Flexi
-
నల్లగొండ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
-
రోజా ఇంటి వద్ద టీడీపీ ఉన్మాదం..
-
పూలగుచ్ఛం అడ్డుపెట్టి.. కూటమి సర్కార్ నీచ రాజకీయం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులకు అవమానం జరిగింది. ఫ్లెక్సీపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఫోటోలు వేశారు. అయితే వారి ఫొటోలు కనిపించకుండా ముఖాలపై కూటమి నేతలు పూల గుచ్చం అడ్డుగా పెట్టారు. టీడీపి, బీజేపీ నేతల ఫోటోలు మాత్రమే కనిపించేలా డెకరేషన్లో ఎత్తుగడ వేశారు.జమ్మలమడుగులో మహిళా సంఘాలతో కేంద్రమంత్రి భేటీకాగా, కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్సీలను ప్రభుత్వ అధికారులు అవమానించారు. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించడంపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారిక కార్యక్రమం కావడంతో ఫ్లెక్సీలపై ఎంపీ, ఎమ్మెల్సీ ఫొటోలు వేయక తప్పని పరిస్థితి. పూలగుచ్ఛం అడ్డుపెట్టి పట్టి కూటమి ప్రభుత్వం నీచ రాజకీయానికి ఒడిగట్టింది. జిల్లా అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇదీ చదవండి: బీజేపీ నేతలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు -
YSRCP ఫ్లెక్సీలను చించేసిన దుండగులు
-
బ్యాంకోళ్ల జబర్దస్తీ!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: రైతులు తీసుకున్న దీర్ఘకాలిక రుణాల వసూలు కోసం సహకార బ్యాంకు అధికారులు జబర్దస్తీకి దిగుతున్నారు. తనఖాలో ఉన్న భూములను వేలం వేస్తున్నట్టుగా రైతులకు నోటీసులు ఇవ్వడమే గాకుండా, పొ లాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. బ్యాంకోళ్ల జబర్దస్తీతో తమ పరువు పోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (ఎన్డీసీసీబీ) అధికారులు కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్ మండలం అంకోల్ తండా, సంగెం, మైలారం, దుర్కి, బస్వాయిపల్లి, అంకోల్, హాజీపూర్ తదితర గ్రామాల్లో రైతులకు నోటీసులు జారీ చేశారు.రైతుల భూములను వేలం వేస్తున్నట్టు నోటీసులు జారీ చేశారు. అంతటితో ఆగకుండా కుదువ పెట్టిన భూములను వేలం వేయడానికి తాము అ«దీనంలోకి తీసుకున్నట్టు కొందరు రైతుల భూముల్లో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జూన్‌లో లింగంపేట మండలంలోని పోల్కంపేట గ్రామంలో రైతుల భూములను వేలం వేస్తున్నట్టు పొలాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన విషయంపై ‘సాక్షి’ప్రచురించిన కథనంతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించి సహకార బ్యాంకు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పరువు తీసేలా వ్యవహరించవద్దని ఆదేశించారు.దీంతో రైతుల భూముల వేలం నిలిచిపోయింది. తాజాగా నస్రుల్లాబాద్ మండలంలో సహకార బ్యాంకు అధికారులు తిరిగి అదే పద్ధతిని మొదలుపెట్టారు. ఈనెల 26న పలువురు రైతుల భూములను వేలం వేయనున్నట్టు రైతులకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. రైతుల ఆవేదన..: బ్యాంకు అధికారులు తమ భూములను వేలం వేస్తున్నట్టు నోటీసులు ఇవ్వడంతో పాటు భూముల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు రైతులు బయట అప్పులు చేసి బ్యాంకు రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తుండగా, మరికొందరు ఆస్తులు అమ్ముకుని అయినా కడతామని, తమ భూములు వేలం వేసి పరువు తీయద్దని వేడుకుంటున్నారు. -
జగన్ ఫ్లెక్సీలను తీసేసిన రేణిగుంట పోలీసులు
-
మహబూబాబాద్‌లో హైటెన్షన్.. కేటీఆర్ ఫ్లెక్సీలు చింపేసిన దుండగులు
సాక్షి,మహబూబాబాద్జిల్లా: లగచర్ల బాధితులకు మద్దతుగా మహబూబాబాద్ పట్టణంలో తహసిల్దార్ ఆఫీసు ఎదుట బీఆర్ఎస్ నేతలు సోమవారం(నవంబర్25) ధర్నా చేయనున్నారు. మహధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు ,ఎమ్మెల్సీలు,మాజీ ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.అయితే ధర్నా సందర్భంగా మహబూబాబాద్‌లో ఏర్పాటు చేసిన కేటీఆర్ ఫ్లైక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారు.ఫ్లెక్సీల రగడపై పోలీసులు ఆరా తీస్తున్నారు.మరోవైపు గో బ్యాక్ కేటీఆర్ అని పోస్టర్లు వెలిశాయి.దీంతో మహాధర్నాకు భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.ధర్నాలో ఏమి జరుగుతుందోనని స్థానికంగా టెన్షన్ నెలకొంది.ధర్నాను అడ్డుకొని తీరుతామని స్థానిక గిరిజనులు,కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్చరించారు.ఇదీ చదవండి: నేడు బీఆర్ఎస్ మహాధర్నా -
రిస్క్ తక్కువ.. రాబడులు స్థిరం
