పూలగుచ్ఛం అడ్డుపెట్టి.. కూటమి సర్కార్‌ నీచ రాజకీయం | Ysrcp Leaders Insulted At Union Minister Jitendra Singh Program | Sakshi
Sakshi News home page

పూలగుచ్ఛం అడ్డుపెట్టి.. కూటమి సర్కార్‌ నీచ రాజకీయం

Published Thu, Jan 2 2025 9:50 PM | Last Updated on Thu, Jan 2 2025 9:54 PM

Ysrcp Leaders Insulted At Union Minister Jitendra Singh Program

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు అవమానం జరిగింది. ఫ్లెక్సీపై ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఫోటోలు వేశారు. అయితే వారి ఫొటోలు కనిపించకుండా ముఖాలపై కూటమి నేతలు పూల గుచ్చం అడ్డుగా పెట్టారు. టీడీపి, బీజేపీ నేతల ఫోటోలు మాత్రమే కనిపించేలా డెకరేషన్‌లో ఎత్తుగడ వేశారు.

జమ్మలమడుగులో మహిళా సంఘాలతో కేంద్రమంత్రి భేటీకాగా, కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్సీలను ప్రభుత్వ అధికారులు అవమానించారు. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించడంపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారిక కార్యక్రమం కావడంతో ఫ్లెక్సీలపై ఎంపీ, ఎమ్మెల్సీ ఫొటోలు వేయక తప్పని పరిస్థితి. పూలగుచ్ఛం అడ్డుపెట్టి పట్టి కూటమి ప్రభుత్వం నీచ రాజకీయానికి ఒడిగట్టింది. జిల్లా అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చదవండి: బీజేపీ నేతలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement