రిత్విక్ సంస్థపై దాడి చేసినా నోరు మెదపని ఎంపీ రమేష్‌నాయుడు
రెచ్చిపోయి ఊగిపోతున్న ఎమ్మెల్యే ఆది
ఆపై వైఎస్సార్‌సీపీ నేతల పనులంటూ..డొంకతిరుగుడు మాటలు
ఎమ్మెల్యే మాధవీరెడ్డి సైతం మద్యం షాపుపై అసెంబ్లీలో ప్రస్తావన
అన్నింటా పాత్రధారులు...సూత్రధారులు కూటమి నేతలే
ఆడవారి మాటలకు ఆర్థాలే వేరులే...అంటూ ఓ సినిగేయ రచయిత పాట రచించారు. వాస్తవానికి ఆ స్థానంలోకి రాజకీయ నాయకులు వచ్చి చేరిపోయారు. వారి మాటలకు చేష్టలకు పొంతన లేకుండా ఉంది. ‘నోటితో మాట్లాడడం, నొసలుతో వెక్కిరించడం, దేని పని దానిదే’అన్నట్లుగా ఉండిపోయింది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు అదే విషయాన్ని రూఢీ చేస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో ఆదానీ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు ఎంపీ రమేష్‌నాయుడుకు చెందిన రిత్విక్ కన్‌స్ట్రక్షన్స్ చేపడుతోంది. కొండాపురం మండలంలోని దొబ్బుడుపల్లె, రావికుంట, తిరువాలయపల్లె గ్రామాలతోపాటు మైలవరం మండలంలోని బొగ్గులపల్లె గ్రామాల పరిధిలో ఆ పనులు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పనులన్నీ తమ వర్గీయులే చేపట్టాలంటూ జమ్మలమడుడు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పట్టుబట్టారు. మంతనాలు, హెచ్చరికలు, రాయబేరాలు ఎలా నడిపినా, ఆశించిన తీరులో నిర్మాణ పనులు దక్కలేదు. దీంతో ఎమ్మెల్యే ఆది కుటుంబ సభ్యులు శివనారాయణరెడ్డి, రాజేష్‌రెడ్డిల నేతృత్వంలో దొబ్బుడుపల్లె వద్ద చేపడుతున్న నిర్మాణపనుల్లో విధ్వంసం సృష్టించారు. స్థానికంగా ఉన్న రిత్విక్ కన్‌స్ట్రక్షన్స్ సిబ్బందిపై దాడి చేసి, అక్కడే ఉన్న వాహనాలను పగులగొట్టారు.
తెరవెనుక మంత్రాంగంలో సీఎం రమేష్‌నాయుడు
క్షేత్రస్థాయిలో రిత్విక్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ పనులు అడ్డుకొని స్థానికంగా ఉన్న సైట్ ఇంజినీర్లపై ఎమ్మెల్యే ఆది వర్గీయులు దాడి చేస్తే ఎంపీ రమేష్ నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు నోరు మెదపలేదు. తెరవెనుక మంత్రాంగంలో రమేష్‌నాయుడు ఉండిపోయారని సమాచారం. ఆమేరకు తన సోదరుడు రాజేష్‌నాయుడును సీఎం వద్దకు పంపించి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. సీఎం స్థాయిలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు దాడి చేపట్టిన వ్యవహారంపై వాకబు చేయడంతో వైఎస్సా ర్‌సీపీ నాయకులతో కలిసి పనులు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆది చెప్పుకొచ్చా రు. అదే వాస్తవమైతే ఫలానా వైఎస్సార్‌సీపీ నా యకులు పనులు చేస్తున్నారని, వారు అక్కడే ఉండి రెచ్చగొట్టారని ఎందుకు బహిరంగంగా ప్రకటి ంచలేదని విశ్లేషకులు నిలదీస్తున్నారు. రూ.1800 కోట్ల సివిల్ పనులు రిత్విక్ కన్‌స్ట్రక్షన్స్ ఎలా ఇస్తారన్నదే ఎమ్మెల్యే వర్గీయుల అసలు ప్రశ్న. ఆ పను లు తామే చేయాలన్నదే వారి ఆకాంక్ష. ఆ విషయాన్ని తెరమరుగు చేసి, వైఎస్సార్‌సీపీ నేతల పనులంటూ దాడి వ్యవహారాన్ని ఎమ్మెల్యే ఆది రక్తి కట్టించారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు.
గళమెత్తిన రెడ్డెమ్మ...
ఎమ్మెల్యే మాధవీ రెడ్డి కడపలో మద్యం షాపుల నిర్వహణ తీరుపై అసెంబ్లీలో గళ మెత్తారు. మార్పు పేరిట డీ–ఆడిక్షన్ సెంటర్ మేడపైన నిర్వహిస్తుంటే, ఆ బిల్డింగ్ కిందనే మద్యం షాపు ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు. వాస్తవంగా ఎమ్మెల్యే లేవనెత్తిన ప్రశ్న మంచిదే అయినా, ఈ వ్యవహారంలో పాత్రధారులు, సూత్రధారులను బహిరంగ పర్చి ఉంటే బాగుడేందని పలువురు చెప్పుకొస్తున్నారు. కడపలో రెడ్డి వైన్స్ వర్సెస్ మౌర్య వైన్స్ మధ్య పెద్ద ఎత్తున ఆధిపత్య పోరాటం నడిచిన విషయం జగమెరిగిన సత్యం. అక్క డ మౌర్య వైన్స్ ఉంచరాదనే విషయంపై అధికారులపై రాజకీయ ఒత్తిడులు వచ్చినా అక్కడే కొనసాగిస్తున్నారంటే మరో అధికార పార్టీ నేత ప్రమే యం ఉండడమేనని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అటు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది వ్యవహారంలోనైనా, ఇటు కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి అసెంబ్లీలో గళమెత్తినా ఈ వ్యవహారంలో పాత్రధారు లు కూటమి ప్రభుత్వ నేతలేనన్నది సుస్పష్టం.
Comments
Please login to add a commentAdd a comment