రిస్క్ పెద్దగా భరించలేని వారు, అదే సమయంలో ఈక్విటీ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయాలని భావించే వారు యూటీఐ ఫ్లెక్సీక్యాప్ ఫండ్‌ను పరిశీలించొచ్చు. దీర్ఘకాలంలో రాబడుల చరిత్ర స్థిరంగా ఉంది. గతంలో యూటీఐ ఈక్విటీ ఫండ్‌గా కొనసాగిన ఈ పథకం, 2017 అక్టోబర్‌లో సెబీ తీసుకొచ్చిన పునర్వ్యవస్థీకరణ నిబంధనల అనంతరం ఫ్లెక్సీక్యాప్గా మారింది.ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ విభాగాల్లో స్వేచ్ఛగా ఇన్వెస్ట్ చేయగలవు. మెరుగైన అవకాశాలున్న చోట ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు నిబంధనల పరంగా వెసులుబాటు ఉంటుంది. రిస్క్–రాబడుల సమతుల్యానికి ఈ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు ఈ పథకం 2008, 2011, 2020 కరెక్షన్ సమయాల్లో నష్టాలను పరిమితం చేయడాన్ని గమనించొచ్చు. ఐదేళ్లు, ఏడేళ్లు, పదేళ్ల కాలంలో చూస్తే సగటున మెరుగైన రాబడులు ఉన్నాయి. ఈ పథకం రాబడులకు ఎస్అండ్పీ నిఫ్టీ 500 సూచీ ప్రామాణికం. ఏడాది కాలంలో ఈ పథకం 24 శాతం మేర రాబడులు అందించింది. ఐదేళ్ల కాలంలో సగటున వార్షికంగా 16.47 శాతం రాబడులు ఇచ్చింది.ఏడేళ్ల కాలంలో ఏటా 14 శాతం, పదేళ్ల కాలంలో ఏటా 12.50 శాతం చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. పోటీ పథకాలతో పోల్చితే రాబడులు కొంత తక్కువగా కనిపించినప్పటికీ.. కరెక్షన్ సమయాల్లో నష్టాలను పరిమితం చేయడంలో ఈ పథకం మెరుగైన పనితీరు చూపిస్తోంది. రాబడుల చరిత్ర గొప్పగా లేకున్నా, దీర్ఘకాలానికి మెరుగ్గా ఉంది. స్థిరంగా తక్కువ ఆటుపోట్లతో ఉన్నందున రిస్క్ తక్కువ కోరుకునే వారికి మంచి ఎంపిక అవుతుంది. ముఖ్యంగా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేసుకుంటే మరింత మెరుగైన రాబడులు అందుకోవచ్చు. పెట్టుబడుల విధానం/ పోర్ట్‌ఫోలియో ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి రూ.27,706 కోట్ల పెట్టుబడులు (నిర్వహణ ఆస్తులు/ఏయూఎం) ఉన్నాయి. దీర్ఘకాల చరిత్ర ఉండడంతో పెద్ద పథకాల్లో ఒకటి కావడం గమనార్హం. నిర్వహణ ఆస్తుల్లో 96 శాతం మేర ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, 0.52 శాతం మేర డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టింది. 3.45 శాతం మేర నగదు నిల్వలు కలిగి ఉంది. ప్రస్తుత మార్కెట్ దిద్దుబాటులో ఆకర్షణీయ అవకాశాలకు వీలుగా నగదు నిల్వలు కలిగి ఉన్నట్టు అర్థమవుతోంది.ఈక్విటీ పెట్టుబడులు గమనించగా, 70 శాతం వరకు లార్జ్‌క్యాప్‌లో ఉంటే, మిడ్‌క్యాప్‌లో 28 శాతం, స్మాల్‌క్యాప్‌లో 2 శాతం వరకు పెట్టుబడులు పెట్టింది. టాప్–10 స్టాక్స్‌లోనే 42 శాతం మేర పెట్టుబడులు ఉన్నాయి. పెట్టుబడులను గమనించినట్టయితే.. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి ఎక్కువ వెయిటేజీ ఇస్తూ, 22 శాతం పెట్టుబడులను ఈ రంగాలకు చెందిన కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత టెక్నాలజీ కంపెనీలకు 22 శాతం, కన్జ్యూమర్ డిస్క్రీషినరీ రంగానికి 18 శాతం, హెల్త్‌కేర్ కంపెనీలకు 12 శాతం చొప్పున పెట్టుబడులు కేటాయించింది. -
కొడాలి నాని పుట్టిన రోజు.. ఫ్లెక్సీలను అడ్డుకున్న పోలీసులు
-
కాంగ్రెస్‌లో చిచ్చురేపిన దసరా ఫ్లెక్సీలు
గీసుకొండ: దసరా పండుగ సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ ధర్మారంలో శనివారం కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి వర్గీయుల మధ్య చిచ్చు రేపాయి. «కొండా అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కాంగ్రెస్‌కు చెందిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఫొటోలు లేకపోవడంతో రేవూరి వర్గం వారు ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ వివాదంపై రేవూరి వర్గం గీసుకొండ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కొండా వర్గం సైతం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అయితే వారిని పోలీస్‌స్టేషన్‌లోనే అదుపులోకి తీసుకుని బయటకు పంపడం లేదనే సమాచారం రావడంతో కొండా వర్గం కార్యకర్తలు, నాయకులు ధర్మారంలో ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి సురేఖ తమ వారిని విడిపించేందుకు ఆదివారం సాయంత్రం గీసుకొండ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. తమ కార్యకర్తలు ఫిర్యాదు చేయడానికి వస్తే, బంధించి బూట్లతో తన్నుతారా.. విచారణ చేయరా? అని ఆమె పోలీసు అధికారులను నిలదీశారు. ఎమ్మెల్యేకు తొత్తుగా వ్యవహరిస్తున్నారంటూ ఆమె ఆరోపించినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్లో సీఐ కురీ్చలో కూర్చుని ఆమె అధికారులతో వాదిస్తున్నట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంత్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన విషయం తెలిసిన సీపీ అంబర్ కిషోర్‌ఝా అక్కడికి వెళ్లి ఆమెతో మాట్లాడారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా రేవూరి వర్గీయుడు పిట్టల అనిల్‌పై దాడి చేసిన విషయంలో కొండా వర్గానికి చెందిన ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు గీసుకొండ పోలీసులు తెలిపారు. ఇందులో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఇద్దరు పరారీలో ఉన్నారు. కొండా వర్గీయుల నుంచి తనకు ప్రాణహాని ఉందని పిట్టల అనిల్ చేసిన వీడియో వైరల్ అయింది. -
ఒంగోలు: వాసన్నకు వరుస అవమానాలు!
