టైటిల్: రేవు
నటీనటులు: వంశీ రామ్ పెండ్యాల, స్వాతి భీమి రెడ్డి, హేమంత్ ఉద్భవ్, అజయ్, సుమేధ్ మాధవన్, యేపూరి హరి తదితరులు
దర్శకుడు: హరినాథ్ పులి
నిర్మాతలు : మురళి గింజుపల్లి, నవీన్ పారుపల్లి
సంగీత దర్శకుడు: జాన్ కె జోసెఫ్
సినిమాటోగ్రఫీ: రేవంత్ సాగర్
ఎడిటర్: శివ శర్వానీ
విడుదల తేదీ : ఆగస్టు 23, 2024
ఈ రోజుల్లో కంటెంట్ ఉంటే చాలు. చిన్న సినిమాలు అయినా సరే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. కొత్త నటీనటులైనా సరే కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలాగే ఇటీవలే కొత్తవాళ్లతో తెరకెక్కించిన కమిటీ కుర్రోళ్లు సక్సెస్ సాధించింది. అలాగే అంతా కొత్తవాళ్లతో తెరకెక్కిన చిత్రం రేవు. హరినాథ్ పులి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు, పర్వతనేని రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా నిర్మించారు. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
అసలు కథేంటంటే...
సముద్ర నేపథ్యంలోని సినిమాలు టాలీవుడ్‌లో గతంలో చాలానే వచ్చాయి. కోస్తాతీరంలోని మత్స్యకారుల జీవనం ఆధారంగా తెరకెక్కించిన చిత్రమే రేవు. పాలరేవు అనే గ్రామంలో అంకాలు (వంశీరామ్ పెండ్యాల), గంగయ్య (అజయ్) అనే ఇద్దరు మత్స్యకారులు జీవనం సాగిస్తుంటారు. చేపల వేట విషయంలో వీరిద్దరి మధ్య పోటీ ఉంటుంది. అయితే వీరి మధ్యలో మూడో వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు. చేపల వేటలోకి నాగేశు(యేపూరి హరి) ఎంట్రీ ఇచ్చి వీరి జీవనాధారాన్ని దెబ్బతీస్తాడు. మరీ నాగేశ్‌ను అంకాలు, గంగయ్య అడ్డుకున్నారా? పాలరేవులో చేపల వేటపై ఆధిపత్యం కోసం వీరిద్దరు ఏ చేశారన్నదే అసలు కథ?
ఎలా ఉందంటే..
రేవు అనగానే సముద్రతీరం, మత్స్యకారులు అని అందరికీ గుర్తొస్తాయి. టైటిల్ చూస్తేనే కథ ఎలా ఉంటుందో ప్రేక్షకులు ఊహించుకోవచ్చు. మత్స్యకారుల నేపథ్యంలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ఇక్కడ కథలో చేపలవేట పేరుతో రివేంజ్ డ్రామాను చక్కగా తెరకెక్కించారు. ఇద్దరు స్నేహితుల మధ్య ఈగో వస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో చక్కగా తెరపై ఆవిష్కరించారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది.
సముద్ర నేపథ్యం అనగానే కథ మొత్తం తీరప్రాంతం చుట్టే తిరుగుతుంది. ఇందులో మత్స్యకారుల జీవనవిధానం, వారు పడే ఇబ్బందుల ఎలా ఉంటాయనేది డైరెక్టర్ తెరపై చూపించిన విధానం బాగుంది. కొత్త నటీనటులైనప్పటికీ ఎక్కడా ఆ ఫీలింగ్ రాకుండా తీశారు. కొత్త దర్శకుడు అన్న ఫీలింగ్ రాకుండా స్క్రీన్ ప్లేను అద్భుతంగా మలిచాడు హరినాథ్ పులి. కథలో సహజత్వం ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. కానీ కథలో కొత్తదనం లేకపోవడం పెద్ద మైనస్. రోటీన్ స్టోరీ కావడంతో కాస్తా బోరింగ్‌గానే అనిపిస్తుంది. కొన్ని చోట్ల సీన్స్ అయితే మరింత సాగదీసినట్లుగా అనిపిస్తాయి. కానీ క్లైమాక్స్ విషయానికొస్తే డైరెక్టర్ ఆడియన్స్‌ను మెచ్చుకునేలా కథను ముగించాడు.
ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాలో వంశీ రామ్ పెండ్యాల మత్స్యకారుడి పాత్రలో మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్‌లో బాగా రాణించాడు. హేమంత, అజయ్ నిడదవోలు తమ పాత్రల పరిధిలో జీవించారు. హీరోయిన్ గా నటించిన స్వాతి ఆకట్టుకుంది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేర రాణించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. ఎడిటర్ మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సంస్థకు తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.
రేటింగ్- 2.75/5
Comments
Please login to add a commentAdd a comment