లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ వేల్యుయేషన్లను అర్థం చేసుకోవడం సాధారణ ఇన్వెస్టర్లకు కష్టమైన విషయమే. భవిష్యత్తులో వీటిల్లో ఏ విభాగం, మిగిలిన విభాగాలతో పోలిస్తే మంచి పనితీరు చూపిస్తుందని ముందుగా గుర్తించడం కూడా కష్టమే. గత 15 ఏళ్ల కాలంలో లార్జ్‌క్యాప్ ఇండెక్స్ నాలుగేళ్ల కాలంలో మంచి పనితీరు చూపించగా, మిడ్‌క్యాప్ ఇండెక్స్ కూడా నాలుగు సంవత్సరాలలో మంచి పనితీరు ప్రదర్శించింది.
కానీ, స్మాల్‌క్యాప్ మాత్రం ఏడేళ్లలో మంచి పనితీరు చూపించింది. కనుక ప్రతీ విభాగంలోనూ ఇన్వెస్టర్ దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా రాబడులు ఆర్జించడానికి మంచి అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. ఇలా లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ విభాగాల్లో పెట్టుబడులు పెట్టి మంచి రాబడులు ఇచ్చేవే ఫ్లెక్సీక్యాప్, మలీ్టక్యాప్ ఫండ్స్. ఈ విభాగంలో ఎంతో కాలంగా పనిచేస్తూ, మంచి పనితీరు చూపుతున్న పథకాల్లో హెచ్‌డీఎఫ్‌సీ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ గురించి తప్పకుండా చెప్పుకోవాలి.
రాబడులు
ఈ పథకం ఏ కాలంలో చూసినా కానీ, బెంచ్ మార్క్ అయిన బీఎస్‌ఈ 500 టీఆర్‌ఐ కంటే మెరుగైన పనితీరు చూపించింది. గడిచిన ఏడాది కాలంలో 37.58 శాతం రాబడిని ఇన్వెస్టర్లకు తెచ్చి పెట్టింది. మూడేళ్లలో కాలంలో వార్షిక రాబడి 24.27 శాతంగా ఉంది. ఇక ఐదేళ్ల కాలంలో 19.40 శాతం, ఏడేళ్లలో 16.44 శాతం, పదేళ్లలో 17.13 శాతం చొప్పున వార్షిక రాబడి ఈ పథకంలో భాగంగా ఉంది.
ఫ్లెక్సీక్యాప్ విభాగం సగటు రాబడితో పోల్చి చూస్తే, ఈ పథకమే 3 శాతం నుంచి 8 శాతం మేర అధిక రాబడిని వివిధ కాలాల్లో అందించినట్టు తెలుస్తోంది. ఇక బీఎస్‌ఈ 500 టీఆర్‌ఐతో చూసినా కానీ, ఈ పథకంలోనే 1–6 శాతం మేర వివిధ కాలాల్లో అధిక రాబడి కనిపిస్తుంది. ఈ పథకం 1995 జనవరి 1న ప్రారంభమైంది. గతంలో హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ ఫండ్ కాగా, అనంతరం ఫ్లెక్సీక్యాప్‌గా మారింది. ఆరంభం నుంచి వార్షిక రాబడి 19 శాతం మేర ఉండడం గమనించొచ్చు.
పెట్టుబడుల విధానం/ఫోర్ట్‌ఫోలియో
హెచ్‌డీఎఫ్‌సీ ఫ్లెక్సీక్యాప్ ఫండ్‌కు దేశ ఈక్విటీ మార్కెట్లో సుదీర్ఘ ట్రాక్ రికార్డు ఉండడం గమనార్హం. తొలుత రూ.52 కోట్లతో ఆరంభమైన ఈ పథకంలో ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఈ ఏడాది జనవరి చివరికి రూ.47,642 కోట్లుగా ఉన్నాయి. ప్రతి మార్కెట్ సైకిల్‌లో మంచి పనితీరు చూపించే అవకాశం ఉన్న రంగాలు, కంపెనీలను గుర్తించి ఇన్వెస్ట్ చేయడం ఈ పథకం ప్రత్యేకత. ప్రస్తుతం ఈ పథకం తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 87.5 శాతమే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. డెట్ సాధనాల్లో 0.42 శాతం పెట్టుబడులు ఉన్నాయి.
రియల్ ఎస్టేట్ సాధనాల్లోనూ 3.79 శాతం మేర ఇన్వెస్ట్ చేసింది. నగదు, నగదు సమానాల రూపంలో 8.29 శాతం పెట్టుబడులు ఉన్నాయి. ఈక్విటీల్లో 91 శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్ కంపెనీలకే కేటాయించింది. మిడ్‌క్యాప్ కంపెనీల్లో 7.61 శాతం, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 1.52 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. పోర్ట్‌ఫోలియోలో 41 స్టాక్స్ ఉన్నాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లో 32 శాతం పెట్టుబడులు పెట్టింది. హెల్త్‌కేర్ కంపెనీలకు 12.59 శాతం, టెక్నాల జీ కంపెనీలకు 9.5 శాతం, క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు 7.39 శాతం చొప్పున కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment