review
-
ప్రపంచ క్రికెట్ క్రీడాభిమానులకు కనువిందైన కానుక
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్తాన్(The Greatest Rivalry: India vs Pakistan) సిరీస్ ఒకటి. ఈ సిరీస్ గురించి తెలుసుకుందాం.భారతదేశంలో సినిమా తరువాత ఏది ఇష్టం అంటే సగటు భారతీయుడు ఠక్కున చెప్పేది క్రికెట్ అనే. నాటి రేడియో రోజుల నుండి నేటి డిజిటల్ ప్రొజెక్షన్ రోజుల వరకు ఎదుగుతున్న సాంకేతికత కన్నా మెరుపు వేగంలో ఎదుగుతోంది ఈ క్రికెట్ అభిమానం. మరీ ముఖ్యంగా ఇండియా– పాకిస్తాన్ మ్యాచ్ అంటే దేశం మొత్తానికి ఆ రోజు అప్రకటిత సెలవు లాంటిది. దాయాదుల పోరు అని చాలామంది ముద్దుగా పిలుచుకునే ఈ మ్యాచ్ ఎప్పుడు ఎక్కడ జరిగినా ప్రపంచం నలుమూలల నుండి ఆకాశమంత ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలోనే నెట్‌ఫ్లిక్స్ ఇరు దేశాల క్రికెట్ ఆటపై ‘ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్తాన్’ అనే సిరీస్ రూపొందించింది. నాలుగు భాగాలతో ఉన్న ఈ సిరీస్‌లో భారతదేశం సాధించిన నాటి ప్రపంచ కప్ నుండి నేటి ప్రపంచ కప్ వరకు ప్రతిదీ విశ్లేషించిన ప్రయత్నం అత్యంత ప్రశంసనీయం. సిరీస్‌లో పత్రికా విలేకరుల నుండి పరోక్ష, ప్రత్యక్ష ఆటగాళ్లతో వివరించిన విధానం ఓ అద్భుతమనే చెప్పాలి. ఈ సిరీస్ ద్వారా ప్రపంచ క్రికెట్ క్రీడాభిమానులకు ఎన్నో వివరణలు, విశ్లేషణలు, రహస్యాలు దృశ్య రూపంలో అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం ఇండియా– పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే ఎంత ఉత్కంఠగా ఉంటుందో అంతకు వేయి రెట్లు ఉత్కంఠ, ఉత్సాహం ఈ సిరీస్ చూస్తున్నంతసేపు ప్రేక్షకులకు కలుగుతుందనడంలో సందేహమే లేదు.క్రికెట్ మ్యాచ్ టీవీలలో ప్రసారమనేది మామూలే కానీ, అదే క్రికెట్ వెనుక జరిగిన తతంగం చూపడమనేది వంద క్రికెట్ మ్యాచులు ఒకేసారి చూడడం లాంటిది. ఓటీటీ వేదికైన నెట్‌ఫ్లిక్స్ ఈ విషయంలో మాత్రం ప్రేక్షకుల నాడి సరిగ్గా పట్టుకుంది. ఈ సిరీస్ మొత్తం తెలుగులోనూ లభ్యం. కాబట్టి కాసేపు ఈ క్రికెట్ రైవల్రీ ఏంటో చూసేయండి. – ఇంటూరు హరికృష్ణ -
దీర్ఘకాలంలో స్థిరమైన రాబడి..
దీర్ఘకాల లక్ష్యాలకు సంబంధించి పెట్టుబడుల్లో ఈక్విటీలకు (Equity Fund) కచ్చితంగా చోటు కల్పించుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. ఎందుకంటే ఇతర సాధనాలతో పోల్చితే ఈక్విటీలు దీర్ఘకాలంలో మెరుగైన రాబడిని ఇచ్చినట్టు చారిత్రక డేటా తెలియజేస్తోంది. ద్రవ్యోల్బణమే సగటున 5–6 శాతం స్థాయిలో ఉంటోంది. ఇంతకుమించిన రాబడిని సంపాదించుకున్నప్పుడే అసలైన సంపద వృద్ధి సాధ్యపడుతుంది. అందుకు ఈక్విటీలు అవకాశం కల్పిస్తాయి. ఈక్విటీల్లోనూ పన్ను ఆదా ప్రయోజనం కోరుకునే వారు ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈ విభాగంలో దీర్ఘకాల చరిత్ర కలిగిన పథకాల్లో ఎస్బీఐ లాంగ్‌టర్మ్ ఈక్విటీ ఫండ్ (SBI Long Term Equity Fund) ఒకటి.రాబడులు ఈ పథకంలో ఏడాది కాల రాబడి 14 శాతంగా ఉంది. అదే మూడేళ్లలో చూసుకుంటే వార్షికంగా 23 శాతం చొప్పున రాబడిని తెచ్చిపెట్టింది. ఐదేళ్లలోనూ ఏటా 23 శాతం రాబడి ఈ పథకంలో గమనించొచ్చు. ఏడేళ్లలో ఏటా 16 శాతం, పదేళ్లలో 14 శాతం చొప్పున పెట్టుబడులపై ఇన్వెస్టర్లకు ప్రతిఫలాన్ని అందించింది. ఎల్ఎస్ఎస్ విభాగం సగటు రాబడితో పోల్చి చూసినప్పుడు ఈ పథకంలోనే మెరుగైన రాబడి కనిపిస్తోంది. వివిధ కాలాల్లో 1–8 శాతం మధ్య అధిక రాబడిని ఈ పథకమే అందించింది. అంతేకాదు బీఎస్ఈ 500 టీఆర్ఐ కంటే కూడా ఈ పథకమే మెరుగైన పనితీరు నమోదు చేసింది.1993 మార్చి 31న ఈ పథకం ఆరంభం కాగా, అప్పటి నుంచి చూస్తే వార్షిక రాబడి 16.99 శాతంగా ఉండడం గమనార్హం. ఈ పథకంలో మొదటిసారి రూ.10,000 లంప్సమ్ ఇన్వెస్ట్ చేసి, ఆ తర్వాత నుంచి ప్రతి నెలా రూ.2,000 చొప్పున సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో గడిచిన ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేసి ఉంటే.. మొత్తం పెట్టుబడి రూ.1.30 లక్షలు కాగా, రాబడులతో కలసి అది ఇప్పుడు రూ.2,54,592గా మారి ఉండేది. అంటే ఐదేళ్లలో పెట్టుబడి దాదాపు వృద్ధిని చూసి ఉండేది. అదే డెట్ సాధనం అయిన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లో పెట్టుబడి రెట్టింపునకు ప్రస్తుతమున్న 7.7% రేటు ఆధారంగా 10 ఏళ్ల 4 నెలలు పడుతుంది. పెట్టుడుల విధానం/ పోర్ట్‌ఫోలియో ఈ పథకంలో పెట్టుబడిని ఆదాయపన్ను పాత విధానంలో సెక్షన్ 80సీ పరిధిలో చూపించుకుని రూ.1.5 లక్షల మొత్తంపై పన్ను మినహాయింపు ప్రయోజనం పొందొచ్చు. ఈ పథకంలో పెట్టుబడికి మూడేళ్ల లాకిన్ ఉంటుంది. ఆ తర్వాతే పెట్టుబడిని వెనక్కి తీసుకోవడానికి అనుమతిస్తారు. పన్ను ఆదాతోపాటు పెట్టుబడుల వృద్ధి ప్రయోజనం ఈ పథకంతో లభిస్తుంది. పెట్టుబడుల్లో వైవిధ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది.కాంపౌండింగ్‌తో దీర్ఘకాలంలో పెట్టుబడి మెరుగైన వృద్ధికి నోచుకుంటుంది. ఈ పథకం నిర్వహణలో రూ.27,791 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 90 శాతం మేర ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. డెట్‌లో కేవలం 0.14 శాతమే పెట్టుబడి ఉంది. మిగిలిన 9.6 శాతం నగదు, నగదు సమానాల్లో కలిగి ఉంది. స్టాక్స్ విలువలు గరిష్టానికి చేరిన నేపథ్యంలో మెరుగైన పెట్టుబడి అవకాశాల కోసం నగదు నిల్వలు నిర్వహిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈక్విటీల్లోనూ 76 శాతం పెట్టుబడులు లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్ కంపెనీలకు 16.44 శాతం, స్మాల్‌క్యాప్ కంపెనీలకు 7.84 శాతం వరకు కేటాయింపులు చేసింది. అత్యధికంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లో 26 శాతం, టెక్నాలజీ కంపెనీల్లో 14.51 శాతం, ఎనర్జీ, యుటిలిటీ కంపెనీల్లో 12.47 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. -
సాయిరామ్ శంకర్ సస్పెన్స్ థ్రిల్లర్ రివ్యూ.. ఎలా ఉందంటే?
పూరి జగన్నాథ్ తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసిన హీరో సాయిరాం శంకర్. 143, బంపర్ ఆఫర్ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా గ్యాప్ ఇచ్చిన ఈ ఏడాది ఒక పథకం ప్రకారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మలయాళంలో సినిమాలు చేసిన వినోద్ విజయన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రిలీజ్‌కు ముందే విలన్ ఎవరో కనిపెడితే పదివేలు ఇస్తామని మూవీ టీమ్ ప్రకటించడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ సినిమా మీద పడింది. ఇవాళ థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.ఒక పథకం ప్రకారం కథేంటంటే..ఈ కథ మొత్తం 2014 విశాఖపట్నంలో జరుగుతూ ఉంటుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిద్ధార్థ నీలకంఠ (సాయిరాం శంకర్) భార్య సీత (ఆషిమా నర్వాల్) షాపింగ్ కి వెళ్లగా అక్కడ భార్య మిస్ అవుతుంది. ఆమె ఏమైందో తెలియక ఇబ్బంది పడుతున్న సిద్ధార్థ డ్రగ్స్‌కు బానిస అవుతాడు. అయితే సిద్ధార్థతో కలిసి డ్రగ్స్ తీసుకునే దివ్య(భాను శ్రీ) అనూహ్యంగా దారుణమైన స్థితిలో హత్యకు గురవుతుంది. ఈ కేసు విచారణలో ఏసిపి రఘురాం(సముద్రఖని), సిద్ధార్థ ఈ మర్డర్ చేశాడని భావించి అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడితే డ్రగ్స్ కేసు కారణంగా సస్పెండ్ కావడంతో ఆ స్థానంలో ప్రాసిక్యూటర్‌గా రావాలని ప్రయత్నించే చినబాబు (కళాభవన్ మణి) కూడా సిద్ధార్థని ఇరికించే ప్రయత్నం చేస్తాడు. అయితే తాను స్వతహాగా లాయర్ కావడంతో తాను హత్య చేయలేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తాడు సిద్ధార్థ్. తర్వాత ఇదే క్రమంలో అనేక హత్యలు జరుగుతున్నాయని తెలుసుకుని అసలు ఈ హత్యలకు కారణం ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో అతనికి ఏసీపీ కవిత(శృతి సోది) కూడా సహకరిస్తుంది. అసలు వరుస హత్యలు చేసేది ఎవరు? ఆ హత్యలకు సిద్ధార్థకి ఏమైనా సంబంధం ఉందా? సిద్ధార్థ్‌ను మాత్రమే ఇరికించాలని ఎందుకు ఏసీపీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సహా మరి కొంత మంది ప్రయత్నించారనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఈ సినిమా ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అని ముందు నుంచే హింట్ ఇస్తూ వచ్చారు మేకర్స్ దానికి తోడు విలన్ ఎవరో కనిపెడితే పట్టుకుంటే పదివేలు అనే అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. సినిమా ఓపెనింగ్ నుంచే కథపై ఆసక్తి పెంచే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే ఫస్ట్ హాఫ్‌లో ఏది గతమో.. ఏది ప్రస్తుతమో అర్థకాక ప్రేక్షకులు కాస్త కన్ఫ్యూజన్కి గురవడం ఖాయం. అయితే సిద్ధార్థ హత్య కేసులో చిక్కుకున్న తర్వాత సినిమా మీద ప్రేక్షకులలో కొంత క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ హీరో మీద అనుమానాలు పెంచేలా ఉంటుంది.ఆ తర్వాత సెకండ్ హాఫ్ పూర్తిగా గ్రిప్పింగ్‌గా తీసుకువెళ్లడంలో డైరెక్టర్ కొంతమేర సక్సెస్ అయ్యాడు. ప్రేక్షకులు అంచనా వేసే విధంగానే ఉన్న దానిని కనెక్ట్ చేయడం మాత్రం ఫర్వాలేదనిపించేలా ఉంది. అయితే అసలు విలన్ ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు అనే విషయం తెలిసిన తర్వాత సగటు ప్రేక్షకుడు ఆశ్చర్యపోతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి ఈ చిత్రం ఇప్పటిది కాదు.. పదేళ్ల క్రితం సినిమా కావడంతో విజువల్స్ కొన్ చోట్ల లాజిక్ లెస్ సీన్స్గా ఉన్నాయి. కానీ సస్పెన్స్ విషయంలో మాత్రం దర్శకుడికి మంచి మార్కులు పడతాయి. క్లైమాక్స్ కూడా కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. మలయాళ దర్శకుడు కావడంతో మలయాళ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.ఎవరెలా చేశారంటే..నటీనటుల విషయానికి వస్తే లాయర్ పాత్రలో సాయిరాం శంకర్ ఆకట్టుకున్నాడు. హీరోయిన్ ఆషిమా నర్వాల్ తన పాత్ర మేర మెప్పించింది. కొంత సేపైనా తనదైన నటనతో ఆకట్టుకుంది. సముద్రఖని, శృతి సోది, సుధాకర్ వంటి వారు తమ పాత్రల పరిధిలో న్యాయం చేశారు. ఇక సాంకేతి అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. ఎడిటింగ్ విషయంలో ఇంకా కత్తెరకు పని చెప్పాల్సింది. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
లెక్క సరిచేశాడు
ఓటీటీ(ott)లో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం హిసాబ్ బరాబర్(hisaab barabar) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఈ ప్రపంచంలో ఆశ లేని మనిషి ఉండడు. కానీ అత్యాశ మాత్రం అనర్ధదాయకం. అందరూ బాగుండాలి... అందులో మనముండాలి అనుకుంటే పర్లేదు. కొంతమంది మాత్రం నేను బాగు పడాలంటే పదిమంది నాశనం కావాలి అని అత్యాశకు లోనవుతుంటారు. అటువంటి వారు తమకు ఎవరూ ఎదురు రారు అనుకుంటూ విర్రవీగుతుంటారు. అలా విర్రవీగేవారికి ఓ సామాన్యడు ఇచ్చే అనుకోని ఝలక్కే ఈ ‘హిసాబ్ బరాబర్’ చిత్రం. జీ5 ఓటీటీ వేదికగా తెలుగులోనూ లభ్యమవుతోంది. ‘హిసాబ్ బరాబర్’ కథ విషయానికొస్తే... ఇది ఓ సామాన్యుడి కథ. రాధేమోహన్ శర్మ ఓ టికెట్ కలెక్టర్. అతనికి ఒక్కడే కొడుకు. భార్య విడిపోతుంది. ఇక రాధేమోహన్ కు అద్భుతమైన టాలెంట్ ఒకటుంది. అదే అతని లెక్కల చాతుర్యత.ఎటువంటి లెక్కనైనా అవలీలగా చెప్పేస్తాడు. చిన్న పైసా కూడా నష్టపోడు. అటువంటి రాధేమోహన్ బ్యాంకు అకౌంటులో అనూహ్యంగా ఓ 27 రూపాయలు తేడా వచ్చి కనపడకుండా పోతుంది. దాంతో బ్యాంకు అధికారులకు ఈ విషయమై ఫిర్యాదు చేస్తాడు. బ్యాంకు అధికారులు ఈ ఫిర్యాదును తాత్సారం చేస్తున్న విషయం గమనించి అదే బ్యాంకుకు సంబంధించిన ఇతరుల అకౌంట్లో కూడా 27 రూపాయలు కట్ అయినట్టు కనిపెడతాడు. రాధేమోహన్ కథ 27 నుండి మొదలై కొన్ని వేల కోట్ల దాకా వెళుతుంది. దీంతో ఇదో పెద్ద స్కామ్ అని నిర్ధారణకు వచ్చి పై అధికారులకు సమాచారమిస్తాడు. ఈ విషయం సదరు బ్యాంకు అధికారుల నుండి ఆ బ్యాంకు ఓనరుకు తెలుస్తుంది. ఇక ఆ పై బ్యాంకు ఓనరుకు రాధేమోహన్కు మధ్య యుద్ధం మొదలవుతుంది.కోట్లకు అధిపతి అయిన బ్యాంకు ఓనరును 27 రూపాయలు పోగొట్టుకున్న రాధేమోహన్ ఎలా ఎదుర్కొన్నాడనేది సినిమాలోనే చూడాలి. రూపాయి అయినా కోటి రూపాయలైనా దేని విలువ దానిదే, కాగితంలో నంబరు విలువను పెంచుతుందే కానీ కాగితమైతే మారదు. పైన చెప్పుకున్నట్టు ఎవరి కష్టం వారిది, ఎవరి ఫలితం వారిది. ఈ రోజు వరించిన విజయానికి ఆనందిస్తే రేపు అపజయాన్ని కూడా ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. ‘హిసాబ్ బరాబర్’ సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ మంచి సందేశంతో ముగుస్తుంది. రాధేమోహన్పాత్రలో ప్రముఖ నటుడు మాధవన్ జీవించారు. సినిమాలో తన లెక్కే కాదు అందరి లెక్క సరిచేశాడు. వీకెండ్‌కి వాచబుల్ మూవీ. – ఇంటూరు హరికృష్ణ -
చూసి తెలుసుకోదగ్గ డాక్యుమెంటరీ
ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో బాలీవుడ్ చిత్రం ది రోషన్స్ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఈ జీవితమనే చక్రంలో కొందరి వంతు వస్తుంది, కొందరి వంతు ముగుస్తుంది. ముగిసిన వారి జ్ఞాపకాలు మన మనసులో పదిలంగా ఉంటాయి. వారిలో ఎందరో మహానుభావులుంటారు. వారి జ్ఞాపకాలైతే మనం నెమరువేసుకోవచ్చేమో కానీ ఆ కాలంలో వారు పడ్డ కష్టం, ఆనందం కానీ మనకు తెలియవు. అటువంటి వారి జీవిత చక్రానికి వెండితెర రూపమిస్తే మన ఆనందం అవధులు దాటుతుంది.ఆ కోవకు చెందినదే నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘ది రోషన్స్’ టీవీ షో. ఇదో డాక్యుమెంటెడ్ మినీ సిరీస్. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి జీవిత చక్రాలకు తెర రూపమే ఈ షో. బాలీవుడ్ దిగ్గజ రోషన్ కుటుంబానికి చెందిన నాటి సంగీత కళాకారులు రోషన్ లాల్ నాగ్రత్ నుండి నేటి తరం నటుడు హృతిక్ రోషన్(Hrithik Roshan) వరకు... వారి జీవిత ప్రయాణాన్ని ఎంతో అందంగా చూపించారు.ఈ డాక్యుమెంటరీలో. ఓ రకంగా చెప్పాలంటే మనం ఈ షో ద్వారా నాలుగు తరాలు ప్రయాణిస్తాం. ముందుగా రోషన్ కుటుంబం నుండి రోషన్ లాల్ నాగ్రత్ సంగీత ప్రయాణంతో ఈ షోప్రారంభమై ఆ పై అతని కొడుకు రాజేష్ రోషన్ బాలీవుడ్ ప్రయాణంతో సాగి, ఆ తరువాత ఆయన కొడుకు రాకేశ్ రోషన్ నటనా ప్రయాణంతో పాటు ప్రోడ్యూసర్‌గా ఎలా రాణించారు? అన్నది చూపిస్తూ నేటి తరం కథానాయకుడు హృతిక్ రోషన్ బాలీవుడ్ ప్రయాణంతో షో ముగుస్తుంది.ఈ షో ద్వారా నాటి బాలీవుడ్ సంగీతం నుంచి నేటి తరం సినిమాల వరకు మనకు తెలియని ఎన్నో రహస్యాలతో పాటు హిందీ చిత్ర పరిశ్రమలోని అప్పటి ఒడిదుడుకులను ఇప్పటి పట్టు విడుపులను సవివరంగా చూపించారు. ఈ రోషన్ కుటుంబానికి బాలీవుడ్ పరిశ్రమలో ఉన్న నాటి, నేటి దిగ్గజాలు తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రేక్షకులకు చెప్పడం మరింత బావుంది. అందుకే ‘ది రోషన్స్’ చూసి నేర్చుకోదగ్గ, తెలుసుకోదగ్గ డాక్యుమెంటరీ. ఇది ప్రతి సినిమా ప్రేక్షకుడు తమ వ్యక్తిగత లైబ్రరీలో భద్రపరుచుకోదగ్గ డాక్యుమెంటెడ్ మినీ సిరీస్. వర్త్‌ఫుల్ టు వాచ్. – ఇంటూరు హరికృష్ణ -
హాలీవుడ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్!
ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం బ్యాక్ ఇన్ యాక్షన్(Back in Action) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.హాలీవుడ్ సినిమాలన్నీ ఏదైనా ఒక జోనర్‌కి సంబంధించనవి మాత్రమే ఎక్కువగా ఉంటాయి. అలాంటిది ఓ యాక్షన్ జోనర్‌ని ఫ్యామిలీతో కలిపి హాలీవుడ్లో సినిమా రావడమంటే అదో వింత. అదే ‘బ్యాక్ ఇన్’ యాక్షన్ సినిమా. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కూడా లభ్యమవుతోంది. ఈ సినిమాకి సేత్ గార్డన్ దర్శకుడు . కేమరన్ డియాజ్, జెమీ ఫాక్స్ వంటి ప్రముఖ నటులతో పాటు జేమ్స్ బాండ్ సినిమాలలో సుపరిచితురాలైన గ్లెన్ క్లోజ్ ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించడం విశేషం. ఇక కథ విషయానికొస్తే... అమెరికాలోని ప్రముఖ సీఐఎ సంస్థలో ప్రతినిధులుగా పని చేస్తున్న ఎమిలీ, మాట్ ప్రేమించుకుంటుంటారు. వారి ప్రేమకు ఫలితంగా ఎమిలీ గర్భవతి అవుతుంది. ఆ విషయాన్ని ఓ ఆపరేషన్‌లో భాగంగా మాట్కు చెబుతుంది ఎమిలీ. ఆ ఆపరేషన్ ఏంటంటే ప్రపంచంలోని ప్రముఖ పారిశ్రామిక, వాణిజ్య మరియు ప్రభుత్వ అధికార యంత్రాంగానికి సంబంధించిన ఓ డేటా డ్రైవ్‌ను తీసుకురావడం. ఈ దశలో ఇద్దరూ ఓ ఘోర విమాన ప్రమాదం నుండి తప్పించుకుంటారు. అలా తప్పించుకున్నవాళ్లు ఇక ప్రపంచానికి తమ ఉనికి తెలియకుండా దూరంగా పుట్టబోయే పిల్లలతో సంతోషంగా ఉండాలనుకుంటారు. అందుకే వాళ్లిద్దరూ 12 ఏళ్ళ దాకా అటు సీఐఎకి ఇటు ప్రపంచానికి తమ అసలు ఉనికి తెలియకుండా జాగ్రత్త పడతారు. ఈ 12 ఏళ్లలో వాళ్లకి ఇద్దరు పిల్లలు పుడతారు. తమ పిల్లలకు కూడా తమ అసలు ఐడెంటిటీ తెలియనివ్వరు. అయితే ఏ ఆపరేషన్ కోసం వీళ్లిద్దరూ అజ్ఞాతానికి వచ్చారో ఆ ఆపరేషన్ వల్లే మళ్లీ కథ మొదలవుతుంది. ఆ ఆపరేషన్‌లో శత్రువులకు దొరకకుండా ఉండాలని మాట్ తనతో పాటు ఆ డేటా డ్రైవ్‌ని ఎమిలీకి కూడా తెలియకుండా దాస్తాడు. ఆ డ్రైవ్ కోసం విలన్స్ వీళ్లిద్దరినీ మళ్లీ ట్రాక్ చేసి ఎటాక్ చేస్తారు. మరి విలన్స్ ఆ డ్రైవ్ చేజిక్కించుకుంటారా? తమ పిల్లలకు, సమాజానికి తమ ఐడెంటీటీని దాచి పెట్టిన ఎమిలీ, మాట్ విలన్స్ ఎటాక్ నుండి తప్పించుకున్నారా? లేదా అన్నది సినిమాలోనే చూడాలి. పైన చెప్పుకున్నట్టు ఇదో చక్కటి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్. మంచి స్టంట్స్, విజువల్స్‌తో పాటు చక్కని కామెడీని ఈ సినిమాలో చూసి ఎంజాయ్ చేస్తారు. మరింకెందుకు ఆలస్యం... గ్రాబ్ యువర్ రిమోట్ టు ‘బ్యాక్ ఇన్ యాక్షన్’ ఫర్ వాచింగ్ దిస్ వీకెండ్.– ఇంటూరు హరికృష్ణ -
బీ కేర్‌ఫుల్...
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం డేంజరస్ వాటర్స్ (Dangerous Waters)ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.జీవితమన్నది క్షణభంగురం. ఏ క్షణానికి ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కాబట్టి అనుక్షణం అప్రమత్తత అవసరం. ఈ నేపథ్యంలోనే రూ΄పొందిన హాలీవుడ్ సినిమా ‘డేంజరస్ వాటర్స్’(Dangerous Waters ). ఇదో పూర్తి థ్రిల్లర్ జోనర్ మూవీ. సినిమా మొత్తం ఓ మూడు పాత్రలతో 90 శాతం సముద్రంలోనే జరిగిన కథ. సినిమాలో ఉన్నది మూడు పాత్రలే అయినా మంచి స్క్రీన్‌ప్లేతో చూసే ప్రేక్షకులను మాత్రం కట్టిపడేసే ప్రయత్నం చేశారు దర్శకుడు జాన్ బర్.ఈ సినిమా లయన్స్ గేట్ ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. ఇది పెద్దవాళ్లు మాత్రమే చూసే సినిమా. ఇక ఈ చిత్రకథ విషయానికొస్తే... అల్మా తన కూతురు కోసం ఓ సూపర్ వెకేషన్ ప్లాన్ చేస్తుంది. తన బాయ్ ఫ్రెండ్ డెరెక్‌తో కలిసి కూతురుతో పాటు బోట్లో బెర్ముడా వరకు ట్రావెల్ చేసి, సముద్రం మధ్యలో తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవాలన్నది ప్లాన్. దీనికి కూతురు రోజ్ అయిష్టంగానే ఒప్పుకుంటుంది. ప్రయాణం మొదలైనపుడు అంతా బాగానే ఉంటుంది. దారి మధ్యలో వేరే ఒక బోట్ వీళ్లకు ఎదురుగా వచ్చి అల్మాను చంపేసి డెరెక్‌ను గాయపరుస్తారు. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనలో నడి సంద్రంలో రోజ్ ఒంటరిదైపోతుంది.దాడి చేయడానికి వచ్చినవాళ్లు బోట్లోని రేడియోను అలాగే బోట్ ఇంజన్‌ను ధ్వంసం చేసి వెళతారు. చుట్టూ నీళ్లు తప్ప ఏమీ లేని ఆ ప్రాంతం నుండి రోజ్ ఎలా బయటపడిందనేది సినిమాలోనే చూడాలి. ఈ సినిమా చాలా నెమ్మదిగా ప్రారంభమై, ఉత్కంఠభరితంగా సాగుతూ ఊహకందని క్లైమాక్స్ ట్విస్టులతో అద్భుతంగా ముగుస్తుంది. గంటా నలభై నిమిషాల నిడివితో సాగే ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. థ్రిల్లర్ జోనర్ ఇష్టపడేవాళ్లకి ఇదో సూపర్ సినిమా. మరింకేం... ఈ వీకెండ్ ‘డేంజరస్ వాటర్స్’లోకి మీరూ ట్రావెల్ చేయండి. – ఇంటూరు హరికృష్ణ -
ఓటీటీలో మలయాళ హిట్ మూవీ సూక్ష్మదర్శిని.. ఎలా ఉందంటే?
ఈ ప్రపంచంలో దాచలేనిది ఏదైనా ఉంది అంటే అది రహస్యమే. కాని మనిషి తన రహస్యాన్ని బంధించగలనని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటాడు. ఇప్పుడు కాకపోతే మరెప్పటికైనా రహస్యమనేది బహిర్గతమవ్వాలసిందే. కాకపోతే ఆ రహస్యాన్ని మన ఊహకు కూడా అందని వాళ్ళు బయటపెట్టితేనే పెద్ద విడ్డూరం. మన రహస్యాన్ని మన ఇరుగుపొరుగు వారు బయటపెడితే మనకెలా ఉంటుంది.. ఆ పంథాన రూపొందించిన సినిమానే సూక్ష్మదర్శిని. ఓ రకంగా చెప్పాలంటే ఇదో వినూత్న కథ, కథతో పాటు స్క్రీప్లే కూడా అంతే వైవిధ్యంగా నడుస్తుంది. సూక్ష్మదర్శిని ఓ మళయాళ సినిమా. హాట్ స్టార్ లో తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉంది. ఇక కథ విషయానికొస్తే ఇది ఓ కాలనీకి సంబంధించినది. ప్రియ తన భర్త ఆంటోని, కూతరు కాణితో అదే కాలనీలో నివసిస్తుంటుంది. ప్రియ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. ప్రియకి అదే కాలనీలో ఉంటున్న స్టెఫీ, అస్మా మంచి స్నేహితులు. ఓ రోజు ఆ కాలనీలోని ఇంట్లోకి మాన్యుల్ తన తల్లితో కొత్తగా వస్తాడు. మాన్యుల్ ప్రవర్తన ప్రియకి అనుమానాస్పదంగా అనిపిస్తుంది. మాన్యుల్ తన తల్లికి అల్జీమర్స్ వ్యాధి ఉందని చెప్పి కొంత వింతగా ప్రవర్తిస్తుంటాడు. ఈ విషయంపై ప్రియ ఫోకస్ చేసి స్టెఫీ, అస్మాతో కలిసి అసలు నిజం బయటపెడుతుంది. మాన్యుల్ ప్రవర్తించిన తీరు ఏంటి, ప్రియ వాళ్లు ఇన్వెస్టిగేషన్ చేసి బయట పెట్టిన సంగతేంటి అన్న విషయాలను మాత్రం సూక్ష్మదర్శినిలో చూస్తే తెలిసిపోతుంది.సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ ఆఖరున వచ్చే అద్భుతమైన ట్విస్టులతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాకి దర్శకుడు యం.సి.జతిన్. ప్రముఖ మళయాళ నటులు నజరియా, బసిల్ జోసెఫ్ వంటి వారు ఈ సినిమాలోని ప్రధాన పాత్రలలో నటించడం ప్రత్యేక ఆకర్షణ. ఆఖరుగా ఒక్కమాట ఇరుగు పొరుగు వారు మనతో కలిసి ఉంటే మంచిదే, అలాగే వాళ్లు మనల్ని ప్రత్యేకంగా గమనిస్తున్నారో లేదో కూడా తెలుసుకోవాలి. అప్పుడే మనల్ని ఏ సూక్ష్మదర్శిని ఏమీ చేయదు. వర్త్ ఫుల్ వాచ్ ఫర్ ది వీకెండ్.- ఇంటూరు హరికృష్ణ. -
నాటి రామాయణం నేటి పాత్రలతో.....
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం సింగమ్ ఎగైన్ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.మన ఇతిహాసాలలో గొప్ప విలువలతో కూడుకున్న కథ రామాయణం. నాటి రామాయణాన్ని నేటి నేటివిటీతో ప్రస్తుత ప్రముఖ నటీనటులతో మళ్లీ మన ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి. ఇదే ప్రయత్నాన్ని గతంలో చాలా మందే చేసినా యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ‘సింగమ్’ సిరీస్ చిత్రానికి ఈ తరహా ప్రయోగం చేయడం మొదటిసారి. అందులోనూ బాలీవుడ్లో భారీ తారాగణంతో ఇలాంటి అంశంతో కూడిన కథ తీయడమనేది నిజంగా సాహసమనే చెప్పాలి. ముందుగా ‘సింగమ్’ సిరీస్ గురించి చెప్పుకుందాం. ఈ సిరీస్‌లో వచ్చిన మూడో చిత్రం ‘సింగమ్ ఎగైన్’. సిరీస్‌లో ఈ భాగం ప్రేక్షకుల ముందు రావడా నికి దాదాపు పదేళ్లు పట్టింది. 2011లో ‘సింగమ్’ మొదటి చిత్రం రాగా 2014లో రెండో భాగంగా ‘సింగమ్ రిటర్న్స్’ విడుదలైంది. ఆ తరువాత మూడో భాగం 2024లో ‘సింగమ్ ఎగైన్’గా వచ్చింది.అన్ని సిరీస్‌లలో కథానాయకుడిగా ప్రముఖ స్టార్ అజయ్ దేవగన్ నటించారు. ఇకపోతే ప్రస్తుత ‘సింగమ్ అగైన్’ చిత్రంలో అజయ్ దేవగన్‌తో పాటు కరీనా కపూర్, దీపికా పదుకోన్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్ తదితర ప్రముఖ నటులు నటించారు. రామాయణ కథనే ఇతివృత్తంగా అల్లుకున్న కథ ఇది. రామాయణంలోని పాత్రలను రిలేట్ చేస్తూ ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ స్క్రీన్‌ప్లే కొనసాగుతుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే సినిమాలో రామాయణ కథను టీవీ షో రూపంలో చూపిస్తూ కథను నడిపిస్తారు. అప్పటి రామాయణ కథ చరిత్రతో మనకు పరిచయం.అందుకే అది రమణీయ కావ్యం. కానీ ఇప్పటి ‘సింగమ్ ఎగైన్’ రణరంగమే ప్రధాన సూత్రంగా నడిచిన కథ. ఆఖరుగా ఒక్క మాట... రామాయణ కథను నేటి తరానికి మళ్లీ చెప్పడమనేది మంచిదే కానీ, ఎన్నో భావావేశాలున్న రామాయణ మూల కథలోంచి ఒక్క శౌర్య, వీర రసం మాత్రం తీసుకుని సినిమా రూ΄పొందించడం ఏమాత్రం సమంజసమో సినిమా తీసిన దర్శక–నిర్మాతలు, చూస్తున్న మనలాంటి ప్రేక్షకులు ఆలోచించాల్సిందే. ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. మీరు కూడా చూసి ఆలోచించడం మొదలు పెట్టండి. – ఇంటూరు హరికృష్ణ -
సీక్రెట్స్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ బై రాజమౌళి
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో ఆర్ఆర్ఆర్ – బిహైండ్ అండ్ బియాండ్ ఒకటి. ఈ డాక్యుమెంటరీ గురించి తెలుసుకుందాం.తన ఉనికిని తెలిపేందుకు ఓ గదిలో నలుగురు ముందు చప్పట్లు కొడితే ఆ నలుగురికి తన విషయం తెలియవచ్చు. కానీ అదే ఉనికి ప్రపంచానికి తెలియాలంటే సరిగ్గా రాజమౌళిలా ఆలోచించాలి. భారతదేశానికి ఒకప్పుడు సినిమా ప్రమోషన్‌ను ఓ వినూత్న పంథాలో పరిచయం చేసిన బాలీవుడ్ దిగ్గజం అమిర్ ఖాన్ కూడా తాను ఈ విషయంలో రాజమౌళినే ఫాలో అవుతాననడం దీనికి ఓ నిదర్శనం. చరిత్ర అనేది రాజమౌళి ముందు ఉన్నది తరువాత ఉంటుంది, కానీ ఆ చరిత్రలో రాజమౌళికి ఓ చెరగని పేజీ ఉంటుందనేది మాత్రం నిర్వివాదాంశం.తెలుగు సినిమా వైభవాన్ని ఎన్నో అంతర్జాతీయ వేదికలపైన నిలిపిన శిల్పి రాజమౌళి. మరీ ముఖ్యంగా తెలుగు సినిమాకి ఆస్కారమే లేదన్న ఆస్కార్ పురస్కారాన్ని అద్భుతంగా అందించిన అత్యున్నత దర్శకులు రాజమౌళి. తన సినిమా అంటేనే ఓ సంచలనం. మరి... ఆ సంచలనం వెనకున్న సీక్రెట్ తెలుసుకోవాలని ప్రతి దర్శకుడితో పాటు సామాన్య ప్రేక్షకుడికి కూడా ఆసక్తి ఉంటుంది. ఆ కోవలోనే రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి సంబంధించిన తన కష్టాన్ని ఓ చక్కటి డాక్యుమెంటరీ రూపంలో ‘ఆర్ఆర్ఆర్ – బిహైండ్ అండ్ బియాండ్’ పేరిట నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంచారు.దాదాపు రెండున్నర గంటల పై నిడివి ఉన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను నాలుగేళ్ల పాటు తీశారు. ఈ డాక్యుమెంటరీలో ఆ సినిమా మొత్తాన్ని ఎలా తీశారో రాజమౌళి వ్యాఖ్యానంతో పాటు సినిమాలోని నటీనటులు టెక్నీషియన్్స కూడా వివరిస్తూ చూపించడం ఎంతో బాగుంది. తన ఈ ‘ఆర్ఆర్ఆర్’ ప్రయాణానికి సంబంధించి ఎన్నో తెలియని, చూడని అద్భుత విషయాలను ప్రేక్షకులకు అందంగా అందించారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి... ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ఫుటేజ్ కొన్ని గంటల రూపంలో ఉంటే దానిని ఎడిట్ చేసి, గంటన్నర నిడివితో అందించారట. ఈ సమాజమనేది ఓ సృష్టి.ప్రతిరోజూ మన మనుగడ ఈ సృష్టికి అనుగుణంగానే ఉంటుంది. ఓ రకంగా సినిమా అన్నది కూడా ఓ సృష్టే. ఓ దర్శకుడి ఆలోచనకు ప్రతిరూపమే సినిమా అన్న ఓ అద్భుత సృష్టి, కానీ ఈ సినిమా సృష్టిలో ఎంతోమంది కష్టం ఉంటుంది. మరి... అటువంటి సినిమాను ఏ విధంగా రూపొందించారో ఆ రహస్యాలు మీరు కూడా తెలుసుకోవాలంటే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘ఆర్ఆర్ఆర్ – బిహైండ్ అండ్ బియాండ్’ని చూసేయండి. వర్త్ టు వాచ్ అండ్ ప్రిజర్వ్ ద డాక్యుమెంటరీ ఫర్ ది ఫ్యూచర్ కిడ్స్. – ఇంటూరు హరికృష్ణ -
కొత్త సంవత్సరంలో సమీక్షించాల్సినవి..
