Director
-
ముంబయిలో దర్శకుడు శ్యామ్ బెనెగల్ అంత్యక్రియలు (ఫొటోలు)
-
భాగ్యనగర్ కా బెనగళ్..
సాక్షి, హైదరాబాద్: విఖ్యాత సినీ దర్శకుడు శ్యామ్ బెనగళ్‌కు నగరంతో విడదీయరాని అనుంబంధం ఉంది. ఆయన చదువు ఇక్కడే కొనసాగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని నిజాం కళాశాల నుంచి ఆరి్థక శాస్త్రంలో శ్యామ్ బెనగళ్ పట్టభద్రుడయ్యాడు. అదే సమయంలో ఆయన హైదరాబాద్ ఫిల్మ్ సొసైటీని ప్రారంభించారు. నాన్నే తొలి గురువు... నగరంలో ఉండగానే తన సినిమా ప్రయాణాన్ని ప్రారంభించారు శ్యామ్ బెనగళ్. ఆయన తండ్రి నగరంలో ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌గా ప్రాచుర్యం పొందాడు. ఖాళీ సమయాల్లో ఆయన 16 ఎంఎం కెమెరాతో తన పిల్లలతోనే సినిమాలను షూట్ చేసేవారు. ఆయన దగ్గర ఈ సినిమాల భారీ కలెక్షన్ ఉంది. శ్యామ్ బెనగళ్ది పెద్ద కుటుంబం. ఆయనతో కలిపి పది మంది పిల్లలు. ‘నాకు మా నాన్న తొలిగా సినిమా గురించి అవగాహన కల్పించారు. మా డిన్నర్ తర్వాత వినోదం.. మా నాన్న రూపొందించిన చిత్రాలను చూడటమే. సినిమాతో నా ప్రమేయం అలా మొదలై చివరికి నన్ను ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకర్‌గా మార్చింది’ అంటూ శ్యామ్ బెనగళ్ గుర్తు చేసుకునేవారు. తన తండ్రికి చెందిన 16 ఎంఎం సినిమా కెమెరాతో వేసవి సెలవుల్లో తన అన్నదమ్ములు, కజిన్లు కలిసినప్పుడు తాను తీసిన ‘చుటియో మే మౌజ్ మజా (సెలవుల్లో వినోదం, ఆటలు)’ తన మొదటి సినిమాగా ఆయన పేర్కొంటారు. కంటోన్మెంట్ ఏరియాలో... సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఏరియాలో తాము నివసించే ప్రదేశానికి దగ్గరగా ఉన్న ఆర్మీ గ్యారీసన్‌లో సినిమా ప్రదర్శనలు ఉండేవనీ, ప్రధానంగా సైన్యం కోసం ఉద్దేశించిన ఆ ప్రదేశంలో వారాంతంలో ఆంగ్ల భాషా చిత్రంతో పాటు, వివిధ భారతీయ భాషలలోని చలనచిత్రాలు ప్రదర్శించేవారని ఆయ న తన చిన్ననాటి స్మృతులను నెమరేసుకునేవారు. అనుబంధం..అపురూపం... ‘హైదరాబాద్ నా జన్మభూమి’ అని శ్యామ్ బెనగళ్ సగర్వంగా చెప్పేవారు. తాను జని్మంచిన నగరం గురించి ‘నేను ఇక్కడ పెరిగాను, నా పాఠశాల కళాశాల ఇక్కడే. ఇక్కడ మరే ఇతర ప్రదేశంలో లేని విశిష్టమైన స్వభావం, మిశ్రమ సంస్కృతి దీని సొంతం’ అంటూ కొనియాడేవారు. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన నిజాం కాలేజ్‌లో చదువుకున్న తాను ప్రస్తుతం పిల్లల చదువు గురించి ఆందోళన చెందుతున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘విశ్వవిద్యాలయం ఇప్పటికీ గొప్పగా ఉంది, కానీ అక్కడ రాజకీయ ప్రమేయం పెరిగింది’ అంటూ ఆయన తాను చదువుకున్న ఉస్మానియా గురించి గతంలో ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ నేపథ్యంలో మరో చిత్రం తీస్తానన్నారు... తన సినిమాలపై తెలంగాణ ప్రభావం గురించి మాట్లాడుతూ తన సినిమాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన ‘అంకుర్, నిషాంత్, మండి చిత్రాలపై ఈ ప్రాంత ప్రభావం ఉందని బెనగళ్ అనేవారు. తెలంగాణ నేపథ్యంలో మరొక కథ దొరికితే, తాను ఖచి్చతంగా దాన్ని కూడా సినిమాగా మలుస్తాను అంటూ ఈ రాష్ట్రంపై ప్రేమను చాటేవారాయన. అనుగ్రహం అనే తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన బెనగళ్‌కు తెలుగు మాట్లాడటం అంతగా రాదు.‘నాకు తెలుగు బాగా అర్థం అవుతుంది కానీ మాట్లాడటం కొంచెం కష్టమవుతుంది’ అనేవారు. తాను హైదరాబాద్‌ను విడిచిపెట్టి 50 సంవత్సరాలకు పైనే అవుతున్నా, ఈ సిటీపై ఇష్టానికి దూరం కాలేదంటారు. ‘ఇది సినిమా క్రేజీ సిటీ. ఇక్కడ భారీ సంఖ్యలో ప్రేక్షకులు సినిమాలు చూస్తారు. చాలా మంది మంచి దర్శకులు, నిర్మాతలు ఇక్కడ ఉన్నారు’ అంటూ కొనియాడేవారు. ఆయన ఇప్పుడు లేకున్నా..ఆ మంచి దర్శక నిర్మాతలకు ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఎప్పటికీ ఉంటుందనేది వాస్తవం. -
సమాంతర సినిమా సృష్టికర్త శ్యామ్ బెనగళ్
శ్యామ్ బెనగళ్– ఈ పేరు ఈ తరం ప్రేక్షకులకి తెలిసి ఉండవచ్చు. కానీ సినిమాలు తెలిసి ఉండక పోవచ్చు. భారతీయ సినిమా భాషా భేదాలు లేకుండా కమర్షియల్ సినిమాల ప్రవాహంలో కొట్టుకుపోతున్న రోజుల్లో ప్రవాహానికి ఎదురీదిన వాడు, సమాంతర (పారలల్ ) సినిమాకి ఊపిరి పోసిన వాడు శ్యామ్ బెనగళ్. ఆయన పూర్తి పేరు బెనగళ్ళ శ్యామ్ సుందర రావు. సికింద్రాబాద్‌లో డిసెంబరు 14, 1934న జన్మించారు. సరిగ్గా 90 సంవత్సరాల 9 రోజులు ఈ భూమి మీద బతికారు. భారతీయ సినిమా రంగంలో ఇకపై ఎన్ని వందల ఏళ్ళు శ్యామ్ బెనగళ్ జీవించి ఉంటారనేది చరిత్ర చెబుతుంది. తెలంగాణ– ఆయనకి ఊహ తెలిసేటప్పటికి ఇంకా నిజాం పాలనలోనే ఉంది. అప్పటి దొరల దౌర్జన్యాలు, పెత్తందారీతనాలు– అట్టడుగు ప్రజల, ముఖ్యంగా స్త్రీల కన్నీటి కథలు– శ్యామ్ బెనగళ్ గుండెలపై చెరగని జ్ఞాపకాలు అయ్యాయి. అందుకే తన మొదటి సినిమా అంకుర్ – ఇదే తెలంగాణ నేపథ్యంలో తీశారు. అప్పటిలో నిజాం రాజ్యంలో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్నిప్రాంతాలు కలిసి ఉండేవి. ఈ మూడుప్రాంతాల సంస్కృతులు, నేపథ్యాలు – శ్యామ్ బెనగళ్ని వెంటాడాయి. యాడ్ ఏజన్సీ లో కాపీ రైటర్‌గా కెరీర్‌ని ఆరంభించినా – ఆయన దృష్టి సినిమాల మీదే ఉండేది . కమర్షియల్ సినిమాల ప్రభంజనంలో – ఆర్టిఫిషియల్ హీరోలను కాకుండా– జీవితాన్ని – సమాజం లోని పాత్రల్ని వాస్తవికంగా తెరపై ఆవిష్కరించాలనుకున్నాడు శ్యామ్. హైదరాబాద్‌లో ఫిలిమ్ సొసైటీప్రారంభించిన వ్యక్తి శ్యామ్ బెనగళ్. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన అత్యున్నతమైన సినిమాల ప్రింట్లు అతి కష్టం మీద తెప్పించుకుని, సినిమా లవర్స్ కోసం హైదరాబాద్ ఫిలిమ్ సొసైటీలో ప్రదర్శిస్తుండే వారు. తెలిసిన జీవితాలు, చూసిన సినిమాలు శ్యామ్ బెనగళ్ ఆలోచనల్లో పారలల్ సినిమా ప్రపంచాన్ని çసృష్టించాయి . కొత్త కథలు చెప్పాలి, జనం మస్తిష్కాలు కదిలించాలని శ్యామ్ బెనగళ్లో ‘అంకుర్’ సినిమాతో భారతీయ సినిమా తెరపై తన సంతకాన్ని పెట్టారు.1978–1980 మధ్య తెలుగు సినిమా అడవి రాముడు నుంచి శంకరాభరణం సినిమాల మధ్య బాక్సాఫీస్ ఊయలలు ఊగుతుండగా, ఓ బ్రహ్మాండమైన మలుపు తిరగబోయి ఆగిపోయింది. సినిమా గర్వించదగ్గ గొప్ప దర్శకుల్లో కొందరు– శ్యామ్ బెనగళ్, మృణాల్ సేన్, గౌతమ్ ఘోష్ – తెలుగు ప్రేక్షకుల అభిరుచికి, ఆమోదానికి ఫిదా అయ్యారేమో తెలియదు కానీ – హిందీలో కాకుండా తెలుగులో పారలల్ సినిమాలు తీశారు. ‘మా భూమి’ అంటూ గౌతమ్ ఘోష్ అత్యద్భుతమైన సినిమాలు అందించారు. వీరి మధ్యలో శ్యామ్ బెనగళ్ మరాఠీ నవల ఆధారంగా తెలుగులో ‘అనుగ్రహం’ సినిమా తీశారు. తెలుగుతో పాటు హిందీలో ఇదే కథతో కొండూర– టైటిల్‌తో పారలల్‌గా తీశారు. రెండింటిలో అప్పటి అగ్ర కథానాయిక వాణిశ్రీ హీరోయిన్. అనంత్ నాగ్ హీరో . స్మితా పాటిల్ తెలుగులో నటించిన సినిమా ఇదే! అలాగే అమ్రేష్ పురి జగదేక వీరుడు – అతిలోక సుందరి మొదలైన వాటి కన్నా చాలా చాలా ముందు తెలుగులో నటించిన సినిమా అనుగ్రహం. తెలుగులో ఆరుద్ర, గిరీష్ కర్నాడ్‌తో కలిసి స్క్రీన్ ప్లే రాశారు శ్యామ్ బెనగళ్. ఆరుద్ర మాటలు– పాటలు రాశారు. రావు గోపాలరావు గుర్తుండి పోయే పాత్ర చేశారు. అయితే శ్యామ్ బెనగళ్ చెప్పిన కథా విధానం అప్పటి ప్రేక్షకులకి రుచించ లేదనే చెప్పాలి. ఆ రోజుల్లో అభిరుచి ఉన్న ప్రేక్షకులు అంకుర్, నిషాంత్ , మంథన్ , భూమిక – ఏ ఫిలిమ్ సొసైటీల్లో చూపిస్తారా అని తిరుగుతుండేవారు. సగటు ప్రేక్షకులేమో ఈయనేంటి – వేరే కథలు చెబుతున్నారు – మనకి తెలియని జీవితపు కోణాలు పట్టుకుంటున్నారు అని డిస్ట్రబ్ అవుతుండే వారు. ఎదిగిన కొద్దీ ప్రేక్షకులకు శ్యామ్ బెనగళ్ను ఇంకొంచెం అర్థం చేసుకునే అవకాశం దొరికింది. అనంత్ నాగ్, షబానా అజ్మీ , నసీరుద్దీన్ షా , ఓం పురి , స్మితా పాటిల్ , అమ్రేష్ పురి , లాంటి గొప్ప నటుల్ని కనుగొన్న కొలంబస్ – శ్యామ్ బెనగళ్. ముఖ్యంగా మన దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియా ఆధారంగా శ్యామ్ బెనగళ్ దూరదర్శన్ కోసం తీసిన సీరియల్ ఎప్పటికీ గుర్తుంచు కోదగ్గది. ముస్లిమ్ మహిళల జీవితాలను çస్పృశిస్తూ మమ్ము, సర్దారీ బేగమ్, జుబేదా అని మూడు సినిమాలు రూపొందించారు. కమర్షియల్‌గా ఫెయిల్ అయినప్పటికీ – మహా భారతాన్ని ఓ బిజినెస్ సామ్రాజ్యానికి అన్వయిస్తూ శశి కపూర్ తీయించిన ‘కలియుగ్’ శ్యామ్ బెనగళ్ ప్రయోగం. 23 డిసెంబర్ 2024న కన్ను మూశారు శ్యామ్ బెనగళ్. కన్ను మూసినా ఆయన ఆలోచనల్లో తీరని కలలు చెప్పని కథలు ఏమున్నాయో మనకి తెలియదు. కానీ కొత్త తరం రచయితలు, దర్శకులు శ్యామ్ బెనగళ్ స్ఫూర్తితో ఏ కొత్త సినిమాని పరిచయం చేస్తారోనని ఎదురు చూద్దాం. – తోట ప్రసాద్, సినీ రచయితసంతాపంసువర్ణాధ్యాయం ముగిసిందిభారతీయ సినిమా, టెలివిజన్ రంగాల్లోని ఓ సువర్ణాధ్యాయం శ్యామ్‌బెనగళ్ మరణంతో ముగిసింది. కొత్త తరహా సినిమాలనుప్రారంభించి, క్లాసిక్ సినిమాలను రూపొందించారు. నిజమైన ఇన్స్టిట్యూషన్కు ఆయన ఓ నిదర్శనం. ఎందరో కళాకారులను, నటులను తీర్చిదిద్దారు. సినిమా పరిశ్రమకు శ్యామ్ బెనగళ్ చేసిన సేవలు దాదాసాహెబ్ ఫాల్కే, పద్మభూషణ్ పురస్కారంతో సహా ఎన్నో విశిష్ట పురస్కారాలు అందుకున్నాయి. ఆయన కుటుంబ సభ్యులకు, ఎంతోమంది ఆయన అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. – భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతీవ్రంగా బాధించిందిశ్యామ్ బెనగళ్ గారి మరణం తీవ్రంగా బాధించింది. ఆయన కథలు ఇండియన్ సినిమాపై ఎంతో ప్రభావాన్ని చూపాయి. ఆయన ప్రతిభ ఎప్పటికీ ప్రజాదరణకు నోచుకుంటూనే ఉంటుంది. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. – భారత ప్రధానమంత్రి నరేంద్రమోదిఫిలిం మేకర్స్‌కు స్ఫూర్తిసమాంతర సినిమాకు నిజమైన మార్గదర్శకుడు, ఆలోచింపజేసే కథ, కథనాలు, సామాజిక సమస్యలతో సినిమాల ద్వారా చిత్ర పరిశ్రమపై తనదైన ముద్ర వేశారు బెనగళ్. 18 జాతీయ చలన చిత్ర అవార్డులతో సహా ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్, దాదాసాహెబ్ఫాల్కే అవార్డులను అందుకున్నారు. ఆయన చరిత్ర ఫిల్మ్‌మేకర్స్‌కు స్ఫూర్తినిస్తుంది. – కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేభావితరాలకు ప్రేరణవిజనరీ ఫిల్మ్‌మేకర్ శ్యామ్ బెనగళ్ గారి మరణవార్త బాధిస్తోంది. సినిమాల్లో అద్భుతంగా సాగిన ఆయన ప్రయాణం, సామాజిక అంశాలపై అంకితభావంతో ఆయన చేసిన సినిమాలు భావితరాలకు ప్రేరణగా నిలుస్తాయి. – కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీసాంస్కృతిక సంపదమన దేశంలోనే అత్యుత్తమ ఫిల్మ్‌మేకర్, మేధావి అయిన శ్యామ్ బెనగళ్గారి మరణం నన్ను బాధించింది. సినిమా రంగంలోని ప్రతిభావంతులను గుర్తించి, ్రపోత్సహించారు. ఆయన తీసిన సినిమాలు, జీవిత చరిత్రలు, డాక్యుమెంటరీలు భారతదేశ సాంస్కృతిక సంపదలో భాగమయ్యాయి. సహచర హైదరాబాదీ వాసి, మాజీ రాజ్యసభ సభ్యులు అయిన బెనగళ్గారి అద్భుతమైన చిత్రాలు, భారతీయ సినిమాలో ఎప్పటికీ మన్ననలు పొందుతూనే ఉంటాయి. – చిరంజీవి -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. డైరెక్టర్ శ్యామ్ బెనగల్ కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ డైరెక్టర్ శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధుపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.శ్యామ్ బెనగల్ సినీ ప్రస్థానం1934 డిసెంబర్ 14న హైదరాబాద్‌లో జన్మించిన ఆయన పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఉస్మానియా వర్సిటీలో ఎంఏ విద్యను అభ్యసించారు. ఆయన దర్శకత్వ ప్రతిభకుగానూ దాదాసాహెబ్ ఫాల్కే పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి సినీ అత్యున్నత అవార్డులు అందుకున్నారు. 1976లో పద్మశ్రీ అవార్డ్ అందుకున్నారు. అంకుర్ (1974) అనే చిత్రం ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత నిశాంత్ (1975), మంథన్ (1976), భూమిక, జునూన్ (1978), మండి (1983, త్రికాల్ (1985), అంతర్నాద్ (1991) లాంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.అనేక అవార్డులు- ప్రశంసలుదాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్-2005పద్మశ్రీ -1976పద్మ భూషణ్-1991ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత పురస్కారం- 2003ఏఎన్నార్ జాతీయ అవార్డ్-2013నిశాంత్ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు -1976మంథన్ సినిమాకు ఉత్తమ జాతీయ చలనచిత్ర అవార్డు- 1977జునూన్ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు -1980 -
శ్రీతేజ్‌ను పరామర్శించిన పుష్ప-2 డైరెక్టర్ సుకుమార్
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడిని డైరెక్టర్ సుకుమార్ పరామర్శించారు. హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన సుకుమార్.. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మా తరఫున బాలుడి కుటుంబానికి అవసరమైన సాయాన్ని అందిస్తామని సుకుమార్ హామీ ఇచ్చారు. అయితే అంతకుముందే సుకుమార్ భార్య తబిత బాలుడికి కుటుంబానికి ఆర్థికసాయం అందించారు. డిసెంబర్ 9వ తేదీన శ్రీతేజ్ తండ్రికి రూ.5 లక్షల సాయం చేశారు.అసలేం జరిగిందంటే..ఈనెల 5న అల్లు అర్జున్ మూవీ పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. అయితే ముందురోజే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలు ప్రదర్శించారు మేకర్స్. డిసెంబర్ 4న సినిమా వీక్షించేందుకు అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు వెళ్లారు. అదే సమయంలో అభిమాన హీరోను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్‌పై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆ బాలుడు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.అల్లు అర్జున్‌పై కేసు..సంధ్య థియేటర్ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో హీరో అల్లు అర్జున్ను నిందితుడిగా చేర్చారు. అంతేకాకుండా బన్నీని అరెస్ట్ చేసి రిమాండ్‌కు కూడా తరలించారు. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో మరుసటి రోజు ఉదయమే జైలు నుంచి విడుదలయ్యారు. -
అలా జరిగితే దేవుళ్లను కూడా అరెస్ట్ చేస్తారా?.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై ఆర్జీవీ రియాక్షన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో బన్నీని అరెస్ట్ చేయడంపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా పోలీసులు, అధికారులకు తనదైన శైలిలో ప్రశ్నలు సంధించారు. నాలుగు రకాల ప్రశ్నలతో ఆయన ట్వీట్ చేశారు.సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన అధికారులకు ఆర్జీవీ వేసిన ప్రశ్నలు నెట్టింట వైరల్‌గా మారాయి. అవేంటో మీరు కూడా చూసేయండి. పుష్కరాలు ,బ్రహ్మోత్సవాలు లాంటి ఉత్సవాల్లో తోపులాటలో భక్తులు పోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా ? అంటూ ప్రశ్నించారు. అలాగే ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులని అరెస్ట్ చేస్తారా ? అని ట్విటర్ వేదిక నిలదీశారు.ఆర్జీవీ నాలుగు ప్రశ్నలు ఇవే..1.పుష్కరాలు , బ్రహ్మోత్సవాల్లాంటి ఉత్సవాల తోపులాటలో భక్తులు పోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా ?2.ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులని అరెస్ట్ చేస్తారా ?3. ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో ఎవరైనా పోతే హీరో , హీరోయిన్లని అరెస్ట్ చేస్తారా ?4. భద్రత ఏర్పాట్లు పోలీసులు ఆర్గనైజర్లు తప్ప ఫిలిం హీరోలు ,ప్రజా నాయకులూ ఎలా కంట్రోల్ చెయ్యగలరు ? . @alluarjun కేసు గురించి సంబంధిత అధికారులకి నా 4 ప్రశ్నలు . 1.పుష్కరాలు , బ్రహ్మోస్తవాల్లాంటి ఉత్సవాల్లో తోపులాటలో భక్తులు పోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా ?2.ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులని అరెస్ట్ చేస్తారా ?3.ప్రీ రిలీజ్…— Ram Gopal Varma (@RGVzoomin) December 13, 2024 -
కూతురిని కూడా ఇండస్ట్రీలోకి తెచ్చిన రవితేజ!?
తెలుగు హీరోలు చాలామంది తమ కొడుకుల్ని హీరోలుగా పరిచయం చేస్తారు గానీ కూతుళ్లని హీరోయిన్లని చేయడానికి ఇష్టపడరు. మిగతా విభాగాల్లో పనిచేసే విషయమై కూడా పెద్దగా ప్రోత్సహించారు. కానీ రవితేజ మాత్రం అలా కాదని నిరూపిస్తున్నాడు. ఎందుకంటే ఇతడి కూతురు దర్శకత్వం నేర్చుకుంటోందట.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 18 సినిమాలు)సినీ నేపథ్యం లేకుండా వచ్చి టాలీవుడ్లో స్టార్ హీరో అయ్యాడు రవితేజ. ఇతడికి కొడుకు మహాధన్, కూతురు మోక్షద ఉన్నారు. కొడుకు ఇదివరకే 'రాజా ది గ్రేట్' మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాడు. ప్రస్తుతం ఓ దర్శకుడి దగ్గర సహాయకుడిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ కూతురు కూడా ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తోందట.ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ తీస్తున్న ఓ సినిమాకు రవితేజ కూతురు మోక్షద.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తుందట. గతంలో రవితేజ కూడా ఇలానే సహాయ దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టాడు. తర్వాత నటుడు అయ్యాడు. బహుశా మోక్షద కూడా ఇలా మొదట దర్శకత్వంలో మెలకువలు నేర్చుకుని, నటి అవుతుందేమో చూడాలి?(ఇదీ చదవండి: మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన 'మెకానిక్ రాకీ') -
'కలర్ ఫోటో' డైరెక్టర్ సందీప్ రాజ్ రిసెప్షన్.. హాజరైన నిహారిక (ఫొటోలు)
-
తిరుమలలో నటితో తెలుగు డైరెక్టర్ పెళ్లి.. హాజరైన ప్రముఖులు (ఫోటోలు)
-
సారా టెండుల్కర్‌కు కొత్త బాధ్యతలు.. సచిన్ ట్వీట్ వైరల్ (ఫొటోలు)
-
నా పోస్ట్‌పై ఏడాది తర్వాత కేసులు పెట్టడమేంటి? : రాం గోపాల్ వర్మ
ఏపీలో తనపై నమోదైన కేసులపై టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మాట్లాడారు. ఏడాది క్రితం తాను పెట్టిన పోస్టుపై ఎవరి మనోభావాలో దెబ్బతిన్నాయని కేసులు పెట్టడం ఏంటో నాకర్థం కావడం లేదన్నారు. ఒక ఏడాదిలో నేను వందల పోస్టులు పెడతానని.. కానీ అవన్నీ నాకు గుర్తుండవని ఆర్జీవీ తెలిపారు. నేను పోస్ట్ పెట్టిన ఏడాది తర్వాత నలుగురు, ఐదుగురు ఎందుకు కేసులు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో తనపై నమోదైన కేసులపై స్పందించారు.గతనెల 25న విచారణకు రావాలని పోలీసులు నోటీసులు పంపించారని ఆర్జీవీ వెల్లడించారు. ఆ తర్వాత నేను పోలీసులకు మేసేజ్ పెట్టానని.. కానీ వాళ్లు కొందరు మీడియావాళ్లతో కలిసి వచ్చారని తెలిపారు. దానికి ఆ మీడియా సంస్థలు ఏవేవో కథనాలు రాశాయని ఆర్జీవీ అన్నారు. సోషల్ మీడియా కంటే ముందుగా మెయిన్ స్ట్రీమ్ మీడియా నన్ను టార్గెట్ చేసి పోస్టులు పెడుతున్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఎవరెవరో ఏవేవో రాస్తారని.. నేను టీవీ ఛానెల్స్‌కి ఇంటర్వ్యూ ఇస్తుంటే పారిపోయాడంటూ ప్రచారం చేశారని రాంగోపాల్ వర్మ వెల్లడించారు.(ఇది చదవండి: రాంగోపాల్ వర్మ పిటిషన్.. ఏపీ హైకోర్టులో ఊరట)గవర్నమెంట్ మారినా పోలీసులు ఇంకా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారని కొందరు తప్పుడు కథనాలు ప్రసారం చేశారని అర్జీవీ అన్నారు. మీ అభిప్రాయం చెప్పినప్పుడు.. నా అభిప్రాయంగా కూడా తీసుకోవాలి కదా.. అదే స్పిరిట్ అని ప్రశ్నించారు. నాపై కూడా ఎన్నో మీమ్స్ వస్తుంటాయి.. నేను ఏదైనా పోస్ట్ పెడితే 90శాతం నెగిటివ్ కామెంట్స్ ఉంటాయని ఆయన తెలిపారు. ఇంత మంది ఒకేసారి కేసులు పెట్టడంపై ముందస్తు బెయిల్‌కు పిటిషన్ వేసినట్లు వెల్లడించారు.అయితే నేను వ్యూహం రిలీజ్ టైములో పొలిటికల్ సినిమా తీయనని చెప్పానని.. ఆ మూవీ విషయంలో సెన్సర్ వాళ్లతో ఇబ్బంది పడి ఇక చేయనని చెప్పినట్లు ఆర్జీవీ క్లారిటీ ఇచ్చారు. పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి డెన్‌కు వచ్చామని పోలీసులు ఎక్కడా చెప్పలేదని తెలిపారు. కాగా.. సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్టులపై కొందరు ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పటికే ఆ కేసులను క్వాష్ చేయాలంటూ ఆర్జీవీ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
రాంగోపాల్ వర్మ పిటిషన్.. ఏపీ హైకోర్టులో ఊరట
టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట లభించింది. తాను చేసిన ఒక్క పోస్ట్‌పై రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులను క్వాష్ చేయాలని కోరుతూ ఆర్జీవీ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం తదుపరి విచారణను తొమ్మిదో తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే సోమవారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం తరఫున న్యాయవాదికి సూచించింది.కేసులకు భయపడటం లేదు: ఆర్జీవీఆంధ్రప్రదేశ్లో తనపై నమోదైన కేసులకు సంబంధించి తాను భయపడటం లేదని రాంగోపాల్‌వర్మ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇటీవల తన కోసం పోలీసులు గాలిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఏడాది క్రితం తాను చేసిన ట్వీట్లకు ఎవరి మనోభావాలో దెబ్బతిన్నాయని ఆయన ప్రశ్నించారు. ఆ ట్వీట్లతో సంబంధం లేని వారి మనోభావాలు ఎలా దెబ్బతింటాయని ఆయన అన్నారు. సంబంధంలేని వ్యక్తులు ఫిర్యాదు చేస్తే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ఆయన వీడియోలో పేర్కొన్నారు. కాగా.. ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఆర్జీవీపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. -
ఎన్టీఆర్ హీరోయిన్ను పరిచయం చేసిన వై.వి.ఎస్.చౌదరి (ఫోటోలు)
-
సన్ ఆఫ్ సర్దార్ డైరెక్టర్ ఇంట్లో తీవ్ర విషాదం
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అశ్విని ధీర్ కుమారుడు మృతి చెందారు. ముంబైలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేపై జరిగిన కారు ప్రమాదంలో జలజ్ (18) దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో అతనితో పాటు స్నేహితుడు కూడా మరణించారు. ఈ ఘటనతో దర్శకుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.నవంబర్ 23న ముంబయిలోని విలే పార్లేలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేలోని సహారా స్టార్ హోటల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తన స్నేహితులైన సాహిల్ మెంధా (18), సర్త్ కౌశిక్ (18), జెడాన్ జిమ్మీ (18)తో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సాహిల్, జెడాన్ స్వల్ప గాయాలతో బయటపడగా.. సర్త్, జలజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. డ్రైవింగ్ చేస్తున్న సాహిల్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని ముంబయి పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో కారు 120 కిలోమీటర్లకు పైగా స్పీడుతో వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.కాగా.. బాలీవుడ్ దర్శకుడు అశ్విని ధీర్ తన కెరీర్లో పలు చిత్రాలను తెరకెక్కించారు. సన్ ఆఫ్ సర్దార్, ఉ మే ఔర్ హమ్, అతిథి తుమ్ కబ్ జావోగే లాంటి చిత్రాలను రూపొందించారు. అంతేకాకుండా సినిమాలతో పాటు హమ్ ఆప్కే హై ఇన్ లాస్, హర్ షాఖ్ పే ఉల్లు బైతా హై వంటి ప్రముఖ సీరియల్స్‌కు కూడా దర్శకత్వం వహించారు. కాగా.. 2017లో గెస్ట్ లిన్ లండన్ అనే సినిమాకు చివరిసారిగా దర్శకత్వం వహించారు. -
అలా చేస్తే కచ్చితంగా లీడర్ అవుతారు: పూరి జగన్నాధ్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇటీవల వరుస మ్యూజింగ్స్ రిలీజ్ చేస్తున్నారు. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా జీవితంలో ఎలా నడుచుకోవాలో తన మాటల ద్వారా మోటివేట్ చేస్తున్నారు. తాజాగా ప్లే ఫూలిష్ అనే కాన్సెప్ట్‌తో మరో కొత్త మ్యూజింగ్‌ను విడుదల చేశారు. అదేంటో మీరు కూడా చూసేయండి.పూరి మ్యూజింగ్స్‌లో మాట్లాడుతూ.. 'ది ఆర్ట్ ఆఫ్ ప్లేయింగ్ ఫూలిష్.. ఈ పోటీ ప్రపంచంలో సక్సెస్ అవ్వడానికి చాలామంది సైకాలజిస్టులు చెప్పే థియరీ ప్లే ఫూలిష్.. అది నీ బిజినెస్, జాబ్‌లో చాలామంది పోటీదారులు, సీనియర్స్, అనుభవజ్ఞులు ఉంటారు. నీకంటే బాగా సక్సెస్ అయినవాళ్లు ఉంటారు. వాళ్లందరినీ స్మూత్‌గా డీల్ చేసే థియరీ ప్లే ఫూలిష్. అంటే నిజంగానే ఫూల్‌లా ఉండటం కాదు. వాళ్ల ముందు తక్కువ నాలెడ్జ్ వాళ్లలా కనిపించడం. ఈ స్ట్రాటజీ మీరింకా నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అవతలి వ్యక్తి చెప్పే మాటలు వినటం నేర్చుకుంటే మనం ఎంత మాట్లాడాలి? ఎప్పుడు మాట్లాడాలి? అనే విషయాలు అర్థమవుతాయి. నీ పోటీదారులను ఎప్పుడు శత్రువులుగా చూడొద్దు. వారిని మెంటార్స్‌గా భావించండి. అతను, నువ్వు ఓకే బిజినెస్ చేస్తున్నా.. అతనికంటే నీకు తక్కువ తెలుసనే ఫీలింగ్ రావాలి' అని సూచించారు.ఇదేమీ మానిపులేటేడ్ టాక్టిక్ కాదు.. వాదించడం మానేసి.. జీనియస్‌గా వ్యవహరించడం.. నువ్వు తక్కువ నాలెడ్జ్ వాడిలా కనిపించినప్పుడు.. అవతలివాళ్లు నిన్ను ఇబ్బందిగా భావించరు. నీపై ఫోకస్ పెట్టరు. నీకు తెలిసినా సరే బేసిక్స్ చెప్పమని అడగండి. అలా అడిగితేనే అవతలివాళ్లు ఆనందంగా సమాధానం చెబుతారు. వాళ్లు ఏమనుకుంటున్నారో వినాలి.. అప్పుడే ఎక్కువ నేర్చుకుంటాం. నీవల్ల వాళ్లకి ఇబ్బంది లేదని ఫీలవ్వాలి. అప్పుడే వాళ్ల స్ట్రాటజీలు మీతో షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పోటీ ప్రపంచంలో చర్చలు జరపాలంటే నాలెడ్జ్ చాలా అవసరం. అది నీ సీనియర్స్, పోటీదారుల నుంచి నేర్చుకుంటే అంతకంటే కావాల్సింది ఏముంది? వాళ్ల స్కిల్స్ ఏంటో మీకు అర్థమవుతాయి. అందుకే మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎవరైనా చెబితే నేర్చుకుంటా అనేలా ఉండాలి. నీకే ఎక్కువ తెలిసినట్లు మాట్లాడితే.. అవతలి వ్యక్తి ఏది నీతో షేర్ చేసుకోడు. పైగా నువ్వు వాడి దృష్టిలో అహంకారిగా కనిపిస్తావు. అందరితో శత్రుత్వం మనకెందుకు? మీరు ఏదైనా అనుకుంటే అందులో సూచనలు చేయమని అడుగుతూ ఉంటే మంచిది. వాళ్లు మీ జీవితంలో సపోర్టింగ్ పర్సన్ అవుతాం. సోక్రటీస్ ఒకమాట చెప్పాడు. 