స్కూల్‌ ప్రేమను గుర్తు చేసే 'మధురం'.. ఎలా ఉందంటే? | Tollywood Hero Uday Raj Latest Madhuram Movie Review In Telugu | Sakshi
Sakshi News home page

Madhuram Movie Review In Telugu: మధురం మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?

Apr 18 2025 8:04 PM | Updated on Apr 18 2025 8:04 PM

Tollywood Hero Uday Raj Latest Madhuram Movie Review In Telugu

టైటిల్: మధురం  
నటీనటులు: ఉదయ్ రాజ్, వైష్ణవీ సింగ్, బస్ స్టాప్ కోటేశ్వర రావు, కిట్టయ్య, ఎఫ్‌ఎం బాబాయ్, దివ్య శ్రీ, సమ్యూ రెడ్డి తదితరులు  
డైరెక్టర్: రాజేష్ చికిలే  
నిర్మాత - ఎం. బంగర్రాజు  
సినిమాటోగ్రఫీ - మనోహర్ కొల్లి  
సంగీతం - వెంకీ వీణ  
ఎడిటర్ - ఎన్టీఆర్  
విడుదల తేదీ ఏప్రిల్ 18, 2025  

మధురం కథేంటంటే..

రామ్ (ఉదయ్ రాజ్), మధు (వైష్ణవీ సింగ్) ఒక రొమాంటిక్ కామెడీ సన్నివేశంలో కలుస్తారు. వారి అమాయకమైన హృదయాలు తక్షణమే ఒకరినొకరు ఆకర్షిస్తాయి. 10వ తరగతి అమ్మాయి, 9వ తరగతి అబ్బాయితో ప్రేమలో పడటం వల్ల ఈ యువ జంట అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. చివరికీ వారి ప్రేమ కథ సక్సెస్ అవుతుందా? తల్లిదండ్రులు, సమాజం నుంచి వారు ఎదుర్కొనే సవాళ్లు ఏమిటి? వాటిని ఎలా అధిగమించారు? వాళ్లు తమ ప్రేమను గెలిచారా? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మధురం చూడాల్సిందే!

ఎలా ఉందంటే..

మధురం టైటిల్‌ చూస్తే లవ్ స్టోరీ అని ఆడియన్స్‌కు గుర్తుపట్టేలా ఉంది. యవ్వనంలో చిగురించిన ప్రేమే కథాంశంగా తెరకెక్కించిన తీరు బాగుంది. మొదటి భావోద్వేగాల సున్నితత్వాన్ని, గోదావరి ప్రాంతం  శాశ్వత సౌందర్యాన్ని తెరపై అందంగా ఆవిష్కరించారు డైరెక్టర్. గోదావరి దాదాపు ఒక పాత్రలా కనిపిస్తూ సినిమా సన్నివేశాలను మరింత ఉన్నతంగా ఆడియన్స్‌కు పరిచయం చేశారు. స్కూల్లో ఇద్దరు విద్యార్థుల ప్రేమ చుట్టే కథ అద్భుతంగా తీర్చిదిద్దారు.

అందమైన కాన్సెప్ట్‌ను ఎంచుకొని, హృదయపూర్వకంగా అందించారు దర్శకుడు రాజేష్ చికిలే . కథ పరంగా సరళంగా ఉన్నప్పటికీ, 90ల తరం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. కొన్ని రిపీటెడ్ సన్నివేశాలు, రెండు భాగాల్లో కొంత లాగ్ కాస్కా బోరింగ్‌గా అనిపిస్తుంది. కానీ దర్శకుడు రాజేష్ చికిలే అందించాలనుకున్న సందేశాన్ని ఇవి దెబ్బతీయలేదు. కథలో కొన్ని భాగాలు ప్రత్యేకంగా బలంగా ఉన్నాయి. ప్రధాన పాత్రల భావోద్వేగాన్ని ప్రేక్షకులు అనుభవించేలా చేస్తాయి. వెంకీ వీణ సంగీతం ఈ సినిమాకు ప్లస్. స్క్రీన్‌పై రెండు పాటలు మాత్రమే ఆకట్టుకున్నాయి. 90ల ప్రేమ కథలను ఇష్టపడే వారికి, గోదావరి సౌందర్యాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఈ చిత్రం ఒక మంచి ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది.

ఎవరెలా చేశారంటే..

డెబ్యూ హీరో ఉదయ్ రాజ్ తన నటనతో మెప్పించారు. గతంలో ఆచార్య, ఆర్‌ఆర్‌ఆర్ వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించిన ఉదయ్.. తన నటనా నైపుణ్యాన్ని చాటాడు. వైష్ణవీ సింగ్‌త తన పాత్రలో ఆకట్టుకుంది. తన అందమైన రూపంతో, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. మిగిలిన నటీనటులు తమ పాత్రలో పరిధిలో అద్భతంగా చేశారు. సాంకేతికత విషయానికొస్తే మనోహర్ కొల్లి సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. నందమూరి తారక రామారావు తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. వెంకీ వీణ  నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు సంస్థకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. 

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement