rgv
-
రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్‌నెట్ లీగల్ నోటీసులు
టాలీవుడ్ సినీ దర్శకుడు రాం గోపాల్ వర్మకు ఏపీ ప్రభుత్వం మరోసారి లీగల్ నోటీసులు పంపింది. ఏపీ ఫైబర్‌నెట్ నుంచి ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' సినిమా పేరుతో ఏపీ ప్రభుత్వం ఆయన్ను టార్గెట్ చేస్తుందని తెలుస్తోంది. ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా వర్మతో పాటు ఆర్జీవి ఆర్వీ సంస్థ, పార్టనర్ గొట్టుముక్కల రవి శంకర్ వర్మకి నోటీసులు పంపారు. ఈ క్రమంలో ఫైబర్ నెట్ మాజీ ఎండి మధు సుధన్ రెడ్డికి కూడా నోటీసులు జారీ అయ్యాయి. -
మంచు ఫ్యామిలీ గొడవపై RGV కామెంట్స్
-
RGV: దేవుళ్లను కూడా అరెస్ట్ చేస్తారా ?
-
అక్కడ 29 మంది చనిపోతే చట్టం గుర్తుకు రాలేదా: ఆర్జీవీ
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి తెలంగాణ ప్రభుత్వం తప్పు చేసిందని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఈ ఘటనలో A11గా ఉన్న వ్యక్తిని నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ఇప్పటికే నెటిజన్ల నుంచి కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమా విడుదల సమయంలో ఇలాంటి తొక్కిసలాట ఘటనలు గతంలో చాలా జరిగాయని వర్మ గుర్తుచేశారు. ఆ సమయంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు. రేవతి కుటుంబానికి ముమ్మాటికి నష్టం జరిగిందని చెప్పిన వర్మ ఆ పేరుతో మరోక వ్యక్తిని ఇబ్బంది పెట్టడం ఏంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాలని ఆయన అన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బన్నీ అరెస్ట్ గురించి చేసిన కామెంట్లు కూడా అభ్యంతరంగా ఉన్నాయని వర్మ అన్నారు. సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారని అంటున్నారు... వారిపై నమోదైన కేసులకు, బన్నీ మీద నమోదు అయిన కేసుకు చాలా తేడా ఉందని ఆయన గుర్తు చేశారు.పుష్కరాలు, బ్రహ్మోత్స వాల్లాంటి కార్యక్రమా ల్లో తోపులాట జరిగి భక్తులు చనిపోతే దేవుళ్లను అరెస్ట్ చేస్తారా?.. ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలో ఎవ రైనా చనిపోతే నేతలను అరెస్ట్ చేస్తారా? అంటూ వర్మ ప్రశ్నించారు. బన్నీ అరెస్ట్ గురించి ఆర్జీవీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియో ద్వారా ఇంటర్వ్యూ చూడగలరు. -
అల్లు అర్జున్ అరెస్ట్ పై RGV కామెంట్స్
-
మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు: RGV
-
ఆర్జీవీపై ముందస్తు బెయిల్ పిటిషన్‌పై రేపు విచారణ
-
సంధ్య థియేటర్ వంటి ఘటనలు గతంలో జరగలేదా..?: ఆర్జీవీ
అల్లు అర్జున్ నటించిన పుష్ప2 చిత్రం డిసెంబర్ 4న ప్రీమియర్స్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడంతో అల్లు అర్జున్‌తో పాటు ఆయన అభిమానులు కూడా బాధ పడ్డారు. అయితే, రేవతి మరణానికి కారణం బన్నీనే అంటూ కొందరు సోషల్‌మీడియాలో ప్రచారం చేశారు.. ఆపై తెలంగాణలో బెన్ఫిట్ షోలు ఉండబోవని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఈ అంశాల గురించి ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్‌వర్మ తన అభిప్రాయాన్ని సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు.సంధ్య థియేటర్ ఘటన విషయంలో అల్లు అర్జున్ను తప్పుపట్టడం చాలా ఆశ్చర్యంగా ఉందని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. సినిమా విడుదల సమయంలో ఇలాంటి తొక్కిసలాట ఘటనలు గతంలో చాలా జరిగాయని ఆయన గుర్తుచేశారు. ఆ సమయంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు. ఈ కారణంతో బెనిఫిట్ షోలను బ్యాన్ చేయడాన్ని వర్మ తప్పుపట్టారు. అయితే, రేవతి కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఎవరూ పూర్తి చేయలేరని పేర్కొన్నారు.'సినిమా సెలబ్రిటీలకు ఎక్కువగా ఫ్యాన్స్ ఉంటారు.. వారు ఎక్కడికైనా వెళ్తే అభిమానులు భారీగానే పోటెత్తుతారు. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు తొక్కిసలాటలు చాలా సాధారణంగా జరుగుతాయి. అయితే, తొక్కిసలాట ప్రమాదం వల్ల జరిగిందా..? నిర్లక్ష్యం వల్ల జరిగిందా..? అసమర్థత, ఉద్దేశ్యపూర్వకంగా జరిగిందా..? అనేది ఒక కేసు ఆధారంగా దర్యాప్తు కోణం నుంచి మాత్రమే తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ సంఘటన కారణంగా బెనిఫిట్ షోలను నిషేధించడం సమాధానం కాదు.బెనిఫిట్ షోలు అనే బదులు వాటిని స్పెషల్ షో అనేది సరైన పేరు.. స్పెషల్ కాఫీ, స్పెషల్ మీల్స్ సాధారణ వాటి కంటే ఎలా ఖరీదైనవో, స్పెషల్ షో టిక్కెట్లు కూడా ఖరీదైనవిగా గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల సభలు, ర్యాలీలు, కచేరీలు మొదలైన వాటికి తగిన అనుమతులు ఇచ్చినట్లే, థియేటర్‌కి కూడా వివిధ సంబంధిత అధికారులు సినిమా ప్రదర్శించడానికి అనుమతి ఇస్తారు.సినిమా నటులు థియేటర్లను సందర్శించడం అనేది కొన్ని సంవత్సరాల తరబడి జరుగుతున్న విషయమే.. అక్కడికి జనం పోటిత్తుతారు. ఆ సమయంలో ఒక్కోసారి ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగడం బాధాకరం. ఒక స్టార్ థియేటర్‌కు రావాడానికి పోలీసులు అనుమతి ఇవ్వాలా వద్దా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ ఘటనలో థియేటర్ యాజమాన్యం బాధ్యత వహించాలి, కానీ బెనిఫిట్ షోలను ఎందుకు నిషేధించాలి..? రాజకీయ సమావేశాల తొక్కిసలాటలు ఎన్నో జరిగాయి. కుంభమేళా వంటి వాటిలో జరిగిన తొక్కిసలాటలో వ్యక్తులు చనిపోయినప్పుడు వాటిని నిషేధించారా..?' అంటూ వర్మ తన సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టారు.It is truly ridiculous to blame @alluarjun for the unfortunate death of a woman in a stampede outside a theatre playing #Pushpa2Celebrities by their very appeal draw huge crowds whether they are Film Stars , Rock stars and even Gods for that matter And stampedes happen very…— Ram Gopal Varma (@RGVzoomin) December 9, 2024 -
Ram Gopal Varma: ఎవరి మనోభావాలో దెబ్బతింటే కేసులు పెట్టడమేంటి?: ఆర్జీవీ
-
ఏపీ హైకోర్టులో రాంగోపాల్ వర్మకు ఊరట
-
RGV: తొమ్మిది చోట్ల కేసులు పెట్టారు..
-
RGV: రామ్ గోపాల్ వర్మను ఈడ్చుకుని వెళ్లారు... వినడానికి నాకు బాగుంటుంది
-
గుర్తుపెట్టుకోండి! రాబోయేది మేమే వడ్డీతో ఇస్లాం
-
చంద్రబాబు మరో డైవర్షన్...
-
సోషల్ మీడియా పోస్టులపై కేసులో విచారణకు వచ్చామంటూ హల్ చల్
-
RGV పై అక్రమ కేసు.. లోకేష్ పై అంబటి రాంబాబు సెటైర్లు
-
రాంగోపాల్ వర్మ ఇంటి నుంచి వెనుదిరిగిన ఏపీ పోలీసులు
-
రామ్ గోపాల్ వర్మ ఇంటికి ఏపీ పోలీసులు
టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నివాసానికి ప్రకాశం జిల్లా పోలీసులు చేరుకున్నారు. విచారణకు రావాలని హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి పోలీసులు వచ్చారు. ఒంగోలు పోలీసు స్టేషన్‌కు విచారణ నిమిత్తం సోమవారం ఉదయం 11 గంటలకు ఆయన హాజరుకావాల్సి ఉంది. అయితే, వర్మ ఒంగోలుకు రావడం లేదని తెలియడంతో పోలీసులే ఆయన ఇంటికి చేరుకున్నారు. పోలీసుల విచారణకు సహకరించకుంటే వర్మను అరెస్ట్ చేసి ఒంగోలు తీసుకొచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై కేసు నమోదైన విషయం తెలిసిందే. 'వ్యూహం' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలో ఆయన పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో నవంబర్ 19న పోలీసుల విచారణలో వర్మ పాల్గొనాల్సి ఉండగా.. ఆ సమయంలో తనకు సినిమా షూటింగ్స్ ఉండటం వల్ల హాజరు కాలేదు. ఈ క్రమంలో పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు.ఈ క్రమంలో పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. వాటికి కూడా వర్మ సమాధానం ఇచ్చారు. డిజిటల్ విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇదే విషయాన్ని వాట్సాప్ ద్వారా డీఎస్పీకి సమాచారం అందించామని ఆయన పేర్కొన్నారు. అయినా సరే పోలీసులు వర్మ ఇంటికి రావడంలో కుట్ర కోణం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వర్మ ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.