. అంతలోనే అధికారుల బృందం హైదరా బాద్ రావడం ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ప్రస్తుతం సీఎం రమేశ్ విదేశీ పర్యటనలో ఉండటం కూడా చర్చనీయాంశంగా మారింది. -
అదీ... ఈ 420 స్టోరీ..!
సాక్షి, అమరావతి, హైదరాబాద్: కడప ఉక్కు కర్మాగారం కోసం దీక్ష చేసినందుకే తనపై ఆదాయపన్ను శాఖ (ఐటీ) దాడులు చేసిందట!! ఇదీ... టీడీపీ ఎంపీ సి.ఎం.రమేష్ వాదన. అంటే... తానెలాంటి తప్పూ చేయలేదని, కేంద్రం కావాలనే కక్ష సాధిస్తోందన్నది దాని ఉద్దేశం. సరే!! మరి రిజిస్ట్రేషన్ కూడా చేయకుండా తనకు తానే ఓ కంపెనీని సృష్టించి... దానిపేరిటే స్టాంపులు తయారు చేసి... పనులు కానిచ్చేస్తూ... దానికి కోట్ల రూపాయల బిల్లుల్ని కూడా చెల్లించినట్లు చూపిస్తున్న వ్యక్తిని ఏమనాలి? ‘‘అసలు రిజిస్టరే కాని కంపెనీ పేరిట లావాదేవీలు చేయటమన్నది మోసం! దీనిపై పోలీస్‌స్టేషన్‌లో 420 కింద కేసు పెడితే... విచారణలో మేమూ భాగమవుతాం’’ అని సాక్షాత్తూ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ఓసీ) అధికారులే చెబుతున్నారు. రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్... కోట్లాది రూపాయల బిల్లుల్ని ‘ఎడ్కో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ అనే సబ్ కాంట్రాక్టర్‌కు చెల్లించినట్లు చూపించింది. అసలు ఈ కంపెనీయే లేదని ఆర్ఓసీ అధికారులే ధ్రువీకరించారు. అదీ... ఈ 420 స్టోరీ. ఎడ్కో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్!! ఈ పేరుమీద దేశంలోని ఏ ఆర్‌ఓసీలో చూసినా ఎలాంటి కంపెనీ ఉండదు. కానీ సి.ఎం.రమేష్ దగ్గర మాత్రం దీనికి సంబంధించిన పత్రాలుంటాయి. దీనికో చిరునామా కూడా ఉంటుంది. ఆ చిరునామాలో మాత్రం ఏమీ ఉండదు. పైపెచ్చు ఆ కంపెనీ తనకు సబ్ కాంట్రాక్టర్ అని చెబుతూ... దానికి కోట్ల రూపాయలు చెల్లించేస్తూ ఉంటారు కూడా. ఈ కంపెనీ ఆదాయాలపై ఐటీ శాఖ అనుమానాలు వ్యక్తంచేయటంతో 2014లోనే ఈ వివాదం ఐటీ ట్రిబ్యునల్‌కు చేరింది. సరైన పత్రాలు సమర్పించమని ఎన్నిసార్లు చెప్పినా కంపెనీ నుంచి ఎవరూ రాకపోవడం, ఇచ్చిన చిరునామాలో కంపెనీ లేకపోవడంతో ఎడ్కో కంపెనీ లావాదీవీలపై ఐటీ శాఖ దృష్టి సారించింది. తాజా దాడుల్లో దాని మూలాలన్నీ రిత్విక్ కంపెనీలో తేలాయి. రిత్విక్ ప్రాజెక్టŠస్ చూపిస్తున్న లెక్కలపై ఐటీ అధికారులు అభ్యంతరాలు వ్యక్తంచేయటం.. దీనిపై రిత్విక్ ప్రాజెక్టŠస్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడం 2012 నుంచి ఏటా క్రమం తప్పకుండా జరుగుతూనే ఉంది. మూసేసిన కంపెనీలకు పనులిచ్చారా? ఎడ్కో మాత్రమే కాక రిత్విక్ నుంచి కోట్ల రూపాయల విలువ చేసే సబ్–కాంట్రాక్ట్ పనులు తీసుకున్న కంపెనీల్లో కొన్ని కంపెనీలు కార్యకలాపాలు కూడా నిలిపేయటం గమనార్హం. ఐటీ అధికారుల తనిఖీల్లో.. ఏఏకే స్టీల్స్, బీఎస్కే స్టీల్స్ నుంచి రూ.25 కోట్ల స్టీల్ కొనుగోలు చేసినట్లు బిల్లులు చూపించారు. కానీ, ఆర్ఓసీ హైదరాబాద్‌లో నమోదైన ఏఏకే స్టీల్స్‌ను ఎప్పుడో మూసేశారు. సికింద్రాబాద్ రాణిగంజ్ డిస్టెల్లరీ రోడ్ 5–4–25 పేరిట 2003 ఫిబ్రవరిలో కంపెనీ రిజిస్టరై ఉంది. కానీ తరవాత మూసేశారు. అలాంటి కంపెనీ నుంచి రమేష్ స్టీల్ ఎలా కొన్నారనేది ఆయనకే తెలియాలి. ఎడ్కోకు బ్యాంక్ రుణాలు కూడా..!! రిత్విక్ ప్రాజెక్టŠస్ నుంచి తీసుకున్న సబ్–కాంట్రాక్ట్ పనులను నామినీగా చూపించి పలు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్‌ల నుంచి ఎడ్కో ఇండియా రుణాలు కూడా తీసుకున్నట్లు ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ (ఐసీఎల్ఎస్) అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏ బ్యాంక్ నుంచి ఎంత మొత్తంలో రుణాలు తీసుకున్నారో విచారణ చేయాల్సిందిగా తాము రిజర్వ్ బ్యాంక్‌ను కోరినట్లు పేరు వెల్లడి కావటానికి ఇష్టపడని ఐసీఎల్ఎస్ అధికారి ఒకరు చెప్పారు. రమేష్‌కు... ఇదో బోగస్ జేబు కంపెనీ కంపెనీ పెట్టేవారెవరైనా ప్రొప్రయిటరీ సంస్థయితే సహకార రిజిస్ట్రార్ దగ్గర, ప్రైవేట్ లిమిటెడ్ అయితే ఆర్వోసీలో నమోదు చేయాలి. అప్పుడే అది చట్టబద్ధమైన కంపెనీ అవుతుంది. రాజ్యసభ సభ్యుడైన సీఎం రమేష్ మాత్రం తనే ఎడ్కో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ పెట్టేసి, స్టాంపులు, సీలు తయారు చేయించేసుకుని... దానికి కోట్ల రూపాయల విలువైన సివిల్ వర్క్స్ కట్టట్టేశారు. ఈ కంపెనీ స్టాంపులు, సీలు అన్నీ రిత్విక్ అకౌంటెంట్ సాయిబాబా దగ్గర దొరకటం దీన్ని ధ్రువపరిచేదే. ఇదే విషయమై ఈ అకౌంటెంట్‌ను సంప్రతించటానికి ‘సాక్షి’ ప్రతినిధి ప్రయత్నించగా... ఎడ్కో అనే పేరెత్తగానే ఆయన అర్థంతరంగా ఫోన్ పెట్టేశారు. ఇంకా విశేషమేంటంటే... ఈ కంపెనీ పేర్కొన్న నాలుగు చిరునామాలూ బోగస్‌వే. బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 13లో కంపెనీ పేర్కొన్న చిరునామాను ‘సాక్షి’ పరిశీలించగా అక్కడ ఏ కంపెనీ లేదని బయటపడింది. చివరకు ఐటీ నోటీసులు సైతం కంపెనీకి కాకుండా సోమాజీగూడలోని ఆడిటర్ పి.మురళీ మోహన్ చిరునామాకే పంపాల్సి వచ్చింది. రిత్విక్ ప్రాజెక్స్‌కు, ఎడ్కోకు ఆడిటర్ ఒక్కరే. రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్టŠస్ గత ఆరేళ్లలో రూ.12 కోట్ల విలువైన పనులను ఎడ్కోకు అప్పచెప్పినట్లు ఐటీ సోదాల్లో బయట పడింది. బయటపడింది ఇలా.. సివిల్ కాంట్రాక్టు వర్కులు చేసే ఎడ్కో ఇండియా ప్రైవేటు లిమిటెడ్ 2009–10 అసెస్మెంట్ ఇయర్‌కు సంబంధించి రూ.3.72 కోట్ల ఆదాయాన్ని చూపిస్తూ ఐటీ రిటర్నులు వేసింది. దీన్ని స్క్రూటినీ చేసిన ఐటీ శాఖ... పుస్తకాల్లోని లెక్కలకు, చేసిన వ్యయాలకు పొంతన లేనట్లు గుర్తించింది. వ్యయాలకు సంబంధించి వాస్తవ బిల్లులు, వోచర్లు లేకపోవడంతో మొత్తం బిల్లులపై 8 శాతాన్ని లాభంగా పరిగణిస్తూ ఆదాయాన్ని రూ.3.72 కోట్లు కాకుండా రూ.5.57 కోట్లుగా పరిగణిస్తూ ఐటీ శాఖ 2011లో ఉత్తర్వులిచ్చింది. సబ్ కాంట్రాక్టర్లకు 5 శాతం లాభాన్ని పరిగణనలోకి తీసుకుంటారని ఎడ్కో ఆడిటర్ వాదిస్తే... ఈ అంశాన్ని ట్రిబ్యునల్‌లో తేల్చుకోమని ఐటీ శాఖ చెప్పింది. రెండేళ్లు దాటినా కంపెనీ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఐటీ అధికారులే 2014లో ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ప్రస్తుతం కేసు ఐటీ ట్రిబ్యునల్‌లో కొనసాగుతోంది. -
సీబీఐ డీఎస్పీ అరెస్ట్
న్యూఢిల్లీ: సీబీఐలో డీఎస్పీగా పనిచేస్తున్న దేవేంద్ర కుమార్‌ను వ్యాపారవేత్త సతీశ్ సానాకు సంబంధించిన అవినీతి కేసులో అరెస్టు చేశామని సీబీఐ అధికారులు సోమవారం చెప్పారు. మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీకి సంబంధించిన కేసులో సతీశ్ విచారణను ఎదుర్కొంటున్నారు. కాగా, శని, ఆదివారాల్లో దేవేంద్ర కుమార్ కార్యాలయంలో, ఇంట్లో తనిఖీలు చేసి కొన్ని ఫోన్లు, ఐపాడ్‌ను స్వాధీనం చేసుకున్నామనీ, వాటిలోని సమాచారాన్ని ప్రస్తుతం పరిశీలిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఇదే అవినీతి కేసులోనే సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానాపై కూడా ఇప్పటికే కేసు నమోదైన విషయం ఆదివారం వెలుగులోకి రావడం తెలిసిందే. మరోవైపు సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ఆస్తానాలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటుండటంతో వారికి ప్రధాన మంత్రి కార్యాలయం నోటీసులు పంపింది. ఆదివారమే అలోక్ వర్మ పీఎంవోలోని సీనియర్ అధికారులను కలిశారు. సతీశ్ నిందితుడిగా ఉన్న కేసును ఆస్తానా నేతృత్వంలోని సీబీఐ బృందం విచారిస్తుండగా, ఆ బృందంలో దేవేంద్ర ఒకరు. సతీశ్ నుంచి ఆస్తానా రూ. 5 కోట్ల లంచాన్ని మనోజ్ ప్రసాద్ అనే మధ్యవర్తి ద్వారా తీసుకుని సతీశ్‌కు అనుకూలంగా విచారణను ప్రభావితం చేశారనేది ఆస్తానాపై ప్రధాన ఆరోపణ. ఈ కేసులో సతీశ్ వాంగ్మూలాన్ని నమోదు చేయడంలో దేవేంద్ర ఫోర్జరీకి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయనను సీబీఐ అరెస్టు చేసింది. గత నెల 26న సతీశ్ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు ఆస్తానా బృందం చెబుతోందనీ, అయితే ఆ రోజున సతీశ్ హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఉన్నట్లు తమ విచారణలో తెలిసింది కాబట్టి వాంగ్మూలాన్ని ఫోర్జరీ చేశారని తేలిందని సీబీఐ అధికారులు చెప్పారు. సీఎం రమేశ్‌తో మాట్లాడారా? తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, తన పాత మిత్రుడు సీఎం రమేశ్‌తో ఈ ఏడాది జూన్‌లో తాను మాట్లాడానని సతీశ్ పేర్కొనట్లు దేవేంద్రకు ఇచ్చిన వాంగ్మూలంలో ఉంది. ‘‘నాపై ఉన్న కేసుకు సంబంధించి సీఎం రమేశ్‌తో నేను మాట్లాడాను. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మతో తాను మాట్లాడతానని రమేశ్ నాకు అభయమిచ్చారు. ఆ తర్వాత కలిసినప్పుడు సీబీఐ డైరెక్టర్‌ను వ్యక్తిగతంగా కలిసి మాట్లాడాననీ, ఇకపై సీబీఐ నన్ను విచారణకు పిలవదని రమేశ్ భరోసా ఇచ్చారు. ఆ తర్వాత జూన్ నుంచి నన్ను సీబీఐ పిలవలేదు. దీంతో నాపై విచారణ ముగిసిందని నేను అనుకున్నా’ అని సతీశ్ దేవేంద్రకు ఇచ్చిన వాంగ్మూలంలో ఉన్నట్లు సీబీఐ అధికారులు చెబుతున్నారు. అయితే అలోక్ వర్మపై ఆస్తానా సీవీసీ వద్ద చేసిన ఆరోపణలను బలపరిచేందుకే సతీశ్ వాంగ్మూలాన్ని దేవేంద్ర ఇలా ఫోర్జరీ చేశారని సీబీఐ ఆరోపిస్తోంది. ఆస్తానా బృందంలోని ఇతర సభ్యులపై కూడా విచారణ జరుపుతున్నట్లు సీబీఐ చెప్పింది. సతీశ్ నుంచి అలోక్ వర్మ రూ. 2 కోట్ల లంచం తీసుకున్నారని ఈ ఏడాది ఆగస్టు 24నే ఆస్తానా ఆరోపించారు. పూర్తి వివరాలు విచారణలోనే తెలియాల్సి ఉంది. అసలు ఏమిటీ కేసు? మొయిన్ ఖురేషీ డెహ్రాడూన్‌లోని డూన్ స్కూల్ విద్యార్థి. ఆ తరువాత యూపీలో మాంసం ఎగుమతి వ్యాపారాన్ని ప్రారంభించి అంచలంచెలుగా ఎదిగాడు. అనేక ఇతర రంగాల్లో వ్యాపారాలు ప్రారంభించాడు. ఆయనపై పన్ను ఎగవేతలు, హవాలా కార్యకలాపాలు తదితర కేసులున్నాయి. వాటిపై పలు కేసులను సీబీఐ విచారిస్తోంది. దేశం నుంచి రూ. 200 కోట్లను అక్రమంగా దేశం నుంచి తరలించారనే కేసును ఈడీ విచారణ జరుపుతోంది. ఈ విచారణల్లో భాగంగా జరిపిన సోదాల్లో ఖురేషీకి సంబంధించిన మరిన్ని అక్రమాలు, సహచరుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఖురేషీ తనకున్న పరిచయాలతో సీబీఐ కేసుల నుంచి తప్పిస్తానంటూ పలువురు నిందితుల నుంచి భారీగా డబ్బులు తీసుకునేవాడు. దీనికి సంబంధించి కూడా ఆయనపై ఓ కేసు విచారణలో ఉంది. అలా ఖురేషీకి సంబంధించిన కేసులో ఒక నిందితుడు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సానా సతీశ్. కేసు నుంచి తప్పించేందుకు సీబీఐ డైరెక్టర్ అస్తానాకు ఇవ్వాలని చెప్పి తన వద్ద ఖురేషీ రూ. 3 కోట్లు తీసుకున్నాడని మెజిస్ట్రేట్ కోర్టులో సతీశ్ వాంగ్మూలం ఇచ్చాడు. ఆ వాంగ్మూలంలో సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానా, దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త మనోజ్ ప్రసాద్, అతని సోదరుడు సోమేశ్‌ల పేర్లను సతీష్ ప్రస్తావించారు. ఈ వాంగ్మూలమే ఆస్తానాపై కేసు నమోదుకు ప్రాతిపదికగా మారింది. ఎఫ్ఐఆర్లో ఏముంది? సతీశ్ వాంగ్మూలం, ఫిర్యాదుల ఆధారంగానే ఆస్తానాపై కేసు నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్లో ఉన్న వివరాల ప్రకారం.. ‘మధ్యవర్తులు మనోజ్, సోమేశ్‌లు దుబాయ్‌లో సతీశ్‌ను కలుసుకున్నారు. సీబీఐ కీలక అధికారి సహాయంతో సతీశ్ కేసును సెటిల్ చేస్తామని వారు హామీ ఇచ్చారు. సీబీఐ స్పెషల్ డైరెక్టర్ ఆస్తానాకు సోమేశ్ ఫోన్ చేసి సతీశ్‌తో మాట్లాడించారు. రూ. 5 కోట్లు ఇస్తే కేసును సెటిల్ చేస్తాననీ, 3 కోట్లు అడ్వాన్సుగా ఇవ్వాలని ఆస్తానా డిమాండ్ చేశారు. దీంతో మనోజ్‌కు దుబాయ్‌లోనే సతీశ్ కోటి రూపాయలు ఇచ్చాడు. తర్వాత సునీల్ మిత్తల్‌కు ఢిల్లీలో రూ.1.95 కోట్లు ఇచ్చాడు. అయినా, ఈ ఏడాది ఫిబ్రవరిలో సీబీఐ నుంచి సతీశ్‌కు నోటీసులు వచ్చాయి. దీంతో సతీష్ మనోజ్‌ను కలిసి డబ్బలిచ్చినా నోటీసులెందుకు వచ్చాయని నిలదీశాడు. మిగతా రూ. 2.05 కోట్లు కూడా ఇస్తే నోటీసు మాఫీ చేయిస్తానని మనోజ్ చెప్పాడు. అక్టోబర్ 9న 2 కోట్లు ఇస్తానని సతీశ్ హామీ ఇచ్చాడు. అనారోగ్యం వల్ల విచారణకు హాజరు కాలేకపోతున్నట్టు సతీష్ సీబీఐకి మెయిల్ పంపాడు. ఆ తర్వాత సీబీఐ నుంచి సతీష్‌కు ఎలాంటి సందేశాలూ రాలేదు. అక్టోబర్ 10న రూ. 25 లక్షలను సతీశ్ మనోజ్‌కు ఇచ్చాడు. మిగతా సొమ్మును అక్టోబర్ 16న ఇవ్వాల్సి ఉండగా తీసుకునేందుకు మనోజ్ భారత్ వచ్చి అరెస్టయ్యాడు’. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఆస్తానాపై సీబీఐ కేసు నమోదు చేసింది. మోదీకి ఇష్టుడు ఆస్తానా ప్రధాని ఏరికోరి మరీ ఆస్తానాను సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌గా నియమించారు. 1984 గుజరాత్ ఐపీఎస్ కేడర్‌కు చెందిన ఆస్తానా అంతకు ముందు సీబీఐ అదనపు డైరెక్టర్‌గా పని చేశారు. గోధ్రా రైలు దహనం కేసులో సిట్‌కు నాయకత్వం వహించారు. యూపీఏ హయాంలో జరిగిన ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్‌సెల్ మాక్సిస్ తదితర కుంభకోణాల దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఆస్తానా అధిపతిగా వ్యవహరించారు. అలోక్ వర్మ తన ఎదుగుదలకు అడ్డుగా నిలుస్తున్నారని భావించిన ఆస్తానా ఆయనపై పలు ఆరోపణలు చేశారు. ఖురేషీ కేసులో అలోక్ వర్మ లంచం తీసుకున్నారని కూడా ఆరోపించారు. అలోక్ వర్మపై 10 అవినీతి ఆరోపణలతో కేబినెట్ కార్యదర్శికి లేఖ కూడా రాశారు. ఆయన ఈ వ్యవహరాన్ని విజిలెన్స్ కమిషన్‌కు అప్పగించారు. -
