vyooham Movie
-
అందరికీ అందుబాటులో 'శపథం'.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం: వర్మ
టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన వ్యూహం సినిమా ఇప్పటికే విడుదలైంది. దానికి సీక్వెల్ అయిన శపథం విడుదల కావాల్సి ఉంది. వ్యూహం సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసిన వర్మ.. ఆ సినిమాకు సంబంధించి శపథంను వెబ్ సిరీస్ రూపంలో ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా విషయంలో వర్మ ప్రెస్‌మీట్ నిర్వహించారు. 'శపథం సినిమాను ఇప్పటికే ఏపీలో ఫైబర్ నెట్లో విడుదల చేశాం. మరో రెండు మూడు రోజుల్లో అన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్‌లలో అందుబాటులో ఉంటుంది. వ్యూహం, శపథం సినిమాలు చేస్తున్నప్పుడే వాటికి వెబ్ సిరీస్ కూడా తీశాం. అందరికీ సినిమా రిచ్ అవ్వాలని మా ప్రయత్నం. ఏపీ రాజకీయాల్లో నాలుగు గోడల మధ్య జరిగిన కొన్ని సంఘటనలరు ప్రజలకు చూపించాను. నాకు పబ్లిక్ ఫిగర్స్ మీద ఉన్న అభిప్రాయాన్ని సినిమాగా తీశాను.' అని ఆయన చెప్పారు. వెబ్ సిరీస్‌కు శపథం ఆరంభం ఛాప్టర్-1, శపథం ఆరంభం ఛాప్టర్-2 అనే టైటిల్స్ పెట్టారు వర్. ఎలాంటి కట్స్ లేకుండా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సమాచారం. కొన్ని నిబంధనలు, కోర్టు కేసులు, అభ్యంతరాలు ఉంటాయి కాబట్టి, వాటికి తగ్గట్టు వ్యూహంను థియేటర్లలో రిలీజ్ చేశామని చెప్పిన వర్మ శపథం మాత్రం ఇలా ఓటీటీలో విడుదల చేయడంతో ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏపీలో ఫైబర్ నెట్లో శపథం చిత్రాన్ని చూడవచ్చు. శపథం సినిమా గురించి ఆ చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ వాళ్లు సినిమాని ఎవ్వరు చూడకుండా పలు కుట్రలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ క్రమంలో గ్రామాల్లో ఉన్న కేబుల్స్‌ను వారు కట్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ అంశం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశామని వారు విచారణ చేపట్టారని ఆయన చెప్పుకొచ్చారు. థియేటర్లో విడుదల కావాల్సిన శపథం సినిమా ఇంకా సెన్సార్ కాలేదని ఆయన తెలిపారు. కానీ అందరూ సినిమా చూడాలని ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించాం. అందుకే సెన్సార్ కాకపోయిన ఫైబర్ నెట్ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. -
ఏపీ ఫైబర్ నెట్లో ఆర్జీవీ ‘వ్యూహం’, ‘శపథం’
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం ‘వ్యూహం’. గత శనివారం(మార్చి 2) థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. వైఎస్సార్ మరణం తర్వాత ఎపీ రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలను తనదైన శైలీలో తెరపై చూపించాడు ఆర్జీవీ. వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం కాకుండా చేసేందుకు అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ చేసిన కుట్రలను.. వాటన్నింటిని ఎదుర్కొని వైఎస్ జగన్ ప్రజా నాయకుడిగా ఎలా ఎదిగాడనేది ఈ చిత్రం ద్వారా చూపించాడు. (చదవండి: వ్యూహం' సినిమా రివ్యూ) దీనికి సీక్వెల్‌గా ‘శపథం’అనే చిత్రం ఈ నెల 8న విడుదల కావాల్సింది. రిలీజ్ డేట్‌ని కూడా గత వారమే ప్రకటించారు. కానీ ఇప్పుడీ చిత్రం థియేటర్స్‌లో రిలీజ్ కావడం లేదు. వెబ్ సిరీస్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. శపథం ఆరంభం, శపథం అంతం అంటు రెండు భాగాలుగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా తెలియజేశాడు ఆర్జీవీ. ‘వ్యూహం , శపథం ల వెనుక మా అసలు వ్యూహం సైడ్ బై సైడ్ వెబ్ సిరీస్ కూడా తియ్యటం. కానీ కొన్ని కారణాల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో సెన్సార్ బోర్డు అనుమతించిన వెర్షన్ మాత్రమే థియేటర్లలో రిలీజ్ చెయ్యడం జరిగింది. కానీ ఇప్పుడు మేము ఫస్ట్ నుంచి రెడీ చేసి పెట్టుకున్న వెబ్ సిరీస్ శపథం ఆరంభం చాప్టర్ 1 ని ఈ రోజు(మార్చి 7) సాయంత్రం 8 గంటలకు, శపథం అంతం చాప్టర్ 2ని రేపు(మార్చి 8) సాయంత్రం 8 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ ఫైబర్ నెట్ ద్వారా పే పర్ వ్యూలో చూసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం. ఆ తర్వాత అంచెలంచెలుగా అన్ని ఓటీటీ ప్లాట్ ఫాంలలో రిలీజ్ అవుతాయి. శపథం ఆరంభం చాప్టర్ 1 , శపథం అంతం చాప్టర్ 2 రెండు కూడా తీసిన ఉద్దేశ్యం ఏమీ దాచకుండా పచ్చి నిజాలు చూపిస్తాం’ అని ఆర్జీవీ అన్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రోగ్రాంలో భాగంగా ఏపీ ఫైబర్ నెట్ లో వ్యూహం సినిమా రిలీజ్ చేస్తున్నామని ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి వెల్లడించారు. అలాగే ఓటీటీ ద్వారా శపథం వెబ్ సిరీస్‌ని విడుదల చేస్తున్నామని అన్నారు. -
థియేటర్లో సినిమా చూసిన ఆర్జీవీ.. లోకేష్‌ను అలా చూపించానంటూ..
అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం వ్యూహం. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈసినిమాను రామధూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం నుంచి ఆయన తనయుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే వరకు జరిగిన పరిణామాల సమూహమే వ్యూహం. ఈ చిత్రం మార్చి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లోకేష్ ఎలా ఉంటాడో.. ఆదివారం నాడు ఆర్జీవీ, వ్యూహంలో సీఎం జగన్ పాత్రను పోషించిన అజ్మల్‌తో కలిసి విజయవాడకు వెళ్లారు. అక్కడ జైరామ్ థియేటర్లో ప్రేక్షకులతో కలిసి వ్యూహం సినిమా చూశారు. సినిమా చూసిన అనంతరం రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ.. సినిమా రిలీజ్ అవడం చాలా సంతోషంగా ఉంది. లోకేష్ బయట ఎలా ఉంటాడో సినిమాలో అలానే చూపించాను. వైఎస్సార్ చనిపోయినప్పటి నుంచి జగన్ సీఎం అయ్యేవరకూ అంతా ఫస్ట్ పార్ట్‌లో ఉంది. సెకండ్ పార్ట్(శపథం) మరికొద్ది రోజుల్లో రిలీజ్ అవుతుంది అని చెప్పారు. ఎన్నికలపై వ్యూహం ప్రభావం.. హీరో అజ్మల్.. సినిమాకు మంచి స్పందన వస్తోందని సంతోషించాడు. నిర్మాత దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. రామ్ గోపాల్ వర్మ నిజాలను నిర్భయంగా తీశారు. గుండె ధైర్యంతో ఎవరికీ భయపడకుండా సినిమా తీశారు. వచ్చే ఎన్నికలపై సినిమా ప్రభావం ఉండబోతోంది. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ఇక ఈ మూవీకి కొనసాగింపుగా మార్చి 8న శపథం రిలీజ్ చేయనున్నారు. Me and VYOOHAM’s JAGAN MOHAN REDDY on our way to Vijaywada to watch the film in Jairam theatre matinee show pic.twitter.com/jRE9BjD1fU — Ram Gopal Varma (@RGVzoomin) March 3, 2024 చదవండి: నలుగురమ్మాయిల కష్టాల కథే ఈ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
'వ్యూహం' సినిమా రివ్యూ
