Tollywood Hero
-
Pushpa 2: పుష్ప-2 ప్రభంజనం.. నైజాంలో తొలిరోజే ఆల్ టైమ్ రికార్డ్!
అల్లు అర్జున్ పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను ఊపేస్తోంది. ఈనెల 5న రిలీజైన ఈ సినిమాకు మొదటి రోజే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమా మాస్ ఆడియన్స్‌ను తెగ మెప్పిస్తోంది. పుష్పరాజ్.. తగ్గేదేలే అంటూ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా సరే థియేటర్స్ దగ్గర హౌస్‌ఫుల్ బోర్డులే దర్శనిస్తున్నాయి.మొదటి రోజే కలెక్షన్స్‌లో పుష్పరాజ్ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఏకంగా రూ.294 కోట్ల గ్రాస్ వసూళ్లతో తిరుగులేని రికార్డ్‌ను సాధించింది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డ్‌ను బద్దలు కొట్టింది. ఇప్పటికే కేవలం హిందీలోనే రూ.72 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో బాలీవుడ్లోనే ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా నిలిచింది.అయితే తాజాగా పుష్ప-2 మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. నైజాంలో మొదటి రోజే 30 కోట్ల షేర్ వసూళ్లు సాధించినట్లు పుష్ప టీమ్ వెల్లడించింది. ఈ మేరకు పుష్ప-2 పోస్టర్‌ను విడుదల చేసింది. నైజాం రీజియన్‌లో ఒపెనింగ్ డే ఆల్‌టైమ్ రికార్డ్‌తో బిగ్గెస్ట్ మూవీగా నిలిచింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు.భారతీయ సినీ చరిత్రలో పుష్ప రికార్డ్భారతీయ సినీ చరిత్రలో అతి పెద్ద ఓపెనర్‌గా పుష్ప2 రికార్డ్ క్రియేట్ చేసింది. బన్నీ దెబ్బకు టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వరకు ఉన్న టాప్ రికార్డ్స్ అన్నీ చెల్లా చెదురయ్యాయి. ఇప్పటి వరకు ఫస్ట్ డే నాడు అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఇండియన్ చిత్రాల జాబితాలో ఆర్ఆర్ఆర్ ఉండేది.. ఇప్పుడు ఆ రికార్డ్‌ను బీట్ చేస్తూ పుష్ప2 రూ. 294 కోట్ల కలెక్షన్లతో ప్రథమ స్థానంలో ఉంది. రెండో స్థానంలో ఆర్ఆర్ఆర్ ( రూ. 223 కోట్లు), మూడో స్థానంలో 'బాహుబలి2' (రూ.214 కోట్లు) ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా కల్కి 2898AD (రూ. 191 కోట్లు),సలార్ (రూ. 178 కోట్లు), దేవర (రూ. 172 కోట్లు), కేజీఎఫ్2 (రూ. 160 కోట్లు),లియో (రూ. 148 కోట్లు), ఆదిపురుష్ (రూ. 140 కోట్లు), సాహో (రూ. 130 కోట్లు), జవాన్ (రూ. 129.5 కోట్లు) ఉన్నాయి.ALL TIME RECORD in Nizam ❤️🔥WILDFIRE BLOCKBUSTER #Pushpa2TheRule collects a share of 30 CRORES on Day 1 making it the biggest opener in the region 💥💥#RecordRapaRapAA 🔥#Pushpa2BiggestIndianOpener RULING IN CINEMAS Book your tickets now!🎟️ https://t.co/eJusnmNS6Y… pic.twitter.com/Xqt3Mmzw5g— Pushpa (@PushpaMovie) December 6, 2024 -
పుష్ప-2 రిలీజ్.. అల్లు అయాన్ లేఖ వైరల్!
ఎన్నో రోజుల నిరీక్షణకు తెరపడింది. అనుకున్నట్లుగానే ఒక రోజు ముందుగానే పుష్ప-2 థియేటర్లలో సందడి చేశాడు. డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటలకే ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. దీంతో ఎన్నో రోజులుగా వెయిట్ చేసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా థియేటర్లకు ఉప్పెనలా తరలివచ్చారు. ప్రపంచవ్యాప్తంగా పుష్ప-2 విడుదల కావడంతో బన్నీ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద హంగామా చేస్తున్నారు.అయితే పుష్ప-2 రిలీజ్‌కు ముందు ప్రతి ఒక్కరూ టీమ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సైతం పుష్ప-2 సక్సెస్ సాధించాలని ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు. అయితే అల్లు అర్జున్ తనయుడు అయాన్ కూడా తన నాన్నపై ప్రశంసలు కురిపించాడు. సినిమా పట్ల మీ నిబద్ధత, హార్ట్ వర్క్‌ను చూసి గర్వపడుతున్నా అంటూ లేఖ రాశాడు.ఈరోజు ప్రపంచంలోనే ఒక గొప్ప నటుడి మూవీ రిలీజ్ కానుంది. ఈ రోజు నాకు చాలా ప్రత్యేకం.. పుష్ప-2 కేవలం సినిమా మాత్రమే కాదు.. సినిమా పట్ల నీకున్న ప్రేమను తెలిజేస్తుందని లేఖలో రాశాడు. నా జీవితంలో నువ్వే ఎప్పటికీ హీరో.. నీకున్న కోట్లాది అభిమానుల్లో నేను ఒకడిని అంటూ తన చిట్టి చేతులతో రాసిన లేఖ నెట్టింట వైరలవుతోంది. దీనికి బన్నీ రిప్లై కూడా ఇచ్చాడు. ఈ లెటర్ నా గుండెలను తాకిందంటూ అల్లు అర్జున్ పోస్ట్ చేశారు.Touched by my son ayaan’s letter 🖤 pic.twitter.com/dLDKOvb6jn— Allu Arjun (@alluarjun) December 4, 2024 -
అఫీషియల్: మెగాస్టార్‌తో జతకట్టిన హిట్ డైరెక్టర్.. హీరో నాని కూడా!