రూ. 800 కోట్లు దారి మళ్లింపు
-
ఎంపీగా రాజీనామా చేయించండి
సాక్షి, అమరావతి: సీఎం రమేశ్‌తో రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని సీఎం చంద్రబాబును బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. అలాంటి వ్యక్తిని రాజ్యసభకు పంపినందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నారు. సీఎం రమేశ్‌తో రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేయించకపోతే ఆయన్ను తొలగించాల్సిందిగా ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. జీవీఎల్ శుక్రవారం విజయవాడలో బీజేపీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ అధికారులు సోదాలు చేస్తారని ముందే తెలిసి అంతా సర్దుకున్నప్పటికీ టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ కంపెనీల్లో రూ.100 కోట్ల అక్రమాలు వెలుగులోకి వచ్చాయని జీవీఎల్ అన్నారు. ఈ మేరకు అధికారులు గుర్తించినట్టు జాతీయ దినపత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తోపాటు కొన్ని జాతీయ టీవీ ఛానళ్లు కథనాలు ప్రసారం చేశాయని గుర్తు చేశారు. జీవీఎల్ ఇంకా ఏం మాట్లాడారంటే.. ‘వందల కోట్లలో, వేల కోట్లలో అవినీతి జరగడానికి ఆస్కారం ఉంది. దొరికిన రూ.వంద కోట్లకు సీఎం రమేశ్ జవాబు చెప్పాలి. తానేదో సత్యహరిశ్చంద్రుడినని ప్రగల్భాలు పలికాడు. మగాడిని అంటూ మీసం తిప్పాడు. ఈ రోజున సగం మీసం అయినా తీసేస్తాడా? ఎడ్కో ఇండియా అనే కంపెనీ పెట్టి, దాని వ్యవహారాలన్నీ రమేశ్ కార్యాలయంలోంచే నడుపుతున్నారు. రమేశ్ అకౌంటెంట్ దగ్గరే ఆ కంపెనీలకు సంబంధించిన స్టాంపులు, మెయిల్స్ ఉన్నాయి. అంటే మీ (సీఎం రమేశ్) ఆఫీసులోనే ఒకరిని డమ్మీగా కూర్చోబెట్టి, మరికొందరు డమ్మీ డైరెక్టర్లను పెట్టి, మీరే ఈ చేతితో డబ్బు ఇచ్చి, ఆ చేతితో డబ్బు వెనక్కి తీసుకోవడం చేశారు. మొత్తం వంద కోట్ల దుర్మార్గం బయటపడింది. ఈ డబ్బంతా తెలుగుదేశం పార్టీ పెద్దలు చేసిన రాజకీయ వ్యాపారానికి ఉపయోగించిన డబ్బేనా? ఆ డబ్బుతో ఏం కొనుగోలు చేశారు? ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు నడిపారా? 23 – 24 మంది ఎమ్మెల్యేలు ఊరికే రారు కదా! చాలా ఖర్చుతో కూడుకున్నది కదా! ఎమ్మెల్యేల కోనుగోలులో సీఎం రమేశ్ పాత్ర ఎంత ఉందనే దానిపై విచారణ చేపట్టాలి. ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో అందరూ అవినీతిపరులనే అపోహ ఉంది. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు, ఎంపీల ఆస్తులపై ఐటీ అధికారుల పరిశీలన జరగాలని కోరుకుంటున్నా. ఒకప్పుడు సైకిల్ తొక్కినవాళ్లు ఇప్పుడు రూ.వేల కోట్లకు అధిపతులయ్యారు. పెద్దల సభకు దిగజారుడు మనుషులా? సీఎం రమేశ్ అంటే ఏపీ ప్రజలంతా ముఖ్యమంత్రి గారి రమేశ్ అని, మరికొందరు ముఖ్యమంత్రి బినామీ అని చెబుతుంటారు. టీడీపీ నుంచి పదేపదే రాజ్యసభకు పంపడానికి ఆయనకున్న అర్హత అదేనని ప్రజలు అనుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తులను దిగజారుడు వ్యక్తులను పెద్దల సభకు పంపి పార్లమెంట్‌ను అవమానపరిచినందుకు చంద్రబాబు సైతం క్షమాపణ చెప్పాలి. సీఎం రమేశ్‌తో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయించాలి. లేదంటే ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేసి, అతడిని అనర్హుడిగా ప్రకటించాలని కోరుతా. గతంలో పార్లమెంట్లో ఓటుకు నోటు కుంభకోణంలో ఉన్నవారిని ఎథిక్స్ కమిటీ ద్వారా పదవుల నుంచి తప్పించారు. లోకేశ్ శాఖలో రూ.వేల కోట్లు లూటీ చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌కు సంబంధించిన ఐటీ శాఖలో ప్రభుత్వ పెద్దలకు బాగా కావాల్సిన బినామీ సంస్థలకు, కొన్ని షెల్ కంపెనీలకు రూ.వేల కోట్లు దోచిపెడుతున్నారు. విశాఖలో ఐటీ కంపెనీలకు ప్రభుత్వం ఇచ్చే భూములను మూడేళ్లలో వారు అమ్ముకోవచ్చట! అంటే ఇదంతా లూటీనే కదా. కంపెనీ పేరు ఒక్కటే నిజం, మిగిలిందంతా దోపిడీయే. ప్రభుత్వం ఐటీ రాయితీలు ఇచ్చిన కంపెనీల వివరాలను ఎందుకు బయటపెట్టడం లేదు? రాష్ట్రానికి ప్రపంచస్థాయి కంపెనీలు వచ్చాయని చెప్పుకుంటున్నారు. కానీ, విజయవాడలోని పటమట స్థాయి కంపెనీలు వచ్చినట్టు ఉన్నాయి. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి తాము సిద్ధమని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ప్రకటించినా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపాల్సిన నివేదికలను చంద్రబాబు ప్రభుత్వం ఆలస్యం చేస్తోంది. మీరు(టీడీపీ పెద్దలు) చేయాల్సింది చేయరు, డ్రామాలు చేస్తారు, ధర్మ పోరాటాల పేరుతో ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకుంటారు’ అని జీవీఎల్ నరసింహారావు దుయ్యబట్టారు. -
రూ.800 కోట్లు దారి మళ్లింపు!
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ అక్రమ లావాదేవీలు, బినామీ వ్యవహారాలను ఆదాయపన్ను శాఖ రట్టు చేసింది. సబ్ కాంట్రాక్టుల ముసుగులో పనులు చేయకుండానే చేసినట్లుగా చూపించి బిల్లులు కాజేయటం, ఆ డబ్బులను చిరునామా లేని కంపెనీల్లోకి మళ్లించి తరువాత వాటి నుంచి సీఎం రమేశ్ సంస్థ నగదు వెనక్కి తీసుకున్నట్లు ఐటీ అధికారులకు కచ్చితమైన ఆధారాలు లభ్యమయ్యాయి. గత వారం రోజులుగా ఆదాయపన్ను శాఖ సోదాల్లో సేకరించిన కీలక ఆధారాలను బట్టి సీఎం రమేశ్‌కు చెందిన నిర్మాణ రంగ కంపెనీ రిత్విక్ ప్రాజెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సుమారు రూ.800 కోట్లను వివిధ కంపెనీల ద్వారా దారి మళ్లించిందని ప్రాథమికంగా నిర్థారించినట్లు తెలుస్తోంది. ఇందులో రూ.100 కోట్ల మళ్లింపుపై పూర్తి ఆధారాలు లభించగా మరో రూ.700 కోట్ల మేరకు అనుమానాస్పద లావాదేవీలను ఐటీ అధికారులు గుర్తించారు. యువనేత సన్నిహిత కంపెనీకి నిధుల వరద అధికార పార్టీకి చెందిన కీలక యువనేతతో దగ్గర సంబంధాలు ఉన్నట్లుగా ప్రచారంలో ఉన్న ఓ సాంప్రదాయ ఇంధన తయారీ రంగంలోని కంపెనీలోకి ఈ రూ.700 కోట్లను సీఎం రమేష్ సంస్థ తరలించినట్లుగా ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. సీఎం రమేష్‌కు చెందిన కంపెనీలు అంజనాద్రి పవర్, కడప పవర్, నారాయణాద్రి గ్రీన్ఎనర్జీ, కదిరి గ్రీన్‌పవర్, రిత్విక్ గ్రీన్‌పవర్‌ల నుంచి ప్రవాహంలా నిధులను ఈ సంప్రదాయ ఇంధన తయారీ కంపెనీలోకి తరలించినట్లు భావిస్తున్నారు. చిరునామా లేని కంపెనీలకు రూ.వంద కోట్లు తరలింపు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థ సుమారు రూ.100 కోట్లను నకిలీ కంపెనీల పేరుతో తరలించినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. రూ.74 కోట్లను చిరునామా లేని కంపెనీల్లోకి తరలించగా మరో రూ.25 కోట్లను అనుమానాస్పద లావాదేవీలుగా గుర్తించినట్లు ఐటీ శాఖ రూపొందించిన నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా సబ్‌కాంట్రాక్టుల ముసుగులో భారీఎత్తున నిధులను దారి మళ్లించినట్లు తేలింది. గత ఆరేళ్లలో ఎడ్కో(ఇండియా) అనే సబ్‌కాంట్రాక్టర్‌కు రూ.12 కోట్లు చెల్లించినట్లు పుస్తకాల్లో చూపించగా రికార్డుల్లో పేర్కొన్న నాలుగు చిరునామాల్లో ఎక్కడా ఈ కంపెనీ ఆనవాళ్లు లభించలేదని ఐటీ శాఖ స్పష్టం చేసింది. రిత్విక్ అకౌంటెంట్ వద్ద ఎడ్కో స్టాంపులు, సీలు రిత్విక్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న సాయిబాబా, ఎడ్కో అనే నకిలీ కంపెనీ మధ్య పలు లావాదేవీలు జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. సాయిబాబా వద్ద ఎడ్కో కంపెనీకి చెందిన స్టాంపులు, స్టీలు దొరికాయని, దీన్నిబట్టి నిధులు తరలించిడానికే ఎడ్కో కంపెనీని వాడుకున్నట్లు అర్థమవుతోందని ఐటీ శాఖ తన నివేదికలో పేర్కొంది. ఇదే సమయంలో రూ.33 కోట్ల అనుమానాస్పద లావాదేవీలను కూడా ఐటీ అధికారులు గుర్తించారు. ఇందులో రూ.25 కోట్లు కొనుగోళ్లు కోసం వెచ్చించినట్లు చూపగా అందులో రూ.23 కోట్లు నగదు రూపంలో వెనక్కి వచ్చేశాయి. ఈ లావాదేవీల గురించి ఐటీ అధికారులు కంపెనీ అకౌంటెంట్, డైరెక్టర్‌ను ప్రశ్నించగా జవాబు చెప్పలేకపోవడం గమనార్హం. సరైన బిల్లులు లేకుండా రూ.కోట్లలో చెల్లింపులు స్టీల్ సప్లయిర్స్ నుంచి రూ.12.24 కోట్లు వచ్చినట్లు చూపించగా దీనికి సంబంధించిన నగదు లావాదేవీలను వివరించలేకపోయారు. స్టీల్ సప్లయిర్స్ నుంచి 2 శాతం కమీషన్ రూపంలో మొత్తం రూ.7.98 కోట్లు వచ్చినట్లు చూపించడంపై కూడా ఐటీ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఢిల్లీకి చెందిన సబ్‌కాంట్రాక్టర్ ఎన్‌కేజీ కన్స్ట్రక్షన్స్కు రూ.6 కోట్లు చెల్లింపులు జరపగా దానికి సరైన బిల్లులు లేవు. స్టీలు కొనుగోలులో గోల్మాల్! రిత్విన్ కంపెనీలో ఓ వ్యక్తి కంపెనీ తరుఫున రూ.2.97 కోట్లు రుణం తీసుకొని ఆ మొత్తాన్ని వ్యక్తిగత అవసరానికి వాడుకున్నట్లు గుర్తించారు. స్టీలు కొనుగోళ్లకు సంబంధించి ఆక్ స్టీల్స్, బీఎస్కే సంస్థలకు చేసిన రూ.25 కోట్ల చెల్లింపులను కూడా ఐటీ శాఖ అనుమానాస్పదమైనవిగా గుర్తించింది. ఇవి కాకుండా సోదాల్లో సీఎం రమేష్ ఇంటి నుంచి రూ.13 లక్షలు, రూ.2.22 లక్షల విలువైన 3,000 అమెరికన్ డాలర్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులను అడగండన్న సీఎం రమేష్ సీఎం రమేష్ నకిలీ కంపెనీల ద్వారా నిధులను భారీఎత్తున తరలించినట్లు ఆధారాలతో సహా జాతీయ మీడియాలో ప్రధానంగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దమ్ముంటే ఒక్కటైనా అక్రమ లావాదేవీ నిర్వహించినట్లు చూపాలని మీసం మెలేసిన సీఎం రమేష్‌ను జాతీయ మీడియా ప్రతినిధులు వివరణ కోరగా ఐటీ అధికారులనే అడగాలంటూ దాటవేయడం గమనార్హం. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ‘రిత్విక్’ నుంచి డబ్బులు! సీఎం రమేష్ ఇంట్లో తీగ లాగితే ‘ఫిరాయింపు’ డొంక కదులుతోంది! కొందరు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డబ్బుల చెల్లింపు వ్యవహారంలోనూ టీడీపీ ఎంపీ సీఎం రమేష్ పాత్ర ఉన్నట్లు ఐటీ సోదాలతో వెలుగులోకి వస్తోంది. వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ముట్టజెప్పిన సొమ్ములో కొంత డబ్బును సీఎం రమేష్ కంపెనీల ద్వారా చేరవేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కిడారి కోసం రూ.7 కోట్లు... సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ తదితర కంపెనీల నుంచి అడ్రస్‌లేని బోగస్ కంపెనీలకు రూ.వందల కోట్లలో డబ్బులు తరలించినట్లు తాజాగా ఐటీ అధికారులు గుర్తించారు. ఈ డబ్బును ఫిరాయింపు వ్యవహారాలకు వినియోగించినట్లు భావిస్తున్నారు. ఇటీవల మావోయిస్టుల చేతుల్లో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుకు కూడా ఇలాగే డబ్బు అందిందనే ప్రచారం జరుగుతోంది. కిడారి పార్టీ మారిన సమయంలో విశాఖపట్నానికి చెందిన ఓ ఎమ్మెల్యే ముఖ్య అనుయాయుడి బ్యాంకు ఖాతాలో దాదాపు రూ.7 కోట్లు జమ అయినట్లు సమాచారం. విశాఖ ఎమ్మెల్యే ఇంటికి సమీపంలోనే ఆయన అనుయాయుడి ఇల్లు ఉంటుంది. ఆయన విజయనగరం జిల్లాలో క్వారీ, మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తుంటారని సమాచారం. తనకు ఆడిటింగ్‌లో ఇబ్బందులు వస్తాయని అతను ఆందోళన వ్యక్తం చేయగా.. కిడారికి అందించేందుకే నీ ఖాతాలో వేశారని ఎమ్మెల్యే తన అనుయాయుడికి సర్దిచెప్పినట్లు తెలిసింది. ఫిరాయింపుదారులకు ఎరవేసిన డబ్బులు సీఎం రమేష్ కంపెనీల నుంచే వచ్చాయా? టీడీపీ సన్నిహితులైన వ్యాపారులు, వారితో సంబంధాలున్న వారి ఖాతాల్లోకి నిధులు చేరవేశారా? అనే కోణంలోనూ ఐటీ అధికారులు విచారణ చేపట్టినట్లు చెబుతున్నారు. చంద్రబాబును మెప్పించేందుకు ఫిరాయింపులను ప్రోత్సహించిన నాయకులు తాజా పరిణామాలతో బెంబేలెత్తుతున్నట్లు టీడీపీలోనే తీవ్ర చర్చ జరుగుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సొమ్ములు ఎవరి ద్వారా వెళ్లాయనే విషయాన్ని ఇన్నాళ్లూ గుట్టుగా ఉంచగలిగారని, కానీ సీఎం రమేష్ ఆస్తులపై జరిగిన ఐటీ సోదాలతో స్పష్టత వచ్చినట్లు అధికారపార్టీకి చెందిన నాయకులే పేర్కొంటున్నారు. -
దొరికారా?
-
చంద్రబాబు బినామీ సీఎం రమేష్
విజయవాడ: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి బినామీ సీఎం రమేష్ అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు ఆరోపించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జీవీఎల్ విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ దిగజారుడు మనిషని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం రమేష్‌ను రాజ్యసభకు పంపినందుకు చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే రాజ్యసభ సభ్యత్వం నుంచి తొలగించాలని కోరారు. జాతీయ స్థాయిలో వచ్చిన కథనాలపై సీఎం రమేశ్ ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మీసం మెలేసిన సీఎం రమేష్ జాతీయ స్థాయిలో వచ్చిన కథనాలతో మీసం తీయించుకుంటారా అని సవాల్ విసిరారు. ఒక అవినీతి పరుడైన సీఎం రమేష్‌ని పబ్లిక్ కమిటీలో స్థానం కల్పించాలని సీఎం ఎలా రికమెండేషన్ చేస్తారని అడిగారు. సీఎం రమేష్‌పై ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు సీఎం రమేష్ తీరుపై ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సీఎం రమేష్ వ్యవహరించే తీరు, పార్లమెంటు సభ్యులకు ఉండాల్సిన లక్షణాలు ఏవీ లేవని అభిప్రాయపడ్డారు. సీఎం రమేష్ అవినీతిపై కూడా ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. సీఎం రమేశ్ వాడే బాష పార్లమెంటు సంప్రదాయానికి విరుద్ధంగా ఉందన్నారు. ఐటీ పేరుతో లూటీ రాష్ట్రంలో ఐటీ పేరుతో చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్‌లు లూటీ చేస్తున్నారని జీవీఎల్ ఆరోపించారు. ఇష్టం వచ్చినట్లు భూములు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. సమాచార చట్టం ద్వారా ఐటీ కంపెనీలకు కేటాయించిన వివరాలు అడిగితే ఎందుకు ఇవ్వడం లేదని సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లోకేష్ తన బినామీలకు ఐటీ కంపెనీల పేరుతో వేల కోట్ల రూపాయల భూమలు కేటాయిస్తున్నారని విమర్శించారు. ప్రజా ధనాన్ని లూటీ చేయడానికి లోకేష్‌కు ఐటీ మంత్రి పదవి ఇచ్చారని ఆరోపించారు. 24 గంటల్లో ఐటీ కంపెనీలకు ఇచ్చిన భూముల వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఐటీ కంపెనీల ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. దొంగ దీక్షలు..తప్పుడు వ్యాపారాలు సీఎం రమేష్ దాదాపు రూ.100 కోట్ల టాక్స్ ఎగ్గొట్టారని, దొంగ దీక్షలు, తప్పుడు వ్యాపారాలు చేశారని జీవీఎల్ ఆరోపించారు. సొంత కంపెనీ అకౌంట్స్‌లోనే దొంగ లెక్కలు చూపించే వ్యక్తిని చంద్రబాబు పబ్లిక్ అకౌంట్స్‌లో మెంబర్‌గా చేశారని విమర్శించారు. సీఎం రమేష్ లాంటి వ్యక్తుల వల్ల పార్లమెంటు పరువుపోతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చర్యలు తీసుకోకపోతే రమేష్ వెనక చంద్రబాబు నాయుడు ఉన్నారని అర్ధం చేసుకోవలసి వస్తుందని అన్నారు. టీడీపీలో విలువలు లేవని చెప్పడానికి సీఎం రమేష్ ఒక ఉదాహరణ అని చెప్పారు. 2019 తర్వాత టీడీపీ కనుమరుగు 2019 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో టీడీపీ కనుమరుగు కానుందని జోస్యం చెప్పారు. సీఎం రమేష్ వాస్తవాలను జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. అందుకే ఆయనపై విమర్శలు చేసిన వారిపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రమేష్ సారాయ కాంట్రాక్టర్, వీధి రౌడీలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. -
దొంగ దీక్షలు..తప్పుడు వ్యాపారాలు
-
రూ. 100 కోట్ల వరకూ అనుమానాస్పద లావాదేవీలు
సాక్షి, న్యూఢిల్లీ : టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌పై ఐటీ దాడుల్లో రూ.100 కోట్ల వరకూ అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. రమేష్‌కు చెందిన నిర్మాణ రంగ కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ రూ.74 కోట్ల నిధులను గుర్తించలేని లావాదేవీల ద్వారా దారిమళ్లించినట్టు, రూ.25 కోట్ల బిల్లులను ఐటీ అధికారులు అనుమానాస్పదమైనవిగా కనుగొన్నట్టు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం పేర్కొంది. ఐటీ అధికారులు ఈనెల 12న హైదరాబాద్‌లోని కంపెనీ కార్యాలయంలో, కడపలో ఎంపీ రమేష్ నివాసంలో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న పత్రాలను పరిశీలించిన మీదట సీఎం రమేష్ డైరెక్టర్‌గా ఉన్న రిత్విక్ ప్రాజెక్ట్స్ పలు సబ్ కాంట్రాక్టర్ల ద్వారా నిధులను దారిమళ్లించేందుకు పలు అనుమానాస్పద లావాదేవీలకు పాల్పడినట్టు ఐటీ వర్గాలు గుర్తించాయి. గత ఆరేళ్లుగా రిత్విక్ ప్రాజెక్ట్స్ ఎడ్కో (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.12 కోట్లు చెల్లించినట్టు గుర్తించారు. అయితే రికార్డుల్లో పేర్కొన్న నాలుగు చిరునామాల్లో ఆ కంపెనీ ఆనవాళ్లు లభించలేదని ఐటీ శాఖ రూపొందించిన నివేదిక వెల్లడించింది. ఎడ్కోతో జరిపిన కరస్పాండెన్స్లో రిత్విక్ ప్రాజెక్ట్స్ అకౌంటెంట్ సాయిబాబు ఉత్తరప్రత్యుత్తరాలు నిర్వహించినట్టు గుర్తించారు. ఎడ్కో స్టాంప్, సీల్ ఆయన వద్ద ఉన్నట్టు గుర్తించడంతో నిధుల దారిమళ్లింపునకే దీన్ని వాడుకున్నట్టు తెలుస్తోందని నివేదిక పేర్కొంది. ఇక రూ. 25 కోట్ల బిల్లులకు సంబంధించి కంపెనీ డైరెక్టర్ కానీ, అకౌంటెంట్ కానీ సంతృప్తికర సమాధానాలు ఇవ్వలేదని తెలిపింది. స్టీల్ సరఫరాదారుల నుంచి రూ. 12.24 కోట్లు వసూలైనట్టు కంపెనీ చూపగా, నగదు లావాదేవీల్లో వివరణ లేదని పేర్కొంది. ఢిల్లీ సబ్‌కాంట్రాక్టర్ ఎన్‌కేజీ కన్స్ర్టక్షన్స్కు రూ 6 కోట్లు చెల్లింపులు జరపగా దానికి సరైన బిల్లులు చూపలేకపోయారని నివేదిక తెలిపింది. వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారు బ్యాంకుల నుంచి రుణంగా పొందిన రూ. 2.97 కోట్లను కంపెనీకి చెందిన కొందరు వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్టు ఐటీ అధికారుల విచారణలో వెల్లడైంది. ఆక్ స్టీల్స్, బీఎస్కే సంస్థలచే స్టీల్ కొనుగోళ్లకు సంబంధించి రూ 25 కోట్ల బిల్లులను అనుమానాస్పదమైనవిగా గుర్తించిన ఐటీ శాఖ వీటిని పరిశీలిస్తోంది. ఇక రికార్డుల్లో చెల్లింపులుగా చూపిన రూ. 8.4 కోట్ల మొత్తానికి సరైన వివరణ ఇవ్వలేదని, రమేష్ నివాసం నుంచి రూ. 13 లక్షలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ దాడులపై ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సీఎం రమేష్‌ను ప్రశ్నించగా, వీటిపై నన్ను అడగవద్దని, ఐటీ అధికారులనే అడగాలని బదులిచ్చారు. టీడీపీ నేతల బుకాయింపు రాజకీయ కక్ష సాధింపుతోనే ఐటీ దాడులు నిర్వహించారని సీఎం రమేష్‌పై ఐటీ దాడుల సందర్భంగా టీడీపీ నానా హంగామా చేసింది. సీఎం రమేష్ సైతం తనపై రాజకీయ కక్షతోనే దాడులు చేపట్టారని ఆరోపించారు. కేంద్ర సహాయ మంత్రిగా పార్లమెంటరీ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా ఐటీ శాఖకు రమేష్ ఇచ్చిన నోటీసుల ఫలితంగానే సోదాలు జరిగాయని కూడా టీడీపీ వర్గాలు చెప్పుకొచ్చాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తమ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని ఐటీ దాడులకు పాల్పడుతోందని సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్ సైతం ఆరోపించారు. గతంలో సుజనా చౌదరి ప్రస్తుతం సీఎం రమేష్‌లపై ఐటీ దాడులే ఇందుకు సంకేతమని చినబాబు అప్పట్లో ఆరోపించారు. -
సీఎం రమేష్‌కు న్యాయం.. అధికారులకు అన్యాయం
సాక్షి, అమరావతి: హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్ సంస్థ పనులు చేయకుండానే చేసినట్లు చూపి మింగేసిన సొమ్మును వసూలు చేయడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. కానీ అక్రమ చెల్లింపులకు బాధ్యులైన చీఫ్ ఇంజనీర్, ఎస్ఈ, ఈఈలపై మాత్రం చర్యలు తీసుకుంది. వివరాల్లోకెళ్తే.. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం తొలి దశకు 2004లో టెండర్లు పిలిచారు. అప్పట్లో సీఎం రమేష్ సంస్థ రిత్విక్ ప్రాజెక్ట్స్ చిన్న సంస్థ కావడంతో టెండర్లలో పాల్గొనే అవకాశం కూడా ఆ సంస్థకు లేకపోయింది. దీంతో హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం తొలి దశలో 23వ ప్యాకేజీ (ప్రధాన కాలువ 3.42 కి.మీ. నుంచి 20 కి.మీ. వరకూ తవ్వకం) పనులను బ్యాక్‌బోన్ కనస్ట్రక్షన్స్ సంస్థను ముందు పెట్టి రూ.47 కోట్లకు సీఎం రమేష్ దక్కించుకున్నారు. ఆ తర్వాత ఆ పనులను సీఎం రమేష్ సంస్థ సబ్ కాంట్రాక్టు కింద చేపట్టింది. హంద్రీ–నీవా తొలి దశలో అన్ని ప్యాకేజీల పనులు 2009 నాటికే పూర్తయినా 23వ ప్యాకేజీ పనులు చేయడంలో మాత్రం రిత్విక్ ప్రాజెక్ట్స్ మొండికేసింది. రాష్ట్ర ప్రభుత్వం 2012లో తీవ్రస్థాయిలో ఒత్తిడి చేయడంతో ఎట్టకేలకు కదలిక వచ్చింది. మిగిలిపోయిన పనులు పూర్తి చేసే క్రమంలో పనులు చేయకపోయినా చేసినట్లు చూపి రూ.5.91 కోట్లు దండుకున్నారు. ఈ వ్యవహారంపై అప్పటి ప్రభుత్వం ఈఎన్సీ రెహమాన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. క్షేత్ర స్థాయిలో పనులను తనిఖీ చేసిన ఈ కమిటీ సీఎం రమేశ్ సంస్థ అక్రమాలకు పాల్పడినట్లు తేల్చింది. అక్రమ చెల్లింపులకు బాధ్యులైన సీఈ, ఎస్ఈ, ఈఈలపై సస్పెండ్ వేటు వేసింది. చేయని పనులకు తీసుకున్న రూ.5.91 కోట్లను వెనక్కి ఇవ్వాలంటూ ప్రధాన కాంట్రాక్టర్ బ్యాక్‌బోన్ కనస్ట్రక్షన్స్‌కు సర్కార్ నోటీసులు ఇచ్చింది. వాటిని తాము చేయలేదని సబ్ కాంట్రాక్టర్ చేశారని ప్రధాన కాంట్రాక్టర్ వివరించారు. సబ్ కాంట్రాక్టర్ సీఎం రమేశ్ సంస్థ మింగిన నిధులను వెనక్కి ఇవ్వకపోవడంతో ప్రధాన కాంట్రాక్టు సంస్థ బ్యాక్‌బోన్ కనస్ట్రక్షన్స్‌ను సర్కార్ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. ఈలోగా ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో చంద్రబాబు సర్కార్ కొలువుదీరింది. దీంతో అధికారులు సీఎం రమేష్ సంస్థ దిగమింగిన సొమ్మును వసూలు చేయలేకపోతున్నారు. కానీ.. అందుకు బాధ్యులైన అధికారులపై మాత్రం శాఖాపరమైన చర్యలను కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే జలవనరుల శాఖ ఇటీవల అందరికీ పదోన్నతులు ఇచ్చి.. ఆ ముగ్గురు అధికారులకు పదోన్నతి కల్పించలేదు. సీఎం రమేష్ సంస్థ చేసిన తప్పులకు తాము శిక్ష అనుభవించాల్సి వస్తోందని ఆ ముగ్గురు అధికారులు వాపోతున్నారు. -
‘ఆయన మీసం మెలేస్తే.. వాళ్లు తొడగొడుతున్నారు’
సాక్షి, విజయవాడ : సీఎం రమేశ్ ఇంటిపై ఐటీ సోదాలు జరిగితే అధికార టీడీపీకి భయమెందుకని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఐటీ దాడులను ప్రేరేపిత దాడులుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రమేశ్ చంద్రబాబు నంబర్‌వన్ బినామీ అని ఆరోపించారు. వైఎస్ జగన్‌ను విమర్శించే నైతిక హక్కు రమేశ్‌కు లేదన్నారు. సీఎం రమేశ్ మీసం మెలేస్తే ఐటీ అధికారులు తొడలు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. రిత్విక్ సంస్థ ఎప్పుడైనా భారీ కాంట్రాక్టు చేసిందా అని ప్రశ్నించారు. ఆ సంస్థవన్నీ సబ్ కాంట్రాక్టులేనని, అవన్నీ బెదిరించి తీసుకున్నవేనని ఆరోపించారు. ఆయన జీవిత భాగస్వామికి, కుటుంబీకులకు తెలియకుండా వేలిముద్ర ఉంటేనే తెరుకునే లాకర్లు ఉండటమేంటని ప్రశ్నించారు. ఆ లాకర్లలో ఏమి దాచారో చెప్పాలన్నారు. సీఎం రమేశ్ ఓ గజదొంగ, బినామీ, బ్రోకర్ కాబట్టే అలాంటి లాకర్లు ఇంట్లో పెట్టుకున్నారని విమర్శించారు. ఇవన్ని చేస్తూ మీసం మెలేస్తున్నారని.. పచ్చకాలం అంటే ఇదేనని ఎద్దేవా చేశారు. బీజేపీ, టీడీపీ నాలుగేళ్లుగా చెట్టాపట్టాలేసుకొని తిరిగారు, తేడా ఎక్కడ వచ్చిందో విడిపోయారని విమర్శించారు. సీఎం రమేశ్ సారా కాంట్రాక్టర్ దశ నుంచి ఎంపీ స్థాయికి రావడానికి గెస్ట్‌హౌజ్ రాజకీయాలే కారణమని ఆరోపించారు. పచ్చకాలం ఎక్కువ కాలం ఉండదని, ప్రజలు బుద్ది చెప్పే రోజులు ముందున్నాయని అంబటి పేర్కొన్నారు. -
సీఎం రమేష్..గోబెల్స్‌కే కొత్త పాఠాలు
సాక్షి, అమరావతి: పచ్చి అబద్ధాలను పదేపదే వల్లె వేసి అక్రమాలను కప్పిపుచ్చుకోవచ్చా? అవాస్తవాలు చెప్పి వాస్తవాలను దాచేయొచ్చా? మీడియా ముందు రంకెలు వేస్తే దొంగ దొర అవుతాడా? ముఖ్యమంత్రి చంద్రబాబు దన్నుతో సారా వ్యాపారిగా జీవితం ప్రారంభించి, కాంట్రాక్టర్‌గా రూపాంతరం చెంది, రాజకీయ నేతగా రంగు మార్చుకున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వ్యవ హారశైలి చూస్తే అలానే ఉంది. సీఎం రమేష్ కుటుంబానికి చెందిన కాంట్రాక్టు, వ్యాపార సంస్థల్లో ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) అధికారులు మూడు రోజులపాటు సోదాలు చేశారు. కీలక పత్రాలు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. విచారణ కొనసాగిస్తున్నారు. ఐటీ సోదాలు పూర్తయిన తర్వాత సీఎం రమేష్ ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తన అక్రమాలను కప్పిప్చుకోవడానికి అబద్ధాలు వల్లె వేశారు. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు.. కనికట్టు చేసేందుకు ప్రయత్నించారు. అబద్ధాలు చెప్పడంలో గోబెల్స్‌కే కొత్త పాఠాలు నేర్పుతున్నారు. మీడియా సమావేశంలో సీఎం రమేష్ అబద్ధాలతో చేసిన రుబాబు.. వాస్తవాలు ఇవీ... సీఎం రమేష్: 1998లోనే రిత్విక్ ప్రాజెక్టస్‌ను ప్రారంభించా. అప్పట్లోనే టెండర్లలో రూ.90 కోట్ల విలువైన అవుకు రిజర్వాయర్ పనులు దక్కించుకున్నా. వాస్తవం: రిత్విక్ ప్రాజెక్ట్స్‌ను 1999లో ప్రారంభించారు. కావాలంటే రిత్విక్ ప్రాజెక్ట్స్ వెబ్సైట్ చూసుకోవచ్చు. సీఎం రమేష్ చెప్పినట్టు 1998లో ప్రారంభించిన సంస్థకు.. పనులు చేసిన అనుభవం ఉండదు. అంటే టెండర్లలో పాల్గొనే అవకాశం లేదు. కానీ, చంద్రబాబు అండతో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో అవుకు రిజర్వాయర్ పనులు దక్కించుకున్న రిత్విక్ ప్రాజెక్ట్స్.. రెండేళ్లలో పూర్తి చేయాల్సిన ఆ రిజర్వాయర్ పనులను 2004 దాకా చేస్తూనే ఉంది. పనులు నాసిరకంగా చేయడం వల్ల రిజర్వాయర్ మట్టికట్టకు పలుమార్లు గండ్లు పడ్డాయి. దాంతో 2004లో ఈ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచుతూ మళ్లీ కొత్తగా పనులు చేయాల్సి వచ్చిందన్న విషయం వాస్తవం కదా? సీఎం రమేష్: అంచనా వ్యయం రూ.5 లక్షల కంటే ఎక్కువ ఉండే పనులను నామినేషన్‌పై ఇచ్చే అధికారం ప్రభుత్వానికి లేదు. నేను నామినేషన్‌పై ఒక్క పని కూడా తీసుకోలేదు. నామినేషన్‌పై ప్రాజెక్టుల పనులు తీసుకున్నానని నిరూపిస్తే దేనికైనా సిద్ధం. వాస్తవం: 2004 నుంచి 2014 వరకూ రూ.5 లక్షలలోపు విలువైన పనులను మాత్రమే.. అదీ అత్యవసరంగా చేపట్టాల్సిన పనులనే నామినేషన్ విధానంలో కాంట్రాక్టర్లకు అప్పగించే సాంప్రదాయం రాష్ట్రంలో ఉండేది. కానీ, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2014 నుంచి నిబంధనలను తుంగలో తొక్కారు. రూ.వందల కోట్ల విలువైన పనులను సైతం నామినేషన్ విధానంలో కాంట్రాక్టర్లకు కట్టబెడుతున్నారు. నీరు–చెట్టు కింద ఇప్పటిదాకా చేసిన రూ.15,386 కోట్ల విలువైన పనుల్లో 95 శాతం పనులను నామినేషన్‌పైనే జన్మభూమి కమిటీల ముసుగులో టీడీపీ నేతలకు కట్టబెట్టారు. పోలవరం ప్రాజెక్టులో రూ.1,292 కోట్ల విలువైన పనిని నవయుగ సంస్థకు అప్పగించారు. హంద్రీ–నీవా ప్రాజెక్టులో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను టెండర్లలో ఆర్కే–హెచ్‌ఈఎస్–కోయా(జేవీ) సంస్థ రూ.430 కోట్లకు దక్కించుకుంది. నిబంధనల ప్రకారం టెండర్లలో షెడ్యూల్ దాఖలు చేసేటప్పుడే సబ్ కాంట్రాక్టర్ల వివరాలను ప్రభుత్వానికి ఇవ్వాలి. కానీ, అప్పట్లో ఇవ్వలేదు. ప్రస్తుతం ఆ పనులను రిత్విక్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. కావాలంటే రిత్విక్ ప్రాజెక్ట్స్ వెబ్సైట్ చూసుకోవచ్చు. ఆ పనులు సీఎం రమేష్ చేతికి ఎలా దక్కాయి? దొడ్డిదారిన కాదా? ఇవే పనులకు ఇటీవల కేబినెట్లో తీర్మానం చేసి మరీ అదనంగా రూ.122.75 కోట్ల బిల్లులు ఇప్పించుకున్న ఘనత సీఎం రమేష్‌కే దక్కింది. హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులలో భారీ ఎత్తున పనులను ఇదే రీతిన దక్కించుకోవడం వాస్తవం కాదా? సీఎం రమేష్: నేను ఆంధ్రప్రదేశ్‌లో కాంట్రాక్టు పనులు చేయకూడదా? 2014కు ముందు కూడా నేను భారీ ఎత్తున పనులు చేశా. 2014 తర్వాత కేవలం రూ.2,000 కోట్ల విలువైన పనులను.. అదీ టెండర్ల ద్వారా పారదర్శకంగా దక్కించుకున్నా. వాస్తవం: 2014 వరకూ సీఎం రమేష్ సంస్థ టెండర్లలో పాల్గొన్న దాఖలాలు లేవు. హంద్రీ–నీవాలో 23, 32 ప్యాకేజీలను బ్యాక్‌బోన్ కన్స్ట్రక్షన్స్ను ముందు పెట్టి.. 33వ ప్యాకేజీ పనులను ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్(ఇండియా)ను ముందు పెట్టి దక్కించుకుని.. వాటిని సబ్ కాంట్రాక్టు కింద చేశారు. 23, 33వ ప్యాకేజీల్లో పనులు చేయకున్నా చేసినట్లు చూపి రూ.9.87 కోట్లకుపైగా అధికంగా బిల్లులు చేసుకున్నారు. ఈ వ్యవహారంలో సీఈ, ఎస్ఈ, ఈఈలపై సర్కార్ సస్పెన్షన్ వేటు వేయడం నిజం కాదా? సీఎం రమేష్ చేసిన పాపాలకు బ్యాక్‌బోన్ కన్స్ట్రక్షన్స్ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన మాట వాస్తవం కాదా? 2014 వరకూ సీఎం రమేష్ సబ్ కాంట్రాక్టర్‌గానే వ్యవహరించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తప్పుడు అర్హత ధ్రువీకరణ పత్రాలను సమర్పించి, టెండర్లలో పనులు దక్కించుకున్నారు. హంద్రీ–నీవా ప్రధాన కాలువ విస్తరణ పనుల దగ్గర నుంచి తెలుగుగంగ లైనింగ్ పనుల టెండర్ల వరకూ ఇదే కథ. సీఎం చంద్రబాబు అండదండలతో అక్రమంగా పనులు దక్కించుకున్న మాట వాస్తవం కాదా? వెలిగొండ రెండో టన్నెల్ పనులు కేవలం సీఎం రమేష్‌కు దక్కవనే నెపంతోనే రద్దు చేసి.. రెండోసారి టెండర్లు నిర్వహించి రూ.299 కోట్ల విలువైన పనులను రూ.597.34 కోట్లకు చేజిక్కించుకోవడం నిజం కాదా? సీఎం చంద్రబాబును అడ్డం పెట్టుకుని గత నాలుగున్నరేళ్లలో రూ.3,596.15 కోట్ల విలువైన పనులను దక్కించుకోవడం వాస్తవం కాదా? సీఎం రమేష్: కాంట్రాక్టు పనుల్లో రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ ఎలాంటి అక్రమాలకు పాల్పడడం లేదు. అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నాం. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నా వ్యాపార సంస్థల్లో ఐటీ సోదాలు చేశారు. వాస్తవం: కేవలం అంచనా వ్యయం పెంచడం ద్వారానే గత నాలుగున్నరేళ్లలో రిత్విక్ ప్రాజెక్ట్స్‌కు రూ.1,544.83 కోట్ల ప్రయోజనాన్ని ప్రభుత్వం చేకూర్చింది. అంటే తక్కువ పనులు చేసి ఎక్కువ లాభం పొందారన్న మాట. ఇది అక్రమం కాదా? నెలనెలా చెల్లించాల్సిన వస్తు సేవల పన్నును(జీఎస్టీ)ని రిత్విక్ ప్రాజెక్ట్స్ చెల్లించడం లేదని కమర్షియల్ ట్యాక్స్ అధికారులే చెబుతున్నారు. ఆదాయపు పన్ను ఎప్పటికప్పుడు సక్రమంగా చెల్లిస్తున్నప్పుడు ఐటీ అధికారులు సోదాలు చేస్తే మీకు ఎందుకంత ఉలికిపాటు? -
పీఏసీ మెంబర్‌గా పోటీ చేశాననే ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) ఎన్నికల్లో పోటీ చేయడం వల్లే తన వ్యాపార సంస్థల్లో కేంద్ర ప్రభుత్వం ఐటీ సోదాలు చేయించిందని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆరోపించారు. కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో జరిగిన ఆ ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకోవాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కోరినా తాను వినలేదని, అందుకే కక్ష సాధింపుగా ఈ సోదాలు జరిపించారని పేర్కొన్నారు. సీఎం రమేష్ ఆదివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికార పార్టీతో పెట్టుకుంటే ఇలాంటి సోదాలు జరుగుతాయని ఒక అధికారి తనను హెచ్చరించారని చెప్పారు. తనను, రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేశారని, కావాలని దాడులు చేశారని విమర్శించారు. ఈ విషయాలన్నింటినీ పీఏసీ సమావేశంలో ప్రశ్నిస్తామని, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. బీజేపీ తాటాకు చప్పుళ్లకు తాను భయపడను రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ టర్నోవర్ రూ.1,000 కోట్లకు మించి లేదని చెప్పిన సీఎం రమేష్ గత సంవత్సరం టర్నోవర్ రూ.1300 కోట్లు, ఈ సంవత్సరం టర్నోవర్ రూ.1,500 కోట్లు ఉంటుందని చెప్పడం గమనార్హం. తన కంపెనీకి నామినేషన్ విధానంలో ప్రభుత్వం రూ.లక్ష విలువైన పని కూడా ఇవ్వలేదని చెప్పారు. రూ.5 లక్షల కంటే ఎక్కువ విలువ చేసే పనులను నామినేషన్ విధానం ద్వారా ఇచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని వెల్లడించారు. దుమ్ముగూడెంలో గతంలో రూ.4,000 కోట్ల విలువైన పనులు వచ్చాయని, అవుకు రిజర్వాయర్‌కు సంబంధించి రూ.90 కోట్ల విలువైన పని వచ్చిందని వివరించారు. అయినా రిత్విక్ కంపెనీ రూ.2,000 కోట్ల విలువైన పనులు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. తనకు సంబంధించిన 25 చోట్ల ఐటీ సోదాలు జరిపినా ఏమీ కనుక్కోలేకపోయారని అన్నారు. బీజేపీ తాటాకు చప్పుళ్లకు తాను భయపడనని, తన తల తీసినా బెదరనని వ్యాఖ్యానించారు. తాను తప్పు చేసి ఉంటే ఉరి శిక్షకైనా సిద్ధమని చెప్పారు. -
‘తుపాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం’
సాక్షి, విజయవాడ : తిత్లీ తుపాను కారణంగా అల్లకల్లోమైన ప్రాంతాలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి సుధాకర్ బాబు విమర్శించారు. తుపాను బాధితులను వైఎస్సార్సీపీ ఆదుకుంటోందని, సహాయక చర్యల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ఆపదలోనూ చంద్రబాబు అవకాశాలను వెతుక్కుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో అతివృష్టి లేదంటే అనావృష్టి వస్తుంది అంటూ ఎద్దేవా చేశారు. తిండి, నీరు లేక అవస్థలు పడుతుంటే.. అధికారులు చోద్యం చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి బాధితులకు నరకయాతనగా మారిందని అన్నారు. తప్పుడు లెక్కలు, పన్నులు ఎగ్గొట్టినా ఐటీ సోదాలు జరుగుతాయని, సీఎం రమేష్ మాటలు ఎవరూ నమ్మరని, ఓటుకు కోట్లు కేసులో రూ. 50లక్షలు ఎక్కడివని ప్రశ్నించారు. మిగిలిన నాలున్నర కోట్లు ఎక్కడినుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. -
ఐటీ దాడులు చేస్తే నీ మీద చేసినట్టా?