టైటిల్: వ్యూహం నటీనటులు: అజ్మల్ అమీర్,మానస రాధాకృష్ణన్,ధనంజయ్ ప్రభునే,సురభి ప్రభావతి తదితరులు నిర్మాణ సంస్థ: రామదూత క్రియేషన్స్ నిర్మాత: దాసరి కిరణ్ కుమార్ రచన-దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ సంగీతం: ఆనంద్ సినిమాటోగ్రఫీ: సాజీశ్ రాజేంద్రన్ విడుదల తేది: మార్చి 2, 2024 రాజకీయాలు, సినిమాలు తెలుగువారి జీవితంలో భాగం. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఉన్నన్నీ రోజులు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గార్ల పేర్లు చిరస్థాయిలో ఉంటాయనేది జగమెరిగన సత్యం. అందుకే వారి రాజకీయ ప్రయాణంపై వచ్చిన యాత్ర, యాత్ర-2 చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన సమయం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు 'వ్యూహం' చిత్రాన్ని తెరకెక్కించారు వర్మ. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వాస్తవంగా ఈ రెండు నెలల క్రితం రావాల్సిన ఈ చిత్రాన్ని నారా లోకేష్ అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆ చిక్కులన్ని దాటుకోని నేడు(మార్చి 2) విడుదలైన వర్మ వ్యూహం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు మరణించిన సీన్‌తో వ్యూహం సినిమా ప్రారంభం అవుతుంది. ఇందులోని పాత్రలకు వర్మ తనదైన స్టైల్లో పేర్లు పెట్టుకుని తెరకెక్కించాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని వీర శేఖర్ రెడ్డి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మదన్ రెడ్డి అని ప్రేక్షకులకు వర్మ పరిచయం చేశారు. వీఎస్సార్ మరణానికి ముందు జగన్ అంటే ప్రజలకు పెద్దగా తెలియదు.. తండ్రి అడుగుజాడల్లో నడవాలని రాజకీయాల్లో ఆయన తొలి అడుగు పడి కడప ఎంపీగా గెలుస్తారు. 2009లో హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్సార్ మరణించడంతో ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు రావడం జరుగుతుంది. ఆ సమయంలో ఏపీ సీఎం ఎవరంటూ ప్రశ్నలు రావడం జరుగుతుండగా.. మదన్(అజ్మల్ అమీర్) ముఖ్యమంత్రిగా కావాలని 150కి పైగా ఎమ్మెల్యేల మద్ధతుతో ఒక లేఖ భారత్ పార్టీ (కాంగ్రెస్) అధినేత్రి అయిన మేడం (సోనియా) వద్దకు చేరుతుంది. అదే సమయంలో మదన్ ముఖ్యమంత్రి ఎట్టిపరిస్థితిల్లో కాకూడదని ఇంద్రబాబు (ధనుంజయ్ ప్రభునే) పన్నిన వ్యూహం ఏంటి..? మేడంను దిక్కరించిన జగన్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు..? 2009లో జగన్ సీఎం కాకుండా చంద్రబాబు అండ్ కో చేసింది ఏమిటి..? 2014లో ఇంద్రబాబుకు మద్దతు ఇచ్చిన శ్రవణ్ కళ్యాణ్..2019 ఎన్నికల్లో ఆ పార్టీతో ఎందుకు పోటీ పెట్టుకోలేదు? శ్రవణ్ కల్యాణ్ పన్నిన వ్యూహం ఏంటి? అతన్ని ఇంద్రబాబు ఎలా వాడుకున్నాడు? ప్రతి పక్షాల కుట్రలన్నింటిని మదన్ ఎలా ప్రజా నాయకుడిగా ఎదిగారనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే.. వైఎస్సార్ మరణం తర్వాత ఎపీ రాజకీయాల్లో చోటుచేసుకున్న పెనుమార్పులను ఎదర్కొని జగన్ ఎలా నిలబడ్డారు..? అనేది వ్యూహంలో వర్మ చూపించారు. తండ్రి ఆశయాలకు గండిపడుతున్న సమయంలో నేనున్నానంటూ ప్రజల కోసం జగన్ పోరాటం.. కేంద్రాన్ని ఎదురించి తనను నమ్ముకున్న ప్రజల కోసం జగన్ ప్రారంభించిన ఓదార్పు యాత్ర.. దాంతో కేంద్రం నుంచి జగన్ ఎలాంటి చిక్కులు ఎదుర్కొన్నారు..? అప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్‌ను ప్రత్యర్థులంతా ఏకమై ఎదురుదాడి చేస్తున్నప్పటికి ఎలాంటి బెరుకు లేకుండా ప్రజలను మాత్రమే నమ్ముకుని అసలు సిసలైన ప్రజా నాయకుడిగా ఎలా ఎదగగలిగాడు అనే విషయాన్ని వ్యూహంలో వర్మ చక్కగా చూపించాడు. ప్రజల్లో తిరుగుతున్న నాయకులు అందరూ కూడా తమ వ్యక్తిగత జీవితంలో ఎలా ఉంటారో తను అనుకున్న రీతిలో చూపించారు వర్మ.. అందుకే వైఎస్ఆర్ మరణం తర్వాత చంద్రబాబు ఆలోచనలు ఎలా ఉన్నాయి.. అప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయి ఉంటాడు అనేది చూపించారు. కుటుంబ పెద్దను కోల్పోతే ఒక ఫ్యామిలీ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుంది.. ఆ సమయంలో వారి బాధ ఎలా ఉంటుంది అనేది వర్మ బయటకు తీశాడు.. కష్ట సమయంలో వైఎస్ జగన్ గారికి ఆయన తల్లి, సతీమణి అండగా ఎలా నిలడ్డారనే పాయింట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. కేంద్రాన్ని దిక్కారించడం వల్ల జగన్ జైలుకు వెళ్లిన సమయంలో తన అనుకున్న వారందరూ దూరం అయినా కూడా ఆయన సతీమణి వైఎస్ భారతి(సినిమాలో మాలతి) గారు ఎలా ధైర్యంగా ముందు అడుగు వెశారో వర్మ తనదైన స్టైల్లో చూపించారు. 2014 ఎన్నికల్లో తొలిసారిగా పోటీకి సింగిల్‌గానే జగన్ బరిలోకి దిగితే... ఓటమి భయంతో చంద్రబాబు కూటమిని ఏర్పాటు చేసుకుని పోటీకి సిద్ధమౌతాడు.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మనసేన (జనసేన) అధినేత అయిన శ్రవణ్ కల్యాణ్‌ను తప్పించేందుకు బాబు ఎలాంటి ఎత్తుగడలు వెశాడో చూస్తే అందరినీ నవ్వు తెప్పిస్తాయి. మళ్లీ 2019 నాటికి పవన్‌తో మళ్లీ బాబు టచ్‌లోకి వెళ్లడం వంటి సీన్స్ వస్తున్న సమయంలో ఏం వ్యూహం బాబుగారు అంటూ పొగడ్తలతో ప్రేక్షకులు కూడా ముంచెత్తుతారు. సినిమా జరుగుతున్న సమయంలో అప్పుడప్పుడు ముకేష్ (లోకేష్) పాత్ర కనిపించి కనిపించక ఉంటుంది. వర్మకు ఆ పాత్ర అంటే బాగా ఇష్టం ఉన్నట్లు ఉంది అందుకే చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దాడు. ముకేష్ నుంచి వచ్చే డైలాగ్స్ తక్కువే అయినా ఫన్నీగా అందరినీ ఆకట్టుకుంటాయి. ఆయన పాత్ర గురించి చెప్పడం కంటే సినిమాకు వెళ్లి చూస్తేనే బాగుంటుందని అభిప్రాయం. ఎవరెలా చేశారంటే.. వ్యూహం సినిమాలో కథ మొత్తం వైఎస్ జగన్, చంద్రబాబు పాత్రల చూట్టే ఎక్కువగా జరుగుతుంది. తర్వాత పవన్ కల్యాణ్ పాత్రకు కాస్త ఎక్కువగానే ప్రయారిటీ ఉంటుంది. వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ అమీర్ సరిగ్గా సరిపోయారు అని చెప్పవచ్చు.. జగన్ గారిలో ఉన్న మ్యానరిజాన్ని పర్ఫెక్ట్గా అజ్మల్ చూపించాడు.. తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. ముఖ్యంగా ఓదార్పు యాత్ర సమయంలో ఆయన కనిపించిన తీరుతో పాటు ప్రత్యేక హోదా కోసం ఆయన చేపట్టిన దీక్షకు సంబంధించిన సీన్స్‌లలో జగన్ గారికి దగ్గరగా కనిపిస్తాడు. ముఖ్యంగా వ్యూహం సినిమాలో వైఎస్ భారతి గారి పాత్రలో మానస రాధాకృష్ణన్ సరిగ్గా సెట్ అయ్యారు. సినిమాలో ఆమె కనిపించిన ప్రతిసారి అచ్చం భారతిలాగే ఉన్నారు. చంద్రబాబు పాత్రలో కనిపించిన ధనంజయ్ ప్రభునే అందరికీ సుపరిచయమే.. ఆయన నటనతో దుమ్మురేపాడు అని చెప్పవచ్చు.. చంద్రబాబు మ్యానరిజానికి ఏ మాత్రం తగ్గకుండా ప్రేక్షకులను ఆయన మెప్పించాడు. సోనియా గాంధీ పాత్రలో ఎలీనా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. వ్యూహం సినిమాలో నటించిన అందరిలో దాగి ఉన్న టాలెంట్‌ను వర్మ సరిగ్గా ఉపయోగించుకున్నాడు. సాంకేతిక పరంగా సినిమా బాగుంది. వైఎస్ జగన్ పార్టీ పెట్టిన సమయంలో వచ్చిన పాట అందరినీ మెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగున్నప్పటికీ సంగీత నేపథ్యం ఇంకాస్త మెరుగ్గా ఉండుంటే బాగుండేది. వైఎస్ జగన్ గారి జీవితంలోని కీలకమైన సంఘటనలను మాత్రమే తీసుకుని ఎడిటింగ్ చేసిన తీరు పర్వాలేదు.. ఏదైమనా వ్యూహం సినిమాను ఎవరైనా చూడొచ్చు.. వైఎస్ జగన్ గారి అభిమానుల్లో మాత్రం ఫుల్ జోష్‌ను నింపడం ఖాయం. -
ప్రపంచవ్యాప్తంగా 'వ్యూహం' విడుదల!