దసరా మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. నాని హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ మూవీతో మరింత క్రేజ్ దక్కించుకున్న శ్రీకాంత్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నారని టాక్ వినిపించింది. అంతా ఊహించినట్లుగానే వీరి కాంబోలో మూవీ ఖరారైంది.ఈ క్రేజీ కాంబోలో వస్తోన్న చిత్రానికి దసరా హీరో నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని హీరో నాని ట్విటర్(ఎక్స్) వేదికగా పంచుకున్నారు. దీంతో ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. చేతులకు రక్తం కారుతున్న పోస్టర్ చూస్తుంటే ఈ చిత్రంపై ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తి నెలకొంది.నాని తన ట్వీట్లో రాస్తూ..'ఆయన నుంచి ఇన్స్పైర్ అయ్యాను. ఆయన కోసం గంటల తరబడి క్యూలైన్స్‌లో వెయిట్ చేశా. నా సైకిల్‌ను కూడా కోల్పోయా. కానీ ఆయన విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నా. ఇప్పుడు ఆయన్నే మీ ముందుకు తీసుకొస్తున్నా. ఇదంతా ఒక చక్రం లాంటిది. దర్శతుడు శ్రీకాంత్‌తో కలిసి ఆ కల నెరవేరబోతోంది' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.మెగాస్టార్ రిప్లైశ్రీకాంత్ ఓదెల, నానితో కలిసి పనిచేయడం చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తోందంటూ మెగాస్టార్ రిప్లై ఇచ్చారు. కాగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్షన్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ తర్వాతే చిరంజీవి- శ్రీకాంత్ కాంబోలో షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది.Thrilled at this collaboration and looking forward to this one my dear @NameisNani 🤗@odela_srikanth#ChiruOdelaCinema Natural Star @NameisNani @UnanimousProd@sudhakarcheruk5 @SLVCinemasOffl https://t.co/AGfKjrwjDL— Chiranjeevi Konidela (@KChiruTweets) December 3, 2024 -
Pushpa2: ఇదెక్కడి మాస్‌రా మావ.. అప్పుడే సెంచరీ దాటేశాడు!
'రికార్డుల్లో పుష్ప పేరు ఉండడం కాదు.. పుష్ప పేరు మీదే రికార్డులు ఉంటాయి' అనే సినిమా డైలాగ్ కూడా సరిపోదేమో. అంతలా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది పుష్ప-2. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ మిలియన్ల వ్యూస్‌తో సరికొత్త రికార్డ్స్ సృష్టించాయి. అంతేకాకుండా ఓవర్సీస్లో ఏ భారతీయ సినిమా సాధించని అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ సాధించింది.తాజాగా మరో క్రేజీ రికార్డ్ క్రియేట్ చేసింది ఐకాన్ స్టార్ మూవీ. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. భారతీయ సినీ చరిత్రలోనే ఓ మైలురాలుగా నిలవనుంది. ఈ విషయాన్ని పుష్ప టీమ్ ట్విటర్ ద్వారా పంచుకుంది. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఫ్యాన్స్ కోసం ఒక రోజు ముందే బెనిఫిట్ షోలు ప్రదర్శించనున్నారు.#Pushpa2TheRule crosses the 100 CRORES mark with advance bookings 💥💥💥THE BIGGEST INDIAN FILM is on a record breaking spree ❤🔥#RecordsRapaRapAA 🔥🔥#Pushpa2TheRuleOnDec5th pic.twitter.com/vTBhiy18oB— Pushpa (@PushpaMovie) December 3, 2024 -
పుష్ప-2 మూవీ.. విడుదలకు ముందు బిగ్ షాక్!
ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న తరుణం రానే వచ్చింది. మరికొద్ది గంటల్లోనే పుష్ప-2 ప్రభంజనం థియేటర్లలో మొదలు కానుంది. డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటలకే బెనిఫిట్ షోలు వేయనున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పుష్ప ఫీవర్ కొనసాగుతోంది. ఇప్పటికే టికెట్ బుకింగ్ ప్రారంభం కాగా.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. భాషతో సంబంధం లేకుండా టికెట్స్ బుకింగ్స్ పుష్ప సరికొత్త రికార్డులు తిరగరాస్తోంది.అయితే పుష్ప-2 రిలీజ్‌కు ముందు అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ మూవీని 3డీ వర్షన్లో అందుబాటులోకి రాలేదనే టాక్ వినిపిస్తోంది. రిలీజ్ రోజున అన్ని థియేటర్స్‌లోనూ కేవలం 2డీ వెర్షన్‌ను మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తున్నారని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇప్పటికే 3డీ వర్షన్ టికెట్స్ బుక్ చేసుకుంటే.. ఆ షోలు కూడా 2డీ వర్షన్‌లోనే ప్రదర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 3డీ వెర్షన్ రావడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశముంది. దీనిపై చిత్రయూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.(ఇది చదవండి: 'పుష్ప 2'.. తమన్‌ని సైడ్ చేసేశారా?)కాగా.. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను ఐమ్యాక్స్, డాల్బీ, డిబాక్స్, 4డీఎక్స్, ఐస్, 2డీ, 3డీ విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లోనూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇప్పటికే 2డీ వెర్షన్‌కు సంబంధించిన ప్రింట్‌ను రెడీ చేశారు మేకర్స్. -
అల్లు అర్జున్ పుష్ప-2.. తగ్గేదేలే అంటోన్న టాలీవుడ్ హీరోయిన్!