దేశానికేకాదు, వ్యక్తులకు వారి పెట్టుబడులకు బడ్జెట్ ప్రణాళికలు అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఏటా ఆయా ఇన్వెస్ట్మెంట్ల(investments)ను సమీక్షించుకోవాలని సూచిస్తున్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో లేదా కొత్త సంవత్సరం ఆరంభంలో సాధారణంగా చాలామంది తమ పెట్టుబడులను సమీక్షిస్తారని చెబుతున్నారు.విడిగా ఒక లక్ష్యానికి ఎంత కాలంలో, ఎంత మొత్తం సమకూర్చుకోవాలన్నది బడ్జెట్లో రాసుకుంటారు. అందుకు అనుకూలించే ఫండ్స్‌ను ఎంపిక చేసుకుంటారు. మరి సదరు మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds) పనితీరు మీ రాబడులు ఆకాంక్షలకు అనుగుణంగానే పనితీరు చూపిస్తున్నాయా? లేదా? పనితీరు బాగోలేకపోతే ఆ ఒక్క పథకంలోనే అలా ఉందా లేక ఆ విభాగంలోని మిగిలిన పథకాల పనితీరు కూడా అదే మాదిరిగా ఉందా? అన్నది పరిశీలించుకోవాలి. విభాగం మొత్తం పనితీరు అదే మాదిరిగా ఉంటే ఆందోళన అక్కర్లేదు. మరికొంత వ్యవధి ఇచ్చి చూడొచ్చు. పథకంలో లోపం ఉంటే, అందుకు కారణాలను గుర్తించాలి. అవి సమగ్రంగా లేకపోతే మరో పథకంలోకి మారిపోవడాన్ని పరిశీలించొచ్చు.రిస్క్‌ను అధిగమించేలా..ఈక్విటీ, డెట్ సాధనాల్లో ఏదో ఒక విభాగంలోని పెట్టుబడుల విలువ గణనీయంగా వృద్ధి చెందితే, రీబ్యాలన్స్ (Re balance) చేసుకోవాలి. ఒక విభాగం పెట్టుబడుల విలువ అధికంగా వృద్ధి చెందినప్పుడు.. అధిక విలువ ఉన్న చోట నిర్ణీత శాతం మేర పెట్టుబడులు విక్రయించి, తక్కువ విలువ వద్దనున్న విభాగంలోకి మార్చుకోవాలి. దీన్నే అస్సెట్ అలోకేషన్గా చెబుతారు. దీని ద్వారా రిస్క్‌ను అధిగమించొచ్చు. బీమా కవరేజీపై దృష్టిటర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్(Insurance)లోనూ మార్పులు అవసరం పడొచ్చు. ఉదాహరణకు గృహ రుణం తీసుకున్నారని అనుకోండి.. ఆ మేరకు టర్మ్ కవరేజీని పెంచుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఇతర ఏ రుణం తీసుకున్నా సరే ఆ మేరకు కవరేజీ పెంచుకోవాలి. వివాహం, పిల్లలతోపాటు బాధ్యతలూ పెరుగుతుంటాయి. ఏటా ఆదాయం కూడా వృద్ది చెందుతుంది. వాటికి అనుగుణంగా తమ బీమా కవరేజీని సమీక్షించుకోవాలి. ఆరోగ్య బీమా కవరేజీ ప్రస్తుత కుటుంబ అవసరకాలకు సరిపడా ఉందా? అని సమీక్షించుకోవాలి. లేదంటే అదనపు కవరేజీతో తక్కువ వ్యయానికే సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవచ్చు.ఇదీ చదవండి: 179 మంది మృతి..‘నాదే పూర్తి బాధ్యత’అత్యవసర నిధి.. వీలునామాలో మార్పులురుణ భారంలో ఉంటే కొత్త ఏడాదిలో దాన్నుంచి బయటపడే మార్గాన్ని గుర్తించాలి. అత్యవసర నిధిలోనూ మార్పులు అవసరమే. జీవన వ్యయాలు పెరుగుతూ ఉంటాయి. కనుక 2–5 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసుకున్న అత్యవసర నిధి ఇప్పటి అవసరాలకు సరిపోకపోవచ్చు. ప్రస్తుత ఖర్చులను కనీసం ఏడాది పాటు అయినా అత్యవసర నిధి గట్టెక్కించగలదా? అన్నది సమీక్షించుకోవాలి. లేదంటే అదనంగా సమకూర్చుకోవాలి. రెండేళ్ల అవసరాలకు సరిపడా ఏర్పాటు చేసుకుంటే మరింత నిశ్చింతగా ఉండొచ్చు. నామినేషన్లు, వీలునామాలో మార్పులు అవసరం అనుకుంటే ఆ మేరకు మార్పులు చేసుకోవాలి. అవసరమైతే ఏడాదిలో ఒక్కసారి అయినా ఆర్థిక నిపుణులను సంప్రదించి సమగ్రమైన సమీక్ష చేయించుకోవాలి. -
జాగ్రత్త... టోర్నడోల్లో ఎగిరిపోతారు
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ట్విస్టర్స్ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఎంత పెద్ద విపత్తయినా, వివాదమైనా ముందుగా అమెరికా హాలీవుడ్ దర్శకుల మెదళ్లలో పుట్టి, దాని తరువాత వీలైతే అది జరుగుతుంది, లేదంటే ఆ హాలీవుడ్ దర్శకుడి ఊహల్లోనే ఉండిపోతుంది. చిన్నపాటి ఈగ నుండి ఇప్పటిదాకా కనీసం ప్రత్యక్షంగా కనిపించని గ్రహాంతరవాసి దాడుల వరకు హాలీవుడ్ దర్శకుల ఊహకు కాదేదీ అనర్హం, ఇది జగమెరిగిన సత్యం. కానీ ప్రకృతి మాత్రం అమెరికాలో భౌగోళిక ప్రాతిపదికన నిజంగానే కాస్తంత ప్రచండంగానే ఉంటుంది. వాటిలో ముఖ్యంగా తరచూ కనిపించే టోర్నడోలు. మన పరిభాషలో చెప్పాలంటే సుడిగుండపు తుఫానులు.వీటి మీద హాలీవుడ్ దర్శకుల కన్ను దాదాపు 28 సంవత్సరాల క్రితమే పడింది. 1996లో జెన్ డి బాంట్ ‘ట్విస్టర్’ అనే సంచలనాత్మక సినిమా తీశారు. ఆ రోజుల్లో ఈ సినిమా ప్రపంచ సినీ పరిశ్రమలో పెద్ద హాట్ టాపిక్. అప్పట్లో 88 మిలియన్లు పెట్టి ఈ సినిమా తీస్తే దాదాపు 500 మిలియన్లు సంపాదించి పెట్టింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా జోసెఫ్ కోసిన్సి్క కథ ఆధారంగా మార్క్ ఔ. స్మిత్ స్క్రీన్‌ప్లేతో లీ ఐజాక్ చుంగ్ దర్శకత్వం వహించిన 2024 అమెరికన్ చిత్రం ట్విస్టర్స్’. ప్రస్తుతం ఈ సినిమా జియో సినిమా ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. ‘ట్విస్టర్స్’ సినిమా పూర్తిగా టోర్నడోల కథాంశంతోనే తెరకెక్కింది. అమెరికా దేశంలో ఒక్లాహామా రాష్ట్రం ఎక్కువగా టోర్నడోలు ప్రభావితమయ్యే ప్రాంతం. ఓ టోర్నడో వస్తుందంటే దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది? అది ఎప్పుడు ఆగిపోతుంది అన్న లోతైన విశ్లేషణలు చేయడానికి ప్రభుత్వంతో పాటు అనేక ప్రైవేటు సంస్థలు పని చేస్తుంటాయి. ‘ట్విస్టర్స్’ సినిమా కథ అటువంటి సంస్థ గురించే. స్ట్రామ్ పార్ అనే ఈ సంస్థలో ఎంతో అవగాహన ఉన్న కేట్ తన సహచరుడు జావి ద్వారా చేరుతుంది. ఓ టోర్నడో ఆపరేషన్‌లో కేట్ తన ప్రియుడిని పోగొట్టుకుంటుంది. ఆ బాధలో ఉన్నా ఓ వారం వరకు తాను జావీకి తోడుగా ఉంటానని స్ట్రామ్ పార్ టీమ్‌లోకి వస్తుంది. కానీ జావి ఇదంతా ఓ స్వార్థం కోసం చేస్తున్నాడని తెలిసి ఇదే టోర్నడో ఆపరేషన్‌లో భాగంగా టోర్నడో వ్రాంగ్లర్ అనే యూట్యూబ్ సంస్థలోకి టైలర్ ఆహ్వానిస్తే వెళుతుంది. టోర్నడో ప్రమాదకర కేటగిరీ ఈయఫ్ 5ని వీళ్ళు ఛేజ్ చేస్తూ చిక్కుకుంటారు. మరి... వాళ్లు ఆ టోర్నడో నుండి బయటపడ్డారా? లేదా అన్నది మాత్రం సినిమాలోనే చూడాలి. మంచి ఇన్ఫర్మేషన్తో చక్కటి థ్రిల్లింగ్ మూడ్‌లోకి తీసుకువెళ్లే సినిమా ఈ ‘ట్విస్టర్స్’. వర్త్‌ఫుల్ టు వాచ్.– ఇంటూరు హరికృష్ణ -
కీర్తి సురేశ్ 'బేబీ జాన్' ట్విటర్ రివ్యూ
హీరోయిన్ కీర్తి సురేశ్ (Keerthy Suresh) తొలి హిందీ సినిమా 'బేబీ జాన్' (Baby John Movie) చాలా ఏళ్ల క్రితం వచ్చిన 'తెరి' సినిమాకు ఇది రీమేక్. వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించాడు. కీర్తితో పాటు వామికా గబ్బి హీరోయిన్గా నటించింది. ట్రైలర్‌తోనే ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్టైనర్ చూడబోతున్నాం అనే హింట్ ఇచ్చారు. ఇప్పుడు క్రిస్మస్ కానుకగా మూవీని థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇంతకీ మూవీ టాక్ ఏంటి? ఆడియెన్స్ ఏమంటున్నారు?(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'బరోజ్' సినిమా రివ్యూ)సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది గానీ మరీ సూపర్ బంపర్ అనట్లేదు. తొలి 40 నిమిషాలు డీసెంట్‌గా ఉందని చెబుతున్నారు. ఇంటర్వెల్ ముందు 20 నిమిషాల మాత్రం హార్డ్ హిట్టింగ్ సీన్స్‌తో చూపించారని అంటున్నారు. సెకండాఫ్‌ని యాక్షన్ సన్నివేశాలతో నింపేశారని, క్లైమాక్స్ సాలిడ్‌గా ఉందని అంటున్నారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుందంటున్నారు.యాక్షన్, ఎమోషన్స్, డ్రామా, కామెడీ, కాస్త రొమాన్స్.. ఇలా అన్ని అంశాల మిక్స్ చేసి తీసిన మాస్ ఎంటర్టైనర్ 'బేబీ జాన్'కి పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. హీరోగా చేసిన వరుణ్ ధావన్, గెస్ట్‌రోల్ చేసిన సల్మాన్ ఖాన్ (Salman Khan) అదిరిపోయే ఫెర్మార్మెన్స్ ఇచ్చారని మెచ్చుకుంటున్నారు. (ఇదీ చదవండి: ఎదురుపడ్డ మాజీ ప్రేమికులు నిఖిల్-కావ్య.. అక్కడే ఉన్నా గానీ!)#BabyJohnReview : ⭐⭐⭐1/2.#BabyJohn is a massy hilarious ride crafted to captivate large audiences. The perfect mix of action, emotions, drama, & humor, coupled with lead actors outstanding performance, delivers an incredibly entertaining & enjoyable cinematic experience.👍 pic.twitter.com/8DMSxR1RKB— Always Bollywood (@AlwaysBollywood) December 25, 2024#BabyJohn Received Extraordinary Response From The Audience.Everyone Appreciate The Performance Of #VarunDhawan & #SalmanKhan's Cameo And Loudly Praise Him.Blockbuster Loading 🔥🔥🔥 @BeingSalmanKhan #SalmanKhan #BabyJohnReview pic.twitter.com/6h8LwgdgKx— Filmy_Duniya (@FMovie82325) December 25, 2024@Varun_dvn Is back with a BANG 🔥 #BabyJohn is the perfect blend of action, drama, romance, comedy & a killer music album! The punchlines and punches, both land so well that it will leave you speechless. The twists, the sound effects, everything make it a MUST WATCH. (1/2) pic.twitter.com/PJONKGkmO1— ekta | VD stan ✨ (@crazyvaruniac_) December 24, 2024Round 1 #BabyJohn Mass 🔥 pic.twitter.com/peivaAjeSf— sahil. (@shutupsahill) December 25, 2024Agree or die Best Title Card ever in the Bollywood cinema 🔥#VarunDhawan #BabyJohn pic.twitter.com/MeYu6kB0Oa— BUNNY (@BabyJohnDec25) December 24, 2024THIS MANNNN!!!! 🔥🤯ONE OF THE BEST ENTRY SCENE FOR SALMAN KHAN!! THE CENIMA WILL TURN INTO STADIUM !! 🥶GET READY FOR "AGENT BHAIJAAN" 🔥🌋🥵#BabyJohn #SalmanKhan #Christmas #MerryChristmas #BabyJohnreview #Sikandar #SikandarTeaser pic.twitter.com/DLmAmdMkab— it's cinema (@its_cinema__) December 24, 2024Only south Directors know how to present superstar like Salman Khan#BabyJohn #SalmanKhan pic.twitter.com/FJuFncJHtz— 𝙳𝚛 𝙼𝚞𝚓𝚓𝚞 𝙺𝚑𝚊𝚗 (@MajesticMujju) December 24, 2024#BabyJohnReview ~ ENTERTAINER!👌Rating: ⭐️⭐️⭐️½#BabyJohn offers GREAT ACTION, GOOD DIALOGUES, THRILLING BGM, and SOLID PERFORMANCEs by the lead and Supporting Actors🔥👌The first 40 minutes are just about decent, but 20 mins before the INTERVAL really HIT HARD! Thanks to… pic.twitter.com/VAAblSJ9Qb— CineHub (@Its_CineHub) December 25, 2024 -
మోహన్ లాల్ 'బరోజ్' సినిమా రివ్యూ
స్వతహాగా మలయాళీ హీరో అయిన్ మోహన్ లాల్ (Mohanlal).. 'దృశ్యం' సినిమాలతో మంచి పాపులరిటీ సొంతం చేసుకున్నారు. తెలుగులో 'జనతా గ్యారేజ్' మూవీలోనూ చేశారు. అలా తెలుగు ప్రేక్షకులకు ఈయన సుపరిచితుడే. 400కి సినిమాల్లో నటించిన ఈయన తొలిసారి 'బరోజ్' (Barroz Movie) అనే సినిమాతో దర్శకుడిగా మారారు. ఇందులో ఈయనే హీరోగానూ నటించారు. క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రం ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజైంది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? మోహన్ లాల్ డైరెక్టర్‌గా హిట్ కొట్టారా అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?ఒకప్పుడు గోవాని పాలించిన పోర్చుగీస్ రాజు డి గామా (ఇగ్నాసియో మతయోస్)కు బరోజ్ (మోహన్ లాల్) నమ్మిన బంటు. ఆయన నిధిని అంతా బరోజ్ కాపాడుతూ ఉంటాడు. భూతంలా మారి వాళ్ల వంశస్థులకు ఇదంతా అప్పగించేందుకు గత 400 ఏళ్లుగా కాపాలా కాస్తూనే ఉంటాడు. అలా డి గామా వంశంలోని 13వ జనరేషన్‌కి చెందిన ఇసబెల్లా (మాయా రావ్) గోవా వస్తుంది. ఆమె బరోజ్‌ని శాపవిముక్తుడిని చేస్తుంది. ఇసబెల్లాకు బరోజ్ నిధి అప్పగించాడా లేదా? 400 ఏళ్ల పాటు నిధిని కాపాడుకునే క్రమంలో బరోజ్ ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నాడు? ఇసబెల్లాకు మాత్రమే బరోజ్ ఎందుకు కనిపిస్తాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?మనలో చాలామంది చిన్నప్పుడు చందమామ కథలు చదివే ఉంటారు. హాలీవుడ్ కార్టూన్ డబ్బింగ్ మూవీస్ కూడా చూసే ఉంటారు. అయితే అవి డబ్బింగ్ మూవీస్ కాబట్టి ఆ మైండ్ సెట్‌తోనే చూస్తాం. అర్థం కాకపోయినా సరే ఎంజాయ్ చేస్తాం. ఇలాంటి సినిమానే మన దగ్గర తీస్తే.. మనకు రిలేట్ అవుతుందా లేదా అనేది మాత్రం అబ్జర్వ్ చేస్తాం. కానీ 'బరోజ్' మాత్రం పేరుకే మలయాళ మూవీ కానీ.. ఏదో ఇంగ్లీష్ మూవీ చూస్తున్నామా అనిపిస్తుంది. రెండున్నర గంటల నిడివి అయినప్పటికీ నాలుగు గంటల మూవీ చూసిన అనుభూతి కలుగుతుంది.మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్‌తో 'బరోజ్' మొదలవుతుంది. ఫాదో గీతంతో ఈ మూవీని ప్రారంభిద్దామని అంటారు. అసలు ఫాదో గీతం అంటే ఏంటి అనుకునేలోపు.. సడన్‌గా పోర్చుగీస్ పాట ప్లే అవుతుంది. దీని మీనింగ్ ఏంటో అర్థం కాదు. ఇదొక్కటే కాదు మూవీ అంతా దాదాపు ఇదే కన్ఫ్యూజన్. నిధిని కాపాడే భూతంగా బరోజ్ ఎంట్రీ.. అసలు ఈ నిధి సంగతేంటి? దెయ్యంగా ఎందుకు మారాడు? ఈ నిధిని ఎవరికి అప్పగించాలి అనే అంశాలే సినిమా కథ.నిధికి కాపలాగా భూతం ఉండటం.. 400 ఏళ్లుగా ఒకే గదిలో ఈ భూతం ఉండిపోవడం.. లైన్ చూస్తుంటే మంచి హాస్యం పుట్టించొచ్చు. నిధిని ఎవరైనా కొట్టేయడానికి వస్తే ఆ సీన్లని అడ్వెంరెస్గా తీయొచ్చు. కానీ 'బరోజ్'లో అలాంటి సన్నివేశాలే ఉండవు. హీరోగా నటించి దర్శకత్వం వహించింది మోహన్ లాల్ కదా. అంతా ఆయన కనిపిస్తాడనుకుంటే.. అడపాదడపా కనిపిస్తాడు. ఈయన పాత్ర భూతం కదా. జీనీలా అద్భుతాలు చేయొచ్చు. తర్వాత ఏం జరుగుతుందో అనే ఆత్రుతని కలిగించొచ్చు. కానీ మోహన్ లాల్ అలా చేయలేకపోయారు. సినిమా ప్రారంభం నుంచి ఈయన మార్క్ చూపించే, అరె భలే ఉందే అనిపించే సీన్ ఒక్కటీ ఉండదు. మోహన్ లాల్ కాకుండా మిగిలిన సీన్లలో మనకు ఏ మాత్రం పరిచయం లేని విదేశీ నటులు వచ్చిపోతుంటారు. ఒకరు తెలుగులో మాట్లాడితే మరొకరు పోర్చుగీస్‌లో మాట్లాడుతుంటారు. ఇది ఇబ్బందిగా అనిపించింది.హాలీవుడ్ సినిమాలని చూసిన మోహన్ లాల్.. వాటి స్ఫూర్తితో సినిమా చేద్దామని ఫిక్సయ్యారు. కానీ ప్రాంతీయ ప్రేక్షకులని ఆకట్టుకునేలా తీయలేకపోయారు. నేటివిటీ లేక ఆడియన్స్ డిస్ కనెక్ట్ అయ్యారు. ఇలాంటి పాయింట్ కోసం పోర్చుగీస్ కథల వరకే వెళ్లాల్సిన అవసరం లేదు. మన జానపదాలు వెతికితే ఎన్నో అద్భుతమైన కథలు కనిపిస్తాయి. ఆ దిశగా మోహన్ లాల్ ఆలోచించి ఉంటే లోకల్ ఆడియెన్స్‌కి సినిమా ఇంకా నచ్చి ఉండేది. దర్శకుడిగా త్రీడీ మూవీ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని తపించిన మోహన్ లాల్.. కంటెంట్‌పై సరిగా దృష్టి పెట్టలేదు. దీంతో మూవీ అటోఇటో అన్నట్లు సాగుతూ వెళ్తుంది.ఎవరెలా చేశారు?బరోజ్గా టైటిల్ రోల్ చేసిన మోహన్ లాల్.. పాత్రలో సరిగ్గా సరిపోయారు. హీరో కమ్ డైరెక్టర్ నేనే కదా అని అనవసర ఎలివేషన్ల జోలికి పోలేదు. పాత్రకు ఎంత కావాలో అంత ఇచ్చారు. కానీ ఇంకాస్త థ్రిల్లింగ్, ఎంటర్టైనింగ్గా బరోజ్ పాత్రని రాసుకుని ఉంటే బాగుండేది. ఇషా పాత్ర చేసిన మాయారావు చూడటానికి బాగుంది. యాక్టింగ్ ఓకే ఓకే. మిగిలిన విదేశీ నటీనటులు బాగానే చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫీ బాగుంది. అండర్ వాటర్ త్రీడీ విజువల్స్ ఔట్పుట్ మాత్రం అనుకున్నంతగా రాలేదు. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడు ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలే గుర్తొస్తాయి. నిర్మాణ విలువల మాత్రం టాప్ నాచ్ ఉన్నాయి. ఖర్చు విషయంలో అసలు వెనుకాడలేదు. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ బాగుంది.ఓవరాల్‌గా చెప్పుకొంటే మోహన్ లాల్ 'బరోజ్'తో కష్టపడ్డారు గానీ కంటెంట్ పరంగా తడబడ్డారు. దీంతో సగటు ప్రేక్షకుడు.. ఇది మా కోసం తీశారా? పోర్చుగీసు వాళ్ల కోసం తీశారా అని సందేహపడటం గ్యారంటీ.-చందు డొంకాన -
సైనికా నీ స్ఫూర్తికి సెల్యూట్
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘అమరన్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.సినిమా అన్నది మనకి చాలావరకు వినోద సాధనం మాత్రమే. కొన్ని సినిమాలు వినోదంతోపాటు విషయ విశ్లేషణను అందిస్తే మరికొన్ని మాత్రం మనకు స్ఫూర్తిదాయకమవుతాయి. అటువంటి ప్రత్యేకమైన సినిమానే ‘అమరన్’. ఈ సినిమా గురించి మాట్లాడుకునే ముందు దేశభక్తి, లేక సైనికులకు సంబంధించిన సినిమాలు చూసి నిజంగా మనం ఇప్పటిదాకా ఏమైనా స్ఫూర్తి పొందామా అన్న విషయం ఆలోచించుకోవాలి. ప్రతిరోజూ మనకి కరెంట్ పోతేనో లేక టైమ్‌కి ఫుడ్ అందకపోతేనో లేదంటే సినిమాకి టికెట్లు దొరక్కపోతేనో ఎంతో చిరాకు పడిపోతాం.కానీ కనురెప్ప మూసినా, రోజుల తరబడి ఆహారం అందకపోయినా అనుక్షణం ప్రమాదం పొంచి ఉన్నా విపరీత వాతావరణ పరిస్థితుల్లో కూడా తమ వారందరికీ దూరంగా తమ ప్రాణాన్ని పణంగా పెట్టి మన ప్రాణాలను కాపాడుతున్న మన సైనికుల కష్టం నేడు ఎంత మందికి తెలుసు. ఓ సైనికుడు తన ము΄్పాతిక భాగం జీవితాన్ని డ్యూటీలోనే గడిపేస్తాడట. అలాగే తన కుటుంబాన్ని, ప్రాణాన్ని పణంగా పెట్టి డ్యూటీ చేసేవాడు సైనికుడు. అటువంటి సైనికుడి కథే ఈ ‘అమరన్’. ఇదో వాస్తవ గాథ. తమిళనాడుకు చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ 2014 సంవత్సరం ఏప్రిల్ 25న వీరమరణం పొందారు. అప్పటినుండి దేశమంతా ఆయన పేరు మార్మోగిపోయింది.అసలెవరీ ముకుంద్, అతను సైనికుడు ఎలా, ఎందుకు అయ్యాడు? అన్నదే ఈ ‘అమరన్’ సినిమా. 44 రాష్ట్రీయ రైఫిల్స్ దళానికి చెందిన ఇతడు 2006 లెఫ్టినెంట్ స్థాయిలో ఉన్న ముకుంద్ ఆరేళ్ల లోపే మేజర్ స్థాయికి ఎదిగాడంటే అతని సామర్థ్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. రాజ్ కుమార్ పెరియస్వామి ఈ సినిమాకి దర్శకుడు. ప్రముఖ తమిళ హీరో శివకార్తికేయన్ మేజర్ ముకుంద్పాత్రకు ప్రాణం పోశారు. ఆయనకు జోడీగా సాయి పల్లవి నటించారు. ఆమె కూడా తనదైన శైలిలో అద్భుతంగా నటించారు. మంచి స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా మనల్ని కాసేపు మేజర్ జీవితంతో ప్రయాణ అనుభూతినిస్తుంది. ఈ సినిమాలో ముకుంద్ ధైర్యసాహసాలు, తెగువకు మించి అతని సైనిక స్ఫూర్తిని ఎంతో సవివరంగా చూపించారు దర్శకుడు. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా ‘అమరన్’ తెలుగులోనూ లభ్యమవుతోంది. ప్రతిక్షణం మన కోసం తన వాళ్లని వదులుకుని ప్రాణత్యాగానికైనా వెనుకాడని మన అమర వీరుల దినోత్సవం అయిన ఈ జనవరి 30న కనీసం ఓ సెల్యూట్ అయినా చేద్దాం, అలాగే అందరితో చేయిద్దాం. ఎందుకంటే అంతటి అసమాన వీరులకు మనం ఇచ్చే చిన్నపాటి కృతజ్ఞత ఇదే. – ఇంటూరి హరికృష్ణ -
టాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్.. ఫియర్ మూవీ ఆడియన్స్‌ను భయపెట్టిందా?
టైటిల్: ఫియర్నటీనటులు: వేదిక, అరవింద్ కృష్ణ, జెపి ( జయప్రకాష్ ), పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులునిర్మాణ సంస్థ: దత్తాత్రేయ మీడియానిర్మాత: డా. వంకీ పెంచలయ్య, ఏఆర్ అభిరచన, ఎడిటింగ్, దర్శకత్వం : డా. హరిత గోగినేనిసంగీతం: అనూప్ రూబెన్స్సినిమాటోగ్రఫీ: ఐ ఆండ్రూవిడుదల తేది: డిసెంబర్ 14, 2024వేదిక, అరవింద్ కృష్ణ ప్రధాన పాత్రల్లో వచ్చిన సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫియర్. డా. హరిత గోగినేని డైరెక్షన్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం డిసెంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే విడుదలకు ముందే ఈ మూవీ పలు అవార్డులు దక్కించుకుంది. ఇప్పటికే ప్రీమియర్ షోలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్ మెప్పించిందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.కథేంటంటే..సింధు(వేదిక) అనే అమ్మాయి సైకలాజికల్ డిజార్డర్‌తో బాధపడుతూ ఉంటోంది. లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు ఊహించుకుని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఒకరోజు తాను ప్రాణంగా ప్రేమించే అరవింద్ కృష్ణ(సంపత్) దూరం కావడంతో మరింత మనోవేదనకు గురి అవుతుంది. అంతేకాకుండా తన చెల్లి ఇందుతో గొడవ పడటం, పేరేంట్స్‌కు దూరంగా ఉండటం లాంటి సింధును మరింత కుంగదీస్తాయి. అసలు సింధు తన చెల్లితో ఎందుకు గొడవ పడింది? తల్లిదండ్రులకు దూరంగా ఉండటానికి కారణమేంటి? ఆమె ప్రియుడు సంపత్ తిరిగొచ్చాడా? అనేది తెలియాలంటే ఫియర్ చూడాల్సిందే.కథ ఎలా ఉందంటే..గతంలో సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు చాలానే వచ్చాయి. కానీ ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ మాత్రం చాలా అరుదుగానే ఉంటాయి. మొదటిసారి తల్లిదండ్రులను ఆలోచింపజేసేలా ఉంది ఈ ఫియర్ స్టోరీ. ఈ కథ మొత్తం సింధు చుట్టూనే తిరుగుతుంది. ఆమె ప్రియుడు సంపత్ దూరం కావడంతో మానసికంగా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఎక్కడికెళ్లినా ఎవరో తనను వెంబడిస్తున్నారనే భ్రమలో ఉంటూ భయానికి గురవుతుంది. కొన్ని సీన్స్‌లో వచ్చే ట్విస్టులు ఆడియన్స్‌లో కన్ఫ్యూజన్కు గురి చేస్తాయి. ఆ తర్వాత ఏం జరిగిందన్న క్యూరియాసిటీని మిస్ అవ్వకుండా డైరెక్టర్ జాగ్రత్తపడ్డారు.సెకండాఫ్ వచ్చేసరికి అసలు సింధుకు అలా మారడానికి దారితీసిన పరిస్థితులు ఆడియన్స్‌ను ఆలోచించేలా చేస్తాయి. అసలు సింధుకు నిజంగానే సైకాలాజికల్ డిజార్డర్ ఉందా? ఎవరికీ కనిపించని వ్యక్తులు.. ఆమెకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నారు? సింధుకు కనిపిస్తున్నవారంతా ఆమె జీవితంలో ఉన్నారా? లేదంటే కావాలనే తాను అలా ప్రవర్తిస్తోందా? అనే క్యూరియాసిటీ ఉండేలా కథను మలిచాడు డైరెక్టర్. కథ మొదలైనప్పటి నుంచి సినిమా క్లైమాక్స్ వరకు ట్విస్ట్‌లు, సస్పెన్స్ ఆడియన్స్‌ను కట్టిపడేస్తాయి. అయితే డైరెక్టర్ తాను అనుకున్న కథను తెరపై చక్కగా ఆవిష్కరించారు. స్లో నేరేషన్ అక్కడక్కడా బోరింగ్‌గా అనిపిస్తుంది. కానీ స్క్రీన్ ప్లే విషయంలో మరింత ఫోకస్ చేయాల్సింది. కొన్ని సీన్స్‌లో కథలో కనెక్షన్ మిస్సయినట్లు అనిపిస్తుంది. ఓవరాల్‌గా సస్పెన్స్ థ్రిల్లర్‌తో పాటు తల్లిదండ్రులకు మంచి మేసేజ్ ఇచ్చేలా ఉంది ఫియర్ మూవీ.ఎవరెలా చేశారంటే..లీడ్‌రోల్ పోషించిన వేదిక ద్విపాత్రాభినయంతో అభిమానులను కట్టిపడేసింది. సంపత్ పాత్రలో అరవింద్ కృష్ణ మెప్పించాడు. పవిత్రా లోకేశ్, షాయాజీ షిండే, జయప్రకాశ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సాంకేతికత విషయానికొస్తే ఐ ఆండ్రూ సినిమాటోగ్రఫీ బాగుంది. అనూప్ రూబెన్స్ బీజీఎం ఈ సినిమాకు కాస్తా ప్లస్ అనే చెప్పొచ్చు. ఎడిటింగ్ మరింత క్రిస్పీగా ఉండాల్సింది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.రేటింగ్ : 2.75/5 -
బిగ్ బాస్ ఈ వారం విశ్లేషణ...'కవరేజ్ ఫుల్లు, కంటెంట్ నిల్లు'
బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ ఆఖరి దశకు వచ్చింది. అలాగే బిగ్ బాస్ ప్రోగ్రామ్‌లో కంటెంట్ కూడా బాగా తగ్గిందనే విషయం ఈ వారం ఇంకా బాగా కొట్టొచ్చినట్టు కనబడింది. ఈ వారం ఆరంభం ఆఖరి నామిమేషన్స్ తో మొదలవగా టాప్ 5 ఫైనలిస్టులతో వారం ముగిసింది. ఆఖరి నామినేషన్స్ కాబట్టి, కంటెస్టెంట్స్ వాళ్ళ వాడే భాష డోసు పెంచి (అంటే పరుషపదజాలం వాడుతూ) బిగ్ బాస్‌కు కాస్త ఆనందం కలిగించారు. ఒక్క అవినాష్ మినహా మిగతా అందరూ నామినేట్ అయ్యారు. ఇంక అవడానికి, చేయడానికి ఎవరూ లేరు కాబట్టి. దాని తరువాత ఓట్ అప్పీల్ కోసం కొన్ని వింత టాస్కులతో ఆఖరి దశలోని ఓ వివాద అంకాన్ని పూర్తి చేశాడు బిగ్ బాస్. హౌస్‌లో వున్న కంటెస్టెంట్స్ దగ్గర కంటెంట్ ఇక రాదు అనుకున్నాడో ఏమో బిగ్ బాస్ బయట నుండి పర్ఫామర్స్ని తెప్పించి అటు కంటెస్టెంట్స్‌ను ఇటు ఆడియన్స్‌ను మెప్పించడానికి ప్రయత్నించాడు బిగ్ బాస్. కంటెంట్ లేక ఫుల్ కవరేజ్ కోసం వీకెండ్లో కాస్త ఓవరాక్షన్ టాస్కులను కంటెస్టంట్స్ చేత చేయించి మితిమీరాడు బిగ్ బాస్. దానిలో భాగంగా డాన్స్ టాస్కులలో మన సంస్కృతికి మణిహారమైన సాగరసంగమం చిత్రంలోని తకిటతథిమి... పాటను అసభ్యకరమైన పోల్ డాన్సు రూపాన వికృత భంగిమలతో నాట్యం చేయించడం ఒకటైతే, సంప్రదాయమైన నాట్య రూపాలతో హేయమైన ఊ... అంటావా ఊహూ అంటావా... పాటలతో చేయించడం రెండోది. కంటెంట్ కోసం వినూత్నంగా విభిన్నంగా ఆలోచించి ఆచరించడం మంచిదే, కాని ఇలాంటి విపరీత, వింత పోకడలతో వినోదాన్ని పంచడం ఎంతవరకు సబబు. నాలుగు డబ్బులు కోసం మన సంస్కృతిని కించపరిచేంత దిగజారాలా బిగ్ బాస్. ఎంత కంటెంట్ నిల్లయితే మాత్రం కవరేజ్ కోసం ఇటువంటి కతలవసరమా.. ఇంకో వారం ఇంకెలాంటి విడ్డూరాలు చూడాల్సివస్తుందో...- హరికృష్ణ ఇంటూరు -
ఓ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రా జెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం ‘ది బకింగ్‌హామ్ మర్డర్స్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.నేరం ఎక్కడ జరిగినా నేరస్తుడి కోణంలో పరిశోధన జరిపితే నేరస్తుడు సులభంగా దొరుకుతాడు అని చెప్పే సినిమా ‘ది బకింగ్‌హామ్ మర్డర్స్’. ఇదో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకొని అల్లుకున్న కథ ఇది. 2023 అక్టోబర్ 14న జరిగిన 67వ లండన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. ఈ సినిమాని దర్శకులు హన్సల్ మెహతా రూ΄÷ందించారు. ఇందులో ముఖ్య పాత్రధారి అయిన జస్మీత్ భమ్రా పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ నటించారు.ఇక ఈ సినిమా కథాంశానికొస్తే... జస్మీత్ ఓ బ్రిటీష్ ఇండియన్ డిటెక్టివ్. తన కొడుకు ఓ డ్రగ్ అడిక్ట్ చేతిలో చనిపోతాడు. ఆ విషయాన్ని తట్టుకోలేక జస్మీత్ బకింగ్‌హామ్ నగరానికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటుంది. బకింగ్హామ్కు రావడంతోనే ఓ కేసు తనకు తానే కావాలని తీసుకుంటుంది. బకింగ్హామ్లో నివాసం ఉంటున్న దల్జీత్, ప్రీతి కొల్లి దత్తపుత్రుడు ఇష్ ప్రీత్ కనబడడం లేదన్నది ఆ కేసు సారాంశం. ఈ కేసు జస్మీత్ తీసుకోవడానికి కారణం తప్పిపోయిన ఇష్ ప్రీత్ సరిగ్గా తన కొడుకు వయసు వాడవడం ఒకటయితే ఈ కేసులో డ్రగ్స్ పాత్ర ఉండడం రెండో కారణం. ఓ పక్క కొడుకును పోగొట్టుకున్న బాధతో మరో పక్క కనబడని బిడ్డ కోసం తల్లిదండ్రులకు తోడుగా ఈ కేసును జస్మీత్ ఎలా పరిష్కరించింది అన్నదే మిగతా సినిమా. సాధారణంగా క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ సినిమాలంటే అందరూ ఇష్టపడరు. కానీ ఈ సినిమా చూసే కొద్దీ చూస్తున్నవాళ్లు బాగా ఇన్వాల్వ్ అవుతారు. ఇక సినిమా స్క్రీన్‌ప్లే ఊహకందని ట్విస్టులతో ఉత్కంఠ రేపుతుంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఓ హైలైట్ అనే చెప్పాలి. జస్మీత్ భమ్రా పాత్రలో కరీనా కపూర్ జీవించారనే చెప్పాలి. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా దాదాపు మూడు వారాల నుండి టాప్ 10లో నిలిచింది. వర్తఫుల్ మూవీ ఫర్ దిస్ వీకెండ్ వాచిట్. – హరికృష్ణ ఇంటూరు -
మిడ్‌క్యాప్‌లో మెరుగైన రాబడి
ఈక్విటీల్లో దీర్ఘకాలానికి పెట్టుబడులు పెట్టాలని భావించే వారు లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు పోర్ట్‌ఫోలియోలో చోటు కల్పించుకోవచ్చు. తమ రిస్క్, రాబడుల ఆకాంక్షలకు అనుగుణంగా ఏ విభాగానికి ఎంత కేటాయింపులన్నవి తేల్చుకోవాలి. లార్జ్‌క్యాప్‌తో పోల్చిచూసినప్పుడు కొంత రిస్క్ అధికంగా ఉన్నప్పటికీ 10–20 ఏళ్ల కాలంలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్ అధిక రాబడులు ఇవ్వగలవు. మిడ్‌క్యాప్ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న వాటిల్లో కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీస్ ఒకటి. దీర్ఘకాల లక్ష్యాల కోసం రిస్క్ భరించే సామర్థ్యం ఉన్నవారు ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. మిడ్క్యాప్తోపాటు లార్జ్‌క్యాప్ పెట్టుబడులకూ ఈ పథకం ప్రాధాన్యం ఇస్తుంటుంది.రాబడులు ఈ పథకం దీర్ఘకాల పనితీరును గమనించినట్టయితే రాబడులు మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఏడాది కాలంలో ఈ పథకంలో రాబడులు 38 శాతానికి పైగా ఉన్నాయంటే పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గడిచిన ఐదేళ్లలో 27 శాతం, ఏడేళ్లలో 18.47 శాతం, పదేళ్లలో 18.84 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇచ్చి.. మిడ్‌క్యాప్ విభాగంలోని మెరుగైన పథకాల్లో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా ఏడాది, ఏడేళ్లు, పదేళ్ల కాలాల్లో బెంచ్‌మార్క్ సూచీ ‘బీఎస్ఈ 150 మిడ్‌క్యాప్ టీఆర్ఐ’ కంటే ఈ పథకం పనితీరే మెరుగ్గా ఉంది. 2007 మే నెలలో ఈ పథకం మొదలు కాగా, నాటి నుంచి చూస్తే వార్షిక సగటు రాబడి 15.75 శాతంగా ఉంది. ఈ పథకంలో ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే చార్జీ (ఎక్స్పెన్స్ రేషియో) 1.43 శాతంగా ఉంది.పెట్టుబడుల విధానం కనీసం 65 శాతం నుంచి గరిష్టంగా 100 శాతం వరకు పెట్టుబడులను మిడ్‌క్యాప్ కంపెనీలకు కేటాయించడం ఈ పథకం పెట్టుబడుల విధానంలో భాగం. 2018, 2020 మార్కెట్ కరెక్షన్లలో ఈ పథకం నష్టాలను పరిమితం చేసింది. ఆ తర్వాతి ర్యాలీల్లో మెరుగైన రాబడులను ఇచ్చింది. వృద్ధికి అవకాశం ఉండి, అంతగా వెలుగులోకి రాని పటిష్టమైన కంపెనీలను గుర్తించి ఇన్వెస్ట్ చేస్తుంటుంది. పోర్ట్‌ఫోలియోలో వ్యాల్యూ స్టాక్స్‌కు ప్రాధాన్యం ఇస్తుంది. మంచి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడమే కాదు.. తగిన రాబడులు ఇచ్చే వరకు ఆ పెట్టుబడులు కొనసాగిస్తుంటుంది.ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో 50,627 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇందులో 96 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. డెట్ పెట్టుబడులు 0.21 శాతంగా ఉన్నాయి. నగదు, నగదు సమానాలు 3.7 శాతంగా ఉన్నాయి. ఈక్విటీల్లో 40 శాతం మేర లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. 58 శాతం పెట్టుబడులను మిడ్‌క్యాప్‌లకు కేటాయించింది. స్మాల్‌క్యాప్ పెట్టుబడులు 1.44 శాతంగా ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో 66 స్టాక్స్ ఉన్నాయి. ఇందులో టాప్–10 కంపెనీల్లో పెట్టుబడులు 29 శాతంగా ఉన్నాయి. పోర్ట్‌ఫోలియో కాన్సంట్రేషన్ తక్కువ అని అర్థమవుతోంది. పెట్టుబడుల పరంగా టెక్నాలజీ, మెటీరియల్స్, ఇండస్ట్రియల్స్, కన్జ్యూమర్ డిస్క్రీషినరీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 78 శాతం పెట్టుబడులు ఈ రంగాల కంపెనీల్లోనే ఉన్నాయి.టాప్ ఈక్విటీ హోల్డింగ్స్కంపెనీ పెట్టుబడులు శాతంపర్సిస్టెంట్ సిస్టమ్స్ 4.16 ఒరాకిల్ ఫిన్ 3.51 ఎంఫసిస్ 3.31 ఒబెరాయ్ రియల్టీ 3.11 ఫోర్టిస్ హల్త్‌కేర్ 3.05 ఇప్కా ల్యాబ్ 3.01 కోరమాండల్ 2.49 పీఐ ఇండస్ట్రీస్ 2.39 సోలార్ ఇండస్ట్రీస్ 2.23 సుప్రీమ్ ఇండస్ట్రీస్ 2.19 -
OTT Review: నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా?
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘ఎ క్వైట్ ప్లేస్ డే వన్’ ఒకటి. ఈ చిత్రం గురించి...ప్రతి మనిషికీ ఆలోచనలుంటాయి. కానీ కొంతమందికి ప్రత్యేక ఆలోచనలొస్తాయి. మరీ ముఖ్యంగా హాలీవుడ్ దర్శకులకు విపరీత ధోరణితో ఆలోచనలొస్తాయి. అవి వాళ్లు సినిమాల రూపంలో ప్రేక్షకుల ముందుంచుతారు. ఆ నేపథ్యంలో వచ్చిన సినిమానే ‘ఎ క్వైట్ ప్లేస్ డే వన్’. ఈ సినిమా సిరీస్‌లో మూడవది. ఈ సిరీస్‌లో వచ్చిన మూడు సినిమాలూ సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు వచ్చిన ‘ఎ క్వైట్ ప్లేస్ డే వన్’ నెల రోజుల క్రితమే ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా పెయిడ్ ఫార్మెట్లో విడుదలవగా... ఈ వారమది అందరికీ అందుబాటులోకి వచ్చింది. దాదాపు ముప్పైఏడేళ్ల క్రితం ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు ‘పుష్పక విమానం’ అనే ప్రత్యేకమైన సినిమా తీశారు. ఒక్క డైలాగ్ లేకుండా చక్కటి కామెడీతో చూడముచ్చటగా ఉంటుందా చిత్రం. దాదాపు అలాంటి కోవకే చెందిన ఇంగ్లిష్ చిత్రం ‘ఎ క్వైట్ ప్లేస్ డే వన్’ చూసేవాళ్లకు చెమటలు పట్టించడం ఖాయం. మాటలు తక్కువున్నా ప్రేక్షకులకు దడ పుట్టిస్తుంది. జాన్ క్రసింస్కీ ఈ సిరీస్‌లో వచ్చిన చిత్రాలన్నిటికీ రచయిత. మొదటి రెండు చిత్రాలకు తాను దర్శకత్వం వహించగా తాజా చిత్రానికి మైఖేల్ సర్నోస్కీ దర్శకత్వం వహించారు.ఈ సినిమా కథ ప్రకారం... న్యూయార్క్‌లో హాస్ స్పైస్ అనే ఫెసిలిటీలో క్యాన్సర్ పేషంట్‌గా ఉన్న సామ్ తన కుక్క పిల్లతో వాలంటీర్ రూబెన్‌తో కలిసి ఓ ప్లే చూడడానికి సిటీలోకి వెళ్తుంది. సామ్‌కి సంగీతం అంటే ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒకటి వింటుంటుంది. అప్పుడే మాన్హాట్టన్ నగరంపై ఏలియన్స్ దాడి జరుగుతుంది. ఈ ఏలియన్స్ ఎక్కడైనా శబ్దం వస్తే చాలు కనిపించిన మనుషులపై దాడి చేస్తూ ఉంటాయి.నగరమంతా వాటి దాడి వల్ల క్షణాల్లో నిర్మాణుష్యమై΄ోతుంది. అక్కడక్కడా శబ్దం చేయకుండా బ్రతికున్నవాళ్లు ఏలియన్స్ నుండి తప్పించుకుంటూ ఉంటారు. అసలే క్యాన్సర్ బారిన పడిన సామ్ ఈ ఏలియన్స్ దాడిని ఎలా ఎదుర్కొందనేది మిగతా కథ. పైన చెప్పుకున్నట్టు ఈ నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ సినిమా చూశాక తెలుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం... ఈ వీకెండ్ చూసెయ్యండి. – ఇంటూరు హరికృష్ణ -
Zebra Movie Review: 'జీబ్రా' ట్విటర్ రివ్యూ
తెలుగులో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో సత్యదేవ్ ఒకడు. నటుడిగా బాగానే పేరొచ్చింది కానీ హీరోగా మాత్రం ఇంకా నిలదొక్కుకోలేకపోతున్నారు. ఇతడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'జీబ్రా'. 'పుష్ప'లో జాలిరెడ్డిగా చేసిన కన్నడ నటుడు ధనంజయ మరో కీలక పాత్ర పోషించాడు. బ్యాంక్ స్కామ్ తరహా స్టోరీతో తీసిన ఈ చిత్రం తాజాగా (నవంబర్ 22) థియేటర్లలోకి వచ్చింది.(ఇదీ చదవండి: రౌడీలా రెచ్చిపోయిన పృథ్వీ.. విశ్వక్సేన్ దగ్గర అవినాష్ కక్కుర్తి!)సత్యదేవ్ 'జీబ్రా' సినిమా ప్రీమియర్లు పడ్డాయి. అలానే కొన్నిచోట్ల షోలు కూడా షురూ అయిపోయాయి. దీంతో ట్విటర్లో టాక్ బయటకొచ్చింది. కామెడీ, థ్రిల్, ట్విస్టులు అదిరిపోయాయని అంటున్నారు. అదే టైంలో సత్యదేవ్ మంచి మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడని చెబుతున్నారు. సత్య కామెడీ కూడా వర్కౌట్ అయిందని చెబుతున్నారు. ఇంతకీ ట్విటర్లో ఎవరు ఏమంటున్నారంటే?(ఇదీ చదవండి: Mechanic Rocky X Review: ‘మెకానిక్ రాకీ’ టాక్ ఎలా ఉందంటే..?)Show completed:- #zebra Very very good movie Ok 1st half Blockbuster 2nd half 👌👌My rating 3/5 pic.twitter.com/DAhjTkUAvz— venkatesh kilaru (@kilaru_venki) November 21, 2024#Zebra Review ⭐🌟🌟 🌟#EashvarKarthic's sharp writing and engaging screenplay keep you hooked.@ActorSatyaDev & @Dhananjayaka screen presence steals the show & Nailed it 🔥🔥Comeback for both Actorbest Heist Drama . especially Bank Employee should not miss this movie . pic.twitter.com/KXFnGvq0ZW— Filmy Feed (@filmy_feed_) November 21, 2024#Zebra Review: SatyaDev’s Thriller 🔥❤️🔥Super First Half with Blockbuster Second Half 🔥🔥Mainly @ActorSatyaDev made his comeback super Strong 💪 with perfect 👌 script 💥Our Rating : 3.5/5 💥💥💥💥#SatyaDev #Zebra pic.twitter.com/WmNkei4BWi— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) November 22, 2024#Zebra : Worthu varma Worthu 🤌🔥🔥Comedy ✅ Suspence ✅ Action ✅ Thrills ✅ all are worked very well. Enjoyed alot.👏🔥🔥🔥- Master Mind Satya Dev Is back after Bluff Master 🤌🔥- Dhananjaja characterization 😈🔥- Satya as usual 🤯🔥🔥 - Priya Bhavani Shankar 😌❤️🔥-… pic.twitter.com/61IPWDQEtJ— SRi Harsha 😈 (@SSanivaar) November 21, 2024#Zebra - UNEXPECTED🔥Easily one of the best film in 2024 ♥️Lucky Baskar kind of Bank robbery film❤️🔥❤️🔥BGM & Robbery scenes are 🔥🔥🔥@ActorSatyaDev @Dhananjayaka @RaviBasrur @priya_Bshankar pic.twitter.com/I5oN8mp9gh— RAJA DK (@rajaduraikannan) November 21, 2024#SatyaDev's #ZebraReview - Second Half 👉 @Satyadev makes a solid comeback, delivering the much-needed punch.👉 #ZEBRA floats seamlessly with the right mix of fun, thrill, and twists.👉 #EashvarKarthic's sharp writing and engaging screenplay keep you hooked.👉… pic.twitter.com/xl2F7HFv5y— Pakka Telugu Media (@pakkatelugunewz) November 21, 2024Extraordinary Cinema 👌👌20's Scam ❤️🔥❤️🔥Duo Satya's 👌🤣🤣#Zebra pic.twitter.com/BvvifqNB3W— .Mark (@Aark_in_exile) November 21, 2024#Zebra #Review #Satyadev makes a solid comeback the much-needed 👊#ZEBRA floats with the mix of fun, thrill, and full of twists.#Satya 🔥🔥🙏Director sharp writing and engaging screenplay keep you hooked.Pre-climax and climax twist land perfectly.🔥🤙👊My rating: 🌟🌟🌟 pic.twitter.com/sjfrWFpeqh— Daily Newzzzz (@Not_Elon_Muskk) November 21, 2024#Zebra Review: SatyaDev’s Thriller 🔥❤️🔥 #SatyaDev 🤯Action ✅ Comedy ✅ Drama ✅All worked wellSuper First Half And Blockbuster Second Half 🔥🔥#BlockbusterZebra 💥💥💥Mainly @ActorSatyaDev made his comeback super Strong 💪 with perfect 👌 script 💥💥💥🤯(Movie Mania 3.5/5)… pic.twitter.com/kRNeaFJnEJ— Movie Mania (@Nimmapandu28) November 22, 2024 -
ఇకపై రివ్యూవర్లకు ఆ ఛాన్స్ లేదు
-
రిస్క్ తక్కువ.. రాబడులు స్థిరం
రిస్క్ పెద్దగా భరించలేని వారు, అదే సమయంలో ఈక్విటీ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయాలని భావించే వారు యూటీఐ ఫ్లెక్సీక్యాప్ ఫండ్‌ను పరిశీలించొచ్చు. దీర్ఘకాలంలో రాబడుల చరిత్ర స్థిరంగా ఉంది. గతంలో యూటీఐ ఈక్విటీ ఫండ్‌గా కొనసాగిన ఈ పథకం, 2017 అక్టోబర్‌లో సెబీ తీసుకొచ్చిన పునర్వ్యవస్థీకరణ నిబంధనల అనంతరం ఫ్లెక్సీక్యాప్గా మారింది.ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ విభాగాల్లో స్వేచ్ఛగా ఇన్వెస్ట్ చేయగలవు. మెరుగైన అవకాశాలున్న చోట ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు నిబంధనల పరంగా వెసులుబాటు ఉంటుంది. రిస్క్–రాబడుల సమతుల్యానికి ఈ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు ఈ పథకం 2008, 2011, 2020 కరెక్షన్ సమయాల్లో నష్టాలను పరిమితం చేయడాన్ని గమనించొచ్చు. ఐదేళ్లు, ఏడేళ్లు, పదేళ్ల కాలంలో చూస్తే సగటున మెరుగైన రాబడులు ఉన్నాయి. ఈ పథకం రాబడులకు ఎస్అండ్పీ నిఫ్టీ 500 సూచీ ప్రామాణికం. ఏడాది కాలంలో ఈ పథకం 24 శాతం మేర రాబడులు అందించింది. ఐదేళ్ల కాలంలో సగటున వార్షికంగా 16.47 శాతం రాబడులు ఇచ్చింది.ఏడేళ్ల కాలంలో ఏటా 14 శాతం, పదేళ్ల కాలంలో ఏటా 12.50 శాతం చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. పోటీ పథకాలతో పోల్చితే రాబడులు కొంత తక్కువగా కనిపించినప్పటికీ.. కరెక్షన్ సమయాల్లో నష్టాలను పరిమితం చేయడంలో ఈ పథకం మెరుగైన పనితీరు చూపిస్తోంది. రాబడుల చరిత్ర గొప్పగా లేకున్నా, దీర్ఘకాలానికి మెరుగ్గా ఉంది. స్థిరంగా తక్కువ ఆటుపోట్లతో ఉన్నందున రిస్క్ తక్కువ కోరుకునే వారికి మంచి ఎంపిక అవుతుంది. ముఖ్యంగా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేసుకుంటే మరింత మెరుగైన రాబడులు అందుకోవచ్చు. పెట్టుబడుల విధానం/ పోర్ట్‌ఫోలియో ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి రూ.27,706 కోట్ల పెట్టుబడులు (నిర్వహణ ఆస్తులు/ఏయూఎం) ఉన్నాయి. దీర్ఘకాల చరిత్ర ఉండడంతో పెద్ద పథకాల్లో ఒకటి కావడం గమనార్హం. నిర్వహణ ఆస్తుల్లో 96 శాతం మేర ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, 0.52 శాతం మేర డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టింది. 3.45 శాతం మేర నగదు నిల్వలు కలిగి ఉంది. ప్రస్తుత మార్కెట్ దిద్దుబాటులో ఆకర్షణీయ అవకాశాలకు వీలుగా నగదు నిల్వలు కలిగి ఉన్నట్టు అర్థమవుతోంది.ఈక్విటీ పెట్టుబడులు గమనించగా, 70 శాతం వరకు లార్జ్‌క్యాప్‌లో ఉంటే, మిడ్‌క్యాప్‌లో 28 శాతం, స్మాల్‌క్యాప్‌లో 2 శాతం వరకు పెట్టుబడులు పెట్టింది. టాప్–10 స్టాక్స్‌లోనే 42 శాతం మేర పెట్టుబడులు ఉన్నాయి. పెట్టుబడులను గమనించినట్టయితే.. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి ఎక్కువ వెయిటేజీ ఇస్తూ, 22 శాతం పెట్టుబడులను ఈ రంగాలకు చెందిన కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత టెక్నాలజీ కంపెనీలకు 22 శాతం, కన్జ్యూమర్ డిస్క్రీషినరీ రంగానికి 18 శాతం, హెల్త్‌కేర్ కంపెనీలకు 12 శాతం చొప్పున పెట్టుబడులు కేటాయించింది. -
Kanguva Review: 'కంగువా' మూవీ రివ్యూ
టైటిల్: కంగువానటీనటులు: సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులునిర్మాణ సంస్థ: స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్నిర్మాతలు: కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్దర్శకత్వం: శివసంగీతం: దేవీవ్రీ ప్రసాద్సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామిఎడిటర్: నిశాద్ యూసుఫ్విడుదల తేది: నవంబర్ 14, 2024కథేంటి అంటే?కంగువ కథ 1070 - 2024 మధ్య నడుస్తుంది. 2024లో ఒక ప్రయోగశాల నుంచి జీటా అనే బాలుడు తప్పించుకుని గోవా వెళ్తాడు. మరోవైపు గోవాలో ఫ్రాన్సిస్ (సూర్య), కోల్ట్ (యోగిబాబు) బౌంటీ హంటర్స్‌గా ఉంటారు. పోలీసులు కూడా పట్టుకోలేని క్రిమినల్స్‌ను వారు పట్టుకుంటూ ఉంటారు. గోవాకు చేరుకున్న జీటాని ఫ్రాన్సిస్ అదుపులోకి తీసుకుంటాడు. ఈ క్రమంలో ఒక నేరస్తుడిని పట్టుకునే క్రమంలో ఒకరిని హత్య చేస్తాడు. ఈ హత్యను జీటా చూస్తాడు. అంతేకాదు ఫ్రాన్సిస్‌ను చూడగానే ఏదో తెలిసిన వ్యక్తిలా జీటా ఫీల్ అవుతాడు. ఫ్రాన్సిస్ కూడా జీటాతో ఏదో కనెక్షన్ ఉండేవాడిలా ఫీల్ అవుతాడు. హత్య విషయాన్ని బయట చెప్పకుండా ఉండేందుకు జీటాను తన ఇంటికి తెచ్చుకుంటాడు. ఇదే క్రమంలో జీటాను పట్టుకునేందుకు ల్యాబ్ నుంచి కొంతమంది వస్తారు. వారినుంచి జీటానీ కాపాడేందుకు ఫ్రాన్సిస్ ప్రయత్నిస్తుండగా కథ 1070లోకి వెళ్తుతుంది. అసలు జీటా ఎవరు..? అతనిపై చేసిన ప్రయోగం ఏంటి..? ఫ్రాన్సిస్, జీటా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి..? 1070కి చెందిన కంగువా(సూర్య) ఎవరు..? కపాల కోన నాయకుడు రుధిర ( బాబీ డియోల్)తో కంగువకి ఉన్న వైరం ఏంటి..? పులోమ ఎవరు? కంగువపై అతనికి ఎందుకు కోపం? భారత దేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు రోమానియా సైన్యం వేసిన ప్లాన్ ఏంటి..? ప్రణవాది కోన ప్రజలను కాపాడుకోవడం కోసం కంగువ చేసిన పోరాటం ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఎంత గొప్ప కథ అయినా సరే ప్రేక్షకులకు అర్థం అయ్యేలా చెప్తేనే ఆ సినిమాని ఆదరిస్తారు. ముఖ్యంగా కథ చెప్పడంలో విసిగించకుండా అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లు.. కథ చెప్పాలి. లేకపోతే ఎంత మంచి కథ అయినా...అంతే సంగతి. దర్శకుడు శివ రాసుకున్న కథ చాలా గొప్పది. కానీ అంతే గొప్పగా తెరపై చూపించడంలో కాస్త తడబడ్డాడు. సినిమా ఫస్టాఫ్ ప్రేక్షకులను మెప్పించడంలో దర్శకుడు కాస్త విఫలం అయ్యారు. సినిమా చూస్తున్నంతసేపు సూర్య పాత్ర మాత్రమే ప్రధానంగా ఉంటుంది. అయితే, స్క్రీన్ మీద ఉన్న క్యారెక్టర్లు అన్నీ ఆడియెన్స్‌ను విసిగిస్తూనే ఉంటాయి. యోగిబాబు, రెడిన్ కింగ్స్లే కామెడీతో విసింగేచేశారనే ఫీల్ అందరిలోనూ కలుగుతుంది.సినిమా ప్రారంభమైన సుమారు 30 నిమిషాల తర్వాత అసలు కథలోకి దర్శకుడు శివ వెళ్తాడు. అప్పటి వరకు ఆడియన్స్‌ను దర్శకుడు విషింగించారనే చెప్పవచ్చు. ఎప్పుడైతే పీరియాడిక్ పోర్షన్ మొదలౌతుందో అక్కడి నుంచి కాస్త ఫర్వాలేదనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా కథ అంతా సెకండాఫ్‌లోనే ఉంటుంది. అప్పుడు వచ్చే వార్ ఎపిసోడ్లు అందరినీ మెప్పించడమే కాకుండా గూస్బంప్స్ తెప్పిస్తాయి. ఫస్టాఫ్‌ను దర్శకుడు ఇంకాస్త బాగా తీసింటే కంగువా మరింత గొప్ప సినిమాగా ఉండేది. ఫస్టాఫ్‌లో సూర్య, దిశా పటానీ లవ్ స్టోరీ అంతగా కనెక్ట్ కాలేదు.విలన్‌గా బాబీ డియోల్ లుక్ బాగున్నప్పటికీ ఆయన పాత్రను చూపించడంలో ఆ క్రూరత్వం కనిపించదు. ఇక్కడ కూడా డైరెక్టర్ శివ కాస్త నిరుత్సాహపరిచారు. అయితే, భారీ ఎమోషనల్ బ్యాంగ్‌తో సినిమాను ఎండ్ చేస్తారు. క్లైమ్యాక్స్ తర్వాత మాత్రం రెండు ట్విస్టులు ఇచ్చిన దర్శకుడు శివ.. సీక్వెల్‌కు మంచి లీడ్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.ఎవరెలా చేశారంటే.. సూర్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేస్తారు. ఈ చిత్రం కోసం ఆయన ప్రాణం పెట్టి నటించారు. కంగువా, ఫ్రాన్సిస్ అనే రెండు విభిన్న పాత్రలో కనిపించిన సూర్య.. ప్రతి పాత్రలోనూ ఆ వేరియేషన్ చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.. ముఖ్యంగా వెయ్యేళ్ల కిందట వీరుడు కంగువాగా ఆయన నటనతో మెప్పించి సినిమాకే హైలెట్‌గా నిలిచారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఉదిరన్ పాత్రకు బాబీ డియోల్ పూర్తి న్యాయం చేశారు. ఏంజెలీనాగా దిశాపటానీ తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్రలో అనేక షేడ్స్ ఉంటాయి. సినిమాకు ఆమె స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి.యోగి బాబుతో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు.ఇక సాంకేతిక విషయాలకొస్తే.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం పర్వాలేదు. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. అదే సమయంలో కొన్ని చోట్ల మోతాదుకు మించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. పాటలు పర్వాలేదు. వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్‌గా, రియాల్టీకీ దగ్గరగా ఉంటుంది. వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు చాలా రిచ్‌గా ఉన్నాయి. -
OTT Review: గల్లీ ప్రేమను సింపుల్‌గా గెలిపించిన క్రికెట్
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘లబ్బర్ పందు’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ప్రపంచంలో ప్రతి ఒక్క ఆటకు ఆయా ప్రాంతాన్ని బట్టి కొంత ప్రత్యేకత సంతరించుకుంది. మన భారతదేశంలో క్రికెట్ ఆటకి ఉన్న క్రేజ్ మరే ఆటకు లేదు అన్నది అక్షర సత్యం. క్రికెట్ ఆధారంగా గతంలో చాలా సినిమాలే వచ్చాయి. కానీ హాట్ స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న తమిళ చిత్రం ‘లబ్బర్ పందు’ సినిమా వాటన్నిటికీ అతీతమనే చెప్పాలి. ఈ సినిమా దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తు క్రికెట్ ఆట స్ఫూర్తిగా ఓ చక్కటి ప్రేమకథను బ్యాక్‌గ్రౌండ్‌లో నడుపుతూ చెప్పిన విధానం అద్భుతమనే చెప్పాలి.నేటివిటీకి నేచురాలిటీకి కేరాఫ్ అడ్రస్ సౌత్ ఇండియన్ సినిమాలు అన్నదానికి సవివర నిదర్శనం ఈ ‘లబ్బర్ పందు’ సినిమా. ఈ చిత్రం మాతృక తమిళమైనా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా హాట్‌స్టార్‌లో ఉంది. ఇక ‘లబ్బర్ పందు’ కథాంశానికొస్తే.. అన్బు అనే ఓ యువ క్రికెటర్ తన కులం వల్ల జాలీ ఫ్రెండ్స్ టీమ్‌లోకి చేరలేకపోతాడు. అన్బుకి క్రికెట్ అంటే చిన్నప్పటి నుండి ప్రాణం. అన్బు ఓ అద్భుతమైన ఆల్ రౌండర్ అని, అతన్ని టీమ్‌లోకి తీసుకోవాలని జాలీ ఫ్రెండ్స్ టీమ్ కెప్టెన్ కరుప్పాయ కూడా ప్రయత్నిస్తుంటాడు. మరో వైపు స్టార్ బ్యాట్స్‌మేన్ అయిన పూమలై సచిన్ బాయ్స్ టీమ్‌లో ఎవ్వరూ ఔట్ చేయని విధంగా పరిచయం చేస్తారు.ఈ దశలో ఓసారి అన్బు, పూమలై తలపడాల్సి వచ్చి అన్బు... పూమలైని ఒక్క రన్ కూడా తియ్యనీయకుండా ఔట్ చేస్తాడు. దాంతో పూమలై అన్బు పై ద్వేషం పెంచుకుంటాడు. అలాగే అన్బు కూడా పూమలైపై కోపంతో ఉంటాడు. ఇంతలో అనుకోకుండా పూమలై కూతురు దుర్గతో ప్రేమలో పడతాడు అన్బు. దుర్గ... పూమలై కూతురన్న విషయం అన్బుతో పాటు అందరికీ తెలిసి రచ్చవుతుంది. తన శత్రువుకి తన కూతురుని ఎలా ఇస్తానని అన్బుతో పూమలై తలపడుతూ ఉంటాడు. ఆఖరికి పూమలైని అన్బు ఆటలో మళ్లీ ఓడించి దుర్గని దక్కించుకుంటాడా? లేక ఆటకు దూరమై దుర్గని వదిలేస్తాడా? అన్నది ‘లబ్బర్ పందు’ సినిమాలోనే చూడాలి. ఓ రకంగా చెప్పాలంటే... ప్రేక్షకుడు ఈ సినిమా చూస్తూ... జీవితాన్ని చూస్తున్న అనుభూతి ΄÷ందుతాడు. ముఖ్యంగా ఈ సినిమాలో పాత్రధారులందరూ నటించలేదు... జీవించారు. గల్లీ ప్రేమను సింపుల్‌గా గెలిపించిన ఈ ఆట ఓ అద్భుతం. మీరు కూడా ఓ లుక్కేయండి. – ఇంటూరు హరికృష్ణ -
'ఇది మామూలు డ్రామా కాదు రా రామా'
నవరసాలను నిరంతరం పండించగలిగే సత్తా ఈ మధ్యకాలంలో ఒక్క బిగ్ బాస్ కార్యక్రమానికి మాత్రం వుందంటే అతిశయోక్తి కాదేమో. బిగ్ బాస్ మిగతా భాషలలో ఏమో కాని తెలుగు లో మాత్రం తమ ప్రేక్షకులు జారిపోకుండా షోని రసవత్తరమైన ఘట్టాలతో ఎప్పటికప్పుడు రక్తి కట్టిస్తూ ఆడియన్స్ ని కట్టిపడేందుకు ప్రయత్నిస్తున్నాడు సదరు బిగ్ బాస్. దీనికి ప్రత్యేక నిదర్శనం ఈ వారం బిగ్ బాస్ కార్యక్రమం. ముఖ్యంగా చఫ్ కంటెండర్ పోటీ కోసం కంటెస్టెంట్లను నాలుగు రంగులతో విభజించి నాలుగాటలు ఆడించి వాళ్ళలో నాలుగు ఎమోషన్స్ తెప్పించి నలుగురు పార్టిసిపెంట్స్ కొట్టుకునేలా చేసి ప్రేక్షకులకు నిత్యం వివాదం తో వినోదాన్ని పంచాలని ప్రయత్నించడం నభూతో నభవిష్యతి అని చెప్పవచ్చు.ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ కంటెస్టంట్ల ఎమోషన్లతో రెచ్చగొట్టడమొకటే కాదు వాళ్ళ ఆరోగ్యాలపై కూడా హైప్ క్రియేట్ చేసి క్యాష్ చేసుకోవడం. పోయిన వారం అవినాష్ కు ఆరోగ్యం బాలేదని, హౌస్ నుండి వెళ్ళిపోతున్నాడని ప్రోగ్రాం చివరలో చూపించి మరుసటిరోజు నామినేషన్స్ నాడు తన ఆరోగ్యం బాగుందని బిగ్ బాస్ డాక్టర్లు ప్రోగ్రాం లో కంటిన్యూ చేయమన్నారని చూపించడం విడ్డూరం. రేపెవ్వరైనా కంటెసెస్టంట్ కు మళ్ళీ హెల్త్ బాగోలేదని చెబితే ప్రేక్షకులు నమ్మాలా లేదా. ఇక ఈ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ నయని పావని. ఈ అమ్మాయిని కదిపినా కదపకపోయినా కన్నీళ్ళు వచ్చేస్తూనే వుంటాయి. అందుకే కాబోలు బిగ్ బాస్ ఆ అమ్మాయిని ఎలిమినేట్ చేశాడు. బిగ్ బాస్ కార్యక్రమం అనేది ఒక్క హౌస్ లో వున్న కంటెస్టెంట్స్ ఎమోషన్స్ తోనే కాదు బయట చూసే ప్రేక్షకుల ఎమోషన్స్ తో కూడా ఆడుకుంటున్నాడనేది అక్షర సత్యం. ఎందుకంటే బిగ్ బాస్ అనేది మామూలు డ్రామా కాదు రా రామా!!!--ఇంటూరి హరికృష్ణ -
OTT Review: ఊహకందని థ్రిల్లింగ్ వెకేషన్
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘ట్రాఫిక్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.వెకేషన్ అంటే ఆనందంగా... సరదాగా అందరితో గడిపే కాన్సెప్ట్. కానీ అదే వెకేషన్ ఊహకందని, ఊహించలేని నైట్ మేర్ అయితే... ఈ లైన్‌ను ఆధారంగా చేసుకునే హాలీవుడ్ దర్శకుడు డీన్ టేలర్ ‘ట్రాఫిక్’ చిత్రాన్ని రూపొందించారు. సినిమా మొత్తం గ్రిప్పింగ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో నిండి ఉంటుంది. ఇది పెద్దల సినిమా. ΄ûలా పాట్టన్, ఒమర్ ఆప్స్ వంటి ప్రముఖ హాలీవుడ్ నటులు లీడ్ రోల్స్‌లో నటించారు.ఇక సినిమా కథ ప్రకారం... బ్రీ కాలిఫోర్నియాలోని ఓ దినపత్రికలో పని చేసే జర్నలిస్ట్. తాను రాసే కథనాలు సరిగ్గా పత్రికలో రావడం లేదని తపన పడుతూ ఉంటుంది. ఈ దశలో బ్రీ తన ప్రియుడు జాన్‌తో కలిసి అతని స్నేహితుడి డారెన్ గెస్ట్ హౌస్‌కి వెకేషన్‌కి వెళతారు. ఈ వెకేషన్ లొకేషన్ శాక్రిమెంటోలోని కొండ లోయల ప్రాంతంలో దూరంగా ఉంటుంది. ఈ వెకేషన్‌కి వెళ్లే సమయంలో బ్రీ, జాన్‌కు ఓ గ్యాస్ స్టేషన్లో కాలిఫోర్నియా బైకర్స్‌తో చిన్నపాటి ఘర్షణ జరుగుతుంది.ఇదే కథకు మలుపు. ఆ ఘర్షణతో బైకర్స్ వీళ్ళ కారును వెంబడిస్తారు. బ్రీ వాళ్ళు గెస్ట్ హౌస్‌కి వెళ్లిన తరువాత బైకర్స్ ఏం చేశారు? వాళ్లను బ్రీ ఎలా ఎదుర్కొంది? ఆ సంఘటన తర్వాత తన జర్నలిస్ట్ కెరీర్లో బ్రీ సాధించిన గొప్ప అంశమేంటి? అన్న విషయాలన్నీ లయన్స్ గేట్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘ట్రాఫిక్’లో చూడాల్సిందే. రోజు వారీ ట్రాఫిక్ కష్టాలతో సతమతమయ్యేవారు ఈ వీకెండ్ ‘ట్రాఫిక్’ సినిమాతో థ్రిల్లింగ్ వెకేషన్ అనుభూతి పొందుతారనేది నిజం. సో... ఎంజాయ్ ది ‘ట్రాఫిక్’. – ఇంటూరు హరికృష్ణ -
OTT Review: నాటి తీపి గుర్తుల నేటి సినిమా
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తెలుగు చిత్రం ‘సత్యం సుందరం’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.మనల్ని కొన్ని సినిమాలు ఆలోచింపజేస్తాయి. మరి కొన్ని సినిమాలు ఆవేశాన్నిస్తాయి. ఇంకొన్ని సినిమాలు ఆనందాన్నిస్తాయి. చాలా కొన్ని సినిమాలు మన మనసులో పదిలంగా నిలిచిపోతాయి. ఎందుకంటే పరోక్షంగానో, ప్రత్యక్షంగానో అవి మన గడిచిన జీవితపు గతాల తెరలను తొలగిస్తాయి కాబట్టి. అటువంటి వాటి కోవలో ముందుండే సినిమా ‘మెయ్యళగన్’. ఈ సినిమా తెలుగు వెర్షన్ ‘సత్యం సుందరం’ నెట్‌ఫ్లిక్స్ వేదికగా లభ్యమవుతోంది.దర్శకుడు సి. ప్రేమ్‌కుమార్ ఈ సినిమాని సినిమాలా తీయలేదు, మన గత జీవితాలను మళ్లీ మనకు పరిచయం చేశారంతే. ఒకరిద్దరు భారీ తారాగణం తప్ప పెద్ద కథ, పెద్ద సెట్లు, పెద్ద లొకేషన్లు ఇలాంటి ఆకర్షణలేవీ లేవు ఈ సినిమాలో. కానీ మనసున్న ప్రతి ఒక్కరినీ ఈ సినిమా మెప్పిస్తుందనడంలో సందేహమే లేదు. ప్రతి ఇంట్లో జరిగే ఓ సున్నితమైన అంశాన్ని కథగా తీసుకుని చాలా నేచురల్‌గా తెరకెక్కించారు దర్శకుడు. కథాపరంగా సత్యం ఉంటున్న ఇల్లు దాయాదుల గొడవల్లో పోతుంది. ఆ బాధతోనే సత్యం కుటుంబం ఉన్న ఊరిని ఉన్న పళంగా విడిచి వెళ్లిపోతుంది. ఇక్కడ నుండే సినిమా ్రపారంభమవుతుంది.పద్దెనిమిదేళ్ల తర్వాత సత్యం తన బాబాయి కూతురు పెళ్లి కోసం మళ్లీ ఆ ఊరులోకి బాధతోనే అడుగుపెట్టవలసివస్తుంది. పెళ్లిలో సత్యాన్ని అతని చుట్టం సుందరం కలుస్తాడు. కానీ సుందరాన్ని సత్యం గుర్తు పట్టడు. సుందరం మాత్రం సత్యం మీద వల్లమాలిన అభిమానాన్ని, ప్రేమను చూపిస్తాడు. అసలే ఆ ఊరితో ఉన్న చికాకుతో పాటు సుందరం ఎవరో గుర్తు రాకపోయినా అతను చూపించే ప్రేమ సత్యాన్ని మరింత మధనపెడుతుంది. మరి... ఆఖరికి సుందరం ఎవరో సత్యం గుర్తుపట్టాడా లేదా? అన్నది మాత్రం సినిమాలోనే చూడాలి. సత్యం పాత్రలో అరవిందస్వామి, సుందరం పాత్రలో కార్తీ తమ పాత్రలలో జీవించేశారు. సినిమా మొత్తం ఈ రెండు పాత్రల మీదే ఉంటుంది. పైన చెప్పుకున్నట్టు ఇది సినిమా కాదు... మన గతం. నాటి తీపి గుర్తుల నేటి సినిమా ఈ ‘సత్యం సుందరం’. వర్త్ టు వాచ్. – ఇంటూరు హరికృష్ణ -
సాఫ్ట్వేర్ కుర్రాడితో 'లగ్గం'.. ఎలా ఉందంటే?
టైటిల్: లగ్గంనటీనటులు: సాయిరోనాక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్, ఎల్బీ శ్రీరామ్, రఘుబాబు, రోహిణి తదితరులుదర్శకుడు: రమేశ్ చెప్పాలనిర్మాత: వేణుగోపాల్రెడ్డివిడుదల తేదీ: 25 అక్టోబర్ 2024సాయిరోనాక్, ప్రగ్యా నగ్రా జంటగా నటిస్తున్న చిత్రం లగ్గం. ఈ సినిమాకు రమేష్ చెప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా ఇవాళ థియేటర్లలో విడుదలైంది. లవ్ అండ్ ఫ్యామిలీ అభిమానులను ఏమేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.అసలు కథ ఏంటంటే?సదానందం (రాజేంద్రప్రసాద్) తన కూతురు మానస ( ప్రగ్యా నగ్రా) కి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. తన సొంత చెల్లెలైన సుగుణ( రోహిణి) కొడుకు (సాయి రోనక్) ని చూడడానికి సిటీకి వస్తాడు. అక్కడ అల్లుడి ఖరీదైన జీవితం, జీతం,సాప్ట్వేర్ లైఫ్ చూసి ఎలాగైనా సరే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలి అని డిసైడ్ అవుతాడు. ఇంతకీ తన చెల్లి సుగుణ( రోహిణి)తో మాట్లాడి కూతురి లగ్గం ఖాయం చేసుకున్నాడా? ఆ తర్వాత తన కుమార్తె జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే లగ్గం కథ.ఎలా ఉందంటే...తెలంగాణ నేపథ్యంలో కావడంతో అక్కడి సంప్రదాయాల్ని , పద్ధతుల్ని ఆచారాల్ని, చూపిస్తూ కథ మొదలవుతుంది. ఆ తర్వాత కథ పెళ్లి సంబురాల వైపు నడిపించాడు. బంధువులు, పెళ్లి, పద్ధతులు, ఆచారాలను ఆడియన్స్‌కు పరిచయం చేస్తూ మెల్లగా కథలోకి తీసుకెళ్లాడు. లగ్గం చుట్టూ ఉండే సరదా సరదా సన్నివేశాలతో , బంధువుల పాత్రలు నిజజీవితంలో ప్రేక్షకులను టచ్ చేసేలా చేశాడు దర్శకుడు. ఇంటర్వెల్ బ్యాంగ్‌తో ఆడియన్స్‌ను ఆలోచనలో పడేశాడు. ఫస్ట్ హాఫ్‌లో క్యారెక్టర్స్ పరిచయాలతో కథ కాస్తా మెల్లగానే సాగినట్లు అనిపిస్తుంది. ఇకపోతే సెకండ్ హాఫ్ వచ్చేసరికి కథఊహించని మలుపులు తిరుగుతుంది. ప్రారంభం నుంచే ఆడియన్స్‌ను ఎమోషనల్ మూడ్‌లోకి తీసుకెళ్లిపోతుంది. ద్వితీయభాగం మొదలైన కాసేపటికే ట్విస్టులు , ఎమోషనల్ సీన్స్ సగటు ప్రేక్షకుడిని దర్శకుడు కట్టిపేడేసేలా ఉన్నాయి. ఒక్క లగ్గం చుట్టూ ఇన్ని జరుగుతాయా? అనే అనుమానాన్ని ఆడియన్స్‌లో కలిగించాడు. ఒక సాఫ్ట్వేర్ లైఫ్, ఓ తండ్రి తన కూతురి కోసం పడే తపన, కుటుంబానికి దూరంగా బతికే వారి కష్టాలతో ఫుల్ ఎమోషనల్ టచ్ ఇచ్చాడు దర్శకుడు రమేష్ చెప్పాల. క్లైమాక్స్ సీన్‌తో సగటు ప్రేక్షకుడికి కన్నీళ్లు తెప్పించేశాడు. ఓవరాల్‌గా చూస్తే మంచి లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్లా అనిపించింది.ఎవరెలా చేశారంటే..సాయిరోనాక్ నటనలో మరోసారి తనదైన మార్క్ చూపించాడు. ప్రగ్యా నగ్రా తన అందంతో అభిమానులను ఆకట్టుకుంది. ఇక రాజేంద్రప్రసాద్, రోహిణి తమ నటనతో మెప్పించారు. రఘుబాబు , ఎల్బీ శ్రీరామ్, సప్తగిరి , రచ్చ రవి,చమ్మక్ చంద్ర , వడ్లమాని శ్రీనివాస్ , కిరీటి , అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే బాలరెడ్డి (బేబీ ఫేమ్) సినిమాటోగ్రఫీ బాగుంది. మణిశర్మ బీజీఎం ఈ సినిమాకు మరో ప్లస్. చరణ్ అర్జున్ పాటలు బాగున్నాయి. నిర్మాణ విలువలు సంస్థకు తగ్గుట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. రేటింగ్- 2.75/5 -
'నరుడి బ్రతుకు నటన' సినిమా రివ్యూ
వచ్చే వారం దీపావళికి బోలెడన్ని పెద్ద సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. దీంతో ఈ వారం దాదాపు అరడజనుకి పైగా చిన్న చిత్రాలు రిలీజయ్యాయి. వాటిలో ఓ మూవీనే 'నరుడి బ్రతుకు నటన'. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిన్న సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు)కథేంటి?సత్య (శివకుమార్) నటుడు అయ్యే ప్రయత్నాల్లో ఉంటాడు. యాక్టింగ్ నీకు చేతకాదని తండ్రి (దయానంద్ రెడ్డి) కాస్త పద్ధతిగా తిడతాడు. ఒక్కగానొక్క ఫ్రెండ్, అసిస్టెంట్ డైరెక్టర్ కూడా వరస్ట్ యాక్టర్ అని సత్య ముఖంపైనే చెబుతారు. దీంతో ఎవరికీ చెప్పకుండా కట్టుబట్టలతో కేరళ వెళ్లిపోతాడు. పరిచయమే లేని డి.సల్మాన్ (నితిన్ ప్రసన్న) అనే వ్యక్తి ఇంట్లో ఇతడు ఉండాల్సి వస్తుంది. కేరళలో ఇతడికి ఎదురైన సమస్యలు ఏంటి? చివరకు నటుడు అయ్యాడా లేదా అనేదే స్టోరీ.ఎలా ఉందంటే?తమిళ, మలయాళంలో కొన్ని మంచి ఫీల్ గుడ్ సినిమాలు చూసినప్పుడు.. అసలు మన దగ్గర కూడా ఇలాంటివి తీయొచ్చు కదా అనిపిస్తుంది. ఎందుకంటే యాక్షన్ సినిమాలు మహా అయితే ఓసారి చూడొచ్చు. హీరో కోసం ఇంకోసారి చూడొచ్చేమో గానీ ఫీల్ గుడ్ చిత్రాలు మళ్లీ మళ్లీ చూడొచ్చు. అలాంటి ఓ సినిమానే 'నరుడు బ్రతుకు నటన'. ఏంటి అంత బాగుందా అని మీరనుకోవచ్చు. నిజంగా చాలా బాగా తీశారు.నువ్వో వరస్ట్ యాక్టర్.. జీవితంలో కష్టాలు తెలిస్తేనే నువ్వో మంచి నటుడివి అవుతావ్ అని హీరో సత్యని ఫ్రెండ్ తిడతాడు. అంతకుముందు ఊరు పేరు తెలియని అసిస్టెంట్ డైరెక్టర్ తిడతాడు. తండ్రి కూడా కాస్త పద్ధతిగా తిడతాడు. దీంతో కోపమొచ్చి కేరళ వెళ్లిపోతాడు. కాస్త డబ్బులు ఉండటం వల్ల కొన్నిరోజులు బాగానే ఉంటాడు. ఆ తర్వాత కష్టాలు మొదలవుతాయి. ఇంట్లో డబ్బులు అడగాలంటే అహం. దీంతో చేతిలో ఉన్న ఫోన్ అమ్మాలనుకుంటాడు. అదేమో ఓ పిల్లాడు తీసుకుని పారిపోతాడు. అలా అన్ని కోల్పోయిన సత్యకి సల్మాన్ పరిచయమవుతాడు. అతడితో అన్ని షేర్ చేసుకుంటాడు. వీళ్లిద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం ఏమో గానీ చూసే ప్రేక్షకుడికి చాలా విషయాలు నేర్పిస్తారు.డబ్బు ఉంటే చాలు.. జీవితం ఆనందంగా ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ చిన్న చిన్న విషయాలు కూడా మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తాయని ఈ సినిమాలో చూపించిన విధానం సూపర్. ఎమోషనల్ స్టోరీ అయినప్పటికీ అక్కడక్కడ కాస్త కామెడీ టచ్ చేస్తూ చివరకు ఓ మంచి అనుభూతి ఇచ్చేలా మూవీని తీర్చిదిద్దిన విధానం బాగుంది. అసలు ముఖంలో ఎక్స్ప్రెషన్స్ పలకవు అని అందరితో తిట్టించుకున్న సత్య.. తనకు తెలియకుండానే ఎన్నో ఎమోషన్స్ పలికిస్తాడు. చూస్తున్న మనం కూడా అతడితో పాటు ఫీల్ అవుతాం!చిన్న పాప ఎపిసోడ్, ప్రెగ్నెంట్ అమ్మాయి ఎపిసోడ్ మనల్ని భావోద్వేగాన్ని గురిచేస్తాయి. ఇక సల్మాన్ లవ్ స్టోరీ, మందు పార్టీ, వేశ్య దగ్గరకు వెళ్లిన సీన్స్‌లో సత్య-సల్మాన్ చేసిన సందడి నవ్విస్తుంది. చూస్తున్నంతసేపు ఓ మలయాళ సినిమా చూస్తున్నామా అనే ఫీలింగ్ వస్తుంది. దానికి తగ్గట్లే అక్కడక్కడ మలయాళ పాటలు కూడా వినిపించడం ఇక్కడ స్పెషాలిటీ. ఇవి వస్తున్నప్పుడు మనకు భాషతో ఇబ్బంది కూడా అనిపించదు. అంతలా లీనమైపోతాం. రెండు గంటల సినిమా అప్పుడే అయిపోందా అనిపిస్తుంది.ఎవరెలా చేశారు?పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసిన శివకుమార్.. ఇందులో సత్యగా నటించాడు. హీరో అనడం కంటే మనలో ఒకడిలానే అనిపిస్తాడు. నితిన్ ప్రసన్న చేసిన డి.సల్మాన్ పాత్ర అయితే హైలైట్. సరదా సరదాగా సాగిపోతూనే చాలా విషయాలు నేర్పిస్తుంది. మిగిలిన పాత్రధారులు ఓకే. టెక్నికల్ విషయాలకొస్తే దాదాపు కేరళలో షూటింగ్ అంతా చేశారు. సినిమా అంతా నేచురల్‌గా ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు తగ్గట్లే ఉంది. దర్శకుడు రిషికేశ్వర్ మంచి పాయింట్ తీసుకున్నాడు. అంతే నిజాయతీగా ప్రెజెంట్ చేశాడు. కాకపోతే కాస్త ఫేమ్ ఉన్న యాక్టర్స్‌ని పెట్టుకుని, మూవీని కాస్త ప్రమోట్ చేసుంటే బాగుండనిపించింది. ఫీల్ గుడ్ మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని అస్సలు మిస్సవొద్దు!రేటింగ్: 2.75-చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన డిఫరెంట్ తెలుగు మూవీ) -
'ఇద్దరు' సినిమా రివ్యూ
ఒకప్పుడు తెలుగులో నటించిన అర్జున్, జేడీ చక్రవర్తి చాలా ఏళ్ల క్రితం 'ఇద్దరు' అనే సినిమాలో హీరోలుగా నటించారు. ఇప్పుడు ఈ మూవీ తెలుగు వెర్షన్ థియేటర్లలోకి వచ్చేసింది. మరి ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?అర్జున్ ఓ మల్టీ మిలియనీర్. ఈయన కంపెనీలో జేడీ చక్రవర్తి ఉద్యోగిగా చేరతాడు. రాత్రి రాత్రే కోటీశ్వరుడు అయిపోవాలనేది ఇతడి ఆశ. ఈ క్రమంలో తన బాస్ అర్జున్‌పై ఒక అమ్మాయితో హనీట్రాప్ చేయాలని చూస్తాడు. ఇది గ్రహించిన అర్జున్.. దానికి పై ఎత్తు వేస్తాడు. ఆ తర్వాత ఏమేం జరిగిందనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: అరెస్ట్ న్యూస్.. వీడియో రిలీజ్ చేసిన బిగ్ బాస్ శేఖర్ భాషా)ఎలా ఉందంటే?ఇద్దరు తెలివైన వ్యక్తుల.. ఒకరిపై మరొకరు ఎత్తుకు పై ఎత్తుల వేస్తే ఏమవుతుంది అనే కాన్సెప్ట్‌తో తీసిన సినిమా 'ఇద్దరు'. వేల కోట్లకు అధిపతి అయిన అర్జున్‌ని హానీ ట్రాప్ చేసి కోటీశ్వరుడు కావాలనుకునే ఉద్యోగిగా జేడీ చక్రవర్తి కనిపించాడు. అతని ఎత్తులను పసికట్టి అతని ఎత్తులకు పై ఎత్తులు వేయడం.. ఇలా సినిమా మొత్తం ట్విస్టులో బాగానే తీశారు. దర్శకుడు పర్లేదనిపించాడు. అక్కడక్కడ బోర్ కొట్టించినా.. కమర్షియల్ అంశాలు బాగానే దట్టించారు.ఎవరెలా చేశారు?అర్జున్, జేడీ తమ పాత్రలకు న్యాయం చేసారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ కూడా ఓకే ఓకే. మిగిలిన విభాగాల వాళ్లు తమ తమ పని సక్రమంగా నిర్వర్తించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కార్తీ 'సత్యం సుందరం' మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) -
'విశ్వం' మూవీ ట్విటర్ రివ్యూ
టాలీవుడ్లో గుర్తుండిపోయే కామెడీ సినిమాలు తీసిన డైరెక్టర్ శ్రీనువైట్ల.. చాన్నాళ్ల తర్వాత చేసిన 'విశ్వం' మూవీ చేశాడు. గోపీచంద్ హీరోగా నటించిన ఈ చిత్రం తాజాగా (అక్టోబర్ 11) థియేటర్లలోకి వచ్చింది. కామెడీ ఎంటర్టైనర్ కథతో తీసిన ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారు. ట్విటర్లో టాక్ ఏంటి?(ఇదీ చదవండి: 'మా నాన్న సూపర్ హీరో' సినిమా రివ్యూ)'విశ్వం' రొటీన్ ఎంటర్టైనర్ స్టోరీ అని, ఈ తరహా గతంలోనే పలు సినిమాలు వచ్చాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గోపీచంద్, కాసిన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి తప్పితే మిగతా అంతా రొటీన్ అని అంటున్నారు. మరికొందరు మాత్రం కామెడీ పరంగా బాగానే ఉందని అంటున్నారు. ఓవరాల్‌గా అబోవ్ యావరేజ్ ఫిల్మ్ అని అంటున్నారు. ఓ రెండు రోజులు ఆగితే అసలు టాక్ ఏంటనేది బయటకొస్తుంది.(ఇదీ చదవండి: రజనీకాంత్ "వేట్టయన్" మూవీ రివ్యూ)#Viswam Decent EntertainerGood 1st half with the same typical formula of old movies.This format is very much familiar to TFI and this has been used by #SreenuVaitla again. And this time he aims for comedy and gets it in majority places. After 1st half, some comedy scenes came…— tolly_wood_UK_US_Europe (@tolly_UK_US_EU) October 11, 2024Just watched #Viswam movie and couldn't stop laughing throughout the movie. I fully enjoyed it from start to finish! Such an action entertaining and superb film!@YoursGopichand @SreenuVaitla @KavyaThapar pic.twitter.com/1BKGRKw0J6— Prabhakar Reddy (@mprabhareddy) October 10, 2024Just finished watching the show. Overall, Above Average to Watch.Last 25 to 30 min Lag scenes . #Viswam #Gopichand #Vettaiyan #GoodBadUgly #AjithKumar #NBK109 #SrinuVaitla #Dussehra24 #MaNannaSuperHero #Pushpa2TheRule pic.twitter.com/yaho3GWwIV— jackpopuri (@jackpopuri1717) October 10, 2024#Viswam First Half : Good 👍👍 The first half of #Viswam is a fun ride, with #Prudvi’s comic timing stealing the show!The light-hearted moments keep the pace going, and the interval fight sets up an exciting second half.#Gopichand did well with outstanding performance 👌👌… pic.twitter.com/IAIKAYKbOm— CHITRAMBHALARE (@chitrambhalareI) October 10, 2024#ViswamReview #Gopichand #Viswam #SreenuVaitla#KavyaThapar #PrabhasViswam Review=-Decent 🍿😎Overall=2.9/5Story=2.8/5Direction=3/5Comedy=3.15/5❣️Emotion=3/5🎶=2.75/5Bgm=2.85/5Action=2.85/5Interval=3/5❤️Actings=4/5👌-Pritviraj2nHalf=2.65/5Climax=2.8/5 pic.twitter.com/8fDN1baUyz— Reviewer_Boss💔 (@ReviewerBossu) October 11, 2024#Viswam Review : “Outdated & Tests Your Patience”👉Rating : 2/5 ⭐️ ⭐️Positives:👉#Gopichand👉Couple of Comedy ScenesNegatives:👉Outdated Story👉Boring Narration👉Predictability👉Weak Climax pic.twitter.com/NCC8NdkOd9— PaniPuri (@THEPANIPURI) October 11, 2024 -
'మా నాన్న సూపర్ హీరో' సినిమా రివ్యూ
