ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 20 మంది
25న విడుదల కానున్న సినిమా
విద్యానగర్(కరీంనగర్): పెళ్లి అంటే రెండు కుటుంబాలు కలవడమే కాదు.. రెండు మనసులు కలవడం అన్న అంశంతో తెలంగాణ పెండ్లి సంప్రదాయాన్ని పెద్ద తెరపై ఆవిష్కరిస్తున్నారు మనోళ్లు. ‘లగ్గం’ పేరున సినిమాను కామారెడ్డికి చెందిన వేణుగోపాల్‌రెడ్డి నిర్మించగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తికి చెందిన చెప్పాల రమేశ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సినీ, యూట్యూబ్ స్టార్స్ ఆర్‌ఎస్ నంద, గుండ మల్ల య్య, రాధిక, తెలంగాణ లక్ష్మి, మిమిక్రి మహేశ్, సత్య ఎలేశ్వరం, సినీ పోస్టర్, టైటిల్ డిజైనర్ విష్ణువర్దన్‌రెడ్డి, అర్చిత, కాంతరెడ్డితోపాటు మరో 10మంది వరకు నటించడం విశేషం. లగ్గం సినిమా ఈనెల 25న విడుదల కానుంది.
పాటే ఆమె ప్రాణం..
శంకరపట్నం(మానకొండూర్): ఇప్పలపల్లి గ్రామానికి చెందిన జనగాం లావణ్య ఫోక్‌సాంగ్స్ పాడి పల్లె జనం, పట్టణ ప్రజల అభిమానం చురగొంటున్నారు. గ్రామీణ ప్రాంతమైన ఇప్పలపల్లిలో నివాసముంటూ భర్త రవీందర్ ప్రోత్సాహంతో నటనలోనూ సత్తా చూపుతున్నారు. బతుకమ్మ, పెళ్లి, వాన పాటలే కాకుండా.. వేములవాడ రాజన్న, కొండగుట్ట అంజన్న, కొమురవెల్లి మల్లన్న దేవతామూర్తుల పాటలు పాడుతూ భక్తుల గుండెల్లో చోటు సాధించారు. ఎల్‌ఆర్ పోక్స్ పేరిట య్యూటూబ్‌లో పాటలు, షార్ట్‌ఫిల్‌్మలు విడుదల చేస్తున్నారు. భర్త రవీందర్, కూతురు మైత్రి, కొడుకు మనోజ్‌కుమార్‌తో కలిసి నటించారు. 90 వరకు పాటలు, షార్ట్‌ఫిల్‌్మలలో నటించగా.. ఇప్పటివరకు 1.50లక్షల వ్యూయర్స్ ఉన్నారు.
పాట పాడుతున్న లావణ్య
Comments
Please login to add a commentAdd a comment