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా నేడు (మార్చి 2) ప్రపంవ్యాప్తంగా విడుదలైంది. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున థియేటర్లలోకి వచ్చేసింది. అజ్మల్, మానస ముఖ్య తారలుగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రామధూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన చిత్రం ‘వ్యూహం’. వ్యూహం చిత్రాన్ని వర్మ తన టీమ్‌తో చూస్తున్నట్లు కొంత సమయం క్రితం సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అంతేకాకుండా అమెరికాలో విడుదల అవుతున్న థియేటర్ల లిస్ట్ కూడా ఆయన విడుదల చేశారు. వాస్తవంగా వ్యూహం సినిమా రెండు నెలల క్రితమే విడుదల కావాల్సి ఉంది. కానీ నారా లోకేష్ కోర్టుకు వెళ్లి పలు అభ్యంతరాలను తెలపడంతో విడుదల విషయంలో జాప్యం ఏర్పడింది. అన్నీ అడ్డంకులను ఎదుర్కొని నేడు విడుదలైన వ్యూహం సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. లోకేష్ అడ్డుకునేంత ఇబ్బంది ఈ చిత్రంలో ఏముంది అని ఆ పార్టీకి చెందిన వారు కూడా వ్యూహం చిత్రాన్ని చూడాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్ వద్ద సందడి వాతవారణం నెలకొని ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు మరణించిన సమయం నుంచి వైఎస్ జగన్‌గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు తొలి భాగం ఉంటుంది. ఈ క్రమంలో ఎవరెవరు ఏయే వ్యూహాలు రచించారు వంటి ప్రధాన ఘటనలు ఈ సినిమాలో ఉన్నాయి. పార్ట్ -2 'శపథం' మార్చి 8న విడుదల కానుంది. -
షర్మిల పాత్రపై క్లారిటీ ఇచ్చిన RGV
-
ఆర్జీవీ డెన్‌లో అమితాబ్ సందడి.. ‘వ్యూహం’ కోసమేనా?
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మంచి స్నేహితులన్న విషయం అందరికి తెలిసిందే. ఆర్జీవీతో సినిమా అంటే కథ వినకుండా ఓకే చెప్పే నటుల్లో అమితాబ్ ఒక్కరు. ఆర్జీవీ ముంబైకి వెళ్లిన ప్రతిసారి అమితాబ్‌ను కలుస్తుంటారు. అపాయింట్మెంట్ లేకుండానే అమితాబ్‌ని ఇంటికి వెళ్లి కలిసే అతి కొద్దిమందిలో వర్మ ఒక్కరు. సర్కారు సినిమా ద్వారానే వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. (చదవండి: మార్చి 2న 'వ్యూహం' రిలీజ్.. ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ ట్వీట్) అమితాబ్ కెరీర్ కాస్త ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సర్కార్(2005) సినిమా తెరకెక్కించి బిగ్ హిట్ ఇచ్చాడు వర్మ. ఆ తర్వాత 2008లో ఈ మూవీకి సీక్వెల్‌గా ‘సర్కార్ రాజ్’ అనే సినిమా చేశారు. అదీ సూపర్ హిట్ అయింది. 2017లో సర్కార్ 3 తీసుకొచ్చారు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయినా కూడా వీరిద్దరి మధ్య స్నేహం మాత్రం అలానే కొనసాగింది. ఫ్రీ టైమ్ దొరినప్పుడల్లా వీరిద్దరు కలుస్తుంటారు. తాజాగా హైదరాబాద్‌కు వచ్చిన అమితాబ్.. ఆర్జీవీ డెన్‌లో సందడి చేశారు. డెన్ మొత్తం కలియతిరిగి.. ప్రత్యేకతలు ఏంటో అడిగి తెలుసుకున్నాడు. SARKAR @SrBachchan in MY SEAT at RGV DEN pic.twitter.com/WxUoMIqJuc — Ram Gopal Varma (@RGVzoomin) February 28, 2024 తన కార్యాలయానికి వచ్చిన సర్కార్(అమితాబ్‌ని ఆర్జీవీ ముద్దుగా సర్కార్ అని పిలుస్తుంటాడు)కి ఆర్జీవీ సాదరంగా ఆహ్వానం పలికారు. దగ్గరుండి డెన్ మొత్తం చూపించాడు. అలాగే ఆఫీస్‌లోని తన సీట్లో కూర్చొబెట్టి.. సర్కార్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.. సర్కార్ నా సీటులో కూర్చున్నాడు అని క్యాప్షన్ ఇచ్చాడు. Me and Dasari Kiran Kumar VYOOHAM ing with SARKAR Amitabh Bachchan at RGV DEN 💐💐💐 pic.twitter.com/jnboZKlhHc — Ram Gopal Varma (@RGVzoomin) February 28, 2024 అలాగే వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ సైతం ఆర్జీవీ డెన్‌లో ఆమితాబ్ని కలిశాడు. దానికి సంబంధించిన ఫోటోని ఎక్స్‌లో షేర్ చేస్తూ..‘నేను, దాసరి కిరణ్ కలిసి అమితాబ్‌తో ‘వ్యూహం’ రచించాము అని సరదాగా రాసుకొచ్చాడు. ఈ రెండు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసి వ్యూహం ప్రమోషన్ కోసమే అమితాబ్ హైదరాబాద్ వచ్చారంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే అమితాబ్ మాత్రం కల్కీ 2898 సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తుంది. విరామ సమయంలో ఆర్జీవీని కలిశాడు.ఆర్జీవీ తెరకెక్కించిన తాజా చిత్రం ‘వ్యూహం’ మార్చి 2న విడుదల కాబోతుంది. SHIVA ing with @SrBachchan at RGV DEN 🔥🔥🔥 pic.twitter.com/RIKwFeh7fK — Ram Gopal Varma (@RGVzoomin) February 28, 2024 -
మార్చి 2న 'వ్యూహం'...RGV ఇంట్రెస్టింగ్ ప్రకటన
-
మార్చిలో వ్యూహం
అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘వ్యూహం’. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘శపథం’ ఉంటుంది. రామధూత క్రియేషన్్సపై దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాల విడుదల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ‘వ్యూహం’ సినిమా నేడు(ఫిబ్రవరి 23), ‘శపథం’ చిత్రాన్ని మార్చి 1న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ‘వ్యూహం’ ను మార్చి 1న, ‘శపథం’ ను మార్చి 8న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు రామ్‌గోపాల్ వర్మ. ‘‘వ్యూహం’ను మార్చి 1కి, ‘శపథం’ను మార్చి 8కి వాయిదా వేశాం. ఈ సారి కారణం లోకేష్ కాదు. కొన్ని సాంకేతిక పరమైన కారణాలు, మేం కోరుకున్న థియేటర్స్ లేనందున వాయిదా వేశాం’’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు రామ్‌గోపాల్ వర్మ. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం నుంచి ఆయన తనయుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే వరకు ‘వ్యూహం’ ఉంటుందన్నారు రామ్‌గోపాల్ వర్మ. -
వ్యూహంలో పవన్ రోల్ ఎలా ఉంటుంది..ఆ సీన్ లో బత్తాయి పండు ఎందుకు పెట్టారు ?
-
వ్యూహం, శపథం ట్రైలర్
-
'మా సినిమాలకు బలం అతనే.. థ్యాంక్స్'.. ఆర్జీవీ ఆసక్తికర కామెంట్స్!