ఈసారి దసరాకి అరడజనుకు పైగా సినిమాలు థియేటర్లలో రిలీజ్. వీటిలో వైవిధ్యభరిత చిత్రాలున్నాయి. ఇందులో ఓ మూవీనే 'మా నాన్న సూపర్ హీరో'. సుధీర్ బాబు, షాయాజీ షిండే, సాయిచంద్ ప్రధాన పాత్రలు పోషించారు. నాన్న సెంటిమెంట్‌తో తీసిన ఈ సినిమా నేడు(అక్టోబర్ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ నాన్న.. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హీరో అనిపించుకున్నాడా లేదా అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?ప్రకాశ్ (సాయిచంద్) ఓ లారీ డ్రైవర్. బిడ్డని ప్రసవించి భార్య చనిపోతుంది. రోజుల పిల్లాడిని అనాథశ్రమంలో ఉంచి, పనికోసం బయటకెళ్తాడు. ఊహించని విధంగా అరెస్ట్ అవుతాడు. 20 ఏళ్లు జైల్లోనే ఉండిపోతాడు. అంతలో పిల్లాడు జాని (సుధీర్ బాబు) పెరిగి పెద్ద వాడవుతాడు. ఇతడిని శ్రీనివాస్ (షాయాజీ షిండే) అనే స్టాక్ బ్రోకర్ దత్తత తీసుకుంటాడు. అయితే జాని రాకతో తన కుటుంబానికి అరిష్టం పట్టుకుందని శ్రీనివాస్‌కి కోపం. కానీ జానికి మాత్రం నాన్నే సూపర్ హీరో. తండ్రిపై విపరీతమైన ప్రేమ. ఊరంతా అప్పులు చేసే శ్రీనివాస్.. ఓ రాజకీయ నాయకుడికి కోటి రూపాయలు బాకీ పడతాడు. ఇంతకీ ఈ డబ్బు సంగతేంటి? చివరకు సొంత తండ్రి కొడుకులైన జాని-ప్రకాశ్ కలిశారా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?తమిళ, మలయాళంలో కొన్ని సినిమాలు చూసినప్పుడు.. అరె మన దగ్గర ఎందుకు ఇలాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ రావట్లేదా అని చాలామంది బాధపడుతుంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ల కోరిక తీర్చడానికి అన్నట్లు వచ్చిన మూవీ 'మా నాన్న సూపర్ హీరో'. కమర్షియల్ అంశాల జోలికి పోకుండా స్ట్రెయిట్‌గా కథ చెప్పి మెప్పించారు.చేయన నేరానికి పోలీసులకు దొరికిపోయి, కొడుక్కి ప్రకాశ్ దూరమవడంతో సినిమా ప్రారంభమవుతుంది. కట్ చేస్తే జాని, శ్రీనివాస్ పాత్రల పరిచయం. పెంపుడు తండ్రి అంటే కొడుకు జానికి ఎంత ఇష్టమో చూపించే సీన్స్. శ్రీనివాస్‌కి దత్త పుత్రుడు అంటే ఉండే కోపం, అయిష్టత. ఇలా నెమ్మదిగా ఈ రెండు పాత్రలకు అలవాటు పడతాం. ఇంతలో ప్రకాశ్ పాత్ర వస్తుంది. ఇక్కడి నుంచి డ్రామా మొదలవుతుంది. చిన్నప్పుడు విడిపోయిన తండ్రి-కొడుకు ఎలా కలుసుకుంటారా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇంతలో కోటిన్నర లాటరీ టికెట్ అనేది మెయిన్ కాన్ఫ్లిక్ట్ అవుతుంది. ప్రకాశ్ దగ్గరున్న లాటరీ టికెట్‌ని కొట్టేయడానికి కొన్ని పాత్రలు ప్రయత్నిస్తూ ఉంటాయి. మరోవైపు తండ్రిని కాపాడుకునేందుకు పెంచిన కొడుకు పడే తాపత్రయం ఇలాంటి అంశాలతో సెకండాఫ్ నడిపించారు.రెండు గంటల సినిమా చూస్తున్నంతసేపు ఓ నవల చదువుతున్నట్లు ఉంటుంది. కానీ హీరోయిన్ సీన్స్, సెకండాఫ్ ప్రారంభంలో రాజు సుందరం ట్రాక్ నిడివి పొగిడించడం కోసం పెట్టారా అనే సందేహం కలుగుతుంది. ఇవి లేకపోయినా సరే సినిమా ఫ్లో దెబ్బతినదు. స్లో నెరేషన్ కూడా కొందరు ప్రేక్షకులకు ల్యాగ్ అనిపించొచ్చు. క్లైమాక్స్‌లోనూ అసలైన తండ్రి-కొడుకు కలుసుకున్నట్లు డ్రామా-ఎమోషన్స్ వర్కౌట్ చేయొచ్చు. కానీ సింపుల్‌గా తేల్చేశారా అనిపిస్తుంది. ఓవరాల్‌గా చూస్తే మాత్రం ఓ మంచి ఎమోషనల్ డ్రామా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.ఎవరెలా చేశారు?సుధీర్ బాబు వరకు ఇది డిఫరెంట్ పాత్ర. ఇదివరకు బాడీ చూపిస్తూ ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇందులో మాత్రం సెటిల్డ్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. షాయాజీ షిండే క్యారెక్టర్ బాగుంది కానీ ఈ పాత్రకు ఇంకాస్త డెప్త్, ఎమోషనల్ సీన్స్ పడుంటే బాగుండేది అనిపించింది. సెకండాఫ్‌లో తండ్రిగా సాయిచంద్ తనదైన యాక్టింగ్‌తో జీవించేశాడు. మేజర్ సీన్స్ అన్నీ ఈ పాత్రల చుట్టే తిరుగుతాయి. దీంతో హీరోయిన్‌తో పాటు మిగిలిన పాత్రలకు పెద్ద స్కోప్ దొరకలేదు.దర్శకుడు మంచి ఎమోషనల్ కథ అనుకున్నాడు. అందుకు తగ్గ పాత్రధారుల్ని తీసుకున్నాడు. కానీ సినిమా తీసే క్రమంలో కాస్త తడబడ్డాడు. కానీ ఇలాంటి స్టోరీ కూడా తీయొచ్చనే అతడి ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. ఎలాంటి కమర్షియల్ వాసనల జోలికి పోకుండా తీసిన డ్రామా సినిమా ఏదైనా చూద్దామనుకుంటే 'మా నాన్న సూపర్ హీరో'పై ఓ లుక్కేయండి. మరీ కాకపోయినా.. నచ్చేస్తుంది!-చందు డొంకాన -
రజినీకాంత్ 'వేట్టయన్' ట్విటర్ రివ్యూ
సూపర్‌స్టార్ రజినీకాంత్ కొత్త మూవీ 'వేట్టయన్' థియేటర్లలోకి వచ్చేసింది. 'మనసిలాయో' పాటతో ట్రెండ్ అయిపోయిన ఈ చిత్రంలో రజినీతో పాటు అమితాబ్ బచ్చన్, రానా, మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రితికా సింగ్, దుసరా విజయన్ లాంటి స్టార్ కాస్ట్ నటించారు. చాలాచోట్ల ఎర్లీ మార్నింగ్ షోలు, ఓవర్సీస్ షోలు పడ్డాయి. దీంతో ట్విటర్లో పలువురు నెటిజన్లు రివ్యూ పోస్ట్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: సోషల్ మీడియాలో వేట్టైయాన్పై ట్రోల్స్.. దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్)రజినీకాంత్ మాస్ అప్పీల్ అదిరిపోయిందని, అనిరుధ్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేశాడని అంటున్నారు. రీసెంట్ టైంలో వచ్చిన వన్ ది బెస్ట్ ఫస్ట్ హాఫ్ అని అంటున్నారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథని, ఆలోచన రేకెత్తించే సోషల్ మెసేజ్‌తో దర్శకుడు జ్ఞానవేల్ అద్భుతంగా చూపించాడని తెగ పొగిడేస్తున్నారు.(ఇదీ చదవండి: రజినీకాంత్ వెట్టైయాన్.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో బిగ్ షాక్!)#Vettaiyan - Superstar Rajinikanth & FaFa scenes are super Funny & Refreshing 😁❤️So nice to see #FahadhFaasil in this kind of character🌟 pic.twitter.com/fLjFzUiGHU— AmuthaBharathi (@CinemaWithAB) October 10, 2024First Half #Vettaiyan(4/5) : Intriguing Investigate Thriller#Rajinikanth & his mass moments🔥racy a screenplay filled with investigation of crime#Fafa super fun@anirudhofficial's BGM & song👌Emotions are well connected@officialdushara plays a crucial role@tjgnan 👍 pic.twitter.com/Qv4TvXaypk— Kollywood Updates (@KollyUpdates) October 10, 2024#Vettaiyan First half 🔥🔥🔥🔥🔥🔥🔥🔥 Content la mass illa , mass la thaan content🔥🔥🔥 First 25 minutes, absolute goosebumps with Thalaivar 🔥🔥🔥🔥🔥🔥 Ani bgm and RR is his career best. That intro theme music, thaaaa🔥🔥🔥🔥🔥 Intriguing crime thriller investigation… pic.twitter.com/nfQB5tOu1i— Achilles (@Searching4ligh1) October 9, 2024#Vettaiyan First Half - SUPERB❤️🔥- First 20 mins to celebrate Superstar #Rajinikanth & his mass moments😎- After half an hour moves towards racy a screenplay filled with investigation of crime 👌- Anirudh BGM & song is so good🎶- Emotions are well connected ❤️- Dushara plays… pic.twitter.com/2V7AcPr2Q0— AmuthaBharathi (@CinemaWithAB) October 10, 2024Thaaaaaaaa! Terrific screenplay writing! Unbelievable TWIST! Absolute banger of a first half! TJ Gnanavel - you won biggggg! Just 50% more to show the world you are bigger than NELSON or KARTHIK SUBBARAJ! One of the best first half ever! #Vettaiyan IS GOING TO BE HUGE!— 𝔻𝕣. 𝔹𝕠𝕙𝕣𝕒 𝕄𝔻. 𝔸𝕀ℝ𝔻 (@Vasheegaran) October 9, 2024#manasilaayo? Glad to be here with loads of #ThalaivarRajinikanth fans! 🔥🔥❤️❤️ #VettaiyanVibes #Vettaiyanfdfs #Vettaiyan pic.twitter.com/Uz8yqxc9wv— Prasanna (@IamprasannaGA) October 9, 2024#Vettaiyan First Half - SUPER GRIPPING & ENGAGING 🔥Fully on content based👌 pic.twitter.com/rkmf8YMF7f— AmuthaBharathi (@CinemaWithAB) October 9, 2024#Vettaiyan Review - Intriguing investigative thriller raising moral questions. Engaging first half sets the stage for a promising second half.TJ Gnanavel blends commercial elements with social justice & human biasLaw vs. Encounter. Amitabh is a fitting match up to Rajini. pic.twitter.com/GIJtFFEbO3— MovieCrow (@MovieCrow) October 9, 2024Thalaivar fans coming out of theatres after watching the climax twist in #Vettaiyan 🔥🔥😭😭😭pic.twitter.com/BKPclWfHOH— Agastya🦕 (@Salaar4k) October 9, 2024#Vettaiyan first half 🔥🔥🔥 thalaivar semma!!!! pic.twitter.com/1Mq2vYLdtf— Anup Krishnia (@CKrishnia) October 10, 2024#Vettaiyan First Half : “Excellent First Half”🔥🔥👉Starts off a bit alow in the first 30mins,but once the story gains momentum, it transforma into an engaging crime thriller that keeps you on the edge of the seat.👉The film leans more towards the director’s film than merely…— PaniPuri (@THEPANIPURI) October 10, 2024 -
'చిట్టి పొట్టి' సినిమా రివ్యూ
రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'చిట్టి పొట్టి'. భాస్కర్ యాదవ్ దాసరి నిర్మిస్తూ దర్శకత్వం వహించారు. చెల్లెలి సెంటిమెంట్‌తో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తీశారు. తాజాగా ఇది థియేటర్లలోకి వచ్చింది. మరి సిస్టర్ సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకులని ఏ మాత్రం ఆకట్టుకున్నాయనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: 'రామ్‌నగర్ బన్నీ' మూవీ రివ్యూ)కథేంటి?కిట్టు (రామ్ మిట్టకంటి) పోలీస్ అయ్యే ప్రయత్నాల్లో ఉంటాడు. అతనికి ఓ గర్ల్ ఫ్రెండ్(కస్వి). ఆమె అమెరికాలో ఉద్యోగం చేస్తుంటుంది. కిట్టుకి చిట్టి(పవిత్ర) అనే చెల్లి. ఆమె అంటే తనకు పంచ ప్రాణాలు. తన జోలికి ఎవరొచ్చినా వాళ్లని కొట్టేస్తుంటాడు. ఓ ఆకతాయి బ్యాచ్ ఆమె ఫొటోల్ని డీప్ ఫేక్ మార్ఫింగ్ చేస్తారు. అవమానం తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది. తన చెల్లిని కాపాడుకుని కిట్టు ఆమెకు ఎలా పెళ్లి చేశాడు? చిన్న చిన్న మనస్పర్దలతో ఎప్పుడో దూరమైన మొత్త మూడు తరాల వారిని ఎలా ఒక్క చోటుకు చేర్చాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?అన్నా చెల్లెలి అనుబంధం మీద చాలా సినిమాలు వచ్చాయి. అలాంటి సిస్టర్ సెంటి మెంట్ సినిమాకు ప్రస్తుతం చాలామందిని ఇబ్బంది పెడుతున్న డీఫ్ ఫేక్ మార్ఫింగ్ కాన్సెప్ట్ జోడించారు. తన చెల్లి అవమానానికి గురైతే ఓ అన్న.. దాన్నుంచి ఎలా ఆమెను బటయపడేశాడు? బాధ్యుల్ని ఎలా శిక్షించాడు అనే ఎలిమెంట్‌తో ఈ సినిమా తీశారు. దర్శకుడు ఫస్టాఫ్ అంతా అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని, సెకండాఫ్‌లో బంధువులు, వారి మూలాలు వెతుక్కుంటూ వెళ్లే సన్నివేశాలతో చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. చివరి ఇరవై నిమిషాలు ప్రతి ఒక్కరూ ఎమోషన్‌కు గురై కంటతడి పెడతారు.ఎవరెలా చేశారు?రామ్ మిట్టకంటి.. ఓ అన్నగా, ఓ కొడుకుగా అలానే యాక్షన్ సీన్స్, సెంటిమెంట్ కూడా బాగా చేశాడు. చెల్లిగా పవిత్ర కుదిరిపోయింది. హీరోయిన్ కస్వి పర్వాలేదు. మిగిలిన వాళ్లు తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు రాసుకున్న సిస్టర్ సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్ సీన్స్ అన్నీ బాగా కనెక్ట్ అయ్యాయి. డీఫ్ ఫేక్ టెక్నాలజీ గురించి, బంధువుల గురించి బాగా చూపించారు. పాటలు, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్లు ఉన్నాయి.(ఇదీ చదవండి: Kali 2024 Movie Review: 'కలి' సినిమా రివ్యూ) -
Kali 2024 Movie Review: 'కలి' సినిమా రివ్యూ
ప్రిన్స్, నరేశ్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'కలి'. ట్రైలర్‌తోనే కాస్త అంచనాలు పెంచేసిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. సైకలాజికల్ థ్రిల్లర్ కథ, కలి పురుషుడు అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తీశారు. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు)కథేంటి?శివరామ్ (ప్రిన్స్) యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఎవరు ఏం సహాయం అడిగినా కాదనకుండా చేస్తుంటాడు. ఈ క్వాలిటీ నచ్చే వేద (నేహా కృష్ణన్) అనే అమ్మాయిని ఇతడిని ప్రేమిస్తుంది. ఇంట్లో వాళ్లుని ఎదురించి వచ్చి మరీ పెళ్లి చేసుకుంటుంది. కొన్ని పరిస్థితుల వల్ల మంచిగా బతికే శివరామ్.. కష్టాల పాలవుతాడు. ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు. దీంతో కలియుగాన్ని పాలించే కలి పురుషుడు (నరేశ్ అగస్త్య) ఎంట్రీ ఇస్తాడు. తర్వాత ఏమైంది? అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ప్రస్తుత సమాజంలో ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి. అడిగిన ఫోన్ కొనివ్వలేదనో, లవర్ బ్రేకప్ చెప్పిందనో ప్రతి చిన్న విషయానికి చాలామంది తమ ప్రాణాల్ని చిన్న వయసులోనే తీసేసుకుంటున్నారు. అలా భార్య వదిలేసిందని, అందరూ మోసం చేశారని అనుకునే వ్యక్తి చనిపోవాలని ఫిక్స్ అవుతాడు. సరిగ్గా ఆ టైంలో కలిపురుషుడు ఎంట్రీ ఇస్తే.. తర్వాత ఏం జరిగిందనేదే 'కలి' థీమ్.ఆత్మహత్య సరైన పని కాదని ఇప్పటికే చాలా సినిమాల్లో చూపించారు. కానీ ఇందులో చెప్పిన, చూపించిన విధానం ఇంప్రెసివ్‌గా అనిపించింది. ఎందుకంటే కలియుగాన్ని ఏలే కలి పురుషుడు భూమ్మీదకు రావడమేంటి? చనిపోవాలనుకునే మనిషితో డిస్కషన్ పెట్టడమేంటి అనిపిస్తుంది గానీ చూస్తున్నంతసేపు భలే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది.దేవుడు మనం ఎన్నాళ్లు బతకాలనేది నిర్ణయిస్తాడు. కానీ మనం ఇలా ఆత్మహత్యలు చేసుకోవడం కరెక్ట్ కాదనే పాయింట్‌ని సైకలాజికల్ థ్రిల్లర్ కథతో చెప్పడం బాగుంది. నిడివి కూడు కేవలం గంటన్నరే. ఇలా ప్లస్సలు ఉన్నట్లే మైనస్సులు కూడా ఉన్నాయి. సినిమా అంతా కూడా శివరామ్, కలి పాత్రల మధ్య తిరుగుతుంది. యుగాలు, చనిపోవాలనుకున్న వాడితో గేమ్ ఆడటం బాగున్నప్పటికీ పదే పదే ఒకే సన్నివేశాలు చూసిన ఫీలింగ్ కలుగుతుంది.ఎవరెలా చేశారు?శివరామ్ పాత్ర చేసిన ప్రిన్స్ ఆకట్టుకున్నాడు. డిఫరెంట్ ఎమోషన్స్ బాగానే పలికించాడు. కలి పురుషుడిగా చేసిన నరేశ్ అగస్త్య సెటిల్డ్ యాక్టింగ్ చేశాడు. వేదగా చేసిన నేహాకృష్ణ ఉన్నంతలో పర్వాలేదనిపించింది. మిగిలిన పాత్రధారులు అంతా ఓకే. టెక్నికల్ విషయానికొస్తే స్టోరీ మంచి ఐడియా. కమర్షియల్ అంశాలు అని కాకుండా దర్శకుడు శివ శేషు.. చెప్పాలనుకున్న విషయాన్ని ఫెర్ఫెక్ట్గా చెప్పాడు. సినిమాటోగ్రఫీ ఓకే. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి తగ్గట్లు ఉంది. బడ్జెట్ పరిమితులు కనిపిస్తాయి గానీ ఉన్నంతలో బాగా తీశారు. ఇక చివర్లో సీక్వెల్ ఉంటుందని కూడా హింట్ ఇచ్చారు.- రేటింగ్: 2.75/5-చందు డొంకాన(ఇదీ చదవండి: 'స్వాగ్' సినిమా ట్విటర్ రివ్యూ) -
Swag Review: 'స్వాగ్' సినిమా ట్విటర్ రివ్యూ
తెలుగులో డిఫరెంట్ సినిమాలు చేసే హీరోల్లో శ్రీ విష్ణు ఒకడు. సహాయ నటుడిగా పేరు తెచ్చుకుని ప్రస్తుతం హీరోగా ఆకట్టుకుంటున్నాడు. ఇతడి లేటెస్ట్ మూవీ 'స్వాగ్'. 'రాజరాజ చోర' అనే సినిమాని తనతోనే తీసి హిట్ కొట్టిన హసిత్ గోలి దర్శకుడు. ప్రతి ఒక్కరు నాలుగేసి పాత్రల్లో నటించిన ఈ మూవీ తాజాగా థియేటర్లలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: ప్రమాదం నుంచి బయటపడిన హీరోయిన్ ప్రియాంక మోహన్)టీజర్, ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసిన ఈ సినిమాకు ఇప్పుడు థియేటర్లలోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. శ్రీ విష్ణు కెరీర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడని అంటున్నారు. సింగ క్యారెక్టర్ హిలేరియస్ అని, మిగిలిన మూడు పాత్రలు కూడా అదిరిపోయాయని అంటున్నారు. మూవీ చూసొచ్చిన వాళ్లు ఇంకా ఏమేం అంటున్నారనేది ట్విటర్ రివ్యూలో చూసేయండి.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8.కొత్త పోకడ, మాజీ కంటెస్టెంట్లతో వర్కవుట్ అవుతుందా?)Showtime: #SWAG pic.twitter.com/Wo5v7bmgso— hikigaya (@Aravind_V3) October 3, 2024#SWAG REVIEW :#SreeVishnu Generates FUN With Multiple Characters especially #SINGA Character 💥💥💥💥Dir #Hasith Planned a Lot Of TWISTS 🤩🤩🤩🤩#RituVarma Plays a Very DIFFERENT Character 👍👍👍Overall a Very Good Fun ENTERTAINER 💯💯💯💯 pic.twitter.com/2BLAk66P5A— GetsCinema (@GetsCinema) October 3, 2024#SWAG : A wholesome film with high emotional drama with hilarious entertainment👌👏🏼#SreeVishnu and #HasithGoli bring another new age cinema to the screens offering a beautiful experience with first of its kind screenplay.Pure one man show from @sreevishnuoffl and… pic.twitter.com/SXjgZbbSlw— Let's X OTT GLOBAL (@LetsXOtt) October 3, 2024#Swag: A first-of-its-kind cinema from Telugu, delivering a gender equality message through impeccable storytelling and writing.🔥🔥#SreeVishnu delivers his career-best performance. He shines as #Bhavabhuti for fun and #Vibudhi for the message. #Yayathi, #Singa, and King…— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) October 3, 2024#SWAG is something TFI has never seen before!@hasithgoli delivers an innovative concept with a one-of-a-kind screenplay executed flawlessly. @sreevishnuoffl shines taking on multiple roles with impressive voice modulations for each character. What an outstanding performance! 🙏 pic.twitter.com/fVcblx53nn— . (@Sayiiing_) October 3, 2024#Swag:#SreeVishnu's portrayal of different characterizations and their variations is excellent. Hasith Goli took a point that wasn't revealed in the trailer and presented it in a unique way. The interval is simply terrific, and the twists worked well!A detailed review…— Movies4u Official (@Movies4u_Officl) October 3, 2024#SWAG Very Good First half even with Complex Script.@sreevishnuoffl @peoplemediafcy pic.twitter.com/tTJKBHdK3M— Pradyumna (@pradyumna257) October 3, 2024Just finished watching #SWAGMovie at Prasad labs ❤️RRC combo worked out big again 🙌🏻Anna this is your career best performance ani cheppochu truly award deserving @sreevishnuoffl👏🏻 👏🏻👏🏻#HasithGoli is here to stay man 💯@peoplemediafcy#Swag #SWAGFromOct4th pic.twitter.com/dkiP23o5B5— Yashwanth (@YashTweetz___) October 3, 2024 -
బిగ్ బాస్ రెండవ వారం విశ్లేషణ...'హౌస్‌లో శేఖర్ భాషా అంకం సమాప్తం '
బిగ్ బాస్ హౌస్ లోని రెండవ వారం వాడి వేడి వాదనలతో నామినేషన్స్ అవగా మిగతా వారమంతా ఫుడ్ టాస్క్ మీద నడిచింది. ముందుగా నామినేషన్స్ గురించి చెప్పుకుందాం. హౌస్ లోని ప్రతి కంటెస్టెంట్ తాను నామినేట్ చేయాలనుకున్న కంటెస్టెంట్ గురించి చెప్పేటప్పుడు సదరు కంటెస్టెంట్ ఆటను ముందుగా పొగిడి తరువాత తన నామినేషన్ కారణాన్ని వివరిస్తూ వివాదపర్చడం విడ్డూరమనిపించింది. ఈ నామినేషన్స్ టైంలో విచిత్రంగా ప్రతి కంటెస్టెంట్ ఫైర్ అవుతున్నారు. ఇటువంటి ఫైరింగ్ నామినేషన్స్ నుండి జోవియల్ కంటేస్టెంట్ అయిన శేఖర్ భాషా ఎలిమినేట్ అవడం విశేషం. శేఖర్ భాషా ఎలిమినేషన్ వ్యక్తిగతంగా అతను తండ్రి అవడం ఓ కారణమైతే అదే కారణాన్ని చూచాయగా చూపిస్తూ హౌస్ లోని కంటెస్టెంట్లందరూ (ఒక్క కంటెస్టంట్ తప్ప) శేఖర్ భాషా హౌస్ నుండి బయటకు వెళ్ళాలి అని బాహటంగానే నామినేట్ చేశారు. బిగ్ బాస్ హౌస్ లో చిన్న కారణమైనా పెద్దదిగా చేస్తారు. అందుకేనేమో బిగ్ బాస్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు మా బాగా నచ్చుతోంది. ఈ సందర్భంగా ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. ఈ వారాంతం జరిగిన షోలో బిగ్ బాస్ తెలుగు ప్రేక్షకులను నాగార్జున అందలం ఎక్కించారు. అదేంటంటే భారతదేశంలోని ఏ బిగ్ బాస్ షోకి రానంత ప్రేక్షకాదరణ ఒక్క తెలుగు బిగ్ బాస్ కే దక్కిందట. మొత్తంగా 6 బిలియన్ల నిమిషాల నిడివితో ఈ తెలుగు బిగ్ బాస్ షోని తెలుగు ప్రేక్షకులు చూశారట. ఇది ఒక రికార్డ్ బ్రేక్ అని నాగార్జున చెప్పుకొచ్చారు. ఈ లెక్కన మన తెలుగు ప్రేక్షకులు భారతదేశంలోనే ఉత్తమోత్తమ ప్రేక్షకులను చెప్పుకోవాలి, ఎందుకంటే మన తెలుగు ప్రేక్షకులకు విషయం కన్నా వివాదం నచ్చుతుందన్న విషయం మరోసారి నిరూపించారు. ఇకపోతే ఫుడ్ టాస్క్ గురించి చెప్పాలంటే చాలానే చెప్పాలి. రాతి యుగంలో ఆది మానవులు ఆహారం కోసం అరాచకం చేసేవారట. ఈ విషయం మన తరం వారు ఎవ్వరూ చూసివుండరు కాని చదువుంటారు. అయితే అదే పరిస్థితి చూడాలనుకుంటే ఈ వారం బిగ్ బాస్ ఫుడ్ టాస్క్ చూసి ఆనందించవచ్చు. ఫుడ్ టాస్క్ కు సంబంధించి దీనికి మించిన వివరణ మరేదీ వుండదు. వారం వారం అంచనాలు అందుకోలేని సంచనాలతో దూసుకువెళ్తున్న ఈ బిగ్ బాస్ ప్రోగ్రాం ముందు ముందు మరెన్ని సంచనాలకు తావిస్తుందో చూడాలి.- ఇంటూరు హరికృష్ణ -
మత్తు వదలరా-2 ట్విటర్ రివ్యూ.. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే?
శ్రీ సింహా, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘మత్తువదలరా 2’. 2019లో వచ్చిన మత్తువదలరా చిత్రానికి కొనసాగింపుగా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీకి రీతేష్ రానా దర్శకత్వం వహించారు. పార్ట్-1 హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ రోజు థియేటర్లలోకి వచ్చేసింది. ఇప్పటికే ప్రీమియర్ షోలు పడిపోవడంతో ట్విటర్ వేదికగా ఆడియన్స్ తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.(ఇది చదవండి: ‘మత్తు వదలరా 2’ ట్రైలర్: శ్రీసింహా, సత్య కామెడీ అదుర్స్)మత్తు వదలరా-2 ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా ఉందంటూ ఆడియన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఫస్ట్ హాఫ్‌లోనే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవడం ఖాయమని అంటున్నారు. నాన్‌స్టాప్ కామెడీ ఎంటర్టైనర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. సత్య తన ఫర్మామెన్స్, కామెడీ అదిరిపోయిందని బ్లాక్‌బస్టర్ హిట్ ఖాయమంటున్నారు. అయితే ఇది కేవలం ఆడియన్స్ అభిప్రాయం మాత్రమే. వీటికి సాక్షికి ఎలాంటి బాధ్యత వహించదు. IT’s A BLOCKBUSTER LAUGHING RIOT😂#Mathuvadalara2 pic.twitter.com/EbXyZKXGvL— Prathyangira Cinemas (@PrathyangiraUS) September 13, 2024 Red Carpet Premiere:#MathuVadalara2 first half!🤣🤣😂Pure #Satya Rampage! Potta Noppochesindi. Really gifted comedian👏👏❤️🔥Non-stop entertainment. Second half Ee range lo Vinte Blockbuster guaranteed#MathuVadalara pic.twitter.com/0Qu8BGjAeD— Ungamma (@ShittyWriters) September 12, 2024 Done with my show, thoroughly enjoyed all references, although it has some lag moments. Satya is spot-on with his comic timing!!while other actors did their part. bhairava's music is lit. Overall a complete laugh riot film:) my rating is 2.75 #Mathuvadalara2Oneman show #Satya pic.twitter.com/kRyZ8Bf5Kn— palnadu tweets (@Nazeershaik1712) September 12, 2024 -
బిగ్ బాస్ సీజన్-8.. మొదటి వారం రివ్యూ
ఈ రోజుల్లో చాలా మంది తమ సమస్యల గురించి ఆలోచించడం మానేసి పక్క నున్న వ్యక్తి సమస్యల పై దృష్టి సారించడం ఎక్కువైపోయింది. ఈ సోషల్ మీడియా కాలంలో ఇలా జరగడం బాగా పెరిగిపోయింది. ఇంకా చెప్పాలంటే అదో వ్యసనంలా మారుతోంది. ఈ మధ్య కాలంలో దారి వెంట ఎవరైనా తగాదా పడుతుంటే వారిని వారించడం పోయి వారి దగ్గరకు వెళ్ళి ఆనందంగా వాళ్ళ కొట్లాట చూడటం వాలైతే ఆ కొట్లాటలో తానున్నట్టు సెల్ఫీలు తీసుకోవడం చాలా మందికి అలవాటైంది. ఇటువంటి పద్ధతినే ప్రాతిపదికను చేసుకుని 2017 సంవత్సరంలోనే నెదర్ ల్యాండ్ దేశంలోని జాన్ డి మోల్ అనే వ్యక్తి బిగ్ బ్రదర్ అనే టీవి కార్యక్రమాన్ని రూపొందించాడు. ఈ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఆదరణ పొందింటే ఈ రోజుకి దాదాపు 70 కి పైగా దేశాల్లో ప్రైమ్ టైమ్ హిట్‌గా ఈ కార్యక్రమం నిలబడిందన్నదే తార్కాణం. దానినే ఇప్పుడు భారతదేశంలో బిగ్ బాస్ పేరిట దాదాపు అన్ని భాషలలో రూపొందించారు. కార్యక్రమ అంశమంటూ ప్రత్యేకంగా ఏమీ చెప్పుకోనక్కరలేదు. సంబంధంలేని దాదాపు ఓ డజను మంది వ్యక్తులను ఓ ప్రాంతంలో కొన్ని రోజులపాటు వుంచితే వారి మధ్య వచ్చే మనస్పర్ధలు, ప్రేమానురాగాలను అందమైన కార్యక్రమంగా రూపొందించడమే ఈ బిగ్ బాస్. మనిషి ప్రతికూలత అంశాన్ని ఎక్కువగా ఆదరిస్తాడన్నదానికి నిదర్శనమే ఈ కార్యక్రమం. అలా అని దీనికి వ్యతిరేకత లేదు అని చెప్పడానికి కాదు, ఎందుకంటే దీనికి ఎంత ఆదరణ వుందో అంతకంటే ఎక్కువే వివాదాలు వున్నాయి. బిగ్ బాస్ తెలుగు లో 8వ సీజన్ నడుస్తోంది. ఈ సీజన్ ప్రత్యేకతలు ఏమిటో ప్రతి వారం ఓ చిన్నపాటి విశ్లేషణతో అందించడానికి ప్రయత్నిస్తాం.'హౌస్ మేట్స్‌కు రుచించని బెజవాడ బేబక్క'ఎంతో ఆర్భాటంగా, అట్టహాసంగా ప్రారంభమైన ఈ బిగ్ బాస్ 8 వ సీజన్ కి మునుపటిలాగే నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సీజన్‌కు టాగ్ లైన్‌గా 'ఎంటర్టైన్ మెంట్‌కు లిమిటే లేదు'గా నిర్ణయించారు. మొత్తంగా 14 కంటెస్టెంట్లో చెప్పుకోదగ్గ వారెవరూ లేకపోయినా కంటెస్టెంట్లందరూ దాదాపుగా తయారై వచ్చినట్టుగా తెలుస్తోంది. మొదటి వారం నామినేషన్ల కన్నా ముందే కంటెస్టంట్ల మధ్య వాడి వేడి వాదనలు జరగడం ప్రేక్షకులకు కనువిందు చేసినట్టైంది. బిగ్ బాస్ అనేది భావోద్వేగభరితమైన షో అని మరోసారి మొదటి రెండురోజుల్లోనే నిరూపించింది ఈ సీజన్.బిగ్ బాస్‌లో ఏడుపులు పెడబొబ్బలు అన్నవి కామన్ అయినా ఏ సీజన్ లోనూ జరగని ఓ వింత ఈ సీజన్ మొదటివారంలోనే జరిగింది. కంటెస్టంట్ అయిన మణికంఠ నామినేషన్స్‌పై వాడివేడి వాదనలు జరుగుతున్న సమయంలో తన విగ్గును పూర్తిగా తీసేసి విలపించడం హైలెట్. ఈ చర్యపై చూసే ప్రేక్షకులే కాదు అక్కడున్న కంటెస్టెంట్స్ కూడా అవాక్కయ్యారు. మిగతా కంటెస్టెంట్లలో నిఖిల్, శేఖర్ భాషా, సోనియా, విష్ణుప్రియ, యశ్మి తదితరులు ఈ వారం తమ అరుపులతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్రయత్నించారు.ప్రధానంగా ఓ మెరుపు మెరిసినట్టు హౌస్ లోకి అడుగుపెట్టి తన నలభీమ పాక చేతి వంటతో అందరి మన్ననలు పొందాలనుకున్న బెజడవాడ బేబక్క అలియాస్ మధు ఆశలు మొదటివారం లో నే ఆడియాసలై హౌస్ నుండి ఎలిమినేట్ అయింది. తన మూర్ఖత్వపు రూల్స్ తో బేబక్క తమ కడుపును మాడుస్తుందని హౌస్ లోని దాదాపు ప్రతి కంటెస్టెంట్ పేర్కొనడం గమనార్హం. అలా బెజవాడ బేబక్క బిగ్ బాస్ ప్రస్థానం ముగిసి బెజవాడ బాట పట్టింది. మరి రానున్న వారాల్లో అంచనాలకు మించి ముందుకు వచ్చిన ఈ బిగ్ బాస్ లో ఇంకెన్ని సంచనలనాలు జరుగుతాయో చూద్దాం.- ఇంటూరి హరికృష్ణ -
థియేటర్లలో ది గోట్.. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే?
కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం 'ది గోట్'(గ్రేటేస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ రోజు నుంచే ది గోట్ థియేటర్లలోకి వచ్చేసింది. ఓవర్సీస్తో పాటు ఇండియాలోనూ మార్నింగ్ షోలు పడిపోయాయి. తెల్లవారుజూము నుంచే థియేటర్ల వద్ద విజయ్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.ఫస్ట్ హాఫ్ ముగియగానే ఆడియన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ యాక్టింగ్ అదిరిపోయిందని అంటున్నారు. ఫైట్స్, యాక్షన్ సీన్స్‌లో విజయ్ ఫర్మామెన్స్ వేరే లెవెల్ అని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చివరి 40 నిమిషాలు అద్భుతంగా ఉందని.. విజయ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయమని చెబుతున్నారు. అయితే ఇదే కేవలం ఆడియన్స్ అభిప్రాయం మాత్రమే..ఈ సమీక్షకు సాక్షి ఎలాంటి బాధ్యత వహించదని తెలియజేస్తున్నాం. #GOAT BLOCKBUSTER 🔥🔥🔥First Half - 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥Second Half - 🔥🔥🔥🔥🔥🔥🤯🤯🔜Different Genre& Screenplay🥵🥶#GOATFDFS #GOATReview#TheGreatestOfAllTime #TheGOATpic.twitter.com/1Sf1ZRbaUQ— Mᴜʜɪʟツ𝕏 (@MuhilThalaiva) September 4, 2024First half Review 🔥#TheGreatestOfAllTime pic.twitter.com/Tn14k2VhFc— Mahi Bro (@Mahi14345) September 5, 2024We Won Thalaivaa @actorvijay 😭💥💥BLOCKBUSTER🔥🔥🔥🔥#GOATFDFS #GOATReview#TheGreatestOfAllTime #TheGOATpic.twitter.com/kdvsXbvrrG— Mᴜʜɪʟツ𝕏 (@MuhilThalaiva) September 5, 2024Unanimous positive response for the first half🔥🔥#TheGreatestOfAllTime #TheGOAT pic.twitter.com/qTWqkhMWzV— Rebel Relangi (@RebelRelangi) September 5, 2024Industry Hit Loading 🥵🔥🔥BLOCKBUSTER champion🏆🏆 ✅#GOATFDFS #GOATReview #GOAT#TheGreatestOfAllTime #TheGoatFromSep5 pic.twitter.com/QDoiQlaeYV— MAHI 𝕏 (@MahilMass) September 5, 2024 -
అడవుల్లో బుల్లెట్ల వర్షం.. ల్యాండ్ ఆఫ్ బ్యాడ్ ఎలా ఉందంటే?
టైటిల్: ల్యాండ్ ఆఫ్ బ్యాడ్డైరెక్టర్: విలియమ్ యూబ్యాంక్నిర్మాణ సంస్థలు: ఆర్ యూ రోబోట్ స్టూడియోస్, హైలాండ్ ఫిల్మ్ గ్రూప్నిడివి: 113 నిమిషాలుఓటీటీ: అమెజాన్ ప్రైమ్కథేంటంటే..యాక్షన్ సినిమాలకు పేరు పెట్టింది అంటే హాలీవుడ్. కానీ డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను కట్టిపడేసేలా కొన్ని చిత్రాలు మాత్రమే ఉంటాయి. అలాగే మనవద్ద కూడా స్పై యాక్షన్ చిత్రాలు చాలానే వచ్చాయి. ఇలాంటి వాటిలో ముఖ్యంగా టెర్రరిస్టులను అంతం చేయడమే ప్రధాన కాన్సెప్ట్. అలా ప్రత్యేక ఆపరేషన్ పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రమే 'ల్యాండ్ ఆఫ్ బ్యాడ్'. ఓ వైమానిక అధికారి కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన టెర్రరిస్టులను అంతమొందించారా? లేదా? అన్నదే అసలు కథ. కేవలం నలుగురు కమాండోలతో చేపట్టిన టెర్రరిస్ట్ ఆపరేషన్ సక్సెస్ అయిందా? లేదా? అన్నది రివ్యూలో చూద్దాం.ఎలా ఉందంటే..అమెరికా ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. యూఎస్‌లో ఉన్న ఎయిర్‌బేస్ నుంచే కథ మొదలవుతుంది. ఈ ఆపరేషన్ కోసం నలుగురు ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన కమాండోలు బయలుదేరుతారు. అయితే ఆపరేషన్ మొత్తం సముద్రంలోని డెల్టా అడవుల్లోనే జరుగుతుంది. టార్గెట్ ప్రాంతానికి చేరుకున్న కమాండోలకు ఊహించని పరిస్థితి ఎదురవుతుంది. అక్కడ వారు అనుకున్న ప్లాన్ బెడిసికొట్టి.. ముందుగానే వార్‌లోకి దిగాల్సి వస్తుంది. ఆ తర్వాత జరిగే యుద్ద సన్నివేశాలు కట్టిపడేస్తాయి. ఒకవైపు టెర్రరిస్టుల నుంచి బుల్లెట్ల వర్షం, వైమానికి దాడులు అబ్బుర పరిచేలా అనిపిస్తాయి. అయితే ఈ కథలో కాన్సెప్ట్ కొత్తగా లేనప్పటికీ ఈ ఆపరేషన్ చేపట్టిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అద్భుతమైన లోకేషన్స్ మధ్య భీకరమైన బాంబు దాడులు, బుల్లెట్ల వర్షం ఆడియన్స్‌కు అద్భుతంగా ఉన్నాయి. ఎయిర్‌బేస్, కమాండోల మధ్య కమ్యూనికేషన్ అంత రోటీన్‌గానే ఉంటుంది. ఆపరేషన్ అంతా అడవుల్లోనే సాగడంతో ఎక్కడా బోర్ అనిపించదు. టెర్రరిస్టులతో ఎయిర్‌ఫోర్స్ కమాండోల పోరాడే సీన్స్ ఫుల్ యాక్షన్ ఫీస్ట్‌గా అనిపిస్తాయి. అయితే ఎయిర్‌బేస్ వైమానిక అధికారుల్లో ఆపరేషన్ పట్ల సీరియస్‌నెస్ లేకపోవడం ఈ కథకు పెద్ద మైనస్. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారికి ల్యాండ్ ఆఫ్ బ్యాడ్ మూవీ మంచి ఆప్షన్. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులోనూ అందుబాటులో ఉంది. -
'నేను కీర్తన' సినిమా రివ్యూ
చిమటా రమేశ్ బాబు హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా 'నేను కీర్తన'. స్టోరీ, మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చింది కూడా ఈయనే. రకరకాల జానర్స్ కలిపి తీసిన ఈ మూవీ తాజాగా థియేటర్లలోకి వచ్చింది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?అన్యాయాన్ని ఎదురిస్తూ, ఆపదలో ఉన్నవాళ్లకు జానీ అనే యువకుడి సాయం చేస్తుంటాడు. ఇతడి జీవితంలోకి కీర్తన అనే అమ్మాయి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత జానీ లైఫ్ ఎలా టర్న్ అయింది. తనకు లభించిన ఓ వరాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా, సమాజ ప్రయోజనాలకు జానీ ఏవిధంగా ఉపయోగించాడనేది మిగిలిన కథ.(ఇదీ చదవండి: వనపర్తిలో మా పెళ్లి.. హీరోయిన్ అదితీ ఇంకేం చెప్పింది?)ఎలా ఉందంటే?'మల్టీ జానర్ ఫిల్మ్'గా ప్రచారం చేసిన ఈ చిత్రంలో నిజంగానే అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. లవ్, సెంటిమెంట్, యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా, కామెడీ, రివెంజ్, హర్రర్ వంటి అంశాలన్నీ బ్యాలెన్స్ చేశారు. చిన్న సినిమాలో ఇన్ని జానర్స్ మిక్స్ చేయడం అవసరమా అని అనిపించినా.. స్టోరీ పరంగా పర్లేదనిపించింది.నటీనటుల విషయానికొస్తే రమేష్ బాబుకి ఇది తొలి సినిమా. హీరోగా చేస్తూనే అన్ని విభాగాల్లో తలో చెయ్యి తన వరకు కష్టపడ్డారు. హీరోయిన్లతో పాటు మిగిలిన పాత్రధారులు పరిధి మేరకు నటించారు. దర్శకుడిగా పర్లేదనిపించిన రమేష్ బాబు... రైటర్‌గా ఇంకాస్త శ్రద్ధ పెట్టాలి. సినిమా నిడివి కొంచెం తగ్గించి ఉంటే బాగుండేది. మిగతావన్నీ ఓకే ఓకే.(ఇదీ చదవండి: సరిగా కూర్చోలేకపోయిన హీరో సల్మాన్ ఖాన్.. ఏమైంది?) -
'సీతారాం చిత్రాలు' సినిమా రివ్యూ
తెలుగులో ఇప్పుడంతా కంటెంట్ ఉన్న సినిమాలదే హవా నడుస్తోంది. స్టార్ హీరోలు లేకపోయినా మూవీస్ సూపర్ హిట్ అవుతున్నాయి. అలా బోలెడన్ని చిన్న చిత్రాలు ప్రతివారం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. తాజాగా థియేటర్లలోకి వచ్చిన 'సీతారాం సిత్రాలు'. కొత్తవాళ్లతో చేసిన ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: సరిగా కూర్చోలేకపోయిన హీరో సల్మాన్ ఖాన్.. ఏమైంది?)కథేంటి? కర్నూలు దగ్గరల్లో టీ స్టాల్ నడిపే కుర్రాడు శివ (లక్ష్మణమూర్తి). మంచి మాటలని వాట్సప్‌లో పెడుతూ 'స్టేటస్ శివ'గా ఫేమస్ అవుతాడు. జీవితంలో సక్సెస్ అవ్వాలనేది గోల్. ఓసారి టీచర్‌గా పనిచేసే పార్వతి( భ్రమరాంబిక)తో ప్రేమలో పడతాడు. అనుకోకుండా ఆమెతోనే పెళ్లి ఫిక్స్ అవుతుంది. పెళ్లి గ్రాండ్‌గా చేసుకోవాలని భారీగా అప్పు చేసి ఏర్పాట్లు చేసుకుంటాడు. కానీ ఊహించని విధంగా పెళ్లి ఆగిపోయి, అప్పులు మిగులుతాయి. ఇంతలో విలన్ ఎంట్రీ ఇస్తాడు. దాంతో శివ లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?ఇది చిన్న సినిమానే గానీ ఎన్నో విషయాలను దర్శకుడు ఇందులో చూపించాడు. మనసుకు నచ్చిన పనిని మరింత ఇష్టంగా చేస్తే విజయం వరిస్తుందని... బంధువులు మాటలు చెప్పడానికే కానీ ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేందుకు పనికిరారనే జీవిత సత్యాన్ని చూపించారు. స్నేహితులు కూడా మనల్ని నమ్మించి ఎలా మోసం చేస్తారో చూపించే సీన్లు బాగున్నాయి. సీరియల్స్ మాయలో పడి ఆడవాళ్లు, ఇంట్లో వాళ్లని కూడా అందులోని పాత్రలుగా ఊహించుకోవడం ఎలా ఉంటుందో చూపించాడు.(ఇదీ చదవండి: వనపర్తిలో మా పెళ్లి.. హీరోయిన్ అదితీ ఇంకేం చెప్పింది?)ఎంచుకున్న పాయింట్‌ని చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ ఇంకాస్త బాగా రాసుకుని ఉంటే బాగుండేది. ముఖ్య పాత్రల్లో తెలిసిన వాళ్లను తీసుకుని ఉంటే సినిమా రేంజ్ ఇంకా పెరిగేది. ప్రస్తుతం యువత ప్రేమలో ఓడిపోతే కుంగిపోతున్నారు. అలాంటి వాళ్లు ఎలా సక్సెస్ అవ్వొచ్చో ఈ మూవీతో చూపించారు.హీరో లక్ష్మణ మూర్తి, హీరోయిన్ భ్రమరాంబిక తమ పాత్రలకు న్యాయం చేశారు. తల్లిగా చేసిన ఢిల్లీ రాజేశ్వరితో పాటు మిగిలిన నటీనటులు పర్లేదనిపించారు. దర్శకుడిగా చెప్పాలనుకున్న పాయింట్‌ని సూటిగా చెప్పాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. రుద్ర కిరణ్ సంగీతం వినసొంపుగా ఉంది. నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్లు ఉన్నాయి.(ఇదీ చదవండి: 'పుష్ప 2'.. సందేహాలు అక్కర్లేదు అంతా క్లారిటీ) -
‘టీటీడీ’ తరహాలో యాదాద్రి బోర్డు: సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్: యాదగిరిగుట్ట దేవాలయం అభివృద్ధిపై అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. యాదాద్రి గుడి అభివృద్ధి పనులపై సీఎం శుక్రవారం(ఆగస్టు30) సచివాలయంలో రివ్యూ చేశారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిలో పెండింగ్ పనుల వివరాలు ఇవ్వాలని సీఎం అధికారులను కోరారు. భక్తుల సౌకర్యాలు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై స్పష్టమైన వివరాలు అందించాలని ఆదేశించారు.ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు అర్ధంతరంగా వదిలేయడానికి వీళ్లేదని స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధిని మరో స్థాయికి తీసుకెళ్లాలని సీఎం సూచించారు. -
టాలీవుడ్ మూవీ 'రేవు' రివ్యూ.. ఆడియన్స్‌ను ఆకట్టుకుందా?
