అక్టోబర్ 25న ‘లగ్గం’ | Laggam Movie Release Date Out | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 25న ‘లగ్గం’

Sep 28 2024 5:12 PM | Updated on Sep 28 2024 5:12 PM

Laggam Movie Release Date Out

సాయిరోనాక్‌, ప్రగ్యా నగ్రా జంటగా నటిస్తున్న చిత్రం ‘లగ్గం’. రమేష్‌ చెప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. వేణుగోపాల్‌ రెడ్డి నిర్మాత. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన టీజర్ కు, పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లగ్గం సినిమా అక్టోబర్ 25న ఏషియన్ సురేష్ ద్వారా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా "రిలీజ్ డేట్ లాంచింగ్ పోస్టర్" ప్రముఖ హీరో సుధీర్ బాబు రిలీజ్‌ చేశాడు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది తెలంగాణ నేపథ్యంలో జరిగే తెలుగు సినిమా. చిత్రంలో నటీనటులు పూర్తి తెలంగాణ యాస మాట్లాడకుండా వాడుక భాషలో మాట్లాడుతారు. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుంది. ఇది లగ్గం నామ సంవత్సరం కాబోతుందని దర్శకుడు ధీమా వ్యక్తం చేశాడు.‘కుటుంబమంతా  కలిసి చూడాల్సిన సినిమా లగ్గం" అని నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు అన్నారు.  "ప్రతి ప్రవాస భారతీయులు తప్పకుండా చూడల్సిన సినిమా.  ప్రతి ఆడపిల్ల తండ్రి కూతురికి పెళ్లి చేసేముందు ఈ సినిమా చూడాలి’ అని ఎల్బి శ్రీరాం అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement