
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై సీఐడీ నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఆయన డైరెక్షన్‌లో తెరకెక్కించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో సీఐడీకి ఫిర్యాదులొచ్చాయి. ఈ నేపథ్యంలోనే విచారణకు హాజరు కావాలని రాంగోపాల్ వర్మకు నోటీసులు జారీ చేశారు. దీంతో సీఐడీ నోటీసులను సవాల్ చేస్తూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ గురువారం విచారణకు వచ్చే ఛాన్సుంది.
ఆర్జీవీ ప్రస్తుతం ఎలాంటి సినిమాలు చేయడం లేదు. ఆర్జీవీ డెన్ నుంచి శారీ అనే మూవీని నిర్మిస్తున్నారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో ప్రముఖ వ్యాపారవేత్త రవి శంకర్ వర్మ నిర్మిస్తున్నారు. సత్య యాదు, ఆరాధ్య దేవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని పలు నిజ జీవిత సంఘటనల ఆధారాలతో సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు.కాగా ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

Comments
Please login to add a commentAdd a comment