Laggam Movie
-
వార్తల్లోకెక్కిన లగ్గం హీరోయిన్.. ప్రజ్ఞా నాగ్రా గురించి ఈ విషయాలు తెలుసా? (ఫొటోలు)
-
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. థియేటర్లలో 'మెకానిక్ రాకీ', 'జీబ్రా', 'దేవకీ నందన వాసుదేవ' సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరోవైపు ఓటీటీలో మాత్రం ఒక్కరోజే ఏకంగా 30కి పైగా మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. వీటిలో అల్లు అర్జున్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 2, 'లగ్గం' సినిమా కొంతలో కొంత ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో ఇంకా ఏమేం వచ్చాయంటే?(ఇదీ చదవండి: Zebra Movie Review: 'జీబ్రా' ట్విటర్ రివ్యూ)ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చిన మూవీస్-వెబ్ సిరీస్ (నవంబర్ 22)నెట్ఫ్లిక్స్దేవర - హిందీ వెర్షన్ మూవీ900 డేస్ వితౌట్ అన్నాబెల్ - స్పానిష్ సిరీస్జాయ్ - ఇంగ్లీష్ సినిమాపోకెమన్ హారిజన్స్ ద సిరీస్ పార్ట్ 4 - జపనీస్ సిరీస్కాంకర్: లహద్ దతూ - మలయ్ సినిమాస్పెల్ బౌండ్ - ఇంగ్లీష్ మూవీద హెలికాప్టర్ హెయిస్ట్ - స్వీడిష్ సిరీస్వెన్ ద ఫోన్ రింగ్స్ - కొరియన్ సిరీస్ద పియానో లెసన్ - ఇంగ్లీష్ సినిమాట్రాన్స్మిట్హ్ - స్పానిష్ మూవీఏ మ్యాన్ ఆన్ ద ఇన్సైడ్ - ఇంగ్లీష్ సిరీస్యే ఖాలీ ఖాలీ అంకైన్ సీజన్ 2 - హిందీ సిరీస్ద ఎంప్రెస్ సీజన్ 2 - జర్మన్ సిరీస్బఘీరా - తెలుగు మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)అమెజాన్ ప్రైమ్హంటింగ్ విత్ టైగర్స్ - ఫ్రెంచ్ సినిమావ్యాక్ గర్ల్స్ - హిందీ సిరీస్పింపినెరో - స్పానిష్ మూవీద రానా దగ్గుబాటి షో - తెలుగు టాక్ షో (నవంబర్ 23)ఆహాఅన్స్టాపబుల్ అల్లు అర్జున్ ఎపిసోడ్ పార్ట్ 2 - తెలుగు టాక్ షోలగ్గం - తెలుగు సినిమాలైన్ మ్యాన్ - తమిళ మూవీహాట్స్టార్బియా & విక్టర్ - పోర్చుగీస్ సిరీస్ఔట్ ఆఫ్ మై మైండ్ - ఇంగ్లీష్ సినిమాతుక్రా కే మేరా ప్యార్ - హిందీ సిరీస్జియో సినిమాబేస్డ్ ఆన్ ఓ ట్రూ స్టోరీ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ద సెక్స్ లైవ్స్ ఆఫ్ కాలేజీ గర్ల్స్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్హరోల్డ్ అండ్ ద పర్పుల్ క్రేయాన్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 23మనోరమ మ్యాక్స్తెక్కు వడక్కు - మలయాళ మూవీసీక్రెట్ - మలయాళ సినిమా (నవంబర్ 24)ఆపిల్ ప్లస్ టీవీబ్లిట్జ్ - ఇంగ్లీష్ మూవీబ్రెడ్ అండ్ రోజెస్ - అరబిక్ సినిమాబుక్ మై షోఫ్రమ్ డార్క్నెస్ - స్వీడిష్ సినిమాద గర్ల్ ఇన్ ద ట్రంక్ - ఇంగ్లీష్ మూవీద నైట్ మై డాడ్ సేవ్డ్ క్రిస్మస్ - స్పానిష్ సినిమాలయన్స్ గేట్ ప్లేగ్రీడీ పీపుల్ - ఇంగ్లీష్ మూవీ(ఇదీ చదవండి: Mechanic Rocky Review: ‘మెకానిక్ రాకీ’ టాక్ ఎలా ఉందంటే..?) -
ఓటీటీలో 'తండ్రీకూతురు' సినిమా స్ట్రీమింగ్
సాయిరోనాక్, ప్రగ్యా నగ్రా జంటగా నటించిన చిత్రం 'లగ్గం'. తెలంగాణ సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిళ్ల తంతును చూపిస్తూ.. రమేష్ చెప్పాల దర్శకత్వం వహించారు. ఈ మూవీని వేణుగోపాల్ రెడ్డి నిర్మాతగా తక్కువ బడ్జెట్లో ఉన్నతంగా నిర్మించారు. అక్టోబర్ 25న ఏషియన్ సురేష్ ద్వారా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. ఆ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది.'