మాచర్ల: ‘చంద్రబాబూ.. నీ బినామీలపై ఐటీ దాడులు జరిగితే అవి రాష్ట్రం మీద దాడులా? ఎంపీ సీఎం రమేష్‌కు 2014కు ముందు ఎన్ని ఆస్తులున్నాయి? ఈరోజు రూ.వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? నీ బినామీగా వ్యవహరించిన రమేష్‌పై దాడులు జరిగితే అది రాష్ట్రంపై దాడిగా ఎందుకు మాట్లాడుతున్నావు? ఇంతటి దిగజారుడు రాజకీయాలు ఇంకా ఎన్నాళ్లు చేస్తావు?’ అని వైఎస్సార్సీపీ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. మాచర్లలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఐటీ దాడులు జరగటానికి కారణం టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతేనని చెప్పారు. ఎన్నికల ముందు అఫిడవిట్లో ఇచ్చిన ఆస్తులకు, నాలుగేళ్లుగా సంపాదించిన ఆస్తులకు వందల కోట్ల తేడాలు ఉండటంతో ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు. అసలు పెట్టుబడులు పెట్టలేని సంస్థలు కోట్ల రూపాయలను సంపాదిస్తుంటే ఐటీ వాళ్లు ఎందుకు దాడులు చేయరని ప్రశ్నించారు. అక్రమంగా సంపాదించిన ఆస్తులపై దాడులు చేయటం సహజమన్నారు. ఐటీ దాడుల నుంచి తప్పించుకోవటానికి అధికార పార్టీ నాయకులు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురద జల్లుతూ ఆరోపణలు చేయటం హాస్యాస్పదమన్నారు. ఎవరు ఎన్ని రాజకీయాలు చేసినా అక్రమాలు బయటకు రాక తప్పవని, అక్రమంగా ఆస్తులు సంపాదించిన టీడీపీ నేతలంతా శిక్షకు గురై ప్రజల చేత కూడా బుద్ధి చెప్పించుకునే పరిస్థితి త్వరలోనే రానుందని ఎమ్మెల్యే పీఆర్కే అన్నారు. -
సీఎం బినామీలకు జైలు తప్పదు
కడప కార్పొరేషన్: ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన బినామీలు కటకటాలపాలుగాక తప్పదని వైఎస్ఆర్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు, కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం కడపలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏం జరిగినా దాన్ని వైఎస్ జగన్‌కు ముడిపెట్టి మాట్లాడటం టీడీపీ వారికి ఫ్యాషనైపోయిందన్నారు. కేంద్రం నుంచి నిధులు రాకపోతే వైఎస్ జగన్ అడ్డుకుంటున్నారని ప్రచారం చేశారని, ఇప్పుడు ఐటీ దాడులు జరుగుతుంటే జగన్ కుట్ర ఉందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రికి బినామీలు చాలా మంది ఉన్నారని, వారందరిపై ఐటీ దాడులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. 1988–87 మధ్య కాలంలో సీఎం రమేష్ అబ్బ సారాయి కొట్టు నడుపుతూ హత్య కేసులో ఇరుక్కొని జలగం వెంగల్రావ్ ద్వారా బయటపడ్డారన్నారు. అనేక మందితో వ్యాపార భాగస్వామ్యం నడిపి అందరినీ మోసం చేశారన్నారు. కానుగచెట్టు నుంచి నూనె తీస్తామని, పెద్ద ఫ్యాక్టరీ పెడుతున్నామని పబ్లిక్ ఇష్యూ చేసి ప్రజల దగ్గర వందలకోట్లు వసూలు చేశారన్నారు. 2014కు ముందు రూ.50కోట్ల పనులు మాత్రమే చేసే రిత్విక్ కంపెనీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన నాలుగున్నరేళ్లలో రూ.3,550కోట్ల పనులు చేయడం ఆశ్చర్యకరమన్నారు. అత్యవసరం కింద 61సీ జీఓ తెచ్చి ప్రాజెక్టుల పనులన్నీ అంచనాలు పెంచి నామినేషన్‌పై చేశారన్నారు. జిల్లాలో గండికోట, అవుకు టన్నెల్, జీఎన్ఎస్ఎస్, ఆర్టీపీపీలో పనులన్నీ రిత్విక్ సంస్థే చేస్తోందన్నారు. సీఎం రమేష్, సుజనా చౌదరి చేస్తున్న పనుల్లో ముఖ్యమంత్రికి 25 శాతం వాటా ఉందని ఆరోపించారు. సుజనా చౌదరి వేలకోట్లు బ్యాంకుల్లో అప్పులు తీసుకొని ఎగ్గొట్టారని గుర్తు చేశారు. ఇన్ని అక్రమాలు చేసి ప్రభుత్వానికి ఆదాయపన్ను ఎగ్గొట్టిన వీరంతా ఏనాటికైనా కటకటలపాలు కాక తప్పదని హెచ్చరించారు. ఉక్కు దీక్ష చేసినందుకే తనపై ఐటీ దాడులు చేశారని సీఎం రమేష్ చెప్పడం సిగ్గుచేటన్నారు. ఆయన చేసింది ఉక్కు దీక్ష కాదని, అది వంచన దీక్ష అని ఎద్దేవా చేశారు. 14వ ఆర్థిక సంఘానికి, ప్రత్యేక హోదాకు సంబంధమే లేదని వైఎస్ జగన్ మొదటి నుంచి చెబుతూనే ఉన్నారని, 15వ ఆర్థిక సంఘం ఛైర్మెన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారని గుర్తు చేశారు. దీన్నిబట్టి బీజేపీ, టీడీపీ హోదా ఇవ్వడం ఇష్టం లేకే డ్రామాలాడాయని ధ్వజమెత్తారు. బీజేపీతో వైఎస్ఆర్సీపీ కుమ్మక్కు కావాల్సిన అవసరం లేదని, అలా అయింటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. బీజేపీపై మొదటిసారి అవిశ్వాస తీర్మాణం పెట్టి, ఎంపీలతో రాజీనామాలు చేయించి బయటికి వచ్చిన ఘనత వైఎస్ఆర్సీపీదేననివారు తెలిపారు. బీజేపీతో టీడీపీ లోపాయికారీ ఒప్పందం ఇప్పటికీ కొనసాగుతోందని, అందుకే టీడీపీ వారు ఎన్ని అక్రమాలు చేస్తున్నా ఏమీ పట్టించుకోవడం లేదన్నారు. ఈ ఐటీ దాడులతో ఏం సాధిస్తారో వేచిచూడాలని అన్నారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు తుమ్మలకుంట శివశంకర్, యానాదయ్య, నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్, ఖదీర్ పాల్గొన్నారు. చంద్రబాబు, లోకేష్‌లపై ఐటీ దాడులు చేయాలి కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి కడప కార్పొరేషన్: లక్షల కోట్లు దిగమింగిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లపై ఐటీ దాడులు నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గత తొమ్మిదేళ్ల పాలన తర్వాత దేశంలోని అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకుల్లో చంద్రబాబు అగ్రస్థానంలో ఉన్నారని తెహల్కా డాట్ కామ్ తెలిపిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాలుగేళ్లపాటు బీజేపీతో అంటకాగి, మంత్రి పదవులను పంచుకున్న టీడీపీ ఇప్పుడు ఐటీ దాడులు జరిగేసరికి ఇతరులపై బురద జల్లడం సరికాదన్నారు. సీఎం రమేష్ ఇళ్లపై ఐటీ దాడులు చేస్తే వైఎస్ జగన్‌పై బురదజల్లడం సరికాదన్నారు. బీజేపీతో తమకు అంత సాన్నిహిత్యమే ఉంటే జగన్‌పై ఉన్న ఈడీ కేసులను ఉపసంహరించేవారు కదా అని ప్రశ్నించారు. సీఎం బినామీలపై ఐటీ దాడులు చేస్తుంటే దాన్ని రాష్ట్రంపైన దాడిగా అభివర్ణించడం దారుణమన్నారు. సుజనా చౌదరి ఎన్ని వేల కోట్లు అప్పులు తీసుకొని ఎన్ని బ్యాంకులను మోసం చేశారో జగమెరిగిన సత్యమేనన్నారు. -
సీఎం రమేష్‌కు దెబ్బ మీద దెబ్బ!
ఎంపీ సీఎం రమేష్ వ్యక్తిగత ప్రవర్తనతోనే టార్గెట్‌కు గురయ్యారా... ఇంటా బయట తలనొప్పులు తీవ్రతరమయ్యాయా...అంటే ఔనని విశ్లేషకులు అంటున్నారు. ఆర్థిక పరపతి అమాంతం పెరగడంతో లెక్కలేనితనం తెరపైకి వచ్చింది. వెరసి అటు రాజకీయంగా ఇటు ఆర్థిక వ్యవహారాల్లో ఇష్టానుసారంగా వ్యవహరించినట్లు సమాచారం. దీంతో వరుసగా దెబ్బ మీద దెబ్బ పడుతోందని పలువురు భావిస్తున్నారు. సాక్షి ప్రతినిధి కడప: సీఎం రమేష్‌ను రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా టీడీపీ అధిష్టానం రాజ్యసభకు పంపింది. పార్లమెంటులో మెంబర్ అయినా పోట్లదుర్తి సుబ్బానాయుడు మనవడుగా జిల్లావాసులకు ఎరుక. పోట్లదుర్తి నాయుళ్లు అంటే జిల్లాలో టక్కున గుర్తుకు వచ్చేది, సారాయి వ్యాపారం. జిల్లాలో సారాయి కాంట్రాక్టర్లుగా వారికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈక్రమంలో రాజకీయనాయకులకు అణకువగా ఉంటూ పలువురిని మెప్పించి, ఒప్పించి కార్యక్రమాలను చక్కబెట్టుకునే వారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. అలాంటి పరిస్థితి నుంచి అండగా నిలిచిన రాజకీయ నాయకులే ఎదురుచూడాల్సిన పరిస్థితికి సీఎం రమేష్ చేరుకున్నారు. అనూహ్యంగా ఆర్థిక, రాజకీయ పరపతి పెరగడమే అందుకు కారణంగా పలువురు చెప్పుకొస్తున్నారు. మునపటి పాతవాసనతో నిమిత్తం లేకుండా తాను మాత్రమే జిల్లా రాజకీయాలను శాసించగలను అనేస్థాయికి వెళ్లడంతో ఇక్కట్లు ఎదురవుతున్నట్లు పలువురు వివరిస్తున్నారు. బెడిసికొట్టిన ప్రొద్దుటూరు వ్యవహారం.. సీఎం రమేష్‌కు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన్న చరిత్ర లేదు. గతంలో మాజీ మంత్రి మైసూరారెడ్డి సాన్నిహిత్యం కారణంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రమేష్ కుటుంబ సభ్యులు ఎర్రగుంట్ల మండలానికి ప్రాతినిథ్యం వహించారు. జిల్లాలో అంతకు మించిన రాజకీయ చరిత్ర లేదు. ఈనేపథ్యంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంపై కన్ను పడింది. అక్కడి రాజకీయాలను తనకు అనువుగా మల్చుకోవాలనే దిశగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పావులు కదుపుతూ వచ్చారు. ఈక్రమంలో ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తూ వచ్చారు. ఆ వివాదం మరింత ముదరడంతో ‘సీఎం రమేష్ స్థాయి పంచాయతీకి ఎక్కువ, మండలానికి తక్కువ’అలాంటి వ్యక్తిని చంద్రబాబు ప్రోత్సహించి రాజ్యసభ సీటు ఇస్తే కాంట్రాక్టు పనుల్లో కమీషన్లు తీసుకుంటూ దోపిడీ చేయడమే కాకుండా వర్గరాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే వరద వ్యాఖ్యలు వాస్తవమే అయినప్పటికీ రమేష్ వ్యక్తిగత స్థాయి బహిర్గతం చేయడంతో ప్రొద్దుటూరు రాజకీయాల్లో వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు. 22మంది కౌన్సిలర్లు ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జి వరదరాజులరెడ్డికి వ్యతిరేకంగా రాజీనామా చేయించారు. అదే విషయాన్ని మాజీ ఎమ్మెల్యే వరద సైతం బాహాటంగా ఆరోపించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సీఎం రమేష్‌ను ప్రొద్దుటూరు రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకుంటానని ప్రకటించారు. ఈమొత్తం వ్యవహారం టీడీపీ అధిష్టానం చెంతకు చేరింది. ముఖ్యమంత్రి, ఏపీ టీడీపీ అధ్యక్షుడు స్వయంగా నాయకుల మధ్య పంచాయితీ చేయాల్సి వచ్చింది. కౌన్సిలర్లతో రాజీనామా చేయించి పార్టీని రోడ్డుమీదకు చేర్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అందుకు పరోక్ష కారకుడు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేషేనని మంత్రి ఆది, జిల్లా అధ్యక్షుడు అంతర్గతంగా సంకేతాలిచ్చినట్లు సమాచారం. దీంతో అధిష్టానం అనవసర రాజకీయాలు చేయవద్దని ఇటీవలే పెద్ద ఎత్తున హెచ్చరికలు చేసినట్లు టీడీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. టీడీపీ అధిష్టానం అగ్రహం వెలిబుచ్చిన ఘటన అలా ఉండగానే ఐటీ దాడులు తెరపైకి వచ్చాయి. కాంట్రాక్టు దిగ్గజంగా మారిన వైనం.... ఎన్నికలకు ముందు సాదాసీదా కాంట్రాక్టు సంస్థగా ఉన్న రిత్విక్ కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టు దిగ్గజంగా మారింది. అందుకు ప్రధాన కారణం ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యమేనని విశ్లేషకుల భావన. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పనులల్లో రిత్విక్ ప్రధానపాత్ర పోషిస్తోంది. అనేక పనులు నామినేటెడ్‌గా దక్కించుకున్న చరిత్ర కూడా ఉండిపోయింది. ఈతరణంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.3,658 కోట్లు పనులు ఆ సంస్థ చేస్తోంది. ప్రభుత్వ అండ ప్రధానంగా ఉండడంతో పనుల్లో పురోగతి లేకపోయినా, మొబిలైజేషన్ అడ్వాన్సులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా పోయిందని తెలుస్తోంది. బ్యాంకు లావాదేవీలు కూడా ఇష్టారాజ్యంగా రిత్విక్ కన్స్ట్రక్షన్కు ఉన్నట్లు సమాచారం. ఇవన్నీ పసిగట్టిన ఆదాయపు పన్నుశాఖ సమగ్ర నివేధికతో ఐటీ సోదాలు చేసినట్లు సమాచారం. పోట్లదుర్తిలో శుక్రవారం సాయంత్రం వరకు, సోదాలు జరిగాయి. హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం వరకూ కొనసాగాయి. ఈసందర్భంగా అనేక డాక్యుమెంట్లు, విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఓ బ్యాంకు నుంచి డ్రాచేసిన రూ.50లక్షలు ఇంకో చోట అక్రమ కార్యకలాపానికి మొత్తంగా గుర్తించినట్లు రూఢీ అయినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. కాగా కేవలం ఎంపీ రమేష్ వ్యక్తిగత ప్రవర్తన కారణంగానే వరసగా ఎదురుదెబ్బలు తగులుతున్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. -
సీఎం రమేష్ ఇంట్లో 2 డిజిటల్ లాకర్లు
-
ఢిల్లీకి ‘రిత్విక్’ డబ్బు?