'నాకు తెలిసింది ఏంటంటే.. ఏమీ తెలియదని'. మనం కూడా అదే ఫాలో అవ్వాలి. ఎప్పుడూ బిగినర్స్ మైండ్ సెట్‌తోనే ఉండాలి. అబ్రహాం లింకన్ ఇలాగే ఉండేవాడట. ఎదుటి వాడి జ్ఞానాన్ని తక్కువ అంచనా వేయొద్దు. మీకు ఎన్నో స్ట్రాటజీలు అర్థమవుతాయి. ప్లే ఫూలిష్ పవర్ఫుల్. ఈ ఆర్ట్‌లో మాస్టర్ అయితే మీరు లీడర్‌గా మంచి పొజిషన్లో ఉంటారు' అని చెప్పారు.కాగా.. ఈ ఏడాది డబుల్ ఇస్మార్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రామ్ పోతినేని, కావ్యథాపర్ జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రాన్ని ఛార్మి కౌర్, పూరి జగన్నాధ్ నిర్మించారు. -
‘వర్చువల్ విచారణకు హాజరవుతానని వర్మ ముందే చెప్పారు’
దర్శకుడు రాంగోపాల్ వర్మపై నమోదైన కేసులో ఏపీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్దకు చేరి ‘అరెస్ట్’ పేరిట హడాడివి చేశారు. అయితే.. వర్మ తాను ఫిజికల్‌గా హాజరయ్యేందుకు సమయం కోరిన విషయాన్ని ఆయన లాయర్ బాల మీడియాకు వివరించారు. ‘‘విచారణకు రెండు వారాల సమయం కోరాం. ఈలోపు వర్చువల్‌గా విచారణకు తాను హాజరవుతానని వర్మ ఇదివరకే చెప్పారు. ఫిజికల్‌గా విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం కావాలన్నారు అని న్యాయవాది తెలిపారు. అయితే.. ఇప్పటివరకు పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీ అందించలేదని ఆయన చెబుతున్నారు. అంతేకాదు.. తమకు ఇచ్చిన నోటీసుల్లోనూ ఎలాంటి ఆధారాలు చూపలేదని తెలిపారు. ఆర్జీవీ తన సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారని.. అందువల్లే డిజిటల్ విచారణకు హాజరవుతామని పోలీసులకు ముందే సమాచారం ఇచ్చామని న్యాయవాది స్పష్టం చేశారు. అయితే.. ఈలోపే ఏపీ ప్రకాశం జిల్లా పోలీసులు ఇవాళ హైదరాబాద్‌లోని ఆర్జీవీ ఇంటికి వచ్చారు. ఆయన కోసం వేచిచేస్తూ.. మీడియాలో హడావిడి ప్రదర్శించాక అక్కడి నుంచి వెనుదిరిగినట్లు సమాచారం. -
అలా చేస్తే సక్సెస్‌ఫుల్‌గా పనికి రాకుండా పోతారు: పూరి జగన్నాధ్
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈ ఏడాది డబుల్ ఇస్మార్ట్‌తో ప్రేక్షకులను అలరించాడు. రామ్ పోతినేని, కావ్యథాపర్ జంటగా నటించిన బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ చిత్రంలో బిగ్‌బుల్‌గా కనిపించారు.సినిమాల విషయం పక్కనపెడితే.. దర్శకుడు పూరి మ్యూజింగ్స్ పేరుతో మోటివేషనల్ సందేశాలు ఇస్తుంటారు. జీవితంలో తను అనుభవాలతో పాటు గొప్ప గొప్ప వ్యక్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని ఇలాంటి వాటిని పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఆయన చేసిన మరో గొప్ప సందేశాన్ని తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకుంటారు. అదేంటో మనం కూడా వినేద్దాం.పూరి మ్యూజింగ్‌లో మాట్లాడుతూ..' చైనాలో లావోజు అనే గ్రేట్ ఫిలాసఫర్ ఉన్నారు. ఆయన 571 బీసీలో జన్మించారు. ఆయనొక మంచి మాట చెప్పారు. నీ ఆలోచనలను గమనించు. ఎందుకంటే అవే నీ మాటలవుతాయి. నీ మాటలే నీ యాక్షన్స్ అవుతాయి. అవే నీ అలవాట్లు.. ఆ తర్వాత అదే నీ క్యారెక్టర్ అవుతుంది. మరి మనకు థాట్స్ ఎలా వస్తాయి. మనం రోజు దేన్నైతే చూస్తామో అవే గుర్తుకొస్తాయి. చదివే పుస్తకాలు, చూసే వీడియోలు, సంభాషణలన్నీ మన ఆలోచనలు మార్చేస్తాయి. పనికిరానివన్నీ చూస్తూ టైమ్ పాస్ చేస్తే అతి తక్కువ కాలంలో మీరు కూడా సక్సెస్‌ఫుల్‌గా పనికి రాకుండా పోతారు. ' అని అన్నారు.ఆ తర్వాత..' మనం మొబైల్లో రోజు ఎన్నో చూస్తుంటాం. రోడ్డెక్కితే ఏదో ఒకటి మనం చూస్తుంటాం. వీటిలో మనం దేనికైనా ఎమోషనల్ అయితే.. అందులోనే మనం కొట్టుకుపోతాం. రోజు నాలెడ్జ్ పెంచుకోకపోయినా ఫర్వాలేదు.. నాన్ సెన్స్ తీసుకోకపోతే చాలు. అందుకే మంచిది, మనకు పనికొచ్చేది మాత్రమే తీసుకుంటే మంచిది. అప్పుడే మన థాట్స్ మారతాయి. మన క్యారెక్టర్‌తో పాటు రాత కూడా మారుద్ది. ' అంటూ చెప్పుకొచ్చారు. ఏదేమైనా మన పూరి జగన్నాధ్ చెప్పినవి జీవితంలో పాటిస్తే సక్సెస్ అవ్వాలంటే తప్పకుండా పాటించాల్సిందే. -
హీరోయిన్ భానుప్రియను పెళ్లాడాలనుకున్నారా? డైరెక్టర్ ఆన్సరిదే!
సితార, అన్వేషణ, ఆలాపన, లేడీస్ టైలర్, చెట్టు కింద ప్లీడరు, గోపి గోపిక గోదావరి,అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు వంటి ఎన్నో విభిన్న సినిమాలను తెలుగు చిత్రపరిశ్రమకు అందించాడు డైరెక్టర్ వంశీ. హీరోయిన్ భానుప్రియను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా ఆయనే! చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.నా సినిమాతోనే భానుప్రియకు అలాంటి ఆఫర్లుభానుప్రియ తన కెరీర్ ఆరంభంలో ఏ సినిమా చేస్తే బాగుంటుందని నన్ను అడిగేది. సితార మూవీ తర్వాత తను బిజీ అయింది. అయితే తనకు మోడ్రన్ లుక్‌లో కనిపించే పాత్రలు రావడం లేదని అసంతృప్తి చెందేది. దీంతో నేను అన్వేషణ మూవీలో తనను గ్లామరస్‌గా చూపించాను. ఆ సినిమా బాగా ఆడింది. అప్పటినుంచి తనకు గ్లామర్ పాత్రలు వచ్చాయని తనే చెప్పింది. 35 ఏళ్లుగా చూడలేదుతనను కలిసి దాదాపు 35 ఏళ్లు అయ్యాయి అని చెప్పుకొచ్చాడు. అప్పట్లో వంశీ.. భానుప్రియను పెళ్లి చేసుకోవాలని ఆశపడినట్లు ప్రచారం జరిగింది. ఈ విషయం గురించి ఆయన్ను ప్రశ్నించగా అందుకు వంశీ స్పందించలేదు. అది ఎప్పుడో గతానికి సంబంధించినది.. అదంతా పాత కథ. ఇప్పుడు నాకు ఎవరూ లేరు. నా భార్య కూడా చనిపోయింది. నా పెద్ద కూతురు చెన్నైలో, చిన్న కూతురు నా దగ్గరే ఉంటుందని తెలిపాడు.చదవండి: పదేళ్ల వ్యవధిలో తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయా..: షారూఖ్ -
ఏపీ హైకోర్టులో రాంగోపాల్ వర్మ మరో పిటిషన్..!
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపైన కేసు నమోదు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. తాను ఎవరి పరువుకు నష్టం కలిగించేలా ఎలాంటి పోస్టులు పెట్టలేదని.. అలాగే వర్గాల మధ్య శతృత్వం సృష్టించేలా పోస్టులు చేయలేదని పిటిషన్లో ప్రస్తావించారు. తనను అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని బెయిల్ పిటిషన్లో వివరించారు.కాగా.. అంతకుముందు విచారణకు హాజరయ్యేందుకు తన సమయం కావాలని పోలీసులకు సందేశం పంపారు ఆర్జీవీ. నాలుగు రోజులు సమయం ఇవ్వాలని ఆయన కోరారు. సినిమా షూటింగ్ బిజీ షెడ్యూల్ కారణంగా విచారణకు రాలేనని వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు ఒంగోలు రూరల్ సర్కిల్ ఇన్సెపెక్టర్ శ్రీకాంత్ బాబుకి వాట్సాప్‌లో వర్మ మెసేజ్ పెట్టారు.మరోవైపు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసులో అరెస్ట్ నుంచి రక్షణల్పించాలని ఆయన దాఖలు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. తనపై నమోదైన కేసు కొట్టేయాలన్న పిటిషన్‌ను మాత్రం విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై కొన్నిరోజులు క్రితం కేసు నమోదైంది. 'వ్యూహం' మూవీ ప్రమోషన్స్‌లో చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. -
విశ్వంభర దర్శకుడి టెలిగ్రామ్ అకౌంట్ హ్యాక్
ప్రముఖ దర్శకుడు వశిష్ట టెలిగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ (ట్విటర్) వేదికగా వెల్లడించాడు. తన టెలిగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని, దాని నుంచి ఎటువంటి మెసేజ్‌లు వచ్చినా పట్టించుకోవద్దని కోరాడు.వశిష్ట విషయానికి వస్తే.. చేసింది ఒక్క సినిమానే అయినా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. బింబిసార మూవీతో దర్శకుడిగా పరిచయమైన ఇతడు ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్నాడు. గతంలో ఇతడు ప్రేమలేఖ రాశా అనే మూవీలోనూ చిన్న పాత్రలో నటించాడు.విశ్వంభర విషయానికి వస్తే.. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ ఫ్యాంటసీ అడ్వెంచర్ చిత్రాన్ని విక్రమ్, వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు.త్రిష, కునాల్ కపూర్, ఆషిక రంగనాథ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.Hi everyone, I just found out that my Telegram account has been hacked. If you receive any messages from it, please ignore them. Thank you!— Vassishta (@DirVassishta) November 15, 2024చదవండి: 20 ఏళ్ల చిన్నవాడితో డేటింగ్ చేస్తున్న టాప్ హీరోయిన్ -
ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా తులసి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరంలో తనకు పూర్తి సహాయ సహకారాలు అందించిన నేతలకు డొనాల్డ్ ట్రంప్ కీలక పదవుల పట్టం కడుతున్నారు. ఇందులో భాగంగా ట్రంప్ తన నూతన ప్రభుత్వ పాలనావర్గం ఎంపిక ప్రక్రియ జోరు పెంచారు. గతంలో డెమొక్రటిక్ పార్టీ నాయకురాలిగా అత్యంత ప్రజాదరణ పొంది ఇటీవల రిపబ్లికన్ నేత ట్రంప్‌కు పూర్తి మద్దతు పలికిన తులసీ గబార్డ్‌కు కీలక పదవి దక్కింది. అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా తులసీని ఎంపిక చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ పదవికి ఎన్నికైన తొలి హిందూ అమెరికన్ మహిళగా తులసీ చరిత్ర సృష్టించారు. ‘‘గత రెండు దశాబ్దాలుగా మన దేశం కోసం, మన అమెరికన్ల స్వేచ్ఛ కోసం తులసి పోరాడారు. గతంలో డెమొక్రటిక్ పారీ్టలో పనిచేయడంతో ఈమెకు రెండు పారీ్టల్లోనూ మద్దతుంది. రాజ్యాంగ హక్కులను కాపాడుతూ, శాంతిని పరిరక్షిస్తూ ఇంటెలిజెన్స్ విభాగాన్ని ముందుకు నడిపిస్తారని విశ్వసిస్తున్నా’ అని ట్రంప్ పొగిడారు.ఆర్మీలో పనిచేసి, రాజకీయ నాయకురాలిగా ఎదిగి.. అమెరికాలోని టుటూలియా ద్వీపంలోని లీలోలా గ్రామంలో 1981 ఏప్రిల్ 12న తులసి జని్మంచారు. 21 ఏళ్ల వయసులో తొలిసారిగా హవాయి రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2001లో అమెరికాలో 9/11 సెపె్టంబర్ దాడుల తర్వాత స్వచ్ఛందంగా ఆర్మీ నేషనల్ గార్డ్‌లో చేరారు. 2004లో ఇరాక్ యుద్ధంలో పాల్గొన్నారు. ఆర్మీ రిజర్వ్ ఆఫీసర్‌గా సేవలందించారు. మేజర్‌గా పనిచేసి లెఫ్టినెంట్ కల్నల్‌గా పదోన్నతి పొందారు. 