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో వస్తోన్న తాజా చిత్రం వ్యూహం. ఇప్పటికే ఈ మూవీ విడుదల ఆలస్యం కాగా.. ఈనెల 23న ప్రేక్షకులను ముందుకొస్తోంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. ఈ మూవీ కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్ట్-2 వస్తోన్న శపథం సినిమా కూడా కేవలం వారం రోజుల వ్యవధిలోనే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను నేపథ్యంగా తీసుకుని "వ్యూహం", "శపథం" చిత్రాలను తెరకెక్కించారు. రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఇందులో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించగా…వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఇప్పటికే వ్యూహం టీజర్ రిలీజ్ కాగా.. మరో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ విషయాన్ని డైరెక్టర్ రాం గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. డబుల్ డోస్ ట్రైలర్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అంటే రెండు సినిమాలకు సంబంధించి ఓకే ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. కాగా.. శపథం(పార్ట్-2) మూవీ మార్చి 1న రిలీజవుతోంది. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ – 'వ్యూహం, శపథం సినిమాల రిలీజ్ విషయంలో నేను థ్యాంక్స్ చెప్పాల్సిన ఒకే ఒక వ్యక్తి నారా లోకేష్. నేను, దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమాలను డిసెంబర్లో రిలీజ్ చేయాలని అనుకున్నాం. కానీ లోకేష్ కోర్టుకు మా సినిమాను అడ్డుకున్నారు. ఇప్పుడు సరిగ్గా ఎలక్షన్స్‌కు ముందు మా రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా పరోక్షంగా హెల్ప్ చేసింది నారా లోకేషే. అందుకే ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం. డిసెంబర్లో రిలీజ్ అయి ఉంటే ఈ పాటికి జనం మర్చిపోయేవారు. నేను ముందు నుంచీ చెబుతున్నా.. ఎవరైనా ఏ సినిమానైనా శాశ్వతంగా సినిమా రిలీజ్ కాకుండా ఆపలేరని. వారం రోజుల తేడాతో రెండు సినిమాలు రిలీజ్ కావడం వల్ల ఇబ్బందేం ఉండదు. నచ్చితే జనాలు చూస్తారు. లేదంటే రెండూ చూడరు.' సెన్సార్ బోర్డ్ గురించి మాట్లాడుతూ..'సెన్సార్ అనేది ఔట్ డేటెడ్ వ్యవస్థ. ఏ కథ తీసినా వాళ్లకు అభ్యంతరాలు ఉంటాయి. ఈ సినిమాలో కొన్ని సీన్స్ తీసేశారు. అయినా కథలోని ఎమోషనల్ కంటెంట్ మిస్ కాలేదు. ప్రజా జీవితంలో ఉన్న కొందరి మీద మనకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. అలా నాకున్న అభిప్రాయాలతో వాస్తవ ఘటనల నేపథ్యంగా నేను వ్యక్తీకరించిన సినిమాలే వ్యూహం, శపథం. ఈ సినిమాలు ఎవరి మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి అనేది నేను చెప్పలేను. మన రాజ్యాంగం ప్రకారం ప్రతి ఫిలిం మేకర్‌కు వాస్తవ ఘటనలను తన కోణంలో తెరకెక్కించే స్వేచ్ఛ ఉందని హైకోర్టు మాకు ఇచ్చిన ఆర్డర్స్‌లో పేర్కొంది. వైఎస్ మృతి నుంచి వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసేవరకు వ్యూహం కథ ఉంటుంది. జగన్ సీఎం ప్రమాణ స్వీకారం నుంచి చంద్రబాబు జైలుకు వెళ్లేవరకు శపథం కథ చూపిస్తున్నాం. నేను ఈ సినిమాను జగన్ కోసం కాదు పవన్, చంద్రబాబు కోసం తీశాను. అన్నారు. నిర్మాత దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ - 'వ్యూహం, శపథం సినిమాల రిలీజ్ విషయంలో దేవుడు మాకు అన్నీ కలిసొచ్చేలా చేశాడని అనుకుంటున్నాం. ఈ రెండు సినిమాలను తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500 థియేటర్స్‌లో రిలీజ్ చేయబోతున్నాం. రెండు సినిమాలు గ్యారెంటీగా సక్సెస్ అవుతాయి. ఈ సినిమాలు మొదలుపెట్టినప్పుడే రిలీజ్‌కు అడ్డంకులు వస్తాయని తెలుసు. ఎన్నికలు సమీపిస్తున్నా..లోకేష్ పార్టీ కార్యక్రమాలు అన్నీ వదిలి మా సినిమాలు రిలీజ్ కాకుండా కోర్టులకు, సెన్సార్ ఆఫీసులకు తిరిగారు. రోడ్లపై ధర్నాలు చేయించాడు. ఆయన అంత పోరాటం చేశాడంటేనే మా సినిమాల్లో ఎంత స్ట్రాంగ్ కంటెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయినా మాకు రాజ్యాంగం ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఉందంటూ న్యాయస్థానం తీర్పు నిచ్చింది. ధర్మం గెలిచిందని మేము భావిస్తున్నాం'. అన్నారు. Hey @LokeshNara , @ncbn and @pawankalyan .. Here is DOUBLE DOSE trailer of VYOOHAM / SHAPADHAMhttps://t.co/ocK7GD0Df3 — Ram Gopal Varma (@RGVzoomin) February 13, 2024 -
వ్యూహం అదుర్స్..పప్పు బెదుర్స్
-
వ్యూహం ఫిక్స్
‘వ్యూహం’ సినిమా విడుదలకు రూట్ క్లియర్ అయింది. ఈ నెల 23న ఈ సినిమా విడుదల కానుంది. అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘వ్యూహం’. దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా తొలి భాగం గత ఏడాది నవంబరు 10న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాను విడుదల చేసుకోవచ్చని సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇవ్వడంతో ఈ నెల 23న రిలీజ్ చేస్తున్నట్లు రామ్‌గోపాల్ వర్మ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాన్మరణం తర్వాత రాజకీయ పార్టీలు ఎలాంటి వ్యూహాలు పన్నాయి? ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వంటి కథాంశంతో ‘వ్యూహం’ రూపొందింది. ఈ చిత్రంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో అజ్మల్ నటించారు. -
'వ్యూహం' విడుదల తేదీని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. తాజాగా సినిమాను విడుదల చేసుకోవచ్చని సెన్సార్ బోర్డు క్లియెరెన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో సినిమా విడుదలపై డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ చేశారు. (ఇదీ చదవండి: Lal SalaamTwitter Review: 'లాల్ సలాం' ట్విటర్ రివ్యూ) వ్యూహం సినిమాకు అడ్డంకులు తొలగిపోవడంతో తాను సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఫిబ్రవరి 23న వ్యూహం చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి రెండు నెలల క్రితమే వ్యూహం సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. కానీ సినిమా విడుదలను నిలిపివేవయాలని తెలంగాణ హైకోర్టులో టీడీపీ నేత నారా లోకేష్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ చిత్రం విడుదల అంశంలో జాప్యం ఎదురైంది. వ్యూహం సినిమాపై మరొకసారి ఒక కమిటీ సమీక్షించి సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వడంతో విడుదలకు ఏర్పడిన అడ్డంకులు తొలిగిపోయాయి. దీంతో ఫిబ్రవరి 23న వ్యూహం సినిమా విడుదల కానుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. -
ఆర్జీవీ 'వ్యూహం' సినిమాకు లైన్ క్లియర్
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. హైకోర్టు సూచనలతో రెండోసారి కూడా సెన్సార్ బోర్డు వ్యూహం సినిమాకు క్లియెరెన్స్ ఇచ్చింది. దీంతో ఈ చిత్రానికి ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయి. వ్యూహం చిత్రాన్ని ఫిబ్రవరి 16న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాత దాసరి కిరణ్ తెలిపారు. వాస్తవానికి రెండు నెలల క్రితమే వ్యూహం సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. కానీ సినిమా విడుదలను నిలిపివేవయాలని తెలంగాణ హైకోర్టులో టీడీపీ నేత నారా లోకేష్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ చిత్రం విడుదల అంశంలో జాప్యం ఎదురైంది. లోకేష్ పిటిషన్‌తో హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి సినిమా విడుదలను గతంలో తాత్కాలికంగా నిలువరించింది. వ్యూహం సినిమాను మరొకసారి సమీక్షించి ఒక కమిటీని ఏర్పాటు చేసి మరొకసారి సెన్సార్ ఇవ్వాలని గతంలో కొర్టు తెలిపింది. (ఇదీ చదవండి: థియేటర్లో అలజడి రేపిన పవన్ ఫ్యాన్స్.. ఇంకెప్పుడు మారుతారో..!) కోర్టు నిర్ణయంతో మరోసారి వ్యూహం చిత్రానికి తాజాగా సెన్సార్ నిర్వహించారు. చిత్రాన్ని విడుదల చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని సెన్సార్ బోర్డు తెలపడంతో వ్యూహం చిత్రం ఫిబ్రవరి 16న విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నామని చిత్ర నిర్మాత తెలిపారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. -
'వ్యూహం' చిత్రం విడుదలపై రేపు విచారణ
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' చిత్రంపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను రేపు చేపడతామని కోర్టు తెలిపింది. వ్యూహం చిత్రం విడుదల అంశంపై తాజాగా హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్‌లో చిత్ర యూనిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మూవీ విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని చిత్ర యూనిట్ న్యాయస్థానాన్ని కోరింది.ఈ నేపథ్యంలో తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్తో పాటు పలు రికార్డ్స్‌ను ఇప్పటికే సెన్సార్ బోర్డు కోర్టుకు అందజేసింది. సెన్సార్ బోర్డ్ రికార్డ్స్‌ను పరిశీలించిన తరువాత విచారణ చేస్తామని న్యాయస్థానం తెలిపిన విషయం తెలిసిందే. విడుదల విషయంలో జాప్యం జరిగితే భారీ నష్టం వస్తుందని వ్యూహం చిత్ర నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ కోర్టును అభ్యర్థించిన విషయం తెలిసిందే. వ్యూహం చిత్రాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ హైకోర్టులో టీడీపీ నేత లోకేష్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ చిత్రం విడుదల అంశంలో జాప్యం ఎదురైంది. లోకేష్ పిటిషన్‌తో హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి సినిమా విడుదలను తాత్కాలికంగా నిలువరించింది. -
వ్యూహం రిలీజ్ మరింత ఆలస్యం
-
వ్యూహం రిలీజ్ మరింత ఆలస్యం
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా రిలీజ్‌కు లైన్ క్లియర్ కాలేదు. ఈ మూవీపై పలు దఫాలు విచారణ చేపట్టిన హైకోర్టు నేడు(జనవరి 22న) సెన్సార్ సర్టిఫికెట్‌ను తిరిగి సెన్సార్ బోర్డుకు పంపించింది. మూడు వారాల్లో సినిమాను మళ్లీ పరిశీలించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కాగా వ్యూహం సినిమా రిలీజ్‌ను నిలిపివేయాలంటూ టీడీపీ నేత నారా లోకేశ్ కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. వ్యూహం చిత్రానికి సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ చట్టవిరుద్ధమని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జనవరి 11 వరకు సెన్సార్ సర్టిఫికెట్ సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సినిమా వాయిదా వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోందని విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 8న సెన్సార్ బోర్డ్.. వ్యూహం సెన్సార్ సర్టిఫికెట్తో పాటు సంబంధిత రికార్డులను న్యాయస్థానానికి అందజేసింది. అన్నింటిపై సమగ్ర విచారణ జరిపిన న్యాయస్థానం సెన్సార్ సర్టిఫికెట్‌ను పునఃపరిశీలించమని సెన్సార్ బోర్డును ఆదేశించింది. దీంతో వ్యూహం రిలీజ్ మరింత ఆలస్యం కానుంది. -
వ్యూహం: కోర్టు చేతికి సెన్సార్ సర్టిఫికెట్
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా రిలీజ్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ మూవీ గతేడాది డిసెంబర్ 29న రిలీజ్ కావాల్సింది. కానీ ఈ చిత్ర సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని కోరుతూ నారా లోకేశ్ కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జనవరి 11 వరకు సెన్సార్ సర్టిఫికెట్ సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే! తాజాగా వ్యూహం చిత్రంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సెన్సార్ బోర్డ్.. వ్యూహం సెన్సార్ సర్టిఫికెట్తో పాటు సంబంధిత రికార్డులను కోర్టుకు అందజేసింది. సెన్సార్ బోర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ వివరాలు పరిశీలించిన అనంతరం మరోసారి విచారణ చేస్తామని న్యాయస్థానం తెలిపింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. చదవండి: వర్మ ఆడిషన్‌కు వెళ్లా.. నన్ను వెళ్లిపోమని చెప్పాడు.. తర్వాత పిలవనేలేదు -
వ్యూహం సినిమా వివాదం.. హైకోర్టు కీలక ఆదేశాలు!