సాక్షి, హైదరాబాద్, అమరావతి: తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు చెందిన హైదరాబాద్‌లోని నివాసం, వ్యాపార సంస్థల్లో రెండో రోజు శనివారం కూడా ఐటీ అధికారుల సోదాలు కొనసాగాయి. రిత్విక్ సంస్థలకు సంబంధించిన లావాదేవీలపై ప్రధానంగా దృష్టి సారించిన అధికారులు ఢిల్లీలోని ఓ వ్యక్తికి రూ.వేల కోట్లను చేరవేసినట్లు గుర్తించారని తెలుస్తోంది. 2015–16, 16–17 ఆర్థిక సంవత్సరాల్లో భారీ స్థాయిలో పెరిగిన కంపెనీ లావాదేవీలపై పలు అనుమానాలతో ఐటీ శాఖ ఈ సోదాలను నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధాన నీటి పారుదల ప్రాజెక్టుల్లో మెజార్టీ పనులను సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ సంస్థలే దక్కించుకున్నాయి. సాగునీటి పనులు చేయకుండానే చెల్లింపులు? సాగునీటి ప్రాజెక్టుల పనులను దక్కించుకున్న రిత్విక్ సంస్థ ఆ పనులు చేయకుండానే చేసినట్టు రికార్డుల్లో చూపించి నిధులు బొక్కేసిందనే కోణం ఐటీ సోదాలతో వెలుగులోకి వస్తోంది. దీంతో ఇరిగేషన్ సబ్ కాంట్రాక్టు పనుల్లో గోల్మాల్ జరిగినట్టు తేలుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో నీటిపారుదల ప్రాజెక్టులను దక్కించుకున్న రిత్విక్ సంస్థ సబ్‌కాంట్రాక్టుల పనులు చేయకుండానే చేసినట్టు చూపిస్తూ రూ. వేల కోట్లను డ్రా చేసిందనే కీలక అంశాన్ని సోదాల సందర్భంగా ఐటీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. సబ్‌కాంట్రాక్టుల కింద సీఎం రమేష్ సంస్థ పొందిన రూ.వేల కోట్లను ఢిల్లీలోని ఒక వ్యక్తి వద్దకు తరలించినట్లు నిర్థారించారు. అయితే ఆ నిధులను హవాలా రూపంలో ఇతర దేశాలకు తరలించారా? ఏపీలోని ఇతర వ్యక్తులు, సంస్థలకు మళ్లించారా? అనే కోణాల్లో ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం రమేష్‌కు చెందిన ఆస్తుల రికార్డులను పరిశీలిస్తూ కూపీ లాగుతున్నారు. గుట్టుగా నగదు లావాదేవీలెందుకు? రిత్విక్ సంస్థలు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పనుల బిల్లులన్నీ నగదు రూపంలోనే జరగడంపై ఐటీ శాఖ దృష్టి సారించింది. ఓ ప్రాజెక్టులో రూ.1,800 కోట్లు, మరో ప్రాజెక్టులో రూ.900 కోట్ల విలువైన బిల్లులన్నీ నగదు రూపంలో రిత్విక్‌కు చేరడం, వాటికి సంబంధించిన పన్నులను కంపెనీ ఎగ్గొట్టిందన్న ఆరోపణలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. అలాగే రిత్విక్ కంపెనీకి అనుబంధంగా ఉన్న మరో ఆరు కంపెనీలపైనా ఆరా తీస్తున్నారు. కేవలం ఒక్క కంపెనీ ద్వారానే రూ.2 వేల కోట్లకు పైగా నగదు లావాదేవీలు జరిగితే మిగిలిన ఆరు కంపెనీల ద్వారా ఇంకెన్ని కోట్ల రూపాయలు లెక్క లేకుండా చేతులు మారి ఉంటాయన్న కోణంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రాజెక్టులకు సంబంధించిన బిల్లులన్నీ ఆన్లైన్ చెల్లింపులు లేదా ఆర్టీజీఎస్ / చెక్కుల రూపంలో ఉంటాయి. అలాకాకుండా రూ.వందల కోట్లను నగదు ద్వారా ఎందుకు స్వీకరించారనే అంశంపై విచారిస్తున్నట్లు ఐటీ వర్గాలు చెబుతున్నాయి. రిత్విక్, అనుబంధ కంపెనీలు దాఖలు చేసిన మూడేళ్ల ఐటీ రిటర్నుల్లో భారీ స్థాయిలో లాభాలు పెరిగిపోవడం, పెట్టుబడులు పెరగడంపైనా అనుమానాలున్నాయని, అందుకే సోదాలు జరుపుతున్నామని, విచారణ ఇంకా కొనసాగించాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. డిజిటల్ లాకర్లలో బట్టలా...? ఎంత ఆస్తిపరుడైనా సాధారణ బ్యాంకు లాకర్లు లేదా కోడ్ నంబర్లతో తెరుచుకునే లాకర్లను వినియోగిస్తారు. అలాంటిది సీఎం రమేశ్ ఏకంగా తన ఇంట్లో రెండు డిజిటల్ లాకర్లను ఏర్పాటు చేసుకోవడంపై అధికారులు విస్తుపోయారు. కోడ్ రూపంలో కాకుండా వేలిముద్రల ద్వారా మాత్రమే ఇవి తెరుచుకునేలా ఏర్పాట్లు చేసుకోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఐటీ అధికారుల సూచనల మేరకు సీఎం రమేశ్ శనివారం సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకుని రెండు లాకర్లను తెరిచారు. ఒక లాకర్లో ఏపీలో చేపట్టిన ప్రాజెక్టుల కేటాయింపుల వివరాలతో కూడిన ఫైళ్లు, ప్రాజెక్టుల పాత అంచనాలను పెంచుతూ రూపొందించిన డాక్యుమెంట్లు ఉన్నట్లు గుర్తించారు. మరో లాకర్లో రమేశ్‌కు చెందిన 3 బ్యాంకు ఖాతాల వివరాలు, చెక్‌బుక్‌లు, 2 పెన్‌డ్రైవ్‌లు, ఐటీ రిటర్నులకు సంబంధించిన కాపీలు లభ్యమైనట్లు తెలిసింది. ఆ లాకర్లలో ఎలాంటి డాక్యుమెంట్లు లేవని, కేవలం తన బట్టలు మాత్రమే ఉన్నాయని సీఎం రమేశ్ తన నివాసం వద్ద మీడియాతో పేర్కొనడం గమనార్హం. అయితే అందులో ప్రాజెక్టులకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఐటీ రిటర్నుల ఫైళ్లు తదితరాలు బయటపడటం రమేశ్ కంపెనీల లావాదేవీలపై ఐటీ అధికారుల సందేహాలకు బలాన్ని చేకూర్చినట్లు అయింది. ఏకధాటిగా విచారణ... రమేశ్ బావమరిది, రిత్విక్ కంపెనీల్లో డైరెక్టర్ హోదాతోపాటు ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టే గోవర్ధన్ నాయుడును ఐటీ అధికారులు శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల నుంచి విచారించారు. వైఎస్సార్ జిల్లాలో ఐటీ సోదాలు పూర్తి కాగానే ఆయన్ను అక్కడి నుంచి హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రిత్విక్ కంపెనీ కార్యాలయానికి తరలించారు. శనివారం రాత్రి 10 గంటల వరకు గోవర్ధన్‌ను విచారించారు. రమేశ్ సోదరుడు రాజేశ్ సైతం కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉండటంతో ఆయన్ను మరో బృందం విచారించింది. రిత్విక్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, రిత్విక్ ప్రాజెక్టŠస్ ప్రైవేట్ లిమిటెడ్, రిత్విక్ çహోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రిత్విక్ గ్రీన్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, కదిరి గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్, గ్లోబల్ ఎర్త్ మినరల్ ప్రైవేట్ లిమిటెడ్, రిత్విక్ అగ్రికల్చర్ ఫారమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో మూడేళ్లుగా జరిగిన లావాదేవీలు, ఏ ప్రాజెక్టులకు ఎంత బిల్లు తీసుకున్నారు? ఐటీ రికార్డుల్లోకి వచ్చిందెంత? నగదు రూపంలో తీసుకున్నదెంత? తదితర అంశాలను ప్రతి డాక్యుమెంట్ ముందు పెట్టి అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. అన్ని కంపెనీల్లో 2015 తర్వాత ఒకేసారి పెట్టుబడులు పెట్టడం, వాటి షేర్ల విలువ పెరగడం, వాటికి సంబంధించిన ఫైలింగ్‌లో వ్యత్యాసాలపై రమేశ్ సోదరుడు, బావమరిదిని ప్రశ్నించినట్లు తెలిసింది. వీరిద్దరితోపాటు కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్న మరో ఆరుగురికి విచారణకు హాజరు కావాలని ఐటీ శాఖ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. సీఎం రమేశ్ ఇంటికి సంబంధించిన విషయంలో ఆయన భార్యకు కూడా అధికారులు నోటీసులిచ్చారు. రిత్విక్ కంపెనీ వ్యవహారాలకు సంబంధించి మొత్తం 4 నోటీసులను రమేశ్‌తోపాటు ఆయన సోదరుడు, బావమరిదికి ఐటీ శాఖ జారీ చేసినట్లు తెలుస్తోంది. -
ఎన్నాళ్లీ నిరర్థక విన్యాసాలు?
వాస్తవాన్ని అవాస్తవంగానూ, అవాస్తవాన్ని వాస్తవంగానూ చిత్రించి నమ్మిం చడం రాజకీయాలలో ప్రధానక్రీడగా కొంతకాలంగా నడుస్తోంది. పౌరుల మన సులలోనే ఈ ఆట రాజకీయనేతలు ఆడతారు. వారు ఎంత లాఘవంగా, ఎంత సమర్థంగా ఆడతారనే దానిపైనే వారి రాజకీయ ఫలాలు ఆధారపడి ఉంటాయి. చాలా సంవత్సరాలుగా గమనించడం వల్ల ఒక రాజకీయనేత పట్ల ప్రజలలో ఒక స్థూలమైన అభిప్రాయం ఉంటుంది. దాన్ని మార్చడానికి రాజకీయనాయకుడు రకరకాల విన్యాసాలు చేస్తాడు. అవి ఎంత ప్రభావవంతంగా ఉంటే ఫలితాలు అంత సానుకూలంగా ఉంటాయి. వీటినే ‘మైండ్‌గేమ్స్’ అంటారు. ఈ క్రీడలో భాగంగా కొన్ని దృశ్యాలనూ, సన్నివేశాలనూ, వాతావరణాన్నీ పనికట్టుకొని సృష్టిస్తారు. ఒకే అభిప్రాయాన్ని అన్ని స్థాయిలలోనూ పదేపదే ప్రచారం చేస్తారు. దీన్నే ‘గ్లోబల్ ప్రచారం’ అంటున్నారు. నిజానికి ఇది ‘గోబెల్స్ ప్రచారం’. 1933 నుంచి 1945 వరకూ హిట్లర్ మంత్రిమండలిలో ప్రచార వ్యవహారాల మంత్రిగా పని చేసిన జోసెఫ్ గోబెల్స్ పేరు మీద వాడుకలోకి వచ్చిన మాట. ఈ క్రీడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్ర బాబునాయుడు అందెవేసిన చేయి. 1995లో ముఖ్యమంత్రి పదవి హస్తగతం చేసుకున్నప్పుడూ, మరుసటి సంవత్సరంలో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో విజయం సాధించినప్పుడూ, 2014 ఎన్నికలలో గెలుపొందినప్పుడూ ‘మైండ్ గేమ్స్’ చంద్రబాబుకు విశేషంగా దోహదం చేశాయి. ఈ క్రీడలో మీడియా సహ కారం అత్యంత కీలకం. సహచరుల తోడ్పాటూ అవసరం. నేతలపైనా, పార్టీల పైనా ప్రజలలో రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. ప్రాంతం, సామాజిక వర్గం, వృత్తి, ప్రవృత్తి, ఆర్థికస్థాయి, సామీప్యత, మరికొన్ని ఇతర కారణాల ఆధా రంగా అభిప్రాయాలు ఏర్పడతాయి. ఈ అభిప్రాయాలు అశాశ్వతం. స్వీయా నుభవం ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఉదాహరణకు 2014లో కొత్త రాష్ట్రానికి సారథ్యం వహించే నాయకుడికి అనుభవం ఉంటే బాగుంటుందని భావించి చంద్రబాబుకు ఓటు వేసినవారిలో చాలామంది కడచిన నాలుగున్నర సంత్సరాల అనుభవం కారణంగా తమ నిర్ణయం సరైనది కాదని గ్రహించి ఉంటారు. అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ‘మైండ్ గేమ్స్’ దిశలో మార్పు చేసే నేర్పు టీడీపీ అధినేతకు దండిగా ఉంది. విస్తారమైన తన అనుభవంతో (ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ), బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ సహకారంతో అద్భుతాలు చేస్తానని నమ్మించారు. అవకాశం వచ్చినప్ప టికీ అన్ని రంగాలలోనూ విఫలమైనారు. అవినీతి మాత్రం విశృంఖలమై అన్ని రంగాలకూ విస్తరించింది. కథనంలో, దృశ్యంలో మార్పు మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. కథనం, దృశ్యం మార్చవలసిన అగత్యం ఏర్ప డింది. ప్రజలకోసం పోరాడతాననీ, అవసరమైతే ప్రధాని మోదీపైన తిరుగు బాటు చేస్తాననీ, ఆంధ్రుల ప్రయోజనాలకోసం ఎంతకైనా తెగిస్తాననీ చంద్ర బాబు నమ్మబలుకుతున్నారు. తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్ళించేం దుకు ఉద్దేశించింది ఈ వ్యూహం. ఈ దిశగా పోరాటానికి అవసరమైన ప్రాతిపది కను నిర్మించడానికి వీలుగానే ఎన్డీఏ నుంచి నిష్క్రమించారు. ఆ తర్వాత మోదీ తన వెంట పడబోతున్నట్టూ, కేంద్ర సంస్థల చేత దాడులు చేయించబోతున్నట్టూ వరుసగా ప్రకటనలు చేశారు. అటువంటి పరిస్థితే వస్తే ప్రజలు తనకు రక్షణ వలయంగా నిలబడాలని అభ్యర్థించారు. దీనికి సమాంతరంగా ఒకానొక నటుడి చేత ‘ఆపరేషన్ గరుడ’ అనే టీవీ నాటకానికి తెరలేపారు. ఏది జరిగినా ఈ ఆప రేషన్‌లో భాగమేనని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న పదేళ్ళలో పార్టీని నడిపించడానికి ఆర్థిక సహాయం చేసిన వ్యాపార రాజకీయ నాయకులలో సుజనాచౌదరి, సీఎం రమేష్, నారా యణ ప్రముఖులు. వీరికి రాజకీయాధికారంలో భాగస్వామ్యం ఇచ్చి, వ్యాపారా వకాశాలూ కల్పించి వారి వ్యాపారాలలో చంద్రబాబు భాగస్వామ్యం స్వీకరించా రన్నది బహిరంగ రహస్యం. వీరే కాకుండా టీడీపీ అధినేత సంకేతాలకు అను గుణంగా నిధులు సమకూర్చేవారూ, ఖర్చు చేసేవారూ అనేకమంది ఉంటారు. వారికి టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం ఏదోరకంగా లబ్ధి చేకూరుతూ ఉంటుంది. ఇలాంటి వ్యవస్థ దేశంలోని దాదాపు అన్ని పార్టీలలోనూ అటుఇటుగా ఉంటుంది. టీడీపీలో ఇది దశాబ్దాలుగా వ్యవస్థీకృతమై బలంగా వేళ్ళూను కున్నది. కేంద్రం ఆధ్వర్యంలో నడిచే దర్యాప్తు సంస్థలు సర్వస్వతంత్రంగా వ్యవహరిస్తున్నాయని ప్రజలు నమ్మడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారి చెప్పుచేతలలోనే అవి నడుస్తాయని అత్యధికుల అభిప్రాయం. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్, ఆదాయంపన్ను(ఐటీ) శాఖ, కేంద్ర నిఘా సంస్థ, ఇతర కేంద్ర సంస్థలు ఏవైనా ఒకానొక సంస్థలోనో, వ్యక్తి నివా సంలోనో సోదాలు జరిపినప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోంది అనుకోకుండా దాని వెనుక రాజకీయ కుట్ర ఉన్నదని దుయ్యపట్టడం రివాజు. రాజకీయ ప్రయోజనాలూ, అభిప్రాయాలూ, విధేయతలూ ఇటువంటి సంద ర్భాలలో అనుసరించే వైఖరిని శాసిస్తాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి అస్తమయం తర్వాత ఓదార్పుయాత్రకు అడ్డుపడిన కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీని ధిక్కరించి పార్టీ నుంచి వైదొలిగి సొంతపార్టీ పెట్టుకున్న జగన్మోహన్రెడ్డిపైన సీబీఐ సుదీర్ఘంగా దాడులు చేసి కేసులు పెట్టినప్పుడు సంబరపడినవారు ఇప్పుడు రేవంత్‌రెడ్డి, సుజనాచౌదరి, సీఎం రమేష్ ఇళ్ళలోనూ, కార్యాలయా లలోనూ సోదాలు చేస్తే ఆంధ్రులపైన దాడి చేస్తున్నారంటూ, రాజకీయ కక్ష సాధిస్తున్నారంటూ గుండెలు బాదుకుంటున్నారు. అవినీతి ఏ మేరకు జరిగిందో స్పష్టంగా తెలుసు కనుక దాడులు జరుగుతాయని ముందే ఊహించి దానికి అవసరమైన నేపథ్యాన్ని సృష్టించారు. ఇటువంటి పరిణామాలు రాకుండా నివారించేందుకే సుజనాచౌదరిని కేంద్రంలో మంత్రిగా నియమించి, సీఎం రమేష్‌ని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ)సభ్యుడిని చేశారు. టీడీపీ ఎన్డీఏ నుంచి వైదొలగడమే కాకుండా గుజరాత్‌లోనూ, కర్ణాటకలోనూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్‌కు వందల కోట్ల నిధులు టీడీపీ అధినేత పంపించారని మోదీకి సమాచారం అందిందనీ, అంతలేసి నిధులు ఎట్లా సమకూరుతున్నాయో తెలుసుకోవాలని ఆయన కుతూహలంగా ఉన్నారనీ బీజేపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. వ్యాపారసంస్థలలో ఐటీ అధికారులు సోదా చేయడం సర్వసామాన్య మనీ, ఇందుకు చంద్రబాబూ, లోకేశ్‌బాబూ భుజాలు తడుముకోవడం ఎందు కని వారు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ ప్రమేయం లేకుండా ఆ సంస్థలు వ్యవహరిం చినట్లయితే ఇప్పుడు జరుగుతున్న సోదాలు ఎప్పుడో జరగవలసింది. ఎన్డీ ఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పుడే అమరావతిలో రియల్ఎస్టేట్ వ్యాపారం జరిగింది. ఇసుకమాఫియా స్వైరవిహారం చేసింది. పోలవరం, పట్టిసీమ, ఇతర సాగునీటి ప్రాజెక్టులలో అవినీతి సాగింది. ఎన్డీఏ నుంచి తప్పుకున్న కార ణంగా, ఉక్కు ఫ్యాక్టరీ కడపలో పెట్టాలని వారం రోజులు దీక్ష చేసిన కారణంగా ఐటీ శాఖను ప్రధాని ప్రయోగించారన్నట్టు ధ్వనించే విధంగా ఇప్పుడు మీడి యాలో రాస్తున్నారు. అప్పుడు సోనియాగాంధీని ధిక్కరించిన కారణంగా సీబీ ఐని ప్రయోగించారని ఇదే మీడియా రాయలేదు. హాస్యాస్పదమైన వ్యాఖ్యలు కొన్ని హాస్యాస్పదమైన ప్రకటనలకు కూడా మీడియా ప్రచారం ఇస్తోంది. అభి వృద్ధిలో గుజరాత్‌ను తలదన్ని ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ముందుకు పోతుందోనన్న భయంతో, ఈర్ష్యతో, చంద్రబాబుకి తనకంటే ఎక్కువ కీర్తి వస్తున్నదనే దుగ్ధతో మోదీ కుట్రపూరితంగా ఐటీ అధికారులతో చేయిస్తున్నారంటూ ఆరోపిస్తు న్నారు. అక్షరాస్యతలో, తలసరి ఆదాయంలో, ఇతర అభివృద్ధి సూచికలలో బిహార్, ఉత్తరప్రదేశ్‌లతో పోటీ పడుతూనే అన్నింటిలోనూ నంబర్ ఒన్ అంటూ ప్రచారం చేసుకునే వైఖరికి ఇది కొనసాగింపు. కానీ ప్రజలు అంత గుడ్డిగా నమ్మరు. వారికీ తెలివితేటలు ఉంటాయనీ, ఇంగితజ్ఞానం, కనీస పరిజ్ఞానం ఉంటాయనీ, ధర్మాధర్మ విచక్షణ వారి అంతరాత్మకు ప్రబోధం చేస్తుందనీ గుర్తించాలి. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగున్నరేళ్ళుగా ప్రాజెక్టుల పనులు కానీ ఏ విధంగా జరుగుతున్నాయో, అంచనాలు ఎంత విచ్చలవిడిగా సవరిస్తున్నారో, కాంట్రాక్టులు టెండర్ల ద్వారా కాకుండా నామినేషన్‌పైన ఎట్లా ఎవరికి కట్టబెడు తున్నారో ప్రజలకు రేఖామాత్రంగానైనా తెలియకపోదు. పాత కాంట్రాక్టర్లపైన 60 సి నిబంధనను ప్రయోగించి వేటు వేయడం, మిగిలిన పనుల వ్యయ అంచనాలు పెంచివేసి రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్‌కు అప్పగించడం ఒక పద్ధతి ప్రకారం జరిగింది. అన్ని కాంట్రాక్టులూ రమేష్‌కే దోచిపెడుతున్నారంటూ వరదరాజులురెడ్డి వంటి టీడీపీ నాయకులే బహిరంగంగా ఫిర్యాదు చేసే స్థాయికి ఈ వ్యవహారం వెళ్ళింది. మొత్తం రూ. 3,658 కోట్ల విలువైన పనులు ఈ సంస్థకు ఇచ్చినట్టు చెబుతున్నారు. హంద్రీనీవా, గాలేరునగరి ప్రాజెక్టులలోనే అంచనాలు విపరీతంగా పెంచి నామినేషన్ పద్ధతిపైన రూ. 1,156కోట్ల విలువైన పనులు రమేష్‌కు అప్పగించారు. చిత్తూరు జిల్లాలో 1980–90 మ«ధ్య కాలంలో సారా వ్యాపారం చేసిన రమేష్ చంద్రబాబుకి ఎట్లా దగ్గరైనారో, తిరుపతి దగ్గర 300 ఎకరాల గుడిమాన్యం తక్కువ ధరకు ఎట్లా ఇప్పించారో, ఆ భూమిని తాకట్టు పెట్టించి బ్యాంకు రుణంతో రిత్విక్ కంపెనీ ఎట్లా పెట్టించారో చాలామందికి తెలుసు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థులకు రాయలసీమలో రమేష్, దక్షిణ కోస్తాంధ్రలో నారాయణ, తెలంగాణలో సుజనాచౌదరి ఏ విధంగా ఆర్థిక సహా యం చేశారో పార్టీలో ఎవరిని అడిగినా చెబుతారు. కాంట్రాక్టు తీసుకోవడం, సబ్‌కాంట్రాక్టుకు ఇవ్వడం, సబ్‌కాంట్రాక్టర్ల ఖాతాలో డబ్బులు జమ చేయడం, వాటిని నగదు రూపంలో డ్రా చేయడం నిరవధికంగా జరిగినట్టు ఐటీ శాఖ అధికారులు అలహాబాద్ బ్యాంక్ లావాదేవీల ద్వారా గమనించినట్టు పత్రికలలో వార్తలు వచ్చాయి. బ్యాంకులో అప్పులు తీసుకొని, నిధులు దారి మళ్ళించి, అప్పులు ఎగగొట్టిన వ్యాపారి ఇళ్ళలోనూ, కార్యాలయాలలోనూ ఆదాయంపన్ను శాఖ అధికారులు సోదా చేశారు. ముఖ్యమంత్రి మెహర్బానీ కారణంగా నామి నేషన్ పద్ధతిపైన వేలకోట్ల రూపాయల విలువ కలిగిన పనులు సంపాదిం చుకున్న వ్యాపారి ఇళ్ళలోనూ, కార్యాలయాలలోనూ సోదాలు చేశారు. వారు వ్యాపారరాజకీయులు. ప్రజలు నవ్వుకోరా? ఇటువంటి తనిఖీలు జరిగినప్పుడు వ్యాపారరాజకీయులను వెనకేసుకొస్తే ప్రజలు మెచ్చుతారా? ఐటీ సోదాలను ఆంధ్రులపైన దాడిగా అభివర్ణించడం ఆంధ్రులకు గౌరవప్రదమా? ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలూ, పెట్టుబడులూ రాకుండా చేసేందుకే ఈ దాడులు చేస్తున్నారంటూ మంత్రి పదవిలో ఉన్నవారు ఆరోపించడం శోభాయమానంగా ఉంటుందా? తప్పు చేయకపోతే భయపడటం ఎందుకని ప్రజలు ఆలోచించరా? నిజానికి ఆదాయంపన్ను శాఖ అధికారులు సోదా చేసి అన్నీ సక్రమంగానే ఉన్నాయని కితాబు ఇస్తే సదరు రాజకీయవ్యాపారి ప్రతిష్ఠ పెరగదా? సోదాలు పూర్తి చేసి ఫలితాలు ప్రకటించకముందే ‘కక్ష రాజకీయాలు’ అంటూ ధ్వజమెత్తడం సమంజసమేనా? రేవంత్‌రెడ్డి ఇంటి లోనూ, ఆయన బంధువుల ఇళ్ళలోనూ సోదాలు జరిగినప్పుడు చంద్రబాబు స్పందించడం ఎందుకు? ‘అఫెన్స్ ఈజ్ ది బెస్ట్ వే ఆఫ్ డిఫెన్స్ (ఆత్మరక్షణకోసం ముందే ఎదురుదాడి చేయడం ఉత్తమం)’ అంటారు. ఇదే పద్ధతి చంద్రబాబు అవలంబించారు. కానీ ఎవరికి కొమ్ముకాస్తున్నారో, వారి గురించి ప్రజలలో ఉన్న అభిప్రాయం ఏమిటో గమనించడం లేదు. రాజకీయ నాయకులను ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారనీ, ఆవలించకుండానే పేగులు లెక్కబెట్టే తెలివితేటలు పల్లెల్లో నివసించే రైతులకు కూడా ఉంటాయని మరచిపోకూడదు. ఎవరు అధికారంలో ఉన్నా కొన్ని నిర్ణయాలు పారదర్శకంగా జరగాలని ప్రగతికాముకులూ, ప్రజాస్వామ్యప్రియులూ కోరుకుంటారు. సాగునీటి ప్రాజె క్టులకూ, రోడ్ల నిర్మాణానికీ, ఇతర ప్రభుత్వ పనులకూ కాంట్రాక్టులు ఇచ్చే పద్ధతి ధర్మంగా, న్యాయంగా ఉండాలి. ప్రాజెక్టుల వ్యయం అంచనాలను సవరించే విషయం సైతం అందరికీ సమంజసంగా కనిపించాలి. ఈ రెండు అంశాలలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏదైనా రాజ్యాంగబద్ధమైన సంస్థ పరిశీలించి ఆమోదించిన తర్వాతనే అమలు జరగాలి. వ్యాపారులే రాజకీయ నాయకులు కావడం, వ్యాపారరాజకీయ నాయకులో, కాంట్రాక్టర్లో ముఖ్యమంత్రులకు బినా మీలు కావడం, వారే ఎన్నికలలో ఖర్చులకు నిధులు సమకూర్చడం అనే విష వలయాన్ని ఛేదించకపోతే ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. కె. రామచంద్రమూర్తి -
బినామీలతో టీడీపీ అడ్డగోలుగా దోపిడీలకు పాల్పడుతోంది
-
ఏపీ సీఎం ఎందుకంత ఉలిక్కిపడుతున్నారు?
-
ఏపీ సీఎం ఎందుకంత ఉలిక్కిపడుతున్నారు?
హైదరాబాద్ : సీఎం రమేష్, రేవంత్ రెడ్డిపై దాడులు జరుగుతుంటే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని తెలంగాణ తాజా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత రేవంత్ ఇంట్లో సోదాలు జరిగితే బాబుకు సంబంధమేమిటని అన్నారు. ఎక్కడ ఐటీ సోదాలు జరిగినా.. కేబినెట్లో చర్చించి మరీ ఆవేదన తెలుపుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఐటీ దాడులు జరుగుతుంటే చంద్రబాబుకు ఏమూలనో భయముందని అన్నారు. చంద్రబాబు చేతిలో కాంగ్రెస్ నేతలు తోలుబొమ్మల్లా మారుతున్నారని ఎద్దేవా చేశారు. 2009లో చంద్రబాబుతో పొత్తును కేసీఆర్ అయిష్టంగానే ఒప్పుకున్నారని చెప్పారు. నిరుద్యోగ భృతి పరిశీలనలో ఉందన్నారు. దసరా తర్వాత మేనిఫెస్టో ప్రకటన, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారం ఉంటుందని కేటీఆర్ తెలిపారు. -
‘ఆ లాకర్లో బట్టలు మాత్రమే ఉన్నాయి’
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నివాసం, వ్యాపార సంస్థల్లో గత రెండు రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే, ఐటీ సోదాలు జరుగుతున్నప్పుడు రమేష్ ఢిల్లీలో ఉన్నారు. ఆయన నివాసంలోని డిజిటల్ లాకర్ తెరవాల్సిరావడంతో హైదరాబాద్‌కు రావాల్సిందిగా రమేష్‌కు అధికారులు సమాచారమిచ్చారు. శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్న రమేష్ మీడియాతో మాట్లాడారు. ఐటీ దాడులకు భయపడడం లేదనీ, గతంలోనూ ఇలాగే చేశారని అన్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే బీజేపీ నేతలు తనపై ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. (రెండో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు) ఆ లాకర్లో బట్టలే ఉన్నాయి.. అధికారులు తెరవాలనుకుంటున్న డిజిటల్ లాకర్లో కేవలం తన బట్టలు మాత్రమే ఉన్నాయని రమేష్ తెలిపారు. ఇంట్లో పనిచేసే నౌకర్ల వల్ల ఇబ్బందులు తలెత్తకూడదనే డిజిటల్ లాకర్ ఏర్పాటు చేసినట్టు రమేష్ చెప్పుకొచ్చారు. ప్రతి సంవత్సరం 200 కోట్ల రూపాయలు ఐటీ రిటర్నులు దాఖలు చేస్తానని తెలిపారు. ఐటీ అధికారులు తన భార్య పేరు మీద నోటీసులు ఇచ్చారని ఆయన వెల్లడించారు. గత నాలుగేళ్లలో 3 వందల కోట్ల రూపాయల టాక్స్ లు కట్టానని తెలిపారు. అవసరమనుకుంటే ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత పంచనామా కూడా కాపీ మీడియాకు ఇస్తానని అన్నారు. రిత్విక్ కంపెనీ వ్యవహారాల్లో గోవర్ధన్ కీలకమా..! సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ ఆఫీసులో ఐటీ ఆధికారులు ముమ్ముర తనిఖీలు చేశారు. హార్డ్‌డిస్క్‌లు, బ్యాంకు లావాదేవీలను పరిశీలించారు. సీఎం రమేష్ బావ గోవర్ధన్ నాయుడు ఇంట్లో కూడా గత అర్ధరాత్రి ఐటీ అధికారులు సోదాలు చేశారనీ, బంగారం, నగదు, కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. గోవర్ధన్‌కు చెందిన రెండు బ్యాంకు లాకర్లను తెరచినట్టు సమాచారం. కంపెనీ ఆర్థిక కార్యకలాపాల్లో గోవర్ధన్ కీలక వ్యక్తిగా ఉన్నట్టు భావిస్తున్నారు. ఆయనను రిత్విక్ ప్రాజెక్ట్స్ ఆఫీసుకు తరలించారు. మరోవైపు రమేష్ సోదరుడు రాజేష్‌ను కూడా అధికారులు విచారించారు. -
డిజిటల్ లాకర్లో బట్టలు మాత్రమే ఉన్నాయి
-
‘టీడీపీ నేతలకు భయమెందుకు’
సాక్షి, గుంటూరు : రాష్ట్రంలో ఐటీ దాడులు జరుగుతుంటే టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని వైఎస్సార్సీపీ నేత రావి వెంకటరమణ ప్రశ్నించారు. శనివారం ఆయన కిలారి రోశయ్య, చంద్రగిరి ఏసురత్నంలతో కలిసి మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని వేల కోట్లు దోచుకున్నారు కాబట్టే ఐటీ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు. సీఎం రమేశ్, బీద మస్తాన్‌రావు ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. బీజేపీతో నాలుగేళ్లు సహజీవనం చేసి ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఐటీ దాడులను అడ్డుకోవాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసినట్లేనన్నారు. ప్రభుత్వ సొమ్ము దోచుకున్న బడాబాబుల వెనుక ఎవరున్నారో తెలియాలని డిమాండ్ చేశారు. అక్రమంగా సంపాదించిన వ్యక్తులపై దాడులు జరుగుతుంటే అవి ఆంధ్రులపై జరుగుతున్న దాడులు అనడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ నేతల తప్పుడు ప్రచారాన్ని జనం అర్థం చేసుకుంటారని, త్వరలోనే తగిన బుద్ది చెబుతారని వెంకటరమణ వ్యాఖ్యానించారు. -
సీఎం రమేష్‌ను హైదరాబాద్‌కు రమ్మన్న ఐటీ అధికారులు
-
హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం రమేష్..!
సాక్షి, హైదరాబాద్ : ఐటీ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహితుడు, టీడీపీ రాజ్యసభ సభ్యుడు చింతకుంట మునుస్వామి రమేష్ (సీఎం రమేష్) ఢిల్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. సోదాల నేపథ్యంలో ఐటీ అధికారులు ఆయనను హైదరాబాద్ రావాల్సిందిగా కోరినట్టు తెలుస్తోంది. రెండురోజులుగా సీఎం రమేష్‌కు చెందిన కంపెనీలు, పలుచోట్ల ఉన్న ఇళ్లు, కార్యాలయాలలో ఆదాయ పన్ను శాఖ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం రమేష్ వేలిముద్రల ఆధారంగా ఆయన ఇంట్లోని కొన్ని లాకర్లు తెరవాల్సి ఉండటంతో.. వాటిని తెరిచేందుకు ఐటీ అధికారులు ఆయనను హైదరాబాద్ రావాల్సిందిగా పిలిచారు. దీంతో ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చారు. శుక్రవారం ఉదయం నుంచి సుమారు 90 నుంచి 100 మంది ఐటీ అధికారులు సీఎం రమేష్‌కు చెందిన హైదరాబాద్, వైఎస్సార్ జిల్లా పోట్లదుర్తిలో ఉన్న ఇళ్లతో పాటు రిత్విక్ ప్రాపర్టీస్, అనుబంధ కంపెనీల్లో సోదాలు జరిపారు. ఇంజనీరింగ్ కాంట్రాక్టులు, మైనింగ్ విద్యుత్తు తదితర రంగాల్లో ఉన్న సీఎం రమేష్ వ్యాపార సామ్రాజ్యం గత మూడేళ్లలో అనూహ్యంగా పెరిగింది. అయితే దానికి తగ్గట్టుగా ఆదాయ పన్ను చెల్లింపులు పెరగకపోవడం, ఖాతాల నుంచి నగదు రూపంలో లావాదేవీలు భారీగా జరుగుతుండటం ఐటీ సోదాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. -
సీఎం రమేష్ ఇళ్లపై రెండోరోజు ఐటీ సోదాలు
-
సీఎం రమేష్‌కు ఐటీ దెబ్బ..
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ (ఆర్పీపీఎల్) కంపెనీ లీలలు జిల్లాలోనూ కొనసాగుతున్నాయి. రమేష్ కంపెనీలపై ఐటీ దాడుల నేపథ్యంలో హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం ప్రధాన కాలువ విస్తరణ పనుల్లో రిత్విక్ వ్యవహారంపైనా చర్చ సాగుతోంది. ఈ పనులను తప్పుడు పత్రాలతో దక్కించుకోవడమే కాకుండా.. చేయకపోయినప్పటికీ నిధులు కొల్లగొట్టింది. కంపెనీకి విధించిన గడువు ముగిసినప్పటికీ కనీసం నోటీసులు ఇచ్చేందుకు సైతం అధికారులు సాహసించడం లేదు. ఈ వ్యవహారంపై అప్పట్లోనే కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీశారు. వాస్తవానికి హంద్రీ– నీవా ప్రధాన కాలువ విస్తరణ పనులను తప్పుడు పత్రాలతో రిత్విక్ సంస్థ దక్కించుకుంది. పైగా ఏడాది కాలంగా పనులు చేపట్టడం లేదు. ఒప్పందం ప్రకారం ఈ ఏడాది జూన్ నాటికే పూర్తి చేయాలి. అయినా ఇప్పటికీ పూర్తి చేయలేదు. పనులను సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించకూడదన్న నిబంధన సైతం పక్కన పెట్టింది. సగం సగం చేసిన పనులను వారికి అప్పగించింది. సదరు సబ్ కాంట్రాక్టర్లు కూడా ప్రస్తుతం పనులు చేయడం లేదు. ప్రభుత్వం నుంచి మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్న రిత్విక్ సంస్థ.. సబ్ కాంట్రాక్టర్లు చేసిన పనులకు మాత్రం బిల్లులు ఇవ్వడం లేదు. టెండర్ దశలోనే రింగు కావడమే కాకుండా ఇతర కంపెనీలపై అనర్హత వేటు వేయించి.. అధిక ధరకు ఈ పనులను దక్కించుకుంది. ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ నివేదిక రూపొందించింది. తాజా ఐటీ దాడుల నేపథ్యంలో రిత్విక్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. దోపిడీ జరిగిందిలా.. హంద్రీ –నీవా ప్రధాన కాలువను 11 నుంచి 20 మీటర్ల మేర వెడల్పు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.831.09 కోట్లతో అంచనాలు రూపొందించింది. టెండర్లో పాల్గొనే కంపెనీ ఇదే తరహా కాలువ వెడల్పు పనులను ఏడాదిలో రూ.328.75 కోట్ల విలువైనవి లేదా మూడు నెలల కాలంలో రూ.82.18 కోట్ల విలువైనవి ప్రధాన కాంట్రాక్టర్‌గా చేసి ఉండాలని టెండర్ నిబంధనల్లో పేర్కొన్నారు. అయితే.. ఇందుకు భిన్నంగా సబ్ కాంట్రాక్టర్‌గా పనులు చేసిన రిత్విక్ సంస్థను టెండర్లో పాల్గొనేందుకు అనుమతించడమే కాకుండా ఏకంగా అధిక ధరకు కట్టబెట్టారు. పోటీగా నిలబడి తక్కువ ధరనే కోట్ చేసినప్పటికీ..సాంకేతిక కారణాలను సాకుగా చూపి ఐవీఆర్సీఎల్, ప్రసాద్‌లను పక్కకు తప్పించారు. మొత్తం మూడు ప్యాకేజీలుగా పిలిచిన ఈ పనుల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న మూడు కంపెనీలకు చెరో ప్యాకేజీ అప్పగించారు. అయితే, రిత్విక్ కంపెనీ సమర్పించిన మొత్తం డాక్యుమెంట్లపై కేంద్ర నిఘా వర్గాలు కీలక సమాచారాన్ని సేకరించాయి. అర్హత ఉందంటూ ఛత్తీస్‌గఢ్ నుంచి రిత్విక్ తెచ్చిన వివరాలు సరైనవి కావని కూడా తేల్చాయి. రెండో ప్యాకేజీ పనుల్లో... వాస్తవానికి హంద్రీ–నీవా ప్రధాన కాలువ విస్తరణ పనులను మొదట్లో 14 ప్యాకేజీలుగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత తమఅనుకూల కంపెనీలకే దక్కేలా మూడు ప్యాకేజీలుగా విడగొట్టింది. ఇందులో కర్నూలు జిల్లాలో రెండు ప్యాకేజీలు ఉన్నాయి. ప్రధాన కాలువ –1.150 కిలోమీటర్ నుంచి 78.60 కిలోమీటర్ల వరకు రూ.326.75 కోట్లతో ఒక ప్యాకేజీగా, 79.75 కిలోమీటర్ల నుంచి 134.27 కిలోమీటర్ల వరకు రూ.224.42 కోట్లతో రెండో ప్యాకేజీగా విభజించారు. ఇక మిగిలింది అనంతపురం జిల్లాలో 134 కిలోమీటర్ల నుంచి 216.3 కిలోమీటర్ల వరకు రూ.279.92 కోట్లతో మూడో ప్యాకేజీగా విభజించారు. ఈ మూడు ప్యాకేజీ పనులను ఒక్కో కంపెనీకి అప్పగించారు. ఇందులో రెండో ప్యాకేజీ పనులను రిత్విక్ కంపెనీ చేపట్టింది. మొబిలైజేషన్ అడ్వాన్సు తీసుకుని పనులు చేయకుండానే ఆ సంస్థ చెక్కేసింది. ఐటీ దాడుల నేపథ్యంలో ఈ వ్యవహారం కూడా బయటకు వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
సీఎం రమేశ్ రాజభవనం చూశారా?