ప్రకాశం, సాక్షి: జనసేనలో చేరకముందే ప్రత్యర్ధి వర్గం చేష్టలతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ చేరిక కూటమిలో ఇప్పటికే చిచ్చును రాజేయగా.. మరోవైపు బాలినేనికి భవిష్యత్తులో ‘రాజకీయ సహకారం’ అందడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ క్రమంలోనే ఫ్లెక్సీల రగడ కొనసాగుతోంది. తాజాగా.. నగరం అంతటా బాలినేని అభిమానులు కట్టిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించేయడం మళ్లీ చర్చనీయాంశమైంది. బాలినేని గురువారం అధికారికంగా జనసేనలో చేరాల్సి ఉంది. ఆయనకు స్వాగతం చెబుతూ.. ఆయన అభిమానులు నగరం అంతటా ఫ్లెక్సీలు వేశారు. కానీ, నిన్న రాత్రి వాటిని ఎవరో చించేశారు. మొన్న చర్చి సెంటర్లో.. ఈ మంగళవారం లాయరు పేటలో.. ఇలాగే బాలినేని వెల్కమ్ ఫ్లెక్సీలు చించివేయడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. గత శుక్రవారం రాత్రి నగరంలోని చర్చి సెంటర్ వద్ద బాలినేనిని జనసేనలోకి ఆహ్వానిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తెలుగు దేశం నాయకులు మున్సిపల్ సిబ్బంది సాయంతో తొలగించారు. ఆ ఫ్లెక్సీలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫొటో వేయడాన్ని తెలుగు యువత వ్యతిరేకించింది. మరోసారి ఇలాంటి ఫ్లెక్సీలు వేస్తే సహించేది లేదని హెచ్చరించింది. ఈ పరిణామం పెద్ద దుమారమే రేపింది. అయితే మంగళవారం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో దామచర్ల జనార్దన్ ఫొటో లేదు. కానీ.. చంద్రబాబు ఫొటో మాత్రం ముద్రించారు. వాటినీ ఎవరో చించేశారు. గత కొద్దిరోజులుగా టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, బాలినేని వర్గాల మధ్య వైరం కొనసాగుతోంది. ఇప్పుడు దామచర్ల వర్గీయులు జనసేనలోకి బాలినేని వెళ్లడాన్ని భరించలేకపోతున్నారు. మరోవైపు.. భవిష్యత్తులో జనసేనలోనూ బాలినేని వల్ల వర్గపోరు తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ ఫ్లెక్సీల చించివేత వ్యవహారాలపై ఇప్పటిదాకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతుండడం గమనార్హం. -
‘బాలినేని.. నిన్ను వదల’
ఒంగోలు టౌన్/టంగుటూరు: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను కలిసిన బాలినేని ఆ పారీ్టలో చేరేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఒంగోలు రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. మొదట్నుంచి ఉప్పు నిప్పులా ఉండే బాలినేని, దామచర్ల ఇప్పుడు ఒక కూటమిలో కత్తులు దూసుకుంటున్నారు. ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. శుక్రవారం బాలినేని అభిమానులు కొందరు నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదాన్ని మరింత రాజేశాయి. ఈ ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే దామచర్ల ఫొటో కూడా ముద్రించడం టీడీపీ శ్రేణులకు మింగుడు పడలేదు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసి వెంటనే వాటిని తొలగించడమే కాకుండా ఇలాంటి ఫ్లెక్సీలు మరోసారి వేస్తే ఊరుకునేది లేదని వారి్నంగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆలూ లేదు సూలు లేదు అన్నట్లు ఇంకా పారీ్టలో చేరక ముందే ఇలా ఉంటే రానురాను ఈ ఇరుపార్టీల మధ్య పరిస్థితి ఇంకెలా ఉండబోతుందో చూడాలి.ఏ పార్టీలోకి వెళ్లినా వదలను..: ఎమ్మెల్యే దామచర్ల బాలినేని వంటి అవినీతిపరుడిని ఏ పార్టీలోకి వెళ్లినా వదిలేదే లేదని, అతనిని, అతని కుమారుడిని చట్టపరంగా శిక్షిస్తామని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. టంగుటూరు మండలంలోని తూర్పునాయుడుపాలెం గ్రామంలో ఆదివారం నిర్వహించిన దామచర్ల ఆంజనేయులు 17వ వర్ధంతి సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ ‘‘గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు పోరాటం చేశాం, ఒంగోలులో టీడీపీ శ్రేణులు, నాపై బాలినేని 32 కేసులు పెట్టారు, మా నాయకుడు చంద్రబాబుని కూడా దూషించారు, అధికారం పోయి వంద రోజులు గడవక ముందే పార్టీ మారుతున్నారు. జనసేన పార్టీలో చేరకముందే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఏ పార్టీలోకి వెళ్లినా కేసుల్లో నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కొడుకు తప్పించుకోలేరు. గత ఐదేళ్లలో ఆయన చేసిన అక్రమాలను బయటకు తీస్తాం, వాటి నుంచి పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేరు. ఎన్నికల్లో కష్టపడి పని చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులకి అండగా ఉంటాం. పారీ్టలు మారే పరిస్థితి వస్తే మేము రాజకీయాలు కూడా మానుకుంటాం..’’ అని దామచర్ల జనార్దన్ అన్నారు. నేనెప్పుడూ కాంప్రమైజ్ కాను.. బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి ‘‘నేనెప్పటికీ కాంప్రమైజ్ కాను. జనసేన ఫ్లెక్సీలు ఎవరు వేశారో నాకు తెలియదు. ఆయన బొమ్మేశారని తీసేయమన్నాడంటా, సంతోషమే... ఆయన బొమ్మ వద్దంటే తీసేద్దాం’’ అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ నుంచి ఒంగోలు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేసిన కామెంట్స్‌పై వివరణ ఇచ్చారు. స్థానికంగా టీడీపీ ఎమ్మెల్యే ఉన్నాడని, జనసేన నాయకులకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అడిగానని, అంతకుమించి తానేమీ మాట్లాడలేదన్నారు. దానిమీద కూడా ఆయన అనవసరంగా ఏదేదో మాట్లాడుతున్నారని, ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. తాను జనసేనలోకి వెళ్లడం ఇష్టం లేకనే రెచ్చగొట్టేందుకు కావాలని ఆయన మాట్లాడుతున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా ఏం చేస్తాడో చూస్తానంటూ ఏదేదో మాట్లాడుతున్నాడని విన్నానని, అంతపనికి రాదు... ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ప్రశ్నించేందుకే జనసేన పార్టీ పెట్టానని పవన్ కళ్యాణ్ చెబుతున్నారని, ఇప్పుడు కూడా ఏదైనా తప్పులు జరిగితే తాను ప్రశి్నస్తానన్నారు. జనసేన పార్టీలో ఉన్న పాతవారిని, తనతో పాటు వస్తున్న వారిని కలుపుకొని జనసేన బలోపేతం కోసం కృషి చేస్తానని తెలిపారు. -
ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్తత.. గణేశ్ ఉత్సవ సమితి Vs పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ట్యాంక్‌బండ్ పై వినాయక నిమజ్జనం లేదంటూ పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, భారీ కేడ్లను భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నేతలు తొలగించారు. ట్యాంక్ బండ్ ఏర్పాటుచేసిన జాలీలను తొలగించిన సమితి నేతలు.. వినాయకుని నిమజ్జనం చేశారు.ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జనం అనేక సంవత్సరాలుగా జరుగుతుందని.. కొత్త రూల్స్ తీసుకువచ్చి భక్తుల మనోభావాలను ప్రభుత్వం, పోలీసులు దెబ్బతీస్తున్నారని ఉత్సవ సమితి నేతలు మండిపడుతున్నారు. 2022, 23లో కూడా ఇదే విధంగా చెప్పారు. కానీ చివరకు ట్యాంక్ బండ్లో గణేష్ నిమజ్జనాలు జరిగాయన్నారు.‘‘ప్రభుత్వం వెంటనే ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జన ఏర్పాట్లు ఈ రోజు మధ్యాహ్నం వరకు చేయాలి.. లేని పక్షంలో ఈ రోజు అన్ని వినాయక మండపాల నిర్వాహకులకు సమాచారం తెలియజేసి రేపు నగరా వ్యాప్తంగా ఆందోళన చేసి నగరాన్ని స్తంభింప చేస్తాం. ఎక్కడికక్కడ మండపాల్లో వినాయకులను అదే విధంగా ఉంచుతాం’’ అంటూ భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రాజావర్ధన్ రెడ్డి హెచ్చరించారు.ఇదీ చదవండి: గణేశ్ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు -
వాట్సాప్‌లో.. వైరల్ అవుతున్న నిజామాబాద్ షాప్ ఫ్లెక్సీ!