టైటిల్: రేవునటీనటులు: వంశీ రామ్ పెండ్యాల, స్వాతి భీమి రెడ్డి, హేమంత్ ఉద్భవ్, అజయ్, సుమేధ్ మాధవన్, యేపూరి హరి తదితరులుదర్శకుడు: హరినాథ్ పులినిర్మాతలు : మురళి గింజుపల్లి, నవీన్ పారుపల్లిసంగీత దర్శకుడు: జాన్ కె జోసెఫ్సినిమాటోగ్రఫీ: రేవంత్ సాగర్ఎడిటర్: శివ శర్వానీవిడుదల తేదీ : ఆగస్టు 23, 2024ఈ రోజుల్లో కంటెంట్ ఉంటే చాలు. చిన్న సినిమాలు అయినా సరే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. కొత్త నటీనటులైనా సరే కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలాగే ఇటీవలే కొత్తవాళ్లతో తెరకెక్కించిన కమిటీ కుర్రోళ్లు సక్సెస్ సాధించింది. అలాగే అంతా కొత్తవాళ్లతో తెరకెక్కిన చిత్రం రేవు. హరినాథ్ పులి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు, పర్వతనేని రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా నిర్మించారు. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.అసలు కథేంటంటే...సముద్ర నేపథ్యంలోని సినిమాలు టాలీవుడ్లో గతంలో చాలానే వచ్చాయి. కోస్తాతీరంలోని మత్స్యకారుల జీవనం ఆధారంగా తెరకెక్కించిన చిత్రమే రేవు. పాలరేవు అనే గ్రామంలో అంకాలు (వంశీరామ్ పెండ్యాల), గంగయ్య (అజయ్) అనే ఇద్దరు మత్స్యకారులు జీవనం సాగిస్తుంటారు. చేపల వేట విషయంలో వీరిద్దరి మధ్య పోటీ ఉంటుంది. అయితే వీరి మధ్యలో మూడో వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు. చేపల వేటలోకి నాగేశు(యేపూరి హరి) ఎంట్రీ ఇచ్చి వీరి జీవనాధారాన్ని దెబ్బతీస్తాడు. మరీ నాగేశ్‌ను అంకాలు, గంగయ్య అడ్డుకున్నారా? పాలరేవులో చేపల వేటపై ఆధిపత్యం కోసం వీరిద్దరు ఏ చేశారన్నదే అసలు కథ?ఎలా ఉందంటే..రేవు అనగానే సముద్రతీరం, మత్స్యకారులు అని అందరికీ గుర్తొస్తాయి. టైటిల్ చూస్తేనే కథ ఎలా ఉంటుందో ప్రేక్షకులు ఊహించుకోవచ్చు. మత్స్యకారుల నేపథ్యంలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ఇక్కడ కథలో చేపలవేట పేరుతో రివేంజ్ డ్రామాను చక్కగా తెరకెక్కించారు. ఇద్దరు స్నేహితుల మధ్య ఈగో వస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో చక్కగా తెరపై ఆవిష్కరించారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది.సముద్ర నేపథ్యం అనగానే కథ మొత్తం తీరప్రాంతం చుట్టే తిరుగుతుంది. ఇందులో మత్స్యకారుల జీవనవిధానం, వారు పడే ఇబ్బందుల ఎలా ఉంటాయనేది డైరెక్టర్ తెరపై చూపించిన విధానం బాగుంది. కొత్త నటీనటులైనప్పటికీ ఎక్కడా ఆ ఫీలింగ్ రాకుండా తీశారు. కొత్త దర్శకుడు అన్న ఫీలింగ్ రాకుండా స్క్రీన్ ప్లేను అద్భుతంగా మలిచాడు హరినాథ్ పులి. కథలో సహజత్వం ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. కానీ కథలో కొత్తదనం లేకపోవడం పెద్ద మైనస్. రోటీన్ స్టోరీ కావడంతో కాస్తా బోరింగ్‌గానే అనిపిస్తుంది. కొన్ని చోట్ల సీన్స్ అయితే మరింత సాగదీసినట్లుగా అనిపిస్తాయి. కానీ క్లైమాక్స్ విషయానికొస్తే డైరెక్టర్ ఆడియన్స్‌ను మెచ్చుకునేలా కథను ముగించాడు.ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో వంశీ రామ్ పెండ్యాల మత్స్యకారుడి పాత్రలో మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్‌లో బాగా రాణించాడు. హేమంత, అజయ్ నిడదవోలు తమ పాత్రల పరిధిలో జీవించారు. హీరోయిన్ గా నటించిన స్వాతి ఆకట్టుకుంది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేర రాణించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. ఎడిటర్ మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సంస్థకు తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. రేటింగ్- 2.75/5 -
'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమా రివ్యూ
తెలుగు సినిమాల్లో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేశ్. ఇతడిని హీరోగా పెట్టి తీసిన సినిమా 'మారుతీనగర్ సుబ్రమణ్యం'. నార్మల్‌గా అయితే ఇదో చిన్న సినిమా. కానీ సుకుమార్ భార్య నిర్మాతల్లో ఒకరు కావడం, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా రావడం కాస్తంత బజ్ క్రియేట్ అయింది. తాజాగా (ఆగస్టు 23) ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?మారుతీనగర్‌కి చెందిన సుబ్రమణ్యం (రావు రమేశ్).. 1998లో టీచర్ ఉద్యోగానికి సెలెక్ట్ అవుతాడు. కానీ కోర్టు స్టే వల్ల అది అలా హోల్డ్‌లో ఉండిపోతుంది. చేస్తే గవర్నమెంట్ ఉద్యోగమే చేయాలని అప్పటినుంచి మరో పనిచేయకుండా ఖాళీగానే ఉంటాడు. భార్య కళారాణి (ఇంద్రజ) గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్. వీళ్లకో కొడుకు అర్జున్ (అంకిత్ కొయ్య). అప్పులతో సంసారం చేస్తున్న సుబ్రమణ్యం అకౌంట్లో రూ.10 లక్షలు వచ్చిపడతాయి. ఇంతకీ వీటిని ఎవరు వేశారు? చివరకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందా? అనేదే స్టోరీ.ఎలా ఉందంటే?సినిమాలో ఎంటర్టైన్ ఉంటే చాలు. స్టార్ హీరోహీరోయిన్లు ఉన్నారా? ఐటమ్ సాంగ్ ఉందా లాంటి విషయాల్ని ప్రేక్షకుల్ని పట్టించుకోరు. అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేశ్‌ని హీరోగా పెట్టి తీసిన సినిమా ఇది. అప్పుడెప్పుడో 1998లో టీచర్ల ఉద్యోగానికి కోర్ట్ స్టే ఇవ్వడం, మన అకౌంట్లో అనుకోకుండా డబ్బులు వచ్చి పడటం.. ఇలా మనకి తెలిసిన వార్తల్ని కాన్సెప్ట్‌గా తీసుకుని తీసిన మూవీ 'మారుతీనగర్ సుబ్రమణ్యం'.మొదలుపెట్టడమే మారుతీనగర్ అనే ప్రాంతంలో ఉండే సుబ్రమణ్యం అసలు ఎలాంటి వాడు? అతడు కుటుంబ పరిస్థితి ఏంటి అనేది క్లియర్‌గా చెప్పి సినిమా మొదలుపెట్టారు. ఓవైపు కథ చెబుతూనే కొన్ని కామెడీ సీన్లు, కొన్ని ఎమోషనల్ సీన్లు అన్నట్లు పేర్చుకుంటూ వెళ్లిపోయారు. సిచ్యుయేషనల్ కామెడీతో రాసుకున్న సన్నివేశాలు చాలావరకు వర్కౌట్ అయ్యాయి. కాకపోతే కొన్నిచోట్ల ఆశించిన స్థాయిలో కామెడీ పండలేదుఫ్యామిలీ డ్రామా తీసుకుని అసలు రూ.10 లక్షలు.. సుబ్రమణ్యం అకౌంట్లోకి ఎవరు వేశారు అనే చిన్న పాయింట్‌తో సినిమాని చివరి వరకు నడపడం బాగుంది. రావు రమేశ్‌కి కూడా సగటు తెలుగు హీరోల్లానే స్లో మోషన్ షాట్స్, డ్యాన్స్‌లు పెట్టారు. అంతా బాగానే ఉంది. కానీ ఇందులో సుబ్రమణ్యం కొడుకు అర్జున్ ప్రేమించే కాంచన అనే అమ్మాయి సీన్లు అయితే మరీ సినిమాటిక్‌గా, లాజిక్‌కి దూరంగా అనిపిస్తాయి. మెగా ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్, చిరంజీవి రిఫరెన్సులు కూడా సినిమాలో పెట్టారు. కాకపోతే అవి కుదిరేశాయి.తల్లిదండ్రుల ముందే రిలేషన్షిప్, బ్రేకప్ లాంటివి కాంచన పాత్ర చాలా ఈజీగా మాట్లాడేస్తూ ఉంటుంది. దీనికి ఆమె తల్లిదండ్రులు పెద్దగా షాక్ అవ్వకుండా అదేదో తమకు చాలా అలవాటు ఉన్నట్లు ప్రవర్తిస్తుంటారు. రియల్ లైఫ్ ఇలా ఎవరు ఉంటార్రా బాబు అనిపిస్తుంది. అయితే ఇదంతా యూత్ కోసం రాసుకున్న సీన్లలా అనిపిస్తాయి. అలానే సినిమాలో లక్షల డబ్బుని చాలా సులభంగా ట్రాన్స్ఫర్ చేసేస్తుంటారు. ఇదంతా కాస్త లాజిక్‌కి దూరంగా అనిపిస్తుంది. ఇలా కొన్ని పొరపాట్లు తప్పితే సినిమా ఓవరాల్‌గా సరదాగా నవ్వుకోవడానికి బాగుంది.ఎవరెలా చేశారు? రావు రమేశ్ నటన గురించి కొత్తగా చెప్పడానికేం లేదు. ఎప్పటిలానే సుబ్రమణ్యం పాత్రలో ఒదిగిపోయాడు. ఇతడి కొడుకుగా చేసిన అంకిత్.. బాగానే చేశాడు. మొన్నే 'ఆయ్'తో, ఇప్పుడు ఈ సినిమాతో మెప్పించాడు. కాంచన పాత్ర చేసిన రమ్య పసుపులేటి.. గ్లామర్‌గా కనిపించడం తప్పితే పెద్దగా చేసిందేం లేదు. ఇంద్రజ కూడా స్టార్టింగ్‌లో ఎమోషనల్ అవ్వడం, చివర్లో డ్యాన్స్ చేయడం తప్పితే పెద్దగా స్కోప్ దొరకలేదు. మిగిలిన పాత్రల్లో ప్రవీణ్, హర్షవర్ధన్, అన్నపూర్ణమ్మ తదితరులు ఓకే.టెక్నికల్ విషయాలకొస్తే.. సినిమా చాలా రిచ్‌గా తీశారు. సినిమాటోగ్రఫీ చాలా కలర్ఫుల్గా ఉంది. పాటలు వినడానికి ప్లస్ చూడటానికి కూడా బాగున్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ లక్ష్మణ్ కార్య.. సింపుల్ స్టోరీ లైన్ తీసుకుని, దానికి తనదైన హాస్యం జోడించి ఎంటర్టైన్ చేశాడు. గతంలో 'హ్యాపీ వెడ్డింగ్' మూవీతో ఆకట్టుకున్న ఇతడు.. ఇప్పుడు ఈ సినిమాతో మెప్పించాడు. ప్రామిసింగ్ దర్శకుడు అనిపించుకున్నాడు. చివరగా చెప్పొచ్చేది ఏంటంటే.. ఫైట్స్ లాంటివి లేకుండా మనసారా కాసేపు నవ్వుకుందామనుకుంటే 'మారుతీనగర్ సుబ్రమణ్యం' మంచి ఆప్షన్.-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
హారర్ థ్రిల్లర్ డీమాంటీ కాలనీ-2 రివ్యూ.. ఆడియన్స్‌ను భయపెట్టిందా?
టైటిల్: డీమాంటీ కాలనీ-2నటీనటులు: ప్రియాభవానీ శంకర్, అరుల్ నిధి, ఆంటి జాస్కెలైన్, త్సెరింగ్ దోర్జీ, అరుణ్‌పాండియన్, ముత్తుకుమార్, మీనాక్షి గోవిందరాజన్, సర్జానో ఖలీద్, అర్చన రవిచంద్రన్ తదితరులుదర్శకుడు: అజయ్ ఆర్ జ్ఞానముత్తునిర్మాతలు: విజయ సుబ్రహ్మణ్యన్, ఆర్సీ రాజ్కుమార్నిర్మాణసంస్థలు: బీటీజీ యూనివర్సల్, వైట్ నైట్స్ ఎంటర్టైన్మెంట్సంగీతం - సామ్ సీఎస్సినిమాటోగ్రఫీ - హరీశ్ కన్నన్ఎడిటర్ - కుమరేశ్ డివిడుదల తేదీ: ఆగస్టు 23(తెలుగు)హారర్ థ్రిల్లర్ మూవీస్ అంటే ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తారు. ఈ జానర్లో వచ్చే చిత్రాలకు కొదవే లేదు. ఏ ఇండస్ట్రీ అయినా ఇలాంటి సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్ ఉంటుంది. అందుకే ఇలాంటి కథలపై డైరెక్టర్స్ ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారు. అలా 2015లో వచ్చిన తమిళ హారర్ థ్రిల్లర్ డీమాంటీ కాలనీ అద్భుతమైన విజయం సాధించింది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్‌గా డీమాంటీ కాలనీ-2 తీసుకొచ్చారు. ప్రియా భవానీ శంకర్, అరుల్ నిధి జంటగా నటించారు. ఇప్పటికే తమిళంలో రిలీజైన ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈనెల 23న రిలీజవుతోన్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీమియర్ షో వేశారు. అజయ్ ఆర్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన డీమాంటీ కాలనీ 2 అభిమానులను ఎంతమేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. అసలు కథేంటంటే..తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సామ్ ఆత్మహత్యకు పాల్పడటాన్ని అతని భార్య డెబీ (ప్రియా భవానీ శంకర్) జీర్ణించుకోలేదు. భర్త ఎందుకలా మరణించాడో తెలుసుకోవాలని ఆరాతీయడం ప్రారంభిస్తుంది. అదే సమయంలో ఆరేళ్లకు ఒకసారి లైబ్రరీలోని పుస్తకం చదవడానికి వెళ్లిన వ్యక్తులందరూ ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తుంది. దీంతో ఆ మరణాలు ఆపేందుకు డెబీ ప్రయత్నాలు స్టార్ట్ చేస్తుంది. ఆ సమయంలో శ్రీనివాస్ (అరుళ్ నిధి), అతని కవల సోదరుడు రఘునందన్ (అరుళ్ నిధి) గురించి కూడా తెలుస్తుంది. వాళ్ల ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉన్నాయని తెలుసుకున్న డెబీ.. ఆ ఇద్దరు అన్నదమ్ములను డెబీ, తన మావయ్య రిచర్డ్ (అరుణ్ పాండియన్)తో కలిసి కాపాడిందా? వీరికి టిబెట్ నుంచి వచ్చిన బౌద్ధ సన్యాసులు ఎలా సాయపడ్డారు? తన భర్త కోరికను డెబీ నెరవేర్చిందా? శ్రీనివాస్‌ను రఘునందన్ ఎందుకు చంపాలని అనుకున్నాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే డీమాంటీ కాలనీ-2 చూడాల్సిందే.ఎలా ఉందంటే..హారర్ థ్రిల్లర్‌కు సీక్వెల్‌గా వచ్చిన డీమాంటీ కాలనీ 2. ప్రీక్వెల్‌ను బేస్ చేసుకుని ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు డైరెక్టర్ అజయ్ ఆర్ జ్ఞానముత్తు. అందుకే డీమాంటీ కాలనీ చూసిన వారికైతే సీక్వెల్ కాస్తా ఈజీగా అర్థమవుతుంది. ఇక ఈ స్టోరీ విషయానికొస్తే డీమాంటీ అనే ఇంటి చుట్టే తిరుగుతుంది. ఇక హారర్ సినిమాలంటే సస్పెన్స్‌లు కామన్ పాయింట్. ఫస్ట్ పార్ట్‌లో సినిమా ప్రారంభంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం, అతని ఆత్మతో మాట్లాడేందుకు భార్య చేసే ప్రయత్నాలు కాస్తా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి.సెకండాఫ్ వచ్చేసరికి ఇందులోకి డీమాంటీ కాలనీ పాత్రలను తీసుకొచ్చిన తీరు ఆడియన్స్‌కు థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. డీమాంటీ కాలనీకి వెళ్లాకే అసలు కథ మొదలవుతుంది. ముఖ్యంగా హారర్ సీన్స్‌లో తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని డైరెక్టర్ చూపించారు. కథ మధ్యలో సర్ప్రైజ్లు కూడా ఆడియన్స్‌ను మెప్పిస్తాయి. కథలో ప్రధానంగా ఆత్మతో పోరాడే సీన్స్ మరింత ఆసక్తిగా మలిచారు జ్ఞానముత్తు. ఈ హారర్ సినిమాలో బుద్ధిజం స్పిరిచువాలిటీ హైలెట్. టిబెటియన్ యాక్టర్‌తో సన్నివేశాలు అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ చిత్రాన్ని హారర్‌తో పాటు అన్నదమ్ముల మధ్య గొడవలు, సవతి చెల్లెలు లాంటి పాత్రలతో ఎమోషన్స్ పండించాడు. క్లైమాక్స్ విషయానికొస్తే ఆడియన్స్‌ను అద్భుతమైన థ్రిల్లింగ్‌కు గురిచేశాడు. విజువల్స్, సౌండ్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. చివర్లో పార్ట్-3 పై ఇచ్చిన హింట్‌తో మరింత క్యూరియాసిటీని పెంచేశాడు జ్ఞానముత్తు.ఎవరెలా చేశారంటే..ప్రియా భవానీ శంకర్ తన పాత్రలో ఒదిగిపోయింది. ముఖ్యంగా హారర్ సీన్స్‌లో హావభావాలు అద్భుతంగా పండించింది. అరుని నిధి ద్విపాత్రాభినయంతో అదరగొట్టేశాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల ఫరిధిలో మెప్పించారు. ఇక సాంకేతికత విషయానికొస్తే.. గ్రాఫిక్స్, సౌండ్ ఫర్వాలేదనిపించాయి. సామ్ సీఎస్ బీజీఎం ఈ చిత్రానికి హైలెట్. హరీష్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌లో కాస్తా ట్రిమ్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. ఓవరాల్‌గా హారర్ జానర్ ఇష్టపడేవారికి ఫుల్ ఎంటర్టైనర్ మూవీ. -- పిన్నాపురం మధుసూదన్, సాక్షి వెబ్‌డెస్క్ -
'తంగలాన్' మరో కోణంలో చూస్తే.. సోషల్ మీడియా రివ్యూస్
ఆగస్టు 15న రిలీజైన డబ్బింగ్ సినిమా 'తంగలాన్'. ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకొచ్చిన ఈ చిత్రానికి తొలిరోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ తర్వాత తర్వాత మెల్లగా పికప్ అవుతోంది. 'మిస్టర్ బచ్చన్', 'డబుల్ ఇస్మార్ట్' ఫెయిలవడం కూడా దీనికి ప్లస్. రొటీన్ రెగ్యులర్ కమర్షియల్ మూవీస్‌లా కాకుండా కాస్త డిఫరెంట్‌గా ఉండటంతో కొందరు తెగ నచ్చేస్తే.. మరికొందరికి మాత్రం అస్సలు నచ్చలేదు. అయితే 'తంగలాన్'ని మరో కోణంలో చూసిన కొందరు సోషల్ మీడియాలో తమదైన రివ్యూలు ఇచ్చారు. అలాంటి వాటిలో కొన్ని మీకోసం..(ఇదీ చదవండి: 'పుష్ప 2'కి పోటీగా రష్మిక నుంచే మరో సినిమా)'ఆత్మగౌరవంతో ఎలా బ్రతకాలో చెప్పేదే 'తంగలాన్' సినిమా. అలాగే మన సంస్కృతి, జీవన విధానాన్ని తెలియపరిచేలా లోతుగా అర్థం అయ్యేలా చాటి చెప్పిన దర్శకుడు పా.రంజిత్. మహిళలకు రవికలు పంచగానే అవి వేసుకుని ఊరంతా సంబరాలు జరుపుకొనేలా వచ్చే పాట 'మనకి మనకి'.. మన అమ్మలు, నాయనమ్మలు చిన్నతనంలో రోళ్లలో వడ్లు పోసి, దంచుతూ పాడుకునేలా సంగీతాన్ని అందించిన జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం, తంగలాన్ బట్టలు వేసుకుంటే ఓర్వకుండా చింపిన మళ్ళీ సూది దారంతో కుట్టుకుని తిరిగి వేసుకోవడం ఇదే కదా ఆత్మ గౌరవంతో కూడిన చారిత్రక జీవన విధానం. -సతీశ్ పొనగంటి'తంగలాన్' సినిమా ఆలోచన నాకు చాలా నచ్చింది. దక్షిణాది భారతీయుల చరిత్రని చూపించాడు. అప్పటి పరిస్థితులని చాలా అద్భుతంగా చూపించాడు. అయితే కథలో వివరణ మొదలవగానే నాకెందుకో డిస్ కనెక్ట్ అయిపోయాను. తంగలాన్ చూస్తుంటే.. ఫిట్జ్ కరాల్డో సినిమా గుర్తొచ్చింది. ప్రస్తుతమున్న వాళ్లలో డేరింగ్ అండ్ ఇంపార్టెంట్ ఫిల్మ్ మేకర్ పా.రంజిత్. 'తంగలాన్' అస్సలు మిస్సవ్వొద్దు. -వెంకట సిద్ధారెడ్డి(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)కటిక దరిద్రుల ఆకలి పోరాటం- తంగలాన్... వాళ్లు పేదవాళ్ళు, కూటికి గతి లేని వాళ్ళు, మూల వాసులు, దళితులు, ఎండుగడ్డి పోచలు, మొలకు గోచీల వాళ్ళు.. భార్యలతో బిడ్డలతో అరణ్యాల్లో నడుస్తూ బంగారం అనే అంతుచిక్కని ఐశ్వర్యం వేటకు బయల్దేరుతారు. అటు ఒక పసిడి భూతం ఈ దరిద్రులను వెన్నాడుతూ వుంటుంది. ఇది ఒక పురాతన జానపద గాథ. నెత్తురూ కన్నీళ్ళూ కలిసి ప్రవహించిన కథ. ఆధునిక కెమెరాలతో, ఉన్నత సాంకేతిక పరిజ్ఞానంతో వందల ఏళ్ళ క్రితం జరిగిన ఓ ఘాతుకాన్ని అంతే క్రూరంగా చూపించిన సాహసం పేరు 'తంగలాన్'. కొన్ని నిజజీవిత సంఘటనలు, కొంత కల్పన, పేదల వేదన కలిసిన తిరుగుబాటు సిద్ధాంతం- తంగలాన్.సర్పట్ట చూశారా? కాలా చూసే వుంటారు. ఇప్పుడు తంగలాన్! వీటిని తీసిన పా.రంజిత్ అనే వాడు మామూలు మనిషి కాదు. మహాదర్శకుడు. కన్నీటి కావ్యామృత రసావిష్కరణ తెలిసిన మాంత్రికుడు. మన కాలం వీరుడు. 'నేను అంబేద్కరిస్ట్ని' అని ప్రకటించుకున్న రంజిత్.. రొటీన్ రొడ్డకొట్టుడు చిల్లర ప్రచార సినిమాలు తీయడు. అతని ఆవేశానికో అర్థముంది. అతని ఆగ్రహానికో పద్ధతి ఉంది. అతని తిరుగుబాటుకో లక్ష్యముంది. తంగలాన్ తీయడం వెనుక వున్నది పరిశోధన, కమర్షియల్ ప్లాన్ మాత్రమే కాదు. అదో తపస్సు. చెక్కు చెదరని నిబద్ధత. ఓ సూపర్ హీరోకి గోచీ పెట్టి దుర్గమారణ్యాల్లో నడిపించిన దుస్సాహసం!కోలార్ బంగారు గనుల్ని మొట్టమొదట కనిపెట్టడానికి జరిగిన సాహస యాత్రలో చరిత్ర చూసిన కన్నీళ్ళనీ, రక్తపుటేర్లనీ, వీరుల చావునీ, ఆడవాళ్ళ నిస్సహాయతనీ ఒళ్ళు జలదరించేలా రికార్డు చేయడంలోని నిజాయితీ మనల్ని షాక్ చేస్తుంది. అటు అగ్రవర్ణ బ్రాహ్మణ దురహంకారం, ఇటు హృదయం లేని బ్రిటిష్ పాలకుల దౌర్జన్యం. దళిత బహుజనులకు వెనక తుపాకులూ, ముందు మొనదేలిన ఈటెలూ, బంగారం ఒక తీరని దాహం, దురాశ. ఇటు నిరుపేద తల్లుల బిడ్డల ఆకలి! ఇలాంటి ఒక మానవ మహావిషాదాన్ని డాక్యుమెంటరీగా తీస్తే చాలదు. నీరసంగా నడిచే కళాత్మక చిత్రంగా తీసినా కుదరదు. ఎఫెక్టివ్‌గా చెప్పాలంటే, కమర్షియల్ స్కీమ్తోనే కొట్టాలి. బలమైన బ్లాక్‌బస్టర్ టెక్నిక్‌తోనే చెలరేగిపోవాలి. ఆ ఎత్తుగడ ఫలించింది. పా.రంజిత్ గెలిచాడు. బీభత్సరస ప్రధానమైన ఓ చారిత్రక విషాదాన్ని మన కళ్ళముందు పరిచాడు. -తాడి ప్రకాష్ (ఇదీ చదవండి: ఆ దర్శకులపై లేని అటాక్ నా ఒక్కడి మీదే ఎందుకు?: హరీశ్ శంకర్) -
'తంగలాన్' సినిమా రివ్యూ
'అపరిచితుడు', 'ఐ' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన విక్రమ్.. సాహసోపేతమైన పాత్రలకు పెట్టింది పేరు. ఇప్పుడు అలానే 'తంగలాన్' అనే మూవీలో ఓ ఆటవిక తెగ మనిషిగా నటించాడు. టీజర్, ట్రైలర్‌తోనే డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ అందివ్వబోతున్నామని ఫీల్ కలిగించారు. ఇప్పుడీ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చింది. ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?అది 1850. బ్రిటీషర్లు మన దేశాన్ని పాలిస్తుంటారు. వెప్పూర్ అనే ఊరిలో తంగలాన్ (విక్రమ్).. తన కుటుంబంతో కలిసి బతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో బంగారం వెతకడం కోసం క్లెమెంట్ అనే ఇంగ్లీష్ దొరతో కలిసి తంగలాన్ వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో వింత వింత అనుభవాలు ఎదురవుతాయి. మరి తంగలాన్ చివరకు బంగారం కనిపెట్టాడా? అరణ్య, ఆరతితో ఇతడికి ఉన్న సంబంధమేంటి అనేదే మెయిన్ స్టోరీ.ఎలా ఉందంటే?'దురాశ దుఃఖానికి చేటు'.. ఈ సామెత చాలాసార్లు వినే ఉంటాం. ఇదే పాయింట్‌తో తీసిన సినిమా 'తంగలాన్'. కేజీఎఫ్ సినిమా మీరు చూసే ఉంటారు. కోలార్ జిల్లాలోని ఓ చోట టన్నుల కొద్ది బంగారం దొరుకుతుంది. అయితే అదంతా ప్రస్తుతంలో జరిగిన కథలా తీశారు. 'తంగలాన్' మాత్రం ఏకంగా వందల ఏళ్ల క్రితం జరిగిన నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో తీశారు.'తంగలాన్', అతడి కుటుంబం, చుట్టూ ఉన్న పరిస్థితులని పరిచయం చేస్తూ సినిమా మొదలుపెట్టడం వరకు బాగానే ఉంది. కొంతసేపటి తర్వాత తంగలాన్.. తన కూతురికి ఓ కథ చెప్పడం.. బంగారం కోసం తన తాత, నాగిని జాతి స్త్రీతో పోరాడటం లాంటివి చెబుతాడు. అయితే సినిమాలో వైవిధ్యముంది కానీ ఎక్కడ కూడా కనెక్ట్ కాలేకపోతాం. మొదటిది సుధీర్ఘంగా సాగే సన్నివేశాలైతే, రెండోది దర్శకుడు అసలేం చెప్పాలనుకున్నాడో ఎంతకీ అర్థం కాకపోవడం.ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలదే ట్రెండ్. అంత మాత్రాన నేల విడిచి సాము చేయడం కరెక్ట్ కాదు. ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యేలా మూవీ తీయాలి. ఈ విషయంలో 'తంగలాన్' ఆమాద దూరంలో ఆగిపోయింది. దాదాపు రెండున్నర గంటల నిడివి.. కానీ నాలుగు గంటల చిత్రాన్ని చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. ఎక్కడో 18వ శతాబ్దంలో మొదలైన స్టోరీ కాస్త 5 శతాబ్దం దగ్గరకు వెళ్లి ఆగుతుంది. హీరోకి అప్పుడప్పుడు కలలో కొందరు మనుషులు కనిపిస్తుంటారు. ఇందుకు కారణాన్ని క్లైమాక్స్‌లో రివీల్ చేస్తారు. కానీ అప్పటికే ఎగ్జైట్మెంట్ చచ్చిపోయింటుంది.ఇందులో హీరోని పల్లెటూరిలో పనిచేసే వాడిగా తొలుత చూపిస్తారు. కొన్నిసీన్ల తర్వాత ఇతడికి బ్రిటీషర్ల మాట్లాడిన ఇంగ్లీష్ చాలా సులభంగా అర్థమైపోతుంది. ఇక్కడ లాజిక్ మిస్సయిపోయారు. అలానే వర్ణ, కుల వివక్ష గురించి సినిమాలో అక్కడక్కడ చూపించిన సీన్లు బాగున్నాయి.ఎవరెలా చేశారు?తంగలాన్‌గా విక్రమ్ తప్ప ఎవరూ ఊహించలేం! ఎందుకంటే ఈ పాత్రలో అలా అదరగొట్టేశాడు. మధ్యలో కొన్ని సీన్లలో తప్పితే అసలు ఒంటిపై బట్టలే ఉండవు. మేకప్ కూడా ఏం ఉండదు. ఇలాంటి పాత్రని టాలీవుడ్లో కొందరు హీరోలు.. జీవితంలో చేయలేరేమో! తంగలాన్ భార్యగా చేసిన మలయాళ నటి పార్వతి తిరువత్తు.. ఉన్నంతలో ఓకే. నాగిని జాతి నాయకురాలు ఆరతిగా మాళవిక మోహనన్ వేరే లెవల్. స్క్రీన్‌పై ఆమె కనిపిస్తుంటే భయమేస్తుంది. మిగిలిన పాత్రధారులు కష్టాన్ని కూడా మర్చిపోలేం.టెక్నికల్‌గా చూసుకుంటే 'తంగలాన్' బ్రిలియంట్ మూవీ. ఆర్ట్, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్స్ ప్రాణం పెట్టేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ తన సంగీతంతో సినిమాని బాగానే ఎలివేట్ చేశాడు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. మిగిలిన విభాగాలతో పాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చాలా కష్టపడింది. కాకపోతే ఈ తరహా మూవీస్ అందరికీ నచ్చవు. డిఫరెంట్ మూవీస్ ఇష్టపడే వాళ్లకు 'తంగలాన్' మంచి ఆప్షన్. ఫైనల్‌గా చెప్పొచ్చేది ఏంటంటే కష్టం కనిపించింది కానీ చాలా సాగదీత అయిపోయింది!-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రివ్యూ
టైటిల్: డబుల్ ఇస్మార్ట్నటినటులు: రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, సాయాజీ షిండే, అలీ, గెటప్ శ్రీను తదితరులునిర్మాణ సంస్థ: పూరి కనెక్ట్స్నిర్మాతలు: పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్దర్శకత్వం:పూరీ జగన్నాథ్సంగీతం: మణిశర్మసినిమాటోగ్రఫీ: సామ్ కె. నాయుడు, జియాని జియానెలివిడుదల తేది: ఆగస్ట్ 15, 2024ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన సినిమా ఇది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ప్రమోషన్స్ అంతగా చేయకపోయినా.. బజ్ మాత్రం క్రియేట్ అయింది. మరి భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథ ఏంటంటే..ఇస్మార్ట్ శంకర్ (రామ్ పోతినేని) తన తల్లిదండ్రుల్ని చిన్నతనంలోనే పోగొట్టుకుంటాడు. తన తల్లి పోచమ్మ (ఝాన్సీ)ని చంపిన బిగ్ బుల్ (సంజయ్ దత్)ను పట్టుకునే పనిలో ఇస్మార్ట్ శంకర్ పడతాడు. మరో వైపు బ్రెయిన్ ట్యూమర్ వల్ల మూడు నెలల్లోనే చనిపోతానని బిగ్ బుల్‌కు తెలుస్తుంది. దీంతో తాను ఎలాగైనా బతకాలని అనుకుంటాడు. థామస్ (మకరంద్ దేశ్ పాండే) మెమోరీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెబుతాడు. ఇస్మార్ట్ శంకర్ అనే వాడికి ఈ ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారని, అలా బిగ్ బుల్ మెమోరీనీ ఇస్మార్ట్ శంకర్‌కు ట్రాన్స్ఫర్మేషన్ చేయాలని థామస్ సూచిస్తాడు.దీంతో ఇస్మార్ట్ శంకర్‌ను పట్టుకునేందుకు బిగ్ బుల్ టీం దిగుతుంది. మరో వైపు బిగ్ బుల్ కోసం ఇస్మార్ట్ శంకర్ కూడా వెతుకుతుంటాడు. ఇండియాలో బిగ్ బుల్ దిగాడని రా ఏజెన్సీకి తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్‌ను పట్టుకుని మెమోరీ ట్రాన్స్ఫర్మేషన్ చేయిస్తాడు బిగ్ బుల్. నాలుగు రోజుల్లోనే ఇస్మార్ట్ శంకర్ కాస్తా బిగ్ బుల్గా మారిపోతాడని చెబుతారు. ఈ క్రమంలో ఇస్మార్ట్ శంకర్ ఏం చేశాడు? బిగ్ బుల్‌ను పట్టుకునేందుకు రా ఏం చేస్తుంది? ఈ కథలో ఇస్మార్ట్ శంకర్ ప్రేయసి జన్నత్ (కావ్యా థాపర్) పాత్ర ఏంటి? చివరకు ఇస్మార్ట్ శంకర్ ఏం చేస్తాడు? అన్నది థియేటర్లో చూడాల్సిందే.ఎలా ఉందంటే..డబుల్ ఇస్మార్ట్ కథ, కోర్ పాయింట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అది చాలా సిల్లీగా ఉంటుంది. చిన్నతనంలోనే తన తల్లిని కోల్పోవడం, తల్లిని చంపిన వాడి కోసం ఇస్మార్ట్ శంకర్ ప్రయత్నించడం.. ఇక కథలోకి హీరోయిన్ ఎంట్రీ.. ఆమె వెనకాల హీరో పడటం ఇవన్నీ కూడా చాలా రొటీన్‌గా అనిపిస్తాయి. మధ్య మధ్యలో బోకా అంటూ అలీ అందరినీ విసిగిస్తాడు. ఏదో అలా తెరపై ఒక సీన్లో కనిపిస్తే జనాలు నవ్వుతారేమో. కానీ పదే పదే చూపించడంతో ప్రేక్షకుడికి సహన పరీక్షలా ఉంటుంది.ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇస్మార్ట్ శంకర్‌ను పట్టుకునేందుకు బిగ్ బుల్ టీం చేసే ప్రయత్నాలతో నిండిపోతుంది. ఇక సెకండాఫ్‌లో అయినా కథ ఇంట్రెస్టింగ్గా సాగుతుందా? ఏమైనా సీరియస్‌గా ఉంటుందా? అని అనుకుంటే పొరబాటే. సెకండాఫ్‌లో ఎమోషన్ పార్ట్ కూడా వర్కవుట్ అవ్వలేదు. షాక్ కొట్టినట్టు, అపరిచితుడులో విక్రమ్ రోల్స్ మారినట్టుగా.. ఇస్మార్ట్ శంకర్‌లో ఎలా అయితే బ్రెయిన్లో మెమోరీ మారిపోతుందో ఇందులోనూ అలానే అనిపిస్తుంది.ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో ప్రగతి నటన చూస్తే అందరికీ నవ్వొస్తుంది. అక్కడ ఎమోషన్ పండాల్సింది పోయి.. అందరూ నవ్వుకునేలా ఉంటుంది. ఇక సినిమా ఎండ్ కార్డ్ పడక ముందే థియేటర్ నుంచి ప్రేక్షకులు బయటకు వచ్చేలా కనిపిస్తోంది. పరమ రొటీన్ క్లైమాక్స్‌లా కనిపిస్తుంది. పూరి నుంచి ఇక కొత్తదనం, కొత్త కథలు ఆశించడం కూడా తప్పేమో అన్నట్టుగా కనిపిస్తుంది.ఎవరెలా చేశారంటే..రామ్ పోతినేని నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాత్ర ఏదైనా సరే అందులో జీవించేస్తాడు. ఇక పక్కా తెలంగాణ యువకుడు శంకర్‌గా అదరగొట్టేశాడు. తెలంగాణ యాసలో ఆయన చెప్పే డైలాగులు చప్పట్లు కొట్టిస్తాయి. సంజయ్ దత్ ఈ సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్. విలన్‌గా ఆయన అదరగొట్టేశాడు. రామ్, సంజయ్ మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇక కావ్య థాపర్ పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో ఆకట్టుకుంది. తెరపై అందంగా కనిపించింది. చాలా కాలం తర్వాత అలీ ఓ మంచి పాత్రలో కనిపించాడు. కానీ ఆయన కామెడీ వర్కౌట్ కాలేదు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా బాగుంది. మణిశర్మ సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. పాటలు అంతంత మాత్రమే అయినా.. బీజీఎం మాత్రం అదిరిపోయింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి.-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్.. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే?
రామ్ పోతినేని- పూరి జగన్నాధ్ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఈ మూవీని 2021లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రంలో ముంబయి భామ కావ్య థాపర్ హీరోయిన్గా నటించింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్‌కు సిద్ధమైన ఈ మూవీ ఇప్పటికే ఓవర్సీస్తో పాటు ఇండియాలోనూ ప్రీమియర్ షోలు మొదలయ్యాయి.ఇవాళ థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రంపై నెటిజన్స్ ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సినిమా అద్భుతంగా ఉందని.. ఫస్ట్ హాఫ్, సెకండాఫ్ ఎక్సలెంట్ అంటూ పోస్టులు పెడుతున్నారు. రామ్ మాస్ యాక్షన్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు బ్లాక్‌బస్టర్ హిట్ అంటూ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. దీంతో ఉదయం నుంచే థియేటర్ల పండుగ వాతావరణం నెలకొంది. డబుల్ ఇస్మార్ట్‌కు హిట్ టాక్ రావడంతో రామ్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. #DoubleISMART Super hit...My fav director puri sir is back...Positives Puri sir dialogues, Amma sentiment,mani Sharma music vere level, big plus Ram energy #DoubleismartonAug15th #DoubleISMARTCelebrations pic.twitter.com/xGwnAKPCAX— Srinu Nattu vidyam (@srinu18_srinu) August 14, 2024 Nandyal EMS mass crowd House full's everywhere 🔥🥵Ustaad @ramsayz ❤️🔥🥳#RAmPOthineni #DoubleISMART#DoubleismartRAmPAgepic.twitter.com/4CkXFS3zhF— DoubleISMART🔱 CITYZEN⚽️ (@Ismart_Cityzen) August 15, 2024 Just now completed ☑️ Congratulations #PuriJagannadh sir🎉Good Movie 👍2nd half >> 1st half Climax 💥💥💥#ManiSharma bgm and songs💥💥#DoubleISMART #RAmPOthineni pic.twitter.com/QJwUGJQbtt— JA$HU’NTR’ (@Jashu_Chowdary9) August 14, 2024 BLOCK BUSTER 💥💥🤟#DoubleISMART #BlockbusterDoubleISMART pic.twitter.com/s2GkDuAAId— RAm POthineni Trends (@RAPOFanTrends) August 15, 2024 -
తుంగభద్ర డ్యామ్ కు రెడ్ అలర్ట్..