విచారణ పేరుతో తనను అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. ఈమేరకు తనకు ముందస్తు బెయిల్ కావాలని పిటిషన్ వేశారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపైన కేసు నమోదు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. తాను ఎవరి పరువుకు నష్టం కలిగించేలా ఎలాంటి పోస్టులు పెట్టలేదని.. అలాగే వర్గాల మధ్య శతృత్వం సృష్టించేలా పోస్టులు చేయలేదని పిటిషన్లో ప్రస్తావించారు. -
హరుడు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన డైరెక్టర్ ఆర్జీవీ.. ఫోటోలు
-
ఏపీ హైకోర్టులో ఆర్జీవీ పిటిషన్ విచారణ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసులో అరెస్ట్ నుంచి రక్షణల్పించాలని ఆయన దాఖలు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. అయితే.. తనపై నమోదైన కేసు కొట్టేయాలన్న పిటిషన్‌ను మాత్రం విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. రామ్ గోపాల్ వర్మ అభ్యర్థనపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసుల నుంచి అరెస్టు ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని కోర్టు సూచించింది. ఈ క్రమంలోనే పోలీసుల విచారణకు తనకు మరికొంత సమయమిచ్చేలా ఆదేశించాలని కోర్టును ఆయన కోరారు. ఆ అభ్యర్థనను కూడా పోలీసులు ముందు చేసుకోవాలని న్యాయమూర్తి సూచించారు. అయితే తనపై నమోదైన కేసును కొట్టేయాలని వేసిన ఆర్జీవీ వేసిన పిటిషన్‌ను రెండు వారాల తర్వాతే విచారణ జరపనుంది. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై కేసు నమోదైన విషయం తెలిసిందే. 'వ్యూహం' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలో ఆయన పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో నవంబర్ 19న పోలీసుల విచారణలో వర్మ పాల్గొనాల్సి ఉంది. -
హైదరాబాద్ లో ఆర్జీవీ కి నోటీసులు ఇచ్చిన ఏపీ పోలీసులు
-
ఆర్జీవీ మేనకోడలు శ్రావ్య వర్మ పెళ్లి వేడుకలు.. సందడి చేసిన యాంకర్ సుమ కనకాల!
-
ఆర్జీవీ మేనకోడలితో కిదాంబి శ్రీకాంత్ పెళ్లి.. గట్టి వార్నింగ్ ఇచ్చిన రష్మిక మందన్న (ఫొటోలు)
-
రానా డైరెక్షన్ లో RGVతో రాజమౌళి షూటింగ్
-
సినీ చరిత్రలోనే తొలిసారి... ఓకేసారి మూడు వర్షన్స్
ఆర్జీవీ సమర్పణలో తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం శారీ. ఈ సినిమాలో కోలీవుడ్ భామ ఆరాధ్యదేవి లీడ్ రోల్ పోషిస్తోంది. ప్రస్తుతం ఈ బోల్డ్ మూవీ షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ పంచుకున్నాడు రాంగోపాల్ వర్మ. ఈ చిత్రంలోని సాంగ్‌కు సంబంధించిన టీజర్‌ను ఆర్జీవీ రిలీజ్ చేశారు. కేవలం టీజర్‌తోనే సాంగ్‌పై అంచనాలను మరింత పెంచేశాడు. ఈ సినిమాలోని ఐ వాంట్ లవ్ అనే పాటకు సంబంధించిన మూడు వర్షన్ల ప్రోమోను ఆర్జీవీ తన ట్విటర్ ద్వారా విడుదల చేశారు. సినిమా చరిత్రలోనే ఇలా జరగడం తొలిసారంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఈ మూవీలోని సాంగ్ టీజర్ చూస్తుంటే కుర్రకారుకు హీటు పుట్టించేలా ఉంది. పూర్తి పాటను అక్టోబర్ 17న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ఆర్జీవీ వెల్లడించారు.సినీ చరిత్రలో ఏఐ ద్వారా రూపొందించిన ఒకే పాటకు మూడు వర్షన్స్ రిలీజ్ చేయడం విశేషం. కాగా.. ఈ చిత్రాన్ని రాంగోపాల్ వర్మ సమర్పణలో.. గిరీశ్ కృష్ణ కమల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సాంగ్‌లో ఆరాధ్యదేవి తన అందాల ఆరబోత ఖాయంగా కనిపిస్తోంది.Here’s a sneak peak teaser reel of I WANT LOVE AI song ONE (Crazy ) from SAAREE film featuring https://t.co/4vViOc25qQ Full song releasing Oct 17 th 5 pm #SaareeSongsAI #RGVsSAAREE pic.twitter.com/RgNnwHGdx6— Ram Gopal Varma (@RGVzoomin) October 16, 2024