టైటిల్: లగ్గం
నటీనటులు: సాయిరోనాక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్, ఎల్బీ శ్రీరామ్, రఘుబాబు, రోహిణి తదితరులు
దర్శకుడు: రమేశ్ చెప్పాల
నిర్మాత: వేణుగోపాల్‌రెడ్డి
విడుదల తేదీ: 25 అక్టోబర్ 2024
సాయిరోనాక్, ప్రగ్యా నగ్రా జంటగా నటిస్తున్న చిత్రం లగ్గం. ఈ సినిమాకు రమేష్ చెప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా ఇవాళ థియేటర్లలో విడుదలైంది. లవ్ అండ్ ఫ్యామిలీ అభిమానులను ఏమేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
అసలు కథ ఏంటంటే?
సదానందం (రాజేంద్రప్రసాద్) తన కూతురు మానస ( ప్రగ్యా నగ్రా) కి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. తన సొంత చెల్లెలైన సుగుణ( రోహిణి) కొడుకు (సాయి రోనక్) ని చూడడానికి సిటీకి వస్తాడు. అక్కడ అల్లుడి ఖరీదైన జీవితం, జీతం,సాప్ట్‌వేర్ లైఫ్ చూసి ఎలాగైనా సరే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలి అని డిసైడ్ అవుతాడు. ఇంతకీ తన చెల్లి సుగుణ( రోహిణి)తో మాట్లాడి కూతురి లగ్గం ఖాయం చేసుకున్నాడా? ఆ తర్వాత తన కుమార్తె జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే లగ్గం కథ.
ఎలా ఉందంటే...
తెలంగాణ నేపథ్యంలో కావడంతో అక్కడి సంప్రదాయాల్ని , పద్ధతుల్ని ఆచారాల్ని, చూపిస్తూ కథ మొదలవుతుంది. ఆ తర్వాత కథ పెళ్లి సంబురాల వైపు నడిపించాడు. బంధువులు, పెళ్లి, పద్ధతులు, ఆచారాలను ఆడియన్స్‌కు పరిచయం చేస్తూ మెల్లగా కథలోకి తీసుకెళ్లాడు. లగ్గం చుట్టూ ఉండే సరదా సరదా సన్నివేశాలతో , బంధువుల పాత్రలు నిజజీవితంలో ప్రేక్షకులను టచ్ చేసేలా చేశాడు దర్శకుడు. ఇంటర్వెల్ బ్యాంగ్‌తో ఆడియన్స్‌ను ఆలోచనలో పడేశాడు. ఫస్ట్ హాఫ్‌లో క్యారెక్టర్స్ పరిచయాలతో కథ కాస్తా మెల్లగానే సాగినట్లు అనిపిస్తుంది.
ఇకపోతే సెకండ్ హాఫ్ వచ్చేసరికి కథఊహించని మలుపులు తిరుగుతుంది. ప్రారంభం నుంచే ఆడియన్స్‌ను ఎమోషనల్ మూడ్‌లోకి తీసుకెళ్లిపోతుంది. ద్వితీయభాగం మొదలైన కాసేపటికే ట్విస్టులు , ఎమోషనల్ సీన్స్ సగటు ప్రేక్షకుడిని దర్శకుడు కట్టిపేడేసేలా ఉన్నాయి. ఒక్క లగ్గం చుట్టూ ఇన్ని జరుగుతాయా? అనే అనుమానాన్ని ఆడియన్స్‌లో కలిగించాడు. ఒక సాఫ్ట్‌వేర్ లైఫ్, ఓ తండ్రి తన కూతురి కోసం పడే తపన, కుటుంబానికి దూరంగా బతికే వారి కష్టాలతో ఫుల్ ఎమోషనల్ టచ్ ఇచ్చాడు దర్శకుడు రమేష్ చెప్పాల. క్లైమాక్స్ సీన్‌తో సగటు ప్రేక్షకుడికి కన్నీళ్లు తెప్పించేశాడు. ఓవరాల్‌గా చూస్తే మంచి లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌లా అనిపించింది.
ఎవరెలా చేశారంటే..
సాయిరోనాక్ నటనలో మరోసారి తనదైన మార్క్ చూపించాడు. ప్రగ్యా నగ్రా తన అందంతో అభిమానులను ఆకట్టుకుంది. ఇక రాజేంద్రప్రసాద్, రోహిణి తమ నటనతో మెప్పించారు. రఘుబాబు , ఎల్బీ శ్రీరామ్, సప్తగిరి , రచ్చ రవి,చమ్మక్ చంద్ర , వడ్లమాని శ్రీనివాస్ , కిరీటి , అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే బాలరెడ్డి (బేబీ ఫేమ్) సినిమాటోగ్రఫీ బాగుంది. మణిశర్మ బీజీఎం ఈ సినిమాకు మరో ప్లస్. చరణ్ అర్జున్ పాటలు బాగున్నాయి. నిర్మాణ విలువలు సంస్థకు తగ్గుట్టుగా ఉన్నతంగా ఉన్నాయి.
రేటింగ్- 2.75/5
Comments
Please login to add a commentAdd a comment