-
'ప్యారడైజ్' సినిమా రివ్యూ (ఓటీటీ)
ప్రైవసీ కోసమో, అడ్వెంచర్ చేయాలనో.. ప్రశాంతంగా ఉండే ప్రదేశాలకు ఒంటరిగా లేదంటే జంటగా వెళ్లే ప్లాన్‌లో ఉన్నారా? అయితే మీరు ఈ సినిమా కచ్చితంగా చూడాల్సిందే. ఎందుకంటే ఆహ్లాదం వెనుకే కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు, అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటి ఓ కథతో తీసిన మలయాళ సినిమానే 'ప్యారడైజ్'. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం!కథేంటి?అది 2022 జూన్. దేశం దివాళా తీయడంతో శ్రీలంకలో పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ఇదే టైంలో ఇండియా నుంచి కేశవ్ (రోషన్ మాథ్యూస్), అమృత (దర్శన రాజేంద్రన్) అనే జంట శ్రీలంకకి విహారయాత్రకి వస్తారు. ప్రైవసీ కోసం ఓ మారుమూల పల్లెటూరిలోని కాటేజీలో దిగుతారు. ఓ రోజు దుండగులు వీళ్ల గదిలోకి వచ్చిన ల్యాప్ ట్యాప్, ఫోన్స్ ఎత్తుకెళ్లిపోతారు. దీంతో కేశవ్-అమృత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?'ప్యారడైజ్' అంటే స్వర్గం అని అర్థం. శ్రీలంకని చాలామంది భూతల స్వర్గం అని పిలుస్తారు. ఎందుకంటే అక్కడి లొకేషన్స్ అంత అద్భుతంగా ఉంటాయి. ఇక్కడి ప్రకృతి అందాల్ని చూసేందుకు విదేశీ టూరిస్టులు చాలామంది వస్తూనే ఉంటారు. అలా శ్రీలంకలో 2022లో అల్లరు జరుగుతున్న టైంలో అక్కడికి వెళ్లిన భారతీయ జంట ఎలాంటి అనుభవాల్ని ఎదుర్కొంది అనే కాన్సెప్ట్‌తో తీసిన థ్రిల్లర్ డ్రామా మూవీ 'ప్యారడైజ్'.చాలామంది ప్రైవసీ కోసమో లేదంటే అడ్వంచర్ చేద్దామనో శ్రీలంక లాంటి చోట్లకు వెళ్తుంటారు. అయితే ఒంటరిగా ఉన్నప్పుడు దొంగతనం, ఇంకేదైనా జరగొచ్చేమో అనే ఓ భయం ఈ సినిమా చూసిన తర్వాత కలుగుతుంది. అలానే శ్రీలంకలో టూరిస్టులని అటు జనాలు కావొచ్చు, ఇటు పోలీసులు కావొచ్చు ఎంతలా గౌరవిస్తారనేది కూడా చాలా చక్కగా చూపించారు. సినిమాలో శ్రీలంక అందాల్ని చాలా బ్యూటీఫుల్ గా క్యాప్చర్ చేశారు.ఓ వైపు నెక్స్ట్ ఏం జరుగుతుందోనని ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ థ్రిల్లర్, డ్రామా చూపిస్తూనే మరోవైపు రాముడు, రావణుడు, సీతతో పాటు రామాయణానికి సంబంధించిన కొన్ని సీన్స్ బాగుంటాయి. స్టోరీ పరంగా సింపుల్ లైన్ అయినప్పటికీ.. కొన్ని సీన్లు సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక యాక్టర్స్ ఫెర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. లీడ్ రోల్స్ చేసిన రోషన్ మాథ్యూ, దర్శన రాజేంద్రన్ చాలా నేచురల్‌గా యాక్ట్ చేశారు. మిగిలిన వాళ్లందరూ లోకల్ యాక్టర్స్. ఉన్నవి కొన్ని పాత్రలే అయినా సరే జీవించేశారు.కేవలం గంటన్నర నిడివి మాత్రమే ఉన్న ఈ సినిమా.. ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. అలానే లోన్లీగా ఉండే ప్రదేశాలకు వెళ్దామనుకునేవాళ్లు ఈ సినిమా చూస్తే మాత్రం కొంపదీసి సినిమాలో చూపించినట్లు జరిగితే అంతే ఇక అని భయపడేలా చేస్తుంది. రెగ్యులర్ రొటీన్ మూవీస్ కాకుండా కొత్తగా ఏదైనా ట్రై చేద్దామనుకుంటే దీన్ని చూడండి.-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్<br>Powered by <a href="https://youtubeembedcode.com">how to embed a youtube video</a> and <a href="https://howtostopgamstop.com/">how to get around gamstop</a> -
'తిరగబడర సామీ' సినిమా రివ్యూ
లావణ్య అనే అమ్మాయి వల్ల హీరో రాజ్ తరుణ్ గత కొన్నిరోజులుగా వార్తల్లో నిలిచాడు. హీరోయిన్ మాల్వి మల్హోత్రా మాయలో పడి, తనని మోసం చేశాడని ఈమె చేసిన కామెంట్స్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయాయి. అదే మాల్వి మాల్హోత్రా-రాజ్ తరుణ్ జంటగా కలిసి నటించిన 'తిరగబడర సామీ' సినిమా ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. రచ్చ వల్ల చర్చల్లో నిలిచిన ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.కథేంటి?సమాజంలో తప్పిపోతున్న చాలామందిని వాళ్ల సొంతవాళ్ల దగ్గరకి చేర్చే అనాథ కుర్రాడు గిరి (రాజ్ తరుణ్). ఈ పని చేస్తుండటం వల్ల ఇతడికి పిల్లనిచ్చి పెళ్లి చేయడానికి ఎవరూ ముందుకు రారు. అలాంటిది మరో అనాథ అయిన శైలజ (మాల్వీ మల్హోత్రా), గిరిని పెళ్లి చేసుకుంటుంది. కొన్నిరోజుల్లో ప్రెగ్నెంట్ కూడా అవుతుంది. అయితే శైలజ అనాథ కాదని ఓ సందర్భంలో గిరికి తెలుస్తుంది. అప్పుడేం చేశాడు? ఇంతకీ కొండారెడ్డి అనే గుండాకు శైలజకు సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?లావణ్య అనే అమ్మాయి వల్ల రాజ్ తరుణ్‌తో పాటు 'తిరగబడర సామీ' సినిమా కూడా వార్తల్లో నిలిచింది. కానీ అనుకున్నంతగా ఇందులో ఏం లేదు. టాలీవుడ్లో చాలాసార్లు చూసేసిన కథతోనే సినిమా తీశారు. పోనీ ఏమైనా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయా అంటే ఏం లేవు. మొదలైన దగ్గర చివరివరకు తర్వాత సీన్ లో ఏం జరుగుతుందో సాధారణ ప్రేక్షకుడు సులభంగా ఊహించేస్తాడు. అంత నీరసమైన స్క్రీన్ ప్లేతో సినిమాని నడిపించారు.తప్పిపోయిన, కనిపించకుండా పోయిన వ్యక్తుల్ని.. ఆయా వ్యక్తుల కుటుంబీకులకు అప్పగించే కుర్రాడిగా రాజ్ తరుణ్‌ని పరిచయం చేశారు. ఆ తర్వాత హీరోయిన్ ఎంట్రీ, కట్ చేస్తే ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత పాటలు ఇలా చప్పగా సాగుతూ ఉంటుంది. అసలు తనని పెళ్లి చేసుకున్న శైలజ ఎవరో తెలిసే విషయంతో ఇంటర్వెల్ పడుతుంది. అయితే అనవసరమైన సీన్లతో సెకండాఫ్ ఇంకా భారంగా సాగుతుంది. ఫైట్‌తో క్లైమాక్స్ ముగుస్తుంది.గంట 55 నిమిషాల నిడివితో తీసినప్పటికీ.. ఏదో మూడు గంటల సినిమా చూస్తున్నామా అనేంత భారమైన ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడెప్పుడో 90ల్లో రాసుకున్న కథని ఇప్పుడెందుకు తీశారు? అసలు రాజ్ తరుణ్ ఇలాంటి మూవీ ఎందుకు చేశాడా అని సందేహాలు వస్తాయి. ఇందులో హీరోయిన్ ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు చెబుతారు. కానీ ఒక్కచోట కూడా పొట్ట ఎత్తుగా ఉన్నట్లు చూపించారు. ఇలాంటి లాజిక్ లేని సీన్లు సినిమాలో బోలెడు ఉంటాయి.ఎవరెలా చేశారు?రాజ్ తరుణ్ మంచి ఎనర్జీ ఉన్న నటుడు. కాకపోతే ఇందులో అతడి యాక్టింగ్ స్టామినాని సరిగా ఉపయోగించుకోలేకపోయారు. ఏదో అలా చేశాడంతే! హీరోయిన్ మాల్వీ మల్హోత్రా యాక్టింగ్ పర్లేదు. విలన్‌గా చేసిన మకరంద్ దేశ్ పాండే పాత్ర, బిహేవ్ చేసే విధానం మరీ సిల్లీగా ఉంటుంది. గ్లామర్ షో చేసేందుకే మన్నారా చోప్రా పాత్ర ఉంది. మిగిలిన పాత్రలన్నీ ఏదో ఉన్నాయంటే ఉన్నాయంతే! టెక్నికల్ విషయాలకొస్తే.. 'యజ్ఞం', 'పిల్లా నువ్వు లేని జీవితం' సినిమాలు తీసిన డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి.. మరీ ఇలా అయిపోయారేంటి అనిపిస్తుంది. పాటలు పర్లేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మరీ లౌడ్‌గా ఉండి తెగ ఇబ్బంది పెట్టింది. సినిమాటోగ్రాఫీ, నిర్మాణ విలువలు ఓకే ఓకే. ఓవరాల్‌గా చెప్పుకొంటే రాజ్ తరుణ్-లావణ్య గొడవ వల్ల కాస్త హైలైట్ అయిన ఈ సినిమా.. కనీసం అంటే కనీసం ఆకట్టుకోలేకపోయింది! -
రేపటి కోసం యుద్ధం.. ఉత్కంఠతతో సాగే 'ది టుమారో వార్'
చిత్రం: ది టుమారో వార్విడుదల: జులై 02,2021నటీనటులు: క్రిస్ ప్రాట్, వైవోన్నే స్ట్రాహోవ్స్కీ, సిమన్స్, గిల్పిన్, సామ్ రిచర్డ్సన్, ఎడ్విన్ హాడ్జ్, జాస్మిన్ మాథ్యూస్, ర్యాన్ కీరా ఆర్మ్‌స్ట్రాంగ్, కీత్ పవర్స్ తదితరులుదర్శకుడు : క్రిస్ మెక్కేసంగీతం: లోర్మీ బ్లాఫీసినిమాటోగ్రఫీ: ల్యారీ ఫాంగ్నిర్మాతలు: డేవిడ్ ఎల్లిసన్, డానా గోల్డ్బెర్గ్, డాన్ గ్రాంజెర్, జులెస్ డాలీ, డేవిడ్ ఎస్.గోయర్, ఆడమ్ కోల్బెర్నర్ఓటీటీ భాగస్వామి: అమెజాన్ ప్రైమ్ వీడియో (తెలుగు)స్ట్రీమింగ్ భాషలు: తెలుగు,ఇంగ్లీష్,హిందీ,తమిళ్,కన్నడ,మలయాళంహాలీవుడ్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు భారీగానే ఆదరిస్తారు. అందుకే అవన్నీ తెలుగులో కూడా డబ్ అవుతుంటాయి. సైన్స్ ఫిక్షన్ చిత్రాలతో పాటు యాక్షన్ అడ్వెంచర్ చిత్రాలను టాలీవుడ్ ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మార్వెల్ చిత్రాలతో పాటు ఏలియన్స్ సబ్జెక్ట్‌తో వచ్చిన సినిమాలు ఎన్నో థియేటర్లలో సందడి చేశాయి. ఈ క్రమంలో తెరకెక్కిన మిలటరీ సైన్స్ ఫిక్షన్ సినిమానే 'ది టుమారో వార్'. 2021 కోవిడ్ సమయంలో డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. హలీవుడ్లో తెరకెక్కిన ఈ సినిమా అమెజాన్‌లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమా కథేంటో తెలుసుకుందాం. భవిష్యత్ కాలంలో భూమి మీద ఎలాంటి ఇబ్బందులు రావచ్చేనే కాన్సెప్ట్‌తో 'ది టుమారో వార్' కథ ఉంటుంది. గ్రహాంతర వాసులకు.. జీవరాశులకు మధ్య జరిగే భారీ యాక్షన్ వార్‌గా చాలా ఉత్కంఠతో కూడుకొని కథ ఉంటుంది.కథ ఎంటి..?డాన్ ఫారెస్టర్ (క్రిస్ ప్రాట్) మాజీ ఇరాక్ సైనికాధికారి. రిటైర్డ్ అయ్యాక స్కూల్ పిల్లలకు బయాలజీ చెబుతూ తన భార్య (బెట్టీ గ్లిపిన్), కూతురు (రియాన్ కైరా)తో కలిసి జీవితం గడుపుతుంటాడు. ఒకరోజు ఆకాశం నుంచి ఓ ఆర్మీ యూనిట్ ఆయనముందు ప్రత్యక్షమవుతుంది. తామందరం భవిష్యత్ కాలం నుంచి వచ్చామని చెబుతూ ఎలియన్స్‌తో యుద్ధం చేసేందుకు సైన్యం అవసరం ఉందని చెబుతారు. ఆయనొక ఆర్మీ అధికారి కాబట్టి ఎలియన్స్ మీద పోరాటం చేసేందుకు తీసుకెళ్తారు. భవిష్యత్తు యుద్ధం కోసం అతను చేసిన త్యాగం ఏమిటి? ఒక బృందంగా వెళ్లిన డాన్ ఫారెస్టర్ ఏం చేశాడు..? ఏలియన్స్ ఎలా అంతమయ్యాయి..? డాన్ ఫారెస్టర్ కోసమే భవిష్యత్ కాలం నుంచి వారు ఎందుకు వచ్చారు..? ఇవన్నీ తెలియాలంటే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'ది టుమారో వార్' చూడాల్సిందే.ఎలా ఉందంటే..?గ్రహాంతర వాసులకు.. జీవరాశులకు మధ్య జరిగే యుద్ద నేపథ్యంలో వచ్చిన ఈ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చాలా అంశాల్లో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఏలియన్స్ కాన్సెప్ట్‌తో వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. అన్నీ సినిమాల మాదిరి కాకుండా ది టామారో వార్ సినిమాను చాలా ప్రత్యేకంగా తెరకెక్కించారు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ భిన్నమైనది. ఎలియన్స్‌ను ఎదుర్కొనేందుకు భవిష్యత్ తరం వారు సాయం కోసం వర్తమాన కాలానికి చెందిన వారిని కలవడం అనేది చాలా ఆసక్తి తెప్పించే అంశం. ఈ పాయింట్‌తో సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ క్రిస్ మెకే భారీ విజయం సాధించారు.డాన్ ఫారెస్టర్ ఆర్మీ నుంచి వచ్చిన తర్వాత ఎలా భవిష్యత్ కాలంలో అడుగుపెట్టాడో చూపించిన విధానం బాగుంది. అక్కడ ఎలియన్స్ మీద రీసెర్చ్ చేస్తున్న ఆ యూనిట్లో డాన్ ఫారెస్టర్ ఎలా కీలకం అయ్యాడో చూపించిన తీరు ప్రేక్షకులను మెప్పిస్తుంది. అప్పటికే చాలామంది ఏలియన్స్ మరణించి ఉంటారు. అలాంటి సమయంలో ఎంట్రీ ఇచ్చిన డాన్ ఫారెస్టర్ యూనిట్ మీద ఏలియన్స్ ఎటాక్ చేస్తాయి. చాలా ఉత్కంఠతతో ఆ సీన్స్ ఉంటాయి.ఈ క్రమంలో ఓ ఏలియన్‌ను డాన్ ఫారెస్టర్ యూనిట్ పట్టుకుంటుంది. ఆ సమయంలో ప్రతి ప్రేక్షకుడిని చూపుతిప్పనివ్వకుండా దర్శకుడు చిత్రీకరించాడు. సరిగ్గా ఈ సమయంలోనే మరో ఆర్మీ యూనిట్‌కు నాయకత్వం వహిస్తున్న మ్యూరి ఫారెస్టర్ తన కుమార్తె అని తెలుసుకుని డాన్ ఫారెస్టర్ చాలా సంతోషిస్తాడు. చాలా ఎమెషనల్‌గా కొన్ని సీన్లు వారి మధ్య ఉంటాయి. భవిష్యత్ కాలానికి వెళ్లి తన కుమార్తెను కలుసుకున్న ఒక తండ్రి కాన్సెప్ట్ అందరినీ మెప్పిస్తుంది. ఎలియన్స్‌ను అంతం చేయాలంటే దానితోనే వాటిని చంపాలని డాన్ ఫారెస్టర్ ఒక వ్యూహం వేస్తాడు. వారి చేతికి చిక్కిన ఎలియన్ శరీరం నెంచి టాక్సిన్ను తయారు చేసి దానితోనే వాటిని అంతం చేయాలని స్కెచ్ వేస్తాడు. అయితే, వారి చేతికి చిక్కిన ఏలియన్‌ను కాపాడుకునేందుకు మిగిలిన ఏలియన్స్ చేసిన పోరాటంతో ప్లాన్ ఫెయిల్ అవుతుంది. అలాంటి సమయంలో డాన్ ఫారెస్టర్ వేసిన మరో అద్భుతమైన ప్లాన్ ఎంటి..? అనేది చాలా ఆసక్తిని పెంచుతుంది. యాక్షన్ చిత్రాలను ఆదరించేవారికి ఈ సినిమా మంచి థ్రిల్‌ను తప్పకుండా ఇస్తుంది.ఎవరెలా చేశారంటే..?డాన్ ఫారెస్టర్ పాత్రలో క్రిస్ ప్రాట్ అదరగొట్టేశాడు. ఆయన కూతురి పాత్రలో స్ట్రావోస్కీ కూడా మెప్పించింది. సిమన్స్, సామ్ రిచర్డ్సన్ వారి పాత్రలకు సరైన న్యాయం చేశారు. 'ది టుమారో వార్' చిత్రానికి ప్రధాన బలం విజువల్స్ అని చెప్పవచ్చు. ల్యారీ ఫాంగ్ సినిమాటోగ్రఫీ సినిమాను మరో రేంజ్‌కు చేర్చుతుంది. ఇలాంటి సినిమాలు బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఆ మజానే వేరు అనేలా ఉంటుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లను ఎలివేట్ చేయడానికి అద్భుతమైన విఎఫెక్స్, క్వాలిటీ సీజిఐను ఉపయోగించడంతో ఈ సినిమా విజువల్ వండర్‌గా తెరకెక్కింది. అయితే దర్శకుడు కథ చెప్పే తీరు కాస్త నెమ్మదిగా ఉంటుంది. ముఖ్చంగా తండ్రీ, కూతుళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు కాస్త సాగదీతగా అనిపిస్తాయి. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త బలంగా ఉండాల్సింది. ఫైనల్‌గా ‘ది టుమారో వార్’ అద్భుతాన్ని చూడాల్సిందే. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. -
Galli Gang Stars Movie Review: గల్లీ గ్యాంగ్ స్టార్స్ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: గల్లీ గ్యాంగ్ స్టార్స్ నటీనటులు : సంజయ్ శ్రీ రాజ్, ప్రియ శ్రీనివాస్, భరత్ మహాన్, రితిక, ఆర్జే బాలు, చందు, తారక్, మురళి కృష్ణ రెడ్డి తదితరులుదర్శకత్వం: వెంకటేష్ కొండిపోగు, ధర్మనిర్మాణ సంస్థ: ఏబీడీ ప్రొడక్షన్స్నిర్మాత: డా. ఆరవేటి యశోవర్ధన్సంగీత దర్శకుడు: సత్య, శరత్ రామ్ రవిఎడిటర్ : ధర్మఅసలు కథేంటంటే..గల్లీ గ్యాంగ్ స్టార్స్ మూవీ నెల్లూరు పరిసర ప్రాంతంలో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. గాంధీ, తప్పెట్లు, మూగోడు, చెత్తోడు, కర్రోడు, క్వార్టర్ అనే పేర్లతో నెల్లూరు గల్లీలో పెరుగుతున్న అనాధల కథే ఈ చిత్రం. ఆ గల్లిని ఎప్పటినుంచో తన గుప్పెట్లో పెట్టుకున్న గోల్డ్ రెడ్డి అనే రౌడీషీటర్. అక్కడ ఉన్న అనాధల్ని తీసుకెళ్లి వాళ్లతో డ్రగ్ అమ్మిస్తూ నేరాలు చేయిస్తూ ఉంటాడు. గాంధీ అనే వ్యక్తి గోల్డ్ రెడ్డి కింద పనిచేస్తూ ఉంటాడు. గాంధీ ప్రియురాలు లక్ష్మీని గోల్డ్ రెడ్డి ఏడిపిస్తాడు. అదేవిధంగా ఆ గల్లీ ప్రజలని భయపెడుతూ ఉంటాడు. ఈ గల్లీ కుర్రాళ్లకి సత్య అని చదువుకున్న యువకుడు తోడు అవుతాడు. ఆ తర్వాత గోల్డ్ రెడ్డి చేస్తున్న అన్యాయాన్ని అర్థం చేసుకున్న గల్లీ కుర్రాళ్ళు గల్లీ గ్యాంగ్ స్టార్స్‌గా ఎలా మారారు? ఈ ఆరుగురు అనాధలు ఎలా కలిశారు? గోల్డ్ రెడ్డిని ఎలా ఎదిరించారన్నదే అసలు కథ.ఎలా ఉందంటే..డైరెక్టర్ వెంకటేష్ కొండిపోగు కథలోకి నెమ్మదిగా ప్రేక్షకులను తీసుకెళ్లాడు. రోటీన్ వచ్చే సన్నివేశాలు, కామెడీతో హాఫ్ సాగింది. కాస్తా బోరింగ్ అనిపించిన అక్కడక్కడ నవ్వించే సీన్స్‌తో కవర్ చేశాడు. గల్లీ కుర్రాళ్లు, రౌడీషీటర్ గోల్డ్ రెడ్డి మధ్య జరిగే సన్నివేశాల్లో అంతగా వర్కవుట్ కాలేదు. సెకండాఫ్ వచ్చేసరికి కథను కాస్తా సాగదీసినట్లు అనిపిస్తుంది. గోల్డ్ రెడ్డి, కుర్రాళ్ల గ్యాంగ్‌ను ఎలా ఎదుర్కొన్నారనే దాని చుట్టే కథ తిరుగుతుంది. క్లైమాక్స్ సీన్ ఫర్వాలేదు. డైరెక్టర్ తాను రాసుకున్న కథను తెరపై ఆవిష్కరించడంలో కొత్తదనం చూపించలేకపోయాడు. చివరికీ గోల్డ్ రెడ్డిని ఆ కుర్రాళ్ల గ్యాంగ్ ఎలా ఎదిరించారో తెలియాలంటే గల్లీ గ్యాంగ్ స్టార్స్‌ను చూడాల్సిందే.ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో కొత్త వారైనా కూడా మంచి నటనతో ఆకట్టుకున్నారు. సంజయ్ శ్రీ రాజ్ గాంధీగా మంచి పాత్ర పోషించాడు. ప్రియ శ్రీనివాస్, భరత్ మహాన్, రితిక, ఆర్జే బాలు, చందు, తారక్, మురళి కృష్ణ రెడ్డి తమ పాత్రలకు న్యాయం చేశారు. ఏబిడి ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు ఫర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. ధర్మ సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. సత్య శరత్ రామ్ రవి సంగీత నేపథ్యం బాగుంది. -
పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్: వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం(జులై 26) సెక్రటేరియట్లో పంచాయతీరాజ్ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల నిర్వహించడంపై అధికారులతో చర్చించారు. ఆగస్టు తొలివారంలోగా కొత్త ఓటరు లిస్టు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఓటరు జాబితా పూర్తయిన తర్వాత గడువులోగా నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్‌ను సీఎం కోరారు. బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ రివ్యూలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ వి.కృష్ణ మోహన్, సీఎస్ శాంతి కుమారి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
Raayan X Review: ధనుష్ 'రాయన్' ట్విటర్ రివ్యూ
తమిళ హీరో ధనుష్ మైల్ స్టోన్ మూవీ 'రాయన్'.ఇతడే దర్శకత్వం వహించిన, హీరోగా నటించాడు. సందీప్ కిషన్, కాళీదాస్ జయరాం, దుసరా విజయన్, అపర్ణ బాలమురళి, ప్రకాశ్ రాజ్, సెల్వ రాఘవన్ తదితరులు కీలక పాత్రలు చేశారు. తాజాగా ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలోకి వచ్చేసింది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? చూసిన వాళ్లు ట్విటర్లో టాక్ ఏంటి?ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని, సెకండాఫ్ మరింత బాగుందని అంటున్నారు. అలానే ధనుష్ ఎంట్రీ అదిరిపోయిందని ఓ నెటిజన్ చెప్పుకొచ్చాడు. ఇంటర్వెల్, క్లైమాక్స్ బ్యాంగ్ సూపర్ గా ఉందని అంటున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉందని, ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయిందని చెప్పుకొచ్చారు. పూర్తి రివ్యూ ఏంటనేది మరికాసేపట్లో వచ్చేస్తుంది.#Raayan - ARR Bhai is the second hero of the movie🥶🫶Sema BGM, especially the flashback portions🤌🔥🔥 pic.twitter.com/y8Nl2Q7wiU— AmuthaBharathi (@CinemaWithAB) July 26, 2024#Raayan First Half REPORT -Raayan - Raw & Rustic One 🔥💥 . @dhanushkraja 's Transformation 🥵🔥 screen presence ... Fireyyyy One ! #Dhanush 's Direction 🏆🙏🙏 Top Notch ... Literally Witnessed an another Vetrimaran Here 🔥 Casting & their Performance - Perfect 💥… pic.twitter.com/shheQ4m4ir— Let's X OTT GLOBAL (@LetsXOtt) July 26, 2024#Raayan interval 💥💥💥💥💥💥#dhanush naaaaaaaaaaaa 💥💥💥💥💥💥💥💥💥💥💥 Watha edra Dragon Template ah omalae #RaayanFDFS pic.twitter.com/TAUiUjcsPG— Tonystark👊🏽 (@Tonystark2409) July 26, 2024#Raayan First half - ABOVE AVERAGE to GOOD🤝- Takes some to set the phase & establish the characters & the story gears up in the midway of the movie 🔥- A Usual Revenge drama but shies out well with the treatment of Director #Dhanush👌- Goosebumps Interval Portion🔪🥵- ARR… pic.twitter.com/XE9v9Lc0Fv— AmuthaBharathi (@CinemaWithAB) July 26, 2024Simple and neat title card with terrific BGM..#Raayan pic.twitter.com/5zt02u4Hhg— R Vasanth (@rvasanth92) July 26, 2024 -
'ప్రతి ఒక్కరూ మేధావులు అనుకుంటారు'.. బాబీ సింహా షాకింగ్ కామెంట్స్!
అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం భారతీయుడు-2. శంకర్- కమల్ కాంబోలో వచ్చిన ఈ మూవీని 1996లో భారతీయుడుకు సీక్వెల్‌గా తీసుకొచ్చారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత సీక్వెల్ రావడంతో అందరి చూపు ఇండియన్-2 పైనే ఉంది. జూలై 12న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఊహించని షాకిచ్చింది. తొలిరోజే మిక్స్డ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. దీంతో వసూళ్లు భారీగా పడిపోయాయి. వారం రోజుల్లో ఇండియా వ్యాప్తంగా కేవలం రూ.70 కోట్లకు పైగా కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బాబీ సింహాకు నెగెటివ్ రివ్యూలకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఇండియన్-2కు నెగెటివ్ రివ్యూలపై ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.బాబీ సింహా మాట్లాడుతూ.. 'ప్రతి ఒక్కరూ తమకు తాము తెలివైన వారని అనుకుంటారు. సినిమాను విమర్శించడానికి కారణాలను వాళ్లే వెతుక్కుంటారు. మేము అలాంటి వాటిని అస్సలు పట్టించుకోం. కేవలం సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులను మాత్రమే గుర్తుంచుకుంటాం. రివ్యూలు ఇచ్చే కొందరు మేధావుల అభిప్రాయాలను పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు' అని షాకింగ్ కామెంట్స్ చేశారు.అంతే కాకుండా ఇండియన్-3 చూసే వరకు ఇండియన్ -2ని అంచనా వేయకూడదని సూచించారు. అయితే బాబీ సింహా కామెంట్స్‌పై నెటిజన్స్ మండిపడుతున్నారు. సినిమా నచ్చకపోతే మీ పొరపాట్లను సరిదిద్దుకోవాలని సలహాలు ఇస్తున్నారు. అయితే మరికొందరు బాబీని సమర్థించారు. ఎప్పుడూ నెగెటివ్ రివ్యూలు ఇచ్చే మేధావుల గురించే ఆయన స్పష్టంగా మాట్లాడారని అంటున్నారు.కాగా.. ఇండియన్-2 చిత్రంలో బాబీ సింహా కీలక పాత్రలో కనిపించారు. ఈ మూవీలో కమల్‌హాసన్ సేనాపతి పాత్రలో నటించగా.. ఆయనను పట్టుకునే సీబీఐ ఆఫీసర్‌గా బాబీ మెప్పించారు. ఇందులో సిద్ధార్థ్, ప్రియా భవాని శంకర్, రకుల్ ప్రీత్, సముద్రఖని కూడా నటించారు. #BobbySimha rather than you blaming audiences, admit the flaws in the movie and try to entertain audiences genuinely. Please re-watch your brilliant performances in #Indian2 again. Don't underestimate audiences.@actorsimha https://t.co/e8l52b9L9y pic.twitter.com/ndyPJNnYhi— Tharan (@jayshah_my) July 19, 2024Bobby Simha criticize the Audience 😐pic.twitter.com/sCBdXzlrDd— Ayyappan (@Ayyappan_1504) July 18, 2024 -
బిగ్‌బాస్ నోయల్ '14' సినిమా రివ్యూ
బిగ్‌బాస్ ఫేమ్ నోయల్ లేటెస్ట్ మూవీ '14'. ఇందులో ఇతడు డిటెక్టివ్ పాత్ర పోషించాడు. రామ్ రతన్ రెడ్డి, విషాక ధీమాన్ హీరోహీరోయిన్లుగా నటించారు. పోసాని కూడా కీ రోల్ చేశారు. లక్మీ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా.. సుబ్బారావు రాయన, శివకృష్ణ నిచ్చన మెట్ల సంయుక్తంగా నిర్మించారు. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ సస్పెన్స్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది? టాక్ ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?రతన్ (రామ్ రతన్ రెడ్డి).. ముఖ్యమంత్రి (పోసాని కృష్ణ మురళి) కుమారుడు. ఇతడిది జాలీ లైఫ్. నేహా (విషాక ధీమాన్) అనే డాక్టర్‌తో ప్రేమలో ఉంటాడు. ఉన్నట్టుండి ఓరోజు.. నేహా ఫ్లాట్‌లో వీళ్లిద్దరూ విగత జీవులుగా కనిపిస్తారు. ఆత్మహత్య కింద కేసు నమోదు చేసి పోలీసులు.. కేస్ మూసేస్తారు. జర్నలిస్ట్ సుబ్బు(శ్రీకాంత్ అయ్యంగార్) మాత్రం వీరిది ఆత్మహత్య కాదని, హత్య అని ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు. ఇంతకీ సుబ్బు ఏం కనుక్కొన్నాడు. ఈ చావులో సీఎం పాత్ర ఏంటి? డిటెక్టివ్ నోయల్ ఈ కేస్ స్టడీలో ఎంత వరకూ ఉపయోగపడ్డాడు? అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: రష్మిక 'కుబేర' వీడియో.. ఆ సూట్ కేసులో ఏముంది?)ఎలా ఉందంటే?మొదట్లో ఓ సాధారణ మర్డర్ మిస్టరీలాగ సినిమా ప్రారంభించారు. ఆ తరువాత ఇంట్రెస్టింగ్ మలుపులతో స్క్రీన్ ప్లే నడిపించారు. మధ్యలో యూత్‌ని ఎంటర్ టైన్ చేయడం కోసం రొమాంటిక్ సీన్స్ పెట్టారు. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు ట్విస్టులతో ఆకట్టుకున్నారు. 14 ఏళ్ల యువకుల్లో వచ్చే మార్పులు ఎలా ఉంటాయి? వారు టెక్నాలజీలో పడి ఎలాంటి వాటికి బానిస అవుతున్నారు? తల్లిదండ్రులు వారి పట్ల ప్రవర్తిస్తున్న తీరు తదితర విషయాలను ప్రీ క్లైమాక్స్ నుంచి బాగా చూపించి... తల్లిదండ్రులకు ఓ మెసేజ్ ఇచ్చారు. పిల్లల ఎదురుగా తల్లిదండ్రులు ఎలాంటి పనులు చేయకూడదో... అలా చేయడం వల్ల వారు ఎలాంటి క్షణికావేశాలకు లోనవుతారనేది ఇందులో చూపించారు.ఎవరెలా చేశారు?నోయల్ డిటెక్టివ్‌గా... ప్రీ క్లైమాక్స్‌లో ఆకట్టుకుంటారు. లీడ్ రోల్స్ చేసిన రతన్, విషాక పర్లేదు. రొమాంటిక్స్ సీన్లలో బాగానే చేశారు. పోసాని కృష్ణ మురళి పాత్ర ఓకే. జబర్దస్త్ మహేష్ పాత్ర కాసేపు ఉన్నా... తన మార్క్ సంభాషణలతో ఆకట్టుకుంటారు. జర్నలిస్ట్ సుబ్బు పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ పాత్రకు న్యాయం చేశారు. మిగతా పాత్రధారులు తమ తమ పరిధి మేరకు నటించారు. దర్శకుడు లక్ష్మీ శ్రీనివాస్ రాసుకున్న కథ... కథనాలు చాలా బాగున్నాయి. రొమాంటిక్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ తీసినప్పటికీ.. చివర్లో ఓ మంచి మెసేజ్ ఇచ్చి ఆకట్టుకున్నారు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాటోగ్రఫ, సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్‌గా ఉండాల్సింది. (ఇదీ చదవండి: ప్రభాస్ 'రాజాసాబ్'... ఆ వార్తలు నమ్మొద్దని టీమ్ ప్రకటన) -
Mirzapur 3: ‘మీర్జాపూర్ 3’ వెబ్‌సిరీస్ రివ్యూ
మీర్జాపూర్.. ఓటీటీల్లో సూపర్ హిట్ అయిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ల లిస్ట్‌లో టాప్‌లో ఉంటుంది. 2018లో తొలి సీజన్‌తో మిర్జాపూర్ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ తర్వాత 2020లో రెండో సీజన్‌తో ప్రేక్షకుల అంచనాలకు మించి హిట్ కొట్టారు. ఇప్పుడు మీర్జాపూర్ సీజన్-3 ద్వారా ఓటీటీలో తమ సత్తా చూపించారు. క్రైమ్ యాక్షన్ జానర్లో వచ్చిన ఈ సిరీస్‌లు యూత్ ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాయి. ఈ కథ మొత్తం ప్రధానంగా కొన్ని పాత్రల చుట్టే తిరుగుతుంది. కాలీన్‌భయ్యా (పంకజ్ త్రిపాఠి), గుడ్డు పండిత్ ( అలీ ఫజల్) బబ్లూ పండిత్ (విక్రాంత్ మాస్సే), మున్నా భాయ్ (దివ్యేందు) గోలు (శ్వేతా త్రిపాఠి), బీనా త్రిపాఠి (రసిక దుగల్) భరత్ త్యాగి (విజయ్ వర్మ) పేర్లతోనే ఎక్కువ పాపులర్ కావడం కాకుండా మీర్జాపూర్లో మెప్పించారు.మీర్జాపూర్ వెబ్‌సిరీస్.. మొదటి రెండు సీజన్లు ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. భారీ క్రైమ్ యాక్షన్ జానర్లో వచ్చిన ఈ సిరీస్ ముఖ్యంగా యువతను విశేషంగా అలరించాయి. అందుకే ఈ సీరిస్ నుంచి మిలియన్ల కొద్ది మీమ్స్ వైరల్ అయ్యాయి. సీజన్-3 కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న ప్రేక్షకుల నిరీక్షణకు ఫుల్స్టాప్ పడింది. నేడు (జులై 5) నుంచి మిర్జాపూర్-3 అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్ దర్శకత్వం వహించారు.మీర్జాపూర్ మొదటి సీజన్లో గుడ్డూ భయ్యా (అలీ ఫజల్),బబ్లూ పండిత్ (విక్రాంత్ మాస్సే) అనే ఇద్దరు అన్నదమ్ములు కాలీన్ భయ్యా కోసం పనిచేయడం. ఆ సీజన్ చివర్లో కాలీన్ భయ్యా కుమారుడు మున్నా చేతిలో గుడ్డూ భయ్యా తన సోదరుడితో పాటు సన్నిహితులను కోల్పోతాడు. దానికి రెండో సీజన్లో గుడ్డూ భయ్యా రివేంజ్ తీర్చుకుంటాడు. సీజన్ చివరకు మీర్జాపూర్ గద్దెపై ఎలా కూర్చుంటాడన్నది చూపించారు. ఈ క్రమంలో కాలీన్, మున్నా భయ్యాలపై దాడి చేసి మున్నాను గుడ్డు చంపేస్తాడు. కానీ, కాలీన్ భయ్యా మాత్రం తప్పించుకొని వెళ్లిపోవడం చూపించారు. సరిగ్గా అక్కడి నుంచే సీజన్- 3 ప్రారంభం అవుతుంది.సీజన్-3 కథ ఏంటి..?సీజన్-3 మున్నా భయ్యా అంత్యక్రియలతో ప్రారంభం అవుతుంది. మున్నా సతీమణి మాధురి (ఇషా తల్వార్) ముఖ్యమంత్రిగా ఉండటంతో ఆమెను శరద్ శుక్లా కలుస్తాడు. మీర్జాపూర్‌ను తిరిగి దక్కించుకునేందుకు ఒకరికొకరం సాయంగా ఉండాలని కోరుతాడు. కానీ, కాలీన్ భయ్యాను కాపాడిన సంగతి ఆమెకు చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కాలిన్ భార్య బీనా త్రిపాఠి (రషిక దుగల్) అండతో మీర్జాపూర్‌కు కొత్త డాన్‌గా గుడ్డు భయ్యా అవుతాడు. గోలు (శ్వేతా త్రిపాఠి) అతడికి లెఫ్ట్ అండ్ రైట్ సపోర్టర్‌గా ఉంటుంది. గుడ్డు భయ్యా మిర్జాపూర్ సింహాసనంపై కూర్చున్నప్పటికీ పూర్వాంచల్‌లో అధికార పోరు కొనసాగుతోంది. కాలీన్ భయ్యాను కాపాడిన శరద్ శుక్లా, శతృఘ్న కూడా మీర్జాపూర్ సింహాసనంపై దృష్టి సారిస్తారు. దీంతో శరద్ శుక్లా , గుడ్డు భయ్యా మధ్య నేరుగా ఘర్షణ జరుగుతుంది. అలా కాలీన్ భయ్యా లేకుండానే మొదటి నాలుగు ఎపిసోడ్లు పూర్తి అవుతాయి. ఈ అధికార పోరు మధ్య, SSP మరణానికి సంబంధించి పండిట్ జీ ఆరోపణలను ఎదుర్కోవడంతో, ఒక రాజకీయ ఆట సాగుతుంది.మరోవైపు ముఖ్యమంత్రి మాధురీ యాదవ్ కూడా శరద్ శుక్లాతో పాటు దద్దా త్యాగి (లిల్లిపుట్ ఫరూఖీ), అతని కుమారుడు (విజయ్ వర్మ) నుంచి మద్దతు తీసుకుంటుంది. ఇలా వీరందరూ గుడ్డు భయ్యాను బలహీనపరచేందుకు పెద్ద ఎత్తున ప్లాన్స్ వేస్తుంటారు. జైలులో ఉన్న గుడ్డు పండిట్ తండ్రి రమాకాంత్ పండిట్ జీవితం ఎన్నో పాఠాలు నేర్పుతుంది. కొత్త శత్రుత్వాలు, స్నేహాల ఆవిర్భావంతో, కాలీన్ భయ్యా పునర్జన్మను పొందుతారు. మిర్జాపూర్ సింహాసనం కోసం కొత్త, చివరి సరైన వారసుడి కోసం పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. బీనా త్రిపాఠి బిడ్డకు అసలు తండ్రి ఎవరనే అనుమానం ఇప్పటికీ రన్ అవుతూనే ఉంది. దీనికి సంబంధించిన క్లూ సీజన్లో వెల్లడి అవుతుంది. చివరికి, కాలీన్ భయ్యాతో కోడలు మాధురి కలిసి కథకు నిజమైన ట్విస్ట్ జోడించి మొత్తం ఆటను మలుపు తిప్పుతుంది. మొత్తం 10 ఎపిసోడ్లలో మీరు ఊహించని విధంగా చివరి 15 నిమిషాల్లో అద్భుతమైన క్లైమాక్స్ ఉంటుంది. మీరు ఈ కథను ఉత్తరప్రదేశ్‌లోని ఇటీవలి రాజకీయాలకు కూడా అనుబంధించవచ్చు. "భయం లేని రాష్ట్రం" అనే పదే పదే వచ్చే థీమ్ మీకు యోగి ఆదిత్యనాథ్ పరిపాలనను గుర్తు చేస్తుంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో అతిక్ అహ్మద్ మరణం తర్వాత గ్యాంగ్స్టర్లలో చట్టాన్ని అమలు చేయడం పట్ల భయం కూడా చిత్రీకరించబడింది. రాజకీయ ఫిరాయింపులు కూడా కనిపిస్తున్నాయి. ఈ అంశాలన్నీ ఈ సీజన్‌ని ఇటీవలి ఈవెంట్లకు సంబంధించినవిగా చేస్తాయి.గుడ్డు భయ్యా, గోలు ఇద్దరూ మీర్జాపూర్‌ను తమ గుప్పిట్లో ఉంచుకోగలిగారా..? గుడ్డు భయ్యాకు ప్రధాన శత్రువు ఎవరు..? జైలుకు ఎందుకు వెళ్తాడు..? మీర్జాపూర్ పీఠం దక్కిన సమయంలో వారికి ఎదురైన సవాళ్లు ఏంటి..? మీర్జాపూర్ పీఠం కోసం ఎంతమంది పోరాటం చేస్తున్నారు..? కాలీన్ భయ్యా భార్య బీనా నిజంగానే గుడ్డు, గోలుకు అండగా నిలిచిందా..? పూర్వాంచల్ పవర్ కోసం ఎటువంటి రక్తపాతం జరిగింది..? గుడ్డు షూట్ చేశాక కాలిన్ ఎలా తిరిగొచ్చాడు..? మీర్జాపూర్ గద్దెను కూల్చేయాలనే ముఖ్యమంత్రి మాధురి (ఇషా తల్వార్) లక్ష్యం నెరవేరిందా..? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సీజన్ 3 చూడాల్సిందే. ముఖ్యంగా చివరి 15 నిమిషాలు అందరినీ మెప్పిస్తుంది.సిరీస్ ఎలా ఉంది..?'మీర్జాపూర్'కి ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు, నాలుగేళ్లుగా ఈ సీజన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, ఈ సీజన్ గత వాటితో పోలిస్తే అంతగా మెప్పించకపోవచ్చు. ముఖ్యంగా మున్నా భయ్యా లేకపోవడం, ఆపై కథలో కాలీన్ భయ్యాకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడమే ఈ సీజన్‌కు బిగ్ మైనస్ అని చెప్పవచ్చు. సీజన్ మొత్తం చాలా నెమ్మదిగా కొనసాగుతుంది. మూడవ ఎపిసోడ్ వరకు కథలో వేగం కనిపించదు. కథ బలహీనంగా ఉండటమే కాకుండా ప్రధాన పాత్రల నుంచి వచ్చే సీన్లు ప్రేక్షకుల అంచనాలకు దగ్గరగా కనిపిస్తాయి. కానీ, మీర్జాపూర్ అభిమానులకు మాత్రం తప్పకుండా నచ్చుతుంది. గత సీజన్లను పోల్చుకుంటూ చూస్తే మాత్రం కాస్త కష్టం. మీర్జాపూర్ అంటేనే వయలెన్స్, సీరిస్‌కు అదే ప్రధాన బలం. కానీ, ఈ సీజన్లో హింసను చాలా వరకు తగ్గించారు. పొలిటికల్ డ్రామాను ఎక్కువగా చూపించారు. ఫిమేల్ పాత్రలకు భారీగా ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులోని ప్రతి ఎపిసోడ్ సుమారు 45 నుంచి 50 నిమిషాల పాటు ఉంటుంది. దీంతో సీన్లు సాగదీసినట్లు అనిపిస్తాయి. కథలో నెక్స్ట్ ఏంటి..? అనే క్యూరియాసిటీ ఫ్యాక్టర్ కనిపించలేదు. ఇందులోని స్క్రీన్ ప్లే కూడా చాలా సీన్స్‌లలో ప్రేక్షకుల ఊహకు అనుగుణంగానే ఉంటాయి.ఎవరెలా చేశారంటే..?గుడ్డు భయ్యా పాత్రలో అలీ ఫజల్ చక్కటి నటన కనబరిచారు. ఈ సీజన్ మొత్తం తన తన భుజాలపై మోశారు. కానీ, ఒక్కడిపై భారం అంతా పడటంతో షో రన్ చేయడం కష్టమైంది. గోలు పాత్రలో శ్వేతా త్రిపాఠి ఎక్కడా నిరుత్సాహపరచదు. ఇందులో ఆమె పాత్ర అందరినీ మెప్పిస్తుంది. అంజుమ్ శర్మ సైతం తమ పాత్రల్లో ఒదిగిపోయారు. బీనా త్రిపాఠి పాత్రకు రషిక దుగల్ మరోసారి ప్రాణం పోశారు. ఆమె పాత్ర అండర్ రైట్‌గా అనిపిస్తుంది. సీఎంగా ఇషా తల్వార్ నటన బావుంది. అందరి కంటే విజయ్ వర్మ ఎక్కువ ఆకట్టుకున్నారు. పంకజ్ త్రిపాఠి కనిపించేది కొన్ని సన్నివేశాలు అయినా సరే తన మార్క్ చూపించారు. గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్ ఈ సిరీస్‌ను అనుకున్నంత స్థాయిలో తెరకెక్కించారు. కానీ, అంచనాలు ఎక్కువగా ఉండటం వల్ల కాస్త రెస్పాన్స్ తగ్గే అవకాశం ఉంది. 'మీర్జాపూర్ సీజన్ -3' చూడదగినది. మునుపటి సీజన్ల మాదిరి మెప్పంచకపోవచ్చు కానీ, మీరు ఈ సిరీస్‌కి అభిమాని అయితే, మీరు దీన్ని మిస్ చేయకండి. -
Black Widow Review: ఓటీటీలో కళ్లు చెదిరే స్పై యాక్షన్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే?