ఖలీల్‌వాడి: నగరంలోని ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఢిల్లీవాలా స్వీట్ హోంపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో విజయ్‌బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వీట్ హోమ్ వద్ద పార్కింగ్ సదుపా యం లేకపోవడంతో కొనుగోలుదారులు వాహనాలను రోడ్డుపైనే నిలుపుతూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారని పేర్కొన్నారు.ఆదివారం రోజున గాంధీచౌక్ నుంచి మమత సర్కిల్ వరకు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీసులతో స్వీట్‌హోం నిర్వాహకులు గొడవపడ్డారని, ఆ తరువాత పోలీసుల వేధింపుల కారణంగా స్వీట్హోంను మూసివేస్తున్నామని ఫ్లెక్సీ ఏర్పాటు చేసి న్యూసెన్స్ చేసినట్లు తెలిపారు. ఢిల్లీ వాలా స్వీట్ హోంపై బీఎన్ఎస్ కింద క్రైం నంబర్ 343/2024, యూ/ఎస్ 221, 224, 285 కింద కేసు నమోదు చేసి చర్యల నిమిత్తం సంబంధిత అధికారులకు నివేదిక పంపించినట్లు ప్రకటనలో తెలిపారు. ఢిల్లీవాలా స్వీట్ హోం వారు పోలీసులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారి ని శాఖ సిబ్బంది ఎటువంటి ఇబ్బందులకు గురి చేయలేదని పేర్కొన్నారు. -
సిద్దిపేటలో ఫ్లెక్సీ వార్
సాక్షి, సిద్దిపేట: కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య సిద్దిపేటలో మొదలైన ఫ్లెక్సీ వివాదం చినికిచినికి గాలివానలా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమాలు, సవాళ్లతో సిద్దిపేట శనివారం రణరంగంగా మారింది. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఇరుపార్టీలకు చెందిన నేతలను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీఆర్ఎస్ నిరసన ర్యాలీ: రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని ఆగస్టు 15 కల్లా పూర్తి చేసినందున ఎమ్మెల్యే పదవికి హరీశ్‌రావు రాజీనామా చేయాలంటూ సిద్దిపేటలో కాంగ్రెస్ కార్యకర్తలు పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిని తొలగించాలంటూ బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం రాత్రి నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించి, తెల్లవారుజామున వదిలి పెట్టారు. మరోవైపు శుక్రవారం అర్ధరాత్రి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అత్తు ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే హరీశ్ క్యాంప్ కార్యాలయంలోకి చొరబడ్డాయి.అక్కడ కేసీఆర్, హరీశ్‌రావు చిత్రాలతో ఉన్న ఫ్లెక్సీని చించేశాయి. దీంతో శనివారం సిద్దిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అక్కడి నుంచి పాత బస్టాండ్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీని నిర్వహించారు. హరీశ్ రాజీనామాను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని దగ్ధం చేశారు. తర్వాత బీజేఆర్ చౌరస్తాలో ఉన్న ఫ్లెక్సీలను బీఆర్ఎస్ నాయకులు చించివేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీలను ఝుళిపించారు. బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు.ర్యాలీగా కాంగ్రెస్: ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ ఫ్లెక్సీని ఏర్పాటు చేసేందుకు నియోజకవర్గ ఇన్చార్జి హరికృష్ణ కార్యాలయం నుంచి ర్యాలీగా బయల్దేరిన కాంగ్రెస్ శ్రేణులను బీజేఆర్ చౌరస్తాలో పోలీ సులు అడ్డుకున్నారు. పోలీసుల కన్నుగప్పి క్యాంప్ ఆఫీస్ వైపు చొచ్చుకొచ్చేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. క్యాంప్ ఆఫీస్ గేట్ వద్దకు చేరు కున్న కాంగ్రెస్ నాయకుడు మహేందర్‌పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయ డంతో పరిస్థితి చేయిదాటిపోతుందనే ఆందోళన నెలకొంది. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇరుపార్టీలు పరస్పర ఫిర్యాదులతో పోలీసులు కేసులు నమోదు చేశారు. -
రాజీనామా ఏది..? హరీశ్‌రావుపై వెలసిన ఫ్లెక్సీలు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావుపై హైదరాబాద్ నగరంలో శుక్రవారం(ఆగస్టు16) ఫ్లెక్సీలు వెలిశాయి. రుణమాఫీ అయిపోయే నీ రాజీనామా ఏడబోయే అంటూ ఫ్లెక్సీల్లో హరీశ్‌రావును ప్రశ్నించారు. ఫ్లెక్సీలపై కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అభిమానుల పేర్లున్నాయి. కాగా, ఆగస్టు 15 లోపు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని గతంలో హరీశ్‌రావు ప్రకటించారు. తుదివిడత రూ.2 లక్షల రుణమాఫీ నిధుల విడుదల సందర్భంగా హరీష్‌రావు రాజీనామా అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి గురువారం వైరా సభలో ప్రస్తావించారు. మొత్తం 3 విడతల్లో రూ. 2లక్షల వరకు రైతుల రుణాలను మాఫీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
కుక్కలకు మీ ఇంటి వద్దే భోజనం పెట్టండి
వెంగళరావునగర్: ‘వీధి కుక్కలకు మీ ఇంటి వద్దనే ఆహారాన్ని పెట్టండి మహాప్రబో.. రోడ్ల మీద పెట్టకండి.. కుక్కల నుంచి ప్రజల ప్రాణాలను రక్షించండి’అంటూ మధురానగర్ కాలనీలో స్థానికులు వినూత్నరీతిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల ఏర్పాటుకు గత ఏడాది నుంచి జరుగుతున్న కాలనీవాసుల ఆందోళనే ప్రధాన కారణం. దాదాపు ఏడాదిన్నర నుంచి కాలనీలో కుక్కల బెడద మరీ ఎక్కువగా ఉంది. శునకాలు పదుల సంఖ్యలో సంచరిస్తూ ఇప్పటికే 50 మందిపై దాడి చేసి గాయపర్చాయి. ఆందోళన చెందిన కాలనీవాసులు అసోసియేషన్‌కు మొర పెట్టుకున్నారు. కొందరు రోడ్ల మీదనే కుక్కలకు ఆహారాన్ని ఇవ్వడం వల్ల అవి కాలనీలో తిష్ట వేశాయని, కనిపించిన ప్రతి ఒక్కరిపై దాడి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇప్పటికే పోలీసుస్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయి. ప్రజల ఆవేదన దృష్టిలో పెట్టుకుని మధురానగర్‌కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ విధమైన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వీధి కుక్కలను తమ ఇంటి వద్దకు తీసుకెళ్ళి ఆహారాన్ని అందించినట్టయితే వాటికి కడుపు నిండుతుందని, కాలనీవాసులకు రక్షణ ఉంటుందని విజ్ఞప్తి చేస్తున్నట్టుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని అసోసియేషన్ నేతలు పేర్కొన్నారు. ఇప్పటికైనా కుక్కల ప్రేమికులు కాలనీవాసుల సమస్యను కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. పెంపుడు కుక్కలు వీధుల్లో మల విసర్జన చేస్తే తక్షణమే యజమానులు వాటిని తొలగించాలని కోరారు. కాలనీ వీధుల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చూసిన ప్రజలు అసోసియేషన్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు. -
రైతు భూమిలో బ్యాంకు ఫ్లెక్సీ!