31 ఏళ్ల వయసులో 2012 పార్లమెంట్ ఎన్నికల్లో రెండో హవాయి కాంగ్రేషనల్ జిల్లా నుంచి డెమొక్రటిక్ అభ్యరి్థగా గెలిచి తొలిసారిగా పార్లమెంట్ దిగువ సభకు ఎన్నికయ్యారు. నాలుగు సార్లు పార్లమెంట్‌కు ఎన్నికైన తులసీ 2020లో డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం బైడెన్‌తో పోటీపడి చివరకు ని్రష్కమించి ఆయనకే మద్దతు పలికారు. తర్వాత 2022లో డెమొక్రటిక్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. అయితే తాజా అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ విధానాలకు ఆకర్షితురాలై ఆగస్ట్‌లో ట్రంప్ అనుకూల పోస్ట్‌లు పెట్టి మళ్లీ అందరి దృష్టిలో పడ్డారు. అక్టోబర్‌లో రిపబ్లికన్ పారీ్టలో చేరారు. టీనేజీలో హిందువుగా మారి.. తులసి తల్లి ఇండియానా వాసికాగా, తండ్రికి యూరోపియన్ మూలాలున్నాయి. వీళ్లిద్దరికీ భారత్‌తో సంబంధం లేదు. కానీ తులసి తల్లిదండ్రులు 1970వ దశకం నుంచి హిందుత్వాన్ని నమ్ముతున్నారు. అందుకే తమ కుమార్తెకు సంస్కృత పదమైన తులసి అని పేరు పెట్టారు. హిందువుగా పెంచారు. పార్లమెంట్లో భగవద్గీత మీదనే ఆమె ప్రమాణంచేశారు. తులసి తండ్రి మైక్ గబార్డ్ సైతం రాజకీయనేతే. ఆయన హవాయ్ సెనేటర్‌గా గతంలో పనిచేశారు.18 నిఘా సంస్థల సమన్వయంతో రోజూ బ్రీఫింగ్ అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్‌తో కలిసి తులసి నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా కీలకమైన బాధ్యతలు నెరవేర్చాల్సి ఉంటుంది. 18 ముఖ్యమైన నిఘా సంస్థల నుంచి అనుక్షణం సమాచారం తెప్పించుకుంటూ వాటిని సమన్వయపరచాలి. ప్రతి రోజూ ఉదయాన్నే అధ్యక్షుడు ట్రంప్‌కు తాజా సమాచారంపై బ్రీఫింగ్ ఇవ్వాలి. అమెరికా విదేశాంగ విధానాలను, విదేశాల్లో అమెరికా అతిసైనిక జోక్యాన్ని తప్పుబట్టిన తులసి తాజా పదవిలో ఏమేరకు రాణిస్తారో వేచిచూడాలి. -
'కలర్ ఫోటో' డైరెక్టర్ నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?
ప్రస్తుతం టాలీవుడ్‌లోనూ పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. త్వరలోనే మరో దర్శకుడి ఇంట్లో పెళ్లి భాజా మోగనుంది. 'కలర్ ఫోటో' సినిమాతో గుర్తింపు తెచ్చకున్న దర్శకుడు సందీప్ రాజ్.. త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. తన తొలి మూవీలోనే చిన్న పాత్ర చేసిన చాందిని రావును ఆయన పెళ్లాడనున్నారు. తాజాగా వీరిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. తనకు కాబోయే భార్య చాందిని రావుకు సందీప్ రాజ్ రింగ్ తొడిగిన ఫోటోలను ఇన్‌స్టాలో పంచుకున్నారు. దీంతో ఈ జంట త్వరలోనే ఏడడుగులు వేయబోతున్నారు.కాగా.. షార్ట్ ఫిల్మ్స్‌తో నటుడు-దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన సందీప్ రాజ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అతడితో పాటు చాందిని రావ్ కూడా షార్ట్ ఫిల్మ్ నటిగా కెరీర్ ప్రారంభించింది. సందీప్ డైరెక్టర్ అయిన తర్వాత ఇతడు తీసిన 'కలర్ ఫొటో', 'హెడ్స్ అండ్ టేల్స్' వెబ్ సిరీస్‌లో చాందిని నటించింది. అలా వీళ్లిద్దరి పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఎప్పుడు ప్రేమలో పడ్డారో గానీ ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయ్యారు.వచ్చేనెల అంటే డిసెంబరు 7న తిరుపతి పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా యాంకర్ సుమ కొడుకుతో 'మౌగ్లీ' అనే సినిమాని తీస్తున్నాడు సందీప్ రాజ్. కొన్నిరోజుల క్రితమే ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించారు. View this post on Instagram A post shared by Sandeep Raj (@sandeepraaaj) -
రెండో పెళ్లి చేసుకున్న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి.. అమ్మాయి ఎవరంటే? (ఫోటోలు)
-
సంచలన డైరెక్టర్ ఆర్జీవీపై కేసు నమోదు..!
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్లో ఐటీ చట్టం కింద కేసు నమోదైంది. వ్యూహం సినిమా ప్రమోషన్ల సమయంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, నారా బ్రాహ్మణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టు చేశారని తెదేపా మండల ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్జీవీపై పోలీసు కేసు నమోదు చేశారు.కాగా.. ఇటీవల వైసీపీ సోషల్ మీడియా వారియర్స్‌పై వరుసగా కేసులు నమోదు చేస్తోన్న సంగతి తెలిసిందే. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే కూటమి ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. పలువురు వైసీపీ సోషల్ మీడియా వారియర్స్‌ను టార్గెట్ చేసి మరీ కేసులు నమోదు చేస్తున్నారు. కాగా.. అక్రమ కేసులపై కార్యకర్తలకు అండగా ఉంటామని వైకాపా అధినేత వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించారు. -
నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్‌లో ఆర్ఆర్ఆర్ హీరోయిన్.. ఆ పవర్ఫుల్ రోల్ కోసమేనా?
ఈ ఏడాది కల్కి మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశాపటానీ లాంటి సూపర్ స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించారు.అయితే ఈ మూవీ సక్సెస్ తర్వాత నాగ్ అశ్విన్ ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో మహానటితో సూపర్ హిట్ కొట్టిన నాగ్.. మరోసారి లేడీ ఓరియంటెడ్ మూవీ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీని కోసం బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆ పాత్రకు ఆలియానే సరిగ్గా సరిపోతుందని మేకర్స్ భావిస్తున్నారని లేటేస్ట్ టాక్. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు.అయితే ఆలియా భట్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఇదే నిజమైతే ఆర్ఆర్ఆర్ తర్వాత మరో భారీ పాన్-ఇండియా చిత్రంలో కనిపించనుంది. బాలీవుడ్లో లేడీ ఓరియంటెడ్ రోల్స్‌కు ఆలియా భట్ పేరుగాంచింది. ఇటీవలే ఆమె లీడ్ రోల్లో నటించిన జిగ్రా మూవీ థియేటర్లలో సందడి చేసింది.అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ మూవీని వైజయంతీ ఫిల్మ్స్ బ్యానర్లోనే తెరకెక్కించనున్నారు. 2025 మధ్యలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. కాగా.. అలియా భట్ ప్రస్తుతం శర్వాయ్ వాఘ్‌తో కలిసి ఆల్ఫా చిత్రంలో నటిస్తోంది.