టైటిల్: బ్లాక్ విడోనటీనటులు: స్కార్లెట్ జాన్సన్, ఫ్లోరెన్స్ పగ్, డేవిడ్ హార్బర్ తదితరులుదర్శకుడు: కేట్ షార్ట్ల్యాండ్నిర్మాత: కెవిన్ ఫీగేసంగీత దర్శకుడు: లోర్న్ బాల్ఫ్సినిమాటోగ్రఫీ: గాబ్రియెల్ బెరిస్టెన్ఎడిటర్: లీ ఫోల్సమ్ బోయ్డ్, మాథ్యూ ష్మిత్ఓటీటీ: డిస్నీ హాట్‌స్టార్(2021లో థియేటర్లలో రిలీజైంది)కథేంటంటే..బ్లాక్ విడో అదే పేరుతో ఉన్న మార్వెల్ కామిక్ క్యారెక్టర్ ఆధారంగా రూపొందించిన సూపర్ హీరో చిత్రం. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్, వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిచర్స్లో ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. కేట్ షార్ట్‌ల్యాండ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్కార్లెట్ జాన్సన్ టైటిల్ పాత్రలో నటించారు. కెప్టెన్ అమెరికా సివిల్ వార్ సంఘటనలతో ఈ చిత్రం ప్రారంభం అవుతుంది. ఈ మూవీ ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. మరి ఈ లేడీ-ఓరియెంటెడ్ సూపర్ హీరో సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.ఎలా ఉందంటే..ఈ మూవీ అంతా కూడా అంతుకుముందు మనకు అవెంజర్స్ సిరీస్‌లాగా ఉన్న స్టోరీలానే అనిపిస్తుంది. రష్యాకు చెందిన ఓ విలన్(డేవిడ్ హార్బర్) ముఖ్యంగా అనాథ అమ్మాయిలను కిడ్నాప్ చేసి వారిని.. ఒక సైన్యంలా తయారు చేస్తాడు. తాను చెప్పినట్లు నడుచుకునేలా వాళ్ల బ్రెయిన్‌ను మారుస్తాడు. ఆ తర్వాత అమెరికాలోని రహస్యాన్ని తెలుసుకునేందుకు ఒక ఫేక్ కుటుంబాన్ని సృష్టిస్తాడు. ఆ తర్వాత ఆ కుటుంబంలోని వాళ్లను మొత్తం విడదీస్తాడు. ఆ తర్వాత ఆ ఇద్దరు పిల్లలను మళ్లీ తన సైన్యంలోనే చేర్చుకుంటాడు. ఆ తర్వాత అందులో ఉన్న స్కార్లెట్ జాన్సన్(బ్లాక్ విడో) బయటికి వచ్చి అతనితో పోరాటం చేస్తుంది. తన మిత్రులు మరికొందరితో కలిసి అతన్ని అంతం చేసేందుకు యత్నిస్తుంది. మరి అసలు అతని నుంచి అనాథ అమ్మాయిలను కాపాడిందా? ఆ విలన్‌ను అంతం చేసిందా? అనే ఆసక్తికర అంశాలు తెలియాలంటే బ్లాక్ విడో చూడాల్సిందే.ఈ స్పై థ్రిల్లర్ సినిమాలో ఫైట్ సీక్వెన్స్‌లు, విఎఫ్ఎక్స్ వర్క్స్ ఆడియన్స్‌ను మాత్రమే ఆకట్టుకుంటాయి. అక్కడక్కడా కొన్ని ట్విస్టులు కూడా ఫర్వాలేదనిపించాయి. ఒక్క ట్విస్ట్ మాత్రం సర్ప్రైజింగా ఉంటుంది. అయితే ఈ కథలో స్క్రీన్ ప్లేను అద్భుతంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ కేట్ షార్ట్‌ల్యాండ్ విఫలమయ్యాడు. ఆడియన్స్‌కు ఎమోషనల్ కనెక్ట్ అయ్యే సీన్స్ ఎక్కడా కూడా కనిపించవు. విజువల్ పరంగా ఆకట్టుకున్నా.. ఎమోషనల్‌గా కనెక్ట్ కాకపోవడం పెద్ద మైనస్. దర్శకుడు కేట్ షార్ట్‌ల్యాండ్ కథను ఇంకా బాగా రాసుకుంటేనే బాగుండేది. కేవలం యాక్షన్ సీన్స్, వీఎఫ్ఎక్స్ కోసమైతే ఈ బ్లాక్ విడో మూవీని ట్రై చేయొచ్చు.ఎవరెలా చేశారంటే..బ్లాక్ విడో పాత్రలో స్కార్లెట్ జాన్సన్ యాక్షన్ సీన్స్‌లో అద్భుతంగా నటించారు. ఆమె తన సూపర్ హీరో హోదాకు న్యాయం చేశారు. ఫ్లోరెన్స్ పగ్, డేవిడ్ హార్బర్ తన పాత్రల్లో మెప్పించారు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో మెప్పించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో పాటు సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్, వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. -
పీఎస్‌బీలపై నేడు ఆర్థిక శాఖ సమీక్ష
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్‌ల చీఫ్‌లతో కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు మంగళవారం భేటీ కానున్నారు. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పథకాలను లోగడ తీసుకురావడం తెలిసిందే. వీటి కింద ఆయా వర్గాలకు బ్యాంకుల నుంచి రుణసాయం ఏ విధంగా అందుతోందన్న దానిపై భేటీలో సమీక్షించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. పీఎం విశ్వకర్మ, స్టాండప్ ఇండియా, పీఎం స్వనిధి, ముద్రా యోజన తదితర పథకాల పురోగతిపై పరిశీలన జరగనుంది. ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. అందరికీ ఆర్థిక సేవల చేరువ విషయంలో ఇతర అంశాలు కూడా చర్చకు రానున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గతేడాది సెపె్టంబర్లో ప్రధాని ప్రారంభించిన పీఎం విశ్వకర్మ పథకం కింద హస్త కళాకారులు, చేతివృత్తుల వారికి నామమాత్రపు వడ్డీపై రుణ సాయం లభించనుంది. ఐదేళ్ల కాలంలో ఈ పథకం కింద రూ.13,000 కోట్ల సాయం అందించనున్నారు. 30 లక్షల మందికి లబ్ధి చేకూరనుందని అంచనా. 2016 ఏప్రిల్ 5న ప్రారంభించిన స్టాండప్ ఇండియా పథకం కింద సొంతంగా సంస్థలను స్థాపించే ఎస్సీ, ఎస్టీ, మహిళలకు బ్యాంక్‌ల ద్వారా రుణ సాయం లభించనుంది. -
పద్మవ్యూహంలో చక్రధారి మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: పద్మవ్యూహంలో చక్రధారినటీనటులు: ప్రవీణ్ రాజ్‌కుమార్, శశికా టిక్కూ, అషురెడ్డి, మధునందన్, భూపాల్ రాజ్, ధనరాజ్, రూపా లక్ష్మి , మాస్టర్ రోహన్, మురళీధర్ గౌడ్, మహేష్ విట్టా తదితరులు.దర్శకత్వం: సంజయ్‌రెడ్డి బంగారపునిర్మాత: కే.ఓ.రామరాజునిర్మాణ సంస్థ: వీసీ క్రియేషన్స్సంగీత దర్శకుడు: వినోద్ యాజమాన్యసినిమాటోగ్రఫీ: జీ. అమర్ఎడిటర్: ఎస్ బీ ఉద్దవ్విడుదల:21 జూన్ 2024వీసీ క్రియేషన్స్ బ్యానర్‌పై కే. ఓ రామరాజు నిర్మాతగా, సంజయ్‌రెడ్డి బంగారపు దర్శకత్వంలో రూపొందిన చిత్రం పద్మవ్యూహంలో చక్రధారి. ప్రవీణ్ రాజ్‌కుమార్ హీరోగా పరిచయం అయిన ఈ సినిమా నేడు థియేటర్లో విడుదలైంది. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కించిన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.అసలు కథేంటంటే..రాయలసీమలోని ఓ గ్రామంలో జరిగే కథే పద్మవ్యూహంలో చక్రధారి. ఆ గ్రామానికి చెందిన చక్రీ(ప్రవీణ్ రాజ్‌కుమార్) సిటీలో ఐటీలో జాబ్ చేసుకుంటూ స్నేహితులతో ఉంటాడు. అదే సమయంలో హీరో ఊరినుంచి సత్య(శశికా టిక్కూ) జాబ్ కోసం హైదరాబాద్ వస్తుంది. చక్రీ, సత్యకు జాబ్ రావడంలో హెల్ప్ చేస్తాడు. దాంతో ఇద్దరు మంచి స్నేహితులవుతారు. ఆ తరువాత ప్రేమికులుగా మారుతారు. అదే సమయంలో అనుకోకుండా సత్య జాబ్ వదిలేసి ఊరికి వెళ్లిపోతుంది. విషయం తెలుసుకున్న చక్రీ తన ఉద్యోగానికి లీవ్ పెట్టి తాను కూడా విలేజ్‌కి వెళ్తాడు. హీరో స్నేహితుడు శ్రీను(మహేష్ విట్టా) ఊరిలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుంటాడు. అతని సాయంతో సత్యను కలవాలని ప్లాన్ చేస్తాడు. అదే విలేజ్‌లో స్కూల్ టీచర్‌గా పద్మ(అషురెడ్డి) పనిచేస్తుంది. తన భర్త కోటి(భూపాల్ రాజ్) ఓ తాగుబోతు. బ్యాంక్ మేనేజర్ ప్రసాద్(మధునందన్) కూడా గతంలో జరిగిన సంఘటనలకు ఆ ఊరి వారంటే ద్వేషం పెంచుకుంటాడు. అతను తాగుబోతుగా మారతాడు. అసలు తన ప్రేమ కోసం వచ్చిన చక్రీ.. సత్యను దక్కించుకున్నాడా ? పద్మ (అషురెడ్డి)తాగుబోతు అయిన కోటిని ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది.? అసలు బ్యాంక్ మేనేజర్ గతం ఏంటి? సత్యను పెళ్లి చేసుకోవాలంటే వాళ్ల నాన్న హీరోకు పెట్టిన కండీషన్స్ ఏంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఫస్ట్ సిటీలో మొదలైన ప్రేమ కథను విలేజ్‌కు తీసుకెళ్లాడు డైరెక్టర్. ఫస్ట్ ఆఫ్‌లోనే అన్ని క్యారెక్టర్లను రివీల్ చేసి సినిమాపై ఇంట్రస్ట్ తగ్గించేశాడు. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ వర్కవుట్ అయింది. విలేజ్‌లో ఉండే క్యారెక్టర్లను కాస్తా ఫన్నీగా చూపించారు. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్ రోటీన్‌గానే అనిపిస్తాయి. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ పెద్దగా వర్కవుట్ కాలేదు. హీరోయిన్ కోసం గ్రామానికి హీరో రావడం...ఫ్రెండ్ శ్రీను హెల్ప్ తీసుకోవడం...అంతా పాత చింతకాయ పచ్చడిలానే చూపించారు. అయితే సెకండ్ హాఫ్‌లో కామెడీ ఎక్కడా ఫరవాలేదు. ఇక హీరో, హీరోయిన్ ప్రేమ విషయం అమ్మాయి తండ్రికి తెలియడం.. అల్లుడికి ఉండాల్సిన లక్షణాల గురించి ఆయన చెప్పడం గతంలో చూసిన సినిమా లాంటి ఫీలింగ్ కలుగుతుంది. ఆ తర్వాత బ్యాంక్ మేనేజర్ ప్రసాద్ దగ్గరకు వెళ్లడం, నిజం తెలుసుకొని ప్రసాద్ మారడం రోటీన్‌గానే అనిపిస్తుంది. ఇక హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ ఫర్వాలేదనిపిస్తుంది. సెకండాఫ్‌లో కొన్ని చోట్ల భావోద్వేగాలతో కట్టిపడేశారు. ఓవరాల్‌గా రోటీన్ లవ్ స్టోరీనే తెరపై చూపించే ప్రయత్నం చేశారు. విలేజ్ నేపథ్యంలో సాగే కథను పల్లె వాతవరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు.ఎవరెలా చేశారంటే..హీరోగా ప్రవీణ్ రాజ్‌కుమార్ తొలిపరిచయం అయినా నటనతో మెప్పించారు. అలాగే హీరోయిన్ శశికా టిక్కూ అద్భుతంగా నటించింది. ముఖ్యంగా రొమాంటిక్ సన్నివేశాల్లో అలరించింది. అషురెడ్డి తను గ్లామర్‌తో కట్టిపడేసింది. మురళిధర్ గౌడ్, మహేష్ విట్టా, మధునందన్, భూపాల్ రాజ్, ధనరాజ్, రూపా లక్ష్మి, తమ పాత్రల మేర మెప్పించారు. సాంకేతికత విషయానికొస్తే.. రచయిత దర్శన్ రాసుకున్న డైలాగ్స్ విలేజ్ నెటివిటీకి సరిపోయాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నేపథ్య సంగీతం ఫరవాలేదు. ఎడిటింగ్‌లో ఇంకాస్తా కట్ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సంస్థకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
'ప్రభుత్వ జూనియర్ కళాశాల' సినిమా రివ్యూ
కాలేజీ ప్రేమకథా సినిమాలకు ఉండే డిమాండే వేరు. 'కొత్త బంగారు లోకం' నుంచి 'కలర్ ఫోటో' వరకు చెప్పుకొంటే ఎన్నో మూవీస్ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమానే 'ప్రభుత్వ జూనియర్ కళాశాల'. అందరూ కొత్తోళ్లే నటించిన ఈ మూవీ తాజాగా థియేటర్లలోకి వచ్చింది. మరి ఇది ఎలా ఉంది? ఏంటనేదే ఇప్పుడు రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 11 మూవీస్.. మొత్తంగా 17 రిలీజ్)కథేంటి?అది 2004. రాయలసీమలోని పుంగనూరు అనే ఊరు. ఇంటర్మీడియట్ ఫస్టియర్ కుర్రాడు వాసు (ప్రణవ్ ప్రీతమ్). అదే కాలేజీలో సీఈసీ చదువుతున్న కుమారి (శాగ్నశ్రీ వేణున్) అనే అమ్మాయి. అసలు పరిచయమే లేని వీళ్లిద్దరూ అనుకోని పరిస్థితుల్లో ఫ్రెండ్స్ అవుతారు. ఆ తర్వాత ప్రేమలో పడతారు. కానీ కుమారి గురించి కొన్ని విషయాలు తెలిసేసరికి ఆమెతో గొడవపడతాడు. ఆ తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు. వాసు ఎందుకు చనిపోవాలనుకున్నాడు? చివరకు వీళ్ల ప్రేమ కంచికి చేరిందా? అనేదే స్టోరీ.ఎలా ఉందంటే?తొలి ప్రేమ.. ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని ఓ జ్ఞాపకం. అయితే అది మంచి జ్ఞాపకమా? చేదు జ్ఞాపకమా అనేది ఆయా పరిస్థితులు బట్టి ఆధారపడి ఉంటుంది. 'ప్రభుత్వ జూనియర్ కళాశాల' కూడా అలాంటి ఓ స్టోరీనే. ఇంటర్మీడియట్ చదివే కుర్రాడి జీవితంలో తొలి ప్రేమ అనేది తీపి గుర్తుల్ని మిగిల్చిందా? చేదు అనుభవాల్ని పరిచయం చేసిందా అనేదే మెయిన్ పాయింట్.ఫస్టాప్ అంతా కూడా గవర్నమెంట్ కాలేజీలో వాసు, అతడి ఫ్రెండ్స్, చుట్టూ ఉండే వాతావరణం, కుమారితో ప్రేమ లాంటివి చూపిస్తూ వెళ్లారు. ఇక సెకండాఫ్ వచ్చేసరికి ప్రేమలో కలతలు, మనస్పర్థలు లాంటివి ఉంటాయి. ఇందులో చెప్పుకోవడానికి కథేం కొత్తగా ఉండదు. ఇప్పటికే ఎన్నో కాలేజీ లవ్ స్టోరీల్లో కనిపించే సీన్స్ ఉంటాయి. కానీ అంతా కూడా మలయాళ సినిమాల్లో తీసినట్లు చాలా నిదానంగా అదే టైంలో క్యూట్‌గా సాగుతుంది. 90ల్లో పుట్టి పెరిగిన వాళ్లు ఈ సినిమా చూస్తే.. గత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతారు. తొలి ప్రేమ, తొలి ముద్దు లాంటివి మనసులో గిలిగింతలు పెట్టేస్తాయి. పాత ప్రేమలు మళ్లీ గుర్తొస్తాయి.(ఇదీ చదవండి: 'నింద' సినిమా రివ్యూ)మధ్య మధ్యలో ఫన్ మూమెంట్స్, జోకులతో సినిమా అంతా సరదా సరదాగా సాగిపోతుంది. కానీ క్లైమాక్స్‌కి వచ్చేసరికి ఎమోషనల్‌గా ఎండ్ చేయడం బాగుంది. సినిమాలో పెద్ద కంప్లైంట్స్ ఏం లేవా అంటే ఉన్నాయి. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే మూవీ కాదు. 90ల్లో పుట్టి, ఫోన్లు లేని కాలంలో ఇంటర్మీడియట్ చేసిన అమ్మాయిలు అబ్బాయిలకు అయితే బాగా నచ్చుతుంది. ఈ కాలంలో పుట్టి పెరిగిన కుర్రాళ్లకు అబ్బే అని చెప్పి విసుగు వచ్చేస్తుంది.ఎవరెలా చేశారు?లీడ్ రోల్స్ చేసిన ప్రణవ్, శాగ్నశ్రీ.. ఇద్దరూ భలే క్యూట్‌గా చేశారు. వీళ్ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. ఇక మిగిలిన పాత్రధారులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే.. సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. పాటలు పెద్దగా గుర్తుండవు కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినసొంపుగా ఉంది. రైటర్, ఎడిటర్, దర్శకుడు.. ఇలా అన్ని బాధ్యతలు భుజానికెత్తుకున్న శ్రీనాథ్ పులకరం.. ఫీల్ గుడ్ మూవీని అందించాడు. కానీ 'కల్కి' మేనియాలో దీన్ని పట్టించుకుంటారా అనేది సస్పెన్స్.-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్(ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. 'కల్కి' అది లేనట్లే?) -
'నింద' సినిమా రివ్యూ
అప్పుడెప్పుడు 'హ్యాపీడేస్', 'కొత్త బంగారు లోకం' సినిమాలతో సెన్సేషన్ సృష్టించిన హీరో వరుణ్ సందేశ్. ఆ తర్వాత సరైన మూవీస్ చేయలేకపోయాడు. ఓ దశలో పూర్తిగా యాక్టింగ్‌కే దూరమైపోయాడు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత 'నింద' అనే ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్‌తో ఇప్పుడు థియేటర్లలోకి వచ్చాడు. మరి ఈ మూవీ ఎలా ఉంది? వరుణ్ సందేశ్‌కి కమ్ బ్యాక్‌గా నిలిచిందా అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. 'కల్కి' అది లేనట్లే?)కథేంటి?కాండ్రకోట అనే ఊరిలో ముంజు అనే అమ్మాయిని బాలరాజు (ఛత్రపతి శేఖర్) అత్యాచారం చేసి చంపేశాడని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఉరిశిక్ష విధిస్తారు. అయితే ఈ తీర్పు ఇచ్చిన జడ్జి సత్యానంద్ (తనికెళ్ల భరణి) మాత్రం.. ఈ కేసులో సరైన తీర్పు ఇవ్వలేకపోయానని బాధతోనే కన్నుమూస్తారు. దీంతో ఈ కేసులో అసలైన నిందితుడు ఎవరో తెలుసుకోవాలని జడ్జి కొడుకు వివేక్ (వరుణ్ సందేశ్) ఫిక్స్ అవుతాడు. అలా ఓ ఆరుగురు వ్యక్తుల్ని కిడ్నాప్ చేసేసరికి అసలు నిజాలు బయటపడతాయి. ఇంతకీ వివేక్ ఏం తెలుసుకున్నాడు? 'నింద' పడిన బాలరాజుకి ఉరిశిక్ష పడకుండా అడ్డుకోగలిగాడా లేదా అనేది స్టోరీ.ఎలా ఉందంటే?చేయని నేరానికి జైలుకెళ్లడం, ఏళ్ల పాటు శిక్ష అనుభవించడం, పుణ్య కాలం పూర్తయిన తర్వాత ఇతడు నిర్దోషి అని కోర్టు తీర్పు ఇవ్వడం, ఆ తర్వాత బయటకు రావడం.. ఇలాంటి ఘటనలు మనం అప్పుడప్పుడు పేపర్, న్యూస్‌లో చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ తీసుకుని చేసిన సినిమానే 'నింద'.ఆరుగురు వ్యక్తులు కిడ్నాప్ అయ్యే సీన్‌తో సినిమా మొదలవుతుంది. వీళ్లలో ఎస్సై, ప్రభుత్వ డాక్టర్, లాయర్, పనోడు, ఆవారా, కానిస్టేబుల్ ఉంటారు. ఓ మాస్క్ వేసుకున్న వ్యక్తి ఈ ఆరుగురి నుంచి మంజు హత్య కేసులో నిజం రాబట్టాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలోనే భయపెట్టి బెదిరిస్తుంటాడు. అయితే ఈ సీన్స్ ఇంట్రెస్ట్ కలిగించాలి. కానీ సాగదీత వల్ల ఇదంతా బోరింగ్ అనిపిస్తుంది. జైల్లో ఉన్న బాలరాజుని వివేక్ కలిసే సీన్‌తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 11 మూవీస్.. మొత్తంగా 17 రిలీజ్)సెకండాఫ్ మాత్రం ఉన్నంతలో కాస్త ఆసక్తిగా అనిపిస్తుంది. బాలరాజు, మంజు ఎవరు? వాళ్ల బ్యాక్ స్టోరీ ఏంటి? కిడ్నాప్ అయిన ఆరుగురికి ఈ కేసుకి సంబంధమేంటి? అనేది ఉంటుంది. అయితే రెగ్యులర్‌గా థ్రిల్లర్ సినిమాలు చూసేవాళ్లకు సెకండాఫ్ మొదలైన కాసేపటికే హత్య చేసిందెవరో అర్థమైపోతుంది. కానీ క్లైమాక్స్‌లో మరో ఊహించని ట్విస్ట్ ఇచ్చి దర్శకుడు ముగించడం కాస్త బాగుంది.తప్పు చేయని వాడికి శిక్ష పడకూడదనే అనే స్టోరీ లైన్ బాగున్నప్పటికీ.. దాన్ని ఇంట్రెస్టింగ్గా డీల్ చేసే విషయంలో దర్శకుడు తడబడ్డాడు. దీంతో రెండు గంటల సినిమా కూడా అక్కడక్కడ సాగదీతగా అనిపిస్తుంది. కాకపోతే కమర్షియల్ వాసనలు ఎక్కడ లేకుండా స్ట్రెయిట్‌గా కథ చెప్పడం మాత్రం రిలీఫ్.ఎవరెలా చేశారు?లవర్ బాయ్ పాత్రలతో మనకు బాగా తెలిసిన వరుణ్ సందేశ్.. ఇందులో వివేక్ అనే మానవ హక్కుల కమీషనర్ ఉద్యోగిగా సెటిల్డ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బాలరాజుగా చేసిన ఛత్రపతి శేఖర్, మంజుగా చేసిన మధు బాగా చేశారు. కిడ్నాప్ అయిన ఆరుగురు కూడా ఉన్నంతలో పర్వాలేదనిపించారు. టెక్నికల్ విషయాలకొస్తే.. సినిమాలో ఉన్నది తక్కువ లొకేషన్స్. ఉన్నంతలో వాటిని బాగానే క్యాప్చర్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉన్నప్పటికీ కొన్నిచోట్ల దీని వల్ల డైలాగ్స్ సరిగా వినపడలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే 'నింద' ఓ డీసెంట్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అంతే. మరీ అంత సూపర్ అయితే కాదు!-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్(ఇదీ చదవండి: 'కల్కి' మరో వీడియో.. స్టోరీని దాదాపు చెప్పేసిన డైరెక్టర్!) -
'లవ్ మాక్‌టైల్ 2' సినిమా రివ్యూ
2022లో కన్నడలో రిలీజై హిట్ కొట్టిన సినిమా 'లవ్ మాక్‌టైల్ 2'. హీరోగా నటిస్తూ దర్శకనిర్మాతగా చేశాడు డార్లింగ్ కృష్ణ. అతడి భార్య మిలాన్ నాగరాజ్ హీరోయిన్. తాజాగా దీని తెలుగు డబ్బింగ్ వెర్షన్ థియేటర్లలోకి వచ్చేసింది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.కథేంటి?'లవ్ మాక్‌టైల్'కి సినిమాకు ఇది సీక్వెల్. ఆది (డార్లింగ్ కృష్ణ) భార్య నిధి (మిలినా నాగరాజ్) చనిపోతుంది. ఎప్పుడూ తన భార్య ఆలోచనలతోనే ఉండే ఆది.. ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావడం కోసం అరకు వెళ్తాడు. ఆ ప్రయాణంలో తన భార్య తనతోనే ఉందని ఊహించుకుంటూ ఉంటాడు. తనను ఇష్టపడే అమ్మాయిలు తన వెంట పడుతున్న వారిని పట్టించుకోడు. కానీ తన భార్య.. తనని ఊహించుకుంటున్న హీరోకి పెళ్లి చేయాలని చూస్తుంది. చివరికి హీరో ఇంకో పెళ్లి చేసుకున్నాడా లేదా? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: విజయ్ సేతుపతి 'మహారాజ' సినిమా రివ్యూ)ఎవరెలా చేశారంటే?'లవ్ మాక్‌టైల్' సినిమాతో హిట్ కొట్టిన డార్లింగ్ కృష్ణ తనే నిర్మాతగా దర్శకుడిగా వ్యవహరిస్తూ ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చేశాడు. నిధి క్యారెక్టర్లో మిలాన నాగరాజ్ నటన చాలా బాగుంది. రచల్ డేవిడ్, నకుల అభయాన్కర్, అమృత అయ్యంగర్, సుస్మిత గౌడ, అభిలాష్ ఎవరి పాత్రకి వాళ్లు న్యాయం చేశారు. నకుల్ నకుల అభయాన్కర్ ఇచ్చిన మ్యూజిక్ అండ్ పాటలు సినిమాకి హైలైట్. శ్రీ క్రేజీ మైండ్స్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. మంచి కథ నేర్చుకుని దర్శకత్వ విలువలతో డార్లింగ్ కృష్ణ ఒక మంచి ఫ్యామిలీ లవ్ స్టోరీ ని తీసుకుని వచ్చారు.డార్లింగ్ కృష్ణ తీసుకున్న స్టోరీతో పాటు అతడి యాక్టింగ్ బాగుంది. మిలాన నాగరాజ్, అభిలాష్, రచల్ డేవిడ్ పాత్రలు కూడా స్టోరీకి తగ్గట్లు బాగున్నాయి. సెకండ్ హాఫ్ మరియు క్లైమాక్స్ సినిమాకి కీలకంగా నిలిచింది. అయితే ఫస్టాప్‌లో కొన్ని సాగదీతగా అనిపించిన సీన్స్, అలానే కొన్ని కామెడీ సీన్స్ మైనస్‌గా నిలిచాయి.(ఇదీ చదవండి: ‘హరోం హర’ మూవీ రివ్యూ) -
విజయ్ సేతుపతి 'మహారాజ' సినిమా రివ్యూ
విజయ్ సేతుపతి సూపర్ యాక్టర్. హీరో అని మాత్రమే కాకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ అదరగొట్టేస్తుంటాడు. ఇతడు 50వ సినిమా 'మహారాజ'. గత కొన్నిరోజుల నుంచి ప్రమోషన్స్ చేస్తూ ఈ చిత్రంతో కచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటానని సేతుపతి ధీమాగా చెబుతూ వచ్చాడు. తాజాగా ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. మరి సేతుపతి చెప్పినట్లు హిట్ కొట్టాడా? 'మహారాజ' ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?మహారాజ (విజయ్ సేతుపతి) ఓ బార్బర్. భార్య, కూతురు ఉంటారు. ఓ రోజు యాక్సిడెంట్లో భార్య చనిపోతుంది. కూతురిపై ఇనుప చెత్త డబ్బా పడటంతో ఆమె ప్రాణాలతో బయటపడుతుంది. తన కూతుర్ని కాపాడిన చెత్త డబ్బాకు లక్ష్మీ అని పేరు పెట్టి సొంత మనిషిలా చూసుకుంటారు. అయితే ఓ రోజు చెవిపై కట్టుతో పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన మహారాజ.. తన లక్ష్మీ కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? పోలీసులు లక్ష్మీని పట్టుకుని మహారాజకు అప్పగించారా లేదా అనేదే స్టోరీ. (Maharaja Movie Review)ఎలా ఉందంటే?కొన్ని సినిమాల గురించి ఏ మాత్రం ఎక్కువ మాట్లాడుకున్నా ట్విస్టులు రివీల్ అయిపోతాయి. చూసేటప్పుడు ఫీల్ మిస్ అవుతుంది. 'మహారాజ' సరిగ్గా అలాంటి సినిమానే. రెండున్నర గంటల సినిమానే గానీ ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. ఎందుకంటే సరదాగా మొదలైన మూవీ కాస్త మెల్లమెల్లగా సీరియస్ టోన్‌లోకి మారుతుంది. ఇంటర్వెల్ వచ్చేసరికి అసలు ట్విస్ట్ వస్తుంది. ఇక అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు ఊహకందని మలుపులు మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి.హీరో భార్య, కూతురు ఓ ఇంట్లో కూర్చుని ఉండగా.. సడన్‌గా ఓ లారీ వచ్చి వాళ్లపైకి దూసుకెళ్తుంది. ఈ ప్రమాదంలో హీరో భార్య చనిపోతుంది. ఓ చెత్త డబ్బా వల్ల కూతురు బతుకుంది. దీని తర్వాత వర్తమానంలోకి వచ్చేస్తారు. అక్కడి నుంచి ఫస్టాప్ అంతా సరద సరదాగా వెళ్లిపోతూ ఉంటుంది. హీరో అసలు పోలీస్ స్టేషన్లో ఎందుకు అలా ఉండిపోయాడా? ఎందుకు అందరితో తన్నులు తింటున్నాడా అని డౌట్ వస్తుంది. కానీ ఎక్కడో ఓ మూల ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? అని డౌట్ వస్తుంది. కానీ మెల్లమెల్లగా స్టోరీలోకి వెళ్లేసరికి చూస్తున్న ఆడియెన్స్‌కి కిక్ వస్తుంది.ఏదో సినిమా తీస్తున్నాం కదా అని అనవసరంగా పాటలు, కమర్షియల్ అంశాల పేరిట ఫైట్స్ పెట్టలేదు. ఏదో ఎంత కావాలో ఏ సీన్ ఎక్కడుండాలో ఫెర్ఫెక్ట్ కొలతలతో తీసిన మూవీ 'మహారాజ' అని చెప్పొచ్చు. అలానే చూస్తున్నప్పుడు ఎక్కడా సినిమా చూస్తున్నామని అనిపించదు. మన పక్కింట్లో వాళ్ల జీవితం చూస్తున్నం అనిపించేంతలా సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతాం.ఎవరెలా చేశారు?విజయ్ సేతుపతి పాత్రే డిఫరెంట్. దేనికి కూడా త్వరగా రియాక్ట్ అవడు. చాలా నెమ్మదిగా ఎమోషనల్‌గా బరస్ట్ అవుతాడు. చూడటానికి మామూలుగా కనిపిస్తాడు గానీ ఒక్కోసారి ప్రేక్షకుల మైండ్ పోయాలా ప్రవర్తిస్తాడు. దీన్ని సేతుపతి పిక్టర్ ఫెర్ఫెక్ట్గా చేశాడు. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ విలన్‌గా చేశాడు. కృూరంగా కనిపిస్తూనే చివర్లో ఎమోషన్‌తో మనసు పిండేస్తాడు. మమతా మోహన్ దాస్, అభిరామి తమకిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. ఇక ఒకటి రెండు సీన్స్‌లో కనిపించే భారతీ రాజా, ఎస్సైగా నటరాజన్ సుబ్రమణియం ఆకట్టుకున్నారు.టెక్నికల్ విషయాలకొస్తే.. స్క్రీన్ ప్లే రాసుకున్న డైరెక్టర్ అండ్ రామ్ మురళి అనే అతన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఫెర్ఫెక్ట్ మూవీ అందించారు. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన అజనీష్ లోక్‌నాథ్ సీట్లలో కూర్చోబెట్టేశాడు. స్క్రీన్ ప్లేకి తగ్గట్లు ఎడిటింగ్ సరిగ్గా సరిపోయింది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. అయితే ఈ సినిమా అందరికీ నచ్చకపోవచ్చు. ఎందుకంటే హింస, క్రైమ్ ఇందులో గట్టిగానే ఉంది. పాటలు, రొమాంటిక్ సాంగ్స్ కూడా ఇందులో ఉండవు. సో డిఫరెంట్ మూవీస్ ఇష్టపడే వారికి మాత్రం 'మహారాజ' నచ్చేస్తుంది. సినిమా చూసిన తర్వాత క్లైమాక్స్ మాత్రం అస్సలు రివీల్ చేయొద్దు. (Maharaja Movie Review In Telugu)-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
Narendra Modi: ఉగ్రనిరోధక సామర్థ్యాలను పెంచండి
న్యూఢిల్లీ/జమ్మూ: ఉగ్రవాదం పీచమణిచేలా జమ్మూకశ్మీర్‌లో ఉగ్రనిరోధక సామర్థ్యాలను మరింతగా పెంచాలని పాలనా యంత్రాంగానికి ప్రధాని మోదీ సూచించారు. యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి, చెక్‌పోస్ట్‌పై మెరుపుదాడి వంటి ఉదంతాలు మళ్లీ పెచ్చరిల్లిన నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో తాజా పరిస్థితిపై ప్రధాని మోదీ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అదనపు భద్రతా బలగాల మొహరింపుతోపాటు ఉగ్రనిరోధక వ్యవస్థలను క్షేత్రస్థాయిలో మరింత విస్తృతంచేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు మోదీ సూచించారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తాజా పరిస్థితిపై వివరాలను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను మోదీ అడిగి తెల్సుకున్నారు. స్థానిక యంత్రాంగంతో ఏ విధంగా వ్యూహాలను అమలుచేస్తున్నారో సిన్హా మోదీకి వివరించారు. జీ7 సదస్సు కోసం ఇటలీకి మోదీఇటలీలో నేటి నుంచి జరగబోయే జీ7 శిఖరాగ్ర సదస్సులో కృత్రిమ మేథ, ఇంధనం, ఆఫ్రికా, మధ్యధరా ప్రాంత సమస్యలపైనే దృష్టిసారించే అవకాశం ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సదస్సులో పాల్గొనేందుకు మోదీ గురువారం ఇటలీకి బయల్దేరి వెళ్లారు. ‘గ్లోబల్ సౌత్’ దేశాల సమస్యలపైనా ప్రధానంగా చర్చ జరగొచ్చని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ఇటలీలోని అపూలియో ప్రాంతంలోని విలాసవంత బోర్గో ఎగ్నాజియా రిసార్ట్‌లో జీ7 శిఖరాగ్ర సదస్సు నేటి నుంచి 15వ తేదీదాకా జరగనుంది. -
NEET Row: గ్రేస్ మార్కులపై ఎన్డీఏ కీలక ప్రకటన
న్యూఢిల్లీ, సాక్షి: నీట్ యూజీ 2024 ఫలితాలపై రగడ కొనసాగుతున్న వేళ.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) డ్యామేజ్ కంట్రోల్‌కు దిగింది. విద్యార్థులకు అదనంగా కలిపామని చెబుతున్న గ్రేస్ మార్క్‌లను సమీక్షించడానికి అంగీకరించింది. ఇందుకోసం విద్యాశాఖ ఓ కమిటీ వేసిందని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్ శనివారం మీడియాకు తెలిపారు.నీట్ యూజీ పరీక్ష నిర్వహణ.. ఫలితాల వెల్లడిపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఎన్టీఏ డైరెక్టర్ సుబోధ్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ‘‘సుమారు 1,500 మందికి ఇచ్చిన గ్రేస్మార్క్ల్ని సమీక్షించేందుకు విద్యాశాఖ నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అధ్యయనం తర్వాతఘ ఆ 1,500 మంది ఫలితాలను సవరించే అవకాశం ఉంటుంది. అయితే.. గ్రేస్ మార్కులు ఇవ్వడం వల్ల పరీక్ష అర్హత ప్రమాణాలపై ప్రభావం పడబోదు. ప్రభావిత అభ్యర్థుల ఫలితాల సమీక్ష అడ్మిషన్ ప్రక్రియపై ప్రభావం చూపించదు’’ అని అన్నారాయన. అలాగే.. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల్ని ఆయన ఖండించారు. పేపర్ లీక్ కాలేదని, అవకతవకలేమీ జరగలేదన్న ఆయన దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష సమగ్రతకు ఎలాంటి భంగం వాటిల్లలేదని స్పష్టంచేశారు.ఇక.. NCERT పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్ష కేంద్రాల వద్ద సమయం కోల్పోవడంతో ఇచ్చిన గ్రేస్ మార్కుల వల్లే ఆ విద్యార్థులు అధిక మార్కులు సాధించడానికి కారణాలని వివరించారు. అయితే, సమీక్ష అనంతరం ఆ విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించే నిర్ణయం కూడా కమిటీ సిఫారసులను బట్టి ఉంటుందన్నారు.‘‘ప్రతి విషయాన్ని పారదర్శకంగా విశ్లేషించి నీట్ యూజీ 2024 ఫలితాలను ప్రకటించాం. మొత్తం 4,750 కేంద్రాల్లో 6 కేంద్రాలకే ఈ సమస్య పరిమితం అయింది. అలాగే, 24 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కాగా, అందులో 1,600 మంది విషయంలోనే సమస్య ఉంది. దేశవ్యాప్తంగా ఈ పరీక్ష సమగ్రతకు భంగం వాటిల్లలేదు. ఏ పరీక్ష కేంద్రంలో కూడా పేపర్ లీకేజీ జరగలేదు’’ అని ఎన్ టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు.విమర్శలు ఇలా.. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం నీట్ పరీక్షల్లో 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించటం అనుమానాలకు తావిచ్చింది. దీనితో తోడు ఈసారి చాలామంది విద్యార్థులు 718, 719 మార్కులు సాధించారు. నీట్లో (+4, -1) మార్కింగ్ విధానం ఉంది. ఈ లెక్కన 718, 719 మార్కులు రావడం సాధ్యమయ్యే పని కాదన్నది చాలామంది వాదన. దీని గురించి ఎన్ఈటీని ప్రశ్నిస్తే 'గ్రేస్ మార్కులు' ఇచ్చామని చెబుతోంది. కొంతమంది విద్యార్థులకైతే 100 వరకు గ్రేస్ మార్కులు ఇచ్చామని అంటోంది. ఇప్పుడు విమర్శల నేపథ్యంలో ఆ మార్కులనే సమీక్షించబోతోంది. ఇక పరీక్ష నాడు ప్రశ్నాపత్రాలు సక్రమంగా పంపిణీ చేయకపోవడంతో వందల మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. తాము తక్కువ టైంలో పరీక్ష రాయాల్సి వచ్చిందని కొందరు వాపోయారు. అయితే కేవలం ఆరు సెంటర్లలో మాత్రమే ఈ ఇబ్బంది ఎదురైందని ఎన్ఈటీ ఇప్పుడు అంటోంది. మరోవైపు గ్రేస్ మార్కుల కోసం ఏ విధానం అవలంభించారన్నది NTA చెప్పకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అలాగే.. నీట్ ఫలితాలను ప్రిపోన్ చేసి ఎన్నికల ఫలితాల రోజే హడావుడిగా విడుదల చేయటం కూడా రాజకీయ విమర్శలకు తావిచ్చింది. -
'లవ్ మౌళి' సినిమా రివ్యూ
కొన్నాళ్ల గ్యాప్ తర్వాత నవదీప్ హీరోగా చేసిన సినిమా 'లవ్ మౌళి'. అవనీంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. తాజాగా జూన్ 7న థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీతో నవదీప్ 2.0 మొదలైందని ప్రమోషన్స్ చేశారు. ఇందుకు తగ్గట్లే టీజర్, ట్రైలర్ కాస్త అంచనాలు పెంచాయి. ట్రైలర్లో ముద్దు, బోల్డ్ సీన్స్ వైరల్ అయ్యాయి. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.కథేంటి?మౌళి (నవదీప్) తల్లిదండ్రులు చిన్నప్పుడే విడిపోవడంతో తాతయ్య దగ్గర పెరుగుతాడు. 14 ఏళ్ల వయసులో ఆయన చనిపోవడంతో తనకు ఇష్టమొచ్చినట్లు, ప్రపంచాన్ని పట్టించుకోకుండా పెరుగుతాడు. తన లోకంలో తానుంటాడు. స్వతహాగా పెయింటర్ అయిన మౌళి.. మేఘాలయాలో ఉంటాడు. ఓ రోజు అనుకోకుండా అడవుల్లో అఘోరాతో ప్రేమ విషయమై గొడవ పడగా, ఓ పెయింట్ బ్రష్‌ని సృష్టించి ఇస్తాడు. కొన్నాళ్ల తర్వాత దానితో ఓ అమ్మాయి బొమ్మ గీయగా, అందులో నుంచి నిజంగానే చిత్ర(పంఖురి గిద్వాని) అనే అమ్మాయి బయటకొస్తుంది. ఈమెతో గొడవ అయ్యేసరికి చిత్ర బొమ్మ మరోసారి గీస్తాడు. డిఫరెంట్ పర్సనాలిటీతో మళ్లీ వస్తుంది. ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతోంది? అసలు మౌళి ప్రేమ గురించి తెలుసుకున్నాడా? చివరకు ఏమైందనేదే స్టోరీ?ఎలా ఉందంటే?'లవ్ మౌళి' గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది సాధారణ ప్రేమకథ. కాకపోతే ఓ ఫాంటసీ ఎలిమెంట్ జోడీంచడం వల్ల స్క్రీన్ ప్లే కాస్త కొత్తగా అనిపించింది. ప్రేమ అంటే ఏంటని వెతికే క్రమంలో ఓ అబ్బాయి ఏం తెలుసుకున్నాడు అనే పాయింట్‌తో ఈ మూవీ తీశారు. అయితే తొలి సగం కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. కానీ సెకండాఫ్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే ఈ మూవీ స్టోరీకి తగ్గట్లు లోకేషన్స్, మ్యూజిక్ అదిరిపోయింది. కథంతా మేఘాలయలోనే ఉంటుంది.సీన్స్ పరంగా చూసుకుంటే ప్రేమ, పెళ్లిలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఏదో ఓ చోట కనెక్ట్ అవుతాయి. ఈ సినిమాలోని ప్రేమ ఎమోషన్‌కి మనం కనెక్ట్ అయితే సినిమా బాగా నచ్చేస్తుంది. ముద్దు సీన్స్, బోల్డ్ సన్నివేశాలు బాగానే ఉన్నాయి. చాలా వరకు ముద్దు సీన్స్ సహజంగానే అనిపించినా ఒకటి రెండు బోల్డ్ సీన్స్ మాత్రం అవసరమా అనిపిస్తాయి. కథని ఎంత కొత్తగా చూపించినా చివరకు అందరూ చెప్పేదే చెప్పడంతో ఓస్ ఇంతేనా అనిపిస్తుంది.ఎవరెలా చేశారు?ప్రమోషన్స్‌లో 2.0 అనేలా నవదీప్ యాక్ట్ చేశాడు. బాడీ, సీన్స్ కోసం బాగానే కష్టపడ్డాడు. హీరోయిన్ చిత్ర పాత్ర చేసిన పంఖురి గిద్వాని సూపర్‌గా చేసింది. హారికగా నటించిన భావన సాగి పర్వాలేదనిపించింది. మిగిలిన పాత్రలు ఓకే. రానా దగ్గుబాటి అఘోరాగా గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి అదరగొట్టేసాడు. టెక్నికల్ విషయాలకొస్తే.. లొకేషన్స్ అదిరిపోయాయి. మేఘాలయని అద్భుతంగా చూపించారు. దర్శకుడే సినిమాటోగ్రాఫర్ కావడంతో ఔట్పుట్ అదిరిపోయింది. గోవింద్ వసంత, కృష్ణ ఇచ్చిన సంగీతం సరిగ్గా సరిపోయింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల బాగుంటుంది. అవనీంద్ర, దర్శకుడిగా ఆకట్టుకున్నాడు. నిర్మాణ విలువల మూవీకి తగ్గట్లు ఉన్నాయి. -
ఎన్డీయే సర్కార్‌కు ‘అగ్ని’పరీక్ష తప్పదా?