లగ్గం' సినిమాలో సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, ఎల్బీ శ్రీరామ్‌తో పాటు రోహిణి, చమ్మక్ చంద్ర వంటి వారు నటించడంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. తెలంగాణ యాసలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు 'ఆహా' ఓటీటీలో విడుదల కానుంది. నవంబర్ 22 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా విడుదల సమయంలో భారీగా ప్రమోషన్స్ కార్యక్రమాలు చేసినప్పటికీ అనుకున్నంత స్థాయిలో మూవీ మెప్పించలేదు.కథ ఏంటంటే?సదానందం (రాజేంద్రప్రసాద్) తన కూతురు మానస ( ప్రగ్యా నగ్రా) కి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. తన సొంత చెల్లెలైన సుగుణ( రోహిణి) కొడుకు (సాయి రోనక్)ని చూడడానికి సిటీకి వస్తాడు. అక్కడ అల్లుడి ఖరీదైన జీవితం, జీతం,సాప్ట్వేర్ లైఫ్ చూసి ఎలాగైనా సరే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలి అని డిసైడ్ అవుతాడు. ఇంతకీ తన చెల్లి సుగుణ( రోహిణి)తో మాట్లాడి కూతురి లగ్గం ఖాయం చేసుకున్నాడా? ఆ తర్వాత తన కుమార్తె జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే లగ్గం కథ.ప్రతి ఆడపిల్ల కథ ఇంతేనేమో..'ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో.. ఈ ఇంట్లో నా కథ. అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా..' అనే పాటను చరణ్ అర్జున్ చాలా అద్భుతంగా రచిస్తే.. సింగర్ చిత్ర అందరి గుండెల్ని పిండేసేలా ఆలపించారు. లగ్గం చిత్రంలోని ఈ పాటకు యూట్యూబ్‌లో కూడా మంచి వ్యూస్ వచ్చాయి. -
సాఫ్ట్వేర్ కుర్రాడితో 'లగ్గం'.. ఎలా ఉందంటే?
టైటిల్: లగ్గంనటీనటులు: సాయిరోనాక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్, ఎల్బీ శ్రీరామ్, రఘుబాబు, రోహిణి తదితరులుదర్శకుడు: రమేశ్ చెప్పాలనిర్మాత: వేణుగోపాల్రెడ్డివిడుదల తేదీ: 25 అక్టోబర్ 2024సాయిరోనాక్, ప్రగ్యా నగ్రా జంటగా నటిస్తున్న చిత్రం లగ్గం. ఈ సినిమాకు రమేష్ చెప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా ఇవాళ థియేటర్లలో విడుదలైంది. లవ్ అండ్ ఫ్యామిలీ అభిమానులను ఏమేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.అసలు కథ ఏంటంటే?సదానందం (రాజేంద్రప్రసాద్) తన కూతురు మానస ( ప్రగ్యా నగ్రా) కి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. తన సొంత చెల్లెలైన సుగుణ( రోహిణి) కొడుకు (సాయి రోనక్) ని చూడడానికి సిటీకి వస్తాడు. అక్కడ అల్లుడి ఖరీదైన జీవితం, జీతం,సాప్ట్వేర్ లైఫ్ చూసి ఎలాగైనా సరే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలి అని డిసైడ్ అవుతాడు. ఇంతకీ తన చెల్లి సుగుణ( రోహిణి)తో మాట్లాడి కూతురి లగ్గం ఖాయం చేసుకున్నాడా? ఆ తర్వాత తన కుమార్తె జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే లగ్గం కథ.ఎలా ఉందంటే...తెలంగాణ నేపథ్యంలో కావడంతో అక్కడి సంప్రదాయాల్ని , పద్ధతుల్ని ఆచారాల్ని, చూపిస్తూ కథ మొదలవుతుంది. ఆ తర్వాత కథ పెళ్లి సంబురాల వైపు నడిపించాడు. బంధువులు, పెళ్లి, పద్ధతులు, ఆచారాలను ఆడియన్స్‌కు పరిచయం చేస్తూ మెల్లగా కథలోకి తీసుకెళ్లాడు. లగ్గం చుట్టూ ఉండే సరదా సరదా సన్నివేశాలతో , బంధువుల పాత్రలు నిజజీవితంలో ప్రేక్షకులను టచ్ చేసేలా చేశాడు దర్శకుడు. ఇంటర్వెల్ బ్యాంగ్‌తో ఆడియన్స్‌ను ఆలోచనలో పడేశాడు. ఫస్ట్ హాఫ్‌లో క్యారెక్టర్స్ పరిచయాలతో కథ కాస్తా మెల్లగానే సాగినట్లు అనిపిస్తుంది. ఇకపోతే