అల్లు అర్జున్ పుష్ప-2 నిరీక్షణకు మరో రోజులోనే తెరపడనుంది. డిసెంబర్ 4 రాత్రి నుంచే తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ బెనిఫిట్ షోలు మొదలు కానున్నాయి. దీంతో ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్పరాజ్ పేరే వినిపిస్తోంది. పుష్ప డైలాగ్స్‌తో ఇమిటేట్ చేస్తూ ప్రతి ఒక్కరూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తగ్గేదేలే అంటూ పోస్టులు పెడుతున్నారు.అయితే ఇంతలా హంగామా ఐకాన్ స్టార్ ఫ్యాన్స్, సినీప్రియులు చేస్తారని అందరికీ తెలుసు. కానీ సినీతారలు కూడా పుష్ప-2 కోసం వెయిట్ చేస్తున్నారంటే ఐకాన్ స్టార్ క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. ఆర్ఎక్స్ 100, మంగళవారం సినిమాలతో టాలీవుడ్లో క్రేజ్ దక్కించుకున్న బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. తాజాగా పుష్ప-2 విడుదల సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ఆ వీడియోలో పుష్ప డైలాగ్‌తో అదరగొట్టింది ముద్దుగుమ్మ. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్ అంటూ డైలాగ్ మేనరిజం చేస్తూ కనిపించింది. ఈ సందర్భంగా పుష్ప-2 చిత్రబృందానికి బెస్ విషెస్ చెప్పింది. ఈ మాస్టర్ పీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
మీ సపోర్ట్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు.. అల్లు అర్జున్ ట్వీట్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. సినిమాకు మీరు ఇస్తున్న సపోర్ట్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అంటూ ట్వీట్ చేశారు. పుష్ప-2 టికెట్స్ పెంచుకునేందుకు జీవో ఇవ్వడం లాంటి మీ ఆలోచనాత్మక నిర్ణయం తెలుగు సినిమా ఎదుగుదలను ప్రోత్సహిస్తుందని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎంవో, సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డిని ట్యాగ్ చేస్తూ ధన్యవాదాలు తెలిపారు.(ఇది చదవండి: తెలంగాణలో పుష్ప-2 రిలీజ్‌కు తొలగిన అడ్డంకులు)కాగా.. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న పుష్ప-2 సినిమాకు బెనిఫిట్ షోలతో పాటు టికెట్స్ పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులిచ్చింది. డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటలకే పడనున్న బెనిఫిట్ షోలకు గరిష్ఠంగా రూ.800 పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ ఏదైనా సరే ప్రస్తుతం ఉన్న టికెట్ ధరకు అదనంగా రూ.800 చెల్లించాల్సిందే. అలాగే అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు కూడా అనుమతించింది. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంపుకోవచ్చని జీవోలో తెలిపింది. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150, డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.20, మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంచుకునేలా జీవో జారీ చేసింది.A heartfelt thank you to the Government of Telangana for their support through the approval of ticket hikes and the new GO. Your thoughtful decision fosters the growth of Telugu cinema. A special thank you to Hon’ble @TelanganaCMO Sri @revanth_anumula garu for his unwavering…— Allu Arjun (@alluarjun) December 3, 2024 -
డిసెంబర్ 5న పుష్ప-2 రిలీజ్.. ప్రమోషన్లలోనూ తగ్గేదేలే!
ఎన్నో రోజులుగా నిరీక్షణకు మరో రెండు రోజుల్లో తెరపడనుంది. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న పుష్ప-2 ది రూల్ ఈ గురువారమే థియేటర్లలో సందడి చేయనుంది. ఓవర్సీస్ ఫ్యాన్స్‌కైతే ఒక రోజు ముందుగానే పుష్ప-2 రిలీజవుతోంది. ఇప్పటికే ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా చిత్రబృందం ఇవాళ తెలంగాణలో భారీ ఈవెంట్ నిర్వహించనుంది. యూసుఫ్‌గూడలోని పోలీస్‌గ్రౌండ్స్‌లో పెద్దఎత్తను ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.అయితే ఇటీవల ముంబయిలోనూ పుష్ప-2 మేకర్స్ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రెస్‌మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ ప్రమోషన్లలో సరికొత్త పంథాలో దూసుకెళ్తోంది పుష్ప టీమ్. ముంబయిలోని మెట్రో రైళ్లకు ఎక్కడ చూసినా పుష్ప-2 పోస్టర్స్ దర్శనమిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బిగ్గెస్ట్ ఇండియన్ సినిమా- బిగ్గెస్ట్ ప్రమోషన్స్ అంటూ పుష్ప టీమ్ ఈ వీడియోను షేర్ చేసింది.కాగా.. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 2021లో వచ్చిన పుష్ప బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా నటించింది. మరోసారి శ్రీవల్లిగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. పుష్ప-2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. రికార్డులు సృష్టిస్తోంది.The Brand is everywhere 🔥🔥Mumbai Metro wrapped with Pushpa Branding 💥💥Biggest Indian Film - Biggest Promotions across India #Pushpa2TheRule#Pushpa2TheRuleOnDec5th pic.twitter.com/qCDPlKnXD5— Pushpa (@PushpaMovie) December 2, 2024 -
పుష్ప-2 అడ్వాన్స్ బుకింగ్స్.. 12 గంటల్లోనే షారూఖ్ సినిమాను దాటేసింది!
మరో మూడు రోజుల్లో థియేటర్స్ షేక్ కానున్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ మూడేళ్ల కష్టం ప్రపంచవ్యాప్తంగా బిగ్ స్క్రీన్‌పై కనిపించనుంది. 2021లో సృష్టించిన రికార్డులన్నీ మొదటి రోజే బద్దలయ్యేలా కనిపిస్తోంది. పుష్పకు సీక్వెల్‌గా తెరకెక్కించిన పుష్ప-2 ఈనెల 5న థియేటర్లలో సందడి చేయనుంది.ఇప్పటికే ఓవర్సీస్ టికెట్స్ బుకింగ్స్ పూర్తి కాగా.. ఇప్పుడు తెలంగాణలోనూ మొదలయ్యాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా టికెట్ బుకింగ్స్ ఓపెనవ్వగా ఒక రోజు గడవకముందే రికార్డుల మీద రికార్డులు నమోదవుతున్నాయి. టికెట్స్ విడుదలైన కేవలం 12 గంటల్లోనే పఠాన్, గదర్ 2, కేజీఎఫ్- 2 లాంటి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ చిత్రాలను అధిగమించింది.పుష్ప 2 ది రూల్ అడ్వాన్స్ బుకింగ్ కొన్ని గంటల్లో రూ.10 కోట్లను దాటేసింది. పుష్ప 2 బుకింగ్ మొదలైన 12 గంటల్లోనే 3 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. గతేడాది షారుఖ్ ఖాన్ పఠాన్ చిత్రానికి 2 లక్షల టిక్కెట్లు మాత్రమే బుకింగ్స్ అయ్యాయి. పుష్ప- 2 కన్నడ బ్లాక్‌బస్టర్ కేజీఎఫ్-2ను సైతం మించిపోయింది. 2022లో ఈ మూవీ టికెట్స్ 12 గంటల్లో 1.25 లక్షలు మాత్రమే సేల్స్ సాధించింది. యష్ నటించిన ఈ చిత్రం అన్ని భాషల్లో మొదటి రోజు ప్రీ-సేల్స్‌లో రూ.80 కోట్లు వసూలు చేసింది.రాజమౌళి బాహుబలి-2 తొలిరోజు అడ్వాన్స్ బుకింగ్స్‌లో రూ.90 కోట్ల వసూళ్ల మేర టికెట్స్ విక్రయించారు. తొలి 12 గంటల అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా చూస్తే పుష్ప- 2 హిందీలో రూ.5.5 కోట్లు, తెలుగులో రూ.3 కోట్లు వసూళ్లు సాధించింది. ఇదే జోరు కొనసాగితే తొలి రోజు ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 రికార్డులను అధిగమించే ఛాన్స్ ఉంది. -
రామ్ చరణ్ దంపతులపై క్యూట్ వీడియో.. స్పందించిన ఉపాసన!
మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలతో సంబంధం లేకపోయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గ్లోబల్ స్టార్ సతీమణిగా మాత్రమే కాదు.. మెడికల్ రంగంలో ఎంటర్‌ప్రెన్యూరర్‌గా రాణిస్తోంది. అయితే రామ్ చరణ్, ఉపాసనపై ఓ అద్భుతమైన వీడియోను రూపొందించాడు ఓ నెటిజన్. గేమ్ ఛేంజర్ సాంగ్‌తో ఎడిట్ చేసిన ఆ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన ఉపాసన స్పందించింది. ఎడిటింగ్ చాలా ముద్దుగా ఉంది.. మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. శంకర్ డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలై సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఇవాళ నానా హైరానా అంటూ సాంగే థర్డ్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అప్డేట్ కూడా ఇచ్చారు. ఈ రొమాంటిక్ సాంగ్ కోసం మెగా ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కాగా.. గేమ్ ఛేంజర్‌లో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ కనిపించనుంది. కోలీవుడ్ స్టార్ ఎస్జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. వెంకటేశ్ మూవీ సంక్రాంతి వస్తున్నాం కూడా పొంగల్ బరిలో నిలిచింది. What a cute edit. ❤️ ❤️ thank u for all the love. https://t.co/AMtAtr2w0T— Upasana Konidela (@upasanakonidela) November 28, 2024 -
మరో జన్మ ఉంటే ప్రభాస్ లాంటి కొడుకు కావాలి: ది రాజాసాబ్ నటి
టాలీవుడ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌పై సీనియర్ నటి జరీనా వాహబ్ ప్రశంసలు కురిపించారు. ప్రభాస్ తాజా చిత్రం ది రాజా సాబ్ గురించి ఆమె మాట్లాడారు. మారుతి డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాలో జరీనా వాహబ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె షూటింగ్ సెట్స్‌లో ప్రభాస్ తీరు గురించి ఆమె మాట్లాడారు. మరో జన్మంటూ ఉంటే ప్రభాస్ లాంటి కొడుకు కావాలని కోరుకుంటున్నానని జరీనా వెల్లడించారు.జరీనా వాహబ్ మాట్లాడుతూ..' నేను ప్రస్తుతం ప్రభాస్‌తో ఓ మూవీ చేస్తున్నా. ది రాజాసాబ్‌లో నటిస్తున్నా. ప్రభాస్ చాలా మంచి వ్యక్తి. మరో జన్మ ఉంటూ ఉంటే నాకు ఇద్దరు కొడుకులు ఉండాలి. అందులో తప్పకుండా ప్రభాస్ లాంటి కుమారుడు నాకు కావాలని కోరుకుంటా. అంత మంచి వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు. అతనొక స్టార్ అనే ఫీలింగ్ లేదు. సెట్లో ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తాడు. ఎవరైనా ఆకలితో ఉన్నారని తెలిస్తే షూటింగ్ సిబ్బందితో పాటు అందరికీ భోజనాలు ఇంటికి ఫోన్ చేసి మరి తెప్పిస్తాడు. ప్రభాస్ నిజమైన డార్లింగ్' అంటూ ప్రశంసలు కురిపించింది.ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న ఈ చిత్రం కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీ రొమాంటిక్ హారర్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నారు. ది రాజా సాబ్ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్ కానుంది. -
అఖిల్-జైనాబ్ నిశ్చితార్థం.. ఈ ఏడాది మాకెంతో ప్రత్యేకం: నాగార్జున
అక్కినేని వారి ఇంట త్వరలోనే శుభకార్యం జరగనుంది. వచ్చేనెల 4వ తేదీన నాగచైతన్య- శోభిత ధూళిపాళ్ల వివాహా వేడుక జరగనుంది. ఈ పెళ్లి పనులతో ఇరు కుటుంబాలు ప్రస్తుతం బిజీగా ఉన్నారు. అంతలోనే మరో సర్ప్రైజ్ ఇచ్చేశారు అక్కినేని ఫ్యామిలీ. నాగార్జున తనయుడు, హీరో అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించారు. ముంబయికి చెందిన జైనాబ్ రవ్జీతో నిశ్చితార్థం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.అయితే మరోవారంలో నాగచైతన్య పెళ్లి జరగనుంది. దీంతో అఖిల్ పెళ్లి ఎప్పుడని అప్పుడే ఆరా తీయడం మొదలెట్టారు నెటిజన్స్. అయితే అఖిల్- జైనాబ్ల పెళ్లి 2025లోనే జరగనుందని నాగార్జున ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఈ ఏడాది తమకు ఎంతో స్పెషల్ అని కింగ్ తెలిపారు. ఓకే ఏడాదిలో అక్కినేని శతజయంతి ఉత్సవాలు, నాగచైతన్య- శోభితల పెళ్లి, అఖిల్ ఎంగేజ్మెంట్ జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే కాకుండా అఖిల్, జైనాబ్ రవ్జీల రిలేషన్‌పై నాగ్ మాట్లాడారు.నాగార్జున మాట్లాడుతూ..'అఖిల్ ఎంగేజ్మెంట్ పట్ల చాలా సంతోషంగా ఉన్నా. జైనాబ్ అందమైన అమ్మాయి మాత్రమే అఖిల్‌కు సరైన జోడి. వారిద్దరు తమ జీవితాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నందుకు ఆనందంగా ఉంది. వారిద్దరి వివాహం 2025లోనే జరుగుతుంది" అని తెలిపారు. అఖిల్- జైనాబ్ల నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను ట్విటర్ ద్వారా పంచుకున్నారు నాగార్జున. కాగా.. నాగ చైతన్య, నటి శోభిత ధూళిపళ్ల వివాహం డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. -
పుష్పరాజ్ క్రేజ్.. అభిమాని కళకు ఫిదా అయిన బన్నీ!
ఇప్పుడంతా పుష్ప-2 ఫీవర్ నడుస్తోంది. విడుదలకు మరో వారం రోజుల సమయం ఉండగానే హడావుడి మొదలైంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, కిస్సిక్ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వచ్చేనెల డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను షేక్ చేయనున్నాడు పుష్పరాజ్.ప్రపంచవ్యాప్తంగా ఐకాన్ స్టార్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పాన్ ఇండియా మాత్రమే కాదు.. వరల్డ్ వైడ్‌గా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. పుష్ప-2 రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని వినూత్నంగా తన ప్రేమను చాటుకున్నారు. దివ్యాండైనప్పటికీ పుష్పరాజ్ స్టైల్లో అల్లు అర్జున్ బొమ్మను గీశారు. తన కాళ్లతో అద్భుతమైన కళాఖండాన్ని ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.తన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ..'అల్లు అర్జున్ సార్ దయేచేసి నా కళను చూడండి. మీకోసం పుష్ప బొమ్మను గీశాను. మిమ్మల్ని కలవాలన్న కోరిక ఉంది సార్. ఇట్లు ధీరజ్ సాత్విల్కర్' అంటూ రాసుకొచ్చారు. ఆ వీడియో కాస్తా వైరల్ కావడంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. నా గుండెను టచ్ చేశావ్ అంటూ అతనికి రిప్లై ఇచ్చారు బన్నీ.బన్నీ రిప్లై ఇవ్వడంతో ధీరజ్ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. మిమ్మల్ని ఒకసారి కలవాలి సార్.. నేను మీకు పెద్ద ఫ్యాన్ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ సైతం సూపర్ ఆర్ట్ అంటూ ధీరజ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. Heart Touching . Thank you 🖤— Allu Arjun (@alluarjun) November 28, 2024 -
9 నెలల తర్వాత ఓటీటీకి టాలీవుడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇప్పుడు తాజా ట్రెండ్ ప్రకారం థియేటర్లలో సినిమాలన్నీ అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి. పెద్ద సినిమాలైతే కనీసం వారం రోజులైనా బాక్సాఫీస్ వద్ద నిలబడుతున్నాయి. కంటెంట్‌తో మరికొన్ని సినిమాలు రెండు, మూడు వారాలపాటు కొనసాగుతున్నాయి. ఆ తర్వాత నెల రోజుల్లోపే ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఈ ఏడాది కూడా తెలుగులోనూ అలా వచ్చి ఇలా వెళ్లిన సినిమాలు చాలానే ఉన్నాయి.అలా ఈ ఏడాది ప్రారంభంలో తెలుగులో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 'తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి'. అసలు ఈ మూవీ ఎప్పుడు వచ్చిందో చాలామందికి తెలియదు. ప్రియదర్శి, శ్రీద, మణికందన్ లాంటి టాలీవుడ్ స్టార్స్ నటించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలో దర్శనమిచ్చింది. ఈ రోజు నుంచే ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 23న తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ మూవీ టాలీవుడ్లో పెద్దగా ఎక్కడా టాక్ వినిపించలేదు. రిలీజైన తొమ్మిది నెలల తర్వాత ఓటీటీకి రావడంతో ఇదేప్పుడు తీశారంటూ ఫ్యాన్స్ తెగ ఆరా తీస్తున్నారు. అయితే పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడంతో మూవీ రిలీజైనట్లు ఎవరికీ తెలియలేదు. కాగా.. ఓ బ్యాంకు దోపిడీ చుట్టూ తిరిగే కథాంశంగా నారాయణ చెన్న దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమాకు వివేక్ రామస్వామి సంగీతమందించారు. -
పుష్ప-2లో ఆయన పాత్ర వేరే లెవల్.. అల్లు అర్జున్ ప్రశంసలు
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మరో వారం రోజుల్లో థియేటర్లను షేక్ చేయనున్నాడు పుష్పరాజ్. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీ అయిపోయారు. ఇటీవల చెన్నైలో కిస్సిక్ సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. పుష్ప-2 ప్రమోషన్లలో భాగంగా ఇవాళ కేరళలోని కొచ్చిలో భారీ ఈవెంట్ నిర్వహించారు. నగరంలోని లివా మాల్ గ్రాండ్ హయత్‌లో ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా హాజరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్‌పై ప్రశంసలు కురిపించారు.అల్లు అర్జున్ మాట్లాడుతూ..'ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. దాదాపు 20 ఏళ్లుగా మీరు నన్ను అభిమానిస్తున్నారు. మల్లు అర్జున్‌గా మీ ప్రేమకు రుణపడి ఉంటా. ఈ చిత్రంలో ఫాహద్ ఫాజిల్ అద్భుతంగా చేశారు. ప్రతి కేరళియన్ గర్వపడేలా ఉంటుంది. ఫాఫా మీ అందరిని అలరిస్తారు. ఆయనతో పనిచేయడం సంతోషంగా ఉంది. పుష్ప విడుదలై మూడేళ్లవుతోంది. ఇకపై ఇన్ని రోజులు మిమ్మల్ని వెయిట్ చేయించను. ఇప్పటి నుంచి సినిమాలు త్వరగా చేస్తాను. శ్రీవల్లితో మూడేళ్లుగా నా ప్రయాణం ఎప్పటికీ గుర్తుంటుంది. ఈ సినిమాలో తన సపోర్ట్‌కు ధన్యవాదాలు. థ్యాంక్ యూ రష్మిక' అని అన్నారు.సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. వచ్చేనెల డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. నేషనల్ క్రష్ రష్మిక మరోసారి శ్రీవల్లిగా అలరించనుంది. పుష్పలో భన్వర్‌లాల్ షెకావత్‌గా అలరించిన మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ మరోసారి కీ రోల్ ప్లే చేస్తున్నారు. A Special surprise coming your way 💥💥💥Get ready for the Mass Blast🎧🔥Watch #PushpaRulesKeralam Event Live now... For the Blasting Surprise ❤️🔥❤️🔥- https://t.co/QdHDdVrAj9#Pushpa2TheRule #Pushpa2TheRuleOnDec5th— Pushpa (@PushpaMovie) November 27, 2024 -
ఓటీటీకి వచ్చేసిన వందకోట్ల సినిమా.. ఎక్కడ చూడాలంటే?