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం రిలీజ్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మూవీ నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక ఉత్తర్వులిచ్చింది. అయితే ఈ సినిమాపై సింగిల్బెంచ్లోనే తేల్చుకోవాలన్న ఉన్నత న్యాయస్థానం.. మెరిట్స్ ఆధారంగా చేసుకుని ఈనెల 8వ తేదీనే పిటిషన్‌పై తుది తీర్పు ఇవ్వాలని సూచించింది. కాగా.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును దాసరి కిరణ్‌కుమార్ సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా దీనిపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. కాగా.. వ్యూహం సినిమాకు సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ చట్టవిరుద్ధమని.. ఏపీ రాజకీయాలను ప్రభావం చేసేలా సినిమా ఉందంటూ టీడీపీ లీడర్ నారా లోకేశ్ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీంతో లోకేష్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ బెంచ్.. ఈ నెల 11వ తేదీ సినిమా రిలీజ్ చేయవద్దంటూ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. -
'ఇంద్రబాబు' పాత్రకు మించి వర్మ 'వ్యూహం'లో ఏముంది..?
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీసిన 'వ్యూహం' సినిమా నేడు (డిసెంబర్ 29) థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ సినిమాను విడుదల కాకుండా ఉండేందుకు నారా లోకేష్ కోర్టు మెట్లు ఎక్కాడు. తెలంగాణ కోర్టు సూచనమేరకు వ్యూహం సినిమాకు తాత్కాలిక బ్రేకులు పడ్డాయి. ఏ ప్రాతిపదికన సెన్సార్ ఇచ్చారో తెలుపుతూ ఆ రికార్డులను కోర్టుకు అందించాలని CBFCని కోరింది. జనవరి 11 వరకు కోర్టు సమయం ఇచ్చింది. చినబాబుకు నిద్ర లేకుండా చేస్తున్న వర్మ వ్యూహం సినిమాను అడ్డుకునేందకు కాంగ్రెస్, జనసేన, టీడీపీ శ్రేణులు, నారా లోకేష్, గంటా శ్రీనివాస్, ఎల్లో మీడియా ఇలా ఎందరో వర్మ 'వ్యూహం' సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి. మొదట సినిమాను అడ్డుకునేందుకు సెన్సార్ బోర్డుకు నారా లోకేష్ ఫిర్యాదు చేశారు. అప్పుడు CBFC కూడా సినిమాను మళ్లీ రివ్యూ చేసి 'యూ' సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో వర్మ దెబ్బకు బయపడిపోయిన లోకేష్ కోర్టుకు వెళ్లాడు.. సినిమా వస్తే ఇంతకాలం బయటకు తెలియని ఎన్నో విషయాలు ప్రపంచానికి తెలుస్తాయనే భయంతో ఆయన కోర్టు మెట్లు ఎక్కాడు. వర్మ వ్యూహానికి చినబాబు లిటిగేషన్ పెట్టాడు. తప్పు చేయని వాడిపై ఎన్ని సినిమాలు తీసినా ఎప్పటికీ భయపడడు కదా..! మరి ఎందుకు చినబాబులో ఇంత భయం. తప్పు చేయకుంటే ఉలుకు ఎందుకు..? చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ ఎవరైనా కానీ గతంలో ఏం చేశారు...? ఉన్నది ఉన్నట్లు ప్రపంచానికి చూపుతాను అని వర్మ అంటున్నాడు. అలా కాకుండా లేనివి ఉన్నట్లు సినిమాలో చూపుతే నిజం ఏంటో టీడీపీ కూడా మరో సినిమా తెరకెక్కించ వచ్చు కదా.. ఎటూ తన వర్గం వారే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఉన్నారు. మరోవైపు ఇప్పటికే ప్యాకేజీ తీసుకుని చంద్రబాబు వెంటే తిరుగుతున్న పవన్ కూడా పచ్చ బ్యాచ్‌లోనే ఉన్నాడు.. డబ్బుకు కొదవ లేదు, డైరెక్టర్లకు కొదవ లేదు, చేతిలో రామోజీ ఫిలిమ్ సిటీ.. ఇలా ఎన్నో చంద్రబాబు గుప్పెట్లోనే ఉన్నాయి. మా నాన్నే ఆంధ్ర రాష్ట్రానికి దేవుడు అని సినిమా తియొచ్చు కదా చినబాబు... గతంలో తమరి రాజకీయ జీవితంలో ఎలాంటి వెన్నుపోట్లు లేకుంటే ఒక్క సినిమా తీసి ప్రజలకు చూపించండి.. అందులో నిజం ఉంటే యాత్ర సినిమా మాదిరి సూపర్ హిట్ చేస్తారు.. లేదంటే తొక్కి పాతరేస్తారు.. ఇప్పుడు వర్మ వ్యూహం సినిమా కూడా అంతే సినిమాలో నిజం ఉంటే ఆదరిస్తారు... లేదంటే వారానికే మరిచిపోతారు... వెన్నుపోటు నుంచి బాబు కథ తెలిసిందే కదా..! వర్మ వ్యూహానికే భయపడిపోయి వ్యవస్థల ద్వారా ఎటాక్ చేసి వ్యూహం సినిమాను అడ్డుకునేందుకు చినబాబు నానాపాట్లు పడుతున్నాడు. సినిమా నచ్చితే చూస్తారు లేదంటే వదిలేస్తారు. మేము సుద్దపూసలం అని చెప్పుకుంటున్న పచ్చ బ్యాచ్ మంద.. వర్మ వ్యూహానికి ఎందుకు వణుకుతున్నారు..? గతంలో ఎలాంటి తప్పులు చేయనప్పుడు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు..? వెన్నుపోటు రాజకీయం నుంచి ఓటుకు నోటు వరకు బాబు గారి చరిత్ర తెలుగు ప్రజలకు తెలిసిందే కదా.. నారా వారి రాజకీయ చరిత్రే ఇదీ.. ఇందులో వర్మ కొత్తగా చూపించేది ఏముంది..? మహా అయితే కొత్తగా వచ్చిన ప్యాకేజీ స్టార్ పవన్ కల్యాణ్‌ను తెరపైకి తీసుకొస్తాడు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌ల రాజీకీయ జీవిత కథ మధ్యయుగం నాటిదికాదు కదా.. నిజం ఎంటో ఇప్పుడున్న వారందరికీ తెలుసు కదా.. వర్మ వ్యూహం సినిమాలో తప్పుంటే వెంటనే సోషల్‌మీడియాలో ఉతికేస్తారు.. నిజం ఉంటే మెచ్చుకుంటారు. అసలు సినిమానే వద్దనుకుంటే చూడకుంటే సరిపోయే.. అలాంటి దానికి ఇంత గోల ఎందుకు చినబాబు.. ఉచితంగానే వ్యూహం సినిమాకు పబ్లిసిటీ వస్తుంది కాబట్టి వర్మ కూడా సరిగ్గా ఉపయోగించుకుంటూ ఎంటర్టైన్ చేస్తున్నాడు. వర్మకు కూడా కావాల్సింది ఇదే. ఈ విషయంలో ఆయన భారీగానే సక్సెస్ అయ్యాడు. సీనియర్ ఎన్టీఆర్‌పై సెటైర్ల సినిమా సీనియర్ ఎన్టీఆర్ యుగపురుషుడు, దేవుడు.. అని తెలుగు ప్రజలు అంటారు. అందులో అభ్యంతరం లేదు. అందుకే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడ ఒక జిల్లాకు ఆయన పేరే పెట్టారు. కానీ నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబీకులు ఎన్టీఆర్‌ను ఆయన చరమాంక దశలో ఒంటరిని చేశారు. కనీసం పండగరోజు కాస్త పప్పన్నం పంపించే వాళ్లు కూడా కాదని ప్రచారం ఉండనే ఉంది. ఈ కారణమే ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించడానికి అవకాశం కల్పించిందని రాజకీయ పరిశీలకులు ఇప్పటికీ అంటూ ఉంటారు. అలా ఆ వయసులో తనకు సహాయంగా నిలిచిన ఆమెను ఎన్టీఆర్ ప్రేమించాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. అప్పటికే ఆమె మొదటి భర్త నుంచి విడాకులు పొంది ఉంది కాబట్టి ఎన్టీఆర్‌కు