సెకండ్ హాఫ్ వచ్చేసరికి కథఊహించని మలుపులు తిరుగుతుంది. ప్రారంభం నుంచే ఆడియన్స్‌ను ఎమోషనల్ మూడ్‌లోకి తీసుకెళ్లిపోతుంది. ద్వితీయభాగం మొదలైన కాసేపటికే ట్విస్టులు , ఎమోషనల్ సీన్స్ సగటు ప్రేక్షకుడిని దర్శకుడు కట్టిపేడేసేలా ఉన్నాయి. ఒక్క లగ్గం చుట్టూ ఇన్ని జరుగుతాయా? అనే అనుమానాన్ని ఆడియన్స్‌లో కలిగించాడు. ఒక సాఫ్ట్వేర్ లైఫ్, ఓ తండ్రి తన కూతురి కోసం పడే తపన, కుటుంబానికి దూరంగా బతికే వారి కష్టాలతో ఫుల్ ఎమోషనల్ టచ్ ఇచ్చాడు దర్శకుడు రమేష్ చెప్పాల. క్లైమాక్స్ సీన్‌తో సగటు ప్రేక్షకుడికి కన్నీళ్లు తెప్పించేశాడు. ఓవరాల్‌గా చూస్తే మంచి లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్లా అనిపించింది.ఎవరెలా చేశారంటే..సాయిరోనాక్ నటనలో మరోసారి తనదైన మార్క్ చూపించాడు. ప్రగ్యా నగ్రా తన అందంతో అభిమానులను ఆకట్టుకుంది. ఇక రాజేంద్రప్రసాద్, రోహిణి తమ నటనతో మెప్పించారు. రఘుబాబు , ఎల్బీ శ్రీరామ్, సప్తగిరి , రచ్చ రవి,చమ్మక్ చంద్ర , వడ్లమాని శ్రీనివాస్ , కిరీటి , అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే బాలరెడ్డి (బేబీ ఫేమ్) సినిమాటోగ్రఫీ బాగుంది. మణిశర్మ బీజీఎం ఈ సినిమాకు మరో ప్లస్. చరణ్ అర్జున్ పాటలు బాగున్నాయి. నిర్మాణ విలువలు సంస్థకు తగ్గుట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. రేటింగ్- 2.75/5 -
అందమైన కుందనపు బొమ్మలా 'లగ్గం' బ్యూటీ! (ఫొటోలు)
-
రాజేంద్ర ప్రసాద్ గారితో యాక్ట్ చేయడం మా నాన్నతో యాక్ట్ చేసినట్టే ఉంది...
-
రెండు కుటుంబాలు కాదు రెండు మనస్సులు కలిస్తేనే లగ్గం..
-
‘లగ్గం’ మూవీ హీరోయిన్ ప్రజ్ఞా నాగ్రా అందమైన (ఫొటోలు)
-
Karimnagar: లగ్గం సినిమాలో మనోళ్లు
విద్యానగర్(కరీంనగర్): పెళ్లి అంటే రెండు కుటుంబాలు కలవడమే కాదు.. రెండు మనసులు కలవడం అన్న అంశంతో తెలంగాణ పెండ్లి సంప్రదాయాన్ని పెద్ద తెరపై ఆవిష్కరిస్తున్నారు మనోళ్లు. ‘లగ్గం’ పేరున సినిమాను కామారెడ్డికి చెందిన వేణుగోపాల్‌రెడ్డి నిర్మించగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తికి చెందిన చెప్పాల రమేశ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సినీ, యూట్యూబ్ స్టార్స్ ఆర్ఎస్ నంద, గుండ మల్ల య్య, రాధిక, తెలంగాణ లక్ష్మి, మిమిక్రి మహేశ్, సత్య ఎలేశ్వరం, సినీ పోస్టర్, టైటిల్ డిజైనర్ విష్ణువర్దన్‌రెడ్డి, అర్చిత, కాంతరెడ్డితోపాటు మరో 10మంది వరకు నటించడం విశేషం. లగ్గం సినిమా ఈనెల 25న విడుదల కానుంది. పాటే ఆమె ప్రాణం.. శంకరపట్నం(మానకొండూర్): ఇప్పలపల్లి గ్రామానికి చెందిన జనగాం లావణ్య ఫోక్సాంగ్స్ పాడి పల్లె జనం, పట్టణ ప్రజల అభిమానం చురగొంటున్నారు. గ్రామీణ ప్రాంతమైన ఇప్పలపల్లిలో నివాసముంటూ భర్త రవీందర్ ప్రోత్సాహంతో నటనలోనూ సత్తా చూపుతున్నారు. బతుకమ్మ, పెళ్లి, వాన పాటలే కాకుండా.. వేములవాడ రాజన్న, కొండగుట్ట అంజన్న, కొమురవెల్లి మల్లన్న దేవతామూర్తుల పాటలు పాడుతూ భక్తుల గుండెల్లో చోటు సాధించారు. ఎల్ఆర్ పోక్స్ పేరిట య్యూటూబ్‌లో పాటలు, షార్ట్ఫిల్్మలు విడుదల చేస్తున్నారు. భర్త రవీందర్, కూతురు మైత్రి, కొడుకు మనోజ్‌కుమార్‌తో కలిసి నటించారు. 90 వరకు పాటలు, షార్ట్ఫిల్్మలలో నటించగా.. ఇప్పటివరకు 1.50లక్షల వ్యూయర్స్ ఉన్నారు. పాట పాడుతున్న లావణ్య -
'లగ్గం' రీల్ పెట్టు.. చీరపట్టు
