అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం వ్యూహం. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈసినిమాను రామధూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం నుంచి ఆయన తనయుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే వరకు జరిగిన పరిణామాల సమూహమే వ్యూహం. ఈ చిత్రం మార్చి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
లోకేష్ ఎలా ఉంటాడో..
ఆదివారం నాడు ఆర్జీవీ, వ్యూహంలో సీఎం జగన్ పాత్రను పోషించిన అజ్మల్‌తో కలిసి విజయవాడకు వెళ్లారు. అక్కడ జైరామ్ థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి వ్యూహం సినిమా చూశారు. సినిమా చూసిన అనంతరం రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ.. సినిమా రిలీజ్ అవడం చాలా సంతోషంగా ఉంది. లోకేష్ బయట ఎలా ఉంటాడో సినిమాలో అలానే చూపించాను. వైఎస్సార్ చనిపోయినప్పటి నుంచి జగన్ సీఎం అయ్యేవరకూ అంతా ఫస్ట్ పార్ట్‌లో ఉంది. సెకండ్ పార్ట్(శపథం) మరికొద్ది రోజుల్లో రిలీజ్ అవుతుంది అని చెప్పారు.
ఎన్నికలపై వ్యూహం ప్రభావం..
హీరో అజ్మల్.. సినిమాకు మంచి స్పందన వస్తోందని సంతోషించాడు. నిర్మాత దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. రామ్ గోపాల్ వర్మ నిజాలను నిర్భయంగా తీశారు. గుండె ధైర్యంతో ఎవరికీ భయపడకుండా సినిమా తీశారు. వచ్చే ఎన్నికలపై సినిమా ప్రభావం ఉండబోతోంది. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ఇక ఈ మూవీకి కొనసాగింపుగా మార్చి 8న శపథం రిలీజ్ చేయనున్నారు.
Me and VYOOHAM’s JAGAN MOHAN REDDY on our way to Vijaywada to watch the film in Jairam theatre matinee show pic.twitter.com/jRE9BjD1fU
— Ram Gopal Varma (@RGVzoomin) March 3, 2024
చదవండి: నలుగురమ్మాయిల కష్టాల కథే ఈ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Comments
Please login to add a commentAdd a comment