భార్య అయ్యింది. రాజకీయంగా కూడా చక్రంతిప్పి ఉండవచ్చు. ఇదే కథతోనే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం వచ్చింది. చంద్రబాబుపై ఎన్టీఆర్ దుమ్మెత్తిపోయలేదా..? లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో వెన్నుపోటు అంకం, ఆ సమయంలో ఎన్టీఆర్ అరణ్యరోదన, అదే మనసును కలిచివేసి ఆయన మరణించడం. చరమాంకంలో చంద్రబాబుపై ఎన్టీఆర్ దుమ్మెత్తిపోయాడం, చంద్రబాబును ఔరంగజేబుతో పోల్చడం, నీతిమాలిన వాడు అని ఆయన దూషించడం, అందుకు ప్రతిగా బాబు కూడా ఎన్టీఆర్‌పై ధ్వజమెత్తడం. ఎన్టీఆర్‌ను విలువల్లేనివాడిగా చిత్రించడం, ఎన్టీఆర్ అవసరం తమకులేదని ప్రకటించడం. వీటికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇప్పటికీ ఎల్లో మీడియా పేపర్ క్లిప్పింగ్స్‌తో పాటు యూట్యూబ్‌లలో వీడియోలు కూడా ఉన్నాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో కూడా వర్మ ఇదే చూపించాడు.. ఒక్క పచ్చ బ్యాచ్ మాత్రమే సినిమాను తప్పబట్టింది.. మిగిలన ఎవరూ తప్పబట్టలేదు. కానీ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం వర్మను అభినందించడం విశేషం. చంద్రబాబు పాత్ర గత సినిమాల్లోనే ఉంది.. వర్మ చూపించేది ఏంటి..? సీనియర్ ఎన్టీఆర్ జీవితం మీద , ఆయన రాజకీయం మీద వ్యంగ్యంగా స్పందిస్తూ వచ్చిన సినిమాలు గతంలో కూడా ఉన్నాయని ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. వాటిల్లో ముఖ్యమైనవి 'నా పిలుపే ప్రభంజనం, మండలాధీశుడు, గండిపేట రహస్యం వంటి చిత్రాలు ఉన్నాయి. ఈ సినిమాలన్నీ యూట్యూబ్‌లో ఉన్నాయి. నేటితరం కూడా వీటిని ఆసక్తితో చూస్తోంది. యూట్యూబ్‌లో వీటికి బాగానే ఉన్నాయి వ్యూస్. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, రామోజీరావు.. తదితర నిజజీవిత పాత్రలన్నీ ఈ సినిమాల్లో ఉన్నాయి. అప్పటికి లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించలేదు. ఈ సినిమాల్లో కథను ఎంతడేర్గా చూపించారంటే... చంద్రబాబును ఉద్దేశించినట్టుగా అనిపించే 'ఇంద్రబాబు' పాత్రకు వ్యాంపులతో ఎఫైర్‌ను పెట్టేంత సాహసం చేశారు ఆ సినిమాల మేకర్లు. ఈ సినిమాలు అప్పటికి, ఇప్పటికీ చర్చనీయాంశంగా నిలిచాయి. మండలాధీశుడులో నటుడు కోటా శ్రీనివాసరావు ఎన్టీఆర్ పాత్రను పోషిస్తే.. గండిపేట రహస్యంలో థర్టీ ఇయర్స్ పృథ్వీ ఎన్టీఆర్‌గా చేశాడు. ఈ సినిమాలు డైరెక్టుగా ఎన్టీఆర్ మీద సంధించిన అస్త్రాలు. ఈ సినిమాలు వచ్చినప్పుడు ఎన్టీఆరే వాటిని చూసీ చూడనట్టుగా వదిలేశాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఎన్టీఆరే వాటిని లైట్‌గానే తీసుకున్నాడు. ఆ సినిమాల్లో ఎన్టీఆర్ పాత్రలను పోషించిన కోటా, పృథ్వీలపై ఆయా సమయాల్లో దాడులు జరిగాయి. అయితే ఎన్టీఆర్ ఆ దాడులను వారించాడంటారు. -
ఎల్లో మీడియాకు RGV స్ట్రాంగ్ కౌంటర్
-
'వ్యూహం' సెన్సార్ రద్దు కాలేదు.. క్లారిటీ ఇచ్చిన ఆర్జీవీ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన 'వ్యూహం' మూవీ.. ఈ రోజు అంటే డిసెంబరు 29న థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని నారా లోకేశ్ పిటిషన్ వేయడంతో.. జనవరి 11 వరకు సెన్సార్ సర్టిఫికెట్‌ని సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనికే పచ్చ బ్యాచ్ తెగ హడావుడి చేస్తోంది. ఏకంగా సినిమా సెన్సార్ రద్దు చేశారన్నంత రేంజులో హడావుడి చేస్తోంది. (ఇదీ చదవండి: కమెడియన్ బ్రహ్మానందం మరో టాలెంట్.. మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ పోస్ట్) ఇలా పచ్చ బ్యాచ్ చేస్తున్న ఓవరాక్షన్‌పై దర్శకుడు రాంగోపాల్ వర్మ కౌంటర్ ఇచ్చాడు. 'ఏబీఎన్ ఛానల్‌కి సంబంధించిన ఈ వ్యక్తి ,ఇంకా మరికొన్ని ఛానెల్స్ చెప్తున్నట్టు 'వ్యూహం' సినిమా సెన్సార్ సర్టిఫికేట్ 'రద్దు' అవ్వలేదు. నిజం ఏంటంటే కోర్ట్.. సీబీఎఫ్సీ నుంచి సర్టిఫికేట్ ఇవ్వటానికి సంబంధించిన రికార్డులు జనవరి 12లోపు సబ్మిట్ చెయ్యాలని అడిగారు' అని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చాడు. దీనిబట్టి చూస్తే త్వరలో ఈ ఇష్యూ క్లియర్ అయి సినిమా విడుదలవుతుంది. (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) ఈ ఛానల్ @abntvtelugu కి సంబంధించిన ఈ వ్యక్తి ,ఇంకా మరి కొన్ని ఛానళ్ళు చెప్తున్నట్టు వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికేట్ “రద్దు” అవ్వలేదు.. నిజం ఏమిటంటే కోర్టు CBFC నుంచి సర్టిఫికేట్ ఇవ్వటానికి సంబంధించిన రికార్డులు జనవరి 12th కల్లా సబ్మిట్ చెయ్యాలని అడిగారు https://t.co/hB5ak477cR — Ram Gopal Varma (@RGVzoomin) December 29, 2023 -
'వ్యూహం' సినిమాలోని జగనన్న సాంగ్ రిలీజ్
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన కొత్త సినిమా 'వ్యూహం'. పొలిటికల్ డ్రామా కథతో తీసిన ఈ చిత్రంలో ఏపీ రాజకీయాల్ని చూపించనున్నారు. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి కాకముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జర్నీ ఎలా సాగింది? ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం ఎలా అయ్యారు అనే విషయాల్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. (ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న 'బిగ్‌బాస్' మానస్.. రేటు ఎంతో తెలుసా?) డిసెంబరు 29న థియేటర్లలో రిలీజ్ కాబోతున్న 'వ్యూహం' నుంచి ఇప్పుడు జగనన్న అని సాగే లిరికల్ గీతాన్ని రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర విజువల్స్ ని ఎక్కువగా చూపించారు. ప్రధాన పాత్రలో అజ్మల్ అమీర్ నటించారు. ఈ పాట ఇప్పుడు సీఎం జగన్ అభిమానుల్ని అలరిస్తోంది. ఇకపోతే 'వ్యూహం' రిలీజ్ విషయంలో పచ్చ బ్యాచ్ పలు ఇబ్బందులు పెట్టినప్పటికీ.. సెన్సార్ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా.. డిసెంబరు 29న గ్రాండ్‌గా విడుదల కానుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'మంగళవారం' సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే) -
వ్యూహం ట్రైలర్ చూసి వణికిపోయారు..!