ఈ ఏడాది దీపావళికి టాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. విడుదలైన మూడు సినిమాలు హిట్‌గా నిలిచాయి. శివకార్తికేయన్ అమరన్, కిరణ్ అబ్బవరం క, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ దివాళీకి విడుదలై బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. అయితే వీటిలో అమరన్ ఇంకా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.అయితే వీటిలో సూపర్ హిట్ మూవీ లక్కీ భాస్కర్ ఇవాళే ఓటీటీకి వచ్చేసింది. ఈ చిత్రంలో గుంటూరు కారం ఫేమ్ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా దాదాపు రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో అందుబాటులో ఉండనుంది.అసలు కథేంటంటే..?ఈ కథ అంతా ముంబైలో 1989-92 మధ్యలో జరుగుతుంది. భాస్కర్ కుమార్(దుల్కర్ సల్మాన్).. మగధ బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తుంటాడు. ఇంటి నిండా అప్పులే. కనీసం ప్రమోషన్ వస్తే చాలు.. కష్టాలు తీరుతాయి అనుకుంటాడు. కష్టపడి పనిచేసినా అది వేరే వాళ్లకు దక్కుతుంది. దీంతో డబ్బు అవసరమై ఆంటోనీ(రాంకీ) అనే వ్యక్తితో కలిసి బ్యాంక్ డబ్బులతో చిన్న చిన్న స్కామ్స్ చేస్తాడు. అంతా బాగానే ఉంటది. డబ్బులు బాగానే సంపాదిస్తాడు. కొన్ని కారణాల వల్ల ఇదంతా ఆపేస్తాడు. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఏకంగా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ అవుతాడు. కోట్లకు కోట్లు సంపాదిస్తాడు. ఇంత డబ్బు ఎలా సంపాదించాడు? భాస్కర్ ని సీబీఐ వాళ్ళు ఎందుకు ఎంక్వయిరీ చేశారు? ఈ కథకి బిగ్ బుల్ హర్ష మెహ్రాకి సంబంధం ఏంటనేది మిగిలిన స్టోరీ. -
అక్కినేని వారి గ్రాండ్ వెడ్డింగ్.. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే?
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య మరికొద్ది రోజుల్లో ఓ ఇంటివాడు కానున్నారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మెడలో మూడు ముళ్లు వేయనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా వీరి పెళ్లి వేడుక జరగనుంది. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదురుగా వేదికను సిద్ధం చేస్తున్నట్లు చైతూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.అయితే వీరి పెళ్లి వేడుకను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో ఓటీటీ రైట్స్‌కు ఓ న్యూస్ తెగ వైరలవుతోంది. నాగ చైతన్య, శోభితాల వివాహ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూ. 50 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల గురించిన వార్తలను అక్కినేని ఫ్యామలీ ఇంకా ధృవీకరించలేదు.అయితే ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. చైతూ- శోభిత డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వివాహం చేసుకోనున్నారు. తమ పెళ్లిని సింపుల్‌గానే నిర్వహించాలని నాగ చైతన్య కోరినట్లు ఇటీవల నాగార్జున వెల్లడించారు. అందుకే పెళ్లి పనులను శోభిత, చైతూనే చూసుకుంటున్నట్లు తెలిపారు. Naga Chaitanya - Sobhita Dhulipala wedding rights bagged by netflix for a whopping ₹50 cr. pic.twitter.com/w6P4x1i9ZK— Manobala Vijayabalan (@ManobalaV) November 26, 2024 -
వన్ మోర్ టైమ్ అంటోన్న నితిన్.. రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది!
భీష్మ హిట్ తర్వాత నితిన్- వెంకీ కుడుముల కాంబోలో వస్తోన్న చిత్రం రాబిన్‌హుడ్. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.తాజాగా రాబిన్‌హుడ్ మూవీ నుంచి వన్ మోర్ టైమ్ అనే రొమాంటిక్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. జీవి ప్రకాశ్, విద్య ఆలపించారు. యూనిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతమందిస్తున్నారు. The LOVE FUSION SONG OF THE YEAR is here!#Robinhood First Single #OneMoreTime out now!▶️ https://t.co/QR2AWYjcFlSung by @gvprakash & @VidyaVox 🎙️GRAND RELEASE WORLDWIDE ON DECEMBER 25th 💥@sreeleela14 @VenkyKudumula @kk_lyricist @OfficialSekhar @MythriOfficial pic.twitter.com/0MiffNi3x6— nithiin (@actor_nithiin) November 26, 2024 -
అంతర్జాతీయ వేదికపై టాలీవుడ్ మూవీ సత్తా.. అవార్డులు కొల్లగొట్టేసింది!
నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్, కియారా ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ హిట్ మూవీ హాయ్ నాన్న. గతేడాది థియేటర్లలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. శౌర్యువ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా సలార్ పోటీని తట్టుకుని ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లకు పైగా రాబట్టింది.తాజాగా ఈ చిత్రం అంతర్జాతీయ వేదికపై మెరిసింది. మెక్సికోలో జరిగిన ఐఎఫ్ఏసీ ఫిల్మ్ ఫెస్టివల్లో ఏకంగా ఆరు అవార్డులను సొంతం చేసుకుంది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ స్కోర్, బెస్ట్ రైటర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సెట్ డిజైన్, బెస్ట్ హెయిర్ అండ్ మేకప్ ఫీచర్ సౌండ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సౌండ్ విభాగాల్లో అవార్డ్స్ దక్కించుకుంది. కాగా.. తండ్రీకూతుళ్ల ఎమోషనల్ చిత్రంగా హాయ్ నాన్న తెరకెక్కించారు. గతంలో న్యూయార్క్‌లో జరిగిన ది ఒనిరోస్ ఫిల్మ్ అవార్డుల్లో సత్తా చాటింది. పలు విభాగాల్లో మొత్తం 11 అవార్డులను కైవసం చేసుకుంది. ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ మార్చ్- 2024 ఎడిషన్‌లో బెస్ట్ ఫీచర్ ఫిలింగా అవార్డును కైవసం చేసుకుంది.కథ విషయానికి వస్తే..ముంబైకి చెందిన విరాజ్ (నాని) ఓ ఫోటోగ్రాఫర్. కూతురు మహి(బేబి కియారా ఖన్నా) అంటే అతడికి పంచప్రాణాలు. పుట్టుకతోనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న మహిని కంటికి రెప్పలా చూసుకుంటాడు. అమ్మ లేని లోటు తెలియకుండా పెంచుతాడు. ప్రతిరోజు రాత్రి మహికి కథలు చెప్తుంటాడు విరాజ్. ఓరోజు అమ్మ కథ చెప్పమని అడుగుతుంది మహి. క్లాస్ ఫస్ట్ వస్తే చెప్తానంటాడు.అమ్మ కథ వినాలని నెలంతా కష్టపడి క్లాస్‌లో తనే ఫస్ట్ ర్యాంకు తెచ్చుకుంటుంది. తర్వాత కథ చెప్పమని అడిగితే విరాజ్ చిరాకు పడటంతో మహి ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది. ఆ సమయంలో రోడ్డు ప్రమాదం నుంచి మహిని కాపాడుతుంది యష్ణ. అప్పటినుంచి వీరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. అసలు యష్ణ ఎవరు? విరాజ్ సింగిల్ పేరెంట్‌గా ఎందుకు మారాడు? మహి అరుదైన వ్యాధిని జయించిందా? లేదా? అన్నది ఓటీటీలో చూడాల్సిందే! Congratulations to the entire team of #HiNanna 🫶 This film truly deserves all the love it's receiving, nd it's heartwarming to see it being celebrated🥺❤️ pic.twitter.com/oAIJDNSMRX— Vyshuuᴴᴵᵀ ³ (@vyshuuVyshnavi) November 26, 2024 -
ట్రైలర్ మాత్రమే కాదు.. సాంగ్ కూడా ఊపేస్తోంది!
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు మరో ఊపు సాంగ్ వచ్చేసింది. పుష్ప-2 నుంచి కిస్సిక్ అంటూ శ్రీలీల డ్యాన్స్ చేసిన ఐటమ్ సాంగ్‌ను విడుదల చేశారు. చెన్నైలో జరిగిన ఈవెంట్లో ఈ లిరికల్ పాటను విడుదల చేశారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్ మరో అదిరిపోయే సాంగ్‌తో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు. విడుదలైన కొన్ని గంటల్లోనే కిస్సిక్ సాంగ్ క్రేజీ రికార్డ్ సాధించింది.ఈ సాంగ్ విడుదలైన కొన్ని గంటల్లోనే 25 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. అంతేకాకుండా సౌత్ ఇండియాలో ఏ సాంగ్ సాధించని రికార్డ్ సృష్టించింది. కేవలం 18 గంటల్లోనే ఈ రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సైతం యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఏకంగా 150 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకెళ్తోంది.సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న ఈ మూవీ మర పది రోజుల్లోనే బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా పుష్ప-2 ది రూల్ విడుదలవుతోంది. ఇప్పటికే ఓవర్సీస్లో టికెట్ బుకింగ్స్ ఒపెనవ్వగా రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ పూర్తయ్యాయి. యూఎస్‌లో ఎప్పుడు లేని విధంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. #KissikSong breaks the highest viewed South Indian song record of 24 hours in just 18 hours 💥💥#Kissik Telugu lyrical video hits massive 25 MILLION+ VIEWS in a flash ⚡▶️ https://t.co/JFhLNrZ9ejAn Icon Star @alluarjun & Dancing Queen @sreeleela14 dance treat 💥💥A… pic.twitter.com/BnGxLfMCHt— Pushpa (@PushpaMovie) November 25, 2024 -
అల్లు అర్జున్ పుష్ప-2.. శ్రీలీల కిస్సిక్ ఫుల్ సాంగ్ వచ్చేసింది
ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప పేరే వినిపిస్తోంది. ఇటీవల పుష్ప-2 ట్రైలర్ రిలీజ్ కాగా.. మూవీ కోసం ఎప్పుడెప్పుడా అంటూ రోజులు లెక్క పెడుతున్నారు ఫ్యాన్స్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ మూవీకి సీక్వెల్‌గా పుష్ప-2 ది రూల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఇదిలా ఉండగా పుష్ప-2 రిలీజ్‌కు కేవలం పది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. తాజాగా చెన్నైలో నిర్వహించిన ఈవెంట్లో పుష్ప-2 లోని కిస్సిక్ ఐటమ్ సాంగ్ విడుదల చేశారు. కిస్సిక్ పేరుతో తెరకెక్కించిన ఈ పాటకు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల.. బన్నీతో కలిసి స్టెప్పులేసింది. చెన్నైలోని లియో ముత్తు ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈవెంట్లో లిరికల్ ఐటమ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.కాగా.. పార్ట్-1లో ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ.. అనే ఐటమ్ సాంగ్ సినీ ప్రియులను ఓ ఊపు ఊపేసింది. పుష్పలో ఈ పాటకు సమంత తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. పుష్ప-2లో కిస్సిక్ సాంగ్‌తో శ్రీలీల తన స్టెప్పులతో ప్రేక్షకులను మెప్పించనుంది. ఈ చిత్రంలో శ్రీవల్లిగా మరోసారి రష్మిక మందన్నా ఫ్యాన్స్‌ను అలరించనుంది. -
టాలీవుడ్ యంగ్ హీరో కాళ్లు మొక్కిన సీనియర్ సిటిజెన్.. వీడియో వైరల్!