న్యూఢిల్లీ: కేంద్రంలో ఎన్డీయే సర్కార్ ఇంకా కొలువు దీరలేదు. ఈలోపే మిత్రపక్షాల నుంచి డిమాండ్లు మొదలవుతున్నాయి. అయితే అవి కేబినెట్ కూర్పు విషయంలోనే కాదులేండి.దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా ఉన్న అగ్నివీర్ పథకాన్ని సమీక్షించాల్సిందేనని ఎన్డీయే మిత్రపక్షం జనతా దళ్ యునైటెడ్(జేడీయూ) ఇప్పుడు కోరుతోంది. ఆ పార్టీ నేత కేసీ త్యాగి మీడియాతో మాట్లాడుతూ ఈ స్వరం వినిపించారు. ’’అగ్నిపథ్ పథకం మీద దేశవ్యాప్తంగా ఎంతో వ్యతిరేకత ఉంది. ఆ పథకం తెచ్చినప్పుడు సైన్యం వర్గాలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. .. వాళ్ల కుటుంబాలు కూడా రోడ్డెక్కి పోరాటం చేశాయి. ఎన్నికల్లోనూ ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది కూడా. కాబట్టి, దానిని కచ్చితంగా సమీక్షించాల్సిందే. ఈ పధకంపై ప్రజలు లేవనెత్తిన లోటుపాట్లను వివరంగా చర్చించి వాటిని చక్కదిద్దాలని మా పార్టీ కోరుకుంటోందని చెప్పారు.‘‘ అని కేసీ త్యాగి అన్నారు.ఇక.. ఉమ్మడి పౌరస్మృతిపై పార్టీ అధ్యక్షుడి హోదాలో బిహార్ సీఎం నితీష్ కుమార్ లా కమిషన్ చీఫ్‌కు లేఖ రాసిన సందర్భాన్ని కూడా త్యాగి గుర్తుచేశారు. తాము ఉమ్మడి పౌరస్మృతికి వ్యతిరేకం కాదని, అయితే యూసీసీపై ప్రభావితమయ్యే అన్ని వర్గాల ప్రజలతో చర్చించి ఓ పరిష్కారం అన్వేషించాలని త్యాగి పేర్కొన్నారు.రెండేళ్ల కిందట.. త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం గత ఎన్డీయే హయాంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే ‘అగ్నిపథ్’. అయితే నాలుగేళ్ల కాలపరిమితితో ఉండే ఈ సర్వీసు అంశంపై ఆ సమయంలోనే తీవ్ర దుమారం రేగింది. దేశవ్యాప్తంగా నిరసనజ్వాలలు పెల్లుబిక్కాయి. మరోవైపు ప్రతిఏపక్షాలు సైతం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అయినప్పటికీ.. అగ్నివీర్ పథకం ద్వారా అగ్నీవీర్‌లను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగిస్తూ వస్తున్నారు. తాజాగా.. ఇండియా కూటమిలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సైతం అగ్నివీర్ పథకాన్ని రద్దు చేయాల్సిందేననే గళం బలంగా వినిపిస్తున్నారు. ప్రభుత్వం ఆ తప్పిదాన్ని ఒప్పుకుని.. వెంటనే దానిని రద్దు చేయాలని కోరుతున్నారాయన. కిందటి నెలలో భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ అగ్నిపథ్ పథకానికి మార్పులు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వెలిబుచ్చారు. అయితే ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ఏడాది మార్చిలో ఒక ప్రకటన చేశారు. దీనిపై కాంగ్రెస్ ఇది ఎన్నికల జిమ్మిక్కు అంటూ మండిపడింది. -
సినిమా చూడకుండానే రివ్యూలు ఇస్తున్నారు: విశ్వక్ సేన్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శర్మ నటించిన చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాకు మొదటి రోజే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో హీరో విశ్వక్ సేన్, డైరెక్టర్ కృష్ణచైతన్య ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రివ్యూలపై విశ్వక్ సేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమా చూడకుండానే రివ్యూలు ఇస్తున్నారని ఆరోపించారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ..' బుక్ మై షో వాళ్లు ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాలి. టికెట్ కొన్నవారికే రివ్యూ ఇచ్చేలా ఉండాలి. కానీ ఇక్కడ ఎంతమంది ఇచ్చినా తెలిసిపోతుంది. ఎవరో పని గట్టుకొని టార్గెట్ చేస్తున్నారు. కానీ ఎవరు ఇలా చేస్తున్నారో తెలియడం లేదు. సినిమాకి సంగీతం బాగాలేదని కొందరు రివ్యూల్లో రాశారు. అక్కడే వారు మూవీ చూడలేదని అక్కడే అర్థమైపోయింది. ఈ సినిమాలో మ్యూజిక్ అద్భుతంగా ఉంది. చూడకుండానే ఉదయం ఐదారు గంటలకే రివ్యూ ఇచ్చారు. సినిమాలో వీక్ పాయింట్‌ని సమీక్షించడంలో తప్పులేదు.' అని అన్నారు. కాగా.. ఇటీవలే మూవీ రిలీజైన వారానికి రివ్యూలు ఇస్తే ఎలా ఉంటుందన్న దానిపై టాలీవుడ్లో చర్చ జరిగిన సంగతి తెలిసిందే.మరోవైపు ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ కృష్ణచైతన్య స్పష్టం చేశారు. కథ సిద్దమయ్యాక అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. పవర్ పేట గురించి త్వరలోనే అప్డేట్ ఇస్తామన్నారు. -
విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్విటర్ రివ్యూ
యువ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. చాన్నాళ్లుగా థియేటర్లు డల్‌గా ఉన్నాయి. దీంతో ఈ మూవీపై అందరూ అంచనాలు పెట్టుకున్నారు. అందుకే ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్లో చీఫ్ గెస్ట్‌గా బాలకృష్ణ ప్రవర్తన వల్ల ఈ మూవీ వార్తల్లో నిలిచింది. మరి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఎలా ఉంది? సినిమా చూస్తున్న ప్రేక్షకులు ట్విటర్ లో ఏమంటున్నారు?(ఇదీ చదవండి: ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్!)యాక్షన్, కామెడీ మిక్స్ చేసి తీసిన లంకల రత్న పాత్రలో విశ్వక్సేన్ యాక్టింగ్ బాగుందని మూవీ చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. విశ్వక్‌లోని మాస్ కోణాన్ని డిఫరెంట్‌గా చూపించిన సినిమా ఇదని అంటున్నారు. రేసీ స్క్రీన్‌ప్లేతో ల్యాగ్ లేకుండా సినిమాని తీశారని మెచ్చుకుంటున్నారు. రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్, మాస్ డైలాగ్స్ బాగున్నాయని ట్వీట్స్ చేస్తున్నారు. సినిమా బోర్ కొట్టనప్పటికీ.. డైరెక్షన్ ఔట్డేటెడ్గా ఉందని అంటున్నారు. విశ్వక్సేన్ నుంచి ఫ్యాన్స్ ఆశించే మాస్ అంశాలు ఇందులో ఎక్కువగా లేకపోవడం మైనస్ అయిందని చెబుతున్నారు. డ్రామా పెద్దగా వర్కవుట్ కాలేదని చెబుతోన్నారు.(ఇదీ చదవండి: మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివకార్తికేయన్? వీడియో వైరల్)ST : #GangsofGodavari pic.twitter.com/sUNH7IikFY— అభి (@Abhiiitweets) May 30, 2024Good first half. Although not a brand new story it has a racy screenplay without any lag, that will definitely work in the films favor. Not a boring moment so far. Second half will be key. #GangsofGodavari— T 🌸 (@PinkCancerian) May 31, 2024#GangsofGodavari good first half 👍... Vishwak sen just killed it🔥— Gautam (@gauthamvarma04) May 31, 2024"aadu modati moodu potlu ammoruki vadilesadu ayya"interval fight🔥but scene process cheskone time ivvatledu. Basically, Pushpa fasttrack chesthe ela undo ala undi. 1st half mottam oka movie teeyochu. Crisp runtime ani kurchunattu unnaru, really bad editing.#GangsofGodavari— Mirugama Kadavula (@Kamal_Tweetz) May 30, 2024Jr tho teeyalsina movie.. inka bagundediViswak’s mass feast #GangsofGodavari 1st half 3.25/5— AN (@anurag_i_am) May 30, 2024 -
'బిగ్ బ్రదర్'’ మూవీ రివ్యూ
శివ కంఠంనేని హీరోగా నటించిన తాజా చిత్రం ‘బిగ్ బ్రదర్’. భోజ్‌పురిలో వరుస విజయాలతో ‘రాజమౌళి ఆఫ్ భోజ్‌పురి’గా నీరాజనాలు అందుకుంటున్న ప్రముఖ దర్శకులు గోసంగి సుబ్బారావు చాలా విరామం అనంతరం తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తూ రూపొందించిన చిత్రమిది. ఫ్యామిలీ డ్రామా నేపధ్యంలో ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియా హెగ్డే హీరోయిన్గా నటించగా... శ్రీ సూర్య, ప్రీతి శుక్లా కీలక పాత్రలు పోషించారు. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కె.శివశంకర్ రావు, ఆర్.వెంకటేశ్వరరావు సంయుక్తంగా ‘బిగ్ బ్రదర్’ చిత్రాన్ని నిర్మించారు.కథ‘బిగ్ బ్రదర్’ సినిమా అన్నదమ్ముల అనుబంధం నేపధ్యంలో ఉంటుంది. శివ (శివ కంఠమనేని), గౌరి (ప్రియ హెగ్డే) పాత్రలతో కథ ప్రారంభమౌతుంది. వారిద్దరికీ నిశ్చతార్ధం జరిగి పదేళ్లు అయినా కూడా పెళ్లి చేసుకోకుండా ఒకే ఇంట్లో ఉంటారు. అలా వారి జీవితం సాగుతుండగా హైదరబాద్ నుంచి శివ సోదరుడు సూర్య (శ్రీ సూర్య) కాలేజ్ నుంచి ఇంటికి వస్తుండగా అటాక్ జరుగుతుంది. అయితే, ఆ సమయంలో తమ్ముడిని కాపాడుతాడు శివ.. అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల తనకు చెప్పకుండా ఎక్కడికీ వెళ్లవద్దని తమ్ముడికి చెబుతాడు శివ. కానీ, ఈ విషయంలో అన్న మాటలను లెక్క చేయకుండా తన వదినకు ఏవో నాలుగు మాటలు చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లూ ఉంటాడు. ఆ సమయంలో పూజ (ప్రీతి) సూర్యకు పరిచయం అవుతుంది. ఈ క్రమంలో వారిద్దరూ ప్రేమలో పడుతారు. ఒకసారి వారిద్దరిపైనా ఎటాక్ చేసేందుకు కొందరు రంగంలోకి దిగుతారు. వారిని ఆ ఇద్దరు బ్రదర్స్ తిప్పికొడతారు. కానీ, ఆ దాడి సూర్య మీద జరిగిందని శివ అనుకుంటాడు. వాస్తవానికి ఆ ఎటాక్ జరిగింది పూజ కోసం అని తర్వాత తెలుస్తోంది. ఇంతకీ పూజ ఎవరు..? ఆమెపై దాడి చేసేందుకు వచ్చిన వారు ఎవరు..? సూర్య, పూజల గతం ఏంటి..? నిశ్చితార్థం అయినా కూడా శివ ఎందుకు పెళ్లి చేసుకోలేదు. పూజ కుటుంబ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి..? అనేది తెలియాలంటే ‘బిగ్ బ్రదర్’ సినిమా రన్ అవుతున్న థియేటర్‌కు వెళ్లాల్సిందే.ఎలా ఉందంటేచిన్న సినిమా అయినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌ను టార్గెట్ చేస్తూ కథను చెప్పడంలో దర్శకుడు విజయం సాధించాడు. సినిమా మొదటి భాగం అంతా కూడా కుటుంబం చుట్టూ తిరుగుతుంది. ఇద్దరి బ్రదర్స్ మధ్య ఉన్న రిలేషన్‌తో పాటు వదినపై మరిది చూపించే గౌరవప్రదమైన ప్రేమ, నానమ్మతో మనుమడి అల్లరి ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌ను చూపించాడు. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. సినిమాలో కామెడీ, ఫైట్స్ పాటలు కూడా మెప్పించేలా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ ఎంజాయ్ చేసేలా ఉన్నా ఇంటర్వెల్ సీన్ మాత్రం ప్రేక్షకులను మెప్పిస్తుంది.ఎంతో సరదగా సాగిన కథ సెకండాఫ్‌లోకి వెళ్తే.. అదే రేంజ్లో మెప్పించేలా దర్శకుడు ప్లాన్ చేసుకున్నాడు.అక్కడి నుంచి సినిమా ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తుంది. కాలేజ్ ఏపిసోడ్స్ రావడంతో యూత్‌ను బాగా మెప్పిస్తాయి. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సీన్లు మంచి ఎంటర్టైన్ చేస్తాయి.కాలేజ్ ఫ్లాష్ బ్యాక్‌తో పాటుగా ఫ్యామిలీ ఫ్లాష్ బ్యాక్ కూడా మరోవైపు జరుగుతూ ఉంటుంది. శివ ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాల్సి వచ్చిందనే పాయింట్‌ను చాలా చక్కగా చూపించాడు. ఆ సమయంలో ప్రేక్షకులు కూడా ఎమోషనల్ అవుతారు. సినిమాలో తమ్ముడి ప్రేమను గెలిపించేందుకు అన్న చేసే పోరాటం చాలా చక్కగా ఉంటుంది.ఎవరెలా చేశారంటేశివ పాత్రలో శివ కంఠమనేని మెప్పించాడు. తనదైన స్టైల్లో ఆయన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. కథకు తగ్గట్లు ప్రేమ, కోపం,సెంటిమెంట్ ఇలా అన్ని ఎమోషన్స్‌ను పండించాడు. శివ పాత్ర తరువాత ఈ చిత్రంలో సూర్య పాత్రే ప్రధానంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో ఒకరకంగా కనిపించిన సూర్య.. సెకండాఫ్ వచ్చేసరికి మరోలా మెప్పిస్తాడు. పూజ పాత్రలో ప్రీతి గ్లామరస్‌గా మెప్పిస్తే.. గౌరి పాత్రలో ప్రియ హెగ్డే కథకు తగ్గట్లు నటించింది. ఇందులోని సంగీతం పర్వాలేదనిపిస్తుంది. పాటలు చూడటానికి బాగున్నప్పటికీ త్వరగా గుర్తిండిపోయేలా లేవు. కెమెరామెన్ స్థాయికి తగ్గట్లు పర్వాలేదనిపిస్తుంది. ఫైనల్‌గా బిగ్ బ్రదర్ తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంది. -
'ఓ సంచారి అంతరంగం'..మనసును కదిలించే పుస్తకం!
విపులాచపృథ్వీ అన్నట్టు తెలుసుకోవడానికి బయలుదేరితే భూమి చాలా పెద్దది. కంటికి నిత్యం కనపడే మానవుడు అంతకంటే లోతు . నా బాల్యంలో మా గ్రామంలో ప్రతి ఉదయాన్నే ఇళ్ల ముందుకు "అమ్మా రాత్రి అన్నం, కూరలు మిగిలి ఉంటే. ఇయ్యండమ్మా" అని సాధారణంగా నిత్యం వినపడే కేక వెనుక ఎంత ఆకలి పేగుల ఏడుపు ఉందో, అన్నపు మెతుకు ఎంత బరువైనదో తెలుసుకునే శక్తి అప్పుడు లేదు. సాహిత్యం ఎందుకు అంటే ఇందుకే అంటాను. సాహిత్యం చెవులకు కొత్తగా వినడాన్నీ, కళ్ళకు కొత్తగా చూడటాన్నీ, మనసుకు కొత్తగా అందటాన్ని సాధన చేయిస్తుంది.సాధన జీవితానికి ప్రాణవాయువు, సాధన జీవితపు ఆ దరికి చేరడానికి సులువు కానించే తెడ్డు. మా ఊళ్ళో మేము సంచార జాతి వారిని, వారి పిల్లా పీచు, గొడ్డు మేకలు సమస్తాన్ని రోజూ చూస్త్తోనే ఉండేవాళ్ళం. మా ఇంటి ముందే డేరాలు వేసుకుని ఉండేవాళ్ళు, ఆ డేరాలు ముందే వాళ్ళ ఉడుములు కట్టేసి ఉండేవి. నేను ఆ ఉడుముల్లో ఒకదానిని ఎలాగైనా తెచ్చుకుని దాని తోకకు తాడుకట్టి ఏ కోటయినా సరే దానిని ఎక్కి ఆక్రమించుకుందామా అని చూసేవాడిని తప్పా ఆ డేరాల లోపల బీద మనుషుల బ్రతుకులు ఏమా అని తొంగి చూడాలనుకున్న వాడిని కాను.ఇంట్లో పెద్దలు కూడా వారేమిటో, వారి బ్రతుకులు ఏమిటో, బ్రతుకు దారి ఎంత పొడవో, లోతో కొలత పాఠం చెప్పిన పాపానికి పోలేదు. ఈ జాతుల పిల్లలు జన్మజన్మల దారిద్య్రం, ఆకలితో క్యాట్ బెల్ చేతపట్టి కాకుల్ని కొట్టేవాళ్ళు. ఆ కాకుల్ని వాళ్ళు తింటారని తెలిసినపుడు అసహ్యం వేసింది. కాకుల్నే కాదు అవసరం, ఆకలి అయినపుడు మనిషి మనిషిని కూడా పీక్కు తింటాడని సాహిత్యమే చెప్పింది, ఒక మనిషి తన పొట్ట ఆకలిని తీర్చడానికి స్వయాన తన కాలిని తిన్న సంగతి కూడా సాహిత్యమే నేర్పింది. నా చిన్న తనంలో చిన్న మా ఊరులో రోజూ కనపడుతూ ఉండే ఈ సంచార మనుషులు ఉన్నట్టుండి, ఊర్లు బలిసి, పసిరిక పాము వంటి మెలిక దారులు అజగరల్లా వైశ్యాల్యమయి పోయి ,ప్రపంచం పెద్దదై పోయి వీరెక్కడ కానరాకుండా పోయిన కాలంలో ఒక టీచరమ్మ పూదోట శౌరీలు నాకు " ఒక సంచారి అంతరంగం" అనే ఈ పుస్తకాన్ని కానుక చేసారు.ఈ రచనను చాలా కాలం క్రితం "అమ్మ నుడి " పత్రికలో ధారావాహిక గా చూసేవాడిని. చదవలేదు. 2017 లో అచ్చు పుస్తకంగా వచ్చిన ఈ రోజు చదివే అవకాశం కలిగింది. శ్రీ రంగనాధ రామచంద్రరావు గారి అనువాదం బావుంది. మూల రచయిత కుప్పే నాగరాజుగారు తన చేయి పట్టుకుని పాఠకుడిని 192 పేజీల సంచారం చేయించారు. ఈ పుస్తకంలో కనపడే మనుష్యులకు,తాము కనపడకుండా పుస్తకం రావడానికి దోహదం చేసిన మహా మానవులందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.పుస్తకం వెల: రూ. 200/-ప్రతులకు: అన్ని ముఖ్యమైన పుస్తక కేంద్రాలు, 1-2-740, హనుమాన్ మందిరం దగ్గర, రాకాసిపేట, బోధన్-503 185 నిజామాబాద్ జిల్లా, తెలంగాణ. --అన్వర్, సాక్షి (చదవండి: సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!) -
వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
టైటిల్: ది కంజూరింగ్: ది డెవిల్ మేడ్ మీ డూ ఇట్నటీనటులు: వేరా ఫార్మిగా, పాట్రిక్ విల్సన్, సారా కేథరిన్ హుక్, జులియన్ హిలార్డ్, జాన్ నోబుల్, ఎజిన్ బొండురెంట్, రూయ్ ఓకోన్నూర్ తదితరులుదర్శకత్వం: మేఖేల్ చావ్స్నిర్మాణ సంస్థ: వార్నర్ బ్రదర్స్ఓటీటీ: అమెజాన్ ప్రైమ్హారర్ సినిమాలు అంటేనే క్రియేటివీటికి మారుపేరు. లేనిది ఉన్నట్లుగా ప్రేక్షకులను భయపెట్టేలా ఉంటాయి. కానీ ది కంజూరింగ్ మాత్రం అలాంటి హారర్ మూవీ కాదు. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా వచ్చిన చిత్రం. అమెరికాలో జరిగిన ఓ హత్య ఆధారంగా రూపొందించారు. అసలు ఈ హత్య వెనుక ఉన్నది ఎవరు? దెయ్యమా? లేక మనుషులేనా? అన్నది తెలియాలంటే ది కంజూరింగ్ చూసేయాల్సిందే.హాలీవుడ్లో హారర్ సినిమాలకు కొదువే లేదు. గతంలో వచ్చిన అన్నా బెల్లె, ది నన్ వెన్నులో వణుకు పుట్టించే చిత్రాలే. మైఖేల్ చావ్స్ తెరకెక్కించిన ఈ హారర్ క్రైమ్ థ్రిల్లర్ కూడా అంతకుమించి ఉందనడంలో సందేహం లేదు. ఈ 21వ శతాబ్దంలో అత్యంత భయపెట్టే చిత్రాల్లో ది కంజూరింగ్ ఒకటని చెప్పొచ్చు. ఈ మూవీ చూశాక దెయ్యాలు కూడా చేతబడులు చేస్తాయా? అనే అనుమానం కచ్చితంగా వస్తుంది. అసలు దెయ్యం ఏంటి? చేతబడులు చేయడమేంటి? అనే డౌటానుమానం మొదలైందా? అయితే ఈ సినిమా చూస్తే కచ్చితంగా అర్థమవుతుంది. ఈ రియల్ క్రైమ్ థ్రిల్లర్ 1981 ప్రాంతంలో జరిగిన కథ. ఇందులో డేవిడ్ గ్లాట్జెల్, డెబ్బీ, ఆర్నె, లోరాయిన్, ఈడ్, క్యాస్టనర్, జూడీ వారెన్ పాత్రల చుట్టే కథ తిరుగుతుంది. మసాచుసెట్స్‌లోని ఓ ఫ్యామిలీలోని చిన్న పిల్లాడు(డేవిడ్ గ్లాట్జెల్)కి పట్టిన దెయ్యాన్ని విడిపించేందుకు భూతవైద్యుని వద్దకు వెళ్తారు. అదే క్రమంలో ఆ పిల్లాడిని విడిచిపెట్టిన ఆ దెయ్యం.. ఆర్నె అనే యువకుడి శరీరంలోకి వెళ్తుంది. ఆ తర్వాత దెయ్యం ఆవహించిన ఆర్నె తన యాజమానిని హత్య చేస్తాడు. దీంతో పోలీసులు ఆర్నెను అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. ఇలాంటి కేసు అమెరికాలోనే మొదటిదని న్యాయమూర్తి సైతం ఆశ్చర్యపోతారు. అదే క్రమంలో జైల్లో ఉన్న ఆర్నెను దెయ్యం తన అధీనంలోకి తెచ్చుకునేందుకు యత్నిస్తూనే ఉంటుంది. అయితే ఆ దెయ్యాన్ని నిలువరించేందుకు.. ఆర్నెను రక్షించేందుకు లోరాయిన్, ఈడ్ ప్రయత్నిస్తారు. కానీ ఆ క్రమంలోనే వారికి అసలు నిజం తెలుస్తుంది? అసలు లోరాయిన్, ఈడ్ ఎవరిని కలిశారు? వారికి తెలిసిన నిజమేంటి? ఆర్నెను వేధిస్తున్న దెయ్యం ఒకరా? ఇద్దరా? లేక ఆత్మనా అనే సస్పెన్ష్ చివరి వరకు ఆడియన్స్‌కు అర్థం కాదు.డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ సినిమాలు అంటే ఇష్టపడేవారు ది కంజూరింగ్ ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ చిత్రంలో దెయ్యం మనిషిని ఆవహించే సన్నివేశాలు మాత్రం ఒళ్లు గగుర్పొడ్చేలా ఉంటాయి. ప్రతి సీన్ నరాలు తెగే ఉత్కంఠను కలిగిస్తాయి. దెయ్యం ఆర్నెను తన అధీనంలోకి తెచ్చుకునే క్రమంలో వచ్చే దృశ్యాలు ఆడియన్స్ వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో క్లైమాక్స్ సీన్స్‌ను డైరెక్టర్ మరింత రియలిస్టిక్‌గా చూపించారు. అంతే కాకుండా చివర్లో ఓ బిగ్ ట్విస్ట్ ఉంటుంది. అదేంటనేది ది కంజూరింగ్ ది డెవిల్ మేడ్ మీ డూ ఇట్ చూడాల్సిందే. 2021లో వచ్చిన ఈ థ్రిలర్ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రాన్ని చిన్నపిల్లల సమక్షంలో చూడవద్దని మనవి. -
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
ప్రజలకు దారి చూపినవాడు నాయకుడవుతాడు. ప్రజలు నడిచే దారిలో తానూ నడిచినవాడే నాయకుడవుతాడు. ప్రజలు నాయకుడి వైపు ఎందుకు చూస్తారు? మా దారిలో కష్టం ఉంది తొలగించు... మా గింజలకు వెలితి ఉంది పూరించు... మాకు జబ్బు చేస్తే వైద్యానికి దోవ లేదు చూపించు... మా పిల్లలకు చదువు చెప్పించు... మా నెత్తిన ఒక నీడ పరువు... మా పిల్లలకు ఒక ఉపాధి చూపించు... ఇలా చెప్పుకోవడానికే కదా.అవి విన్నవాడే నాయకుడవుతాడు. నేను ఉన్నానని అనేవాడే పాలకుడవుతాడు.ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు, రెండు రాష్ట్రాలుగా విడిపోయాక వర్తమాన పరిణామాలకు మూలాలు ఏమిటో తెలియడం తెలుగు ప్రజలకు అవసరం. ఎందుకంటే ప్రజల నొసట రాత పాలకులే రాస్తారు. నాటి మద్రాసు రాష్ట్రంతో మొదలు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, హైదరాబాద్ స్టేట్ ఆవిర్భావం, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రకటన, తెలంగాణ ఉద్యమాల దరిమిలా తెలుగు రాష్ట్రాల విభజన... వీటన్నింటిలో పాలకుల ఎత్తుగడలకు, ప్రజల ఆకాంక్షలకు జరిగిన ఘర్షణ ఒక క్రమానుగతంగా చదివితే ఎక్కడెక్కడ నాయకుడనేవాడవసరమో అక్కడక్కడ తెలుగు జాతి ఒక నాయకుణ్ణి తయారు చేసుకోగలిగింది అనిపిస్తుంది. అయితే ముందే చెప్పుకున్నట్టుగా ఈ నాయకుల్లో ప్రజల కోసం నిలిచే నాయకులూ ఉన్నారు. ప్రజలను వంచించే నాయకులూ ఉన్నారు.సుదీర్ఘకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల విషయంలో ప్రదర్శించిన అహం, ప్రోత్సహించిన ముఠా రాజకీయాల సంస్కృతి ఆంధ్రరాష్ట్రాన్ని ఒక అనిశ్చితిలోనే ఉంచాయి. స్థిరంగా నిలిచి, బలంగా కొనసాగే నాయకుడు ఉన్నప్పుడే జాతి ముందుకు వెళ్లగలదు. ఈ నేపథ్యంలో ఒకరిద్దరు కాంగ్రెస్ నేతలు ఆంధ్రప్రదేశ్‌కు సమర్థమైన నాయకత్వం వహించినా కుర్చీ కింద పెట్టే మంటలు వారిని కుర్చీ వదులుకునేలా చేశాయి. అసలు తెలుగువారికి ఒక ఆత్మాభిమానం ఉందా అనే సందేహం కలిగించాయి.ఈ సందర్భమే ఎన్.టి.రామారావు పుట్టుకకు కారణమైంది. పార్టీ స్థాపించిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన నాయకుడిగా, చరిష్మా కలిగిన పాలకుడిగా, పేదవాడి గురించి ఆలోచన చేసిన అభిమాన నేతగా ఎన్.టి.రామారావు ప్రజల మెప్పును పొందారు. కాని ఆయన అహం, తొందరపాటు చర్యలు కుట్రలకు తెరలేపాయి. చంద్రబాబు నాయుడు తెలుగుజాతి అవమానపడే రీతిలో ఎన్.టి.ఆర్‌ను వెన్నుపోటు పొడిచి దొడ్డి దారిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగుదేశం పార్టీతో పాటు పార్టీ ఫండ్ ఉన్న అకౌంట్‌ను కూడా హస్తగతం చేసుకున్న వార్త అందిన రోజున ఎన్.టి.ఆర్. తీవ్ర మనస్తాపం చెందారు. అదే ఆయన మృతికి కారణమైందన్న భావన ఉంది.‘దేశమంటే మట్టి కాదోయ్.. మనుషులోయ్’ అన్నాడు గురజాడ. ఒక రాష్ట్రాన్ని ప్రజల వారసత్వంగా చూడాల్సిందిపోయి దానినో కార్పొరెట్ ఆఫీసుగా మార్చి, దానికి తాను సి.ఇ.ఓగా భావించి పాలించడం మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు పాలనలో తెలుగు ప్రజలు చులకనను ఎదుర్కొన్నారు. గుండు దెబ్బలు తిన్నారు. నీతి, రీతులే వ్యక్తిత్వమని భావించే మన సంస్కృతిలో వంచనతో వచ్చిన నాయకుడిని నమ్మి మోసపోతున్నామని తెలుగు ప్రజలకు పదేపదే అనిపించిన ఉదంతాలు ఉన్నాయి. వై.ఎస్.రాజశేఖర రెడ్డి వచ్చి పెద్ద గీత గీసే వరకూ చంద్రబాబు ఎంత చిన్న గీతో ప్రజలకు అర్థమైందని విశ్లేషకులు అంటారు.ప్రజల కోసం, ప్రజల వలన, ప్రజల చేత... పాలన చేస్తే ఎలా ఉంటుందో వై.ఎస్.రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజలకు చూపారు. విశాలమైన హృదయం, దయ, ఆర్ద్రత ఉన్న నాయకుడు తన పాలనలో ప్రతి వ్యక్తి ఉన్నతి కోసం తపన పడతాడని, పడాలని వై.ఎస్.రాజశేఖరరెడ్డి చూపారు. ఆరోగ్యశ్రీ, ఫీజ్ రియింబర్స్‌మెంట్, రైతులకు ఉచిత కరెంట్, జలయజ్ఞం... రాష్ట్రం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతున్నదని ప్రజలు పూర్తి సంతృప్తితో, సంతోషంగా ఉన్న కాలమది.కాని రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తెలుగుజాతిని స్థాణువును చేసింది. రాజశేఖర రెడ్డిని చూసిన కళ్లు అలాంటి నాయకుడి కోసమే వెతుకులాడాయి. ఆ నాయకుణ్ణి వై.ఎస్.జగన్‌లో చూసుకున్నాయి. అయితే రాజకీయ కుయుక్తులు పన్నడంలో తలపండిన చంద్రబాబు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, జగన్‌కు మధ్య సైంధవుడిలా నిలిచారు. టక్కుటమార విద్యలు ప్రదర్శించి, అబద్ధాల మేడలు కట్టి మరోసారి జనాన్ని నమ్మించి సి.ఎం. అయ్యారు. కాని చంద్రబాబు పరిపాలనా కాలంలో రాష్ట్రం మన్నుతిన్న పాములా ఉండిపోయింది. చిన్నా చితక పథకాల ప్రయోజనాల కోసం కూడా ప్రజలు అల్లల్లాడారు. ఒక వర్గం ప్రజలు రాజధాని నిర్మాణం వల్ల లబ్ధి పొందుతున్నారని సామన్యులకు అవగతమైంది. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుని కోసం వారు తిరగబడ్డారు. వై.ఎస్.జగన్‌ని తమ ముఖ్యమంత్రిని చేసుకున్నారు.రాష్ట్ర విభజన వల్ల అనేక వెసులుబాట్లు కోల్పోయి, నిధుల లోటులో రాష్ట్రం ఉన్నప్పటికీ జగన్ తన విశిష్ట సమర్థతతో ప్రజాహిత పాలన కోసం నవరత్నాలతో ముందుకు వచ్చారు. రెండేళ్ల కరోనా కాలం ప్రపంచాన్ని స్తంభింపచేసినా తెలుగు రాష్ట్రం ముందంజలో ఉండేలా చూసుకున్నారు. విద్య నుంచి వికాసం, వైద్య ఖర్చు నుంచి విముక్తి ప్రధాన అజెండాగా చేసుకున్న జగన్ విస్తృత తెలుగు సమూహాలను గట్టున పడేశారు. తెలుగు ప్రజలు ఎన్నడూ చూడని విధంగా ఇళ్ల స్థలాల పట్టాల పంపిణి జరిగింది. రాజధానిలో పేదలకూ చోటుండాలని భావించిన జగన్ వంటి ముఖ్యమంత్రి ఉన్నారా?దారులు స్పష్టం. ప్రజలు ఏ దారిని ఎంచుకోవాలో తమకు తాముగా నిర్ణయించుకోవాలని అంటారు దేవులపల్లి అమర్. ఆయన రాసిన ‘మూడు దారులు’ గ్రంథం ఆంధ్ర రాష్ట్ర అవతరణ నుంచి మొదలయ్యి ప్రభావవంతమైన ముఖ్యమంత్రులుగా పని చేసిన ఎన్.టి.రామారావు, వై.ఎస్. రాజశేఖర రెడ్డి ధోరణులను తెలియచేస్తూ ఇప్పుడు వై.ఎస్. జగన్‌తో తల పడుతున్న చంద్రబాబు ‘యూ టర్న్’లను, వెన్నుపోట్లను, నమ్మించి వచించిన సంఘటలను విపులంగా తెలియచేసి పారాహుషార్ అంటూ హెచ్చరిస్తుంది.అనుభవజ్ఞుడైన జర్నలిస్టుగా మాత్రమే కాదు, చేయి తిరిగిన జర్నలిస్టుగా కూడా దేవులపల్లి అమర్ ఎంతో సులభంగా, సరళంగా చరిత్రని, వర్తమానాన్ని, తెలుగు నేలకు సంబంధించిన రాజకీయ ఘటనలను ఒక వరుసలో ఉంచి పాఠకులకు గొప్ప అవగాహన కలిగిస్తారు. కొన్ని ఘటనలు జరక్కపోయి ఉంటే తెలుగు జాతి మరింత ముందంజలో ఉండేది కదా అనిపించే విషయాలన్నో ఈ గ్రంథంలో ఉన్నాయి. ఇది నేటి రాజకీయ కార్యకర్తలకు, నిపుణులకే కాదు భావి విద్యార్థులకు కూడా కీలకమైన రిఫరెన్స్ గ్రంథం.‘చరిత్రదేముంది... చింపేస్తే చిరిగి పోతుంది’ అనేది సినిమాలో డైలాగ్. కాని చరిత్ర చిరిగిపోదు. అలాగే ఉంటుంది. మళ్లీ మళ్లీ ఉజ్జీవనం చెందుతూనే ఉంటుంది. చరిత్ర నిర్మింపబడే కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విభజన అయ్యాక కాళ్లూ చేతులు ఊనుకుని ఒక గొప్ప పురోగమనానికి సిద్ధమవుతున్న ఆంధ్రప్రదేశ్ ఈ సమయంలో ఎటువంటి నాయకుణ్ణి ఎన్నుకోవాలో, తద్వారా ఎటువంటి ఘన చరిత్రకు తెలుగు జాతి ఆలవాలంగా ఉండాలో ఈ ఎన్నికల కాలంలో నిర్ణయించుకోవాలి. దారి స్పష్టం కావాలంటే ఈ గ్రంథం చదవండి.మూడు దారులు– రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు; రచన– దేవులపల్లి అమర్; ప్రచురణ– రూప బుక్స్; పేజీలు: 210; వెల–395; ప్రతులకు–రూప పబ్లికేషన్స్, హైదరాబాద్.– వి.ఎన్.ప్రసాద్ (చదవండి: మూడు దారులు– రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు) -
సుహాస్ ప్రసన్న వదనం.. మరో హిట్ పడినట్టేనా?
టైటిల్: ప్రసన్న వదనంనటీనటులు: సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్, నందు, వైవా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత, కుశాలిని తదితరులుడైరెక్టర్: అర్జున్ వైకేనిర్మాతలు: మణికంఠ జేఎస్, ప్రసాద్‌రెడ్డి టీఆర్‌సంగీతం: విజయ్ బుల్గానిన్సినిమాటోగ్రఫీ: ఎస్.చంద్రశేఖరన్‌ఎడిటింగ్: కార్తిక్ శ్రీనివాస్విడుదల తేదీ: 03-05-2024టాలీవుడ్లో యంగ్ హీరో సుహాస్ ప్రత్యేక శైలితో దూసుకెళ్తున్నారు. ఫ్యామిలీ డ్రామా, కలర్ ఫోటో, అంబాజీపేట మ్యారేజీ బ్యాండు లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. తాజాగా మరోసారి ప్రసన్న వదనం అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చారు. సుకుమార్ వద్ద పని చేసిన అర్జున్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఫేస్ అండ్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్ ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. మరి సరికొత్త కాన్సెప్ట్ వర్కవుట్ అయ్యిందా? కొత్త దర్శకుడితో సుహాస్ ఖాతాలో మరో హిట్ పడిందా? చూసేద్దాం పదండి. అసలు కథేంటంటే...ఓ ప్రమాదంలో తల్లితండ్రులను కోల్పోతాడు సూర్య(సుహాస్). అసలే కష్టాల్లో ఉన్న అతనికి మరో వింత డిజార్డర్ కూడా వస్తుంది. తలకి బలంగా గాయం కావడంతో ఫేస్ బ్లైండ్నెస్ డిజార్డర్ వస్తుంది. అంటే అతను ఎవరినీ గుర్తించలేడు. ఓ ఎఫ్ఎం స్టేషన్లో ఆర్జేగా పని చేస్తున్న సూర్య ఓ అర్ధరాత్రి దారుణమైన ఘటనను ప్రత్యక్షంగా చూస్తాడు. అమృత(సాయి శ్వేత)అనే అమ్మాయిని ఎవరో లారీ కింద తోసేస్తారు. అయితే ఈ ఘటనని ప్రత్యక్షంగా చూసిన సూర్య.. తనకి ఫేస్ బ్లైండ్నెస్ ఉండటం వల్ల ఆ వ్యక్తి ఎవరనేది గుర్తుపట్టలేడు. మరుసటి రోజే అది యాక్సిడెంట్ అని వార్తల్లో వస్తుంది. ఇది చూసిన సూర్య బాధితురాలికి న్యాయం చేయాలని భావించి పోలీసులకు ఫోన్ చేసి అసలు సంగతి చెబుతాడు. ఈ కేసుని ఏసీపీ వైదేహి(రాశి సింగ్) ఎస్ఐ( నితిన్ ప్రసన్న) చాలా సీరియస్‌గా తీసుకుంటారు. అసలు పోలీసులు నిందితున్ని పట్టుకున్నారా? దర్యాప్తులో ఎలాంటి నిజాలు రాబట్టారు? ఫేస్ బ్లైండ్‌నెస్‌తో సూర్య ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు ? అసలు అమృతని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది ? అనేది తెలియాలంటే వెండితెరపై చూడాల్సిందే.ఎలా సాగిందంటే.. ఇలాంటి ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్‌తో తెలుగులో ఇప్పటివరకూ సినిమాలు రాలేదు. సరికొత్త పాయింట్‌ను తీసుకున్న డైరెక్టర్ అర్జున్ ఆ పాయింట్‌ను అంతే కొత్తగా తెరపై చూపించే ప్రయత్నం చేశారు. అందులో సక్సెస్ అయ్యారు కూడా. సూర్య తల్లితండ్రులు ప్రమాదంలో చనిపోవడం.. సూర్యకి ఫేస్ బ్లైండ్ నెస్ రావడం.. ఆ తర్వాత అతను పడే ఇబ్బందులు, అధ్య(పాయల్ రాధకృష్ణ) రూపంలో ఓ క్యూట్ లవ్ స్టొరీతో కథను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లాడు. కథలోకి క్రైమ్ ఎలిమెంట్ వచ్చిన తరవాత వేగం పుంజుకుంటుంది. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ మాత్రం నిజంగానే బ్లైండ్నెస్ వచ్చేలా చేస్తుంది. అంటే అంతలా సస్పెన్ష్ ఉంటుందన్నమాట.సెకండాఫ్‌కు వచ్చేసరికి కథను మరింత గ్రిప్పింగ్‌గా నడిపించారు డైరెక్టర్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఆ ట్విస్ట్‌ను ఎవరూ ఊహించలేరు. కథను అంత పకడ్బందీగా రాసుకున్నాడు దర్శకుడు. క్లైమాక్స్ ఈ సినిమాకి మరో హైలెట్‌గా నిలిచింది. అప్పటివరకూ కాస్తా స్లో నేరేషన్ అనిపించినప్పటికీ ఈ కథకు ఇచ్చిన ముగింపు మాత్రం అదిరిపోయింది.ఎవరెలా చేశారంటే...సూర్య పాత్రలో సుహాస్ సహజంగా ఒదిగిపోయాడు .తనదైన నటనలో ఎమోషనల్ సీన్స్‌లో అదరగొట్టేశాడు. యాక్షన్ సీక్వెన్స్‌లోనూ సూపర్బ్ అనిపించాడు. పాయల్ తన అందంతో పాత్రలో ఒదిగిపోయింది. రాశి సింగ్, నితిన్ తమ పాత్రల పరిధి మేర నటించారు. హర్ష, సత్య కామెడీతో అదరగొట్టేశారు. ఓవరాల్‌గా నందుతో పాటు మిగిలిన నటీనటులు తమపాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే.. విజయ్ బుల్గానిన్ నేపధ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ ఫరవాలేదు. కార్తిక్ శ్రీనివాస్ ఎడిటింగ్‌లో తన కత్తెరకు కాస్తా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. ఓవరాల్‌గా తొలి సినిమాతోనే దర్శకుడు అర్జున్ తన మార్క్ చూపించారు.