సాక్షి, వైఎస్సార్ జిల్లా: జిల్లాలో బీజేపీ నేతల మధ్య వార్ నడుస్తోంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌ల మధ్య పొసగడం లేదు. ఆదినారాయణరెడ్డి బంధువు పేకాట శిబిరాలు నడుపుతున్నాడంటూ కలెక్టర్, ఎస్పీకి సీఎం రమేష్ ఫిర్యాదు చేశారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు పంపిన సీఎం రమేష్.. ఆది బంధువు దేవగుడి నాగేశ్వరరెడ్డిపై కంప్లెంట్ చేశారు.
ఆదినారాయణరెడ్డి వ్యవహారాలన్నీ చక్కబెట్టే నాగేశ్వరరెడ్డిపై సీఎం రమేష్ ఫిర్యాదుతో ఆదినారాయణ రెడ్డి అరాచకాలు బట్టబయలయ్యాయి. ఇప్పుడు పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారనే దానిపై చర్చ జరుగుతోంది. నిన్నటి వరకు కలిసి ఉన్న ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్‌ల మధ్య డైరెక్ట్ వార్ సాగుతోంది.
ఇదీ చదవండి: ‘చంద్రబాబు పాలనలో రాయలసీమకు ప్రతిసారీ అన్యాయం’
Comments
Please login to add a commentAdd a comment