-
Vyooham Movie Pre Release Pics: విజయవాడలో వేడుకగా వ్యూహం ప్రీ రిలీజ్ (ఫొటోలు)
-
'వ్యూహం' సినిమాని.. 2024లో జగనన్న విజయాన్ని ఆపలేరు: మంత్రి రోజా
ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ తీసిన 'వ్యూహం' సినిమా పార్ట్-1.. డిసెంబరు 29న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ జరుగుతుండగా.. తాజాగా విజయవాడలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈవెంట్లో వైసీపీ మంత్రి రోజాతో పాటు మల్లాది విష్ణు, ఎంపీ నందిగం సురేశ్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సినిమా గురించి సీఎం జగన్మోహనరెడ్డి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆ హిట్ మూవీ.. రెండు నెలల తర్వాత ఇప్పుడు స్ట్రీమింగ్) 'వ్యూహం' చిత్ర వ్యూహకర్త ఆర్జీవీకి అభినందనలు. బెజవాడ గడ్డ మీద పుట్టిన ముద్దుబిడ్డ ఆర్జీవీ. శివ నుంచి కంపెనీ వరకూ సినిమాలు తీసి, బెజవాడ నుంచి ముంబై వరకూ తన సత్తాను చూపిన వ్యక్తి వర్మ. ఆర్జీవీ అంటేనే ఒక సంచలనం. 'వ్యూహం' టైటిల్ ప్రకటించగానే సైకిల్ పార్టీ షేకైపోయింది. ఆర్జీవీ డైరెక్టర్ అనగానే పచ్చ పార్టీ నేతల ప్యాంట్లు తడిచిపోయాయి. చంద్రబాబు కుట్రలు కుతంత్రాలకు జగన్ మోహన్ రెడ్డికి మధ్య జరిగిన సంఘర్షణే ఈ 'వ్యూహం'. ఎందుకూ పనికిరాని పప్పు లోకేష్‌గాడు కూడా పవన్ సీఎంగా పనికిరాడని చెప్పాడు. రాజమండ్రి సెంట్రల్ జైలుకెళ్లి బాబుకి మద్దతు పలికి తనతో పాటు తన వర్గానికి పవన్ వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు ఎన్నో కుట్రలు చేశాడు. ఎలాగైనా వ్యూహం సినిమాను ఆపాలనుకుంటున్నారు. అయితే 'వ్యూహం' చిత్రాన్ని ఆపలేరు, 2024లో జగనన్న విజయాన్ని కూడా ఆపలేరు' అని మంత్రి రోజా చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 'వ్యూహం చిత్రానికి కర్తకర్మ క్రియలైన వర్మ, కిరణ్‌కు అంభినందనలు. రాజకీయాల్లో భయపడని వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. సినిమాల్లో భయపడని వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. 'వ్యూహం' విషయంలో చంద్రబాబు,లోకేష్ ఎందుకు భయపడుతున్నారో అర్ధం కావడం లేదు. ముంబై మాఫియాకే ఆర్జీవి భయపడలేదు...మీకు భయపడతారనుకుంటున్నారా?చంద్రబాబు కుట్రలు... పవన్ కమెడియన్ వేషాలను కళ్లకు కట్టినట్లు ఈ చిత్రం రూపొందించారనుకుంటున్నాను. సినిమా మంచి ఘన విజయం సాధిస్తుంది' అని అన్నారు. ఇక పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. కచ్చితంగా సినిమా మంచి విజయం సాధిస్తుంది. ఫైబర్ నెట్‌కు సినిమాను ఇస్తే పదిలక్షల మంది ఒకేసారి సినిమా చూపించే ప్రయత్నం చేస్తామని అన్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న హిట్ సినిమా 'మంగళవారం'.. డేట్ ఫిక్స్) -
వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏర్పాట్లు (ఫొటోలు)
-
ఇదే నా హృదయపూర్వక ఆహ్వానం.. ఆర్జీవీ ట్వీట్ వైరల్!
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం 'వ్యూహం'. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారో ఈ చిత్రంలో చూపించనున్నట్లు ఆర్జీవీ తెలిపారు. ఈ సినిమాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో తమిళ నటుడు అజ్మల్ అమీర్ పోషిస్తుండగా.. జగన్ సతీమణి వైఎస్ భారతి పాత్రలో మానస రామకృష్ణ కనిపించనుంది. రామదూత బ్యానర్‌పై దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్స్ రిలీజ్ కాగా.. ఈ నెల 29న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఈనెల 23న విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు ఈవెంట్ ప్రారంభమవుతుందని పోస్ట్ చేశారు. ఈ ఈవెంట్‌కు తెదేపా అధినేత చంద్రబాబుతో పాటు నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఆహ్వానిస్తున్నట్లు ట్వీట్లో ప్రస్తావించారు. ఇదే హృదయపూర్వక ఆహ్వానం అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. VYOOHAM pre release event is tmrw the 23rd at 5 pm in Vijaywada at Indira Gandhi muncipal stadium My heartfelt invitation to sri @ncbn , @naralokesh and @PawanKalyan to grace the occasion 🙏🙏🙏 pic.twitter.com/jabNUkU4HE — Ram Gopal Varma (@RGVzoomin) December 22, 2023 -
సెన్సార్ U సర్టిఫికెట్ పొందిన వ్యూహం మూవీ
-
RGV: ఆర్జీవీ వ్యూహం.. రిలీజ్ డేట్‌పై క్రేజీ అప్డేట్!
టాలీవుడ్ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం వ్యూహం. అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను దాసరి కిరణ్‌కుమార్ నిర్మించారు. ఈ సినిమా నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. వాయిదా పడిన సంగతి తెలిసిందే. వ్యూహం సినిమా రిలీజ్‌ను ఆపేయాలని టీడీపీ నాయకుడు లోకేష్ సెన్సార్ బోర్డుకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్‌ను మేకర్స్ వాయిదా వేశారు. రివైజింగ్ కమిటీ సినిమా చూసిన తరవాత కొత్త విడుదల తేదీ ప్రకటిస్తామని ఆర్జీవీ గతంలోనే చెప్పారు. తాజాగా ఆర్జీవీ ఈ విషయంపై ట్వీట్ చేశారు. వ్యూహం సినిమా త్వరలోనే థియేటర్లలో రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సినిమా పోస్టర్‌ను తన ట్విటర్లో పంచుకున్నారు. ఈ సినిమాపై గతంలోనే ఆర్జీవీ మాట్లాడుతూ.. ప్రముఖ నాయకుడు, దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారు మరణించినప్పుడు ఎవరికి వారు వ్యూహాలు పన్నారు. అందులో నాకు తెలిసినవే వ్యూహం సినిమా ద్వారా చెప్తున్నాను. నేను నమ్మిన దాన్ని సినిమా తీస్తున్నానని రామ్‌గోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చాడు. గతంలో ‘ఉడ్తా పంజాబ్, పద్మావత్’ వంటి హిందీ సినిమాలకు కోర్టు ద్వారా రిలీజ్ ఆర్డర్ తెచ్చుకున్నట్లే మేమూ తెచ్చుకుంటామని.. చట్టపరంగా ఉన్న పద్ధతుల ద్వారా వ్యూహం చిత్రాన్ని రిలీజ్ చేసుకుంటామని వెల్లడించారు. pic.twitter.com/WTUeAA7Fmk — Ram Gopal Varma (@RGVzoomin) November 19, 2023 -
ఆర్జీవీ వ్యూహం.. దసరాకు స్పెషల్ పోస్టర్ రిలీజ్!
టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘వ్యూహం’. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి టీజర్,ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇటీవలో ఓ సాంగ్‌ను వర్మ విడుదల చేశారు. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. తాజాగా దసరా సందర్భంగా డైరెక్టర్ ఆర్జీవీ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. విజయదశమి శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేశారు. కాగా.. ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తెరకెక్కించనున్నట్లు ఆర్జీవీ ప్రకటించారు. మొదటి భాగం వ్యూహం పేరుతో నవంబర్ 10న విడుదల కానుంది. శపథం పేరుతో రెండో భాగం జనవరి 25న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. వ్యూహం మూవీలో వైఎస్ జగన్ గారి పాత్రతో దక్షిణాది నటుడు అజ్మల్ అమీర్ నటిస్తుండగా.. వైఎస్ భారతి గారి పాత్రలో మానస రాధాకృష్ణన్ నటిస్తున్నారు. ‘అహంకారానికి ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం’ ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ నిర్మిస్తున్నారు. HAPPY DUSSEHRA from the team of VYOOHAM 💐💐💐 pic.twitter.com/4u6Ecpp1So — Ram Gopal Varma (@RGVzoomin) October 23, 2023 -
'వ్యూహం' నుంచి దమ్మున్న సాంగ్‌తో ఊపేసిన రాహుల్ సిప్లిగంజ్
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘వ్యూహం’. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్,ట్రైలర్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వ్యూహం సినిమా నుంచి YSRCP అనే సాంగ్‌ను వర్మ విడుదల చేశారు. ఈ పాట కోసం ఆర్ఆర్ఆర్ సినిమాతో నాటు.. నాటు పాటకు ఆస్కార్ అవార్డుతో మరింత గుర్తింపు పొందిన రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) వైఎస్సార్సీపీ.. వైఎస్సార్సీపీ (YSRCP).. ఢీ కొట్టే మా పార్టీ వచ్చింది చూడు.. దమ్మున్న మా పార్టీ వచ్చింది చూడు.. ఆంధ్ర ప్రాంతంలో పుట్టింది నేడు.. సీమ సింగంలా తొడగొట్టే చూడు.. అంటూ సాగే పాటను రాహుల్ అద్భుతంగా పాడారు. ఇప్పటికే వ్యూహం నుంచి వెన్ను పోటు సాంగ్ పేరుతో.. పులుల రూపంలో గుంట నక్కలు అంటూ ఒక పాటను వర్మ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ పాట యూట్యూబ్‌లో సంచలనం క్రియేట్ చేస్తుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. రెండు పార్టులుగా రానున్న ఈ సినిమా.. మొదటి భాగం వ్యూహం పేరుతో నవంబర్ 10న విడుదల కానుంది. శపథం పేరుతో రెండో భాగం జనవరి 25న విడుదల కానున్నట్లు ఆయన ప్రకటించారు. వ్యూహం మూవీలో వైఎస్ జగన్ గారి పాత్రతో దక్షిణాది నటుడు అజ్మల్ అమీర్ నటిస్తుండగా.. వైఎస్ భారతి గారి పాత్రలో మానస రాధాకృష్ణన్ నటిస్తున్నారు. ‘అహంకారానికి ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం’ ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ నిర్మిస్తున్నారు. -