సాక్షి, కామారెడ్డి/లింగంపేట: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నుంచి తీసుకున్న దీర్ఘకాలిక రుణాలు రికవరీ కాకపోవడంపై బ్యాంకు అధికారులు కఠిన చర్యలకు దిగుతున్నారు. తనఖా పెట్టిన భూములను వేలం వేస్తామంటూ ఆ భూముల్లో ఏకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని లింగంపేట మండలంలోని పోల్కంపేట, పర్మల్ల, శెట్పల్లి సంగారెడ్డి తదితర గ్రామాల రైతులు 2010 ప్రాంతంలో పెద్ద మొత్తంలో దీర్ఘకాలిక రుణాలు తీసుకున్నారు. కొందరు కొన్ని వాయిదాలు చెల్లించి మానుకోగా, మరికొందరు అసలే చెల్లించలేదు. కొందరు మాత్రం పూర్తిగా చెల్లించారు. అయితే భూమిని తనఖా పెట్టి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాల్సిందేనని బ్యాంకు అధికారులు కొన్నేళ్లుగా రైతులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ మేరకు పలుమార్లు నోటీసులిచ్చారు. భూములను వేలం వేస్తామని హెచ్చరించారు. అయితే అప్పులు తీసుకుని పది పదిహేనేళ్లు కావడంతో వడ్డీలు పెరిగిపోయాయి. అప్పట్లో రూ.5 లక్షలు అప్పు తీసుకుంటే ఇప్పుడది రూ.15 లక్షలు దాటింది. ఇంత పెద్ద మొత్తం చెల్లించడం రైతులకు భారంగా మారింది. వడ్డీ తగ్గించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా అప్పులు చెల్లించడం లేదంటూ బ్యాంకర్లు ప్రత్యక్ష చర్యలకు దిగుతున్నారు. పోల్కంపేటలో ఓ రైతు పొలంలో భూమిని వేలం వేస్తామంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో ఆ గ్రామానికి చెందిన రైతులంతా ఆందోళనకు గురవుతున్నారు. వడ్డీలు తగ్గిస్తే అప్పు తిరిగి చెల్లిస్తామని పేర్కొంటున్నారు. చట్ట ప్రకారమే వ్యవహరిస్తున్నాం బ్యాంకుకు భూమి తనఖా పెట్టి అప్పు తీసుకున్న రైతు తిరిగి చెల్లించకపోవడమే గాక, ఆ భూమిని అమ్ముకోవడం చట్టరీత్యా నేరం. బ్యాంకు తనఖాలో ఉన్న భూమిని ఎలా అమ్ముకుంటారు? ఆ భూమిపై బ్యాంకుకే హక్కు ఉంటుంది. లింగంపేట మండలంలో దాదాపు 7 వందల మంది రైతులు దీర్ఘకాలిక రుణాలు తీ సుకున్నారు. వారిలో చాలామంది అప్పులు తి రిగి చెల్లించలేదు. సహకార చట్టం ప్రకారం వా రందరికీ నోటీసులిచ్చాం. వారి ఆస్తులను జప్తు చేయడం, లేదా వేలం వేయడం జరుగుతుంది. – కుమారస్వామి, బ్రాంచి మేనేజర్, ఎన్డీసీసీబీ, లింగంపేట -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
కందుకూరు: చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపే ఫ్లెక్సీ కడుతూ విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందిన ఘటన శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా కందుకూరు మండలం మాచవరంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఇనకొల్లు గజపతి, అనూరాధ దంపతుల కుమారుడు నరసింహ (21) తోటి యువకులతో కలిసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ భారీ ఫ్లెక్సీ ఏర్పాటుకు సంకల్పించారు.తన ఇంటి సమీపంలో ఫ్లెక్సీ కట్టేందుకు యత్నిస్తుండగా, ఒక్కసారిగా పెద్ద గాలి వచ్చింది. దీంతో ఫ్లెక్సీ బ్యాలెన్స్ తప్పి పక్కనే వెళ్తున్న 11 కేవీ విద్యుత్ లైన్‌పై పడింది. ప్రమాదంలో ఫ్లెక్సీకి ఉన్న ఇనుప బోర్డుకు విద్యుత్ సరఫరా కావడంతో నరసింహ అక్కడికక్కడే మృతి చెందారు. చేతికి అందివచ్చిన కుమారుడు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. -
ఇదేనా ప్రజాస్వామ్యం!?