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సన్నిహితుడు, టీడీపీ రాజ్యసభ సభ్యుడు చింతకుంట మునుస్వామి రమేష్ (సీఎం రమేష్)కు చెందిన కంపెనీలు, పలుచోట్ల ఉన్న ఇళ్లు, కార్యాలయాలలో ఆదాయ పుపన్ను శాఖ అధికారులు శుక్రవారం విస్తృతంగా సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. సీఎం రమేష్ మొదటిసారి రాజ్యసభ ఎంపీగా ఎన్నికైనప్పుడు దాఖలు చేసిన అఫిడవిట్, రెండోసారి నామినేట్ అయిన సందర్భంలో దాఖలు చేసిన అఫిడవిట్లోనూ భారీ తేడాలున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ దాడుల నేపథ్యంలో తన వ్యక్తిగత ఆస్తుల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హైదరాబాద్, జూబ్లిహిల్స్‌లో తన నివాసానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. రాజభవనాన్ని తలిపిస్తున్న ఆయన నివాసాన్ని చూసి నెటిజన్లు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రమేశ్ నివాసంలోని అత్యంత ఆధునిక టెక్నాలజీతో ఉన్న హోంథియేటర్, స్విమ్మింగ్‌పూల్, డైనింగ్ టేబుల్, బెడ్ రూం ఫొటోలు వైరల్ అయ్యాయి. చదవండి: వేల కోట్లకు పడుగలెత్తిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్.... రెండో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు సీఎం రమేష్ సంస్థల్లో ఐటీ సోదాలు -
లాబీయింగ్‌లో రమేష్ నంబర్‌వన్
సాక్షి, ఎర్రగుంట్ల : టీడీపీ నేత సీఎం రమేష్ లాబీయింగ్ చేయడంలో నంబర్ వన్ అని వైఎస్సార్ సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టరు ఎం సుధీర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎర్రగుంట్లలోని పార్టీ కార్యాలయంలో ‘సాక్షి’తో మాట్లాడారు. 2014 ఎన్నికల మందు రిత్విక్ కంపెనీకి కేవలం 300 కోట్ల టర్నోవర్ ఉండేదని, ఎన్నికల తర్వాత చంద్రబాబు అధికారంలోకి రాగానే వేల కోట్లకు చేరుకుందన్నారు. దీన్ని బట్టి ఏవిధంగా ఆవినీతి సోమ్ము సంపాదించారో తెలుస్తోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీకి రూ.30లక్షలు దాకా ఖర్చు పెట్టి, ప్రత్యేక విమానాల్లో తిరిగారని చెప్పారు. ఎంత డబ్బులు ఖర్చు పెట్టి బీటెక్ రవిని గెలిపించారని ప్రశ్నించారు. కానీ అది గెలుపు కాదన్నారు. టీడీపీ ఆర్టీపీపీలోని 6 మెగావాట్లలో ఆవినీతి జరిగిందన్నారు. రూ.3వేల కోట్లు ఉన్న ప్రాజెక్టులో సుమారు 800 కోట్లు సంపాందించారు. పోట్లదుర్తి – మాలెపాడు, గ్రామాల మధ్య ఏ పనులైనా రిత్విక్ కంపెనీ కనుసన్నలలో జరగాలి, వైఎస్సార్ సీపీ తరుపున టెండర్‌వేస్తే రాకుండా చేస్తారు. లేక పోతే పనులు జరగనివ్వరన్నారు. లాబీయింగ్ చేయడంలో ఎంపీ రమేష్ నంబర్ వన్ అని అన్నారు. బీజేపీ కక్ష సాధింపు అనడడం సరికాదన్నారు.రమేష్ బలం చంద్రబాబు, అవినీతి సొమ్మేనని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మూలె హర్షవర్ధన్‌రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. చదవండి: వేల కోట్లకు పడుగలెత్తిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్.... రెండో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు సీఎం రమేశ్ రాజభవనం చూశారా? -
వేల కోట్లకు పడుగలెత్తిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్....
సాక్షి ప్రతినిధి కడప: టీడీపీ నేత రాజ్యసభ సభ్యులు ఎంపీ సీఎం రమేష్ నివాసం గృహం, సమీప బంధువులు, ప్రధాన అనుచరుల ఇళ్లల్లో శుక్రవారం ఐటీ అధికారులు సో దాలు చేశారు. ఈవార్త జిల్లాలో దావానంలా వ్యాపించింది. విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణుల్లో కలకలం రేగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆదా యపు పన్నుశాఖ అధికారులు సోదాలు చేసి మూడు సూట్కేసులల్లో విలువైన పత్రాలు, డ్యాకుమెంట్లు తీసుకెళ్లారు. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలో రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ ఇంటిలో శుక్రవారం తిరుపతి నుంచి వచ్చిన 8 మంది ఐటీ (ఇన్‌కం ట్యాక్స్) అధికారులు తనిఖీలు చేశారు. సాయంత్రం 5.30 గంటల వరకూ అధికారుల తనిఖీలు కొనసాగాయి. కాగా ‘గుమ్మడి కాయల దొంగ’ అంటే భుజాలు తడుముకున్నట్లుగా టీడీపీ నేతలు శైలి కన్పించింది. ఐటీ అధికారుల తనిఖీలు చేయడాన్ని రాజకీయ రంగు పులిమి నిరసనలు, నినాదాలు చేపట్టారు. ఓవైపు అధికారులు వారి పని వారుచేస్తుండగా మరోవైపు టీడీపీ శ్రేణులు ఆం దోళనలు కొనసాగించాయి. ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, బీటెక్ రవీ, మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తదితరులు పోట్లదుర్తి చేరుకొని హంగామా సృష్టించారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన పాటించారు. ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మీడియా ఎదుట ఆగ్రహం ప్రదర్శించారు. రిత్విక్ కన్స్ట్రక్షన్స్.... రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంపీ రమేష్‌నాయుడు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్కు వేల కోట్లు కాంట్రాక్టు పనులు వచ్చి చేరిపోయాయి. అప్పటి వరకు అరకొర పనులకే పరిమితమైన ఆ సంస్థ రాష్ట్రంలో దాదాపుగా రూ.3,658కోట్లు పనులు చేసినట్లు సమాచారం. సాగునీటి ప్రాజెక్టుల్లో పెండింగ్‌లో ఉన్న పనులు కల్పతరువుగా నిలిచాయి. జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్, ఆర్టీపీపీ, వంశధార, కుప్పం బ్రాంచ్ కెనాల్, వెలిగొండ టన్నెల్ ప్రధానంగా ఉన్నట్లు సమాచారం. బీఎన్ఎస్ఎస్లో అతి తక్కువగా నిలిచిపోయిన పనులు రివైజ్డ్ రేట్లు వేయించుకొని అత్యధికంగా సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ రూ.522 కోట్లు, హంద్రీ–నీవా సుజల స్రవంతి ఫేజ్–2 రూ.1000 కోట్లు, హెచ్ఎన్ఎస్ఎస్ విస్తరణ పనులు రూ.195 కోట్లు, హెచ్ఎన్ఎస్ఎస్ 34వ ఫ్యాకేజీ రూ.234కోట్లు, జీఎన్ఎస్ఎస్ ప్రాజెక్టులో రూ.350కోట్లు, వెలిగొండ టన్నల్ రూ.270 కోట్లు, తెలుగుగంగ లైనింగ్ పనులు రూ.289 కోట్లు, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ రూ.172 కోట్లు, వంశధార ప్రాజెక్టు పనులు రూ.120 కోట్లు, ఆర్టీపీపీ 6వ ఫ్లాంటు నిర్మాణ పనులు రూ.400 కోట్లు, గండికోట ప్రాజెక్టు పునరావాస నిర్మాణం పనులు రూ.106 కోట్లు పనులు దక్కినట్లు కాంట్రాక్టు వర్గాలు వివరిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వంలో దాదాపు రూ.3,658 కోట్లు పైబడిన కాంట్రాక్టులను ఆ సంస్థ కొనసాగిస్తున్నట్లు పలువురు ధ్రువీకరిస్తున్నారు. ఈమొత్తం వ్యవహారంలో ఆదాయ వ్యవహారాలు చెల్లించడంలో లోటుపాట్లు ఉన్నట్లు ఐటీ శాఖ గుర్తించి దాడులకు పాల్పడినట్లు పలువురు వెల్లడిస్తున్నారు. ఇదివరకే టీడీపీ నేత ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజలరెడ్డి సైతం ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నట్లు ఆరోపణలు సైతం చేశారు. ఈనేపథ్యంలో ఐటీ విభాగం ప్రత్యక్ష తనిఖీలు చేయడంపై పోట్లదుర్తి వాసులు ‘తేలు కుట్టిన దొంగల్లా’ వ్యవహరిస్తున్నారని పలువురు బాహాటంగా అంటున్నారు. -
రెండో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎంపీ సీఎం రమేశ్ నివాసం, కార్యాలయాల్లో రెండవ రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని రమేశ్ నివాసంలో అర్ధరాత్రి వరకు సోదాలు సాగాయి. రిత్విక్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-12లో ఉన్న సీఎం రమేశ్ బావ గోవర్థన్ నాయుడు ఇంట్లో అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు, నగదు, స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆయనకు చెందిన రెండు బ్యాంకు లాకర్లను కూడా ఐటీ అధికారులు ఓపెన్ చేశారు. (చదవండి: సీఎం రమేష్ సంస్థల్లో ఐటీ సోదాలు) అర్ధరాత్రి దాటాక రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కార్యాలయానికి గోవర్థన్ నాయుడిని తరలించారు. కంపెనీ ఫైనాన్స్ వ్యవహారంలో గోవర్థన్ నాయుడు కీలకవ్యక్తిగా ఉన్నారు. సీఎం రమేశ్ సోదరుడు రాజేష్‌ను కూడా అధికారులు విచారించారు. శనివారం కూడా సీఎం రమేశ్ కార్యాలయం, నివాసాలపై ఐటీ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. -
ఎంపీ సీఎం రమేష్‌ది నేరపూరిత చరిత్రే
-
సీఎం రమేశ్ ఆఫీస్‌లో కొనసాగుతున్న ఐటీ దాడులు
-
సీఎం రమేష్ సంస్థల్లో ఐటీ సోదాలు
సాక్షి, అమరావతి, హైదరాబాద్, సాక్షి ప్రతినిధి కడప: ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహితుడు, టీడీపీ రాజ్యసభ సభ్యుడు చింతకుంట మునుస్వామి రమేష్ (సీఎం రమేష్)కు చెందిన కంపెనీలు, పలుచోట్ల ఉన్న ఇళ్లు, కార్యాలయాలలో ఆదాయ పుపన్ను శాఖ అధికారులు శుక్రవారం విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఉదయం 8 గంటల సమయంలో సుమారు 90 నుంచి 100 మంది ఐటీ అధికారులు సీఎం రమేష్‌కు చెందిన హైదరాబాద్, వైఎస్సార్ జిల్లా పోట్లదుర్తిలో ఉన్న ఇళ్లతో పాటు రిత్విక్ ప్రాపర్టీస్, అనుబంధ కంపెనీల్లో సోదాలు జరిపారు. ఇంజనీరింగ్ కాంట్రాక్టులు, మైనింగ్ విద్యుత్తు తదితర రంగాల్లో ఉన్న సీఎం రమేష్ వ్యాపార సామ్రాజ్యం గత మూడేళ్లలో అనూహ్యంగా పెరిగింది. అయితే దానికి తగ్గట్టుగా ఆదాయ పన్ను చెల్లింపులు పెరగకపోవడం, ఖాతాల నుంచి నగదు రూపంలో లావాదేవీలు భారీగా జరుగుతుండటం ఐటీ సోదాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. హైదరాబాద్‌లో రాత్రిదాకా సోదాలు... విచారించేందుకు సిద్ధమవుతున్న అధికారులు! హైదరాబాద్ సాగర్ సొసైటీలోని రమేష్ కన్స్ట్రక్షన్, విద్యుత్ ప్రాజెక్టులు నిర్వహించే రిత్విక్ కంపెనీ, జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో 16 మంది అధికారులతో కూడిన బృందం సోదాలు జరిపింది. 2014కి ముందు ఆయన దాఖలు చేసిన ఐటీ రిటర్నులు, ఆ తర్వాత దాఖలు చేస్తూ వస్తున్న వివరాల్లో భారీ వ్యత్యాసాలున్నట్లు ఈ సందర్భంగా గుర్తించారని తెలిసింది. సీఎం రమేష్ మొదటిసారి రాజ్యసభ ఎంపీగా ఎన్నికైనప్పుడు దాఖలు చేసిన అఫిడవిట్, రెండోసారి నామినేట్ అయిన సందర్భంలో దాఖలు చేసిన అఫిడవిట్లోనూ భారీ తేడాలున్నట్లు అధికారులు గుర్తించారు. నాలుగేళ్లలో రూ.వందల కోట్ల మేర ఆస్తులు పెరిగిపోవడం, వాటికి సంబంధించి చెల్లించాల్సిన ఐటీలో తేడా ఉండటంపై అధికారులు సీఎం రమేశ్‌ను విచారించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. రమేశ్ కంపెనీలకు ఇటీవల ఏపీ ప్రభుత్వం ఇచ్చిన పలు ప్రాజెక్టుల టెండర్లు, వాటి ద్వారా వచ్చిన లాభాలకు సంబంధించిన లెక్కల్లోనూ భారీగా తేడాలున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీ ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని లావాదేవీలు, నిర్మాణ రంగం, పవర్ ప్రాజెక్టులు దక్కించుకున్న అంశాలకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రిత్విక్ సంస్థ నుంచి 8 హార్డ్‌డిస్క్‌లు, 18 పెన్‌డ్రైవ్‌లు, 6 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 3 సూటుకేసుల్లో కీలక పత్రాలు వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని సీఎం రమేష్ ఇంటికి ఉదయమే చేరుకున్న తిరుపతి ఆదాయపు పన్నుశాఖ అధికారులు ఎంపీ ఢిల్లీలో ఉండడంతో ఆయన సోదరుడు సురేష్‌నాయుడి సమక్షంలో సోదాలకు ఉపక్రమించారు. ఎంపీ సోదరులు సురేష్, రాజేష్, ప్రకాష్ ఇళ్లలో కూడా సోదాలు జరిపారు. ప్రొద్దుటూరులో ఉంటున్న రమేష్ సమీప బంధువు గోవర్ధన్‌నాయుడు ఇంట్లో కూడా తనిఖీలు కొనసాగించారు. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు వాటి జాబితాను సురేష్‌నాయుడుకు అందచేసి మూడు సూట్‌కేసులతో సాయంత్రం 5.30 గంటలకు వెనుతిరిగారు. అత్యధిక చెల్లింపులు నగదు రూపంలోనే 2013–14లో రూ.55,349.26 కోట్లుగా ఉన్న రిత్విక్ ప్రాపర్టీస్ ఆదాయం రెండేళ్లలో అంటే 2016–17 నాటికి ఏకంగా 145 శాతం పెరిగి రూ.1,35,720.78 కోట్లకు చేరుకుంది. మరోవైపు 2017–18కి సంబంధించి ఐటీ రిటర్నులు ఇంకా సమర్పించలేదని రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) సమాచారం ద్వారా వెల్లడవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి దక్కించుకున్న రూ.వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు సంబంధించి చెల్లింపులు జరగగానే అధిక భాగం నగదు రూపంలో తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై హైదరాబాద్ సాగర్ సొసైటీలోని అలహాబాద్ బ్యాంక్ అధికారులను ఆరా తీసిన ఐటీ అధికారులు బ్యాంకు మేనేజర్ నుంచి సాక్షి సంతకాలు తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే ఐటీ అధికారులు తనిఖీలకు దిగినట్లు భావిస్తున్నారు. ఉదయం ప్రారంభమైన సోదాలు రాత్రి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. పలు లావాదేవీలకు సంబంధించిన విలువైన పత్రాలు, హార్డ్ డిస్క్‌లను ఐటీ అధికారులు సీజ్ చేసి సూట్‌కేసుల్లో తరలించారు. పుట్టగొడుగుల్లా కంపెనీలు... సీఎం రమేష్, ఆయన సోదరుడి పేరు మీద 10కి పైగా ప్రధాన కంపెనీలతో పాటు పలు డొల్ల కంపెనీలు ఉన్నట్లు తేలింది. వీటిలో కొన్ని కంపెనీలు రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రారంభం కావడం గమనార్హం. రిత్విక్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, గ్లోబల్ ఎర్త్ మినరల్స్, ల్యాండ్ మార్క్ ఇన్ఫ్రా ఎస్టేట్స్ అండ్ హోమ్స్, రిత్విక్ హోల్డింగ్స్, అంజనాద్రి పవర్, కడప పవర్, నారాయణాద్రి గ్రీన్ ఎనర్జీ, కదిరి గ్రీన్ పవర్, రిత్విక్ గ్రీన్ పవర్‌లతోపాటు మరికొన్ని డొల్ల కంపెనీలు ఉన్నట్లు బయటపడింది. వీటిలో కడప, అంజనాద్రి, నారాయణాద్రి, కదిరి గ్రీన్ పవర్ కంపెనీలు రెండు మూడేళ్ల క్రితమే ఏర్పాటయ్యాయి. షెల్ కంపెనీల్లోకి నిధుల మళ్లింపు? రిత్విక్ ప్రాజెక్టస్ ద్వారా వచ్చిన నిధులను సీఎం రమేష్ గొలుసుకట్టు కంపెనీలలోకి మళ్లించడం ద్వారా భారీ మొత్తాలను బయటకు తరలించినట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దిశగా దృష్టి సారించి దర్యాప్తు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఆంతరంగికుల్లో ఒకరైన సీఎం రమేష్ ఆదాయం అనూహ్యంగా పెరగడంపై వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ 2009లోనే కోర్టు తలుపులు తట్టారు. 2003లో రూ.61 కోట్లుగా ఉన్న రమేష్ కంపెనీ ఆదాయం 2009 నాటికి రూ.488 కోట్లకు పెరిగిందని, ఓ చిన్న సబ్‌కాంట్రాక్టరుకు ఈ స్థాయిలో వ్యాపారం పెరగడం అసాధారణమని, దీనిపై దర్యాప్తు జరిపించాలంటూ హైకోర్టును ఆమె గతంలో ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సోదాలకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణుల నిరసన.... సీఎం రమేష్ ఇంట్లో ఐటీ సోదాలపై టీడీపీ శ్రేణులు పోట్లదుర్తిలో నిరసన తెలిపాయి. శాసనమండలిలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తదితరులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. సోదాల వెనుక కేంద్రం ప్రమేయం: సీఎం రమేష్ సాక్షి, న్యూఢిల్లీ: తన ఇళ్లు, కార్యాలయాలపై జరుగుతున్న ఐటీ సోదాల వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందున తనపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేయిస్తున్నారని శుక్రవారం ఢిల్లీలోని మీడియాతో పేర్కొన్నారు. తాను ఇంట్లో లేని సమయాన్ని చూసి ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారని, ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని, తన సంస్థల ద్వారా వస్తున్న ఆదాయానికి క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్నట్టు చెప్పారు. సోదాల సందర్భంగా ఐటీ అధికారులు తెలంగాణ ప్రభుత్వ అధికారులను మధ్యవర్తులుగా తీసుకురావడాన్ని ఆయన తప్పుబట్టారు. -
డొంక కదులుతోంది
-
టీడీపీ సర్కారు అవినీతిలో కూరుకుపోయింది..
-
‘రేవంత్, రమేష్‌లు చంద్రబాబు బినామీలు’
సాక్షి, న్యూఢిల్లీ : మంత్రి లోకేష్ వ్యాఖ్యలతో సీఎం రమేష్ చంద్రబాబు బినామీ అని తేలిపోయిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి లోకేష్ బినామీ ఐటీ కంపెనీలు పెట్టి పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులను, భూములను దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రాధమిక ఆధారాలు లేకుండా ఐటీ శాఖ సోదాలు జరపదు, సమాచారం ఉంది కనుకనే దాడులు నిర్వహిస్తుందన్నారు. ఐటీ అధికారులు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పకుండా కక్ష సాధింపు చర్యలు అంటే ఎలా అని ప్రశ్నించారు. తప్పు చేయని వారు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇతర పార్టీలపై ఐటీ సోదాలు జరిగితే భేష్ అన్న టీడీపీ నేతలు తమపై జరిగితే మాత్రం భుజాలు తడుముకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, సీఎం రమేష్‌లు చంద్రబాబు బినామీలని ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్‌కు టీడీపీ ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చారని, అదంతా అవినీతి సొమ్మేనని విమర్శించారు. దొంగ దీక్షలకు ఎవరూ భయపడరు ఉక్కు కర్మాగారం కోసం సీఎం రమేష్ చేసే దొంగ దీక్షలకు ఎవరూ భయపడరని జీవీఎల్ అన్నారు. దీక్ష చేసినందుకే కక్ష కట్టి కేంద్ర ప్రభుత్వం దాడులు చేయిస్తోదనడంలో వాస్తవం లేదన్నారు. అక్రమార్జనపై వచ్చిన ప్రశ్నలకు సీఎం రమేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్టాంట్‌పై ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్‌తో చర్చలు జరిపామని, ఆయన సానుకూలంగా స్పందించారని జీవీఎల్ చెప్పారు. మేకాన్ సంస్థ నివేదిక అనంతరం నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ( చదవండి : సీఎం రమేశ్ ఇంట్లో ఐటీ సోదాలు) -
రిత్విక్ ప్రాజెక్టు ఆస్తులపై ఐటీ సోదాలు
-
సీఎం రమేశ్ ఇళ్ల పై ఐటీ దాడులు
-
సీఎం రమేశ్ ఇంట్లో ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: టీడీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ నివాసాలు, వ్యాపార కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, విజయవాడలో ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన స్వగ్రామం వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని నివాసంలోనూ సోదాలు జరుగుతున్నాయి. ఆయన చూపించిన ఆదాయానికి, లెక్కలకు పొంతన లేకపోవడంతో ఐటీ అధికారులు సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఆస్తుల పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను అధికారులు తనిఖీ చేస్తున్నారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో సీఎం రమేశ్ బంధువు గోవర్ధన్ నాయుడు ఇంట్లోనూ ఐటీ సోదాలు సాగుతున్నాయి. సీఎం రమేశ్‌కి దగ్గర బంధువైన గోవర్ధన్ నాయుడు కాంట్రాక్టర్‌గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చాక సీఎం రమేశ్ పలు కాంట్రాక్టు దక్కించుకున్నారు. ఆయనకే అన్ని కాంట్రాక్టులు ఇస్తున్నారని టీడీపీ నాయకులే పలు సందర్భాల్లో బహిరంగంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఐటీ దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం సీఎం రమేశ్ ఢిల్లీలో ఉన్నారు. పోట్లదుర్తిలోని సీఎం రమేశ్ నివాసం భారీగా అక్రమాలు.. సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్కు చంద్రబాబు సర్కారు అక్రమంగా కాంట్రాక్టులు కట్టబెట్టిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువైన నిర్మాణ పనులను నామినేషన్ పద్ధతిలో ఇచ్చేసినట్టు వెల్లడించాయి. హంద్రీనీవా 2వ ప్యాకేజీలో రూ.42 కోట్లకుగాను మిగిలిపోయిన పనులు రూ.9 కోట్లు అయితే, దాన్ని మళ్లీ రూ.52 కోట్లకు రీ టెండర్ వేసి సీఎం రమేష్‌కు అప్పగించారన్న ఆరోపణలున్నాయి. దాన్నికూడా భారీగా పెంచి సీఎం రమేష్ దాదాపు రూ.90 కోట్ల బిల్లులు తీసుకున్నట్టు తెలుస్తోంది. హంద్రీ నీవాలో 36వ ప్యాకేజీలో మిగిలిపోయిన రూ.55 కోట్లకుగాను దీన్ని రూ.265 కోట్లకు పెంచి చేజిక్కించుకున్నారని సమాచారం. హంద్రీనీవాలో 3వ ప్యాకేజీలో కూ.50 కోట్ల రూపాయలకు మిగిలిపోయిన పనులను రూ.110 కోట్లకు సీఎం రమేష్‌కు అప్పగించి, ఆ మేరకు బిల్లులు చేసుకున్నారు. పై మూడు పనులకు సంబంధించి పాత ధరలకే చేస్తామని కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్లినా, ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. కుప్పం బ్రాంచ్ కెనాల్‌కు సంబంధించి రూ.150 కోట్లకయ్యే పనులకు ఇవ్వాళ్టికి సుమారు రూ.550 కోట్లు బిల్లులు చేసుకున్నారు. ఇంకా రూ.150 కోట్లకు సంబంధించి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎస్సార్బీసీలో బనగానపల్లి వద్ద మిగిలిపోయిన రూ. 12 కోట్ల పనులకు గానూ రూ. 127 కోట్లకు చేసుకున్నారు. కాంట్రాక్టర్లు ఎవ్వరూ రాకుండా బెదిరింపులకు పాల్పడ్డం, తమ సంస్థలకే కాంట్రాక్టు వచ్చేలా మార్గదర్శకాలు రూపొందించుకోవడం తదితర పద్ధతుల్లో ఏపీ ప్రభుత్వం నుంచి భారీగా లబ్ధి పొందారని విపక్షాలు ఆరోపించారు. టీడీపీ నాయకులకు టెన్షన్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర సోదరుడు బీద మస్తాన్‌రావు ఇల్లు, వ్యాపార సంస్థలపై కూడా ఆదాయ పన్నుల శాఖ అధికారులు గతవారం దాడులు నిర్వహించారు. ‘బీఎంఆర్’ గ్రూప్ పేరుతో వ్యాపారాలు చేస్తున్న ఆయన ఆదాయపన్ను చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. వరుస దాడులు అధికార టీడీపీ నాయకుల్లో గుబులు రేపుతున్నాయి. తాము చేసిన అక్రమాలు ఎక్కడ బయటపడతాయోమోనని సైకిల్ పార్టీ నేతలు వణికిపోతున్నారు. (చదవండి: టీడీపీ నేత ‘బీద’ సంస్థలపై ఐటీ దాడులు) -
ప్రొద్దుటూరు టీడీపీలో తారాస్థాయికి విభేదాలు
వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరు టీడీపీలో విభేదాలు తారాస్ధాయికి చేరుకున్నాయి. ఎంపీ సీఎం రమేశ్‌పై మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి నిప్పులు చెరిగారు. తాను జీవించి ఉన్నంత వరకూ సీఎం రమేశ్ కుటుంబాన్ని ప్రొద్దుటూరు రాజకీయాల్లోని రానివ్వనని తెగేసి చెప్పారు. సీఎం రమేశ్ కనుసన్నల్లోనే ప్రొద్దుటూరులో కౌన్సిలర్లు రాజీనామాలు చేశారని ఆరోపించారు. ప్రొద్దుటూరు టీడీపీలో జరుగుతున్న అల్లర్ల వెనక సీఎం రమేశ్ హస్తం ఉందని మీడియా సమావేశంలో వరదరాజులు రెడ్డి పేర్కొన్నారు. ప్రొద్దుటూరులో టీడీపీకి చెందిన 22 మంది కౌన్సిలర్లు, తమ పదవులకు రాజీనామా చేస్తూ మున్సిపల్ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డికి సోమవారం లేఖ ఇచ్చిన సంగతి తెల్సిందే. -
అధికార పార్టీ ఎంపీ అంటే అంతేమరి!
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ టెండర్ల వివాదం నుంచి గట్టెక్కేందుకు టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ సంస్థ అదిరిపోయే ప్లాన్ వేసింది. పనులను పాత కాంట్రాక్టర్‌కే సబ్ కాంట్రాక్టుకు అప్పగించడం ద్వారా టెండర్ల వివాదానికి చెక్ పెట్టడంతోపాటు తట్టెడు మట్టెత్తకుండానే రూ.200 కోట్లకు పైగా లబ్ధి పొందడానికి వ్యూహం రచించింది. 4.65 అధిక ధరలకు టెండర్ వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో భాగంగా రెండో టన్నెల్‌ను 18.838 కి.మీ.ల పొడవున తవ్వే పనులను రూ.735.21 కోట్లకు హెచ్‌సీసీ–సీపీపీఎల్(జాయింట్ వెంచర్) సంస్థ 2007లో దక్కించుకుంది. కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం 2012 నాటికే ఈ పనులు పూర్తి కావాలి. కానీ 2015 వరకూ పూర్తి కాలేదు. 2016 డిసెంబర్ నాటికి ఈ టన్నెల్ పనులు పూర్తి చేయాలనే సాకు చూపుతూ అదేఏడాది జూలై 5న కాంట్రాక్టర్‌కు నిబంధనలకు విరుద్ధంగా రూ.17.29 కోట్లను ప్రభుత్వం ఇచ్చేసింది. అయినా టన్నెల్ పనులు పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ నాటికి రెండో టన్నెల్ పనులు పూర్తి చేయాలనే నెపంతో మిగిలిపోయిన పనులను 60సీ నిబంధన కింద పాత కాంట్రాక్టర్ నుంచి ప్రభుత్వం తొలగించింది. ఈ పనుల విలువను రూ.299.48 కోట్లుగా ఐబీఎం తేల్చింది. కానీ, ముఖ్యనేత ఒత్తిడి మేరకు అంచనా వ్యయాన్ని పెంచేస్తూ మార్చి 22న జలవనరులశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన అంచనా వ్యయంతో చేపట్టే పనులను సీఎం రమేశ్ సంస్థకే అప్పగించాలని ముఖ్యనేత నిర్ణయించారు. ఈ పనులకు రూ.570.58 కోట్ల అంచనా వ్యయంతో మార్చి నెలలో సర్కార్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. 4.65 శాతం అధిక ధరలకు సీఎం రమేశ్ సంస్థ టెండర్ దక్కించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనలు వినకుండా 60సీ నిబంధన కింద తమపై వేటు వేసిందంటూ పాత కాంట్రాక్టర్ హైకోర్టును ఆశ్రయించారు. దాంతో పాత కాంట్రాక్టర్ వాదనను విని, లెక్కలు తేల్చాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. టన్నెల్ బోరింగ్ మెషీన్(టీబీఎం), క్వారీ, చేసిన పనులకు అదనపు బిల్లులతో కలిపి రూ.185 కోట్లు పరిహారంగా ఇవ్వాలని పాతకాంట్రాక్టర్ ప్రతిపాదించారు. లేకపోతే పెంచిన అంచనా వ్యయం మేరకు బిల్లులు ఇస్తే ఆ పనులు తామే చేస్తామని పేర్కొన్నారు. పాత కాంట్రాక్టరే సబ్ కాంట్రాక్టర్ టెండర్ల వివాదం నుంచి గట్టెక్కడంతోపాటు భారీగా లబ్ధి పొందడానికి సీఎం రమేశ్ మాస్టర్ ప్లాన్ వేశారు. టన్నెల్ పనులను సబ్ కాంట్రాక్టు కింద ఇస్తామని.. వాటి పాత విలువ అంటే రూ.299 కోట్లకు అదనంగా ఇంకో రూ.70 కోట్లు ఇస్తామని, వాటిని మీరే చేసుకోవాలని పాత కాంట్రాక్టర్‌కు ప్రతిపాదించారు. ఇందుకు పాత కాంట్రాక్టర్ అంగీకరించినట్లు తెలిసింది. దీనివల్ల పనులు చేయకుండానే రూ.200 కోట్లకుపైగా ప్రయోజనం పొందడానికి సీఎం రమేశ్ పన్నాగం పన్నినట్లు స్పష్టమవుతోంది. -
సీఎం రమేష్‌తో వేగలేం..!
సాక్షి ప్రతినిధి కడప: తెలుగుదేశం పార్టీ అంతర్గత విభేదాలు తీవ్రమయ్యాయి. ఎత్తుకు పైఎత్తులను కొనసాగిస్తున్నారు.ఎంపీ రమేష్‌ను నియంత్రించే ప్రక్రియ జోరందుకుంది. క్రమం తప్పకుండా ఫిర్యాదుల పరంపర చేపట్టారు. మొన్న మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మంత్రి నారాలోకేష్ ఎదుట ఏకరువు పెట్టగా, తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ తనయుడు రితీష్‌రెడ్డి కుండ బద్దలు కొట్టారు. ఇక సీఎం రమేష్‌తో వేగలేం.. కట్టడి చేయండి ..పార్టీ ఉన్నతి కోసం దశాబ్దాలుగా కృషి చేసిన కుటుంబాలను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తినట్లు సమాచారం. జిల్లా టీడీపీలో రమేష్ ఓ వర్గానికి నాయకత్వం వహిస్తుండగా, మంత్రి ఆదినారాయణరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి మరో వర్గానికి అండగా నిలుస్తున్నారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఈక్రమంలో ఒకరి కంటే మరొకరిది పైచేయి కావాలనే ఆరాటం అధికంగా కన్పిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి రాజ్యసభ సభ్యుడు రమేష్‌ను ఉద్దేశించి ‘పంచాయతీకి ఎక్కువ, మండలానికి తక్కువ’స్థాయి కల్గిన వ్యక్తిగా ఘాటుగా విమర్శించారు. వరద వాస్తవికతను బహిర్గతం చేయడంతో ‘తేలు కుట్టిన దొంగలా’మౌనం వహించాల్సిన పరిస్థితి రమేష్ వంతయింది. కాగా ఈ తతంగం వెనుక మంత్రి ఆది ఉన్నారని గ్రహించిన రమేష్ భారీ ఎత్తుగడ వేశారు. ఈక్రమంలోనే ఉక్కు ఫ్యాక్టరీ ఆమరణ దీక్ష తెరపైకి వచ్చినట్లు సమాచారం. ఉక్కుదీక్షను సీఎం రమేష్ ఎంచుకొని రాష్ట్ర మంత్రి వర్గాన్ని తన దీక్షాశిబిరానికి రప్పించుకున్నారు. వెరసి ఆ దీక్షకు మంత్రి ఆది పడిగాపులు కాయాల్సిన పరిస్థితులను సృష్టించారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. రాజధానికి చేరిన ఫిర్యాదులు..ఎంపీ రమేష్ ఆమరణదీక్ష చేపట్టినంత కాలం జిల్లా టీడీపీ నాయకులు (మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మినహా) భుజకీర్తులు మిన్నంటాయి. ఆ కార్యక్రమం ముగియగానే యథావిధిగా ‘సిఎం రమేష్ స్థాయి పంచాయతీకి ఎక్కువ, మండలానికి తక్కువ’నినాదం తెరపైకి వచ్చింది. మండలస్థాయిలో కూడా ప్రజా పరపతి లేని వ్యక్తి ఇష్టారాజ్యంగా చెలాయిస్తున్నారు, పార్టీని అడ్డుపెట్టుకొని ఆదాయం గడిస్తున్నారు, వర్గ విభేదాలు సృష్టిస్తున్నారంటూ పలువురు నాయకులు ఫిర్యాదు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఇదే విషయమై అమరావతిలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్‌కు కూలంకషంగా వివరించినట్లు సమాచారం. రమేష్‌ను కట్టడి చేయకపోతే జిల్లాలో టీడీపీకి పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని తెలియజేసినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో సోమవారం సాయంత్రం అమరావతిలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ తనయుడు రితీష్‌రెడ్డి సీఎం చంద్రబాబును కలిశారు. మా తాత బద్వేల్ వీరారెడ్డి చిత్తశుద్ధితో పార్టీ ఉన్నతి కోసం కష్టపడ్డారు. పార్టీ అడ్డుపెట్టుకొని ఆర్థికంగా సంపాదనపై దృష్టి పెట్టలేదు, వ్యక్తిగత పరపతి కోసం వర్గాలను సృష్టించలేదు, ఎంపీ రమేష్ జిల్లాలో వర్గాలను ప్రోత్సహిస్తున్నారు, మాలాంటి వారు కూడా పార్టీలో ఉనికి కోసం పోరాటం చేయాల్సిన దుస్థితి నెలకొందని ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీని అడ్డుపెట్టుకొని లబ్ధిపొందుతూ పార్టీ కోసం పనిచేయడం లేదని, వ్యక్తిగతంగా జిల్లాలో రమేష్ ప్రజాపరపతి చాలా స్వల్పమని, కట్టడి చేయకపోతే కష్టమేనని తెలిపినట్లు సమాచారం. జిల్లా అధ్యక్షుడు సమక్షంలో ఎంపీపై ఫిర్యాదు చేయడంతో సీఎం ఆలకించినట్లు తెలుస్తోంది. గతంలో వాసుకు చెక్‌పెట్టిన ప్రతిఫలమే... టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డిని మార్చాలంటూ గతంలో ఎంపీ రమేష్ దృష్టి సారించారు. ఆస్థానాన్ని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, లేదా మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డిలతో భర్తీ చేయాలనే దిశగా జోరుగా పావులు కదిపారు. ఈక్రమంలో మంత్రి ఆదినారాయణరెడ్డి కూటమిది పైచేయి కావడంతో రమేష్ ప్రతిపాదన తెరమరుగైందని పలువురు వెల్లడిస్తున్నారు. అందుకు ప్రతిగా రమేష్‌నాయుడు వైరి పక్షాన్ని ప్రోత్సహిస్తూ అధిష్టానం దృష్టికి నేరుగా ఫిర్యాదు వెళ్లేలా చర్యలు చేపడుతున్నట్లు పలువురు వివరిస్తున్నారు. పైగా సాగునీటి ప్రాజెక్టుల్లో రమేష్ దక్కించుకున్న కాంట్రాక్టుల వివరాలు చేపట్టిన పనులు, అందులో లభించిన ప్రతిఫలం రికార్డులతో సహా కొందరు మంత్రి నారా లోకేష్ దృష్టిలో పెట్టినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో మంత్రి ఆది వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఎంపీ రమేష్‌నాయుడుకు చెక్పెట్టుతోన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
సీఎం రమేష్‌కు అంత భద్రత ఎందుకు
-
సీఎం రమేష్ పంచాయతీకి ఎక్కువ..మండలానికి తక్కువ