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం చాలా కష్టమైన పని. మంచి కంటెంట్ ఉన్నా సరే.. ఆ సినిమా వచ్చిందనే విషయం తెలియక ప్రేక్షకులు థియేటర్స్‌కి వెళ్లడం లేదు. అందుకే మేకర్స్ వినూత్నమైన రీతిలో తమ సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఎలాగో అలా తమ చిత్రం రిలీజ్ అవుతుందనే విషయం ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తున్నారు. తాజాగా ‘లగ్గం’ సినిమా మేకర్స్ కూడా వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లె ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో చీరల పండుగ పేరుతో రీల్ పెట్టు - చీర పట్టు అనే కార్యక్రమంకు శ్రీకారం చుట్టారు. ఆసక్తి కలిగిన యువకులు ఇన్‌స్టాగ్రామ్‌లో లగ్గం సినిమాకు సంభందించి పాటలకు గానీ లేదా టీజర్ లో డైలాగ్స్ కు గాని తమ స్టైల్ లో రీల్ లేదా యూట్యూబ్ షాట్ చేసి 8885050729 నెంబర్ కు పంపితే చీర ను గిఫ్ట్ గా అందిస్తారట. అయితే ఈ బహుమతి పొందాలంటే.. వారి అకౌంట్ లో పోస్ట్ చేసి లగ్గం పేజీ కి టాక్ చెయ్యాలట.లగ్గం విషయాలకొస్తే.. ఇది తెలంగాణ నేపథ్యంలో సాగే సినిమా ఇది. సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రమేశ్ చెప్పాల కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం వహిస్తున్నారు. సుబిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 25న విడుదల కానుంది. -
లగ్గం రెడీ
సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్, ఎల్బీ శ్రీరామ్, రఘుబాబు, రోహిణి ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘లగ్గం’. రమేష్ చెప్పాల దర్శకత్వంలో వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 25న ఏషియన్ సురేష్ సంస్థ ద్వారా రిలీజ్ అవుతోంది. ఈ రిలీజ్ పోస్టర్‌ను ఆవిష్కరించి, యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు హీరో సుధీర్‌బాబు. ‘‘తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నటీనటులు పూర్తి తెలంగాణ యాస మాట్లాడకుండా వాడుక భాషలో మాట్లాడతారు’’ అన్నారు రమేష్ చెప్పాల. ‘‘ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చూడాల్సిన చిత్రం ఇది’’ అన్నారు వేణుగోపాల్ రెడ్డి. -
అక్టోబర్ 25న ‘లగ్గం’
సాయిరోనాక్, ప్రగ్యా నగ్రా జంటగా నటిస్తున్న చిత్రం ‘లగ్గం’. రమేష్ చెప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. వేణుగోపాల్ రెడ్డి నిర్మాత. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన టీజర్ కు, పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లగ్గం సినిమా అక్టోబర్ 25న ఏషియన్ సురేష్ ద్వారా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా "రిలీజ్ డేట్ లాంచింగ్ పోస్టర్" ప్రముఖ హీరో సుధీర్ బాబు రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది తెలంగాణ నేపథ్యంలో జరిగే తెలుగు సినిమా. చిత్రంలో నటీనటులు పూర్తి తెలంగాణ యాస మాట్లాడకుండా వాడుక భాషలో మాట్లాడుతారు. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుంది. ఇది లగ్గం నామ సంవత్సరం కాబోతుందని దర్శకుడు ధీమా వ్యక్తం చేశాడు.‘కుటుంబమంతా కలిసి చూడాల్సిన సినిమా లగ్గం" అని నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు అన్నారు. "ప్రతి ప్రవాస భారతీయులు తప్పకుండా చూడల్సిన సినిమా. ప్రతి ఆడపిల్ల తండ్రి కూతురికి పెళ్లి చేసేముందు ఈ సినిమా చూడాలి’ అని ఎల్బి శ్రీరాం అన్నారు.