రాష్ట్రంలో టీడీపీ నేతలు, కార్యకర్తల దౌర్జన్యాలు రోజురోజుకూ మితిమీరి పోతున్నాయి. చంద్రబాబు, లోకేశ్ కనుసన్నల్లో ఇష్టానుసారం దాడులు చేస్తూ పేట్రేగిపోతున్నారు. అధికారంలోకి వచ్చింది వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను చితకబాదడానికే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఊరూరా ఆస్తుల ధ్వంసం, ప్రభుత్వ కార్యాలయాల బోర్డుల తొలగింపు, శిలాఫలకాల విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఎప్పుడో చరిత్ర పుస్తకాల్లో చదువుకున్న ఆటవిక రాజ్యాన్ని తలపిస్తూ పోటీపడి మరీ దాడులు చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ కార్యకర్త దుస్తులు విప్పి కొట్టడమే కాకుండా, లోకేశ్ ఫ్లెక్సీ ఎదుట మోకాళ్లపై కూర్చోబెట్టి బూతులు తిట్టారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కనకాద్రి పల్లెలో 50 ఇళ్లకు మంచి నీరు బంద్ చేశారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలో అర్చకత్వ బాధ్యతలు తమ వర్గీయులకు అప్పగించాలంటూ ఓ పూజారి ఇంటిపై దాడి చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ వర్గీయుల దాషీ్టకాలు ఊరూరా కనిపిస్తున్నాయి. సభ్య సమాజం ఏమనుకుంటుందనే విచక్షణ మరచి బరితెగింపుతో వ్యవహరిస్తున్నారు. మహిళలని కూడా చూడకుండా ఇళ్లలోకి చొరబడి కొడుతున్నారు. ఎక్కడో సినిమాల్లో కనిపించే ఇలాంటి దృశ్యాలు ఐదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో నిజ జీవితంలోనూ చోటుచేసుకోవడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం చోద్యం చూస్తుండటం దారుణం, దుర్మార్గం. పైగా కొన్ని చోట్ల వారే టీడీపీ కార్యకర్తలుగా మారి పూనకం వచ్చినట్లు ఊగిపోతుండటం గమనార్హం. ఏ తప్పూ చేయకపోయినా పల్నాడు జిల్లాలో ఊరు విడిచి వెళ్లాలని ఒక ఉప సర్పంచ్‌ను ఓ సీఐ తీవ్రంగా హెచ్చరించడం, బాధితుడు ఒత్తిడి తాళలేక ఆత్మహత్య చేసుకోవడం అరాచకానికి పరాకాష్ట. పరిస్థితి చూస్తుంటే రాష్ట్రం రావణ కాష్టం అవ్వాలన్నదే బాబు, లోకేశ్‌ల అభిమతంగా అనిపిస్తోంది. -
గాలి భానుప్రకాష్ అతి.. ఓట్ల లెక్కింపునకు ముందే..!
నగరి: నగరి నియోజకవర్గం పుత్తూరులో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓట్ల లెక్కింపు జరగముందే తానే ఎమ్మెల్యే అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేయించారు. కొందరు దీన్ని చూసి అంత తొందరేల భానూ.. అంటూ నవ్వుకున్నారు. ఇందంతా ఒక పథకం ప్రకా రం రెచ్చగొట్టడమేనని భావిస్తున్నారు. నేర చరిత కలిగిన వారిని జనంలోకి రప్పించడం.. గతంలో గంజాయి సరఫరా జరిగిందని ప్రచారం జరిగిన ప్రాంతంలో బ్యాడ్మింటన్ కోర్టు ప్రారంభించడం ఏంటని చర్చించుకుంటున్నారు. అది బ్యాడ్మింటన్ కోర్టు కాదు.. విధ్వంస కుట్రలకు కేంద్రంగా చేసుకున్నారని అనుమానిస్తున్నారు. ఇదంతా ఎన్నికల కమిషన్‌కు కనబడలేదా అని జనం ప్రశి్నస్తున్నారు.ఆలూ లేదు, చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది టీడీపీ నేతల పరిస్థితి. ఓట్ల లెక్కింపు జరగలేదు. గెలుస్తారో లేదో కూడా తెలియదు. నగరిలో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ ఎమ్మెల్యే అంటూ పుత్తూరు పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం హాస్యాస్పదంగా మారింది. ఇదేం విడ్డూరం అంటూ జనం నవ్వుకుంటున్నారు.బ్యాడ్మింటన్ కోర్టు ప్రారంభోత్సవంలో గాలి భానుప్రకాష్పుత్తూరు మున్సిపాలిటీ చింతలగుంటలో గతంలో బీఎస్ జిమ్ నిర్వహించేవారు. ఏడాది క్రితం ఈ జిమ్ నిర్వాహకుడు టీడీపీ నేత హరి విశాఖపట్నం అరకు వద్ద గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఆ తర్వాత ఆ జిమ్ నిరుపయోగంగా మారింది. ఈ జిమ్ నుంచే గంజాయి సరఫరా జరిగేదంటూ అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అనంతరం ప్రచారాల్లోను, పలు కార్యక్రమాల్లోను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్తో పాటు గంజాయి స్మగ్లర్, అతని అనుచరులు పాల్గొనడం అప్పట్లో వివాదాస్పదమైంది. వివాదాలకు చిరునామాగా ఉన్న వీరంతా తాజాగా మరో వివాదానికి తెరతీశారు. నిరుపయోగంగా ఉన్న జిమ్‌ను బ్యాడ్మింటన్ కోర్టుగా మార్చి ఎన్ని కల కోడ్ ఉండగానే టీడీపీ అభ్యరి్థతో ప్రారం¿ోత్సవం చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో భానుప్రకాష్ ఎమ్మెల్యే, నగరి అంటూ ముద్రించి ప్రదర్శనగా ఉంచారు.కోడ్ వర్తించదా? ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్న టీడీపీ నాయకులకు ఎన్నికల నిబంధనలు వర్తించవా అంటూ నగరి నియోజకవర్గ ప్రజలు ప్రశి్నస్తున్నారు. బహిరంగంగా ఒక అభ్యర్థి ఎమ్మెల్యే అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి ప్రారం¿ోవాలు చేస్తుంటే వారిపై చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.రెచ్చగొట్టి విధ్వంసాలకు పాల్పడేందుకేనా?ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే పుత్తూరు టీడీపీ నాయకుల దుశ్చర్యను చూసి వైఎస్సార్సీపీ నాయకులు, స్థానిక ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. రాజకీయ పారీ్టలను రెచ్చగొట్టి.. గొడవలు సృష్టించి విధ్వంసాలకు పాల్పడేందుకే పథకం వేశారని స్థానికులు భయపడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించేందుకే నేరచరిత కలిగిన వారిని టీడీపీ నాయకులు జనంలోకి తీసుకొస్తున్నట్టు సమాచారం. -