వ్యూహం ట్రైలర్ పై జైల్లో ఇంద్రబాబు రియాక్షన్
-
'వ్యూహం' కోసం ఎవరి పర్మిషన్ అవసరం లేదు.. వర్మ సంచలన కామెంట్లు
సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ అనే సినిమాని తెరకెక్కిస్తున్న విషం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ఆయన తాజాగా విడుదల చేశారు. ఇప్పటికే ఆయన పలు బయోపిక్ సినిమాలను ఉన్నది ఉన్నట్లుగా తీసి మంచి గుర్తింపు పొందాడు. తాజాగా వ్యూహం, శపథం అనే రెండు భాగాలతో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి గార్ల జీవిత చరిత్రలను ఆయన తెరకెక్కిస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. 'ఈ సినిమా వెనుక ఎలాంటి వ్యూహం లేదు. ఈ మూవీలో నిజం మాత్రమే ఉంది. వ్యూహం రెండు భాగాలుగా వస్తుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలతో ఈ రెండు సినిమాలు ఉంటాయి. నేను చాలా సౌమ్యుడిని. నేను ఎప్పుడు చంద్రబాబుని కలవలేదు. నాకు జగన్ గారు అంటే ఒక అభిప్రాయం ఉంది. అలాగే చంద్రబాబు గారు అంటే కూడా ఒక అభిప్రాయం ఉంది. కానీ నిజమనేది మాత్రమే ఈ సినిమాలో ప్రజలు చూస్తారు. జగన్ గారి మీద నాకు ఉన్న అభిప్రాయం వ్యూహం సినిమాలో కనపడుతుంది. మిగతా వారిపై నాకు ఎలాంటి అభిప్రాయం లేదు... నేను వేరే వాళ్ల మీద సినిమా తియ్యమంటే తియ్యను. ఈ సినిమాలో నేను నమ్మిన నిజం ఉంది. పబ్లిక్ డొమైన్లో ఉన్న జీవితాలను సినిమా తియ్యడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. నేను గతంలో లక్ష్మిస్ ఎన్టీఆర్ , సర్కార్ వంటి సినిమాలు అలా తీసినవే. నేను జగన్ గారి మీద ఉన్న అభిమానంతో సినిమా తీశాను. కానీ ఇక్కడ ప్యాకేజ్ అనేదానికి ఆస్కారం లేదు. నాకు టీడీపీ గురించి కానీ వైసీపీ గురించి కానీ వేరే పార్టీ గురించి కానీ తెలీదు. నేను నమ్మిన నిజం మాత్రమే సినిమాలో చూపిస్తున్నాను. నా రీసెర్చ్‌లో వెనుక ఏమి జరిగింది అనేదే ఈ సినిమా. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారి పాత్ర కూడా ఉంది. ఆ కష్టాలు జగన్ గారు మాత్రమే పడ్డారు దేశంలో ఏ ముఖ్యమంత్రి కొడుకు కూడా పడని కష్టాలు వైఎస్ జగన్ గారు పడ్డారు. అందుకే ఈ సినిమా తిస్తున్నట్లు వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ కుమార్ చెప్పారు. కూడు గుడ్డ లేని వారికి పేద ప్రజల సంక్షేమానికి జగన్ గారి ప్రభుత్వం ఎంతో చేస్తుంది. దీంతో ఆయన ప్రజల గుండెళ్లో చిరస్థాయిగా ఉంటారు. ప్రజలు మళ్లీ వైఎస్ జగన్ గారికే పట్టం కడతారు. ఇదే తథ్యం అని కిరణ్ కుమార్ అన్నారు. -
వ్యూహం మూవీ ట్రైలర్ విడుదల
-
'వ్యూహం' ట్రైలర్: కల్యాణ్‌కు తెలివి లేదు.. ఎన్నికల తర్వాత గ్లాస్ పగిలిపోతుంది
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘వ్యూహం’. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ సంచలనం సృష్టించింది. తాజాగా వ్యూహం సినిమా నుంచి ట్రైలర్‌ను ఆర్జీవీ విడుదల చేశారు. ఇందులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలను తనదైన స్టైల్లో చూపించారు. సోనియా గాంధీ పాత్రధారి ఫోన్ కాల్‌తో వ్యూహం ట్రైలర్ ప్రారంభం అవుతుంది. జగన్ పాత్ర పోషించిన అజ్మల్ అమీర్‌ను ఓదార్పు యాత్ర ఆపేయాలని వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు చంద్రబాబు పాత్ర పోషించిన వ్యక్తి తెరపైకి వస్తాడు. ఇప్పుడు మన వ్యూహం మొదలవుతుంది అని కన్నింగ్ డైలాగ్ చెప్పడం. ఆ కల్యాణ్‌కు ఎవరు శత్రువో.. ఎవరు మిత్రుడో గుర్తించే తెలివి లేదయ్యా అంటూ బాబు పాత్రధారి చెప్పే డైలాగ్‌తో పాటు పలు ఆసక్తికరమైన వాస్తవ సన్నివేశాలను వర్మ తెరికెక్కించినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ గారి బాడీ లాంగ్వేజ్ అజ్మల్ అద్బుతంగా అనుసరించారని చెప్పవచ్చు. అలాగే వైఎస్ భారతిగా మానస కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. బాలాజీ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నాడు. ఈ నవంబర్ 10న సినిమా విడుదలకానుంది. రెండోవ భాగం శపథం 2024 జనవరి 25న విడుదల అవుతుందని వర్మ ప్రకటించారు. -
ఆర్జీవీ ‘వ్యూహం ’ తొలి పాట వచ్చేసింది
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘వ్యూహం’. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన రెండు టీజర్లు సంచలనం సృష్టించాయి. తాజాగా ఈ మూవీ నుంచి తొలి పాటని విడుదల చేశారు మేకర్స్. ఇందులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను చూపించాడు. ‘నరకాసుల నవ్వులు.. రాబంధవుల హేళనలు..జగనుడి మౌనం.. రాక్షసుల నాట్యం... వెన్నుపోటుల రాజులు.. వెంటనడిచే కుక్కలు.. బురద జల్లే బండ్రోతులు.. బెదిరించే నక్కలు.. అన్నింటిని తదదన్నే జగనుడి నిశ్శబ్ధం.. అంటూ సాగే ఈ ఒక్క పాటతో అప్పట్లో తెర వెనుక జరిగిన రాజకీయాలేంటో కళ్లకు కట్టినట్లు చూపించాడు ఆర్జీవీ. ఇక పాట చివరల్లో చంద్రబాబు పాత్రదారితో అతని భార్య ‘ఏంటండీ ఆ జనం.. మా నాన్న వెంట కానీ, వాళ్ల నాన్న వెంట కానీ ఇంతమంది రావడం నేను చూడలేదు’అని అనగా.. ‘జనానికి పిచ్చి బాగా ముదిరింది’ అంటూ చంద్రబాబు పాత్రధారి అనడం వీడియోలో గమనించవచ్చు. రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. -
'వ్యూహం'టీజర్: కల్యాణ్‌కు బాబు వెన్నుపోటు.. వాడికంత సీన్లేదు!
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘వ్యూహం’. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ సంచలనం సృష్టించింది. తాజాగా వ్యూహం సినిమా రెండో టీజర్‌ని విడుదల చేశాడు ఆర్జీవీ. ఇందులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలను తనదైన స్టైల్లో చూపించాడు. (చదవండి: నా గురించి రాత్రింబవళ్లు ఆలోచించి డబ్బు వృథా చేసుకోకండి: కంగనా) సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి, అల్లు అరవింద్, సోనియా గాంధీ, రోశయ్య, మన్మోహన్ సింగ్.. ఇలా అనేకమంది పాత్రలను ఈ టీజర్లో చూపించాడు. ‘నిజం తన షూ లేస్ కట్టుకునేలోపే.. అబద్దం ప్రపంచం అంతా ఓ రౌండ్ వేసి వస్తుంది’ అని జగన్ పాత్ర పోషించిన అజ్మల్ అమీర్ చెప్పడం టీజర్లో కనిపించింది. అలాగే చివర్లో పవన్ కల్యాణ్ పాత్రను చూపించి, చంద్రబాబు పాత్రధారితో ఓ వ్యక్తి ‘ఎప్పుడో అప్పుడు మీరు కల్యాణ్‌ను కూడా వెన్నుపోటు పొడుస్తారుగా’ అని అడగ్గా.. ‘వాడికంత సీన్ లేదు. తనను తానే పొడుచుకుంటాడు’ అని చంద్రబాబు పాత్రధారి అనడం టీజర్లో గమనించవచ్చు. రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. -
'వ్యూహం' మూవీ టీజర్ విడుదల
-
రాంగోపాల్ వర్మ సంచలన ప్రకటన.. ఎన్నికలే టార్గెట్‌గా ‘వ్యూహం’!
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలన ప్రకటన చేశాడు. రాజకీయాలపై ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలిపాడు. ‘నేను అతి త్వరలో “వ్యూహం” అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను. ఇది బయోపిక్ కాదు …బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయో పిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ ,రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి. అహంకారానికి , ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన ‘వ్యూహం’ కధ , రాజకీయ కుట్రల విషం తో నిండి ఉంటుంది . రాచకురుపు పైన వేసిన కారం తో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే “వ్యూహం” చిత్రం. ఈ చిత్రం 2 పార్ట్స్ గా రాబోతుంది. మొదటి పార్ట్ “వ్యూహం” , రెండోది “శపథం” .రెండింటిలోనూ రాజకీయఆరాచకీయాలు పుష్కలంగా ఉంటాయి. రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం “వ్యూహం “ షాక్ నుంచి తెరుకునే లోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్ , పార్ట్ 2 “శపథం “ లో తగులుతుంది . వ్యూహం చిత్ర నిర్మాత నాతో అంతకు ముందు వంగవీటి సినిమా తీసిన దాసరి కిరణ్ . ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనక ,ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు కనక చెప్పట్లేదు’ అంటూ వరుస ట్వీట్స్ చేశాడు.