ఈ ఏడాది సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రం హనుమాన్. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమా పొంగల్ పోటీలో సూపర్ హిట్‌గా నిలిచింది. గుంటూరు కారం, నా సామిరంగ, సైంధవ్ చిత్రాలతో పోటీపడి రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించారు. అయితే ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఐఎఫ్ఎఫ్ఐ వేడుకల్లో తేజ సజ్జా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో హనుమాన్ మూవీని ప్రదర్శించారు. ఈ సందర్భంగా తేజ సజ్జా వేదికపై సందడి చేశారు. ఆ సమయంలోనే ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ సీనియర్ సిటిజెన్ తేజ సజ్జా కాళ్లకు నమస్కరించాడు. అయితే వెంటనే తేజ ఆయనను అలా చేయవద్దని కోరాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కాగా.. తేజ ప్రస్తుతం మరో మూవీలో హీరోగా నటిస్తున్నారు. Super Hero @tejasajja123 received a memorable felicitation at @IFFIGoa after the screening of the Historic Blockbuster #HanuMan !#TejaSajja #IFFI2024 pic.twitter.com/QBHFwiVD3j— Rajesh Manne (@rajeshmanne1) November 23, 2024 -
ఆర్ఆర్ఆర్ టైమ్‌లో లేదు.. అందుకే పుష్ప-2తో ప్రారంభిస్తున్నాం: నాగార్జున
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున టెక్నాలజీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. మనదేశంలో డాల్బీ విజన్ సాంకేతికతను తొలిసారి అన్నపూర్ణ స్టూడియో ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సదుపాయం ఇప్పటివరకు ఇండియాలో ఎక్కడా కూడా లేదన్నారు.గతంలో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు డాల్బీ విజన్ టెక్నాలజీ అందుబాటులో లేకపోవడంతో జర్మనీకి వెళ్లారని అన్నారు. అక్కడే సినిమాకు సంబంధించిన పనులు పూర్తి చేశారని నాగ్ వెల్లడించారు. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా సదస్సులో పాల్గొన్న నాగార్జున సినిమా, థియేటర్ టెక్నాలజీపై మాట్లాడారు.మొట్ట మొదటిసారి ఈ సదుపాయాన్నిఅన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మూవీతో ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నామని నాగార్జున తెలిపారు. మనదేశంలో తొలిసారి అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. సినిమా ప్రమాణాలు పెంచి ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని అందించేందుకు ఈ డాల్బీ విజన్ సాంకేతికతను వినియోగించనున్నారు. కాగా.. గోవాలో జరుగుతున్న ఐఎఫ్ఎఫ్ఐ-2024 ఈవెంట్ ఈనెల 28 వరకు కొనసాగనుంది. -
కుమారుడి బర్త్ డే.. వీడియో షేర్ చేసిన టాలీవుడ్ హీరో
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ఇటీవలే మా నాన్న సూపర్ హీరో అనే మూవీతో ప్రేక్షకులను అలరించాడు. తండ్రి, కుమారుల కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆర్ణ జోడీగా హీరోయిన్గా నటించింది. సాయి చంద్, సాయాజీ షిండే ఇతర పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.తాజాగా సుధీర్ బాబు తన కుమారుడి బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు. ఫ్యామిలీ సభ్యులతో కలిసి ఆయన కుమారుడు చరిత్ మానస్ కేక్ కట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు సుధీర్ బాబు. ఈ రోజు నాకు ప్రత్యేకమంటూ కుమారుడిపై ప్రేమను చాటుకున్నారు. చరిత్ మానస్ పుట్టినరోజు వేడుకలో మహేశ్ బాబు సతీమణి నమ్రతా, సోదరి మంజుల కూడా సందడి చేశారు.కాగా.. సూపర్ స్టార్ కృష్ణ, ఇందిరా దేవి కుమార్తె ప్రియదర్శినిని సుధీర్ బాబు పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు చరిత్ మానస్, దర్శన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల మహేశ్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని బర్త్ డే వేడుకల్లో సుధీర్ బాబు ఫ్యామిలీ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను మంజుల సోషల్ మీడియాలో షేర్ చేసింది. On your special day, I want you to know how much I love and cherish you. You're growing up to be an incredible individual! Happy birthday, cherry ❤️ @Just_Charith pic.twitter.com/7HGrRdno55— Sudheer Babu (@isudheerbabu) November 22, 2024 -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. మోహన్ బాబు లుక్ చూశారా?
టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ మూవీలో పలువురు సూపర్ స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేశారు. ఇందులో మహదేవ శాస్త్రి పాత్రలో మోహన్ బాబు కనిపించనున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న ఈ మూవీని డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి మధుబాల,శరత్‌కుమార్, దేవరాజ్ వంటి ప్రముఖ నటుల పోస్టర్లను విడుదల చేశారు. కన్నప్పలో ప్రభాస్ లాంటి అగ్రహీరో కూడా కనిపించనున్నారు. అంతేకాకుండా మోహన్ లాల్, బ్రహ్మానందం, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో కన్నప్ప పాత్రను మంచు విష్ణు పోషిస్తున్నారు. కాగా.. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. త్వరలోనే కన్నప్ప థియేటర్లలో సందడి చేయనుంది. Unveiling the divine look of @themohanbabu garu as 'Mahadeva Shastri' in #Kannappa🏹. Witness the devotion and grandeur as they come to life! 🌟✨ #HarHarMahadevॐ#MohanBabu @ivishnumanchu @Mohanlal #Prabhas @akshaykumar @realsarathkumar #MukeshRishi @mukeshvachan… pic.twitter.com/Z8XbIV3ccd— Kannappa The Movie (@kannappamovie) November 22, 2024