లోకేష్, బాబు ఫ్లెక్సీలు చించేసిన టీడీపీ క్యాడర్
-
కూటమిలో క్రోధాగ్ని నిరసనల భగభగలు
సాక్షి, రాజమహేంద్రవరం/నూజివీడు/కాళ్ల: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో కుమ్ములాటల పర్వం కొనసాగుతోంది. తెలుగు సంవత్సరాది వేళా నిరసనల సెగ చల్లారలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి స్వపక్ష శ్రేణుల్లోనే విభేదాల అగ్గి రాజేస్తోంది. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలోని ద్వారకామాయి ఫంక్షన్ హాలులో సోమవారం రాత్రి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సమన్వయ సమావేశం రసాభాసగా మారింది. రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన తరువాత తొలిసారి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పురందేశ్వరి పాల్గొన్నారు. సభా వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, పురందేశ్వరి, కూటమి రాజానగరం నియోజకవర్గ అభ్యర్థి, జనసేన నేత బత్తుల బలరామకృష్ణ ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీనిలో టీడీపీ రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జి బొడ్డు వెంకట రమణ చౌదరి ఫొటో లేకపోవడంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ కోసం సీటు త్యాగం చేసిన నేత ఫొటో ఎందుకు పెట్టలేదని పురందేశ్వరిని నిలదీస్తూ ఆ ఫ్లెక్సీని చించి పారేశారు. ఫ్లెక్సీలో ఉన్న మోదీ ఫొటోనూ చించివేస్తున్నా వారిని వారించేందుకు పురందేశ్వరి కనీసం యత్నించకపోగా, చిరునవ్వులు చిందిస్తూ అలాగే వేదికపై కూర్చోవడం విమర్శలకు దారి తీసింది. ఆమె తీరుపై బీజేపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ శ్రేణుల నిరసనల నేపథ్యంలో ఫంక్షన్ హాలు నుంచి ఆమె మెల్లగా జారుకున్నారు. సాధారణంగా పార్టీ అగ్రనేతల ఫొటోలు, ఫ్లెక్సీలను ఎవరైనా చించితే నాయకులు, కార్యకర్తలు సహించలేరు. కానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వైఖరి ఇందుకు భిన్నంగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ► పశ్చిమగోదావరి జిల్లా ఉండి సీటు మార్చే యోచనలో టీడీపీ అధిష్టానం ఉండటంతో ఎమ్మెల్యే మంతెన రామరాజు భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. కాళ్ల మండలం పెదఅమిరం నిర్మలాదేవి ఫంక్షన్ హాలులో మంగళవారం నిర్వహించిన టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. సమావేశంలో టీడీపీ నాయకులు స్పందిస్తూ.. ఉండి అభ్యర్థిని మారిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాజీనామాలకూ వెనుకాడబోమని స్పష్టం చేశారు. సమావేశానికి పార్టీ పరిశీలకుడిగా వచ్చిన ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు సమక్షంలోనే వారు ఈ విషయాన్ని తేల్చిచెప్పడం గమనార్హం. ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ.. తన సీటును వదులుకోవడానికి సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. ఏ తప్పూ చేయకుండా త్యాగానికి సిద్ధం కావాలనడం న్యాయం కాదని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్నీ విధిగా చేయడం తన తప్పా అని ప్రశ్నించారు. కార్యకర్తల నిర్ణయమే తనకు శిరో«దార్యమని, వేరే వ్యక్తికి సీటు కేటాయిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పార్టీ నేతల అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళతానని గన్ని వీరాంజనేయులు చెప్పారు. తొలి నుంచీ పురందేశ్వరికి చుక్కెదురు వాస్తవానికి ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన పురందేశ్వరికి మొదటి నుంచీ ఇక్కడ చుక్కెదురవుతూనే ఉంది. రాజమహేంద్రవరం వచ్చిన వెంటనే ఆమె స్థానిక బీజేపీ నాయకులను కలుపుకొని వెళ్లాల్సింది పోయి.. వేరుకుంపటి పెట్టారు. పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును పూర్తిగా పక్కన పెట్టారు. ఈ పరిణామం సోము వర్గంతోపాటు పార్టీ శ్రేణులను దూరం చేసింది. దీంతో సభలు, సమావేశాల్లో ఆమెకు నిరసనల సెగ ఎదురవుతూనే ఉంది. అనపర్తి ఎమ్మెల్యే టికెట్‌ను తొలుత టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కేటాయించి.. పొత్తు అనంతరం బీజేపీకి ఇవ్వడంపైనా టీడీపీ వర్గాల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. అక్కడ ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి, స్థానిక బీజేపీ నాయకులను వ్యతిరేకిస్తూ రామకృష్ణారెడ్డి స్వతంత్రంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయినా పురందేశ్వరి పెదవి విప్పకపోవడంపై ఆమె టీడీపీకి లాభం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఫ్లెక్సీలో ప్రధాని మోదీ ఫొటో చించుతున్నా స్పందించకపోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తోందని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. -
దీర్ఘకాలంలో నమ్మకమైన లాభాలనిచ్చే ఫండ్.. ఓ లుక్కేయండి..
లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ వేల్యుయేషన్లను అర్థం చేసుకోవడం సాధారణ ఇన్వెస్టర్లకు కష్టమైన విషయమే. భవిష్యత్తులో వీటిల్లో ఏ విభాగం, మిగిలిన విభాగాలతో పోలిస్తే మంచి పనితీరు చూపిస్తుందని ముందుగా గుర్తించడం కూడా కష్టమే. గత 15 ఏళ్ల కాలంలో లార్జ్‌క్యాప్ ఇండెక్స్ నాలుగేళ్ల కాలంలో మంచి పనితీరు చూపించగా, మిడ్‌క్యాప్ ఇండెక్స్ కూడా నాలుగు సంవత్సరాలలో మంచి పనితీరు ప్రదర్శించింది. కానీ, స్మాల్‌క్యాప్ మాత్రం ఏడేళ్లలో మంచి పనితీరు చూపించింది. కనుక ప్రతీ విభాగంలోనూ ఇన్వెస్టర్ దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా రాబడులు ఆర్జించడానికి మంచి అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. ఇలా లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ విభాగాల్లో పెట్టుబడులు పెట్టి మంచి రాబడులు ఇచ్చేవే ఫ్లెక్సీక్యాప్, మలీ్టక్యాప్ ఫండ్స్. ఈ విభాగంలో ఎంతో కాలంగా పనిచేస్తూ, మంచి పనితీరు చూపుతున్న పథకాల్లో హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ గురించి తప్పకుండా చెప్పుకోవాలి. రాబడులు ఈ పథకం ఏ కాలంలో చూసినా కానీ, బెంచ్ మార్క్ అయిన బీఎస్ఈ 500 టీఆర్ఐ కంటే మెరుగైన పనితీరు చూపించింది. గడిచిన ఏడాది కాలంలో 37.58 శాతం రాబడిని ఇన్వెస్టర్లకు తెచ్చి పెట్టింది. మూడేళ్లలో కాలంలో వార్షిక రాబడి 24.27 శాతంగా ఉంది. ఇక ఐదేళ్ల కాలంలో 19.40 శాతం, ఏడేళ్లలో 16.44 శాతం, పదేళ్లలో 17.13 శాతం చొప్పున వార్షిక రాబడి ఈ పథకంలో భాగంగా ఉంది. ఫ్లెక్సీక్యాప్ విభాగం సగటు రాబడితో పోల్చి చూస్తే, ఈ పథకమే 3 శాతం నుంచి 8 శాతం మేర అధిక రాబడిని వివిధ కాలాల్లో అందించినట్టు తెలుస్తోంది. ఇక బీఎస్ఈ 500 టీఆర్ఐతో చూసినా కానీ, ఈ పథకంలోనే 1–6 శాతం మేర వివిధ కాలాల్లో అధిక రాబడి కనిపిస్తుంది. ఈ పథకం 1995 జనవరి 1న ప్రారంభమైంది. గతంలో హెచ్డీఎఫ్సీ ఈక్విటీ ఫండ్ కాగా, అనంతరం ఫ్లెక్సీక్యాప్గా మారింది. ఆరంభం నుంచి వార్షిక రాబడి 19 శాతం మేర ఉండడం గమనించొచ్చు. పెట్టుబడుల విధానం/ఫోర్ట్‌ఫోలియో హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీక్యాప్ ఫండ్‌కు దేశ ఈక్విటీ మార్కెట్లో సుదీర్ఘ ట్రాక్ రికార్డు ఉండడం గమనార్హం. తొలుత రూ.52 కోట్లతో ఆరంభమైన ఈ పథకంలో ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఈ ఏడాది జనవరి చివరికి రూ.47,642 కోట్లుగా ఉన్నాయి. ప్రతి మార్కెట్ సైకిల్లో మంచి పనితీరు చూపించే అవకాశం ఉన్న రంగాలు, కంపెనీలను గుర్తించి ఇన్వెస్ట్ చేయడం ఈ పథకం ప్రత్యేకత. ప్రస్తుతం ఈ పథకం తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 87.5 శాతమే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. డెట్ సాధనాల్లో 0.42 శాతం పెట్టుబడులు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ సాధనాల్లోనూ 3.79 శాతం మేర ఇన్వెస్ట్ చేసింది. నగదు, నగదు సమానాల రూపంలో 8.29 శాతం పెట్టుబడులు ఉన్నాయి. ఈక్విటీల్లో 91 శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్ కంపెనీలకే కేటాయించింది. మిడ్‌క్యాప్ కంపెనీల్లో 7.61 శాతం, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 1.52 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. పోర్ట్‌ఫోలియోలో 41 స్టాక్స్ ఉన్నాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లో 32 శాతం పెట్టుబడులు పెట్టింది. హెల్త్‌కేర్ కంపెనీలకు 12.59 శాతం, టెక్నాల జీ కంపెనీలకు 9.5 శాతం, క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు 7.39 శాతం చొప్పున కేటాయించింది. -
టీడీపీలో ఫ్లెక్సీల లొల్లి
కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు టీడీపీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ తన పుట్టిన రోజును వేదికగా చేసుకుని నియోజకవర్గవ్యాప్తంగా గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఫ్లెక్సీల్లో జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నట్లు వ్యక్తుల పేర్లు కాకుండా గ్రామ టీడీపీ అని పేర్కొనడం వివాదానికి కారణమైంది. నియోజకవర్గ టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న పెండ్యాల అచి్చబాబు స్వగ్రామమైన దొమ్మేరులో ఆయన ఫొటో లేకుండా ఈ తరహా ఫ్లెక్సీల ఏర్పాటును ఆ పార్టీ స్థానిక నాయకులు తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో అచ్చిబాబు వర్గీయులు శుక్రవారం గ్రామంలో సమావేశమై మరీ జవహర్‌పై బహిరంగ విమర్శలకు దిగారు. గ్రామ కమిటీ, స్థానిక నాయకుల ప్రమేయం లేకుండా ‘దొమ్మేరు టీడీపీ’ అని పేర్కొంటూ తమ గ్రామంలో ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేస్తారని, ఇది జవహర్ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. పార్టీని రెండు గ్రూపులుగా చేసేందుకు ఆయన ప్రయతి్నస్తున్నారని సీనియర్ నాయకుడు, ఎంపీటీసీ సభ్యుడు యలమర్తి శ్రీరామచంద్రమూర్తి (రాంబాబు)మండిపడ్డారు. దొమ్మేరు గ్రామ కమిటీని సంప్రదించకుండా ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అచి్చబాబు చెప్పినట్లే నడుస్తాం తప్ప, జవహర్ చెప్పినట్లు కాదని స్పష్టం చేశారు. సీనియర్ నాయకుడు కేవీకే రంగారావు, ఉప సర్పంచ్ కలగర సుబ్బారావు, టీడీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కొక్కిరిపాటి శ్రీహరి కూడా జవహర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పారీ్టకి, ఆ ఫ్లెక్సీలకు ఎటువంటి సంబంధమూ లేదని ప్రకటించారు. గతంలో అచ్చిబాబు చెబితేనే జవహర్‌కు 13 రోజుల ముందు టికెట్ ఇచ్చినా ఎమ్మెల్యేగా గెలిపించామని అన్నారు. దొమ్మేరులో జవహర్‌కు మద్దతుదారులు లేరని ప్రకటించారు. అందువల్లే సొంతంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారన్నారని అన్నారు. కొవ్వూరులో శుక్రవారం జరిగిన జవహర్ పుట్టిన రోజు వేడుకలకు సైతం అచి్చబాబు వర్గీయులు దూరంగానే ఉన్నారు. ఇటీవల అభ్యర్థుల ఖరారులో భాగంగా అధిష్టానం నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో కూడా జవహర్ పేరు ప్రస్తావించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజా వివాదానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎనిమిదేళ్లుగా..: జవహర్, అచ్చిబాబు వర్గాల మధ్య ఏడెనిమిదేళ్లుగా వివాదం నడుస్తోంది. దీంతో నియోజకవర్గంలో టీడీపీ రెండు గ్రూపులుగా పనిచేస్తోంది. గతంలో అచి్చబాబు వర్గం వ్యతిరేకించినందునే జవహర్‌ను అధిష్టానం కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గానికి పంపింది. అక్కడ ఓటమి చవిచూసిన ఆయన మళ్లీ కొవ్వూరుపై దృష్టి సారించారు. పేరుకు జిల్లా అధ్యక్షుడి పదవి కట్టబెట్టినప్పటికీ కొవ్వూరు నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని అధిష్టానం షరతు విధించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.